23, జూన్ 2019, ఆదివారం


ప్రాంజలి ప్రభ (2) బావా మరదల్ల  ప్రేమ 
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

5ఈ హాయి కలకాలం ఉండాలి మరదలా
నీ సుఖం కోసం ఏమైనా చేయాలా మరదలా
నా ద్యాస అంతా, ఆశలన్ని నీ పైనే బావా
ఏనాటి పుణ్యమో నీ ప్రేమకు చిక్కాను బావా

6బెలవు అనుకున్నా, కాదు గడసరివి మరదలా
ప్రేమ కతలు వ్యక్త పరుస్తున్నావు మరదలా
నిన్ను చూస్తుంటే వళ్ళంతా పులరిస్తుంది బావా
నా చెంగుకు దొరకకుండా ఉన్నావు బావా

7కలవరపాటు లో నిను చూడలేదు మరదలా
కలవాలనుకున్న కలువలేకున్న మరదలా
నీ ప్రక్కన ఉన్నాను చుడలేదా బావా
నీలో నె ఉన్నాను దిగులు పడకు బావా

8నీ నీడ సోకగానే నామనసునిలవనంటుంది మరదలా
హాయి హాయి గా మనం తిరుగాలి మరదలా
చల్లని వెన్నేలను పంచె నేలరాజువు బావా
విచ్చుకున్న కలువను ముద్దడవేమి బావా

--((**))--


అక్షర గోవిందనామాలు (3)
రచయిత : మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ 

13. ఓర్పుతో ఆరాదిస్తే కాపాడినవాడవు గోవిందా, 
ఓర్పే ఆయుధడవు గోవిందా  
      ఓపికను పరిక్షించి, రక్షించిన వాడవు గోవిందా, 
ఔదార్యము కలవాడవు గోవిందా 

14. ఔషదము పంచేవు గోవిందా, 
ఔను కాదు అని నిర్ధారించేవు గోవిందా
ఔనత్యము కల్గించావు గోవిందా, 
ఔరా అనేవిధముగా మార్చావు  గోవిందా

15. కపిల వర్ణము కలవాడవు గోవిందా, 
కపీంద్రుడవు గోవిందా
కపిలా చార్యుడవు గోవిందా, 
కామపాలకుడవు గోవిందా

*ఏడుకొండలవాడా వేంకట రమణ గోవిందా గోవిందా 
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గో విందా గోవిందా 

16. కాలనిర్ణయాధి కుడవు గోవిందా, 
కామ దేవుడవు గోవిందా
కాలాన్ని గుర్తిమ్చేవాడవు గోవిందా, 
కారడవుల్లో ఉన్నావు గోవిందా    

17. కష్టములు నివరించావు గోవిందా,
 కామిత ఫల దాతవు గోవిందా 
 కరుణాసాగరుడవు గోవిందా, 
కాంచనాంభరధరుడవు గోవిందా

18. కాంచనాంభరధరుడవు గోవిందా, 
కస్తూరి తిలకం ఉన్నవాడవు గోవిందా
కామ క్రుతుడవు గోవిందా,
 కలలో కనిపించే గోవిందా  

*ఏడుకొండలవాడా వేంకట రమణ గో విందా గోవిందా 
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గో విందా గోవిందా 
--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి