2, జూన్ 2019, ఆదివారం

బుద్ధ



కనిపిస్తున్న ఈ ప్రకృతి సమస్తం పలు వర్ణాలతో పలు శోభలతో సౌందర్య భరితంగా మహావైభవంగా అలరారుతున్నది.
ఈ ప్రకృతి మాత గర్భాన ఉద్భవించిన జీవులు కోటానుకోట్లు.
 ఎంతో వైవిధ్యభరితంగా అనునిత్యం ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రకృతి యే ఇంతటి వైవిధ్యభరితంగా ఉంటే ప్రకృతి ఇలా ఉండడానికి కారణం అయినా ఆ పరమాత్మ ఎంతో ఆశ్చర్యకరుడు.
ప్రతినిత్యం క్రొంగొత్త కోణంలో ప్రకృతి పరమాత్ముని దర్శిస్తూ ఉంది. ఎన్ని కోణాల్లో ఆ పరమాత్ముడు దర్శనీయుడు అయినప్పటికీ ఇంకనూ పలు కోణాల్లో దర్శనీయ మై ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. ఆయనను వర్ణిస్తూ ఈ మానవ జాతి ఎన్నో కోణాలలో దర్శించింది.ఎన్నో సాంప్రదాయాలతో దర్శనీయం చేసింది ఈ మానవత. ఒక్కొక్క మహర్షి ఆ పరమాత్మను వర్ణిస్తూ స్తుతిస్తూ ఒక . గ్రంథం రచించాడు. ఆ గ్రంథాలన్నీ వేదాలు అయినాయి. ఇలా వేదాలు అనంతంగా వస్తూనే ఉంటాయి. మనకు చూడడానికి నాలుగు వేదాలు కనిపిస్తాయి. కానీ వేదం అనంతం అని ఆదిలోనే బ్రహ్మదేవుడు తన నిర్ణయాన్ని తెలియజేశాడు.
ఇంతవరకు ఎందరో మహాత్ములు ఆ పరమాత్మను ఎన్నో కోణాలలో దర్శించారు.అటువంటి మహర్షులలో ఒక వినూత్నమైన కోణంలో దర్శించిన వాడు గౌతమ బుద్ధుడు.
ప్రపంచాన్ని శాంతి సాగరంలో ముంచి తేల్చిన ఆనంద అధ్యయన నిరంతర దురంధరుడు. శుద్ధోదన మహారాజు యొక్క కుమారుడు సిద్ధార్థుడు గౌతముడు.
శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క నిష్క్రమణ తర్వాత వెలసిన మహావిష్ణువు యొక్క దివ్యమైన అవతారం ఈ గౌతమ బుద్ధుని అవతారం.....
Dear friends!... ఆ మహాత్ముని గురించి నేను కేవలం విన్నాను కానీ ఆయన జీవిత చరిత్రను పూర్తిగా తెలుసుకోలేదు అప్పుడప్పుడు ఆయన బోధనలను ఈ ఫేస్బుక్ మాధ్యమంలో చూశాను అందువలన సంపూర్ణ జీవిత చరిత్రను చదవాలని నిర్ణయానికి వచ్చాను.
నేను చదువుతూ ఆ యొక్క చరిత్రను మీకు వినిపిస్తాను నా ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆమోదించెదరు గాక...🌼
🙏🏻🙏🏻🙏🏻🌼
వివిధ వర్ణాలతో అలరారుతున్న  ఈ భూమిపై తెల్లటి గుణములతో జ్ఞాని లాగా హిమాలయ పర్వతములు సమున్నతంగా ఈ భారతావనికి ఉత్తరాదిన ప్రకాశిస్తున్నాయి.
ఆ హిమగిరి సానువుల్లో,  మహా సామ్రాజ్యమైన " మగధ"సుభిక్షంగా అలరారుతూ ఉంది. ఆ మగధకు
వాయువ్యదిశలో   చిన్న సామంతరాజ్యం ఉన్నది. దానికి కపిలవస్తు నగరం రాజధాని. ఆ సామంత రాజ్యానికి రాజు
శుద్దోధనుడు.  ఆయన శాక్యవంశస్థుడు. వారి పూర్వీకులు ఇక్ష్వాకులని ప్రతీతి. రోహిణీ నదీతీరంలో టేకువృక్షాలతోను, సారవంతమైన సశ్యశ్యామల మైన దేశాన్ని పాలించే రాజుకు సిరిసంపదలకి కొదవేముంటుంది? 
ఆ రాజుకు నలుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు
ఉన్నారు. ఆయన భార్య మాయాదేవి.
అయితే చాలాకాలం వరకు ఆమెకు సంతానం కలుగలేదు.
శాక్యులు ప్రతిసంవత్సరం ఆషాడ సప్తమినుండి ఏడురోజుల
పాటు వేసవి వీడ్కోలు పండుగలు జరుపుకుంటారు. 
అలా పండుగ ఘనంగా జరిపిన మాయాదేవి విందు భోజనమారగించి బడలికతో నిద్ర కుపక్రమించింది.
తెల్లవారు ఝాము కా వస్తూ ఉన్నది. ఆ ప్రభాత సమయంలోన రాణి విచిత్రమైన కల కన్నది.
నల్లటి  కాంతిగల ఆకాశం నుండి  ఒక ఆణిముత్యం భువి పైకి జారుతూ ఉన్నది.
అలా జారుతున్న ఆ దివ్య క్రాంతి గల ముత్యం పెద్దగా మారుతూ తన ముంగిట వచ్చి నిలిచింది. ఉన్నట్లుండి  ముత్యము తెల్లని ఐరావతం (ఇంద్రుని వాహనమైన ఏనుగు) వలె మారిపోయి, ఆమె శయ్యచుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణం జేసింది.. రాణి గారు ఆశ్చర్యంతో ఐరావతాన్ని చూస్తూ ఉన్నది. ఆ తెల్లని ఏనుగు తనతొండం చివరగల చల్లని తామరపువ్వుతో ఆమె నడుమును కోమలంగా నిమిరింది. అలా నిమురుతూ
సూక్ష్మ రూపం ధరించి ఆమె కుడి డొక్కలోంచి ఆమె
ఉదరంలోకి ప్రవేశించింది.కానీ ఆమెకు ఎటువంటి బాధ లేదు.
ఆశ్చర్యంతో నిద్రమేల్కొనిన రాణి శుద్దోధనునికీ ఈ వార్త తెలిపింది.ఆయన ప్రముఖ జ్యోతిష్కులను పిలిపించి ఈ విషయం గురించి అడిగాడు.
ఆ వార్త విన్న జ్యోతిష్యులు ఆనందంతో  'రాజా! గొప్ప శుభవార్త వినండి. రాణి గర్భం ధరించి మీకు అంతులేని పేరు ప్రతిష్ఠలనందించగల కుమారుడిని అందించబోతున్నది. 
మీ వంశం కొన్నివేల సంవత్సరాలు కీర్తించబడేట్లు చేసే, ఆ కుమారుడు అజేయుడైన చక్రవర్తి అవుతాడు. లేదా జగద్విఖ్యాతుడైన సన్న్యాసి అయినా అవుతాడు.
 ఏ విధంగానైనా మీ పేరు, చిరస్మరణీయ మవుతుంది అన్నారు. అద్భుతమైన ఆ వార్త విని పొంగిపోయిన ఆ రాజు వారిని ఘనంగా సత్కరించి పంపివేసి ఒక ప్రక్క  తన చిరకాల వాంఛ తండ్రి అవటం నెరవేరుతున్నందుకు సంతోషాన్ని,
మరియు లేక లేక కలుగుతున్న తనకుమారుడు సన్న్యాసి
అవుతాడేమోననే విచారం రెండు ఒకేసారి కలిగి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. మహా అదృష్టం తో కూడిన ఈ సమస్యను 
ఎలా పరిష్కరించాలి? అని ఆయన సతమతమయ్యాడు.
అయినప్పటికి కల నిజమవుతుందా చూద్దాంలే అని
సరిపెట్టుకున్నాడు. కానున్నది కాక మానదన్నట్లు, మాయాదేవి
గర్భవతయింది. నెలలు నిండిన రాణిని వారి ఆచారం
 ప్రకారం పుట్టింటికి పంపుతున్నారు. ఆరోజు వైశాఖ పూర్ణిమ
మంగళవారం. ఆ మహా రాణి  దివ్య రథమున తన పుట్టిల్లు కు వెళుతున్న క్రమంలో...కపిలవస్తుకు ఇరవై మైళ్ళ దూరంలో వున్న'లుంబినీ' అనే ఉద్యానవనం చేరే సరికే రాణి విపరీతం గా అలిసిపోయింది. బడలిక తీర్చుకోవటానికి ఒక సాలవృక్ష
ఛాయలో చేరింది రాణి. అప్పుడు ఉన్నట్లుండి పురుటి నొప్పులు ప్రారంభమైనాయి. కొంత సేపటికి లోకోద్ధరణకు అవతరించిన | బుద్ధ భగవానుని జననం జరిగింది. 
ఆ కాలము క్రీ.పూ. 563. సంవత్సరంగా నేటి చరిత్రకారులు చెబుతున్నారు. కానీ ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు.
ఇలా రాణి ప్రస్తావించగానే వారు అటునుంచే తిరుగు ప్రయాణం కట్టి కపిలవస్తు నగరం చేరారు. పుత్రోదయ సందర్భంగా రాజు గొప్ప విందు ఏర్పాటు చేశాడు. 
ఐదవరోజు పురిటి స్నానం చేయించి బాలునికి
'సిద్ధార్ధుడు” అని నామకరణం చేశారు. అన్ని అభీష్టములు
నెరవేర్చువాడని ఆ మాటకర్ధం. ఈ లోకోపకార వార్త ముందుగానే తెలిసిన మహాత్ములు అయినా సిద్ధపురుషులు,
సర్వార్ధ సిద్ధికి అవతరించిన  సిద్ధార్థుని చూడటానికి దేశం నలుమూలలనుండి  వచ్చారు.

హిమాలయాలనుంచి 'అసిత' అనే మహర్షి వచ్చారు. ఆయన వయోవృద్ధుడు.అతడా బాలుని చూచి " - 
ఆనంద భరితుడైన, ఆయన 'ఇతడు లోక రక్షకుడు'. తన ముప్పది రెండవ ఏట దివ్య జ్ఞాన ప్రాప్తిచే అష్ట సిద్ధులు గల మహోన్నత పురుషుడవుతాడు. ఇతడు గగనతలం నుంచి మానవులకు దివ్యబోధ చేయుటకై వచ్చిన 'కారణజన్ముడు... అని చెబుతూ అంతలోనే విచారంగా మౌనం వహించాడు. 
ఆ ముని విచార వదనం చూసిన రాజు కంగారు పడి  ఆ మౌనానికి కారణమేమని అడిగాడు. నరవర! వినుమా...
నాకా 'బుద్ధుని జూచుట చేకూరదు అంతదనుక జీవించనుగా
నూకలు లేవని ఇవ్విధి నాకన్నుల నీరు గ్రమ్మె . ఆ మహాత్ముని వీక్షించే భాగ్యం నాకు లేదు అని 'అసితుడు'మౌనంగా వెడలి పోయాడు. ఆ ముని అలా వెళ్లిపోయిన తర్వాత రాజుకు అంతయు అగమ్యగోచరంగా ఉన్నది అప్పుడాయన వెంటనే
 దేశంలోనే గొప్ప కీర్తి గడించిన ఏడుగురు పండితులను పిలిపించి సిద్ధార్ధుడి జాతక చక్రంవేయమన్నాడు.
వారు క్షుణ్ణంగా దానిని అధ్యయనం జేసి ఇలా అన్నారు.
ఓరాజా! మా ఊహకందినంతవరకు ఇతడు జగద్గురువు,
కారణ జన్ముడు. ఇతని భవితం రెండు విధాలుగా జరుగవచ్చు.
మొదటిది ఇతడు అవిక్రమ పరాక్రముడై విశ్వ విజేతయై
సాటిలేని చక్రవర్తి అనిపించుకుంటాడు.
 రెండవది ఇతడు సన్యసించి ప్రపంచ శాంతిని పరిరక్షించు
గొప్ప లోకరక్షకుడు అయినా అవుతాడు. 
ఓ రాజా! రెండు విధములా తమరి పేరుకూడా గొప్పగా జనుల నోళ్ళలో నానుతుంది. ఈ మాటకు తిరుగులేదు అన్నారు.
కౌండిన్యస గోత్రానికి చెందిన 'కొండన్న' అను పండితుడు ఇలా చెప్పాడు. రాజా! వీరు చెప్పినట్లుగా నీ కుమారుడు గొప్ప చక్రవర్తి కావలెనంటే వైరాగ్య జనిత భావాలు అతని మనసును కలచి వేయకూడదు. అది  సంసార త్యాగానికి
పురిగొల్పుతాయి. జాగ్రత్త అని చెప్పాడు.  రాజు ఆ మాటలు విని వెంటనే ఒక దృఢ నిశ్చయానికొచ్చాడు. వీనికి వేదాంతం నీడ సోకనివ్వను. నిత్యం సుఖాస్వాదనలో ముంచి తేలుస్తాను అనుకున్నాడు. మనిషి ప్రయత్నాలన్నీ ఇలానే ఉంటాయి విధి అనే ఘోర నది  ప్రవాహానికి ఎదురీదడం. ఇది ఇలా ఉండగా...
దురదృష్టవశాత్తు పురుటి అనారోగ్యంతో బాధపడి ఏడవరోజున రాణి మాయాదేవి కన్నుమూసింది. బాలుని సంరక్షణకు రాజు తన భార్య మాయా దేవి యొక్క సోదరి అయినా 'ప్రజాపతి గౌతమి'ని పెండ్లాడాడు. ఆమె చేతుల్లో అల్లారుముద్దుగా పెరిగిన సిద్ధార్థుడు, పినతల్లి నామము పై గౌతముడని పిలువబడ్డాడు. అయితే గౌతమునికి అంతపుర వాసం తప్పా మరో బయట ప్రదేశం తెలియదు.  యవ్వన వంతులు అయిన స్త్రీలను పురుషులను చూడడం తప్ప అన్యు లైన వారిని ఆయన చూడలేదు. ఆరోగ్యవంతులైన ఉల్లాస భరితులై న వారిని చూశాడు కానీ  రోగగ్రస్తులనూ ఆయన చూడలేదు.
అన్ని రకాలుగా పగడ్బందీగా శుద్ధోదన మహారాజు గౌతముని వైరాగ్య భావన నుండి రక్షించే వాతావరణాన్ని ఇలా కల్పించాడు. ఇలా సిద్ధార్థుడు గౌతముడై సమవయస్తులైన తన పెత్తండ్రి కొడుకు 'మహానాముని'తోనూ, పినతండ్రి కొడుకు
'ఆనందుని'తోనూ మేనత్త కొడుకు 'దేవదత్తుని'తోనూ కలిసి
ఒకేచోట పెరిగాడు. కానీ దాయాదులైన పెదనాన్న చిన్నాన్న బిడ్డలు గౌతముని తమ శత్రువు గా చూసేవారు కారణం ఉత్తర రాజ్యాధికారి అతడే కనుక.
గౌతముని లోని సుగుణ సంపద వారికి నచ్చేది కాదు. సర్వ పరివారం ఆయన సుగుణ సంపదను కీర్తించడం సహించేవారు కాదు.
 ఇలా ఉండగా .'విశ్వామిత్రు'డనే గురువుదగ్గర వేదాంతం స్పృశించని కేవలం లౌకిక విద్యాభ్యాసం చేయించారు శుద్ధోదన మహారాజు గారు. అయినప్పటికీ కూడా సిద్ధార్ధుని హృదయం  నిర్మలమై పూవువలె మృదువైనది.
ఒకరోజు సిద్ధార్ధుడు వనవిహారం చేస్తున్నాడు. ఉన్నట్లుండి
అతనిముందు హృదయవిదారకంగా అరుస్తూ ఒక కొంగ
ఆకాశంనుండి జారిపడింది..
అతి కుసుమ కోమల మైన ఆయన హృదయం ద్రవీభవించి
గాయపడిన యట్టి క్రౌంచపక్షి ని తన చేతుల్లోకి తీసుకొని
దానిరక్తం తుడిచి, తన ఉత్తరీయం చించి కట్టుకట్టాడు.
ఇది చూసిన శుద్ధోదన మహారాజు కు కలవరం కలిగింది. ఇటువంటి సంఘటనలు మరల పునరావృతం కాకూడదని తన భటులను ఆదేశించాడు....
సరే ఇలా కాలం గడుస్తూ ఉన్నది. కానీ యుక్త వయస్కుడైన గౌతమునికి వివాహం నిమిత్తం గా ఎవరు పిల్లను ఇవ్వడానికి ముందుకు రావడం లేదు... కారణం అతడు సన్యాసి అవుతాడు అన్న ప్రచారం వారిని అలా చేసింది.
 గౌతముని కి తమ రాకుమార్తెలను ఇచ్చి వివాహం చేసేందుకు సాటి రాజు లెవరు  ముందుకు రాలేదు. చూస్తూ చూస్తూ
సన్న్యసించబోయే వానికి పిల్లనిచ్చే తండ్రెవరు? అతను గొప్ప
చక్రవర్తి అవుతాడనేది ఆశావాదమేకదా!
వివాహాలు స్వర్గంలో జరుగుతాయని నానుడి. ఎన్ని
సంబంధాలు చూసిన రాజు తనకుమారునికి వధువును తేలేకపోయాడు. చివరికి తప్పదన్నట్లు గా తన మంత్రి
కుమార్తె యశోధర ను నిచ్చి వివాహం చేశాడు. తన తెలివి తేటలతో భర్తని మార్చగలననుకున్నది 'యశోధర'.
 గౌతమునికోసం మూడు భవంతులు ప్రత్యేకంగా అన్ని వసతులతో కట్టించారు. వాటికి శుభ, రమ్య, సురమ్య అని పేర్లు. ఒకటి రాకుమారుడు తన సహచరులతో గడుపుటకు. రెండవది బంధువులతో గడుపుటకు. మూడవది తన భార్య యశోధరతో గడుపుటకు. ఆ మూడు భవంతులను దాటి, అతడు అడుగు బైట పెట్టాల్సిన అవసరం లేకుండా చేశాడు తండ్రి అయిన శుద్ధోదన మహారాజు. ఆ రాజు నలభై మంది నాట్య,గాన, ప్రియ భాషణా విదుషీమణులైన అందగత్తెలు సిద్ధార్థునికి అన్యమైన వాటి గురించి ఆలోచించ నవసరం లేకుండా చేశాడు రాజు. స్వర్గమంటే ఇదే అని వేరు ఆలోచన లేకుండా చేశాడు. ఆవిధంగా సిద్ధార్థుని విరాగి కాకుండా
ఆపగలననుకున్నాడు రాజు. కాని ఆయన అనుకున్నట్లు
జరగలేదు. ఎంతకాలమని ఎవరైనా సరే నిర్బంధానికి  గురి అవుతారు. గౌతమునికి ఇలా గృహనిర్బంధం నచ్చలేదు. సరదాగా బయట విహరించాలని దేశ పర్యటన చేయాలని ఆయన వాంఛ. అందుకు తన తండ్రి అంగీకరించడం లేదనే బాధ అతనిలో గూడు కట్టుకుని ఉంది. 
భార్య తన భర్త లో వచ్చిన ఆ మార్పును గమనించింది. ఆమె తెలివిగల యువతి. ఆమె తన భర్త చెరసాలలో ఉన్నవానివలె
స్వాతంత్ర్యం కోరుకుంటున్నాడని అతన్ని నిర్బంధించి ఉంచడం తగదనుకుంది. పైగా ఆమె గర్భవతి. తన సాంగత్యం నుంచి అతనికి ఒకింత స్వేచ్ఛనివ్వడం మంచిదని ఆమె తలంచింది. తన అభిప్రాయాన్ని మామగారైన శుద్ధోదన మహారాజు ముందు ఉంచింది.
శుద్దోధనుడు ఆమె చెప్పినదాని కంగీకరించి. నాలుగు
శ్వేతాశ్వములను పూన్చిన చక్కని రధాన్ని అతనికోసం సిద్ధం
చేయించాడు. దానికి సిద్ధార్థుని చిన్ననాటి స్నేహితుడైన 'చెన్నుని' సారధిగా ఏర్పాటుచేసి, సుందర ప్రదేశాలే
గౌతమునికి చూపించాలని మరీ మరీ చెప్పాడు.
ఒక రోజు సిద్ధార్థుడు,... తన మిత్రుడైన చెన్నుని నగరంలో విహారానికి తీసుకుని వెళ్ళమన్నాడు. దైవజ్ఞులు చెప్పిన సమయం రానే వచ్చింది. రధానికి అడ్డంగా ఒక పండు ముసలివాడు వచ్చాడు. ఏ క్షణాన మరణిస్తాడో అన్నట్లున్న ఆ ముదుసలి నడకలో వణుకు స్పష్టంగా కనిపిస్తోంది.
 కళ్ళలో జీవంలేని ఆ దేహం నిండాముడతలు. ముగ్గుబుట్ట లాంటి తల. రధానికి అడ్డం వచ్చినందుకు చెన్నుడు అసహనంతో నిందిస్తున్నా మారుమాటలేక భయంతో వణికి పోతున్న అతన్ని చూసి గౌతమునికి ముందు ఆశ్చర్యం కలిగింది. ఇది ఏమిటి  ఈ వ్యక్తి విచిత్రం గా ఉన్నాడు. ఇటువంటి వ్యక్తిని నేనింతవరకూ చూడలేదు.
అని రథ చోదకుడు అయినా తన మిత్రుని అడిగాడు సిద్ధార్థుడు. సమాధానం ఏమి చెప్పాలో అర్థం కాలేదు మిత్రుడైన రథసారధి కి. అతడు మౌనం వహించాడు...
ఆ మౌనం సిద్ధార్థునికి నచ్చలేదు. ఏమిటి మిత్రమా అడుగుతుంటే చెప్పవేం ఇతడు మనిషేనా ఎందుకిలా ఉన్నాడు అని అడిగాడు....

దైవ సమానుడైన మిత్రునికి అబద్ధం చెప్పడం భావ్యం కాదనిపించింది రాజాజ్ఞను విస్మరించి ఇలా చెప్పాడు..
ప్రభు!.. మీరు చూసిన ఈ వ్యక్తి మనిషే. వృద్ధాప్యం చేత అలా ఉన్నాడు అని చెప్పాడు. 

వృద్ధాప్య మా అదేమిటి అని ఆశ్చర్యంగా అడిగాడు సిద్ధార్థుడు. 
మనిషిగా పుట్టిన ప్రతి వాడు కూడా బాల్యం అటు తర్వాత యవ్వనము అటు తర్వాత ఇదిగో మీరు చూస్తున్నారే ఈ ముసలితనాన్ని తప్పక పొందాలి అని చెప్పాడు...
 నీవు చెప్పినట్లు పుట్టిన ప్రతివాడు ఇలా అవతార!? అని అడిగాడు ఆశ్చర్యంతో... 
అది ప్రకృతి ధర్మం తప్పించడం కుదరదు అన్నాడు సారధి.
ఆ మాటలు విని సిద్ధార్థుడు వెంటనే రథం దిగి ఆ ముదుసలి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు.
కథ విన్న మిత్రులందరికీ ధన్యవాదాలు భావములతో  
రేపటి కథాంశంతో మీ ముందుకు వస్తాను
మీ మిత్రుడు సుబ్బరాజు భట్టు 
🌼🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌼

ప్రశ్నించని మనిషి ఉన్డడు। ప్రశ్న లేని బ్రతుకు జ్ఞాన శూన్యం।
ప్రశ్నించడం బుద్ధి లక్షణం తెలియబడిన సమస్త విజ్ఞానానికి
ప్రశ్న యే పునాది మనిషికి మిగతా జీవరాసులకు ఇది ఒక్కటే తేడా। ప్రతిదీ మారిపోయే ఈ లోకంలో మనిషి బ్రతుకు ప్రశ్నా ర్థకం। మనిషి కోరేది శాశ్వతం అశాశ్వతమైన ఈ జీవితాన అది దొరికేనా?!
నిజమనిపించే జీవిత ప్రేమానురాగాలు కడదాకా మిగిలేన ?!
ప్రభూ!।।।
శాశ్వితాన్నీ చేరే దారిని  మాకు ప్రకాశవంతం చేయవా।।।।।

అని ఆ పరమాత్మను ప్రార్థిస్తూ మహాత్మా గౌతమ్ బుద్ధ జీవన చరిత్ర రెండవ భాగం లోనికి ఈ శుభోదయ సమయాన మీ అందరినీ స్వాగతిస్తూ ప్రవేశిస్తాను।

మిత్రులందరికీ స్వాగతం 
సిద్ధార్థుడు తన రథం దిగి ఆ ముదుసలి వ్యక్తిని సమీపించాడు। భయపడుతూ వణుకుతున్న పెద్దాయనను కరుణతో చూచి అతని భుజం తట్టి భయపడకు అని చెప్పాడు। ఆ ముదుసలి యువరాజుకు నమస్కరించాడు । సిద్ధార్థునికి ఆ వేదన కలిగింది। ఏమిటిది? ఇంత నిగనిగలాడుతున్న తన శరీరం కూడా ఒకనాడు ఇలా అయిపోతుందా!  ఎంత దుర్భరం! " ।। సిద్ధార్థుని కనులలో కన్నీళ్లు తిరిగాయి। ఇలా గౌతముడు కంటతడి పెట్టడం రథసారధి అయినా చెన్నుడు చూశాడు। అతడు వెంటనే రథం దిగి యువరాజును సమీపించి ప్రభు! మీరు రథమును అధిరోహించండి మనం చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి అని విన్నవించాడు రథసారధి।
మౌనంగా తలవంచుకొని సిద్ధార్థుడు రధాన్ని అధిరోహించాడు। రథం ముందుకు బయలుదేరింది।।।

సముద్ర తరంగాల వలె ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతూ సిద్ధార్థుని మస్తిష్కంలో అలజడి రేపాయి।
రథసారధి యైన  మిత్రుని చూసి ఇలా అన్నాడు
చిన్న! మనిషి ఎందుకు వయసును బట్టి ఇలా మారి పోతున్నాడు। ఇలా ఎందుకు జరుగుతుంది। ఇది ఇంతేనా ఇంకా ఏమైనా మార్పులు చెందుతాడా మనిషి।।। 
ప్రశ్నించాడు సిద్ధార్థుడు।
సిద్ధార్థుని తీరును గమనిస్తున్నా సారధి " ఆ దైవజ్ఞులు చెప్పిన మాట నిజమయ్యేలా ఉంది అని మనసులో అనుకుంటూ।। ప్రభు! మనం అంతపురం చేరిన తర్వాత మీతో అన్ని విషయాలు మాట్లాడతాను కాస్త ప్రశాంతంగా ఉండండి అంటూ రథమును నడుపుతున్నాడు చెన్నుడు।
రథం తిరుగుముఖం పట్టి అంతఃపురానికి చేరింది।
ఎన్నో ప్రశ్నలతో తన మందిరంలో ప్రవేశించాడు సిద్ధార్థుడు। 
కొన్నాళ్ళ తర్వాత చెన్నుని మరల నగర పర్యటనకు
తీసుకెళ్ళమన్నాడు గౌతముడు। 
ఈసారి ముదుసలి వారిని రాచరహదారిలో లేకుండ జాగ్రత్త పడ్డారు రాచపరివారం।ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది। ఎవరూ రధానికి అడ్డురావటం లేదు। ఇంతలో  దారిలోనపోయే ఒక యువకుడు ఉన్నట్లుండి నరికిన చెట్టులాగ దారిలో పడిపోయాడు। నోటిలో చొంగకారుస్తూ కట్టెలా బిగిసిపోయి కాళ్ళు చేతులు నేలకు కొట్టుకుంటూ బాధపడుతున్నాడు।
జనం అంతా మూగారు। ఏదన్నా ఇనుప వస్తువు అతని
చేతిలో పెట్టండి। నాలుగు కడవల నీరు అతని నెత్తిన
ఒంటి మీద గుమ్మరించండి। కాళ్ళు చేతులు నొక్కిపట్టండి,
జనం అరస్తూ ఆయాపనులు చేస్తున్నారు।
ఇదంతా చూస్తున్న గౌతమునికి చాలా ఆశ్చర్యం కలిగింది।
 ఏమిటిది ?!। ఆ మనిషి ఎందుకిలా కింద పడి కొట్టు కుంటున్నాడు। దీనికి కారణమేమిటి?  చెన్ను ని అడిగాడు సిద్ధార్థుడు।

చెన్నుడు నిజాన్ని దాచలేక పోయాడు సరే జరిగేది ఏమైనా జరుగును। దైవలీల అని అనుకుంటూ ఇలా చెప్పాడు।। 
ప్రభు! పడిపోయిన ఆ వ్యక్తి మూర్చ రోగము చేత అలా బాధ పడుతున్నాడు। ఆ బాధ ఎక్కువ సేపు ఉండదు కొంత వైద్యం చేసిన తర్వాత బాగుపడతాడు ఇది సహజం। ఆనందంగా ఉన్న మనిషిని ఆరోగ్యవంతుడు అంటారు। ఇలా ఆనందం కోల్పోయి పడిపోయిన వారిని రోగగ్రస్తులు అంటారు అని చెప్పాడు రథసారధి।।।

ఆశ్చర్యంతో సిద్ధార్థుడు " ఏమిటి రోగమా !అది మనిషిని చేరుతుందా ?! అప్పుడు రోగగ్రస్తం అవుతాడా మనిషి ?! ఇది సహజంగా మనకు వస్తుందా ?!।। ప్రశ్నించాడు సిద్ధార్థుడు। 
అవును ప్రభు! ప్రతి ఒక్కరికి ఈ పరిస్థితి తప్పదు। 
చెప్పాడు చెన్నుడు।।।
రోగం అంటూ ఒకటి ఉంటుందా ఇది ఇన్నినాళ్ళు నాకు ఎందుకు తెలియలేదు ?!
చెన్నా!।। రోగం అనే ఈ శరీర మార్పు ఎందుకు జరుగుతుంది।?!। నాకు ఇదంతా చిత్రంగా తోస్తుంది దయచేసి చెప్పు।।। మిత్రుని చూస్తూ అడిగాడు సిద్ధార్థుడు।
క్షమించండి ప్రభు!।। కొన్ని సంవత్సరాల క్రితం మీరు చిన్నవాడిగా ఉన్నారు। ఇప్పుడు పెరిగి పెద్దగా మారి యువకుడు అయ్యారు। మీరు చూసిన ముదుసలి ఒకప్పుడు చిన్నవాడే।
ఈ ప్రపంచం లో పుట్టింది అది ఏదైనా సరే పెరుగుతుంది ఆ తరవాత త్వరత్వరగా నశించిపోతుంది అని చెప్పాడు సారధి।
అయితే మిత్రమా! నీవు నేను కూడా ఇలాగే నశించిపోతామా! మనకు కూడా ఈ మార్పు తప్పదా!।।। దీనిని తప్పించే మార్గం లేదా!
ఆ యువకుడు మూర్ఛ నుండి కోలుకున్నట్లు మనం కూడా తిరిగి యవ్వన వంతులం అవుతామ?!।। అమాయకంగా ప్రశ్నించాడు సిద్ధార్థుడు। 
అబద్ధం చెప్పడం తప్పే అయినా ప్రస్తుతానికి సిద్ధార్థుని మనసును తేలిక పరచాలని ఇలా చెబుతున్నాడు రథసారధి।। అవును ప్రభు " వైద్యం చేయడం ద్వారా తిరిగి మనం యవ్వనం పొందవచ్చు" అని రధాన్ని అంతపురం వైపు తిప్పాడు సారథి।
జవాబులు దొరకని ప్రశ్న లాగా అంతపురం చేరాడు సిద్ధార్థుడు। అన్యమనస్కంగా ఇలా ఉన్నా సిద్ధార్థు ని చూసి తల్లిదండ్రులు మరియు అర్థాంగి అయిన యశోధర ఎంతో బాధకు లోనయ్యారు।।।।।
సిద్ధార్థుని మనసును ఆహ్లాదం  చేయాలని అతడు వైరాగ్య భావన కు దూరం కావాలి అని విందువినోదా సంగీత గాన ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు   మహా రాజు।
ప్రస్తుతానికి కొంత మర్చిపోయి మామూలు స్థితికి వచ్చాడు సిద్ధార్థుడు। ఇలా కొంత కాలం గడిచింది।
ఏదో తెలియనిది ఉంది। ఏదో రహస్యం ఈ జీవితంలో దాగి ఉంది। నాకు ఏదో తెలియాలి అన్న జిజ్ఞాస పూర్ణంగా సిద్ధార్థుని లో నెలకొని ఉంది।।
ఒకరోజు సిద్ధార్థుడు ఉన్నట్లుండి ఒక నిర్ణయానికి వచ్చాడు।। తన మిత్రుని  ।
“చెన్నా! రధం సిద్ధం చేయి వాహ్యాళికెళదాం” అని ఆదేశించాడు ।
గౌతముని ఆజ్ఞకు, ఎందుకనే అడిగే ధైర్యం ఎవరికీ లేదు। తాపీగా రధం నగర వీధులలో పోతున్నది। అన్యమనస్కంగానే
మాట్లాడుతున్నాడు గౌతముడు।  ఉన్నట్లుండి ఒకవీధిలో పెద్దగా ఏడుపు వినిపించింది। ఎవరో యువకుడు మరణించాడు। వానికోసం వాని బంధు మిత్రులు ఏడుస్తున్నారు। రథం ఆపు అన్నట్లుగా సైగ చేశాడు సిద్ధార్థుడు। రథం ఆగిపోయింది। అక్కడ జరిగే తతంగాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నాడు సిద్ధార్థుడు।
చనిపోయిన ఆ యువకుని భార్య అందమైన యువతి। ఆమె దుఃఖం వర్ణనాతీతంగా వుంది। అంతవరకూ అలా బిగ్గరగా ఎవరు ఏడవడం సిద్ధార్థుడు చూడలేదు।।।।
మనిషి పాడే పాటలు మాత్రమే అంత వరకు తాను విన్నాడు।।। ఇదేదో పాట లాగా ఉంది కానీ చిత్రంగా ఉంది అని అనుకుంటున్నాడు సిద్ధార్థుడు। చిత్రం ।।।।సిద్ధార్థునికి ఏడుపు అంటూ ఒకటి ఉందని కూడా తెలియదు।
యువకుని శవం పై పడి ఆ యువతి ఏడుస్తున్నది।
నాథ! నను విడిపోతివేల ఇకనాకు జగంబున
ఎవరయ్యా దిక్కు।।।
కంటి చూపు లేని నీ తల్లిదండ్రులను ఇక నేను ఏమి చేయాలి ?!
తన తండ్రి చనిపోయాడు అని తెలియని నీ చిన్ని బిడ్డకు నేను ఏమని చెప్పాలి। 
నీ తండ్రి లేడు రా వెళ్ళిపోయాడు రా అని ఎలా చెప్పాలి।।।
అమ్మ నాకు నాన్న కావాలి అంటే నిన్ను నేను ఎక్కడి నుంచి తీసుకొని రాగాలను।।।
మాకు  అన్యాయం చేసి వెళ్ళిపోతావా అని దీనాతి దీనంగా ఏడుస్తూ ఉంది ఆ యువతి।।।।
ఆ విధంగా రోదిస్తున్న ఆమెను, ఆమె బంధువులు ఓదార్చలేక
పోతున్నారు।
 ఇంతవరకు ఇటువంటి దృశ్యం చూడని సిద్ధార్థుడు  ఆప్రదిభుడయినాడు।
 ' చిన్న! ఆమె ఎందువలన అంత పెద్దగా విచిత్రంగా పాట పాడుతున్నది। ఆ పడుకుని ఉన్న యువకుని చుట్టూ చేరి అంతమంది ఎందుకు  కన్నీరు కారుస్తున్నారు  ।
 అని అడిగాడు।  చెన్నుడు మౌనం వహించాడు। కానీ సిద్ధార్థుడు ఆగలేదు చాలా గట్టిగా ఆజ్ఞా పించాడు చెప్పమని।
బలవంతంమీద చెన్నుడిలా అన్నాడు। ప్రభూ! “ఆ యువకుడు మరణించాడు। అతని పైబడి పెద్దగా విలపిస్తున్న ఆయువతి అతని భార్య।అతనిక తిరిగి రాడని అంధులైన ఆతని తల్లిదండ్రులను, వివాహం చేయవలసిన ఆతని సోదరిని, ముక్కుపచ్చలారని తమ పుత్రుని జూచి దిక్కు తెలియక ఆమె ఏడుస్తున్నది” అన్నాడు। 
ఏమిటి మరణమా?
మరణం అంటే ఏమిటి? ప్రశ్నించాడు సిద్ధార్థుడు।
ప్రభు! మనం అంతఃపురాని విడిచి రథంపై ఇంత దూరం వచ్చామా!।।
ఇలాగే మనిషి కూడా తన శరీరాన్ని విడిచి వెళ్లిపోతున్నాడు దానిని మరణం అని అంటాము అని అన్నాడు రథసారధి।।।
నాకు అర్థం కావడం లేదు చిన్న। కాస్త అర్థమయ్యేటట్లు చెప్పు ఆశ్చర్యంగా అడిగాడు సిద్ధార్థుడు।।
ప్రభు! మీరు ప్రతిరోజు నిద్రపోయే మనిషిని చూస్తున్నారు కదా!। అలా నిద్రపోవడం మనిషి తాత్కాలికంగా శరీరాన్ని విడిచి వెళ్లి పోవడం। కానీ అతడు తిరిగి వచ్చి మేల్కొంటాడు। అది మీరు రోజు చూస్తూ ఉన్నారు కదా!। జవాబు ప్రశ్నగా చెప్పాడు సారధి। ఏమిటి చిన్నా నువ్వు చెప్పేది?!। నిద్రలో మనిషి వెళ్ళిపోతున్నాడా? అంటే ఇప్పుడు నేను అనుకుంటున్నా ఇది నేను కాదా!, అమితా ఆశ్చర్యంతో అడిగాడు సిద్ధార్థుడు।
అవును ప్రభు। నీవు గాని నేను కానీ ఎవరైనా కూడా ఈ శరీరాలు కాదు। ఈ శరీరం ఒక గృహం వంటిది। కొంతకాలం ఈ గృహంలో కాపురం ఉండి, మనిషి శాశ్వతంగా దీన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు। దానిని చచ్చిపోవడం అని అంటారు ఆ యువతి తన భర్త తిరిగి రాడని రోధిస్తూ ఉన్నది అని చెప్పాడు మిత్రుడైన రథసారధి। అయితే ఏదో ఒక రోజు నేను కానీ నీవు కానీ ఇలా   చచ్చిపోతామ ? ఇది శాశ్వతం కాదా?!।
అసలు మనం ఈ శరీరంలో కి ఎందుకు వస్తున్నాము ఎందుకు వెళ్ళిపోతున్నాము। 
ఇన్ని రోజులు నన్ను ప్రేమించి పెద్ద చేసిన నా తల్లిదండ్రులు ఎవరు?!
నేను చనిపోతే వారి పరిస్థితి ఏమిటి?!।
ఇంకా జన్మించని నా బిడ్డ దిక్కేమిటి? నా భార్యకూడా ఇలాగే
రోదిస్తుందా? ।।।।।। సిద్ధార్థుని పెదవులు అదురు తున్నాయి। కంఠం గద్గద మవుతున్నది। శరీరం వణుకుతుంది। రోదన అంటే ఏమిటో తెలియని సిద్ధార్థుడు తొలిసారిగా ఆ భావన పొందాడు। కన్నీళ్లు ధారాపాతంగా ప్రవహిస్తున్నాయి।
చెన్నా!
 మనిషికి ఈ వేదన తప్పదా? దీని నివారణోపాయం లేదా? మనిషి ఎప్పుడూ ఆనందంగా ఉండే మార్గం లేదా? 
ఈ విధంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్న గౌతమునికి తనకు తెలిసిన విధంగా ఇలా చెబుతున్నారు।।
మహారాజా కావలసిన మీరు।।।।ఇలా చిన్నపిల్లవాడిలా రోధించ కూడదు । ఈ చావు పుట్టుకలు మనిషికి సహజం। మీ తండ్రి తర్వాత మీరు రాజ్యాన్ని పరిపాలించాల్సి ఉంది।
 రాజ్యం లో శాంతిభద్రతలను కాపాడేందుకు నేరస్తులను దండించాల్సి ఉంటుంది।
 అవసరమైతే మరణదండన కూడా విధించాలి। ఇలా మీ కర్తవ్యం మీరు నిర్వర్తించాలి। మీరు శాంతాన్ని పొందండి అని ప్రార్థించాడు మిత్రుడు।
నిరుత్తరుడై నిచ్చేష్టుడైనాడు గౌతముడు। 
మరి ఇంత హింస, దుర్మార్గం ఉండే ఈ రాజరికం ఎందుకు? తన ప్రజల దుఃఖాన్ని నివారించలేని రాజుకు వారిని దండించఏ అధికారం ఎక్కడిది? మనిషి ఎప్పుడూ ఆనందంగా ఉండే దారిలేదా? ఇలా వారు మాట్లాడుతూ ఉంటుండగా రథము రాజ భవనం ముందు వచ్చి నిలిచింది।
జరిగిన మూడు సంఘటనలు శుద్ధోధన మహా రాజుకి తెలుస్తూనే ఉన్నాయి। తను చూస్తూ ఏమీ చేయలేక పోతున్నాడు। విధి అంటే ఇదేనా? కాపలా కట్టుదిట్టం చేయలేక
పోతున్నాడెందుకు? 
 
గౌతముడు ఆంతరంగికుడైన చెన్నుని నిర్బంధిస్తున్నాడా? చూస్తూ చూస్తూ చెన్నుని రాకుమారుని ఆజ్ఞను తిరస్కరించ మని చెప్పలేడు। 
ఇటువంటి సంఘటన ఇకపై జరుగరాదని కఠినంగా మందలించాడు చెన్నుని।
 ఆపైన భారమంతా తనకెన్నడూ కనిపించని ఆ దేవునిపై వేసి
నిర్లిప్తంగా ఉండిపోయాడు శుద్ధోదన మహారాజు।
సిద్ధార్థుని జీవితాన నాలుగు సంచలన సంఘటనలు
జరుగుతాయని దాని ఫలితంగా అతను సన్యసిస్తాడని
జ్యోతిష్కులు చెప్పారు। 
ఆ నాలుగో సంఘటన ఏమయి ఉంటుంది?  
కథ విన్న మిత్రులందరికీ ధన్యవాదములు। రేపటి కథాంశంతో మీ ముందుకు వస్తాను।  మీ మిత్రుడు సుబ్బరాజు భట్టు 
🌼🙏🙏🙏🙏🙏🙏🙏🌼

మనిషి మనిషికో కథ ఉంది..
మనుష్యజాతి ఒకటే అయినా మనిషి మనిషికి ఏదో కొంత తేడా ఉంది..
 ఏ రెండు ముఖాలు ఒకేలా ఉండవు, ఏ రెండు మనసులు ఒకేలా ఉండవు, అనాది కాలం నుండి నేటికి వచ్చిన మానవ సమూహం ఎంతో ఎంతెంతో వచ్చిన వారి సంఖ్య అసంఖ్యాకం.
అయినప్పటికీ కూడా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రూపం 
 ఒక్కొక్కకథ ఉంది.
అంతయు వైవిధ్యం ఒక కథ కు మరొక కథ కు సంబంధమే లేదు రాసిన  కథలు రాయడం లేదు
నిత్య వినూత్నంగా ఆయన కలం కదులుతోంది ఆశ్చర్యకరుడు
మహా కవి అయిన ఆ బ్రహ్మయ్య క్రొంగొత్త కథలు రాస్తూనే ఉన్నాడు...

అలుపులేని ఆయన కలానికి ఒక నమస్కారం...
ఇలా బ్రహ్మయ్య కు నమస్కరిస్తూ ఆయన సృష్టించిన గౌతమ బుద్ధ మహాత్ముని కథ మూడో భాగం లోనికి  ఈ శుభ సాయంత్రం సమయాన మీకు అందరికీ స్వాగతం చెబుతూ అందులో ప్రవేశిస్తాను.

మిత్రులందరికీ స్వాగతం 
ఆచారం ప్రకారం గర్భవతి అయిన ఇల్లాలు పుట్టింటికి వెళ్ళాలి.. 
సిద్ధార్ధుని ఇల్లాలు మంత్రి కుమార్తె అయినందువల్ల యశోధర పురిటికి ఎక్కడికీవెళ్ళలేదు. నేడో రేపో ఆమె ప్రసవిస్తుంది. శుద్దోధన మహారాజు మహదానందంతో జన్మించబోయే వారసుని  కోసం,ఆ హడావిడిలో ఉండిపోయాడు.
కానీ సిద్ధార్థుని పరిస్థితి మరోలా ఉంది. తనకు సంతానం కలుగుతున్న ఆనందం లేదు. తల్లిదండ్రులతో స్నేహితులతో బంధువులతో తన ఇల్లాలితో మాట్లాడుతున్నప్పుడు కూడా సిద్ధార్థుడు అన్యమనస్కంగానే ఉన్నాడు. ఎవరు తోడు లేకుండా ఉద్యానవనంలో ఒంటరిగా విహరిస్తున్నాడు. 
సంగీత వినోదాలు ఆయనను ఆకర్షించడం లేదు.
ఈ వరుస క్రమంలో ఆయనకు రాత్రిల్లు కూడా నిద్ర పట్టడం లేదు...

తాను నివసిస్తున్న రాజభవనం కేవలం ఒక సత్రం లాగా కనిపిస్తుంది. తల్లిదండ్రులు బంధుమిత్రులు కడకు భార్య కూడా ఆయనకు గమ్యం తెలియని బాటసారు ల్లాగా కనిపి స్తున్నారు. ఏమిటి ఈ మనుషులంతా?!.

వీరికి మొదలు తెలియదు తుది తెలియదు. ఎందుకు వస్తున్నారు అంటే సమాధానం లేదు.ఎందుకు వెళ్తున్నారో వీరికి అర్థం కావడం లేదు.
అతి ముఖ్యమైన ఈ నా ప్రశ్నకు సమాధానం చెప్పే వారు ఎవరు?! 
ఏమి తెలియకుండా గానే నిష్కారణంగా ఈ మనుషులు మరణానికి బలి అవుతున్నారు. మరణాన్ని జయించే మార్గం లేదా?!.
ఒకరకంగా ఈ జీవనం ఒక కారాగారం లాగా కనిపిస్తున్నది. 
ఎవరో పట్టుకొచ్చి ఈ మనుషులను ఇక్కడ బంధిస్తున్నారా అనిపిస్తున్నది.... 
లేకపోతే స్వతహాగా దుఃఖంతో కూడిన ఈ లోకానికి ఎందుకు వస్తారు ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువగా శోకమే రాజ్యమేలు తుంది. ముందుగా నేను ఎవరో నాకు తెలియాలి. ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను తెలియాలి.ఇలా అనుకుని, సమాధానం పొందిన వారు ఎవరైనా ఉన్నారా?!...

నాకు తెలిసి ఈ రాజకుటుంబంలో కానీ ఈ రాజ్యంలో కానీ జవాబు తెలిసినవారు ఎవరూ కనిపించడం లేదు. జవాబు చెప్పే ఆ మనిషి ఎక్కడ ఉంటాడు?!.
ఇంతకూ ఆ  మనిషంటూ ఉంటాడా ?
ఏమో వెతికి చూస్తే తెలియవచ్చు. ఈ నా ప్రయత్నం లో నాకు ఎవరైనా సహాయ పడతార!...
ఇలా ఆలోచిస్తున్నా సిద్ధార్థునికి నిద్రాహారాలు రుచించడం లేదు....
ప్రస్తుతం ఆయన లో ఒకే ఒక్క వాక్యం తిరుగుతూ ఉన్నది...
 ఏమిటి సత్యం ? ఏమిటి సత్యం ? ఏమిటి సత్యం ?...
ఈ సత్యాన్ని అన్వేషించ వలసిందే...
దృఢమైన నిశ్చయానికి వచ్చాడు సిద్ధార్థుడు. ఒక రోజు గౌతముడు చెన్నుని రధం సిద్ధం చెయ్యి నగరం చూసి వద్దామన్నాడు. 
ఈ మాట వినగానే చెన్నుని కి గుండె గుభేలుమంది. 
ఈ విషయం శుద్దోధనునికి చెప్పే సమయం కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి?!. 
ఇక ఆలోచించలేదు చెన్నుడు. వెంటనే  నగరంలో భటులపై తనకున్న ప్రత్యేక అధికారంతో ఇదివరకు సంఘటనలు
పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డాడు. రథం కదిలింది.
 నెమ్మదిగా పురవీధులలో ప్రయాణిస్తోంది. వారి రధానికి ఈసారి దివ్య తేజస్సుతో ప్రశాంతమైన కరుణా దృష్టికల ఒక పరివ్రాజకుడు (సన్న్యాసి) ఎదురుపడ్డాడు. కాషాయ వస్త్రాలు ధరించిన వాడు కన్నుల్లో శాంతి కిరణాలు విరజిమ్మే వాడు
తలపులన్నీ బోడి అయ్యాయా అన్నట్లు శిరోముండనం చేయించుకున్నాడు. ఒక చేత భిక్ష పాత్రను ధరించిన వాడు
మరో చేత దండం ధరించిన వాడు. పాదరక్షలు లేనివాడు
ఒకచోట నుండక తిరిగేవాడు సుఖ దుఃఖములను నాటకం వలె చూస్తూ వినోదంతో వెలసిన చిరునవ్వు కలిగినవాడు.
అట్టివాడు యగు సన్యాసిని సిద్ధార్థుడు అమితాశ్చర్యంతో చూచెను. 
“చెన్నా! ఈ మహానుభావుడెవరు? ఇతని వేషం వింతగా వుంది. 
మరెవరి లో కనపడని వినూత్న కాంతి ఇతనిలో గోచరమవు తుంది అన్నాడు సిద్ధార్థుడు. “ప్రభూ!ఇతడొక సన్న్యాసి. 
సర్వసంగ పరిత్యాగి. భిక్షుక వృత్తితో జీవిస్తాడు. ధ్యానయోగం ద్వారా మోక్షప్రాప్తికి ప్రయత్నిస్తున్న విరాగి. నిత్యానందులని ఇటువంటివారినే అంటారు” అన్నాడు చెన్నుడు. ప్రతిభుడైన  సిద్ధార్థుడు. ఏమిటి చేన్నా! మోక్షమా ! అంటే ఏమిటి?!
ఏ బంధము లేకపోవడం నిత్యం ఆనందంతో ఉండటం సమాధానం చెప్పాడు చెన్నుడు. అతను కూడా మనిషే కదా ?!
మనిషి అన్న తరవాత తల్లిదండ్రులు, అన్నదమ్ములు, స్నేహితులు ,బంధువులు.  ఒకవేళ వివాహం అయితే భార్య బిడ్డలు ఉంటారు కదా!
 బంధం లేకపోవడమేమిటి అని అన్నాడు సిద్ధార్థుడు. మీరు చెప్పింది తాత్కాలిక నిజం ప్రభు. కానీ ఏదో ఒక రోజు ఈ సమస్త బంధాలను వదిలి మనిషి ఎటో వెళ్లిపోతున్నాడు కదా!
అంటే మరణిస్తున్నాడు కదా!. రాకపోకలు లేని స్థితి తెలుసుకోవాలని ఆ మనిషి తనకు ఉన్న సమస్త బంధాలను వదిలిపెట్టి ఇలా సన్యాసి అయ్యాడు. మోక్షం అంటే ఏమిటో తెలుసుకోవాలని ఇలా కొందరి ప్రయత్నం. ఆ మాట వినగానే సిద్ధార్థుడు వెంటనే రథమును ఆపమన్నాడు.ఆగిపోయింది రథం. తాను త్వరగా దిగి రథమును, ఆ పరివ్రాజకుడు ని సమీపించాడు..
సమీపించి వినయంతో ఇలా అడిగాడు" మహాత్మా మోక్షం అంటే ఏమిటి ?!మీరు తెలుసుకున్నారా?!."ప్రశ్నించాడు సిద్ధార్థుడు. 
లేదు... ఈ శరీరం పడిపోయే లోపల అది తెలుసుకోవాలని నా ప్రయత్నం... నవ్వుతూ సమాధానం చెప్పి తన మార్గాన తాను వెళ్ళిపోతున్నాడు సన్యాసి.
వెళ్ళిపోతున్న అతని వైపు చూస్తూ నిలబడ్డాడు గౌతముడు.
ప్రభు.. పిలుపు వినిపించింది. తన మిత్రుని మాట విని రథం ఎక్కాడు సిద్ధార్థుడు. రథం కదిలింది. 
చిన్న! నీకు చాలా విషయాలు తెలుసు. మనిషి ఎందుకు జన్మిస్తాడు ఎందుకు మరణిస్తున్నాడు.. నీవు చెప్పినట్లు మోక్షం అనేది నిజంగా ఉన్నదా. అది ఎవరైనా తెలుసుకున్నారా ?!.
ప్రభు! మీరు అడిగిన ప్రశ్నలకు నా వద్ద సమాధానం లేదు. ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని ఎందరో మనుషులు ఋషులు అయిపోయారు. కొందరు తెలుసుకునే ప్రయత్నం లో శరీరాన్ని విడిచారు . మోక్షం అనేది ఉన్నదని అది పొందిన వారు కూడా ఉన్నారు అని పెద్దలు చెప్పగా విన్నాను... 
అయినా ప్రభు ఏదో కారణంతో మనకు ఈ జన్మ వచ్చింది?!. మనకు తెలిసి ఈ జన్మ తీసుకోలేదు. జన్మను ఇచ్చింది దేవుడు అంటారు... 
జన్మ ఇచ్చిన వాడు మనకు ముక్తి ఇస్తాడు అన్నది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. అంత వరకు ఈ శరీరం ఏ కార్యం కోసం పుట్టిందో అది చేస్తూ పోవడమే... ఇలా అనుకుని చాలా మంది ఈ  సంసారంలో ఉన్నారు.... రథం నడుపుతూ చెప్పాడు రథసారధి.....
రథం తన భవనం ముందు ఆగింది. సిద్ధార్థుడు రథం దిగి తన మందిరంలోకి ప్రవేశిస్తున్నాడు.
ఇంటికి తిరిగి వచ్చిన వారికి యశోధర చక్కని బాలుని
ప్రసవించిందనే వార్త తెలిసింది. ఒక చెలికత్తె ఆ వార్త చెప్పగానే గౌతముడు విచార పడ్డాడు. తన సత్యాన్వేషణకు మరియొక బంధము ఏర్పడె కదా! అనుకుని ‘రాహువు' పుట్టాడా? అని అన్నాడు అన్యమనస్కంగా...
 ఆ మాట ఆమెకు ,"రాహులు" పుట్టాడా అన్నట్లు వినిపించి పరిగెత్తుకుని రాజు దగ్గరకు వెళ్ళి గౌతముడు తన బిడ్డకు పేరు నిశ్చయించేశాడని బాబు పేరు రాహులుడని చెప్పింది.
 రాహులుడంటే ప్రేమించదగినవాడని అర్ధం. ఆ పేరు విని అందరూ సంతోషించారు. తన బిడ్డని చూడకుండానే అంత అందమైన పేరు పెట్టిన గౌతమునికి పుత్రవాత్సల్యం కలిగిందని అందరూ అనుకున్నారు.
అంతే మరి ఒక దానిని మరొక దాని గా ఒక అర్థాన్ని మరొక అర్థం గా భావించడం ఈ మనుషులకు సహజం. 
బిడ్డ పుట్టాడన్న సంతోషం సిద్ధార్థునికి లేదు. తన మిత్రుని వైపు చూశాడు మౌనంగా. ఆనందం పరిచే వార్త సిద్ధార్ధుని ఆనంద పరచలేదేనని  ఆశ్చర్యంతో గమనిస్తున్నాడు చెన్నుడు....

ప్రభు! మీరు అలసినట్లు ఉన్నారు. త్వరగా స్నానం చేసి పుట్టిన మీ వారసుని చూసి రండి. మీరు నాకు సెలవిస్తే ఇంటికి వెళ్లి మీ తో పాటుగా ఆ వారసుని చూడటానికి వస్తాను.. వినయంగా నమస్కరించాడు రథసారధి. మౌనంగా తల ఊపాడు సిద్ధార్థుడు.కథ విన్న మిత్రులందరికీ న్యవాదములు రేపటి కథాంశంతో మీ ముందుకు వస్తాను మీ మిత్రుడు సుబ్బరాజు భట్టు 

*****
4
నీవు అంగీకరిస్తావా!
నిన్ను ఎవరైనా చంపడం. ఇది నీకు ఇష్టమేనా ?!.
వెంటనే సమాధానం వస్తుంది. నేను అంగీకరించను ఇది నాకు ఇష్టం లేదు. మరి అటువంటప్పుడు...
ఇతరులను నీవు ఎందుకు చంపు తున్నావు ?!
ఇతరులు అంటే కేవలం మనిషే కాదు జంతువులు పక్షులు అన్ని కూడా...
మిత్రులందరికీ శుభోదయం ప్రణామములు. ఇది బుద్ధ దేవుని యొక్క వచనములు. ఆయన సత్యానికి నిలువెత్తు సాక్ష్యం.
ఆయన వాక్యం ఆయన జీవితంలో ప్రకాశించింది.
అట్టి  ప్రకాశాన్ని స్మరిస్తూ మహాత్మా గౌతమ్ బుద్ధ చరిత్ర  నాలుగవ భాగం లోని ప్రవేశిస్తాను మిత్రులందరికీ స్వాగతం.
****
ఇదివరకు నేను మూడు భాగాలుగా ఆయన చరిత్రను మీకు చెప్పాను.
ఈ కథ చెప్పడానికి దాదాపుగా పది పదిహేను బుద్ధుని చరిత్ర గ్రంథాలను..  పరిశోధించాల్సి అవసరం వచ్చింది.
బుద్ధుని యొక్క జననం మరియు ఆయనకు వైరాగ్యం వచ్చిన తీరు అన్ని గ్రంధాలలో ఓకే గా ఉంది. అటు తర్వాత జరిగిన చరిత్రలో ఒక్కొక్కరు ఒక విషయాన్ని చెబుతూ వచ్చారు... వాటిలో ఏది సత్యము అని నిర్ధారించుకోవడానికి ఇప్పటికీ నాకు రెండు రోజులు పట్టింది....

ఇలా నేను బుద్ధుని చరిత్ర పరిశోధిస్తున్నంతలో బుద్ధుని గురించి ఒక యోగి చెప్పిన వాక్యాలు నాకు లభ్యమయ్యాయి. 
ఒక యోగి గురించి ఒక యోగికి మాత్రమే తెలుసు...
ఒక కవి గురించి మరొక కవికే తెలుస్తుంది. ఈ కారణం చేత పుస్తక చరిత్ర కన్నా కూడా నేను ఆ యోగి చెప్పిన కథకు ప్రాధాన్యత ఇచ్చాను.  అదే దాన్ని నేను ఇప్పుడు మీకు అందించ బోతున్నాను దయచేసి మన్నించగలరు.. మిత్రులందరికి మరి మరి మనవి చేస్తూ కథలో ముందుకు వెళ్తున్నాను. 
"ఈ జీవితానికి మృత్యువే పరమావధి అయితే, ఇంక ఈ జీవితానికి పరమార్థం ఏమిటి?'' దానిపై యోచిస్తో-రాజభవనం
పొన్న చెట్టుకింద కూర్చుని దేశదిమ్మరి జీవితం గడిపి అయినా సరే, దుఃఖనివారణోపాయాన్ని తెలుసుకోవాలనుకున్నాడు సిద్ధార్థుడు. అంతఃపురం విలాసాలు... 
ఇవన్నీ అతని నుండి పూర్తిగా  విడిపోయాయి. "వీటన్నింటి వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ దేహం ముసలిది అయిపోవచ్చు. అనారోగ్యం పాలు కావచ్చు, ఖచ్చితంగా మరణం సంభ విస్తుంది. మరి, నా జీవితాన్ని నేను ఈ విధంగా ఎందుకు
సాగిస్తున్నాను?" అని ఆలోచించసాగాడు.  కానీ
అప్పటికే, ఆయనకు ఒక పసిబిడ్డ ఉన్నాడు. ఎంతో
ప్రేమించే భార్యను, ప్రియమైన బిడ్డను అతను వదలలేక పోయాడు. తనలో తాను ఆయన ఎంతో ఘర్షణకు లోనయ్యాడు.
అప్పటికి దాదాపుగా ఏడాది పైన మూడు నెలలు గడిచాయి. 
ఆ పిల్లవాడికి ఒకటిన్నర సంవత్సరం వయసు ఉన్నప్పుడు, ఆయన ఇక ఆగలేకపోయాడు. ఒక అర్ధరాత్రి వేళ ఎవరికీ
చెప్పకుండా ఆయన అంతఃపురం నుండి ఒక దొంగలా బయటపడి, దానిని శాశ్వతంగా  వదిలిపెట్టాడు. "నేను ఈ జీవిత సత్యాన్ని తెలుసుకోవాలి" అంటూ, అని ఆయన
సత్యాన్వేషణలో బయలుదేరాడు. ఆ కాలంలో భారతదేశంలో ఎన్నో భిన్నమైన ఆధ్యాత్మిక మార్గాలు ఉండేవి. ఒకానొక సమయంలో 1,800 విధానాలు ఉండేవి, 18 వందల భిన్నమైన
యోగ విధానాలు. 
ఈనాటి వైద్యశాస్త్రం ఏ విధంగా ఉందో ఆనాటి  యోగ విద్యాభ్యాసం ఆ విధంగా ఉండేది. ఉదాహరణకు,
పాతిక సంవత్సరాల క్రితం, ఏ అనారోగ్యం వచ్చినా
, మీరు కేవలం  మీకు తెలిసిన వైద్యుని దగ్గరకు 
 వెళ్లేవారు.  కానీ ఈనాడు, మీ దేహంలోని ప్రతి భాగానికి ఒక డాక్టర్ ఉన్నాడు. యోగ విధానానికి కూడా ఇలాంటిదే జరిగింది.
యోగం ఒకటే యైనా దాన్ని పొందేందుకు ఎన్నో విధానాలు ఆ రోజుల్లో ఉండేవి.  ఎన్నో భిన్నమైన విధానాలలో, చిన్న అంశాలలో ప్రజలు నిష్ణాతను సాధించడం మొదలు పెట్టారు.
అయితే... 
ప్రత్యేకమైన విధానం అనేది ఒక స్థాయి దాటినప్పుడు ఇక
అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే, పతంజలి వచ్చి అన్నిటినీ యోగసూత్రాలుగా సంకలనం చేశాడు. గౌతముడు పతంజలి మహర్షి తరువాత వచ్చిన వాడే కానీ, అప్పటికి ఇంకా ఎన్నో విధానాలు ఉన్నాయి. గౌతముడు ఒక్కొక్క యోగ విధానాన్ని నేర్చుకుంటూ...
ఆయన ఒక విద్యాశాల నుండి మరొక విద్యాశాలకు వెళుతూ ఎనిమిది రకాల సమాధి స్థితులను అభ్యసించాడు. 
ఆయనకు ఇవన్నీ ఎంతో అందమైన అనుభూతులుగా ఉన్నాయి. కానీ, అవి ఆయనకు మాత్రం ముక్తిని కలిగించలేదు. ఇలాంటి పరిస్థితిలో ఆయన ఒక 'సమానా' అనే యోగ వ్రత విధానాన్ని ఆచరించాడు.  ఇది ఎలాంటి సాధన అంటే వీళ్ళు ఎవరిని భోజనం కోసం కూడా అడగకుండా కేవలం నడుస్తూ ఉంటారు. వాళ్లు ఆహారాన్ని వెతుక్కుంటూ
వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళు మనుగడ యొక్క ప్రాథమిక అంశాన్ని గెలవాలనుకుంటారు. 'సమానా'లు కేవలం నడుస్తూ ఉంటారు, ఎవరినీ ఆహారం కోసం కూడా అడగరు. 
కానీ ఆ రోజుల్లో సంస్కృతి సున్నితంగా ఉండేది. ఎవరైనా ఆధ్యాత్మిక వ్యక్తి నడుస్తూ ఉండడాన్ని చూస్తే ప్రజలు ఇంట్లో
వంట చేసి, వారి వెంట పరిగెట్టి, వారికి ఆహారాన్ని అందించేవారు. ఎందుకంటే, వీళ్లు ఆహారాన్ని
అడగరు అన్న విషయం వారికి తెలుసు. 
ఈ రోజుల్లో మీరు ఒక 'సమాన' అయితే, మీరు చచ్చేంత వరకూ
నడుస్తూ ఉండవలసిందే. ఆ రోజుల్లో ప్రజల్లో సున్నితత్వం ఉండేది. సాధనకు స్పందించేవారు అందుకని దేశంలో వేల మంది సమానాలు నడుస్తూ ఉండేవారు. గౌతముడు ఒక సమాన అయ్యాడు. మీరు భోజనం కోసం అడగకపోవచ్చు కానీ ఒక నగరానికి దగ్గరగా నడిచినట్లు అయితే ఆహారం
దొరుకుతుంది. కానీ గౌతముడు ఈ వ్రతాన్ని తేలిగ్గా
తీసుకోలేదు. అలా నడుస్తూ ఉన్నాడు. ఆయన ఎముకల గూడు అయిపోయాడు. చర్మం కప్పిన అస్తిపంజరంలా తయారయ్యాడు. అప్పుడు ఆయన నిరంజన అనే ఒక నది
సమీపానికి వచ్చాడు. అందులో షుమారు 18 నుండి
20 అంగుళాల నీరు మాత్రమే ఉంది. ఆయన
అందులో అడుగుపెట్టాడు. నది మధ్యలో ఉన్నప్పుడు ఆయనకు నదిని దాటే శక్తి లేకపోయింది. ఆయనకు తర్వాతి అడుగు తీసుకోవడానికి కూడా తగిన శక్తి లేదు. 

కానీ, ఆయన అలా వదిలిపెట్టే మనిషి కాదు. అక్కడ ఒక
ఎండిపోయిన చెట్టు కొమ్మ ఉంది, ఆయన దాన్ని
అలా పట్టుకుని నుంచున్నాడు.  అలా పట్టుకొనే
ఉన్నాడు. ఎంతకాలమో మనకు తెలియదు. బహుశా రెండు నిమిషాలు అయి ఉండొచ్చు. మీకు నీరసంగా ఉన్నప్పుడు ఆ రెండు నిమిషాలే మీకు రెండు సంవత్సరాలలా అనిపిస్తాయి. 
ఆయన అలా పట్టుకొని ఉన్నప్పుడు ఆయనకు ఇది తెలిసింది, "నేను దేని కోసం కృషి చేస్తున్నాను? నేను ఈ

దేశాటన దేనికోసం చేస్తున్నాను. ఒక విద్యాశాల
నుండి మరొక విద్యాశాలకు, ఇది అది నేర్చుకుంటూ
అసలు నేను దేని గురించి వెతుకుతున్నాను?" అని.
అప్పుడు ఆయనకు తెలిసొచ్చింది. "నిజానికి ఉన్నది
ఏదీ లేదు. ఈ జీవం కొనసాగుతోంది.  నేను
చేయవలసిందల్లా అది అనుభూతి చెందడానికి
ఏవైతే ఆటంకాలుగా ఉన్నాయో వాటిని తొలగించుకోవడం, మాత్రమే!" అని. ఆయనకు సర్వం తనలోనే ఉన్నాయన్న జ్ఞానం కలిగినప్పుడు, వెతికేందుకు ఎక్కడికీ వెళ్లాల్సిన
పనిలేదు అని తెలియగానే ఆయనకు తరువాతి అడుగు, ఆ తరువాతి అడుగు తీసుకోవడానికి ఉన్నపళంగా శక్తి వచ్చింది. ఆయన నదిని దాటి ప్రస్తుతం ఎంతో ప్రసిద్ధమైన బోధి చెట్టు కింద కూర్చున్నాడు.  ఆ రోజు పౌర్ణమి. ఆయన అక్కడ ఎంతో దృఢనిశ్చయంతో కూర్చున్నాడు "అయితే నేను నా అస్తిత్వం యొక్క మూలాలను ఇప్పుడు తెలుసుకోవాలి,  లేదంటే ఇక్కడే కూర్చుని, ఉన్న పళంగానే మరణిస్తాను. అంతే, నాకు అది తెలిసేంతవరకు కళ్ళు తెరవను!" అని. ఒకసారి ఆయన ఈ దృఢనిశ్చయం చేసిన తరువాత, మీలో ఉన్నది మీకు తెలియడానికి ఒక క్షణం చాలు. జ్ఞానోదయం కోసం మీరు ప్రత్యేకించి ఏదీ చేయవలసిన పని లేదని ఆయన గుర్తించినప్పుడు ఆయనకు పూర్తి ఆత్మజ్ఞానం కలిగింది.  నిండు చంద్రుడు మెరిసిపో తున్నాడు. ఆయన ఎన్నో ఏళ్లుగా సరిగ్గా భోజనం చేయలేదు. ఆయన నాలుగు సంవత్సరాలుగా 'సమాన' గా ఉన్నాడు.  ఆయన వద్దకు అయిదుగురు శిష్యులు చేరారు. వీళ్ళు ఇన్నాళ్ళూ ఏమనుకున్నారంటే, "ఈయన అసలైన వాడు. ఎందుకంటే ఆయన భోజనం చేయడు, కఠినంగా ఉంటాడు" అని. ఇప్పుడు ఆయనని ఏదో పారవశ్య స్థితిలోనూ, ఆయన ముఖంలో ఏదో వెలుగునూ వాళ్ళు చూశారు. కళ్ళు తెరచి వారికి ఆయన ఏదో బోధన అందిస్తారు అనుకున్నారు.
 
ఆయన కళ్ళు తెరిచి వాళ్ల వంక చూస్తూ చిరునవ్వుతో "ఏదైనా వంట చేయండి. మన అందరం తిందాం" అన్నాడు.
దానితో వాళ్ళు పూర్తిగా నిరాశ చెందారు. "ఈయన
పతనమై పోయాడు" అనుకున్నారు వాళ్లు. నాలుగేళ్లపాటు వాళ్ళ ఆయనతో నడిచారు, ఆయనకు చిత్రహింస తప్ప మరేదీ లేదు. కానీ ఆయనకు ఆత్మజ్ఞానం కలిగినప్పుడు వారు ఆయనను వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు ఏదో కఠినమైన విషయాన్ని వినాలి అనుకున్నారు. కానీ ఆయన "వంట చేయండి! మనం తిందాం. మనం మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం"
అన్నాడు. మిత్రులందరికీ ధన్యవాదములు రేపటి కథాంశంతో మీ ముందుకు వస్తాను మీ మిత్రుడు 
*****


5..

చర్యకు ప్రతిచర్య ఉంటుంది.  దీనిని చట్టము అంటారు.
ఈ చట్టం విశ్వవ్యాప్తమైంది. దీనినే ధర్మము అని అంటారు.
కనుక...
ఇతరుల నుండి నీవు ఎటువంటి ప్రతిచర్య ఆశిస్తున్నా వో
దానికి సంబంధించిన చర్య మాత్రమే నీవు చేయాలి.
" ప్రతి చర్య "అని ఎందుకంటున్నానంటే మనిషి తాను చేస్తున్న పనులు ఏంటో తనకు నిజంగా తెలియదు...
తను చేసే పనులు తనకు తెలియవు కానీ తాను ఇతరుల నుండి ఏమి కోరుతున్నాడు అంటే దయ (ప్రేమ)ను దానమును(ఉచితంగా పొందడం)ను మరియు ఓర్పు (క్షమ)ను కోరుకుంటున్నాడు. కానీ మనం ఏవైతే కోరుతున్నామో
 అవి ముందుగా మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి....
ఇవ్వకపోతే పొందలేవు అన్నది అద్ధము చెప్పే నగ్నసత్యం.
అద్దం ముందుకు వెళ్లి నీవు ఏదన్నా నీ ప్రతిబింబానికి ఇవ్వడానికి ప్రయత్నించు అది కూడా నీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. 

అద్దంతో నీ వ్యవహారం ఎలా ఉంటుందో అచ్చంగా ఈ లోకం కూడా అలాగే ఉంటుంది. నీ ముందు ఉన్న అద్దమే ఈ లోకం.
ఈ లోకం ఏమిటో కాదు నీకు ప్రతిబింబం. నీ చర్యను బట్టి ప్రతి చర్య లోకానిదై ఉంటుంది...
ఇస్తూ పోతావా!
నీవు పొందడం మొదలుపెడతావు. క్షమిస్తూ పోతావా  నీవు కూడా క్షమించ బడతావు నవ్వులను పంచుతూ వెళతావా 
నీవు నవ్వులను పొందుతావు. నీ కౌగిలింతకు ప్రతి కౌగిలి సమాధానం  ఇది సత్యం....
ఇది నీ జీవన రహస్యం. అని చెప్పిన మహాత్మా గౌతమ బుద్ధుని మహత్తర వాక్యాలను స్మరిస్తూ బుద్ధ భగవానుని జీవిత చరిత్ర ఐదో భాగం లోనికి మిత్రులందరినీ స్వాగతం పలుకు తున్నాను.
నేను ఆయన చరిత్ర కన్నా ఆయన బోధనలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాను కనుక వాటిని మాత్రమే మీకు చెబుతూ వెళ్తాను...

ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి జనాలు ఇచ్చిన పేరు అంగుళీ మాల.  అతనికి ఏదో ఒక సంఘటన జరిగింది. సమాజం తన పట్ల అన్యాయంగా ప్రవర్తించిందని, అతను ఒక కోపిష్టిగా
తయారయ్యాడు. 

note :-యౌవ్వనంలో మనకు కు ప్రతిదీ అన్యాయం అనిపిస్తుంది. అలా అతను సమాజంపై కోపంతో,
తనతో అన్యాయంగా ప్రవర్తించిన ఈ ఊరిలోని 101 మందిని చంపి, వాళ్ళ ఒక వేలును కత్తిరించి, తన మెడ చుట్టూ ఒక దండలా వేసుకుంటానని. అతను ఒక ప్రతిజ్ఞ పూనాడు.
అతను ఆలా చేస్తూ పోయాడు. అతను ఒక అడవిలో ఉండేవాడు. కానీ, అది అనేక మార్గాల మధ్యలో ఉంది. అందువల్ల, కొన్ని సంవత్సరాలలో,అతను వంద మందిని చంపేశాడు. అయితే తన ప్రతిజ్ఞ పూర్తిచేయడానికి, ఇంకొకరు కావాలి. ఒక రోజున గౌతమ బుద్ధుడు ఆ ఊరికి వచ్చాడు. అప్పటికే, ఈ వేళ్ళను మాలగా ధరిస్తుండటం వలన, అతన్ని అంగుళీమాల అంటే - చేతి వేళ్ళను దండగా ధరించేవాడు - అని పిలిచేవారు.  తన ప్రతిజ్ఞ పూరి చేసుకోవడానికి ఇంకొక చేతి వేలు కావాలి. ఇటువంటి సందర్భంలో గౌతమ బుద్ధుడు ఆ వూరికి వచ్చాడు. 

 గౌతమ బుద్ధుడు వచ్చాడు, ఆయన ఈ దోవనే వెళ్ళాలి. "ఆ
మార్గంలో వెళ్ళవద్దు. వాడు మనిషి కాడు, ఒక మృగం. బోధించడానికి కానీ, ధ్యాన పరుణ్ణి చేయడానికిగానీ, అతను తగిన వాడు కాదు, మీరు వెళ్ళవద్దు ఎందుకంటే అతనికి ఇంకొక ప్రాణం కావాలి. అది మీరేకావాలని మేము కోరుకోవడం
లేదు" అని ప్రజలు అన్నారు.  అప్పుడు గౌతముడు "నేను వెళ్లక పొతే, ఎవరు వెళతారు.  పాపం అతను కోరిక నెరవేర కుండానే ఉంటాడు. అతనికి ఇంకొక్క వేలే కదా కావాలి. నన్ను పోనివ్వండి" అంటూ ఆయన వెళ్లారు. అంగుళీమాల ఒక రాతి పైన కూర్చుని, మౌనంగా వస్తున్న సన్యాసిని చూసాడు.
ఇప్పటికే, తన పేరు ప్రఖ్యాతుల పట్ల అతనికి ఆనందంగా ఉంది. ప్రజలు అతనంటే భయ భీతులవుతున్నారు. అది అతనికి చాల ఇష్టం. ప్రజలు అతని పేరు వింటేనే వణికిపోతారు. ఆ రాతి మీద కూర్చుని, ఈ సన్యాసి ఆ విషయం
తెలుసుకోవాలన్నట్లుగా "నేను ఇక్కడ ఉన్నాను. నీ చావు మూడుతోంది రా " అంటూ గర్జించాడు. గౌతముడు అతని వైపు చూసి, తన ముఖంపై చిరునవ్వుతో మౌనంగా నడవ సాగాడు. 
అది అతనికి నచ్చలేదు. సామాన్యంగా అతన్ని చూసినా, విన్నా ప్రజలు తమ ప్రాణాలు రక్షించుకోవడానికి, అస్తవ్యస్తంగా పరిగెత్తుతారు. అదంటే అతనికి ఇష్టం.
మరి, ఈ మనిషి చక్కగా నడిచి వెళుతున్నాడు.
అతను రాతి మీద నుండి దూకి, అతని ఎదుటికి
వచ్చి ఇలా అన్నాడు, "నువ్వు ఎవడివి? నేనెవరినో తెలుసా?" అంటూ తన వేళ్ళతో ఉన్న మాలను చూపించాడు. “నా గురించి నీకు తెలుసా?" అని అన్నాడు,
 గౌతముడు "ఆఁ! నీ గురించి చాల విన్నాను. అయితే ఏమిటి?" అని నడుస్తూనే ఉన్నాడు . అంగుళీమాల "ఎక్కడికి పోదామను
కుంటున్నావు? నేను మాట్లాడుతుంటే, నువ్వు వెళ్తూనే ఉన్నావు?"... 
 దానికి గౌతముడు "నా పయనం ఎప్పుడో ఆగిపోయింది. నేను గమ్యం చేరుకున్నాను. నీవే ఎక్కడికో పోదామని ప్రయత్నిస్తున్నావు." అన్నాడు. 
అప్పుడు అంగుళీమాల నవ్వి "చెత్త మాటలు. నువ్వో పిచ్చివాడవు. నేను స్థిరంగా నిలుచున్నాను. నీవేమో వెళ్తున్నానని అంటున్నావు, కానీ నువ్వు నడుస్తున్నావు, అయినా ఎక్కడికి వెళ్లడం లేదంటున్నావు. నీకేమయింది?" అన్నాడు. దానికి గౌతముడు  "నేను చాలా కాలం క్రిందే
చేరుకున్నాను. నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. నీవే
ఎక్కడికో వెళ్లాలని ప్రయత్నిస్తున్నావు. కానీ, నీకు
ఎక్కడికి వెళ్లాలో తెలీదు. నీకు నా వేలు కావాలా
లేక నా మెడ కావాలా? నీ దగ్గర వేళ్ళు ఇప్పటికే ఉన్నాయి, నా తలను వెళ్ళాడ తీయి. అది నీ కంఠమాలలో మంచి పతకంగా ఉంటుంది. ఎందుకంటే నా పని పూర్తయింది, నేను చేరాను.
నేను భౌతికంగా ఇక్కడ ఉన్నా, లేకపోయినా పర్వాలేదు. నీకు కావాల్సింది చేసుకో" అన్నాడు. ఎవరినైనా చంపే ఆనందం, వారు భయ భ్రాంతులై, చావడానికి ఇష్టపడక పోతున్నప్పుడే. కాని, చావాలని నిశ్చయించుకుని, విచారించకుండా ఉంటే,
అటువంటివాడిని చంపి ప్రయోజనమేమిటి?
ఏమనిపిస్తోందంటే ఈ వ్యక్తిని చంపినప్పటికీ, 101
మందిని చంపాలన్న కోరిక తీరదు, ఎందుకంటే అది
ఆ ఆనందం ఇవ్వదు. అప్పుడు అంగుళీమాల "ఆఁగు!
నీవు ఇది ఏమిటో నాకు చెప్పు? నీవు కదుల్తున్నావు, నేను చేరాను అంటూనే నడుస్తున్నావు.  నేను కదలటం లేదు కానీ
కదుల్తన్నానని అంటున్నావు" అన్నాడు.  గౌతముడు,
“నీవు నీకు తెలసిన పద్ధతిలో తృప్తికై ఎదురుచూస్తున్నావు. నేను ఇప్పటికే తృప్తి పొందాను. ఇదే పెద్ద తేడా. 
నీవు నా ప్రాణం తీయవచ్చు. దాని వల్ల నీకు తృప్తి వస్తుందని
నీవనుకుంటే, నువ్వు ఆ పని చెయ్యి, ఎందుకంటే
నా పని ప్రజలను తృప్తి పరచడమే. ఇతరులను తృప్తిపరచడం మే నా యొక్క ధర్మం. నాకు శ్రమ లేకుండా
కేవలం నా గొంతు కోసి నీవు తృప్తి పడగలను అని అనుకుంటున్నావు. నాకు కూడా నీవు తృప్తి చెందడం కావాలి. నేను కష్టపడి నీకు బోధ చేయాల్సిన అవసరం శ్రమ రెండు లేవు. ఇది నాకు చాలా సుఖం కూడా.. 
 కానిచ్చేయి. సమస్య ఏముంది?" అని పరమానందంగా అన్నాడు. అతడు ఉన్నఫలంగా ఒకే ఒక క్షణం లో మారిపోయాడు.
Note: ఒక రాక్షసుడు ఉన్న ఫలంగా మారడం అంటే అతడు పొందిన బోధ సామాన్యమైనది కాదు.. దండిస్తే ఇతడు మారగలడా? మారే వాడ ?!
బుద్ధుని యొక్క అనంతమైన కరుణ ముందు అతడు తలవంచాడు. అప్పుడు అంగుళీమాల ఆయన శిష్యుడయ్యాడు. గౌతముడు "నీవు ఏ ఊరిలో వంద మందిని
చంపావో ఆ ఊరికి నీవు తప్పక వెళ్ళాలి" అన్నాడు.
దేవా ! నేను ఆ వూరికి వెళ్ళలేను. నేను వెళితే అందరూ అక్కడ భయపడి పారిపోతారు. నేను అక్కడికి వెళ్లి బోధ చేస్తే ఎవరు వింటారు.  వారు నన్ను చంపుతారు. అని అన్నాడు అంగుళీమాల. ఇప్పుడు నీవు లేవు.నీవు నా స్వరూపం పొందావు. నిన్ను వారు చంపరు. ఒకవేళ వారి చేతిలో చంపబడిన  అది నీకు మేలు చేస్తుంది. నేను నీ ముందుకు వచ్చాను నీవు చంపగలిగావా?!.వారు కూడా అంతే ఆలోచించకు వెళ్ళు. గౌతముడి సన్యాసులని బిక్కులు అంటారు. బిక్కులు అంటే యాచకులు అని అర్థం. అప్పుడు.
గౌతముడు అతనికి ఒక పసుపు పచ్చ గుడ్డ, భిక్ష పాత్ర ఇచ్చాడు. ఆయన "వెళ్ళు, ఊరిలో కొంత ఆహారం కోసం ప్రయత్నించు" అన్నాడు.  ఒక చిన్న ఊరిలో వంద మంది చనిపోయారంటే, దాదాపు ప్రతి ఇంట్లో, ఒకరు ఇతని వల్ల చంపబడ్డారు. అంగుళీమాల ఈ ఊరికి ఒక సన్యాసిలా వచ్చాడు. ప్రజలు అది చూసి భయభీతులయ్యారు. అతను
ఏమి చేస్తాడో అని భయపడి, వారంతా మిద్దెల మీదకు వెళ్లారు.
ఎప్పుడయితే వారు ఇతను సాధువైనాడని, ముందటిలా, దుర్మార్గుడు కాదని చూశారో, అతనిపై రాళ్లు రువ్వడం మొదలు పెట్టారు.  ఎందుకంటే ప్రతి కుటుంబం వీడివల్ల ఎవరో ఒకరిని కోల్పోయింది. అయినప్పటికీ అతను ఏమాత్రం బాధపడకుండా సంతోషంతోముందుకు పోతూనే ఉన్నాడు, 
రాళ్లు తగిలి అతని దేహం అంతా రక్తసిక్త మయ్యింది. రాళ్లు విసరడం కొద్దిగా ఎక్కువైనప్పుడు, గౌతముడు వచ్చి వారిని ఆపి "ఇతడు ఇంతకు ముందులాంటి వాడు కాదు. వాడు లేడు చనిపోయాడు. ఈతడు నా ప్రతి రూపం. మీరు నా పై
రాళ్లు విసురుతున్నారు. వెంటనే ఆపండి. ఇతన్ని
చంపి ప్రయోజనం లేదు, ఎందుకంటే ఇతనికి అతి
కష్టమైన ఈ సమయంలో జ్ఞానోదయం అయింది. ఇప్పుడు
అతన్ని చంపడం ద్వారా, మీరు నష్టపోవద్దు" అన్నాడు. ఆ ప్రజలు అతని క్షమించారు. మహాత్ముడైన బుద్ధుని వల్ల ఒక రాక్షసుడే కాదు ఒక ఊరు  కూడా ప్రేమ స్వరూపం గా మారిపోయారు...

ఆతరువాత అంగుళీమాల, ఒక ప్రసిద్ధ శిష్యుడై, బుద్ధుని జీవన శైలి, అవగాహనల గురించి దేశం నలుమూలల చాటాడు. కానీ, వారు అతన్ని అంగుళీమాల అనే పిలుస్తూ ఉండే వారు,
ప్రేమను ఇస్తే తిరిగి ప్రేమను పొందుతావు. ఇతరుల తప్పును క్షమిస్తూ పోతే నీ తప్పుల నుండి క్షమించ  బడుతూ పోతావు ఏదైనా తొలి అడుగు నీదే కావాలి. అది మనదై ఉండాలి...
కథ విన్న మిత్రులందరికీ శుభ సాయంత్రం నమస్కారములు ధన్యవాదములు మీ మిత్రుడు 

****
--6--
ఆకాశం ఒక గ్రహమా?!. కాదు ఏమీ కాదు.
ఆకాశం ఒక నక్షత్రమా ?!. కాదు ఏమి కాదు.
ఆకాశం ఒక మేఘమా ?! కాదు ఏమి కాదు ?!. అది శూన్యం. 

కనుక అది గ్రహాలను నక్షత్రాలను అన్నింటిని తనలో చేర్చుకున్నది. అలాగే నీవు కూడా ఏదీ కాకూడదు. ఒకవేళ నీవు ఏదైనా అయితే అది గానే ఉండిపోతావు. ఆకాశం వలె నీవు శూన్యం అయితే సమస్తాన్ని నీలో కలుపుకుంటూ పోతావు.
అప్పుడు నీవు ఎవరో తెలుసా ?! నిన్ను ప్రేమ అంటారు..
ఇలా మహోన్నతమైన ప్రేమ మూర్తి బుద్ధ భగవానుని వచనాలను స్మరిస్తూ ఈ శుభోదయ వేళ మిత్రులందరినీ మహాత్మా గౌతమ్ బుద్ధ చరిత్ర  6వ భాగం లోనికి గతిస్తున్నాం.
మిత్రులందరికీ స్వాగతం...
***
బుద్ధ భగవానుడు ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎంతో ప్రావీణ్యం గల ఒక జ్యోతిష్యుడు అక్కడ నదిలో స్నానానికి వచ్చి, నది ఒడ్డున ఒక కాలి గుర్తు చూశాడు. 
పాదముద్రలు ఏ విధంగా ఉన్నాయో చూసి, ఆ పాదం కలిగిన వ్యక్తి ఎవరో..అతను ఏమి చేయగలడో కొందరు జ్యోతిష్యులు కచ్చితంగా చెప్పగలరు. ఇవి చక్రవర్తి పాదముద్రలు లాగా ఆయన చూశాడు, ఎవరైతే ఈ ప్రపంచాన్ని ఏల గలడో అటువంటి వాడు.  అటువంటి మనిషి ఇలాంటి మారుమూల అడవిలో ఎందుకు ఉంటాడు? అని ఆశ్చర్యపోయాడు.
ఆ తరువాత,  అతను ఆ పాదముద్రలు ఉన్న దిశగానే వెళ్ళాడు ఒక చక్రవర్తిని కలవబోతున్నాననే ఉద్దేశంతో. 
కానీ ఆయన అక్కడి ఈ సాధువును, గౌతముడిని చెట్టు కింద కూర్చుని ఉండడం చూశాడు.

 ఇది చూసి ఆయన, "ఏమిటిది. అయితే నా జాతకం అయినా తప్పి ఉండాలి లేదా నన్ను ఎవరో ఆటపట్టిస్తూ ఉండాలి లేదా నేను ఏదో భ్రమలోనో ఉండి ఉండాలి. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది?'' అని అనుకున్నాడు. 
ఆయన గౌతముడి దగ్గరికి వెళ్లి, "నువ్వు ఎవరు?" అని అడిగాడు.  గౌతముడు అతని వాలకాన్ని చూసి నవ్వి "నేను
ఎవరినీ కాదు. ఏమీ కాదు. కేవలం ఓ అనామకుడిని" అన్నాడు.
ఆశ్చర్యపడుతూ అతడు అన్నాడు" కాదు                                    నీకు ఒక చక్రవర్తి పాదాలు ఉన్నాయి, నువ్వు ఈ ప్రపంచాన్ని జయించాలి" అన్నాడు. గౌతముడు"అది నేను చేస్తాను, కానీ యుద్ధం ద్వారా కాదు!" అన్నాడు.
Note:- ప్రపంచాన్ని జయించేందుకు రెండు మార్గాలు
ఉన్నాయి - ఒకటి ఆక్రమించడం ద్వారా లేదా అన్నింటిని తనలో కలుపుకోవడం ద్వారా రెండు విధానాల్లోనూ అది మీది అవుతుంది.  మీరు ఆక్రమిస్తూ పోతే అది మీకు మరియు ఇతరులకు కూడా బాధ కలిగిస్తుంది. కానీ మీరు అన్నింటిని మమేకం చేసుకుంటే పోతే అది మీ జీవితాన్ని ఎంతగానో పెంపొందిస్తుంది. అప్పుడు బుద్ధుడు అన్నాడు ..
నీవు సరైన జ్యోతిష్కుడి వే నీవు చెప్పింది నిజం.
"నేను ఈ ప్రపంచానికి చక్రవర్తిని!" అన్నాడు. 
దానికి జ్యోతిష్యుడు ప్రతి గా నవ్వుతూ "నువ్వు సాధువువి. ఏదీ నీది కాదు!" అన్నాడు.
"నాకు ఏదీ సొంతం కాదు. నేను ఎవరినీ
కాను. అందుకే అన్నీ నావే!" అన్నాడు బుద్ధుడు.
Dear friends....
బుద్ధుని లోని వ్యక్తిత్వం శూన్యం అయిపోయింది. శూన్యం అవడం(ఏమీ కాకపోవడం) అంటే, మీరు ఎందుకూ ఉపయోగపడరు అని కాదు అర్థం, మీరు శూన్యం అంటే మీరు అన్నింటినీ మీలో కలుపుకున్నారు అని అర్థం. 
మీరు ఏదో ఒకటి అయితే, మీరు అంత మాత్రంగానే ఉండగలరు. కానీ మీరు ఏదీ కాకపోతే, అన్ని మీరై ఉంటారు.
ఇక మీ ఇష్టం ఒక వ్యక్తి గా జన్మ జన్మలుగా ఉండిపోతారా లేక శూన్యమై అనంతశక్తి గా జన్మరాహిత్యాన్ని పొందుతారా.
 మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉండవచ్చు.
సరే అప్పుడు ఆ జ్యోతిష్యుడు బుద్ధుని ముందు  కూర్చుని
"నువ్వు ఒక సాధువువి. నీ దగ్గర ఏదీ లేదు. కానీ నువ్వేమో 'నేను ఎవరిని కాదు, కానీ సర్వం నాదే' అంటున్నావు. ఇది ఏమిటి?" అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు ఆకాశాన్ని చూస్తూ ఇలా అన్నాడు.. 
ఆకాశం ఏమీ కాదు అది ఒక శూన్యం. కానీ ఆ సూన్యం లోని గ్రహాలు నక్షత్రాలు ఉల్కలు మేఘాలు సమస్త లోకాలు ఉన్నాయి. అలాగే నేను కూడా ఒక శూన్యం ఈ సమస్త ప్రాణి సమూహం నాలో  ఉన్నది. అని చెప్పగానే....
ఆ జ్యోతిష్కుడు బుద్ధుని పాదాల ముందు శరణాగతి చెందాడు. బుద్ధుని ప్రేమలో మమైకం చెందాడు..
Note... వ్యక్తి ఎవరో కాదు మనస్సు యొక్క ఒక అభిప్రాయం. 
ఈ అభిప్రాయమే వ్యక్తిగా ప్రాణం పోసుకుని అది నీవై జన్మ జన్మలుగా సాగుతూ ఉన్నది పిపీలికాది బ్రహ్మ పర్యంతం. 
నీలోని వ్యక్తిని నీవు గుర్తిస్తే  అదే క్షణంలో  నీవు వ్యక్తిని కోల్పోయి...
అప్పుడు నీవు ఒక అనంతశక్తిగా ఉండిపోతావు...
పరిమితం  వదలకపోతే అపరిమితం గా ఎలా ఉండగలవు ?!.
కాస్త ఆలోచించు మిత్రమా ఉంటాను మరి నీ మిత్రుడు 

సశేషం......
-----------------------------
6
ఎదుటి వ్యక్తికి ప్రేమను అందుకునే అర్హత ఉందా? లేదా? అన్నదాన్ని గురించి ప్రేమ పట్టించుకోదు....
 అట్లాటి దృష్టి లోభి దృష్టి. అది సరికాదు.కానీ ప్రేమ లోభి కాదు. భూమికి అర్హత ఉందా లేదా అని మేఘం పట్టించుకోదు. 
అది పర్వతాల పైన రాళ్ళపైన కూడా వర్షిస్తుంది. దరమైన ఉద్యానవనాల పై అలాగే మురికి గుంటలపై కూడా తన ప్రేమను చూపుతోంది. ఎట్లాంటి నిబంధనలూ లేకుండా, 
ఎటువంటి అనుబంధాలు అంటుకోకుండా, అది వర్షిస్తుంది,....
ప్రేమకూడా అలాటిదే అది కేవలం ఇస్తుంది.అది ఇవ్వడాన్ని ఆనందిస్తుంది...

నీవు కూడా ఒక మేఘం కావాలి అని చెప్పినా మహాత్ముడైన గౌతమబుద్ధుని స్మరిస్తూ...
ఆయన చరిత్ర ఆరో భాగం లోనికి ప్రవేశిస్తున్నాను.

గౌతమ బుద్ధుడి జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఒక రోజు ఉదయం, ఆయన తన శిష్యుల మధ్య కూర్చుని ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. అతను రామ భక్తుడు. అతను తన జీవితం అంతా 'రామా రామా రామా' అంటూ కేవలం రామనామ జపం మాత్రమే చేస్తూ ఉన్నాడు.
అతను గుళ్లకు వెళ్లడం మాత్రమే కాదు, అతను ఎన్నో గుళ్ళను కట్టించాడు కూడా. అతను ఒక గొప్ప భక్తుడు.  వయసు పైబడుతుంది, ఇప్పుడు అతనికి రాకూడని ఒక చిన్న అనుమానం తలెత్తింది.  "జీవితమంతా నేను కేవలం 'రామా రామా రామా' అంటూ రామ నామ జపం చేస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుని పైన విశ్వాసం లేని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, వారుఇక్కడ కూర్చుని ప్రాపంచిక విషయాలలో
ఆనందాన్ని పొందుతున్నారు. నేను కేవలం ఇన్ని రోజులు  దేవునిపేరు జపం చేయడం కోసం అన్నింటినీ విడచి
పెట్టాను. ఒకవేళ ఇతరులు చెబుతున్నట్టుగానే దేవుడే లేకపోతే, అప్పుడు నేను నా పూర్తి జీవితాన్ని వృధా చేసుకున్న వాడిని అవుతాను" అని సందేహం వచ్చింది.
 అతనికి దేవుడున్నాడని తెలుసు, కానీ ఒక చిన్న సందేహం.
"ఎలాగూ, ఇక్కడ ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఉన్నాడు, అతనికి తెలిసే ఉండాలి."అని అనుకొని అతను గౌతముడి దగ్గరికి వెళ్ళాడు. ఉదయాన్నే, సూర్యోదయం కాకమునుపే, అతడు మసక చీకట్లో నుంచుని, "దేవుడు ఉన్నాడా?" అని అడిగాడు. ఈ ప్రశ్న ఎందుకు అడిగావు అన్నాడు గౌతముడు.
సత్యం ఏమిటో తెలుసుకోవాలని. అతడు చెప్పాడు. నీవు ఎన్ని రోజులనుండి దేవుని పూజిస్తున్నావు ?!.

చాలా రోజుల నుండి నా బాల్యం నుండి ఇంతవరకు పూజించాను. సమాధానం చెప్పాడు.
సరే బాగుంది దేవుడు ఉన్నాడా? లేడా ? అని నిర్ధారించు కోకుండా ఈ పని ఇంతకాలం ఎందుకు చేశావు.
విశ్వాసంతో నమ్మకంతో చేశాను. 
అవును నువ్వు చెప్పింది నిజమే కనిపించే మనిషిని నమ్మనివారు కనిపించని దైవాన్ని మాత్రం నమ్ముతారు వాస్తవమే...
ఇంతకన్నా మోసం ఏముంది ?!
నీవు మోసపోయా వు , "లేడు!" అన్నాడు. మొట్టమొదటిసారిగా గౌతముడు స్పష్టంగా "దేవుడు లేడు!" అని చెప్పాడు.
అయితే దేవుడు లేడు అంటే నేను నమ్మాలా అని అడిగాడు. 
నమ్మడం ఒకటే కదా నీకు తెలిసింది. మీ పెద్దలు చెప్పారు దేవుడున్నాడని..
 నమ్మావు. నేను చెప్పాను లేడు అని.. నమ్ము ఇక అనుమానం దేనికి ?!...
కాదు దేవుడు ఉన్నాడు. అతను గట్టిగా అరిచాడు.
అయితే నన్ను ఎందుకు అడిగావు ఇక వెళ్ళవచ్చు నీవు.... ప్రేమతో చెప్పాడు నవ్వుతూ గౌతముడు.  అక్కడ ఉన్న శిష్యులందరికీ ఆశ్చర్యం కలిగింది. ఆ రోజు సాయంత్రం మరొక వ్యక్తి వచ్చాడు. ఇతను ఒక చార్వకుడు. తమకు కనిపించేది తప్ప, మరి దేన్నీ నమ్మని పూర్తి లౌకికవాది.
 చార్వాకులు అనేవాళ్ళు ఆ రోజుల్లో, అదే వృత్తిగా ఉండే వాళ్ళు. వీరిని నాస్తికులు అంటారు.  వాళ్ళు ప్రజలకు ఒక
సవాలు విసిరే వాళ్ళు, "దేవుడు లేడని నేను మీకు
నిరూపిస్తాను. మీరు గనుక దేవుడు ఉన్నాడని నాకు
నిరూపిస్తే, నేను మీకు ఇంత డబ్బు ఇస్తాను, కానీ నేను దేవుడు లేడు అని నిరూపిస్తే మీరు నాకు ఇంత డబ్బు ఇవ్వాలి" అని సవాలు విసిరే వాళ్లు. ఇదే వాళ్ళ వృత్తి. అతను ఒక ప్రతిభావంతుడైన చార్వకుడు. అతను ఎటువంటి వాడు అంటే , ఒకవేళ మీరు 50 ఏళ్లుగా దేవుడిపై నమ్మకంతో
ఉండవచ్చు, కానీ మీరు అతనితో పదిహేను నిమిషాలు మాట్లాడితే, అతను మీకు దేవుడు లేడు అని నిరూపిస్తాడు.
ఇలా అతను దేవుడు లేడు అని కొన్ని వేల మందికి నిరూపించాడు. అటువంటి అతనికి ఇప్పుడు వయసు పైబడుతున్నది, ఇప్పుడు ఒక చిన్న సందేహం వచ్చింది. "ఒకవేళ దేవుడు ఉంటే? అని. దేవుడు లేడు అని అంతకాలంగా నిరూపించిన తరువాత, ఒకవేళ నేను అక్కడికి వెళితే, అతను నన్ను వదిలి పెడతాడా? ఇప్పటికే ఈ విశ్వాసులు దేవుడికి చాలా కక్ష ఉంటుంది అని చెబుతూ
ఉంటారు -  అతను(దేవుడు) నన్ను విడిచి పెడతాడా?" ఒక
చిన్న భయం వచ్చింది.  అతనికి కచ్చితంగా తెలుసు
దేవుడు లేడు అని,  కానీ ఒక చిన్న సందేహం వచ్చింది.
అతను సాయంత్రాన సూర్యుడు అస్తమించిన తరువాత, గౌతముడి దగ్గరికి వచ్చి, మసక చీకటిలో నుంచుని, అదే ప్రశ్నను అడిగాడు, "దేవుడు ఉన్నాడా?" 
గౌతముడు ఈ మనిషి వైపు  చూసి, ఈ ప్రశ్న ఎందుకు అడిగావు ?!. ఒకవేళ ఉన్నాడేమో అన్న అనుమానం వచ్చి అడిగాను. అయితే బాగుంది. దేవుడు లేడు అని భావించే టప్పుడు.. ఆ విషయాన్ని సత్య మా కాదా అని నిర్ధారించు కోకుండా నీవు ఇంత కాలం ఎందుకు ఇలా వాదిస్తూ తిరుగుతున్నావు ?!
అది నా నమ్మకం నా ప్రగాఢ విశ్వాసం. దేవుడు కరుణామయుడు అంటారు కదా! ఒక జీవిని మరొక జీవికి ఆహారంగా ఎందుకు పెట్టారు చెప్పు మరి ?!
హింస తో నిండిన ఈ ప్రపంచాన్ని ఎందుకు చేశాడు చెప్పు మరి ?!.
అందుకే నేను దేవుడు లేడు అని అంటున్నాను. 
ఒకవైపు దేవుడు లేడు అని నీవు అంటున్నావు. మరోపక్క అతడు హింసతో నిండిన ప్రపంచాన్ని చేశాడు అని అంటున్నావు ఇలా రెండు మాటలు ఎందుకు మాట్లాడు తున్నావ్.... సత్యము చెప్పు. దేవుడు ఉన్నాడో లేడో అర్థం కాక, నా బాధను చెబుతున్నాను....
అయితే విను "అతడు ఉన్నాడు!" అన్నాడు. కాదు నువ్వు చెప్పేది నిజం కాదు అతడు లేడు లేడు లేడు.. ఇలా చార్వాకుడు అరిచాడు...
అయితే  నాతో నీకు ఏమి పని ?!
అతడు లేడో .. ఉన్నాడో అన్వేషించు శోధించు అది ఇతరుల కోసం కాదు నీ కోసం. నీవు వెళ్ళవచ్చు....
ఇక శిష్యులలో మళ్లీ అలజడి మొదలయ్యింది. ఉదయాన 'దేవుడు లేడు' అని తెలుసుకుని వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు.
సాయంత్రానికి వచ్చేసరికి అతను 'దేవుడు ఉన్నాడు'
అని అంటున్నాడు. గౌతముడు ఎందుకు ఇలా ఆడుతున్నాడు? అసలు ఏమిటీ ఆట? అతను
కేవలం గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడా? 
అని శిష్యులు తమలోతాము అనుకుంటూ ఉండగా....
గౌతముడు ఇలా ప్రశాంతంగా అన్నాడు. ఇతర ప్రాణులకు లేనిది మనిషికి మాత్రమే ఉన్నది బుద్ధి. అది చాలా ప్రమాదకరమైనది. మనసు యొక్క విశ్వాసాలను అవిశ్వాసాలను అది లెక్కించదు. బుద్ధి కేవలం సత్యదర్శనం తోనే తృప్తి చెందుతుంది. అప్పుడే అది స్థితమ్ అవుతుంది.
అది ప్రేమను దర్శి స్తుంది ఎందుకంటే అది అనుభవం కనక....
అందరూ అనుకుంటున్న దేవుడు ప్రేమ తప్ప మరొకటి కాదు.
ప్రేమ ఉందా లేదా అని తర్కించ వలసిన అవసరం లేదు.
ప్రేమకై అన్వేషించాల్సిన పనిలేదు అది మీలో ఉంది.
అది పంచితే పెరుగుతుంది. తుంచి తే తరిగిపోతుంది.
ఒక మేఘం వలె కల్లాకపటం లేకుండా అంతట  ప్రేమను పంచాలి...
ఇది ఒక్కటే మీరు సుఖ పడే మార్గం. కథ విన్న మిత్రులందరికీ శుభరాత్రి నమస్కారాలతో ధన్యవాదములు
***

7
తల్లిని చూసిన క్షణంలోనే  బిడ్డ పరుగెత్తుకొని వచ్చి తల్లి ఒడిలో వాలింది...
ప్రియుడు వ్రాసిన ప్రేమ కవితను చదివి ప్రేయసి కన్నీరు కార్చెను ఆ కన్నీరు అమృతము తో నిండెను.
నేనున్నాను దిగులు చెందకు అన్న స్నేహితుని పిలుపు జీవితములో ఒకరిని నిలబెట్టెను. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ 
నిజంగా  నమస్కారానికి ఆస్కారమే లేదు. ఎందుకో తెలుసా?!.
తల్లికి బిడ్డకు మధ్య నమస్కారం ప్రవేశించదు. హత్తుకోవడం తప్ప ప్రేయసి ప్రియుని మధ్య నమస్కారం ప్రవేశించదు. కౌగిలింత తప్ప ప్రాణ స్నేహితుల మధ్య కూడా నమస్కారం ఉండదు. త్యాగం తప్ప. మరి  దైవానికి భక్తునికి మధ్య లో నమస్కారం అన్నది ఎంతవరకు సత్యం ?!.
ఇది నీవు ఎప్పుడైనా ఆలోచించావా?!
అని సున్నితంగా మిత్రులను పలకరిస్తూగౌతమ బుద్ధుని చరిత్ర ఏడవ భాగం లోనికి ప్రవేశిస్తున్న. ఈ శుభ రాత్రి సమయాన మిత్రులందరికీ స్వాగతం...

ఇక్కడ నమస్కారం పెట్టాను ఏమీ అనుకోకు ప్లీజ్.....😊😊😊
ఒక రోజున, ఒక వ్యక్తి గౌతమ బుద్ధుని చూడడానికి వచ్చాడు. గౌతముడు ఏకాంతంగా ఒక చిన్న ఆవరణలో కూర్చుని ఉన్నాడు, ఆ వ్యక్తి తన రెండు చేతుల నిండా పూలను తీసుకుని వచ్చాడు, ఎందుకంటే  గురువుకు అభివాదం చేసే విధానం.. అది ఒక సాంప్రదాయం.  ఆ వ్యక్తి గౌతమ బుద్ధుడి వైపు వస్తూ ఉండగా, గౌతముడు అతని వైపు చూసి “పడేయి” అన్నాడు.  తాను సమర్పణగా పూలను తీసుకొచ్చాడు కాబట్టి వాటిని క్రింద పడవేయమని గౌతముడు అంటున్నాడేమో అని అతను అనుకున్నాడు. అదిగాక ఒకవేళ వీటిని నేను ఎడమచేతిలో తీసుకుని వస్తున్నాను కాబట్టి, బహుశా అది అమంగళమైనదేమో అని అతను అనుకున్నాడు. ఇది కూడా మన నమ్మకాలలో ఒక భాగమే. మీరు దేన్నయినా మీ ఎడమచేతితో ఇస్తే, చాలా వరకు అందరూ దాన్ని అమంగళమైనదిగా భావిస్తారు. కాబట్టి అతను తన ఎడమ చేతిలోని పూలను పడేసి, వినయంగా ముందుకు సాగాడు. 
గౌతముడు అతని వైపు చూసి మరొకసారి “పడేయి” అన్నాడు. 
ఇప్పుడు అతనికి ఏం చేయాలో తెలియలేదు.  ఈ పూలతో వచ్చిన తప్పేంటి? అతను మిగిలిన పూలను కూడా పడేశాడు. 
అప్పుడు గౌతముడు నవ్వుతూ ఇలా అన్నాడు “నేను పడేయమన్నది, పూలను కాదు, ఈ పూలను తెచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో అతన్ని పడేయి."...

అతనికి అర్థం కాలేదు. ఈ పూలను తెచ్చింది నేనే కదా నన్ను నేను పడేసుకోవాలి అన్నమాట అని వెంటనే సాష్టాంగ పడిపోయాడు అతడు. మహాత్ముడైన గౌతముడు అతనిని వెంటనే లేపి తనవద్ద కూర్చోబెట్టుకుని సహజంగా ఉండు నేను చెప్పింది నీకు అర్థం కాలేదు జాగ్రత్త గా విను...
నీ చిన్నతనం లో నీ తల్లిదండ్రులతో నీవు ఉన్నప్పుడు వారికి నమస్కరించావా !
లేదు అని సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి. నీ చిన్ననాటి స్నేహితులతో కలసి ఆడుతున్నపుడు నీవు వారికి నమస్కరించావా!
లేదు అలాంటి ఆలోచనే రాలేదు. ఆనందంగా మనసు విప్పి మాట్లాడకోవడమే తప్ప అటువంటి ఆలోచన రాదు కదా అన్నాడు. నీవు ఎవరినైనా అమ్మాయిని ప్రేమించావా?!.
అవును ప్రేమించాను.. సమాధానం అయితే ఆ అమ్మాయి నీకు ఎప్పుడైనా నమస్కరించినదా  ?!.
గౌతముడు అలా అనగానే ఆ వ్యక్తి సిగ్గుపడుతూ🥰
 ఎవరైనా ప్రేయసీ ప్రేమికులు నమస్కరించుకుంటార . నమస్కరించరు కదా అని చెప్పాడు..
అప్పుడు గౌతముడు " చూశావా నీవు ప్రేమతో తిరిగిన వారందరి దగ్గర కూడా నీ నమస్కారం ఉంచలేదు.
ఇలాగే నీవు ఇక్కడ నమస్కారం ఉంచవలసిన అవసరం లేదు. నీ  ప్రేమను ఉంచితే చాలు. .
నమస్కారం అన్నది నీకు నాకు అంతరం పెంచుతుంది.
ప్రేమ ప్రతిష్ట జరగదు. ఈమాటలు వినగానే ఆ వ్యక్తి కన్నుల నుండి ధారాపాతంగా కన్నీరు జాలువారింది. అతనిలోని అజ్ఞాని నిజంగా పడిపోయాడు ఒక జ్ఞాని నూతనంగా జన్మించాడు.  గౌతముని పాదాలకు అప్రయత్నంగా నమస్కరించాడు. ఎందుకో ఈ సారి గౌతముడు అతని నమస్కారాన్ని స్వీకరించాడు. అతని లేపి హత్తుకున్నాడు.
కథ విన్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు...
మీకు స్వచ్ఛంగా నమస్కరిస్తున్నాను దయచేసి కాదనకండి ***

8
బాల్యంలోని నిష్కల్మష చూపులతో ప్రకాశించు వారు ధన్యులు...
అట్టి దృష్టికి శిరస్సువంచి నమస్కరిస్తూ మిత్రులందరికీ మీ శుభోదయం సమయాన స్వాగతం పలుకుతూ గౌతమబుద్ధుని చరిత్ర ఎనిమిదో భాగం లోనికి ప్రవేశిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. బుద్ధుని దగ్గర ఒక రాజకుమారుడు శిష్యుడిగా చేరాడు. అతడు కాస్త చపల చిత్తుడు అతనికి ఇంకనూ ప్రాథమిక పాఠాలు కావాలి. అందుకోసమని అతడిని బుద్ధుడు తన శిష్యురాలైన ఒక స్త్రీ వద్దకు పంపాడు.
బుద్ధుని ఆశ్రమానికి ఆయన శిష్యురాలు ఆశ్రమానికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఆశ్రమాన్ని చేరడానికి అతనికి దాదాపుగా నాలుగు గంటల ప్రయాణం పట్టింది.
సరిగ్గా మిట్టమధ్యాహ్న సమయానికి ఆశ్రమానికి చేరుకున్నాడు.
ఎండ తాపం వల్ల వళ్ళంతా చెమట పట్టింది. ఒకపక్క దాహం వేస్తుంది మరోపక్క ఆకలి వేస్తుంది కానీ  స్నానం చేస్తే బాగుంటుందా! లేక ముందుగా భోజనం చేస్తే బాగుంటుందా అని అనుకుంటున్నాడు. ఇంతలో ఒక అద్భుతమైన సౌందర్యవతియైన ఒక స్త్రీ చెంబుతో నీరు తీసుకొని బయటికి వచ్చి అతడికి ఇచ్చి ముందుగా దాహం తీర్చు కోండి అని చెప్పింది. అతడు నీటిని సేవించిన తర్వాత, ఆమె మీరు మొదటగా వెళ్లి స్నానం చేయండి తర్వాత భోజనం చేస్తే బాగుంటుంది అని సూటిగా చెప్పింది. అతడు ఆశ్చర్యానికి లోనయ్యాడు ఎందుకంటే తన మనసులో ఏమని భావించాడో అవన్నీ ఆమె చాలా స్పష్టంగా చెబుతున్నది..

అతడు చాలా ఆశ్చర్యపడుతూ  చుట్టుపక్కల చూస్తూ ఉన్నాడు ఎక్కడ స్నానం చేయాలని. ఆమె చెప్పింది ఇక్కడికి కాస్త దూరంలో ఒక సెలయేరు పారుతున్నది  అక్కడికి వెళ్లి స్నానం చేయండి అని. అతడు ఆశ్చర్యపడుతూ సెలయేటి వద్దకు వెళ్లి స్నానం చేసి తిరిగి ఆశ్రమానికి వచ్చాడు.
అతడు ఆశ్రమానికి చేరుకునిన తర్వాత భోజనం వడ్డించింది ఆమే...

చిత్రమేమిటంటే ఆ రాజకుమారుడు ఎటువంటి భోజనం ఉంటే బాగుంటుందో అని అనుకున్నాడో సరిగ్గా అటువంటి భోజనమే ఆమె అతనికి వడ్డించింది...

అతడు ఆశ్చర్య పోవటమే అతని వంతు అవుతూ వస్తున్నది...
 భోజనం చేశాడు ఇప్పుడు హాయిగా పడుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాడు. కానీ పాపం, అతడు రాజకుమారుడు కదా నేలపై పడుకోవడం కష్టం అందుకని ఏదైనా పరుపు ఉంటే బాగుంటుంది అని అతడి ఆలోచన. ఆమె శాంతంగా ప్రేమతో ఇలా చెప్పింది మన శరీరమే మనకు పానుపు వేరే పానుపు అక్కర్లేదు... 
సన్యాసిగా దీక్ష తీసుకున్నప్పుడే దీనికి మనం సిద్ధపడాలి. అని ఆమె పలుకగానే అతడు మరింత ఆశ్చర్యంతో అలాగే ఉండి పోయాడు కొంత సేపు. అతడు పడుకున్నాడు కానీ నిద్ర పట్టలేదు. అంతయు తనకు ఆశ్చర్యం గా ఉంది ఒక గంట అటూ ఇటూ దొర్లుతూ ఇక అక్కడ ఉండలేక వెంటనే బుద్ధుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. హడావుడిగా ఆశ్రమం వైపు వస్తున్న రాజకుమారుని చూశాడు బుద్ధుడు. ఆ శిష్యుడు బుద్ధుని చెంతకు వచ్చి పాదాలకు ప్రణమిల్లాడు. మహాత్మ! మిమ్మలని వేడుకుంటున్నాను దయచేసి నన్ను అక్కడికి పంపించవద్దు అండి మీకు పుణ్యం ఉంటుంది అని ప్రాధేయపడ్డాడు.

నీకు ఏ బాధ కలిగింది అని ప్రశ్నించాడు బుద్ధుడు. శిష్యుడు నమస్కరిస్తూ ప్రభు! నా మనసులోని ప్రతిదీ ఆమెకు తెలిసిపోతున్నది అందువల్ల నేను భయపడుతున్నాను. 
ఆమె సౌందర్యాన్ని చూసి నాలో కామం ప్రవృత్తి ప్రకోపిస్తున్నది. ఈ విషయం  ఆమెకు తెలిసిపోతుంది అన్న భయంతో   ఆవిడకు చెప్పకుండా నేను మీ చెంతకు వచ్చాను అని తన క్షమాపణలు చెప్పాడు...

అప్పుడు బుద్ధుడు నవ్వుతూ ఇలా చెప్పాడు. rajakumara మన లో నిత్యం మెలుకువ లో ఒక సాక్షి ఉంటుంది. అది సర్వం చూస్తూ ఉంటుంది అంత కూడా. అది మన సహజ స్థితి. ఆ స్థితికి వెళ్లిన వారు ఎవరైనా సరే సర్వజీవుల హృదయాల లోని భావాలు తెలుసుకోగలరు. ఆ సాక్షిని గురువు అని అంటారు. 
కనుక మనం చేసే పనులు జాగ్రత్తగా పవిత్రంగా చేయాలి ఎందుకంటే మనల్ని ఒక సాక్షి చూస్తూ ఉన్నది. ఆ సాక్షి ఏ మన మూల స్వరూపం. అలా సాక్షిగా మన స్థానాన్ని చేరడమే ఈ జన్మకు సాఫల్యత. అని చెప్పగానే ఆ రాజకుమారుడు ఎంతో ఆశ్చర్యంతో ఇలా నివేదించాడు. సాక్షి అంటే ఏమిటి ప్రభు.?!
అది స్వయం జ్యోతి. శక్తి స్వరూపం.. మీ యొక్క నా యొక్క ఆ శ్రీ మూర్తి యొక్క సకల జీవ రాశుల యొక్క మూల స్థితి అదే... నీవు దేని నుండి అయినా తప్పించుకోవచ్చు కానీ ఒక్క సాక్షి స్థితి నుండి నీవు తప్పించుకోలేవు అది నీ మూలం అది నీకు ఆధారం. నాయనా! శ్రద్ధగా  నన్ను..  నా మాటలపై ధ్యాస ఉంచు. ముందు నీవు పసి బాలుడిగా ఉంటివి.. అప్పుడు నిష్కల్మషంగా ఆహ్లాదకరంగా ఆడుతూ పాడుతూ ఉన్నావు. ఆ తర్వాత బాలుడు వెళ్ళాడు యువకుడు వచ్చాడు. నీవు ఆ బాలునితో ఉన్నావు అప్పుడు. కానీ ఇప్పుడు యువకునితో ఉన్నావు. బాలుని లో లేని కోరికలు యువకుని లో పుట్టాయి.... కొంతకాలం అవి ఉంటాయి అటు తర్వాత యువకుడు వెళ్ళిపోతాడు వృద్ధుడు వస్తాడు... 

కానీ నీవు వెళ్ళవు స్థిరం గా ఉంటావు నీవు చూస్తూనే ఉంటావు.
ఇప్పుడు వృద్ధుడు కూడా వెళ్ళిపోతాడు నీ జ్ఞాపకం ఆగి పోతుంది మళ్ళీ బాలుడు వస్తాడు. బాలుడు వచ్చాడు పోయాడు యువకుడు వచ్చాడు పోయాడు వృద్ధుడు కూడా వచ్చి పోతున్నాడు కానీ నీవు ఎక్కడికి వెళ్లక స్థిరంగా వీరిని చూస్తూనే ఉన్నావు. ఇప్పుడు అర్థమైందా నీవు ఎవరో....

కానీ నీవు మఱుపు కు లోనై నేను బాలుని అంటున్నావు నేను యువకుని అంటున్నావు నేను వృద్ధుడను అని అంటావు రేపొద్దున. కానీ ఈ మూడు అవస్థలు వచ్చిపోతూ ఉంటాయి కానీ నీవు మాత్రం స్థిరంగా వీటిని చూస్తూ ఉంటావు. అది నీ మూల స్వరూపం. ఈ బోధ వినగానే అతడు సాక్షి కి ఉప లబ్దము యై నాడు.... 
అలాగే నిశ్చలంగా నిలబడి పోయాడు. ఇంతవరకు ఉన్న రకరకాల ముసుగులు తొలిగిపోయాయి. ఇప్పుడు అతనికి అసలు ముఖం తెలిసివచ్చింది అనుభవమైంది....

కొంతసేపటి తర్వాత కన్నులు తెరిచాడు బుద్ధుని పాదాల పై తన శిరస్సు వాలివుంది. ప్రేమమూర్తి యైనా బుద్ధుడు తన బిడ్డ యొక్క శిరస్సును దువ్వుతూఇలా చెప్పాడు.
తండ్రి! ఈ లోకంలో ఒక వస్తువుకు ఒక్క ఉపయోగం ఉంది ఆ ఉపయోగం కోసమే ఆ వస్తువులు కల్పించబడ్డాయి.
ఏ స్త్రీ శరీరము నిను ఆకర్షించినదో ఆ స్త్రీ శరీరం యొక్క భాగాలను ఉన్న వాటిని సహజంగా అర్థం చేసుకో.
స్త్రీ పాలిండ్లు కేవలం బిడ్డలకు పాలివ్వడానికే ఉద్భవించాయి ఇది సత్యం.
ఆ స్థన ద్వయానికి నమస్కరించు. ఎందుకంటే మనకు చిన్నప్పుడు ఆహారం ఇచ్చి పోషించాయి కనుక..
లోతైన నాభి నిను ఆకర్షించిన దాతల్లిగర్భమున నీ ఉన్నప్పుడు ఈ నాభియే నీకు ఆహారాన్ని అందించింది. 
ఒక్క నమస్కారం చెయ్.సన్నటి నడుము నిన్ను ఆకర్షించిందా...
బిడ్డల కోసం సేవలు చేసే శ్రమకు గుర్తుగా  ఉన్న దానికి గుర్తుగా ఆ సన్నని నడుము  నిలిచింది... 
ఆ అన్యమైన సేవకు నమస్కరించు. స్త్రీ యొక్క మర్మాంగం నిను ఆకర్షించిందా!
ఆ యోనియే సమస్త జీవరాసులకు ఈ లోకపు ద్వారము... నిష్కల్మష భావంతో నమస్కరించు 
అయినను మనం కోరుకోని ఈ జన్మను ఎత్తలేదు. నీవు కోరుకుని పురుషుడుగా పుట్టలేదు ఒకవేళ ఆ బ్రహ్మ అనుకుంటే స్త్రీ గా కూడా పుట్టే వాడివి...
ఇదొక వేషం. అంతే.....
ఆహారం తో తయారుచేయబడిన ఈ శరీరం కొంత సమయం ఉండి ఆ తర్వాత పాచిపోతుంది . సత్య దృష్టి తో ఉన్న దానిని ఉన్నట్టు చూస్తే మోహం అన్నది ఎప్పుడూ మనల్ని దరిచేరదు....
అద్భుతమైన ఈ బోధ వింటూ ఆ రాజకుమారుడు ఇప్పుడు అతడు ఏ వస్తువును ఆ వస్తువు లాగే చూస్తున్నాడు...సమాధి పొందాడు.ఆయనకు సత్య దర్శనం జరిగింది.
  ****
9
ఇది నీకు తెలుసా మీరు అనంతం కానీ అజ్ఞానం వల్ల మీరు గుర్తింపు కావాలని అనుకుంటున్నారు. కానీ అది ఎలా సాధ్యం.
గుర్తింపు అనేది మిమ్మల్ని పరిమితం చేస్తుంది. ఈ అజ్ఞానం యొక్క ఆనందం ఏమిటి? కనీసం ఒక్కసారైనా ఆలోచించారా. ... అని పలికిన మహాత్మ గౌతమబుద్ధుని జ్ఞాన వచనాలను స్మరిస్తూ ఈ శుభ రాత్రి సమయాన  ఆ మహానుభావుని చరిత్ర 9వ భాగం లోనికి ప్రవేశిస్తున్నాను...🌼🌼🙏

మనం మరీ ఎక్కువగా మనసుకు అతుక్కుపోయి వుంటాం. 
అది చాలా అల్పమయింది.  మనం మరీ శరీరానికి అతుక్కుపోయి వుంటాం. మరీ ఎక్కువగా దాని గుండా గుర్తింప బడతాం. ఇది కేవలం సామాన్యుల పరిస్థితి.  కానీ జ్ఞాన మార్గంలో ఉండే వారికి సాధనసంపత్తి ఉన్నవారికి ఇది ఒక పెద్ద అవరోధం...
మనం ధ్యానం చేస్తాం  కానీ  ధ్యానం యొక్క పరమార్థం ఏమిటి!. అంటే ఏదో ఉన్నతమైన దానిని పొందాలి అన్నది దాని సారాంశం....
కానీ  ఇందులో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే తాను ఉన్న స్థితిని ముందుగా వదలాలి. ఎందుకంటే ఇది పరిమితం కనుక. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ చిత్రాతి చిత్రం ఏమిటంటే మనం కోరుకునేది ఏమో అనంతం కానీ గట్టిగా పట్టుకున్నది మాత్రం పరిమితం. ఇది సాధ్యమేనా మీరే చెప్పండి. కనుక అది సాధ్యం కావాలంటే ముందుగా పరిమితమును వదలాలి..
కానీ మనం అలా చేయడం లేదు.  ఉన్న ఈ పరిమితికి గొప్ప గుర్తింపు ఇవ్వాలి గుర్తింపు కావాలి అని తహతహ పడుతూ ఉంటాం.  పరిమితం అంటే ఏమిటి ?!.
మనం కలిగిన పేరు. మనం పుట్టిన కులం. మనం అనుసరిస్తున్న సాంప్రదాయం. మనం ఉంటున్న దేశం.
ఫలానా వాడు ఇంత గొప్పవాడు రా అని అనుకోవాలి.
ఫలానా వాడు ఇంత గొప్ప అధికారి రా అని గుర్తించాలి.
వాడు అత్యంత పవర్ఫుల్ అని అందరికీ తెలియాలి.
వాడిని చూస్తే అందరు భయపడాలి. వాడిని మహాజ్ఞాని గా గుర్తించాలి. వాడు మహా గురువుగా గౌరవించ బడాలి.
ఇదంతా వ్యక్తిగతమైన కీర్తి వ్యక్తిగతమైన ప్రతిష్ట వ్యక్తిగతమైన పరిమితం ఈ పరిమితాన్ని వదలకుండా అనంతంగా వ్యాప్తి చెందాలి. ఇది సాధ్యమేనా ?!.
అహంకారపు గదిలో బంధించబడి సమస్త విశ్వము నేను అని అనుకుంటే ఎలా ?!
గదిని వదిలితే గగనాన్ని చేరగలం లేకుంటే గదిలోనే మగ్గి పోతాము. నిజం గా ధ్యానం  యొక్క పరమావధి ఏమిటో తెలుసా ?!
అది నిన్ను మహోన్నతమైన సాక్షిగా నిలబెట్టడమే  అది స్వయం అది తేజోమయం  అది అనంతం అది అవధి లేని ఆకాశం.   పరిమితమైన ఈ వ్యక్తిగత గుర్తింపు లేకపోవడం. అనంతం యొక్క లక్షణం అది. కేవలం నేను చైతన్యం మాత్రమే అని గుర్తించడం.  నేను సాక్షిని అన్న విషయం గుర్తుంచుకోవాలి.....
లేకపోవడమే నిజమైన వుండడం.నువ్వు అహంగా మాయ మయిన క్షణం విశాలమవు తావు. అల గా నీ గుర్తింపును వదులుకున్న రోజున సముద్రానుభావానికి పొందుతావు. 
సరిహద్దులు లేని సంతోషాన్ని అందుకుంటావు.దురదృష్ట మేమిటంటే  మనం మరీ ఎక్కువగా మనసుకు అతుక్కుపోయి వుంటాం.  అది చాలా అల్పమయింది.  మనం మరీ శరీరానికి అతుక్కుపోయి వుంటాం. మరీ ఎక్కువగా దాని గుండా గుర్తింపబడతాం. అలా గుర్తించడానికి ఇష్టపడతాం. ఇది అజ్ఞానపు ఆనందం. మనము గా ఉన్న ఈ మనసు  కేవలం ఒక యంత్రం ఒక సాఫ్ట్వేర్  సూక్ష్మ యంత్రమయిన మనసునీ వుపయోగించు. కానీ యంత్రానికి లొంగకు. డ్రైవరు కారు నడుపుతాడు. కార్లో వుంటాడు. కానీ కారు కాడుకదా!
మనకు సంబంధించిన వ్యవహారం కూడా అలాంటిదే. మనముంటున్న యంత్రం ద్వారా మనం గుర్తింపు పొందుతున్నాం.  ఈ రకమైన గుర్తింపు అహాన్ని యిస్తుంది. 
నేను శరీరం, నేను మనసు, నేను క్రిష్టియన్ని, నేను మహమ్మదీయుడను  నేను హిందువుని, తెల్లవాణ్ణి, నల్లవాణ్ణి, నేను అది, నేను యిది!  ఇవన్నీ కేవలం గుర్తింపులు.
 ధ్యానమంటే గుర్తింపు లేకపోవడం. కేవలం. నేను చైతన్యం మాత్రమే. , మెలకువని, సాక్షిని, అన్న విషయం గుర్తుంచు కోవాలి. ఎందుకంటే వాస్తవంగా సత్యంగా అది నీవే కనుక...
ఆ సాక్షిగా వుండడంలో అహం అదృశ్యమవుతుంది. 
ఎప్పుడైతే అహం అదృశ్యం అవుతుందో గొప్ప విప్లవాత్మకమైన మార్పు జరుగుతుంది. 
 నువ్వు అల్పమయిన, చిన్ని ప్రపంచం నించీ విశాలమైన, సౌందర్యభరితమైన వైశాల్యంలోకి, కాలం నించి శాశ్వతత్వంలోకి  మరణం నించీ మరణ రాహిత్యానికి సాగుతావు...... 
అని నా మిత్రులందరికీ నివేదన చేస్తూ ఇది నా గురువు నాకు చెప్పిన బోధగా మీకు పరిచయం చేస్తూ మహాత్ముని కథలోనికి ప్రవేశిస్తున్నాను. 
మహాత్మా బుద్ధుని ప్రముఖమైన శిష్యులలో ఆనందుడు ఒకడు.
బంధుత్వం రీత్యా, ఆనందుడు బుద్ధుడికి సోదరుడు
అ  వుతాడు.
 బుద్ధుడు ప్రజలకు సన్యాస దీక్ష ఇస్తున్న ఆ సమయంలో ఆనందుడు వచ్చి, “నేను కూడా సన్యాసి అవుతాను..
 కానీ ...
నేను నీ శిష్యుడిని అవ్వాలి అంటే  నాది ఒక షరతు, నువ్వు దానికి ఒప్పుకుని తీరాలి,  ఎందుకంటే వరుసకు, నేను నీకు అన్నని. అయినా కూడా నేను నీ శిష్యుణ్ణి అవుతాను. నీవు నీ  శిష్యుల లాగా నన్ను చూడకూడదు  కానీ నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను.  నువ్వు నన్ను ఎప్పుడూ ఏ పనికీ పంప కూడదు. నేను ఎప్పుడూ నీ నీడలా వెన్నంటి ఉంటాను.".. ఆనందుడు ఇలా చెప్పగానే  గౌతముడు అతని వంక చూసి నవ్వుతూ  “అది నీ ఇష్టం, నాకు ఏ సమస్య లేదు” అన్నాడు. నిజంగా అహంకారపు గుర్తులు జ్ఞానికి అవసరం ఏముంది?! ఇతరులకు ఉంటే ఆయనకు నష్టం ఏముంది?!
Not this point my dear friends 
➖➖➖➖➖➖➖➖➖➖➖
మనం ఒక గురువు వద్ద విద్యను అభ్యసించే టప్పుడు...
 శిష్యుడిగా ఉండడానికి సిద్ధమైనప్పుడు... మన అంతరంలో షరతులు ఉండకూడదు... అప్పుడు శిష్యుడుగా ఉండటంలోని మాధుర్యం ఏమిటో మనకు ఎప్పటికీ తెలియదు. ఒకవేళ  గురువు మన కన్నా వయసులో చిన్నవాడైనప్పటికి కూడా తప్పక ఆ పదవిని గౌరవించి తీరాలి. అప్పుడే మనకు విద్య అనేది అబ్బుతుంది.
ఒకవేళ మనం లోపల నేను ప్రత్యేకిని అన్న అహంకారం ఉంచుకుంటే పొందాల్సిన ఉపయోగాలన్ని కూడా వృధా అయిపోతాయి. విద్య అనేది చేతికి రాదు. 
సరే ఫ్రెండ్స్ ఆనందుడు పెట్టిన కండిషన్ కి గౌతముడు నవ్వి “సరే” అన్నాడు.  శిష్యుడు ఈ షరతు పెట్టినప్పుడు గౌతముడు దాన్ని పాటించాడు, అతనికి ఏ సమస్యా లేదు. ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ పొందవలసిన లాభాన్ని ఆనంద్ కోల్పోయాడు.ఒకసారి గౌతముడు తన భార్యను చూడాలనుకున్నాడు, అతను ఆమెను దాదాపు 8 ఏళ్లకు పైగా చూడనేలేదు. తన కుమారుడు పసివాడుగా ఉన్నప్పుడు అతను అర్ధరాత్రి వదిలేసి వెళ్లిపోయాడు.  యశోద చాలా అభిమానవతి. ఒక యశోధర మాత్రమే కాదు సహజంగా స్త్రీలు అభిమానవంతులు. గౌతముడు కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా, అర్ధరాత్రి అతను వదిలి వెళ్ళిపోయాడని ఆమె చాలా బాధపడింది. 
అతను తన రాజ్యాన్ని, తన కుమారుడిని, తన భార్యను వదిలేసి, వారితో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్లిపోయాడు. 
ఇప్పుడు ఎనిమిదేళ్ల గడిచాయి. ఇంత కాలం తర్వాత అతను ఆమెను చూడాలని అనుకున్నాడు, ఎందుకంటే తాను అనుభూతి చెందిన ఈ సంభావ్యతను ఈ ఉన్నత స్థితిని ఆమెకు కూడా అందించాలని అనుకున్నాడు.  ఎందుకు అలా అనుకున్నాడు అంటే ఆయన ప్రేమ మూర్తి. ఏ గొప్ప ప్రయోజనాన్ని ఆయన పొందాడో అది తనను ప్రేమించే వారికి ఇస్తున్నాడు.  తన సంఘ పరివారంతో అక్కడికి  వెళ్ళాడు.
ఇంతకాలానికి తనను చూడటానికి వచ్చిన భర్త అయినా గౌతముని చూసి యశోధర కోపంతో రగిలిపోయింది,  రకరకాల శాపనార్థాలు పెట్టింది, అతనిపై కేకలేసింది, అతన్ని పిరికివాడు అని తిట్టింది. తిట్టదా మరి భార్యను కన్న కొడుకును నిష్కారణంగా వదిలేస్తే ఎందుకు తిట్టదు ?!.
ఒక సాటి గృహినికి ఏం తెలుస్తుంది యోగం జ్ఞానము ఇవన్నీ వారికి అక్కర్లేదు. ధర్మబద్ధంగా తాళికట్టి చేపట్టిన అర్థాంగిని వదిలేయకూడదు అన్నది వారికి తెలిసిన ధర్మం.
అందువల్ల ఆవిడ గౌతముని ఏమేమి అనాల్నో అవన్నీ అనేసింది...
కానీ గౌతముడు పరమ సాక్షి ఆయన పరిమితం కాదు అనంతం. పరిస్థితి ఎలా ఉంటుందో  గౌతమునికి మాత్రం తెలియదా ?!అందుకు అతడు సిద్ధపడే అక్కడికి వెళ్ళాడు..
ఆమె పెట్టిన శాపనార్థాలు అన్నీ అతను విన్నాడు. అన్ని నూ
 మౌనంగా విన్నాడు. అప్పుడు అతను ఆమెతో, “నిన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇప్పుడు లేడు,  అతను పోయాడు, కానీ  ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు., 
ఇప్పుడు ఇతడు  జ్ఞానోదయం పొందిన వ్యక్తి. ఒకవేళ నీ భర్త వల్ల సాధ్యమైనది మహా అయితే ఇంకొంతమంది పిల్లలు. 
కానీ ఇప్పుడున్న ఈ వ్యక్తి వల్ల మహత్తరమైనది జరగగలదు. ఈ వ్యక్తి పూర్తిగా భిన్నమైన వాడు. దయచేసి ఇటు వైపు చూడు,  ఈ వ్యక్తి‌ ఆ వ్యక్తి కాదు.” అన్నాడు.
అప్పుడు ఆమె “అదేం కాదు, నువ్వు నా భర్తవి!” అంది. ఇంతకన్నా ఆమెకు గౌతముని గురించి ఏమి తెలుసు. వారు కేవలం గుర్తించడమే తెలుసు పరిమితము చూడడమే తెలుసు.
గౌతముడు అన్న ఆ జ్ఞాన వచనాలు ఆమె అర్థం చేసుకోలేదు...
నువ్వు పిరికి వాడివి. ఈ పసివాడిని వదిలిపెట్టి వెళ్లిపోయావు. వాడికి కనీసం తన తండ్రి ఎవరో కూడా తెలీదు. నువ్వు పారిపోయావు” అంది. ఇంకా ఎన్నో అంది. ఆమె అనాలను కున్నవన్నీ అంది.  గౌతముడు చాలా ప్రేమగా ఇలా అంటున్నాడు “పరవాలేదు!” ఇవన్నీ వినడానికి అతడు లేడుఅన్నాడు.  అప్పుడు యశోద కోపంతో, “నీ కొడుకుకి నువ్వు ఇచ్చేది ఏమిటి?” అని అడిగింది. ఆమె తన కుమారున్ని తీసుకువచ్చి, “అతను నీకు ఏమిస్తాడో నీ తండ్రిని అడుగు” అంది.  గౌతముడు సిద్ధమయ్యే వచ్చాడు. 
అతడు ఆనందుడితో “దయచేసి నా భిక్ష పాత్రను తీసుకురా” అన్నాడు. అతను భిక్ష పాత్రను తీసుకువచ్చాడు.
 అతను తన కుమారుడిని పిలిచి, “నువ్వు ఒక రాజుగా బాధ పడటాన్ని నేను కోరుకోవడం లేదు, అందుకే నీకు పరమోత్తమ స్వేచ్ఛను ఇస్తున్నాను. నా వారసత్వం ఈ భిక్షపాత్ర” అన్నాడు. 
అతను తన బిక్ష పాత్రను తన ఎనిమిదేళ్ళ కుమారుడికి ఇచ్చాడు, ఇక ఆ కుమారుడు ఒక సన్యాసి అయ్యాడు.
 గౌతముడు తన మరణశయ్య మీద ఉన్నప్పుడు, 
కేవలం జ్ఞానోదయం పొందిన శిష్యులు మాత్రమే లోపల ఉన్నారు. వారికి మాత్రమే గౌతముడు అవకాశం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు ఎవరు ఆయన సమీపానికి రాలేకపోయారు అందుకు అతడు ఒప్పుకోలేదు. ఎందుకు ?!
ఎందుకంటే తను చెప్పేది జ్ఞానం తెలిసిన శిష్యులకు మాత్రమే అర్థం అవుతుంది. మిగతా వారు బయటే ఉంచ బడ్డారు. ఆనందుడు తనకు కలుగ గల  గొప్ప స్థితిని కేవలం ఒక్క షరతు మూలంగా నాశనం చేసుకున్నాడు. అతను దాన్ని పూర్తిగా చేజార్చుకున్నాడు.  ఆనందుడు “నేను అతనితో ఎంతో సన్నిహితంగా ఉన్నాను, కానీ నేను బయటి వారిలో ఉన్నాను. ఎందుకు నాకు జ్ఞానోదయం కాలేదు?” అని ఏడ్చాడు. ప్రజలు ఇదే ప్రశ్నను గౌతముడిని అడిగినప్పుడు, 
గౌతముడు అన్నాడు “ఒక గరిటె,  ఎన్ని వంట పాత్రల్లో తిరిగినా రుచిని ఎలా చూడ గలుగుతుంది? దానికి తెలిసింది కొలతలు మాత్రమే రుచి తెలియదు ఆనందుడు అంతే” అన్నాడు. ఒక గరిటె వంట రుచిని చూడాలి అంటే, దానికి నాలికకు ఉండే ఇంద్రియ జ్ఞానం ఉండాలి. 
అలాగే శిష్యుడు కూడా తన అజ్ఞానాన్ని వదల లేక ఒక పాత్రకు పరిమితమై ఉంటే గురువు చెప్పిన అహంకార రాహిత్యం అతనికి ఎలా తెలుస్తుంది ?!. పరిమితాన్ని వదలలేని వాడు అనంతానికి పయనం ఎలా చేయగలుగుతాడు.
  శిష్యుడు, నన్ను గౌరవించాలి నాకు గుర్తింపు ఇవ్వాలి అని షరతు పెట్టిన మరుక్షణమే  గొప్ప యోగాన్ని కోల్పోయాడు.. 
అతను ఒక వస్తువుగా కుచించుకుపోతాడు. తాను అలా అవడమే కాదు అందులో భాగంగా గురువు యొక్క విశాలతను కూడా తగ్గించాలని ప్రయత్నిస్తారు. కానీ అది మీరు పొందాలనుకున్న జ్ఞానాన్ని మీకు చాలా దూరంగా ఉంచుతుంది.. 
ఆనందుడి విషయంలో అదొక దురదృష్టకరమైన విషయం..
అనంతుడైన ఆ పరమాత్మ దయ వలన మనలో పరిమి తత్వపు చాయలు తొలుగు గాక అని సంకల్పం చేస్తూ మిత్రులందరికీ కథ విన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ శుభరాత్రి మీ మిత్రుడు
****


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి