14, మే 2019, మంగళవారం





శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం-29-   సుదంతుని  కధ

గంధర్వనగరం అనే సుందర పట్టణం లో ప్రజలను కన్నబిడ్డలు లాగా చూసు కొనే మహారాజు ఉన్నాడు .దానికి దగ్గర లో చిన్న అడవి ఉంది .అందులో సుదంతుడు అనే పేరున్న మహర్షి ఉన్నారు .ఆయన సద్గుణ సంపన్నుడు .తపోనిధి .ఆశ్రమ ధర్మాలన్ని టిని సక్రమంగా నిర్వహిస్తూ మౌని గా పవిత్ర జీవితాన్ని గడుపు తున్నాడు .మంత్ర మననం తో రుషి అయాడు .హృదయం లో ఆత్మా రాముడిని దర్శిస్తూ ఆనంద బ్రహ్మ లాగా ,ఆనంద మూర్తి గా ఉన్నాడు .వృద్ధాప్యం ప్రవేశించి ,ఆకలి దప్పుల చే పీడింప బడుతున్నాడు.

ఒక రోజు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి ఎంతో శ్రమ పడుతూ బయల్దేరాడు .వచ్చిన వారందరినీ ఆదరిస్తూ భోజన పానీయాలతో సంతృప్తి పరుస్తున్నాడు భరద్వాజుడు .కాని సుదంతుని పట్టించు కోలేదు .ఆకలిగా ఉన్న సుదంతుడు భరద్వాజ మహర్షి దగ్గర కు చేరి ,నమస్కరించి ,’’మహర్షీ! అందర్ని ఆదరించారు .నా మీద అనాదరం ఎందుకు చూపిస్తున్నారు?నేను కడు దరిద్రుడిని .వృద్ధుడిని.ఆకలి దప్పిక తో బాధ పడుతూ భరించ లేక మీ చెంతకు చేరాను .’’అని విన్న వించాడు .మహర్షి హృదయం కరిగి ,జాలిగా సుదంతుని వైపు చూశాడు.ఓదార్చాడు .దుఃఖించ వద్దని చెప్పాడు .అతనికి ఆతిధ్య మివ్వ కుండా ఉండటం లో తన తప్పేమీ లేదని ,అదంతా సుదంతుడు చేసిన పాప కర్మ ఫలమే నని వివరించాడు.

‘’పూర్వం నువ్వు ఒక రాజ్యానికి రాజు గా ఉండే వాడివి .అందర్నీ బాగా చూసే వాడివి .విద్యా వంతుడివే అయినా నీవు  ఎందుకో హనుమ ను దూరం చేసుకోన్నావు .హనుమను దేవుడు కాదని ,ఒక సామాన్య మైన కోతి అని భావించి నిన్దిన్చావు . అంతే కాదు హను మంతుడిని ఉపాసించే వారిని బాధించావు .కాని నీ తల రాత ఇంకో విధం గా ఉంది .నీ శత్రువులు అందరు ఏకమై ,నిన్ను ఓడించి,నీ రాజ్యాన్ని ఆక్రమించి ,నిన్ను అడవులకు పంపారు .నీ భార్యా ,పిల్లలు చని పోయారు .నువ్వు అన్నీ పోగొట్టు కోవటం చేత కుంగి ,కృశించి ,ఆ అడవి లోనే మరణించి ,బ్రాహ్మణ ధర్మాన్ని కాపాడి నందుకు బ్రాహ్మణుడి గా జన్మించావు .నిష్కామంగా ,నిశ్చల బుద్ధి తో తపస్సు చేసి రుషి అని పించు కొన్నావు .అయినా మారుతి ని దూషించిన ఫలితం గా నువ్వు ఆకలి బాధ కు గురి అయావు .ఆ దుష్కృతి పోగొట్టు కోవ టానికి నువ్వు హను మంతుని సేవించు .నేను హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తాను .దాన్ని తీవ్రం గా జపిస్తూ ,నీ కోర్కెను తీర్చుకో ‘’అని చెప్పాడు.

భరద్వాజుడు ఉపదేశించిన హనుమాన్ మంత్రాన్ని అక్కడే ,ఆయన సమక్షం లోనే జపించాడు సుదంతుడు .అప్పటికప్పుడు హనుమ ప్రత్యక్షమై సమాదరించాడు .సుదంతుడు హనుమ పాదాల పై వాలి నమస్కరించాడు .తనను ఉద్ధరించ మని అనేక రకాలుగా స్తోత్రాలు చేశాడు .అంజనా నందనుడు ఆనంద పడి,’’సుదంతా !బాధ పడకు .నన్ను సేవించు.నీకు ఇదే చివరి జన్మ .’’అని ఊరడించి అదృశ్యమైనాడు ..అప్పటి నుండి సుదంతుడు నిత్యం హనుమ ను సేవిస్తూ పూజిస్తూ స్మరిస్తూ ఉపాశిస్తూ జీవితాన్ని గడి పాడు .జీవితాన్ని ధన్యంచేసుకొని చివరకు  హనుమ  లో లీనమయ్యాడు .

‘’రాజ్య ప్రదం హనూమంతం వదాన్యం మధుర ప్రియం

శ్రియం చింతా మణిం కామ ధేనుం కల్పక మాశ్రయే.’’

‘’సపీత కౌపీన ముదంచి తాన్జలిం సముజ్జ్వలం మౌన్జ్య జినోప వీతినం


సకుండలం లంబశిఖం సువాలం తమాన్జనేయం శరణం భజామి ‘’.

Image may contain: 2 people
ప్రాంజలి ప్రభ 
నేటి కవితానందం  
రచయిత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 

ఐశ్వర్యం లో ఉన్న 
పేదరికంలో ఉన్న 
గుణం లేకపోతె గుండు సున్నా 

పట్టు పరుపులపై నిద్రించిన  
కటిక నేలపై నిద్రించిన 
బుధ్ధి లేక పొతే గుండు సున్నా 

పంచ భిక్ష పరవాన్నాలు తిన్నా 
గంజి నీరు త్రాగి ఉన్నా 
శక్తి లేక పొతే గుండు సున్నా 

అందుబాటులోది చూడకున్నా  
లేని దానికోసం వెంపర్లాడినా 
మనసు లేక పొతే గుండు సున్నా 

నల్లెరులా పరుగెత్తిన 
పల్లేరులా గుచ్చుకుంటూ వెళ్లినా 
కరుణ లేకపోతె గుండు సున్నా 

కారుచీకట్లు కమ్మి ఉన్నా 
పండు వెన్నెల పొంచి ఉన్నా 
దాహం తీరకపోతే గుండు సున్నా

మంచులా కరుగుతూ నీడ ఉన్నా 
నిప్పే వెలుతురుగా ఉన్నా  
ఆకలి తీరకున్న నిండు సున్నా 

వానచినుకు స్పర్శకు తనువున్నా  
సహజ సౌందర్యంతో వెలిగి పోతున్నా 
బతుకు సార్ధకం లేకపోతె నిండు సున్నా 

మర యంత్రంలా బ్రతుకుతున్నా 
దేశానికీ ఎవ్వరికి ఉపయోగం లేకున్నా 
ఉన్నా లేనట్లే అదే నిండు సున్నా 


--((**))--


పేదవాని కధ  
ఒకసారి చాలా పేదవాడు బుద్దుడి వద్దకి వచ్చాడు. అతను అడిగాడు:
'నేను ఎ౦దుకు పేదవాడను?
బుద్ధుడు సమాధానం చెప్పాడు: మీరు ఎ౦దుకు పేదవారు  అంటే మీరు  ఎటువంటి ఔదార్యము  కలిగి లేరు మరియు దాన ధర్మాలు చేయరు.
నేను ఇతరులకు దానం చేయడానికి నావద్ద ఏమున్నది అని ఆ పేదవాడు అడిగాడు.
అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు

మీరు ఇతరులతో ప0చుకోగల ఐదు నిధులను కలిగివున్నారు.

 మొదట మీ ముఖం ఉంది. మీరు ఇతరులతో మీ  ఆనందాలను(నవ్వులను) పంచుకోవచ్చు .. ఇది ఉచితం ... ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది ..

రెండవది మీ కళ్ళు మీకు ఉన్నాయి. మీరు ప్రేమ మరియు శ్రద్ధతో  ఇతరులను చూడవచ్చు .. నిజం.. మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు .. వాటిని మంచి అనుభూతిగా చేయండి ..

 మూడవది  మీ నోరు మీకు ఉంది. ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పవచ్చు .. మంచి చర్చించండి .. వాటిని విలువైనదిగా భావించండి .. ఆనందం మరియు సానుకూలత వ్యాప్తి చెందుతాయి ..

 నాలుగవది మీకు గుండె ఉంది. మీ ప్రేమగల హృదయంతో మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు .. ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు.. వారి జీవితాలను తాకవచ్చు..

 మీరు కలిగి ఉన్న చివరి సంపద మీ శరీరం .. ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు ..అవసరమైనవారికి సహాయం చేయగలరు .. సహాయం  చెయ్యడానికి  డబ్బు అవసరం లేదు ..

ఒక చిన్న శ్రద్ధ ,సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు.
భగవంతుడు మనకిచ్చిన జీవితం..
కలకానిదీ ! విలువైనదీ ! సర్వోత్తమమైనదీ !
ప్రతిక్షణం ఆనందంగా ఉంటూ, పదిమందికి సహాయపడుతూ, జన్మను చరితార్థం చేసుకుందాం.
  
శుభం.....

--((**))--
ప్రాంజలి ప్రభ
నేటి కవితానందం
రచయత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

గాలి మనిషిని ఆవరించు
తేన పలుకులతో వరించు
నాదాల హరిలా పరవసించు
మాటలు తూటాలు చలించు

పలాయనంతో సర్వం మరచు
చిత్తగింపుతో  నిజము చరచు
అభ్యుదయమని గొప్పగా అరచు
మనిషి మేధావితనం వ్యక్త పరచు

పుట్టినప్పుడు బట్ట కట్ట లేదనుచు
పోయినప్పుడు వెంట ఏదీ రాదనుచు
నిన్ను రక్షించే చైతన్య కవచమనుచు
నీలో ఉన్న దైవమే నిన్ను నడిపించు

తెలుగు నుడికారం జీవిత మనుచు
పరిమళ ప్రాకారం దేశము అనుచు
హృదయ సహకారం పెద్ద లనుచు
తోడుండే కాలమే సౌజన్య మనుచు

--((*))--

శ్రీ ఆంజనేయ స్వామి కధలు -2

పూర్వం ఒక గ్రామంలో కేశవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు .వేద వేదాoగ పారంగతుడు. బుద్ధిమాన్,  స్వధర్మా చరణనిష్టుడు.  పుత్రులు ,పౌత్రులతో, భార్య విశాలాక్షితో సుఖ జీవితం  గడుపుతున్నాడు. అతిధి పూజలో జన్మ ధన్యం చేసు కొంటున్నాడు.

 ఆ గ్రామానికి ఒక ప్రభువులా వెలిగి పోతున్నాడు కేశవుడు. కొంత కాలానికి అతని జీవితం లో, విషాదం అలముకొంది.  ప్రియ అర్ధాంగి, అకస్మాత్తుగా మరణించింది. అతని దుఖం పట్ట శక్యం కాకుండా ఉంది.  బాధ తట్టుకోలేక, కాశీ నగరం చేరాడు.
అక్కడ నిత్యం, గంగా స్నానం తో, పవిత్రతను పొందుతూ,  విశ్వేశ్వరున్ని దర్శిస్తూ, అభిషేకం చేస్తూ, విశాలాక్షీ దేవి దర్శనంతో ఊరట చెందుతున్నాడు . కొంత కాలం కాశీలో గడిపి , తర్వాత, ప్రయాగ , గయా, మొదలైన  క్షేత్రదర్శనం చేసి, పితృ కార్యాలను, నిర్వహిస్తూ,  విధ్యుక్త ధర్మాలన్నీ  నిర్వహిస్తూ, కొన్ని నెలలు గడిపి , మళ్ళీ ఇంటి ముఖం పట్టాడు . ప్రయాణంలో ఒకరోజు చీకటి పడటంతో ఒక మర్రి చెట్టు కింద విశ్రమించాడు.  ఆ వటవృక్షం, చాలా పురాతనమై, ఊడలతో బాగా విస్తరించి ఉంది .అర్ధరాత్రి సమయంలో ఆ చెట్టును ఆశ్రయించుకొని, ఒక పిశాచం, అందంగా ఉన్న కేశవుని తినాలని, ఉబలాట పడింది.

 మనోహర సుందర యువతి గా మారి, అతని దగ్గరకు వచ్చింది. శృంగార చేష్టలతో రెచ్చగొట్టటం ప్రారంభించింది. అతనికి ఏమీ పాలు పోలేదు.
 ”యువతీ !ఎవరు నువ్వు ?అర్ధరాత్రి ఒంటరిగా ఇలా రావటం తగదు. వివాహం అయిందా ?నేను భార్య లేని వాడను. నా అండ దండలతో ఉండగలవా ? నువ్వు ఒప్పుకొంటే, నాతో నిన్ను, మా ఊరు తీసుకొని వెళ్తాను” అని చెప్పాడు . ఆమె అంగీకరించింది . వారిద్దరూ  ఆ రాత్రి ఆనందంగా గడిపారు .మర్నాడు ఆ ఇద్దరు ఇంటికి చేరారు .  కొంత కాలం ఆమెతో చక్కగా కాపురం చేశాడు. ఒకరోజు కేశవుని ఇంటికి దూరంగా ఒక చెట్టు కింద, ధూళి దూసర దేహంతో , రుద్రాక్షమాల ధరించి , వ్యాఘ్ర చర్మాంబర దారి అయిన, ఒక యోగి, శిష్యులతో కనిపించాడు.

కేశవుడు ఆయన్ను చేరి, తన ఇంటికి వచ్చి, ఆతిధ్యం స్వీకరించమని కోరాడు.
 సంతోషంతో ఆ యోగి, శిష్యులతో, కేశవుని ఇంటికి వచ్చాడు. లోపలికి  వెళ్లి, భార్యను రమ్మని పిలిచాడు .  అ యోగి పిలవవద్దని వారించాడు. కేశవునితో యోగి, ”కేశవా! ఆమెను తెలుసుకొనే కాపురం చేస్తున్నావా ? పెళ్లి చేసుకోన్నావా ?నిజం చెప్పు" అని అడిగాడు. దానికి కేశవుడు, జరిగిన విశేషాలన్నీ, వివరంగా తెలిపాడు. తనకేమీ తెలీదని, తనను ఉద్ధరించ మని వేడుకొన్నాడు . కేశ్శవునిపై యోగికి జాలి కలిగి, అతన్ని ఉద్దరించాలని భావించాడు. ”ఈమె విషయం నేను చెప్పను. నువ్వే గ్రహించు .”అని చెప్పి, శ్రీ రామ తారక మంత్రాన్ని ఉపదేశించి, వెంటనే జపిoప చేయించాడు. 

 ఒక రుద్రాక్షమాలను ఇచ్చి దానితో జపం చేయమన్నాడు.
 చేతిలోని ఆ మాల వల్ల, సూర్య తేజంతో వెలిగి పోతున్నాడు. ఆమె భయపడి ఆ జపమాలను దూరంగా విసిరేయమని కోరింది . తన దగ్గరకు రావద్దని ప్రార్ధిస్తూ, ఏడుస్తూ దూర దూరంగా జరిగింది . అప్పుడు భక్త సులభుడైన ఆంజనేయస్వామి ప్రత్యక్షమై తన తోకతో ఆ పిశాచిని చుట్టి, విసిరేశాడు.  కేశవుడికి జరిగినదంతా తెలిపి, స్వామి అదృశ్య మైనాడు. కేశవుడు యోగిని దర్శించి, జరిగినదంతా తెలియ జేసి , తన్ను ఉద్ధరించమని వేడాడు . యోగి కృపాళువై, ”రామ, ఆoజనేయులను, నిత్యం జపించు . ఒక దేవాలయం నిర్మించి శ్రీ హనుమను ప్రతిష్టించు.
 జీవితాంతం, హనుమ పూజ మానవద్దు ” అని హితవు చెప్పి శిష్యులతో వెళ్లిపోయాడు.

 యోగి ఆదేశించిన విధంగా, కేశవుడు, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మిచి , స్వామిని ప్రతిష్టించి, యదా విధిగా పూజలు నిర్వహిస్తూ,
హనుమద్భక్తులను ఆదరిస్తూ,  హనుమ కధలను వినిపిస్తూ,
 హనుమదనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది , చివరకు ముక్తిని పొందాడు.

--((**))--




ప్రేమలో వెలుగే మలుపు 

ప్రాంజలి ప్రభ - నేటి కవితానందం 



ఉషోదయ వెలుగు 

ప్రేమకు తోలి మలుపు 
చామునఛాయా వెలుగు 
కళ్ళ మెరుపులతో మలువు 

జఱిగి పోతున్న వెలుగు 
పెళ్లితో తోలి మలువు 
దోసలపిండి పెనం పై వెలుగు 
గుటకలు వేస్తూ నవ్వుల మలుపు 



చుక్కల చీరలో చక్కని వెలుగు 

మక్కువ కొద్ది మనసులో మలుపు 
మబ్బులో మేఘానికి చిక్కిన వెలుగు 
ఉరుము ఉరికి వర్షపు జల్లే మలుపు 

ఊహల ఉయ్యాల సఫల వెలుగు 
గాలి సవ్వడికి కదిలే ఊహ మలుపు 
అలంకారములేని దేహపు వెలుగు 
స్వప్నాల సంపద పంచే మలుపు  



చెప్పుకోలేని తృప్తి పరిచే వెలుగు

దాహంతో ఆకలిని తీర్చే మలుపు   
సౌందర్యం తో ఆరాధనే వెలుగు 
అనుక్షణం అణుకరణతో మలుపు 

--((**))--




తెలివి చిన్న కధ (1)

ప్రాంజలి ప్రభ - మల్లాప్రగడ రామకృష్ణ 

ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్ లో అతిపెద్ద మాల్ లో ఒక సేల్స్ మాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు.



అది ప్రపంచంలోనే అతి పె ద్ద మాల్. అక్కడ దొరకని వస్తువు అంటూ  ఉండదు.

 "ఇంతకు ముందు సేల్స్ మాన్ గా ఎక్కడైనా పనిచేసావా ?" అడిగాడు బాస్.



 "చెయ్యలేదు"


"సరే ! రేపు వచ్చి జాయిన్ అవ్వు. నీ పెర్ఫార్మన్స్ నేను స్వయంగా చూస్తా! ".



తర్వాతి రోజు చాలా భారంగా నడిచింది తనకి. చివరకి సాయంత్రం ఆరు గంటలకి బాస్ వచ్చాడు. 



"ఈ రోజు ఎంత మంది కష్టమర్స్ కి  సేల్స్ చేశావు?".



 "సర్ ! కేవలం ఒకరు" అని బదులిచ్చాడు తను.



 "ఒకటేనా ! నువ్వు ఇక్కడ గమనించావా, అందరూ 40 నుండి 50 సేల్స్ చేస్తారు. సరే, ఎంత ఖరీదైన సేల్ నువ్వు చేశావో చెప్పు?"



 "8,009,770 పౌండ్స్" చెప్పాడు మన సేల్స్ మాన్. 



"వాట్ !!" అదిరిపడ్డాడు  బాస్. 



"అంత పెద్ద సేల్ ఏమి చేశావు?"  అడిగాడు. 



"వినండి. ఒక పెద్దాయనకి ఒక చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను."



"గాలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ ఖరీదు కాదే? "  అన్నాడు బాస్.         



"పూర్తిగా వినండి, తర్వాత ఆ గాలానికి సరిపడే రాడ్, ఒక గేర్ అమ్మాను. ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నారో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పారు. దాని కన్నా ఒక బోట్  లో వెళుతూ నది మధ్య చేపలు పడితే  బాగుంటుందని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక షూనర్ బోట్  డబల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను. ఆ పెద్దమనిషి తన జీప్ కెపాసిటీ తక్కువ ఈ బోట్ ని తీసుకు పోలేదు అన్నారు. అప్పుడు ఆటొమోబైల్ డిపార్ట్మెంట్ లో ఒక కొత్త 4 * 4 డీలెక్స్ బ్లాజర్ కొనిపించాను.తరువాత అక్కడే నది ఒడ్డున ఉండటానికి కాంపింగ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా ఒచ్చిన ఆరు స్లీపర్ల ఇగ్లూ కాంప్ టెంట్ దానిలో ఉండటానికి కావల్సిన భోజన సామగ్రి పాక్ చేయించాను.” 



బాస్ ఆశ్చర్యంతో రెండు అడుగులు వెనక్కి వేశాడు. "ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా !!!"



 "లేదు సార్ !" బదులు ఇచ్చాడు సేల్స్ మాన్.



"మరి ? "  అన్నాడు బాస్. 



 " ఆయన నిజానికి ఒక తల నొప్పి టాబ్లెట్ కోసం వచ్చారు. తలనొప్పికి టాబ్లెట్ కన్నా చేపలు పట్టే  హాబీ ద్వారా తగ్గించుకోవచ్చు అని ఒప్పించాను." 



బాస్: " అరే యార్ …!! ఇంతకీ  నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి?"



అప్పుడు ఆ సేల్స్ మాన్ చెప్పాడు "

హనుమాన్ విద్యామందిర్ స్కూల్ లో టీచర్ ఉద్యోగం చేసేవాణ్ణి సార్."టీచర్ కి, సేల్స్ కు,ఏంటి రిలేషన్?? అడిగాడు బాస్ 
ఏబిసిడి లు నేర్పమని వస్తే ,పదేళ్ల తర్వాత వచ్చే భగవద్ గీత,  ఐఐటి -నీట్-సివిల్స్ ,రాంక్  పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం... అని ఆన్సర్ ఇచ్చాడు



ఇదండీ మన విద్యా విధానం అందుకే వెనుకబడి ఉన్నది, మన తెలివి మనం ఉన్నచోట పనికి రాలేదు, వేరోచోటికి పొయ్యాక తేలివి బయట పడింది.  ఎక్కడైనా దోచుకోవటమే ఇది చదువులు నెపంతో తల్లి తండ్రుల బలహీనతను సొమ్ము చేసు కోవాలను కోవటమే, అక్కడది వ్యాపారము ఏది ఏమైనా తెలుగోడి తెలివి అమోఘం. అందుకే అన్నారు పెద్దలు వినయం ఉన్న చోట "గర్వం, దర్పం, స్వాతిశయం దరి చేరవు, ప్రేమతో కూడిన సద్గుణం ఏర్పడి సంపద వచ్చి చేరుతుంది. ఫలితం అసించ కుండా పనిచేస్తే   మన:శాంతి ఏర్పడుతుంది.                 


--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి