30, జులై 2019, మంగళవారం

*శ్రీ శివ కవచం****



ఓం శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ:- ఓంనమ:శివాయ  



మాసశివరాత్రి

 మీకు ఏ సమస్య ఉన్న ఒకే ఒక పరిష్కారం మాస శివరాత్రి శివాభిషేకం

మీకు ఏ సమస్య ఉన్న తక్షణమే పరిష్కారం కొరకు ఈ పరిహారం మీకోసమే , మాస శివరాత్రి రోజు  సూర్యోదయం మేల్కొని తల స్నానం చేసుకొనిమాస శివరాత్రి రోజు ఉపవాసం వుండి " ఓం నమశివాయ " అనే శివ పంచాక్షరి మంత్రం జపించి సూర్య అస్తమం పిదప మీ సమస్యను బట్టి ఈ క్రింది ద్రవ్యములలో మహా శివుని అభిషేకం చేసుకున్నయెడల ఏ సమస్య వున్నా సీగ్రమే పరిష్కారం లభించును.
మాస శివరాత్రి రోజు శివునికి ఏ అభిషేకం వలన ఏం ఫలితములు వచ్చునో తెలుసుకుందాము..

1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును
4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు … కలుగును 
5 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు
లభించును. 

6 . శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుందిఅన్న లింగార్చన).

7.ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
8.ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
9.నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
10.కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
11.నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
12.మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
13.పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు
జరుగ గలవు.

ఆస్సలు మాస శివరాత్రి అంటే ఏమిటి  ?
ప్రతి నెలలోను వచ్చే బహుళ పక్షంలోని చతుర్ధశిని మాస శివరాత్రి అంటారు .అలా సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తే అందులో గొప్పదైన ఈ శివరాత్రి – అంటే -మాఘ మాస శివరాత్రి ‘ మహా శివరాత్రి (తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందు రోజు – రాత్రి చతుర్ధశి కలిగిన వున్న రోజుని జరుపుకోవాలి) అవుతోంది .’మహా’ అని ఎక్కడ అనిపించినా కొన్ని అలాంటి వాటికంటే గొప్పదని భావం . శివ పార్వతులిరువురికి కలిపి ‘శివులు’ అని పేరు ( శివ శ్చ శివా చ సివౌ ).ఆ ఇద్దరికీ సంభందించిన రాత్రి శివరాత్రి అనేది మరో అర్థం . అందుకే శివరాత్రి నాడు అయ్యకి – అమ్మకి కుడా వుత్సవం సాగుతుంది .శివ – మంగళకరమైన – రాత్రి ఏదో అది శివరాత్రి అనేది మూడో అర్థం .

ప్రాణికోటి యావత్తు నిద్రపోతూ ఉండే కాలం.. రాత్రి , నిద్ర అనేది పాక్షిక మరణంతో సమానం. ఆ రాత్రి వేల తానూ మేల్కొని రక్షించే శంకరుడు రాత్రి దేవుడు . ప్రాణికోటి యావత్తు నిద్రపోతూ ఉండే కాలం.. రాత్రి , నిద్ర అనేది పాక్షిక మరణంతో సమానం. ఆ రాత్రి వేల తానూ మేల్కొని రక్షించే శంకరుడు రాత్రి దేవుడు . తన వివాహం కూడా అర్దరాత్రి దాటాకనే మొదలవుతుంది. చలి కాలం వెళ్ళబోతుండగా ‘మహాశివరాత్రి’ పండుగ దినము వస్తుంది. చలి , మంచు భాధకు తాళలేక శరీరంలో పుట్టే చలిని తట్టుకోలేక గొంగల్లని కప్పుకుని వుండగా – పిశాచ , భూత ప్రేతాలకి దుఃఖాన్ని చేకూర్చే వాడైన శంకరుడు, నెలవంకను శిరోభూషనముగా ధరించి భస్మ లేపనం వాసనల మద్య కన్నుల పండువగా జరిగే పార్వతీ పరమేశ్వరుల (శివ-పార్వతుల) కళ్యాణ మహోత్సవము కోసం ఎన్ని రాత్రులైనా వేచి చూడాల్సిందే…..
మాస శివరాత్త్రి పర్వదినం నాడు మెడలో మీకు నచ్చిన రుద్రాక్ష ధరించి, ఈ దీపాలను పడమర దిక్కున వెలిగించి, “ఓం నమఃశివాయ” అని 108 సార్లు ధ్యానించే వారికి కైలాస ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం. అదేవిధంగా.. ఆలయాల్లో పంచామృతముతో శివునికి అభిషేకం చేయిస్తే ఈతిబాధలు, దారిద్య్రాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
తెలిసిగానీ, తెలియక గానీ భక్తి తోగాని, డంబముతో గాని, యీరోజు ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము జాగరణ చేస్తారో వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు తెలుపుతున్నాయి.
మనోభీష్టాలు నెరవేర్చే మాస శివరాత్రి
పరమ శివుడికి ‘మాసశివరాత్రి’ అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడుతోంది. ఈ రోజున ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించడం వలన, కోరిక కోరికలు నెరవేరు తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి … పూజా మందిరాన్ని అలంకరించి … సదా శివుడికి పూజాభిషేకాలు నిర్వహించాలి. స్వామికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
ఉపవాస దీక్షను స్వీకరించి ‘ప్రదోష కాలం’లో అంటే సాయం సమయంలో శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. ఈ సమయంలో పార్వతీదేవి బంగారు సింహాసనంపై ఆశీనురాలై వుంటుంది. లక్ష్మీదేవి పాటపాడుతూ వుండగా, పరమశివుడి తాండవానికి అనుగుణంగా శ్రీమహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటాడు. దేవేంద్రుడు వేణువు వాయిస్తూ వుండగా, సరస్వతీదేవి వీణను మీటుతూ వుంటుంది. మనోహరమైన ఈ దృశ్యాన్ని సమస్త దేవతలు సంతోషంతో తిలకిస్తూ వుంటారు.
ఈ సమయంలో ఆదిదేవుడి నామాన్ని స్మరించినా … ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించినా మహా పుణ్యమనీ … మనోభీష్టాలు నెరవేరుతాయని చెప్పబడుతోంది. అందువలన మాసశివరాత్రి రోజున ఉపవాస జాగరణలనే నియమాలను పాటిస్తూ, ప్రదోష కాలంలో సదాశివుడిని ఆరాధించాలి. అనుక్షణం ఆయన నామాన్ని స్మరిస్తూ తరించాలి.
ఓం నమ: శివాయ .. ఓం నమ: శివాయ.. ఓం నమ: శివాయ
--((**))--

నేటి శ్లోకాలు -5
సేకరణ మల్లాప్రగడ రామకృష్ణ 


(సుబ్రహ్మణ్య పంచరత్నం)

షడాననం చందనలేపితాంగం 

మహోరసం దివ్యమయూరవాహనమ్ |
రుద్రస్యసూనుం 

బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 1 ||
జాజ్వల్యమానం సురవృందవంద్యం
 కుమార ధారాతట మందిరస్థమ్ |
కందర్పరూపం కమనీయగాత్రం

 బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 2 ||
ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం 
త్రయీతనుం శూలమసీ దధానమ్ |
శేషావతారం కమనీయరూపం

బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 3 ||
సురారిఘోరాహవశోభమానం 
సురోత్తమం శక్తిధరం కుమారమ్ |
సుధార శక్త్యాయుధ శోభిహస్తం

 బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 4 ||
ఇష్టార్థసిద్ధిప్రదమీశపుత్రం
 ఇష్టాన్నదం భూసురకామధేనుమ్ |
గంగోద్భవం సర్వజనానుకూలం

 బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 5 ||
యః శ్లోకపంచమిదం పఠతీహ భక్త్యా
బ్రహ్మణ్యదేవ వినివేశిత మానసః సన్ |
ప్రాప్నోతి భోగమఖిలం భువి యద్యదిష్టమ్


అంతే స గచ్ఛతి ముదా గుహసామ్యమేవ || ౬ ||

--(()--


నేటి శ్లోకం 


పరమేశ్వర స్తోత్రం 
నమః కనక లింగాయ వేద లింగాయ వైనమః
నమః పరమ లింగాయ వ్యోమలింగాయ వైనమః 1



నమ స్సహస్ర లింగాయ వహ్నిలింగాయ వైనమః
నమః పురాణ లింగాయ శ్రుతిలింగాయ వైనమః 2


నమః పాతాళ లింగాయ బ్రహ్మ లింగాయ వైనమః
నమో రహస్య లింగాయ సప్త ద్వీపోర్ద్వ లింగినే 3


నమ స్సర్వాత్మ లింగాయ సర్వ లోకాంగ లింగినే
నమస్త్వ వ్యక్త లింగాయ బుద్ద లింగాయ వైనమః 4


నమోహంకార లింగాయ భూత లింగాయ వైనమః
నమ ఇంద్రియ లింగాయ సమస్తన్మాత్ర లింగినే 5

నమః పురుష లింగాయ భావ లింగాయ వైనమః
నమో రజోర్ద్వ లింగాయ సత్త్వలింగాయ వైనమః 6

నమస్తే భవ లింగాయ నమస్త్రై గుణ్య లింగినే
నమోనాగ లింగాయ తేజో లింగాయ వైనమః 7

నమో వాయ్వర్ద లింగాయ శ్రుతిలింగాయ వైనమః
నమస్తే ధర్మ లింగాయ సామలింగాయ వైనమః 8


నమో యజ్ఞాంగ లింగాయ యజ్ఞ లింగాయ వైనమః
నమస్తే తత్త్వ లింగాయ దేవానుగత లింగినే 9


దిశనః పరమం యోగ మపత్యం మత్సమం తధా
బ్రహ్మ చైవాక్ష యమదేవ శమం చైవ పరం విభో

అక్షయత్వం చవంశస్య ధర్మేచ మతి మక్ష యామ్ 10

అగ్నిః || వసిష్టేన స్తుత శ్శంభుస్తుష్ట శ్శ్రీపర్వతే పురా
వసిష్టాయ వరందత్వా | తత్రై వాంతరధ యత 11

--(())--


ఓం నమః శివాయ ! 🌹🕉🌹 

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

అస్య శ్రీశివకవచ స్తోత్ర మహామంత్రస్య ఋషభ యోగీశ్వర ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ సదాశివరుద్రో దేవతా, హ్రీం శక్తిః, రం కీలకం, శ్రీం హ్రీం క్లీం బీజం, శ్రీసదాశివప్రీత్యర్థే శివకవచస్తోత్రజపే వినియోగః ||

🕉🕉🕉 *కరన్యాసః ||* 🕉🕉🕉

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం హ్రీం రాం సర్వశక్తిధామ్నే ఈశానాత్మనే అంగుష్ఠాభ్యాం నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం నం రీం నిత్యతృప్తిశక్తిధామ్నే తత్పురుషాత్మనే తర్జనీభ్యాం నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం మం రూం అనాదిశక్తిధామ్నే అఘోరాత్మనే మధ్యమాభ్యాం నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం శిం రైం స్వతంత్రశక్తిధామ్నే వామదేవాత్మనే అనామికాభ్యాం నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం వాం రౌం అలుప్తశక్తిధామ్నే సద్యోజాతాత్మనే కనిష్ఠికాభ్యాం నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం యం రః అనాదిశక్తిధామ్నే సర్వాత్మనే కరతలకరపృష్ఠాభ్యాం నమః ||

🕉🕉🕉 హృదయాద్యంగన్యాసః || 🕉🕉🕉

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం హ్రీం రాం సర్వశక్తిధామ్నే ఈశానాత్మనే హృదయాయ నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం నం రీం నిత్యతృప్తిశక్తిధామ్నే తత్పురుషాత్మనే శిరసే స్వాహా |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం మం రూం అనాదిశక్తిధామ్నే అఘోరాత్మనే శిఖాయై వషట్ |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం శిం రైం స్వతంత్రశక్తిధామ్నే వామదేవాత్మనే కవచాయ హుమ్ |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం వాం రౌం అలుప్తశక్తిధామ్నే సద్యోజాతాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం యం రః అనాదిశక్తిధామ్నే సర్వాత్మనే అస్త్రాయ ఫట్ ||

🕉🕉🕉 *ధ్యానమ్ ||* 🕉🕉🕉

వజ్రదంష్ట్రం త్రినయనం కాలకంఠమరిందమమ్ |
సహస్రకరమత్యుగ్రం వందే శంభుముమాపతిమ్ ||

రుద్రాక్షకంకణలసత్కరదండయుగ్మః
ఫాలాంతరాలధృతభస్మసితత్రిపుండ్రః |
పంచాక్షరం పరిపఠన్ వరమంత్రరాజం
ధ్యాయన్ సదా పశుపతిం శరణం వ్రజేథాః ||

అతః పరం సర్వపురాణగుహ్యం
నిశ్శేషపాపౌఘహరం పవిత్రమ్ |
జయప్రదం సర్వవిపత్ప్రమోచనం
వక్ష్యామి శైవం కవచం హితాయ తే ||

🙏🌹🙏 *పంచపూజా ||* 🙏🌹🙏

లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి |
హం ఆకాశాత్మనే పుష్పైః పూజయామి |
యం వాయ్వాత్మనే ధూపమాఘ్రాపయామి |
రం అగ్న్యాత్మనే దీపం దర్శయామి |
వం అమృతాత్మనే అమృతం మహానైవేద్యం నివేదయామి |
సం సర్వాత్మనే సర్వోపచారపూజాం సమర్పయామి ||

🌹🌹🌹 *ఋషభ ఉవాచ |* ---
నమస్కృత్య మహాదేవం విశ్వవ్యాపినమీశ్వరమ్ |
వక్ష్యే శివమయం వర్మ సర్వరక్షాకరం నృణామ్ || ౧ ||

శుచౌ దేశే సమాసీనో యథావత్కల్పితాసనః |
జితేంద్రియో జితప్రాణశ్చింతయేచ్ఛివమవ్యమ్ || ౨ ||

హృత్పుండరీకాంతరసన్నివిష్టం
స్వతేజసా వ్యాప్తనభోఽవకాశమ్ |
అతీంద్రియం సూక్ష్మమనంతమాద్యం
ధ్యాయేత్పరానందమయం మహేశమ్ || ౩ ||

ధ్యానావధూతాఖిలకర్మబంధః
చిరం చిదాందనిమగ్నచేతాః |
షడక్షరన్యాససమాహితాత్మా
శైవేన కుర్యాత్కవచేన రక్షామ్ || ౪ ||

మాం పాతు దేవోఽఖిలదేవతాత్మా
సంసారకూపే పతితం గభీరే |
తన్నామ దివ్యం వరమంత్రమూలం
ధునోతు మే సర్వమఘం హృదిస్థమ్ || ౫ ||

సర్వత్ర మాం రక్షతు విశ్వమూర్తిః
జ్యోతిర్మయానందఘనశ్చిదాత్మా |
అణోరణీయానురుశక్తిరేకః
స ఈశ్వరః పాతు భయాదశేషాత్ || ౬ ||

యో భూస్వరూపేణ బిభర్తి విశ్వం
పాయాత్స భూమేర్గిరిశోఽష్టమూర్తిః |
యోఽపాం స్వరూపేణ నృణాం కరోతి
సంజీవనం సోఽవతు మాం జలేభ్యః || ౭ ||

కల్పావసానే భువనాని దగ్ధ్వా
సర్వాణి యో నృత్యతి భూరిలీలః |
స కాలరుద్రోఽవతు మాం దవాగ్నేః
వాత్యాదిభీతేరఖిలాచ్చ తాపాత్ || ౮ ||

ప్రదీప్తవిద్యుత్కనకావభాసో
విద్యావరాభీతికుఠారపాణిః |
చతుర్ముఖస్తత్పురుషస్త్రినేత్రః
ప్రాచ్యాం స్థితో రక్షతు మామజస్రమ్ || ౯ ||

కుఠార ఖేటాంకుశపాశశూల
కపాలమాలాగ్నికణాన్ దధానః |
చతుర్ముఖో నీలరుచిస్త్రినేత్రః
పాయాదఘోరో దిశి దక్షిణస్యామ్ || ౧౦ ||

కుందేందుశంఖస్ఫటికావభాసో
వేదాక్షమాలావరదాభయాంకః |
త్ర్యక్షశ్చతుర్వక్త్ర ఉరుప్రభావః
సద్యోఽధిజాతోఽవతు మాం ప్రతీచ్యామ్ || ౧౧ ||

వరాక్షమాలాభయటంకహస్తః
సరోజకింజల్కసమానవర్ణః |
త్రిలోచనశ్చారుచతుర్ముఖో మాం
పాయాదుదీచ్యాం దిశి వామదేవః || ౧౨ ||

వేదాభయేష్టాంకుశటంకపాశ
కపాలఢక్కాక్షరశూలపాణిః |
సితద్యుతిః పంచముఖోఽవతాన్మాం
ఈశాన ఊర్ధ్వం పరమప్రకాశః || ౧౩ ||

మూర్ధానమవ్యాన్మమ చంద్రమౌళిః
ఫాలం మమావ్యాదథ ఫాలనేత్రః |
నేత్రే మమావ్యాద్భగనేత్రహారీ
నాసాం సదా రక్షతు విశ్వనాథః || ౧౪ ||

పాయాచ్ఛ్రుతీ మే శ్రుతిగీతకీర్తిః
కపోలమవ్యాత్సతతం కపాలీ |
వక్త్రం సదా రక్షతు పంచవక్త్రో
జిహ్వాం సదా రక్షతు వేదజిహ్వః || ౧౫ ||

కంఠం గిరీశోఽవతు నీలకంఠః
పాణిద్వయం పాతు పినాకపాణిః |
దోర్మూలమవ్యాన్మమ ధర్మబాహుః
వక్షఃస్థలం దక్షమఖాంతకోఽవ్యాత్ || ౧౬ ||

మమోదరం పాతు గిరీంద్రధన్వా
మధ్యం మమావ్యాన్మదనాంతకారీ |
హేరంబతాతో మమ పాతు నాభిం
పాయాత్కటిం ధూర్జటిరీశ్వరో మే || ౧౭ ||

(స్మరారిరవ్యాన్మమ గుహ్యదేశం
పృష్ఠం సదా రక్షతు పార్వతీశః )

ఊరుద్వయం పాతు కుబేరమిత్రో
జానుద్వయం మే జగదీశ్వరోఽవ్యాత్ |
జంఘాయుగం పుంగవకేతురవ్యాత్
పాదౌ మమావ్యాత్సురవంద్యపాదః || ౧౮ ||

మహేశ్వరః పాతు దినాదియామే
మాం మధ్యయామేఽవతు వామదేవః |
త్రిలోచనః పాతు తృతీయయామే
వృషధ్వజః పాతు దినాంత్యయామే || ౧౯ ||

పాయాన్నిశాదౌ శశిశేఖరో మాం
గంగాధరో రక్షతు మాం నిశీథే |
గౌరీపతిః పాతు నిశావసానే
మృత్యుంజయో రక్షతు సర్వకాలమ్ || ౨౦ ||

అంతఃస్థితం రక్షతు శంకరో మాం
స్థాణుః సదా పాతు బహిఃస్థితం మామ్ |
తదంతరే పాతు పతిః పశూనాం
సదాశివో రక్షతు మాం సమంతాత్ || ౨౧ ||

తిష్ఠంతమవ్యాద్భువనైకనాథః
పాయాద్వ్రజంతం ప్రమథాధినాథః |
వేదాంతవేద్యోఽవతు మాం నిషణ్ణం
మామవ్యయః పాతు శివః శయానమ్ || ౨౨ ||

మార్గేషు మాం రక్షతు నీలకంఠః
శైలాదిదుర్గేషు పురత్రయారిః |
అరణ్యవాసాదిమహాప్రవాసే
పాయాన్మృగవ్యాధ ఉదారశక్తిః || ౨౩ ||

కల్పాంతకాలోగ్ర పటుప్రకోపః
స్ఫుటాట్టహాసోచ్చలితాండకోశః |
ఘోరారిసేనార్ణవదుర్నివార-
మహాభయాద్రక్షతు వీరభద్రః || ౨౪ ||

పత్త్యశ్వమాతంగఘటావరూథ
సహస్రలక్షాయుతకోటిభీషణమ్ |
అక్షౌహిణీనాం శతమాతతాయినాం
ఛింద్యాన్మృడో ఘోరకుఠారధారయా || ౨౫ ||

నిహంతు దస్యూన్ప్రళయానలార్చి-
ర్జ్వలత్త్రిశూలం త్రిపురాంతకస్య |
శార్దూలసింహర్క్షవృకాదిహింస్రాన్
సంత్రాసయత్వీశ ధనుః పినాకః || ౨౬ ||

దుస్స్వప్న దుశ్శకున దుర్గతి దౌర్మనస్య
దుర్భిక్ష దుర్వ్యసన దుస్సహ దుర్యశాంసి |
ఉత్పాతతాపవిషభీతిమసద్గ్రహార్తిం
వ్యాధీంశ్చ నాశయతు మే జగతామధీశః || ౨౭ ||

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
ఓం నమోభగవతే సదాశివాయ-
 సకలతత్త్వాత్మకాయ- 
సర్వమంత్రస్వరూపాయ-
 సర్వయంత్రాధిష్ఠితాయ-
 సర్వతంత్ర స్వరూపాయ-
సర్వతత్త్వవిదూరాయ-
బ్రహ్మ రుద్రావతారిణే-
 నీలకంఠాయ-
 పార్వతీ మనోహర ప్రియాయ- 
సోమసూర్యాగ్ని లోచనాయ- 
భస్మోద్ధూళిత విగ్రహాయ-
మహామణి మకుటధారణాయ-
మాణిక్యభూషణాయ-
సృష్టిస్థితిప్రళయకాలరౌద్రావతారాయ-
దక్షాధ్వరధ్వంసకాయ-
మహాకాలభేదనాయ-
మూలాధారైకనిలయాయ-
తత్త్వాతీతాయ-
గంగాధరాయ-
సర్వదేవాదిదేవాయ-
షడాశ్రయాయ-
వేదాంతసారాయ-
త్రివర్గసాధనాయ-
అనంతకోటి బ్రహ్మాండనాయకాయ-

అనంత వాసుకి తక్షక కర్కోటక శంఖ కుళిక పద్మ మహాపద్మేత్యష్ట మహానాగ కుల భూషణాయ- ప్రణవస్వరూపాయ- 
చిదాకాశాయాకాశ దిక్స్వరూపాయ-
గ్రహనక్షత్రమాలినే-
సకలాయ- 
కళంక రహితాయ-
సకలలోకైకకర్త్రే-
 సకలలోకభర్త్రే-
సకలలోకైకసంహర్త్రే-
సకలలోకైకగురవే-
సకలలోకైకసాక్షిణే-
సకలనిగమగుహ్యాయ-
సకలవేదాంతపారగాయ-
సకలలోకైక వరప్రదాయ-
 సకలలోకైక శంకరాయ-
 సకల దురితార్తిభంజనాయ- 
సకలజగదభయంకరాయ-
శశాంకశేఖరాయ-
శాశ్వతనిజావాసాయ-
నిరాకారాయ-
నిరాభాసాయ-
నిరామయాయ-
నిర్మలాయ-
నిర్లోభాయ-
నిర్మదాయ-
నిశ్చింతాయ-
నిరహంకారాయ-
నిరంకుశాయ- 
నిష్కళంకాయ-
 నిర్గుణాయ- 
నిష్కామాయ- 
నిరుపప్లవాయ- 
నిరవద్యాయ- 
నిరంతరాయ- 
నిష్కారణాయ- 
నిరాతంకాయ- 
నిష్ప్రపంచాయ- 
నిస్సంగాయ- 
నిర్ద్వంద్వాయ- 
నిరాధారాయ- 
నీరాగాయ- 
నిష్క్రోధాయ- 
నిర్లాయ- 
నిర్లోపాయ- 
నిష్పాపాయ- 
నిర్భయాయ- 
నిర్వికల్పాయ- 
నిర్భేదాయ- 
నిష్క్రియాయ- 
నిస్తులాయ- 
నిస్సంశయాయ- 
నిరంజనాయ- 
నిరుపమవిభవాయ- 

నిత్యశుద్ధబుద్ధముక్తపరిపూర్ణసచ్చిదానందాద్వయాయ- పరమశాంతస్వరూపాయ- 
పరమశాంతప్రకాశాయ- 
తేజోరూపాయ- 
తేజోమయాయ- 
తేజోఽధిపతయే- 
జయజయ రుద్ర మహారుద్ర- 
మహారౌద్ర- 

భద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంతభైరవ కపాలమాలాధర ఖట్వాంగఖడ్గచర్మపాశాంకుశ డమరు శూల చాప బాణ గదా శక్తి భిండి వాల తోమర ముసల ముద్గర పాశ పరిఘ భుశుండీ శతఘ్నీ చక్రాద్యాయుధ భీషణకర సహస్రముఖ దంష్ట్రాకరాళవదన వికటాట్టహాస విస్ఫరిత బ్రహ్మాండమండల నాగేంద్రకుండల నాగేంద్రహార నాగేంద్రవలయ నాగేంద్రచర్మధర నాగేంద్రనికేతన మృత్యుంజయ త్ర్యంబక త్రిపురాంతక విశ్వరూప విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన విషవిభూషణ విశ్వతోముఖ సర్వతోముఖ మాం రక్ష రక్ష జ్వలజ్వల ప్రజ్వలప్రజ్వల మహామృత్యు భయం శమయ శమయ అపమృత్యుభయం నాశయ నాశయ- రోగభయం ఉత్సాదయోత్సాదయ- 
విషసర్పభయం శమయ శమయ- చోరాన్మారయ మారయ- మమ శత్రూనుచ్చాటయోచ్చాటయ- త్రిశూలేన విదారయ విదారయ- 
కుఠారేణ భింధిభింధి ఖడ్గేన ఛింధిఛింధి ఖట్వాంగేన వ్యపోథయ వ్యపోథయ మమ పాపం శోధయ శోధయ- ముసలేన నిష్పేషయ నిష్పేషయ- 
బాణైస్సంతాడయ సంతాడయ- 
యక్షరక్షాంసి భీషయ భీషయ అశేషభూతాన్ విద్రావయ విద్రావయ- 
కూష్మాండ భూతవేతాళ మారీగణ బ్రహ్మరాక్షసగణాన్ సంత్రాసయ సంత్రాసయ మమ అభయం కురుకురు- నరకభయాన్మాముద్ధర ఉద్ధర- 
విత్రస్తం మామాశ్వాసయాశ్వాసయ- 
అమృతకటాక్ష వీక్షణేన మాం ఆలోకయ ఆలోకయ- సంజీవయ సంజీవయ- 
క్షుత్తృడ్భ్యాం మామాప్యాయయాప్యాయయ- 
దుఃఖాతురం మామానందయానందయ- 
శివకవచేన మామాచ్ఛాదయాచ్ఛాదయ- 
హరహర మృత్యుంజయ త్ర్యంబక సదాశివ నమస్తే నమస్తే నమః |

🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

🕉🕉🕉 *కరన్యాసః ||* 🕉🕉🕉

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం హ్రీం రాం సర్వశక్తిధామ్నే ఈశానాత్మనే అంగుష్ఠాభ్యాం నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం నం రీం నిత్యతృప్తిశక్తిధామ్నే తత్పురుషాత్మనే తర్జనీభ్యాం నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం మం రూం అనాదిశక్తిధామ్నే అఘోరాత్మనే మధ్యమాభ్యాం నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం శిం రైం స్వతంత్రశక్తిధామ్నే వామదేవాత్మనే అనామికాభ్యాం నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం వాం రౌం అలుప్తశక్తిధామ్నే సద్యోజాతాత్మనే కనిష్ఠికాభ్యాం నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం యం రః అనాదిశక్తిధామ్నే సర్వాత్మనే కరతలకరపృష్ఠాభ్యాం నమః ||

🕉🕉🕉 హృదయాద్యంగన్యాసః || 🕉🕉🕉

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం హ్రీం రాం సర్వశక్తిధామ్నే ఈశానాత్మనే హృదయాయ నమః |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం నం రీం నిత్యతృప్తిశక్తిధామ్నే తత్పురుషాత్మనే శిరసే స్వాహా |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం మం రూం అనాదిశక్తిధామ్నే అఘోరాత్మనే శిఖాయై వషట్ |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం శిం రైం స్వతంత్రశక్తిధామ్నే వామదేవాత్మనే కవచాయ హుమ్ |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం వాం రౌం అలుప్తశక్తిధామ్నే సద్యోజాతాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |

ఓం నమో భగవతే జ్వలజ్జ్వాలామాలినే
ఓం యం రః అనాదిశక్తిధామ్నే సర్వాత్మనే అస్త్రాయ ఫట్ ||

భూర్భువస్సువరోమితి దిగ్విమికః ||

🕉🕉🕉 *ఫలశ్రుతిః ||* 🕉🕉🕉

🌹🌹🌹 ఋషభ ఉవాచ –

ఇత్యేతత్కవచం శైవం వరదం వ్యాహృతం మయా |
సర్వబాధాప్రశమనం రహస్యం సర్వదేహినామ్ || ౧ ||

యః సదా ధారయేన్మర్త్యః శైవం కవచముత్తమమ్ |
న తస్య జాయతే క్వాపి భయం శంభోరనుగ్రహాత్ || ౨ ||

క్షీణాయుః ప్రాప్తమృత్యుర్వా మహారోగహతోఽపి వా |
సద్యః సుఖమవాప్నోతి దీర్ఘమాయుశ్చ విందతి || ౩ ||

సర్వదారిద్ర్యశమనం సౌమాంగల్యవివర్ధనమ్ |
యో ధత్తే కవచం శైవం స దేవైరపి పూజ్యతే || ౪ ||

మహాపాతకసంఘాతైర్ముచ్యతే చోపపాతకైః |
దేహాంతే ముక్తిమాప్నోతి శివవర్మానుభావతః || ౫ ||

త్వమపి శ్రద్ధయా వత్స శైవం కవచముత్తమమ్ |
ధారయస్వ మయా దత్తం సద్యః శ్రేయో హ్యవాప్స్యసి || ౬ ||

🌹🌹🌹 *సూత ఉవాచ |* --

ఇత్యుక్త్వా ఋషభో యోగీ తస్మై పార్థివసూనవే |
దదౌ శంఖం మహారావం ఖడ్గం చారినిషూదనమ్ || ౭ ||

పునశ్చ భస్మ సంమంత్ర్య తదంగం పరితోఽస్పృశత్ |
గజానాం షట్సహస్రస్య ద్విగుణస్య బలం దదౌ || ౮ ||

భస్మప్రభావాత్సంప్రాప్త బలైశ్వర్య ధృతిస్మృతిః |
స రాజపుత్రః శుశుభే శరదర్క ఇవ శ్రియా || ౯ ||

తమాహ ప్రాంజలిం భూయః స యోగీ నృపనందనమ్ |
ఏష ఖడ్గో మయా దత్తస్తపోమంత్రానుభావతః || ౧౦ ||

శితధారమిమం ఖడ్గం యస్మై దర్శయసి స్ఫుటమ్ |
స సద్యో మ్రియతే శత్రుః సాక్షాన్మృత్యురపి స్వయమ్ || ౧౧ ||

అస్య శంఖస్య నిర్హ్రాదం యే శృణ్వంతి తవాహితాః |
తే మూర్ఛితాః పతిష్యంతి న్యస్తశస్త్రా విచేతనాః || ౧౨ ||

ఖడ్గశంఖావిమౌ దివ్యౌ పరసైన్యవినాశినౌ |
ఆత్మసైన్యస్వపక్షాణాం శౌర్యతేజోవివర్ధనౌ || ౧౩ ||

ఏతయోశ్చ ప్రభావేన శైవేన కవచేన చ |
ద్విషట్సహస్రనాగానాం బలేన మహతాపి చ || ౧౪ ||

భస్మధారణసామర్థ్యాచ్ఛత్రుసైన్యం విజేష్యసి |
ప్రాప్య సింహాసనం పిత్ర్యం గోప్తాఽసి పృథివీమిమామ్ || ౧౫ ||

ఇతి భద్రాయుషం సమ్యగనుశాస్య సమాతృకమ్ |
తాభ్యాం సంపూజితః సోఽథ యోగీ స్వైరగతిర్యయౌ || ౧౬ ||

🌹 *ఇతి శ్రీస్కాందపురాణే బ్రహ్మోత్తరఖండే శ్రీశివకవచ స్తోత్రప్రభావవర్ణనం నామ ద్వాదశోఽధ్యాయః |* 🌹

🌹🕉🌹 ఓం నమః శివాయ ! 🌹🙏🌹

--((***))--


సేకరణ: హిందూ ధర్మ చక్రం వారి నుంచి,
జై శ్రీ రామ్...
I
భాగము 17
👉.ప్రసాద్ భరద్వాజ

🌴రుద్రము - నమకము🌴
🌻 అనువాకము 5 - Part 1 🌻

🌷యజుస్సు 1. 
నమో భవాయచ రుద్రాయచ.

ప్రాణుల యుత్పత్తికి మూల కారణమైన, జీవుల రోదనమునకు కారణ మైనట్టియు దుఃఖమును ద్రవింప జేయు నట్టి శివునకు నమస్కారము.

🌷యజుస్సు 2. 
నమశ్శర్వాయచ పశుపతయేచ.

పాప నాశకులకును, అజ్ఞానులైన పురుషులను పాలించు వారికిని నమస్కారము.

🌷యజుస్సు 3. 
నమో నీలగ్రీవాయచ శితి కంఠాయచ.

నీలగ్రీవము స్వేత కంఠము కలవాఁడు నగు శివునకు నమస్కారము.

🌷యజుస్సు 4. 
నమః కపర్దినేచ వ్యుప్త కేశాయచ.

జటాజూటము కల వానికి, వ్యుప్త ముండిత కేశునకు (జుత్తులేనివానుకు) నమస్కారము.

🌷యజుస్సు 5. 
నమస్సహస్రాక్షాయచ శతధన్వనేచ.

ఇంద్ర వేషముచే సహస్రాక్షుఁడైన వాఁడును, సహస్ర భుజములు గల అవతారములు ధరించుటచే శతధన్వుఁడును ఐన శివునకు నమస్కారము.

*🌴రుద్రము - నమకము🌴*
*🌻 అనువాకము 4 - Part 2 🌻*

*అనువాకము 4.*

*యజుస్సు 6.*
*నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవోనమః.*

*వికృత రూపులైన నగ్న ముండాదులకు నమస్కారము. తురంగ గజ వక్త్రాది నానా రూపములను దాల్చు భృత్యులును అగు మీకు నమస్కారము.*

*యజుస్సు 7.*
*నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చవోనమః.*

*అణిమా ద్యష్టైశ్వర్యములతో కూడుకొన్నవారికి నమస్కరము. అష్టైశ్వర్యములు లేని మీకు నమస్కారము.*

*యజుస్సు 8.*
*నమో రథిభ్యో உరథేభ్యశ్చవోనమః.*

*శరీర రథము నధిష్టించిన పరమాత్మకును, రథులైన యోధులకును, జీవులకును నమస్కారము. రథము లేని సామాన్య జీవులకును, శరీర రథము లేని అప్రాణులున్నగు మీకును నమస్కారము.*

*యజుస్సు 9.*
*నమోరథేభ్యో రథపతిభ్యశ్చవోనమః.*

*రథ రూపులకు నమస్కారము. రథములకు ప్రభువులైనట్టి మీకు నమస్కారము.*

*యజుస్సు 10.*
*నమస్సేనాభ్యస్సేనానిభ్యశ్చవోనమః*.

*రథ గజ తురగ పదాతి రూప సేనలకు నమస్కారము. సేనా నాయకులైనట్టి మీకు నమస్కారము.*

*యజుస్సు 11.*
*నమః క్షత్తృభ్యః సంగ్రహీతృ భ్యశ్చవోనమః.*

*రథ శిక్షకులును, రథములను గ్రహించు సారథులును అగు మీకు నమస్కారము.*

*యజుస్సు 12.*
*నమస్తక్షభ్యోరథకారేభ్యశ్చవోనమః.*

*దేవాధిష్టానులైన శిల్పి విశేషులకు నమస్కారము. చక్కగా రథములను నిర్మించు శిల్పులగు మీకు నమస్కారము.*

*యజుస్సు 13.*
*నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చవోనమః.*

*కుంభకారులకు నమస్కారము. లోహకారులగు మీకు నమస్కారము.*


*యజుస్సు 14.*
*నమః పుంజష్టేభ్యో నిషాదేభ్యశ్చవోనమః.*

*పక్షి పుంజములను సంహరించు వారికి నమస్కారము. మత్స్య ఘాతుకులైనట్టి మీకు నమస్కారము.*

*యజుస్సు 15.*
*నమ ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చవోనమః.*

*చక్కని శరీరములను చేయునట్టి మీకు నమస్కారము. చక్కని ధనుస్సులను చేయునట్టి మీకు నమస్కారము.*

*యజుస్సు 16.*
*నమోమృగయుభ్యశ్శ్వనిభ్యశ్చవోనమః.*

*మృగములను చంపెడి వ్యాధులకు నమస్కారము. కుక్కల మెడలయందు గట్టబడిన పాశములను దాల్చెడి మీకు నమస్కారము.*

*యజుస్సు 17.*
*నమశ్శ్వభ్యశ్శ్వపతిభ్యశ్చవోనమః.*

*శ్వాన రూపధారులకు నమస్కారము. శునక స్వాములైన మీకు నమస్కారము.*

--((***))--

శివపురాణం -3 వ భాగం:

శాక్తేయ నాయనారు – నారదుడు మాయకు వశుడగుట :

మనకు పెరియపురాణం అని ఒక గ్రంథం ఉన్నది. అది మనకి నాయనార్ల చరిత్రను తెలియజేస్తుంది. అందులో ‘శాక్తేయ నాయనారు’ అని ఒక నాయనారు ఉన్నారు. ఆయన గొప్ప శివభక్తితత్పరుడు. కాని ఆయన ఉన్నరోజులలో శివుడి గురించి మాట్లాడడం కాని, ‘శివ’ అన్న నామం పలకడం కాని, శివార్చన చెయ్యడం కాని కుదరని భయంకర పరిస్థితులు ప్రబలివున్నాయి.కానీ ఆయనకు లోపల శివారాధన చెయ్యాలన్న పరమభక్తి భావన ఉండేది. ఆయన కాంచీపురంలో ఉండేవారు. ఆ రోజుల్లో శివలింగము నొకదానిని తీసుకువచ్చి రోడ్డు మీద పెట్టారు. ఒక్కసారి ఆ శివలింగం దగ్గరకు వెళ్లి శివ నామములు జపిస్తూ ఆ శివలింగం మీద పూవులు వెయ్యాలని ఆయన కోరిక. ఆ రోజుల్లో పరిస్థితులు శివలింగం మీద ఎవరయినా పువ్వులు వేసినా, నమస్కరించినా వారిని చాలా అవమానములకు గురి చేసేవారు. అపుడు ఆయన ఒక మార్గమును ఎంచుకున్నారు. శివార్చన చెయ్యనివాడిలా కనపడాలి పైకి. లోపల శివార్చన చెయ్యాలన్న ఆయన కోర్కె తీరాలి. అందుకని ఆయన అటుగా వెళుతూ అన్నం తినేముందు కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని శివా, నీ పూజ చేయకుండా అన్నం ఎలా తినను? అని రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లి, నీవు శివుడివా?” అని ఒక రాయి తీసుకొని దానిని చేమంతి పువ్వుగా మనస్సులో భావిస్తూ, ఆ శివలింగం మీద పడేసేవారు. మరొక రాయిని తీసుకుని ‘నీవు శివుడివా? అని పైకి అంటూ మనసులో మాత్రం నేను మల్లెపువ్వును వేస్తున్నాను అనుకుంటూ శివలింగం మీదకి విసిరేవారు. నిజానికి అక్కడ జరిగింది ఆయన విసిరినా రాళ్ళకు బదులు చేమంతిపువ్వులు, మల్లెపువ్వులు పడ్డాయి. చూసేవాళ్ళందరూ ఆయన అక్కడి పరిస్థితులు ఆచారముల ననుసరించి శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు, ఆయనను చాలా గౌరవంగా చూడాలి అనుకునేవారు. అతడు చేస్తున్న పూజ లోకమునకు అర్థం అవుతుందా –శివుడికి అర్థం అవుతుందా? శివుడికి అర్థం అవుతుంది. అదీ ఆయన పూజ! ఇది ఆర్తిలోనుంచి వచ్చిన పూజ.

ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు. అపుడు ‘శర్వతి’ అనే నామం జ్ఞాపకమునకు వచ్చింది. ‘ఈ అన్నమును నాకు పెట్టినవాడు శంకరుడు. లోపలి వెడితే దానిని జీర్ణం చేస్తున్న వాడు శంకరుడు. అగ్నిని ఆదేశించి అన్నమును ఉడికేటట్లు చేసేవాడు శంకరుడు. నేను పశువు తిన్నట్లు ఈ అన్నం తినడానికి వచ్చాను. ఈవేళ శివలింగం మీద నాలుగు పువ్వులు వెయ్యడం మర్చిపోయాను అని అన్నం పళ్ళెం దగ్గరనుంచి లేచి, భార్యకు చెప్పకుండా పరుగు పరుగున శివలింగం దగ్గరకు వెళ్లి ‘శివుడివా’ అని నాలుగు రాళ్ళు తీసి శివలింగం మీద విసిరాడు. ఇలా తప్ప మరొకవిధంగా నీకు పూజ చేయలేక పోతున్నానయ్యా’ అని మనస్సులో చెప్పుకుని కన్నుల వెంట నీరు కార్చాడు. వెంటనే ఈశ్వరుడు ఆయనకు నటరాజ మూర్తిగా సాక్షాత్కరించి తనలో కలిపేసుకున్నాడు. దీనిని బట్టి మహేశ్వరుడు అన్న శబ్దం చేత ఈశ్వరుడు మీ సంకల్పములను, మీ హృదయ శుద్ధిని, మీ చిత్తశుద్ధిని చూడగలిగిన వాడు. ఇదీ ఆయన స్వతంత్రత. లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దానిని భావనకు అనుగుణంగా తీసుకొని ఉద్ధరించి అన్నమును విడిచిపెట్టి నాలుగు రాళ్ళతో పూజ చేసిన మోక్షము యిచ్చిన వాడు శంకరుడు. అలా మోక్షమును యివ్వగల శక్తి ఈశ్వరునికి ఉన్నది. ఐడి మహేశ్వర శబ్దముచేత ప్రతిపాదించబడుతుంది. ఈశ్వరుని శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరుని కనపడకుండా చేస్తుంది. ఈ మాయ ఈశ్వర వాక్కువలన, ఈశ్వర స్వరూపులయిన గురువాక్కుల వలన తొలగుతుంది. నిరంతర గురు వాక్శ్రవణమే మాయ తొలగేందుకు కారణం. అందుకే గురువులేని విద్య గుడ్డివిద్య. గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ తొలగదుమాయ వలన ఈశ్వర దర్శనమును విస్మరించి ‘ఇదంతా నా ప్రజ్ఞ’ అని అంటాడు. . కామక్రోదాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. చంద్రశేఖర పరమాచార్య తన 73వ ఏట ఇప్పటికీ నన్ను ఆశ అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది’ అని చెప్పుకున్నారు. మహాత్ములు విషయములను దాచరు. శివమహా పురాణం ఈ జ్ఞానమును ఉపదేశించడానికి ఒక అద్భుతమయిన ఘట్టమును తీసుకువచ్చి మీకు బోధచేసే ప్రయత్నమును ప్రారంభం చేస్తోంది.

ఒకానొక సమయంలో నారదమహర్షి హిమవత్పర్వతము క్రింది భాగమునందు, గంగానది ప్రవహించే ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో, అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేశారు. తపస్సు చేస్తున్నప్పుడు మనస్సు భగవంతునియందు మగ్నమై ఉండాలి. అది చంచలం అవుతున్నదీ లేనిదీ పరీక్ష చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇంద్రుడు మన్మథుడిని పిలిచి ఒకమాట చెప్పాడు.

‘మన్మథా, మహా సంయముడయిన నారదమహర్షి తపస్సు చేస్తున్నాడు. నీవు ఆయన వద్దకు వెళ్ళి వికారములను, ఇంద్రియములకు చూపించి ప్రలోభపెట్టి, నారదుడు యింద్రియములకు వశుడవుతాడేమో చూడవలసినది అని చెప్పాడు. మన్మథుడు వెళ్ళి ప్రయత్నం చేశాడు. నారదుడు లొంగలేదు. నారదుని తపస్సు సఫలీకృతం అయింది. ఆయన ఎవరి గురించి తపస్సు చేశాడో ఆయనని సాకారంగా చూడడానికి కైలాస పర్వతానికి వెళ్ళి ‘ఈశ్వరా, హిమవత్పర్వత ప్రాంతంలో ఉండే గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను, మన్మథుడు వచ్చి నామీద బాణములు వేసే ప్రయత్నం చేశాడు. కానీ నేను వాటిని లెక్కపెట్టలేదు. కామమును జయించి తపస్సునందు సిద్ధిని పొందాను’ అని చెప్పాడు. అంటే ఈశ్వరుడు చేసిన పనిని తాను చేశానని గొప్పగా చెప్పుకోవడం. ఎంతగా మాయ కమ్మేసిందో చూడండి. నారదుని మాటలు విన్న శంకరుడు నవ్వి ‘నారదా, నీవు కాముడినే జయిన్చావా? కాముడిని జయించడం అంటే మాటలు కాదు. నా దగ్గర చెప్పినట్లు వైకుంఠంలో చెప్పకు’ అని చెప్పాడు. కానీ నారదుడు శంకరుని మాటలను పట్టించుకోలేదు. గురువుల మాటలను తిరస్కరించడం అంటే ఇదే. అది అనుష్ఠానములోనికి రానివిద్య. ఆ విద్య శ్రవణమునకు మాత్రమే పనికొస్తుంది. అనుష్ఠానంలో పెట్టని వేదాంత విద్యవలన ప్రయోజనం లేదు. నారదుడు వైకుంఠమునకు వెళ్తూ మధ్యలో బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. తండ్రితో కూడా తన తపస్సు గురించి కాముని గెలిచినట్లు, సిద్ధిని పొందినట్లు చెప్పాడు. అపుడు బ్రహ్మ తన కుమారుడితో అలా అనకూడదు అని చెప్పి నీవు తపస్సు చేసిన చోట ఇంతకుపూర్వం పరమశివుడు తపస్సు చేసి అక్కడకు మన్మథుడు వస్తే మూడవ కంటి మంటచేత కాల్చివేశాడు. ఆ ప్రాంతంలో మన్మథ బాణములు పనిచేయకపోవడానికి కారణం ఇంతకుపూర్వం అక్కడ శంకరుడు తపస్సు చేయడం. నీవు గెలిచావని చెప్పడంలో అర్థం లేదు. అది శివ ప్రజ్ఞ, నీ ప్రజ్ఞ కాదు.

నారదుడు తన తండ్రి మాటలను కూడా లెక్కలోకి తీసుకోలేదు. వైకుంఠమునకు వెళ్ళాడు. నారాయణుడు ఎదురువచ్చి స్వాగతించాడు. అపుడు నారదుడు ‘స్వామీ, నేను తపస్సు చేశాను మన్మథుడు నామీద బాణములు వేసినప్పటికీ నేను చలించలేదు. సిద్ధి పొందాను’ అని చెప్పాడు. అపుడు నారాయణుడు ‘ఎంత గొప్పపని చేశావయ్యా, శివుని తర్వాత మరల నీవే చేశావు’ అని మెచ్చుకున్నాడు. నారదునికి పుట్టం పెట్టి లోపల జ్ఞానము బాగా నిలబడేటట్లుగా చేయవలసిన అవసరం ఏర్పడింది అని నారదుని పంపించివేశాడు. ఇపుడు మాయ ప్రారంభమయింది.

నారదుడు బయలుదేరి ఒక రాజ్యంలోకి వెళ్ళాడు. ఆ రాజ్యమును శీలనిది అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు ఒక కుమార్తె, పేరు శ్రీమతి. నారదుడు శీలనిధి అంతఃపురంలోనికి వెళ్ళాడు. రాజుగారు నారదునికి స్వాగతం చెప్పి పాదములు కడిగి కూర్చోపెట్టాడు. తన కుమార్తెను నారదుని వద్దకు తీసుకువచ్చి ఆమెచేత నారదునికి నమస్కారం చేయించి, తన కుమార్తెకు ఎటువంటి వరుడు వస్తాడో చెప్పవలసినది అని కోరాడు.

నారదుడు త్రికాలవేది. ఆయన లక్ష్మీదేవికి భర్త ఎవడో, ఎవడు సర్వవ్యాపకుడో ఎవడు నిరంతరం లోకం చేత పూజించబడుతూ ఉంటాడో, ఎవడు మహానుభావుడో అటువంటి శ్రీమహావిష్ణువుకు ఈమె ఇల్లాలు అవుతుంది’ అన్నాడు. అక్కడివరకు బాగానే చెప్పాడు కానీ ఆమెను చూడగానే ఆమె తన ఇల్లాలు అయితే ఎంత బాగుండు అని లోపల అనుకున్నాడు. ఈ అమ్మాయికి పెళ్లి ఎలా చేద్దామని అనుకుంటున్నావు అని రాజును అడిగాడు. స్వయంవరం పెట్టాము. స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది. అని చెప్పాడు. అనగా విష్ణువు సాకారుడై ఈ సభలోకి వస్తాడు అని నారదుడు గ్రహించాడు. వెంటనే వైకుంఠమునకు వెళ్ళి విష్ణుమూర్తిని సమీపించి ‘అయ్యా, నామనస్సు ఆ శ్రీమతిని పెళ్ళి చేసుకోవాలని ఉవ్విళ్ళూరి పోతున్నది. ఆమె నాకు దక్కకపోతే మన్మథబాణముల చేత చచ్చిపోతాను’ అన్నాడు. ఇంతకు మునుపు మన్మథబాణములను జయించానని చెప్పిన నారదుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఇదీ మాయ అంటే. నేను బతకాలంటే నాకు నీరూపం కావాలి. అప్పుడు ఆమె నా మెడలో మాల వేస్తుంది. అందుకని దయచేసి నీ రూపమును నాకీయవలసినది’ అని అడిగాడు. శ్రీమహావిష్ణువు మహానుభావుడు. ఆయన హరి శరీరమునూ ఇచ్చాడు, శిరస్సునూ ఇచ్చాడు. హరి అనే పదమునకు రెండు అర్థములు – పాపములను హరించే శ్రీమహావిష్ణువు, కోటి. హరి శరీరమును కిందవరకు ఇచ్చాడు, కోతి తలను పైన యిచ్చాడు.

వెంటనే నారదుడు ఆలస్యం చేయకుండా స్వయంవర మండపమునకు వెళ్ళి అక్కడ గల ఒక ఆసనం మీద కూర్చున్నాడు. అతనికి అటూ ఇటూ రుద్రపార్షదులు కూర్చుని ఉన్నారు. ఈతని అలంకరణ చూస్తె మహావిష్ణువులా అలంకరించుకున్నాడు, పైన మాత్రం కోతి ముఖం ఇతని మేడలో ఎలా మాల వేస్తుంది అని అనుకుంటున్నారు. పక్కవాళ్ళు అసూయతో అలా అనుకుంటున్నారని అనుకుంటున్నాడు నారదుడు. శ్రీమతి దండ పట్టుకుని దగ్గరకు వచ్చింది. ఆమె నారదుని వంక ఒకసారి చూసి భ్రుకుటి ముకుళించి ఈ కోతి శిరస్సు ఏమిటి? ఈ రూపమేమిటి? అనుకుని వెళ్ళిపోయింది. ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు. వరమాల తీసుకువెళ్ళి ఆయన మేడలో వేసింది. ఈవిడను తీసుకుని ఆయన వైకుంఠమునకు వెళ్ళిపోయాడు.

అపుడు నారదునికి ఎక్కడలేని బాధా కలిగింది. పక్కన ఉన్న రుద్రపార్షదులు కోతిముఖం వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నారు. నారదుడు వారిద్దరినీ మీరు రాక్షస యోనులయందు జన్మించెదరు గాక అని శపించాడు. మాయా ప్రభావం కామక్రోధముల యందు ఎలా తిప్పుతుందో చూడండి. రుద్రపార్షదులు నారదుని తిరిగి శపించకుండా శివేచ్ఛగా భావించారు. వాళ్ళు మహాజ్ఞానులు. నారదుడు గబగబా వైకుంఠమునకు వెళ్లి “శ్రీమన్నారాయణా! ఎంత పని చేశావు. హరిరూపము యివ్వమని అడిగితే కోతి శిరస్సు పెట్టావు. ఆమెను నాకు కాకుండా చేశావు. నీవు ఒకానొకనాడు నరుడవై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరం అయితే అరణ్యంలో పది ఏడిస్తే, ఈ కోతిముఖం వున్న వాళ్ళే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు. అలా నిన్ను శపిస్తున్నాను’ అన్నాడు. 

               శ్రీమన్నారాయణుడు మహానుభావుడు కనుక ఆ శాపమును కూడా లోకమునకు ధర్మమార్గము నేర్పడానికి రామావతారమునందు సీతావియోగంగా తీసుకున్నారు. ఇప్పుడు నారదుని స్వస్థత కలిగింది. తాను ఏమిటి పొందాను అని ఆలోచించాడు. ఆత్మపరిశీలన చేసుకున్నాడు. మాయ తొలగింది. శ్రీమన్నారాయణుని చూసి యుక్తాయుక్త విచక్షణ మరచి నేను మాట్లాడిన మాటలకి నా నాలుకను ముక్కలు ముక్కలుగా కత్తిరించెయ్యాలి. గరుత్మంతుడిని నీ ధ్వజమునకు చిహ్నంగా కలవాడా! ఇంకా ఎంత మాత్రము జాగు చెయ్యకుండా నీ చక్రధారల చేత నా నాలుకను కత్తిరించెయ్యి. అప్పుడు కాని నేను చేసిన పాపం పోదు అని కన్నీటి ధారలతో ఆయన పాదములను అభిషేకించి కాళ్ళమీద పడ్డాడు. నారదుడు కాబట్టి మరల అంత తొందరగా స్వస్తితిని పొందగలిగాడు. మనం అయితే మాయలో పడి కొన్ని కోట్ల జన్మలు తిరుగుతూ ఉంటాము. పరిశీలించినట్లయితే రామాయణంలో ఒక రజకుడి మాట సీతా వియోగమునకు కారణం అయింది. అదే రజకుడు మరల ద్వాపర యుగంలో రజకుడిగా వచ్చినపుడు, కృష్ణ భగవానుడు నాలుగు పంచెలు యివ్వమని అడిగాడు. అపుడు ఆ రజకుడు నీకు రాజుగారి బట్టలు కావలసి వచ్చాయా అని గేలిచేసి మాట్లాడాడు. యుగం మారినా వాని బుద్ధి మారలేదు. అపుడు కృష్ణుడు వాని శిరస్సు మీద ఒక గుద్దు గుద్ది వేయిముక్కలు చేశాడు. మీరు ఏ మంచి పని చేసినా ఈశ్వర ప్రజ్ఞకు ముడిపెట్టాలి. ‘నేను’ అనేమాట అంటే మాత్రం యిబ్బందిలోకి వెళ్ళిపోతారు. మొదట మనం మన వాక్కును దిద్దుకోవాలి. నారదుడు కాబట్టి అతి స్వల్పకాలంలో దిద్దుకున్నాడు. మనం ఎంతటి వాళ్ళము. ఇది మహేశ్వర శక్తి. ఆ మాయే అమ్మవారి స్వరూపము. మీరు గట్టిగా అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే ఆవిడే మిమ్ములను దగ్గరికి తీసి, మీకు ఈశ్వర భక్తిని ఇచ్చి మీచేత ఈశ్వర సేవ చేయించి, ఈశ్వరుడిలో కలుపుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తిప్పిన కామపాషములు అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే భక్తిపాశములుగా మారిపోతాయి. ఆవిడ మాయాశక్తి, స్వరూపిణి. మాయా పాశమును భక్తి పాశము చేస్తుంది. లోకమునందు పంచతన్మాత్రలను ఈశ్వరుని వైపు తిప్పేసి ఈశ్వరునిలో కలిపేస్తుంది. అది మహేశ్వరుని చేరుకోవడానికి మార్గం. ఆ మార్గమునకు మొట్టమొదటి పొరపాటు వాక్కునందు కలుగుతూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడూ ఈశ్వర ప్రజ్ఞను ఈశ్వరానుగ్రహమును గుర్తెరిగి ప్రవర్తిస్తూ ఉండాలి.
--((***))--


ఒక అంకం

ముగిసిపోతున్నది నీవు ఏర్పరచిన జగన్నాటక రంగంలో ఒక పాత్ర ముగిసిపోతున్నది
పాత్ర ఔచిత్యంలో నేను నా పాత్రకు న్యాయం చేసానో నటించానో జీవించానో నిర్ణయించే
సమయం ఆసన్నమైంది ఏమి పొందానో ఏమి కోల్పోయానో ఏమి కోరుకున్నానో ఏమి ఆశించానో ఏమి వదులుకున్నానో ఏమి వదలకున్ననో ఏమి జ్ఞప్తికి లేవు నా అస్థిత్వానికై పడిన తపన పొందిన ఆరాటం జరిపిన జీవన పోరాటంలో నీ అస్థిత్వాన్ని గమనించక వృధా పరచిన కాలమెంతో నా అజ్ఞానాన్ని మన్నించి కరుణించు ఎంతో ఆరాటపడి ఎన్నో సంపాదించా
విలువైన నీ సన్నిధి వదిలి వెలలేని విషయాలను పట్టుకున్నా అంకెను వదిలి
సున్నాలను మాత్రమే ఎర్పరచుకున్ననా అమాయకత్వాన్ని దయతో మన్నించు
అవసరమైన నీ అనుగ్రహాన్ని మాత్రము మరచి అనవసరమైన ప్రతి విషయంలో మైమరచిపోయా శాశ్వతమైన నీ బంధాన్ని వదిలి అశాశ్వతమైన బంధాలకు బందీయైన
నా మూర్ఖత్వాన్ని వాత్సల్యంతో మన్నించు పాశ్చ్యాత్తాపముతో పరితపించే జీవులకు
నీ పద కమలముల శాశ్వత సన్నిధి ఒసగగల బోళా శంకరుడివని నమ్మి అవసాన సమయములో అర్ధిస్తున్నాను తండ్రి నీ చరణ సన్నిధే నా పెన్నిధి గా మార్చు ఈ జన్మకైనా మరే జన్మకైనా నీవే నా తండ్రివై తోడు నీడగా నడిపించి నీచెంతనే నిలిచేలా అనుగ్రహించే
బాధ్యత భారము నీదే శివయ్యా

--((**))--


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి