23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

భగవద్గీత - 8 వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగం

అక్షర పరబ్రహ్మ యోగం - అంతర్గత సూక్తులు (8/60 




51  నిరంతరం పరమాత్ముని ధ్యానిస్తూ ఉన్నవానికి స్థానం ఎటువంటిది?, ఫలితము ఏమిటో ? 




52 . మరణం అనేది ముగింపు కాదు, ఒక దేహాన్ని వదలి మరొక దేహానికి చేరటం, అనగా పాత బట్టను వదలి కొత్త బట్ట కట్టుకున్నట్లు 




53 నిర్మలమైన, నిశ్చలమైన మనస్సును రాగద్వేషాలకు, పాపపు వాసనలకు, విషయ వ్యామోహాలకు చిక్కకుండా దైవాన్ని ప్రార్ధించాలి.




54 . పగ్గంతో గుర్రాన్ని అదుపులో తెచ్చినట్లు, భక్తి అనే పగ్గంతో మనస్సు అనే గుర్రాన్ని  అదుపులో పెట్టుకోవాలి.        . 




55 . ప్రేమనే భక్తి అంటారు కానీ అది పవిత్ర మైన భక్తి కాదు. ఎందుకంటే భార్య యందు ఉండే ప్రేమను మొహం అంటారు, బిడ్డలపై ఉండే ప్రేమను వాత్సల్యం అంటారు   భగవంతునిపై, గురువుపై ఉండే ప్రేమనే ప్రేమ అంటారు. 




56 గురువుగారు విద్యనేర్పుతుణ్నప్పుడు అనుకోని విధముగా అనారోగ్యునిగా మారితే తక్షణమే శస్త్ర చికిత్స చేసినవాడే నిజమైన ప్రేమ కలవాడు. 




57 .యోగబలం కూడా ఉండాలి, అనగా  భృ మధ్యంలో  ప్రాణశక్తిని ధారాన చేసి నిలబడటమే. అనగా ముక్కులో సంచరించే ప్రాణవాయువును నిరోధించి, కనుబొమల మధ్య ప్రదేశమున నిలబెట్టడం. 




58 . దేహంలో ఉన్న పింగళనాడులు,వీటిలో ఉన్న ప్రాణశక్తి మూలాధార చక్రం, సాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం,అనాహత చక్రం, విసుద్ధ చక్రాలను దాటుకుంటూ ఆజ్ఞాచక్రం చేరిన ప్రాణ శక్తిని యోగం ద్వారా నిలబెట్టాలి. 




59  ఆజ్ఞా చక్ర సమీపములో సప్త కోశాలు ఉన్నాయి, భోధిని, నాద,అర్ద్,చంద్రికా,మహానాడు, కళా చంద్రికా, ఉన్మనీ చేరి పరమపురుషుని చేరుకుంటాడు.




60 . యోగులు కాని వారు కర్మకు బద్ధులై, కన్ను, ముక్కు, నోరు, చెవి, మొదలైన అదో మార్గాల ద్వారా ప్రణాలు వదలి మరో శరీరంలో చేరుతారు.  




61. వేద విదులైనవారు పరబ్రహ్మాన్ని అక్షరం అని చెబు తున్నారు, అంటే అక్షరం నాశనం లేనిది. 




62. ప్రపంచంలోని అన్నీ ప్రాణులు, పదార్దాలు అన్నీ  క్షరమే, క్షనికమైనవి అని గ్రహించగలరు. 




63. ఆత్మ విద్యను మొదట" ఓం" అనే అక్షరాన్ని దిద్దిస్తారు   ఆ తర్వాత నమ:శివాయ: అని దిద్దిస్తారు ఇదే అక్షర బ్రహ్మం. 




64. ప్రాపంచక విషయ వస్తువుల పట్ల, భోగాలపట్ల రాగాన్ని ఆసక్తిని వదలి వేయాలి. 




65. స్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అనేవి ఎందుకూ పనికిరావు. ప్రాతిభంధకాలును, అజ్ఞానా న్ని తొలగించు కొన్నప్పుడే పరమాత్మ అనుభూతి పెరుగు తంది.            




66. సోమరిపోతుకు ఆధ్యాత్మిక రంగంలో స్థానంలేదు. దృడ దీక్ష తో, పట్టుదలతో ప్రయత్నిమ్చిన వారికే ముక్తి- మోక్షం 




67. బ్రహ్మ చర్యం అంటే సాధారణ ఆర్ధం " వీర్య రక్షణం, సుఖ భోగాళ వైపు పోకుండా ఉండటం "




68. భగవంతుని యందు శ్రవణ, మనన, నిదిధ్యాసలతో బాటుగా జపము, ధ్యానము,ఆత్మ విచారణ, సాక్షి భావన, నిర్వకల్ప సమాధి సాధనాలే బ్రహ్మ చర్యం అంటారు.




69. ఓంకారో పాసన ఎలాచేయాలో, పరబ్రహ్మాన్ని అందు కునే సాధన లేమిటో తెలుసుకొని జీవించగలరు. 




7౦. ఇంద్రియాలను స్వాధీనములో ఉంచుకొని, మనస్సు హృదయాన్ని ఏకం చేసి, యోగ నిష్ట అవలంబించి, ప్రా ణమును సిరస్సు నందు ఉంచి, "ఓం " అనే 

ప్రణవాక్షరాన్ని ఉచ్చరిస్తూ దేహాన్ని వదలి ప్రయాణి౦చుట. 





71. మోక్షం అంటే అమ్మ పెట్టె తిండి కాదు, నాన్న ఇచ్చే ధైర్యముకాదు, డబ్బుతో కొనే వస్తువు కాదు. కానీ దేవుడు నన్ను మరవని వాన్ని నేను మారాను అన్నాడు. 




72. పడవ దిక్సూచి తూర్పు చూపించినట్లు, ఏ పని చేసిన చిత్తము పరమాత్ముని వైపే ఉంచాలి. 




73. పతివ్రత స్త్రీ ప్రేమ భర్త పై ఉంచినట్లు, పూజారి దక్షణ పై ప్రేమ ఉంచినట్లు, వ్యాపారి లాభంపే ప్రేమ ఉంచి నట్లు,    మానవులమై ఏపని చేసిన ప్రేమ దేవునిపై ఉంచాలి. 




74. కష్టం వచ్చినప్పుడు దేవున్ని తలచటం కాదు, సుఖంలో కూడా దేవుణ్ణి తలవాలి అప్పుడే మోక్షం ఉంటుంది.




75.  నేను జపం చేస్తున్నాను నే భావన లేకుండా దేవుని ధ్యానంలో ఉండి పరధ్యాస లేకుడా ఉండాలి. 




76. నన్ను చేరుకున్న ఉన్నతోన్నత మహానుభావులు మోక్షము పొంది, కష్టాలు పొందే పునర్జన్మ ఉండదు. 




77. పాపం చేస్తే సే నరకం, పుణ్యం చేస్తే స్వర్గం, జ్ఞానం పొందితే మోక్షం అని భగవంతుడే తెలియపరిచాడు.  




78. బాల్యం, యవ్వనం, వృద్దాప్యం అనేవి మానవజన్మలో ఉంటాయి, అనుభవిస్తూనే దైవాన్ని ధ్యానించాలి. 




79. 7 ఊర్ధలోకాలకు వెళ్లి సుఖాలు, 7 అధోలోకాలకు వెళ్లి నరకాలు చేసిన పుణ్య పాపాలవల్ల అనుభవిస్తారు. 




80. నేను చేసేవాన్ని కాదు, అనుభవించే వాన్ని కాదు,

 నిరంతరము ఆత్మగా, సాక్షిగా ఉంటూ నిశ్చయజ్ఞానముతో    దైవాన్ని ప్రార్ధించే వాడ్ని అనుకోవాలి.   
81 .  ఆనందం తాండవిస్తూ ఉంటె కాలం తెలియదు అంటే యుగ మొక క్షణం, దుఖం వెంబడిస్తూ ఉంటె కాలం నిదానం అంటే క్షణ మొక యుగం. 





82. బ్రహ్మ పగలు 1000 యుగములు కలదానిగాను, రాత్రి 1000 యుగాలు కలదానిగాను ఎవరు తెలుసు కుంటారో వారే అహో రాత్రములు ఎరిగినవారు. 




83. కృత, త్రేతా, ద్వాపర,కలియుగములు అను 4 కాల ప్రమాణమునకు దివ్య యుగమని పేరు. 




84. సంవత్సర కాలమానము దేవతలకు ఒక దినము, 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల, 360 సంవత్స రములు దేవతలకు ఒక దివ్య సంవత్సరము. ఇట్లే 12000 సంవత్సరములు ఒక దివ్య యుగము. 




85. భక్తి శ్రద్ధలతో నిరంతరము  భగవంతుని తలుస్తూ ఉండుట బుద్ధిమంతులు లక్షణం. 




86.  నిద్రలో మనము సంసార  లయమై పోయి మళ్ళీ జగత్ లో ఎలావస్తున్నామో,  బ్రహ్మ సృష్టి కూడా మళ్ళీ వ్యక్త మవుతుంది.    




87. ప్రాణులు ప్రళయంలో అవ్యక్తులై, కల్పంలో వేరువేరు దేహాలలో వ్యక్త మవుతారు. 




88. మనోబుద్ధులు, ఆశలు, ఆశయాలు, సంకల్పాలు మారుతాయి కానీ సీసాలు రంగు మారినా దానిలో ఉండే పాలు రంగు మారదు. 




89. మానవ జన్మలో మనిషిగా ఏ కర్మలు చేస్తున్నాడో, బుద్దిగా ఏమి ఆలోచిస్తున్నాడో, మనస్సులో ఏమి భావిస్తున్నాడో ఆ వాసనలు వెంబడిస్తాయి మరోజన్మకు .




90. ఆకలైనంత వరకే అన్నం తినగలుగుతాము , అట్లే కర్మ బంధాలు ఉన్నంత వరకే ప్రాణులు రావటం- పోవటం   జరుగుతుంది , అదే బ్రహ్మ సృష్టి, అందుకే భగవానుడు నిరంతరం భగవద్ ధ్యానంలో ఉంటే జననం అనేది ఉండదు .        

                             
91. మనం సుఖంగా ఉన్నా మంటే పూర్వం చేసిన పుణ్యం, దు:ఖంగా ఉన్నామంటే పూర్వం చేసిన పాపం, ఏది ఏమైనా ఈజన్మలో చేసిన పుణ్యం మరోజన్మ లేకుండా చేస్తుంది. 





92. ఈ జగతి అంటా మాయను కప్పి యుంటుంది. కానీ పరమాత్మ పారమార్ధిక సత్యం, ఇది త్రికాలాలో ఉంటుంది. 




93.  పరమాత్మముకు ఏ ఆశ్రయము అవసరంలేదు, స్వర్వత్రా ఇంద్రియ గోచరమై ఉంటుంది. 




94. మాయ అనేది అజ్ణానమ్ ఉన్నంత వరకే, అజ్ఞానం నశిస్తే అన్ని మాయం. 




95. సర్వభూతాలు నశించినా ఈ పరమాత్మ - అక్షర పరబ్రహ్మం నశించేది కాదు. సర్వలోకాలు, ఉన్న లేకున్నా ఇది ఉంటుంది. 




96. ఒక స్కూల్లో లెక్కల మాష్టర్ నల్లబల్లపై లెక్కలు చెపుతాడు, తర్వాత సైన్సు మాష్టర్ వచ్చి చిత్రం గీసి వివరిస్తాడు. నా తుడిచినా నల్ల బల్ల అట్లాగే ఉంటుంది. 




97. కష్టాలు నష్టాలు వచ్చిన మీ మీద పరమాత్మ దృష్టి ఎప్పటికీ మారదు. మీరు పరమాత్మను మరువకుండా చూసుకోవాలి . 




98. పునర్ జన్మ వద్దనుకున్నవారు, జన్మ రాహిత్యం సఫలం కావాలను కున్నవారు ఆ పరమాత్మనే ప్రార్ధించాలి. 




99. పరమాత్మే పరం ధామం, ఆ పరమాత్మే మన స్వస్థానం, అక్కడకు చెరీతే జన్మ అనేది లేదు. 




100. ఈ 14 లోకాలు బ్రహ్మాండం అంతా పరమాత్మలోనే ఉన్నది. ఆ పరమాత్మ చైతన్యమే మన జీవితం.       


111. అలలన్నీ సముద్రములో ఉన్నట్లుగా, ఆభరణాలన్ని బంగారంలో ఉన్నట్లుగా, స్వప్నలోకమంతా మేలుకున్న వాని మనసులో ఉన్నట్లుగా, ప్రాణులతో కూడిన బ్రహ్మాండ మంతా పరమాత్మలో ఉన్నది. 





112. పాలలో వెన్నలాగా, నువ్వుల్లో నూనెలగా మనుష్యుల్లో అంతర్గతంగా పరమాత్ముడే ఉన్నాడు . 




113. నిరంతర పరామత్మ చింతన వల్లనే దానివలన జ్ఞాన విచారణా శక్తి లభించి మోక్షం కలుగుతుది. 




114. ఋషులు, మహర్షులు, మహాత్ములు చెప్పిన బోధలను   గ్రహించి ఆచరించుటే నిజమైన జీవితం. 




115. జ్ఞానులు, ఆత్మజ్ఞానులు, జీవన్ముక్తులు జ్ఞాన విచారణ ద్వారా/వివరణ తెలియపరిచేవారు నరరూపములో ఉన్న నారాయణులు. 




116.  సమస్తకర్మలు జ్ఞానాగ్నిలో దగ్దమవుతాయి, వీరికి విధి నిషేధాలు ఉండవు, వారు చెప్పేది వేదం, వారు నడిచింది శాస్త్రం, వారు మునిగిందే గంగ, వారు ఉన్నదే కాశి. 





117. సగుణ బ్రహ్మొపాసన, ఓంకారోపాసన చేస్తూ, నిత్య నైతిక కర్మలు చేస్తూ, ఫలాపేక్ష, సంగభావం లేకుండా జీవభావంతో ఉన్నవారికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. 





118. దానధర్మాలు, యజ్ఞయాగాదులు, పరోపకారాలు, పూజాపురస్కారులు చేసేవారు ఫలాపేక్షతో చేస్తే పితృ లోకానికి చేరు కుంటారు. 





119. పితృలోకంలో సుఖం తర్వాత మరలా జన్మ ఎత్తేందు కు భూలోకానికి వస్తారు.





120. కొందరికి కడుపే కైలాసం, పరోపకారం, దయ, కరుణ అంటే ఏమిటో వీరికి తెలియదు, వీరు నర రూపంలో ఉండే మృగాలు వీరు చనిపోగానే ఇక్కడే మారో దేహాన్ని పట్టు కుంటారు . 

                                           
121. జ్ఞానాన్ని బట్టి, చేసిన కృషిని బట్టి, సంస్కారాలు కోరికలు అభిరుచులు, ఉంటాయి.

122. కాలం అనగా అంత్యకాలం అనే ఒక అర్ధం ఉన్నది, మరియొకటి మార్గం అని కూడా ఉన్నది. ఉన్న మార్గాన్ని తెలుసుకొని మనిషి ఎదగాలి అని తెలియపరిచారు. 





123. మొదటి మార్గం అగ్ని, వెలుగు అందించి దహించే గుణము ఉన్నది, మనలో ఉన్న వేడిని తగ్గిన్చుకొని, చల్లని తెల్లని మంచులా వెలుగు అందించాలి. 





124. అగ్ని అంటే అగ్ని అభిమాన దేవత, పగలు అనే పగలు అభిమాన దేవత, శుక్లపక్షం అనే శుక్లపక్ష అభిమాన దేవత, ఉత్తరాలయిన అంటే ఉత్తరాయణ దేవత, సహకరిస్తూ, ప్రాణాన్ని బ్రహ్మలోకానికి ముందు చేరుస్తారు, ఈ దేవతలు ఒక చోట నుండి మరియొక చోటుకు ప్రాణాల్ని మారుస్తారు. 

125. ప్రాధాని వస్తున్నారంటే వార్త అంచలంచలుగా అధికారులు ఏం చేయాలో అలోచించి మరీ చేస్తారు,  అట్లాగే చేసిన ఖ్ర్మలు బట్టి దేవతలు సహకరిస్తారు.

126. ఆత్మజ్ఞానమ్ కోసం ప్రయత్ని౦చే వారు, త్యాగశీలు రైనవారు సర్వసుఖాలు అనుభవించి మరలా పుడతారు, కారణం ఫలాపేక్షతో చేసినారు గనుక. 

127.  జీవుడు మరలా మేఘమండలములోని వర్షపు బిందువుని అంటి పెట్టుకొని ఉంటాడు. వర్షముద్వారా భూమికి చేరి విత్తనంలో చేరుతాడు. 

128. ఏ దంపతులు ఆ వరి కంకులను వండు కొని తింటారో.   పురుషుడే భుజించిన దానిలో జీవుడు చేరి, వీర్యముగా మారి స్త్రీ గర్భంలో చేరుట యే వారి కర్మాను సారం పుట్టుక జరుగుతుంది. 

129. స్త్రీ గర్భంలో 9 నెలలు ఉండి వివిధ దశలలో శరీరము ఏర్పడి శిశువుగా జన్మించటం  జరుగుతుంది.              .               


130. దైవఘటన వళ్ళ ఏ అన్నం ఎవరి ప్రాప్తియో వారికే చేరుతుంది. ఏ స్త్రీ పురుషులు భార్య భర్తలు అవుతారో ఎవ్వరు గమనించలేరు. 


అక్షర పరబ్రహ్మ యోగం - అంతర్గత సూక్తులు 
రచయత :మల్లాప్రగడ రామకృష్ణ 



131. నోటిదగ్గర పెట్టుకున్న ముద్ద నోటిలోకి పోతుందో లేదో తెలుసుకో లేరు, పెళ్లైన మాత్రాన పిల్లలు పుడతారని నమ్మకము లేదు, కన్న పిల్లలే తల్లి తండ్రులను ఆదుకుంటారని నమ్మకము లేదు. 


132. రాష్ట్ర విభజన జరుగుతుందని ఎవరికీ తెలియదు, నేను డిప్యూటీ డైరక్టరుగా (ఇంచార్జి) చేసి  మరలా 58 సంవత్సరాలు నిండి, మరలా మోడల్ స్కూల్ అకౌంట్స్  ఆఫీసర్ గా రావటము కూడా దైవ సంకల్పమే అను కుంటున్నాను.

133. సాధకున్నీ చేసే లక్ష్యాన్ని బట్టి ఒకటి శుక్లగతియని, మరొక దానిని కృష్ణ గతి యని అన్నారు. కృష్ణ  అనగా నలుపు చీకటి, శుక్లమ్ అనగా తెలుపు అదే వెలుగు. అందుకే నేను ఎప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుతాను.   

134. వెలుగుతో సాధకున్నీ ఉన్నత స్థానానికి చేరుస్తుంది. చీకటిలో సంసారం జనన మరణ చక్రములో ఇరికిస్తుంది. 

        

135. మొదటిది ముక్తిని కలిగించే మార్గం, రెండవది రెండవది భందములో ఇరికించే మార్గం రెండుమార్గాలలో ప్రయాణించటమే మానవ జీవితం. 


136. కేవలము భవబంధాలను తెంచుకొని వెలుగుని ఆరాధించి ముక్తి పొందిన వారికి పునర్ జన్మ ఉండదు. సీకటిలో భవబంధాలలో చిక్కి ధర్మశాస్రాలను బోధించినవారు, న్యాయ మార్గాన నడిచిన వారు,  సత్యాన్ని అనుకరించిన వారు  సత్య లోకానికి చేరుకోగలరు.        

               
137. మంచి చేదు, చీకటి వెలుగు, విషం అమృతం మీకు అందుబాటులో ఉంచారు  మరువకుండా నావు సాధకుడుగా నిత్య ప్రయత్నంలో నీవు దేనిలో సుఖము ఉన్నదో దాన్ని గ్రహించు లేదా మాయ నిన్ను కప్పి వేస్తుంది .

138. ఓంకారోపాసన, సగుణోపాసన, నిరంతరం పరమాత్మ స్మారణ దీనికి చదువుగాని, అంగబలం కానీ, అర్ధ బలము కానీ గొప్ప తెలివి అవసరము లేదు. 

139.    శాస్త్రం పట్ల, గురువు పట్ల విశ్వాసం అత్యున్న స్థానం పొందాలని పట్టుదల ఉంటె చాలు . 

140. సమయాన్ని బట్టి, అవకాశము బట్టి, దాన్ధధర్మాలు చేయాలి. అపార్ధం చేసుకోకుండా స్వార్ధం విడనాడి త్యాగం తో తనకున్నదానిలో పరమాత్ముని తలుస్తూ ఇతరులకు సహాయపడుటయే నిజమైన మోక్ష మార్గం అని గమనించగలరు. 

ఓంకారాన్ని ఉచ్చరిస్తూ అర్ధభావాన్నిధ్యానిస్తూ, జీవుడికి ఆధారమైన పరమాత్మను ధ్యానిస్తూ ,  వదలిన యోగి అక్షరుడైన పరబ్రహ్మాన్ని చేరుకొనే ఉపాయాన్ని తెలిపిన  
అక్షర పరబ్రహ్మ యోగ నామ ఆశ్డమోధ్యాయః సమాప్తము       
ఎందరో మహానుభావులు అందరికి వందనములు, ఆ పరమాత్ముని  కృపకు  ప్రతి ఒక్కరు పాత్రులే 
          
                                     . 

1, ఫిబ్రవరి 2018, గురువారం

భగవద్గీత - 8 వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగం

  మీ సందేశం పంపబడలేదు ఎందుకంటే ఇది ఫేస్బుక్లోని ఇతర వ్యక్తులు అసంబద్ధం అని నివేదించిన కంటెంట్ను కలిగి ఉంది. 15-02-2018
అన్నారు ఎందుకు నా కష్టర్జితాన్ని ప్రజల ముందు ఉంచకూడదా దయచేసి నా రచనలకు అనుమతి ఇవ్వండి. నావి తప్పుగా ఎమన్నా పొందు పరిచితే తొలగించండి.
6 సంవస్చరాల నుండి భగవద్ గీతను వ్ద్రాసున్న ఎందుకు తొలగించాలని అనుకుంటున్నారు ఒక రచయతగా అడుగుతున్నా , ఇప్పడికి ఇది 5 వసారి
ప్రాంజలి ప్రభగా మీకిష్టం లేకపోతె మీరేం చేయాలోచేప్పండి నాకు గ్రూపులు లేవు
ఆ ప్రాంజలి ప్రభను అనుమతించండి
అసబ్యకరమైనవి, నావి కానివి తొలగించండి
నాకు నా రచనలకు అనుమతివ్వకుండా ఆపుట ఎందుకు , నాకు సమదానము చెప్పగలరు
ఇట్లు మీ మల్లా ప్రగడ రామకృష్ణ
ప్రాంజలి ప్రభను ఆదరించేవారికి క్షమాపణలు తెలుగుపుతున్నాను
తెలుగును బ్రతికించండి, ఆత్మగౌరవం మన జనం హక్కు

ఓం శ్రీ రామ్ శ్రీ మాత్రేనమ:- శ్రీ కృష్ణాయనమ:
 
భగవద్గీత - 8 వ అధ్యాయము 
అక్షర పరబ్రహ్మ యోగం - అంతర్గత సూక్తులు (8/10) 

1. ప్రాపంచిక  వ్యామోహంలో చిక్కిన వారికి దూరంగా, గురువు, తల్లి తండ్రుల అనుగ్రహము ఉన్నవారికి దగ్గరగా భగవంతుడు ఉంటాడు ఎందుకు?.

2. అసత్యాన్ని సత్యమని, అనిత్యాన్ని నిత్యమని, అనాత్మను ఆత్మని పొరబడుతున్నాడు, కలవరి స్తున్నాడు, అజ్ఞానము కమ్ముకున్న నిద్రలో మునిగి పోతున్నాడు. మానవుడు ఎందుకు? 

3. కలియుగంలో  తప్పించు కొనుటకు పరిగెడుతున్నాడు, గోతిలో పడి, బుసలు కొట్టే సర్పానికి చిక్కి, భయంతో వణికి పోతున్నాడు ఎందుకు?.  
    
4.పురాణాలలో ప్రకృతిని బ్రహ్మ అంటారు, వేదాన్ని బ్రహ్మ అంటారు, విధాతను బ్రహ్మ అంటారు, ప్రణవాన్ని బ్రహ్మ అంటారు, యజ్ఞాన్ని బ్రహ్మ అంటారు. అసలు బ్రహ్మ గుర్తించి తెలుసు కోవాలని తాపత్రయంతో బ్రతుకుతాడు ఎందుకు?   

5. ఆది +ఆత్మ = ఆధ్యాత్మ, ఆత్మకన్నా అధికమైనదా ? ఆత్మ అంటే దేహము అని కూడా కదా? దేహం కన్నా అధికమైన ఇంద్రియాలు, మనస్సు, బుద్ది ఇవి అన్నీ ఆధ్యాత్మమ్ కాదా? ఆధ్యాత్మమ్, ఉపాధికి సంబంధించిందా, చైతన్యానికి సంబంధించిందా , మరి ఆధ్యాత్మిక ఎందుకు ?

6. కర్మ అంటే నిత్య, నైమిత్తిక,  కామ్య, నిషిద్ధ, ప్రాయశ్చిత్త మేనా, లేదా యజ్ఞ  యాగాదులు, దానధర్మాలు, పూజా పురస్కారాలా, మరివీటినే   పనులే అంటారు, మరికొందరు భగవంతుని సృష్టి అన్నారు,  అసలు అర్ధం ఏమిటి ?
     
7. పంచ భూతాలు ఆదిభూతాల్లా మరొకటి ఏదైనా ఆది భూతము ఉన్నదా ?

8. నాలుగు వేదాలకు అది దైవాలు ఉన్నారు, ఒక్కొక్క ఇంద్రియానికి  ఒక్కొక్క ఆది దేవత  ఉన్నది, జగత్ అంతా దేవతల  మయ మైనది, అసలు అది దైవం అంటే ఎవరు ? 

9. ఆదియజ్ఞు డెవరు ?  కర్మలు చేసే వాడా, చూస్తూ ఉండే వాడా, మనలోపల ఉండే వాడా, వెలుపల ఉండే వాడా, దూరంగా ఉండే వాడా, దగ్గరగా ఉండే వాడా ? 

10. అంత్యకాళం లో  పరమాత్ముని స్మరించే మార్గం, దర్శనం చేసుకొనే మార్గం, ఎవరికైనా సాధ్యమవుతుందా అనే  ప్రశ్నలతో మనస్సు చికాకు పరుస్తుంది ఎందుకు ? 

పై ప్రశ్నలకు జవాబులు రేపటి భగవద్ గీత లో చదవండి, భగవంతుడు తెలిపినవే తెలుపుటకు ప్రయత్నిస్తాను. 

11. స్తూల ప్రపంచానికి ఆది దేవత విరాట్పురుషుడు అతడికి స్థూల ప్రపంచం. స్తూల దేహం గురించే తెలుస్తుంది.  

12. సూక్ష్మ ప్రపంచానికి ఆది దేవత, హిరణ్య గర్భుడు సూక్ష్మ దేహం గురించే తెలుస్తుంది. 

13. స్థూల, సూక్ష్మ, ప్రపంచాలకు అధి దేవత పురుషోత్తముడు, అతడే పూర్ణ పురుషుడు, సర్వజ్ఞుడు. 

14. "బ్రహ్మ అనగా అక్షరం " సృష్టింప బడనిది కనుక నశింపు లేనిది, అన్ని కాలములలో ఉండేది, కనుక పరమాత్మే అక్షర బ్రహ్మ. 

15. దృశ్యమాన ప్రపంచానికి మూలమై, ఆధారమై, కారణమై, ఉన్న స్థిరమైన ఆత్మ, తత్వమే,  బ్రహ్మం. 

16. దేహ మనో బుద్దులను ప్రకాశింప  చేస్తున్నది, చైతన్య రూప ఆత్మయే బ్రహ్మము యొక్క లక్షణం. 

17. భూ తన్మాత్ర, జల తన్మాత్ర, అగ్ని తన్మాత్ర, వాయు తన్మాత్ర, ఆకాశ తన్మాత్ర అన్నీ లయమే పరమాత్మా, పంచ తన్మాత్రలకు పరమాత్మే బ్రహ్మ. 

18.     తెలివిగలవారు, తెలివి తక్కువ వారు, పెద్ద వారు, చిన్నవారు, ఆడవారు, మొగవారు అందరు ఒకచోట చేరినప్పుడు ఒకగురువు అడిగిన ప్రశ్న "మీలో ఇప్పుడు ఎవరు చనిపోతారు" అని అడుగగా అందరు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. 

19. పనివుందని ఒకరు, పొయ్యే రోజు వస్తే అందరూ  పొయ్యే వారమని అనేవారు ఒకరు, ఇలా చెపుతూ పోతూ ఒక్కరు అక్కడ ఉండలేదు. ఎందుకంటే చావు అంటే  అందరికి భయమే. ఎవ్వరూ స్వశ్చముగా ఆహ్వానించ కూడదు అదేనీతి. 

20.  భగవంతుని స్వభావమైన సత్ అనే లక్షణం, ఎప్పుడూ ఉండాలని కోరిక, అదే ఆత్మ స్వభావం, భగవంతుని స్వ భావం, అదే జీవికి ఆధ్యాత్మికం. 



21. విత్తనం తన స్వరూపాన్ని త్యాగంచేసి వృక్ష మవుతుంది. 

22. పరమాత్మ తన స్వరూపాన్ని త్యాగం చేసి బహు రూపాల ప్రాణ కోటిని సృష్టించింది 

23. ప్రవాహంలా జగన్నాధ చక్రం సాగుతూనే ఉంటుంది. ఈశ్వరుని సంకల్ప రూపమే కర్మ. 

24. ఇంద్రియాలు, ఆలోచనలు, కోపములు, ఉద్రేకాలు, 
తలంపులు, వాసనలు, కర్మ ఫలాలు పుట్టి నశించేవి వీటిని ఆది భూతాలంటారు. 

25. జన్మ జరా మరణముల నుండి విముక్తి పొందినవారు ఆదిభూతాలకు చిక్కనివారు. 

26. పురుషుడే ఆది దైవము అంటున్నాడు భగవానుడు ఇతడే విశ్వ రూపుడు, సర్వదేవతా మయుడు. 

27.   ఆది యజ్నుడంటే ఫలభోక్త. మహేశ్వరుడు. మనదేహం లో ఉన్న పరమాత్మను మనం గ్రహించ లేక పోతున్నాము.             

28. అంత్య కాలంలో ఎవరు నన్నే తలుస్తూ  కళేబరాన్ని వదిలి ప్రయానిస్తారో అతడు నాభావాన్ని పొందుతాడు. 

29.    మనలో కోరికలు తీరేవరకు నేను నేనే, అనుకుంటూ దేహాన్ని వదలి కర్మ ఫలం అనుసరించి మరోదేహం చేరుతాం. 

30. మనం నిత్యం భగవంతుని ధ్యానం లోనే ఉండాలి, భీష్ముడు ములుకుల ఆంప శయ్యపై ఉండి, శాంతి పర్వం చెప్పగలిగాడు, శాంతాకారం భుజగ సయణం అన్నారు పడుకున్నది పాము పడగ నిత్య ద్యానం పరమాత్మునికి తప్పలేదు.      

31.మరణించే ప్రతి ఒక్కడు భగవత్ స్మరణ, భగవత్ భక్తి తో జన్మ సార్ధకం చేసు కుంటే నాలో ఐక్యమవుతారు అని చెప్పారు భగవంతుడు. 

32. ఈరోజు వచ్చే వార్త రేపటికి పనికిరాదు, కొన్ని వేల సంవత్సరాల నుండి ఉన్న గీత మరచి క్షణికావేశం తెప్పిచ్చే పేపరు చుట్టూ ఉంటారు ఎందుకు?
           
33. రాత్రి నిద్రపోయే ముందు తెల్లవారు జామున ఇది చేద్దామను కుంటే ఖచ్చితంగా మెలుకు వస్తుంది. సంకల్ప సిద్ధి పొంద గలుగుతారు. 

34. అదే విధముగా ప్రతి రోజూ కొన్ని మంచి విషయాలు నేర్చు కుంటూ ఉంటే అవసరానికి ఉపయోగ పడతాయి.

35. నిరంతరం నీవు దేనిని స్మరిస్తూ ఉంటావో ఆభావమే నీలో సంస్కారముగా మిగిలిపోతుంది . 
   
36. భ్రమరం కీటకాన్ని తెచ్చి మట్టి గూటిలో పెడుతుంది, దానికి చిన్న రంద్రం చేస్తుంది దాని చుట్టూ జుంకారం చేస్తూ తిరుగుతుంది. బయటకు రాలేక లోపల కీటకం తిరిగి తిరిగి భ్రమరంగా మారుతుంది. 

37. మహాదేవుని స్మరిస్తూ స్మరిస్తూ నందీశ్వరుడు ఆజన్మలోనే శివుని పొందినట్లు శివపురాణం చెపుతున్నది. 

38. జీవుడు తన వైనవి తెచ్చు కొనేది కర్మము-ధర్మము మాత్రమే,  మరణం మంగళ ప్రదం చేసుకోవాలి . 

39. కుంతి   పరమ భక్తురాలు జీవిత మంతా కృష్ణుని పార్ధిస్తూనే ఉంది. కనుక కుంతీ కుమారా అనిపించు కోవడం మంచిదని భగవంతుడే తెలియపరిచాడు. 

40. అందుకే తల్లిని బట్టి బిడ్డలకు సంస్కారము, తండ్రిని బట్టి ధైర్యము, విశ్వాసము, ఓర్పు నేర్పు ఉంటుందని భగవంతుడే తెలియపరిచాడు.            

41. గోపికలు కామంతో, శిసుపాలుడు, హిరణ్యకశిపుడు, శత్రుత్వంతో, కంసుడు భయంతో, యాదవులు బాంధ  వ్యంతో,  పాండవులు ప్రేమతో, మానవులు భక్తితో భగవంతుని ధ్యానించి జీవితాన్ని ధన్య పరుచు కుంటున్నారు. 

42. హృదయ క్షేత్రంలో కర్తవ్య కర్మలు నింతరం వెంబడి స్తూ ఉన్నప్పుడు శాంతి కలుగుటకు భగవంతిడ్ని ధ్యానించాలి. 

43. వ్యాపారి పోటీ సామ్రాజ్యాన్ని ఎలా ఎదుర్కొవాలో ఆలోచిస్తాడు, డాక్టర్ ప్రాణాన్ని ఎలా బ్రతికించాలో ఆలోచిస్తాడు, కాముకుడు ఎప్పుడు ప్రేమను పొందాలని ప్రయత్నిస్తాడు.   

44. పనికి పని, స్మరణకు స్మరణ చేస్తూవుంటే మన:శాంతి  కల్పిస్తానని భగవంతుడే తెలియ పరిచాడు. 

45. దేవునికి పూలు పండ్లు, నీవికాదు, చెట్టుని గిల్లి తెచ్చినవి, సమర్పించుటే కాదు, నీకున్న  మనోబుద్దులు వదిలించు కోవాలి. 

46. నీవు ఉద్యోగం చేస్తున్నంత వరకు కార్యదక్షుడవై ఉండాలి, దేవుని సేవా కార్యక్రమములో పాల్గొని ప్రజల్ని కాపాడాలి . 

47. మనస్సు అభ్యాసమనే ఉపాయాన్ని ఆశ్రయించాలి, చిత్తం ఇతర విషయాలపై పోకుండా పరమాత్మ గురించి చింతించాలి. 

48. అభ్యాసము వల్లనే భారత దేశానికి పతకాలు తెస్తున్నారు, అభ్యాసము వల్లనే పరోక్ష సైనికులను ఎదుర్కొంటున్నారు, అభ్యాసము వల్లనే రక్షక దళాలు ప్రజలకు రక్షణ కల్పిసున్నారు. అట్లే అభ్యాసంతో కొలవండి. 

49. మనస్సు  వ్యామోహాలకు చిక్క కుండా, నిర్నీత సమయాన్ని కేటాయించుకొని అభ్యాసముతో భగవంతుని ప్రార్ధించాలి. 

50. గురువు యొక్క ఉపదేశా ననుసరించి పరధ్యాస చెంద కుండా, భగవత్ స్మరణ అలవాటుగా మార్చు కుంటే మరణం ముందు కూడా ప్రార్ధించగలుగుతారు.   

51. సూర్యుని చుట్టు గృహాలు, గ్రహాలు చుట్టూ ఉపగ్రహాలు తిరిగినట్లు, అంత రిక్షంలో సమస్త గ్రహాలు ఆధారం  లేకుండా ఉన్నట్లు,  భగవంతుడు మనలో ఉంటాడు. 

52. ఒక మనిషి గుమ్మడి తీగ క్రింద కూర్చొని దేవుడికి బుర్రలేదు,  అంటూ          ఎందు కంటే పెద్ద మర్రి చెట్టుకు చిన్న పండు, చిన్న తీగకు పెద్ద పండు అనగా ఒక ఎలుక గుమ్మడి  కొరికింది, అది జారి తలపై పడింది అంతే. 

53. మనల్ని ఎవరు చూడటం  లేదని అనుకోవటం తప్పు, మనకన్నా ముందు నుంచి ఉన్నవాడు ముసలివాడు కాదు, సర్వజ్ఞుడు.  మనమే దేవుని లీలలు తెలుసుకో లేని  ముసలివాళ్ళం.  

54. దేహేంద్ర మనోబుద్దులు వికసించిన అదుపులో ఉంచుకొన్న అది కుడా దేవుని ప్రతిభ అని గమనించాలి. 

55. ఆకాశానికి శబ్ద గుణం ఉన్నది కానీ కనిపించదు, అట్లాగే మనలో అనేక గుణాలు ఉన్నాయి అవి ఎప్పుడు ప్రభావితము ఆవుతాయో భగవంతునికి తప్ప ఎవ్వరికీ తెలియదు. 

56. దేహానికి భూమి ఆధారం, భూమికి జాలం ఆధారం, జలానికి అగ్ని ఆధారం, అగ్నికి వాయువు ఆధారం, వాయువుకు ఆకాశం ఆధారం, ఆకాశానికి పరమాత్ముడే ఆధారం. 

57. ప్రతి వస్తువుకు ఒక గుణం, రూపం, పదార్ధం ఉంటుంది అది మనస్సు ద్వారా గుర్తించ గలం. మనస్సును ఏర్పరిచింది భగవంతుడని గ్రహించాలి. 

58. మనసుతో కలిగి ఉన్న ఆత్మ రూపం మంచి చెడు, పుణ్యం పాపం, కీర్తి , అపకీర్తి , ధర్మం, అధర్మం, సార్ధం నిస్వార్ధం హెచ్చరిస్తూ తెలియ పరుస్తుంది అదే భగవంతుని లీల. 

59. పరమాత్మకు రంగు లేదు కానీ ఆదిత్య వర్ణుడు అంటారు.  సకల ప్రాణులలో వెలుగుని నింపేవాడు. 

60. సూర్యుడు చీకటిని చూపలేడు, కానీ పరమాత్మ చీకటిని అజ్ఞానాన్నీ చూపగలడు భగవంతుడు చీకట్లకు అతీత మైనవాడు. ప్రార్ధించితే వెలుగులు నింపువాడు.            
        
 నాకు డైరెక్టుగా నా బ్లాగుల్లో వ్రాసినవి పేస్ బుక్కు వారు అనుమతించుటలేదు. అనుకున్న ప్రకారముగా 5 రోజులు ఆగాను ఫలితము కనిపించలేదు. ఆ భగవంతుడే అధికారుల మనస్సు  మార్చగలరని ఊహిస్తున్నాను. (నా 11 బ్లాగుల్లో ఉన్నవి మీకు అందించుటకు వప్పుకోవటం లేదు,) అయినా  నేను కొత్తవి  పేస్ బుక్కులో పెట్టలేను), భగవద్ గీత సూక్తులు ఇక రోజు పోస్టు చేస్తాను. చదివి మీ  చెప్పఁగలరు.