27, జూన్ 2013, గురువారం

64. జ్ఞాణామృతం-1

01-07-2013
జ్ఞాణామృతం
           గౌరవనీయులైన పెద్దలకు, ఎందరో మహాను భావులకు, ప్రతి ఒక్కరికి నా వందనములు.  నేను 01-06-2013 నాటి నుండి నేటి వరకు "దిగంబర రహస్యాలు"  (1 నుంచి 6 భాగాలు)అని, కొన్ని సంసారమునకు సంభందించిన భావ కవితలు వ్రాయటము జరిగినది.  అ
వి చదివినవారు సంతోషం  వ్యక్తము చేయుటతో,  ఇంకా జ్ఞానాన్ని అందించాలని ఉద్దేశ్యముతో దర్మము తప్పకుండా నేను చదివినవి, పత్రికలలో ముద్రించినవి, ఋషులు, మునులు, పండితులు, మేధావులు, కవులు,సకల వేదాలు  మనకందిమ్చినవాటి ఆధారముగా నేను జ్ఞానామృతము వ్రాయుటకు సాహసించు చున్నాను, అందరికి  మరొక్కసారి ధన్యవాదాలు.  నా ఆలోచన ప్రకారముగా, సులభముగా అందరికి అర్ధమగు "తేట తెలుగు" భాషలో (తెలుగుభాషను మరువద్దు, మాత్రుమూర్తిని మరువద్దు, మాతృదేశాన్ని మరువద్దు, మనం ప్రార్ధించే ఆరాధ్య మూర్తిలను మరువద్దు) మీకు అమ్దరికీ తెలిసినవి "ఐన" రోజుకు ఒక్కసారి ఇంటర్నెట్ ద్వారా తెలిపే జ్ఞాన గుళికలు చదువుతూ ఆరోగ్యముగా, ఆనందముగా, ఆహ్లాదముగా ఉండాలని ఆశయంతో నేను 01-07-2013 నాటి నండి ప్రతిరోజూ ముద్రనద్వారా (గూగల్  యాజమాన్యం ఇన్ పుట్ సాధనాలద్వారా ) మీకు అమ్దిస్తున్నాను.  తప్పులు దొర్లిన నాకు తెలియపరిస్తే నేను సరి దిద్దుకోగలను) మీరు  చెప్పే  విధముగా నా రచనలు మార్చు కోగలను .

             నేను 03--11--2012 నుండి మొదటగా ఆంద్రుల ఆరాధ్యా  దైవమైన శ్రీ వేంకటేశ్వరుని ప్రార్ధిస్తూ భావ కవితలు వ్రాయుట ప్రారంభించాను 30-06-2013 వరకు 63 భాగాలుగా వివిధ రచనలను ఇందు పొందు పరిచాను.
              నేను వ్రాసే ఈ "జ్ఞా
ణామృతం"  చదివినవారి మనసు ప్రశాంతముగా ఉండాలని నేను ఆరాధించే  "శ్రీ సీతా రామ భాక్తాంజనేయునకు " ప్రాంజలి ఘటిస్తూ వ్రాస్తున్నాను.
 

విజ్ఞాకాక్షేపం

1. భక్తి కి మార్గాలు
2.  సూర్య కిరణాలు .
3. దీపారాధన మహిమ 
1. భక్తి కి మార్గాలు

       మానవులు జీవించుటకు అన్నిప్రాణుల పట్ల సమ ప్రేమభావం, అహంకారము వదలి మమకారముతో సద్బావం, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించే  స్వభావం ఉండాలి , సంతృప్తి , ఆత్మనిగ్రహము,దృడ నిత్యయముతో ఉన్నవారికి పెరుగును  భక్తి  భావం

        1.  " భాగావంతునిపై  మనకు గల అంకిత భావమే భక్తి "          
            అన్నారు వ్యాస మహర్షి 

      2.  " నేను అనే అహాన్ని వదలి అంతా భగవంతుడే అన్న భావమే 

           భక్తి " అన్నారు శాండిల్యముని.         
                
      3.  " సమస్తం ఆ సర్వేశ్వరునికి  అర్పించడం అనేది భక్తి "  అన్నారు 

            నారద మహర్షి
      4.  " ధ్యానం ద్వారా మోక్షం, భక్తి  భావం పెరుగును " అన్నారు 

           ఆది శంకరాచార్యులు 


            భగవద్గీతలో  శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చన, వందనం, ధ్యానం, శక్యం, ఆత్మనివేదనం, అంటూ తొమ్మిది భక్తీ మార్గాలు.
      పరమాత్మ సాక్షా త్కారానికి భక్తులు భక్తి మార్గాన్ని ఎన్నుకుంటారు
.
        


           1.  వేదా ధ్యయనం చేసిన పండితులు, జ్ఞానులు పరబ్రహ్మము 
                 ను  ఉపాసించడమే " పర భక్తి".
            2.  ఇష్ట దేవతలను ఉపాసించడం " అపర భక్తి " .
            3.  యాత్రలు చేసి, దేవతా స్వరూపాలను ఆరాధించటం " భయ 
                 భక్తి "
            4.  ఇష్ట దేవుని ప్రతిరూపాన్ని ఆరాధించడం " అన్వయ భక్తి "
            5.  ఎల్లాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా దేవుని ప్రేమించడం  
                 "ఏకాంత భక్తి "
            6.  ఎల్లాంటి ఉద్వేగాలకు పోకుండా ప్రశాంతమైన ప్రార్ధన  " 
                 శాంత భావ భక్తి "
            7.  నేను నీకు దాసుడను అనే  చేసే ప్రార్ధనను  " దాస్య  
                       భావ భక్తి "
            8.  దేవుణ్ణి ప్రియమిత్రునిగా భావించి చేసే  ప్రార్ధనను  " సఖ్య  
                 భావ భక్తి "
            9.  భక్తులు భగవంతున్ని బిడ్డలుగా భావించి చేసే  ప్రార్ధనను  " 
                  వాత్సల్య   భావ భక్తి "
           10.  భర్తే దేవునిగా భావించి  చేసే  ప్రార్ధనను  " కాంత  భావ భక్తి "
            11.  మనస్సును పూర్తిగా అర్పించి చేసే  ప్రార్ధనను  " మాధుర్య  
                  భావ భక్తి "
            12.  భగవన్నామస్మరణను నిరంతరం ఒక పద్దతి ప్రకారం 
                  చేయడం" అబ్యాస భక్తి"
            13.  మంచి చెడులు వ్యత్యాసాలను గమనించి చేసే  ప్రార్ధనను  
                  "వివేక భక్తి"
            14.  భగవంతుని దూషింస్తూ చేసే స్మరణను " విముఖ భక్తి "
            15.  ఎల్లప్పుడూ సత్యమార్గాన్న చేసే ప్రార్ధనను " సత్య  భక్తి "
            16.  దేవుని కళ్యాణాలు చేస్తూ ప్రర్దిమ్చడమే  " కల్యాణ భక్తి "
            17.  ప్రాణుల పట్ల అహింసను ప్రదర్సిస్తూ పరమను చూపే 
                   భక్తిని " అహింస భక్తి " 
            18.  సమాజానికి  చేతనైనంత దానం చేయటమే "దాన భక్తి "
             

             ప్రతి ఒక్కరు భక్తి  మార్గములో నడుస్తూ సమాజానికి, దేశానికి భారం కాకుండ, మనుష్యులు  " బ్రతికి- బ్రతికించుకుంటు" జీవించడమే  " నిజమైన భక్తి "

                                     "  సేకరణ ఋషులు చూపిన  భ
క్తి మార్గాలు "
02-07-2013 

2. సూర్య కిరణాలు         సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిమ్చు చున్నాడు, కాలం తప్పకుండా కలియుగంలో ప్రతిఒక్కరికి ఆనందముగా ఉండే విధముగా వెలుగును పశరిస్తూ లోక సంచార జీవిగా ఉన్నాడు.  అందరికి ప్రత్యక్ష దైవము సూర్య భగవానుడు, ఉదయముననే లేచి సూర్యాసనములు వేసి, ప్రార్ధించటం తెలుగు వారి నిత్య అలవాట్లులో ఒకటి.  " ప్రాణాయామాని యోగ సాధనల ద్వారా,
మనోనిగ్రహం ద్వారా, వేదశాస్త్రాలలో చెప్పిన విధముగా కర్మలనే ప్రమాణంగా తీసుకోని వాటి నాచరిం చడం ద్వారా మానవులకు జ్ఞానామృతం సిద్దిస్తుంది".  " ప్రాణము, మనస్సు, వాక్కు " అనే మూడింటిని  ఆత్మా జ్ఞాన సాధనకు భగవంతుడు మనకు అందించాడు. సత్యం, ధర్మం,న్యాయం,
ద్వారా మనస్సును నిగ్రహిమ్చుకుంటూ ప్రార్ధన చేయాలి.    

ఆదిత్య హృదయము సూర్యదెవతాకమైన స్తోత్రముగా ప్రసిద్ధి పొమ్దిది.  శ్రీ మద్రామాయణ యుద్ధకాండ మున - రావణ వధమునకు సంసిద్దుడవుచున్న శ్రీ రామచంద్రునికి అగస్య మహాముని ఈ స్తోత్రమును భోదిమ్చినట్లుగ ప్రతీతి.  దీనిని పఠించినవారికి అయురారోగ్యాభివృద్ధి, శత్రునాశనము జరుగునని విస్వాశము.    
  
             ఇది పావనమైనది, సకల శత్రు నాశకమైనది, జయమును కలిగించునది అక్ష ఫలమును ఇచ్చునది, సర్వ మంగళ ప్రదమైనది, సమస్త పాపములను పోగొట్టునది, దీర్ఘాయువును కలుగ చేయునది, చింతా శోకములు నివారిమ్చునది, ఉత్తమోత్తమా మైనది. దీనిని జపించ వలెను. 
             సూర్యుడు లేనిదే మనకు వెలుగు లేదు. 
         1.  సూర్యుడు ద్రవ్యరాశి 99.86 శాతము అంటే సుమారు 20 లక్షల 

              ట్రిలియన్ కిలోలు
         2.  ఒక ట్రిలియన్ అంటే ఒకటి ప్రక్క 12 సున్నాలు
         3.  సూర్యుడు ఉపరితలముపై ఉష్ణోగ్రత 5,500 డిగ్రీల సెల్సియస్.  
         4. సూర్యుడి అంతర్భాగంలో ఉండే ఉష్ణోగ్రత 1,36,00,000 డిగ్రీల 

              సెల్సియస్.
             5. భూమినుంచి సూర్యుడి సగటు దూరం 15 కోట్ల కిలోమీటర్లు
         6.  సూర్య కాంతి  భూమిని చేరటానికి పట్టె  సమయం 8.3 

                   నిముషాలు
         7.   సూర్యుడు ప్రతి సెకనుకు 50 లక్షల టన్నులు బరువును 

                  కోల్పోవును
             8.  సూర్యుడి చుట్టు కొలత 13,92,000 కిలోమీటర్లు.
             9.  ఇది భూమి వ్యాసముకన్న 110 రెట్లు ఎక్కువ
            10.  సూర్యుడి వయస్సు 400 కోట్ల సంవత్సరములు
            11.  సూర్యుడు తనచుట్టూ  తాను 27 రోజుల్లో తిరుగుతాడు
            12.   కాంతి దశలో "O2 " ఏ ర్పాడు ద్రవ్య ఉత్పన్నం
            13.    కాంతి తీవ్రత పెరిగేకొద్దీ బష్పోత్సేక వేగం పెరుగును
            14.    తక్కువ కాంతిలో పెరిగే మొక్కలను "సయోఫిట్లు " 

                     అమ్దురు.
            15.    సూర్యకామ్తి ఉండే వైపు పెరిగే మొక్కను హీలియోఫైట్ లు 

                    అందురు
            16.    భాష్పోత్సేకం ఎక్కువ ఉష్ణోగ్రత తక్కువ ఆర్ధతలో 

                     ఉండును.
            17.    కిరణ  జన్య సంయోగక్రియ తెలుపు వర్ణ కాంతిలో వేగంగా 

                     జరుగును
            18.    కాంతి శాస్త్రముగా  ఆస్టిక్స్  అని  పిలుస్తారు          ఆదిత్యుడు, లోక ప్రేరే పకుడవు,  జనులను కర్మలందు  ప్రోత్సహిమ్చువాడవు,   అకాశవిహారి, వర్షము  మూలమున  జగత్ ను  పోషించువాడవు,   శ్రేష్టమైన  కిరణములున్న వాడవు,   బంగారు వంటి తేజస్సు గలవాడవు,  బంగారు రేతస్సు కలవాడవు,   పగటిని కలిగించు వాడవు, వేయి కిరణములున్న వాడవు, ఆకు పచ్చ రంగుగల ఏడు  గుఱ్ఱములు కలవాడవు,  చీకటిని నసిమ్పచేయు ప్రశస్తి కిరణములు కల సుఖమును ప్రసాదిమ్చువాడవు,  నామరూపములను నిర్మూలిమ్పచెయువాడవు,  బ్రహ్మాండమును మరల జీవిమ్పచెయువాడవు, ప్రపంచ మంతటను వ్యాపింప చేయు వాడవు, నీవు హితము, రమనీ యమునగు బుద్ధి  కలవాడవు,  చల్లనివాడవు,  తపింప చేయువాడవు,  వేదములచె  స్తుతింప బడు వాడవు,  గర్భము నందు అగ్ని కలవాడవు,   అదితి పుత్రుడవు,   ప్రళయ  కాలమున శాంతముగా నుండు వాడవు, మంచును పోగొట్టు వాడవు,   ఆకాశ   నాధుడవు,  జలమునకు మిత్రుడవు, అకాశ మార్గమున సీఘ్రముగా పయనిమ్చువాడవు,  గుండ్రని రూపముగలవాడవు,  ఋగ్యజుస్సామవేద పారంగతుడవు, ఉదయకాలమున  గోరోచ నపు వన్నె గలవాడవు,  మధ్యాహ్న కాలమున సమస్తమును తపింప జేయువాడవు,  కవి,సర్వ నిర్వాహకుడవు, మహా తేజోవంతుడవు,  అందరి యందు అనురాగము కలవడవు,  కార్య కారణ భూతుడవు,  అందరికి మోక్షమును ప్రసాదిమ్చు వాడవు.  

1.  తూర్పు పడమర కొండలపై తోచు నీకు  నమస్కారము
2.  జ్యోతిర్గణములకు అధినేత వైన నీకు నమస్కారము
3.  దినాధి  పతివైన, లోక సాక్షివైన నీకు నమస్కారము
4.  అడ్డులేని పరాక్రమము గల దేవ నీకు నమస్కారము
5.  విజయమును మంగళమును కలిగించు నీకు నమస్కారము
6.  సహస్ర  కిరణములు గల నీకు నమస్కారము
7.  అదితి పుత్రుడ వైన నీకు నమస్కారము
8. ఉగ్రుడవు, విరుడవు,లోకమున విహరించు వాడవు నీకు 

     నమస్కారము
9.  పద్మములను వికసిమ్పచేయు వాడవు నీకు నమస్కారము
10.  బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు నియామకుడవు నీకు నమస్కారము
11.  సర్వభక్షకుడవు, రౌద్ర రూపుడవు,  నీకు నమస్కారము
12.  ఉపాసకుల శత్రువులను వదిమ్చువాడవు నీకు నమస్కారము
13.  దీప్తి మంతుడవు, జ్యోతిర్గణ  పతివియు   నీకు నమస్కారము 
14.  అజ్ఞానమును నశింప చేయువాడవు నీకు నమస్కారము
15.  తన రస్మిచేత తాపము కలిగించు వాడవు నీకు నమస్కారము
16. ఎండిన మానును వర్శముచె చిగురింప చేయు వాడవు నీకు 

      నమస్కారము
17.అగ్ని హోత్రార్చన ఫలము గూదా ఇచ్చు వాడవు నీకు 

       నమస్కారము
18.  చిరంజీవి యగు హనుమంతునకు సర్వ వ్యాకరణములునేర్పిన 

       గురువగు నీకు నా నమస్కారములు 

            ఆపత్కాలమున, కష్టములు వచ్చినప్పుడు, భికరారణ్య ములో చిక్కు కున్నప్పుడు, భయస్తితులలో మానవుడు ఈ ఆదిత్య హృదయమును పఠింమ్చినచో  ఆ ఆపదల నుండి  బయటపడి సుఖిమ్చును. 
              శ్రీరాముడు రావణ సంహార సమయమున అగస్త్య మహాముని భోధించిన  ఆదిత్య హృదయమును  ముమ్మారు దీక్షతో  పఠించి రావణుని సంహరిచినట్లు పురాణాలు తెలుపుచున్నవి.

              ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని  నిష్టగా ప్రార్దించితే, సమస్త సుఖములు కలుగును, మనస్సు ప్రశాంతగు ఉండును,  చేసే పనిలో సంతృప్తి కలుగును, కలతలు తొలిగి సంతోషములు వేల్లువెరియును. 
              " సర్వేజనా సుఖినోభవంతు "
 03-07-2013                                                                      


3. దీపారాధన మహిమ
                                                         శుభం కరోతి కల్యాణం
        ఆ రోగ్య  ధన సంపద 
        శత్రు బుద్ధి  వినాశాయ
         దీప జ్యోతి నమోస్తుతే

         దీపం  జ్యోతి  పరబ్రహ్మం
         దీపం  సర్వ తమోపహం
         దీపేన సాధ్యతే  సర్వం
         సంధ్యా  దీపం నమోస్తుతే 

         వర్తి ర్దేహొ కర్మ తైలం
         జ్యొతిరాత్మేతి చింతయేత్
         అధ కర్పూర కీలావత్
         భవేన్ని శ్శేషతావధి:
    
          వత్తే దేహం, కర్మే తైలం, దీపమే  ఆత్మ, అని భావించాలి.  అలా భావించిన తరువాత, కర్పూర జ్వాలలాగా ఎమీ మిగిలి వుండక పోవటమే అవధిగా గలవాడు కావాలి.  అంటే ఎమీ మిగలకుండా జ్యోతిలో లీనమై పోవాలి.  
 

దీపమహిమ:                                                                                ‘‘దీపం జ్యోతి పరబ్రహ్మ                                                                  దీపంజ్యోతి జనార్ధన
దీపేన హారతే పాపం                                                                   

దీపలక్ష్మి నమోస్తుతే’’


dheepam                                                    
           హిందూ సంస్కృతిలో దైవ కార్యాన్ని ప్రారంభించే ముందు దీపం వెలగించి దీపారాధన చేసి ప్రారంభిస్తాము. గృహణ మంగళం దీపం అన్నారు. ఇంట్లో దీపం పెట్టడం ఇంటికి మంగళప్రదం. దీపం ముల్లోకాలలోని చీకట్లను పారద్రోలుతుంది. నరకబాధలను నివారిస్తుంది. దీపంజ్యోతికొక దివ్యశక్తి ఉంది. అందుకే పరమాత్మను జ్యోతిర్మయ స్వరూపుడని అంటారు. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన దీమును ప్రతి ఇంట ఉదయము, సాయంకాలం తప్పక వెలిగించి మానసికానందం, శరీరారోగ్యమును పొందడం ఎంతైనా అవసరం. స్త్రీలకు ఈ దీపారాధన సౌభాగ్యకరం.   

                
           ఈ లోకములో జరుగుతున్న సంఘటనలు మనము మన కళ్ళతో చూడ గలుగు తున్నాము.  ఇది మన గొప్ప తనమూ కాదు, మన కళ్ళ కున్న శక్తి  కాదు " ఆది పరాశక్తి లోకమంతా వ్యాపించి తన కళ్ళతో (నిద్ర పోకుండా) చూడటం వళ్ళ ఆ కళ్ళల్లోచి  వచ్చే వెలుగే కాంతి "  మనము మనచుట్టూ ఉన్న లోకాన్ని చూసి అలసిపొయి  రాత్రికి నిద్ర పొతూ ఈ కళ్ళకు విశ్రాంతి ఇస్తున్నాము, తెల్ల వారే సరికి కళ్ళకు కొత్త శక్తి వస్తుంది.   ఈ శక్తి  ఎట్లా వచ్చిందో ఎవరైనా ఆలోచించారా ?
 

                ఆ పరమేశ్వరుడు వెలుగునిచ్చి వెలుగును చూడమని కళ్ళు నిచ్చిన ఆ పరమేస్వరునికి, ఆదిపరాశక్తికి  కృతజ్ఞతను తెలుపుతున్నాను.
                కృతజ్ఞతా భావంతో దీపం వెలిగిస్తున్నాను.             కులమత భేదము లేకుండా ప్రతిఒక్కరు వెలుగును ఆరాధిస్తారు.  కొందరు క్యాండిల్ రూపములొ ఆరాధిస్తున్నారు,  కొందరు కాగడా రూపములొ ఆరాధిస్తున్నారు, కొందరు సూర్య బిబాన్నే ఆరాధిస్తున్నారు, భారతీయులు దీపారాధన రూపములొ ఆరాధిస్తున్నారు.


              మనము సూర్య చంద్రులు చూపిన వెలుగు  ద్వారా కొన్ని వస్తువులను చూసి గమనిమ్చగలుగుచున్నాము. దీప కాంతులు మన శరీరములొ ప్రవేశించి తెలియని కోరికలతో సతమతమవుతున్నాము. 


        దీపపు ప్రమిదలో ఆవునెయ్యి గాని, నువ్వులు నూనె గాని శక్తి కొద్ది  ప్రమిదలో పోసి వత్తి ( హిమ్దూ సంమ్ప్రదాయము ప్రకారము కొందరు వారిఆచారము ప్రకారముగా 2 వత్తులు వెలిగించడం, 3 వత్తులు వేలిగిమ్చాడ, 4 వత్తులు వెలిగించడం, 5 వత్తులు వెలిగించడం,6 వత్తులు వెలిగించడం, మరియు అఖండ దీపముగ అడుగుభాగము అనేక జ్యోతులు ప్రతివరుసకు తగ్గిమ్చుకుంటూ పై భాగమున ఒక జ్యోతి వెలుగుతూ ) అద్భుతకామ్తివంతముగా దీపారాధన చేస్తారు            కొందరు దీపం వెలిగించి  " దేవుడా నివే దిక్కు " ప్రార్ధనలు చస్తున్నారు,   మేము రంగుల కలల్లో జీవిస్తున్నాము, ఆశల పల్లకిలో పరిబ్రమిస్తున్నాము, మొహా పరవశులై తిరుగుతున్నాము, జీవిత      నౌకను నడుపుతూ ఆటు- పోటులకు తట్టు కుంటు, తిమింగలాలకు చిక్కకుండా, పురోగతి - అధోగతి అనుకుంటు,  బొమ్మ- బొరుసలా తిరిగి ఏది జరుగునో తెలియక జీవిస్తున్న మమ్ము చికటి నుండి వెలుగులోకి, అసత్తు నుండి సత్తు లోకి, మృత్యువు నుంచి అమృతత్వానికి చేరువేయగల మనసును ప్రసాదించు.  మనసు లేక పొతే మనిషికి మనుగడలేదు. అందుకే మేము పుట్టుకలో, పెళ్ళిలో,పూజలొ, చావులో, అన్ని చోట్లా దీపాలు వెలిగిస్తున్నాము. 

              కొందరు ఒక వత్తి  వేసి దీపం వెలిగిస్తారు.   దానికి ప్రత్యేకత ఏమిటంటే " చనిపోయిన వారి ఆత్మ స్వర్గలోకం చేరుతుందని " ఒక నమ్మకము.

             కొందరు రెండు వత్తులు  వేసి దీపం వెలిగిస్తారు.   దానికి ప్రత్యేకత ఏమిటంటే " సరస్వతి సయంభువులు, లక్ష్మి నారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, తల్లి తండ్రులు దీవిస్తారని " ఒక నమ్మకము.
             కొందరు మూడు వత్తులు  వేసి దీపం వెలిగిస్తారు. దానికి ప్రత్యేకత ఏమిటంటే " త్రిమూర్తులు స్వయముగా అతిధులుగా వచ్చి దీవిస్తారని '  నమ్మకం .
             కొందరు నాలుగు  వత్తులు  వేసి దీపం వెలిగిస్తారు. దానికి  ప్రత్యేకత  ఏమి  టంటే " నాలుగు వేదములు పఠింటించలేక పొయినాము, వేదములో ఉన్న వెలుగును మాకు ప్రసాదిస్తారని "నమ్మకం.
             కొందరు ఐదు  వత్తులు  వేసి దీపం వెలిగిస్తారు. దానికి  ప్రత్యేకత  ఏమి  టంటే " పంచ భుతాలవల్ల ఎటువంటి ఆపద రాకుండా పరమాత్మ కాపాడుతారని "  నమ్మకం.
             కొందరు ఆరు  వత్తులు  వేసి దీపం వెలిగిస్తారు. దానికి  ప్రత్యేకత  ఏమి  టంటే " అంతశ్శత్రు వులు  (కామం, క్రోధం, మొహం, లోభం,  మదం,  మాత్సర్యం,) నుండి దేవదేవుడు  కాపాడు  తారని " నమ్మకం.  
            కొందరు అనేక  వత్తులు  వేసి దీపం వెలిగిస్తారు. దానికి  ప్రత్యేకత  ఏమి  టంటే " లోకమంతా సుభిక్షముగా, శ శ్శ శ్యామలముగా, సంతోషముగా, ఆనందముగా, ఉండాలని కోరుతూ దేవాలయము లందు,  నదీ తీరములందు, పూజలు ప్రార్ధనలు చేస్తూ దీపాలు వెలిగిస్తారు, ఆ దీపాల వెలుగును కళ్ళకు ఆద్దు కుంటే మనస్సు ప్రశాంతముగా ఉంటుందని " నమ్మకం   
  

04-07-2013
        
               మన మనస్సు, ఎ మనస్సును ఆకర్షిమ్చుతుమ్దో, వికర్షిచుతుమ్దో మనలో ఉన్న ఇంద్రియాలపై ఉన్న వెలుగు తెలియ పరుస్తుంది.   ఇంద్రియాలను జయించుటకు మానవులకు సాద్యముకాదు, కాని ఏకాగ్రతతో, నిష్టతో, దీపాల వెలుగులో పరమాత్మను పూజిస్తె, మనసుకు ప్రశాం తత ఏర్పడుతుంది.
               మన సరీరములొ ఉండే వేలుగనే శక్తి " మన పూర్వకర్మ ఒక్కటే ", ఆ కర్మ ఫలమున్నంత వరకే  ప్రాణము, మనస్సు, నిలిచి వుంటాయి.  కర్మ ద్వారా దేహము, దేహము లో  ప్రాణము, ప్ర్రాణ ములో మనస్సు, మనస్సులో వెలుగు,  ఆ పరమాత్మ అందరికి సమంగా ఉమ్చారు. వెలుగును సమానముగా పంచమని మనకు భోధ చేసారు మన పూర్వీకులు, తల్లి తండ్రులు.
                నూనె ఉన్నంత వరకు వత్తి వెలుగుతుంది, నూనె లేక పోతె వత్తి  వెలుగదు, నూనె పూర్వకర్మ, వత్తి  మనదేహం, దీపజ్వాల అనేది మన మనస్సు, మనస్సు ఆన్ని వైపులా ప్రసరిస్తూ అందరి హృదయాలను సంతోష భరితము చేయును, లేదా భారంచలేని భాదను కుడా కలిగించును.   


   ఇద్దరు స్నేహితులు  ప్రక్క  గ్రామానికి బయలు దేరారు దారిలో చిక్కటి పడింది, దగ్గరగా ఉన్న అడవిలో ఎండు పుల్లలు తెచ్చి మంట చేసాడు ఇందులో ఒకడు. ఏమిటి చేస్తున్న పని తొందరగా పోవాలి ఇప్పుడు ఇది అవసరమా అన్నాదు. సూర్యాస్మయమ్ తర్వాత దీపమ్ వెలిగించే అలవాటుంది అందుకనే ఈ మంట ఏర్పాటు చెసుతున్నాను.  
 మోకాళ్ళ మీద కూర్చొని భగవంతుడా నీవు సర్వజ్ఞుడవు, సర్వ సమర్దుడవు,  నావారిని, నాచుట్టు ఉన్నవారిని నిత్యము సహాయము చేయు శక్తిని ప్రసాదించు పరమాత్మ. అంటు మంట  చుట్టు మూడు  ప్రదక్షణలు చేసాడు.    
           అదే దారిన పోతున్న ఒక సన్యాసి వీరి వద్దకు వచ్చి, నేను ఇక్కడ అద్భుతమైన దీపపు  వెలుగు చూసాను,  ఇదిగో  కాశిలో  ఉండే విభూతి చేతిలో పెట్టి సన్యాసి పాటలు పాడు  కుంటూ  ముదుకు వెళ్లి పోయాడు ( ఆ పాటలు క్రింద ఉదహరిస్తున్నాను ) ఇది కళా నిజమా అ ను కుంటూ ముందుకు అడుగులు  వేయగానే  ఊరిలొ ఉన్న శివాలయము వచ్చింది.  ఇరువురు కలసి దీపారాధన చేయుటవలన  వెళ్ళిన పనిలో లాభము వచ్చినది.   
              
              కంటికి వెలుగు, ఇంటికి వెలుగు ఆరని జ్యోతి
              జీవితమంతా పువ్వులబాటలో నడిపే జీవన జ్యోతి
              చల్లని  మనసు, తీయని మాటలతో పలికే జ్యోతి 
              ఇంటికి పేరు ఊరికిపెరు తెచ్చే ఆనంద జ్యోతి  


   మంచి విత్తనము నాటకపోతే, వరి పైరు మంచిఫలితము రాదో
   మనిషి  తన ప్రయత్నం తాను చేయకపోతే ఫలితము ఉండదో
   నూనె ఇంకి పోయినప్పుడు దీపము వెలుగు ఎట్లా క్షీనించునో
   మనవంతు మనం శ్రమపడుతూ, భగవంతుని సాయం కోరాలి  


              నూనె దీపంలో నువ్వులనూనె  ప్రసస్తమని పెద్దలు చెప్పెదరు.  ఈ నూనె దీపమ్ కాలిన వాసనవల్లా, మనసులో ఏకాగ్రత పెరుగుతుంది,  లక్షలకొద్దీ నునెదీపాలు వెలిగితే ఆ నూనె ఆవిరులు వాయు తరంగాల మీద ప్రయాణము చేసి, మంచి వానలకు దారితీస్తాయి. 
               విద్యుదీపాల స్తానంలో నూనె దీపాలు పెడితే వానలు కురిసి దేశం సుఖ సంతోషాలతో ఉంటుందని నాభావన.
               ప్రతి పూజ చివర కర్పూర హారతి ఇవ్వటం మన ఆచారం. బిళ్ళ ల రూపములొ ఉన్న వాటిని హారతి మమ్చిదికాదు.  పరిమితి ప్రాంతాలలో  చెట్లకు కాయలుగాస్తుంది  (ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం) .  దానితో హారతి చేసినప్పుడు పరిసర వాతా వరణంలో కాలుష్యం తొలగి, మనస్సులు కూడ  ప్రశాంతపడి,  సహజంగా నిశ్చల స్తితిలొకి చేరుతారు.    
               హనుమంతుని కృపవల్ల. వెలుగుల ఉపాసలోని కొన్ని విషయాలు మీకందరికి మనస్సులకు పట్టి,  మీరు నిజమైన ఆరాద్యులుగా మారాలని భక్తి  పారవశ్యముతో ఆ పరమాత్మ కృపకు పాత్రులగుదురగాక.             కాశిలో  గంగామాతకు ఇచ్చిన హరతులను ఇందు పోదు పరిచినాను.    
                                                                         ఇట్లు తమ విధేయుడు
         
                                                            Mallapragada Ramakrishna
                                                                    H.No 12-126, Meerpet
                                                                      Saroornagar Mandal
                                                                          Hyderabad -97
                                                                          AndhraPradesh
                                                                              9849164250