22, జూన్ 2013, శనివారం

63. దిగంబర రహస్యాలు-6

27-06-2013
1.  ప్రపంచం అంతా మాయ వలయం 
     సిరి కోసం అంతా మయా జూదం
     గంగ కోసం ప్రతిచోట పోరాటం
     స్త్రీల కోసం అంతటా ఆరాటం

2  అందరికి చీకటి రాత్రులు వస్తాయి,
    చీకటిని  తరిమే వెలుగులు వస్తాయి, 
    అందరికి పున్నమి రాత్రులు వస్తాయి,
    మనసంతా ప్రశాంతముగా ఉంచి పోతాయి

3.  వెన్నెల్లో విహరిస్తే  ఆనందం ఉంది
     ముఖంలో విరజిమ్మే అందం ఉంది
     ఆమెలో ఇంకా మానవత్వం  ఉంది
     ఆమెకు జయిస్తానని విశ్వాసము ఉంది

4.  స్త్రీని  చూడగ తాపంబు కలిగి,  కలుగుస్తుంది బ్రాంతి
     స్త్రీని మోహదృష్టితో చూడకు, చూడాలి సహజ దృష్టి
     ఇల్లాలిని నిర్లక్షం చేయకు, వేశ్య వద్దకు  పోతే   రోగం
     స్త్రీలను గౌరవించు, అతిగా ప్రవర్తిస్తే కుదురును తిక్క 

5.  స్త్రీలు కలుగుచోట చేర్లాటములు
     స్త్రీలను అర్ధం చేసుకోలేక చిక్కులు
     స్త్రీలు లేని చోటు  నిశ్స బ్దములు
     స్త్రీలను చూస్తె పెరుగును ఆలోచనలు

6.  కన్నె దాని మెను కస్తూరి వాసన
     ప్రతివ్రత మేను మల్లెపూల వాసన 
     ముసలి దాని మేనుమురికి వాసన
     వయస్సుకొచ్చిన దాన్నివర్ణించ దగునా

7.  మందహాసముతో మదిని దోచె
     పరిహాసముతొ సమస్య   తెచ్చె
     కిలకిల నవ్వుతో మనస్సు వేదించె
     బ్రహ్మ కుడా స్త్రీని చూసి చలించె 

8.  ఎత్తులు పై ఎత్తులు వేయకు
     చిత్తులు గమ్మత్తులు చేయకు
     అత్తలు మేనత్తలు మరువకు
     ఎత్తు పల్లాలు చూసి బ్రతుకు
28-06-2013
 
9.  పరువాల తోలి పొద్దులో
     కోరికల గల మత్తులో
     తరాజుల ఉండాలి హద్దులో
     భార్యఉండాలి భర్త గుండెలో  

10.  బుడగల మధ్య నవ్వుల ముఖం
        నవ్వుల్లో అంతా రత్నాల మయం
        మన్మధమదినే దోచిన మయూరం
        తపనలతో ఇరువురు పొందే తన్మయం

11.   వృధా చేయకు సమయం
         జీవితమే ఒకమాయ భ్రమణం
         చీకటి వెలుగుల గమనం
         భక్తిపై మనసు ఉంచాలి వేగం

12.   పొంగి పొంగి పొమ్గుల వల తన్నె
         వంగి వంగి వలపుల వల మన్నె
         తొంగి తొంగి చూపుల వల వన్నె
         మగ్గి మగ్గి తలపుల వల కన్నె 

13. ఛెంగ్ ఛెంగ్ దూకె  సెలయేరు   
       ఖంగ్ ఖంగ్ దగ్గే ముసలివారు
       ఠంగ్ ఠంగ్ గంటకొట్టే గుళ్లోవారు
       యంగ్ యంగ్ స్త్రీలు కవ్వించెవారు

14.  భయపడితే పనికిరాకుండా పోతావు
        శ్రమ పడితే ఆరోగ్య వంతుడవుతావు
        సుఖపడి సుఖపెడితే తెజోవంతుడవుతావు
        గుండె గుండె తాకితే పరమానందభరితుడవు

15.  పౌరుషాన్ని కొల్పోయి పిరికివాడుగా మారకు        
        వీరత్వాన్ని కోల్పోయి ధీరుడు  మారకు
        క్షమాత్వాన్న్ని కోల్పోయి దుర్బలుడుగా మారకు
        ప్రేమతత్వాన్ని కోల్పోయి పిచ్చి వాడుగా మారకు

16.   అపార్ధాల అగాధంలో పడకు
         వ్యర్ధపుమాటలతో విసిగించకు
         అర్ధంకొరకు అనర్ధాలు సృష్టిమ్చకు
         స్వార్ధంతో కాపురంలో చిచ్చుపెట్టకు 

29-06-2013
17.   అద్దంలా ఉన్నది ఉన్నట్లుగా చూపాలి
         గడియారం లా  సోమరితనం వదలాలి
         స్ప్రింగులా సామర్ద్యమును పెమ్చుకోవాలి
         ఆసనం లా అందరినీ దయతో ఆదుకోవాలి

18.   చీమలను చూసి క్రమశిక్షణ నేర్చుకో
         భూదేవిని  చూసి  ఓర్పును నేర్చుకో
         పువ్వులనుచూసి నవ్వటం నేర్చుకో
         బంతిలా తిరిగి  చప్పటం  నేర్చుకో

19.  పూలు చల్లుతున్నారని సంబర పడమాకు
       రాళ్ళు, చెప్పులు, పడతాయని    మరువకు
       గోతులు తవ్వేవారిని చూసి భయ పడకు
       ఎత్తులు వేసి నిన్ను చిత్తు చేసే వారినివదలకు

20.  నవ్వు తారని నీగమ్యమ్ మార్చుకోకు
        ఎడ్చేవారున్నారని పనిచేయటం మానుకోకు
        పోగిడేవారున్నారని గొప్పలకు పోమాకు
        తిట్టేవారివద్ద జాగ్రత్తగా మసలుకోనిబ్రతుకు

21   జీవితానికి అర్ధం,పరమార్ధం, వచ్చేది విద్య వల్ల
        సంసారానికి సుఖం, దుఖం వచ్చేది శీలం వల్ల
        కాపురానికి ప్రేమ, నమ్మకంవచ్చేది శాంతి వల్ల
        పరువానికి యవ్వన తృప్తి  నిచ్చేది పెళ్ళి   వల్ల

22.  కలలో వచ్చి, కలవరం రేపి, కలత చెందావా
        గలగలా పారే సెలఎరులాగా పరిగేడుతున్నావా
        సలసలా కాగే నీరులా నన్ను ఉదికిస్తున్నావా
        గెల తల మెరుపులా, నా  మది  దోస్తున్నావా
 
23.   అంత కంతకు పెరుగు తుంది సుమంత
         కిత కితలతో, కతలతో చేసే కను వింత
         జత కోసం, చిడతలు పట్టిచేసే జాగారమంత
         లతలతో, కవితలతో, మదిదోచే ఈ కాంత 

24.   ముగ్ద మనోహర యద పొమ్గుల మయం
         చెందనగంధ సుగంధి లెపనాల  మయం
         స్నానముతో వంటి మీద వలువలు మాయం
         ఉష్ణ తాపముతో   పొందు కోసం తాపత్రయం
30-06-2013
25.   మనిషి బ్రతకాలన్న  ఆహారం కావాలి
         సుఖజీవనం జరపాలన్న శాంతి కావాలి
         పదవి కావాలన్న, ఏదైనా ఒకటిమరవాలి
         అది కావాలంటే, ఏదైనా ఒకటి మరవాలి

26.   ప్రేమతో  పగని   గెలిచి   బ్రతుకు    దిద్దుకో 
         ఓర్పుతో విషయం తెలుసుకొని మసలుకో
         నేర్పుతో సంసారాని ఒడ్డుపైన నిల బెట్టుకో
         తీర్పుతో ఒక్కరై దేవుని ప్రార్ధన తో వేడుకో 


27.  ఉన్నదానిలో తృప్తి ఉండకపోతే,  ఏలిక అయినా తృప్తి ఉండదు
        స్త్రీలు వివేకంగా ప్రవర్తిమ్చక పోతే, ద్వేషం పెరుగక  మానదు
        జీవితములో సుఖము లేకపోతె, ధనమున్న తృప్తి ఉండదు
        ప్రేమ, భక్తీ, పెరుగక పోతే, ఆయుర్దాయము తగ్గక మానదు     

28.   పెరిగేకొద్ది తెలిసింది, ఉండాల్సింది పురుష ప్రయత్నం
         అవినీతిని ప్రతిఘటిమ్చాలంటే ఉమ్దాల్సిమ్ది నిర్బయత్వం
         శ్రద్ధ, సహనం, స్వప్రయత్నం, ఆత్మశక్తి,  ప్రతీకలె ధీరత్వం
         జాతీయ పవిత్రతను కాపాడ టానికి ఉండాలి వీరత్వం 

29.  ఇద్దరు కలిస్తే  ఏర్పడుతుంది అభిరుచి
        వంటలలో ఉప్పు  కలిస్తే అద్భుత రుచి 
        అర్ధం లేకుండా ఏదో మాట్లాడకు విరచి
        భారతంలో అర్జున్ని అంటారు సవ్యసాచి

30.   నీ  విరహ వీణలొ ఎంత మాధుర్యం
         నీ  మధుర భాష్యంలో ఎంత భావం
         నీ  భావంలోఉంది ఎంతో ప్రస్నార్ధం
         ప్రస్నార్ధంలో ఉంది   సృష్టి  ధర్మం31..  ఏమని చెప్పను, నాకు ఏమి జరిగిందని
         ఎదారిని  పోను, నేను పోలేను ఆ దరిని
         ఎంతని చెప్పను, వేరొకరు చేసిన పనిని
         నిన్ను మరువను, ఊరుకోను ఎంబడిస్తానని 

32.    మనిషి మనసు చంచల మైనది
         వాంఛలకు బానిసను  చేస్తుంది
         దృక్పధంమార్చికోమని చెపుతుంది
        ఇది ధర్మం అని వెన్నుతట్టి చెపుతుంది 

33.  పూల గుత్తులపై సంచరించి సీతాకోక చిలుకలు
        మకరంద్రమును గ్రోలుటకు వచ్చే తుమ్మెదలు
        వెలుతురు ఇవ్వలేని మినుగురు   పురుగులు
        మదన తాపముతో స్త్రీల చుట్టూ తిరిగే కుక్కలు

34.   మత్తులోకి దించు పూల గుత్తులు
         మనసు లేకుండాచేయు పాలగుత్తులు
         సౌందర్యానికిచిహ్నాలు ఎగసిపడే గుబ్బలు
         మనసును మార్చే  స్త్రీ హావ భావాలు

35.  నవ్వులతో వచ్చి, సరస సల్లాపములు  జరిపి
        సయ్యపైకి  వచ్చి, రమ్యమైన లోకాలు  చూపి
        మనసంతా ఇచ్చి, మదితలపులు తెరచి చూపి
        ఉష్ణమును పంచి, కోగిట్లో భందించి స్వర్గం చూపె 

36.  వద్దు వద్దు అంటూ ఎదపై వలువ తొలగించె
        పాలుబుగ్గి పాలు చేయకు అంటూ పరవశించె
        నీ సొంతం అంటూ నూలుపొగు తీసి కౌగాలించె    
        చీకటిలో అందాన్నిచూసు కో   అటూ కవ్వించె  

37.  రోజులన్నీ మనవి కావు, మరి ఎవరివి
        భుద్దులన్నీ మనవి కావు, మరి ఎవరివి 
        పిల్లల రంగుల మనవి కావు, మరి ఎవరివి
        పిల్లలను కంటాం, మంచి చెడు చూసే దేవుడివి 

38.  జాతి కన్నా, నీతి  గొప్ప
        మతముకన్నా, మతము గొప్ప
        కులము కన్నా, గుణము గొప్ప
        భర్తసంపాదనకన్నా, భార్య పిల్లలనుక
నిపెంచుటే గొప్ప

39.  పువ్వు కాని పువ్వు "  కాలి ప్లవర్ "
        కాయ కాని కాయ   "  మొట్టికాయ "
        దానం కాని దానం  " మైదానం "
        దెబ్బ కాని దెబ్బ   " వడ దెబ్బ " 

పార్కులో చెట్టు చాటుకు ప్రేయసి ప్రియులు చేరి కళ్ళు కళ్ళు కలిపే
ఐస్క్రీం  పైపొర నెమ్మదిగా తీసి అహ ఓహో అంటు ఇరువురు నాకే 
అటువచ్చిన పీచుమిఠాయితీసుకోనిపిల్లల్లా ఒకరికొకరు అందుకొని తినే  
 ఆహఏమి రుచి, కనివిని ఎరుగని రుచి, ఒకరికొకరు ముద్దులతో మునిగే