9, ఏప్రిల్ 2013, మంగళవారం

Ugadi 2016


  
                  ఆంద్రప్రదేశ్  లో ఉన్న ప్రతి ఒక్కరికి, తెలుగు భాష తెలిసిన ఇతర రాష్ట్రలో ఉన్న వారికి, ఇతర దేశాలలో ఉన్నవారికి  పేరు పేరున నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శ్రీ మన్మధ నామ సంవత్సరము నకు వీడ్కోలు పలుకుతూ శ్రీ దుర్ముఖి  నామ సంవత్సరమునకు స్వాగతతం శుస్వాగతం, చైత్రమాసం 8-04-2016
                   ఆదికవి వాల్మికి  చెప్పన విధముగా
" పక్షీ  చ సాఖానిలయం ప్రవిష్టు  పూనా; పన శ్చోత్తమసాంత్వవాది
   సుస్వాగతం వాచ ముదీరయాణ: పున: పునశ్చోదయతీవ హృష్ట: "

                పక్షికూడ  తన గూటిలో ప్రవేశించి మాటిమాటికి సాంత్వఫూర్ణమైన ధ్వని చేయుచు, స్వాగత ధ్వనిని  చేయుచు,  మిక్కిలి సంతోషముతో రాబోవు ప్రియమును శూచించుచున్నట్లుగా నున్నది.

               విజయ నామ సవత్సరమున ప్రతివక్కరికి  విజయము చేకూరాలని ఆ పరమాత్మను ప్రార్దిస్తున్నాను   ప్రక్రుతి కనికరించి  మేఘం వర్షించి పంటలు పండి సుఖశాంతులతో ఉండాలి.

              " సూర్యుని ఉషస్సు, చంద్రుని యశస్సు
                 వేద పండితుల, తల్లితండ్రుల ఆశిస్సు
                 భూమాత వర్చస్సుతో ఉండే మనస్సు
                 తెలుగు వెలుగుల పంచాంగమే శ్రేయస్సు "

               " వేపఫూవు  తెచ్చి చేతలతో చెరిగి
                  పచ్చిమామిడి తెచ్చి ముక్కలు తరిగి
                  కొత్తకుండతెచ్చి మంచి నీటితో  కడిగి
                  ప్రతిఒక్కరు నూతన వస్త్రములతో ఒదిగి
                  షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి కలిగి
                  ఒకరితో ఓకరు ఆనందముగా కలసి తిరిగి
                  ఆహా  ఓహో అంటూ ఉగాది పచ్చడి మరిగి "


             
" విఘ్నరాజునకు వినమ్రతతో వంద గుంజీలు తీయగా
   గురికలిగి  గిరిని అధిరోహించి గిరిజాపతిని దర్సించగా
   శివపార్వతుల రూపం  చూసి తన్మ యత్వం చెందగా 
   నిత్యమునిలయమునందు ఆరాధ్య దైవమును కొలవగా  "

                                            
     

              అంత్యప్రాస భావముతో  ఉగాది కవిత
              " ప్రతిఒక్కరు లోగిళ్ళు  శుబ్రపరిచి
                 అరవింద పుష్పాలతో  అలంకరించి
                 వసంతమాసం వచ్చినట్లుగా కల్పించి
                 ప్రతి రోజు చిరునవ్వులతో పలకరించు "

               " ఉయ్యాల లూగి, మనస్సులో ఉండే కలవరం తుంచి 
                  పంచాంగ శ్రవణమునువిని సుఖశాంతులు కలిగించి
                  గతస్మ్రుతులనుమరచి విజ
నామ ఉగాదిఆహ్వానించి
                  క్షేమంగా పలక రించి, ప్రేమంతా రంగరించి  జీవించు "  


                " కొత్త చిగురుటాకులవలె కొత్త ఆలోచనలతో రంగరించి
                   పూల పండ్లతో వయసుకు తగ్గ పరువాలు పులకరించి
                   కోయల గానామృతముతో  మనస్సుకు అనంద పరచి
                   విజయనామ ఉగాది విజయానికి మార్గమని ఊహించు "

              "  విజయనామ ఉగాది సుఖాల నిలయమని భావించి
                  వినోద విహారములతొ ఈ సంవస్చరమన్తా ఊహించి
                  సుందర లోకము లో ప్రతిదీ  సుందర మని  తలంచి
                  ఆటుపోటులతో,ఆటపాటలతో జీవితమంతాసాగించు "

                
                
              " ఇంతకుముందు ఎవరూ చేయలేని పనిని చేయించి
                  నివే చేయ  గలవని అందరి చేత సుభాష్  అనిపించి
                  ఈ ఫలితము అందరికి సమానముగా  విస్తరించి
                ప్రతిరోజు విజయనామ ఉగాది విజయమని భావించు"

           "  ఆరురుచులతో ఆరోగ్యంగా ఉంటూ అందరిని ఆదరించి
                పితృ కార్యములు, దాన ధర్మములు, చేసి,   చేయించి
                విజయమే  శాస్వితము, ఆరోగ్యదాయకామని ఊహిమ్చి
                హిమగిరి కరిగి జలమైనట్లుగా హృ దయాన్ని అర్పించు "

                " ధర్మమార్గమున జీవితమును సాగించి
                   మధురిమలతో మానవత్వము వ్యక్తపరిచి
                   మమతానురాగాలు అందరికి  పంచి
                   నీమనస్సు  నిత్య పుష్పంలా  పరిమళించు "               
  
                " రాబోయే కాలము మంచిదని భావించి
                   మంచితనముతో  హృదయాన్ని పంచి
                   సిరులుకాదు ప్రేమే శాస్వితమని భావించి
                   ప్రేమ అవరోధాలను నివు అధిగమించు "
 
" రెప్పలు కళ్ళను కాపాడినట్లు, ప్రతివిషయంలో  ఓర్పు వహించి
  చేడుతావన్నది లేనట్లు, మంచిచే మనసుకుచింత లేదని పించి
  ద్దృష్టిదోషము, గ్రహభాదలు శాస్వితముకాదని అమ్దరూ భావించి
  ధైర్యం, మనోనిగ్రహశక్తి పెంచుకొనేందుకు హనుమంతుని ప్రార్ధించు "                                                    


                
               " యస్య  త్వేతాని చత్వారి వానరేంద్ర  యథా  తవ,
                 ద్రుతిద్రుష్టిర్మతిర్దాక్ష్యం  స కర్మసు న సీదతి   "
                                                    (సుందరకాండము  మోదటి స్వర్గ ) 
          ఓ వానరోత్తమా!  నీకు ఉన్నట్లు,  ఎవనికి,  ధైర్యం,  సూక్ష్మద్రుష్టి, భుద్ది, నేర్పు  అను  నాలుగు లక్షణ ములుండునో అతడు ఏ కార్యము చేయవలసి వచ్చినను వైఫల్యము పొందడు.  

          ఎందరో మహానుభావులు అందరికి 
    " ఉగాది "   శుభాకాంక్షలు.

               

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి