శ్రీ రామాయణ మహాత్త్యమ్
ramakrishnamallapragada.blogspot.in
శ్రీ రామ ప్రాతిపదిక మవశేనాపి సంగృణన్
ముక్తిం ప్రాప్నోతి మనుజ: కిం పునర్భుద్ధి పూర్వకమ్
శ్రీ రామ అను ప్రాతిపదికమును అప్రయత్నముగా పలికినను మనుజుడు ముక్తిని పొందునన్నచో. నింక భుద్ధి పూర్వకముగ (శ్ర ద్దా భక్తులతో ) జప మొనరించు వారి విషయమున చెప్పవలెనా?
నామజపము చేయు వారి హృదయములో శూక్ష్మ రూపములొ భావ ప్రకటితము అగును, శరీరము యొక్క జడత్యము నశించును,భగవత్ సాక్షాత్కారము కలుగును,హనుమంతుడు నిశ్చము రామ నామ జపము చేస్తూ దుష్టులను శిక్షించును, సిష్టులను రక్షించును, భక్త తుకారం, కబీరదాస్, మీరాబాయి మరి యందరో నామ జపముతో మోక్షము పొందినారు. కలియుగమున జ్ఞాన, కర్మ, భక్తీ మార్గములు మూడు కఠిన మైనవే. కాని భగవంతుని నామజపము సులభము. నామజపము వలన అన్దరూ లాభమును పొంన్ద వచ్చును ఇందులో యట్టి విధి విదానములు లేవు బాలబాలికలు, స్త్రీ లు, పురుషులు, వృద్ధులు, రోగులు కుడా నామజపము చేయవచ్చును. అన్ని పరిస్థితులలోను, సమయములలోనూ చేయవచ్చును.
**********
**********
శ్రీ రామ, శ్రీ రామ, శ్రీ రామ, శ్రీ రామ, శ్రీ రామ,
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
శ్రీరామ, శ్రీరామ అని స్మరించుము, రమ్య మైనది శ్రీరామనామం
మనస్సునకు, ఆత్మకు సంతోష పరచునది శ్రీరామనామం
కన్నవారి కలతలు తీర్చి సంతోష పరచునది శ్రీరామనామం
ప్రతి ఒక్కరి మనస్సులో స్థిరనివాసమై యున్నది శ్రీరామనామం
ప్రకృతిలో వానకు తడవనిది యండకు కరగనిది శ్రీరామనామంప్రకృతిలో చలికి వనకనిది, చెదలు పట్టనిది శ్రీరామనామం
మనస్సునకు, ఆత్మకు సంతోష పరచునది శ్రీరామనామం
కన్నవారి కలతలు తీర్చి సంతోష పరచునది శ్రీరామనామం
ప్రతి ఒక్కరి మనస్సులో స్థిరనివాసమై యున్నది శ్రీరామనామం
ప్రకృతిలో వానకు తడవనిది యండకు కరగనిది శ్రీరామనామంప్రకృతిలో చలికి వనకనిది, చెదలు పట్టనిది శ్రీరామనామం
నమ్మినవారి కోర్కలు తీర్చినమ్మకము కలిగించునది శ్రీరామనామం
గాలి, నీరు, అగ్ని తోకలసి గగనమునందు మ్రోగునది శ్రీరామనామం
అక్షరజ్ఞానంలేనివారిని, అమాయకులను ఆదుకొన్నది శ్రీరామనామం
చింతలు తీర్చి చిరునవ్వులు నవ్వించే చిద్యిలాసునిది శ్రీరామ నామం
ఉన్ననామములోకేల్ల ఉన్నత మయినది శ్రీరామ నామం
గాలి, నీరు, అగ్ని తోకలసి గగనమునందు మ్రోగునది శ్రీరామనామం
అక్షరజ్ఞానంలేనివారిని, అమాయకులను ఆదుకొన్నది శ్రీరామనామం
చింతలు తీర్చి చిరునవ్వులు నవ్వించే చిద్యిలాసునిది శ్రీరామ నామం
ఉన్ననామములోకేల్ల ఉన్నత మయినది శ్రీరామ నామం
నిశ్చము పరమేశ్వరుడు జపించునది శ్రీరామనామం
శ్రద్ధతో గాని, అవహేలనతో గాని శ్రీరామనామం చేస్తే మోక్షం
శ్రద్ధతో గాని, అవహేలనతో గాని శ్రీరామనామం చేస్తే మోక్షం
ప్రారబ్ధ కర్మలు మారిపోవునట్లు చేయునది శ్రీరామనామం
ధర్మ,అర్ధ,కామములను త్రివర్గాఫలమును ఇచ్చునది శ్రీరామనామం
ఈస్వర ఉవాచ
శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్త్రనామ తతుల్యం రామ నామ వరాననే
శ్రీ రామ నామ వరానన ఓం నమః ఇతి
సహస్త్రనామ తతుల్యం రామ నామ వరాననే
శ్రీ రామ నామ వరానన ఓం నమః ఇతి
సుందరు డైన రామునిగూర్చి నా మనస్స్సు నాకర్షించు శ్రీరామ, రామ.రామ, యను నామమును నేను సదా స్మరించు చున్నాను.
ఆ రామనామము సహస్ర నామములకు సమానమైనది.
రమంతే యోగిన్యోనంతే నిత్యానందే చిదాత్మనే
ఇతి రామపదేనాసౌ పరబ్రహ్మభి ధీయతే
ఇతి రామపదేనాసౌ పరబ్రహ్మభి ధీయతే
సచ్చిదానంద స్వరూపమగు ఎ పరబ్రహ్మంను నిరంతరమూ భావిస్తూ మునీన్ద్రులు ఆనందము అనుభవిస్తారో అట్టి పరతత్యమే రాముడు.
మనోభిరామం నయనాభిరామం
వచో భిరామం శ్రవనాభిరామమ్
సదాభిరమం సతతాభిరం
వందే సదా దాశ రధీమ్ చ రామమ్
మనస్సునకు, నేత్రములకు, వాక్కులకు, చెవులకు, సంతోషకరమైన వారును, ఎల్లప్పుడు పరిథిని కలుగజేయు వారును, దసరథ పుత్రుడు అగు శ్రీరామునకు నమస్కరించుచున్నాను.
***********
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్
ఆపత్తులను పోగొట్టువారును, సమస్త సంపదలను ఒసంగువారును, లోకమునకు ఆ నందమును కలుగజెయువారును అగు శ్రీరామునకు మరల మరల నమస్కరించుచున్నాను ************
శ్రీ రామ రామ రఘునందన రామ రామ
శ్రీ రామ రామ భరతాగ్రజ రామ రామ |
శ్రీ రామ రామ రణకర్కశ రామ రామ
శ్రీ రామ రామ శరణం భవ రామ రామ ||
శ్రీ రామ రామ భరతాగ్రజ రామ రామ |
శ్రీ రామ రామ రణకర్కశ రామ రామ
శ్రీ రామ రామ శరణం భవ రామ రామ ||
రఘువంశమును ఆనందింపజేయువారును,
భరతుని సోదరులును,యుద్ద మందు పరాక్రమమును
చూపువారును అగు ఓ రామచంద్రా,నాకు శరణము నొసంగుడు.
**********
శ్రీ రామచంద్ర చరణె మనసా స్మరామి
శ్రీ రామచంద్ర చరణె మనసా స్మరామి
శ్రీ రామచంద్ర చరణె వచసా గృణామి |
శ్రీ రామచంద్ర చరణె శిరసా నమామి
శ్రీ రామచంద్ర చరణె శరణం ప్రపదేయ్ ||
శ్రీ రామచంద్ర చరణె శిరసా నమామి
శ్రీ రామచంద్ర చరణె శరణం ప్రపదేయ్ ||
శ్రీరామచంద్రుని పాదములను మనస్సుతో స్మరించుచున్నాను.శ్రీరామచంద్రుని పాదములను వాక్కులతోవర్ణించుచున్నాను.శ్రీరామచంద్రునిపాదములను
శిరస్సుతోనమస్కరించుచున్నాను.శ్రీరామచంద్రుని పాదములను శరణుబొందుచున్నాను.
************
మాతా రామో మత్పితా రామచంద్ర:
స్వామీ రామో మత్సఖా రామచంద్ర
సర్వస్వం మై రామచెంద్రో దయాళు :
నన్యం జానే నైవ జానే న జానే
స్వామీ రామో మత్సఖా రామచంద్ర
సర్వస్వం మై రామచెంద్రో దయాళు :
నన్యం జానే నైవ జానే న జానే
రాముడే నా తల్లి, రాముడే నా తండ్రి. రాముడే నా ప్రభువు.
రాముడే నా మిత్రుడు. దయామయుడగు రాముడే నా సర్వస్వము రామునికంటే అన్యమగు దేనిని నే నెరుగను,ఎరుగను, ఎరుగను.
రామేతి రామచెంద్రేతి రామభద్రేతి వామనుమ్
యావజ్జీవం జపాన్ మర్త్యోజీవన్ముక్తో న సంశయ:
మానవుడు రామ అని గాని రామచేంద్ర అని గాని లేక రామభద్ర అని గాని వీనిలో ఎ దో ఒకమంత్రము యావజ్జీవము జపించుఛు నిస్సమ్సయముగా జీవన్ముక్తుడగును.
************
రామనామమహిమ
రామనామ మహిమగురించి తెలుసుకోవాలని నారద మహర్షి ఒకనాడు
శ్రీ మహవిష్ణువు వద్దకు వెళ్లి రామనామ మహిమను గూర్చి తెలుపమని వేడుకొనెను. నారదా నీకు రామనామ మహిమ తెలియదా? నివే ప్రత్యక్షముగా తెలుసుకొగలవు, అని శ్రీ మహవిష్ణువు నారదునీతో
" అదిగో భూలోకంలో, కీకారణ్యంలో, మామిడిచెట్టుపై భాగమున,
యంతో మాధుర్యముగా తనేముగ్దురాలవుతూ ఆనందిస్తూ పరవశంతో పాడుతున్న కోకిల నడుగు అదే చెపుతుంది రామనామ మహిమ"అని చెప్పాడు. "ఓసి ఇంతేనా" అంటూ నారదుడు కోకిల చెంతకు చేరి రామనామ మహిమగురించి తెలుపమని యడిగెను. అప్పుడా కోకిల " రామ రామ " అని మృదు మధురముగా పలికి చెట్టు మీద నుండి క్రిందకు పడి మృతి చెందినది.
శ్రీ మహవిష్ణువు వద్దకు వెళ్లి రామనామ మహిమను గూర్చి తెలుపమని వేడుకొనెను. నారదా నీకు రామనామ మహిమ తెలియదా? నివే ప్రత్యక్షముగా తెలుసుకొగలవు, అని శ్రీ మహవిష్ణువు నారదునీతో
" అదిగో భూలోకంలో, కీకారణ్యంలో, మామిడిచెట్టుపై భాగమున,
యంతో మాధుర్యముగా తనేముగ్దురాలవుతూ ఆనందిస్తూ పరవశంతో పాడుతున్న కోకిల నడుగు అదే చెపుతుంది రామనామ మహిమ"అని చెప్పాడు. "ఓసి ఇంతేనా" అంటూ నారదుడు కోకిల చెంతకు చేరి రామనామ మహిమగురించి తెలుపమని యడిగెను. అప్పుడా కోకిల " రామ రామ " అని మృదు మధురముగా పలికి చెట్టు మీద నుండి క్రిందకు పడి మృతి చెందినది.
"అయ్యో ఇదేమిటి ఇలా జరిగింది అనితలచుకుంటూ నారాయణుని వద్దకు వెళ్లి జరిగిన విషయమును తెలేయపరిచినాడు.కొకిల పొయినందుకు భాధపడకు, అదే అరణ్యములో ఒక జామచేట్టు మీద ఒక చిలక తన అందం చూసుకొని మురిసి పోతున్నది ఆ చిలకను అడుగు అని చెప్పగా, నారదుడు చిలక వద్దకుపో యి "చిలకా ఓ చిలక నా సందేహమును తీర్చవా, రామనామ మహిమను తెలుపవా " అన్నాడు. చిరునవ్వుతో" రామ రామ అని హొ యలుపలికి మృతిచెందినది.
నారదునకు కోకిల, చిలక, నావలన చనిపోయిన వణి భాదపడుతూ నారాయణనువద్దకు వెళ్ళెను. నారదా సమస్స్య తిరినదా అలా దిగులుగా ఉన్నావు, అడుగగా జరిగినవిషయమును తెలిపెను. జరిగినివాటి గురించి విచారించకు, ఇప్పుడు ఒకపనిచేయి ఆ అడవి చెంత ఉన్న గ్రామములో ఒక బ్రాహ్మణుని ఇంట ఆవు ప్రసవిమ్చింది ఆ పుట్టిన లేగాదూడను అడుగు రామనామ మహిమ తెలుపగలదు అన్నాడు నారాయణుడు. ఇప్పుడేమి జరుగునో అని తలుస్తూ, కొండంత ఆశతో లేగాదూడ వద్దకు వెళ్లి రామ నామ మహిమను గూర్చి తెలుపమని అడిగె, అంతే దూడ కూడ "రామ రామ" అని మృతిచెందినది.
హరి చెంతకు చేరి నారాయణ, నారాయణ, అని జపము చేస్తూ ఉన్నాడు. ఎమినారదా రామనామ మహిమ తెలిసినదా అనగా నారదుడు అన్ని తెలిసినవారు నన్ను ఆటపట్టిమ్చ్ చున్నారు, ఇది మీకు న్యాయమా అని అడిగె, నారదా తొందరపడకు సహనము వహించు, ఇప్పుడు వరగుణ మహారాజుకు లేకలేక ఓకే కుమారుడు జన్మించాడు, ఆ పిల్లవానివద్దకు వెళ్లి అడుగు నీ సందేహము నివృత్తి అవుతుంది అన్నాడు నారదుడు.అంతే నారదుని నోటమాట రాలేదు, భయముతో గజ గజ వణికిపోయాడు. అయ్యో స్వామి కోకిల,చిలుక,లేగదూడ దిక్కులేనివి అవి మృతిచెందిన దిగులుపడే వారు లేరు, నన్నేవరు యేమి అడుగలేకపోయారు,
కాని మహారాజు శివభక్తుడు, ఈ కుమారుడు మరణిస్తే నన్ను ఊరకే వదులుతాడా నా ప్రాణాలు తీయడు, వద్దు స్వామీ వద్దు నేను అంత సాహసము చేయలేను అంటూ వెనుతిరగపొయినాడు నారదుడు,
నారదా ఆగు అలా ఎన్నడు జరగదు నివు యందుకు భయ పడతావు
వెళ్లి రామనామ మహిమను తెలుసుకో అన్నాడు.
కాని మహారాజు శివభక్తుడు, ఈ కుమారుడు మరణిస్తే నన్ను ఊరకే వదులుతాడా నా ప్రాణాలు తీయడు, వద్దు స్వామీ వద్దు నేను అంత సాహసము చేయలేను అంటూ వెనుతిరగపొయినాడు నారదుడు,
నారదా ఆగు అలా ఎన్నడు జరగదు నివు యందుకు భయ పడతావు
వెళ్లి రామనామ మహిమను తెలుసుకో అన్నాడు.
************
శుద్ధ బ్రహ్మాపరాత్పర రామ !
కాలాత్మక పరమేశ్వర రామ !
శేషతల్ప సుఖనిద్రిత రామ ! బ్రహ్మా ద్యమర ప్రార్ధిత రామ చన్డకిరణ కులమన్డన రామ!
కాలాత్మక పరమేశ్వర రామ !
శేషతల్ప సుఖనిద్రిత రామ ! బ్రహ్మా ద్యమర ప్రార్ధిత రామ చన్డకిరణ కులమన్డన రామ!
శ్రీమద్దశరథ నన్దన రామ !
కౌసల్యా సుఖ వర్ధన రామ !
విశ్వామిత్ర ప్రియధన రామ !
ఘోరతాటకా ఘాతక రామ !
మారీచాది నిపాతక రామ!
విశ్వామిత్ర ప్రియధన రామ !
ఘోరతాటకా ఘాతక రామ !
మారీచాది నిపాతక రామ!
కౌశికముఖ సంరక్షక రామ ! శ్రీమదహల్యోద్ధారక రామ !
సురమునివర గుణసంస్తుత రామ ! నావికధావితమృదుపద రామ ! మిధిలాపుర జనమోదక రామ ! విదేహకమానస రంజక రామ !
త్ర్యంబక కార్ముక భన్న్జక రామ ! శివధనుస్సును విరచిన రామా !
సీతార్పిత వరమాలిక రామ ! కృత వైవాహిక కౌతుక రామ !
భార్గవదర్ప వినాశక రామ ! శ్రీమదయోధ్యా పాలక రామ !
అగణిత గుణగణ భూషిత రామ ! అనేక సుగుణములచే శోభించు రామా !
అవనీతనయా కామిత రామ !
రాకాచన్ద్ర సమానాన రామ ! తృవాక్య శ్రితకానన రామ !
ప్రియగుహ వినివేదిత పద రామ !
తటలిత నిజమృదుపదరామ !
భరద్వాజ ముఖనందక రామ !
చిత్రకూటాద్రి నికేతన రామ !
దశరథ సంతత చింతిత రామ !
కైకేయీ తనయార్ధిత రామ ! విరచిత నిజపితృకర్మక రామ !
భరతార్పిత నిజపాదుక రామ ! దండక వనజన పావన రామ !
దుష్ట విరాధ వినాశన రామ ! రభజ్గ సుతీక్ష్నార్చిత రామ !
అగస్త్యా నుగ్రహ వర్ధిత రామ ! గ్రద్ద్రాధిప సంపేవిత రామ ! పంచవటి తట సుస్థిత రామ ! శూర్పణ ఖార్తి విధాయక రామ !
ఖరదూషణ ముఖ సూదక రామ !
సీతా ప్రియ హరిణానుగ రామ !
మారీచార్తి కృతాశుగ రామ !
వినష్ట సీతా న్వేషక రామ !
గృధ్రాధి పగతి దాయక రామ !
శబరీదత్త ఫలాశన రామ !
కభంధ బహుచ్చేదన రామ !
హనుమత్సేవిత నిజపద రామ !
నత సుగ్రీవా భీష్టద రామ !
గర్విత వాలి సంహారక రామ !
వానరదూత ప్రేషక రామ !
హితకర లక్ష్మణ సంయుత రామ !
కపివర సంతత సంస్మృత రామ!
తద్గత విఘ్న ధ్వంసక రామ !
సీత ప్రాణ ధారక రామ !
దుష్ట దశానన ధూషి త రామ !
శిష్ట హనుమద్బూషిత రామ !
సీతోదిత కాకావన రామ !
కృత చూడామణి దర్శన రామ !
కపివర వచనాశ్వాసిత రామ !
రావణ నిధన ప్రస్థిత రామ !
వానర సైన్య సమావృత రామ !
శోషిత సరిధీశార్ధిత రామ !
విభీషణా భయ దాయక రామ ! పర్వతసేతు నిబంధక రామ !
కుంభకర్ణ సిరశ్చే దక రామ !
రాక్షస సంఘ విమర్ధక రామ !
అహి మహి రావణ దారణ రామ !
సంహృత దశముఖ రావణ రామ !
విధి భవ ముఖసుర సంస్తుత రామ !
ఖస్థిత దశరథ వీక్షిత రామ ! సీతాదర్శన మోదిత రామ !
అభిషిక్త విభీషణ నుత రామ !
పుష్పక యానారోహణ రామ !
భారద్వాజాభి నిషేవణ రామ !
భరత ప్రాణ ప్రియకర రామ !
సాకేతపురీ భూషణ రామ !
సమస్త జనసమ్మానిత రామ !
రత్నలస త్ఫీటస్ధి త రామ !
పట్టాభిషేకాలం కృత రామ !
పార్ధివకుల సమ్మానిత రామ !
విభీషణార్పిత తరంగక రామ !
కీశ కులానుగ్రహకర రామ ! సకల జీవ సంరక్షక రామ ! సమస్త లోకోద్దారక రామ ! అగణిత మునిగణ సంస్తుత రామ! విశ్రుత దాశ కనోద్భవ రామ ! సీతా లింగన నిర్వృత రామ !
నీ తి రక్షిత జనపద రామ ! విపిన త్యాజిత జనకజ రామ ! కారిత లవణా సుర వధ రామ ! స్వర్గత శంబుక సంస్తుత రామ !
స్వతనయ కుసలవ నన్దిత రామ !
అశ్వమేథ కృతు దీక్షత రామ ! కాలావేదిత సురపద రామ ! అయోధ్యక జనముక్తిద రామ !
విధిముఖ విభుధా నందక రామ ! తేజోమయ నిజరూపక రామ ! సంస్కృతి భంద విమోచక రామ ! ధర్మ స్థాపన తత్పర రామ ! భక్తి పరాయణ ముక్తిద రామ ! సర్వచరాచర పాలక రామ ! సర్వభవామయ వారక రామ !
వైకుంఠాలయ సంస్థిత రామ !
నిత్యనంద పద స్థిత రామ !
రామ రామ జయ రాజ రామ !
రామ రామ జయ సీతా రామ!
శుద్ధ బ్రహ్మాపరాత్పర రామ ! శుద్ధ బ్రహ్మ స్వరూపులను, పరాత్పరులును ఆయిన రామా !
కాలాత్మక పరమేశ్వర రామ ! కాలరూపులును,పరమేశ్వరుడును ఆయిన రామా !
శేషతల్ప సుఖనిద్రిత రామ ! శేష శయ్యపై సుఖముగా నిద్రించు రామా !
బ్రహ్మా ద్యమర ప్రార్ధిత రామ బ్రహ్మాదేవుడు మొదలైన దేవేతలచే ప్రార్ధిమ్పబడు రామా !
చన్డకిరణ కులమన్డన రామ! సూర్య కులమును ప్రకాశింప జేయు రామా !
కాలాత్మక పరమేశ్వర రామ ! కాలరూపులును,పరమేశ్వరుడును ఆయిన రామా !
శేషతల్ప సుఖనిద్రిత రామ ! శేష శయ్యపై సుఖముగా నిద్రించు రామా !
బ్రహ్మా ద్యమర ప్రార్ధిత రామ బ్రహ్మాదేవుడు మొదలైన దేవేతలచే ప్రార్ధిమ్పబడు రామా !
చన్డకిరణ కులమన్డన రామ! సూర్య కులమును ప్రకాశింప జేయు రామా !
శ్రీమద్దశరథ నన్దన రామ ! శ్రీమంతుడగు దశరధుని కుమారుడగు రామా !
కౌసల్యా సుఖ వర్ధన రామ ! కౌసల్య యొక్క సుఖమును పెంపొందించు రామా !
విశ్వామిత్ర ప్రియధన రామ ! విశ్వామిత్రునకు ప్రియధనమగు రామా !
ఘోరతాటకా ఘాతక రామ ! భయంకర రూపిణియగు తాటకను సంహరించిన రామా!
మారీచాది నిపాతక రామ! మారీచాది రాక్షసులను మట్టుపెట్టిన రామా!
విశ్వామిత్ర ప్రియధన రామ ! విశ్వామిత్రునకు ప్రియధనమగు రామా !
ఘోరతాటకా ఘాతక రామ ! భయంకర రూపిణియగు తాటకను సంహరించిన రామా!
మారీచాది నిపాతక రామ! మారీచాది రాక్షసులను మట్టుపెట్టిన రామా!
కౌశికముఖ సంరక్షక రామ ! విశ్వామిత్రుని యాగమును రక్షించిన రామా !
గౌతమముని సంపూజిత రామ ! గౌతమ మునీస్వరునిచేలెస్సగా పూజింపబడిన రామా !
సురమునివర గుణసంస్తుత రామ ! దేవతలు మునీస్వరులుచే స్తుతిమ్పబడిన రామా !
నావికధావితమృదుపద రామ ! నావికునిచే కడుగాబడిన మృదువైనపాదములుగల రామా!
మిధిలాపుర జనమోదక రామ ! మిధిలాపుర జనులకు సంతోషమును కలుగజేసినరామా విదేహకమానస రంజక రామ ! జనకుని మనస్సును రంజింపజేసిన రామా !
త్ర్యంబక కార్ముక భన్న్జక రామ ! శివధనుస్సును విరచిన రామా !
సీతార్పిత వరమాలిక రామ ! సీతచే వేయబడిన శ్రేష్టమగు పుష్పమాల గల రామా !
కృత వైవాహిక కౌతుక రామ ! సీతను వివాహమాడిన రామా !
భార్గవదర్ప వినాశక రామ ! పరశురాముని దర్పమును అణచిన రామా !
శ్రీమదయోధ్యా పాలక రామ ! అయోధ్యా వాసులకు అనందమును కలుగ జేసిన రామా!
అగణిత గుణగణ భూషిత రామ ! అనేక సుగుణములచే శోభించు రామా !
అవనీతనయా కామిత రామ ! సితదేవిచే ప్రేమిమ్చబడిన రామా!
రాకాచన్ద్ర సమానాన రామ ! పున్నమిచెంద్రని వంటి ముఖముగల రామా!
పితృవాక్య శ్రితకానన రామ ! పితృ వాక్య్యమును అనుసరించి అడవులకుకేగిన రామా!
ప్రియగుహ వినివేదిత పద రామ ! ప్రియగుహునిచేనమస్క్రింపబడిన పాదములుగల రామా!
తటలిత నిజమృదుపదరామ ! గుహునిచే కడుగాబడిన మృదువై న పాదములు గలరామా!
భరద్వాజ ముఖనందక రామ ! భరద్వాజుని ఆనందపరచిన రామా!
చిత్రకూటాద్రి నికేతన రామ ! చిత్రకూటపర్వతము పై నివసించిన రామా!
దశరథ సంతత చింతిత రామ ! దశరదునిచే సదా చిన్తింపబడిన రామా!
కైకేయీ తనయార్ధిత రామ ! భరతునిచే ప్రార్ధించిన రామా!
విరచిత నిజపితృకర్మక రామ ! మరణించిన దశరదునకు పితృ కర్మల నాచరించిన రామా!
భరతార్పిత నిజపాదుక రామ ! భరతునకు పాదుకలు నొసంగిన రామా!
దండక వనజన పావన రామ ! దండకారణ్య వాసులను పావనమోనర్చిన రామా!
దుష్ట విరాధ వినాశన రామ ! దుష్టుడగు విరాదుని సంహరించిన రామా !
శరభజ్గ సుతీక్ష్నార్చిత రామ ! శరభంగుడుసుతీక్ష్నుడు,అను మహనీయులచెపూజీమ్పబడినరామా ! దుష్ట విరాధ వినాశన రామ ! దుష్టుడగు విరాదుని సంహరించిన రామా !
అగస్త్యా నుగ్రహ వర్ధిత రామ ! అగస్త్యుని అనుగ్రహమును బడసిన రామా !
గ్రద్ద్రాధిప సంపేవిత రామ ! గ్రద్ద్ర రాజు జటాయువుచే సేవిమ్పబడిన రామా !
పంచవటి తట సుస్థిత రామ ! పంచవటీ తీరమున నివసించిన రామా i
శూర్పణ ఖార్తి విధాయక రామ ! శూర్పణను రక్షించిన రామా !
ఖరదూషణ ముఖ సూదక రామ ! ఖరదూషణాది రాక్షసులను సంహరించిన రామా!
సీతా ప్రియ హరిణానుగ రామ ! సీతాకు ప్రియమై న బంగారులేడిని వెన్నంటిన రామా !
మారీచార్తి కృతాశుగ రామ ! మారీచుని శిక్షించిన బాణముగల రామా!
వినష్ట సీతా న్వేషక రామ ! సీత కొరకు అన్వేశిక్షించిన రామా !
గృధ్రాధి పగతి దాయక రామ ! జటాయువు నకు సద్గతి నొసంగిన రామా!
శబరీదత్త ఫలాశన రామ ! శబరి ఓ సంగిన ఫలములను భుజించిన రామా !
కభంధ బహుచ్చేదన రామ ! కభంధుని బహువులు ఛేదించిన రామా !
హనుమత్సేవిత నిజపద రామ ! హనుమంతునిచే సేవిమ్పబడిన పాదములుగల రామా !
నత సుగ్రీవా భీష్టద రామ ! వినీతుడగు సుగ్రీవుని అభీష్టమును నెరవేర్చిన రామా !
గర్విత వాలి సంహారక రామ ! గర్వించిన వాలిని సంహారించిన రామా !
వానరదూత ప్రేషక రామ ! వానరదూతను పంపిన రామా !
హితకర లక్ష్మణ సంయుత రామ ! హితకరుడగు లక్ష్మణునితో కూడియున్న రామా !
కపివర సంతత సంస్మృత రామ! కపిశ్రేష్టులచే సదా సంస్మరింపబడిన రామా!
తద్గత విఘ్న ధ్వంసక రామ ! కపిసమూహము యోక్క విఘ్నములను కాపాడిన రామా!
సీత ప్రాణ ధారక రామ ! సీతయౌక్క ప్రాణములను కాపాడిన రామా !
దుష్ట దశానన ధూషి త రామ ! దుష్టుడగు రావణునిచే పరుషముగామాట్లాడబడిన రామా!
శిష్ట హనుమద్బూషిత రామ ! శిష్టుడగు హనుమంతునిచే స్తుతిమ్పబడిన రామా!
సీతోదిత కాకావన రామ ! సీత తెలిసినట్టి కాకాసురుని రక్షించిన రామా !
కృత చూడామణి దర్శన రామ ! సితచే ఒసంగాబడిన చూడామణిని దర్శించిన రామా!
కపివర వచనాశ్వాసిత రామ ! హనుమంతుని వాక్యములచే ఆశ్వాసమును బొందిన రామా!
రావణ నిధన ప్రస్థిత రామ ! రావణుని సంహరించుటకు భద్ధకంకను డైన రామా!
వానర సైన్య సమావృత రామ ! వానర సైన్యముతో కూడియున్న రామా!
శోషిత సరిధీశార్ధిత రామ ! సముద్రునిచే ప్రార్ధిమ్పబడిన రామా!
విభీషణా భయ దాయక రామ ! విభీషనునకు అభయ మోసంగిన రామా!
పర్వతసేతు నిబంధక రామ ! పర్వతములలో సేతువును నిర్మించిన రామా!
కుంభకర్ణ సిరశ్చే దక రామ ! కుంభకకర్ణుని శిరస్సును చ్ఛేదించిన రామా!
రాక్షస సంఘ విమర్ధక రామ ! రాక్షస సమూహమును మర్దించిన రామా!
అహి మహి రావణ దారణ రామ ! ఆహి మహి రావణులను శిక్షించిన రామ!
సంహృత దశముఖ రావణ రామ ! దశముఖ రావణుని హతమార్చిన రామా!
విధి భవ ముఖసుర సంస్తుత రామ ! బ్రహ్మా ,శివుడు మొదలైన దేవతులచే సుతిమ్పబడిన రామా!
ఖస్థిత దశరథ వీక్షిత రామ ! ఆకాశమున దశ రధుని వీక్షిమ్చిన రామా!
సీతాదర్శన మోదిత రామ ! సీతాదర్శనముచే ఆనందమును పొందిన రామా!
అభిషిక్త విభీషణ నుత రామ ! పట్టభిషక్తుడేన విభీషనునిచే స్తుతింపబడిన రామా!
పుష్పక యానారోహణ రామ ! పుస్పకవిమానమును అధిరోహించిన రామా!
భారద్వాజాభి నిషేవణ రామ ! భారద్వా జాది మహర్షులను సేవించిన రామా!
భరత ప్రాణ ప్రియకర రామ ! భరతుని ప్రాణమును కాపాడిన రామా!
సాకేతపురీ భూషణ రామ ! సాకేతపురమునకు భూషణుడైన రామ!
సమస్త జనసమ్మానిత రామ ! జనులన్దరిచే సన్మా నిమ్పబడిన రామా!
రత్నలస త్ఫీటస్ధి త రామ ! రత్నములుచే శో భించు పీటమున ఆసీనుడైన రామా!
పట్టాభిషేకాలం కృత రామ ! పట్టాభిషేకముచే అలంకృత మైన రామా!
పార్ధివకుల సమ్మానిత రామ ! రాజులచే సంన్మానిమ్పబడిన రామా !
విభీషణార్పిత తరంగక రామ ! విభీషణునిచే అర్పిమ్పబడిన భక్తి ప్రపత్తుగల రామా!
కీశ కులానుగ్రహకర రామ ! వానరసమూహమునకు అనుగ్రహించిన రామా!
సకల జీవ సంరక్షక రామ ! సమస్త జీవులకును సంరక్షకుడ వై న రామా!
సమస్త లోకోద్దారక రామ ! సమస్త లోకములకు ఆ ధారభుతుడ వైన రామా!
అగణిత మునిగణ సంస్తుత రామ! వచ్చిన మునులచే లేస్సంగ్ స్తుతిమ్పబడిన రామా!
విశ్రుత దాశ కనోద్భవ రామ ! రావణ సంహరముచే గొ ప్ప కీ ర్తిని బడసిన రామా!
సీతా లింగన నిర్వృత రామ ! సీతాలింగనముచే సుఖమును పొందిన రామా!
నీ తి రక్షిత జనపద రామ ! నీతి నియమములు గలిగిన జనులతో గూడిన రామా!
విపిన త్యాజిత జనకజ రామ ! సీత ను అడవికి పంపిన రామా!
కారిత లవణా సుర వధ రామ ! సత్రుఘ్ననిద్వార లవణాసురుని సంహారమునకు కారణమై న రామ!
స్వర్గత శంబుక సంస్తుత రామ ! సంబుకునిచే సంసుతిమ్పబడిన రామా !
స్వతనయ కుసలవ నన్దిత రామ ! కుమారులగుకుశ లవులనుగాంచిసంతసించిన రామా!
అశ్వమేథ కృతు దీక్షత రామ ! అశ్వమేథ యాగ నిర్వహణమునకు దీ క్ష వహించిన రామా!
కాలావేదిత సురపద రామ ! కాలునిచే తెలుపబడిన బ్రహ్మాధామ గమన వృత్తాంత్త ముగల రామా!
అయోధ్యక జనముక్తిద రామ ! అయోధ్యా పురవాసులకు ముక్తినోసంగిన రామా!
విధిముఖ విభుధా నందక రామ ! బ్రహ్మా దేవునాకు ,దేవతులకు ఆనందము కలిగించిన రామా!
తేజోమయ నిజరూపక రామ ! తేజోవంత మై న బ్రాహ్మ స్వరూపమును పొందిన రామా !
సంస్కృతి భంద విమోచక రామ ! సంసార భంద విమోచాకులగు రామా!
ధర్మ స్థాపన తత్పర రామ ! ధర్మ స్థాపన తత్పరులగు రామా!
భక్తి పరాయణ ముక్తిద రామ ! భక్తిపరాయణులకు మోక్షమోసంగునట్టి రామా!
సర్వచరాచర పాలక రామ ! సమస్త చరాచర ప్రానికోట్లను పాలించురామా!
సర్వభవామయ వారక రామ ! సంసారరోగమును పరిపూర్ణముగా నివారించు రామా!
వైకుంఠాలయ సంస్థిత రామ ! వై కుంట నివాసమున వేల యు నట్టి రామా!
నిత్యనంద పద స్థిత రామ ! నిత్యానంద బ్రహ్మా పదమున విలసిల్లు రామా!
రామ రామ జయ రాజ రామ ! రామా రామా రాజాధిరాజగు రామా జయమగుగాక!
రామ రామ జయ సీతా రామ! రామ రామ సీతారామా జయమగుగాక!
శ్రీ రామ మంగళ హారతి
రామచంద్రాయ జనకర్రాజజామనోహరాయ
మామకా భీష్టదాయ మహితమంగళమ్ సీతా మనోహరులను, భక్తుల అభిష్టములను నెరవేర్చువారును అగు శ్రీ రామచెంద్రు నకు మంగళమగుగాక!
కౌసలేయాయ మందహాస దాస పోషణాయ
వాసవాది వినుత సద్వరద మంగళంకోసలదేశాధిపతియు, మందహాసము కులవారును, భక్తులను పోపోషించువారును దేవేం ద్రాదులచే స్తుతింపబడువారును, ఉత్తమవరముల నొసంగువారును అగు శ్రీ రామచెంద్రునకు మంగళమగుగాక!
పుండరీ కాక్షాయ పూ ర్ణ చంద్రాననాయ
అండజాత వాహనాయ అతుల మంగళమ్.కమునేత్రులను,పూర్ణచంద్రుని వంటి సుందరముఖము కలవారును, గరుడ వాహనులను అగు విష్ణు రూపులయ్న శ్రీ రామచెంద్రునకు మంగళమగుగాక!