4, నవంబర్ 2012, ఆదివారం

.ప్రాంజలి ప్రభ - Namo Namo Sri Thirumala thirupathi Venkatesha

ఓం శ్రీ రాం     ఓం శ్రీ రాం     ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ. 
సర్వేజనా సుఖినోభవంతు

మంచి మాట ప్రతివోక్కరి మనస్సుకు వెన్నల బాట 
                                                    
ఎందరో మహానుభావులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కీర్తిమ్చితూ  అనేక రచనలు చేసియున్నారు, ఇంకా భక్తులు రచనలు  చేస్తునే ఉ న్నారు, అదేవుని కృపకు పాత్రులవుతున్నారు. నేను వ్రాసినది  పాండిత్యము  కాదు,  పద్యము కాదు,  నేను ఆరాధించే శ్రీ రామ భక్త హనుమంతుని సహాయముతో శ్రీ తిరుమల  తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధిస్తూ,  ప్రతి ఒక్కరికి స్వామి వారి క్రుపాకటాక్షముల్  చెందాలని వ్రాసిన 108 కుసుమాలు, గూగుల్ మరియు జి మెయిల్ ద్వారా ప్రతి వొక్కరూ చదువు కొనే విధముగా నా శ్రీమతి, పుత్రికల ప్రోత్యాహముతో, మరియు శ్రీ వెంకటేశ్వరస్వామి వారి భక్తుల సహాయ సహకారముతో ఇది పూర్తిచేసినాను.
             
            నేను వ్రాసినా కవితలలో అక్షరతప్పులను,  వాక్య  దోషములను నేనే  భాద్యత వహిష్తున్నాను, మీ సలహాలు అభ్యంతరములు నాకు తెలియపర్చండి, సరిదిద్దు కోగలను. మీరు చదివి మరోక్క రిని చదవమని చెప్పగలరని ఆ శ్రీవెంకటేశ్వరస్వామి వారి కృపకు పాత్రులవ్వాలని, అందరికి అర్ధమయ్యే పదాలతో, సరళమైన శైలిలో తకముగా మీ కందిస్తున్నాను.          
                                             
            
1. నమోకేశవ, నమోనారాయణ, నమోమాధవ,
    నమోగోవింద, నమోవిష్ణు, నమోమధుసూధన,
    నమోత్రివిక్రమ, నమోవామన, నమోశ్రీధర,
    నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
 
                                    
  
2. నమోహృషేకేశ, నమోపద్మనాభ, నమోదామోదర, 
    నమోసంకర్షణ, నమోవాసుదేవ, నమో ప్రద్యుమ్న,
    నమోయనిరుర్ధ, నమోపురుషోత్తమ, నమోయధోక్షజ,
    నమోనమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.3. నమోనారసింహ, నమోఅచ్చుత, నమోజనార్ధన,
    నమోఉపేంద్ర , నమోశ్రీకృష్ణ , నమోశ్రీహరి,
   నమోవెంకటేశ, నమో శ్రీనివాస, నమోసర్వదేవ,
   నమోనమోశ్రీ తిరుమలతిరుపతి
వేంకటేశ.

4. అగ్రత, అఖండ, అరుణోదయ,
     అమోఘ, అద్భుత, అభిరూప,
     అమృత, అభీష్ట, అమ్బుజనాధ,  
     నమోనమోశ్రీ తిరుమలతిరుపతి వేంకటేశ.

5.  అభిమాన, అభ్యు దయ, అష్టోత్తరకర్త,
     అభిజ్ఞాన, అలంకార ,అభివాద
ర్త,
     అమిత, అమూల్య, అరవిన్దభర్త,        

     
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి
వేంకటేశ.

6.  అకార, అకర్ష,ఆచార్యువు,
     ఆనంద, ఆత్రేయ,అధిపుర్షు
వు,
             ఆశ్రయ, ఆశ్రిత, ఆరాధకు
వు,       
                       నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


7.  సువర్ణ , సుందర, సుహృదయ,
     సురబి, సురత, సుభగాసుత,
     సుకుమార, సుకృత, సురోత్తమ,
     నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
  
8.  కరుణ,కటాక్ష,కమనీయరూప,
     కనువిందు 
చేయు
కమనీయ కవచధారి,
    
ప్పముకట్టే, కలియుగ కమలానాధ,  
     నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.  


9.  గగన, గతీశ ,గతిప్రదాతా,
     గణక , గణకార,  గణదాతా,
     గమన, గణాకర,  గణరాజా,
     నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
    


10. గోదేశ,గోదాన,గోధార,
      గోదేవ, గోద్యేత్య, గోధర,
      
గోధాత, గోధారణ, గొనాధ,
                         నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ. 

11. మహాస్వన:, మహామాయ:, మహాబల:
      మహాబుద్ధి:, మహావీర్య:,మహాశక్తి:
      మహాద్య్యుతి
:, మహాశన :, మహాభాగ :
      నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


12. సుకుమార,  సుధామృత, సుభాగాసుత,
                సుముఖం,   సుహృదం,          సులభం,
                స్వాతికార,  సాహిత్య,       స్వభాగినేయ, 
                నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


                           13.  అభిరామ, అసహయ, అవనీతనయ,
                               అమాత్త్య,  అభిఘాత,   అసాధ్యాయ,
                              అక్షపాద,        ఆక్షేపక,    ఆర్యవర్తక,
                         నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


                           14.  జనార్ధన:,      జగద్రక్ష:, జగత్కర్త:,
                                  జగజ్జేత:,   జగత్జ్యోతిష:, జగజ్జీవ:,
                                 జగద్గురు:, జగత్జయ:, జగత్సాక్షి:,
                          నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


                            15.  కులక్షణ:, కులసంభవ:, కులసేష్ట:,
                                  కులీన:,     కులేస:,    కులేస్వర్య:,
                                  కూత్తమ:,  కూతేజార:,       కుధీర:,     

                          నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


                         16. గగనతల,  గగనకుసమ,    గగనధ్యజ,
                           గజవాహన, గరుడవాహన,  గణనీయ,
                             గజతుర,      గజప,     గానితవిశారద,

                         నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
                    17.  శ్రీకర:,        శ్రీనిధి:,          శ్రీమాన్ :
                           శ్రీవాస:, శ్రీ
వత్సవక్షా:, శ్రీమతావర :
                           శ్రీనివాస:, శ్రీవిభావన:,       శ్రీ ధర :

                  నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


                    18   పరమాత్మ:,  పరంధామా:,  పద్మనాభా :
                    ప్రభాత:,  ప్రత్యర్ధన:,          పురుషోత్తమ:,
                    ప్రజాపతి:,  ప్రజాభవ:,        పుండరీకాక్ష:,

                    నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

                19.  ప్రాణదాత,  ప్రాణే నేశ్వర,     ప్రధమగణాధీశ,
                     ప్రత్యేకాత్మ,  ప్రసన్నాత్మ,   ప్రమేయాత్మ,
                     పద్మనిభేక్షణ,  పరమస్పష్ట,  పరమేశ్వర,

                     నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

                

              20.  ఇతిహాస,       ఇతివృత్త,       ఇందువదన,
                     ఇష్టఘంధ,      ఇష్టభోజ,      ఇంద్రియలోల,
                     ఇల్లాలుఇష్టంతేలిసిన, ఇక్స్వాకువం
వర్ధన,

                     నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


                 21. దేశరూప,  దెవభూయ,  దేవకీనందన,
                    ధనాధిప,          ధన్య,        ధర్మరక్షక,
                    ధీమన్థ,  ధీర్ఘ
దృష్టి   ,   దివ్యకరుణ,    

                    నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

                 22. సర్వకాల, సర్వావస్థలలో, సంధర్శనదేవ,
                     సర్వమానవుల,  సమ స్యల,  ప్రక్షా
దేవ,
                     సమగ్ర
మైన, సందేహములను,   నివర్తదేవ,

                     నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ. 

                       23. దర్పక,  ద్వాదశాత్మ,  దామోదర,
                           దీ క్ష క,   దుర్వర,       ద్యూ దక

                            దాక్షిణ్య, 
దినమణి,      దివాకర,

                      నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

                24. మణి కంకణ, మందస్మిత , మకుటాధ్యాభరణ,
                  మృదుమధుర, మహోన్నత, మమోఘరూప,
                  మనస్కార, మనిమాణిక్య, ఆ భరణ మహాకుల,   

                  నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

                25. ఆరాటం, అర్భాటంలేని, అనందలోలువు ,
                   ఆదర్శ,         ఆత్మీయ
తా,      ఆరాధ్యువు ,
                  అందరిలో,వెలసియున్న, అత్మీయబన్దువు
వు ,

                 నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ. 

                   26. చంచల,  చమత్కార,     చతుర్వ్వెది,
                  చక్రవాస,   చక్రహస్త,       చతుర్భుజి,
                  చతుర్వేద్వ్వరో,  రత్నాయ,  చక్రపాణి,
                                                నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

  
                27. నీ నామమే మాకు నిధియ నిదానము,
                    నీ నామమే యాత్మనిదినాన్జనము,
                    నీ    శామము     సర్వ  పాప  హారము,

                     నమో నమో శ్రీ తిరుమల  తిరుపతి వేంకటేశ.
                                                          

             28. హనుమంతునకు శ్రీరామ నామము నిత్యఔషధం ,
                 నారదునకు  నారాయణ  నామమునిత్యఔషధం,
                 నీ కొండయక్కినవారికి గోవింద నామము నిత్యఔషధం,
                 నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
 
               29.పదారువేల భామ అలకలు తీర్చినమోహన రూపం,
                  గొల్లపడచుల కులుకు చూపులకు సరియగు రూపం,
                 సత్యభామ కౌగిలి సోమ్పులుమరగిన వేడుక  రూపం,
                 నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
   
              30. ఆశ్రితులకు  అమృతం దొరుకు  తిరుపతి   క్షేత్రం,
               వలయ భుద్ధినిమార్చే జ్ఞాణామృత
తిరుపతి క్షేత్రం,
               భక్తుల  కోర్కలుతీర్చే  ఘంధపరిమల
తిరుపతి క్షేత్రం,

                నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
  
              31. మేము ఏడు వారాలు వ్రతములు  ఆచరిస్తాము,
                 మేము   ఏడు కొండలు  ఏక్కి నడచి వస్తాము,
                 మేము నీలాలు అర్పించి మొక్కులు  చెల్లిస్తాము,

                  నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.  

                   32.  ఉద్రేకాలకు పోక పరిశీలింన్చిప్రవర్తిస్తాము,
                 ఆనందాన్ని వదులుకోక  అణచివేతను  వదులుతాము,
                 ప్రతిది పరసీలించి నిజరూపము తెలుసు కుంటాము,

                 నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

33. నిన్నుచూసిన తన్మయత్వంతో తప్పటడుగులు  వేస్తున్నాము,
              కాలాను       గుణం
    మార్పులకు   తలవంచ   తున్నాము,
             శరణార్ధులను  ఆదుకుంటూ,  దేశాభివృద్ధికి కృషి చేస్తున్నాము,

             నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
 
              34  నింగి నంత   వ్యాపించిన     సర్వాంగ     సున్దరువు,
             
పృ ద్ధ్వి లాగ  సర్వం    భరించే     మహానుభావువు,
              అగ్ని,వాయువు, వెలుగు, అందరికి అందిచువా
వు,  

              నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

              35  తులసి        వనమాలా          విభూషితువు,

                సాలిగ్రామ      మాలికా      కంఠా       దీశువు,
                దీవ్యసుగంధ లేపితుడయిన కూర్మనాదు
వు,

                నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

              36.  కడలిలో ఈత గచిన మత్య వల్లభువు,

                  మందరపర్వత మెత్తిన కూర్మ వల్లభువు ,
                  మూతిపై  ధరణి మోసిన వరాహవల్లభు
వు ,

                   నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

            37.   దుష్ట  రాక్షస దురుమే నార    శిoహవల్లభువు,
                   దుష్ట రాజులను సంహరించిన  పరశురాము
వు,
                   దానంగా మూడడుగులు  పొందిన వామను
వు,

                   నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
    
              38.   సూక్ష్మ ము  కానివావు, దీర్ఘ ముకానివావు,
                   
అనంతమయువు, జన్మ వినాశ  రహితువు,

                    రూప గుణ వర్ణ నామరహితువు ,
                    నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


          39.   దినదిన గన్న్డం నుండి రక్షించు   ధీనభందువుడవు,
                       ధీక్షాపరులకు దివ్య వెలుగు    చూపు  దినకరుడవు,
                      ధర్మదేవతను  ధర్మమార్గమున  నడిపించే ధక్షుడవు,

                       నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

            40.  చందనలేపముతో, కస్తూరి తిలకమును, ధరించినావు,
                      నిలబడి   సువర్ణ   ఆభరణాలతో   దర్శనమిస్తున్నావు,
                      వక్షస్థలమునందు  శ్రీ దేవిని,  భూదేవిని, భరిష్తున్నావు,

                       నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

         41.  సకల   ప్రాకోటికి   మోక్ష  మార్గం   చూపు  జ్ఞా  దీపమైనావు,
          మానవులలో వుండే అంధకారమును తొలగించే జ్యోతి వై నావు,
         మనస్సుకు   ప్రశాంతత   కల్పించే  దివ్య
మన్గల  స్వరూపుడవు ,                   నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


          42.  నాదిలో  అంతర్మధనంతో   నిన్ను   ప్రా ర్ధి స్థు న్నాము,
           నాకంఠములో  స్వరము ఉన్నంత   వరకు  
కీర్తి
స్తున్నాము,
          నాతపన నీలోఐక్యమై పరవశించి  జీవితం గడుపుతున్నా
ము,
                   నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ. 


                 43.  నీ మహిమలు విని, కీర్తించి, స్మరించినాము,
                    
నీ స్వరూపనికి  నమస్కరించి, అర్ధించినాము, 
                   నా మనస్సులోని భక్తి భావాన్ని నివేదించినా
ము,

                      నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

           44.  హరి గూర్చిస్తుతులు చదవని నాలుకలు కప్పనాలుకలే,
                    హరి చూడని నేత్రములు 
నె
మలి ఈక కన్నులే,
              హరిని  త్రికరణ శుద్ధితో ధ్యానించని ప్రాణం
ఉన్నాలేనట్లే,

                      నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

              45.  దేవతలు, ధర్మపరులు, భక్తులు,  సంచరించుకొండ,
                       వే
మంత్రాలుతో   బ్రాహ్మణులు జపించే  కొండ,
                  తాపసులు నిరంతరం హరినామస్మరణ చే యు కొండ,

                        నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

           46.  తల్లి   దండ్రులను    ప్రత్యక్ష    దేవతులుగా    కొలిచితిని,
              సూర్య   చంద్రులను   గతి  తప్పని దేవతులుగా కొలిచితిని,
             పిల్లలుకు బ్రతుకు మార్గము చూపి భార్యతో నిను కొలిచితిని,

                       నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

        47.  కలసి  మెలసి జీవిస్తాము,లుగురుతో పాటు శ్రమిస్తాము,
             భద్ధకమును వదిలేస్తా
ము ,   అధిక  నిద్రను   మరుస్తాము,
        పకృతి ననుసరించి ప్రవర్తిస్తా
ము, మృష్టాన్నభోజనంవదిలేస్తాము,

                        నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ. 
       
           48. శాoతముతో,స్నేహితులును,భoధువులను ఆదరిస్తాము,
              శత్రువులను   కోపము లేకుండా ప్రేమతో   గౌర  విస్తాము,
             ఇల్లాలు   పిల్లలు   సంతోషమే    స్వర్గమని    భావిస్తాము,
                     నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

                49.  నీతలపే నాబలమై,  నీ నామమే నాకు వరమై,  

               నీ చూపులే నామార్గమై, ని మౌనమే  నాకు సంకేతమై,
               నీ కరుణ యే నాకు అర్హతయే, నీ సేవయే నాకు ఆరాధ నై,
                      నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

                  50.  రాగం,తానం, పల్లవి  సంగీత స్వరమయం,
                      మనస్సు,     బుద్ధి,   ప్రేమ,   ప్రాణ మయం,
                      ఆశ , వాసన ,   చింత,    మాయ   మయం, 

                    నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

          51.  కామ,క్రోధ ,లోభ,మోహ మద మాత్చర్య్యం  లేనివాడవు,
              పరమాత్మగా,జీవాత్మగా ,భులోకవాసిగా వున్నవాడవు ,
             జీవులకు, మనోధేర్య్యం, సంకల్పమార్గంఇ చ్చినవాడవు,
         

              నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
 
         స్త్రీలను, పురుషులను,ఆకర్షించుట య్యందు అభద్ధమాడినాము,
         ప్రాణభయం   కలిగిన   సమయం   నందు  అభ ద్ధ   మాడి  నా
ము,
         పెండ్లి,   కర్మలు,   చేయుట   యందు    అభ ద్ధ   మాడి      నా
ము,          క్షమించుము నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

 
52.  స్స్త్రీల గౌరవముమంటకలియు సమయనందు అభద్ధమాడినా
ము,
      ధనమును
కో
న్నప్పుడు,అహం దెబ్బతిన్నప్పుడు అభద్ధ మాడినాము,
      
కోపము అణచు కోలేనప్పుడు, మాటలకు,  అభద్ధ మాడి నా
ము,
      
క్షమించుము
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

      
53.  నిన్ను చూ స్తే  నామనస్సులో  మమతల సేలయేరు, 
         నీ చల్లని చూపుల్లో   కోటి   దీపాల   వేలుగుల యేరు,
         నీ సుఘంద   పరిమాలలతో  
కాలుష్యం
   బలాదూరు, 

                నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
      
                54. శ్రీ బాలాజీ అనే  భక్తుడుతో     పాచిక లాడినావు,
                    ఆటలో ఓడినట్లు ఆభరణం   ప్రక్కన  ఉంచినావు,
                   భక్తుడుకి శిక్ష వేసి గాజెంద్రునిద్వార రక్షించినావు,

                       నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

               55.   దివి  నుండి  భువికి   అవతరించిన    వాడవు,                                        సజ్జనులకు, భక్తులకు    మోక్ష    మించినావు,
                     
దివ్యమంగళ రూపంతో మమ్ముచూస్తున్నావు,

                      నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

56.తలచిన చోట తానై ఉండు,  పిలిచిన  చోట పలుకుతు ఉండు
 కొలచినవారివెంట తిరుగుతు ఉండు, రాక్షసులనణచిరక్షిస్తు


    ఉండు 
    మ్రోక్కినవారి మనస్స్సు శాంత పరుస్తు ఉండు, అందరిని  ప్రేమిస్తు   

    ఉండు                                  
     నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
 
             57.  మాయను ఆవరించని పరమాత్మవు,
              వర్ణించలేని, వ్వా ఖ్యా నించలేని పరమాత్మవు,
               అరిషడ్వర్గాలను జయించిన పరమాత్మవు,
                నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

58.  నడ మంత్రపు సిరి నాకొద్దు, మనసుకు ప్రశాంతత  ప్రసాదించు,
         బంగారం,రత్నాలు, నాకొద్దు, ధర్మ రక్షణకు మార్గం ప్రసాదించు,
         వంచకులుతో స్నేహం నాకొద్దు, నన్నుఅర్థంచసు కొనేవారిని    

              ప్రసాదించు,నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

59.  వలచిన మగువచేరి విలవిల్లాడిన మనస్సును ఊరడిన్చావు,
        వనితాసిరోమనిని  వరించి వరమాలవేసి సంతోష పరిచావు,
        వెన్నలలో మగువల మనస్సును గ్రహించి మురిపించావు ,

                   నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
     
60.  మెరుపులు కాంతులు కన్న, నీకంటి చూపులు మాకు మిన్న,
        వజ్ర వైడూర్యలవెలుగులు కన్న, నీ  దేహవేలుగులు మాకు మిన్న,
        భక్తులు  ఇచ్చే ముడుపులు కన్న, నీ దీవెనలు మాకు మిన్న,

                     నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
  
                61.   కనుమూసిన కలలో, కనిపించే  కరుణమూర్తివి,
                       కపటి    మాటలు, కడతేర్చి    కాపడు   వాడవు,
                    కానుకలు, సమర్పించినవారికి దారి చూపువాడవు,

                           నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.  
                
             62.   నీ మహిమలు తెలియని మంధబుద్ధి గలవాడను, 
                     నిన్నే కొలుస్తూ ధర్మమార్గమున నడిచే ధీనుడను.
                      కర్మభంధమునకు భద్దుడునై  ప్రవర్తిమ్చే
వాడను,

                         నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

          63.  స్వరం, స్వరం,  కలుపుదాం, దేవుని కీర్తనలు పాడుదాం,
            పాపాత్ములను, పున్యాత్ములుగా మార్చుటకు పూజిద్దామ్,  
             అందరం   కలసి,  ఒకే    తల్లి బిడ్డలము అని ప్రార్దిమ్చుదాం 

              నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

64.  నీ భక్తుల భాదలు ఎరుగవా, నీ దాసుల భంగములు జూతువా,               మాపాప   పున్యాలు   తెలియవా, కర్మ   భందాలు   అనేదవా,      

        నిను తలవని దినము లేదనితెలియదా,సంసారినవున్నానని    
          అందువా , నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
  
65.  యంత చదివిన పరులకు సహాయపడని విద్య విద్య కాదు,
        సమయానికి మంచి  మాటలు 
పల్కని
  నోరు  నోరు కాదు, 
        నాకష్టార్జితం అని దేవునిని తూలనాడటం సమంజసం కాదు
        నిన్నే  ప్రార్దిస్తున్నాను
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


66. భ్రుగు మహర్షి బ్రహ్మలోకం చేరగా వీణా పాణి  నినాదములు మ్రోగే   
        
కైలాసం  చేరగా శివపార్వతులు కేళి నృత్య తాండవం సాగే
        వై కుంట్ట ము  చేరగా లక్శ్మీనారాయనులు సంభాషనులు సాగే
  భ్రుగుమహర్షి గర్వంఅణచిన
నమోనమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


67.అమృతసరస్సులోశేషపాన్పుమ్మీదలక్శ్మీనారాయనులుఉన్నప్పుడు,
    భ్రుగు మహర్షి గర్వంచే  పాదముతో వక్ష స్థలం మ్మీద మోపినప్పుడు ,
     పాదమును  హస్తంలో తీసుకొని అహంకారక్షిని  అణచినప్పుడు 

                  నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


68     సర్వ సాక్షి:, సర్వదర్సన:,  సత్యపరాక్రమహః
          సమీరణ:,   సహస్రమూర్ధా:,      సంప్రమర్దన:
           సిద్ధార్ధ:,      సిద్ధి  కల్ప:,   సిద్ధి   సాధ
:

           నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


69.   క్షణ విత్తం, క్షణ చిత్తం ,     క్షపాకర
         క్షణ సుఖం,  క్షణ ధుక్కం,  క్షేత్ర జ్ఞా
         క్షనక్షిప్రం,  క్షణజీవితం,   క్షణ క్షార
 
        నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.70.  సర్వవ్వాపి, సర్వాంతర్యామి, సర్వసిద్ధి
         సర్వశ్రుష్టికర్తః,  సర్వరక్ష:,     సర్వాత్మ:
         స్వరూప,
స్వయంఫోషక, స్వయంకృషి :
 
        నమో నమో శ్రీ తిరుమల తిరుపతి
వేంకటేశ.71    కృత యుగమునందు      వై కున్టము ఈ తిరుమలక్షేత్రం
         త్రేతా యుగమునందు  అనంతాసనం ఈ తిరుమలక్షేత్రం
         ద్వాపర యుగమునందు శ్వేత  దీపం ఈ తిరుమలక్షేత్రం
               నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


72     సురులు కీర్తించేటి,  మునులు ధ్యానించేటి  పురుషోత్తమా,
           వకుళమ్మ గారాల ముద్దు   బిడ్డ,  పద్మావతి హ్రుద యేశ ,
            రత్నశోబితమైన సూర్య      సన్ని భమైన పూర్న పురుషా 

                 నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.  


72.      పారిశ్రామీక  కర్తకు    ఎన్నో   ఆశలు   చూపుతావు,
            బడుగు   జీవులకు   జీవన   భృత్యo   కలిగి స్తావు,
             భాగ్యవంతునికి  భాగస్వామి వైకానుకలు భరిస్తావు
,  

                    నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

73.     శ్రీరాముడు  అనుసరించినట్లు  అనుసరించమన్నావు,
             శ్రీకృష్ణుడు  చెప్పినట్లు  చేసి సుఖపడమన్నావు ,
         అధర్మం, అక్రమం జరిగినచోట అవతార
  మెత్తుతానన్నావు,

                  నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

74    కలియుగ వాసులకు కర్తవ్యం
 
భోధించిన కార్యధక్షుడవు,
        నీలాలు అర్పించినవారి కోరికలు తీర్చిన    ధీమన్థు డవు,
         మొక్కులు    తీర్చినవారికి  కష్టాలు    కడతేర్చినవాడవు,
                  నమో నమో శ్రీ తిరుమల తిరుపతి
వేంకటేశ.                  75    సర్వ:, సంభవ:, స్వయం భూహ్ :
                   సర్వేశ్వర:, సర్వాది:,     సత్యవ్రత:
                   సమాత్మ:, సమ్మిత:, సర్వయౌగా:
                  
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

  

                 76     సహృదయ:,  సహోదర:, సావచ్చర:
                   సత్యవచా:,        సదాతన:,   సనాభి:
                  సత్య్యగున శోభిత:, సత్యగుణ భూషిత:

                  నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


               77.   భహుశిర;  భహు భుజ; భ్రుహద్రూప;
                    భూతకృత్;   భూతబ్రుత్,    భూతాత్మ
                    భూతభావన; భుతాదిపతి; భూగర్భ;

                   నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


                     78.  విశ్వమ్,  విష్ణు,     విస్వవిధాత
                         విశ్వే శ్వర:, విక్రమ;    విశ్వరేత;
                         విశ్వకేసేన; విశ్వభాహు;విస్తార;

                నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


79. వినయనీతిని ఎరుగక, మనస్సులోవున్న నీతిని మరువక,
      శిక్షణ ఇచ్చుగురువు దొరకక, మచ్చలేని మనిషి కానరాక,                    సుభసూచనలు బుద్ధికిచేరక, నిన్ను కొలుచుటవిడువలేక,

     ఈ ప్రాణి ని కాపాడుము నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
                                                         

       80.  నీపాదములు,   తాకితెచాలు  నా    పాతకములు తొలగు,
            నీపాదములవద్ద శిరస్సు మోటితెచాలు, పాపకర్మలు తొలుగు,
            నిన్ను అభిషేకిస్తే చ్చాలు  సమస్తసుఖములు కలుగు,              
   ఈ ప్రాణి ని కాపాడుము నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

 

       81. చంచలమైన నామనసు, చలమునందు  చెంద్రుడిలా ,
             చిరునవ్వులేక  చీమలా సంచరించు       సుర్యడులా,
             నీటిబొట్టు  తామరాకు మీద వెలుగొందే  ముచ్చములా,
      ఈ ప్రాణి ని కాపాడుము
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.82.  కదలక  మెదలక ఉన్నావు , అందరి   కలలు   తీరుస్థున్నావు,
          అక్కడ ఇక్కడ ఉన్నావు,  అందరకి వెలుగు చూపుతున్నావు
,
         దారి   తెన్నులేక  తిరిగేవాడికి మంచి దారి   చూపు  తున్నావు ,
 
     ఈ ప్రాణి ని కాపాడుము
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.83    సరస సల్లాపములతో  సరిగములు నేర్పినావు,
        సవతిపోరు లేకుండా
వ్యసాచివలే సర్దుకొనినావు,
        సకల సుఖములు  పంచి సమన్వయ భర్త వైనావు,

            నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
   

84. శతకోటి కుసుమాలతో పూజిన్చలేని శక్తి హినుడ్ని ఐనాము,
      శత్రువును  జయంచలేక,  శాస్త్రము తెలియక సలభనై నాము,
      శాఖమ్రుగమును ప్రార్ధిస్తూ, నీ భక్తి పారవశ్యంతో పరవసించాము,
                         నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

                            85.ఎవ రిని చూసిన తదుపరి   దృశ్యం లేదో,

                        ఎక్కడకు  చేరిన  మళ్ళి     జన్మ ఉండదో,
                       ఎవరి వద్దతెలుసుకొనే విషయం ఉండదో,
         ఆ పరమాత్మవు నీవె,నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

                  86. ఏ లాభం  మించన     లాభం     లేదో,

                        ఏ సుఖాన్ని  మించన    సుఖం లేదో,
                         ఏ జ్ఞా నానికి   మించన జ్ఞానామ్ లేదో,
      ఆ పరమాత్మవు నీవె,నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
 
                87. సరనాగాతవచ్చల  సమంతకమని దోషపరిహర,
                    శరత్కాల మేఘవర్ణ  శస్య   స్యామల    స్వరూప,
                   శ్రావ్యమైన  శ్రవణానంద శ్రీరంగాధామేస్వర రూప,
                      నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


                   88  తల్లి యశోదలా    జోకొడితే  నిద్రపోతావు,
                          భక్త శబరిలా    ఎంగిలి పెడితే ఆరగిస్తావు,
                          బృందావన గోపికలతో నృత్యమాడినావు, 

                        నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


89  నాకళ్లలో   శాశ్వతముగా  నిలిచిపోనీ,      నీ మోహనరూపం,
       నామనో భావంలో చిత్రితమైన నీస్వరూపం ఎంతో అద్బుతం,
       నా హృదయంలో నీ రూపాన్నీ నిలుపుకొను భాగ్యం కలిగించు.   

                  నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


90     నెనొక పిచ్చి వాణ్ణి,నాలోని  భాదను ఎవరు అర్ధం చేసుకుంటారు?
         నెనొక భక్తుణ్ణి,పారవశ్యoతో పాడే కిర్తనలు ఎవరు వింటారు?
         నేనొక మనిషిని ,నేవ్రా సిన భక్తి భావ కవితలు  ఎవరువింటారు?

                        నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ. 


                      91.   అంగాగ  రంగ  భగ భగ  తరంగా తురగ,
                             గగనసీమ గమన గలగలా ఆ కాసగంగ,
                              గుండె  గల గల ఘంటారావం  మ్రోగంగ,

                          నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ. 


92.   బ్రహ్మధార, విష్ణుధార, శివధార, చంద్ర ధార,గలతిరుమలక్షేత్రం
        క్షీరధార,ఔషదధార,వృక్షధార, పంచామృతధార,
గలతిరుమలక్షేత్రం

        సంకల్పధార, జీవన ధార, దివ్యామృత  ధార,గలతిరుమలక్షేత్రం
         నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


93.   నీ గుడి ద్యారము తెరువగానే   ఒక   ఆత్మీయతా   సమీరం,
           నీ పాదములు గడిగె పరవళ్ళుత్రొక్కే యమునానది ప్రవాహం,
           
నీ మందిరం శతకోటి సుర్యకిరనాలతో మాకు దర్శన భాగ్యం ,

             నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


94.   చూపుల దోషాలకు నాకళ్ళు      చెమ్మగిల్లే,
               ఆపదలను ఆపలేని మనస్సులో భాదగిల్లె,
               శోకమును తీర్చలేని, పుణ్యంచేయని ఇల్లే,
               
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.95.  దరిద్రులుకు దారిచూపి ధనమును అందించిన దయాళుడవు,
              ద్వారపాలకులసహితము  దాక్షిణ్యం  చూపిన కార్యదక్షుడవు,
             ప్రార్ధనకే ముసలిబారినుండి గజేంద్రుడిని  కపాడిన రక్షకుడవు,

             నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


96. తృప్తిగా త్రుష్టను తీర్చిన  తోరణ  తేజ   త్రివిక్రముడవు,    
            తలనీలాలు  అర్పించినవారిని  కాపాడే త్రికాలనేత్రుడవు,
            మితిగా భుజించి, మిన్నగా కొలిచిన
త్రిభువనేస్వరుడవు,          

             నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


97. తల్లివి తండ్రివి నివే సకల   దేవతలకు,    మానవులకు,
            సప్త ఋషులు, ప్రతి   ఒక్కరు మ్రోక్కెదరు నిపాదాలకు,
            బ్రహ్మాండ లోకములన్ని నీనోటిలోచూపావు యశోదకు,

            నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


 98. క్షనకాల సుఖంకోసం   మేము నిరిక్షన చేసి క్షణం వ్యర్ధ పర్చాము,
       యేక్షణమున యేమిజరుగునోఅని మేము భయంతో జీవిన్చాము,
       క్షేత్రజ్నుడవని, క్షీరా భిషేకము చేస్తున్నాము మము  కాపాడుము,

        నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


99.  తల్లితండ్రులను, గురువులను, వేదములను, ప్రేమిస్తున్నాము,
       కష్ట  సుఖములను  ప్రకృతి  ననుసరించి అనుభ విస్తున్నాము,
       లోకవ్యవస్థను ధర్మమార్గమున మార్చుటకు నిన్నేపార్దిస్తున్నాము 

       నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
  

100. భౌతికస్పర్శకు  అందని ఒక సహజభావన  పరిమళమే నీ ధ్యాణం,
        మనోవ్యాపారమును, నవ రంధ్రాలను నిర్వీర్యమ్ చేసేది నీ ధ్యాణం,
       సాధనలో మనోనిగ్రహశక్తిని, ఆత్మ సంతృప్తిని, కలిగించేది నీ ధ్యాణం,
  

       నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

  101. సంపదలు అన్నిపోయిన లేమి వచ్చినను బ్రతకవచ్చు,
           బంధనములచే  చుట్టబడిన అందరూ జీవించవచ్చు,
           మాన ధనములు మాట తప్పక మాటఫై  బ్రతుకవచ్చు,  
            నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
       
102. అదివేణుగానమో,వేద పఠణమో,హరినామ స్మరణమో,
            భక్తులు గోవిందా అంటూ ఆర్తనాదమో,ఆలయ గంటానాదమో, 
            బ్రాహ్మణులు మంత్రముల పారాయణమో,భక్తుల పారవశ్యమో,
             నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


103   ఎవ్వరు ఎప్పుడు   తలచిన   అప్పుడే     ప్రత్యమైనావు,
               కొలుతురు కొందరు కూరిమీతో కనువిందు చేసినావు,
               నీత్యం వేద మంత్రములకు పరవశం పొందిన వాడవు,  

               నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
 
 104   ఋతువులు మారుతున్న ,ష్య మూకముఫై ఉన్న,                 
         ఋక్షరాజుడు నీకు సహయపడి వున్న, ఋణగ్రస్తుడగా కాకున్న,
        
ఋషులు వేదములు చదువుతున్న, ఋషభాముఫై ఊరేగితున్న,

         నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.


   105   ఉండు ఉండు అంటూ ఉవ్విలూరించే    వయసు  లేదు,
             ఉరవడి  నుండి ఉన్నఫలానా తప్పిoచుకొనే  శక్తి లేదు,
             ఉన్నదిలేదని ,లేనిది ఉందని ,  వాదన   చేయట లేదు,
            
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.    106  కుబేరుని వద్ద ధనం అప్పుతీసుకొని పద్మవతిని పేళ్ళాడినావు.
            అన్న గోవింద రాజును ఎప్పుటికప్పుడు వడ్డీ చెలించ మన్నావు,
            నీ కొండ ఫై నీలాలు అర్పిoచినవారికి సుఖ  శాంతులు ఇచ్చనావు,
            
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

       

  107. భావసుద్ధితో, ఆరాధిస్తేనే మోక్షసిద్దికి  అర్ర్హులమౌతము,
            భావసుద్ధి లేని వేద  విద్యాభ్యాసము  అరణ్య రోదనము,
            నీవేదిక్కని తిరుమల క్షేత్రములో చేసే స్నానం అమృతము
,

            నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
108. బ్రహ్మోత్చవం ఇది  బ్రహ్మండనాయుకుని   బ్రహ్మోత్చవం
        త్రిమూర్తుల తేజస్సుతో స్వర్గాన్ని మురిపించే బ్రహ్మోత్చవం
        వేదమంత్రాలుతో వేంకటేశ్వరుని ఊరేగిమ్పుతో సాగే బ్రహ్మోత్చవం
 
         నమో నమో శ్రీ తిరుమల తిరుపతి  వేంకటేశ.                                           


      
          శ్రియ:  కాంతాయ కళ్యాణ నిధయే  నిధయేర్ధినామ్
          శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం
         లక్ష్మి  సనిబ్రమాలోక సుభ్రూ విబ్రమ  చక్షుషే
         చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళం
         సర్వనయవ సౌందర్య సంపదా సర్వచేతసాం
         సదా సంమోహనాయాస్తు వేంకటేశాయ మంగళం
         నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే
         సర్వాంతరాత్మనే  శ్రీ మద్వెంకటేశాయ మంగళం
         శ్రీ వైకుంటవిరక్తాయ స్వామిపుష్కరినీ  తటే
         రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళం
        శ్రీ
మత్సున్దరజామృత మునిమానసవాసినే
         సర్వలోక నివాసాయ   శ్రీనివాసాయ మంగళం 
         మంగళా శాసనపరై: మదాచార్య  పురోగమై:
         సర్యైస్చ్చ పూర్యైస్ఛ రాచార్యై: సత్క్రుతాయాస్తు  మంగళం
         శ్రీ పద్మావతీ  సమేత  శ్రీ శ్రీనివాస  పరబ్రహ్మణే  నమ:  

ఫైన నేను ప్రతి పద్యములో అలివేలుమంగాసహిత  శ్రీ వెంకటేశ్వరస్వామిని తలంపుతో  వ్రాసినాను, మీ మీ వాసనా బలము బట్టి మీ మనస్సుకు తప్పక ఒకపద్యమైన హత్తుకుంటుందని,చదివినవారు,చదివిన్చినవారు తరించ్చాలని అ పరమాత్మను ప్రా ర్ధన చేస్తూ  ప్రతి ఒక్కరి  సంకల్పం నెరవేరాలని కోరుతున్నవాడను.
       
నేను వ్రాసిన ప్రాంజలి ,మనోవాక్  చదివి మీ అభిప్రాయములు తెలపగలరు ఈ కుసుమాలను స్వామి వారి పాదాలకు సమర్పిస్తున్నాను.
             
                   సర్వే  జనా సుఖినో భవంతు,  ఓం శాంతి:  శాంతి:  శాంతి:           
                                      ఇట్లు,  స్వామివారిని అరాధించే  భక్తుడను,
                                                                                                      

             
                                                        మల్లాప్రగడ రామకృష్ణ  

Sri venkateswarasubrapatam శ్రీ వెంకటేశ్వర సుబ్రపాతం  కీర్తన  గోవిందనామాలు
      శ్రీ వెంకటేశ్వర కీర్తన