14, అక్టోబర్ 2025, మంగళవారం

 



*ఈ కథ కాదు? హృదయాక్షర ప్రాంజలి*


అసలే అంధకారం, ఉండి లేనట్లుగా అంతా కాంతిమయం, సకలం నిద్ర వస్తలో చిన్మయం, అక్కడక్కడ సునకాల విన్యాసం, శబ్దాల సమన్వయం, రక్షక భటుల అగమ్య గోచరం, చర్మాంకాలతో అనారోగ్య విధి విలాసం, గమ్యమే తెలియని పుట్టుకే తెలియని అనాధుదల ఆర్తనాదం,


మనసంతా మరుమల్లె పూచినట్టుగ  యెదిగే, తనువంతా తపమల్లె సూత్ర యున్నతి వెలుగే, గుణమంతా సుఖమివ్వ మూల మౌనము కలిగే, జనమంతా సహనమ్ముగానిద్ర మరిగే,అపురూపము కలగా కవ్వింతలో కళా మయం, ఉపవాసము తలపే ఉత్సాహమ్ముగా మనోమయం, నొపదేశము మలుపే నోర్తే సఖ్యత విస్మయం, అపవాదము మెరుపే ఆశ్చర్య గమ్య జీవితం.


ఎదురు చూడ కన్నులు అంతు చిక్కని కలలు, బెదురు లేనిబేలలు భీతి చెందెదడి కథలు, వెదురు బుట్ట మేళము వేగుచున్న వ్యధలు, సదరు భక్తి గానము సాగుతున్న రుదలు, కలవరింతలో కళా బెదురు లేని తెన్నులు, సలపరింతలో సదా శ్రమను చూపు కన్నులు, కలవ వింతలో కధా గమన మొప్పు

చన్నులు, పిలుపు యంతలో కదా సమము చేయు సొమ్ములు నిలకడ జీవితం.


 రచన మల్లాప్రగడ రామకృష్ణ 

 అభిప్రాయాలు తెలిపితే రాస్తాను  (రోజువారీ కథగా )

*ఈ కథ కాదు? హృదయాక్షర ప్రాంజలి* (02)


ఊహలలో నిమగ్నమ ఈ మనసుకు ఏమిటీ, స్నేహములో వినమ్ర త శుభముయె ఏమిటి, దే హము లో సమర్ధత సహనము ఏమిటీ, దాహములో శుభమ్ము గు ఏమిటీ కదిలించు జీవితం,  తలపులో చిగురిoచిన ఈ వింత వింతలోకము, మలుపులో సుగంధము యీ బంధ మోహ మైకము, పలుకులో శుభమ్మగు యీ కాంతి లీలలేయగు, తులువు లే గళమ్మగు యీ బ్రాంతి కాల వైనము తీరుగా జీవితం కదా మాష్టారు మీరేమంటారు


అసలు స్వర్గం అనగా?


 మంచి ఆరోగ్యం, మమతానురాగం, హృదయ వాశ్చల్యం, నెరవేర సంయోగం, 

దృఢకాయ శరీరం, యేపనైనాచేయగలనని విశ్వాసం, 

పాప రహితమైన జీవితం గడపడం, పరోపకరిగా పరమానంద భరితునిగా, 

స్వతంత్రంగా జీవించడం , అనగా స్వేచ్ఛగా సహాయ సహకారాలు అందిస్తూ, సర్వవేళలా జ్ఞాన భోధకుడుగా జీవిస్తూ, దేవుడుపైన నమ్మకం, కలిగేట్లు మాటలు వళ్ళిస్తూ, అంతా శివ సంకల్పం నేముమాత్రం నిమిత్తమాతృడను అనుకుంటూ, నిత్య o బ్రతికి బ్రతికించు ధ్యేయం తో ధైర్యము గా జీవించినట్లయితే అటువంటి వారికి నిత్యమూస్వర్గమే.


నింగినున్నదియె మేఘం నిను చూసియు జల్లులై, భంగి యన్నది యె మోహo విను కోతల పల్కులై, ఖంగు తిన్న మది వైనం నిధి నేస్తము నవ్వులై, రంగు లన్ని కల తీరు కరిగే విధి పువ్వులై, ఏదో కమ్మని పిలుపై చుక్కచక్కిలి గింతగా, ఏదో నమ్మని తలపే వక్కచెక్కలైనంతగా, ఏదో కమ్మనిపిలుపే దక్కుదిక్కులై నంతగా, ఏదో దమ్ముకు బలుపే ముక్కచెక్కలై నంతగా కదలికలే కాల నిర్ణయానికి లోబడి సంసారములో సరిగమలు కావా @@


తడిమి పరువశించిగాకురిసే యరవిందమై, మడుగు పలకరించగామెరిసే మెరుపమ్ముగై, అడుగు కలవరంపగా అలుపే హృదయమ్ము గై, ముడుపు తలపు యాసగా, చిరు గాలియె  చల్లగా మెల్లగా తాకి సాగుగా, పరవమ్ముయు మెల్లగా చల్లగా ఊగి సాగగా, అరునోదయ వేడిగా వేగమై  సాగి సాగగా, చిరుహాసము మెల్లగా చెల్లగా పాకి సాగగా కదిలే జీవితం లో అన్నీ నిజాలుకావు, అబద్దాలు ఆశలె కావు కదా అని నిద్రలో కలవరస్తుంది సంయుక్త.


ఇంకా వుంది.


*ఈ కథ కాదు? హృదయాక్షర ప్రాంజలి* (03)

మల్లా ప్రగడ రామకృష్ణ


చూడు సంయుక్త నీవు చదివినంత నేను చదవలేదు, కాని లోకమే నాకు నేర్పింది. నాభాధ యంతా నీమీదే మీ అన్నలు ఎవరి దారి వారు చూసుకున్నారు. నిన్నుకూడా ఒక ఇంటిదాన్ని చేస్తే నా మనస్సు కొంత ప్రశాంతత నా మాటలు నీకు భాదగా నున్నాయా లేదు లేదు చెప్పమ్మా 


ఎప్పుడూ నిజాన్నే మాట్లాడడం. ఇది ఒక వ్రతం లాంటిది. గొప్ప ధర్మం. శ్రేయస్కరం కూడా. కాని ఒక్కొక్కప్పుడు సత్యం కూడా కఠోరంగా ఉంటుంది. ఆది నువ్వు తెలుసుకోవాలి నీ ఉద్యోగధర్మం లో కొన్ని అవాంతరాలు వచ్చినా ధైర్యమే నీకు ఆయుధం అవ్వాలి ఎవ్వరూ తోడురారు.


నువ్వు కూడా నమ్మా 


అవునమ్మా వయసు ఉడికినవారు సలహాలు తప్ప ఏమిస్తారు అదిచాలమ్మా


అందుకే "నిజం నిప్పు లాంటిది" అంటారు. దాన్ని దాచలేము కూడా. నిజం చెపితే నిష్ఠూరం కూడా కలుగుతుంది. అవతలి వారి మనసు గాయపడవచ్చు. వారు బాధపడవచ్చు, అలాంటి సందర్భాలలో వారికది ప్రియభాషణం కాకపోవచ్చు.


అంచేత "సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం".


సత్యాన్నే పలకాలి. ప్రియంగా పలకాలి. అప్రియమైన సత్యాన్ని పలకకుండా ఉండడమే మంచిది. అంటే నిజం చెపితే ఎవరికైనా ఏదైనా కీడు జరుగుతుందనుకున్నప్పుడు ఆ నిజం చెప్పవలసిన అవసరం లేనప్పుడు చెప్పకుండా ఉండడమే మంచిది.


 అలాగే ఒక అసత్యం చెపితే ఎవరికయినా ఏదయినా మేలు జరుగుతుందన్నప్పుడు అసత్యమాడినా పరవాలేదు. అదే ధర్మరాజు "అశ్వత్థామా హతః (కుంజరః)" అని ఆడిన అసత్యం.


అలాంటి సందర్భాలలో, సమయాలలో సత్యం చెప్పకపోవడమే కాకుండా అసత్యమాడినా దోషం అంటదనేది శుక్రనీతి. కాని అది ఎల్లవేళలా పనికి రాదు.


"స్మితవక్త్రో మితభాషీ, అపూర్వభాషీచ రాఘవః" అని శ్రీరామచంద్రుని అష్టోత్తర శతనామావళిలో కీర్తించడం జరిగింది.


అంటే శ్రీరామచంద్రుడు ఎల్లప్పుడూ చిరునవ్వుతో మాట్లాడేవాడునూ, మితంగా భాషించేవాడునూ, అపూర్వంగా అంటే ఇంతకు ముందు ఎన్నడూ ఎవరూ ఎరుగని విధంగా మహోన్నతంగా భాషించేవాడునూ అని కొనియాడడం జరిగింది.


అందుకే అవతార పురుషుడై మానవులందరికీ మాటల్లోనూ, చేతల్లోనూ ఆదర్శప్రాయమైన మార్గాన్ని అవలంబించి చూపాడు.


అయితే ఈ వాక్కును నిగ్రహించుకోవడం ఎలా.. మనం మన మనసును నిగ్రహించుకుంటే వాక్కును నిగ్రహించుకోగలుగుతాము మనసు నిర్మలంగా, శుద్ధిగా ఉంటే వాక్కు కూడా నిర్మలంగా ఉంటుంది.


వాక్శుద్ధి కలుగుతుంది.


అటువంటి వాక్శుద్ధి కలవారు అన్నది జరిగి తీరుతుంది.


అమ్మా నీమాటను తప్పకుండా ఆచరిస్తాను 


ఇంకా వుంది


***


*ఈ కథ కాదు? హృదయాక్షర ప్రాంజలి* (04)

మల్లా ప్రగడ రామకృష్ణ


చూడు బిడ్డా నేను చెప్పేవన్నీ నాకు తెలుసనీ యనకు ఒక తల్లి పడే కష్టం ఆదేవుని సం కల్పమే అని నమ్ము అదే నీకు మార్గం 

ఒక చిన్న కధ చెపుతా వీను 


"ఒక చంటి బిడ్డ క్రింద పడుకుని హాయిగా నిద్రిస్తూవుంది. ఆ బిడ్డ

వైపు ఒక కండచీమ వెడుతున్నది. 

ఆ చీమ వెళ్ళడం చూసిన బిడ్డ తల్లి 

కండచీమని బిడ్డ వద్దకు వెళ్ళనీకుండా తీసి బయట పారవేస్తుంది. ఆ సమయంలో నిద్రిస్తున్న బిడ్డకు తనకు వచ్చిన ఆపద గురించి, ఆది తొలగిన 

విషయం గురించి తెలియదు. తల్లి పనికట్టుకొని చెప్పదు."


ఈ విధంగానే  దైవం ఎల్లవేళలా తన భక్తులను కాపాడుతుంది. 

ఈ విధంగానే భక్తులు తమకు  తెలియకుండానే కలిగే ఆపదలనుండి  భగవంతుని దయవలన, లీల వలన కాపాడబడి హాయిగా జీవిస్తున్నాము. 

నీ కర్ధ మైందా బిడ్డా 

హింసకు ప్రతిహింసకాదు అని తెలుసుకో అన్నది తల్లి 


ఆ మాటలకూ సంతోషంతో


🎵 పల్లవి


మా అమ్మ...

ఆది కాంతి వలె లేచె మాతృదేవతా రూపం మా అమ్మ

చీకటిని చీల్చి వెలుగై నిలిచె జీవన దీపం మా అమ్మ


చరణం – 1


వేకువలో మెలకువవేసి, పూటలకీ పండుగై,

తొలిపొద్దుని లేపి తేజమై పూసె మా అమ్మ.

పుల్ల పుడకల పొయ్యిలో ఆకలి తీర్చె కాంతి,

నిప్పురవ్వలలో సంతోషం రాసె మా అమ్మ.


చరణం – 2


ఇంటిని చక్కదిద్దె కర్తవ్యం రాణి,

తన ఒంటినే ధారపోసె త్యాగమూర్తి మా అమ్మ.

చెమట పూలతో నేలతల్లిని తడిపె మమత,

చల్లని నీడల స్నేహమై నిలిచె మా అమ్మ.


చరణం – 3


చీకటిని మింగిన రాత్రిలో ధైర్య దీపమై,

మన మనసుల్లో వెలుగునింపె మా అమ్మ.

నవ్వులో భరోసా, కన్నీటిలో కరుణ,

నిస్వార్థ ప్రేమకు రూపమై నిలిచె మా అమ్మ.


అంటూ పాడింది సంయుక్త 


ఇంకా వుంది


ఇది కథ కాదు? హృదయాక్షర ప్రాంజిలి (05)

 మల్లాప్రగడ రామకృష్ణ  


చూడు సంయుక్త కాలమనేది కనిపించకుండా కదిలిస్తుంది ఎలాంటి శక్తి లేకుండా కూడా మనసులో చేరి మభ్యపెడుతుంది కాలం వ్యక్తం చేసుకుంటూ నిజానికి కాలం మానవ జీవితాన్ని క్షణం కూడా నిలకడ లేక కత్తిరిస్తుంది. కాలమనే శక్తి ప్రకృతిని పలకరిస్తూ అందరికీ సహకరిస్తూ చేయూతనిస్తూ జీవితాన్ని సహకరిస్తూ బ్రతకలిస్తూ చావనిస్తూ నేనున్నానని గుర్తు చేస్తూ ఉంటుంది. మానవత్వం లో భిన్న భిన్న అభిప్రాయాలు ఉంటాయి కానీ మతంలో అనేక విధాలైనటువంటి సూత్రాలు ఉంటాయి కానీ కాలల్లో మాత్రమే ఏక సూత్రము దైవములో మాత్రమే ఉంటుందనేది నిర్ధారణంగా ఉన్నది  భగవద్గీతలో కూడా నేను కాలంగా ఉంటాను అన్నాడు భగవంతుడు పంచభూతాల్లో ఉంటాను అన్నాడు భగవంతుడు. కాలం ప్రగతి చూపే అంశం అధర్వణ వేదల్లో ఉన్నట్లుగా మన పూర్వీకులు మనకు తెలియపరిచారు.

ఎంత ధైర్యమున్నా ఆ అమ్మవారి కృప నీకు ఎల్లవేళలా ఉండాలి. నీవు కూడా ఆ అమ్మవారిని ధ్యాణించు ఎప్పుడు ఏమిజరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు.


*🌼🌿దరిద్రం, భయం కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మని ఈ 32 నామాలతోరోజూ పూజించు...

🌼అర్ధంతో దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళి.🌼


దుర్గా దుర్గార్తి శమణీ, దుర్గాపద్వినివారిణీ

దుర్గమచ్చేదినీ, దుర్గసాధినీ, దుర్గనాశినీ

దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహ

దుర్గమదేజ్ఞానదా, దుర్గ దైత్యలోకదవానలా

దుర్గమ, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణీ

దుర్గమార్గాప్రద, దుర్గమావిద్యా, దుర్గమాశ్రిత

దుర్గమజ్ఞానసంస్థాన, దుర్గమధ్యానభాసిని

దుర్గమోహ & దుర్గమగ, దుర్గమర్థస్వరూపిణీ

దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధదారిణీ

దుర్గమాంగీ, దుర్గమత, దుర్గమ్య, దుర్గమేశ్వరీ

దుర్గభీమా, దుర్గభామా, దుర్లభా, దుర్గధారిణీ..

ఇవి దుర్గాదేవి 32 నామాలు.


🌼🌿32 నామాలకు అర్ధం:(ప్రతినామం తర్వాత నీకు వందనం. అనాలి)


1.దుర్గా: భక్తుల చుట్టూ ఒక కోటలా ఉండి కాపాడే తల్లి 

2.దుర్గార్తిశమణీ: కష్టాలను శమింపచేసేతల్లి నీకు 

3.దుర్గాపద్వినివారిణీ: ఆపదలను నివారించే తల్లీ 

4.దుర్గమచ్ఛేదినీ: కష్టాలను ఛేదించే తల్లీ 

5.దుర్గసాధినీ: దుర్గమమైనది సాధించే తల్లీ 

6.దుర్గనాశినీ: కష్టాలను నాశనం చేసే తల్లీ 

7.దుర్గతోద్దారిణీ: దుర్గాలలో కూరుకుపోయిన వారిని రక్షించే తల్లీ 

8.దుర్గనిహంత్రీ: మనదెగ్గరికి కష్టాలు రాకుండా నియంత్రించే తల్లీ 

9.దుర్గమాపహ: కష్టాలను వినాశనం చేసే తల్లీ 

10.దుర్గమదేజ్ఞానదా: రహస్యమైన ఆత్మజ్ఞానం లాంటి జ్ఞానాన్నిచ్చే తల్లీ

11.దుర్గదైత్యలోకదవానలా: కష్టాలనే రాక్షసుల సమూహాన్ని దహించే తల్లీ 

12.దుర్గమ: అమ్మను సాధించడానికి ఆశక్యమైన తల్లీ (తేలికగా దర్శనం ఇవ్వని తల్లి).

13.దుర్గమాలోక: చర్మచక్షువులు,పంచేంద్రియాలతో చూడలేని తల్లీ 

14.దుర్గమాత్మస్వరూపిణీ: మనలోనే వసిస్తూ లభించడానికి సాధ్యం కాని ఆత్మస్వరూపమైన తల్లీ నీకు వందనం. అంటే మనలోపల ఉన్నా సరే మాటలలో వర్ణించలేని, కళ్ళతో చూడలేని, తెలుసుకోలేని తల్లి స్వరూపంమని అర్ధం

15.దుర్గమార్గాప్రదా: రహస్య మార్గానికి త్రోవచూపేతల్లీ 

16.దుర్గమవిద్యా: రహస్యమైన విద్యాస్వరూపమైన తల్లీ (శ్రీవిధ్యా స్వరూపం).

17.దుర్గమాశ్రిత: దుర్గాన్ని ఆశ్రయించి ఉన్న తల్లీ  (శ్రీచక్రం).

18.దుర్గమజ్ఞానసంస్థాన: అలవికాని జ్ఞానానికి సంస్థాన అంటే సాధ్యంకాని జ్ఞానానికి తల్లీ .

19.దుర్గమధ్యానభాసిని: ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానంలో భాసించే తల్లీ.

20.దుర్గమోహ: ఆపదలను లాగేసే తల్లీ .

21.దుర్గమగ: కష్టాలను పరిష్కరించే తల్లీ .

22.దుర్గమార్థస్వరూపిణీ: ఈ పదానికి రెండు అర్థాలున్నాయి. ఒకటి మనలోని చెడు ఆలోచనలకు శత్రువైన తల్లి అని.. రెండోది దుర్గమమైన అర్ధాలుగల తల్లీ .

23.దుర్గమాసురసంహంత్రీ: దుర్గమాసురుడైన రాక్షసుడిని సంహరించిన తల్లీ .

24.దుర్గమాయుధదారిణీ: దుర్గమమైన ఆయుధాలను ధరించిన తల్లీ.

25.దుర్గమాంగీ: ఊహించలేని దివ్యమైన అంగాలు కల తల్లీ .

26.దుర్గమత: కల్మషాలను దూరం చేసే తల్లీ .

27.దుర్గమ్య: సాధించడానికి శక్యం కానీ తల్లీ.

28.దుర్గమేశ్వరి: విఘ్నాలకు అధినాయకురాలైన తల్లీ .

29.దుర్గభీమా: భీషణమైన పరాక్రమం కల తల్లీ.

30.దుర్గభామా: దుర్గ అనే స్త్రీ రూపం లోని తల్లీ .

31.దుర్గభా: ప్రకాశం గల తల్లీ .

32.దుర్గదారిణీ: రహస్యాన్ని ఛేదించే తల్లీ


ఓం నమో దుర్గాయ నమః అంటూ ఈ 32నామాల దుర్గాదేవి వందనాలు ద్వాత్రింశన్నామావాళిని 108 సార్లు పారాయణం చేస్తే సర్వ దరిద్రాలు తొలగుతాయి అనేది పురాణాల కథనం.. భక్తుల నమ్మకం..


🌼🌿శ్రీ మాత్రే నమః....అని జపo నిత్యం శాంతికి మూలం.


ఇంకా వుంది

ఇది కథ కాదు? హృదయాక్షర ప్రాంజిలి (06)

 మల్లాప్రగడ రామకృష్ణ  

అవునమ్మా నీ ఆలోచన చాలా సబబు, విచిత్రమైన జీవితంలో వింతైన సమయమిది... అనుకున్నవన్నీ జరగవు, జరిగేవన్నీ అనుకోను. ఏది ఏమైనా భవిష్యత్తు కన్నా వర్తమానమే మిన్న.  నేటి విద్యార్థులు భక్తి ధర్మం పక్కన పెడుతూ ఆత్మ పూర్ణతను కోల్పోవడం ఆకర్షణకు లోబడి అంతరాంతరాలు మరిచిపోయి అనుకోని విధంగా అదే గొప్పతనం అని ఉల్లాసపడటం, ఆకర్షణ లోబడటం విరక్తి లేకపోవడం, అహంకారకాంక్షలతో ధర్మభక్తి సౌభాగ్యం దెబ్బ తినటం నేటి విద్యా విధానం తోడ్పడటం అంతర్జాల మహత్యం అన్నట్టు  స్మా ర్ట్ ఫోన్లు ప్రభావం పడటం ఈ లోకంలో ఈ లోకం ఈ విధంగా మారనని ఎవరు చెప్పలేదు.

అకస్మాత్తుగా ఎన్నో సంఘటనలు జరిగి పోతుంటాయి. కొన్నింటిని మౌనంగా అంగీకరించక తప్పదు,

మరి కొన్నింటిని స్వీకరించడం అసాధ్యంగా అనిపిస్తుంది. పచ్చ నోటు ముందు పల్చనై పోతున్నాయి బంధాలు, ధనం ముందు  అవిరై పోతుంది గుణం, ఆస్తుల ముందు ఆవిరై పోతున్నాయి ఆప్యాయతలు, నేటి ప్రవర్తనలు అగమ్య గోచరణాలు, బీదవారుగా కనలేము గాని బీద వాక్కులు, స్వార్ధ పూరిత బంధాలను, నేడు దేశం నందు నిలబడి ఉన్నాయి.

కొందరిని ఎంతగా కోరుకున్నా చేరుకోలేం, మరికొందరు మనం కోరుకో కుండానే జీవితంలోకి వచ్చేస్తారు. ప్రకృతి ప్రభావముగా మనస్ఫూర్తిగా మారాలని అనుకున్నా వీలుపడదు, కానీ కాలమే మనల్ని మార్చివేస్తుంది, మారక తప్పని పరిస్థితిని సృష్టిస్తుంది. అదే వచ్చే ధర్మం, అదే ప్రవృ ర్తి ధర్మం అదే సంతృప్తి మార్గం.

కాలపు గమనాన్ని అనుసరించి జీవితం సాగిపోతుంది, అంతే!"  ఏమని చెప్పేదా ఈ లోకంలో  ఎవరికి ఎవరో ఈ లోకంలో అంటూ సంయుక్త తన తల్లితో పలికింది.

 తల్లి ఆదుర్దాగా అప్పుడే పెళ్లి కాకుండా ఇన్ని విషయాలు నేర్చుకున్నావా అందుకే అన్నారు గురువును మించిన శిష్యులు, తల్లిదండ్రులను మించిన బిడ్డలని 


 ఏంటమ్మా పొగుడుతున్నావా

 అమ్మో పిల్లలను తిట్టడమే......


యింకా వుంది

5, అక్టోబర్ 2025, ఆదివారం





వేగిరపడి యొకని వెంగెము దేనికి 

జాగిలము మనసగు జాత రేల

యోగి వేష మెవరు యోగ్యత యెట్లగు 

కాగితమ్ము లాగ కలలు కాగ

ఇదిగో వరుస భావ విశ్లేషణ:

👉 ఎవరో ఒకరిని చూసి అసూయతో వేగిరపడడం ఎందుకు?

జీవనపథంలో ప్రతి ఒక్కరికీ తన తపన, తన కర్మ, తన సమయం వేరు.

అసూయ మన చిత్తశాంతిని దోచుకుంటుంది.

👉 మనసు కుక్కవలె (జాగిలము) బంధాల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది;

పుట్టుకతో వచ్చిన ఈ చంచలత్వమే మనసు యొక్క స్వభావం.

దానిని శాంతపరచడం సాధనమనే సారాంశం.

👉 యోగి వేషం వేసుకోవడం వల్ల యోగ్యత రాదు;

యోగం బాహ్య ప్రదర్శన కాదు — అంతర ఏకాగ్రత, సద్విచారణ, దయభావం యోగానికి మూలం.

👉 కలలు కాగితంలా పలుచగా, ఊదితే ఎగిరిపోతాయి.

వాటిపై ఆరాధన వృథా;

యథార్థమూ శాశ్వతమూ అన్వేషించమనే గాఢమైన చింతన.

🌿



భావం బెక్కడ లేక వృత్తి నియమాపాయంబు జింతింప కెం
దేవర్తించి పదార్ధ వంచనలచే దీపించి మూర్జళి సం
భావింపే హనుమా ప్రణీత కృతి సామాన్యా కృతిం బూని పై
పై వన్నెల్ వచరింప దాని తిలకింపంబోరు ధీరోత్తముల్

వరుస భావ విశ్లేషణ:
👉 హనుముడు ఎప్పుడూ కేవలం నియమానుసారం ప్రవర్తించడు; భావమే అతని దారిదీపం.
భావరహిత నియమం ఆపాయమే అని తెలుసుకున్నాడు — కర్మయోగా వెనుక ఉన్న ఆత్మభావం ముఖ్యమని గ్రహించాడు.
👉 లంకలోకి ప్రవేశించి మాయమోహాల వంచనల మధ్య కూడా,
తన దేవభక్తి జ్యోతి వెలిగించాడు — అజ్ఞానాంధకారమును శాంతజ్యోతిగా మార్చాడు.
దానితోనే అతని చిత్తదీపం మూర్జలమై ప్రకాశించింది.
👉 హనుముడి కార్యం — సీతామాతను కనుగొనడం, రామదూత్యము — ఇది సాధారణ కార్యం కాదు.
అది భావసంపూర్ణ కృతి; ఆత్మభావం, దైవభక్తి, జ్ఞానశక్తి ఏకమై ప్రతిఫలించిన దివ్యసాధన.
👉 హనుముని ఈ కృతిలోని ఆత్మవెలుగును, తత్త్వప్రతిభను గ్రహించగలవారు ధీరోత్తములు మాత్రమే.
అంటే — యథార్థ భక్తుడే హనుముని కృత్యానికి తత్త్వార్ధం తెలుసుకోగలడు.
🌿


రాతిని నాతిగా మలుపు రాముని లీలలు కాలతీరుగన్

ఖ్యాతిగ సత్యమే పలుకు కాల సు వాక్కుసతీ వియోగమున్

జాతి గుణమ్ముగా హనుమ జాగిల మాదిరి రామ భక్తిగన్

రాతిరి తూర్పు కొండలభి రామము లయ్యెను సూర్యకాంతితో న్

👉 రాముని లీలలు కాలమనే నదీ ప్రవాహమును వంగించినంత శక్తివంతమైనవి.

రాతిలా స్థిరమైన కర్మఫలాన్నీ, నాతిలా మృదువైన ప్రేమతో మలచగల లీలాశక్తి రామునిది.

👉 రాముని వాక్కే సత్యం — సీతావియోగకాలంలో కూడ అది ధర్మపథాన్నే ప్రతిధ్వనించింది.

కాలమే సాక్షి; రాముని మాటలు కాలాన్నీ దాటిన ఖ్యాతిశాశ్వతతను కలిగించాయి.

👉 హనుముని భక్తి అతని స్వభావగుణం — జాతిగుణం వలె సహజమైనది.

జాగిలం తన యజమానుని పట్ల ఎంత అపారమైన విశ్వాసం చూపుతుందో,

అలాగే హనుముడు రామునిపై నిత్యజాగ్రత్త, నిష్ఠ, ప్రేమతో నిండిన చిత్తాన్ని కలిగివున్నాడు.

రాతిరి తూర్పు కొండలభి రామము లయ్యెను సూర్యకాంతితోన్

👉 —హనుముని రామస్మరణ చీకటిలో వెలుగులా విరాజిల్లింది.

రామనామమే అతనికి సూర్యకాంతి; అది ఆత్మానందాన్ని ప్రసరించింది.లంకలో

🌿


అస్పష్టమ్మగుసీతజాడ కలగన్ ఆనంద చంద్రా కళల్
సుస్పష్టమ్మగు మేఘరేఖలుగనున్ సూక్ష్మమ్ము నీడల్లెగన్
ప్రస్పష్టమ్మగు లంకవైభవముగన్ ప్రాభల్య మౌనమ్ముగన్
విస్పోష్టమ్మగు వాక్కు వల్లజపమున్ విశ్వాస మేమార్పుగన్

👉 సీతా జాడలు, రమ్యమైన ఆకృతి, శోభాకర కాంతి — ఇది హనుముని మనసులో స్పష్టముగా ఆనందంగా ప్రతిఫలిస్తుంది.“ఆనంద చంద్రా” అంటే సీతా శోభ ఆకాశమంతా ప్రకాశింపజేసే చంద్రుడు లాంటి అనుభూతి.
👉 మేఘరేఖలు, చిత్తములోని సూత్రమైన భావాలు —
హనుముని జ్ఞాన, స్పష్టతా దృక్పథం ద్వారా చూసినప్పుడు సులభంగా గ్రహింపబడతాయి.“సూక్ష్మమూ నీడల్లెగన్” → ప్రతి చిన్న దిక్కులోనూ ప్రతిఫలించే ఆత్మవేదన.
👉 లంక వైభవం, భౌతిక శక్తి, రాజశక్తి — ఇది హనుముని దృష్టిలో ప్రభల్యమైన మౌన శక్తిగా దర్శనమిస్తుంది.
అర్థం: లంక వైభవం చూసి ఆశ్చర్యపడటమే కాక, హనుముని ధ్యానం, మౌనము ద్వారా దాని ధర్మాత్మకతను గ్రహించడం.
👉 హనుముని వాక్కు శక్తి → వాక్ప్రవాహం, మంత్రశక్తి, భక్తి ప్రబలత.
వాక్కు వల్ల జపం, విశ్వాసం — ఇది అతని ఆత్మవిశ్వాసాన్ని మరియు రామానురాగ భక్తిని ప్రబలంగా చూపిస్తుంది.
🌿


సుందరకాండ – హనుమ ఆలోచన (సీతా భక్తి తత్త్వం)

కేవల చంద్రకాంతిగను కృత్రిమ దేహము గాంచలేకయున్,
తావిరి పుట్టుపుత్తడగు, నాభావన తత్త్వరేఖల గాంచలేకయున్,
పావని పూర్వగాయములు సానలు, దీరిన మేఘరేఖలుల్,
గావున నట్టి సీతగనగానొనరింపగ, నేర్పు పెంపుమున్.

భావ వివరణ:
→ సహజ ప్రకాశం మాత్రమే నిజమైన విలువను కలిగివుంటుంది;కృతక దేహం ద్వారా అది పొందలేము.తావిరి పుట్టుపుత్తడగు, నాభావన తత్త్వరేఖల గాంచలేకయున్→ భూమి తల్లి (తావిరి) ద్వారా ఉద్భవించే జీవరసాలు,సీతా మాత (నాభావన) తత్త్వప్రవాహాలు హనుముని భక్తిని వెలికితీస్తాయి.పావని పూర్వగాయములు సానలు, దీరిన మేఘరేఖలుల్→ వాయు దేవుని శక్తి, ప్రకృతి ప్రవాహాలు, మేఘాల సూచనలు → ఆధ్యాత్మిక మార్గదర్శక శక్తులు.గావున నట్టి సీతగనగానొనరింపగ, నేర్పు పెంపుమున్→ సీతాగానం ద్వారా హనుముని ఆత్మ-ప్రవాహం శుద్ధి అవుతుంది, భక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మిక జ్ఞానం ప్రబోధమవుతుంది.
🌿


దవులు గొప్ప బీదయన పాశము నేస్తము పట్టు వేడగన్

 చదువుల సత్య సంపదయు సజ్జన సౌమ్యత సర్వ వేళలన్ 

 పొదుపుగ పల్కు పాఠమగు పూజ్యత లక్ష్యము దేశభక్తిగన్

 మది పులకించ జీవములు మానస తృప్తికి మార్గదర్శగన్


పదవులు, గౌరవం, మాన్యమైన బంధాలు మన జీవితాన్ని బలవంతంగా పట్టుకుని నిలబెడతాయి.

చదువులు, సత్యసంపద, జ్ఞానం మనసును సౌమ్యంగా, సజ్జనంగా మారుస్తాయి.

పొదుపు, పాఠాలు, పూజ్యమైన లక్ష్యాలు, దేశభక్తి మన వ్యక్తిత్వాన్ని బలోపేతం చేస్తాయి.

ఇవన్నీ మన హృదయాన్ని ఉల్లాసింపజేసి, మానసిక సంతృప్తికి మార్గదర్శకమవుతాయి.

******

ఆర్య భావములన్ని తెల్పగ యర్ధమంతయు యార్తిగా 

సౌర్యశక్తియు ధర్మ వాక్కుల సౌక్య సంపద స్ఫూర్తిగా 

ధైర్యలక్ష్యము యేకపత్నియు ధర్మ రాజ్యము హృద్యమై 

సూర్యకాంతి మహార్షి వాల్మికి సూత్రకావ్యము రామ సీ 

తార్య మారుతి నిష్ఠసిద్ధియు తత్వ రామ మనో హరం


వాల్మీకి జయంతి సందర్భంగా, రాసిన రామాయణం అన్ని ఆధ్యాత్మిక, ధార్మిక భావాలను స్పష్టంగా మనకు తెలియజేస్తుంది.

యీ పద్యం

ఇది సౌర్యశక్తి, ధర్మవాక్యాలు, జ్ఞాన సంపదలతో మనకు ప్రేరణగా నిలుస్తుంది.

రామాయణం ధైర్యాన్ని, ధర్మ రాజ్య స్థాపన లక్ష్యాన్ని హృదయానికి సంతోషకరంగా చూపిస్తుంది.

మహర్షి వాల్మీకి, సూర్యకాంతిలా ప్రకాశించే కవిత్వంతో రామాయణాన్ని రచించారు.

మారుతి (హనుమాన్) విధి-నిష్టతో రాముని తత్త్వాన్ని మనసులో నిలుపుతూ, ధైర్యాన్ని, నిశ్చయాన్ని పెంపొందిస్తాడు.

*-***

వందే సూర్య కళా ప్రభా సురుగురుం Left

జగత్కారణం

వందేచంద్ర కళా సుఖాల సుఖమం వందే గుణానాo పతిo

వందేతన్మయతల్లి తండ్రి గురువే వందే శుభం రక్షమo

వందేకాలమయం జనాశ్ర యముగా వందే ముకుంద ప్రియం

🔹 — సూర్యుని కాంతికళలలో ప్రతిఫలించే దివ్యప్రభను నమస్కరిస్తాను;

ఆ సూర్యస్వరూపుడే సురగురువు (దేవతల గురువు), జగత్కారణమైన పరబ్రహ్మ.

🔹— చంద్రముని మృదువైన కాంతి మనసుని సుఖింపజేస్తుంది;

ఆ సుఖస్వరూపుడైన గుణపతి (గుణాలాధిపతి)నూ వందనము చేస్తాను.

అంటే సౌరశక్తి జ్ఞానరూపం, చంద్రము ఆనందరూపం.

🔹— ఆ సూర్య–చంద్ర శక్తుల సమన్వయమే తల్లిదండ్రి, గురువు రూపమైన దైవత్వం;

వారే శుభప్రదులు, రక్షకులు — వారినే నమస్కరిస్తాను.

🔹— సమస్తం కాలమయమే; కాలమే మన జనాశ్రయం, దైవసంకేతం;

ఆ కాలతత్త్వంలో విరాజమానమైన ముకుందప్రియ లక్ష్మీశక్తినే నమస్కరిస్తాను.


🌼 


 పలుకులను చదవ గలగా

విలసితమగు దయ కరుణయె వినయమ్ముగనే

కళలు కథలగుటయే రా

తలనే తొలగింప మనకు ధన్యత గలుగున్ 

    

 

🔹 — మనిషి పలుకులు, మాటలు, భావప్రకటన — ఇవన్నీ ఆత్మస్వరూపానికి అద్దములు.

వాటిని లోతుగా “చదివి” (అర్థం చేసుకొని) చూసినప్పుడు, మన అంతరంగమును తెలుసుకోవచ్చు.

🔹— మాటల సారాంశం దయగానూ, కరుణగానూ వికసించినపుడే అది నిజమైన వినయం అవుతుంది.

మాటలలోని నిగ్రహం — హృదయపు మృదుత్వమే.

🔹— మన కళలు, సృష్టులు, కథలు అన్నీ ఆ వినయపూరిత హృదయాన్నుంచే పుడతాయి.

కళా–కథా రూపాలు దయ–కరుణలతో మిళితమైతేనే అవి జీవనశాస్త్రమవుతాయి.

🔹 — తల (అహంకారం, గర్వం) తొలగించినపుడే మనకు ధన్యత (సత్యానందం, విముక్తి) లభిస్తుంది.

అహంకారాన్ని విడిచిపెట్టి దయను ఆచరించడం — ఇదే జీవిత సాధన.

🌼 సారాంశం:

మాటలు సత్యహృదయం నుంచే పుట్టాలి;

వాటిలో దయ, కరుణఉండి వినయస్వరూపం అవ్వాలి

ఆ వినయమే కళలకు మూలం, అహంకార విముక్తి ధన్యతకు మార్గం.

****


చదువు జవరాలు సంపద చక్క గున్న
కవులు వాణీ పతులు గాను కాలమందు
ధర్మ చారిగా భోధన దక్షతగను
కొరివి చెట్టుకు నైనను తరముగాదు
🔹
— మనిషికి విద్య, జ్ఞానం, సంపద అన్నీ సమృద్ధిగా ఉన్నా కూడా,
ఆత్మబోధ లేకపోతే అవి అలంకారమాత్రమే.
🔹
— కాలములో ఎన్నో కవులు, వాగ్ములు, పండితులు వచ్చి పోయారు;
వారి వాక్చాతుర్యం కూడా కాలానుగుణమే — శాశ్వతం కాదు.
🔹
— ధర్మమార్గంలో నడుచుకొని, బోధనలో నైపుణ్యమున్నా —
అది కూడా పరిమితమైన మానవ కర్తవ్య పరిధిలోనే ఉంటుంది.చదువు జవరాలు సంపద చక్క గున్న 

కవులు వాణీ పతులు గాను కాలమందు 

ధర్మ చారిగా భోధన దక్షతగను 

కొరివి చెట్టుకు నైనను తరముగాదు 

🔹 

— మనిషికి విద్య, జ్ఞానం, సంపద అన్నీ సమృద్ధిగా ఉన్నా కూడా,

ఆత్మబోధ లేకపోతే అవి అలంకారమాత్రమే.

🔹

— కాలములో ఎన్నో కవులు, వాగ్ములు, పండితులు వచ్చి పోయారు;

వారి వాక్చాతుర్యం కూడా కాలానుగుణమే — శాశ్వతం కాదు.

🔹

— ధర్మమార్గంలో నడుచుకొని, బోధనలో నైపుణ్యమున్నా —

అది కూడా పరిమితమైన మానవ కర్తవ్య పరిధిలోనే ఉంటుంది.

🔹 

— ఆంతరిక వినయం లేకపోతే, ఆత్మసాక్షాత్కారం లేనపుడు

అన్ని శ్రమలూ “కొరివి చెట్టుకి కొంగ” ఎక్కినట్లే —

అనర్ధక ప్రయాస.

(అంటే, కొరివి చెట్టు పైకి ఎక్కిన పక్షి వలె, ఫలప్రాప్తి కాని యత్నం.)

🌼

గీత.. (6)


రూపరహితుడు నాతడు రూపయుతుడు

 నామరహితుడు మరియును నామియతడు

ప్రేమ భక్తుడు మనసున ప్రేమికుడుగు

వాడు కానది జగతిని భాసమగునె?           

🔹 

— ఆ పరమాత్మునికి స్వరూపం లేదు; అయినప్పటికీ సృష్టిలోని ప్రతి రూపములో ఆయనే వ్యక్తమవుతాడు.

నిరాకారుడే సాకారుడవుతాడు — నిష్కలమే సకలమవుతుంది.

🔹 

— నామములేని పరబ్రహ్మమే అనేక నామముల రూపముగా అనుభవింపబడుతుంది.

సత్యం నిరుపాధికమైనది, కానీ భక్తి దృష్టిలో అది “లక్ష్మీ”, “శివ”, “కృష్ణ” మొదలైన నామాలతో దర్శనమిస్తుంది.

🔹 

— ఆ రూపరహితుడే మనసులో ప్రేమరూపమై భక్తునిలో ప్రేమికుడుగా అవతరిస్తాడు.

అది ఆత్మానుభూతి; అక్కడ భక్తుడు, భగవంతుడు రెండూ ప్రేమలో ఏకమవుతాయి.

🔹 

— ఆయన లేనిది ఏది?

ఆయన తానే జగత్తుగా, జ్ఞానంగా, చైతన్యంగా వెలుగుచేస్తున్నాడు.

ఆ వెలుగు లేక జగత్‌ అనుభవమే ఉండదు.

🌼

"అష్టావక్ర గీత"


పద్యం:


అష్టావక్ర గీత


మనసున గోచరమ్మగుట మాట వివేక సృజన్య మూలమున్

తనువున కామయిoద్రియము తత్త్వము బంధము నిత్య ముక్తిగన్

మనమున బాహ్యయంతరము మార్గము జన్యుపరమ్ము శాంతిగన్

వినయ గుణమ్ము తీరుగను విద్యల వెల్లువ సర్వమేయగున్


మొత్తం భావార్థం:

మనస్సు యొక్క తాత్కాలికమైన విషయాలపై ఆశక్తి వివేకం లేనిదే కలుగుతుంది.

శరీరం, ఇంద్రియాలు మనకు బంధం కలిగిస్తాయి, కానీ తత్త్వ జ్ఞానం వలన ముక్తి పొందవచ్చు.

మనస్సు అంతర్ముఖమైతే, పరమశాంతిని అందుకుంటుంది.

విద్యకు గర్వం కాదు, వినయమే మౌలికత. వినయంతోనే విద్యకు సార్థకత.

*****

యీ మహామహుల్ మనసుగా యేక మగట

ముందు విందగు సంతృప్తి మూల మగుట

సహన సాహిత్యప్రియులు గా సమయ మగుట

ఒకరి కొకరు కలసి మాట నో ర్పు యగుట


1️⃣


> మహామహులైన జ్ఞానులు, సాహిత్యప్రియులు, మహానుభావులు — వీరి మనసులు యేకమవ్వాలి.

మనోఐక్యతే మహాత్మత్వానికి మూలం.

భిన్న భావాలు ఉన్నా, హృదయ సమన్వయమే నిజమైన మహిమ.


2️⃣


> ఏకముగా ఉండడం వల్ల ముందుగానే సంతృప్తి కలుగుతుంది.

సంతృప్తి — అంటే తృప్తి, శాంతి, సహకారం.

ఇది మనసుకు మూలాధారం; సమాజానికి ఆశ్రయం.



3️⃣


> సహనం, సాహిత్యప్రీతి — ఈ రెండూ కలిసి సమయస్ఫూర్తిగా ఉండాలి.

సాహిత్యం సహనాన్ని బోధిస్తుంది, సహనం సాహిత్యాన్నీ పరిపుష్టం చేస్తుంది.

ఇది సంస్కార సమయానికి శిల్పము.



4️⃣ 


> సత్సంగములో మాటల మార్పిడి సత్యసంధానముగా ఉండాలి.

కలసి మాట్లాడడం అంటే కేవలం సంభాషణ కాదు — మాటలలో మమకారాన్ని పంచుకోవడం.

పరస్పర గౌరవం మాటల ద్వారా వ్యక్తమవుతుంది.


*****

మాతృశ్రీ” శ్రేణికి సరిపోయే మణిరత్నం. 🌿


నేల ఋణము తీర్చ నిలకడ పుట్టుకే 

బ్రతుకు బ్రతుకు మధ్య బంధ మెట్టు 

పుట్టి గిట్టు టనకు పూజ్యమగునుగుట్టు 

పట్టు రట్టు కట్టు బెట్టు బొట్టు


1️⃣ 

పుట్టుకే మనిషి భూమాతకు, సృష్టికి ఋణపడి జన్మిస్తాడు.

ఆ ఋణాన్ని తీర్చడం — అదే జీవన ధర్మం, అదే నిలకడ.

జీవితం అనేది ఋణ పరిహారయాత్ర.

2️⃣ 

బ్రతుకులోని బ్రతుకు — అంటే ప్రతి క్షణ జీవనమూ ఒక బంధమే.

ఆ బంధమే మనిషిని ఎత్తుకెళ్లే మెట్టుగా కూడా మారుతుంది.

స్నేహం, కర్తవ్యము, ప్రేమ — ఇవన్నీ బంధాల రూపంలో ఉన్న పాఠాలు.

3️⃣ 

పుట్టి ఎదిగేంత వరకు మనిషి తెలుసుకోవలసిన గుట్టు — పూజ్యమయ జీవన రహస్యం.

అది శ్రమ, సేవ, సాత్వికతతో నిండిన మర్మము.

జీవితం పూజ్యమవుతుంది గుట్టు గ్రహించినప్పుడు మాత్రమే.

4.వ పాదం మాటల ధ్వన్యాత్మక సమన్వయంతో అద్భుతంగా ఉంది.

“పట్టు” — సంకల్పం,

“రట్టు” — ఆచరణ,

“కట్టు” — బంధం లేదా కట్టుబాటు,

“బెట్టు” — సాధన లేదా పోరాటం,

“బొట్టు” — ఫలితం, సమర్పణ, శుభసూచిక.

ఈ పంచపదాలు జీవనయాత్ర యొక్క ఐదు దశలను సూచిస్తాయి.

🌺


నానాజీవకళా జలా చలనమై నానంద పర్గేలె సు

మ్మానాదంబుగ శబ్దతత్త్వమగు టే మానంబు సౌఖ్యంబు గ 

మ్యానాట్యంబగుశాంతిమార్గముగనే మాయల్లె తీరమ్ముగన్ 

జ్ఞానా నందము పొంద తీరగుటయే కాలమ్ము వైనమ్ముగన్




🔹 — అనేక జీవరూపాలు, జల తరంగాల వలె నిరంతర చలనంలో ఉంటాయి.

అవి ఆ చలనంలోనే అనుభవరసాన్ని — నానా ఆనంద పర్గెలను — పొందుతాయి.

జీవితం అంటే స్రవంతి; ఆ చలనం సృష్టి రాగం.

🔹 — ఆ చలనమంతటిలో నినదించే నాదమే శబ్దతత్త్వం;

ఆ నాదమే మనసుకు సౌఖ్యమూ, మానసిక సమతా ప్రసాదమూ.

అంటే చైతన్య ప్రవాహమే శబ్దస్వరూపమైన సత్యం.

🔹 — ఈ చలనమే విశ్వనాట్యం;

అందులో శాంతిమార్గమే నిజమైన తీరము.

మాయా తరంగాలు శాంతి సముద్రంలో కలిసిపోతాయి.

🔹— చివరికి ఆ శాంతి, ఆ చైతన్యం మనసుని జ్ఞానానంద స్థితికి తీసుకువెళ్తుంది.

కాలము కూడా ఆ అనుభవానికి సేవకుడవుతాడు — సాక్షిగా నిలుస్తాడు.


🌼 సారాంశం:

జీవచలనము జలతరంగమువలె నడుస్తూ,

శబ్దతత్త్వంలో నాదముగా అనుభవమవుతూ

మాయను దాటి శాంతిమార్గంలో కలిసినపుడే

జ్ఞానానందమే పరమగమ్యం అవుతుంది.

*****

న్యస్తాక్షరి ******** అంశం : హనుమ సీతను చూసి వచ్చి తన వానర సేనకు చెప్పిన విషయాలు 01-11  .  రి ,    ( 1 వ లైన్ 11 వ అక్షరం రి 02-  2  .  సి  , 03-13  . మి ,   04-20 .  మో ... ==


పద్యం

చూసితి సీత దేవిగను భూరిత లక్ష్మము లంకనాశనం

వాసిగ రావణా కళలు వాక్కుల తీరున బాధలే యగున్

రాశిగ కొంతయుద్ధమును రక్షణ మిన్నగ నేనుచేసితిన్

పాశము రామభక్తిగను పావని పూజలు కాలమేనమో


అది అద్భుతమైన ఆలోచన! 🌸

ఇప్పుడు ఆ దృక్కోణంలో — హనుమంతుడు సీతను దర్శించి లంక నుండి తిరిగి వచ్చి వానరసేనతో చెప్పిన మాటలుగా 

 (హనుమంతుని స్వరంలో)👇🏻


వానరు లారా! నేను సీతా దేవిని చూశాను!

ఆమె రూపంలో భూరి లక్ష్మీ తేజస్సు ప్రకాశిస్తుంది.

ఆ తేజమే లంకనాశనానికి సంకేతం.

రామవీర్యం ఆమెలో దివ్యస్ఫురణగా ఉంది.

రావణుడు మాయామంత్రాలతో, మధురవాక్కులతో ఆమెను వశపరచాలనుకున్నాడు,

కాని ఆ ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి — అతనికి బాధలే మిగిలాయి.

ధర్మాన్ని బంధించలేము, మాయకు సత్యం లొంగదు.

లంకలోని రాక్షసులతో నేను కొంత యుద్ధం చేసాను,

కానీ రాముని కృప లేక నేనేమి చేయగలిగేవాన్ని?

ఆ ప్రభు స్మరణే నా రక్షణ — ఆ ప్రభావమే నా బలం.

రామభక్తి పాశముతోనే ఈ కార్యం సాధ్యమైంది.

ఆ పూజ పావనమైంది; కాలమే ఆ రామకార్యానికి సేవకుడయ్యాడు.

నా శక్తి కాదది, రామభక్తి విభూతి!

🌺
🔹
— ఆంతరిక వినయం లేకపోతే, ఆత్మసాక్షాత్కారం లేనపుడు
అన్ని శ్రమలూ “కొరివి చెట్టుకి కొంగ” ఎక్కినట్లే —
అనర్ధక ప్రయాస.
(అంటే, కొరివి చెట్టు పైకి ఎక్కిన పక్షి వలె, ఫలప్రాప్తి కాని యత్నం.)
🌼
గీత.. (6)

రూపరహితుడు నాతడు రూపయుతుడు
నామరహితుడు మరియును నామియతడు
ప్రేమ భక్తుడు మనసున ప్రేమికుడుగు
వాడు కానది జగతిని భాసమగునె?          
🔹
— ఆ పరమాత్మునికి స్వరూపం లేదు; అయినప్పటికీ సృష్టిలోని ప్రతి రూపములో ఆయనే వ్యక్తమవుతాడు.
నిరాకారుడే సాకారుడవుతాడు — నిష్కలమే సకలమవుతుంది.
🔹
— నామములేని పరబ్రహ్మమే అనేక నామముల రూపముగా అనుభవింపబడుతుంది.
సత్యం నిరుపాధికమైనది, కానీ భక్తి దృష్టిలో అది “లక్ష్మీ”, “శివ”, “కృష్ణ” మొదలైన నామాలతో దర్శనమిస్తుంది.
🔹
— ఆ రూపరహితుడే మనసులో ప్రేమరూపమై భక్తునిలో ప్రేమికుడుగా అవతరిస్తాడు.
అది ఆత్మానుభూతి; అక్కడ భక్తుడు, భగవంతుడు రెండూ ప్రేమలో ఏకమవుతాయి.
🔹
— ఆయన లేనిది ఏది?
ఆయన తానే జగత్తుగా, జ్ఞానంగా, చైతన్యంగా వెలుగుచేస్తున్నాడు.
ఆ వెలుగు లేక జగత్‌ అనుభవమే ఉండదు.
🌼
"అష్టావక్ర గీత"

పద్యం:

అష్టావక్ర గీత

మనసున గోచరమ్మగుట మాట వివేక సృజన్య మూలమున్
తనువున కామయిoద్రియము తత్త్వము బంధము నిత్య ముక్తిగన్
మనమున బాహ్యయంతరము మార్గము జన్యుపరమ్ము శాంతిగన్
వినయ గుణమ్ము తీరుగను విద్యల వెల్లువ సర్వమేయగున్

మొత్తం భావార్థం:
మనస్సు యొక్క తాత్కాలికమైన విషయాలపై ఆశక్తి వివేకం లేనిదే కలుగుతుంది.
శరీరం, ఇంద్రియాలు మనకు బంధం కలిగిస్తాయి, కానీ తత్త్వ జ్ఞానం వలన ముక్తి పొందవచ్చు.
మనస్సు అంతర్ముఖమైతే, పరమశాంతిని అందుకుంటుంది.
విద్యకు గర్వం కాదు, వినయమే మౌలికత. వినయంతోనే విద్యకు సార్థకత.
*****
యీ మహామహుల్ మనసుగా యేక మగట
ముందు విందగు సంతృప్తి మూల మగుట
సహన సాహిత్యప్రియులు గా సమయ మగుట
ఒకరి కొకరు కలసి మాట నో ర్పు యగుట

1️⃣

> మహామహులైన జ్ఞానులు, సాహిత్యప్రియులు, మహానుభావులు — వీరి మనసులు యేకమవ్వాలి.

మనోఐక్యతే మహాత్మత్వానికి మూలం.
భిన్న భావాలు ఉన్నా, హృదయ సమన్వయమే నిజమైన మహిమ.

2️⃣

> ఏకముగా ఉండడం వల్ల ముందుగానే సంతృప్తి కలుగుతుంది.

సంతృప్తి — అంటే తృప్తి, శాంతి, సహకారం.
ఇది మనసుకు మూలాధారం; సమాజానికి ఆశ్రయం.

3️⃣

> సహనం, సాహిత్యప్రీతి — ఈ రెండూ కలిసి సమయస్ఫూర్తిగా ఉండాలి.

సాహిత్యం సహనాన్ని బోధిస్తుంది, సహనం సాహిత్యాన్నీ పరిపుష్టం చేస్తుంది.
ఇది సంస్కార సమయానికి శిల్పము.

4️⃣

> సత్సంగములో మాటల మార్పిడి సత్యసంధానముగా ఉండాలి.

కలసి మాట్లాడడం అంటే కేవలం సంభాషణ కాదు — మాటలలో మమకారాన్ని పంచుకోవడం.
పరస్పర గౌరవం మాటల ద్వారా వ్యక్తమవుతుంది.

*****
మాతృశ్రీ” శ్రేణికి సరిపోయే మణిరత్నం. 🌿

నేల ఋణము తీర్చ నిలకడ పుట్టుకే
బ్రతుకు బ్రతుకు మధ్య బంధ మెట్టు
పుట్టి గిట్టు టనకు పూజ్యమగునుగుట్టు
పట్టు రట్టు కట్టు బెట్టు బొట్టు

1️⃣
పుట్టుకే మనిషి భూమాతకు, సృష్టికి ఋణపడి జన్మిస్తాడు.
ఆ ఋణాన్ని తీర్చడం — అదే జీవన ధర్మం, అదే నిలకడ.
జీవితం అనేది ఋణ పరిహారయాత్ర.
2️⃣
బ్రతుకులోని బ్రతుకు — అంటే ప్రతి క్షణ జీవనమూ ఒక బంధమే.
ఆ బంధమే మనిషిని ఎత్తుకెళ్లే మెట్టుగా కూడా మారుతుంది.
స్నేహం, కర్తవ్యము, ప్రేమ — ఇవన్నీ బంధాల రూపంలో ఉన్న పాఠాలు.
3️⃣
పుట్టి ఎదిగేంత వరకు మనిషి తెలుసుకోవలసిన గుట్టు — పూజ్యమయ జీవన రహస్యం.
అది శ్రమ, సేవ, సాత్వికతతో నిండిన మర్మము.
జీవితం పూజ్యమవుతుంది గుట్టు గ్రహించినప్పుడు మాత్రమే.
4.వ పాదం మాటల ధ్వన్యాత్మక సమన్వయంతో అద్భుతంగా ఉంది.
“పట్టు” — సంకల్పం,
“రట్టు” — ఆచరణ,
“కట్టు” — బంధం లేదా కట్టుబాటు,
“బెట్టు” — సాధన లేదా పోరాటం,
“బొట్టు” — ఫలితం, సమర్పణ, శుభసూచిక.
ఈ పంచపదాలు జీవనయాత్ర యొక్క ఐదు దశలను సూచిస్తాయి.
🌺
న్యస్తాక్షరి  ******** అంశం : హనుమ సీతను చూసి వచ్చి తన వానర సేనకు చెప్పిన విషయాలు   01-11  .  రి ,    ( 1 వ లైన్ 11 వ అక్షరం    రి  02-  2  .  సి  , 03-13  . మి ,    04-20 .  మో ...  ==

పద్యం
చూసితి సీత దేవిగను భూరిత లక్ష్మము లంకనాశనం
వాసిగ రావణా కళలు వాక్కుల తీరున బాధలే యగున్
రాశిగ కొంతయుద్ధమును రక్షణ మిన్నగ నేనుచేసితిన్
పాశము రామభక్తిగను పావని పూజలు కాలమేనమో

అది అద్భుతమైన ఆలోచన! 🌸
ఇప్పుడు ఆ దృక్కోణంలో — హనుమంతుడు సీతను దర్శించి లంక నుండి తిరిగి వచ్చి వానరసేనతో చెప్పిన మాటలుగా
(హనుమంతుని స్వరంలో)👇🏻

వానరు లారా! నేను సీతా దేవిని చూశాను!
ఆమె రూపంలో భూరి లక్ష్మీ తేజస్సు ప్రకాశిస్తుంది.
ఆ తేజమే లంకనాశనానికి సంకేతం.
రామవీర్యం ఆమెలో దివ్యస్ఫురణగా ఉంది.
రావణుడు మాయామంత్రాలతో, మధురవాక్కులతో ఆమెను వశపరచాలనుకున్నాడు,
కాని ఆ ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి — అతనికి బాధలే మిగిలాయి.
ధర్మాన్ని బంధించలేము, మాయకు సత్యం లొంగదు.
లంకలోని రాక్షసులతో నేను కొంత యుద్ధం చేసాను,
కానీ రాముని కృప లేక నేనేమి చేయగలిగేవాన్ని?
ఆ ప్రభు స్మరణే నా రక్షణ — ఆ ప్రభావమే నా బలం.
రామభక్తి పాశముతోనే ఈ కార్యం సాధ్యమైంది.
ఆ పూజ పావనమైంది; కాలమే ఆ రామకార్యానికి సేవకుడయ్యాడు.
నా శక్తి కాదది, రామభక్తి విభూతి!
🌺

 “చిత్త ధర్మచక్రం”

చాకచక్యపు పలుకులు చలన రీతి

బుద్ధి తత్త్వము కదలగా పూజ్య పలుకు

మంచి యన్న మాటలు తీరు మాయలె యగు

కాకి చిరకాల మున్న నే కార్యమగును


🔹— చాకచక్యముగలవారి మాటలు చలనశీలమైనవి;

వాటి లోతు మారిపోతూ ఉంటుంది — అవి స్థిరసత్యం కాదని సూచన.

అంటే కపటచాతుర్యం మాటలలో ప్రతిఫలిస్తుంది.

🔹 — బుద్ధి తత్త్వం (సత్యజ్ఞానం) కదిలిపోతే,

అంటే విలువలు, ధర్మం చెదిలితే —

పూజ్యమైన పలుకులు (మాటలు, బోధనలు) కూడా బలహీనమవుతాయి.

నిజమైన బుద్ధి లేని మాట పూజ్యముకాదు.

🔹 — “మంచి మాటలు” అని అనిపించినా,

అవి లోలోపల మాయగా మారతాయి —

అనుకరణతో కూడిన నాటకప్రాయమైన సౌమ్యత.

బాహ్య మాధుర్యం లోపలి అబద్ధాన్ని దాచుతుంది.

🔹— కానీ ఇంతమందరిలోనూ నిజమైన కర్తవ్యనిరతుడు,

సహనముతో ఉన్నవాడే —

కాలాంతరాన ఫలాన్ని పొందుతాడు.

కాకి (సహనము, స్థిరత్వము) దీర్ఘకాలమునే ఫలాన్ని ఇస్తుంది.

🌼

ఓంకారమ్ముననె స్థితాత్మ గుణమున్ – నానాత్మ లీలారసం
సoఖ్యా మోహముగమ్య జీవనముగా – మార్గమ్ముగా మాళ్ళధం
భోక్తార్చన్న విభూతియు మంగళముగన్ – భాసించ నిత్యార్థధం
కైంకర్యమ్మగు సామరూప్యముగనున్  సాధించు సద్గోపధం

పద్య భావార్థం:

➡️ పరమాత్మ (ఓంకారస్వరూపుడు) లోనే స్థితమైన ఆత్మగుణం — అనగా జ్ఞానం, ఆనందం, చైతన్యం మొదలైన గుణాల ద్వారా నానా జీవరాశుల లీలారసాన్ని ప్రదర్శిస్తాడు.
➡️ ఈ జగత్తు సఖ్యమోహరూపమైన మాయలోనూ, ఆయనే జీవనానికి మార్గముగా నిలిచే మహా ధనం — మాళ్ళధుడు (విష్ణువు).
➡️ భక్తులు ఆయనను ఆరాధించగా, ఆయన విభూతి, కాంతి, మంగళమూర్తి స్వరూపం నిత్యసత్యంగా ప్రస్ఫుటమవుతుంది.

➡️ చివరగా, సద్గోపుడు (భక్తుడు) ఆయన సేవా స్వరూపమైన సామీప్య, సారూప్య, సాయుజ్యములు పొందటమే పరమపదసాధన.

భారతి ధర్మ తత్త్వం

చం. బ్రతుకు ధరాతలమ్మగుట భారతి బంధనసత్య భాద్యతన్
మెతుకుకు ధర్మదారులగు మెప్పుకు మేలుకు విద్య లక్ష్యమున్
గతుకు మనస్సుకామ్యమున గమ్యము శాంతి య శాంతి ప్రశ్నగన్
చితపు లీలలే భవిత చేరువ కాలము తోడు నీడగన్
🔹
— జీవితం ఈ భూమిపై ఒక బాధ్యతగా, ధర్మసత్యముగా ఏర్పడిన భారతి (జ్ఞానశక్తి) యొక్క బంధముగా ఉంది.
అంటే జీవితం భౌతికం కాదు — అది జ్ఞానభారతిగా ఉన్న దైవబంధనం.
🔹
— మన మేలుకి (ఉన్నతికి) విద్యే మార్గం;
ధర్మదారులు (ధర్మమార్గాన నడిచే వారు) మాత్రమే మెతుకులైన (సూక్ష్మమైన) సత్యాన్ని గ్రహిస్తారు.
విద్య యొక్క లక్ష్యం ధర్మానుసరణం.
🔹
— మనసుకు అనేక ఆకాంక్షలున్నా,
అవి సాంతం అయ్యే గమ్యం శాంతి మాత్రమే.
శాంతి అంటే ప్రశ్నలకతీత స్థితి — చిత్త సమత్వం.
🔹
— చిత్తము చేసే లీలలే భవిష్యత్తుగా (భవితగా) రూపాంతరం చెందుతాయి;
కాలము వాటి నీడగా కదిలిపోతుంది.
అంటే భవితవ్యమూ మనసు లీలలే; కాలం కేవలం దానికి తోడుగా ఉంటుంది.
🌼

పద్యం:

ప్రణవాశ్చల్యము పన్యసింపఫల ప్రాబల్యమ్ము క్రీడార్ధమున్
గుణదీక్షాత్పర విశ్వబంధపరమున్ సూక్ష్మమ్ము శఖ్యార్థిగన్
గణధర్మమ్ముగు పద్మజామయముగన్ గమ్యమ్ము విశ్వాసమున్
రుణకేళీమయ రేయిగాపవలు సారూప్యమ్ము దేహమ్ముగన్
---

పదక్రమంగా వివరణ:

1. ప్రణవ ఆశ్చల్యము – “ఓం” (ప్రణవ) యొక్క చలించని స్థితి (అశ్చల్యము), అంటే పరమాత్మ తత్వం, స్థిరమైనదైన ఆధ్యాత్మిక స్థితి.


2. పన్యసింప ఫల ప్రాబల్యమ్ము క్రీడార్థమున్ – పన్యసింపు = ఆవిష్కరణ; ఫలప్రాబల్యము = ఫలితాల ప్రభావం; ఈ ప్రపంచం తాను సృష్టించిన లీలా, క్రీడార్థంగా సృష్టించబడినదని భావన.


3. గుణదీక్షాత్పర విశ్వబంధపరమున్ – మూడు గుణాల (సత్త్వ, రజస్, తమస్) లోనిది కాకపోవడం; విశ్వబంధానికి పరమమైనది; అంటే మాయలో నిత్యం ఆగిపోని పరమాత్మ తత్వం.


4. సూక్ష్మమ్ము శఖ్యార్థిగన్ – సూక్ష్మతత్వం (ఇంద్రియాలకు అందని పరమసత్యం), శఖ్యార్థిగన్ = మిత్రత్వాన్ని కోరే సాదకులకు మాత్రమే గ్రహించగలిగినది.


5. గణధర్మమ్ముగు పద్మజామయముగన్ – గణధర్మము = గణనీయమైన లక్షణం; పద్మజా = లక్ష్మి (విష్ణుపత్ని); అమయం = స్వభావం; లక్ష్మిదేవి స్వభావంగా గల విశేషగుణాలుగల పరమాత్మ తత్వం.


6. గమ్యమ్ము విశ్వాసమున్ – విశ్వాసముతో చేరవలసిన గమ్యం.


7. రుణకేళీమయ రేయిగాపవలు – రుణ (బంధం), కేళీ (లీలా), మాయగా ఏర్పడిన రాత్రి (అజ్ఞానం), ఆ పాపాల నుండి విముక్తి.


8. సారూప్యమ్ము దేహమ్ముగన్ – సారూప్యం = పరమాత్మతో సమానత్వం; దేహంగా (శరీరధారణగా) కనబడే పరమసత్యాన్ని సూచిస్తుంది.

మొత్తం అర్థం:

ఈ పద్యం ఒక తాత్విక భావనను ప్రతిబింబిస్తుంది. పరమాత్మ యొక్క స్థితిని, సృష్టిని, తన లీలా వల్ల వచ్చిన బంధాలను, వాటినుంచి విముక్తిని, చివరకు భక్తుడు పొందే సారూప్య స్థితిని ఈ పద్యంలో వర్ణించబడింది. ఇది శంకరభాష్య శైలికి దగ్గరగా ఉంటుంది. ఈ పద్యంలో "ఓం" యొక్క స్థిరత్వం, మాయా లీలా, గుణాల పాలన, సద్గుణాలు, భక్తి ద్వారా పొందే పరమగమ్యం వంటి తత్త్వాలు చాలా లోతుగా ఉన్నాయి.
*****