14, అక్టోబర్ 2025, మంగళవారం

 



*ఈ కథ కాదు? హృదయాక్షర ప్రాంజలి*


అసలే అంధకారం, ఉండి లేనట్లుగా అంతా కాంతిమయం, సకలం నిద్ర వస్తలో చిన్మయం, అక్కడక్కడ సునకాల విన్యాసం, శబ్దాల సమన్వయం, రక్షక భటుల అగమ్య గోచరం, చర్మాంకాలతో అనారోగ్య విధి విలాసం, గమ్యమే తెలియని పుట్టుకే తెలియని అనాధుదల ఆర్తనాదం,


మనసంతా మరుమల్లె పూచినట్టుగ  యెదిగే, తనువంతా తపమల్లె సూత్ర యున్నతి వెలుగే, గుణమంతా సుఖమివ్వ మూల మౌనము కలిగే, జనమంతా సహనమ్ముగానిద్ర మరిగే,అపురూపము కలగా కవ్వింతలో కళా మయం, ఉపవాసము తలపే ఉత్సాహమ్ముగా మనోమయం, నొపదేశము మలుపే నోర్తే సఖ్యత విస్మయం, అపవాదము మెరుపే ఆశ్చర్య గమ్య జీవితం.


ఎదురు చూడ కన్నులు అంతు చిక్కని కలలు, బెదురు లేనిబేలలు భీతి చెందెదడి కథలు, వెదురు బుట్ట మేళము వేగుచున్న వ్యధలు, సదరు భక్తి గానము సాగుతున్న రుదలు, కలవరింతలో కళా బెదురు లేని తెన్నులు, సలపరింతలో సదా శ్రమను చూపు కన్నులు, కలవ వింతలో కధా గమన మొప్పు

చన్నులు, పిలుపు యంతలో కదా సమము చేయు సొమ్ములు నిలకడ జీవితం.


 రచన మల్లాప్రగడ రామకృష్ణ 

 అభిప్రాయాలు తెలిపితే రాస్తాను  (రోజువారీ కథగా )

*ఈ కథ కాదు? హృదయాక్షర ప్రాంజలి* (02)


ఊహలలో నిమగ్నమ ఈ మనసుకు ఏమిటీ, స్నేహములో వినమ్ర త శుభముయె ఏమిటి, దే హము లో సమర్ధత సహనము ఏమిటీ, దాహములో శుభమ్ము గు ఏమిటీ కదిలించు జీవితం,  తలపులో చిగురిoచిన ఈ వింత వింతలోకము, మలుపులో సుగంధము యీ బంధ మోహ మైకము, పలుకులో శుభమ్మగు యీ కాంతి లీలలేయగు, తులువు లే గళమ్మగు యీ బ్రాంతి కాల వైనము తీరుగా జీవితం కదా మాష్టారు మీరేమంటారు


అసలు స్వర్గం అనగా?


 మంచి ఆరోగ్యం, మమతానురాగం, హృదయ వాశ్చల్యం, నెరవేర సంయోగం, 

దృఢకాయ శరీరం, యేపనైనాచేయగలనని విశ్వాసం, 

పాప రహితమైన జీవితం గడపడం, పరోపకరిగా పరమానంద భరితునిగా, 

స్వతంత్రంగా జీవించడం , అనగా స్వేచ్ఛగా సహాయ సహకారాలు అందిస్తూ, సర్వవేళలా జ్ఞాన భోధకుడుగా జీవిస్తూ, దేవుడుపైన నమ్మకం, కలిగేట్లు మాటలు వళ్ళిస్తూ, అంతా శివ సంకల్పం నేముమాత్రం నిమిత్తమాతృడను అనుకుంటూ, నిత్య o బ్రతికి బ్రతికించు ధ్యేయం తో ధైర్యము గా జీవించినట్లయితే అటువంటి వారికి నిత్యమూస్వర్గమే.


నింగినున్నదియె మేఘం నిను చూసియు జల్లులై, భంగి యన్నది యె మోహo విను కోతల పల్కులై, ఖంగు తిన్న మది వైనం నిధి నేస్తము నవ్వులై, రంగు లన్ని కల తీరు కరిగే విధి పువ్వులై, ఏదో కమ్మని పిలుపై చుక్కచక్కిలి గింతగా, ఏదో నమ్మని తలపే వక్కచెక్కలైనంతగా, ఏదో కమ్మనిపిలుపే దక్కుదిక్కులై నంతగా, ఏదో దమ్ముకు బలుపే ముక్కచెక్కలై నంతగా కదలికలే కాల నిర్ణయానికి లోబడి సంసారములో సరిగమలు కావా @@


తడిమి పరువశించిగాకురిసే యరవిందమై, మడుగు పలకరించగామెరిసే మెరుపమ్ముగై, అడుగు కలవరంపగా అలుపే హృదయమ్ము గై, ముడుపు తలపు యాసగా, చిరు గాలియె  చల్లగా మెల్లగా తాకి సాగుగా, పరవమ్ముయు మెల్లగా చల్లగా ఊగి సాగగా, అరునోదయ వేడిగా వేగమై  సాగి సాగగా, చిరుహాసము మెల్లగా చెల్లగా పాకి సాగగా కదిలే జీవితం లో అన్నీ నిజాలుకావు, అబద్దాలు ఆశలె కావు కదా అని నిద్రలో కలవరస్తుంది సంయుక్త.


ఇంకా వుంది.


*ఈ కథ కాదు? హృదయాక్షర ప్రాంజలి* (03)

మల్లా ప్రగడ రామకృష్ణ


చూడు సంయుక్త నీవు చదివినంత నేను చదవలేదు, కాని లోకమే నాకు నేర్పింది. నాభాధ యంతా నీమీదే మీ అన్నలు ఎవరి దారి వారు చూసుకున్నారు. నిన్నుకూడా ఒక ఇంటిదాన్ని చేస్తే నా మనస్సు కొంత ప్రశాంతత నా మాటలు నీకు భాదగా నున్నాయా లేదు లేదు చెప్పమ్మా 


ఎప్పుడూ నిజాన్నే మాట్లాడడం. ఇది ఒక వ్రతం లాంటిది. గొప్ప ధర్మం. శ్రేయస్కరం కూడా. కాని ఒక్కొక్కప్పుడు సత్యం కూడా కఠోరంగా ఉంటుంది. ఆది నువ్వు తెలుసుకోవాలి నీ ఉద్యోగధర్మం లో కొన్ని అవాంతరాలు వచ్చినా ధైర్యమే నీకు ఆయుధం అవ్వాలి ఎవ్వరూ తోడురారు.


నువ్వు కూడా నమ్మా 


అవునమ్మా వయసు ఉడికినవారు సలహాలు తప్ప ఏమిస్తారు అదిచాలమ్మా


అందుకే "నిజం నిప్పు లాంటిది" అంటారు. దాన్ని దాచలేము కూడా. నిజం చెపితే నిష్ఠూరం కూడా కలుగుతుంది. అవతలి వారి మనసు గాయపడవచ్చు. వారు బాధపడవచ్చు, అలాంటి సందర్భాలలో వారికది ప్రియభాషణం కాకపోవచ్చు.


అంచేత "సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం".


సత్యాన్నే పలకాలి. ప్రియంగా పలకాలి. అప్రియమైన సత్యాన్ని పలకకుండా ఉండడమే మంచిది. అంటే నిజం చెపితే ఎవరికైనా ఏదైనా కీడు జరుగుతుందనుకున్నప్పుడు ఆ నిజం చెప్పవలసిన అవసరం లేనప్పుడు చెప్పకుండా ఉండడమే మంచిది.


 అలాగే ఒక అసత్యం చెపితే ఎవరికయినా ఏదయినా మేలు జరుగుతుందన్నప్పుడు అసత్యమాడినా పరవాలేదు. అదే ధర్మరాజు "అశ్వత్థామా హతః (కుంజరః)" అని ఆడిన అసత్యం.


అలాంటి సందర్భాలలో, సమయాలలో సత్యం చెప్పకపోవడమే కాకుండా అసత్యమాడినా దోషం అంటదనేది శుక్రనీతి. కాని అది ఎల్లవేళలా పనికి రాదు.


"స్మితవక్త్రో మితభాషీ, అపూర్వభాషీచ రాఘవః" అని శ్రీరామచంద్రుని అష్టోత్తర శతనామావళిలో కీర్తించడం జరిగింది.


అంటే శ్రీరామచంద్రుడు ఎల్లప్పుడూ చిరునవ్వుతో మాట్లాడేవాడునూ, మితంగా భాషించేవాడునూ, అపూర్వంగా అంటే ఇంతకు ముందు ఎన్నడూ ఎవరూ ఎరుగని విధంగా మహోన్నతంగా భాషించేవాడునూ అని కొనియాడడం జరిగింది.


అందుకే అవతార పురుషుడై మానవులందరికీ మాటల్లోనూ, చేతల్లోనూ ఆదర్శప్రాయమైన మార్గాన్ని అవలంబించి చూపాడు.


అయితే ఈ వాక్కును నిగ్రహించుకోవడం ఎలా.. మనం మన మనసును నిగ్రహించుకుంటే వాక్కును నిగ్రహించుకోగలుగుతాము మనసు నిర్మలంగా, శుద్ధిగా ఉంటే వాక్కు కూడా నిర్మలంగా ఉంటుంది.


వాక్శుద్ధి కలుగుతుంది.


అటువంటి వాక్శుద్ధి కలవారు అన్నది జరిగి తీరుతుంది.


అమ్మా నీమాటను తప్పకుండా ఆచరిస్తాను 


ఇంకా వుంది


***


*ఈ కథ కాదు? హృదయాక్షర ప్రాంజలి* (04)

మల్లా ప్రగడ రామకృష్ణ


చూడు బిడ్డా నేను చెప్పేవన్నీ నాకు తెలుసనీ యనకు ఒక తల్లి పడే కష్టం ఆదేవుని సం కల్పమే అని నమ్ము అదే నీకు మార్గం 

ఒక చిన్న కధ చెపుతా వీను 


"ఒక చంటి బిడ్డ క్రింద పడుకుని హాయిగా నిద్రిస్తూవుంది. ఆ బిడ్డ

వైపు ఒక కండచీమ వెడుతున్నది. 

ఆ చీమ వెళ్ళడం చూసిన బిడ్డ తల్లి 

కండచీమని బిడ్డ వద్దకు వెళ్ళనీకుండా తీసి బయట పారవేస్తుంది. ఆ సమయంలో నిద్రిస్తున్న బిడ్డకు తనకు వచ్చిన ఆపద గురించి, ఆది తొలగిన 

విషయం గురించి తెలియదు. తల్లి పనికట్టుకొని చెప్పదు."


ఈ విధంగానే  దైవం ఎల్లవేళలా తన భక్తులను కాపాడుతుంది. 

ఈ విధంగానే భక్తులు తమకు  తెలియకుండానే కలిగే ఆపదలనుండి  భగవంతుని దయవలన, లీల వలన కాపాడబడి హాయిగా జీవిస్తున్నాము. 

నీ కర్ధ మైందా బిడ్డా 

హింసకు ప్రతిహింసకాదు అని తెలుసుకో అన్నది తల్లి 


ఆ మాటలకూ సంతోషంతో


🎵 పల్లవి


మా అమ్మ...

ఆది కాంతి వలె లేచె మాతృదేవతా రూపం మా అమ్మ

చీకటిని చీల్చి వెలుగై నిలిచె జీవన దీపం మా అమ్మ


చరణం – 1


వేకువలో మెలకువవేసి, పూటలకీ పండుగై,

తొలిపొద్దుని లేపి తేజమై పూసె మా అమ్మ.

పుల్ల పుడకల పొయ్యిలో ఆకలి తీర్చె కాంతి,

నిప్పురవ్వలలో సంతోషం రాసె మా అమ్మ.


చరణం – 2


ఇంటిని చక్కదిద్దె కర్తవ్యం రాణి,

తన ఒంటినే ధారపోసె త్యాగమూర్తి మా అమ్మ.

చెమట పూలతో నేలతల్లిని తడిపె మమత,

చల్లని నీడల స్నేహమై నిలిచె మా అమ్మ.


చరణం – 3


చీకటిని మింగిన రాత్రిలో ధైర్య దీపమై,

మన మనసుల్లో వెలుగునింపె మా అమ్మ.

నవ్వులో భరోసా, కన్నీటిలో కరుణ,

నిస్వార్థ ప్రేమకు రూపమై నిలిచె మా అమ్మ.


అంటూ పాడింది సంయుక్త 


ఇంకా వుంది


ఇది కథ కాదు? హృదయాక్షర ప్రాంజిలి (05)

 మల్లాప్రగడ రామకృష్ణ  


చూడు సంయుక్త కాలమనేది కనిపించకుండా కదిలిస్తుంది ఎలాంటి శక్తి లేకుండా కూడా మనసులో చేరి మభ్యపెడుతుంది కాలం వ్యక్తం చేసుకుంటూ నిజానికి కాలం మానవ జీవితాన్ని క్షణం కూడా నిలకడ లేక కత్తిరిస్తుంది. కాలమనే శక్తి ప్రకృతిని పలకరిస్తూ అందరికీ సహకరిస్తూ చేయూతనిస్తూ జీవితాన్ని సహకరిస్తూ బ్రతకలిస్తూ చావనిస్తూ నేనున్నానని గుర్తు చేస్తూ ఉంటుంది. మానవత్వం లో భిన్న భిన్న అభిప్రాయాలు ఉంటాయి కానీ మతంలో అనేక విధాలైనటువంటి సూత్రాలు ఉంటాయి కానీ కాలల్లో మాత్రమే ఏక సూత్రము దైవములో మాత్రమే ఉంటుందనేది నిర్ధారణంగా ఉన్నది  భగవద్గీతలో కూడా నేను కాలంగా ఉంటాను అన్నాడు భగవంతుడు పంచభూతాల్లో ఉంటాను అన్నాడు భగవంతుడు. కాలం ప్రగతి చూపే అంశం అధర్వణ వేదల్లో ఉన్నట్లుగా మన పూర్వీకులు మనకు తెలియపరిచారు.

ఎంత ధైర్యమున్నా ఆ అమ్మవారి కృప నీకు ఎల్లవేళలా ఉండాలి. నీవు కూడా ఆ అమ్మవారిని ధ్యాణించు ఎప్పుడు ఏమిజరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు.


*🌼🌿దరిద్రం, భయం కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మని ఈ 32 నామాలతోరోజూ పూజించు...

🌼అర్ధంతో దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళి.🌼


దుర్గా దుర్గార్తి శమణీ, దుర్గాపద్వినివారిణీ

దుర్గమచ్చేదినీ, దుర్గసాధినీ, దుర్గనాశినీ

దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహ

దుర్గమదేజ్ఞానదా, దుర్గ దైత్యలోకదవానలా

దుర్గమ, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణీ

దుర్గమార్గాప్రద, దుర్గమావిద్యా, దుర్గమాశ్రిత

దుర్గమజ్ఞానసంస్థాన, దుర్గమధ్యానభాసిని

దుర్గమోహ & దుర్గమగ, దుర్గమర్థస్వరూపిణీ

దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధదారిణీ

దుర్గమాంగీ, దుర్గమత, దుర్గమ్య, దుర్గమేశ్వరీ

దుర్గభీమా, దుర్గభామా, దుర్లభా, దుర్గధారిణీ..

ఇవి దుర్గాదేవి 32 నామాలు.


🌼🌿32 నామాలకు అర్ధం:(ప్రతినామం తర్వాత నీకు వందనం. అనాలి)


1.దుర్గా: భక్తుల చుట్టూ ఒక కోటలా ఉండి కాపాడే తల్లి 

2.దుర్గార్తిశమణీ: కష్టాలను శమింపచేసేతల్లి నీకు 

3.దుర్గాపద్వినివారిణీ: ఆపదలను నివారించే తల్లీ 

4.దుర్గమచ్ఛేదినీ: కష్టాలను ఛేదించే తల్లీ 

5.దుర్గసాధినీ: దుర్గమమైనది సాధించే తల్లీ 

6.దుర్గనాశినీ: కష్టాలను నాశనం చేసే తల్లీ 

7.దుర్గతోద్దారిణీ: దుర్గాలలో కూరుకుపోయిన వారిని రక్షించే తల్లీ 

8.దుర్గనిహంత్రీ: మనదెగ్గరికి కష్టాలు రాకుండా నియంత్రించే తల్లీ 

9.దుర్గమాపహ: కష్టాలను వినాశనం చేసే తల్లీ 

10.దుర్గమదేజ్ఞానదా: రహస్యమైన ఆత్మజ్ఞానం లాంటి జ్ఞానాన్నిచ్చే తల్లీ

11.దుర్గదైత్యలోకదవానలా: కష్టాలనే రాక్షసుల సమూహాన్ని దహించే తల్లీ 

12.దుర్గమ: అమ్మను సాధించడానికి ఆశక్యమైన తల్లీ (తేలికగా దర్శనం ఇవ్వని తల్లి).

13.దుర్గమాలోక: చర్మచక్షువులు,పంచేంద్రియాలతో చూడలేని తల్లీ 

14.దుర్గమాత్మస్వరూపిణీ: మనలోనే వసిస్తూ లభించడానికి సాధ్యం కాని ఆత్మస్వరూపమైన తల్లీ నీకు వందనం. అంటే మనలోపల ఉన్నా సరే మాటలలో వర్ణించలేని, కళ్ళతో చూడలేని, తెలుసుకోలేని తల్లి స్వరూపంమని అర్ధం

15.దుర్గమార్గాప్రదా: రహస్య మార్గానికి త్రోవచూపేతల్లీ 

16.దుర్గమవిద్యా: రహస్యమైన విద్యాస్వరూపమైన తల్లీ (శ్రీవిధ్యా స్వరూపం).

17.దుర్గమాశ్రిత: దుర్గాన్ని ఆశ్రయించి ఉన్న తల్లీ  (శ్రీచక్రం).

18.దుర్గమజ్ఞానసంస్థాన: అలవికాని జ్ఞానానికి సంస్థాన అంటే సాధ్యంకాని జ్ఞానానికి తల్లీ .

19.దుర్గమధ్యానభాసిని: ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానంలో భాసించే తల్లీ.

20.దుర్గమోహ: ఆపదలను లాగేసే తల్లీ .

21.దుర్గమగ: కష్టాలను పరిష్కరించే తల్లీ .

22.దుర్గమార్థస్వరూపిణీ: ఈ పదానికి రెండు అర్థాలున్నాయి. ఒకటి మనలోని చెడు ఆలోచనలకు శత్రువైన తల్లి అని.. రెండోది దుర్గమమైన అర్ధాలుగల తల్లీ .

23.దుర్గమాసురసంహంత్రీ: దుర్గమాసురుడైన రాక్షసుడిని సంహరించిన తల్లీ .

24.దుర్గమాయుధదారిణీ: దుర్గమమైన ఆయుధాలను ధరించిన తల్లీ.

25.దుర్గమాంగీ: ఊహించలేని దివ్యమైన అంగాలు కల తల్లీ .

26.దుర్గమత: కల్మషాలను దూరం చేసే తల్లీ .

27.దుర్గమ్య: సాధించడానికి శక్యం కానీ తల్లీ.

28.దుర్గమేశ్వరి: విఘ్నాలకు అధినాయకురాలైన తల్లీ .

29.దుర్గభీమా: భీషణమైన పరాక్రమం కల తల్లీ.

30.దుర్గభామా: దుర్గ అనే స్త్రీ రూపం లోని తల్లీ .

31.దుర్గభా: ప్రకాశం గల తల్లీ .

32.దుర్గదారిణీ: రహస్యాన్ని ఛేదించే తల్లీ


ఓం నమో దుర్గాయ నమః అంటూ ఈ 32నామాల దుర్గాదేవి వందనాలు ద్వాత్రింశన్నామావాళిని 108 సార్లు పారాయణం చేస్తే సర్వ దరిద్రాలు తొలగుతాయి అనేది పురాణాల కథనం.. భక్తుల నమ్మకం..


🌼🌿శ్రీ మాత్రే నమః....అని జపo నిత్యం శాంతికి మూలం.


ఇంకా వుంది

ఇది కథ కాదు? హృదయాక్షర ప్రాంజిలి (06)

 మల్లాప్రగడ రామకృష్ణ  

అవునమ్మా నీ ఆలోచన చాలా సబబు, విచిత్రమైన జీవితంలో వింతైన సమయమిది... అనుకున్నవన్నీ జరగవు, జరిగేవన్నీ అనుకోను. ఏది ఏమైనా భవిష్యత్తు కన్నా వర్తమానమే మిన్న.  నేటి విద్యార్థులు భక్తి ధర్మం పక్కన పెడుతూ ఆత్మ పూర్ణతను కోల్పోవడం ఆకర్షణకు లోబడి అంతరాంతరాలు మరిచిపోయి అనుకోని విధంగా అదే గొప్పతనం అని ఉల్లాసపడటం, ఆకర్షణ లోబడటం విరక్తి లేకపోవడం, అహంకారకాంక్షలతో ధర్మభక్తి సౌభాగ్యం దెబ్బ తినటం నేటి విద్యా విధానం తోడ్పడటం అంతర్జాల మహత్యం అన్నట్టు  స్మా ర్ట్ ఫోన్లు ప్రభావం పడటం ఈ లోకంలో ఈ లోకం ఈ విధంగా మారనని ఎవరు చెప్పలేదు.

అకస్మాత్తుగా ఎన్నో సంఘటనలు జరిగి పోతుంటాయి. కొన్నింటిని మౌనంగా అంగీకరించక తప్పదు,

మరి కొన్నింటిని స్వీకరించడం అసాధ్యంగా అనిపిస్తుంది. పచ్చ నోటు ముందు పల్చనై పోతున్నాయి బంధాలు, ధనం ముందు  అవిరై పోతుంది గుణం, ఆస్తుల ముందు ఆవిరై పోతున్నాయి ఆప్యాయతలు, నేటి ప్రవర్తనలు అగమ్య గోచరణాలు, బీదవారుగా కనలేము గాని బీద వాక్కులు, స్వార్ధ పూరిత బంధాలను, నేడు దేశం నందు నిలబడి ఉన్నాయి.

కొందరిని ఎంతగా కోరుకున్నా చేరుకోలేం, మరికొందరు మనం కోరుకో కుండానే జీవితంలోకి వచ్చేస్తారు. ప్రకృతి ప్రభావముగా మనస్ఫూర్తిగా మారాలని అనుకున్నా వీలుపడదు, కానీ కాలమే మనల్ని మార్చివేస్తుంది, మారక తప్పని పరిస్థితిని సృష్టిస్తుంది. అదే వచ్చే ధర్మం, అదే ప్రవృ ర్తి ధర్మం అదే సంతృప్తి మార్గం.

కాలపు గమనాన్ని అనుసరించి జీవితం సాగిపోతుంది, అంతే!"  ఏమని చెప్పేదా ఈ లోకంలో  ఎవరికి ఎవరో ఈ లోకంలో అంటూ సంయుక్త తన తల్లితో పలికింది.

 తల్లి ఆదుర్దాగా అప్పుడే పెళ్లి కాకుండా ఇన్ని విషయాలు నేర్చుకున్నావా అందుకే అన్నారు గురువును మించిన శిష్యులు, తల్లిదండ్రులను మించిన బిడ్డలని 


 ఏంటమ్మా పొగుడుతున్నావా

 అమ్మో పిల్లలను తిట్టడమే......


యింకా వుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి