నందమూరి తారకరామారావు జన్మదిన సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు 28-05-2022
.....
తే...నాటి వీరాభిమాని ని నటన జూసి
చదువు నిర్లక్ష మయ్యేను చనువు వల్ల
మనసు ఉల్లాస ఉత్సాహ మాయ నాడు
నేడు మరలా తలచు చుండె నిర్మలమున
........
* తే..ప్రబల విశ్వాసమే కళ ప్రగతి నందు
ప్రతిభ జూపిన నటనలే పలకరింపు
నమ్మకం తెలుగు వెలుగు నటన కాదు
నిత్య పరిరక్షకుడు గాను నందమూరి
........
*తే..సంఘ కవనసేవ సమయ మందు
తెలుగు సినిమా చరిత్రలో తిరుగు లేని
తనకు తానుగా గుర్తింపు తపన తోపు
భాష పరిశోధన నటనా భక్తి తోనె
......
*తే...మనిషి విలువలు గుర్తింపు మనకు లేదు
చిన్న తప్పులు పెద్దవై చెడును చెప్పు
చెంత ఉన్నా వెతుకు బుద్ధి చెప్ప లేక
ఉన్న నాడు వేధింపు గా ఊపిరి గతె
........
తే...కన్న బిడ్డల కొరకు నే కాటి వరకు
తృప్తి చేందని మనసుయే తృణము గుండె
బిడ్డల కళలు తీర్చినా బిడియ బ్రతుకు
బ్రతుకు నేర్పను గుణ పాఠ బేల చెంత
.........
తే..కీర్తి ఖండము మంతయు కీడు గాక
తెలుగు వెలుగు కై శ్రమ మమతగను జీవి
తెలుగు ఆత్మగౌరవ మేను తిరుగ జేసి
నటన బ్రతుకు నటన గాను నాడు ముగిసె
.........
........
*తే...తొండ ముదిరి ఊసరవెల్లి తోలు తిత్తి
రాజకీయ బ్రతుకు రంగు రవ్వ వెలుగు
వట్టి మాటలు కావులే వరద పొంగు
నయన హర్షిత చౌదరి నందమూరి
.........
అరచి చెప్పెనటన వల్ల ఫలము లేదు
అతిగ ఏడ్పు తో కన్నీరు ఫలము లేదు
విలువ కోల్పోయి గెలిచినా విజయ మవదు
రాజకీయము మనసు గా రాజ నీతి
........
తే..మంచి ఎపుడు చెడ్డగనుట మనిషి జబ్బు
మొదట మెచ్చి పిదప తిట్టె మొండి బుద్ధి
అభినయ అభిమాని మరచి మాట వొద్దు
మనసు లేనివాని పలకు మనకు ఏల
28-05-2022 ఉదయ హృదయ స్పందన పద్యాలు
ఓం శ్రీరామ-- శ్రీ మాత్రేనమా:
శేషాద్రివాసం శరదిందుహాసం
శృంగారమూర్తిం శుభదానకీర్తిం
శ్రీ శ్రీనివాసం శివదేవ సేవ్యం
శ్రీ వేంకటేశం శిరసా నమామి
---
తే ::మదిలొ మెదిలే ను కళలతో మగువ పిలుపు
అదియు నదిలా ను కదిలేను అడుగు మలుపు
పదిలము గనులే నడకల పలుకు వలపు
గదిన చదువులో చిలుకును గళము మెరుపు
---
*జూదం ఓ వ్యసనం ఆస్థి హరణం స్థితి క్షవరం ప్రతిష్ట గరళం
ఉ ::జూదము ఆటలో మనకు ఊపుయు ఆశల తోవినోదమున్
మోదము వల్ల ఆస్తియును మోక్షమనువ్యసనమ్ముయేయగున్
బాధల తో ప్రతిష్ఠ మతి బాధ్యత లేకయు నుక్ష రొమ్ము గన్
నాదు చరిత్ర యే ఇదియు నమ్మక వమ్ముగ బత్కునందునన్
---
అరచి చెప్పెనటన వల్ల ఫలము లేదు
అతిగ ఏడ్పు తో కన్నీరు ఫలము లేదు
విలువ కోల్పోయి గెలిచినా విజయ మవదు
రాజకీయము మనసు గా రాజ నీతి
___
" వినీల దేహప్రసుశోభతేజసం ,
సరోజనాభం సరసీరుహాక్షమ్..
ప్రసామనాదానువినోదలోలం ,
శ్రియఃపతింప్రణమామినిత్యమ్ !!! "
---
*తే...మనిషి విలువలు గుర్తింపు మనకు లేదు
చిన్న తప్పులు పెద్దవై చెడును చెప్పు
చెంత ఉన్నా వెతుకు బుద్ధి చెప్ప లేక
ఉన్న నాడు వేధింపు గా ఊపిరి గతె
........
తే...కన్న బిడ్డల కొరకు నే కాటి వరకు
తృప్తి చేందని మనసుయే తృణము గుండె
బిడ్డల కళలు తీర్చినా బిడియ బ్రతుకు
బ్రతుకు నేర్పను గుణ పాఠ బేల చెంత
.........
తే..కీర్తి ఖండము మంతయు కీడు గాక
తెలుగు వెలుగు కై శ్రమమమతగను జీవి
తెలుగు ఆత్మగౌరవ మేను తిరుగ జేసీ
నటన బ్రతుకు నటన గాను నాడు ముగిసె
.........
సంఘ సేవ కవనసేవ సమయ మందు
తెలుగు సినిమా చరిత్రలో తిరుగు లేని
తనకు తానుగా గుర్తింపు తపన తోపు
భాష పరిశోధన నటనా భక్తి తోనే.
---
*చివరిపడం సమస్య
ఉ ::మెత్తగ నున్న కాలమిది మీసము చూపియు మోస చూపులున్
ఒత్తుగ పెర్గినా కళలు ఓర్పుయు చూపక వెర్రి చేష్టలు న్
మత్తుకు చిక్కెఅల్లుడయె మానస డబ్బుకు ధూషనమ్ముగన్
అత్తకు మీసముల్ మొలిచె నల్లుడు వచ్చిన వేళ యెట్టిదో
---
సీ ::మలయప్ప స్వామికి మంజులా పద్మకు
కళ్యాణ యుత్సవమ్ కంటికెలుగు
బ్రహ్మయుత్సవమునఁబండగాదినముల్ల
పావన మలయప్ప పరిణయంబు
అన్నమయ్య మొదటయాశించికళ్యాణ
నిత్యముఁజేయుచూ నిలచి వెలిగె
తిరువీధిఁనూరేగతిరుమల నాథుండ
అఖిలాండకోటికియాదినీదు
___
పూజ్యయన్నమయవు పుణ్యచరితవుగా
నిత్యపరిణయంబునీవుజేసి
శ్రీనివాసతోడ శ్రీదేవిభూదేవి
కీర్తన లనుఁబాడుకీర్తి నీదు.
---
తే::పెంచుట విరుచుట కొరకే పెడసరియగు
తగ్గిన దిపెంచుటకు వీలు తారు మారు
పెరిగిన వయసు తరుగుటె పిలుపు వలెను
పెంచి నప్పటి కంటేను ప్రేమ జూపు
.......
*తే...మనిషి మనసు ఈగ వలెను మనుగడ కళ
కామి నీకాంచనాల కు కాల మలుపు
ఈగ పండుపై పెంటపై ఇష్ట మగుటె
త్యాగికి భగవంతుడు తప్ప తృప్తి లేదు
తేనె టీగల వలేను తిరుగ వలెను
........
..నేటి ఉదయ హృదయ స్పందన తో పద్యాలు
*ఆ..వీధి లోన చెత్త వేకువనే చేరె
గాలి వచ్చి కంపు కడప నందు
చావు ఏల ననచు చక్కబరచలేక
పొరుగు వారు చేరి పోపు పెట్టె
.......
*ఆ..ఆవు చేయు మేలు ఆత్మబలమ్ముయే
పాలు వెన్న నెయ్యి బలము నిచ్చు
పెండ మూత్ర,ముయును పిలుపు మందు
పేగు బంధ మల్లె పేరు పెంచు
.......
*ఆ..చెట్టు రాజ కీయ రంగస్థల ఫలము
పండు ఆకు పిందె పదవి గుణము
కాండ మేను మెరుపు కళ్ళు లేనిది బుధ్ధి
రాజు కీయ లబ్ది రంగు జనులు
.......
* తే...మనసు తెలుపు మంకెన పువ్వు మరుపు మెరుపు
మోగ్గ తెలపు పాలు పెరుగు మోజు తెలుపు
సిగ్గు బిల్లతెలుపు వెరసి సిరి తెలుపు
రచయితల విచిత్ర చిత్రమ్ము రంగు తెలుపు
ంం.....
....
*తే..పాలకుడు కులము మతము పావనమనె
గొడుగు క్రింద చేరిన వారి గోడు వినియె
రెచ్చగొడతాడు ఓట్లకు రెచ్చి పోయి
ప్రాంతముల మధ్య చిచ్చుతో పాడు బుధ్ధి
......
*చం::మరువక రక్త మార్పిడిని మానము మార్పుగ దేహబంధన
న్నరయగు పేరుపేరున నె నద్భుతకార్య ముహృధ్య మవ్వుటే
తరుణము నీదినాదియు మతీ మమతానుసుఖమ్ము దేనికో
కరికిజనించే సింహమనగా విసుమానము జెందు టేలకో
.........
*కం..కటకట పళ్ళను కొరికే
అటునిటు సాగియు సకాల మాశలు కూర్చెన్
విటులే పలుకులు మార్చెన్
దొటదొట దొటదొట దొటదొట దొటదొట కారెన్
...........
*కం:: స్వార్ధం ఏలనె మీలో
అర్ధం కొరకే ననేను ఆశే ఏలన్
ప్రార్ధన జరుపుట ఏలన్
మర్ధన ఆకలి అగుటయు మైకము ఏలన్
.........
ప్రియంవధ వృత్తము..న భ జ ర..8..ప్రాస
పలుకు మాటలు యె పాద రమ్య తై
వలపు ఆటల సవారి గమ్యమై
తలపు లన్నియు మతాల భావమై
మలుపు కోరెను సమాన ప్రేమయే
.......
*దత్తపది...రవి, కవి, పువి, చెవి ..పవి.. వజ్రాయుధం పూరించె?
తే..మలుపు లేసమ ర వి జయం మనిషి లోని
సమయ పాల క వి నయమే సంతసమ్ము
ఆయన ఆశ ప వి చారణ ఆత్ర మగుటె
కరుణ కావడి చె వి కదలి కర్రు కుర్రు
..........
*. మాటల వల్ల జీవితం సఫలం, మరియ కుటుంబ కష్టం?
తే...పలుకుబడి మానవ శరీర పలుకు బట్టి
అర్ధ వివరణ కోరగా అలుకమలుపె
మాట పరమార్ధముయె పరమౌషదముయె
ఉత్తముల పలుకే నిజం యువకుల కళ
........
*బాథనుబంధించక నుంచుంటే బ్రతుకు
తే...బాథ పంచెడి బుధ్ధియు భార్య భర్త
భార మవకయే బంధము భర్తి యగుటె
చులకనా కళ కలలుగా చుక్క లగుటె
చెప్పు కుంటే ను ఇష్టమే చింత లేల
.......
*చిరుకోప చిత్రమైన బంధం చిరునవ్వుతో బంధం.
కోపము విడుదల భయము కోరు పోరు
చిద్రమైన ది బంధ ము చిగురు మల్లె
నవ్వి నవ్వలతో చిందు నటన వద్దు
ఏడ్చి నవ్వించు పలుకులు ఏల నీకు
......
*కోనసీమ ఘటన కొబ్బరికాయ మాదిరే?
తే....వళ్ళు గుల్లగా మారుట వంత పలుకే
మల్లు గుచ్చుకొన్న తెలివి మిడిన బిగువు
కళ్లు తిరుగుడు ఘటనలు కాలి పోవు
చెల్లు కాని పలుకు బడి చింత పులుపు
........
*చెడు వల్ల గెలుపే.మంచి మనిషికైనా సంతృప్తి ఓటమే కదా?
తే...నీడ వెంట నిలువ ఎంత నెంచ గలవు
చెడును కోరి చెడుట బుద్ధి చేను బ్రతుకు
మంచి గుర్తింపు లేదని మోద మోద్దు
నమ్మకము కలిగి జీవిగా నమ్మి బ్రతుకు
........
........
*వేచి చూసి విచార వదనంతో తిరిగేప్రేమ ?
తే..నిను దలచి మైమరిచి చెంత నీవు లేక
కనులు కాయలాయె కథలే కలలు తెచ్చె
చినుకులా వచ్చి పిడుగులా చిచ్చు లేదె
కళ్లు కన్నీరు యింకక కాటి చేరె
.....
*పేరు వల్లవొరిగేదిలేదు అభివృద్ధి కావాలి?
తే...పేరు ఏదైన బ్రతుకులో పిలుపు కోరు
కునుకు లేని ఘటన లేల కూలి పోవు
కంటి నలుసు నాలుక తీయు కధలు తెలుపు
తెలుసు కాల మార్పులు చేటు తెగులు పట్టు
........
పిల్లవానికి పతాక ఉద్యమమా?
*తే..ఊహ తెలియని బ్రతుకులో ఊరు విడిచి
చిన్న పిల్లల్లొ పాఠాలు చేరువగుటె
చింత ఏడుపు చరవాణి చెంత లేక
దీక్ష నుపతాకముతొ చేసె దినము నందు
.......
యుద్ధం లో వాక్య వాచ్య నిషిద్ధం ?
* తే..వాక్యమైనను షరతులు వలదు వలదు
వాచ్య మైనను షరతులు వలదు వలదు
జీవ కోటి బ్రతుకు అండ జాతి రక్ష
యుద్ధ సమయాసమయములే యుగము దీక్ష
...........
*తే..ఏమి చదువులు ఆంగ్లము ఎత్తి పొడుపు
దాని లో కళ సంస్కృతి దాగి లేదె
కంఠ శోష యేలనుమీకు కళ్ళు తెరిచి
అర్ధ మేది నిరర్ద మా ఆశ చదువు
......
*తే..వాడు పద మేల వాడితి వాసన కళ
వీడు ఎవడు నీ చుట్ట మా వీర మాయ
వాడు వీడు నీకును ఏల వాదమగుట
నిజము తెల్పి బ్రతుకు నీడ నిన్ను చూడు
........
*తే..పాలకు లెవరు రాజ్యము పాము పడగ
కలవరము ఏది సిరి పంట కాటు వేసె
పదములు పెదాలు దాటె ను పడక కొరకు
కలత లేల జనులు రేపు కలిసి బ్రతుకు
.........
*తే..లతలు పరవశమై కళ లహరి చెంది
కరులలో ఘబాలింపులై కులుకు సిరియు
మనసు దోచే కుసుమ మాయె మకుట మాయె
తనువు తపన పునాదిగా తలపడుటయె
.........
సీస పద్యము
గురువునే కనుగొను..గురు ముఖమేజేరు
తరువునే యెరుగుమా ..తరము తరము
తలపులే కోరికలు తలవకాతలపులు ...
తలుపులే
మూయుము..తలచుగురువు
కలుపు మొక్కలుయేరు.. కల్మష మేయనీ
మనమునఘనమైన.. మాటనింపు
నిజమైన నినునీవు... నిలకడగయెరుగు
నీవను మాటకు... నిజముఁదెలువు!
ఆటవెలది
ముసలిఁ దనము లేదు మరుయునా కాంక్షలు
వేల జన్మ లయిన వేధనేగ
అగ్ని యందు వేయు యాసమి ధనుగాల్చు
సమిధ దీసిజూడు స్వాంత మగును
.........
కం..మాటకు కన్నీరు లొలికె
ఆటల మోసము కధలులె ఆశల వల్లన్
బాటన నడకకు ధారలు
దొటదొట దొటదొట దొటదొట దొటదొట కారెన్
.........
1
న్యస్తాక్షరి.... సం..స్కాం..రా..ము. పాదాదిన
ఆటవెలది
సంపదెల్ల విద్య సర్వ భూషణము,సం
స్కారశమనసుగుణ శాంతమే,వ
రమగు విమలకాంతి సుమసుధా రూపంబు
ముచ్చటయగుమౌనమూర్తి యేగ..
........
తేటగీతి పద్యాలు
భూమి నంతపుత్తడున్న భుక్తి కాదు
కడలి జలమెంతనున్నునూ కూడు కాదు
ఆకలికి ఆశలున్నను ఆర్తి కాదు
పలుకు లెన్నిఅన్న పదము పాఠమవదు
.......
రాళ్ళను విసిరేసి యశస్సు రాజ్య మేలు
కుత్రిమ అలలు ఆజ్యము కుంపటగుటె
మనుషులను పంపి విధ్వంస మనసు మూర్ఖ
తగుల బడెజాతి రక్షణ తమక మాయె
సృష్టి లో నడుంకట్టేది శృతి లయేది
.........
......
*ముత్యపు మెరుపు కలిగిన ముఖ్య భక్తి
సత్యము తెలుపు హనుమంత సమయ యుక్తి
నిత్యము కొలిచే దైవమ్ము నియమ ముక్తి
మృత్యు వు నెదిరించు మహిమ మృదువు పలుకు
మల్లాప్రగడ వారి *న్యస్తాక్షరి...హ. ను. మం. త....పాదాదిన
హనుమ రామనామతప మహిమను తెలిపె
నునుపు శక్తి విలువ యుక్తి నొసగు భక్తి
మంగళమగుట రామనామమ్ము జయము
తపము చేసిన మోక్షము తరుణ మిచ్చె
......
సమయ ముంచి ఏలు కోవె
మమత నంత పంచు కోవె
కమల పువ్వు పెట్టు కోవె
తమక ముంచి నంచు కోవె
సమర మన్న ఆదు కోవె
విమల మైన మెచ్చు కోవె
ఢమర నాద మాను కోవె
అమర గాన మోద్దు లేవె
విముఖ మనకు మేలు కోవె
సముఖ మైన దిదియు లేవె
ఉమవు కళలు పంచు కోవె
సుమవు కలలు మూడు లేవె
చమక పూజ చేసు కోవె
నమక మైన పూజ లేవె
1
1
తే::మగువ పైశీల నింద యే మనసు మాట
లోక మందు న జోడించు లహరి యాట
శోక పాకమై నలుగుట శకుని మాట
ఏక మవక కూడుకొరకు యెక్కి యాట
తే::స్నేహము పటిష్ట మైనది సేతు వల్లె
మోహము బతుకు మార్గము మోజు మల్లె
ద్రోహము జరిగే జీవితం లోన జల్లె
అహము ఆహారము గనులే ఆట వల్లె
.........
తే::మధుర మైన యుగాన న మనసు గాన
ఎండు టాకుగానము చూడు యదలొ గాన
పిల్ల ఏడ్పు గానమున మారు పికమె గాన
గాన గంధర్వ కళలోన గాన హృదయ
గాన అనే పదము ఈ పద్యములో వేర్వేరు అర్ధాలు తో చూడగలరు
........
తే::కాటు కెట్టుకో కళ్ళలో కళలు వల్లి
నుదురు పైబొట్టు పెట్టుకో నిత్య మల్లి
కొప్పులో మల్లె లెట్టుకో కొత్త లిల్లి
నడుము వడ్డానమును పెట్టి నన్ను జూడు
తే::అడుగులో అడుగేసియు అందు కొనుము
కాళ్ళ పారాణి గజ్జలు ఘల్లు ఘల్లు
వలపుల తొ మద్దులివ్వవే వలపు రాణి
వయసు అడగను ప్రేమతో వలపు పంచు
కం ::జీవన మార్గమ్ముగనే
జీవిత నౌక నడిపించి జయమే గాంచెన్
జీవిత చక్రము తిప్పెన్
భావితరమ్ముకు పలుకుల బంధము తెల్పెన్
......
న భ ర న న న ర..12...సురభూజ రాజము
పలుకవే సుధ కోమలాంగి ఉపకరణమగుటె శోభగన్
చిలకవే మదిచిత్రమాయెను చరణ కమలమె ప్రేమగన్
అలకలేలను సాధనమ్మున అతి మతి గతియగు టేలగన్
పలక మారుట గొప్పకాదుగ పలుక గలవులె జీవితమ్
........
కోమలి వృత్తము...1,3 పాదములు..న. జ. జ. య.../8
2,4, పాదాలు జ భ స జ గ.../9
మనసున చిందెను మధ్య సుఖమ్ముయే
వినోద భావము యెవివేక లక్ష్యమై
తనువున సౌఖ్యము తత్వ మనమ్ముయే
మనోమయమ్మున మనమేక మవ్వుటే
....
అతనికలం కళ కావ్య మయమ్ముగా
గతీప్రభావముయె సుఖాల విశ్వమై
మతిని మనోమయమయ్యె విధమ్ముగా
పతీప్రకాశముయె ఉపాయధర్మమై
.......
.నేటి ఉదయ హృదయ స్పందన పద్యాలు
*తే...ఉదయ వికసించి రేయి న కులానికి నిద్ర
పద్మము గుబాళింపు తోన నె పడతి మెరుపు
పద్య భావ పరిమళమ్ము పడక చేరె
కొత్త పాలపుంత గానే ను కోర్క తీరు
*- నేటి
కోనసీమ కుల రక్కసి
కరాళ నృత్యం
ప్రభుత్వం చోద్యం
అల్లరికి ఆజ్యం !
తే..కోన సీమన రక్కసి కోరి సెగలు
జనుల నృత్యహేల కలలు జపము పెరిగె
చోద్యమయుకాదు చదరంగ జోడు గోల
ఆజ్యముయె రాజకీయ లబ్ది ఇదియు
.....
* తే..మానవత్వాన్ని మరిచేటి మదము వలన
రాజ కీయ లభ్ధికి అధికార వాంఛ
అందనంత కుతంత్రాలు ఆట సాగె
రగడ అంబేద్కరా మమ్ము రక్ష జేయు
.....
* కం..వెతికే తీరును బట్టీ
బతుకే నరకమ్ము సాగు బంధము బట్టీ
మెతుకే జీవిత వరమై
మతి ఊరింపే వినయము మాధ్యమముగనే
.........
పరుగు పరుగనా కదిలే
కరుణా సాగర ప్రభావ కారుణ్యముగా
ప్రేరణ కాలము చక్రము
చరణంబులు లేనివాడు చకచక నడిచెన్
*కందపద్యం
అరుణోదయ మై కదిలే
తరుణమ్ముననె కిరణాలు తపనై వచ్చే
విరిసెను కమలము సుఖమై
చరణంబులు లేనివాడు చకచక నడిచెన్
........
*సీస పద్యం..ఓం స్త్రీ ఆక్రందన..
ఆత్మహత్యబ్రతుకు..అత్తమామల ఘొష
శస్త్ర శాస్త్ర ము కళే...శిక్షణమ్ము
రాత్రింబవళ్ళూను ....రమ్య పరచు ఘొష
సాధన శోధన...శరణమమ్మె
అనుమాన ఆగ్రహం...అంతిమ మార్గమై
అవమాన పరిచియే ...హారతిగనె
సారమే లక్ష్యమై...శాంతియే దాహమై
ధరణినే అవమాన...దేహ మగుటె
ఆటవెలది
వంపుతిరగమనియు.. వాలెటి పంకజాన్ని
ఆంగిక అభి నయన ...ఆశ గుళిక
పంటి బిగువు కోరి...పడతిని హింసించె
కుడి యెడమ లనుచునె కుంటి సాకు
......
..
*శార్దూలము
ఏంచెయ్యాల నకే మదీయ పలుకే బంగార మయ్యేనులే
స్వేచ్ఛా పాశముయే సరాగమగుటే సంఘర్ష సద్భావమే
వచ్చేదే మనకే ను దక్కు కరుణే వాశ్చల్య విజ్ఞానమే
నచ్చేదే సుఖమైన సంగమముయే నాన్యత జీవమ్ముగన్
....
తేటగీతి
*ఏది పరధీన మగుటయే ఏల అనకు
అదియు నేపరాధీనమ్ము అగుట యేను
ఏది ఏమై ప్రజాస్వామ్య మేను బ్రతుకు
నాది కాదునీదియు కాదు నడుమ సిరియె
........
తేటగీతి
*మిణుకు మిణుగురు పురుగుయే మిణుకు మిణుకు
దీపము వెలుగు గాలికే మిణుకు మిణుకు
ఆశల హృదయ కదలిక మిణుకు మిణుకు
ప్రేమ పలుకులు మనసున మిణుకు మిణుకు
........
తేటగీతి
*హృదయ కమలమ్ము కర్తవ్య హృద్యమైన
నిత్య సంచార బుధ్ధినే నిర్ణ యించె
శబ్ద సంఘర్షణ కళలు శాంతినిచ్చె
మానస ప్రగతి ప్రతిభయే మనిషి ఓర్పు
........
ఉత్పలమాల
*నిర్మలశోభితమ్ముగనె నెంచియు రక్షణ నిశ్చయమ్ముగా
కర్మల సాక్షిగా వినయ కామ్యపు శక్తిని పంచిపుచ్చుటే
మర్మము ఏమియౌ అనక మానస బుద్ధిని తత్వబోధగా
కార్యము నిర్ణయమ్ముగను కావ్యచరిత్రము తెల్పు జీవమున్
.......
చూతములే మనోమయము చూపుల మేలును తెల్పి బత్కుటన్
ఘాతము కాదులే కలలు ఘర్ఫణ భావము ఏలనోయగున్
మాతపితాను గా కళలు మానస వీణయె జీవనమ్ముగన్
మాతయు మామయై యొసగు మాన్యుడు మిమ్ముల బ్రోచు నెప్పుడున్
.........
సీ॥
మందార మహనీయ మధురమే మనసంత
బంగారుశోభతో భాగ్యశాలి!
నింపైన యుదరంబు నిలుచుమా మదినందు
సొంపైన రూపుతో సొబగులిచ్చు!
అందాలచూపుతో యలరింప కాంతులే
బంధాల యమ్మకు బాలసిరివి!
సుందరాకారుడాశుభమిచ్చువిఘ్నేశ
మందమతులనెల్ల మార్చుస్వామి!
బాల గణపతి బుద్ధికి భవ్యఘనము
మాత పార్వతి మురిసెను మనము నందు
శివుని నెదిరించి గెలిచినచిన్మయుడవు
ముద్దు గణనాథ మ్రొక్కుదూ మూర్తి నిన్ను..