22, ఫిబ్రవరి 2021, సోమవారం

సమ్మోహనాలు





ఈశ్వర తత్వం

ఒకణ్ణే  రమ్మనము, రమ్మనీ పొమ్మనము
పొమ్మనుట కాదన సందేహ మె ఈశ్వరా

ఒక్కణ్ణే పిలిస్తే, పిలస్తె ఇద్దరొస్తె
ఇద్దరూ వద్దంటే రారుగా ఈశ్వరా

ఇద్దరూ వస్తేను, వస్తె సంసారమను
సంసార పరమ లక్ష్యమే గా ఈశ్వరా

సంసారంలొ నేను, నేను పరమ పదమును
పదము దేహాత్మభావంతోనె ఈశ్వరా

వెలుపల నె జీవున్ని, జీవిలో దైవాన్ని
దైవంగా ముక్తి ప్రయత్నమే ఈశ్వరా

తాను తనువు రెండూ, రెండు మనుగడండూ
మనుగడ ఆనందంగానే ను ఈశ్వరా

వెలుపల సంసారిని, సంసార స్వామిని
స్వామి గా మనిషికి ఋషిగానె ఈశ్వరా

ఒకరికొకరు గాను లె, గాను ఒక్కరౌను లె
ఒక్కరై ఒదిగి పోవుట యేలె ఈశ్వరా

మంచిని పెంచాలీ, పెంచి మనసివ్వాలి
మనసిచ్చి మమతను పెంచానులె ఈశ్వరా

రక్తం ఎర్ర కణమె, కణమె తల్లని కణమె
కణాలు రెండు మిలితం వృద్ధి కె ఈశ్వరా

ప్రకృతి లో ధర్మమే, ధర్మము అధర్మమే
ఆధర్మాలు రెండు జీవితం ఈశ్వరా

0 ఇష్టాలు మారుతూ, మార్పుగా బ్రతుకుతూ
బ్రతుకు ప్రేమలో మార్పులు లేవు ఈశ్వరా

కష్టాలు వచ్చాయి, వచ్చే సుఖము హాయి
హాయిలో నమ్మకంతొ ఉన్నాము ఈశ్వరా

మాటలే మార్చినా, మార్పు కొరకు ఐనా
ఐనా మాట తప్ప కే బ్రతుకు  ఈశ్వరా

రెక్కలు కదిలేను, కదిలె యంత్రం అగును
యంత్రం ఇంధనంతో కదిలే ఈశ్వరా

రోజులు కదిలే ను, కదిలే సందడి గను
సందడి ఆలోచనలు వెల్లువె ఈశ్వరా

ఇలా నువ్వు అలాగె, అలా నవ్వు ఇలాగె
ఇలాగె కాలంతో కదులుటే ఈశ్వరా

అటు నువ్వు ఉన్నావు, ఉన్న  రమ్మన్నావు
రమ్మని మనమోక్కటే తలుపు లె ఈశ్వరా

విశ్వాస విజయమే, విజయ సంబంధమే
సంబంధం ప్రేమే సంక్రాంతి ఈశ్వరా

కోళ్ళ పందాలు గాను, పందెం లో ధనమును
ధనము కీర్తి ప్రతిష్ట‌ సంక్రాంతి ఈశ్వరా

అరిసెలు జంతికలు యె, జంతికలు చెక్కులు యె
చెక్క లు పాయసమ్ము సంక్రాంతి ఈశ్వరా

పండుగ యె మా యింట, యింట వెన్నెల పంట
పంట బంధువులు గల సంక్రాంతి ఈశ్వరా
....
సంక్రాంతి శుభాకాంక్షల సమ్మోహనం తో సంక్రాంతి

ఆనంద ఆరోగ్య, ఆరోగ్య సద్భాగ్య
సద్భాగ్య సమ్మోహ సంక్రాంతి ఈశ్వరా

హర్షాల వర్షమే, వర్షమే భాగ్యమే
భాగ్యమే సంతోష సంక్రాంతి ఈశ్వరా

ఉల్లాస కదలి కే, కదలే మనుషులకే
మనుషుల్లోన మమత సంక్రాంతి ఈశ్వరా

పసిడి పంటల శోభ, శోభ తోనే ప్రతిభ
ప్రతిభా పురస్కారం సంక్రాంతి ఈశ్వరా

ఊరు వాడ సందడి, సందడి జన ఉరవడి
ఉరవడి వెల్లువేను సంక్రాంతి ఈశ్వరా

లోకాలలో వెలుగు, వెలుగు తేజము పరుగు
పరుగు సహస్రకిరణాలు గానె ఈశ్వరా

విశ్వాస విజయమే, విజయ సంబంధమే
సంబంధం ప్రేమే సంక్రాంతి ఈశ్వరా

కోళ్ళ పందాలు గాను, పందెం లో ధనమును
ధనము కీర్తి ప్రతిష్ట‌ సంక్రాంతి ఈశ్వరా

అరిసెలు జంతికలు యె, జంతికలు చెక్కులు యె
చెక్క లు పాయసమ్ము సంక్రాంతి ఈశ్వరా

పండుగ యె మా యింట,యింట వెన్నెల పంట
పంట బంధువుల తో సంక్రాంతి ఈశ్వరా
...
భోగి..సంక్రాంతి.. శుభాకాంక్షలతో సమ్మోహనాస్త్రం 1511..1520

సంకల్పం ఉంటే, ఉంటె మన వెంటే
వెంట వెంటనే పనుల ఫలాలు ఈశ్వరా

సాధన ఆరాధన, అరాధనె మనసున
మనసులొ మాట ఈనాడు ప్రతిభ ఈశ్వరా

విజయం సంభవమ్ము, సంభవ కారణమ్ము
కారణం ఏదైనా పలుకేను ఈశ్వరా

ఆలోచన పలుకే, పలుకు తో నె కులుకే
కులుకే సంక్రాంతి సంబరాలు ఈశ్వరా

ఆశయం తో కదులు, కదలి చేయు సేవలు
సేవ పరమాత్మ లక్ష్య మైసాగె ఈశ్వరా

ఆచరణీయం ఇదియె, ఇదియేను తరుణముయె
తరుణ ఆనందం వ్యక్తమ్మే ఈశ్వరా

అవకాశం కోసం, కోరుచుండె సహనం
సహన శక్తి అవసరం నిత్యం ఈశ్వరా

వినియోగంపై ఇక, యోగంపైన మునక
మునక  స్వేచ్ఛ సమానత్వమ్మే ఈశ్వరా

సత్ఫలితాలు పొందు, పొందేను సుఖమందు
సుఖము దుఃఖము ఈడు జోడు ఈశ్వరా

ముందుండి కదలాలి, కదలి సేవించాలి
సేవించి  ప్రేమనే పొందే ఈశ్వరా
0
- నేనే శిల్పిని 

శిల్పిగా నేనోయి,  నేనే కర్త నోయి
కర్తగా క్రియను జరిపు మనిషినే  ఈశ్వరా 

 చెడునే తొలిగిస్తా, తీసి మంచి చేస్తా 
మంచి శిల్పిగా చెక్కటమే విధిగా ఈశ్వరా 

 నా తెలివి నాదోయి, నా కష్టం నాదోయి
నాప్రాణం తొ దైవ రూపమే ఈశ్వరా

సుత్తి సాన మాయుధం, ఆయుధం జీవనం
జీవనం శిల్పగా బతకటం ఈశ్వరా 

 సజీవ రూపాన్నీ, రూపం దైవాన్నీ 
దైవాన్ని ప్రార్ధించె  శిల్పినే ఈశ్వరా 

శిలపెచ్చు తొలగించి, తొలగించి ఓర్పుంచి 
ఓర్పుతో అందమైన రూపం ఈశ్వరా 

నేను బ్రహ్మనుకాను, కాను రూప కర్తను
కర్తగా దైవదృష్టి యే ఈశ్వరా 

ప్రాణమె నా ధ్యేయము, ధ్యేయము నా లక్ష్యము 
లక్ష్యము శిలను మార్చు శిల్పిగా ఈశ్వరా 

తల్లితండ్రుల సేవ, సేవతో శిల్పిగా 
శిల్పిగా వంశాన్ని రక్షగా ఈశ్వరా 

పురజనులు కొలిచే, కొలిచే దైవాన్ని 
దైవాన్ని కొలిచే రూపకర్త ఈశ్వరా 

 సమ్మోహనాలు... అడుగులు 

అడుగులే ఆప కే, ఆపకు నిలకడ కే
నిలకడ తో కష్టాలు మయమే ఈశ్వరా

ప్రకృతి లా కదలాలి, కదలి జీవించాలి
జీవితంలో కదిలే అడుగులు ఈశ్వరా

తరువు లా కదలాలి, కదలె అడుగెయ్యాలి
అడుగు జాడలు బట్టి కదిలేను ఈశ్వరా

ధర్మ ముతో నడకే, నడక త్యాగ పలుకే
పలుకు సత్యమార్గంలో నడక ఈశ్వరా

ఆత్మ స్వరూపమె, రూప స్వరూపమె
రూప లక్ష్యం తో అడుగేను ఈశ్వరా

వయసులో నడకలే, నడకలొ పాఠములే
పాఠము జీవితానికి మలుపులె ఈశ్వరా

మాయదారి ముచ్చట, ముచ్చట వృద్ధి బాట
బాట ఆధునిక కవిత్వమ్మే ఈశ్వరా

వృద్ధాప్యంలొ నడక, నడక ఆరోగ్య మిక
ఆరోగ్యం ఆనందం మాకు ఈశ్వరా

మనసులో విప్లవం, విప్లవ చైతన్యం
చైతన్యంతొ వేసే అడుగే ఈశ్వరా

ఒక మెట్టే ఎక్కుము, ఎక్కి యూ మోక్కాము
మొక్కే ఉత్తరద్వార స్వామిని ఈశ్వరా
....

సమ్మోహనాల - వెలుగు నీడలు (1)

ఉదయ అడుగు జాడలు - జాడ వెలుగు నీడలు

నీడల్లా వెంటాడె మనుష్యులు ఈశ్వరా

నీడగా నీ వెనుక - వెనుక నేను చిక్కక
చిక్కు లొచ్చినా దారి మార్చదు ఈశ్వరా

మాయ గ చేరు నీడ - నీడ ఉండును అండ
అండ దండ గా నీడలోనే ఈశ్వరా

అద్దం లో బింబమే - బింబం సుందర మే
సుందర నీడ మనసు మార్చేను ఈశ్వరా

వీడెను మబ్బు నీడ - నీడ గా వాన పొడ
పొడ గడబిడ నీడలు కొలువగును ఈశ్వరా

ఊహలే నీడలై - నీడలే మాయలై
మాయలే మనుష్యుల జీవితం ఈశ్వరా

నిను వీడి ఉండదు లె - ఉండదు కాలమే లె
కాలము నీడలా వెంటాడెను ఈశ్వరా

బంధము గా మారెను - మారె బుధ్ధి చేరెను
చేరె నీడే వెంటాడు మనిషి ఈశ్వరా

గ్రహణము చీకటితో - చీకటి వెలుగుల తో
వెలుగు నీడల మనిషి జీవితం ఈశ్వరా

కుండ నీటిన బింబము - బింబము తోను ఘటము

ఘటము లోన చంద్రుని నీడ యే ఈశ్వరా
దేశ మంటే మొహం .... మొహం  వ్యామోహం 
వ్యామోహం తోను చూడలేము  ఈశ్వరా 

దేహ మంతా బాధ ... బాధ చెప్పఁని గాధ 
గాధ లు లేని జీవితం లేదు ఈశ్వరా 

తెలిపెను పలు వింతలు .... వింతలు మనసులతలు 
లతలు వికసించి వాడును కదా ఈశ్వరా 

అనుభవాలు చెప్పను .... చెప్ప లేను నిజమును 
నిజమబద్ధము మధ్య జీవితం ఈశ్వరా 

యోగము వెంట నేను .... నేను ఒక దేహమును 
దేహము ఆకర్షణ చక్రమ్ము ఈశ్వరా 

ఇంద్రియాల వేదన .... వేదన తో రోదన 
రోదన ఈ జన్మకు తప్పదే ఈశ్వరా 

బందంకు భందమై .... బంధం పవిత్రమై 
పవిత్రం అపవిత్రం తెలియదు  ఈశ్వరా 

నాలో పెరిగె నిష్ఠ .... నిష్ఠ తోను గరిష్ట 
గరిష్ట మవుతు బతుకులొ ప్రతిష్ఠ ఈశ్వరా 

ప్రాంజలి ప్రభ స్నేహము

స్నహము బతికేందుకు .... బతుకు బతికించుటకు 
బతికించేందుకు శాశ్వతముగా ఈశ్వరా

ఒకరికొకరు నీడై .... నీడ కళల తోడై
తోడై వుండును భర్తకు భార్య ఈశ్వరా

బాల్య మిత్రుల బలిమి .... బలిమి శాశ్వత చెలిమి
చెలిమి కలిమి కలబోత స్నేహము ఈశ్వరా

బంధువు లేని బతుకు ... బతుకు కొరకే మెతుకు
మెతుకే తోడు నీరు మిత్రుడే ఈశ్వరా

పిచ్చి మచ్చిక తనము ..... తనము సాహచర్యము
సహజ సామరస్యము మైత్రియే ఈశ్వరా 

ఆదుకొను హస్తమిది  .... ఇది చెలిమి పెంచునది
పెంచి రక్త బంధముతొ  ప్రేమ ఈశ్వరా

హంగు ఆర్భాటమే ...... ఆర్భాట బేధమే
బేధమే ఎరుగక సఖ్యత యే ఈశ్వరా

మాటతో మాటలే  ..... మాటలే బాసలే
బాసలే ప్రత్యుపకారము యే ఈశ్వరా

హృదయము నే పంచును ..... పొంచి ప్రీతి కోరును
కోరియు మనసునే  పంచుటయే ఈశ్వరా

 మనసులే ఏకమై  ..... ఏకమై  ప్రేమమై
ప్రేమ చేతులతొ ఆలింగనం ఈశ్వరా

మాటల మాయ లేదు ..... లేదు కధలు చెప్పదు
చెప్పదు చేయూత మిచ్చు ఈశ్వరా

ప్రేమతొ సఖ్యత సఖి ...... సఖియె ప్రేమతొ లిఖి
లిఖిలో హృదయమును చూడునే ఈశ్వరా

చేయి చేయి కలిపి యు ....  కలిపి బాస చేసియు
 బాసలుచేసి ప్రేమ శ్వాసలు ఈశ్వరా

ప్రేమను వ్యక్త పరుచు .... వ్యక్తమై కళ తలచు
పసిడ కళలే స్నేహ సఖ్యతే ఈశ్వరా

లేత లత పరిమళము ..... పరిమళమతి మధురము
మధుర కలయికే మనసున మైత్రి ఈశ్వరా

తరగని నిధియె  మైత్రి ..... మైత్రి ఇది గాయత్రి
గాయత్రి సహనములో ధరిత్రి ఈశ్వరా

కన్న తల్లి కన్నను  ..... కన్న తండ్రి కన్నను
కన్న  ప్రేమ కన్న మిన్న మైత్రి ఈశ్వరా

 చెప్పేటి రహస్యం ..... రహస్య స్థావరం
స్థావరంలో స్నహ సహకారం ఈశ్వరా  

స్నేహ మె మనిషి చెట్టు ...... చెట్టు సహనపు మెట్టు
మెట్టు మన ఎదుగుదలకు నిచ్చెన ఈశ్వరా

హృదయ మందు స్నేహము ..... స్నేహమే శాశ్వితము
శాశ్విత వలయమె మానవత్వం ఈశ్వరా 

సమ్మౌహనాలు..గుడ్ ఫ్రైడే

వినుచున్న నీలీల .... నీలీల బతుకు కల
కలలు తీర్చి శాంతిని పంచేటి దైవమే

రక్తమ్ము చిందించి ...... చిందించి శాసించి
శాసించి మేడ్వ వలదనే ‌పలికె దైవమే

ఖ్యాతి గాదే నీతి ...... నీతి సూక్తులే మతి
మతి ననుసరించి జీవించమనె దైవమే

పలుకంగ నీస్తోత్ర ....... స్తోత్రము బతుకు సూత్ర
సూత్రమే ప్రేమ పూరితమైన దైవమే

పాఠముల్ పుణ్యమౌ  ...... పుణ్యమౌ గ్రంధమౌ
గ్రంధమే ప్రవక్త పాఠముగా దైవమే

కనుచున్న నీరూపు  ..... నీరూపు మా పిలుపు
పిలుపు తోను మమ్ము రక్షించే దైవమే

మోడు వారకు జీవి  ...... జీవి తెలుపు కధలవి
కధలు అనుభవాలు జ్ఞాపకాల దైవమే

కరుణకే చిహ్నమై  ..... చిహ్నము ప్రేమమై
ప్రేమతో బతుకులను నెర్పేది దైవమే

సమ్మోహనాలు .. కోయిలా 

తెల్లారె కోకిలా  ...... కోకిల కూయనెలా 
కూయగానె సంతోషం గలిగె ఈశ్వరా 

అదియు వసంత పిలుపు .....  పిలుపే  మేలుకొలుపు 
మేలుకొలుపు తోను ఆనందం ఈశ్వరా 

తరువులే చిగురించు ...... చిగురుతొ సంతసించు 
సంతసము కోయిల పంచుకొనును ఈశ్వరా 

మాటకు మాట లాగ  ....... మాటల కూతలాగ
కూతతోనె పిలిచే కోయిలా ఈశ్వరా 

రూపము చూడ నలుపు ...... నలుపు తో మైమరపు
మైమరపు గానముతొ కోయిలా ఈశ్వరా 

చల్లని వేళయనీ   ...... వేళలొ  పిలుపులనీ  
పిలుపులు హాయిని గొలుపు మనసుకు ఈశ్వరా 

ప్రకృతి పరవశముతో  ...... పరవశ ప్రేమతో 
ప్రేమ పిలుపు కోయిల రాగమే ఈశ్వరా 

కోయిల రాగాల తొ ......    రాగ అనురాగముతొ
అనురాగము కుహు కుహు అనిపిలుచు ఈశ్వరా 

భూదేవి సాక్షిగా ..... సాక్షిగా ప్రేమగా 
ప్రేమ పంచిపొందేటి హృదయం ఈశ్వరా 

నీరు నిప్పు గాలీ ...... గాలి చూపు జాలీ
జాలి తో అమ్మ మరిపించేది ఈశ్వరా 

కాలమే నీవెంట .... నీవెంట ప్రేమంట 
ప్రేమతో ఇంటి‌లో కథలెన్నొ ఈశ్వరా 

బంధాలే తత్వం .... తత్త్వం సమ్మోహం 
సమ్మోహం సంసారం మగును ఈశ్వరా

ఆరూపు చూస్తుంటె  .... చూస్తుంటె ఏదంటె
ఏదంటె ఆకర్షణే మనసు ఈశ్వరా

అందాలు చిందేను .... చందె ఆకర్ణనను 
ఆకర్షణతొ అందరిని పిలుచు ఈశ్వరా 

దేవకన్యల రంగు ..... రంగు కళలతొ పొంగు 
పొంగు సహజ మార్చు అందర్నీ ఈశ్వరా

వగలు చూపే పడతి ..... పడతి చేసే వినతి
వినతిపత్రం తో బతుకు తెరువు ఈశ్వరా

సమ్మోహనాల.... స్త్రీ

స్త్రీ శక్తికి మించిన  .. మించేనా యుగాన
యుగాన ఎవ్వరో తెలియదే ఈశ్వరా

స్త్రీ యుక్తి వల్లన .. యుక్తితో సంధాన
సంధానకర్తగా స్త్రీ యేగ ఈశ్వరా

స్త్రీ సృష్టి అంతా ను .. అంతా గంధ మేను
గంధము పేగు బంధం ప్రేమే ఈశ్వరా

స్త్రీ జీవితం తృప్తి  .. తృప్తి తో సంతృప్తి
సంతృప్తి తెల్పు కుటుంబానికి ఈశ్వరా

స్త్రీ మనసు మరుమల్లె  .. మల్లె సుమధుర జల్లె
జల్లె తరుణాన హాయిగొలుపే ఈశ్వరా

స్త్రీ గృహానికి గురువు .. గురువుగాను బిందువు
బిందువే మూలం అన్నింటికి ఈశ్వరా

శివ తత్వం:-

➡ శివం - శుభకరం, శుభాన్ని కలిగించేవాడు.
➡ త్రినేత్రం - ధ్యానం/తపస్సు.
➡ ఢమరుకం - సంగీతం.
➡ తాండవాభినయం -  నృత్యం.
➡ శివుని చేతిలోని అగ్ని - నిప్పుతో చెలగాటం అనగా జీవితంలో ఎట్టి ఒడిదుడుకులు ఎదురైనా, ధైర్యంగా ఎదుర్కోవటం.
➡ భిక్ష పాత్ర -  ప్రతి ఒక్కరి నుండి జ్ఞానం నేర్చుకోవడం.
➡ కపాలం - శరీరం యొక్క చివరి దశని సూచిస్తాయి.
➡ కోరుకునేది - చితా భస్మం కాదు.  చిత్త భస్మం. (అనగా శూన్య స్థితి)

మనిషి - పరిధి ... సమ్మోహనాలు   1348 ... 1356 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

కాలము మారుచుండు .. మారు బతుకే ఉండు 
బతుకులే కడలిలొ కలువుచుండు ఈశ్వరా 

కాల గమ్యం కదులు ..  కదులు నిత్య బాధలు 
బాధలున్న గమ్యం తొ కథలే ఈశ్వరా 

పయనమే జీవితం ..  జీవితం సుఖమయం  
సుఖమయం లో జీవిచ్చ కలుగు ఈశ్వరా 

వెన్నెలే ఎడారి గ  .. ఎడారే చీకటిగ
చీకటి అంతాఅయ్యోమయం ఈశ్వరా 
 
ఇది గమ్య మేమిటో  .. ఏమి ఏమి మాటో  
మాటల పరంపర మనసు కలయు ఈశ్వరా

ప్రేమ ఎంత గొప్పదొ  .. కళ గొప్పది ఎట్టిదొ   
గొప్ప కళ లే ఒకదాని కొకటి ఈశ్వరా 

ఆరంభం ఆగదు  .. ఆగదు చెడే పోదు 
చెడి పోనిది ఒక్కటే ప్రేమా ఈశ్వరా 

కాలమే నీవెంట  .. నీవెంట బతుకంట 
బతుకు భ్రమలు చుట్టూ అంటా ఈశ్వరా 
 
--(())--

మహిళాదినోత్సవం సందర్భముగా సమ్మోహనాలు 
కాంతిలో కలలు  1339 ... 1347
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మగువా మరవ వద్దు  .. మఱచి వేదన వద్దు 
వేదనలన్ని కళ్ళలొ చూపే ఈశ్వరా 
 
మహిళా మనసు పంచు  .. పంచి హృదయము పంచు
పంచి జీవితం కష్టాలులేలు  ఈశ్వరా 
 
క్షణములో వీక్షణము  .. వీక్షణమే దృశ్యము   
దృశ్యము నిరంతరం కంటిలో ఈశ్వరా 

మరువలేని స్మృతులు  .. స్మృతుల తో చూపులు 
చూపులు కళ్ళలో నిలిచి ఉండు ఈశ్వరా

హృదయ రంజితములే  .. రంజిత భావములే 
భావాలు  కళ్ళలో మెదలునే ఈశ్వరా 

జ్ఞాపకాలు వెంటనె  .. వెంటనే కలలుగనె 
కలలుగనె కళ్ళు మెరుపులు వచ్చె ఈశ్వరా 

కళ్ళలో మాయలే  .. మాయతో చూపులే 
చూపులలొ సుందరాంగ కళలే ఈశ్వరా 
 
కలలలో కథలేలు  .. కధలు కళ్ళ చూపులు 
చూపుల లో ప్రేమకథలు వచ్చు ఈశ్వరా 

మదిలోన మలపులన్ని .. మలుపులలో హృదయాన్ని   
హృదయాన్ని పంచేటి మనసాయె ఈశ్వరా 

సమ్మోహనాలు.. సుఖనిద్ర

కృష్ణా నిద్ర వద్దు .. వద్దు అనకయె పొద్దు
పొద్దు వాలిన నిద్ర దేెనికో ఈశ్వరా

కృష్ణ వైకుంఠ మీడి .. వీడి భక్తులు గూడి
గూడి రోగి యొక్క స్థానము యే ఈశ్వరా

పుడమి బాధను తీర్చి .. తీర్చి ప్రేమ చేర్చి
చేర్చి హాయిని అందించి నిద్ర ఈశ్వరా

ముద్దు లొలుకు కృష్ణా .. కృష్ణ అనిన కృష్ణా
కృష్ణా అన్నా మారని స్థితి ఈశ్వరా

అమ్మ పాట పాడగా .. పాడి జోల పాడగా
పాడి ఆడి హాయిగాను నిద్ర ఈశ్వరా

దుష్టుల సంహారము .. సంహార సంగరము
సంగరము చేసి హాయి నిద్ర ఈశ్వరా

బుడి బుడి అడుగులతో .. అడుగుల శబ్ధముతో
శబ్దము ఉన్న ప్రశాంత నిద్ర ఈశ్వరా

చెరసాలలో పుట్టి  .. పుట్టి వేణువు పట్టి
పట్టి మధురానుభూతి ఇచ్చే ఈశ్వరా

సంతోషమును పంచి .. పంచి మనసును ఉంచి
ఉంచి ఆనందముగా నిద్ర  ఈశ్వరా

కష్టములనే బాపి  .. బాపి ఇష్టము చూపి
చూపిన మహానుభావుని నిద్ర ఈశ్వరా
....
సమ్మోహనాలు ... హోళి 

హృదయాల కలయికయె .. కలయిక రంగులు యె 
రంగుల హృదయాలు ఏకమౌట ఈశ్వర 

మోము రంగుల కళలు .. కళలు చూపు ఆటలు  
ఆటల తో ఆనందం పంచు ఈశ్వరా 
 
సంబరాల వెల్లువ .. వెల్లువ తో మక్కువ    
మక్కువ తొ ఒక్కరికోరు ఆడు ఈశ్వరా

గులాబీ హృదయమే ..  హృదయమ్ము శబ్దమే  
శబ్దమే ఆకర్షతో పిలుపు ఈశ్వరా 

పచ్చపచ్చని రంగు ..  రంగు పడచుల పొంగు 
పొంగుల అరుపు ఆర్భాట హోళీ ఈశ్వరా
   
చెడు దగ్దము చేయును .. చేయు అగ్ని రగుల్చును 
రగిల్చి నృత్యము తో తిరుగుదురు ఈశ్వరా 
  
రంగవల్లి లోగిళ్ళు .. లోగిళ్ల తిరునాళ్ళు 
తిరునాళ్ళలొ రంగు లెదజల్లు ఈశ్వరా 

మోహమాటము లేక  .. లేక ఆడుచు కేక 
కేకలు కేరింతల సంబరం ఈశ్వరా 
--(())--
సమ్మోహనాలు.. విశ్వాసం

విశ్వాసం వ్యక్తమ్మే .. వ్యక్త పరచె ధైర్యమ్మే
ధైర్యంగా జీవించుట బతుకె ఈశ్వరా

మనిషి యందు బంధము .. బంధము అను బంధము
బంధంగా స్నేహం శునకమ్ము ఈశ్వరా

నమ్మిన సిద్ధాంతం .. సిద్ధాంత సుఖాంతం
సుఖాంతం గా స్నేహ బంధమే ఈశ్వరా

వాసనను పసిగట్టి  .. పసిగట్టి కనిపెట్టి
కనిపెట్టి దొంగను పట్టు కుక్క ఈశ్వరా

పేద మహిళ జీవన .. జీవన కష్ట మైన
కష్టమైన ఇష్టంగా బతుకే ఈశ్వరా

నిత్య కష్ట జీవులు .. జీవులుగా బతుకులు
బతుకుకే తోడుగా కుక్కయే ఈశ్వరా
--(())--

సమ్మోహనాలు ... పిల్లి   1331 ... 1328   

పిల్లి నడకలు వొద్దు  .. వొద్దు అతుకులు వొద్దు 
వొద్దు అనేపదం వెంటరాదు ఈశ్వరా

పిల్లిని భంధింస్తే  .. భంధి తొ కోపిస్తే   
కోపిస్తే పిల్లియె పులియగును ఈశ్వరా 

ఆడువారినడకలు .. నడకలతో కళకళలు 
కళకళలు పిల్లి నడకలు మల్లె ఈశ్వరా 

హనుమ రూపము మార్చి .. మార్చి సహనము చేర్చి 
చేర్చి మార్జాలముమల్లె కదిలె ఈశ్వరా

పిల్లిని చూసి ఎలుక  .. ఎలుక పరుగులే ఇక 
ఇక పిల్లికి చిక్కక బతికేను ఈశ్వరా 

కుక్కను చూసి పిల్లి  .. పిల్లి పరుగుల పిల్లి
పిల్లి అయినా కుక్కంటె భయము ఈశ్వరా 
 
పిల్లి పిల్లలు తిప్పి  .. తిప్పి ఇల్లులు తిప్పి 
తిప్పి బతుకును నేర్పు పిల్లలకు ఈశ్వరా 

కళ్ళు మూసియు పిల్లి .. పిల్లి పాలను గిల్లి 
గిల్లి పాలు త్రాగుట తప్పదు ఈశ్వరా 
  
--(())--
సమ్మోహనాలు ... పాదాలు  1321 ... 1330   

ఏమి చెప్పి మెచ్చాలి .. మెచ్చాలి ఊండాలి
ఉండాలి భయములేక ఏలా ఈశ్వరా

మనసులోన నేధ్వని .. ధ్వని వల్ల ప్రతి ధ్వని
ప్రతి ధ్వని యే మనిషికి రోగమె ఈశ్వరా

మాయ కుమ్మి ఉన్నా .. ఉన్న కధలు విన్నా
విన్నా నాలొ భయము తరమాలి ఈశ్వరా

ఆహార లోపాలు  .. లోపాల శాపాలు 
శాపాలు మహత్చమే చీకటి  ఈశ్వరా 

ఆత్మహత్య పాపం .. పాపం ఒక శాపం 
శాపం జన్మజన్మలబంధం ఈశ్వరా 

బతక లేని ఆశ  . .. ఆశతో పేరాశ 
పేరాశ మార్చు బుద్ధి మనసును ఈశ్వరా 

కాలము నీది కాదు .. కాదు ప్రేమ కాదు 
కాదు అనే పదం అన్న కాదు ఈశ్వరా 
 
భ్రమలో చిక్కినా .. చిక్కిన భయపడినా 
భయము మనిషిని నాశనము చేయు ఈశ్వరా 

ఎప్పుడో జరిగినది .. జరిగి కదులుతున్నది  
కదలి కలవరము తెప్పించేను  ఈశ్వరా 

మగువతోడును లేక .. లేకను మనసు లేక 
మనసు లేని పక్షిలా తిరుగే ఈశ్వరా 


అనర్గళ వాక్పటిమ  .. వాక్పటిమ మంగళమ 
మంగళమ అమంగళమా తెల్పు ఈశ్వరా 

మేధస్సు అక్షరము  .. అక్షరము సంభవము 
సంభవం అసంభవమా తెల్పు ఈశ్వరా 

సాహిత్య మమకారము .. మమకార విధిమయము 
విధిమయమ వీధిమయమా తెల్పు ఈశ్వరా 
  
కవిత్వ పదజాలము .. పదజాల సానుభవము 
సానుభవ అసంభవమా తెల్పు ఈశ్వరా 

ప్రకృతి యే పరవశము  .. పరవశము సంగమము 
సంగమమా పరవశమా తెల్పు ఈశ్వరా 
 
సుఘంధము పరిమళము .. పరిమళ సమ్మోహము 
సమ్మోహముతో  సమతుల్యమూ ఈశ్వరా 

--(())--




దేవుడే దిగివచ్చి .. వచ్చీ నడిచివచ్చి 
వచ్చి వెల్లె పాదాలు గుర్తులు ఈశ్వరా 

అడుగు జాడలు బతుకు .. బతుకు వెలుగుల మెతుకు 
మెతుకు లేనిదె  జీవితములేదు ఈశ్వరా 

పాదముద్రలు చూచి  .. చూచియే గమనించి 
గమనించి నడకను సాగించు ను ఈశ్వరా 

హరి పాదమును పట్టు  .. పట్టు అదియే మెట్టు 
మెట్టు మెట్టు ఎక్కించేది హరి ఈశ్వరా 

రామ పాదము అడుగు   .. అడుగు అదియే గొడుగు 
గొడుగు లా రక్ష చేయును అడుగు ఈశ్వరా    

జ్ఞాపకాల అడుగులు  .. అడుగులు జీవితాలు 
జీవితాలు అడుగుల్లా మారును ఈశ్వరా 

మధురానుభూతిగా  .. అనుభూతి అడుగుగా 
అడుగులో అడుగువేసి నడుచుటె ఈశ్వరా 

ఇసుకలో పాదాలు .. పాద లతో గుర్తులు 
గుర్తులు శాశ్వితమ్ము కావులే ఐశ్వరా 

మూడు పాదాల హరి .. మూడు కన్నుల శిరి 
శిరి నిలకడ ఉంచని పాదాలు ఈశ్వరా 

ప్రశ్న 
మృత్యు పదాలు కదులు .. కదలి పొందు శోకాలు 
శోకాలు కావు ఋణానుబంధ ఈశ్వరా 

సరిగమ సంగీతము  .. సంగీతం పాఠము 
పాఠము జీవిత సంగీత మే ఈశ్వరా 

సంగీత స్వరాలు  .. స్వరాలే మధురాలు
మధురాలు మనసునే దోచేను ఈశ్వరా  

యువతకే ఉల్లాసం  .. ఉల్లాస ప్రభావం 
ప్రభావం సంగీత స్వరాలే ఈశ్వరా 
  
సంగీత కచేరీ  .. కచేరీ విహారీ 
విహారి మనసుకునేర్పు  లహరీ  ఈశ్వరా 

 కొందరి జీవితాలు  .. జీవ సంగీతాలు
సంగీత వృత్తియే జీవమ్ముఁ ఈశ్వరా

లింగ భేదము లేదు ..  లేదు మతమును లేదు 
లేదు సంగీత స్వరము మనషె ఈశ్వరా  

కాలానుగుణంగా  .. గుణ ప్రభావంగా 
ప్రభావ సంగీత సాహితియే ఈశ్వరా

అపారమగు సంగీత .. సంగీత సమర్దత  
సమర్ధత కీర్తి ప్రతిష్టలే ఈశ్వరా

అత్యధికోత్సాహము ..  ఉత్సాహ యవ్వనము 
యవ్వన దూకుడులు,గెంతులే ఈశ్వరా 

రమణీయ గీతమ్ము  ..  గీత ఆనందమ్ము  
ఆనంద సర్వ  సంగీతమే ఈశ్వరా 

ప్రేమలేక రాశా  .. రాసి నా ఓ ఆశా
ఆశా పాశము కు చిక్కాలే ఈశ్వరా

అమితమైన ప్రేమ .. ప్రేమ సుఖము దుఃఖమ
దుఃఖము తప్పదు జీవితములో ఈశ్వరా

ధనము కీర్తి ప్రతిష్ట  .. ప్రతిష్ఠ మనకు నిష్ట
నిష్ట మనిషిగా సంతృప్తియే ఈశ్వరా

మనసులో భోగమ్ము .. భోగమ్ము తరుణమ్ము
తరుణమ్ము ప్రేమ లేఖ తోనె ఈశ్వరా 

ఇంద్రియములు మనస్సు .. మనస్సు కళ తపస్సు
తపస్సు సౌఖ్యమ్ము కొరకుకళలు ఈశ్వరా

నేడు ప్రేమలేఖలు  .. లేఖతొ పరిచయాలు
పరిచయం ఇరు మనసులను కలిపె మోహనా

లోకము ప్రేమమయము .. ప్రేమలొ అనురాగము
అనురాగముతో ఇంద్రియసుఖము ఈశ్వరా 

లేఖనే రాసితిని  ... రాసియే ఆగితిని 
ఆగియు ప్రేమ పంచుటకు లేఖ ఈశ్వరా 

కరుణ చూపు ప్రేమా .. ప్రేమ తోనె యుగమా 
యుగము అంత జీవిత ప్రేమే ఈశ్వరా 

ఉషోదయ వెలుగులే  .. వెలుగుతొ  ప్రేమలే 
ప్రేమ జీవితాన నిత్య లేఖ ఈశ్వరా 

ప్రశ్నలో ఉన్నాది  .. ఉన్నాది జవాబది
జవాబులో ఉంది తన్మయమే  ఈశ్వరా 

ప్రశ్నించ కే నీవు  .. నీవు బాధపతావు 
బాధలు పెట్టుట ఎంత నిజమొ ఈశ్వరా 

జ్ఞాన సముపార్జనే  .. ఆర్జన ప్రశ్నగునే 
ప్రశ్న లే మనిషిని మార్చును లే ఈశ్వరా 

మనసు ప్రశ్నలవల .. వలయె  పొంగేటి అల 
అల ప్రశ్నిస్తూనేవుంటుందే ఈశ్వరా  

మంచి చెడ్డ చూడక  .. చూడక ప్రశ్న అలక 
అలక తీర్చుటకు ప్రశ్నలు వచ్చు ఈశ్వరా 

గురువు శిష్యుల మధ్య .. మధ్య ప్రశ్నల పద్య 
పద్యములకు గురువే జవాబే ఈశ్వరా 

ప్రశ్న తో మోహమ్ము .. మోహమ్ము దేహమ్ము 
దేహము ప్రశ్నల చుట్టూ తిరుగు ఈశ్వరా 

కృష్ణార్జునులలో  .. అర్జున అడుగుటలో 
అడుగుట ప్రశ్నగా కృష్ణ తెలుపు  ఈశ్వరా 

జిజ్ఞాస ఉండాలి  .. ఉంటె ప్రశ్నల గాలి 
గాలి కమ్ముకున్నట్ల ప్రశ్నలే ఈశ్వరా     

ప్రశ్నించేది కలలు .. కలలు వల్లా వెతలు 
వెతలు లేని జీవితం వ్యర్ధము ఈశ్వరా   


16, ఫిబ్రవరి 2021, మంగళవారం

సీతాపతీ పద్య కావ్యము.





 సీతాపతీ పద్య కావ్యము.....(1)

ఓం శ్రీ రాం .. శ్రీ మాత్రే నమ:.... ఓం శ్రీ విఘ్నేశ్వరాయనమః


త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి....


         యా కుందేందు తూషారహారధవళా యాశుభ్రవ స్త్రాన్వీతా

         యావీణ వరదండ మండితకరా యాశ్వేత పద్మాసనా

         యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభుథిభి: దేవై: సదా వందితా

         సామాంపాతు సరస్వతి భగవతీ నిశ్శేషజాఢ్యాపహా


భావము:-

               మల్లెపువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె, ముత్యము వలె తెల్లగా, స్వఛముగా ఉండి, తెల్లని చీర ధరించి, చేతిలో వీణతో, తెల్లని పద్మమునందు ఉండు ఓ సరస్వతి దేవీ! బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడు పూజింపబడు ఓ భగవతీ!! నాలోని అజ్ఞానమును పోగొట్టి నన్ను ఎల్లప్పుడూ రక్షించుము.

          ఓం శ్రీ రాం... శ్రీ మాత్రే నమః..ఆ తల్లి కరుణాకటాక్షాలు అందరికీ చెందాలని మనఃశాంతి కలగాలని ఆశయం అదే

సీతాపతీ కావ్యము (1)


గీ .... శీఘ్రముగను నే పుడమి స్నేహితమ్ము

        ప్రకృతి మాతను వేడుక ప్రాభవమ్ము

        రామ పాదము పట్టియు రవ్వ వెలుగు

        కోసమే రామకధలుగాను కరుణ తోడ


గీ      ఎట్టి దయతో డ మునులు లాలించి నావొ

        ఎట్టి కరుణతొ సుగ్రీవు పేలి నావొ

        ఎట్టి ధర్మాలు మనసుకు నంద చేయు

        అట్టి కనికరము ను బ్రోవు మభవ నన్ను

గీ ....ఆంజనేయ కృపా కటాక్షమ్ము యిదియు

       సకల ధర్మ నిరతి గాను సాగు లీల

       నీకరుణ యర్ధమగు నాకు నిశ్చయముగ

       కావుమయ్యా సీతాపతీ కావుమయ్య


గీ ...శ్రీ రమాపతి నాకిచ్చి చిత్త శుద్ధి

      కీలుబొమ్మగ జేసి లిఖింపజేసె

     కమలనయనా ధృఢముగను కావ్య సృష్టి

     కనులు విప్పేసి మహిమను మాకు చూపు

     తండ్రీ మమ్ము  కావు మయ్యా


ఎందరో మహానుభావులు భావులు అందరికీ వందనాలు నారచన లో టైపు తప్పులు , ప్రాసయతులు తప్పులు దొర్లి నా నిరభ్యంతరముగా తెలపండి ఇది అందరి రామాయణము 

 సీతాపతీ కావ్యము.......              ఇంకా ఉంది


       సీతాపతీ పద్య కావ్యము ... (2)


ఓం శ్రీరామ్ .. శ్రీ మాత్రే నమ:...ఓం శ్రీ విఘ్నేశ్వరాయనమః


గీ..   రామ పద్యకధా సుధారసము ఇదియు

      ద్రావి  మనుషిగా మౌక్షమ్ము దాత గుండి

      తెలుగు భాషలో రచనగా తేట తలుపు

      నమ్మ కమ్మున రామనామముతొ హనుమ


గీ .....తెలుగు వారికెల్ల ను తేట తెల్ల మనుచు

       తెలుగు బాస తీపిదనము తెల్ప దలచి 

       రచన సీతాపతీ కథల రసము తెల్ప 

       ఆర్య భావమ్ము మనసున ఆశ తీర్చు 


   గీ..   వేంకటాచల జోష్యుల వార సున్ని

       లక్ష్మణుని పుత్ర రత్నము ఆశయమ్ము

       తల్లి ఊర్మిళ కరుణతో తత్వ మైన

       శ్రీ మతి శ్రీదేవి సలహా మేర రచన


గీ....  అలసిన తనువుకి తలుపు అమ్మ పిలుపు

       తెగని కోరిక మనసున తండ్రి తీర్పు

       జీవితపు నీడ ఊటగ జపత రామ

       గాలిగావచ్చి దీవెను గాను పిలుపు


గీ...  కావలెను ఓర్పు మనసుకు కాల మార్పు

       పుండవలె మరింత అభిలాషుండ వలెను

       నేర్వ వలెను సాహిత్యమ్ము నేర్పు వలెను

       ఆర్య చరితము నిత్యమూ ఆత్మ తృప్తి


గీ.......నిర్మ లంగాను మనసును నడుము నుంచి

       కలుగు అమిత ఆనందము కలసి పంచి

      ప్రకృతిని తిలకించి సమయ ప్రీతి నిచ్చి

      ఆర్య నడకలో అర్దము అందు కొనును


గీ.....మనిషి గా ఉనికి సేవల మూర్తి అనియు

      ప్రాణ రక్షణ కవచం గ జనుల కున్న

      ఉనికి మానవతావాది ఊహ నిజము

      ఆర్య మనిషికీర్తిని పెంచి ఆదు కొనును


ఆ..  ఓం కవీంద్రులార నాలోక నివసు

      లార మిమ్ము దలచి లాలితమగు

      కవిత వ్రాయ నెంతు కమ్మని కవనంబు

      నాకు గలుగ దీవెనములు నిండు


--(())--

సీతాపతీ పద్య కావ్యము (3 )

ఓం శ్రీ రాం .. శ్రీ మాత్రే నమ:.... ఓం శ్రీ విఘ్నేశ్వరాయనమః


పరనారీ కుచకుంభ పాళికలపై పదాబ్జాయుగ్మ0బుపై

కరమూలాంబులపై కపోలతటిపై కంఠ0బుపై కొప్పుపై 

పరువుల్ పారెడు నాతలంపులుమిమున్ భావింపగా జేసి స 

ర్వ రసాధీశ్వర నన్నుబ్రోవు రఘువీరా జానకీ నాయకా 


తాటక గూల్చినావు వినతాసుతపుత్రునిగాంచినావు ఘో 

రాటవి లో కబంధుని బిరాన వధించి జనమ్ము గాచినా 

వాటగ గట్టినావచట వారధి రావణు జంపినావు, నా 

మాట వినంగ రావొ కనుమ రఘువీర ధర్మాత్మజేశ్వరా


అఖండ లాలిత్వ యానంద మంచించి 

తఖండ విభవో దయాంచితుండు 

వారణారి త్రపాకారణాజిస్థలా

వారణాంచద్భుజా పౌరుషుండు 

మందేహరిపు దీప్తి సందేహఘటనాత్వ 

మందేహ తేజస్సమన్వితుండు       

బంధురాజీ పయస్సింధూరాజీభవ 

ధ్భ0దు రాజీ జయ భ్రాజితుండు 

     

వెలయు నిఖిల దిగంత పృథ్వీ తలాబి 

మణిమ తల్లీ ఘృణి ప్రతి మల్లపుల్ల 

కీర్తివిభువుండు సకలము రక్షకుండు 

ఆర్య సర్వము గ్రాహ్యము కందజేయు 


--(())--     

సీతాపతీ పద్య కావ్యము  (4 )

చిరునవ్వు మోమున చిందులాడెడు వాడు 
శ్వామలా వర్ణ దేహంబు వాడు
కర్ణ కండలముల కాంతి మెరయు వాడు 
కరుణాసముద్రుడై గ్రాలు వాడు 
చెవులంటు కన్నుల చెలువు గల్గిన వాడు 
హరి నీలకేశంబు లమరు వాడు    
జానకీ దేవితో సరస మాడెడు వాడు 
తమ్ములబోలు పాదముల వాడు 

వాడు మావాడు శ్రీరామ వల్లభుండు 
దేవ తలలోన శ్రేష్ఠుడు దివ్యు డగుచు 
మాదు కోర్కెల మన్నించు మానవుండు 
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు       .... (1 )
 

మరుమల్లె పందిరి మధ్యనున్నటి వాడు 
మనసును అర్పించు మేధ పరుడు 
సహనము చూపుచూ సాధ్య పరుడు 
వినయమ్ము విశ్రాంతి వివరించు వాడు 
విషయ వాంఛ లనేవి విప్పు వాడు 
సకలమ్ము పనులకు సహకరించు 
అమృతధాయ ననుచు ఆనంద రూపుడు 
చరితను మన్నించు చరిత పురుష 


భూసుతా రంజన భువనైకభవ వీర        
నీరద సముగాత్రనిరూప నామ వీర 
నిర్మల మనస్సు నందించి నిజము తెల్పె      
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు       .... (2 )


  --(())--
సీ ....హృదయమ్ము కదిలించి హాయిని పంచియు
       చిగురించు ఆశలు చలవ చూపి
       ప్రాణము అనునది పచ్చ పచ్చని దిగ
       స్వప్నాలు తీర్చేను సౌమ్య రామ
       నిశ్చలంగా ఉండు నిర్మల హృదయుడు
        నిత్యమూ జనులును నీడ లాగ
      సంయమనం వల్ల సమ్మోహ పరిచియు
      సకలమ్ము సేవకు సౌమ్య రామ

గీ ...నిన్ను బ్రార్ధింప నబ్ధముల్ నెలలు దినము
      లగుచు గంటలై నిముషంబు లగుట యెన్న
      డంచు కలవరింతును నేను రామ నిన్ను
     ప్రాంజలి నొనర్తు రామ నీపాదములకు...........3

--(())--

          సీతాపతీ పద్య కావ్యము (5 )
         రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

సీ... తుంటరి మదిలోన వింతైన మార్పులు  
       మెప్పునే పొందుట ముదిత రామ 
       సాధన చేసినా సాహసము పెరుగు 
       సమతుల్య మైనను సకల సుఖము    
       కాసుల వర్షము కాపురమ్మునుచేర్చు 
       కనికరపు గుణము కాపు కాయు 
       మట్టిని నమ్మితీ మిత్తినీ చేరుట 
       మగువల మానస మోన రామ 

ఆ ... ప్రజల కెల్ల  సులభ వస్సుడై యున్నాడు 
        భవము బాపునట్టి భాంధవుండు 
        నీరజాక్షుడతడు తారక నాముండు  
        అతని భజన సేతు ననుదినంబు  .... .... (4)
                   --(())--

సీ    నిశ్శబ్ద శబ్దాల  నడుమన బతుకులు 
       అశలే లేనట్టి అరుణ రామ 
       ఆవర్తనంలోను ఆశల పూజలు 
       అడుగులు మడుగులై నడక రామ 
       శిశిర మార్గంలోను శివమెత్తి మెలకువే 
      గ్రీష్మతాపమ్మున తగ్గు రామ 
      శీతలగంధ సమీరాలు కమ్మియు 
      ఆశలతొ తుషార ఆది దేవ 

గీ   మాకు దారిచూపును కదా మధుర రామ 
      చరితను మలవడానికి చతుర రామ 
      నిలిచి వేడుకొనుచు రమా వల్లభునిలె 
      ప్రాంజలి నొనర్తు రామ నీపాదములకు .... .... (5 ) 
                      --(())--

సీ    గతమును మరిచియు గమ్యమ్ము చేరకు
       సతత వేటే మాని హితము తెలుపె
       మమతాను రాగము మాన మైన తలపు
       కమనీయ వేడుకా కలిపె రామ
       సాహితీ వినయము సౌమ్య మ్ము వలననే
        సంభ్రమాలను చూపె సంతసమ్ము
        కత్తుల విత్తులే కుత్తుక పలికినా
        శౌర్య మతిని పెంచు శౌర్య రామ

గీ    ఎండిన మనసు మార్చియు ఏది అనక
      మానవత్వాన్ని మరువక  మంచి చేయు
      స్వార్ధపరులు లేకుండగా సుగుణ రామ
      ప్రాంజలి నొనర్తు రామ నీపాదములకు....... (6)
--(())--


సీతాపతీ పద్య కావ్యము (6)
సీ      కోదండ ధారివై వేదండముల బోలు
         ఘోరారి ప్రకరముల్ గూల్చి నావు
        వారధి గంభీర వర్షాంబుద శరీర
        స్ధిరుడవై జగములు చెలగినావు
       శగుణనిధివై భక్తి గుణముల నెల్లను
       కరుణతో రక్షించి గ్రాలి నావు
       శ్రీ రామ రఘు వీర సీతాపతీ పద్మ
       నేత్ర విజయుడవై నెగడి నావు

గీ   రామచంద్ర రఘూత్తమా రాజవర్య
     రాజరాజేంద్ర సురరాజ రాఘవేశ
     రామభద్రుండ రఘవంశ రాజతిలక
    శరణుజొచ్చితి దాసుండ జయము నిమ్ము ...... 7
--(())--

సీ   సంపాదనలు వద్దు సుఖముంటె చాలును
      సామాన్య జీవమ్ము సంతసమ్ము
       అహముతో గర్వము అస్సలు వద్దులే
       ఆధ్యాత్మిక ము ఉంచు కలియుగమ్ము
        ఆడంబరము వద్దు ఆర్భాటంగా వద్దు
       ఆత్మీయత బతుకు అచ్చి తమ్ము
       అధికార ము వద్దు అతిశయమును వద్దు
       అందరి వాడిగా అందు రామ

గీ     పెత్తనం వద్దు ఆకలి పెంచు చాలు
        పదవి వద్దులే మనసుకు ప్రీతి చాలు
        కొలువు కాసులు అసలొద్దు కరుణ చాలు
         కలిసి పోయేటి బతుకుల కథలు రామ.....8
--(())-+

సీ     నిలువెత్తు బలమైన నీడలా గుండియే
              బాధ్యత లన్నియు బాగు పరిచి
        మాయని మచ్చల మమతలు లాగనే
              మనసున పలికేటి మధుర రామ
          తప్పిన మనసుకు తపనలు తీర్చె ను
               మనసుకు పొదుపు గా మేథ పంచె
          నమ్ముకున్న బతుకు నటనలు కాకుండ
               విష్ణు రూపము తోడ వెల్సె వచ్చె

గీ.     సుప్రకాశుండవగుదువు సుంద రాంగ
         జగములకు వెల్గునొసగెదు సార్వ భౌమ
          రమ్య గుణధామ శ్రీ రామ సౌమ్య నామ
          ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు  .... 9
               ---(())---

          సీతాపతీ పద్య కావ్యము .. 7  
          రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

సీ      కవిరామదాసుని కావ్యమ్ము లన్నియు
                 రసరమ్య భావాల రాగధనులు
          గుండె చప్పుడు లను రామ రూపముననే
                 కనువిప్పు కలిగేల కరుణ చూపె
          రఘువంశ నాయక రత్నము ధ్యానించి
                 జూడంగ మానస చోదితములె
          పీతాంబరము గట్టి సీతాపతీ మనో
                 నాధుడై శ్రీ రామ నవ్య శోభ

గీ      స్పర్సతోప్రేమ అనుభవ సారమంత 
        చిత్తము చిరునవ్వు లతోను చూపి నావు 
        నాయికకు కన్నుల వసంత నెగడ చూపి 
        ఉత్తమము తెల్పిచును మహా ఉత్త ముడులె ......10
--(())--

సీ     రఘువంశ తిలకుండు రాముండు నా తండ్రి 
               భూదేవి పుత్రిక నాదు తల్లి 
       బ్రహ్మ సఖుండైన పావని నా బ్రాత 
               వైరాగ్య మే ప్రేమ పడతి నాకు 
       ఇంద్రియనిగ్రహ0బిమ్ముగా సాధించి  
               నట్టి విశ్వామిత్రు డనఘ మూర్తి   
       యా విభీషుడాదియగు, సజ్జనంబులె 
              మిత్రుల జ్ఞానంబె మేటి హితుడు

గీ      విమల రామపాదభక్తియె వెతలు మాన్పి 
        యోగమును గూర్చి, యిచ్చు సంయోగ సుఖము
         కోరికల దీర్చు వైకుంఠ రామ 
        ప్రాంజలి నొనర్తు రామ నీపాదములకు. ....... 11
                    --(())--

సీ   జీవితాన్ని చదువుతుండె జీవమూర్తి
            పరిమళించె మనసు పగలు రాత్రి
      విరబూచి నవ్వెడి వలపుల పువ్వులు
           అనురాగము శిఖరం ఎక్కించే నవని యందు
      బ్రమరము‌ వల్లెనె భ్రాంతి తొలచె
           హిమవర్ష మువలెను హాయి గొలిపి
      రాగాల హృదయాలు రసరమ్య మయ్యేను
           రఘరామ చంద్రుని రమ్య లీల

గీ.    దోసిలి తో పూజ దోపిడిగను
       హృదయ కమలమ్ము విడిపించి హాయి గొలుపు
       తెలియ కండగా చేసేవి తప్పు లన్ని
       ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు......... 12
              --(())--

సీతాపతీ పద్య కావ్యము ( 8)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ      
        
సీ      నా నీడ లెప్పుడు నాగతం తెలుపును
               రాగము గీతము రమ్య మగును
          రేపు ఈతనువు మరొకటగుచు నె
               మలుపులె కదలిక మోనమవ్వు
         నా గమ్యం ఏదైన నడిపించు రాముడే
               తరతరాల చరితం తీర మయ్యె
         నేనంటు తెలుపును నటనలో బతుకులు
                సవ్వడి నడకల్ని సాగు రామ

గీ   రామ నీరూపములు కొల్చు నవని జనులు
      రామ  యైశ్వర్య ములు పంచు నవని యందు
      రామ నీదు కృపయు సర్వ నవని యెంత
       ప్రాంజలి నొనర్తు మాత నీపాదములకు.......13

--(())--

సీ     ప్రేమను పంచి యు ప్రేమను  పొందేట్లు
               అంతయు తెల్ఆపేటి  ఆత్మ రామ
        ఆప్యాయత తొభంధ ఆతృత మును చూపి
              ఆనందం యైశ్వర్య ఆది దేవ
       ప్రేమ తపస్సుయే ప్రేమను బతికించు
              త్రిప్తిని కలిగించు తృప్తి రామ
      శబరిలా బతికియు శపదమ్ము చేసియు
              కాలమే బతుకును కామ్య పరచు 
   
గీ     రామ తారక మంత్రమై రక్తి తోడ
       జెలగె నీముద్దు నామంబు చిత్త శుద్ధి
       నిన్ను సేవించు భక్తులు నెమ్మి యుంద్రు  
      ప్రాంజలి నొనర్తు రామనీ పాదములకు...  ... 14
                    --(())==

సీ     జగతపుత్రీ నాధ జగధీశ్వరుడ వీవు
               జనుల కానందంబు సల్పు దీవు
        సకల జంతువులకు జననమూలం బీవు   
               జనులభాధ హరించు స్వామి వీవు
        జనన మాది, మునుల సఖుడై వెలసి తీవు 
               శాశ్వతుండవు నీవు సరసుడీవు 
        భార్గవ గర్వంబు బరిహరించితి వీవు 
               జాజ్వల్యమైన తే జస్వి వీవు 
     
గీ      సర్వ సౌందర్య మ్ముకలిగి సహజవీవు 
        నిత్య భక్తివిశ్వాసపు నిగమ వీవు    
        ధర్మ నిర్వాహణము చేయు ధైర్య రామ 
        ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు  .... ..... . 15 

                   --(())--
 
సీతాపతీ పద్య కావ్యము 
సీతా స్వయంవరం ముందు సీతా విలాపం 

సద్దుచేయకు మన సుందరాంగుడు వాడు 
      మచ్చలే నట్టితో  ముచ్చ టించె 
మట్టసంగా ఉండి  మహిమను చూపాడు 
      మనసును దోచేటి మగశిరోడు 
సిగలోకి పూలను సక్కగా పెట్తాడు 
        ఎకశిక చేయకే ఏలు వాడు    
ఎదురుచూ సినరాడు ఎదలోన ఉన్నోడు 
      ఎంతచక్కనివాడు ఎదలొ రామ 

వెన్న లాంతాను కరిగేటి వేగుచుక్క 
నిండు మనసుతో దీవించు నీటు కాడు 
కడిగిన ముత్తెము లాగున్న కలలొ రామ 
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు   .... ... 16 
       
--(())--               

సీ     నిండుమనసుతోను నిర్మల హృదయుడు  
             నిజమును తెల్పిన నీటు కాడు 
       మదిలోన మదనుడు మన్నికై ఉన్నాడు 
             ఉలకడు పలకుడు ఊహ వాడు 
      అబ్న అబ్బ ఎలా‌ను  సెప్పను చరితుడు  
             కలలోకి వచ్చినే కావ్య వరుడు 
     పదిలంగ ఉండునే పక్కచూపులు లేవు 
        పలకరింపు దయచూపు  పలుకు వాడు  

గీ    అల్ల రెంత చేసినవాడు చక్కనోడు
      మరచి నిదిరించి నా వచ్చు కళల వాడు 
      సకలమున  కళాప్రియుడుగా సేవకుడులె 
      ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు  ..... ..... 17

--(())--   

సీ     పరువాల నా మది  పలకను నిమిరాడు 
        గదిలోకి వచ్చియు  కబురు చెప్పె 

       అల్లరెన్తొను చేసి నమ్మ పలుకు వాడు 
       నయనాల చూపుల లోన వాడు 

      ఊరించు కనులతో ఉసి గొలుపేవాడు 
      ఉలకని పలుకని ఉత్తముండు 

      మనసున్న మగధీర మాన వోత్తముడులే 
      మగువమనసు మహనీయు డతఁడు     

గీ    కరుణ గల్గిన శ్రీరామ కావుమయ్య  
      రక్తి ధ్యానంతు లోకేశ్వరా ప్రణామ 
      మర్పణముసేతు భజయింతు నాశ్రయింతు 
      రక్షసేయుము శ్రీరఘురామచంద్ర ..... ....... 18

                   --(())--
సీతాపతీ పద్య కావ్యము (10)
      సీతాదేవి పలుకులకు రామ పలుకు 
సీ    మనమధ్య దూరమ్ము మనసుకు లేదులే 
       మరుమల్లె లాగున్న మగువ వీవు 
       దూరము గాఉన్న దగ్గర ఉన్నట్లె 
       నీశ్వాస నాకులే నడుమ లేరు 
      సామీప్య మున్నట్లు సౌందర్య దేవత 
     మగువా నినునె మర్పు మాయ లేదు  
     దగ్గర దూరము దరిదాపు లేదులే 
     చామంతి పూబంతి చలువ చూపు 
గీ   చిరునగవులనే మరువలే చింత వలదు 
     మగవ తో మను వాడగా మనససు నిచ్చె      
     మధురిమలను నే పలికెద మనసు పెట్టు 
     సీత నీకొరకునె వేచి శీఘ్ర మైతి  ..............19
--(())--
సీ    వైదేహి లోచన పద్మంబుల కినుండు 
       మనసు నెరిగినట్టి మోము వాడు 
       సీత మానసమున బ్రీతి నుండెడివాడు 
       శ్రీకరుండై  సదా చెలగువాడు 
       జానకి మోహింప జాలు సొబగు కాడు
       దయచిల్కు నట్టి నేత్రముల వాడు 
       సీతామహాదేవి చెక్కిళ్ళ తర్పణ 
       ముందువెలింగెడి అందగాడు
గీ   శ్రీకర శుభకర చరణ లేలుచున్న 
     మినివర శృతి నయన మేలుకొమ్మువయ్య 
     మనసు మాయను తెంచియు ఆదుకొమ్ము 
    ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు............20
        --(())--
సీ       చల్లని వెన్నెల లో చిలక పలుకు
          మదిలోన పులకరింత గను జరిగె
         మధురపరిమళపు మైకము లాగునే
         మోగలి రేకుల మత్తు గాలి
         విచ్చిన విరజాజి పూల పరిమళాలు
         రాముని చేరియు రసమయముగు
         మంచును తడిసిన మేలిన ముత్యమై
          విరిసిన జానకి వాక్కు జేరె

 గీ     కాల నిత్యము ప్రేమల జ్ణాప కాలు
         శ్వాసకు శ్వాస వై మది శోభ వెలుగు
        హృదయ సీమలో తలపుల హాయి వెలుగు
         ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు..........21
--(())+-


సీతాపతీ  పద్య కావ్యము 
      రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
సీ    విత్తనం చేరింది వత్తుకొని యు హత్తు 
       పుడమి కోరిక వేయి పడగలయ్యె 
      లోకాన్ని చూడాలి లోలక మనుసు యై 
      గూటిలో మెదిలేటి గువ్వ మనసు 
     తాపత్రయమ్ము కదా తాడూబొంగరములా
     మోడైన మానులో ముద్దు లొలుకు 
     రెక్కలు కట్టియు రెపరెప లాడాలి . 
     నయనాల మెరుపులు నమ్మి ఉంచు 

గీ   జగతి లో వెత కాలనీ జాము కలుగు  
     ఉదయ వెలుగులు పంచాలి హృదయమంత 
     సర్వ విజ్ఞాన మువలన స్థితియు గతియు 
     ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు  .. ... .22 
     --(())--
సీ    నింగిలో చుక్కలు నేలమీదను చిక్కు 
      మబ్సులన్నీతర్మి మాయ చేరు 
      గాలులన్నీఊసు గాయము చేయును 
      కలల కలవరింపు కామ్య మవ్వు 
     కంటినిద్రయు రాదు కామ్యభావమ్ముగా 
     కటికనేల సెగలు కమ్ముచుండు   
    ఆనంద భావము అందుకొ నుట మార్పు 
    ఆకురాయిల హత్తు అవని పిలుపు  
గీ    
గీ      వయసు ఉన్నప్పుడు అనుభవం విమల చరిత
         మనసు అనుభవం వచ్చాక మధుర చేరితే
         గ్రహణ ములు వచ్చు అయినను గాధ తెలిపె
         ప్రాంజలి నొనర్తు రామ నీపాదములకు   .... ... 23
ऊँ!
----
"దక్షప్రజాపతిదర్పమునణఁచిన
      సర్వజ్ఞ..గురురూప !  సాటి లేరు
తాపసితనయుని తనుమానములుఁగాచి
      దీర్ఘాయువునొసంగు తీక్ష్ణరూప !
చిఱుతొండనంబునిచిద్భక్తినెఱుఁగుచు
      కైవల్యమిచ్చిన కామ్యదాత !
పార్వతీతపమునుపాండితినిఁదెలిసి
      సగమేనునిచ్చిన సాంబ ! దేవ !
గీ.
--
గుహ్యసాధననేర్వని గుణనిధికిని
మోక్షమిచ్చితివీవెగ ముదముతోడ
భక్తతరుకల్ప..కరుణించు..భక్తవశ్య !
జోతలయ్య..సదాశివ ! జోగిరాజ !!! "          .... 24
------------

సీతాపతీ పద్యకావ్యము 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
సీసము
శ్రీ రామ రూపమ్ము శ్రీ సీత వరముగా
ఆనంద సౌఖ్యము ఆది పరము
శ్రీ ప్రేమ మాహాత్మ్య శ్రీ మతి కరుణయే
మాపైన చూపించి మదిని తెల్పె
శ్రీ శక్తి నామమ్ము రీతిగా కీర్తింతు
శ్రీ కర శుభకర సీఘ్ర మముగ
శ్రీ యుక్తి మనసుయే శ్రీ ముక్తి పరముగా
శ్రీ రామ ప్రార్ధింతు శక్తి మేర
తేటగీతి
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు
రక్ష చేయుము మాయందు రమ్య మగును
కనికరముజూపు ఎప్పుడూ కలత తొలగు
కరములను మోడ్చి కోరెద కోర్కె తీర్చు.............25
...........
సీసము 
విప్రప్రియుండను పేరు గొన్నావు 
కరుణా కరుండయి గ్రాలినావు 
ధర్మస్వరూపుడై దానవ నాశన   
సీతకుభర్త యై చెలిగినావు
మాయామృగంబును మర్ధించినాడవు
మహిమాన్వితము చూపి మనసు పంచె 
కోరుకున్నారికీ కోరినంత సుఖము 
కోటివిద్యుత్కాంతి కూడినావు   
తేటగీతి 
ధరణి రఘుకుల శ్రేష్టుండై ధరిణినావు 
ధర్మ పరిపాలన తరుణా దిత్యు డుగను 
ధర్మ పరిరక్షణ ను చేయు ధర్మ పరుడు 
రామచంద్ర రక్షింపుమా రాఘవేశ        ....... 26
--(())--
ऊँ! శ్రీ రాం
----
"సీ.
----
శ్రీభవ్యరూపమ్ము శ్రీభూతి వరముగ
     భావించెదనునేను భాస్కరాక్ష !
శ్రీదివ్యమాహాత్మ్య శీతల కరుణను
     మాపైన సారించు మరుని తండ్రి !
శ్రీశ్రావ్య నామమ్ము రీతిగా కీర్తింతు
    క్షేమశమనమిచ్చు  సిరులకొఱకు
శ్రీముక్తివరదుని శ్రీశుని ప్రార్థింతు
నెపుడును తుష్టిని యిడుమనుటకు
గీ.
--
అబ్జనాభ !  కమలనేత్ర ! యాగకర్త !
కమలహృదయస్థ ! మోహన గానలోల !
కనికరముఁజూపు మాయందు ఫణిసుతల్ప !
కరములనుమోడ్చి వేడెద సురవిశేష !!! "
------------.......,....... 27

ఇది రోజువారీ ప్రాంజలి ప్రభ పత్రిక (4)
సీతాపతీ పద్యకావ్యము 
సీసము
ధనమున్న లేకున్నా దరఖాస్తు లేకున్నా
    మనసున్న  మనిషి లో మమత పెరుగు
వద్దన్న అవునన్న విధ్యతో వినయమ్ము
    విభజన బంధము వద్దె వద్దు
స్నేహము వల్లనే చింతలు తొలగును
    దానము వల్లనే దరిని చేరు
రాముని నమ్మినా రమ్యమైన మనసు
    ఆంజనేయుని నమ్ము ధైర్య మోచ్చు
తల్లి దండ్రియు  నాకు ధరణి లోన  రామ 
బ్రాత నాకు,ధరణి జాత విభుడు రామ  
సఖుడు నాకు రామ చంద్రుండు సర్వ మవ్వు  
మరయ రాముండతని నాశ్ర యింతు నేను ...28
*****

సీసము 
కష్టముల్ ఇష్టముల్ కావులే శాశ్వతం 
      బులు నీటిబుడగలే - బురద పామె 
కన్నీళ్లు వేవిళ్లు కలకాల ముండవు 
    నవ్వుళ్లు పువ్వుళ్ళు నడచు చుండు 
రోగముల్ బంధముల్ రాగముల్ వెళ్లెను 
    చీకటి వెల్గులా  చింత మార్చు 
ధైర్యమ్ము మరవకు ధర్మమ్ము వదలకు 
    దానమ్ము చేయుము ధరణి యందు 

తేటగీతి 
అమృత పలుకులు పల్కెను ఆదిదేవ 
అరమరికలులేని కళలు ఆదు కొనును 
అప్పులేని బతుకు జీవి హాయి గాను 
దాశరధి ధ్యాన మొనరింతు తప్పకెపుడు .... 29 
==))((--

ఇది ప్రాంజలి ప్రభ రోజువారీ పత్రిక (11)
సీతాపతీ పద్య కావ్యము 

సీసము 
భూసుతతో కూడి పాలుపోదు రాముండు 
         నా హృదయమున జెన్నారుగాత  
తమ్ములతోగూడి దనరెడి రాముండు 
         నా నమస్సు గొను పూర్ణంబుగాఁగఁ 
మనసున వాక్కున మత్కాయమున నేను 
         చేసిన కర్మలు శ్రీర ఘాత్త  
మునకు నర్పించెద ననఘు పాదంబుల
         కాంజలి ఘటియించి యధిక భక్తి

తేటగీతి 
పాపముల నుండి రక్షింప ప్రార్ధనంబు 
వీర శ్రీరామ రక్షింపు శ్రీ రమేశ
నిన్నె నమ్మితి శరణమ్ము నమ్మినోడ్ని 
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు  .... ...... 30

--())-- 

సీసము 

రఘువంశరాజుల రత్నంబు, రాజీవ
     నేత్రుండు బలపూర్ణ నాదు గురువు 
నిర్మలాత్ముడుగను నిఖిలజగంబున
     విశ్వమంతయును విఖ్యాత పురుష 
రాఘవేశ్వరుడు శ్రీ రాకేందుబింబాన 
    నుండు రఘుకులోత్తముండు ధరణి 
రాఘవేంద్ర దయాకర రఘువంశ తిలక 
   నిన్నేను ప్రార్ధించి  నమ్మి ఉన్న 

మం. ద్వి .

కౌసల్య వరపుత్ర - కాకుత్ స్ధ వంశ్య 
భుసుతారంజన  - భువనైక వీర 
నీరదసమగాత్ర  - నిరుపమాకర 
ధర్మకార్యసక్త  -  దానవ హంత     .... ....... ... 31
****

సీసము
మనిషిగా పుట్టిన మహనీయడే రామ 
    మానవత్వం మ్మును మనసు నేర్చు
ప్రేమతో జగతినే పాలించే శ్రీ రామ
      కాలము మారినా కధలు బతుకు
మావి చిగురు మల్లె మహిమను చూపియు
     చిరునవ్వుల రామ తనువంత సీతకే
అనువైన ఆదర్శ భావమ్ము తెలిపిన
      ఆదిత్యుని వెలుగు అంది పుచ్చు

తేటగీతి

పాడి పంటలు మునులకు పాడి ఆవు
మునుల యాగాలు రక్షగా మనసు నిచ్చు
చిన్న పెద్దాఅందరి లోను తపము తెల్పి
ప్రాంజలి నొనర్తు రామ నీ  పాదములకు
--(())+-.......32

ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక (15)
సీతా పతీ పద్యకావ్యము

సీసము
శేషతల్పసుఖుడై శోభ పెంపొందంగ
         కాలాత్మకపరమై కరుణ రామ
చండకిరణములై జేతిలో ధరియించి
        శ్రీపరాత్పర రామ సుఖము పంచు
కౌసల్యాపుత్రుడై కైకేయి కన్నడై
       విశ్వామిత్రుని శిషై వినయ రామ
సురముని వరగుణా సౌఖ్యమ్ము  పొందేటి
        మిధిలాపురజనుల మోద రామ

తేటగీతి
ఘోర తాటక ఘాతక ఘనత రామ
ఘోర మారీచా దనిపాత ఘనత రామ
ఘోర రాక్షస సంహార ఘనత రామ
ప్రాంజలి నోనర్తు రామ నీ పాదములకు   .... 33
--(())--

సీసము 
అనుభూతు లన్నియు అలికాక బంధాన్ని 
     పెనవేసె లక్ష్యంగా ప్రీతి రామ  
పెనుమాయ కమ్మిన పారదోలే నులే  
      మానవ సంభంద మదిలొ బలిమి   
ఎన్నడూ కరగని ఏది అనక ప్రేమ  
      సుఖముల వెలుగులు సౌఖ్య చెలిమి 
నవ్వుల తో మాట  నవనీత మల్లెను  
      నెరవేర్చు కధలను నేర్పు రామ    

తేటగీత 
ధరణిఁ ధేనువు పితుకంగ దలచితేని 
జనుల బోషింపు మధిప వత్సముల మాడ్కి 
జనులు పోషింప బడుచుండ జగతి కల్ప 
లత తెఱంగున సకల ఫలంబు లొసఁగు   ..... ...... 34
--(())--

సీస పద్యము 
పలుకుల రాగము ప్రేరణ మనసుకు
      శృతికల్సి ఉండెటి శక్తి నివ్వు  
వలపుల భావన వెయ్యెళ్ల వెన్నెల
      మాకును  అందింప మౌన రామ 
తలపుల ప్రేమను తలచియు పొందియు 
      సౌఖ్యము కల్పించు శోభ రామ  
తలుపులు నీకోసం తెరచియు ఉంచాను  
      నాహృద యములోన నిన్నె రామ     

తేటగీత 
బువ్వ తిన్నాక ఆకలి తీరు రామ  
నీళ్లు తాగాక దాహము తీరు రామ  
గాలి పీల్చాక ఆరోగ్య గాడి రామ  
గూడు చేరాక శాంతితొ గొడుగు రామ    ...... .... 35
--(())--

సీసము.
కైలాస గిరితతుల్-కరిగె వేదాల నా
       దాలతో,పులకించ-ధరణి మాత..!
గంగానదీ తరం-గమ్ములు పొరలెత్తి
       ఉపనిషద్ధారలై -ఉబికి వచ్చె..!
వింధ్యాటవీ మధ్య-వినిపించె సుస్వర
       ధార్మిక గానము-ధర్మ నీతి..!
గోదావరీ నది-కూర్మితో గడిగె య
    గస్త్యుని పాదాలు -గౌరవించి..!
తే.గీ॥
వేద మంత్రాలు వెలసిన- వేదభూమి..!
ధర్మ సూత్రాలు నడయాడు-ధర్మభూమి..!
కర్మ వీరులు నడచిన-కర్మభూమి..!
వన్నె తరగని కీర్తి..నా-భరతభూమి..!  ...... ..... 36

ऊँ!
----
"సీ.
----
తరికిట తరికిట తత్తళాఙ్ తరికిట
      తద్ధితై తత్తళాఙ్ 
తద్ధి తకిట
ధిత్తళాఙ్ ధిత్తళాఙ్ దిద్ధితై  ధిత్తళాఙ్
      తద్ధితై తత్తళాఙ్ 
తకిట యనుచు
నందీశ భృంగులు నట్టువాంగముఁజేయ
        ఆదిదంపతులంత నాడిపాడ
గణములునానందగానరసాలతో
       పారవశ్యముతోడఁ
జేరసాగ
సురగణమంతయు సూక్తమంత్రనుతుల
     స్తుతియింతురనిశము తుష్టిమదిని
జగదీశ - జగదంబ శక్తిప్రదాతలు
       విశ్వకళ్యాణులు వేడ్కఁగొలుప 
       

గీ.( పంచపాది )
--
భక్తులెల్లరు వీక్షింత్రు త్యక్తచేష్టు
లగుచు శ్రద్ధగా ముదమొంద్రు రాగరహిత
కేవలత్వమొందురుగద శైవులుగను !
అట్టి పితరులకంజలిదిట్టమతిని
చేయుదుసభక్తివినుతుల     శివ- శివలకు !!! " 37


 సీ. వనమంజరుల మధ్య - వనమయూరములాడె
ఘననినాదమ్ములన్ - వినుచు వేగ
మత్తేభములఁ జూచి - మత్తకోకిల పాడె
మత్తహంసిని యాడె - మత్త మగుచు
తరళ నేత్రమ్ములన్ - హరిణీగణమ్ములు
తరుపదమ్ములఁ బర్వెఁ - ద్వరితగతుల
కళికలు విరబూయ - మలయజమ్ముల తావి
లలితలలితముగా - విలసితమయె

తే. వసుమతి మనోజ్ఞమై యుండె - కుసుమవతిగ
భామినీషట్పదుల్ మ్రోఁగెఁ - గామలతల
తేటగీతుల బలు నింపెఁ - దేఁటిబోఁటి
మదనమున త్రాఁగిరి మదిర - ముదిత లెల్ల   ..... 38

--(()))--


సీతాపతీ పద్య కావ్యము
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

కరుణాసముద్రడు కరుణామయుడు గాను
కారుణ్య బంధమ్ము కావ్య పరుడు

ఆనంద నిలయుడు ఆత్రత్రాణ పరుడు
కొలిచిన వారిలో కోర్కె తీర్చు

భక్త వత్సలుడు గా భాగ్యప్రధాతుడు
భవబంధనహరుడు భవ్య భవుడు

కాలాన్ని బట్టి యే కామ్యప్రధాతుడు
సర్వరక్షకపరుడు రాము డనియు


తేటగీతి 
మనసు పలికేటి చూపేటి మాధుర్యడులె
చరిత లలిత సంగీతపు తురుము వేసి
సహజ సిద్ధమైన నటుడు ఉదయ భాను
ప్రాంజలి నొనర్తు రామ్ నీ పాదముల కు   .....   39

***((***))***
పరిపూర్ణత కొరకు జాగరూకత 

(రామరాజ్యము )

సీసము 

పరిశుద్ధ జీవన పరమపావనమగు 
మర్మము లేనిది మనసు నిజము  

నిర్మల హృదయము నిలకడ చూపును   
జిజ్ఞాస హృదయము చిత్త మొవ్వు   

మాటుపడని అతీం ద్రియముయే జీవము    
సోదర భావము సహనమవ్వు 

సలహాల నియమము స్వీకరించుటకును
సంసిద్ధ త కలిగి యుండు రామ 

తేటగీతి 

దేశికుని యెడ  ధర్మానుష్టాన ముండు   
బుద్ధి విశ్వాస నీయమ్ము నుంచి 
సత్యసూత్రములను పంచి యుండె  
వ్యక్తిగతముగా తనకు తానే సహాయ 

--(())--                                     ............................   40

సీసము 
 
అన్యాయమును దుష్టబుద్ధిని తరిమియు 
ధీరుడుగాను విధేయుడగుట, 

సిద్ధాంతములనువశీకరములగాను     
నిర్భీతిగా నుద్ఘాటించుచుండె 

తెగువతో కాపాడి గుప్తవిద్య లనేవి  
నేర్పి మానవుని పురోభివృద్ధి

పరిపూర్ణతల యెడ పరమావిధినిచూపి    
జనుల సేవయు చేయు జపత రామ 

తేటగీతి 
జాగరూకత కలిగి యుండుటయు రామ 
మానవ పురోభివృద్ధిగా మనసు పంచు 
ప్రజల రక్షణ ధ్యేయంగ పాకులాడు 
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు   

--(())--  ...... ..... 41 


మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు
సీతాపతీ పద్యకావ్యము

సీసము

సహజీవనమ్ముయే సంతోష సమరమ్ము
భార్యాభర్తలు కల్సి భాధ్య తుంచు
కోప తాపము తోను కోర్కల మధ్యన
మోహ పరవశాన మోము నుంచు
భేష జాలుయె లేక భారమ్మును భరించి
సరిగమ పదనిస సంబరమ్ము
కాల మార్పులు బట్టి కనికరం చూపియు
జానకి రాములై తనువు పంచె

తేటగీతి

మేను కలసియు మనసుతో ముద్దు చేసి
నిత్య అనురాగ అనురక్తి అనుభవమ్ము
కలలు తీర్చేటి పురుషుడు కామ్య రామ
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు

--(())--     ..... ..... .... 42

సీసము

శ్రీ రామ ధీరయా శ్రీ సౌర్య దేవాయ
నమయంచు మ్రొక్కెద నమ్మి నోన్ని
జానకీ పతివియు చైతన్య రాజు వి
మోహనా పరుడవి మరువ లేను
పాటింతు నిష్ఠగా పరమా విధివలనే
నిత్య పారాయణ నియమ విధిని
శ్రీ రామ భక్తుడై శ్రీ ధర్మం ప్రాప్తికై
రామ నా మస్మృతి రాజ్య మేలు

తేటగీతి
సకల జనుల లో భక్తిగా సకల వరదు
అర్చనాదిప్రార్ధనలను సలిపె
పూజసేయుదు నిష్టగా పుడమి నందు
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు

--(())--   ..... ...... ..... 43
సీసము 

లక్ష్మ ణా మనసున లాశ్యము లాడక
      మనుషుల అలికిడి మెప్పు పొందు

ప్రేమతత్వ ముతోను పరిణతి చెందెను
    అధ్యక్షుడు పలుకు ఆదరించు

లక్ష్మణా మనసుయే లాహిరి లాహిరి 
    సర్వము మాయయు సతతముగను 

మోహము లోభము మోదము క్రోధము 
   యంతయు మాయయు యాలకించు 

తేటగీతి 
కార్య దక్షాపరా విధి కువల యేశ 
సర్వ మాయార్ద భావమ్ము సకలమందు 
నిర్వి రామ కృషియు చేయు నిరత మందు 
ఆర్య లక్ష్మణా ఇదియేను  ప్రేమ తృప్తి 

--(())--  ... .... .... 44
  
సీతాపతీ పద్యకావ్యము 
రామ వాక్కు 

సీసము 
నిశ్శబ్ధ తేజస్సు నిర్మల మయమగు 
జీవితముయు నిగూఢాంధకరము 

విశ్వమ్ము లో దాగి విశ్వభావము పంచు 
శబ్ధార్ధ లబ్ధమ్ము సామ్య మవ్వు 

శబ్దమ్ము కళల నిశ్శబ్దమ్ము మనసుయే 
విశ్వాన్ని తప్పదు  వీక్షణమ్ము   

నిత్యము బతుకు అనిత్యము తెలుసుకో 
లక్ష్మణా జీవిత లక్ష్య మిదియె
  
తేటగీతి 
దిక్కులన్నియు తమతమ దిక్కు చూపు 
ప్రకృతి విధి యంత తెల్పుచూ పగలు రేయి 
సూర్య కిరణములు తిరుగి శుబ్రపరచు 
కాలమేదైన కర్తవ్య దీక్ష వుంచు               .............  45

--(())--

సీసము 

క్షణము ఉత్కంఠగా  కానుక అవ్వుచూ 
నిత్యానందము వచ్చు నిలకడగను 

అక్కున చేరిన అలకలు తీర్చియు 
శిఖరాన్ని ఎక్కుచు శుభము తెల్పు 

అగ్నిశిఖలు ఉండు అతలాకుతలముగా 
అయినను ఓర్పుగా ఆనతించు 

నిత్య సత్యమ్ముయే నిన్నునూ గెలిపించు 
లక్ష్మణా జీవిత లక్ష్య మిదియె

తేటగీతి 
తెలియనిది తెల్పు, తెల్సింది తెల్ప గలవు 
అవనినంతట సుఖమును అభయ మిమ్ము 
ఆద మరిచేటి జనులను ఆదుకొనుము 
ఆత్మ బంధమ్ము జను లాత్మ గుండు  ..... ...... 46

--(())--

సీసము 

జలధి తరంగమై, గాలి కెరటములై  
సర్వము వాప్తియై సత్యమగును 

బూడిద కుప్పల భూగోళ మంతయు
బురబురా పొంగినా బాధ వలదు 

విద్యుక్త ధర్మమున్ వినయమ్ము పాటించి
భావప్రకంపన పదిలపరచు   

కాలమ్ము అవధియే కర్మాగా జరుగును 
లక్ష్మణా జీవిత లక్ష్య మిదియె
     
సంకుచితమైన మనసును చూపకుండు 
సతతము సమయ పాలన సాధనివ్వు 
కరుణ సహనమ్ము చూపుము కార్యమందు  
కావ్యమంతయు కదులును కలల ముందు   ..... ...... 47

--(())--

"సీ.
-----
శ్రీహర్ష వల్లిస్థ శ్రీసూర్యదేవాయ
        నమయంచు మ్రొక్కెద నళినపూల
ఛాయోష పద్మినీ జాయలకుపతియౌ
        మార్తాండునెప్పుడు మరువకుండ
పాటింతు శ్రద్ధగా పౌరాణికంబగు
         నిత్య పారాయణ నియమ విధిని
శ్రీపతంజలిదేవు శ్రీదయ ప్రాప్తికై
        సూర్యనమస్కృతి
సూక్తనుతుల
--
సకల కరణాల భక్తిగా సకలవరదు
అర్చనాది మంత్రయాగవిధుల
పూజసేయుదు తరణికి పూష్ణు రవికి
కంజబంధునరుణుకంజలింతు !!! "   ... .... 48

--(())--

సీసము 

నీతిని నమ్మియు న్యాయమ్ము గానుండి
బ్రతికియు బలముతో  భాగ్య మిచ్చు 
ధర్మము దప్పక దారిద్రమ్మును మాపె
విలువైన బ్రతుకున విశ్వ మందు
స్వార్ధపు కళలను చూపక ఉండియు
సత్యము తప్పక సాదు జీవి
ఉన్నత మంత్రము ఉన్నతమ్ముగ తెల్పు 
లక్ష్మణా జీవిత లక్ష్య మిదియె

ఉదయ ఉషోదయ ఊహ పంచె

కాల మాయను చూపియు కాపు గాచె
కర్మ పక్వత పదిలమ్ము కళల పంచె
కామితార్ధపు అర్ధమ్ము గడువు తీర్చె
బతుకు సారం బోధించిన జ్ఞానమవ్వు  .... ...... ... 49
--(())--

సీసము 
సూర్య కిరణముల స్థతిని పంచె జగతి
నిత్య వెలుగు లను నీడ నిచ్చు 
ధర్మచరితమార్గ దారిద్ర్యము ను దృంచి
హరితవిప్లవమునే హాయి జూపి
సర్వము తెలిసియు స్ధానములను పెంచి
నిరతము నిలకడైన కల రాజు
ధైర్యమ్ము చెప్పియు దానము చేయుము 
లక్ష్మణా జీవిత లక్ష్య మిదియె

మరువలేని మనసు మాకు పంచె కవి ఆర్యులు

కాల మంతయు కనికర కామ్య మవ్వు
కాల కెరటాలు ఆగెను కలల మల్లె
కాల యోగము కర్మయు కధలు మల్లె
కాల మేఘము వర్షము కరిగి పోయె                       .... ...  50
--(())--


సీసము 

నా తండ్రి, నా నిధి  నా పుణ్య రూపుండు 
నా తప స్సిద్ధియు నాదు గురువు 
నా ప్రాణ వాయువు, నా ధ్యాన రూపుండు 
నా పరమాత్మయు, నా సమస్త 
కర్మల పుణ్యంబు, కారుణ్య వార్ధి, నా 
బహుబంధు రూపుండు ప్రాణములకు 
నాధారభూతుండ నై. యనుగ్రహము, నా 
యందు జూపెడి, మరమాత్ముడరయ  

తేటగీత 
నాదు నేలిక నా సొఖ్య మాదరమున  
నాదు మనసుయే అర్పించె మాదరమున 
సేవ సలిపెద,  నా తపస్సిద్ధి కొరకు 
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు .......  ........  49

--(())--

సీతాపతీ పద్య కావ్యము 
సీసము 
రామచంద్రోదయ - రమ్యమవ్వును ఇక 
రుద్రాయ నవశక -  రుద్ర మన్య 
నిశ్చయిం చితిని -  నిరతము స్వామిని
నిమ్నహృదయముతో - ను కొలిచేను  
కాలాయ కళలేలు - కనికరం చూపుము  
కధలను మార్చియు - కామ్య దాత 
సంప్రీతిగాతెల్పి  - సతతము మ్రొక్కెద 
సమతుల్యమును ఉంచి - సుఖము నివ్వు 

తరులు చిగురించి తన్మయ - తపన తీర్చు    
కోయిల పులక రించియు  కొత్త వెలుగు 
శార్వరిగడిచి పోయి౦ది - శాఖ లుండె   
క్రొత్త వత్సర మరుదెంచె - కోటి రామ 

--(())--