2, డిసెంబర్ 2019, సోమవారం

🕉🌞🌎🌟🌙🚩

 *_Swamy Vivekananda's wisdom for daily inspiration - *

*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - *


*పారమార్థికతకు, వేదాంతానికి, సంఘనీతికి, సాధుత్వానికి, ప్రియవర్తనకు, ప్రేమకు భారతదేశం మాతృభూమి. అది ఎప్పుడూ సజీవంగా ఉంచాల్సిన భాద్యత మనమీదే ఉంది.*

*_మానవునిలోని దివ్యత్వం_*

*ఈ వేదాంత భావాలు అరణ్యాలకు, గుహలకే పరిమితం కాకుండా అందరి ముంగిట్లోకీ అవి రావాలి. న్యాయవాద వృత్తిలోని వారికి న్యాయమూర్తులకు, ఆధ్యాత్మిక సభా సమూహాలలోనికి, గుడిసెలో నివసించే పేదవాడికి, చేపలు పట్టే బెస్తవారికి, విద్యార్ధి లోకానికి ఈ భావాలు అంది ఆచరణాత్మకం అవ్వాలి. చేపలు పట్టేవాడు తాను ఆత్మనని భావిస్తే ఉత్తమ బెస్తవాడుగా మారతాడు. విద్యార్థి తనను తాను ఆత్మగా భావిస్తే ఉత్తమ విద్యార్థిగా ఎదుగుతాడు. న్యాయవాది తనను ఆత్మగా భావిస్తే ఉత్తమ న్యాయవాదిగా రాణిస్తాడు.*


🕉🌞🌎🌟🌙🚩
అనురాగపు స్వరాలు
(చిన్న కధ)


హలో .. హలో ... అన్నాడు

ఏమండి 
నాకు   ......   నాకు నా శ్రీమతి మీద అనుమానము ఉన్నది
దానికి పరిష్కారము చెప్పాలి మీరు
మీకు ఫోన్ లో మాటలకు ఏమి చెప్పలేను స్వయముగా కలవండి
ఏమండి అంటూ ఒకతను కలిసాడు రామకృష్ణతో
నా భార్య ప్రేమ మరీ అతిగా ఉంటుంది
అసలు ఎలా ఉంటుందో చెప్పవయ్యా


భార్యగా తన విధిగా భర్తను కడుపునిండా మంచి ఆహారము పెట్టాలని, సుఖ పెట్టాలని, నా సలహాలతో వృద్ధిలోకి వచ్చి సంపాదన పెరగాలని, తనను బానిసగా చూడక ప్రేమగా చూడాలని, పుట్టింటి వారిని ఆదరించి గౌరవించాలని, కోరికలన్నీ తనతోటే తీర్చుకోవాలని, వ్యసన పరుడుగా మారి భాద పెట్ట కూడదని, పరుల ముందు కించ పరచకుండా ఉండాలని, సాధింపులు లేకుండా విశ్రాంతి కల్పించాలని, తన మాంగల్యం భంధం సుఖ సౌక్యాలతో ఉండాలని ఆశతో, ఆశయాలతో కోరుకునేది.


నా భార్య ఇంకా


భార్య కడుపు పండాలని, పొదుపు నేర్చుకోవాలని, తనకు బాసటగా నిల్వాలని, తనవారిని ఆదరించి గౌర వించాలని, తనకు ఎదురు తిరిగి మాట్లాడ కూడదని, అందంగా అలంకరించుకొని ఎప్పుడు ఉండాలని, ఎటువంటి కోరికలు కోరుకో కూడదని, తనకుటుంబాన్ని గుర్తించాలని, ఇంటి గుట్టు కాపాడాలని, సంపూర్ణ ఆరోగ్యవతిగా సుఖ పెట్టాలని కోరుకునేవాడు మగవాడనే ధీమాతో ఉండేవాడు భర్త.

భార్య భర్తల మధ్య ఉండాల్సింది ఆకర్షణ, ఎ పరిస్తితిలోను కుడా వికర్షణ అనే భావము మనసులో కూడా రాకూడదు. అని ఎన్నో సలహాలు ఇస్తుంది.



అస్తమించు చున్న సూర్యుడికి తూర్పున ఉదయిస్తానాని నమ్మకం ఉంటుది, అట్లే కష్టాలు ఎప్పుడు ఉండవని సుఖాలు వస్తాయని నమ్మకంతో బ్రతకాలని, అమావాస్యపు చికట్లు తొలగి పున్నమి వెలుగులు వస్తాయని గమనించాలి. ఎన్ని సార్లు  ఓటమిని చూసిన, లోకమంతా వేలెత్తి చూపినా, మనోధైర్యంతో రేపటి యుద్దంలో గెలవాలని బ్రతికి బ్రతికిన్చుకోవాలి ప్రతిఒక్కరు.

అని ఉపన్యాసము ఇస్తుంది.

దీనికి నేను న్యాయము ఎలా చేయాలో తెలియుట లేదు

ఓపిక పట్టాలోయ్ ----    నన్ను చూసి నేర్చుకో 

అవునో  నేను నీకన్నా ఎక్కవ బాధపడుతున్న నేను ఎవ్వరికి  చెప్పుకోలేను, ఇలా నాదగ్గరకొచ్చిన వారిని నాకు  కుదిరితే  ఇస్తా లేదా నా  శ్రీమతికి ఈ కేసుని అపగిస్తా 
 
ఇంతకీ మీకు పిల్లలున్నారా
మాకు పిల్లలు లేరండి మాకు పిల్లలు వద్దని నేను మందులు  వాడుకుంటున్నాను అన్నాడు

ఆ తెలిసింది లోపము భార్యలో లేదు నీలో నే ఉన్నది.

మనలోని దుర్గుణములు తొలగిపోతాయి. మంచి వారితో కలిసి మెలసి తిరగడము వంటికి గంధము పూసుకోవడము వంటిది. శరీరములోని దుర్గంధాన్ని మంచి గంధము పూత యెలా దూరము చెస్తుందో , అలాగే సజ్జన సాంగత్యము మనలోని అవలక్షణాలని దూరము చేస్తుంది."

స్త్రీకి ఎప్పుడు మాతృత్వము పై ఎక్కువ ప్రేమ ఉంటుంది మీకు పిల్లలు పుట్టాక అన్ని సర్దుకుంటాయి అది తెలుసుకో

ఒకరి భావాలు ఒకరు అర్ధం చేసుకొని జీవిన్చటమే ఆలూమగల - అనురాగపు స్వరాలు

--(())--



*నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు* ఇది తాళ్ళపాక అన్నమాచార్య కీర్తన. పాడినవారు:- శ్రీ మతి నందినీ రావ్ గారు.
రాగం : హిందోళం

నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు
సత్యాత్ముడై యుండి సత్యమైతానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మయై యుండు సం-
స్తుత్యుడీ తిరు వేంకటాద్రి విభుడు|| ||నిత్యాత్ముడై యుండి||

యేమూర్తి లోకంబు లెల్ల నేలెడు నాత
డే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాత
డే మూర్తి నిజమోక్ష మియ్యజాలెడు నాత
డే మూర్తి లోకైక హితుడు|| ||నిత్యాత్ముడై యుండి||

యే మూర్తి నిజమూర్తి యేమూర్తి యునుగాడు
యేమూర్తి త్రైమూర్తు లేకమైన యాత
డేమూర్తి సర్వాత్యుడేమూర్తి పరమాత్ము
డామూర్తి తిరు వేంకటాద్రి విభుడు|| ||నిత్యాత్ముడై యుండి||

యేదేవు దేహమున నిన్నియును జన్మించె
నేదేవు దేహమున నిన్నియును నఱగెమరి
యేదేవు విగ్రహంబీ సకల మింతయును
యేదేవు నేత్రంబు లిన చంద్రులు|| ||నిత్యాత్ముడై యుండి||

యేదేవుడీ జీవులన్నింటిలో నుండు
నేదేవు చైతన్య మిన్నిటికి నాధార
మేదేవుడవ్యక్తుడే దేవుడద్వంద్వుం
డాదేవుడీ వేంకటాద్రి విభుడు|| ||నిత్యాత్ముడై యుండి|
--(())_-

ఫోటో వివరణ అందుబాటులో లేదు.
స్త్రీలు ఎందుకు సాష్టాంగ నమస్కారం చేయకూడదో తెలుసా ?

పురుషులు మాత్రమే సాష్టాంగ నమస్కారానికి అర్హులని పేర్కొంది... స్త్రీలు పంచాంగ నమస్కారం చేస్తే చాలని చెప్పబడింది....
సాష్టాంగ ప్రణామము చేయటానికి ఎనిమిది అంశాలు అవసరమౌతాయి. అవి చాతి (రొమ్ము), నుదురు, శబ్దం, మనస్సు,కాస్త ఎడంగా పెట్టి నమస్కార రూపంలో ఉంచిన చేతులు, కళ్ళు, మోకాళ్ళు మరియు పాదాలు.
సాష్టాంగ నమస్కారం చేయునప్పుడు రెండు పాదాల ముందుభాగం మోకాళ్ళు, చాతి మరియు నుదురు మాత్రమే నేలకు ఆనించి ఉంచాలి. అలా సాష్టాంగ పడ్డప్పుడు చేతులను తలభాగం పైకి ఎత్తి నమస్కరిస్తూ దేవతను ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి మంత్రాలను లేక శ్లోకాలను ఉచ్చరిస్తూ, దేవుడి విగ్రహంపై దృష్టిని ఉంచి మనస్సులో దేవుడిని ధ్యానించాలి.
ఈ పద్దతిలో నమస్కారం అనేది స్త్రీల శరీర నిర్మాణానికి తగినట్లు ఉండదు... స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేసేటపుడు, ఉదరం, పాలిండ్లు, కటి ప్రదేశం నేలకు తగిలే అవకాశం ఉంది... అందువలన గర్భస్థ మహిళలకు, పిల్లలకు పాలిచ్చే మహిళలకు చాలా కష్టంగా ఉండి ప్రమాదం సంభవించవచ్చు.. ఆధునిక శాస్త్రం సైతం స్త్రీలు ఇలాటి ప్రణామాలు చేయడం ద్వారా వారి గర్భాశయం స్థానభ్రమంశం అయ్యే అవకాశం ఉందని తెలియజేయడం జరగింది... అందుకని మన పెద్దలు స్త్రీలు మోకాళ్ళపై ఉండి నమస్కారించడమో, ధ్యానించడమో లేక మోకాళ్ళపై ఉండి మోకరిల్లడమో(పంచాంగనమస్కారం) చేస్తే చాలు అని చెప్పారు....
అందుకే మరొక ప్రాణికి జన్మనిచ్చి చైతన్యవంతులను చేయగలిగిన అమ్మలకు ఇందులో వెసులు బాటు కలిగించారు....

--((***))--

త్యాగరాజు కీర్తన --- మోహన - ఆది

రామా! నిను నమ్మినవారము-గామా? సకలలోకాభి → /రామా/
పామరజనదూర! వరగుణ! ఘృణా-పాంగ! శుభాంగ! మునిహృదబ్జభృంగ! /రామా/

1) వాలాయముగాను రాను జా-గేల? సుగుణ! దశరథనృ-
పాలహృదయానందకర! శ్రీ-లోల! పాల వెలయుమిక,
ఫాలలోచన-హృదయాల-యా(ఆ)ప్తజనపాల! కనకమయ-
చేల! ఇక పరాకేల? ఇపుడు మ-మ్మేల నీదు మనసేల రాదు? /రామా/

2) నీవే గతియంటినిగాని, - నే వేరేమి యెరుగను, ముందర
రావే? నీ పదపంకజభక్తి-నీవే? భావజారినుత!
దేవ! నీదు పదసేవ ఫలము, మముఁ - గావునే, పతిత-
పావనా! త్రిదశభావనీయ! మునిజీవనా(అ)నిశముఁ బ్రోవవేల? శ్రీ → /రామా/

3) ధారాధరనిభదేహ! జనా-ధార! దురితౌఘజలదస-
మీర! త్యాగరాజహృదయా-గార! సారహీనసం-
సారమందు వేసారి నిన్ను మన-సార నమ్ముకొననేరలేని నే-
నూరక ఇక విచారమందుటకు - మేరగాదు శ్రీరామ! /రామా/

***



(ఋజుగమన సమ)వేగం (velocity), వేగోధృతి (acceleration) కూడా కనిపించే ఈ కృతిని చాలామందే పాడుతున్నారు.

ఈ కృతిని స్వామి ఒక బృందంతో పాడినట్లు గోచరిస్తోంది పల్లవినుండి మొదటి చరణంవరకూ. తరువాత ఆయనొక్కడే పాడాడనిపిస్తోంది!

“అన్ని లోకాలకూ రంజకుడవైన రామా! మేము నీ భక్తులం కామా? దుష్టులకు అందనంత దూరంలో ఉండేవాడవు, శ్రేష్ఠములలైన గుణాలు కలిగినవాడవు కదా! దయతో నిండిన కడగంటి చూపులతో మమ్ములను అనందింపజేసేవాడవు, అందమైన శరీరావయవాలను కలిగినవాడవు, మునుల హృదయాలనే తామరపూలచుట్టూ తిరిగే తుమ్మెదవు.

ఉన్నపళంగా (గజేంద్రుడికోసం బయలుదేరినట్లుగా) రాకుండా ఎందుకు ఆలస్యంచేస్తున్నావు?

ఓ సుగుణాల రాశీ! మీతండ్రియైన దశరథుడి మనస్సుకు సంతోషం కలుగజేసినవాడా! మావద్ద నెలకొనవయ్యా! శివుడి హృదయమే నీ నెలవు! నీకు కావలసినవారిని రక్షించేవాడవే కదా! ఓ పీతాంబరధారీ! మమ్మల్ని రక్షించడానికి మాత్రం మనసురావడంలేదా? మేమంటే నిర్లక్ష్యమా?

నాకేమీ తెలియదు, నీవే గతి అంటూ కూర్చున్నాను. నా దగ్గరకు రావా? నాకు కావలసినది నీ పాదాలపైన భక్తి మాత్రమే! శివుడిచే పూజించబడే దేవుడవు నీవు. నీ పాదాలను సేవించడంవలన కలిగే ఫలితం మాత్రమే మాకు రక్ష. పతితపావనుడవు, దేవతలెప్పుడూ నిన్నే స్మరిస్తూంటారు కదా! మునులకు జీవనాధారుడవు నీవే!

నిరంతరం మమ్మల్ని రక్షించవలసిందే!

నీలమేఘశ్యామా! జీవాధారా! పాపసమూహాలనే మేఘాలను చెదరగొట్టే వాయువా! నా మనసులో గూడుకట్టుకొన్నవాడా! ఈ చావుపుట్టుకలతో నిండిన ఈ సంసారం అంటే నాకు విసుగు పుట్టింది! నేను పూర్తిగా నిన్ను నమ్ముకోలేని (unable to have implicit faith in You) వాడనైనా, ఇలా బాధపడడం ఇంక నావలనకాదు!”

దశరథుడు నిండు సభలో రాముడిని యువరాజుగా చేసే ప్రసక్తిని తెచ్చినప్పుడు ‘మాటవరసకు’ ప్రజాభిప్రాయాన్ని అడిగాడట - ‘తనకు ఎవరూ అడ్డుచెప్ప’రని తెలిసినా. మరి ఎందుకు అడిగాడంటే - ప్రజలు ముక్తకంఠంతో తన కొడుకుని ‘పొగడి మరీ ఒప్పుకోవడమే’ ఆయన కోరుకొన్నది’ అంటారు కొందరు పౌరాణికులు!

రాముడిని వర్ణించడానికి త్యాగయ్యదగ్గర వెదకుకోవలసిన అవసరం లేనంత సరంజామా ఎప్పుడూ సిద్ధంగానే

ఉంటుందని చెప్పడానికి ఈ కృతి ఒక తార్కాణ.

----------

సకలలోక+అభిరామ! అన్నిలోకాల్లో అందమైనవాడా/లోకాలనూ రంజింజేసేవాడా! ; దూర! - అందుబాటులో ఉండనివాడా!; పామరజనదూర! - ‘దుష్టులకు దూరంగా’ ఉండేవాడా! (పామరులంటే చదువుకోనివాళ్ళని కాదు ఇక్కడ) ; ఘృణా+అపాంగ! - దయతో కూడిన కడగంటి చూపులు కలిగినవాడా!; మునిహృద్+అబ్జ - మునులయొక్క హృదయాలనే తామరపూల ; భృంగ! - (చుట్టూ తిరిగే) తుమ్మెదా!

వాలాయముగా - సిద్ధంగా (readily), positively (‘నిర్బంధం/compulsion’ అనే అర్థం ఇక్కడ పొసగదు!) ; రాను జాగు+ఏల? - రావడానికి ఆలస్యం ఎందుకు? ; శ్రీలోల! - లక్ష్మీదేవియందే మిక్కుటమైన ఆసక్తి గలవాడా! ; ఇక పాల వెలయుము - మాపట్ల నెలకొనుము ;

ఫాలలోచన-హృదయ-ఆలయ! - శివుడి హృదయంలో గూడుకట్టుకొన్నవాడా! ; ఆప్తజనపాల! - దగ్గరివారిని రక్షించేవాడా! ; కనకమయచేల! - పీతాంబరమును కలిగినవాడా! ; పరాకు - నిర్లక్ష్యం ; ముందర రావే - ఎదుటకు రమ్ము ; నీ పదపంకజభక్తిన్+ఈవే? - నీపాదపద్మాలపై భక్తిని ఈయవా? ; భావజ+అరి+నుత! - మన్మథుడికి శత్రువైన శివుడిచేత కీర్తింపబడేవాడా! ; మమున్+కావునే - మమ్మల్ని రక్షిస్తుంది ; పతితపావనా! - పతనంచెందినవాళ్ళను కూడా పవిత్రులుగా చేసేవాడా! ; త్రిదశ-భావనీయ! - దేవతలకు స్మరణీయుడైనవాడా! (అమృతం త్రాగిన కారణంగా దేవతలకు మరణమే ఉండదట! - త్రిదశలు = 3 దశకాలు - 3 × 10 = 30 ఏళ్ళు వాళ్ళకి అంతే, ఇక దాటదని లెక్క) ; మునిజీవనా! - మునులమనస్సులలో గూడుకట్టుకున్నవాడా! ; అనిశము - ఎల్లవేళలా ;

ధారాధరము- మేఘము (నీటిని ధరించేది) ; ధారాధర-నిభ-దేహ! - మబ్బుతో సమమైన రంగును కలిగినవాడా! ; జన+ఆధార! - జీవులకు ఆధారమైనవాడా! ; దురిత+ఓఘ - పాపాలసముదాయం అనే ; జలద-సమీర! - మేఘాలను చెదరగొట్టే వాయువైనవాడా! ; త్యాగరాజహృదయ+ఆగార! - త్యాగరాజుహృదయమే ఉనికిపట్టైనవాడా! ; వేసారి - విసుగెత్తిపోయి ; మనసార నమ్ముకొననేరలేని - పూర్తిగా నమ్మగలగడం అనేది చేతగాని ; మేరగాదు - నా తరం కాదు;

*****

నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ  

మది పులకించును నీ నామము  విన్నా 
మది తపియించును  నీ గానము విన్నా 
మది చలియించును నీ భాష్యము విన్నా  
మది ఉడికించును  నీ కావ్యము విన్నా 

ఇది యని చెప్పను నీ మాటను విన్నా 
బ్రమ అని ఒప్పను నీ సూక్తులు విన్నా 
చిరు నగు మౌముయె నీ పల్కులు విన్నా 
నవ విధ భావము నీ  మాయను విన్నా 

శుభకల కల్గును నీ ధైర్యము విన్నా 
పరిణత చెందును నీ జ్ఞానము విన్నా 
తరుణము మోక్షము నీ విజ్ఞత విన్నా 
సిరియును పెంచును నీ ప్రేమయు ఉన్నా 

కరుణయు కల్గును నీ శ్లోకము విన్నా 
నయనము వన్కును నీ సేవలు విన్నా  
తలవగ ఉండను నీ దానము విన్నా 
జయజయ శ్రీరమ నీ వల్లభ సేవా 

--((*))--
  
సాహితీమిత్రులారా!

ఒక పద్యాన్ని విన్నపుడు అలాంటిది అంతకుమునుపు రాసిన
లేదా విన్న పద్యం గుర్తుకు రావడం సహజం అలా గుర్తుకు వచ్చేట్లు రాస్తే దాన్నే అనుకరణ అనవచ్చు. అలాంటిది ఒకదాన్ని ఇక్కడ చూద్దాం -.

తల్లిదండ్రులఁబ్రోచు తనయుండు తనయుండు

తగు రాజుచే పడ్డ ధరణి ధరణి

అభిమానవతియైన యంగన యంగన

యక్కఱ కొదవిన యర్థ మర్థ

మొరుకాంతఁగోరని పురుషుండు పురుషుండు

వేఁడని యాతని విద్య విద్య
సంగరాంగణమునఁజచ్చుట చచ్చు టు
పవసించి సల్పెడు వ్రతము వ్రతము
ఎదురు తన్నెఱిఁగిన యట్టి యెఱుక యెఱుక
ప్రజలు మెచ్చఁగఁజెప్పెడి పాటి పాటి
పగయె లేకుండ బ్రతికిన బ్రతుకు బ్రతుకు
మనుజ మందార సింగన మంత్రి మాచ


ఈ పద్యం వింటూనే చటుక్కున గుర్తుకు వచ్చే పద్యం

పోతన భాగవతంలోని ఈ పద్యం చూడండి.

కమలాక్షు నర్చించు కరములు కరములు

శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ

సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు

శేషశాయికి మ్రొక్కు శిరము శిరము

విష్ణు నాకర్ణించు వీనులు వీనులు

మధువైరిఁ దవిలిన మనము మనము
భగవంతు పలగొను పదములు పదములు
పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి
దేవదేవునిఁ జింతించు దినము దినము
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు
తండ్రి హరి జేరు మనియెడి తండ్రి తండ్రి


ఈ పద్యాలలో లాటానుప్రాస గమనింపగలరు

ఆవృత్తమైన రెండుపదాలు అర్థభేదంలేకుండా

తాత్పర్యభేదం వుంటే దాన్నిలాటానుప్రాసం అంటారు.

-------------------------------------------

- ఏ.వి.రమణరాజు
-
అన్నమయకోశం ఏది?

అన్నసారంతో పుట్టి, అన్నసారంతో పెరిగి అన్నరూప భూమిలో కలిసిపోయే స్థూలశరీరమే అన్నమయ కోశం.
అన్నరూప సారంతో పుడుతున్నది: అసలు శరీరం తయారయ్యేది తల్లిగర్భంలో. తల్లిగర్భంలో పిండం ఏర్పడాలంటే తల్లి అండం, తండ్రి బీజం (వీర్యం) ఉండాలి. తండ్రిలో వీర్యం తయారయ్యేది అన్నరసం వల్లనే. కనుక అన్నసారంతోనే దేహం యొక్క పుట్టుక.
అన్నరూపసారంతో పెరిగేది :- తల్లిగర్భంలో పిండం క్రమక్రమంగా పెరుగుతున్నదీ అంటే అది తల్లి తీసుకొనే ఆహరం ద్వారానే. అలాగే పుట్టిన తర్వాత ఆ స్థూలశరీరం క్రమక్రమంగా పెరిగేది కూడా అతడు తీసుకొనే ఆహారం వల్లనే. కనుక అన్నసారంతోనే పెరుగుతుంది.
అన్నసారమైన భూమిలో కలిసిపోయేది :- చనిపోయిన తరువాత ఆ దేహం మట్టిలో కలిసిపోతుంది. మట్టి లేదా భూమి అన్నరూపమే. ఎందుకంటే ఆ భూమి నుండే ఆహారంగా కాయలు, పండ్లు, ఆకుకూరలు, ధాన్యాలు మొ||నవి వస్తున్నవి. అందుకే ఈ దేహం అంతా అన్నమయం. కనుక దీనిని అన్నమయ శరీరం అన్నారు. ఇది స్థూలదేహం.

అన్యోన్య అధ్యాస
అన్నమయకోశం ఆత్మ వేరువేరు అయినప్పటికీ అంతా ఒక్కటిగా - నేనుగా ఎందుకు అనుకుంటున్నాం? ఇదే అన్యోన్య అధ్యాస - అన్నమయకోశమే నేను అనుకోవటం అజ్ఞానం - 

నేను స్త్రీని, నేను పురుషుణ్ణీ  అనే అన్నమయకోశ జాతి ధర్మాలను, నేను పుట్టాను, పెరుగుతున్నాను అనే దేహమార్పులను, నేను బాలుడను, యువకుడను, వృద్ధుడను అనే అవస్థలను, నేను బ్రాహ్మణుడను, వైశ్యుడను, శూద్రుడను అనే వర్ణధర్మాలను, నేను బ్రహ్మచారిని, గృహస్థును అనే ఆశ్రమ ధర్మాలను, నేను ఆంధ్రుడను, మలయాళీని, తమిళుణ్ణి అనే దేశ ధర్మాలను, నేను రామారావును, వెంకట్రావును, సీతాదేవిని, అనే నామాలను, మొ||న ఈ అన్నమయ కోశ ధర్మాలను - వికారాలను, ఇవి ఏమీలేని నిరాకార నిర్గుణ, సచ్చిదానందస్వరూపమైన ఆత్మపై (నేను పై) ఆరోపించటం జరుగుతున్నది.
ఇక ఆత్మ ధర్మాలైన సత్ - చిత్ - ఆనందమనే ధర్మాలను శరీరం ఉన్నది అనుకోవటం, తెలివిలేని శరీరాన్ని తెలివిగలదనుకోవటం, దుఃఖాన్ని కలిగించే శరీరాన్ని ఆనందం కలిగించేదిగాను భావిస్తున్నాం. ఈ విధంగా ఆత్మధర్మాలను అన్నమయకోశంపై ఆరోపిస్తున్నాం. అన్నమయకోశానికి - ఆత్మకు అన్యోన్యఅధ్యాస ఉన్నట్లుగా భావిస్తున్నాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి