28, మార్చి 2017, మంగళవారం

ఇంటర్నెట్ తెలుగు మా గజైన్ 3/ 2017/

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
Mandala Graphic Collection - colorful mandalas:
ప్రార్ధన శ్రీ తత్వ భగము పద్యాలు -1

శ్రీరంగ రంగా నోరారంగ పిల్వన్గ అత్యంత అర్ధంగ
అర్చించె ఆరాధ్య ప్రేమత్వ కళ్యాణ వైభోగ రాగంగ
ఆనంద మాధుర్య స్వప్నాల సాహిత్య తత్వంగ పాడంగ
 ఉత్తేజ దాక్షిణ్య సౌభాగ్య నేస్తంగ ఉన్నాను శ్రీరంగ       

శ్రీ తత్వ భగము పద్యాలు -2

భూదాన, గోదాన, కన్యత్వ దానము చేసాను శ్రీ రంగ
బంగారు దానము, గృహాల దానము చేసాను శ్రీ రంగ
సౌందర్య లాలిత్వ భావంగ అమ్మోరు ప్రార్ధించె శ్రీరంగ
రీయింబ వళ్లేను నీధ్యాన నీకీర్తి నేచెప్పె  శ్రీ రంగ

శ్రీ తత్వ భగము పద్యాలు - 3

శోకంబు వచ్చేను, శోకించ కున్నాను, జాతస్య భావంగ
బాహ్మణ తత్వంగ, ధీరత్వ సూరత్వ కర్తవ్య సాక్ష్యంగ
బిడ్డాలు కోడండ్రు భంధంతొ కొండంత భాద్యత భావంగ
నేనున్ నినున్ వేడితిన్ నీ ప్రెమమ్మూను పొందాలి శ్రీ రంగ
Illustration by Brigitte May:
ప్రేమ
శ్రీ తత్వ భగము పద్యాలు - 4
ఈ పూట నీవున్న నాకేమి పెడ్తావు ఈరాత్రి వచ్చాను 
వెన్నేల పంచాలి ఓసత్య, నవ్వించి కవ్వింపు రాత్రేగ 
నావెల్గు నీవేగ, నా తృప్తి నీవేగ, నా ఆశ నీవేగ
నాప్రాణ మంతాను నీమీద, నాప్రేమ నీదేగ ఓసత్య  శ్రీ తత్వ భగము పద్యాలు - 5
 

ఏ కాల మొప్పుడొ, ఏవేష మెచ్చునొ , ఏ మాట పల్కునొ 
ఏ తీర్పు చెప్పునొ, ఏ ఆశ తీర్చునొ,  ఏ మాయ కల్గునొ 
ఏ బొమ్మ ఆడునొ , ఏ బొమ్మ ఏడ్చునొ , ఏరంగు వేసేనొ
ఏ లేఖ రాసేనొ, ఏ తప్పు చేసెనొ, నీ ప్రేమ నాప్రేమ  


శ్రీ తత్వ భగము పద్యాలు - 6


ప్రాణమ్ము నీమీద, ప్రాణమ్ము నీలీల, ప్రాణమ్ము మాయేగ
ప్రాణమ్ము బ్రహ్మమె, ప్రాణమ్ము సత్యంగ, ప్రాణమ్ము నిత్యంగ
ప్రాణమ్ము రాగంగ, ప్రాణమ్ము దేహంగ, ప్రాణమ్ము ధైర్యంగ
ప్రాణమ్ము వేదాంగ, ప్రాణమ్ము సఖ్యంగ, నీప్రేమ నా ప్రేమ  

Cute Baby Elephant Dj Wearing Headphones and Glasses on Blue. By Jeff Bartels:
ఆద్యాత్మికం 
శ్రీ తత్వ భగము పద్యాలు - 7
నిశ్శబ్ద సాహిత్య ప్రోత్సాహ భావాన్ని చెప్పేందు కేనేను

నాలోని ఆవేశ సారాంశ ఆధ్యాత్మ ఆరాధ్య మే శాంతి
ఆరోగ్య ఆనంద ఆకర్ష ఆత్మీయ తత్వాన్ని పంచేను
మానుష్య నిర్నీత ప్రేమమ్ము మార్గాన సుస్పంద ణాన్నిధి     
 

 శ్రీ తత్వ భగము పద్యాలు - 8

మానుష్య దుర్మార్గ మార్గాన్ని తప్పించి, సన్మార్గ కల్పించె 
లక్ష్యాన్ని కోల్పోక, ఉత్సాహ తత్వాన్ని, సంసార సౌఖ్యాల
భావాన్ని, సమోన్నత సఖ్యత కల్పించి, ఉత్తేజ నిర్మాణ
ఉద్బోధ ప్రీరేప ణాన్ని ప్రేరేపించి  ఆనందం అందించు

 శ్రీ తత్వ భగము పద్యాలు - 9

మానుష్య నిర్నీత ప్రేమమ్ము మార్గాన సద్బుద్ధి సహాయ
సారూప్య సుస్పందనాన్ని సుకల్పించి సాకార సౌశీల్య
సౌభాగ్య మార్గాన మస్తిష్క చెతన్య చాతుర్య స్నేహాన్ని
ప్రోత్సాహ ఉద్బోధ కల్పించి సంపాద మార్గాన్ని చూపించి
Tenemos 7 chakras principales, los cuales no son perceptibles físicamente ni los podemos ver, sólo SENTIR.:
 శ్రీ తత్వ భగము పద్యాలు - 10
నారింజ నేరేడు దానిమ్మ బత్తాయి జామా మరిఇంకెన్నొ
ఆరోగ్య ఆహార పండ్లను, రాచిల్క కొట్టిన పండూను
సంతోష కొద్దీ ఫలాసవాద లోలంను మెప్పించు ఇష్టంగ
మానుష్య పక్షాదు సైతంప సందైనా విందే విశేషంగ    

 శ్రీ తత్వ భగము పద్యాలు - 11
ఆహార వ్యాపార భాగంగ గాకుండా పెండ్లిళ్లు పేరెంట
మండెను ఉత్పాదితా కల్లోలమందూను ఆహార మత్యన్త
శీఘ్రంగ అందించి సంపాద మాసింపకా సేవ తాత్పర్య
భాగంగా క్షుద్బాధ తీర్చియు స్నేహాన్ని పెంచేది ఆరోగ్య

 శ్రీ తత్వ భగము పద్యాలు - 12
గిన్నెలో బియ్యంకి నిర్పోసి జ్వాలల్లో మండించి వచ్చేది
అన్నంగా చెప్తాము, తింటాము శాస్త్రంగ శక్తికే ఆహారం
ఇంకను పాళ్లల్లో నూసత్తా ఉన్నాది ధీటైన ఆరోగ్య
ఉత్పత్తి ప్రాచీన వాగ్మయ భోధల్లో చెప్పియు ఉన్నది

శ్రీ తత్వ భగము పద్యాలు - 13
ఈరోజు కారోజు పోట్లాట, ఈనాటి కానాటి మాట్లాట
లేరోక్క రీధాత్రి ఎందెందు, అందందు ఉన్నారు అంటారు
మౌనాన్ని వీడేందు కేనేమో, మానాన్ని రక్షించు కొనేందు
కేనేమో మార్తా౦డ వేడీని భందించి మంచూను గుప్పించే     
శివపురాణం -3 వ భాగం:
శాక్తేయ నాయనారు – నారదుడు మాయకు వశుడగుట :
మనకు పెరియపురాణం అని ఒక గ్రంథం ఉన్నది. అది మనకి నాయనార్ల చరిత్రను తెలియజేస్తుంది. అందులో ‘శాక్తేయ నాయనారు’ అని ఒక నాయనారు ఉన్నారు. ఆయన గొప్ప శివభక్తితత్పరుడు. కాని ఆయన ఉన్నరోజులలో శివుడి గురించి మాట్లాడడం కాని, ‘శివ’ అన్న నామం పలకడం కాని, శివార్చన చెయ్యడం కాని కుదరని భయంకర పరిస్థితులు ప్రబలివున్నాయి.కానీ ఆయనకు లోపల శివారాధన చెయ్యాలన్న పరమభక్తి భావన ఉండేది. ఆయన కాంచీపురంలో ఉండేవారు. ఆ రోజుల్లో శివలింగము నొకదానిని తీసుకువచ్చి రోడ్డు మీద పెట్టారు. ఒక్కసారి ఆ శివలింగం దగ్గరకు వెళ్లి శివ నామములు జపిస్తూ ఆ శివలింగం మీద పూవులు వెయ్యాలని ఆయన కోరిక. ఆ రోజుల్లో పరిస్థితులు శివలింగం మీద ఎవరయినా పువ్వులు వేసినా, నమస్కరించినా వారిని చాలా అవమానములకు గురి చేసేవారు. అపుడు ఆయన ఒక మార్గమును ఎంచుకున్నారు. శివార్చన చెయ్యనివాడిలా కనపడాలి పైకి. లోపల శివార్చన చెయ్యాలన్న ఆయన కోర్కె తీరాలి. అందుకని ఆయన అటుగా వెళుతూ అన్నం తినేముందు కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని శివా, నీ పూజ చేయకుండా అన్నం ఎలా తినను? అని రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లి, నీవు శివుదివా?” అని ఒక రాయి తీసుకొని దానిని చేమంతి పువ్వుగా మనస్సులో భావిస్తూ, ఆ శివలింగం మీద పడేసేవారు. మరొక రాయిని తీసుకుని ‘నీవు శివుడివా? అని పైకి అంటూ మనసులో మాత్రం నేను మల్లెపువ్వును వేస్తున్నాను అనుకుంటూ శివలింగం మీదకి విసిరేవారు. నిజానికి అక్కడ జరిగింది ఆయన విసిరినా రాళ్ళకు బదులు చేమంతిపువ్వులు, మల్లెపువ్వులు పడ్డాయి. చూసేవాళ్ళందరూ ఆయన అక్కడి పరిస్థితులు ఆచారముల ననుసరించి శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు, ఆయనను చాలా గౌరవంగా చూడాలి అనుకునేవారు. అతడు చేస్తున్న పూజ లోకమునకు అర్థం అవుతుందా –శివుడికి అర్థం అవుతుందా? శివుడికి అర్థం అవుతుంది. అదీ ఆయన పూజ! ఇది ఆర్తిలోనుంచి వచ్చిన పూజ.
ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు. అపుడు ‘శర్వతి’ అనే నామం జ్ఞాపకమునకు వచ్చింది. ‘ఈ అన్నమును నాకు పెట్టినవాడు శంకరుడు. లోపలి వెడితే దానిని జీర్ణం చేస్తున్న వాడు శంకరుడు. అగ్నిని ఆదేశించి అన్నమును ఉడికేటట్లు చేసేవాడు శంకరుడు. నేను పశువు తిన్నట్లు ఈ అన్నం తినడానికి వచ్చాను. ఈవేళ శివలింగం మీద నాలుగు పువ్వులు వెయ్యడం మర్చిపోయాను అని అన్నం పళ్ళెం దగ్గరనుంచి లేచి, భార్యకు చెప్పకుండా పరుగు పరుగున శివలింగం దగ్గరకు వెళ్లి ‘శివుడివా’ అని నాలుగు రాళ్ళు తీసి శివలింగం మీద విసిరాడు. ఇలా తప్ప మరొకవిధంగా నీకు పూజ చేయలేక పోతున్నానయ్యా’ అని మనస్సులో చెప్పుకుని కన్నుల వెంట నీరు కార్చాడు. వెంటనే ఈశ్వరుడు ఆయనకు నటరాజ మూర్తిగా సాక్షాత్కరించి తనలో కలిపేసుకున్నాడు. దీనిని బట్టి మహేశ్వరుడు అన్న శబ్దం చేత ఈశ్వరుడు మీ సంకల్పములను, మీ హృదయ శుద్ధిని, మీ చిత్తశుద్ధిని చూడగలిగిన వాడు. ఇదీ ఆయన స్వతంత్రత. లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దానిని భావనకు అనుగుణంగా తీసుకొని ఉద్ధరించి అన్నమును విడిచిపెట్టి నాలుగు రాళ్ళతో పూజ చేసిన మోక్షము యిచ్చిన వాడు శంకరుడు. అలా మోక్షమును యివ్వగల శక్తి ఈశ్వరునికి ఉన్నది. ఐడి మహేశ్వర శబ్దముచేత ప్రతిపాదించబడుతుంది. ఈశ్వరుని శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరుని కనపడకుండా చేస్తుంది. ఈ మాయ ఈశ్వర వాక్కువలన, ఈశ్వర స్వరూపులయిన గురువాక్కుల వలన తొలగుతుంది. నిరంతర గురు వాక్శ్రవణమే మాయ తొలగేందుకు కారణం. అందుకే గురువులేని విద్య గుడ్డివిద్య. గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ తొలగదుమాయ వలన ఈశ్వర దర్శనమును విస్మరించి ‘ఇదంతా నా ప్రజ్ఞ’ అని అంటాడు. . కామక్రోదాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. చంద్రశేఖర పరమాచార్య తన 73వ ఏట ఇప్పటికీ నన్ను ఆశ అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది’ అని చెప్పుకున్నారు. మహాత్ములు విషయములను దాచరు. శివమహా పురాణం ఈ జ్ఞానమును ఉపదేశించడానికి ఒక అద్భుతమయిన ఘట్టమును తీసుకువచ్చి మీకు బోధచేసే ప్రయత్నమును ప్రారంభం చేస్తోంది.
ఒకానొక సమయంలో నారదమహర్షి హిమవత్పర్వతము క్రింది భాగమునందు, గంగానది ప్రవహించే ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో, అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేశారు. తపస్సు చేస్తున్నప్పుడు మనస్సు భగవంతునియందు మగ్నమై ఉండాలి. అది చంచలం అవుతున్నదీ లేనిదీ పరీక్ష చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇంద్రుడు మన్మథుడిని పిలిచి ఒకమాట చెప్పాడు.
‘మన్మథా, మహా సంయముడయిన నారదమహర్షి తపస్సు చేస్తున్నాడు. నీవు ఆయన వద్దకు వెళ్ళి వికారములను, ఇంద్రియములకు చూపించి ప్రలోభపెట్టి, నారదుడు యింద్రియములకు వశుడవుతాడేమో చూడవలసినది అని చెప్పాడు. మన్మథుడు వెళ్ళి ప్రయత్నం చేశాడు. నారదుడు లొంగలేదు. నారదుని తపస్సు సఫలీకృతం అయింది. ఆయన ఎవరి గురించి తపస్సు చేశాడో ఆయనని సాకారంగా చూడడానికి కైలాస పర్వతానికి వెళ్ళి ‘ఈశ్వరా, హిమవత్పర్వత ప్రాంతంలో ఉండే గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను, మన్మథుడు వచ్చి నామీద బాణములు వేసే ప్రయత్నం చేశాడు. కానీ నేను వాటిని లెక్కపెట్టలేదు. కామమును జయించి తపస్సునందు సిద్ధిని పొందాను’ అని చెప్పాడు. అంటే ఈశ్వరుడు చేసిన పనిని తాను చేశానని గొప్పగా చెప్పుకోవడం. ఎంతగా మాయ కమ్మేసిందో చూడండి. నారదుని మాటలు విన్న శంకరుడు నవ్వి ‘నారదా, నీవు కాముడినే జయిన్చావా? కాముడిని జయించడం అంటే మాటలు కాదు. నా దగ్గర చెప్పినట్లు వైకుంఠంలో చెప్పకు’ అని చెప్పాడు. కానీ నారదుడు శంకరుని మాటలను పట్టించుకోలేదు. గురువుల మాటలను తిరస్కరించడం అంటే ఇదే. అది అనుష్ఠానములోనికి రానివిద్య. ఆ విద్య శ్రవణమునకు మాత్రమే పనికొస్తుంది. అనుష్ఠానంలో పెట్టని వేదాంత విద్యవలన ప్రయోజనం లేదు. నారదుడు వైకుంఠమునకు వెళ్తూ మధ్యలో బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. తండ్రితో కూడా తన తపస్సు గురించి కాముని గెలిచినట్లు, సిద్ధిని పొందినట్లు చెప్పాడు. అపుడు బ్రహ్మ తన కుమారుడితో అలా అనకూడదు అని చెప్పి నీవు తపస్సు చేసిన చోట ఇంతకుపూర్వం పరమశివుడు తపస్సు చేసి అక్కడకు మన్మథుడు వస్తే మూడవ కంటి మంటచేత కాల్చివేశాడు. ఆ ప్రాంతంలో మన్మథ బాణములు పనిచేయకపోవడానికి కారణం ఇంతకుపూర్వం అక్కడ శంకరుడు తపస్సు చేయడం. నీవు గెలిచావని చెప్పడంలో అర్థం లేదు. అది శివ ప్రజ్ఞ, నీ ప్రజ్ఞ కాదు.
నారదుడు తన తండ్రి మాటలను కూడా లెక్కలోకి తీసుకోలేదు. వైకుంఠమునకు వెళ్ళాడు. నారాయణుడు ఎదురువచ్చి స్వాగతించాడు. అపుడు నారదుడు ‘స్వామీ, నేను తపస్సు చేశాను మన్మథుడు నామీద బాణములు వేసినప్పటికీ నేను చలించలేదు. సిద్ధి పొందాను’ అని చెప్పాడు. అపుడు నారాయణుడు ‘ఎంత గొప్పపని చేశావయ్యా, శివుని తర్వాత మరల నీవే చేశావు’ అని మెచ్చుకున్నాడు. నారదునికి పుట్టం పెట్టి లోపల జ్ఞానము బాగా నిలబడేటట్లుగా చేయవలసిన అవసరం ఏర్పడింది అని నారదుని పంపించివేశాడు. ఇపుడు మాయ ప్రారంభమయింది.
నారదుడు బయలుదేరి ఒక రాజ్యంలోకి వెళ్ళాడు. ఆ రాజ్యమును శీలనిది అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు ఒక కుమార్తె, పేరు శ్రీమతి. నారదుడు శీలనిధి అంతఃపురంలోనికి వెళ్ళాడు. రాజుగారు నారదునికి స్వాగతం చెప్పి పాదములు కడిగి కూర్చోపెట్టాడు. తన కుమార్తెను నారదుని వద్దకు తీసుకువచ్చి ఆమెచేత నారదునికి నమస్కారం చేయించి, తన కుమార్తెకు ఎటువంటి వరుడు వస్తాడో చెప్పవలసినది అని కోరాడు.
నారదుడు త్రికాలవేది. ఆయన లక్ష్మీదేవికి భర్త ఎవడో, ఎవడు సర్వవ్యాపకుడో ఎవడు నిరంతరం లోకం చేత పూజించబడుతూ ఉంటాడో, ఎవడు మహానుభావుడో అటువంటి శ్రీమహావిష్ణువుకు ఈమె ఇల్లాలు అవుతుంది’ అన్నాడు. అక్కడివరకు బాగానే చెప్పాడు కానీ ఆమెను చూడగానే ఆమె తన ఇల్లాలు అయితే ఎంత బాగుండు అని లోపల అనుకున్నాడు. ఈ అమ్మాయికి పెళ్లి ఎలా చేద్దామని అనుకుంటున్నావు అని రాజును అడిగాడు. స్వయంవరం పెట్టాము. స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది. అని చెప్పాడు. అనగా విష్ణువు సాకారుడై ఈ సభలోకి వస్తాడు అని నారదుడు గ్రహించాడు. వెంటనే వైకుంఠమునకు వెళ్ళి విష్ణుమూర్తిని సమీపించి ‘అయ్యా, నామనస్సు ఆ శ్రీమతిని పెళ్ళి చేసుకోవాలని ఉవ్విళ్ళూరి పోతున్నది. ఆమె నాకు దక్కకపోతే మన్మథబాణముల చేత చచ్చిపోతాను’ అన్నాడు. ఇంతకు మునుపు మన్మథబాణములను జయించానని చెప్పిన నారదుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఇదీ మాయ అంటే. నేను బతకాలంటే నాకు నీరూపం కావాలి. అప్పుడు ఆమె నా మెడలో మాల వేస్తుంది. అందుకని దయచేసి నీ రూపమును నాకీయవలసినది’ అని అడిగాడు. శ్రీమహావిష్ణువు మహానుభావుడు. ఆయన హరి శరీరమునూ ఇచ్చాడు, శిరస్సునూ ఇచ్చాడు. హరి అనే పదమునకు రెండు అర్థములు – పాపములను హరించే శ్రీమహావిష్ణువు, కోటి. హరి శరీరమును కిందవరకు ఇచ్చాడు, కోతి తలను పైన యిచ్చాడు.
వెంటనే నారదుడు ఆలస్యం చేయకుండా స్వయంవర మండపమునకు వెళ్ళి అక్కడ గల ఒక ఆసనం మీద కూర్చున్నాడు. అతనికి అటూ ఇటూ రుద్రపార్షదులు కూర్చుని ఉన్నారు. ఈతని అలంకరణ చూస్తె మహావిష్ణువులా అలంకరించుకున్నాడు, పైన మాత్రం కోతి ముఖం ఇతని మేడలో ఎలా మాల వేస్తుంది అని అనుకుంటున్నారు. పక్కవాళ్ళు అసూయతో అలా అనుకుంటున్నారని అనుకుంటున్నాడు నారదుడు. శ్రీమతి దండ పట్టుకుని దగ్గరకు వచ్చింది. ఆమె నారదుని వంక ఒకసారి చూసి భ్రుకుటి ముకుళించి ఈ కోతి శిరస్సు ఏమిటి? ఈ రూపమేమిటి? అనుకుని వెళ్ళిపోయింది. ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు. వరమాల తీసుకువెళ్ళి ఆయన మేడలో వేసింది. ఈవిడను తీసుకుని ఆయన వైకుంఠమునకు వెళ్ళిపోయాడు.

అపుడు నారదునికి ఎక్కడలేని బాధా కలిగింది. పక్కన ఉన్న రుద్రపార్షదులు కోతిముఖం వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నారు. నారదుడు వారిద్దరినీ మీరు రాక్షస యోనులయందు జన్మించెదరు గాక అని శపించాడు. మాయా ప్రభావం కామక్రోధముల యందు ఎలా తిప్పుతుందో చూడండి. రుద్రపార్షదులు నారదుని తిరిగి శపించకుండా శివేచ్ఛగా భావించారు. వాళ్ళు మహాజ్ఞానులు. నారదుడు గబగబా వైకుంఠమునకు వెళ్లి “శ్రీమన్నారాయణా! ఎంత పని చేశావు. హరిరూపము యివ్వమని అడిగితే కోతి శిరస్సు పెట్టావు. ఆమెను నాకు కాకుండా చేశావు. నీవు ఒకానొకనాడు నరుడవై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరం అయితే అరణ్యంలో పది ఏడిస్తే, ఈ కోతిముఖం వున్న వాళ్ళే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు. అలా నిన్ను శపిస్తున్నాను’ అన్నాడు. శ్రీమన్నారాయణుడు మహానుభావుడు కనుక ఆ శాపమును కూడా లోకమునకు ధర్మమార్గము నేర్పడానికి రామావతారమునందు సీతావియోగంగా తీసుకున్నారు. ఇప్పుడు నారదుని స్వస్థత కలిగింది. తాను ఏమిటి పొందాను అని ఆలోచించాడు. ఆత్మపరిశీలన చేసుకున్నాడు. మాయ తొలగింది. శ్రీమన్నారాయణుని చూసి యుక్తాయుక్త విచక్షణ మరచి నేను మాట్లాడిన మాటలకి నా నాలుకను ముక్కలు ముక్కలుగా కత్తిరించెయ్యాలి. గరుత్మంతుడిని నీ ధ్వజమునకు చిహ్నంగా కలవాడా! ఇంకా ఎంత మాత్రము జాగు చెయ్యకుండా నీ చక్రధారల చేత నా నాలుకను కత్తిరించెయ్యి. అప్పుడు కాని నేను చేసిన పాపం పోదు అని కన్నీటి ధారలతో ఆయన పాదములను అభిషేకించి కాళ్ళమీద పడ్డాడు. నారదుడు కాబట్టి మరల అంత తొందరగా స్వస్తితిని పొందగలిగాడు. మనం అయితే మాయలో పడి కొన్ని కోట్ల జన్మలు తిరుగుతూ ఉంటాము. పరిశీలించినట్లయితే రామాయణంలో ఒక రజకుడి మాట సీతా వియోగమునకు కారణం అయింది. అదే రజకుడు మరల ద్వాపర యుగంలో రజకుడిగా వచ్చినపుడు, కృష్ణ భగవానుడు నాలుగు పంచెలు యివ్వమని అడిగాడు. అపుడు ఆ రజకుడు నీకు రాజుగారి బట్టలు కావలసి వచ్చాయా అని గేలిచేసి మాట్లాడాడు. యుగం మారినా వాని బుద్ధి మారలేదు. అపుడు కృష్ణుడు వాని శిరస్సు మీద ఒక గుద్దు గుద్ది వేయిముక్కలు చేశాడు. మీరు ఏ మంచి పని చేసినా ఈశ్వర ప్రజ్ఞకు ముడిపెట్టాలి. ‘నేను’ అనేమాట అంటే మాత్రం యిబ్బందిలోకి వెళ్ళిపోతారు. మొదట మనం మన వాక్కును దిద్దుకోవాలి. నారదుడు కాబట్టి అతి స్వల్పకాలంలో దిద్దుకున్నాడు. మనం ఎంతటి వాళ్ళము. ఇది మహేశ్వర శక్తి. ఆ మాయే అమ్మవారి స్వరూపము. మీరు గట్టిగా అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే ఆవిడే మిమ్ములను దగ్గరికి తీసి, మీకు ఈశ్వర భక్తిని ఇచ్చి మీచేత ఈశ్వర సేవ చేయించి, ఈశ్వరుడిలో కలుపుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తిప్పిన కామపాషములు అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే భక్తిపాశములుగా మారిపోతాయి. ఆవిడ మాయాశక్తి, స్వరూపిణి. మాయా పాశమును భక్తి పాశము చేస్తుంది. లోకమునందు పంచతన్మాత్రలను ఈశ్వరుని వైపు తిప్పేసి ఈశ్వరునిలో కలిపేస్తుంది. అది మహేశ్వరుని చేరుకోవడానికి మార్గం. ఆ మార్గమునకు మొట్టమొదటి పొరపాటు వాక్కునందు కలుగుతూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడూ ఈశ్వర ప్రజ్ఞను ఈశ్వరానుగ్రహమును గుర్తెరిగి ప్రవర్తిస్తూ ఉండాలి.

ఒక అంకం
ముగిసిపోతున్నది
నీవు ఏర్పరచిన
జగన్నాటక రంగంలో
ఒక పాత్ర ముగిసిపోతున్నది
పాత్ర ఔచిత్యంలో నేను
నా పాత్రకు
న్యాయం చేసానో
నటించానో
జీవించానో
నిర్ణయించే
సమయం
ఆసన్నమైంది
ఏమి పొందానో
ఏమి కోల్పోయానో
ఏమి కోరుకున్నానో
ఏమి ఆశించానో
ఏమి వదులుకున్నానో
ఏమి వదలకున్ననో
ఏమి జ్ఞప్తికి లేవు
నా అస్థిత్వానికై పడిన తపన
పొందిన ఆరాటం
జరిపిన జీవన పోరాటంలో
నీ అస్థిత్వాన్ని గమనించక
వృధా పరచిన కాలమెంతో
నా అజ్ఞానాన్ని
మన్నించి కరుణించు
ఎంతో ఆరాటపడి
ఎన్నో సంపాదించా
విలువైన నీ సన్నిధి వదిలి
వెలలేని విషయాలను పట్టుకున్నా
అంకెను వదిలి
సున్నాలను మాత్రమే ఎర్పరచుకున్న
నా అమాయకత్వాన్ని
దయతో మన్నించు
అవసరమైన
నీ అనుగ్రహాన్ని మాత్రము మరచి
అనవసరమైన
ప్రతి విషయంలో మైమరచిపోయా
శాశ్వతమైన నీ బంధాన్ని వదిలి
అశాశ్వతమైన బంధాలకు బందీయైన
నా మూర్ఖత్వాన్ని వాత్సల్యంతో మన్నించు
పాశ్చ్యాత్తాపముతో
పరితపించే జీవులకు
నీ పద కమలముల
శాశ్వత సన్నిధి ఒసగగల
బోళా శంకరుడివని నమ్మి
అవసాన సమయములో
అర్ధిస్తున్నాను తండ్రి
నీ చరణ సన్నిధే నా పెన్నిధి గా మార్చు
ఈ జన్మకైనా మరే జన్మకైనా
నీవే నా తండ్రివై తోడు నీడగా
నడిపించి నీచెంతనే నిలిచేలా
అనుగ్రహించే
బాధ్యత
భారము నీదే
శివయ్యా