23, జులై 2015, గురువారం

Self confidence - Pravallika - Day to Day


ఓం శ్రీరాం    ఓం శ్రీరాం       ఓం శ్రీరాం
 అంత్య ప్రాస భావ కవితా  ప్రవళ్ళిక
 నేనెవర్నో గుర్తించి సమాధానము తెలుపండి 

21. నింగి నేల ఒకటైతే నివునేను ఒకటవుదాం
ఎడారి ఇసుక చల్ల బడితే చల్లగా కలుద్దాం 
తొడిమ నుండి పువ్వు వీడక పొతే పెళ్లి చేసుకుందాం
రైలు పట్టాలు ఏకమైతే ఇద్దరం ఒకటవుదాం  
ఇన్తకీ నేనెవర్ని ?


20. అది  జరగందే అమృత ధార పడదు 
అవి త్రాగందే పిల్లల ఏడుపు మానదు
అవి లేందే గుర్తింపు విలువ ఉండదు 
అవే అధరామృతములు అనక తప్పదు
అవి ఏవి ?


19. నా అందాన్ని చూసి మురిసి పోతుంటారు 
నన్ను పట్టు కోవాలని సంబర పడుతుంటారు 
 నా మాటలు వింటే సంతోష పడతారు 
నన్ను భందిన్చినవారు జైలు పాలవుతారు 

ఇన్తకీ నేనెవర్ని ?
  

18. రంగు రంగు ల రెక్కల కలిగి ఉండు 
పువ్వు పువ్వుపై ఎగురుచు ఉండు 
నాలుగవ దశలొ సంతోష పడుచుండు 
నన్ను చూసిన పిల్లలు కేరింతలు పెట్టుచుండు

ఇన్తకీ నేనెవర్ని ?
 

17. ఒక ప్రక్క తాయిలం అమ్ముడు - మరో ప్రక్క మధువు అమ్ముడు 
 ఒక వైపు వెన్నెల అమ్ముడు - మరోవైపు వలువలు విప్పుడు 
ఒక వీధి పూలు అమ్ముడు - మరో వీధి వళ్ళే అమ్ముడు 
ఇక్కడ తపన తగ్గించుకోనుడు - రోగాలు తెచ్చుకోనుడు 
ఇన్తకూ నాదే ప్ర్రాంతము ?  

16. రుద్రాక్షను తలపించు తాను కానీ నేను కాను
మురికిని వదిలిన్చుతాను సబ్బు
ను కాను
తడిసిన నురుగుగా మారుతాను కడలిని కాను
మరి నేను కురులు రక్షించే  జిడ్డు వదిలిస్తాను 

ఇంతకూ నేనెవర్ని ?
  

15.తట్ట చేత పట్టి వయ్యారముగా నడుస్తుంటే కదులుతాను  
 

సిరి మల్లేల గుబాళింపు సిగ పెట్టు కుంటే కదులుతాను
 

 కనులతో ముందుకు లాక్కొని అద్దంలో చూస్తుంటే కదులుతాను 
 

పిరుధుల మద్య ఊగుతు ఉండి వనితకు అందాలు పెంచుతాను 

ఇంతకూ నేనెవర్ని ?
 

9. వెళ తప్పని నిత్య గరిష్టుడు 
ధరణిని ప్రజ్వలింప చేయవాడు 
పూలను వికసింప చేయువాడు 
సర్వ ప్రాణ రక్షణకు మార్గదర్సకుడు

ఇంతకూ నేనెవర్ని ?


13. మనం చేసే ప్రతి పని ప్రభావం 
మాట్లాడే ప్రతి మాటయోక్క ప్రభావం
ఆశల వలయ ఆలోచన ప్రభావం
మన మనసుపై ఉంటుంది దాని ప్రభావం 


ఇంతకూ నేనెవర్ని ?


12. ఇంతై వటుడింతై అంటూ విస్తరించా నంది 
ఇది లేకపోతె పౌర సేవాలు న్యాయస్థానం ఆపద్దంది
వివరాలు నమోదు ప్రక్రియ అవినీతి మయం అవుతున్నది 
అయిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇది లేందే వీలు కాదంటుంది 

ఇంతకూ నేనెవర్ని ?


11. భయాందో ళనలు కల్పించి బ్రతకడం 
ధనాశతొ దుర్మార్గపు ఆలోచనలు రావడం
మానసిక శారీరక  రోగాలు పెరగడం 
బ్రతకడం కోసం కొట్టి బతకడం 

ఇలా బ్రతకాటానికి కారణం ?

10 ఎవరిని శిక్షిమ్చాలో  - ఎవరిని రక్షిమ్చాలో 
ఎవరిని భక్షిమ్చాలో - ఎవరిని లొంగదీయాలో 
ఎవరి పరిస్థితి ఉన్నత స్తితికి - ఎవరి పరిస్థితి అధోగతికి 
బండ్లు ఒడ లవుతాయి - ఓడలు బండ్లవుతాయి 
మార్పుకు మూల కారణం ?


9. చెరపలేని ఇష్టం - విప్పలేని విశ్వం 
తరగని అనురాగం - నిరంతర త్యాగం
 జగత్ అంటా ఒకే రకం - కేవలం భాషా భేదం 
ఇది ప్రతిఒక్కరిలొ ఉంటుంది - దానితో కలసి తరిస్తారు 
ఇంతకూ నేనెవర్ని ?

8. దివ్యకాంతిలో దేవదూతలా..ప్రత్యక్షమవుతూ  

 భువిని  ఇరువైపులా స్పర్శిస్తూ .. ..


తన్మయత్వంతో పుడమిని పునీతం చేస్తూ...


అద్భుత రంగుల దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ...


వాన వెలిసిన సజీవ పరవశ ప్రకృతిని


ఇన్తకూ నేనెవర్ని ..... ?

7. స్వచ్చత లేని మనసులన్
విచ్చలవిడిగా విహరించు వెర్రి మనుజులన్
తుచ్చపు నీచులు యుండున్
స్వేచ్చాస్వచ్చత ప్రదేశ  మెచ్చట కలుగున్ (సూక్తి )

స్వచ్చతలో అస్పృస్యత ఉంటె
స్వేచ్చకు స్వస్థత ఉండదు
మనచుట్టూ ప్రాంతం అపరిసుబ్రంగా  ఉంటె
రోగాలు  లో అందరు పడక తప్పదు

భారత ప్రధాని పరిశుబ్రతకు పెట్టిన పేరు ఏమిటి? ఎప్పటి నుండి ?


6. పులకించని మది పులకించు 
వినిపించని కధ వినిపించు
 కనిపించని ఆశలు ఫలించు 
మనసు ఉడుకును చల్ల బరచు

అనురాగము పెరిగి రక్తికొనుచు 
తీపి కలల రాత్రి సుఖపరుచు
చెదిరిన భావాలు జతపరుచు 
శోక తాపము తొలగించు
దేనివల్ల మనస్సు శాంత పరచు ?
✿ڿڰۣ(̆̃̃❤ █▄◯╲╱Ξ♡(̆̃̃❤ (̆̃̃❤



5. నీతిగా జీవించేందుకు సాధనం
ఉన్నత శిఖరాలకు చేరే సోపానం
ప్రతిఒక్కరు బ్రతికి బ్రతికించు కొనే మార్గం
మరణము లేనిది మనిషికి గుర్తింపు నిచ్చేది
ఇంతకూ నేనెవర్ని ? 


4. విద్యార్ధి దశలొ విద్యను అభ్యసించక
యవ్వనంలో ధనాన్ని అర్ధించక
మద్యస్తంలో సంసారాన్ని చేయక
వృద్ధాప్యంలో ఆడు కొనే వారు లేక

తిరిగే వాణ్ని ఏమందురు ?



3. 
నీవు పీల్చె స్వాసకు - ప్రాణధార నేనిత్తును
మల మల మాడే ఎండకు - చల్లనినీడ నేనిత్తును
నక నక లాడే కడుపుకు - మధుర ఫలాలు నేనిత్తును
అందర్ని ఆనదపరిచేందుకు - పరిమళాలు వెదజల్లు తాను    

ఉషోదయ అడుగు గుమ్మానై - నిరు పేదకు ఇంటి కప్పునై
పాకశాలకు వండే  కట్టెనై  - బ్రతుకు తెరువుకు మార్గానై
కాయాన్ని మోసే పాడినై - కాష్టంలో కాలే మానునై
తుఫాన్కు అడ్డంగా నిలిచినా దానై - అన్యాయంగా నరకబడుతున్న దాన్ని
ఇంతకూ నేనెవర్ని?  




2. మరచి పోలేని గొప్ప  మనుషి
మదిని ఆనంద పరిచిన మనిషి
తెలుగును ఉద్దరించిన  మనిషి 
ప్రపంచదేశాలు గుర్తించిన మనిషి

కుళ్ళు రాజకీయమ్ తొలిచిన మనిషి
మమతాను రాగాలు చూపిన మనిషి
చిత్రసీమను పదికాలాలు  బ్రతించిన మనిషి
నభూతో నభవిషత్  గా నటించిన మనిషి

ఇన్తకీ నేన్నేవరో మీకు తెలుసా ?
    జవాబు


1. పువ్వు వికసించినట్లు ఎప్పుడూ  వికసిస్తుంది 
నవ్వు నవ్వుకు ఉల్లాసం ఉస్చాహం పెరుగుతుంది 
నిన్న నేడు రేపు అంటూ తపన పడుతుంది 
గుర్తిన్చేవారులేక  ఏమి చేయలేక భాద పడుతుంది 
ఇన్తకీ నేనెవర్ని ?

జవాబులు 1. మనసు  2. కీర్తి శేషులు నందమూరి తారక రామారావు 3. (తరువు) 4. (దేశ దిమ్మరి )  5.  (అక్షర జ్ఞానం ) 6. (మధుర గానం )

7. (స్వచ్చ భారతి )(2-అక్టోబర్ -2014) 8. ఇంద్రధనస్సు9. ( ప్రేమ)
10. (కాలం) 11. ఆకలి  12. ఆధార కార్డ్  13. ప్రతిచర్య 14 సూర్యుడు
15. జడ  16. కుంకుడికాయ
 17.రెడ్ లైట్ ప్రాంతము 18. సీతాకొక చిలుక 19. రామచిలక 20. పాళిళ్ళు
21. బ్రహ్మచారి 






  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి