9, సెప్టెంబర్ 2013, సోమవారం

78. Sriimadbhagavadgiitaamrutam (prathamodyaaya:)



స్రీ వేదవ్యాసరుషి రచించిన భగవత్ గీత జగత్ నందు మిక్కిలి ఉపయోగకరమైనది.  కళ్యానకరమైనది, ప్రభోధాత్మకమైనది ప్రతిఒక్కరూ చదువుకొనుటకు ఆనాడు సంస్కృతములో శ్లోకాల రూపమున రచించడము జరిగింది.  దీనిని అనేకమంది అనేక భాషలలో అనువాదించటం జరిగింది.  భారతీయ సంస్కృతికి దర్పణం ప్రతిఒక్కరూ శ్రీ కృష్ణ పరమాత్ముడు అర్జునునకు భోధించిన మనోనిగ్రహశక్తిని పెంచే భయమూను తొలగించే మనిషికి చావు ఉందికాని ఆత్మకు చావులేదని తెలియపరిచే మనసు ప్రశాంతత కొరకు ప్రతిఒక్కరూ భగవత్‌గిఇతను పారాయణము చేయాలి.  తెలుగు భాషలో ప్రతిఒక్కరికీ అర్ధ మగుటకు నావంతు కృషిగా నేను అంత్యప్రాస భావముతో శ్లోకముల భావ పరంపరగా చదువుకొనేవిధముగా వ్రాయ శంకల్పించాను.  గీతాయందు జ్ఞాన, ధ్యాన,కర్మ, భక్తి యోగ సాdhanaములు తెల్పబడినవి.  మానవులు శ్రద్ధగా గీత మొత్తమును లేదా ఏ యోగ సాధనమును చేపట్టినను శ్రీఘ్రముగా సిద్ధి లభించును. గీతామార్గములను అనుసరించి మానవులు
  జీవితములను తీర్చి దిద్దుకొనవలెను.  జీవితాంతామువరకు భక్తి, ప్రేమ,మార్గములో నడుచుకొనవలెను. జీవితములో అనేక సంఘటనలు జరుగుతుంటాఈ, ప్రతి సంఘటనకు కారణము అనేది ఉంటుంది తెలియక
జరిగేవి జరుగాక మానవు, జరిగేవిషయాలలోఆలోచించటం అనవసరం, ఒకరుచెప్పె విష యాన్ని  సావధానముగా విని దానిలోని మంచిని గ్రహించి, నలుగురికీ ఉపయోగంజరిగేలా చూడాలి, చెడు ను నిర్భయముగా తిరస్కరించాలి.   

స్నేహం కొరకు ప్రాణాలు ఇవ్వటానికి ముందుకు రావాలి, పెద్దలను, గురువులను, వ్యతిరేక పక్షమున ఉన్న, తప్పులు చేసిన ఎదిరించి యుద్ధముచేయాలి, వారు పెద్దలని గౌ రవించి తప్పుకోవటం మంచిదికాదు, హృదయాంతరములో అనుమానములేకుండా జయమం తప్పక మనదే అని భావించి ప్రతిఒక్కరూ యుద్ధం చేయాలి, శక్తి వంచన లేకుండా పోరాడాలి, ఆధిపత్యముకొఱకు ఆశపడవద్దు, భోగములకోరకు ఎవ్వరూ వెమ్పర్లాడవద్దు, సుఖము కొరకు ఎవ్వరూ ప్రక్కదారిన పడవద్దు, కుల క్షయం, మిత్ర ద్రోహం చేయవద్దు.  మనుషులు లోభమునకు లొంగి బ్రష్టులవుతారు.  కులమునందు చిడపురుగులా తయారవుతారు, మిత్రద్రోహులుగామారి శత్రువులవుతారు, కుల నాశనమునకు పాపమును ముటకట్టుకుంటారు.  స్త్రీని ఆరాధించినంతకాలము ఎటువంటి అరాచకాములు జరుగవు, స్త్రీలు దూషితులైనచొ వర్ణ సాకర్యము ఏర్పడును అని ప్రథమ ఆద్యామునందు భక్తులకు (౪౦,౪౧,౪౨) శ్లోకముల ద్వారా ధర్మాలను గురించి తెలియపరిచారు .


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి