ఆనందానికి '64' అంత్య ప్రాస భావ కవితలు
చేయకూడని పనులు, చేయలేని పనులు,
అర్ధం కోసం, ఆరాటపడే పనులు, నివారించడమూ!
మంచి పనులు, శ్రమకు తగ్గ ఫలిత మిచ్చే పనులు,
నలుగురు మెచ్చే పనులు, ప్రేరే పించడమూ!
రహస్యాలు, భాధలు, కుటుంబ విషయాలు, స్త్రీద్వారా వచ్చే కలహాలు, దాచటమూ !
మంచిగుణముతో ధర్మభుద్ది, చిత్తశుద్ధి, కలిగి జ్ఞానమును, వ్యాప్తి చేయటమూ!
గాలిలోగాని, నీటిలోగాని, భూమి మీదగాని, అగ్నిలోగాని, ఆపదలు వచ్చిన అందరితో, కలసి ఉండటమూ!
నీవెంట నేనున్నానని, నిన్ను విడిచి నే నుండ లేనని, ఒకరి కొకరు అర్ధంచేసుకొని బ్రతకటమే జీవితమూ!
ఆపదలలో ఆదుకొంటానని, సేవలు చేయడమే ఋణమని,
ఈ లోకం యే మన్నా నీకు నేను, నాకు నీవు అనుకుంటేనే, జీవితము!
అనుమానాలకు తావివ్వక, ఆశలకు పోక, ఆశయాలతో
సుఖదుఃఖాలు కలసి మెలసి పంచుకుంటేనే నిజమైన జీవితం.
నాటి కవిత -
2. శ్రేయోభిలాషి (2/64)
మావటివాడు అంకుశము తో పొడిచిన ఎగరలేని ఏనుగులా!
తుఫానువచ్చి నదులు, సముద్రములో కలసిన తలవంచే గడ్డిపరకలా!
ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఒప్పుకొను పల్లమునకు జాలువారు నీటిలా!
పెనుగాలికి వృక్షాలు, పడిపోకుండా అడ్డుగా ఉండే, మఱ్ఱి వృక్షములా !
సమిధలు వేసి, నేయి పోసి, మండించినా దాహము తీరని అగ్నిలా !
దుఖం, వేదన, ఓటమి, నష్టము, సమ్మేళనాలు జీవితంలో క్షనికములా !
సుఖం,సంతోషం,గెలుపు,లాభం సమ్మేళనాలు జీవితమే సముద్రములా!
కంటికి కనురెప్పలా, పవిత్రమైన సలహాలు ఇచ్చి, కాపాడే యోగిలా !
సత్యమ్, ధర్మం, న్యాయం, ప్రక్రుతి ననుసరించి చంద్రుడు లాగా నిత్యమూ కష్టపడుటకు చేయూత నిచ్చువాడు, భేదము లేకుండా ఆపదలో ఆదు కునేవాడు అందరి కష్టాలను తీర్చి, అవసరానికి ఆదుకొన్న వాడే శ్రేయోభిలాషి .
3. ఆమె ఓ అమ్మ !(3/64)
సంతాన, సంతోష, సౌభాగ్యాలు, ఆమె గుండె చప్పుళ్ళు !
శ్రీపతి మృదు మధుర పలుకులు, ఆమె పెదవుల ముచ్చట్లు !
మనవుడు చేసే ఆకతాయి పనులు, ఆమెకు తెలియని ఇక్కట్లు !
చివరి రక్తపుబొట్టు వరకు శ్రమించిన, ఆమెకు తరగని కన్నీళ్ళు !
సంతానము కోసం ఆమె సర్వేంద్రియములు ఖర్చు చేసినట్లు !
తల్లి తండ్రులకోసం, మమకారం పంచలేక ఆమె మనోవేదన చెందినట్లు !
అత్తమామల కోసం ఆమె జీవితాంతం అణిగి మణిగి ఉండినట్లు !
భర్త కన్నాముందు సౌభాగ్య వతిగా శివసానిధ్యం పొందాలనుకొన్నట్లు !
స్నేహితులకోసం, ప్రేమను పంచలేక ఆమె మౌనం వహించినట్లు !
ఒక చుట్టు లాగా సర్వం అర్పించేది ఒక్క తల్లిమాత్రమే, ఆమె అందరిని ఒకదత్రాటిపై నడిపించుటకు నిత్యమూ ప్రయత్నమూ చేసినట్లే
4. మాతృ భాష కోకిల మాతృ భాష "కుహు కుహు" సంగీత భాష !
లెగదూడ మాతృ భాష" అంబా " కేరింత అరుపు భాష !
కప్పు మాతృ భాష "బెక బెక" లాడు ముచ్చటిమ్చ్ భాష !
పిల్లల మాతృ భాష "అమ్మా అమ్మా" అని మరువలేని స్వర భాష !
మాతృ భాష మారేది లేదు, మరోభాష వచ్చేది లేదు !
మనుగడకు మాతృభాష, బ్రతుకు తెరువుకు మర భాష !
ఎన్నివేషాలు వేశిన, ఏ విద్య నేర్చు కున్న మారదు తల్లి భాష !
భవిషత్తుకు పునాది, మార్గదర్శికి పెన్నిధి, మాతృభాష !
మనోవికాసానికి భాష, భావావేశాన్ని తెలిపే మాతృభాష !
విదేశి భాషకు పట్టం కట్టకు, చేయకు ద్రోహం మాతృభాషకు!
5. వ్యసనాలు కామానికి రావణుడు, వాలి, కీచకుడు, ఏమైనారో తెలుసుకొ !
జూదమునకు నలమహారాజు, ధర్మరాజు ఏమైనారో తెలుసుకొ!
మత్తుకు బానిసై శుక్రాచార్యులు, ఇంద్రుడు ఏమైనారో తెలుసుకొ!
వేటవల్ల దశరధుడు, పాండురాజు, ఏమైనారో తెలుసుకొ!
పలుకు ప్రల్లదనువల్ల శిశుపాలుడు, దూర్వాశుడు ఏమైనారో తెలుసుకొ!
వృధా వ్యయం చేసి రాజులు, మహారాజులు, ఏమైనారో తెలుసుకొ!
కామానికి బలి కాకుండా జీవతము సరిదిద్దుకొ !
జూదము అనేది మనస్సులోకి రానీక సంసారం సరిదిద్దుకొ !
ఇల్లు,వళ్ళు గుల్లచేసే మత్తు పానీయం త్రాగాట ఎందుకొ !
కోపముతో అనరాని మాటలు పలికి భాదపడుట ఎందుకొ !
నలుగురుకు సహాయపడుతూ జేవితం సాగించు ముందుకు !
6.దు:ఖ భావాలు !
హృదయమును తాకే దుఃఖ స్వరాలు !
జీర్ణం చేసుకోలేక, చెప్పలేని పరిస్థితులు !
వీణను మీటితే, సంగీత స్వరతంత్రులు !
హృదయాన్ని వేదించే, తీరని కోర్కెలు !
తెలిసి, తెలియక చేసిన, స్వయం క్రుతాలు !
మంచి, చెడు, తెలుసుకోలేని, కొన్ని సంఘటనలు !
ఓదార్చిన ఆగవు, దు:ఖ నయన ధారలు !
జీవితములొ అలలవలె, వస్తూపోతూ ఉంటాయి దు:ఖాలు !
ఎప్పడు సంతోష విషయాలు వింటూ వింటే, ఉండవు దు:ఖభావాలు !
సింహంలా దూకి వస్తాను నీ దగ్గరకి !
ఉయ్యాలలో ఊగి వస్తాను నీ పక్కకి !
పల్లకిలో ఎక్కివస్తాను నీ స్నేహానికి !
తయారై యున్నాను నీ తాకిడికి !
దాపరికం ఆగేనా నీ దాదా గిరికి !
పలకరింపులు పెరేగేనా నీ పేదరికానికి !
దాసోహం ఐ పొనా నీ దాహానికి !
ఆనందముగా భందికానా నీ కౌగిలికి !
ఆధారముగా అల్లుకు పోనా నీ ఆశలకి !
ఆహారముగా స్వాహకానా నీ ఆకలికి !
ఆహా ఓహో అంటాను నీ ఆవిరికి !
ఆవిరికి మంచు కరిగే చివరికి కోరిక తీరె !
8. మనిషి *
మట్టిలోకి యంత్రమై
మట్టిని పైకి నెట్టుతూ
ముందుకు దుసుకుపొతూ !
గాలిలోకి యంత్రమై
గాలి తేమను పైకి నెట్టుతూ
ముందుకు సాగి పొతూ !
కొత్తదారులు దొరకక,
పాతదారిలో బ్రతకలేక,
మంచులా కరిగిపొతూ !
మనిషిగా నిజం మాట్లాడితే,
మృగాన్ని తరిమినట్లు
తరుముతూ !
ఆశల వలయాల్లో చిక్కి,
మనిషి కట్టిన కోటలు,
పేక కోటల్లా కూలిపొతూ !
కోకిలగానాన్ని వింటూ,
మనిషి శబ్ధ కాలుష్యాన్ని,
జీవితములో భరిస్తూ !
అర్ధంలేని అర్ధం కోసం,
ఇతరుల మేప్పుకోసం,
పనులు చ్చేసి విలపిస్తూ !
వినగూడని మాటలు వింటూ,
విన్నది చేప్పలేక మౌనం గా
బ్రతుకుతూ !
ఒకవేపు మారణహోమం సాగిస్తూ,
మరోవైపు తర్పణాలు వదులుతూ !
మనిషి కామాన్ని
అదుపులో ఉంచుకోలేక,
మృగ జాతికి జీవం పోస్తూ !
జీవిత చివరి ఘడియలలో
ఒక్కరూ ఆదుకోలేక,
వీధి కుక్కలా విలపిస్తూ !
కొందరు చేసిన
పుణ్య ఫలమో,
దానఫలమో,
అందరిముందు స్వాస విడుస్తూ !
మంచిని పెంచి,
వంచనను త్రుంచి,
మంచిమాటలతో,
మనస్సును త్రుప్తిపరుస్తూ !
నిన్నటి గురించి ఆలోచించక,
రేపటి గురించి విచారించక,
నేడే సంతోషముగా జీవిస్తూ !
భవబంధాలను భరిస్తూ,
ఈదేశంకు, భూధేవికి భారం,
కాక జీవించేవాడే నిజమైన మనిషి.
జాలువారు నదులు సముద్రములో కలుయును, నిశబ్ధముగా !
కొన్ని సంఘటనలు జరిగి కాలంతోపాటు, సమసి పోవును, నిశబ్ధముగా !
ఇరువురి మనస్సులు పారవశ్వముతో జరుపును, సృష్టి కార్య్యము నిశబ్ధముగా !
కలవరింతలు, ఘురకలు, అనుకోని శబ్ధాలు, నిద్ర పాడుచేయును, నిశబ్ధముగా !
సూర్య-చందృలు ఒకరి తరువాత ఒకరు విధిగా మారుతారు, నిశబ్ధముగా !
సత్య్యం, ధర్మం, న్యాయం, అనేవి అందరికి తెలియును కాలముతోపాటు నిశబ్ధముగా !
గురువుగారు పిలిచినట్లు నామనస్సు కలువ పువ్వులా విచ్చుకొంటుంది, నిశబ్ధముగా !
శబ్ధములతో సాగుతుంది, పగటిపూట సంసారము, రాత్రికి సర్దు కొంటుంది నిశబ్ధముగా !
భూమి అలుపెరుగగా తిరుగుతూ సమస్త జీవకొటిని భరించుతూ ఉంటుంది నిశబ్ధముగా !
ప్రతిఒక్కరు శారీరక సంభంధాలు వీడి పరమానంద ప్రాప్తిని పొందేది నిశ్శబ్దం .
ప్రేమను పొందటానికి నిర్మలమైన మనస్సుతో కోరేది ప్రేమ !
అనుకున్నది సాధించుటకు మురిపములు అందిమ్చి పొందే కపట ప్రేమ !
ఇతర్లు తమ ధర్మం పాటించకపోతే, ధర్మమార్గంలో నడిపే ఆగ్రహిమ్చే ప్రేమ !
కల్లబొల్లి మాటలను నమ్మక వాస్తవ దృష్టిని గ్రహించి పొందేది వాస్తవ ప్రేమ !
భార్య్య భర్తల మద్య ఉండేది, అన్దరూ బాగుండాలని చెప్పది, సృష్టి కర్త ప్రేమ !
ఆకర్షణకు లొంగి, విశ్వాసముతో ఏకంగా మారి పెద్దలను ఎదిరించే ప్రేమ !
కన్నపిల్లలు తిట్టినా, కొట్టినా, చీదరిమ్ చుకొన్న, తప్పు పిల్లలది కాదని కన్న ప్రేమ !
అందాలు వెదజల్లి, మనసును, ధనమును దోచి, రోగమును పంచే కపట ప్రేమ !
84 లక్షల జీవరాసులలొ ప్రేమలేని ప్రాణి లేదు, అన్నింటిలో ఉంటుంది ప్రేమ !
కొండగాలి విచే చోట, పూల పరిమళాలు వెదజల్లే చోట ఉంటుంది ప్రేమ !
అలల తుంపర్లు వెదజల్లే చోట, చిరుజల్లుల్లో తడిసిన ఉంటుంది ప్రేమ !
కిరణాలు విస్తరిమ్చినచోట, ఇంటిని చక్కగ్గా అలంకరించిన చోట ఉంటుంది ప్రేమ !
మమతలు కలసి మనసైన చోట, పేగు భంధం కలసిన చోట ఉంటుంది ప్రేమ !
ప్రేమించటము కన్న ప్రేమించ బడటం అసలైన నిజమైన ప్రేమ.
పున్నమి వెన్నల వేళ, పరవసించి పఋవాలు పంచుకొనెలీల !
మల్లెపూల పరిమళాల వేళ, కోరికలు సద్విని యొగంచేసికొనే లీల !
సుర్య్యొదయం శుభవేళ , వ్యాయామము చేస్తే ఆరోగ్యం మార్పులీల !
అమృతఘడియలవేళ,ఆరాధ్య దైవాణ్ని ప్రార్ధిస్తే మనసుకు ప్రశాంతి లీల !
పరుల దోషము నెంచు నీచ గుణము లేకుండు లీల !
అదేపనిగా ప్రతి విషయంలో లంపటత్యం లేకుండు లీల !
దురభిమానము, ద్రోహము, అనుమానము లేకుండు లీల !
ప్రతిఒక్కరిలొ అభిజనమదం, విద్యామదం,ధనమదం లేకుండు లీల !
యవ్వరికి ఆనాడు అర్థంకాలేదు, శ్రీకృష్ణ పరమాత్ముని లీల.
లీలను గురించి వర్ణించటం నాతరమా ఈ వేళ.
మనుష్యులు ఎవ్వరికి బానిసలుగా, బ్రతకనవసరము లేదు !
మన బ్రతుకు మరొకరికి ఇబ్బందిగా, ఉండ నవసరము లేదు !
భాద పడవద్దు, బ్రతుకు ఒక నరకము అనుకోవలదు !
ఇల్లాలు పంచే సుఖం ఎనాటికి మరువ వలదు !
అవసరాలకు మించిన ధనమున్న సుఖములేదు !
ఒక అభద్ధాన్ని నమ్మించటానికి ప్రయత్నం చేయవలదు !
భాదలోకూడా వ్య ర్ధముగా, అతిగా మాట్లాడ వలదు !
సత్యం పలుకుతూఉండి ,భాదలోకూడా అసత్యం పలకకూదదు !
భాదతో పరుగులు తీసె వాళ్లకు, ప్రశాంతత ఉండదు !
ప్రేమలేని చోట, భాదవ్య్యక్తముచేసిన ఫలితము ఉండదు !
కోపము వచ్చినవారికి, ఎదుటివారి భాదపడుతారని తెలీదు !
భాదను భరించి తగినమన్దు తీసుకోని ఉండుట తెలీదు !
కలువపూలు తెలుపు, కమలములు తెలుపు, కల్పవృక్షం తెలుపు !
కసేరుక తెలుపు, కళానిధి తెలుపు, కామ ధెనువు తెలుపు !
కనికరము తెలుపు, కర్తవ్యం తెలుపు, కర్పూరం తెలుపు, !
కళ దేతుం తెలుపు, కళ త్రం తెలుపు, కల్యాణం తెలుపు, !
కాదమ్బరీ తెలుపు, కామేశ్వరీ తెలుపు, కారుణ్యం తెలుపు, !
కళ్ళు తెలుపు, కుతూహలమ్ తెలుపు, కిరణం తెలుపు, !
అన్నం తెలుపు , అన్నపూర్ణ తెలుపు, ఆనందం తెలుపు, !
ఉప్పు తెలుపు , ఉమ్మి తెలుపు , ఉషోదయం తెలుపు, !
14. వద్దు అనువుకానిచోట అధికులమని, సంబరపడవద్దు !
ఎవ్వరూ అపసకునాల మాటలు అనవద్దు, వినవద్దు !
అధరామృతము కోసం ఆరాట పడవద్దు !
అగ్నిజ్వాలలు కుటుంబములో రగిలించ వద్దు !
అగ్ని హృదయాన్ని దాహిస్తున్దని, మరువవద్దు !
అనా వృష్టి ఏర్పడినప్పుడు, దుక్కి దున్న వద్దు !
కుటుంబములో అనుమానము అనేది, ఉండవద్దు !
గాది క్రింద పందికుక్కులు ఉన్న, గగుర్పాటు పడవద్దు !
వెన్నలను చూపి, వెన్నముద్దకోరుతాడను,కోవద్దు !
చిరుతలా పరిగెత్తవద్దు, ఎవిషయ్యానికి కంగారు పడవద్దు !
అందరిలో మంచివాడని అనిపించుకోవటం కద్దు !
15. పత్స రణం* సూర్యుని ఒక్క ధర్మం తాపం, జలము ఒక్క ధర్మం రసం !
అగ్ని ఒక్క ధర్మం దహనం, జీవుని ఒక్క దర్మం ఆత్మజ్ఞానం !
కుటుంబములో సత్యం,న్యాయం, ధర్మం, మార్గమే సంసారం !
మతములో ఉన్న సమస్త ధర్మాలకు అందరం భద్దులం !
ఎక్కడ ధర్మం ఉంటుందో, అక్కడ తేజస్సు విస్తారం !
ఎక్కడ తేజస్సు విస్తారంగా ఉంటుందో, అక్కడ భక్తి మయం !
ఎక్కడ భక్తి ఉంటుందో, అక్కడ లక్ష్మి దేవి స్థిరనివాసం !
ఎక్కడ సత్సాంగత్యమ్ ఉంటుందో, అక్కడ ఉత్తమ గుణం !
ఎక్కడ ఉత్తమ గుణం ఉంటుందో అక్కడ భగవంతుని సాక్షాత్కారం !
ఎక్కడ భగవంతుని సాక్షాత్కారం ఉంటుందో, అక్కడ బ్రహ్మా జ్ఞానం !
ఎక్కడ బ్రహ్మా జ్ఞానం పంచ బడుతుందో, అక్కడ నిత్య కళ్యాణం !
ఎక్కడ నిత్య కళ్యాణం ఉంటుందో, అక్కడ పత్స తోరణం !
16. నాలోకం*
దు:ఖాన్ని భరించి, అందరికి సుఖాన్ని ఇచ్చే మార్గం చెబుతాను !
దుఖిమ్చే వారిని ఒదార్చలేను, సంతోషాన్ని అందరికి పంచుతాను !
సుర్యుడులా తిరుగలేను, కొందరి భాదల విముక్తికోసం తిరుగుతాను !
చెంద్రుడిలా వెన్నలకురిపించలేను, సంసారములో వెన్నల నింపుతాను !
గాలి తాకిడికి ఎగిరే ఆకులా ఉంటాను, భందాలకు చిక్కక పయనిస్తాను !
పరమపద సోపాన మవుతాను, కష్టములు వచ్చినా కూక్కలా ఉంటాను !
విశ్రాంతి లేకుండా నిరంతరం ప్రవహించే నదిలా సమస్యలను పరిష్కరిస్తాను !
రోగానికి మందులా,హృదయానికి తగిలిన గాయాన్నితొలగిమ్చుతాను !
నానిరంతర పయనము ఆపేవారెవరు, నన్ను అర్ధంచేసుకోనేవారి కోసం నేను !
17. ఒక స్త్రీ ఒక దివ్య మణి
నయన మనోహర కలువల అపరంజి మణి !
మనసును దోచే, నవ నవోన్మష రక్తి స్వరూపిణి !
కోరికలు తీర్చి, యశస్సును పెంచే, యసశ్విణి !
మనోధైర్యం, తేజస్సును వృద్ధి పరిచే, తేజస్విణి !
ధర్మశాస్త్రములు తెలిపి, ఆదు కొనే అంతర్వా ణి !
కొన్ని విషయాలు తెలిసుకోనుటకు, సహాయపడే అన్వేషిణి !
మనసును మెప్పించిన, వారి కోర్కెలు తీర్చిన, అభిలాషిణి !
అంతరాత్మను ప్రభోదించి, అవసరమునకు సలహాఇచ్చె, ఆత్మజ్ఞాణి !
ఆస్తిని, అదాయమును,పెంచి ఆహారమును అన్దిమ్చ్, అన్నప్రదాయిణి !
పురాణములు, వేదములు అనర్గాలముగా వర్ణించి చెప్పే, అవృత్తిణి !
ఇంటిని, సభను, పిల్లలను, హుందాగా తీర్చి దిద్దన, అస్థాణి !
కామాందులకు, దుర్మార్గులకు, దుష్టులకు, చిక్కిన ఆహుతిణి !
పరిమళాలు వెదజల్లి, మనస్సును ఉల్లాసపరిచే, ఇష్ట ఘంధిణి !
రౌద్రరసమును చూపి, శత్రువుల గుండెలలో ఉండే, ఉగ్రరూపిణి !
మనో భిష్టమును నెరవేర్చి, ఉచ్చాహమును పెంచే, ఉజ్వల రాణి ! తెలివితో తెలియనివి తెలియపరిచే ఉపన్యాసిణి !
ఉపవాసములు ఉండి ఉపాయములు తెలియపరిచే ఉపచారిణి !
భర్త దుర్వసనములు లోనైతే వ్యసనములను మాన్పిమ్చే ఉపాధ్యాయిణి !
ఉరొభాధను భరించి ఉష్ణమును పెంచి ఉన్మాదునికి ఊరట కలిగించే విలాసిణి !
బలము, ధెర్యము, మనోనిగ్రహ శక్తి పెంచే తేజస్సుగల ఓజస్వి ణి !
అనారోగ్య భర్తను ఆరోగ్య్యవంతునిగా మార్చుటకు శ్రమించే ఔషదణి ! నవనీత హృదయ వేణి , మంజుల మధుర వాణి !
నును లేత రెమ్మల మాటున దాగిన మొగ్గ మందారం !
అప్పుడే కళ్ళు తెరచి చూసి పరిమళించిన మొగ్గ మందారం !
ఎరుగని ప్రదేశములో వెళ్ళి వేరొకరికి చిక్కిన మొగ్గ మందారం !
భంధనం అనే దారముతో అల్లుకు పోయిన మొగ్గ మందారం !
పరమార్ధం కొరకు పరితపించిన లేలేత మొగ్గ మందారం !
ఆడి పాడే తోటి సఖులను వదిలి కోత్తలోకం వచ్చిన మొగ్గ మందారం !
తల్లిచాటున పెరిగి, తండ్రి పెంపకముతో విద్య్యనేర్చిన మొగ్గ మందారం !
పుట్టి నింట నుండి మెట్టి నింటను మాలిమై మాసాలు మొగ్గ మందారం !
కొత్త ఇంటిని చేరి అత్త మామలను ఆనందపరుచు మొగ్గ మందారం !
కన్నతల్లి తండ్రులను కూడ ఆదరిస్తూ, తోటివారికి సహయ పడే ముద్ద మందారం !
పరమహర్షముతో పతి దేవునికి మురిపాలను అందించిన శ్రుంగారపు ముద్ద మందారం !
కృష్ణ మేఘమా రావే, రావే,,
దాశి మేఘమా రావే, రావే !
శ్వేత మేఘమా రావే, రావే,,
పువ్వుల మేఘమా రావే, రావే !
నీళి మేఘమా రావే, రావే,
పింజ మేఘమా రావే, రావే !
చమటను ఊద్చి దిమ్మరిమ్పవే,
కుండపోతగా కురువవే !
జల మేఘమా రావే, రావే,
కొంచము జలము విడిచి పెట్టవే !
పిడుగుల శబ్దంతో ఒక మెరుపు
మెరిసి గగనమును కప్పినావే !
తొలకరి వానలు కురిపించి,
పంటలు పండటానికి సహకరిమ్చినావే !
మీఘమా దాహార్తులకు దాహము
తీర్చి ధన్యు డ వేనావే !
నీకొరకు ఓ ప్రాణి విలపిస్తున్నాడని
తపించి తపన తీర్చవే మేఘమా
ఆకాశాము నుండి జారి కురవవే
సకల ప్రాణులకు ఆధారమే మేఘమా
--((*))--
సకల ప్రాణులకు ఆధారమే మేఘమా
--((*))--
20 . వ్యక్థ పరిచా*
నెమలి పురి విప్పి నాట్య మాడుట చూచి !
సరస్సులో హంసలు ఈదులాడుట చూచి !
చిద్యిలాసముగా తోట చివురిమ్పగ చూచి !
రేమ్మ కొక సుమముగా రంగు మీరగ చూసా !
రంగు ఆకుల మద్య్య పూల ముగ్ధలు చూచి !
సందడి చేయు కొయిల గానమును చూచి !
ప్రాణమునకు ప్రాణమై ప్రాణ కాంతి చూచి !
సుఖమో,దుఖమో వీలుకాని స్థితిని చూసా !
పరమార్ధముగా నీ చూపుల్లో ఉండే కాంతిని చూచి !
జీవకోటికి ప్రాణం పోస్తున్న ప్రథ్యూషను చూచి !
పలకరించిన మనస్సుతో పారవశ్య ముతో జలించి !
నిలిచి పోయిన నా మనస్సు వేగముగా హెచ్చరించా !
నా మనోగత భావాలను లేఖగా నామనోహరికి వ్యక్థ పరిచి !
నా మనోహరి మాటను గౌరవించి ఆమెనే అనుకరించి
మా మనసులలోని మాటలని ఒకరి కొకరు గ్రహించి
మేము జీవన సమరంలో చదరంగం ఆటను గ్రహించా
21.నా ఆకాంక్ష నెమలి పురి విప్పి నాట్య మాడుట చూచి !
సరస్సులో హంసలు ఈదులాడుట చూచి !
చిద్యిలాసముగా తోట చివురిమ్పగ చూచి !
రేమ్మ కొక సుమముగా రంగు మీరగ చూసా !
రంగు ఆకుల మద్య్య పూల ముగ్ధలు చూచి !
సందడి చేయు కొయిల గానమును చూచి !
ప్రాణమునకు ప్రాణమై ప్రాణ కాంతి చూచి !
సుఖమో,దుఖమో వీలుకాని స్థితిని చూసా !
పరమార్ధముగా నీ చూపుల్లో ఉండే కాంతిని చూచి !
జీవకోటికి ప్రాణం పోస్తున్న ప్రథ్యూషను చూచి !
పలకరించిన మనస్సుతో పారవశ్య ముతో జలించి !
నిలిచి పోయిన నా మనస్సు వేగముగా హెచ్చరించా !
నా మనోగత భావాలను లేఖగా నామనోహరికి వ్యక్థ పరిచి !
నా మనోహరి మాటను గౌరవించి ఆమెనే అనుకరించి
మా మనసులలోని మాటలని ఒకరి కొకరు గ్రహించి
మేము జీవన సమరంలో చదరంగం ఆటను గ్రహించా
గాలి మాధుర్యముగా ఉండుగాక, దుర్వాసనలు లేకుండుగాక !
నదీ నదాలు మధుర జలాలు ప్రవహించుగాక, కాలుష్యం లేకుండుగాక !
వృక్షాలు మానవులకు ఉపయోగపడు గాక, వృక్షాలను కాపాడుగాక !
భాను కిరణాలు సమంగా పడుగాక, సర్వ ప్రాణులను రక్షించి గాక !
చెంద్రుడు వెన్నెలను కురిపిమ్చుగాక, ప్రాణుల సృష్టిక మార్గామగుగాక !
పశు సంతతి తీయదనము అందిమ్చుగాక,అందరి శక్తీ వృద్ధిపొందుగాక !
ఐకమత్యం వర్ద్ధిల్లి ఉండుగాక ,చిత్త శుద్ది,ఆచరణసిద్ధి,అందరిలోఉండుగాక !
మిత్రులయడ, శత్రువులయడ, సమభావము కలిగి ఉండి బ్రతుకు సాగిమ్చుగాక !
శ్రద్ధ ,విశ్వాసము,నమ్మకము, ఉన్నచోట పెద్దల ఆశిస్సులు ఉండుగాక !
వ్వక్సుద్ధి ఉన్నవారి మాట నిత్యకళ్యాణం పచ్చతోరణం గా ఫలిమ్చ్ గాక !
మీ తలపు, అభిప్రాయం ఒకటై సుఖ సంసారం జరుపుతూ ఉండుగాక !
హృదయ గతభావాలు ఒకటై సమానముగా ఉండి ఆలోచనకు తావివ్వకుంగాక !
మనస్సూ, చింతన, భావనా, సంతోషం, ఒకటై ప్రతి ఒక్కరిలొ ఉండుగాక !
మీ మధ్య చక్కటి సామరస్స్యమ్, సహకారం, సహనం, నెలకొని ఉండుగాక !
ప్రతిఒక్కరికి దైవం మీద, తల్లి తండ్రుల మీద, మాతృ భూమి ప్రేమ, ఉండుగాక !
నిత్య, సత్య, సుఖ సంతోషాలతో ఉండాలని, శుభాకాంక్షలు తెలపాలని నా ఆకాంక్ష.
*. ఆకర్షణ
అద్భుత ఆకర్షణ శక్తివి నీవు !
నాదృష్టిలో మూర్తీభవించిన
సౌందర్య రాశివి నీవు !
నామది ఏలా అతులూగి,
ఇతులూగి, కలతపెడుతున్నావు !
నావంక చూసి తూలి,
వళ్ళంతా త్రుళ్ళింతలాడు తున్నావు !
మోములో కళ,
నీ నవ్వులో శ్రుతి కల్పుతున్నావు !
ముసి ముసి నవ్వులతో,
ఓరకంట చూపులతొ ఉడికిస్తున్నావు !
అంతర ద్రుష్టికి సాక్షత్కారిస్తున్న
ప్రసన్న రూపంతో నీవు !
యవ్వనంలో ఉండి నామది ఎందుకు
గిలిగింతలు పెడుతున్నావు !
సోయగాలు వెదజల్లి ,
మూతిబిగువులతొ ఉన్న అందాల ప్రోవు నీవు!
వయ్యారాల వంపులతో,
వయస్సు తెలుపక మురిపిస్తున్నావు !
యవ్వనములో ఉన్న యతివలే
నా కళ్ళను ఆకర్షిసున్నావు !
మాయ మర్మం తెలియని,
మనస్సుని అదేపనిగా వేదిస్తున్నావు !
స్వర్గ సుఖాలు ఏమిటో,
రుచి చూపిస్థానని నాకలలో వేదిస్తున్నావు !
మనసు మనసులో లేకుండా,
మానసిక వత్తిడికి లోనుచేసున్నావు !
మనుధర్మలను, వాస్యాయన ధర్మాలను,
అర్ధం చేసు కోమన్నావు !
మట్టిలో మాణిక్యమై,
ముత్యపుచిప్పలో ముత్య్యమై,
ఆకర్షిమ్చుతున్నావు !
నవరత్న వెలుగులతో,
నవ్య, దివా కాంతులతో అపరంజివేనావు !
ఆకర్షణ ఏదో , వికర్షణ ఏదో,
తెల్సుకోలేని నావయస్సుని ఎందుకు కదిలిస్తావు !
--((*))--
మనువాదేవాడి మాట మంచిమాటా, తల్లితండ్రులను ఎదిరించే ప్రేమికులంట !
మంచిమాటకు మనస్సు కరుగునంటా, ప్రలోభానికి లొంగని మనసంట !
కొందరు కర్కశంగా మాట్లాడుతుంటా, మనో ధైర్యం దెబ్బతీయును అంట !
మాట పదునైన కత్తి లాంటి దంటా, కొందరి ప్రాణములు కూదా తీయునంట !
నెమ్మదిగా, చెక్కగా కొందరు మాట్లాడుచుంటా, వారిని చులకన చేయునంట !
ఇంపు కానిమాట వినకూడ దంటా, అందుకే నేను చెవిలో దూది పెట్టుకుంట !
శ్రీమతి మాట శ్రీపతికి శిరోధార్యమంటా, ఇరువురి హృదయాలకు చల్లదన మంట !
అందరి మాటలు వింటూ ఉంటా, వారిమాటలు సమర్ధించలేక మౌనంగా ఉంట !
నేను ప్రతిపూట హనుమంతుని ప్రార్ధిస్థూ ఉంటా, నానోటివెంట వచ్చును మంచిమాట.
24.మోక్షం
పుట్టలో ఉండి తపస్సు చేస్తే మోక్షం, మరి పాములకు ఎప్పుడు మోక్షం !
ఓంటి కాలుతో తపస్సు చేస్తే మోక్షం, మరి కొంగలకు ఎప్పుడు మోక్షం !
తలక్రిందుగా వ్రేలాడి తపస్సు చేస్తే మోక్షం, మరి గబ్బిలంకు ఎప్పుడు మోక్షం !
అడవిలో ఒంటరిగా తపస్సు చేస్తే మోక్షం, మరి వానరులకు ఎప్పుడు మోక్షం !
జలములొఉండి తపస్సు చేస్తే మోక్షం, మరి జలచరాలకు ఎప్పుడు మోక్షం !
ఉచ్చారణ చెస్తూ తపస్సు చేస్తే మోక్షం, మరి కీచురాళ్ళకు ఎప్పుడు మోక్షం !
ఎడారిలో ఉండి తపస్సు చేస్తే మోక్షం, మరి ఓంటేలకు ఎప్పుడు మోక్షం !
గుహలో కూర్చొని తపస్సు చేస్తే మోక్షం, మరి మృగాలకు ఎప్పుడు మోక్షం !
గాలిలో తేలుతూ తపస్సు చేస్తే మోక్షం, మరి పక్షులకు ఎప్పుడు మోక్షం !
జన్మాతరం వరకు నమ్మిన దైవాణ్ని ప్రార్ధించటమే నిజ మైన మోక్షం !
భారతీయులకు పవిత్ర మైనది, ప్రతిగ్రుహములొ ఉండ వలసినది !
గోమాత, భూమాత ,లక్ష్మి మాత, వలే అద్వితీయం అమోఘం మైనది !
మొక్కమోదట్లో సరస్వతీ తీర్ధమ్, అగ్రభాగములో వేదములు ఉన్నది !
మద్యభాగమున విష్ణువు, కాండమున శివుడు సమస్త, దేవతలు ఉన్నది !
శాఖలలో అష్ట దిక్పాకులు ఉన్న తులసికి అందరూపూజించ వలసియున్నది !
తులసి అమ్మ వారికి, కార్తికమాసములొ చిలుకద్వాదశి నాడు కళ్యాణం ఐనది !
తులసికి ప్రదక్షణం చేస్తే సప్తద్వీపాలతొ,సమస్త భూమండలం తిరిగిన ఫలముంది !
శరీరములో ఉండే క్రిములను హరించి, ఆలోచనలను, రుచిని, ఆకలిని,కలిగించునది !
కిడ్నివ్యాధులు, గజ్జి, తామర, చర్మ వ్యాదులను తులసిఆకు రసం నయముచేయునది !
తులసి నామాలు, "తులసి , బృంద, బృందావని, విశ్వపూజిత, విశ్వ పావని ,పుష్ప సార,
నందినీతులసి, కృష్ణసేవిత, భక్తితో పూజిమ్చినవారికి లక్ష్మి నారాయణలు ప్రత్యక్షమగుదురు !
26.మిన్న (నాదృష్టిలో గొప్ప )
తపస్సు కలవారికన్నా, మేధావులుకన్నా, శాస్త్రజ్ఞులు కన్నా ,
కర్మానుష్టానముకన్నా , యోగము పొందిన య్యోగి మిన్న !
పొగచే అగ్ని కప్పి యున్నా, ధూళిచే దర్పణము కప్పి యున్నా,
మావిచే గర్భము కప్పి యున్నా, కామముచే జ్ఞానము కప్పి యున్నా,
స్థూల శరీరము కన్నా, అందరికి ఇంద్రియముల మిన్న !
అధరం అందాలన్నా ,అనందం వెళ్లి విరియాలన్నా,
ఆశయం నెరవేరాలన్నా, ధర్మ మార్గాన సాధన మిన్న !
మంచి మనసుకు దారులు ఎన్ని ఉన్నా, మనిషి మనుగడకు మార్గాలెన్నిఉన్నా,
మంచి మాటకు అర్ధాలు ఎన్ని ఉన్నా, మాటకంటే నోటుకు ఈయుగంలో మిన్న !
వ్యాధి ఉన్నవాడికి సలహాకన్నా, వైద్య్యుని వ్రాసిన మందులు వాడుట మిన్న !
అవసరానికి ధన సహాయము చేయని మిత్రుడున్నా, వడ్డీ వ్యాపారస్తుడు మిన్న !
ఎవరికి వారి విధిని నిర్వహిమ్చటమే, ఫలితం దేవ దేవుడుపై వదిలే యుట మిన్న !
27.సాగే నావ
భూమిలోని ఖనిజ సంపదను వెలికితీసి వాడుకొందాం !
చెట్లను పెంచి భాను కిరణాలనుండి నిడగా వాడుకొందాం !
నదినీరును పంటపొలములకు, త్రాగుటకు వాడుకొందాం !
ఆరోగ్యమును పాడుచేయు క్రిములకు మందులు వాడుకొందాం !
శ్రమతగ్గి, ఫలితము పెంచే యంన్త్రములను వాడుకొందాం !
చేయి చేయి కలుపుదాం, ప్రాణానికి ప్రాణంగా నిలుద్దాం !
ఆదర్సముగా ఉండి అరమరికలు లేకుండా జీవిద్దాం !
కష్టతర మయిన ఏపని ఐన సాధనతో సులభతరం చేసుకుందాం !
అనురాగం, ఆత్మీయతలతో అందరం కలసి జీవిద్దాం !
పరిమళాలను వెదజల్లే పూల చెట్లను పెంచు కుందాం !
విశ్వాసముగల జంతువులను ఇంటికి కాపలా ఉంచుదాం !
నవులపుప్వులతో సాగే నావలో సుఖ జీవితం గడుపుదాం !
తెలుగు అక్షరం దిద్దరా, అణ్య భాష మనకొద్దురా !
చదువే మన కులంరా, చదువే మన మతం రా !
చదువే దైవము రా , చదువే మన సంస్కృతి రా 1
చదువులందు ఉండే మర్మమము తెలిసుకొని బ్రతకరా !
తల్లి తండ్రులు, గురువు నేర్పే చదువు దైవముతో సమానమురా !
అమ్మ భాషలో అష్టసిద్ధులు, 64 కళలు, నేర్చుకూరా !
ప్రమిదలొచమురుపొసి,వత్తిని అగ్గితో వెలిగిమ్చితే దీపపు వేలుగురా !
మనస్సుకు చైతన్యము కలిగించి పరులకు సహాయపడే చదువే చదువురా !
అదృశ్యముగా దైవము మనలో ఉండునని ఎన్నటికి మరువకురా !
సత్యం, ధర్మం,న్యాయం, శాంతం, ఉన్న చదువే చదువురా !
ఎచదువు చదివిన నినుకన్న అమ్మనే అదృశ్య గురువుగా మరువకురా !
తల్లితండ్రులను గౌరవిస్తూ భార్యా,పిల్లలతో కలసి జీవిమ్చటమే చదువురా !
సృష్టిని అతిక్రమించి, ప్రకృతికి వ్యతరేకిమ్చే, ప్రలోభ పెట్టె చదువు వద్దురా !
మౌనముగా విషం అర్ధంచేసుకొని వివేకిగా ప్రవర్తిమ్చటమే నిజమైన చదువురా !
చదువులోఆరోగ్యం, సంతృప్తి ఉన్నచోట , సుఖ సంసార మవుతుమ్దిరా !
చట్టం ఎప్పుడు ఉన్నవారికి చుట్టం !
చట్టం ప్రతి ఒక్కరికి ఒక ఆయుధం !
చట్టాన్ని తిరగ రాయిస్తుంది అర్ధం !
చట్టంతో ఆడుకుంటుంది ధనమదం !
చట్టంతో వేగలేక కొందరు దాసోహం !
చట్టం తనపని తను చేసుకుంటుందని ఒక అభిప్రాయం !
చట్టం చాప క్రింద నీళ్ళ లాగ కనపడని మర్మం !
చట్టాలు కదలిక నల్లేరు నడకలాగాక తాబేలులా పయణం !
చట్టంకు కొన్ని పరిస్థితులలో అమాయకులు బాలి అవటం !
చట్టానికి చిక్కుకొని ధర్మపరులు,బీదవారు భాదపడుట ఖాయం !
30.సూర్య తేజస్సు
సూర్య తేజస్సు ప్రాణిపై ఉదయం నీడ పొడవు !
మనుష్యుల యోక్క కోరికలు మరీ పొడవు !
సూర్య తేజస్సు ప్రాణిపై మధ్యాహ్నం నీడ కురచ !
కోరికలు కొంత తీరిస్థూ ఉంటేనే కుటుంబంలో కురచ !
సూర్య తేజస్సు ప్రాణిపై సాయంత్రం నీడ మధ్య !
తరుముతూ ఉండే ఇంద్రియ సుఖాలు మధ్య !
సూర్య తేజస్సు ప్రాణిపై రాత్రికి నీడ మాయం !
సర్వం మరచి హాయిగా నిద్రపోవటం రాత్రి మయం !
సూర్య తేజస్సు స్నేహం ధనం ఉన్నప్పుడు ఎక్కువ !
సూర్య తేజస్సు స్నేహం ధనం లేనప్పుడు తక్కువ !
సూర్య తేజస్సు స్నేహం ధనం ఉండి లేనప్పుడు మధ్య !
ప్రేమ, స్నేహం ఉన్న వారి మీద సూర్య తేజస్సు ఖాయం !
దృతరాష్ట్రుడికి పుత్ర వ్యామొహము వల్ల పుత్రుడు చేసేది
అధర్మము అని చెప్పలేక పోయినాడు, దేనికోసం !
దుర్యోధనుడికి రాజ్య వ్యామొహము వల్ల అందరి మరణమునకు
కారకుడైనాడు, దేనికోసం !
బలిచక్రవర్తి దాన చేయు వాడని, అధికార వ్యామోహము ఉండుటవల్ల పాతాళ మునకు నోక్కబడి నాడు, దేనికోసం !
రావణుడు స్త్రీవ్యామొహము వల్ల శతకోటి లింగార్చన చేసిన, శక్తి
పరుడైన మానవుని చేతిలో మరణించినాడు, దేనికోసం !
కృష్ణుడు జరాసందుడిని అర్ధరాత్రి పూట కోపము వచ్చు నట్లుగాప్రవర్తింఛి భీమునుచే విధికి వ్యతరేకముగా చంపించాడు, దేనికోసం !
కుచేలుడు వచ్చాడని తెలుసుకొని సిమ్హసనమునమీద కూర్చొపెట్టి
ఉపచారములు చేసినాడు, దేనికోసం !
ఎవరు ఏది చేసిన ధర్మంకోసం, ప్రేమకోసం, స్నేహంకోసం చరిత్రలో ఉన్న
విషయాలను, మంచిని గ్రహించి అందరు జీవించటం కోసం !
ఒకరి యందు ప్రేమ ఏర్పడి, అది సాస్విత ప్రేమగా మారుతుమ్దికాని అది క్షణిక ప్రేమ మాత్రము కాదు !
విజ్ఞానం కలిగించి, అజ్ఞానం తొలగించి, హెచ్చుతగ్గులలో ఉన్న నిజము తెలుపునది ప్రేమ, క్షణిక ప్రేమ మాత్రము కాదు !ఇరువురు కలిస్తే సృష్టి ఏర్పడుతుంది, రెండు వస్తువులు రాపిడికి అగ్ని పుడుతుంది, క్షణిక ప్రేమ మాత్రము కాదు !
నీకు సుఖము, సంతోషము ఇవ్వలేని ఈ యవ్వనం క్షణికం, ఉన్నా ఉన్నట్లు కాదు, అనుకోవటము తప్పు !
నిన్ను పొగడుటకు, కీర్తించుటకు చక్షు రిమ్ద్రియములు క్షణికం, ఉన్నా ఉన్నట్లు కాదు, అనుకోవటము తప్పు ! అధరామృతమును ఆస్వాదించలేని పెదవులు క్షణికం, ఉన్నా ఉన్నట్లు కాదు, అనుకోవటము తప్పు !
నీటికి బుడగ,నురుగు,కెరటము క్షణికం , ఉన్నా ఉన్నట్లు కాదు, అనుకోవటము తప్పు!
దేహమునకు బుద్ధి,మనసు, కోరిక, వైరాగ్యం క్షణికం, ఉన్నా ఉన్నట్లు కాదు అనుకోవటము తప్పు!
ఆత్మకు భార్యా, పిల్లలు, తల్లితండ్రులు క్షణికం , ఉన్నా ఉన్నట్లు కాదు అనుకోవటము తప్పు !
శరీరమునకు ఇంద్రయ్య సుఖములు క్షణికం , ఉన్నా ఉన్నట్లు కాదు అనుకోవటము తప్పు!
క్షణికం ఒక సంతోషం, క్షణికం ఒక దుఖం, క్షణికం ఒక వ్యాపారం, క్షణికంకానిది ఎదీలెదు.
మనుష్యుల మధ్య ఉండాలి మమకారం !
ప్రతి ఒక్కరు ఆరోగ్య్యానికి తినాలి ఉప్పు ,కారం !
ప్రతి ఒక్కరిలో ఉండాలి బుద్ధి పరోపకారం !
జనం చైతన్య్యంకి ఉండాలి ఎప్పుడు శ్రీకారం !
కొందరిలో నవ్వి, నవిమ్చటంలోనే ఉంది చమత్కారం !
ద్రొహుల మీదకూడ ఉండ కూడదు ప్రతీకారం !
ప్రభుత్యం ప్రజలసోమ్ముతో చేసుతుమ్ది వ్యాపారం !
ప్రజలు చూపుతున్నారు నాయ్యకులు చేసే పనులకు తిరస్కారం !
నాయకులకు మాత్రము ఉండాలి దండల పురస్కారం !
అందరిలో ఉండాలి సమత, మమతల తులాభారం !
భార్యా భార్తల మద్య ఎప్పుడు ఉండాలి సహకారం !
చూపులలొ, చుమ్బనాలలొ ఉంటుంది శృంగారం !
ప్రతిఒక్కరు తల్లితండ్రుల దీవెనలు పొందితే శ్రేయస్కరం !
ప్రతిఒక్కరు గురువుల దీవెనలు పొందితే యశస్కరం !
ప్రతిఒక్కరికి భయమును త్రుంచి, మనోధైర్య్యం పెంచి ,
సర్వసుఖములు అందించే హనుమంతుని ఆరాధిస్తే అంతా శుభకరం .
ప్రకృతి నియమము తప్పితే ప్రళయం !
భూమికి భారం ఎక్కు వైతే వస్తుంది ప్రకంపం !
మనుష్యుల మద్య నియమము తప్పితే ప్రమాదం !
స్త్రీలను అందరిముందు అవమానిస్తే ప్రమోదం !
స్త్రీ పురుషుల మద్య ఎప్పుడూ ఉంటుంది ప్రేమమయం !
జీవితానికి అర్ధం లేదను కుంటే విచారం !
జీవితానికి ప్రేమే ముఖ్యం అనుకుంటే సుఖం !
జీవితానికి సంతృప్తి అనే ఆయుధము ఉంటే అంతా సుఖమయం !
రవ్వంత వెలుగు కోసం, ఊపిరి నిలబట్టే గాలికోసం, నీడకోసం,
ప్రేమ కోసం, ప్రతి ఒక్కరు నడవాలి జీవిత పయణం !
చిత్తసుద్ధితో చేసేపనికి దైవానుగ్రహం, స్రమజీవనమె నాకు తారకమంత్రం !
35.ఉచిత సలహా
రుచిగ ఉందని గొమ్తుదాక తినకు, అజీర్తి వల్ల అడ్డం పడకు !
బలం కోసం అదేపనిగా మందులు వాడకు, అదేపనిగా మాంసం తినకు !
సుఖం అంగడిలో దొరికే వస్తువు కాదు, సుఖం కోసం పరకాంత వెంటపడకు !
వృద్ధాప్య్యంలో నడిస్తే చాలు, యవ్వనం కోసం వ్యాయామము చేయకు !
గులాబిని వదిలి గాజు పూలకు ఆశపడకు, చేసినదానికి పశ్చాత్తాప పడకు !
శ్రమపడక దేవుడా నీవె దిక్కని అనకు, శ్రమపడితేనే సుఖనిద్ర అని మరువకు !
ఆచారాలు, నమ్మకాలు, దేవుళ్ళ పేరుతొ అర్ధంలేని పనులు చేయకు !
కుటుంబ సుఖం కోసం, పరులను వేదించకు, హత్సలు చేయకు !
చేయలేని పనిచేస్తానని ప్రగాల్పాలు పలికి నలుగురులో అవమానపడకు !
జరిగేవి అన్ని జరుగక మానవని గాలిలో దీపముపెట్టి నివేదిక్కని అనకు !
చెడు అనకు, చేడువినకు, చేడుకనకు, చేడుచేయకు ఇదే నా ఉచితసలహ !
36.ధ్య్యాస ! రుచిగ ఉందని గొమ్తుదాక తినకు, అజీర్తి వల్ల అడ్డం పడకు !
బలం కోసం అదేపనిగా మందులు వాడకు, అదేపనిగా మాంసం తినకు !
సుఖం అంగడిలో దొరికే వస్తువు కాదు, సుఖం కోసం పరకాంత వెంటపడకు !
వృద్ధాప్య్యంలో నడిస్తే చాలు, యవ్వనం కోసం వ్యాయామము చేయకు !
గులాబిని వదిలి గాజు పూలకు ఆశపడకు, చేసినదానికి పశ్చాత్తాప పడకు !
శ్రమపడక దేవుడా నీవె దిక్కని అనకు, శ్రమపడితేనే సుఖనిద్ర అని మరువకు !
ఆచారాలు, నమ్మకాలు, దేవుళ్ళ పేరుతొ అర్ధంలేని పనులు చేయకు !
కుటుంబ సుఖం కోసం, పరులను వేదించకు, హత్సలు చేయకు !
చేయలేని పనిచేస్తానని ప్రగాల్పాలు పలికి నలుగురులో అవమానపడకు !
జరిగేవి అన్ని జరుగక మానవని గాలిలో దీపముపెట్టి నివేదిక్కని అనకు !
చెడు అనకు, చేడువినకు, చేడుకనకు, చేడుచేయకు ఇదే నా ఉచితసలహ !
ఇష్టమైన దేవతా విగ్రహము ముందు కూర్చొని తదేకద్రుష్టితో ధ్య్యాస !
ఇష్టమైన దైవాణ్ని ఒక కాంతి స్వరూపముగా భావించి తదేకద్రుష్టితో ధ్య్యాస !
నాసికారంద్రములుద్యారా ఉచ్చ్స్వాస నిస్వాసములపై తదేకద్రుష్టితో ధ్య్యాస !
వ్య్యక్తిగత మనస్సును విశ్వా త్మక అనుసంధానం చేసే ప్రక్రియపై ధ్య్యాస !
క్షణ భంగురమగు ఇమ్ద్రియభోగాశక్తి తగ్గి శాశ్వత శాంతి మూలము ధ్య్యాస !
కాలచేక్రబ్రమణములో అమృత ఘడియలలో చేయాలి తదేకద్రుష్టితో ధ్య్యాస !
మహాసౌఖ్యముగ బ్రహ్మా ముహుర్తమునందు మనోనిగ్రహసక్తే ధ్య్యాస !
నిత్యమూ వేద పారాయణము, ఉపనిషత్తుల భొదపై తదేకద్రుష్టితో ధ్య్యాస !
భౌతికపదార్ధము నిజముగా లేనే లేదు, అదొక భ్రాంతిగా గుర్తించి పెట్టు ధ్య్యాస !
దుశ్చరితులకు, అశాంతమానసులకు, అనుమాన పరులకు కలుగదు ధ్య్యాస !
ఇమ్ద్రియనిగ్రహముతొ, గ్రుహశ్రమములొ సతీసమేతముగా త్రికరణ శుద్ధిగా
సుర్యా సనములు, ఇష్టదైవ ప్రార్ధనలు చేస్తే కలుగును సత్యజ్యోతిపై ధ్య్యాస !
37.జీవిత గమణాలు
నాలుక చివారే సిరి సంపదలు
నాలుక చివారే మిత్రులు, భందువులు
నాలుకచివారే కారాగార శిక్షలు
నాలుకచివారే కొందరి మరణాలు
నాలుకచివారే ఆకలి ప్రకంపణలు
నాలుకచివారే కొదరి ఆర్తనాదాలు
నాలుకచివారే మృగాల కోరికలు
నాలుకచివారే కొందరి స్త్రీల వేదనలు
నాలుకచివారే కొందరి వాంఛలు
నాలుకచివారే ఉంటాయి స్వప్నద్రుస్యాలు
ప్రతిజీవిలొ సుఖ దుఖాలు, మంచి చెడులు
పాప పుణ్యాలు పృకృతి అనుసరించి నడకలు
వేమ్బడిమ్చే సహజ త్రిగుణాలు
సూర్య- చంద్రలులతొ జీవిత గమణాలు
38.చీకటి
తమల వృక్షా లవల్ల అంతా అంధకారం వెల్తురు మాయం !
ఉరములు, మెరుపులను, అదేపనిగాచూస్తే భదిరులవుట ఖాయం !
తల్లి కడుపులో పిల్ల అంధకార మలపంకములమధ్య ఉండుట సృష్టి మయం !
మత్తుకు బానిసైనవారు కళ్ళున్న లోకం గుడ్డిది అనుట ప్రముఖం !
సంతృప్తి లేని హృదయం ఎప్పుడు వెలితితో వెలుతురుని చూడలేని భయం !
సంపదలు, వనరులు, అవధులు దాటితే అంతా చీకటి మయం !
మానవుల జీవితాలు మాటలపై ఆధారం, దాటితే అంధకారం !
కళ్ళకు కాటుక చల్లదనం, అదే ఎక్కువగా పెట్టుకొట్టే చీకటి మయం !
కల్లుమూసుకుంటే నిరాకర దైవం, తెరిచి చూస్తే సాకార దైవ మయం !
కళ్ళు మూసుకొని గుండెలోతుల్లోకి వెడితే నిరాకార చైతన్యం !
కళ్ళు తెరచి చుట్టూ తేరిపార చూస్తే సాకార తత్త్వం !
చూపులతో రాజ్యాలు కూల్చ వచ్చు, కాపురాలు చెడగోట్టవచ్చు,
చూపులతో మత్తెకించి మనస్సుని దోచి చేయును చీకటి మయం !
39. లేదు
ఎంత నీరుచెరిన సముద్రానికి దాహము తీరుట లేదు !
భగవంతుడు మానవులకు కోర్కెలు తీర్చిన ఆశ మారుట లేదు !
ఎందరు పరుషులు వచ్చి త్రుప్తిపరిచిన కులట తృప్తి పడుట లేదు !
ఎందరు మరణించిన మృత్యువుకు ఆకలి తీరుటలేదు !
గాలిని భంధించే ద్వారము లేదు, సముద్రాన్ని కొలిచే తాడులేదు !
సూర్య కిరణములకు ఎదురు నిలబడి చూసె నాకు శక్తీ లేదు !
సృష్టికి, ప్రకృతికి, ప్రుద్ధ్వికి, ఆకాశ మునకు వ్యతిరేకముగా ప్రవర్తించ లేదు !
పరుగులు తీసేవారికి ఆలోచన , ప్రసాంతత ఎప్పటికి ఉండ లేదు !
ప్రేమలేనివారికి అనురాగం, ఆత్మీయత, తెలియుట అవకాసము లేదు !
కోపమువచ్చినవారకి ఏది అనవచ్చో, ఏది అనకూడదో తేలి యుట లేదు !
అహంకారము ఉన్నవారికి వావి వరుసలు తెలిసికొనే అవకాశము లేదు !
ఆంగ్లము రాలేదని దిగులు లేదు, తెలుగు వచ్చినందుకు పోమ్గిపోవుట లేదు !
తెలుగు భాష మరుగై పోతుందని భాదగా ఉంది, బ్రతికిమ్చుకొనుటకు మార్గము తేలియుట లేదు !
40.ఆకలి
అప్పుడే పుట్టిన లేగదూడకు పొదుగు అందించి ఆకలి తిర్చనది !
ఆకలికోరకు వళ్లు అమ్ముకొని అమ్మగామారి బిడ్డను కుప్పతోట్టిన ఉంచినది !
ఆకలికి మనుషుల మధ్య ఒక పావుగామారి కొరికతీర్చె బలి పశువు ఐనది !
కొవ్వత్తి వెలుతురు పంచి కరిగినట్లు, బిడ్డాకలితీర్చి శీలరక్షణకు ప్రాణాలు అర్పించినది !
మానవ మృగాల ఆకలి తీర్చి ఈలోకములొ బ్రతకలేక వాయువులో కలిసి పొఇనది !
ఆకలిగాఉన్ననక్క కుందేలును వేటాడుతుంది, ఆకలిలేని సింహం నిదురపొతుంది !
ఆకలికి చిన్న పెద్ద భేధములేదు, దొరికిన ఎంగిలాకులను తినే బ్రతుకు కొందరిది !
ఆకలిఉన్నవారికి ఆలోచనరాదు, అన్వేషణ జరిగి ఆకలి తిరేదాక నిద్రపట్టని లోకమిది !
మూగ జీవులను, జలచరాలను తెచ్చి, ఆకలికి వండుకొని తినే కాలమిది !
దురాశపరులు తనుతినక, ఇతరులను తిననీయక ఆకలినే తినే కాలమిది !
పగలు పోష్టికాహారము తిని రాత్రిపూట పాలు పండ్లు తినుట ఈకాలమ్ మంచిది !
కొందరి ఆకలి కనీసము తీర్చుటకు అన్నదానము చేయుట మంచిది !
ఆకలి తట్టుకోలేక మూర్ఖులుగా మారకుండా జాగర్త పాడుతా మంచిది !
41.ఏది ఏది అనకు
సంఘ సంస్కరణాలను గురించి చెప్పుటంకాదు ఆచరణ ఏది !
కుటుంబ సమస్వలతో సతమైన వాడికి ప్రశాంతత ఏది !
నక్షత్రాలు రాత్రి కనబడు తాయి పగలు కనబడవని ఆలోచనేది !
భగవమ్తునిగూర్చి తెలుసుకోవాలని అనుకొనే వారికి దారి ఏది !
చంచలమైన మనస్సును అదుపులోపెట్టుటకు మార్గము ఏది !
పాపాలు చేసేవారిని పాపాలను లెక్కకట్టి శిక్ష వేసేదేది !
చేడుమార్గామునుండి మంచిమార్గామునకు మారే శక్తీ ఏది !
అవినీతిని, అధర్మమును, అంతము చేసే ప్రభుత్యము ఏది !
సమస్వలను పరిష్కరించి, కాపాడే ప్రభుత్యము ఏది !
చట్టాలను, చుట్టాలను ఆదరించే సంస్కారముగల దేశము ఏది !
ఏది ఏది అనుకు నేను దేశానికి చేస్తున్నాను ఇది ఇది అను !
42.హృదయము
రక్త నాడులతొ భంధనమై అదేపనిగా శబ్ధము చేయుచూ !
వలలో చిక్కిన పక్షిలా, తప్పుచేసి భార్యకు చిక్కిన భర్తలా దడ దడ లాడుచూ !
నీటి ఉరవడి, గాలి సవ్వడి , అగ్నిలా భగభగ మండుచు శబ్ధము చేయుచూ !
సూర్యగమనము, చంద్రగమనము, నాగామానము ఒక్కటే అగుచూ !
కోర్టులో తీర్పు, బంగారములో మెరుపు, కీచురాళ్ళ అరుపు ఒక్కటే అగుచూ !
కవిలో భావం, పద్య్యంలో యతి ప్రాస, మూర్ఖులలొ మార్పు, నాలో దడ ఒక్కటే అగుచూ !
బిదవారు నాభాద అర్ధం చేసుకోరు, ధనికులు కొద్దిభాదకే దడ దడ లాడుచూ !
ఆలస్యము ఐనప్పుడు తొందర్లో నేను బయట పడతాననుచూ !
అవసరములేకున్న ప్రతివోక్కరిని నేను ఉడి కించు తాననుచూ !
సకల జీవకోటి సంరక్షణ నా మీద ఆధారపడి ఉండు ననుచూ !
నాది నీదగ్గర, నీది నాదగ్గర , ఇరువురి హృదయము ఒక్కటే అనుచు
43.నేటి సమాజంలో ఎలా బ్రతకాలన్న
తొడలు పట్టి చీల్చి చండాడే తోడేళ్ళుల ప్రవర్తించే మనుషులున్న !
పిరికితనం వదిలి ఎదిరించే స్వభావము, ఆత్మ ధైర్యం పెంచా లన్న!
భయంకర మైన భల్లూక విన్యాసాలు చేస్తున్న భల్లూకాల మద్య ఉన్న !
ఆకతాయి పనులు చేస్తూ అల్లరి పెట్టే వారిని తరిమి తరిమి కొట్టాలన్న !
నమ్మించి మోసం చేసే జిత్తులమారి నక్కల స్వభావముగల వారున్న !
నమ్మినట్లు నటించి నక్క జిత్తులు చూపే వారినుండి తప్పించు కోవాలన్న !
బుసలు కొడుతూ అందరిని భయపెట్టే విషసర్పాలవంటి మనుషులున్న !
పాములా మెలికలు తిరుగుతూ సర్పాలకు వెలుగు చూపి పోరాడాలన్న!
ఏమి తెలియక అమాయకులను మోసము చేసే మేకవన్నె పులులున్న !
కలియుగములో బ్రతకాలన్న అందరు మృ గాలను వేటాడే విద్య నేర్చుకోవాలన్న !
తావలచింది రంభ అని, తానుపట్టిన కుందేలుకు మూడే కాల్లని వితండవాదులున్న!
మానోనిగ్రహశక్తితో, తమశక్తిని కేంద్రీకరిమ్చి, ముష్టిఘాతములతో ఎదిరించమన్న !
ఆగి కళ్ళతో చూస్తే వేటకుక్కలు సహితం తోక ముడుచుకొని వెనుతిరుగుతాయన్న !
44.మాతృశ్రీ !
కళా కౌశలం కిరణ్మయి, సృజన స్వరూప సుందరి !
నాట్య నటనా మయూరీ, మన్మధ మంజుల మోహిని !
కన్నీరు ఎరగని కళ్యాణి, అందమైన అనురాగ అరుంధతి !లలిత లావణ్య లావంగి, మృదు మనోహర మోహనాంగి !
రమ్య రసమయి రాగిణి, నవరస నటనా నారాయణి !
తేట తెలుగు తేజస్వని, వగలు వలికించిన వరూధిని !
రాగయుక్త రస రంజని, చిందులతో చింతతిర్చే చింతామణి !
రుగ్మత ఎరుగని రుక్మిణి, సరనన్న శక్తినిచ్చే సర్వాణి !
సంతోషాలు పంచే సంతోషిణి, వెలుగును పెంచే ప్రకాశిని !
భాదలు భరించే భగిని, శత్రువులను హింసించే రుద్రిని !
సరస సల్లాపాల సావిత్రి , సకలశుభాలు ఇచ్చె శుభాంగి,
పాపాలని భరించే భారతి, సమతలాలు మోస్తున్న భూదేవి!
సంగిత స్వరాల సరస్వతి, పరిర్స్జాట పరిమళం ఇచ్చే పార్వతి !
మక్కువతో మధురను పంచే మాధురి, కరుణా స్వరూపిణి !
మనసుకు శాంతిని అందించి మమతలెరిగిన మాతృశ్రీ !
45.అవసరం
అరుణోదయం నిద్రలేఛి పూజకు ఆవసరం !
అనురాగం, అనుభందం, ఆత్మీయతకు ఆవసరం !
అరమరికలులేని అరుగు సుఖనిద్రకు ఆవసరం !
అమ్మమాట కుటుంబములో ఉన్న అందరికి ఆవసరం !
మార్పును స్వాగతించే ధైర్యం అందరికి ఆవసరం !
బాధ్యతలను స్వీకరించే శౌర్యం అందరికి ఆవసరం !
కలకాలం యవ్వనం పొందే సౌఖ్యం అందరికి ఆవసరం !
ఇష్టాలకు ప్రశాంతి చేకూర్చే భాగ్యం అందరికి ఆవసరం !
అత్యాస లేకుండా ఆరోగ్యముగా జీవించుట అందరికి ఆవసరం !
నిర్మలంగా, నిత్యలత్వముగా, ఉండుట అందరికి ఆవసరం !
ఏవిషయములోను తలదూర్చగా ఉండుట అందరికి ఆవసరం !
మనస్సు ప్రశాంతతకు మంచిమాటలు అవసరం !
హృదయాలు కలవటానికి ప్రేమ అవసరం !
స్త్రీకి పరుషుడు అవసరం, పురుషుడికి స్త్రీ అవసరం !
అందరికి ఆపరమాత్ముని దీవెనలు అవసరం !
పితృ దేవతలను సంతోషపరుచుట ప్రతిఒక్కరికి అవసరం.
46.యువతకు నా హితవు
యువతియువువకులార నేచ్చేప్పేది గమనించండి, అలోచించండి, ఆచరించండి !
మీరు నిరుద్యోగులు కారండి, ప్రభుత్వమువారు ఉద్యోగములు కల్పించ లేదనకండి !
చదివిన చదువు ఎంతవరకు దేశానికి ఉపయోగపడుతుందొ తులాభారం వేయండి !
చదువు కేవలము భుక్తి కోసం అనుకోకండి, నలుగురి శక్తిని పెంచేదని మరువకండి !
ఎవరు ఎమన్నా ఆలోచనలు పెట్టుకోక, మీభవిషత్తుకు ఒకదిశ నిర్దేశం నిర్మించు కొండి !
నాయకులప్రలోభాలకు లొంగి ఉద్యమాలలో పాల్గొని చదివిన చదువును వ్యర్ధపర్చకండి !
తల్లి తండ్రులను అవమానపరిచే, ఉద్యమాలలో పాల్గొని నేర్చినవిద్యను దుర్విని యోగపర్చకండి !
పట్టుదలతో సాధించలేనిది లేదని గమనించి, హనుమంతుని ప్రార్ధించి మరో ప్రయత్నం చేయండి !
కలి యుగంలో ధనంతో కొనే చదువుగా మారిందండి, భవిషత్తులో ఆచదువు ఉపయోగపడదండి !
తల్లి తండ్రులు మీరు ఎదికోరిన దానిని ఇచ్చెందుకు చివరిరక్తపుబోట్టు వరకు శ్రమిస్తారని తెలుసుకోండి !
ఇతరదేశాలలో చదువుకోనుటకు సహకరించలేదని తల్లి తండ్రులను కోపముతో ద్వేషించకండి !
మనకుటుంబ పరిస్తితులను గమనించి, తల్లి తండ్రులకు సహయ్యముగా ఉండి, శ్ర మించండి !
అపరమాత్మలీలలు ఎవరికీ అర్ధం కావు, ఒర్పువహించి, చదివానని అహంభావం లేకుండా ఉండండి !
కులవృత్తిని అవలంభించి, చదివిన చదువును ఉపయోగించుకొని జీవితం సాగించాలి.
47.మన అమ్మెకదా
నవమాసాలు గర్భమును పదిలముగా మోసి !
మాసమాసాలలో పిండములో మార్పులు భరించి !
ఇంటిల్లిపాటివారికి సేవలుచేస్తూ, ఉదరములో కదలికలు తలచి !
ఊపిరినిపోసి, ఊపిరిబిగపెట్టి బిడ్డకు జన్మ ఇచ్చింది అమ్మే కదా.
రోమ్ములభాదను భరిస్తూ, పాలను బిడ్డకు అందించి ! జన్మ జన్మల భందమని, జన్మ సార్ధమైనదని భావించి !
నిదురపట్టేవరకు పక్కతడిపిన పక్కలో పవళించి !
కన్నా కన్నా అని ముద్దు మురిపాలను అందించినది అమ్మే కదా.
బుడి బుడి నడకలు నడుస్తున్నప్పుడు జారకుండా జాగర్త వహించి !
ఎక్కడదెబ్బ తగులుతుందో నని అడ్డముగా ఉన్న వస్తువులను తొలగించి !
ఏడ్చి నప్పుడు ఊయలలో పరుండ పెట్టి,లాలి,జోల, పాటలు,స్వర పరిచి !
పిల్లవాడిని అత్తమామలకు, తల్లితండ్రులకు, మేనమామలకు, చుపునది అమ్మే కదా.
తప్ప డడుగులు వేయకుండా, చేయి పట్టుకొని నడి పించింది !
ఆడుకోటానికి లక్కపిడతలు, రబ్బరు బొమ్మ్మలు, కొనిచ్చింది !
మారం చేసినప్పుడు నాలుగు దేబ్బలు వేసి తను భాద పడేది !
ప్రొద్దున్న, సాయంత్రం, వద్దనా బలవంతముగా పాలుఇచ్చేది అమ్మేకదా !
పిల్లవాడికి శరీరం కొద్దిగా వేడెక్కితే అందరిని గాబరా పెడుతుంది !
జలుబు,దగ్గు, ఉందని తెలిస్తే చాలు వైద్యుని వద్దకు తీసుకు వెళ్ళినది !
దగ్గర ఉండి సూదిమందు వేయించి రాత్రంత నిద్రపోకుండా సేవలు చేసింది !
పిల్లవాడేలోకంగా, భర్తే దైవముగా, పెద్దల సేవే పరమాత్మంగా భావించింది అమ్మేకదా !
అమ్మ ఎప్పుడు ప్రేమను పంచే పనిలో తలమునకలై ఉంటుంది !
బెంగపడే పిల్లలకు కధలుచెపుతూ ప్రేమానే మందుతో మురిపిస్తుంది !
పిల్లవాడిలో వచ్చిన భయాన్ని తొలగించి ధైర్యం నూరి పోస్తుంది !
పిల్లవాడి వచ్చిరాని ముద్దు మాటలువింటూ తన్మయత్నంతో మురిసిపోయేది అమ్మే కదా !
ఒనామ: శివాయ: సిద్ధం నమ: అని అక్షరాభ్యాసం చేయించ్చింది !
అందుబాటులొఉన్న, పరిశుబ్రముగాఉన్న, విద్యాలయములొ చేర్పించింది !
పిల్లవాడు తిరుగోచ్చేదాక వీధి గుమ్మ వద్ద కళ్ళల్లో వత్తులు పెట్టుకొని ఎదురు చూసింది !
ఆలస్యమైతే నేరుగా విద్యాలయముదాక వచ్చి పిల్లవాని చూసి సంతోష పడేది మన అమ్మ .
48.ప్రేయసి.
విశ్వం విస్తరిస్తుంది, పుష్పం పరిమళిస్తుంది, నీ ప్రేమకోసమని !
గగనములో ఉన్న ఒక తార నప్రేమకోసం భూమికి దిగి వచ్చిందని !
నాలొఉన్న నిజమైన ప్రేమను నీకు తెలపాలని నిచుట్టు తిరుగుతున్నానని !
నాలో ఉన్నతప్పును చూపి, నన్ను ద్వేషించు, ప్రేమనుమాత్రం దుషించకు ప్రేయసి .
రంగులరాట్నంలా, పొద్దుతిరుగు పుష్పములా, నీ చుట్టూ పరిబ్రమిస్తున్నాను !
నాచదువు, నిను పోషించగల శక్తి ఉందని ధైర్యంగా నీకు చెపుతున్నాను !
ఎన్నో రోజులనుండి నిన్ను కలవాలని, నీ ప్రేమపొందాలని ఎదురు చూస్తున్నాను !
నీవు నాకు నచ్చలేదు అని ఒక్కమాటతో నా ప్రేమను ముక్కలు చేసావు ప్రేయసి.
నన్ను మన్నిస్తావని, నేను ఆశిమ్చినది తప్పుకాదని, నాప్రేమ ఫలిస్తుందని,
నా అసమర్ధత, నాస్వార్ధం, నాపట్టుదల, నిన్ను భాద పెట్టి ఉండవచ్చని !
నలొఉన్న కల్ముషాన్ని వదలి, నీ ప్రేమఫలిమ్చేదాక వేచి ఉంటానని !
నీ కుటుంబ సమస్యలను నేను తీరుస్తాను, భాపడక నన్ను ప్రేమించు ప్రేయసి..
ప్రేమేసర్వస్వం, ప్రేమే ముఖ్యం, ప్రేమేసాశ్వితం,అని తల్లి తండ్రులను తప్పుపట్టాను !
నా కర్తవ్యం తెలుసుకొని, ప్రేమిమ్చబడని స్త్రీని ఆసిమ్చటం మంచిది కాదనుకున్నాను !
పెదాలపై చిరునవ్వు మాయమై పోగొట్టుకున్న వస్తువును వెదికాను!
స్మృతిపథంలో ఉన్న ప్రేమను మరచి బ్రతికి బ్రతికించు మార్గమును వేదుకు తున్నాను !
తల్లితండ్రులు చెప్పిన సంబంధమును చేసుకొని జీవిత మార్గమును సుఖమయము చేసుకోగలను !
నన్ను అర్ధం చేసుకొని నన్ను మరచి పోతుందని నమ్మకము ఉంది నా ప్రేయసికి.
రెండు హృ దయాలు కలవాలన్న, మానవ ప్రయత్నం, దై వసంకల్పము కలసి ఉండును ! మనసంస్కారం ప్రకారం పారిణయము జివతములో ముఖ్య మైనదాని తెలుసుకున్నాను !
స్నేహభావముతో, పవిత్రభావముతో, మన పెద్దలు చెప్పనా మార్గములో నడుస్తాను !
క్షణిక ప్రేమకోసం పెద్దలను ఎదిరించ లేనని, విడమరచి చెపుతాను నా ప్రయయసికి !
ప్రేమేసర్వస్వం, ప్రేమే ముఖ్యం, ప్రేమేసాశ్వితం,అని తల్లి తండ్రులను తప్పుపట్టాను !
నా కర్తవ్యం తెలుసుకొని, ప్రేమించ బడని స్త్రీని ఆసించటం మంచిది కాదనుకున్నాను !
తల్లితండ్రులు చూపిన పెల్లికూతురు ఫోటోను చూసి, ముద్దు పెట్టుకొని గంతేసాను !
నేను ప్రేమించిన వ్యక్తి నాజీవిత భాగస్వామిగా వస్తుందని దేవునికి కృతజ్ఞత తెలుపుతున్నాను.
49.వృత్తి
కమ్మరి కొలిమి మూతపడింది, వారి బ్రతుకులు వీధి పడ్డాయి !
కమ్మరి చేక్రం నడవడం లేదు , వారి జీవితాలు దుర్భర మైనాయి !
మేదరి అల్లికలు కనబడుటలేదు, ఆకుటుమ్బాలే అల్లికలుగా మారాయి !
మనం కుటిరపరిశ్రమలోవి వస్తువులు వదలి పరదేశి వస్తువులపై మోజు పెరగటము కదా !
సాలెల మగ్గంకు నూకలు దొరుకుటలేదు, నేతవస్త్రములను కొనువారు కరువా యి !
జాలరి పగ్గంకు చేపలు దొరుకుటలేదు, దొరికిన అమ్ముకొనుటకు దళారులు ఎక్కువాయి !
కంసాలి వద్ద నగలు చేయించు కొనేవారు రావటములేదు, యంత్ర నగలు తయారీ ఎక్కువాయి !
మనం కుటిరపరిశ్రమలోవి వస్తువులు వదలి పరదేశి వస్తువులపై మోజు పెరగటము కదా !
కొడవలితో చేనుకోసేవారు కానరావటములేదు, కూలీల నోట్లో మన్నుకొట్టి యంత్రములు వాడుతున్నారాయి !
కట్టేలుకొట్టి బ్రతికే బ్రతుకుకు మార్గము లేదు, గ్యాసు, కరంటు, వాడుటవల్ల కట్టెకు విలువ లేకుండా పోయి !
బొమ్మలు చేసే కళాకారులు చేయుటలేదు, యంత్రములతో తయారైనా బొమ్మలకు నగిషీలు ఎక్కువాయి !
మనం కుటిరపరిశ్రమలోవి, వస్తువులు వదలి, పరదేశి వస్తువులపై మోజు పెరగటము కదా !
***************************************************
**************************************************
50. సంక్రాంతి
సంక్రాంతి ఆంద్రుల అతి పెద్ద పండుగ రోజు !
శ్రీ మహావిష్ణువు అసురలను మంధరపర్వతం క్రింద మట్టుపెట్టిన రోజు !
భగిరధుడు శివుని ప్రార్ధించి గంగను భూమిపై ప్రవహింప చేసినరోజు !
క్కాలము విలువ తెలిసుకొని ప్రతిఒక్కరు జీవితము సుఖమయం చేసికోనేరోజు !
చిక్కని చీకటిలో, వెలుగు చిమ్మే వెన్నలలో గజ గజ వణికించే చలి !
వాకిళ్ళు సుబ్రముచేసి ఆవు పేడతో కల్లాపు చల్లె తెలుగింట ముంగిలి !
కుటుంబ సభ్యులు అందరు కలసి ముగ్గులు పెట్టి సంతోషపు లోగిలి !
సూర్యోదయం కాకమునుపే స్త్రీలు ఓపికతో శ్రద్ధగా వేసే ముగ్గుల కూడలి !
సింధు లోయలలోని శిధిలాల్లో, హరప్పాలో, మెలిక ముగ్గుల చిత్రాలు !
తమిళనాడులోని పసుపతీశ్వరాలయ శిల్పాలపై ముగ్గుల చిత్రాలు !
తమిళనాడులోని ఔషధీశ్వరాలయలో మూడు త్రిభుజాలలో మెలిక ముగ్గులు !
ఆముక్తమాల్యద, విజయ విలాసం, మరియు అనేక గ్రంధాలలో ముగ్గుల వివరణలు !
ముగ్గులమధ్య ఉంచుతారు పసుప,కుంకుమ అద్దిన గొబ్బెమ్మలు !
నాలుగు గొబ్బెమ్మల మధ్య ఒక పెద్ద గొబ్బెమ్మ ఉంచి పూల అలంకరణలు !
హరి కీర్తనలు చేస్తున్న హరిదాసుకు తలపై ఉన్న పాత్రలో పోస్తారు ధాన్యపు గింజలు !
గంగిరెద్దు సహిత శంకర పరివారంకు ఇస్తారు వస్త్రాలు, ధాన్యపు గింజలు, పైసలు !
గగనసేమలో పగటిపూట నక్షత్రాల వలె ఎగరవేస్తారు గాలిపటాలు !
సంబరముగా అల్లుడు అత్తగారింటికి వచ్చి మరదల్లతో ఎకసక్కాలు !
ఊరు అంతా ఒకచోటచేరి కాస్తారు కోడిపందేములు,ఎడ్ల బండి పందెములు !
రైతులు చెమటోట్చి పండించిన ధాన్య్యమును కొందరు చేస్తారు దానములు !
ఇంట్లో ఉన్న పాత టేకు వస్తువులను ఒక చోట చేర్చి వేస్తారు భోగిమంటలు !
ధనుర్మాసమున రొజూ తెల్లవారుజామున భక్తులు చేస్తారు నగర కీర్తనలు !
భోగిసాయంత్రమున, ముత్తైదువులను పిలిచి బొమ్మలకోలువుకు పారంటములు !
రేగిపళ్ళు,సనగలు,పూలు,పైసలు కలసిన వాటిని పిల్లలపై కుమ్మరించి ద్రిష్టి తీస్తారు !
సంక్రాంతి రోజున పాలుపొంగించి దానితో తయ్యారు చేస్తారు తీపిపదార్ధాలు !
కబుర్లతో అరెసలు,బొబ్బట్లు,పులిహొర,పొంగలి చేస్తారు పిండి వంటకాలు !
సంక్రాంతి నాడు పితృ దేవతలకు వదులుతారు తర్పణాలు, చేస్తారు దాణాలు !
సంక్రాంతి నాడు వైష్ణవ భక్తులు ధనుర్మ్సవ్రతమును ఆచరించి గోదా కళ్యాణం చేస్తారు !
సూర్యుడు తనకుమారుని శని ఇంటికి వెళతాడని చెపుతున్నాయి పురాణాలు !
ఉత్తరాయనమునందు మరణించినవారు పుణ్యలోకాలకు పోతారని నమ్మకాలు !
భారతీయ సాంప్రదాయము ప్రకారం చాంద్రమానాన్ని నను సరించి వస్థాయి పండుగలు !
ఆది శంకరా చార్యులు సన్యా సము పుచ్చుకొన్నది సంక్రాంతి పర్వదినము నాడు !
51.జీవిత చక్రం
ప్రతి అల ఎగుడు డగుడు వలే ఆవర్తన రూపమున జరుగుతుంటాయి !
అలల వలే అందరి జీవితములలో సుఖ దు:ఖాలు జరుగుతుంటాయి !
నిరంతర నదీ ప్రవాహము సుడులు తిరుగుతూ సముద్రంలో చేరుతుంటాయి !
మనశరీరములోని ప్రతి భాగము క్షణ పరిమాణములో మారుతుంటాయి !
చెట్లు ప్రకృతి అనుసరించి ఆకులు రాల్చి, మరల ఆకులు చిగురిస్తుంటాయి !
మనశరీరములో అనారోగ్యము ఏర్పడి మందులతో ఆరోగ్యవంతుడాయి !
మెట్టు మెట్టు కాలు మార్చి పైకి ఎక్కి నెమ్మదిగా పైమెట్టు వరకు చేరటమోయి !
ఇల్లాలు, పిల్లల కోరికలు తీర్చికుంటూ సంసారనావను నడిపించటమోయి !
సైకిలు ఓపికున్నంతవరకు తొక్కుకుంటూ ముందుగా గమ్యం చేరాలోయి !
ఎట్టి పరిస్థితిలో ఎవ్వరూ కూడ ఆధేర్య పడకుండా, ధర్మమార్గమున నడవాలోయి !
సముద్రములో సుడిగుండాలు ఏర్పడి ప్రతివస్తువును తనలోకి లాకుంటాయి !
వ్యసనము అనే కొత్త అలవాట్లు నేర్చుకొని కొందరి మనస్సును భాదపెడుతుంటాయి !
భూమిలో బంగారపు గడ్డలు ఎంతో ప్రయత్నము మీద కొందరి దొరుకు తుంటాయి !
కష్టపడి కష్టమునకు కూలి అడిగితే, అనుకున్నదానికన్నా ఎక్కువ ఇస్తుం టారోయి !
మనుష్యులకు ఎప్పుడు ఉండకూడదు మానసిక వ్యధలోయి !
మానసిక వ్యధవలన కుటుంబలో ఉన్న అందరికి కలుగును భాదలోయి !
భాద వలన కుటుంబములో ఎ పని చెయ్యలేక మానసిక రోదనలోయి !
ఇది ఒక జివితచక్రం అని తలచి ఓర్పుతో, వినయంతో బ్రమించాలోయి !
52.ఓ తల్లి ఆవేదనా
ఇన్నేళ్ళుగా నీవు నన్నెలా చూసినా, నాకంటూ ఏ గుర్తిమ్పు లేకపొయినా !
జానెడు పొట్టకోసం ఒక మూల ఉండనా, నే చేయగల పనిని చేసి పెట్టనా !
వంటింటిలో వంట చేసి పెట్టనా, అందరి ముందుకు రాకుండగా దాగి ఉండనా !
నా అవసరము ఎవరికైనా ఉండునా, కసువు ఊడ్చిన చీపురలా ఒక మూల ఉండనా !
నా మౌనానికి, దు:ఖానికి దారి దొరుకునా, అంతరాత్మను చమ్పుకొని బ్రతక వలెనా !
బ్రతికి చెడిన దానిలా ఉండి పోవలెనా, నేను ఇల్లు తుడిచే గుడ్డలా బ్రతక వలెనా !
వయసు పెరిగినా, నరములు వనికినా, కొడుకు ఇంట ఉండి సేవ చేయ వెలెనా !
కంటికి చూపు తగ్గినా, కాళ్ళకు రక్షలు లేక పోయినా, నా మాటలు తడబడినా !
నాబిడ్డ పాపల కోసం, నా ప్రేమ పాశానికి బలిపీఠము ఎక్కవలసిన పరిస్థితి వచ్చేనా !
నా చదువు నలుగురికి పనికి రాకపోయినా, ఓ తాల్లిగా గుర్తించి గౌరవించలేకపోయినా !
వృద్ధాప్యములో తోడులేక నాలాగా ఎవరు వేదన పడినా అది ప్రేమఎక్కువగుట వలనా !
53.అమ్మా నీవు అధికారం చేలాయించు
అమ్మా నీ వెందుకమ్మ ఈ పనులన్ని చేస్థావమ్మా !
నేను నా భార్య కలసి నీకు సేవలు చేయాలమ్మా !
నీ సలహాను పాటించి మేము పనులన్నీ చేస్థావమ్మా !
రుద్రాక్ష మాల తీసుకొని రామ నామ జపము చేసుకోవమ్మా !
నాకొరకు, నాబిడ్డలకొరకు, ఎందుకు కష్ట పడ తావమ్మా !
నీ అనారోగ్యానికి తగిన మందు వాడి ఆరోగ్యముగా ఉండమ్మా !
నీ ఆరోగ్యమే ఇంటిల్లి పాటి ఆనందదాయకమని మరువనమ్మా ! రుద్రాక్ష మాల తీసుకొని రామ నామ జపము చేసుకోవమ్మా !
చెక్కర తినవద్దని, దేనిగురించి ఆలోచించవద్దని వైద్యుడు చెప్పాడమ్మా !
కుటుంబ ఖర్చులలో, ఆస్తిలో తలదూర్చ వద్దని న్యాయ వాది చెప్పాడమ్మా !
గుడికి పోయి, గుడిలో చెప్పే పురాణాలు విని ప్రశాంతముగా ఉండమ్మా ! రుద్రాక్ష మాల తీసుకొని రామ నామ జపము చేసుకోవమ్మా !
54. కలియుగ మానవుడు
గాలిలో కోటలు కడుతున్నాడు, తన ఆధిక్యతను చాటుతున్నాడు !
ముక్కుకు సూటిగా వెళుతున్నాడు, ఎవరుఎమిచెప్పిన వినిపించుకోడు !
తాను ఇష్టమైనవి తినలేడు, ఎవరైనా తిన్న ఒర్వలేడు, ఎవరికీ పెట్టడు !
కాలిలో ముళ్ళుగా మారుతున్నాడు, ఆవులిస్తే పేగులు లేక్కపెడుతాడు !
ఏమితెలియని అమాయకుడు, ముద్దిస్తే చాలు చంక నేక్కుతాడు !
అందరి తలలో నాలుకలా ఉన్నాడు, అప్పులతో మునిగిఉన్నాడు !
సమస్యలను సృస్టింస్తున్నాడు, తప్పించుకోలేక తాగుబోతవుతున్నాడు !
మంచి చెడు తెలుసుకోలేక, కక్క లేక మింగలేక బ్రతుకుతున్నాడు !
నడమంత్రపు సిరి కోసం కొత్త అలవాట్లు నేర్చకొని భాదపెడుతున్నాడు !
వసపోసిన పిట్ట లాగా అంతా నాకు తెలుసాని గొప్పగా చెపుతాడు !
ఎగతాళి కైన ఆభద్దమాడడు, అనుకున్నది సాదిమ్చేదాక నిద్రపోడు !
55.ఓటు
నిజాయతి పరునకు వేయాలి ఓటు !
ఒట్టు పెట్టి చెపుతున్న నికే వేసాను ఓటు !
ఓటు ఓటుకు ఎంత ఇస్తాన్నన్నావు నోటు !
నోట్లు ఖర్చు పెట్టనిదే రాదు కొందరికి సీటు ! నాయకులతో వస్తుంది తలపోటు !
పదవికోసం నాయకులు చేస్తారు తిరుగు బాటు !
కోర్కలుతీర్చి బుజ్జగింపులతో చేస్తారు సర్దుబాటు ! అందరూ వేసే ఓటు దెశ పురోగతికి తోలి మెట్టు !
ఓట్ల కోసం ధనం పంచుతారు మెట్టు మెట్టు !
నాయకులు పడతారు ప్రజల నాడి పట్టు !
ఓట్ల కోసం కడతారు చేతులకు కట్టు !
ఓటుతో బయట పడుతుంది ఇంటి గుట్టు !
ఓట్ల కోసం బిందెలు, వస్త్రాలు పంచి పెట్టు !
ఓట్లకోసం కొందరు విధినపడి పడతారు కుస్తీ పట్టు !
నాయకులకు తమకులస్తులపై ఉంటుంది పట్టు !
గెలిచే ఓట్లకోసం తిరుగుతారు ప్రజలచుట్టు !
ప్రజల సొమ్మును తనదిగా పంచిపెట్టు !
వ్యాపారముగా మారే రాజకీయ మైనట్టు !
రాజకీయము ప్రజలపై వ్యాపార మైనట్టు !
56.ఆత్మీయత భావం
మనిషి మేథా స్పూర్తి కొన్నిపరిస్తితులలో మహితమై భాసించు !
అణువు పరామాణువుల కూర్పు పవిత్రమైనదని భావించు !
అణువులద్వారా అణుబాంబు తయారుచేసి దేశ ప్రగతికి ఉపయోగించు !
నీటి బిందువులు కలసి దాహార్తులకు దాహము తగ్గించు !
మనోధైర్యముతో, మంచిమనస్సుతో మచ్చలేని మనిషిగా జీవించు !
పరులతప్పులుదిద్ది , శరణు కోరినవారిని కాపాడి, అందరితో జ్వలించు !
మౌనముగా అన్వేషించి, వేద వేదాంత స్థితి ప్రజ్ఞను వ్యక్తపరచు !
గాత్ర మాదుర్యముతో భయమును తొలగించి అందరిని సంతోషపరచు !
అందరికి ప్రేమనుపంచి, మరో వసంతము వచ్చినట్లు కనబరచు !
కాలమును దుర్వినియోగము పరచక విలువ తెలుసుకొని చలించు !
విధినిర్వాహణలొ వచ్చు అనుకోని సంఘటనలు గమనించి ప్రవర్తించు !
అందు కోలేనివాటిని గూర్చి ఆలోచించక అందుబాటలో ఉన్నదానిని గమనించు !
57.ఎప్పుడూ
ఎగతాళి చేసి ఇతర తప్పలు ఎత్తి చూపకు !
ఎదిరించగల వీరుడని మనస్సులో కుడా గర్వపడకు !
దైవమే ఆపదలలో వచ్చి కాపాడుతుందని ఆశపడకు !
ఎకాగ్రతతో పనులు చేయి, ఫలితముకోసం ఎదురుచూడకు !
ఇల్లాలిని కష్టపెట్టకు, సుఖపెట్టలేదని దిగులు చెందకు !
పనికిరాని ఆలోచనతో సమయాన్ని వ్యర్ధముచేయకు !
అనవసరపు పనిలో తలదూర్చి మాట వినలేదని అనకు !
ఆడదాన్ని కన్నీరు పెట్టించకు, అర్ధము చేసుకో లేదనకు !
శ్రమజీవిగా బ్రతుకు, ఆశలకు, కలవరింతలకు దారి చూపకు !
మొహమాట పడకు, అడిగి తెలుసుకొని కదులు ముందుకు !
పచ్చ నోట్లకు, ప్రలోభాలకు వ్యక్తిత్వం చంపుకొని దాసోహం అనకు !
స్వార్ధ సంకుచిత భావాలను మనస్సులోనికి ఎపరిస్తితిలో రానీయకు !
ప్రకృతి అనుసరించి ఆత్మీయుల పంచన చేరి చులకన అవకు !
ఎప్పుడు అని అనకు ఇప్పుడే బ్రతికి బ్రతికించు కొనే మార్గము వెతుకు.
58.ధరహాశి
ధరహాసముతో, సరససల్లాపముతో ఉవ్విల్లూరించి సుఖపెట్టు చుండు !
శృంగార కలాపముతో, మత్తుచూపులతో మగని ఆకర్షించు చుండు !
వంపు సొంపులతో మగని ఆకర్షించి క్షోభపెట్టి మన్మధలీల సాగిమ్చుచుండు !
ఉద్యోగముచేస్తూ, పతి సేవచేస్తూ, పిల్లలను ఇంటిని సరిదిద్దుకోను చుండు !
చక్కని చుక్కనిచుక్కనుచూసి మక్కునపడకుండ మగని కోర్క తీర్చుచుండు !
శరీరములొఉన్న శుక్ర సొణిత ధాతు కణములవలన సుఖపెట్టి సుఖపడు చుండు !
కొన్ని పరిస్థితులలో చిత్తమునకు చిచ్చుపెట్టి దరిచేరవద్దని భాదపెట్టు చుండు !
కాలముబట్టి, సమయముబట్టి, మన్మధలీలు, క్రీడలు, మార్పు చేయు చుండు !
కన్నవారికోర్కలు తీరుస్తూ, అత్తమావలకు శేవచేస్తూ, మగని కోర్క తీర్చుచుండు !
మౌనము పాటించి, అనుకున్నది సాధించేవరకు దూరముగా వుంచి జీవించు చుండు !
కలసిమెలసి బ్రతుకుట జీవితధ్యేయమని, పరమార్ధమని భావించు చుండు !
నవ్వులతో, అనురాగము పంచుతూ, ఆత్మీయులను పలకరింపులతో సంతోషముగా ఉండు !
--((*))--
59. నేటి ప్రపంచం
దేశము దిన దినాభి వృద్ధి జరుగు తున్నది అనేది దేవుడెరుగు !
పల్లెవాసులు పోట్ట చేతపట్టుకొని తిండికోసం, విధి విధి తిరుగు !
ఉద్యోగములు ప్రభుత్వమువారు చూపకపొవడమువల్ల దొంగలగు !
విద్యాలయములలో డబ్బున్నవారికే చదువుకొనేందుకు వీలుకలుగు !
వ్యపారములుచేయలేక, పోటి పంచములో బ్రతికేందుకు తికమకమగు !
మద్యం దుకాణాలువల్ల, కొందరు తాగుబోతులుగామారి కొందరికి బానిసలగు !
వ్యపారస్థులు నిత్యవసర వస్తువులు దాచుటవల్ల ప్రజలకు ఇబ్బంది కలుగు !
వైద్యులు రోగికి అవసరమైన కాకపోయిన పరిక్షలు చేయాలంటే భయము కలుగు !
ప్రతివస్తువుమీద సుంకమును పెంచుటవల్ల, కొనలేక ప్రజల గుండె కరుగు !
పెట్రోలు, గ్యాసు, అన్నివస్తువులు పెరగటము వల్ల ప్రజలలో తిరుగుబాటుజరుగు !
క్లబ్బులు, అంగాంగ ప్రదర్శనలు పెరుగుట వల్ల విద్యార్ధుల చదువులు మరుగు !
అధికారులు కాసులుకోసం అంధులుగా మారుట వల్ల ప్రజలకు వేదన కలుగు !
నీతి, నిజాయితిగా,న్యాయం, ధర్మం తప్పక ఉన్నవారు అనేకమంది ఈదేశం ల్లో ఉండుటవల్ల
ఇదేశం మూడుపూవులు ఆరు కాయలుగా వెలసిల్లి ప్రజల జీవితము వెలుగు
నిత్యా నూతన విధానములతో ప్రజలకు భాదలు తొలగించడానికి అనేక పథకాలతో ముందుకు పరుగు, ఇతరదేశా లకు సహాయ సహాకారా లు అందిస్తూ , అందరి సహకారంతో ఏక మార్గంలో నడిచేదేశం మనది
--((*))--
60. తెలుగు తేజస్సు
ఆజానుబాహుడు, సంస్కారవంతుడు, అందాల నటుడు !
దివ్యాంశ సంభూతుడు, అందరికి వెలుగును చూపినవాడు !
అభిమానుల ఆరాధ్యుడు, విశ్వ విఖ్యాత నటనాసార్వభౌముడు !
ఆరుకోట్ల ప్రజల హృదయాలను దోచుకొన్న యుగ పురుషుడు !
నిరాడంబరత్వముతో ప్రజలే దేవుళ్ళుగా నమ్మిన మహానటుడు !
బ్రహ్మ ముఖ ప్రజ్ఞావంతుడు, నటనతో చరిత్ర సృష్టిమ్చిన వాడు !
తెలుగు ఆత్మగౌరవాన్ని ప్రపంచదేశాల దాక విస్తరిమ్చినవాడు !
నాయకుడుగా, ప్రతినాయకుడుగా, మనుషుల్లో దేవుడైనాడు !
తెలుగు తనం ఉట్టిపడిన తేజస్సుగల నటనా కారణజన్ముడు !
నవరసాలు నటనా చాతుర్యంతో అభిమానులకు నటనా ధీశుడు !
అభిమానుల హృదయములో ఉన్న నందమూరి తారక రాముడు !
61.శుభాంగి
కంటిచూపులో కమనీయభావమును చూపి మనస్సు కల్లోలపరచు !
చిరునవ్వుతో చింతను మరచి ఉల్లాసముగా మనస్సు సంతోషపరచు !
వంపు సొంపులతో మందగమనముగా మనస్సును ఉల్లాస పరచు !
గుబ్బల కదలికతో, సుకుమార నడకతో గుండెల్లో గుబులు పరచు !
కురులు విరజిమ్మి, మత్తుచూపులతో పెదవి విరచి కలవార పరచు !
జల్లుకు తడిసి ఓరకంట చూపులతో పూలపరిమళాలతోతన్మయ పరుచు !
మృదు మధుర స్వరముతో, ఆకర్షణతో, హృదయమును గాయ పరుచు !
చిలిపి చేష్టలతో చిన్న చూపు చూపి చుట్టూ తిరిగి కోరికను వ్యక్త పరచు !
కన్నులలో జ్వాల, ముఖములో ఖటినత్వముతో భయము వ్యక్త పరచు !
మదపిచ్చి పెరిగి, మతిపోగొట్టి, నంగనాచి మాటలతో మత్తెక్కి మైమరచు !
ప్రకృతి సౌందర్యముతో, స్త్రీ సహజ సౌందర్యముతో, కొందరిని ఇబ్బంది పెట్టుచు !
అడిమిపట్టిన సౌందర్యము ఆగదు, అందు కున్నవాడు మనోభావం వ్యక్త పరుచు !
62.జలం
బావులు, మోటబావులు పూడ్చ బడ్డాయి !
మోటర్లుతో భూమిలోని నీరుని తోడటం ఎక్కువాయి !
వర్షములు లేక నదులలో జలములేక ఎండి పో యి !
ఉన్న జలములొ పరిశ్రమల కలుషిత నీరు ప్రవేసించాయి !
కలుషిత నీరు త్రాగుట వల్ల రోగాలు అధికమై వేదనాయి !
విధికులాయిలు ఎక్కడున్నాయి, ఉన్నమంచి నీరు కరువాయి !
సుబ్రం చేసిన నీరును ధనంతో కొనుటకు ప్రజలకు కష్టమాయి !
అధికవర్షము కురిసిన చోట ఆనకట్టలు లేక నీరు సముద్రం పాలాయి !
నదులు సంధానం చే యు ప్రక్రియ ఇంతవరకు జరుగలేదాయి !
నీటిని వేలం వేసి అమ్ముకొనే ప్రభుత్వాలొచ్చాయి !
నీటికోసం ప్రజలమధ్య అప్రకటిత యుద్ధాలొచ్చాయి !
మేఘమధనము అని ధనము దుర్వినియోగము ఎక్కువాయి !
వర్షములకొరకు పూజలెక్కువాయే, చెట్లను పెంచుట తక్కువాయి !
కలియుగములొ ఎండలు పెరిగి వడగళ్ళు వానలు ఎక్కువాయి !
కాలవుల్లో, నదుల్లో, సరస్సుల్లో నీరు లేని చోట గుడిసెలు పెరిగాయి !
భూ ప్రకంపనలు పెరగి, మంచుకరిగి వరదలు ఎక్కువాయి !
నీరు పల్లమెరుగు నిజముదేవుదేరుగు, నిరులేక పక్షులు వలసపోయే !