ఓం శ్రీ రామ్
శ్రీ శృంగేరి శారదా ఫీఠా టాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి గారు హైదరాబాద్ మహానగరములో తెలుగులలితకళాతోరణములో డిసెంబర్ 14 వ తారీఖు 2012న ప్రజల నుద్దేసించి గురువందన కార్యక్రమం సందర్భముగా సభలో దివ్వ్యసందేసములు ఇచ్చి ఉన్నారు. ఆ సందేశమును నేను ధర్మపరులు అందరు తెలుసుకోవాలని ఇందు పొందు పరుచు చున్నాను.
సమాజములో ప్రతిఒక్కరు దర్మాన్ని అమలు పరుస్తూ ధర్మమార్గంలో నడవాలని తెలియపరిచారు.
84 లక్షల జీవరాశుల్లో మనిషి జన్మకు ప్రత్యకముందని, మనిషికి యోగ్యత ఉందని, మరి ఏ ఇతరప్రానులకు లేదని అన్నారు. మహానుభావులు అంటే కేవలం డబ్బు ఉన్నవారో, విద్య ఉన్నవారో, అధికారం ఉన్నవారో,శారీరకశక్తి ఉన్నవారో కాదని శాస్త్రోక్తముగా కర్మాచరణ చేసే వారే మహానుభావులని సాక్షాత్తు శంకర భగవత్పాదులే పేర్కొన్నారు. ధర్మాన్ని ఆచరించిన వారిన వివేకవంతులుగా గుర్తించి గౌరవిమ్చుతారని అన్నారు.
భగవన్నామస్మరణ చేయడం, ఇతరులకు ఉపకారం చీయడం, తల్లిదండ్రులను శేవించడం, సంధ్యావందనం చేయడం, గాయత్రి జపం చేయడం తదితర మార్గాల్లో ధర్మాన్ని ఆచరించవచ్చు నన్నారు. ధర్మమును కాపాడటానికి, ప్రజల్లో చైతన్యం కలిగించటానికి మాత్రమే శృంగేరి శారదా పీటము ఉన్నదని కాలానుగుణముగా ధర్మం లో మార్ప్లు లు తెలేమని సూచిమ్చ్చారు. ధర్మమును రక్షించే విషయములో శాస్త్రాన్ని యులంఘిమ్చవద్దని, అసత్యం ఏ కాలములో ధర్మము కాలేదని తెలియపరిచారు. ధర్మం విషయములో కుతర్కం వద్దని, శాస్త్రాన్ని ప్రశ్నించడం సముచితం కాదన్నారు. గురువుగారికి ఏ మితెలుసని అజ్ఞానముగా ఆలోచించవద్దని, ధర్మాన్ని ప్రశ్నించడం అవమానమని మహాస్వామి వివరిమ్చ్చారు .
గోవులను రక్షిం చేందుకు అందరం పాటుపడాలని, ఎట్టీపరిస్థితిలో గోవధ జరగాకుండా చూడాలని పిలుపునిచ్చారు. గోవులవల్ల అనేక ప్రయోజణములు ఉన్నకారణముగ దేవతా స్వరూపముగా పూజించాలని కోరారు. మనిషిజన్మను వ్యర్ధం చేసుకోవద్దని కో రారు. ఏ ది తప్పో, ఏ ది ఒఫ్ఫో తెలుసుకొనే విచక్షణ భగవంతుడు మనుష్యులకు ఇచ్చాడని, ఈ విచక్షణ ద్యార పెద్దలు చెప్పే ధర్మమార్గములో నడవడం అందరి కర్తవ్యం అని, ఉత్తమ మార్గమని తెలియపరిచారు. శక్తికి మిమ్చిన ధర్మం చేయాల్సిన అవసరములేదని, ఎవరికి చేతనైనంతవరకు అంతే ధర్మం చేయడం ఉత్తమమైన విధానమని తెలియపరిచారు. శక్తికి తగ్గట్టు పనిచేయాలని, ధర్మ మార్గాన అందరూ నడవాలని, భాగ్యనగరమునకు తరుచు వస్తానని హామీ ఇచ్చారు.
--9900--
--9900--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి