8, ఆగస్టు 2024, గురువారం

1.పాండురాజు శపించిన మహర్షి నామము?

2.  శ్వేతకేతువు ఎవరు?

 3. ధృతరాష్ట్రునికి వైశ్య ద్వారా పుట్టిన కుమారుడు ఎవరు?

 4. పాండవులకు ఉపననాదులు నిర్వహించిన మహర్షి ?

 5. భీకర విష ఉరగాదులతో గేములు కనిపించిన ప్రదేశం ఏది?

  6. శరధ్వంతుని సంతానం ఎవరు?

 7. ద్రోణాచార్య ధర్మపత్ని?

 8. ఏకలవ్యుని తండ్రి?

 9 దేవేంద్రుని వజ్రాయుధం ఏ మహర్షి వెన్నెముక?

10. శకుని ఆప్త మంత్రి ఎవరు?


(జవాబులు. 01. కిందముడు 02 ఉద్దాలకముని కుమారుడు 03 యు యు త్సుడు 04 శతశృంగ పర్వతం మీద మహామునులు 05 ప్రమాణ కోటి 

06 కృపుడు 07 కృపి  08

హిరణ్య ధన్వుడు 09 దధీచి మహర్షి 10 కణికుడు 

ప్రాంజలి  ప్రభ ... రచయత మల్లాప్రగడ  రామకృష్ణ (001) 

ఎందరో మహానుహవులు అందరికీ వందనములు ,, (మూలం వాల్మీకి రామాయణము 2014 లో 6 నెలలు వ్రాసుకున్నది అందరిస్తే పోస్టుచేయగలను, లైక్ చేసి, షేర్ చేయగలరని ఆశిస్తాను)

శ్రావణ మాస సందర్భముగా సుందరకాండ పారాయణము చేయుట చాలా మంచిది, అందుకని అందిరికి అందుబాటులో ఉండేవిధముగా నేను వ్రాసిన రామాయణములో "సుందరకాండ" సుందరతత్వ వచస్సు ను పొందు పరుస్తున్నాను.  

మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభోదయము

రమాయణ క్లుప్త విశ్లేషణ (sundarakaanda)

శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము కర్కాటక లగ్నము నందు, భరతుడు చైత్ర శుద్ధ దశమి పుష్యమి నక్షత్రము మీన లగ్నము నందు, లక్ష్మణ, శత్రఘ్నులు చైత్ర శుద్ధ దశమి ఆశ్లేష నక్షత్రము కర్కాటక లగ్నము నందును జన్మించిరి. వారి వారి జనన కాలము నందు రవి, కుజ, గురు, శుక్ర, శనులు ఉచ్చ దశలలో యుండిరి. జ్యోతిషశాస్త్ర ప్రమాణము ప్రకారము శ్రీరాముడు లోకనాయకుడు అనగా జగత్ప్రభువుగా, తక్కిన వారు జగత్ప్రసిద్ధులైరి.

(మానవజన్మగా పూషోత్తముడు, సకల దేవతలు వారి శక్తులతో భూలోకంలో జన్మించడం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ సంకల్పం)

సర్వే వేదవిదః శూరాః సర్వే లోక హితే రతాః

సర్వే జ్ఞానోప సంపన్నాః సర్వే సముదితా గుణైః   1 18  24

ఆ రాజకుమారులు వేదశాస్త్రములను అభ్యసించిరి. ధనుర్విద్య యందు ప్రావీణ్యము సంపాదించిరి. యుక్త వయస్కులైన తన పుత్రుల వివాహ విషయమై దశరథ మహారాజు ఆలోచించుచుండగా విశ్వామిత్ర మహర్షి వచ్చి యజ్ఞ సంరక్షణార్థమై శ్రీరాముని పంప వలసినదిగా కోరతాడు. 

( ఎవరు యే కార్యము చేయగలరు, వారి నాపుణ్యత ఏమిటి అనేది కొందరు దివ్యదృష్టితో తెలుసుకోగలరు అందువలననే విశ్వామిత్రుడు యజ్ఞరక్షణకు కోరాడు )

ఆ కోరిక విని దశరథ మహారాజు విశ్వామిత్రునితో ..

ఊన షోడశ వర్షో మే రామో రాజీవ లోచనః

న యుద్ధ యోగ్యతామ్ అస్య పశ్యామి సహ రాక్షసైః  1 20 2

రాముడు పదుహారు సంవత్సరముల ప్రాయము వాడు, క్రూర రాక్షసులతో యుద్ధము చేయలేడు. ఇక్కడ వాల్మీకి తన కావ్యములో శ్రీరాముడు జననము తర్వాత వారు పదునారు సంవత్సరముల ప్రాయములో సకల విద్యా పారంగతులైరి అని చెప్పెను. తరువాత శ్రీరాముని వైరాగ్యము, వసిష్ఠ మహర్షి చెప్పిన ఆత్మ విజ్ఞానము మనకు వాల్మీకి రామాయణములో కానరాదు. అది యోగ తత్వము నందు యున్నది  గావున గమనించ గలరు.

 (తండ్రి ప్రేమ, భయము వ్యక్తం చేస్తూ నేనే స్వయoగా వచ్చి రాక్షస సంహారం, యజ్ఞం రక్షణ చేయగలనన్న 

వశిష్టుని హితవాక్యాలతో కొన్ని విద్యలు కొందరి దగ్గరే నేర్చుకోవాలి కదా పంపు అని పలుకుట యిది క్షత్రియ ధర్మం మీకు తెలిసినదే కదా )

కం..సాధ్యా సాధ్యాలు గనే - విద్యా బుద్దులు యలవడు వినయమ్ముగనే 

అధ్యాయాలు చదువు గా -విద్యార్థి దసౌను ముఖ్య విజయమ్ముగనే

రావణుడు (బ్రాహ్మణుడు)అమోఘమైన తపఃసంపన్నుడు. అట్టి రావణుని సంహరించుటకు రావణుని మించిన తపఃశక్తిని  పొంది యుండవలెను.

కం..ఏదియ యేమైన ఫలము -ఏదియు నీదిగను లేదు యేలా ననకూ 

వాదిగ యేలా బ్రతుకగు -ఆది పురుషుని గమనమ్ము ఆశల కళలే

*విశ్వామిత్రుడు రామలక్ష్మనులకు తెలియ పర్చట*

ఉ.ఓ నవ రామ పాపహర!యుర్విమనుష్యులఁ  గావనెంచియున్ 

పావన నీదు నామము ప్రపంచ జనాల కొసంగి నట్టియున్ 

దేవవిభుండ!నీవు మఱి దివ్యసునామము వేరుకాదయా 

భావమెఱింగి నామమును బల్కరు మర్త్యులు రామచంద్రుడా 

                                   

వేదము - సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము - అని మూడు భాగాలు. ఆరణ్యకంలో వివిధ తపస్సులు క్రింది విధంగా పేర్కొనబడినవి:

"ఋతం తపః, సత్యం తపః, శ్రుతం తపః, శాంతం తపః, దమస్తపః, శమస్తపః, దానం తపః, యఙ్ఞం తపః, భూర్భువస్వుర్బ్రహ్మై తదుపాస్య తపః.

1. ఋతము = సూన్రుత భాషణము - వాక్కుతో సత్యము పలుకుట, 

2. సత్యము = త్రికాలలో - భూత-భవిష్యత్-వర్తమానాలలో - ఉండేది. యథార్థ వస్తు చింతనం చేయటం. సత్యం ఙ్ఞానం అనంతం బ్రహ్మ (తైత్తిరీయోపనిషత్తు), 

3. శ్రుతము = వేదాధ్యయనము, 

4. శాంతము = శాంతముగా నుండుట (ఓర్పు), 

5. దమము = ఇంద్రియ నిగ్రహము, 

6. శమము = కామక్రోధాదులు లేకుండుట, 

7. దానము = బ్రహ్మార్పణముగా ఇతరులకు ఇచ్చుట, 

8. యఙ్ఞము = దేవతారాధన. ఇవేకాకుండా బ్రహ్మను (అంటే సర్వమూ తానే అయి, సర్వత్రా, సర్వకాలములలో ఉండేవాడు) ఉపాసించుట కూడ తపస్సే. 

(యఙ్ఞములు పలు రకాలు. వాటిలో తపోయఙ్ఞం ఒకటి. అదే ఆ పైన చెప్పబడినదియే యఙ్ఞం తపః.

శ్రీమద్భగవద్గీతలో శ్రీ క్రుష్ణ భగవానుడు ఐదు రకాలైన యఙ్ఞ భేదములను ఇట్లా వివరించాడు.

ద్రవ్య యఙ్ఞాస్తపోయఙ్ఞా, యోగ యఙ్ఞాస్తధాపరే|

స్వాధ్యాయ ఙ్ఞానయఙ్ఞాశ్చ, యతయః సంశితవ్రతాః||

(ఙ్ఞానయోగము: 4-28)

వాటిలో తపస్సు కూడా ఒక యజ్ఞమే. ఈ మాదిరి పుణ్య కార్యాలు, తపస్సులు చేస్తే దైవారాధన వల్ల లోక కళ్యాణం జరుగుతుంది. మహర్షులు, సాధు పురుషులు తమ స్వార్థం కోసంగాక, లోక క్షేమం కోరి తపస్సు చేస్తారు. కామక్రోధాలను, రాగద్వేషాలను దరిజేరనీయక, జితేంద్రియులై, సత్వ గుణ ప్రధానులై త్రికరణ శుద్ధితో తపస్సు చేస్తారు. అట్టి తపోధనుల తపస్సంపద లోక కళ్యాణానికి దారి తీస్తుంది. శ్రీరాముడు లోకకళ్యాణార్థమై తపస్సు చేస్తాడు.

రామాయణము జాగ్రత్తగా మొదటి నుంచి చివర వరకు గమనించితే శ్రీరాముడు సాధించిన ఇట్టి తపః ప్రభావములు గనపడును. మానవుని పురోభివృద్ధి ఎలా యుండవలెనో/సాగవలెనో రామాయణము కాండల రూపములో శ్రీరాముని పాత్ర ద్వారా వాల్మీకి వివరించారు. 

ఉదాహరణకు బాలకాండములో శ్రీరాముడు గురుకులంలో విద్యాభ్యాసము, వసిష్ఠ మహర్షి వద్ద ఆత్మ జ్ఞానము, విశ్వామిత్రుని వద్ద అట్టి విద్యను సత్యధర్మములనే ఆయుధములుగా అభ్యాసము (ప్రాక్టీస్) చేసినాడు.

 అయోధ్యాకాండములో భరతునికి రాజ ధర్మమును బోధించుట ద్వారా ఆచార్యుడు (గురువు) గా దర్శనము చేసినాడు. అనగా తాను చదువుకున్నది అభ్యాసము చేసినవాడే సరియైన గురుస్థానమును పొందగలుగును.

 జాబాలి నాస్తిక వాదాన్ని ఖండించుట ద్వారా వేద ప్రమాణాన్ని నిలబెట్టాడు. (ఆది శంకరాచార్యులు ఇటులనే ప్రాచుర్యములో యున్న నాస్తిక వాదమైన బౌద్ధమును ఖండించడము గమనించ వచ్చు). 

అరణ్య కాండలో అసురభావములను నాశనము చేసి సత్య ధర్మములను ప్రతిష్టించవలెనని తన నడవడిక ద్వారా చాటెను.

 కిష్కిందా కాండలో అట్టి అసుర భావములను నాశనము చేయుటకు మిత్రుని తోడ్పాటు కూడా అవసరమని గ్రహించి సుగ్రీవునితో స్నేహము చేసినాడు. చివర  యుద్ధ కాండలో దుష్ట సంహారం చేసినాడు.

ఈ విధముగా మానవుడు అభ్యుదయము పొందవలెనన్న పరిణామ క్రమము ఎలా ఉండవలెనో శ్రీరాముని పాత్ర ద్వారా మనకు వాల్మీకి అవగతము చేసినారు.

రేపటి నుంచి సుందర కాండలో హనుమ స్వరూపమును విహంగ వీక్షణము చేయుటకు ప్రయత్నిద్దాము.

శ్రీరామ జయరామ జయజయ రామ

ఓం శ్రీ రామ - ఓం శ్రీ రామ - ఓం శ్రీ రామ - 

ఓం శ్రీ రామ - ఓం  శ్రీ రామ - ఓం శ్రీ రామ - 

ఓం శ్రీ రామ - ఓం శ్రీ రామ - ఓం శ్రీ రామ - 


శ్రీరామ జయరామ.. జయజయ రామ

--(())--

సేకరణ స్వేచ్ఛా రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ

Jai sri ramఓం శ్రీ రామ్ ... శ్రీ మాత్రే నమ: 

*-సుందర కాండము-1*002 


*హనుమ స్వరూపము*

*వేదవేద్యే పరే పుంసి జాతే దశరాత్మజే*

*వేద: ప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా*

వేదములచే తెలియబడు పరమపురుషుడు దశరధునికి కుమారుడైనట్లుగా,వేదము,వాల్మీకి వలన , రామాయణ రూపముతో ఉండినది..

శ్రీమన్నారాయణుడు ఈ భూమిపై మరల నసించిపోవు చున్న ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీరాముడు గా అవతరించాడని  మన భారతీయుల ప్రగాఢ విశ్వాసము. శ్రీరాముని మీద మనకు లభించినన్ని పరిశోధనా గ్రంథాలు వేటి యందు లభించవు. శ్రీరాముడు మానవునిగా జన్మించి తన శిష్య ప్రజ్ఞచే సకల శాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి, అకుంఠిత దీక్షతో ఆయా యోగ రహస్యాలను అభ్యాసం చేసి, తన సత్య సంధతతో భగవంతునిగా రూపాంతరము చెందినవాడు. తనను గూర్చి *"ఆత్మానాం మానుషం మన్యే"* (నేను మానవ మాత్రుడను) అని పేర్కొన్న శ్రీరాముడు *"సత్యేన లోకాన్ జయతి"*  అను ప్రమాణము ననుసరించి సత్యనిష్టాగరిష్ఠుడు అయినందున శ్రీరాముడు అన్ని లోకములను జయించ గలిగిన వాడై భగవంతునిగా ఈ లోకుల దృష్టిలో ఉండిపోయాడు. దుర్లభమైన మానవ జీవితమును వ్యర్థము చేసుకొనకుండా బాహ్యమున ధర్మాచరణమును, అంతరమున జ్ఞానము కలిగి ఉండవలెనని మనకు శ్రీరాముని ద్వారా తెలియు చున్నది.

రామలక్ష్మణులు సీతను అన్వేషించుతూ పంపా తీరమునకు వచ్చినప్పుడు, సుగ్రీవుని భయము పోగొట్టుటకై హనుమ సుగ్రీవునితో ఇది ఋశ్యమూకం గాన ఇక్కడికి వాలి, వాలి సంబంధీకులు రాలేరు అని చెపుతాడు. ఆ విధంగా రామాయణంలో హనుమ పాత్ర పరిచయము అయింది. రామసౌందర్యమును చూడగానే హనుమ ఆకర్షితుడయ్యెను. హనుమను చూచి, అతని సంభాషణ విని నంతనే రాముడు అతనిలోని గుణగణములను తెలుసుకొనెను. రాముడు లక్ష్మణుతో హనుమను గురించి చెపుతూ ..

వాక్యకుశలః,(వాక్యకుశలుడు),  ఋగ్వేదమునందు బాగుగా శిక్షణ పొందినాడు, యజుర్వేదమును ధారణ చేసినాడు,  సామవేదమును చక్కగా ఎరిగిన వాడు, వ్యాకరణమును అనేక మార్లు వినినాడు, మాట్లాడినప్పుడు సందిగ్ధము లేకుండా, తొందరగా గాని, మెల్లగా గాని గాకుండా ముఖము నందు ఎట్టి వికార భావములు లేకుండా, మధుర స్వరముతో, సంస్కారముగా, మంగళకరమైన మధుర స్వరముతో మాట్లాడినాడు అనెను. ఇట్టివాడు దూతగా ఉన్నచో కార్యము తప్పక సిద్ధించునని దూతగా హనుమ యొక్క విశిష్టతను  చెప్పినాడు.  హనుమ యొక్క ఉత్పత్తి ప్రకారమును పరిశీలించిన శబ్దమునకు హనుమతో గల సామ్యము గోచరించును. మనలోని ఒక భావమును ఆవిష్కరించ వలెనన్న కోరిక గలిగినచో శరీరములోని వాయువులలో కదలిక గల్గును. ఆ వాయువుచే అభిహతమై మూలాధార స్థానము నుండి శబ్దము బయలుదేరి నాభిని, హృదయమును, కంఠమును దాటి తిన్నగా శిరస్థానమును చేరును. అచట నుండి పైకి పోవ వీలు లేక కంఠము నుండి ముఖము గుండా వెలికి వచ్చును. అట్లు వచ్చునప్పుడు నోటిలోని ఆయా స్థానములలో వాయువు యొక్క తాకిడిచే శబ్దముగా వెలికి వచ్చును. ఇందు హనుమకు, శబ్ధమునకు సాపత్యమును చూద్దాము.

1 హనుమ వాయువు వలన జన్మించాడు. శబ్దము కూడా వాయువు వలననే జనియించింది.

2 పుట్టగానే హనుమ సూర్య మండలము వైపు (సమాధి అవస్థ) కు పోయెను. శబ్దము కూడా ముందుగా శిరస్సు వైపు సాగును. అటు పోవ వీలుగాక నోటి నుండి వెలుపలికి వచ్చును. నోటిలోని ఆయా వర్ణముల అభివ్యక్త స్థానములే అంజన, కనుక అంజనాసుతుడు అయ్యెను.

3 సూర్యుని నుండి క్రిందకు పడిపోటచే దౌడలు సొట్ట  బోయి   హనుమ గా పేరు వచ్చినది. శబ్దము గూడ శిరఃస్థానము నుండి నోటిలోని దౌడల కదలికచే వర్ణ రూపమున వెలుపలికి వచ్చును గాన శబ్దము గూడ "హనుమ" అగును.

4 శబ్ద సామర్థ్యము వలన అవసరమైన కార్యములు నెరవేర్చుటలో మంత్రి వలే పని చేయును. స్వాధ్యాయన ప్రవచన శీలి యగు సుగ్రీవునకు హనుమ సచివుడు.

ఇట్టి హనుమయే రాముని సీతమ్మతో  కలుపును.

*శ్రీరామ జయరామ జయజయ రామ*

సీతారామ మనోభిరామ కళ్యాణ రామ 

సమస్త జనరక్షక పాలన రామ .. ఓం శ్రీరాం 

/మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

--(())--

Jai sri ram.. సుందర కాండ.. 003

మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ 

మన సమస్యలకి సుందరకాండ పరిష్కారాలు.!

సుందరకాండ అద్భుతమైన పారాయణం,

ఎన్నో సమస్యలకు సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది పరిష్కారం పొందారు..

ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం

కాండం మొత్తం పారాయణ చేయలేరు,

అయితే అందులో ఏ సమస్యకు ఏది పరిహారామో వివరంగా ఉంది.

పారాయణ నియమాలతో ఉంటుంది.

ఇక్కడ ఇచ్చిన వివరాలు ఒకసారి పరిశీలించండి.

1. ఆపదలు తొలగటానికి , సంపదలు కలగటానికి..

శ్లోకం.ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ ||

21 దినములు ,108 సార్లు ,శక్తి కొలది తమలపాకులు,

అరటిపళ్ళు నివేదన చేయాలి.

2. విద్యాప్రాప్తికి.

ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేయవలెను .

3 రోజులు ద్రాక్ష , అరటిపళ్ళు నివేదన

3. భూతబాధ నివారణకు.

3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు,30 దినములు పారాయణ చేయవలెను .1.కొబ్బరికాయ , అరటిపళ్ళు నివేదన.


4. సర్వ కార్య సిద్దికి.

64 వ సర్గ నిష్ఠతో 11 సార్లు,40 దినములు పారాయణ చేయవలెను .శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.

5. శత్రు నాశనముకు.

51 వ సర్గ అతినిష్ఠతో 2 సార్లు,21 దినములు పారాయణ చేయవలెను.శక్తి కొలది ద్రాక్ష , బెల్లము నివేదన చేయవలెను.

6. వాహనప్రాప్తికి.

8 మరియి 9 వ సర్గలు ఏకాగ్రతతో 3 సార్లు,27 దినములు పారాయణ చేయవలెను.శక్తి కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.

7. మనశాంతికి.

11 వ సర్గ నిష్ఠతో 3 సార్లు,21 దినములు పారాయణ చేయవలెను.అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.

8. స్వగృహం కోరువారికి.

7వ సర్గ ఏకాగ్రతతో 1 సారి40 దినములు పారాయణ చేయవలెను.అరటిపళ్ళు చక్కెరతో నివేదన చేయవలెను.

9. యోగక్షేమాలకు.

13 వ సర్గ నిష్ఠతో 3 సార్లు, 27 దినములు పారాయణ చేయవలెను.శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను.

10. ఉద్యోగప్రాప్తికి.

63 వ సర్గ నిష్ఠతో 5 సార్లు,21 దినములు పారాయణ చేయవలెను .శక్తి కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.

11. రోగ నివారణకు.

34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతిదినము ,21 దినములు పఠించవలెను.శక్తి కొలది బెల్లపు ముక్క అరటిపళ్ళు నివేదన చేయవలెను.

12. దుఃఖనివృత్తికి.

67 వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా 3 సార్లు,21 దినములు పారాయణ చేయవలెను.శక్తి కొలది అరటిపళ్ళు,ఖర్జూరము నివేదన చేయవలెను.

13. దుస్వప్న నాశనానికి.

27వ సర్గ ఏకాగ్రతతో 1 సారి ప్రతిదినము పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.

14. దూరముగా ఉన్న ఆప్తులు క్షేమమునకు.

33 నుండి 40 వ సర్గ వరకు 1 సారి ,21 దినములు నిష్ఠతో పఠించవలెను .శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.

15. ధనప్రాప్తికి.

15వ సర్గ ఏకాగ్రతతో 1 సారి,40 దినములు పఠించవలెను.

అరటిపళ్ళు, పటిక బెల్లం , మరియు రామాయణం లో అయోధ్యకాండలో యాత్రాదానము. 32 వ సర్గ 1 సారి ,

40 దినములు పఠించవలెను.శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్షనివేదన చేయవలెను . ( అగస్త్య ,

 పరాశర , ఉమా సంహిత ప్రకారం చెప్పబడినది ).

16. దైవాపచారా ప్రాయశ్చిత్తం.

38 వ సర్గ ఏకాగ్రతతో 3 సార్లు, 27 దినములు పఠించవలెను.

శక్తి కొలది అరటిపళ్ళు వీలైతే పనస నివేదన చేయవలెను.

17. బ్రహ్మజ్ఞానము కలుగుటకు.

19 వ సర్గ అతినిష్ఠతో రోజుకు ఒకసారి,1 సంవత్సరము పఠించవలెను.శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.

18. ఏలిననాటి శనీ దోష పరిహారమునకు.

సకల రోగ నివృత్తికి - సర్వ పాప నివృత్తికి

మొత్తం సుందరకాండ నిష్ఠతో 9 దినాలలో 1సారి

68 రోజులు చదువవలెను.

నివేదన రోజూ కొబ్బరికాయ సత్ఫాలితమునిచ్చును.

19. కన్యా వివాహమునకు.

9 దినములలో ఒకసారి పూర్తిగా

68 దినాలలో పఠించవలెను.

సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు

ప్రతిరోజు పఠించవలెను.

అప్పాలు , పాలు , పంచదార నివేదన చేయవలెను.

20. విదేశీ యానమునకు.

1 వ సర్గ ఏకాగ్రతతో రోజుకు 5 సార్లు

30 దినములు పఠించవలెను.

శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.

21. ధననష్ట నివృత్తికి.

55వ సర్గ నిష్ఠతో 3 సార్లు

30 దినములు పఠించవలెను .

శక్తి కొలది అరటిపళ్ళు,పనస నివేదన చేయవలెను.

22. వ్యాజ్యములో విజయమునకు.

42 సర్గ అతి ఏకాగ్రతతో 3 సార్లు ,

21 దినములు పఠించవలెను.

శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్ష , దానిమ్మ నివేదన చేయవలెను.

23. వ్యాపారాభివృద్ధికి.

15వ సర్గ నిష్ఠతో నియమంతో 5 సార్లు

21 దినములు పఠించవలెను.

శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.

24. పుత్ర సంతానానికి.

ప్రతిదినం 7 వ సర్గ నిష్ఠతో

68 రోజులు పారాయణ చేయవలెను .

శక్తి కొలది అరటిపళ్ళు , కొబ్బరికాయ ,నివేదన చేయవలెను.

శక్తి కొలది తమలపాకులతో అర్చన చేయవలెను . సుందరకాండ 16 రోజులు పారాయణ చేయవచ్చును.

25. ఋణ విముక్తికి.

28 వ సర్గ చాలా నిష్ఠగా రోజుకి 1 సారి

41 రోజులు పఠించవలెను.

శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.

🌼🌿శ్రీరామ జయరామ జయ జయరామ..🌼


🙏 *స్వాగతం జయహనుమాన్* 🙏

ప్రాంజలి - సుందరకాండ - తెలుగు- వచస్సు.. (4)

అథ: సుందరకాండ ప్రారంబ: - ప్రధమ: సర్గ:

210 సంస్కృత  శ్లోకాల ఆధారముగా తెలుగు- వచస్సు    

O -- O -- O

హనుమంతుడు సముద్రమును లంఘించుట

మైనాకాకుడు అతనిని గౌరవించుట

సురసను హనుమంతుడు ఓడించుట

సింహికను వధించుట

దక్షిణ తటముచేరి అచట లంక శోభను చూచుట 

హనుమంతుని - సముద్రలంఘన - ప్రయత్నము

O -- O -- O

 

సుందరకాండ - సుందర తత్త్వం - తెలుగు వచస్సు ( 1వ సర్గము ) 

అసంఘటితమైన శక్తిఉన్నా హనుమంతుడు అణిగి మణిగి ఉండి, అందరి ఆదరణ పొందుతూ, తన్ను ఆదరించి తన కర్తవ్యాన్ని భోధించిన, రాముని కార్యమును సఫలీకృతము చేయటకు, నిగ్రహ శక్తితో మహేంద్ర గిరి పర్వతముపై ఉండి, చేయ వలసిన కార్యమును ఆలోచిస్తూ ఉండగా తన తోటి వానరు లందరూ బాధలో ఉండుట గమనించెను.

****


*(1)(  కార్యము సాధించ గలమని ప్రతి ఒక్కరికి, నిగ్రహ శక్తి ఉండాలి అందరకు, నమ్మకము, ఆత్మ విశ్వాసము  ఉండాలి *).

జాంబ వంతుడు, వానరులందరు, కలసి  సీతాన్వేషినిమిత్తం దక్షిణ దిక్కు అంతా చూసినను సీత జాడ కనుగొన లేక పోయెను,  వానరరాజు, ఇచ్చిన సమయము మించి పోయినది, ముందుకు పోవు మార్గము లేక, వెనుకకు పోలేక,  దిగులుతో అందరూ ప్రాణార్పణం చేయ తలంచెను.

 *(2) అవేశము లో ఉన్నప్పుడు ఆలోచనా శక్తి నశించును, చేతకాని వారిగా మార్చును)   

(*) అను భవజ్ఞులు చెప్పేమాటలు ఆలకించి అనుకరించ వలెనని తెలియ బడుతుంది 

అందరితో అంగదుడు, జటాయువును తలస్తూ విలపించసాగెను, కార్యార్దమై జటాయువు భాత్రు (అన్న) సంపాతి అంగదుని కలిసెను,

సంపాతి దక్షిణదిక్కున లంకలో సీత రావణుని బందీలో ఉందని చెప్పెను,  అందరు కలసి, సముద్ర వడ్డుకు చేరి సముద్రాన్ని దాట తలచెను.

 *3 ( ఆశించిన పనికి దేవుడు సహాయము చేస్తాడనుటకు ఇది ఒక నిదర్సనం, నాయకుడనేవాడు పలువిధాలుగా అలోచించుటవల్ల  మంచి వారికి మంచే జరుగును అని ఒక నిదర్సనం ఆలోచనలు కుడా మంచిగా వచ్చును  )      

సంపాతికి సీత జాడ తెలుపగా రెక్కలు వచ్చి వెళ్ళేను, వానరులు సముద్రాన్ని దాటగల శక్తి గూర్చి తెలుపెను,  అంగదుడు, జాంబవంతుడు సంశయములో పడెను,  సముద్రాన్ని దాటుటకు అందరు  హనుమంతుని ప్రేరేపించెను.

భయం హర హర మథ మథ భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయ మారయ శోషయ శోషయ ప్రహారయ ప్రహారయ, ఠఠఠఠ ఖఖఖఖ ఖేఖే ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే శృంఖలాబంధ విమోచనాయ ఉమామహేశ్వర తేజో మహిమావతార సర్వవిషభేదన సర్వభయోత్పాటన సర్వజ్వరచ్ఛేదన సర్వభయభంజన, ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే కబలీకృతార్కమండల భూతమండల ప్రేతమండల పిశాచమండలా-న్నిర్ఘాటయ నిర్ఘాటాయ భూతజ్వర ప్రేతజ్వర పిశాచజ్వర మాహేశ్వరజ్వర భేతాళజ్వర బ్రహ్మరాక్షసజ్వర ఐకాహికజ్వర ద్వ్యాహికజ్వర త్ర్యాహికజ్వర చాతుర్ధికజ్వర పాంచరాత్రికజ్వర విషమజ్వర దోషజ్వర బ్రహ్మరాక్షసజ్వర భేతాళపాశ మహానాగకులవిషం నిర్విషం కురు కురు ఝట ఝట దహ దహ, ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే కాలరుద్ర రౌద్రావతార సర్వగ్రహానుచ్చాటయోచ్చాటయ ఆహ ఆహ ఏహి ఏహి దశదిశో బంధ బంధ సర్వతో రక్ష రక్ష సర్వశత్రూన్ కంపయ కంపయ మారయ మారయ దాహయ దాహయ కబళయ కబళయ సర్వజనానావేశయ ఆవేశయ మోహయ మోహయ ఆకర్షయ ఆకర్షయ, ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే జగద్గీతకీర్తయే ప్రత్యర్థిదర్ప దళనాయ పరమంత్రదర్ప దళనాయ పరమంత్రప్రాణనాశాయ ఆత్మమంత్ర పరిరక్షణాయ పరబలం ఖాదయ ఖాదయ క్షోభయ క్షోభయ హారయ హారయ త్వద్భక్త మనోరథాని పూరయ పూరయ సకలసంజీవినీనాయక వరం మే దాపయ దాపయ, ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే ఓం (హ్రౌం క్ష్రౌం గ్లౌం హుం హ్సౌం) శ్రీం భ్రీం ఘ్రీం ఓం న్రూం క్లీం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హుం ఫట్ ఖే ఖే హుం ఫట్ స్వాహా ||

– హ్రౌం క్ష్రౌం క్ష్ర్మ్యౌం గ్లౌం హ్సౌం (ఇతి పాఠభేదః)

****

4* ( శక్తిని మించిన కార్యమని తలచుట సహజము, పెద్దల మాటను అనుకరించుట ఇంకా అవసరము, ఎవరి శక్తి వారు తెలుపుట కూడా  ఒక అవసరము, అందుకే జాంబవంతుడు హనుమంతుని శక్తి తెలిసినాడు కనుక ప్రేరేపించుటకు ముందు వచ్చును, పెద్దలను గౌరవించ టం వల్ల సీతాన్వే షనకు మార్గము సులభమాయెను)     

శా..ప్రోత్సాహం సమయమ్ముగాను సఫలం కోర్కే సునాయాసమున్ 

ఉత్సాహమ్ముగనే వివేక వినయంసాఫల్య సంతృప్తిగన్ 

సత్సంఘంసహనం సహాయమయమే సామర్ధ్య పెంపొందు గన్

సత్సామర్ధ్యముగాను నిశ్చయముసేవాజయమ్మేనులే

(*)ప్రోత్సాహం కొండంత   బలం అని తెలుపుతున్నది, ఏ పరిస్థితులలోను నిరుత్సాహ పరచకూడదు . 

రామనామ జపంతో, హనుమంతుడు మహేంద్రగిరిపై ఉండెను, జాంబవంతాదులందరూ కలసి హనుమంతుని పొగడెను తనశక్తి తనకే తెలియక ప్రొత్సాహముతో  శక్తిని పెంచుకొనెను, చారులు సంచరించే మార్గానా సముద్రంపై పోవుట నిశ్చయించెను.

*(5. పసి పిల్లవానికి  పాలు త్రాగితే ఎంత సంతోషమో, రామనామ జపమే హనుమంతునకు అంతకన్నా ఎక్కవ సంతోషము, తనలో ఉన్న ఆత్మ తేజాన్నిఉత్తేజ పరిస్తే ఎటువంటి వారైన కార్యసాదకులుగా మారుతారు, ఓం శ్రీ రామ్ , ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ అంటూ ఆధారము లేని గగన మార్గం ఎన్నుకోవటం ఒక నిదర్సనం, ఆధారము లేక పోయినా సాధించగలమని తపన ఉండుటే ఇందులో నీతి) 

                                                                                               ( 1వ సర్గము - ఇంకా ఉంది  )

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ, 6281190539

*****

సుందరకాండ - సుందర తత్త్వం - తెలుగు వచస్సు ( 1వ సర్గము - ఇంకా ఉంది )(5)

తతో రావణ నీతాయాః సీతాయాః శత్రు కర్శనః

ఇయేష పదమ్ అన్వేష్టుం చారణా చరితే పథి 5.1.1

రామ నామ జప హనుమంతుడు మహేంద్ర గిరిపై ఉండెను 

జాంబ వంతాదు లందరూ కలసి హనుమంతుని పొగడెను 

రామచంద్ర అనుచూ ప్రొత్సాహముతో  శక్తిని పెంచుకోనెను 

చారులు సంచరించే మార్గానా సముద్రంపై ప్రయాణమయ్యెను


*పచ్చిక బీల్లపై ఉన్న హనుమంతుడు ఆకు పచ్చని వర్ణముతోను, పచ్చిక బీల్లపై ఉన్ననీటి బిందువులు వైడూర్యమణుల    వలే మెరుపులతోను, దూరముగా ఉన్న  జలము పై సూర్య కిరణాల ప్రభావ వెలుగులతోను, ధీరుడైన హనుమంతుడు మహేంద్రగిరిపై సీఘ్రముగా సంచరించెను.

 *(6) ఏ  శుభకార్యము జరగాలన్న పచ్చటి తోరణాలు కట్టుట, మెరుస్తున్న కాంతి పుంజాలను వ్రెలాడదీస్తూ, పరిశుబ్రమైన జలమును నిలువచేస్తూ, సూర్య కిరణాలతో గాలి ప్రవేసించు నట్లు చేసితే అందరూ హాయిగా సంచరిన్చగలరని వాల్మీకి మనకు భోధించారు )          

*మహేంద్రగిరిపై చిత్రవర్ణములుగల ధాతువుల తోను, యక్షులు, కిన్నరులు, గంధర్వులు, దేవతామూతృల తోను, స్వేచ్చ జీవులుగా సింహాలు, ఉత్తమ గజాల సంచారముల తోను,  హనుమంతుడు మహ హృదయముతో  ఐరావతం వలే ప్రకాశించెను

*(7) ఒక వివాహ వేడుకలో పలురకాలు వస్త్రాలు ధరించిన స్త్రీలు పురుషులు, వేదాలు వల్లించే పండితులు, మంచిగా భుజించే వారు, మంచి చెడుల సంబాషించుకొనే వారు సింహం వాలే అజమాయషీ చేసి ప్రవర్తించేవారు, గజం వలె మొద్దు చాకిరీ చేసేవార్లు    మద్య ఎత్తైన పీఠంపై  నూతన వదూవరులు మహ హృదములో ఐరావతం వలే ప్రకాశిస్తూ ఉండాలనేది ఈ శ్లోకం నీతి)     

స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే!

 భూతేభ్య శ్చాoజలిం కృత్వాచకార గమనే మతిమ్!!......... 

^ సకల విద్యలు నేర్పిన గురువు గారగు సూర్యనికి నమస్కరించెను, బాల్యంలో భాధపెట్టిన దేవతల రాజైన ఇంద్రునికి నమస్కరించెను, సృష్టికర్త ఐన బ్రహ్మదేవునకు, సకల భూతములకు నమస్కరించెను.

*(8) ఏపని అయినా చేసేముందు, ప్రయాణానికి  పోయే ముందు,  శుభకార్యము చేసే ముందు ఎవరైనా సరే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాన్నీ ముందుగా ప్రార్ధించాలి, తరువాత తల్లి తండ్రులకు, మనకన్నా పెద్దలైన గురువులకు అధికారులకు ప్రణామాలు చేయాలి, స్నేహితులను, భందువులను  ప్రతి ఒక్కరిని చక్కగా పలకరిస్తూ ముందుకు సాగా లనేదే ఈ శ్లోక భావం)         

*మారుతి కడలిపై గగన సీమలో ప్రయాణం చేయ తలంచెను, మారుతి తూర్పునకు తిరిగి తండ్రి ఐన వాయుదేవునకు నమస్కరించెను, దక్షణదిక్కుకు తిరిగి వెళ్ళుటకు శిరస్సు పైకి ఎత్తి ఆబోతువలె ప్రకాశించెను.

*(9) మనం  చేసే కార్యము ఎంతో  కష్టమని అనుకో కూడదు,  ఎందుకంటే తూర్పునకు తిరిగి ముందుగా తల్లి తండ్రులకు నమస్కరించి మరలా దక్షణ దిక్కుకు తిరిగి చేయవలసిన కార్యమును మొదలు పెట్టి నట్లైతే ఎక్కడలేని శక్తి మీలో  ప్రవేసిస్తుందని, ఎదురు లేకుండా పని సాను కూలముగా జరుగు తుందని ఈ శ్లోక భావం)      

*హనుమంతుడు పౌర్ణమినాడు సముద్రుడు పొంగినట్లుగా శరీరాన్ని పెంచెను, వానరు లందరూ చూచు చుండగా రామకార్యము కొరకు ఆకాశమార్గమున ప్రయాణం చేసెను, 

ఉ..సమ్మతి గాను వాయుజుడు సాధ్యము నెంచక అంద రిష్ఠమై 

నమ్మిన సేవనెంచి సహనమ్ముతొ దోక విదిల్చి, పాదముల్ 

నెమ్మది బాహువుల్ కుదిపి వీచి మొగంబు బిగించి కొండపై 

ఘుమ్మని నూగి ముందరికి జూ యని లేచియు దూగి వార్ధిపై

*(10) సముద్రములో ఎన్నిజీవులున్నాయొ అంతమంది మానవులు శుభకార్యానికి సహకరిస్తారు, ఆ పరిస్తితిలో మనోధైర్యము పెరిగి పిల్లల పెళ్లి మేళ తాళాలతో జరుపుటకు దృడసంకల్పంతో ప్రయాణం చేయాలన్నదే ఇందులో నీతి)   

******

సుందరకాండ - సుందర తత్త్వం - తెలుగు వచస్సు ( 1వ సర్గము )(6)

కం ..పాదాల స్పర్శకు నే  - భూదేవి కదలగ చెట్లు కూలియు యగ్నీ 

ప్రాధాన్యతగాలతలే - సాధారణ లక్ష్య హనుమ సాగే యుదధీ

  పాదాల కదలికలకు చెట్లపై ఉన్న పక్షులు భయపడెన, వక్షస్థల ఘాతముతో చెట్లు కూలి పోయె, సింహం విజ్రుమ్భించి నట్లు విజ్రుం భించగా మృగాలు మరణించె, మద్యమ జ్వాలలతో కూడిన అగ్ని నుండి ధూమము బయలు దేరెను,   

     *(11) శుభ కార్యము జరుగుతున్నప్పుడు ఆకాశ కదలికలు,వర్షపు సూచనలు, భూమిలో శుభ సూచకాలని ఇందు మూలముగ తెలియ చేస్తున్నారు, సంకల్ప సిద్దితో ముందుకు పోయేవారి రూపమ్ ఎప్పుడూ  సింహములా ఉంటుంది, కొన్ని మాటలు జ్వాలలుగా మరికోన్నిమాటలు చల్లని జల్లులుగా మానవులను ఆవహిస్తూ ఉంటాయనే గ్రహించాలి,  శుభకార్యాన్ని పాడుచేయాలనే దుర్మార్గుల గుండెల్లో సింహ స్వప్నం  ఉండాలనేది ఇందు నీతి)    

కొలుచుటకు శక్యము కానంత పెద్దదిగా శరీరమును పెంచె, చేతులతోనూ, పాదములతో, పర్వతమును గట్టిగా నొక్కె

పర్వతము ఒక్కసారి ఊగగా చెట్లపైఉన్న పూవ్వులన్ని రాలె, హనుమంతునిపై పుష్పాభిషేకమువల్ల పుష్పముల కొండవలె  ఉండేను.

*(12) శుభకార్యము చేసేవారు ఎవరా అని తెలుసు కోలేని విదముగా లీనమై పోవాలనే విషయాన్ని, ఉత్సాస నిస్వాసాలు మెత్తము కార్యదీక్షపై ఉంచి ఎవరు ఎమన్నా పట్టించుకోకుండా ఉండాలని, పెళ్ళిలో పుష్పాలు పంచుట కూడా  ఇందులో భాగమే,   అందరి దృష్టిలో మహానుభావుడు పూజింప దగిన మహాత్ముడు అనిపించుకోవాలని తెలియ పరిచిన నీతి)   

ఆ..నుడువు నుడువు ఒక్క యడుగు బెరుగుచు నా - కాశ మందు పెరిగి కీశ గుణము 

లల్ల సిల్ల మేఘ మురిమెనా యనునట్లు - పలికె నిటుల రామ బంటు నగచు

పర్వతముపై మదించిన ఏనుగులు మదోదకమును కార్చు చుండె, పర్వతముపై ఉన్న ప్రాణులన్నీ వికృతమైన స్వరముతో అరచు చుండె, సమస్త వర్ణ శిలలమద్య అగ్ని పుట్టివర్ణ దూమములు వచ్చు చుండె, భూప్రకమ్పనల మద్య హనుమంతుడు బయలు దేరుటకు నిశ్చయించెను . 

*(13) వివాహమునందు మదించిన వారు అంటే అత్యధికంగా  ధనమున్నదనే గర్వపడేవారు, ఎవరికీ తోచిన విధముగా వారు కల్పించి  కధలు చెప్పుకుంటూ పెళ్లిని వర్ణంచేవారు, కామంతో విర్ర వీగేవారు, నన్నే చూడాలని కేశాలు విరబూసుకొని, అరువు తెచ్చిన నగలు పెట్టుకొని ఆకర్షణ కోసం పాకు లాడేవారు, ఎన్ని తగాదాలు వచ్చిన, ఎన్ని పొగలు వెంబడించిన మనోనిగ్రహ శక్తితో "కర్త"  ఉండాలనేదే ఇందు నీతి)             

*తొకలపై స్వస్తిక్ చిహ్నములుగల సర్పములు నిలిచెను, విషము క్రక్కుచూ దంతములతో శిలలను కరచె

శిలలు అగ్నిజ్వాలకు దగ్ధమై వేయి ముక్కలై ఎగెరె, గిరిపై ఓషధ చెట్లు ఉన్న, శాంతింప చేయలేక పోయెను.

*(14 ) వివాహ వేదికలో కొందరు పెద్దలు, స్నేహితులు  సహకరిస్తూ సహాయము చేసే విధముగా ఉండాలని, ఓర్వలేవారు, తంపులు పెట్టేవారు ఉంటారు, జాగర్తగా ఉండాలని, హోమంలో సమిధులు ఆహుతి అవుతూ ఆ పొగ అంతా ఆవహించి చెడుని నాశనము చేయ గలదని ఇందు మూలముగా తెలుసుకోగలరు, కొందరు వితండ వాదులు, మూర్కులు, త్రాగినవారు  ఉంటారు, వారిని ఎటువంటి మందు శాంతిప చేయలేదని జాగర్తగా వారినుండి తప్పించుకొని కార్యము చేయాలనేదే ఇందు నీతి)    

భూతాలు పర్వతమును బద్దలు చేయు చున్నాయని తలచె

తినుచున్న లేహ్యములు, భక్ష్యములు, మాంసములు విడిచె,  మునులు, యక్షులు,  విద్యాధరులు వారి స్త్రీలతో పైకే ఎగిరెను , అణిమా సిద్దులుగల విద్యాధరులు హనుమంతుని చూసి ఆరాదించెను.

*(15) వివాహ వేడుకల లో సన్నాయి మాలములుతో,  కర్ణ ఖటోరమైన శబ్ధములతో బ్యాన్డుమేలములతో, పర్వతాలు బద్దలు చేయు శబ్దాలతో ఊరే గింపులు చేస్తున్నారు,    లేహ్యములు, భక్ష్యములు, మాంసములు భుజించుటకు చేస్తున్నారు  అవి ఆరగించి పెద్ద లందరూ నవ వదువులకు దీవించి ఆశీర్వాదములు  ఇవ్వటమే ఇందు ప్రధానము.

*****

1, ఆగస్టు 2024, గురువారం

 

బాల సాహిత్యం 


సీ..ఎదుటివారి పలుకు  ఎదను తట్టగలుగు - పదును చూప కలుగు పదనిసగను 

వదులు వదలనకు వరుసగలపు యింతి - పదులసంతసము గా పాఠ మగును

అదుపు తప్పక సాగు అదునుగా సుఖమయి - మృదుల మద్దెల కళ శృతి లయలగు 

కుదురుగా కుమ్ముటే కుందనపు కళలు - పొదల మాటున పోటు కలుగు 


తే..చదువు లేని సుఖము చూడు చలవ చేయు - అదుపు లెక్కయున్నను కష్ట పాలు చేయు 

వధువు వయ్యారములు చూపు వరద చేయు - మది మదనపు కళలగు మంద బుద్ధి 


****

సీ..ఎగిరేపతంగము ఎదురుచూపుల గాలి - జీవితము తతంగ జీవ జాలి 

చదరంగ పఠముగా సలుప చేష్టల గాలి -గమ్యమ్ము భద్రమ్ము గమన తీరు 

జీవన స్వేచ్ఛయె మది చిత్రవిచిత్రము -సూత్రదారం విధి చూపు పఠము 

వలయముగను తిర్గి వయ్యారమును జూపు -పట్టువిడవ కుండ పఠము యెగురు 


ఆ.. పరుగు పిల్ల పాప పఠము పట్టనులేక -దొరక పుచ్చ గలుగు దొరగ నేడు 

జీవితాన జరుగు జీవయాత్ర పఠము -మనిషి గాలి పఠము మనసు పఠన 

***


సీ..సుందరి శిల్పము చూపులతొ పసందు - సందడి చేయుట సంక నెక్క 

పందెము కాదులే పంతము ముద్దుకై - సాందర్య మౌనము సాధు పక్క 

అంద పసందును అందియందకచేయు - మందమారుత మగు మధువు దక్క 

చందన చర్చిత జప హావ భావమే - కుందనపు మహిళా కూడు కక్క 


ఏమి లావణ్య లలనవు యేల మొక్క - కామి తార్ధ యధరములు కాచు దక్క 

సామి తీర్ధపొందికయగు సాకు ముక్క - తిమిర తాపము తీర్చేడి తెగువ దక్క 


***


సీ..పెట్టిన దినమున పెనవేయు చుట్టము= నట్టడవుల కైన నడచి వచ్చు

బెట్టని దినములు బెట్టుగా సాగును - గట్టెక్కిన మనిషి గాన వచ్చు 

ముట్టననుచు చెప్పు ముచ్చట్ల తోముంచు - వట్టి మాటలనుచు వళ్ళు దోచు 

గిట్టు ధనముకోరు గెంతు లేసెడిబుద్ధి - వట్టి మాటలు కావు వొట్టు చెప్ప


తే..కట్టి కొట్టెడి మనిషిగా కాటు వేయు - చిట్టి చూపు చిన్నదనుచు చేటు చేయు 

మట్టి మిన్ను మధ్య బతుకు మాయ చేయు - పట్టి పట్టని మనసుగా పాట తెలుపు 


***


సీ..అందునిందును నెందు? సందేహ మెందుకు? - సందుసందున మత్తు మందు చిందె

మందు పొందిన మంది మందులై కీడును - విందులతొ సునందు వింత చెందె 

చిందునందునుపొందు చిందులేసెడి చెందు - మందు ముద్దు ముందు మనసు చిందె 

ఇందు యందన సందు ఇంతులతొ పసందు - బందులున్నను పొందు బంధ మందు 


ఆ..తక్కువగను నీరు త్రాగుట యేమందు? - నిద్ర లేక తిరుగు నీడకేమియు మందు?

మందు ఎక్కవగుట మనుగడేది యు పొందు? - చిందు లేయ విందు చిన్ని కోపము చెందు 


****


ఉ..అంకిత భావమే వదిలి అన్నము కోరిడి ఆశ జీవిగన్ 

సంకటమయ్య యవ్వనము శాంతినికోరుట సాధు మార్గమున్

వంకలు చెప్పు నీతిరతి వాక్కుల మాయల మోసపు బుద్ధిగన్ 

బంకుల నుండలే ననియు బాదర బందియు యేలనాకుగన్

***


సీ..మంచి కవిత యన్న మంచి కవియటన్న - మంచి యనగ నేది మంచి దగును 

మనిషి మనిషి వోలె మసలునటుల జేయ  - మానవత్వము జూపు మహిమ గాను 

మారుతున్నా కాల మనసు మాయను కమ్ము - మనిషి చెలిమి వల్ల మమత చెడును 

మస్తకాల వలనా మనుగడ ప్రశ్నయే - పచ్చదనము గున్న పంత మేను 


చిలుము పట్ట తోము పలుకు చెంబు బతుకు - గలుషితముయున్న కుంపటి కాల బతుకు 

బలిమి యున్ననూ బంధము బట్టి బతుకు - మలిన మైన బుద్ధి గనుమా మాను బతుకు 

****


సీ..నిజయబద్ధము తెల్ప నియమపాప మగుట - ఎన్నెన్నొ యందాలు యేల యనకు 

ప్రాయశ్చితము నున్న పాపమె మారను - మరణంచినాకీర్తి మార కుండు 

ఆత్మపీడన వల్ల ఆత్మీయతలు మారు - అరుణకిరణ మల్లె ఆశ బతుకు 

శాశ్వతమ్ము యనినా జగతి యందున లేదు - యీ శరీర ఋణము తీర్చ యిచ్ఛ 


తే..ఆశ యనెడి పిశాచిగా ఆత్ర మేల = విధి నమస్కార దూషణ వింత యేల

ఏడుస్తూ ప్రశంసిస్తాడు యిoదు యేల - నవ్వి నవ్వుల మనిషియే నటన బతుకు

***


సీ..మనిషివిలువమారు మనసుకలిగి నాక - కాలం విలువ తీరు కళలు చేరు 

మనది కానిది యేది మనదైన బ్రతుకేది - మనదనే జీవితమ్ మనసు కళలు 

ప్రేమ పలకరింపు ప్రీతి గా చిరునవ్వు - ఆప్యాయత కళలు ఆది పిలుపు 

మనకష్ట యిష్టము మనవాళ్ళు నేస్తము - గౌరవించే వాళ్ళు గళము తీరు


తే..దేహ మాతృడిగానుండు దివ్య గురువు - దేహ భావము పోగొట్ట దీక్ష గురువు

స్పష్ట సత్యాన్ని యనుభవ సాధ్య గురువు - మార్గదర్శనం మాయను మాప గురువు 

***


సీ..నీరు పల్లమెరుగు నిజము దేముడెరుగు - నీరు సూత్రమెరుగు నిప్పు వెలుగు 

నోరు ఓర్పు పరుగు నోము పూజ జరుగు - కోరు మార్పు పెరుగు కోర్కె వెలుగు 

పోరు నిత్య కలుగు పోకచెక్క వెలుగు - యేరు పొంగ గలుగు యేల వెలుగు 

ఊరు పాట జరుగు ఊపిరి కథలగు - జోరు బుద్ధి గలుగు జోగి వెలుగు 


తే..తప్పదు వెలుగు చీకటి తల్లి తండ్రి = ఒప్పు తప్పులు తప్పవు ఓర్పు నేర్పు 

నిప్పని తెలిసి కదులుటా నిష్ట బల్కె - తిప్పల మనసు తిరుగుటే తెల్పు జీవి 

***


సీ..కలవారు యనువారు కాలమందు పలుకు - కల్లాఖపటముగా కాంచు వారు

ధనమున్న ధరణిలో దరిద్రమనెడివారు - హితమెల్ల తెలిపెడి హితులు కారు

బంధము ధనమైన బాధ్యత కనలేరు - ప్రేమ పరిమళము పెర్చలేరు

మనిషి విలువ గూర్చి మదిలోన తెలపరు - పలుమారు పనిలేక బలుకు వారు


తే..గాల వశమున సర్వంబు గోల వారు - సుగుణ వంతుని ప్రేమతో జూచు వారు

ధనమదముతో జలగలుగా దాత లేరు  - వినరు నెవ్వరు చెప్పగలుగు వింత పోరు 


***-

సీ..చిన్నప్పుడు చదువు చిన్నబుచ్చవలదు - కన్న వారి పలుకు కనుల తీరు 

మన్నుతినెడి పాము మత్తుపెంచును యన్న - మిన్ను తీరు చెలిమి మెచ్చ లేరు 

చన్నులు కుదిసినా చెపల బుద్ధి కలుగు = మెన్ను విరిగి పడ్డ మేలు రారు 

తన్నులెన్ని తినినా తప్పులెరుగ లేరు - ఉన్న మాట తెలప ఊరు కోరు 


తే..యున్న నాళ్ళు నిజము పల్కు యుద్ధ భూమి - పన్ను కట్టి పలుకు చుండు పాప భీతి 

పెన్నిధి మనసు గమనించు పేరు కాదు - చిన్నది యనకు కష్టము చింతలనకు 


***

సీ..చల్లని కెరటాలు చక్కని చుక్కలు = అల్లిక జీవాలు ఆశ కళలు 

మల్లిక మహిమలు మక్కువ చూపులు - తుల్లిన మమతలు సుఖపు కళలు 

జల్లెడ వినయాలు జారెడి పయనాలు = వెల్లువ పలుకులు విశ్వ కళలు 

కల్లలు కథలేలు కావ్యపు గులికలు = పల్లవి రాగాలు పలుకు కళలు 


తే..చిల్లర బతుకుల కళలు చేరు కలలు - ఎల్లలగుట దశ దిశలు యాశ కలలు 

పల్లకి కళ కదలికలు పారు కలలు - పల్లవి పదనిస లతలు భావ కలలు 

***

సీ.. ఇరుగుపొరుగు పోరు ఇష్ట నష్టము జోరు - తలచు కడలి హోరు తనము తీరు 

విశ్వశాంతినికోరు విజయానికి కబురు = విసిగిస్తె బేజారు వింత చేరు 

మాట తీరు తెలుపు మాయ తెలుప నోరు -  ఈ పరిస్థితుమారు ఇంటి పేరు 

బద్దకం ఉంటేను బంధతీరును మారు - ఆణిముత్యము తీరు ఆర్తి మారు 


తే..గౌరవించ మూలము చూడు గొప్ప తీరు - అదుపు చేయాలి నోరునే ఆశ తీరు 

మంచి పేరుఊరు పలుకు మనసు చేరు - మరెవరూ సాటి రాలేరు మాయపోరు

***

సీ..మనమనుకున్నను మనవాళ్ళు కాలేరు - మన యిష్టమును బట్టి మనకు రారు

మనకష్టపు మనసు మమత పంచను లేరు - మన నష్టముయె మార్పు మాయ తీరు 

మన గౌరవపు విద్య మంచి మలుపు కోరు = మనయాస్తి గుణముయే మంత్ర తీరు 

మన ప్రియ నేస్తము మనుగడ మనవారు - మనపలుకే విధి మనుషి తీరు


తే..సేవలన్ని చేయ తలపు చిత్రమగుట = చేవ లేనట్టి వారికి సేవ చేయ 

తోవయేదైన నడుచుటే టో ట్రుపాటు - నావ కదలికే జీవితమ్ నటన తీరు

**-

సీ..కనుగొన లేనును గాయపు హృదయాన్ని - మనమని లేనట్టి మానసమ్ము 

ధనమున్న ఫలముయు ధరణినా పొసగదు - గొనకొని వెల్లువ గోరు పోటు 

కనలేని పకృతియే కనికరమే చూపు - గొనలిడు కాలము గూలు చుండు 

వినలేని తనముయె వింత వాకిటగుటే - అనలేని అసలు అదురు పట్టు 


క్షణమొక యుగమగుట క్షణ్తవ్యుని బతుకు - కనుల చూపు లేని కావ్య జగతి 

మనసు మర్మ మేను మనుగడ యాటలే - ఇనుము లాంటిబతుకు యీశ్వ రేచ్ఛ

*****

సీ..తిండి లేక వొకడు  తినలేక మరొకడు - ఉండి లేదనువాడు ఉండలేడు

మొండిగా బతికాడు మోజుతో నసిగాడు - దండిగా తినువాడు దండ గోడు 

గుండిగా పొట్టోడు గుండుగలిగినోడు- బండిలా కదిలాడు బండ లోడు 

వండి వార్చెడివాడు వరుడి యాట ల వాడు - రండి యనెడు వాడు రండ మొగుడు 


ఆ..ఉండ బట్ట లేదు ఉరికెడి వాడులే - కనులు లేని  వాడు కండ లోడు 

కుండలున్నవాడు  గూడు మూకుడు తిండి - బండ బతుకు యెoడ పండ బుద్ధి

***

సీ..డబ్బుతో పొందేది డాంబిక బతుకుయే - డబ్బులో మునిగియే డప్పు కొట్టు 

డబ్బు నిలకడేది ఢమఢమా ఖర్చులే - డబ్బు రోగ మయము ఢమరకమగు 

డబ్బు కే పరుగులు డ్రమ్ము మోతలు గాను- డబ్బు లేకయు తంట ఢoక మోత 

డబ్బు జబ్బువదలు డబ్బువిద్య బతుకు - డబ్బు చిన్నాచూపు డబ్బు కేల


తే..సబ్బులా కరుగేబుద్ధి సమయ ధనము - గబ్బు వున్న డబ్బునుచేరు గమ్య మేను 

మబ్బు లాడబ్బు ఆశలు మార్గ మౌను - డబ్బు కదలికే ఙివితం డచ్చి లచ్చి 

***

సీ..తెలుగు మాట్లాడరా తెగులు ఆంగ్లము వద్దు- తెలుగు చిదంబరం తీరు చదువు 

తెలుగు బ్రాహ్మణ విద్య తెలుసుకో జాతకం - తెలుగు అర్ధమ్ము గా తీరు చదువు 

తెలుగు తల్లీ దేవి తక్షణ శోకమౌ - తెలుగు గౌరవమేను తీరు చదువు 

తెలుగు కథలుగాను తెలపగలుగు విద్య - తెలుగు భూమి యిదియు తీరు చదువు 


ఆ..తెలుగు బాష వెలుగు తేట తెలుగు విద్య - తెలుగు నాడి గతియు తెల్ప చదువు 

తెలుగు దేశమిదియు తెలుపగలుగు విద్య - తెలుగు బాష యేను తిష్ట చదువు

***

సీ..  రాజిల్లు భాషయే రాష్ట్రమంతట విద్య - భాజా భజంత్రీగ బంధ తెలుగు 

పెద్దయు చిన్నయు పేర్మితొ జదువంగ - రాజకీయము వద్దు రవ్వ వెలుగు విద్య 

వాజి విజయ మగు  వాగ్దేవి యొసగిన = కాజ తీపి కనికరమ్ము తెలుగు  

 అదియెను తెలుగను అధికార భాషగా - అక్షరా లధికము అంధ చదువు 


ఆ..కానగలుగు చుండు కాంచనంబు తెలుగు - అమృత భాష తెలుగు అమ్మ తలపు 

విజ్ఞ తెరిగి జదువ వినయంబు జేకూర్చు = తెలుగు తేజ మదియ తెలియ చుండ 

***

సి..మాట మంచిగనుమా మనసు ఘనము చూడు - మాటే మనసు అద్ధమౌను నిజము 

మాట తెలుపు జీవి మాయ అహమగుటే - మాట బేధము యుద్ధ మనసు నిజము 

మాట ధార వెలుగు మాతా పితురు లౌను - మాట మలుపు ధార మమత నిజము 

మాట గురువు బోధ మంత్ర చెలిమి గాను - మాట జీవితమేను మాయ నిజము


ఆ..మాట విలువ జూడ మంత్రమౌను విధిగా - మాట మంచి చూడు మార్గ మౌను

మాట నిత్య సత్య మానసమ్ము గనులే - మాట మంచి చెడుకు మాయ తలపు

***

సీ..హద్దులు గీస్తున్న హోదా యహమ్మగు - ఈర్ష్య యసూయల ఇచ్ఛ యేల

సమరమ్మ సుఖమగు సమయమే జీవితమ్ - ఎదురీత ప్రళయమే యదల లీల

తెలివితో వ్యూహమ్ము తెగువతో జీవితమ్ - ఓయదృష్టముపొంద ఓర్పు లీల

సుడిగుండమున పడ్డ సృష్టిగ జీవితమ్ - నవ్వుల బహుమాన నయన లీల


గీ..త్యాగము పరమోన్నతమౌను కాల బుద్ధి -నిలయ రాజీవ యానంద నిత్య బుద్ధి 

భాగ సంజీవనముగాను భాగ్య బుద్ధి - నాగరికత నడక జూప నయన బుద్ధి

 

***


సీ..మకరంద సుమధుర మాధుర్య మధులత - ప్రతి యెదలోననె ప్రభల గీత

మది భాషణంగాను మనుగడగ సమత - రసవాహిని పలుకు రాస గీత 

నిత్య అంతర్వాహినిగను సాగు మమత - ప్రణవ ప్రకరణమె ప్రకృతి గీత

మేధోమథన మేఘమథనమై చతురత - ఉరిమి మెరుపులై ఊహ గీత


గీ..ఆత్మ అవినాశ నిత్యమై ఆశయమగు - కళలు పంట వీనుల విందు కాల మయము 

కలలు తీరు జయముగాను కనుల తీరు - కథలు కావ్య మగుట నెంచ కామ్య చరిత


****


సీ..ఎంత బ్రతుకు నందు నంత సంతోషమ్ము - ఎంత చెట్టుకునైన నంత గాలి

అంత యింతని యెంతైన నొక్కటే - చింత పడగరాదు చెంత గాలి 

కొంత భక్తిని జూపి కొంత రక్తిగా జూపు - ముంత నాకుడులోన ముంపు గాలి 

బొంత బతుకుగాను బోధచదువు గాను - శాంతి లేని బతుకు శాప గాలి 


గీ.కాల నిర్ణయమే యిది కావ్య జగతి - ఎంత చెప్పినా తక్కువే యేల జగతి 

జాలి అహము కోప పలుకు జాతి జగతి - మారు మాటలేని బతుకు మాయ జగతి 

***


సి. రమ్యంపు పలుకులై రాయంచ ములుకులై -అలరారి విలసిల్లు అలక జూపు 

కాకలీ రవములై  కనువిందు భవములై - తెలివెల్గు లందించు  తిక్క జూపు 

జాబిల్లి వెన్నెలై  జలతారు వెల్గులై - తిలకమై వెలుగొందు తెలపు జూపు 

హిమశైల శిఖరమై హీరంపు నికరమై - తేనియల్ చిందించు తెలుగు కవిత 


తే . కమ్మకమ్మని రుచులూరి కానుకలవి -మధు సుధారలు కురిపించి మాయలు యవి 

పొద్దు పొడుపులై నిత్యమ్ము పోరు లవియు - దేశ వాసులన్మేల్కొల్పు తెలుగు కవిత


****


సీ..ఆర్యవర్ధన గను ఆయుష్ విధి పరమై -సర్వ శక్తి గమన సాధు బుద్ధి 

నిర్వి రామకృషియు నిజనిజాల పలుకు - కార్య నిర్వహణ కాల గుణము 

సౌర్య సహన విద్య సౌకుమార మెరుపు - ధైర్యమే సంపద ధరణి యందు 

పర్యావరణ రక్ష పాఠ్య భోద తెలుప - చర్యా వినయ వాంఛ చరణ రీతి 


తే..కానుక మది తలపు లౌను కామ్య మగుట -కవి చరణమే కళలు తీరు కాంచనమ్ము 

సమయ సద్వినియోగము సరళ రీతి -తెల్పు మల్లాప్రగడ రామ తేట ముద్దు 


****

సీ..నాలుగు దిక్కులు నయన కళల చూపు - ప్రతిపదము శ్రమించ  ప్రగతి కోరి 

త్రిగుణాల విషయాన తీవ్ర తపన తోడ - సత్వ గుణము వైపు సాగు కళయు 

ద్వంద్వాల విషయాన ద్వంద మేల నీకు - రెంటి కతీతమే రెప్ప బతుకు 

నీటిలో బుడగలే నీడలో వెలుగులే చినిగిన కాగితం చేరు చెలిమి 


తే.గీ.  మర్మ మెరిగియు జీవితం మనసు పంచు ధర్మ మార్గాన బ్రతుకుము ధరణి యందు 

అర్ధ పరమార్ధ సూత్రాలు నాచరించ ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత 

***

చిరునవ్వు మీవెంట చరితమార్చగలుగు -  ధరణి నీడ మనసు ధర్మ మార్గ

కరుణ చూపుకలయు కాలానుభవమగు - తరుణ దుఃఖ సుఖము తనువు తీర్పు

మరులుగొల్పుమమతమానవత్వమగుట తరువు లాంటి బతుకు తమక జపము 

పరువు కోసమనియే పదములె విప్పకు అరువు బరువుగుటే ఆశ వలదు


గీ..నమ్మకం సమ పాలన నయన తీరు వమ్ము చేయని జీవితం వలపు తీరు

చెమ్మ రానీక కలతీర్చ చింత మారు సమత మమత తీర్చ తలపు సహన చరిత

***

సీ..చిక్కులన్నియు చుట్టి చిత్తమందు జేరు ఘర్షనల్ నొసగుచు ఘడియ ఘడియ

చేయగ ధ్యానమే చెలిమిచే కురుటయు  ధైర్య ధనము నున్న ధరణి నీకు రక్ష

బద్ధక మంతయున్ బదులు చెప్ప లేదు ఆత్మబంధువెపుడు నాదరించు

నిత్య శాంతపు నీడ కమ్ము కొనుట  జగడమొద్దు మనకు సాగవోయి


తే. గీ.వినయ శంకారమై నిత్య విజయ మేను ప్రణవ మోంకారమై గతి ప్రగతి జూపు 

కులికి ఆడెడి పాడెడి కూర్పు గలుగు  విశ్వ మాయకృష్ణునిలీల విజయ మేను

***

సీ..ఆకారమై త్రిగుణాకార సాకార - మై కన, నీ మది మౌనమేను 

రాకారమై మది శ్రీకారమై గతి - హుంకారమైవిధి హాస్యమౌను 

శ్రీకార భాంకార శ్రీ శక్తి కర్తవ్య - వెలయ టంకారమై వేదనౌను 

 శ్రీకార ఢంకార శ్రీ విద్య ఘీంకార - హంకారమైశోభ హారతౌను


తే. గీ మనసు ఝంకారమై కేకి మగ్గిపోవు వయసు క్రీంకారమై సిరి వడలి పోవు 

సొగసు ప్రాకారమై కళ సోకు పోవు   కలికి హ్రీకారమై చెలగ కాల మౌను

***



బ్రహ్మతత్వభావాలు ..౧ సీస పద్యాలు 


అన్యాయమును దుష్టబుద్ధిని తరిమియు - ధీరుడుగాను విధేయుడగుట, 

సిద్ధాంతములనువశీకరములగాను    - నిర్భీతిగా నుద్ఘాటించుచుండె 

తెగువతో కాపాడి గుప్తవిద్య లనేవి  - నేర్పి మానవుని పురోభివృద్ధి

పరిపూర్ణతల యెడ పరమావిధినిచూపి - జనుల సేవయు చేయు జపత రామ 


జాగరూకత కలిగి యుండుటయు రామ - మానవ పురోభివృద్ధిగా మనసు పంచు 

ప్రజల రక్షణ ధ్యేయంగ పాకులాడు - ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు   



***

అంబవు నీవునా మలుపు ఔదల చూపుల సందడేయగున్  

అంబర మేను సేవ మది అక్కడ నీకృప ధర్మమేయగున్ 

బంబర మౌన దీక్షతయు బంధపు చిత్తము నేస్తమేను  ఆ

డంబర శాంతిగా కను విడంబన జూపుల ధార్మికమ్ముగన్