10, జులై 2024, బుధవారం

శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధన.

 *******

101

అపార్థపు అనర్థాల జీవితం నాది వేంకటేశా

 అర్థం పరమార్థం కోరి నిను చేరా వెంకటేశా 


ఆ ఇంటి ముందు యీ ఇంటి ముందు 

ఎన్నో ఏళ్లుగా తిరిగా 

 నవ్వులే నా బతుకై నడకే కష్టమై 

నేను నమ్మి నీ దగ్గరగా చేరా వెంకటేశా 


కళ్ళల్లో మెరుపులు రాలిపోయి 

చరమాoక జీవితంలో చేరిపోయి 

పళ్ళు లేని పెదవులుబిగసుకు పోయి 

 జీవితాని స్నేహంగా కలిసిపోయి 

 నీ ముంగిట మనసులో చెప్పుకుంటున్నా వెంకటేశా 


 ఎన్నో అగ్నిపర్వతాలను దాటుకుంటూ 

 సుడిగుండాలను ఉప్పెనలను తట్టుకుంటూ 

 అనేక నేక మానవ మృగాలను దాటుకుంటూ 

 అనుభవాలను అనుభూతులను తెల్పాలని వచ్చా ను వెంకటేశా 


 నుదట రేఖలు మార్చలేవని తెలుసు 

 పాప పుణ్యాల కర్మలేనని తెలుసు

 ఇక కాలమంతా నీసేవలో బ్రతకాలని వచ్చా వేంకటేశా


అపార్థపు అనర్థాల జీవితం నాది వేంకటేశా

 అర్థం పరమార్థం కోరి నిను చేరా వెంకటేశా 


 గోవిందా....గోవిందా... గోవిందా

******


శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి..ప్రార్థన..102

 మల్లాప్రగడ రామకృష్ణ


ఓ స్వామి నామీద దయలేదా ఏమి?

అమ్మలకైనా నా మనవి వినిపించ వేమి 


 నీ హృదయం నవనీయతమైతే యేమి?

 నా యదగాయన్ని  మార్చ లేదు స్వామి 


 నీ మనసు అమృతం అయితే ఏమి?

 నా మది బాధ మార్చ లేదు స్వామి 


 నీ అడుగులు ప్రగతి పదం అయితే ఏమి?

 నా నడకకు గమ్యం చూపలేదు స్వామి 


 నీ స్నేహం సెలయేరు అయితే ఏమి?

 నా బ్రతుకులు ఎదురీత మారలేదు స్వామి 


 నీ జ్ఞాపకం ఒక దీపం అయితే ఏమి?

 నా తలపులకు దారి చూపలేదు స్వామి 


 నీ బంధం ఆదరింపు అయితే ఏమి?

 నా సాన్నిత్యాన్ని మార్చలేదు  స్వామి 


 నీ బోధన ఓదార్పు అయితే ఏమి?

 నా వేదన తీర్చలేదు స్వామి 


 నీ ప్రేమ సాగరం అయితే ఏమి?

 నా అనురాగార్తిని తీర్చలేదు స్వామి 


 నీ కరుణ ఒక మేఘం అయితే ఏమి?

 నా మీద దయావర్షం కురిపించలేదు స్వామి 


 నీ శాంతం ఓ కపోతమైతే ఏమి?

 నా భావ కథలు వీక్షించలేదు స్వామి 


 నిన్ను వరించడం నేను చేసిన నేర మైతే 

 నిన్ను ప్రేమించడం నేను చేసిన దోషమైతే 


నా సమస్యలు పరిష్కారం చూప వేమి స్వామి 

 అపరి చితునిలా సాగిపోవాలా స్వామి 

 అపరాధిలా ఒప్పుకోవాలా స్వామి 

 అనా మకునిలా సాగిపోవాలా స్వామి 


 నా మీద నీకు ఏమి కోపం స్వామి వెంకటేశా 

 నా మాటలు ఆలకించు మా స్వామి వెంకటేశా 

 నా మౌనం తిరస్కారం కాదు స్వామి వెంకటేశా 

 నామీద ఎందుకు ధైన్యం గా ఉన్నావు స్వామి వెంకటేశా


ఓ స్వామి నామీద దయలేదా ఏమి?

 నీ హృదయం నవనీయతమైతే యేమి?

ఓ స్వామి నామీద దయలేదా ఏమి?

అమ్మలకైనా నా మనవి వినిపించ వేమి 


గోవిందా.. గోవిందా..

********

పల్లవి.

శక్తి నిమ్ము స్వామి నాకు సమయ భక్తి గానులే 

యుక్తి నిమ్ము స్వామి నాకు యున్నతమ్ము గానులే                 ॥శక్తి॥


అనుపల్లవి

ముక్తి నిమ్ము స్వామినాకు ముఖ్య మైన గానులే 

రక్తి నిమ్ము స్వామి నాకు రమ్య మౌను నేనులే                ॥శక్తి॥


దేశ భక్తి, నది గాను దైవ భక్తి తోడులే 

కవిగ , గాయక గురు భక్తి కాలమౌను తోడులే 

నవ కవితలు చేయు శక్తి నాకు యిచ్చు నీడలే 

దివ్య శక్తి నొసగు స్వామి దీన తగను  ప్రార్ధనే     ॥శక్తి॥


బీద సాద నాదు శక్తి బీడు గాక  చూడుమా 

మధుర మైన మాతృ భక్తి మాలొ నుండు మార్గమా 

 రస భవమగు తెలుగు భక్తి,రమ్యతే చె కూర్చుమా 

ఎదను నున్న నీవు స్వామి యెల్లరగుట భక్తియే    ॥శక్తి॥


మతము పైన ముదురు భక్తి మాయ చేర లేదులే 

జాతి పైన జిలుగు భక్తి జాతరైన జాములే 

అత్మీయతయు నింపు యుక్తి, ఆశ మార్పు కోర్కెలే 

చతురతగను నీవు స్వామి  చింతలన్ని  మార్చుటే    ॥శక్తి॥


కవిత లల్లు మనసు శక్తి కాల మాయ గానులే 

నవవసంత లక్ష్య శక్తి నటన యంత నీదెలే 

భావుకతలు బంధ శక్తి బాధ్యతపును నీదయే 

అవిరళముగ నివ్వు స్వామి ఆనతిగను నీదయే  ॥శక్తి॥

----------


శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి..ప్రార్థన..104

 మల్లాప్రగడ రామకృష్ణ


శ్రీశ్రీ శ్రీనివాస మా జీవన గమ్యమే ఇది 

శ్రీశ్రీ శ్రీనివాస మా జీవన గమ్యమే ఇది 


కలగన్నది ఒకటి, కడ కైనది ఒకటి,

పిలుపన్నది ఒకటి, పెనవేసిన దొకటి 

వలపన్నది ఒకటి, వలపైనది దొకటి 

కల యైనది ఒకటి, కథకైనది ఒకటి 


 ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి ఓ శ్రీనివాసా 

 ఇరువురు మధ్య నీవు ఎలా వెలిగావో ఓ శ్రీనివాసా 


తలచినది ఒకటి, తుదకైనది ఒకటి,

వలచినది ఒకటి, వరుసన్నది ఒకటి 

మలచినది ఒకటి, మదికందిన దొకటి,

ఆలోచన ఒకటి,  అసలైనది ఒకటి,


ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి ఓ శ్రీనివాసా 

 ఇరువురు మధ్య నీవు ఎలా వెలిగావో ఓ శ్రీనివాసా 


మోహ మొందిన దొకటి, మనసైనది ఒకటి,

దాహ మన్నది ఒకటి, దరువైనది ఒకటి 

స్నేహమైనది ఒకటి, సొంతమైనది ఒకటి,

ఊహ యైనది ఒకటి, ఊపిరైనది ఒకటి 


ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి ఓ శ్రీనివాసా 

 ఇరువురు మధ్య నీవు ఎలా వెలిగావో ఓ శ్రీనివాసా 


మనము కోరిన దొకటి, మనకు దక్కిన దొకటి

మనసు పడినది ఒకటి,  మన చేత నొకటి,

మనువు యాడిన దొకటి,మనసు దక్కినదొకటి

తనువు కోరినదొకటి, తపన తీర్చిన దొకటి 


ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి ఓ శ్రీనివాసా 

 ఇరువురు మధ్య నీవు ఎలా వెలిగావో శ్రీనివాసా 


కోరినది ఒకటి, కొంగునున్నది ఒకటి,

చేరిన దొకటి, చెంత నున్నదోకటి 

మారిన దొకటి, మార నున్న దొకటి

 జారిన దొకటి, జారని దొకటి 


ఇరువురి మధ్య నలిగిన శ్రీ శ్రీని వాసుడు 

తలపులలో తపము తలరాత శాపము 

తలక్రిందులైన బ్రతుకు, తియ్యని తలపులతో బ్రతుకు

ఊహలలో లోపమా, ఉర్వి జీవుల కోపమా 


కాల మహిమా యిది, కర్మ ఫలమా యిది                      

మనిషి జీవితిముల, మితి మిధ్య కోరికల 

శ్రీనివాసుని లీలా సంకల్పము గోల                   

ఆరాటము ఒకటి, అందినది ఒకటి,


నరుల బ్రతుకుల లోన, నిరతము మలుపులె 

తిరుమలేశుని తలపు, తెల్ప తరమా?


శ్రీశ్రీ శ్రీనివాస మా జీవన గమ్యమే ఇది 

శ్రీశ్రీ శ్రీనివాస మా జీవన గమ్యమే ఇది 

ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి ఓ శ్రీనివాసా 

 ఇరువురు మధ్య నీవు ఎలా వెలిగావో శ్రీనివాసా 


****

శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి..ప్రార్థన..105

 మల్లాప్రగడ రామకృష్ణ


గాలి ద్వారా వచ్చిన పూల పరిమళం లా 

 ఆకాశంలో వికసించిన పున్నమి వెన్నెల లా 

 పుడమి పై కురిసిన వర్షపు చినుకు లా

 నా హృదయ శబ్దాలు నిన్ను చేరాలని ఆశ వెంకటేశ  


 ప్రేమ సాగరంలో ముంచావు నేను అన లా 

 అలలు అలలుగా మార్చావు ప్రశ్నించ లా 

 తియ్యని పాటగా పల్లవించావు మొక్కు లా 

ఏకాంత వీణవై గీతాన్ని ఆలపిస్తున్నా వేంకటేశా


ఒకే పరతత్త్వం-

సంకల్పం లేనప్పుడు దేవుడు గా(అచలంగా)

సంకల్పం ఉన్నప్పుడు దేవతగా (ప్రపంచంగా) 

 కొలువై ఉన్నారని తెల్పావు వేంకటేశా..


ఆపదలోకి త్రోయడం,...ఆపద నుంచి రక్షించడం...

అజ్ఞానానికి గురి చేయడం...జ్ఞానప్రబోధం చేయడం...

మంచి-చెడులనేవి సమాంతరంగా లేనట్లు... మళ్లీ ఉన్నట్లు... కల్పిస్తావు వేంకటేశా


ప్రతిజీవి కర్మఫలాన్ని ప్రతిజీవికీ సరాసరిన పంచుతూ

అవతరించడం...అనుగ్రహించడం....

ఆగ్రహించడం...అంతం చేయడం...దేనికి వేంకటేశా

.********

*శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి..ప్రార్థన..106

 మల్లాప్రగడ రామకృష్ణ


రాత్రి యందాల రాత్రి గారమ్ము నీకై 

ధాత్రి యందాల ధాత్రి మోదమ్ము నీకై 

స్వాతి యందాల ఖ్యాతిగా సాక్షి నీకై 

నాతి యాందాల నాట్య మనమ్ము నీకై 

వేగిరమ్ముమా నమ్ముమా వేంకటేశా


పాత్రలోఁ జాల పండు లింపైన పాలే 

గాత్రమందుండు నూత్న రాగమ్ము నీకై 

మాత్ర మాయలే నూత్నమ్ము మనసు పాలే 

యాత్ర వైభోగ భావమ్ము యాస నీకై 

వేగిరమ్ముమా నమ్ముమా వేంకటేశ


జీవనమ్మందుఁ జిత్త రాజీవ మీవే 

భావనా వీణ సేయు రావమ్ము నీకై 

కావుమా మమ్ము కమనీయ కాల మీవే 

సేవలే మీకు సేయ రావమ్ము నీకై 

దేవి మిము కాంచ కలిగెటి దీప్తి నీవే 


జీవనానంద నృత్య రోచిస్సు నీవే 

భావనాకాశమందు దీపమ్ము నీకై 

యావలన్నియు మార్చుకాయమ్ము నీవే 

నావలాకడలిన పయనమ్ము నీవే 

దేవి మిము కాంచ కలిగెటి దీప్తి నీవే 


ఓలలాడంగఁ గౌముదీ యుత్సవమ్మే 

మాల నేఁగూర్తు స్వర్ణ దామమ్ము నీకై 

పూలతో గంధ మెందు సమ్మోహనమ్మై 

తాళబద్ధమ్ము తేటగీతమ్ము నీకై 

వేగిరమ్ముమా నమ్ముమా వేంకటేశా


******

తేటగీతము - ర/ర/య/య UIUU . IUIU . UIUU 

********

*అభ్యర్థన!మందారం!ముక్కంటి*


కైలాసమందుండినా.. కైవల్యము కో రుచుంటి 

కాలు కదపవు నీవు నన్ను.. కాలమ్ము నా మనస్సంటి  


బంధాలు తెంచుకు నేను..బయట నే పడలేనంటి 

అంతటా ఉన్నావనే..చూడమంటావు నెకంటి 


ఆత్మ చక్షువు నాకేది..విచ్చుకో లేదు యేమంటి 

కార్యదక్షత నాకేది.. కామ్యమే లేదు ఏమంటి 


చిద్విలాసముయే నీకు..చిత్రమేమోగానంటి 

చీకు చింతల తోటినే.. తీవ్ర నాకు సహవాస మంటి 


పంతమెందుకు నాతోను ,.. పాలెగాడను కానంటి  

సుంతైన దయరాదెలే..వింతగా తోచలేదంటి 

 

అయిన వాడను గానులే..అలుసు అయ్యానా కోటి 

ఆర్తిగా యాచించితీ..నే అలిసి పోయానంటి 


పంతాలుగ నీకేనా?..పరమేశా చూడనంటి 

గుండెలోనే గుడి కట్టి..కొలువకుంటా ముక్కోటి 


అంతటా ఉన్నావులే..అన్నదే నిజమైనంటి 

అక్కడికి రాకుండగా.. ఎక్కడికి పోతావంటి 


శ్వాస ఆగక మునుపెలే..చూసి పోవయ్య నంటి 

చరితార్థుడై నే నిన్ను..చేరుకుంటానంటి

********

UI UII UI UII - UI UII UIU  - ఊహల డోల - భ/ర/స/జ/జ/భ 


 మార్పు యన్నది కోరుకున్నది- మానసమ్మున నిత్యమున్ 

 ఓర్పు జూపిది సర్వమందున -వోట మైనను భవ్యమున్ 

 కూర్పు నీదియు నిత్య వాక్కులు -కూట మైనను ధన్యతన్ 

 నేర్పు నీదియు నమ్ముతుంటిని -నీడ గాంచితి భక్తిగన్ 

తీర్పు లన్నియు సత్యమేయగు - దీప కాంతిగ మొక్కితిన్ 

దర్పమన్నది లేకచూడుము.. దాత గానును నుండెదన్ 

శ్రీనివాస విదీ మనోస్థితీ - శ్రీ నివాసుయె వేంకటేశ్వరా 


వారు వీరని బేధభావము వాంఛలేయగు దైవమా 

కారుచిచ్చుగ దాహమంతయు కానుకాయగు యీసుధీ 

ఆరు నూరుగ మోసమేమదిగాను యేలను యీ నిధీ 

చారుహాసుని లీలలేయగు చంచలేయగు దేవరా 

***--

కార్యసాధన తత్వమౌనే కర్తవ్య భావమ్ము గానున్ 

సూర్యశక్తియు నిత్యమౌనే సూత్రమ్ము లక్ష్యమ్ము గానున్ 

ధైర్య మేగతి నిత్యమౌనే దైవయనంతమ్ము గానున్ 

ఆర్యనీతియు సత్యమౌనే యాశయ మూలమ్ము గానున్

*****

UI UII UI UII - UI UII UIU  - ఊహల డోల - భ/ర/స/జ/జ/భ 


ప్రేమ చూపితి పూజ చేసితి - ప్రీతి పొందక నేను వెళ్ళితిన్ 

ఆశ లన్నియు భాద లయ్యెను - ఆట మాత్రమే మర్చి పోయితీ

బోధ నంతయు తెల్ప గల్గితీ - బీద వాక్కుకు మోస పోయితిన్ 

పాట పాడితి ఊహ చెప్పితీ - పాశ మైనది పాపమే గతీ 

కీర్త నంతయు నేను తెల్పితీ - కీడు యన్నను తప్పు తెల్పితిన్ 

ఏది వెల్తురు ఏది చీకటీ - ఇచ్ఛ యున్నను చెప్ప గామతీ 

శ్రీనివాస లతామనోస్థితీ - శ్రీ నివాసుయె వేంకటేశ్వరా 


కొందఱుoదురు మోసగాండ్రలు - గూర్మి జూపుచు 

నమ్మబల్కుచున్,

గందువంతులు నస్మదర్థప వాథకంబులఁజే ధనంబుగన్

పొందునొoదరు విత్తమెంతయు  మూలమేయగు

నిక్క మిద్దియున్ 

సందియమ్మగు మింతలేదను చక్క దంచును 

మోసగింతు రా 

మంద శిక్షయు వేయునెంచుట -మాన సమ్మున !మ్రొక్కెదేయగున్ 

వందనమ్ముయు వేంకటేశ్వర - వంత పల్కుము వేంకటేశ్వరా 


తేరు కొంటిని తేట తెల్లము గా మనో భవ సాగరం 

లో తరించి మదీయ వేదము గా తపో భవ సాగరం 

లో భరించి విశాల విశ్వము గా   పరం భవ సాగరం

లో భవాని పదాల పర్వము శ్రీని వాస లతా మయున్






ఓం శ్రీ



రామ.. శ్రీ మాత్రేనమః 


ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక...శుభాకాంక్షలతో*11-7-24

నిర్వహణ:: ఫేస్బుక్ ద్వారా... మల్లాప్రగడ రామకృష్ణ 


శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధన.. 34


 పల్లవి

దరి చేరితిని దారి  దక్కదిక్కువు నీవు 

సరిజూచు బాధ్యత సమయము నీదిరా 

చిక్కెను యీరోజు నీపాదములు నాకు 

హరిహరి నీపాద మార్గనాకును దిక్కురా 


చరణము1

వెలివేయకురా వెంకటరమణా।    

దరిచేరితి నీ మానస రమణా l                                   

 కాల దోయకు హరి నారాయణ।

మాల దెచ్చితి హరినారాయణl.... ద 


 చరణము2

ఇడుములబడితిని ఎన్నెన్నో మరి।

నీదయలేకా శ్రీహరి నీ నీదయలేకా।

కడు తప్పటడుగులు ఎన్నెన్నో మరిl

నీకృప లేకా శ్రీహరి నీ నీకృప లేకాl


తాళలేనురా తాటకమర్ధన!

దయతోబ్రోవర దానవ భంజనl

హేదురి తారీ హరిహరి

నీ పాదములే నాకు దిక్కురా వెంకట రమణా.... ద 

చరణము3

వదలనువదలను నేనేనాటికి।

నీపాదములూ నరహరినీపాదములూ।

పగబూనకురా పక్షివిహారీ।

కరుణించుమురా కంసమురారీ।.... ద 

                  చరణము4

సలిపితి సలిపితి ఎంతోభక్తిగ।

నీపూజలనూ విరివిగనీపూజలనూ।

పద్మికాప్రభో!హేభవహరణా హరిహరి నీపాదములూశ్రీహరినీపాదములూ।।చిక్కేచిక్కే॥

గోపికాప్రభో!హేగిరిధారీ హరిహరి

నీపాదములూ 

శ్రీహరి నీ పాదములూ॥.. దరి 


గోవిందా... గోవిందా... గోవిందా 


 *****


విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ 35.


హృదయమునకు ప్రీతి కలిగించు హృదయమే వేంకటేశ

పుణ్య కర్మలు చేయు వారి శిరమున వేంకటేశ


యోగ నిష్ఠుల ప్రస్థానములొ సహాయ సహకారం 

నిర్మలత్వము ప్రసాదించు రూపము వేంకటేశ


చ్ఛిన్నాభిన్నమైన తత్త్వజ్ఞానము సహకారం 

ఉండే సంశయములనే తిర్చేటి వేంకటేశ


దుష్ట శిక్షణ శిక్ష రక్షణ యందు సహకారం 

కపాల మోక్షముకు అనుశ్రుతముగా వేంకటేశ


ఆఖరి దశలో శాంతి కల్పించే సహకారం 

విచ్ఛిన్నమస్తక గ్రంధులు ఏకం వేంకటేశ


నిత్యమూ సందర్భము ననుసరించి సహకారం 

సరైన పునర్జన్మను కలుగచేయు వేంకటేశ


జనులకు ఆత్మజ్ఞానము అందించే సహకారం 

జన్మ రాహిత్యాన్ని ప్రసాదించు వేంకటేశ

 

మంచి వారు ఎల్లప్పుడు పూజింప వేంకటేశ 

పాద పంకజములు కలగి పవిత్రత వేంకటేశ

*****

36.

కనలేవులె కధ లన్నియు 

వినలేనివి చేష్టలౌను విజయమ్ముగనున్ 

అన లేవులె తమ తప్పులు 

విను మాయెనుజీవితమ్ము వెంకట రమణా


నన గానదు లత వాడెను 

వినరాదొక పిక గీతము విందుగ లేదే 

గణమే కదిలే కథలై 

వినుమా పుట్ట విధిగాను వెంకట రమణా 


మలుపే యొక మనసే యొక  

పలుకే వినయమ్ముతలపు పదనిస లగుటే 

కులుకే యొక దుడుకే యొక

 విలువ పంచెద నిరతము వెంకటరమణా 


వలపే యొక పెను శాపము 

మలుపే మన్మధుని లీల మాయలు రమణా 

తలఁపే యొక పరితాపము 

చెలువాలకగు బలిపీఠ చిందులు రమణా 


చినమాయయు చెర యయ్యెను

పెను మేదినియు చెఱసాల పేరుగ రమణా 

పని లేనిది పస లేనిది 

వినువీథుల కరుణదృష్టి వెంకట రమణా 


కధ లవ్వుట కళలవ్వుట 

పదిలమ్ముగాపరువమ్ము బద్రమే రమణా   

పెదమాయయులే ప్రేమా 

చదువే సహనమ్ముగాను చలువే రమణా 


పరమేశుని కెడబాటులె  

కరుణ రసమయమ్ముగాను కనికర రమణా 

మఱి నాహృది నెటులాతఁడు 

సరి చేయు దరి చూపుగాను సాహస రమణా 


*****



శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధన.. 37.


జ్ఞాన సంపన్న పండిత వాక్కు నిధి గను లె 

మహత్ముల కృపగా మనకది కలుగును లె 

వేంకటేశ్వరానుగ్రహమై భక్తి చెలగును లె 

వేంకటేశ్వర అభయ హస్తము నుంది లే 


లౌకికములు గ మునిగి యున్నాను లె 

దైవ లీలలను కీర్తించు చూన్నాను లె 

మనసును భక్తిలోన  నిలిపాను లె 

దేవున గ ధ్యాసకు దూరమై పోదు లె

వేంకటేశ్వర అభయ హస్తము నుంది లే 

                      

సజ్జన సంగతి సులభము కాదు లె  

అవగతమైనదిగ దరికి రాదు లె         

దొరికితె చాలు మననొదిలి పోదు లె 

ధన్యము కానిగ జన్మము లేదు లె 

వేంకటేశ్వర అభయ హస్తము నుంది లే 

                        

మహాత్ములతో కుదిరిన నేస్తము 

అర్థము పరమార్ధము తెలుపు నేస్తము 

చాచబడినదిగా దేవుని హస్తము 

నిత్యమూ వెంకటేశ్వరుని అభయ హస్తమ్ము లే 

                     

సజ్జనుడు దైవీగుణ సంపన్ను డగుటగ నె    

అతనికి దేవునికి బేధము లేకుండునుగ నె 

అట్టి భక్తియె మనము కోరదగినదిగ నె 

అట్టి భక్తియే వాంఛింప దగినదిగ నె 

నిత్యమూ వెంకటేశ్వరుని అభయ హస్తము గనే 

                           

దుష్ట జన స్నేహము కోరరాదు జీవితమ్ము నె 

నేస్తముగ దరి చేరరాదు జీవితమ్ము నె 


జ్ఞాన సంపన్న పండిత వాక్కు నిధిగను లె 

మహత్ముల కృపగా మనకది కలుగును లె 

వేంకటేశ్వరానుగ్రహమై భక్తి చెలగును లె 

వేంకటేశ్వర అభయ హస్తము నుంది లే 


గోవిందా... గోవిందా.. గోవిందా


*****


శుభోదయం.. 38


ఎవ్వరెవ్వరివాడొ, యేమితీర్చెడి వాడొ , యీ దేవుఁడు

నెవ్వరికి నేమౌనొ, నేమన్న నేమౌనొ యీదేవుఁడు !!


ఎందరికిఁ కొడుకుగాను యీ దేవుఁడు 

వెనక -కెందరికిఁ తోబుట్టఁగాను యీ దేవుఁడు

యెందరిని భ్రమయించ జేయ యీ దేవుఁడు 

దుఃఖమెందరికిఁ గావింప యీ దేవుడు !!


యెక్కడెక్కడఁ తిరుగఁడ దేవుడు 

హృదయమ్మునే నివసించు దేవుడు 

వెనక-ఎక్కడో తనజన్మ యీ దేవుఁడు

యెక్కడి చుట్టము యీ దేవుఁడు 

యొప్పు-డెక్కడికి ఏగునో యీ దేవుఁడు !!


ఎన్నఁడును చేటులేనీ దేవుఁడు

అంతా ఆవరించిన మహా దేవుడు 

 వెనక-ఎన్ని తనువులు మోవఁడీ యీ దేవుడు 

కానరాక పగలురాత్రి సంచారుడు 


యెన్నఁగల తిరువేంకటేశుమాయలఁ దేవుడు 

తగిలి యెన్నిపదవులఁ పొందఁడీ యీ దేవుడు 

నిత్యమూ ఆరాధించే జీవులలో దేవుడు 

సమస్త లోకమునే ప్రేమతో రక్షక దేవుడు 

శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వరుడు 


 గోవిందా.... గోవిందా... గోవిందా

*****

39..తిరుమల తిరుపతి దర్శనం కొరకు నడిచేవారి అనుభూతులు, ముచ్చట్లు 


మేము నిత్యముభజించెద మీ దయ చూపుమా 

మానసమ్ముగతి బ్రోవుము మాయను మార్చుమా 

ధ్యానమేవిధిగ చేసెద దాశ్యము మాపుమా 

శ్రీనివాస సురపూజిత చిన్మయ శ్రీహరీ


ఏడుకొండలు వాడా వెంకటరమణా గోవిందా... గోవిందా 


ముద్దు పలుకుచిన్నారులు ముందు నడువ 

ముచ్చట కొలుపు కమ్మని కూతలు విన 

కోకిలల కర్ణాలకింపుల పలకులు   

సప్త గిరివాస తిరుమల వేంకటేశ  


ఏడుకొండలు వాడా వెంకటరమణా గోవిందా... గోవిందా 


ప్రేమ పలకరింపు మనసు ప్రీతి కళలు

చెలియ గుసగుస పరవశ చిత్ర కళలు  

పులకరింప చేస్తాయిలే పుడమి కళలు

సప్త గిరివాస తిరుమల వేంకటేశ


ఏడుకొండలు వాడా వెంకటరమణా గోవిందా... గోవిందా 


చిలుక చక్కెర పలుకులు చెవుల కళ లు 

గాన గంధర్వ సంబర గలగళలగు   

మదుల మురిపించ హృదయాలు మనసు కళలు 

సప్త గిరివాస తిరుమల వేంకటేశ


ఏడుకొండలు వాడా వెంకటరమణా గోవిందా... గోవిందా 


చినుకుల చిటపటలు యవి చిత్ర మయ్యె 

చెప్పలేని హాయిని జూపు చెలిమి యగుట  

పండిత ప్రవచనాలగు పాఠ్య మగుట 

సప్త గిరివాస తిరుమల వేంకటేశ


ఏడుకొండలు వాడా వెంకటరమణా గోవిందా... గోవిందా 


గాయకుల సంతసపరుచు గాన కళలు 

తెలియపరుచుట తత్వాలు తెలుప కలుగు

పువ్వులనువణికిస్తాయి పుడమి యందు

సప్త గిరివాస తిరుమల వేంకటేశ


ఏడుకొండలు వాడా వెంకటరమణా గోవిందా... గోవిందా 


తుమ్మెదలలీల ఝుంకార తరము చుండు

కవితల చప్పుడులు గాను కధలు చెప్ప 

సాహితీ సవ్వడులు గాను సహకరమగు 

సప్త గిరివాస తిరుమల వేంకటేశ


ఏడుకొండలు వాడా వెంకటరమణా గోవిందా... గోవిందా 


మేము నిత్యముభజించెద మీ దయ చూపుమా 

మానసమ్ముగతి బ్రోవుము మాయను మార్చుమా 

ధ్యానమేవిధిగ చేసెద దాశ్యము మాపుమా 

శ్రీనివాస సురపూజిత చిన్మయ శ్రీహరీ


ఏడుకొండలు వాడా వెంకటరమణా గోవిందా... గోవిందా 

.. గోవిందా 

***

40.

మనసుకు ఆనందం కలిగించేలా మాట 

చెప్పరాని, చెప్పుకోని, చెప్పలేని  చేష్ట

సుఖ దుఃఖమ్మే....దేనికి వేంకటేశ్వరా..


 సుఖ మన్న కష్టాలన్న మాట   

వృద్ధి చెంది క్షీణించట యే చేష్ట 

శాంతి యశాంతి....దేనికి వేంకటేశ్వరా..


వస్తువు ధర తగ్గి, పెర్గి నవ్వుల తో మాట 

వాస్తవ యావస్తవమ్ముతో కలల చేష్ట 

న్యాయా న్యాయం దేనికి...వేంకటేశ్వరా..


జీవితంలో కష్టసుఖాలు నిత్యమూ మాట

మనిషి మంచి చెడ్డలు తెలిసి చేసెడి చేష్ట

నమ్మానమ్మకమ్ము దేనికి... వెంకటేశ్వరా..


తల్లి తండ్రి గురువు పెద్దలు చెప్పు మాట 

నీటిమీదరాతల మారుట యేల చేష్ట 

గౌరవా గౌరవం దేనికి....వేంకటేశ్వరా..


చీకటి వెలుగుల మధ్య కలయు మాట 

పౌర్ణమి, అమావాస్య ల కళలు చేష్ట 

స్థితప్రజ్ఞత లే కదా.... దేనికి వేంకటేశ్వరా..


 సంపదలు, నీటికెరటాలలాగా, రావిఆకులలాగా, 

మెరుపుటద్దాలలాగా, గాలిలోని దీపాలలాగా, 

ఏనుగు చెవులులాగా, ఎండమావులలాగా మిణుగురుపురుగులులాగా, ఆకాశంలోని అక్షరాలలాగా, జీవులలోని ప్రాణాలలాగా, వెన్నెల ముద్దలలాగా చాలా చంచలములు, అశాశ్వతములు కదా!..

మానవుని బుద్ధి ధనముపై..

దేనికి.. దేనికి.. దేనికి..వేంకటేశ్వరా..


ఏది శాశ్వితం యేది యశాస్వితం తెలియని మానవునిలో ఆశలు రేపి ఆనంద పడతావు....

దేనికి.. దేనికి.. దేనికి..వేంకటేశ్వరా....

కరుణించి కాపుడు వేంకటేశ్వరా 


గోవిందా.. గోవిందా... గోవిందా 

****


41..

ధర్మ తేజ! ఇందిరవల్లభా!బ్రోవరా

విశ్వంబర! విశ్వ విజేత! బ్రోవరా 


శ్రీదేవి భూదేవితొ గూడియున్న సర్వంతర్యామి, లోకరక్షకా!

ఇలనువేడితిని, ఇకనీవేగతి, నీవే మాకు శరణా గతి 

॥ధర్మ ॥


పాలనజేతూవానీ మది నమ్మియుంటినీగానీ।

పరిపరిరీతుల-మరిమరివేడితి..

పరిపరిరీతుతులమరిమరివేడిన

కరిమొరవలె మామొరలను వినవేవినవే॥ధర్మ॥ 

       

గరుడవాహనంబెక్కీ లోకమున దిరుగుచునుండా

నేతివత్తులా-హారతిచ్చెదము

నేతివత్తులాహారతిచ్చెదము

నేమముదప్పక నిన్నేవేడుచు॥ధర్మ ॥


మల్లెలుమొల్లలుగోసీ-విరిమాలలుఅల్లియువేసీ।

కొల్లలుగానూ-కొబ్బరికాయలు..

కొల్లలుగానూకొబ్బరికాయలు కొట్టిపెట్టెదము కోపగించకూ                

 ॥ధర్మ ॥


వసుధనువెలసిన-వెంకటేశ్వరా

వకుళా తనయా నీకుమ్రొక్కెదము

మాస్థితి, దృష్టి సక్రమముగానుంచుము 

నిత్యమూ సేవలు చేసేదము 

నిత్యమూ సేవలు చేసేదము 

నిత్యమూ సేవలు చేసేదము ॥ధర్మ ॥


గోవిందా.. గోవిందా... గోవిందా 

****

42..


పచ్చని పూల, మాలలగను తిరుమల 

పండిత పామర నీతి బోధలున్,

మచ్చిక మాటలే గతికి గోవిందుని 

పాలన యిచ్చెడి సర్వ బోధగన్,

మచ్చిక చేయగా మనసు గోవిందుని 

 ప్రాణములిచ్చెడు మూగజీవులున్,

ఎచ్చటనుండియో చెవులకింపుగ 

విన్పడు తిరుమలలో 'గీత' గానముల్,


ముచ్చట తీర్తుమా యనుచు తిరుమల 

మోగెడు కోవెల కంచుగంటలున్,

ముచ్చటలాడుచున్ గడప తిరుమల 

ముంగిటకూర్చుని లోకమంతయున్

ఇచ్చము వచ్చినట్లు చెరిగేసెడు 

తిరుమల ప్రౌఢలు రంగసానులున్,

హెచ్చులు చెప్పుచూ తిరుమల  

జనుల హేళన చేయువారలున్,


పిచ్చిగ మాటలాడుచునె, తిరుమల

 పేరును కీర్తియు పొందువారలున్,

చిచ్చులు పెట్టుచూ పొరుగు తిరుమల  

 జీవుల కాష్ఠము పేర్చువారలున్,

కచ్చెకుపోయి బంధువుల కంఠము 

 నొక్కెడు వారసత్వముల్,

ముచ్చట మాటలాడుచునె తిరుమల 

 మూలము కత్తెర వేయువారలున్,


చొచ్చుకుపోవు భావములు, తిరుమల 

 చూపుకు అందని అందచందముల్


43..దేవాది దేవా పరంధామా 

కేసి అనే రాక్షసుని చంపిన పురుషోత్తమా 

గోవులను రక్షించు హృదయమా 

విశ్వమంతా నిండిఉన్న తేజమా 

కలియుగాన జనుల రక్ష వేంకటేశ్వరా 


మధు అనే రాక్షసుని చంపిన వష ట్కారాయ 

చుట్టూ నీటి మధ్యలో ఉన్న దామోదరాయ 

మాధవి (లక్ష్మీదేవి) భర్తకు ఆది దేవాయ 

3 లోకాలను ఆక్రమించిన త్రివిక్రమాయ

కలియుగాన జనుల రక్ష వేంకటేశ్వరా 


వామన  అవతార రూప  పరాత్ప రాయ

లక్ష్మీని వక్షస్థలాన ధరించిన శ్రీధరాయ

ఇంద్రియాల అధిపతి హృషీకేశాయ 

నాభిలో పద్మం కలిగిన పద్మనాభాయ

కలియుగాన జనుల రక్ష వేంకటేశ్వరా 


 కడుపు చుట్టూ  తాడు

కడుపులో  లోకాలున్న దామోదరాయ 

ప్రళయాన అన్నీ ఆకర్షించి

మింగే సంకర్షణాయ 

వసుదేవ సుతుడుగా వాసుదేవాయ

తేజో రూపునకు  ప్రద్యుమ్నాయ

కలియుగాన జనుల రక్ష వేంకటేశ్వరా 


ఎవరూ  జయించ లేని అనిరుద్దాయ

ఉత్తమ దైవము ధరణీ నాధాయ 

భూమి ఆకాశం మధ్యవున్న

దైవము అధోక్షజాయ

 నర+సింహ రూపంలో ఉన్న నారసింహాయ

కలియుగాన జనుల రక్ష వేంకటేశ్వరా 


 నశించని దైవము అచ్యుతాయ

 జనులు మేలు కోరి పూజించే జనార్ధనాయ

ఇంద్రుని తమ్ముడు ఉపేంద్రాయ

 ప్రళయాన అంతా 

 విష్ణువుగా హరప్రియాయ

అంతా ఆకర్షించు నల్లని వాడు శ్రీకృష్ణాయ

కలియుగాన జనుల రక్ష వేంకటేశ్వరా 


. గోవిందా.. గోవిందా.. గోవిందా 

***


***-


44..ఎలుకకు కలుగౌను ఏటికి గట్టౌను 

పందికి మడుగౌను పంతము బతుకౌను 

పక్షికి గూడౌను పాముకు పుట్టౌను 

చీమకు రంధ్రమౌను పశువుకు కొట్ట మౌను


పక్షులకు వృక్షాలుగాను, అంబరమౌను 

మనిషికి గృహమౌను దైవనికి మందిరమౌను 

ఎడారిలో కొంనౌను, నదిలో కొంనౌను 

సంద్రంలో కొoనౌను, మంచులో కొంనౌను

ప్రాణుల నివాసం ప్రేమ అంతా మాయే 

జగత్తునంతా మహామయా 

అయినా మానవత్వం బలమైనది 


తలచిన తలపును విడువక, నిర్ణయము మార్చుకోక 

ఆధ్యాత్మిక చింతనము, ఉంటేను నీలో కూర్పు,

అదే వేంకటేశ్వర లీల 


మలచిన పథమును సడలక, సంకల్పము మారనీక

కలిగించును సాంత్వనము, కష్టాల్నెదిరించు నేర్పు, 

అదే వేంకటేశ్వర లీల 


గెలుపును పొసగుట మరువక, అనుకున్న పని మానకు

చెయ్యవోయి సహాయము, బాధల్నెదిరించు ఓర్పు,

అదే వేంకటేశ్వర లీల 


నిలిచిన యుండున మెరవక, నెరవేరు దాక వదలక

ఇచ్చునోయి ప్రశాంతము, జీవితమిస్తుంది తీర్పు, 

అదే వేంకటేశ్వర లీల    


గోవిందా... గోవిందా.. గోవిందా 

**


45..నేటి అమ్మ .. అలివేలుమంగమ్మ ** 


అమ్మ లాలన పాలన అనకువ దయ 

ఎంత హాయని పించు ఎల్లరకును 

స్వచ్ఛత ప్రేమ పంచును సమయ మందు 

అమ్మ మది ఎంత వోర్పుయో ఆది పృథ్వి 


అమ్మ మాటలో సత్యమ్ము మధురమోయి

పాటలో ఎంతొ మనసుకు పాఠ మోయి 

నిత్య యనురాగ మమకార నీడ వోయి 

అమ్మ దేవత యేనోయి ఆది పృథ్వి 


అమ్మ ఒడిలోన సంపద అరుణ కిరణ 

నిత్య వోదార్పులో ఎంత నిజము కిరణ 

పుట్టుక వరమిచ్చిన తల్లి పుడమి కిరణ 

అవనిలోన దేవతగాను ఆది కిరణ 


అమ్మ ముద్దులో న మనసు ఆత్రమేను 

మురిపము చిరునగవు లోను ముఖ్య మేను 

అమ్మ నాన్న నొప్పింపకు ఆది ముక్తి

బిడ్డలందరి మేలెంచు పిలుపు తల్లి 


విధిగ యుద్యోగ ధర్మమ్ము వినయ ముంచి 

విధిగ యుత్తేజ రాగాలు విలువ నెంచి

సమ్మత మగునాణ్యత సమ సాధ్య మెంచి 

నమ్మకమ్మును నిలిపేటి నయని తల్లి 


నిశ్చయమగు నీతిని తెలిపి నీడ గుండి 

పాత్ర లన్నీ సూత్ర మగుట పగలు రాత్రి 

ఉభయ కళలన్ని జీవమై ఉన్నతమగు 

బంధ ప్రాధాన్యతను జూపు భాగ్య తల్లి


తిండి లేక బతుకు తల్లి తేరు కొనక 

తిండి యున్నతినగలేని తిష్ట బతుకు 

కలిమి లేముల జీవితం కథల తీరు 

విజయ వాంఛల తో దేవి వేంకటేశ

****

46..


తొలి పొద్దు సంధ్య వేళలో మెరుపు 

పక్షుల కిలకిలా రావాలతో మెరుపు 

మనసు ఆమని వసంత మై మెరుపు 

మురిసే మల్లెల పరిమళాలతో మెరుపు 


స్వచ్చమైన ప్రేమకు మల్లెలు అందాలై

మగువలకు మల్లెలు సౌరభాలై 

తనివితీరా మనసు పరవసాలై 

తనువు పులకించే తన్మయత్వాలై 


 పరిమళించే మనసుల ప్రణయ గీతాలై

విరిసిన మల్లె మురిసిన హృదయాలై 

మల్లెల పరిమళం మలయ సమీరమై

సుస్వరాల సుమధుర తరుణి పరిమళ భరితమై

 

స్వాతి ముత్యపు చినుకులా మెరుపు 

ముదిత తలలో ముడిచిన మల్లెలు మెరుపు 

విరబూసిన  సౌరభాలు మెరుపు

 హృదయపు తంత్రి ని మనసు మీటుతుంటే మెరుపు 


అందాలొలుకు వయ్యారాలు మెరుపు 

సొగసరి కన్నులకు కాటు కందంలా  మెరుపు 

మనసైన మగువకి సిగన మల్లెలందం లా మెరుపు 

వినీలాకాశంలో నిండు జాబిల్లి మెరుపు 


వెన్నెల వెలుగు ల్లా,మల్లెల తెల్లదనమై మెరుపు 

 జాలువారే మదిలోని ప్రేమ మెరుపు

హృదయంతరాలను దోచి మైమరిపించే మెరుపు 

శ్రీదేవి, భూదేవి సరస సళ్ళాపాలతో శ్రీ శ్రీనివాసుని మెరుపు


గోవిందా... గోవిందా.. గోవిందా 

****


47


సాహితీ సభా.. సమయ తృప్తియే 

మోహమై మదీ.. మనసు తృప్తియే 

దాహమే విధీ..  తపన తృప్తియే 

స్నేహమే గతీ..  సహన తృప్తియే 


అ...అతడు... ఆ.. ఆమె 


అ...రావె నాసఖీ - మనసు దోచవే 

రావె నాప్రియా - మమత పంచవే

చూపు లన్నియూ - నవ వసంతమై    

నన్ను దోచెనే - కళలు తీర్చవే  


ఆ..మందహాసమా  - మధుర గానమా 

సుందరాంగుడా - సుధను కోరితీ  

ఎందు నీవెగా - హృదయ రంజితా 

పొందు కోరితీ - దృఢత ధీరుఁడా 


అ..పంతమేలనే -  మధుర మంజరీ 

సొంతమేనులే - కధలు దేనికే 

ముందు రమ్ములే - మదన సుందరీ   

తెల్ప వద్దులే - నవకవిత్వమే 


ఆ..పూలమాలలే - పులకరింపుగా

గోల ఆటలే - సలపరింపుగా 

ఈల పాటలే - యెపుడు హాయిగా 

తాళ లేవులే - తపన నీడనే 


అ..తాళ వృత్తమై - తనరు చిత్తమే 

జ్వాల చెంతనే - జపము దేనికే   

నీల దాహమా - నెనరు చిత్తమే 

తాల లేవులే - తపన తోణులే 


ఆ..చుక్క చుక్కగా - సుమదళమ్ములై 

ఒక్క మాటగా - కళ సమమ్ములై  

యక్కజమ్ముగా - నవని సొమ్ములై 

మక్కువంతయూ - మధుర మత్తులై  


అ..దిక్కుదిక్కులం - దెలి హిమమ్ములే 

యెక్కడుంటివో - యిచట నిమ్ములే 

కాల మంతయూ - కధల చింతనే 

దేహమంతయూ - హృదయ పొంతన 


అతడు.. ఆమె 


రావె నాసఖీ - మనసు దోచవే 

రావె నాప్రియా - మమత పంచవే

చూపు లన్నియూ - నవ వ సంతమై    

నన్ను దోచెనే - కళలు తీర్చవే


అంటూ శ్రీదేవి, భూదేవి మధ్య 

సరససల్లాపాల లీలలు చూపిన వెంకటేశ్వరుడు 


గోవిందా.. గోవిందా.. గోవిందా 

****


48..కాల మాయలగు కామ్యపను లౌనే 


కాల మాయలగు కామ్యపను లౌనే 

గాల మే బ్రతుకు గమ్యమగు టౌనే 

జ్వాల దాహమగు చల్ల పరు పౌనే 

మాల దేహమగు మార్గ సుఖ మౌనే 


నమ్మ కమ్ముయు మనమ్ముగను గాదా 

చెమ్మకార్చుటయు చిన్మయము గాదా 

దమ్ము చూపుటయు ధర్మముయు గాదా 

నమ్ము యీమనిషి నమ్మపలు కౌదా 


వళ్ళు గుల్లలుగ చల్ల పరి చావా

చల్లఁ కోచ్చియులె నెల్లఁ సరి చేయా 

వళ్ళు మచ్చికయె చిత్తు మృదు భావా 

తుళ్ళి వచ్చితిని చిత్త మగు నీకై


మూల్య మెప్పుడును ముత్తువగుఁ గాదా       

కాల మెప్పుడును కల్లలగు గాదా 

ఘల్లు పల్కు నట గాలముగ  గాదా 

పల్ల మవ్వుటను పూజ్యపని గాదా  

 

సౌర్య ముండెనులె సత్తువుయె చూపే 

కార్య మంతయును కానిదియు కాదే 

భాగ్య మయ్యెనులె బంధమగు టేగా 

సౌఖ్యమిచ్చెనులె సంతసము యేగా 


గుత్తి గుత్తులుగఁ దెత్తు లత లౌనే 

 క్రొత్త పుష్పముల నిత్తు కల గౌనే 

మెత్త మెత్తగను చిత్తు చెరు కౌనే 

మెప్పు నిచ్చకము మెత్తు చురు కౌనే 


అన్ని సే వలగు ఆత్మకళ రూపే 

మన్నికే మగువ మాయకళ రూపే 

విన్నపమ్మగుట వింతకల రూపే 

మన్ననే బ్రతుకు మార్గమగు రూపే 


తప్పు తప్పనుట కొత్తపలు కౌనే 

ఒప్పు ఒప్పనుట పాత గుర కౌనే 

ముప్పు కాదనుట మొత్తుసుఖ మౌనే

తప్పు కోమనుట తత్వశృతి మౌనే 


శ్రీదేవి భూదేవి తో సరస సల్లాపాల 

వెంకటేశ్వరిని లీలలు హృదయాం తర భావాలే 


గోవిందా.. గోవిందా.. గోవిందా 

***


49..హరుడైన, హరివైన నీవనే కొలిచే! 


హరుడైన, హరివైన నీవనే కొలిచే! 

సుఖమైన, దుఃఖమైన నిన్నునే కొలిచే! 

నిజమైన చెడుయైన నావిధీ యదియే! 

ఆత్మ సాక్షిగ నీ దరికి ఆర్తిగా వచ్చే!


అందుకో విన్నపము, అందించు మభయమూ!

చెప్పెదా చేయపని, చేయించు సమయమూ!

యెదలోన నీ రూపు, పెదవిపై నీ ఊసు పదిలమూ!

సకలమ్ము నీ ధ్యాస, హృదయమై నీ ప్రేమ సమయమూ!

 

పంతమెందుకు స్వామి! చింత దీర్చవదేమి?

సత్యసుందరానందం పొందజాలని జన్మదేమి?


దేహ భ్రాంతిని విడిచి నుండ లేనేమి?

అహమునిహమును మరవ లేకున్నా నేమి?

గుండెలో గుడికట్టి కొలుచుతున్నా

 మనసు నిలవదేమి?

కాలాను గుణంగా బ్రతుకు సాగదేమి?


శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా.... ఏమారకా-పూజింతమూ-ప్రతినిత్యమూ।

సంకాటమూ బాపూనటా ఆనంద నిలయ నాథుండటా l

        

మత్స్యవాతారంబునానీరంబునాసంచారించీ।

సోమాకునీదండించెడీ పట్టూదలాబూనేనటాl

                          

గోపాలునీరూపంబునా గోవర్ధనామెత్తీయునూ।

గోవూలనూగాపాడినా వసుదేవునీతనయుండటా॥

                        

భూదేవినీగాచూటకూ వరహంబుగామారీయునూ।

కనకాక్షునీజంపేసినావైకుంఠుడూయి తడేనటా


శ్రీ వేంకటేశా.. శ్రీ శ్రీ శ్రీనివాసా..

శ్రీ వేంకటేశా.. శ్రీ శ్రీ శ్రీనివాసా..


కొండంత వరములు కోరను గాని,

అండగా నీవుండి అభయమీయుము, చాలు!

సంసార సాగరం దాటి వస్తాను,

నీ దివ్య సన్నిధి చేరుకుంటాను, చాలు!

పాదాల చెంతుండి

ప్రణవమును వింటాను, చాలు!

ఆది మధ్యాంత రహితునకు

నైవేద్యమవుతాను! చాలు


గోవిందా.. గోవిందా.. గోవిందా 

****

50..హనుమంతునితో వేంకటేశ్వరస్వామి పలుకు 


హనుమంతునితో వేంకటేశ్వరస్వామి పలుకు 

హనుమా కలియుగంలో మానవులరీతి అర్ధమగుటలేదు?

యే తీరున నుండునో వివరించుమా!

అంతర్యామి మీకు తెలియనివా? ఆనాడు సీతమ్మడిగినట్లు మీరు నన్నడుగుతున్నారు, తెలిసినవి తెలిపేద వేంకటేశ్వరా!


విశ్వంలో ఉన్న కోటానుకోట్ల ఆత్మలన్నీ ఈ ఏడు ఆత్మ స్థాయిలలో ఏదో ఒక దానికి చెంది ఉంటాయి.


1.  శైశవ ఆత్మ (అజ్ఞాని):-

 దేవుడు ఉన్నాడా? ఉంటే  చూపించు? 'ఆధారాన్ని' చూపించు అనేవాడు.


2. బాల ఆత్మ (విపరీత జ్ఞాని):-

 మేము చెప్పేదే నిజము .,అని వితండవాదం చేసేవారు.

 

3. యువ ఆత్మ (ప్రాపంచిక జ్ఞాని):-

 పైకి అన్నీ చెప్తాడు. కానీ ఆచరించడు.


4. ప్రౌఢ ఆత్మ (వేదాంతి):-

'అంతా దైవమే, అంతా మాయే, మనం నిమిత్తమాత్రులం' అనేవాడు.


5. వృద్ధ ఆత్మ (యోగి):-

ధ్యానం చేస్తూ, దివ్య దృష్టిని  ఉత్తేజింప చేసుకున్నవాడు. కానీ దివ్య దృష్టి మాత్రం 'మనసు చేసే మాయ ' యని అనుకునేవాడు.


6. విముక్త ఆత్మ (ఋషి/రాజర్షి):-

ఎంత మాత్రం మాట్లాడకూడదు, సాధన చేయాలి అనే వాడు.

 సాధన చేస్తూ దగ్గర వచ్చే వాళ్లకు ధ్యానం చేయండి అని చెప్తాడు.

R

7. పరిపూర్ణ ఆత్మ (బ్రహ్మర్షి):-

అన్ని చోట్లకు తిరుగుతూ, "ప్రతిఫలాపేక్ష" లేకుండా  ఆత్మజ్ఞానాన్ని అందించేవారు.


ఎవరైతే బ్రహ్మర్షి స్థితిలో ఉంటారో-- వారు జనన మరణ చక్రమును దాటుతారు.  వారికి మరల జన్మ తీసుకునే అవసరం ఉండదని మీరే భగవద్గీత లొ ఉదాహరించారు కదా!


ఏమో హనుమా, యీ భక్తుల కోర్కెలు ఎప్పుడాగుతాయో? కుబేరుని అప్పు ఎప్పుడు తీర్చేదనో? అర్ధమగుట లేదు?

కలియుగాంతమువరకు తప్పదు కదా? అవును కదా 


గోవిందా... గోవిందా.. గోవిందా 

****



*

61..గోవిందా తనువంత తన్మయమే పోరాడు జాడ్యమ్ము లే 


గోవిందా తనువంత తన్మయమే పోరాడు జాడ్యమ్ము లే 

గోవిందా బతుకంత భందములే గోప్యమ్ము మార్గమ్ము లే 

గోవిందా జగమంత జాతరులే శోధించు శాంతమ్ము లే    

గోవిందా తమకంతొ తప్పులనే కోపమ్ము తోనేసుధీ   ..


విద్యా భాను వసంత లోక తరుణం తన్మాత్ర తన్మాయ లే       విద్యా సేవ సుమంత సోభ సమయం జీవాత్మ సద్బోధ లే

విద్యా ప్రేమ అనంత బోధ కమలం విద్యుత్తు ఉద్భోద లే  

విద్యా వెంకట రామ ప్రేమ నయనం మామీద ఉంచావు లే  ...


కల్లోలా లయ దేహమందు తరులే మేల్కొల్పు మార్గమ్ము లే

ముల్లోకా లయ వాసియందు సిరులే మిక్కోటి దేహమ్ము లే 

సల్లాపం లయ ప్రేమయందు వెతలే సంఘర్ష వాదంబులే 

చల్లార్చే లయ  కృష్ణ లీల కరుణా సత్యాను రాజ్యమ్ములే  ... 

   

తేజస్వీ తరుణం ముకుంద జపమేధస్సే సువిద్యాలయే

తేజస్వీ సమయం సుధామధు జపం సాహిత్య విద్యాలయే

తేజస్వీ వినయం ప్రభాత ప్రభవం ఆరోగ్య విద్యా లయే        తేజస్వీ సుప్రభాత పూజ లతలే శ్రీ సర్వ దేవాలయే  ..


నిత్యానందములే సదామి సేవలే నిత్యమ్ము సౌభాగ్య సా 

హిత్యానందములే సదామి ఎలికే ఇచ్ఛాను ఐశ్వర్య ఆ 

ధ్యాత్మికమ్ దయలే నమామి నడకే దాస్యమ్ము బాంధవ్య మే  

ఆత్మానందములే  రమారమణకే  ఆరాధ్య కర్తవ్యమే ....

****

62..నిర్వచింప లేనిది భక్తి నిత్య మందు 


నిర్వచింప లేనిది భక్తి నిత్య మందు 

కలదు దానికమోఘమై కళల శక్తి 

సహన సంతృప్తి సహవాస సమయ యుక్తి 

విద్య వినయ విధేయత వేంకటేశ

              

మూగ వాని రుచి వివరించ ముఖ్య మవదు 

భక్తునిలొ భక్తినే విప్పి చెప్పలేరు 

అరుదుగా భక్తి రక్తియై ఆదు కొనును 

విద్య వినయ విధేయత వేంకటేశ

              

గంగ వాఱు నెపుడు గదలని గతి తోడ 

ముఱికి వాగు పాఱు మ్రోత తోడఁ 

బెద్ద పిన్న దనము పేరిమి యీలాగు 

 విద్య వినయ వినమ్ర  వేంకటేశ


దుష్ట సంగతి విడుచుటే దురిత బుద్ధి 

శిష్టులుగ చరించెడివాని సీఘ్ర బుద్ధి 

మాయలకు లోబడడు వాని మంత్ర బుద్ధి 

విద్య వినయ విధేయత వేంకటేశ


దాటునుగ మాయలను వాడు ధరణి యందు 

యోగ క్షేమ త్యజించును  యోగ్య మందు               

అహము లేక కర్మ ఫలము ఆశ్రిత యందు 

విద్య వినయ విధేయత వేంకటేశ


వేద విహితపు కర్మల విజయ వాంఛ

అట్టి వాడుభక్తి తరించు అక్షయమగు 

లోకములనెల్ల జూచెడి లోహితుడుగు 

విద్య వినయ విధేయత వేంకటేశ

                    

ఉండగోరును  ఏకాంత ఊపిరిగను 

జగతినేలునుత్రిగుణాల జాడ్య మగును    

ద్వంద్వములకిదె యతీత ద్యాస యగును 

విద్య వినయ విధేయత వేంకటేశ

******

63..ఆర్తజనరక్షకా ఆత్మబంధువా 


తిరువేంకటేశ్వరా! దిక్కు నీవంటిరా!

కరుణాలవాల! నీ కరుణ చిలికించరా!

నీ దర్శనము గోరి నిలుచుంటి చూడరా 

కాదనకే మోము కాంచుమా దేవరా..తి 


ఏడుకొండలవాడ! ఇచ్ఛతో కాంచరా

వీడితి మోహమును బీదనై నుంటిరా 

నీనామ జపమును నిష్ఠతో పాడెరా 

మానితమై నిన్ను మనసు కోరితిరా.. తి 


శ్రీదేవి తోడుగా శీఘ్రమై సేవరా 

వేదన తీరగా ప్రేమను పంచెరా

పాలించు దొరవంచు భక్తితో చేరెరా 

పున్నెంబు జ్ఞానమే పుడమిన భోదరా.. తి 


ఆనందప్రదశాస్త్ర మతిని ఆయుష్షురా 

మిక్కుటవరముల నొసగువాడవురా

వేదమన్త్రములచే వీనుల విందురా 

పవిత్ర కాంతులతోను ప్రభల ప్రకాశంరా 


జనరక్షకా మది జాతకం చేష్టరా 

కీర్తిమంతుడవీవు!కృపతో రక్షించురా 

శ్రీవేంక టేశ్వరా సేవలూ పొందరా 

సాధుసజ్జనరక్ష సంతోష మివ్వరా


తిరువేంకటేశ్వరా! దిక్కు నీవంటిరా!

కరుణాలవాల! నీ కరుణ చిలికించరా!


గోవిందా.. గోవిందా..

గోవిందా 


***


65..మళ్ళీ రాదు జరిగిన కాలం


మళ్ళీ రాదు జరిగిన కాలం..మండే నాతి వెలుగులు గాలం 

ఉన్న అవకాశం వదల లే.. యన్న శుభయోగం కదలు లే 

కోల్పో వద్దు సహనము తీరం.. సెప్పే మాట వినగల మౌనం 

మంచి సమయాన్నీ మరువ లే.. యెంచ హృదయాన్ని వదల లే

శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశా

  

ఎంతో మార్పు జరిగిన భావం.. ఓర్పే చూపి మరిగిన లక్ష్యం 

అన్న పలుకుల్లో  వరుస లే.. ఆశ చినుకుల్లో వరద లే 

అమ్మా నాన్న వదలక ఉండు.. ఆలి నిన్ను మరువక నిండు 

సేవ సమయాల్లో ఒకటి లే.. దేహ పరవాల్లో ఒకటి లే 

 శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశా


పొందే శక్తి మనసున లక్ష్యం.. చిందే రక్తి వయసుకు భోజ్యం 

విద్య వినయాల్లో కధలులే.. పద్య సమయాల్లో  మొదలు లే 

గొప్ప మార్పు కోరుకునే ధ్యేయం.. చెప్పు కున్న మారకనే ఖర్మం 

ప్రేమ సుఖ సంతో షములుగా.. దేహసహనంతో ఫలము గా 

శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశా


విజయం సాధించేంత వరకు నా కృషి ఆపను 

సమయం సద్వినియోగం వరకు నా విధి మార్చను 

చెలిమి గాతోడుండు వరకు పట్టు విడవను 

కలిమియే తోడున్న మనసు పూజ మరువను 


గురువు తల్లీ తండ్రి కొరకు మాట మార్చను 

పరువు యన్న బాధ యున్నను మనసు తిప్పను 


సేవల త్యాగమ్మేను మనసు మారదు ఎపుడు

శ్రీశ్రీశ్రీ నా కృషి ఆపను  వేంకటేశా


గోవిందా.. గోవిందా.. గోవిందా 

*****


66..పాల కడలి యందు ఉద్భవించిన కన్యవై 


పాల కడలి యందు ఉద్భవించిన కన్య వై 

పరమ దయాల హృదయ తరుణి మల్లె వై    

వెంకటేశ్వర  పట్టపు మహారాణి వై 

అలమేలు మంగగా ఆనంద తృప్తి వై 

శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరునికి తరుణీ 


సమస్త ప్రజానీకానికి నాయిక వై   

ముని జన స్తోత్ర, మహలక్ష్మిదేవి వై

సమస్త మారాధ్య కల్పవల్లీ దేవి వై

హృదయానంద భరిత అమృతాన్ని వై

శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరునికి తరుణీ


వరలక్ష్మి, గజ లక్ష్మి, రాజ్యలక్ష్మి వై

భాగ్య లక్ష్మి, శ్రీ లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి వై   

సంతాన లక్ష్మి,, వెంకటా లక్ష్మి,దేవి వై 

శరణన్న వారికి  కొంగు బంగార మై 

శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరునకు  తరుణీ 


మమ్ము కన్నబిడ్డల్లా కాపాడే తల్లి వై

మాతగా తిరుమలేశ్వరుని దేవి వై     

మగువల కోరికలు తీర్చే గౌరి వై

మముగన్న తల్లులకు తల్లి వై  

శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరునకు  తరుణీ 


అమ్మా మాకు నీవే దిక్కు

మీకే ఉంది కరుణించే హక్కు

మాకు అందిచవమ్మా అమృత వాక్కు

మా కోరికలు తీర్చి కాపాడే తల్లివి నివేనమ్మా  

శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరునకు  తరుణీ 


*****


67..దివ్య దర్శనం అంటూ ఇష్టా రాజ్యంగా


దివ్య దర్శనం అంటూ ఇష్టా రాజ్యంగా

ధర్మ దర్శనం అంటూ అధర్మ పరంగా

భక్తుల వసతి గ్రహాలు లేక ఇబ్బందిగా

మనుష్యుల ఓర్పును పరీక్షిస్తున్నావా దేవా


మోక్కలు తీర్చాలని నడిచి వచ్చామయ్యా

దర్శనం లేదని పలు ఇబ్బంది చేస్తున్నావయ్యా

పైసాతో పరమాత్ముడిని దర్శించ లేదయ్యా

అధర్మ పరిపాలన గా మారిందయ్యా 

ముందుగా (ఆన్లైన్) లేకపోతే దర్శనం లేదంటయ్యా 

కాలం నీదయ్యా మమల్ని ఆడిస్తున్నావయ్యా


అంతులేని ధనాన్ని ప్రజలు నీకిచ్చినా 

నీలాలు అర్పించి కష్టంతో దర్శించినా 

కనీసం లడ్డూ ప్రసాదం లేకుండా చేసినా 

అధికారులు ఇష్టా రాజ్యంగా మార్చినా 

నీమీద భక్తితో నామనస్సు తెలుపుతున్నా వేంకటేశ 


మామనస్సును అర్ధం చేసుకోవయ్యా

శ్రీ శ్రీ శ్రీ తిరుమల తీరుపతి వేంకటేశా

భక్తులు కోర్కలు తీర్చే మహానుభావా, మమ్మాదుకోవా

అమ్మ అలివేలు మంగమ్మ నీవైనా చెప్పమ్మా 

మా కన్నీరు తుడిచే మార్గానమ్మా 

కరుణించి కాపాడవే ఓ నాయకా 

కలియుగ వైకుంఠం యేలే నాయకా


******


68..కొండలైన కోనలైన  లోయలైన


కొండలైన కోనలైన  లోయలైన బయలైన 

సొగసులెన్నో కొలువైన రంగుల హంగులైన

కొత్తవైన వెలుగులైన చిత్తము నిర్మలమైన 

 క్షణ క్షణం  నీ మనుగడలో  ఉండాలని ఆశ వెంకటేశా 

 

స్వచ్ఛమైన నవ్వులు, ఆశయాల తీరులు,  

 అంతా నీ ఉత్సాహమైన

అలుపన్నది ఆరాట పోరాట నిను చేరా 

 దర్శనం నా భాగ్యమైన 

అబద్ధాలు ఆనందపరిచిన వేళలోన 

 నిజాలు నవ్వెర పరిచిన కాలము లోన 

 కాలాల వరంగా నడిచిన జీవితాన 

బ్రతుకు నేర్పిన గుణపాఠాల మదినా 

 క్షణ క్షణం  నీ మనుగడలో  ఉండాలని ఆశ వెంకటేశా 


ప్రేమ యున్నచోట అహం యుండు టేన

 స్నేహ మున్న చోట విలువ అడ్డుపడుటేన

 బంధ మున్న చోట ధనభేధం చూపుటేన

 బాధ్యత ఉన్న చోట బరువు అనిపించుటేనా 

క్షణ క్షణం  నీ మనుగడలో  ఉండాలని ఆశ వెంకటేశా


నిస్వార్థతతో సమాజాన్ని సేవించిన 

లాభమేమని సందేహము ఉదయంచిన 

తృప్తి ప్రాప్తి యోగమవ్వు పరికించిన 

ఆరోగ్యం కూరి ఆయుష్షు తరిగిన 

క్షణ క్షణం  నీ మనుగడలో  ఉండాలని ఆశ వెంకటేశా 

 

గోవిందా.. గోవిందా.. గోవిందా 

***

69..అందరి బ్రతుకు పూలదారులు చేసి 


అందరి బ్రతుకు పూలదారులు చేసి 

కొత్త వెలుగులు పుంతలు కలుగ చేసి 

పనులలో ఒరిమిగా ఎదురుచూసి 

అతిశయాలు ఆహాలు లేకుండా చేసి 


ఆకాశ మంత ఎత్తులోఉండే నివాసి 

పెళ్ళి కోసం అప్పులు చేసిన వాసి 

అప్పులు తీర్చేందుకు నిలబడ్డవాసి 

వడ్డీ కట్టేందుకు ప్రజామేలు స్థిరవాసి 

శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరా 


భక్తుల కోర్కెలుతీరుస్తూ నున్న నివాసి 

నిత్యకల్యాణం చేసుకొనే మహా మనిసి 

భార్యలను ఆదరించే ప్రేమ పిపాసి 

సతులకు మమతాను రాగాలు పంచేసి 


నన్ను నేను చూచుకునే భాగ్యమెంత మధుర రాశి 

చెలిమిగగన సీమమల్లె మిగులుటెంత మధుర రాశి 

కనుబొమలకు లాస్యాలను పొదిగినావు చిత్రమేసి 

చూపునదికి వారథిగా నిలచుటెంత మధుర రాశి 

శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరా 


మోయలేని విరహాలను రద్దుచేసి 

అడుగుల జాడలలో నడిపింపచేసి 

కనుసైగన విప్లవాలు చల్లార్చేసి 

వెన్నెలలో మనుగుటెంత మధుర రాశి


పిడికెడు తలంబ్రాలు శిరంపై పోసి 

ఓర చూపులతో మాయను చేసేసి 

మదిలో ఉల్లాస్సంతో నవ్వు నవ్వేసి 

శ్రీదేవి,భూదేవి సమేత వేంకటేశ్వరా 


అలకలు చూపక సఖ్యత సేవలు చేసి 

నిత్య ఆనంద సౌఖ్యాలు అందచేసేసి 

సమస్త ప్రజల ధుఃఖాలను తొలగించేసి 

శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరా 

****


70..చిరునవ్వుల పూల పడవ నీ పెదవుల పిలుపుల సందడిలో..!


చిరునవ్వుల పూల పడవ నీ పెదవుల పిలుపుల సందడిలో..!

చెలిమి వెలుగు పసిడి ధార నీ చూపుల కలయిక సందడిలో..!

పలకరించు మేఘమాల నీ వలపుల తలపుల సందడిలో..!

యీ వెంకటేశ్వరునే మైమరిపిస్తున్నారు శ్రీదేవి భూదేవిగా!


మధురామృత వసంతమే నీ కులుకుల మలపుల సందడిలో..!

స్వచ్ఛమైన ఆనందం నీ సొగసుల ఆవిరిల సందడిలో..!

విరహానికి గుబులాయెను నీ ఊపుల మెరుపుల సందడిలో..!

యీ వెంకటేశ్వరునే మైమరిపిస్తున్నారు శ్రీదేవి భూదేవిగా!


ఏ స్వర్గపు చిరునామా ఎక్కడుందొ ఏమోమరి. పొందికలో!

వయారాల నీలికురుల మౌనాలకు చిత్రాలా.. సంతోషంలో!

మందారపుసిందూరం తిలకమల్లె అమరింద హృదయంలో 

కరిగిపోని నీ కాటుక కన్నుల కథ ఏనాటిది..! ఇద్దరిలో!

యీ వెంకటేశ్వరునే మైమరిపిస్తున్నారు శ్రీదేవి భూదేవిగా!


తనువు తన్మాయా మ్మీకు తెలుసుకదా శుభ కాంక్షలలో!

నా మనసు తెలియనిదా  వర్షించగ.కరిగిపోతా .!

కోటికోట్ల వేకువలే నీ పదముల సందడిలో..నిలిచిపోతా!

యీ వెంకటేశ్వరునే మైమరిపిస్తున్నారు శ్రీదేవి భూదేవిగా!


యీ వెంకటేశ్వరునే మైమరిపిస్తున్నారు శ్రీదేవి భూదేవిగా!

యీ వెంకటేశ్వరునే మైమరిపిస్తున్నారు శ్రీదేవి భూదేవిగా!


గోవిందా.. గోవిందా.. గోవిందా 

****


71..జీవమ్ము నీదైన - విశ్వమ్ము నీవైన


జీవమ్ము నీదైన - విశ్వమ్ము నీవైన

భావాలు నీవౌను - భాగ్యమ్ము నీదౌను 

నావేమి లేదిందు - నా మర్మ మేమందు 

నాదైవమా - నీదక్షతే - వేంకటేశ్వరా 


ఈవేళ నీతోడ - యీ మార్గ నీనీడ

నేవేళ నీతోడ  - నేసేవ నీ కాడ 

రావేల నాతోడ - కాదేల నీతోడ

రాగాంబుధీ - నీదక్షతే - వేంకటేశ్వరా 


కాలమ్ము రాత్రయ్యె - కావ్యమ్ము రక్షయ్యె 

నీలమ్ము వ్యోమమ్ము - నేమమ్ము ధ్యేయమ్ము 

వేళయ్యె రావేల - విశ్వమ్ము యీ వేళ 

ప్రేమమ్ముతోఁ - నీదక్షతే - వేంకటేశ్వరా 


బాలించవా నన్ను  - ప్రార్ధించెదా నిన్ను 

దేలించవా నన్ను - దీవించవా నన్ను 

లాలించవా నన్ను - లాస్యమ్ము గా నైన

రమ్యమ్ముగా - నీదక్షతే - వేంకటేశ్వరా 


నామానసమ్మందు - నీ ధర్మసౌ ఖ్యమ్ము 

నీముద్దు రూపమ్మె - నా హృద్య భావమ్ము 

సోమద్యుతుల్ నింపె - కోపమ్ము చూపుమ్ము 

సొంపీయఁగా - నీదక్షతే - వేంకటేశ్వరా 


కామావతారుండ - కామ్యమ్ము తీరుండ 

ప్రేమావతారుండ - ప్రేమమ్ము పెంచుండ 

శ్యామావతారుండ - సాయమ్ము చేయుండ 

చల్లంగ రా - నీదక్షతే - వేంకటేశ్వరా 


 గోవిందా... గోవిందా.. గోవిందా 

****


72..నేను రెండు కళ్ళ నీడలా భూతాన్ని


నేను రెండు కళ్ళ నీడలా భూతాన్ని

కనుల తోను చూసి కాల నిజంతెల్ప 

 లయలు యెన్ని యున్న లక్ష్యము మారదు 

వేకువ మదినిలయ వేంకటేశ్వరవైతి 


ఎల్లరు కల తీర్చ ఇష్టమౌను ధరించ  

 యతుల దీక్ష తోను యజ్నోప వేతాన్ని

అదియు నాకు  ధర్మ కవచమ్ము గానులే 

వేకువ మదినిలయ వేంకటేశ్వరవైతి 


నేను వ్రాయ గలది వినయ సాహిత్యము

మనసు యుపశమనము మార్గము కల్గించ

సహన సంపదగను సంతృప్తి పంచుటే 

వేకువ మదినిలయ వేంకటేశ్వరవైతి 


పగలు రాత్రి పలుకు పద్య ప్రవచనాన్ని

తెలుసు కోవటముయు తెల్పకల్గుటయేను 

నిత్యధర్మమేనునియమమ్ము గానులే 

వేకువ మదినిలయ వేంకటేశ్వరవైతి 


ఉపకరణము యిదియు ఊహల కావ్యము 

మనసు హత్తుకొనెడి మార్గపు పద జాల

శరళ విధిగ మార్పు స్వరాన్ని నందించ

వేకువ మదినిలయ వేంకటేశ్వరవైతి 


నేను అందిచ గల నియమ సాహిత్యమే 

అదియు నాకు తృప్తి ఆచార్య భావము 

కాల మరుపు జూపు కల్గ ఉజ్వల తేజ

వేకువ మదినిలయ వేంకటేశ్వరవైతి 


అవసరాన్ని బట్టి అస్రనైపుణ్యాన్ని

ఆశ తర్పణమ్ము అధర్మాన్నరికట్ఠ 

అణుకువబతుకుమది ఆశయమే విధి 

వేకువ మదినిలయ వేంకటేశ్వరవైతి 


నేను యెప్పుడునిను నిత్యమూ కొలిచెదా 

 శాంతి నందచేయు సమ్మోహ నిలయమై 

చూపలేను యెపుడు చూపుయుద్రేకాన్ని

వేకువ మదినిలయ వేంకటేశ్వరవైతి 


గోవిందా... గోవిందా.. గోవిందా 

****


73..నిత్యాత్ముడై యుండి వెలుగొందు 


నిత్యాత్ముడై యుండి వెలుగొందు 

నిత్య కళ్యాను డై వెలుగొందు 

సత్యాత్ముడై యుండి సత్యమై వెలుగొందు 

ప్రత్యక్షమై ప్రభలుగా వెలుగొందు 

తిరుమల తిరుపతి వెంకటేశ్వరుండు 


ఏమన్న యేమున్న యేలాగ చెప్పేది

ఏలేటి లాలిత్వ లక్ష్యమ్ము చెప్పేది 

ఏధర్మ యేమర్మ  యే కర్మ చెప్పేది 


ఏ యెన్ని రీతుల్లొ యే రాత చెప్పేది 

ఏమంత్ర యేయంత్ర యేతంత్ర చెప్పేది 

ఏ శక్తి యే యుక్తి యే ముక్తి చెప్పేది 


నిత్యాత్ముడై యుండి వెలుగొందు 

నిత్య కళ్యాను డై వెలుగొందు 

సత్యాత్ముడై యుండి సత్యమై వెలుగొందు

తిరు వెంకటాద్రి విభుడు 


ఏ మార్పు యే ఓర్పు యే నేర్పు చెప్పేది 

ఏమార్గ యే మాయ యేమోక్ష చెప్పేది 

ఏ యర్ధ యేతీర్ధ యేస్వార్ధ చెప్పేది 


ఏకాల యేమాల యేజ్వాల చెప్పేది 

ఏకావ్య యే దివ్య యే సవ్య చెప్పేది 

ఏకామ్య యేకణ్య యేసూణ్య చెప్పేది 


నిత్యాత్ముడై యుండి వెలుగొందు 

నిత్య కళ్యాను డై వెలుగొందు 

సత్యాత్ముడై యుండి సత్యమై వెలుగొందు 

ప్రత్యక్షమై ప్రభలుగా వెలుగొందు 

తిరుమల తిరుపతి వెంకటేశ్వరుండు 


గుణగణనాభాస నిన్ను గూరిమి గొలుతున్ 

శ్రీశ్రీశ్రీ శ్రీదేవీ భూదేవి సమేత వేంకటేశ్వరుండు 


గోవిందా.. గోవిందా.. గోవిందా 

***

74..ఏ హాయి సుఖమనుట -  యేమాయ మనసనుట -  


ఏ హాయి సుఖమనుట -  యేమాయ మనసనుట -  

యే ధ్యాస పిలుపునుట - యే ధర్మ మోనో

 ఏదైన పనియనుట -  యేదైన విలువనుట - 

యేదైన శుభమనుట -    యే సత్య మౌనో 

ఏ రూపు విధి యనుట - యేరూపు కథలనుట - 

యే రూపు సమమనుట - యే న్యాయమౌనో 

ఏపుణ్య సమయమిది - యేపుణ్య సహనమిది - 

యేపుణ్య విలువయిది - యేసర్వ మౌనో


మందమ్ము పవన మిట - నందమ్ము సుమము లిట -

గంధమ్ము పరవె నిట - నిత్యాత్మ దేవా 

మందమ్ము నడక యిట - నందమ్ము కవన మిట -

ఛందమ్ము రవణ మిట - నిత్యాత్మ దేవా 

మందమ్ము మధురలయ - లందమ్ము స్వర సరిత -

చందమ్ము రవము లిట - నిత్యాత్మదేవా 

మందమ్ము పదము లిట - నందమ్ము నటన మిట -

విందైన సొబగు లిట - నిత్యాత్మ దేవా 


ఏమందు నిను గనఁగ - నేమందు భువిఁ గనఁగ -

నేమందు దివిఁ గనఁగ - నేమందు దేవీ

ఏ మందు తనువునకు - నే మందు మనమునకు -

నే మందు వలపునకు - నే మందు దేవీ

నాముందు హరిణముగ - నాముందు వరటముగ -

నాముందు బహుజముగ - రా ముందు దేవీ

రా ముందు సరసముగ - రా ముందు స్వరనదిగ -

రా ముందు సురనదిగ - సోమాస్య దేవీ


గోవిందా... గోవిందా.. గోవిందా 

***

75..గొప్పలు చెప్పిన - గోలలు చేసిన 


గొప్పలు చెప్పిన - గోలలు చేసిన 

కోపము వచ్చిన  - తప్పులు చేసిన 

కాలము మారిన  - దేవుని తిట్టిన 

దేవుని మెచ్చిన  - పేరును మార్చిన 

కాలము నీదయ - గమ్యము వెంకన్న 


కూతలు కూసిన  - కూడును తిట్టిన 

కీలును విర్చిన  - ఆలిని తిట్టిన 

మోనము చూపిన  - మోసము చేసిన 

గానము చేసిన  - పాఠము చెప్పిన 

స్నేహము నీకృప - సేవలు వెంకన్న 


మేళము తప్పిన  - గట్టును కొట్టిన 

కొట్టిన తిట్టిన  - గాళము వేసిన 

శాపము పెట్టిన  - తాపము చూపిన 

పాపము చేసిన  - జాప్యము చేసిన 

పాశము నీదయ - పాలన వెంకన్న 


వేషము వేసిన  - ద్రోహము చేసిన 

మాయను కమ్మిన  - వెల్గును ఆపిన 

బుగ్గను గిల్లిన  - మగ్గును తోక్కిన 

నుగ్గుగ చిత్పిన  - తక్కువ చేసిన

నూకలు నీకృప - కూడుగ వెంకన్న


వచ్చి పోవు దారి వరదలా జీవితం 

అసలు జారిపోయె అనుభూతుల కలలు 

కొన్ని జ్ఞాపకాలై కొవ్వొత్తి వెలుగుగా

కరిగి పోవునట్టి కలవేంకటేశ్వరా 


జ్ఞాపకాల చెలిమి జ్ఞప్తి యూత మగుటే 

అనుభవాలు తోడ అభ్యర్ధనబ్రతుకే 

అడుగులోన యడుగు ఆశలు రేపుటే 

కరిగి పోవునట్టి కలవేంకటేశ్వరా 


అండగలిగిన వాణ్ణి అడ్డె వాళ్ళని యాప 

గమనమార్గమేను కళలతీరుబతుకే 

సులభ సాధ్యమైన సుఖదుఃఖ మగుటయే 

కరిగి పోవునట్టి కలవేంకటేశ్వరా 


యెదురుచూపులన్ని యెదను తట్టెడి బుద్ధి 

ఎదుట నున్న వాని నెప్పుడు గానక 

పదట గొడుకులకును బ్రమయేల దీ రదో 

కరిగి పోవునట్టి కలవేంకటేశ్వరా


గోవిందా.. గోవిందా.. గోవిందా 

***


76..ఆశ్చర్యకర చేష్టల మణిపూస దివ్యకాంతి 


ఆశ్చర్యకర చేష్టల మణిపూస దివ్యకాంతి 

మధురా నిర్వాకులు మనో నేత్రుని మనసు కాంతి 

భగవత్ సంబంధము కల ఆరాధ్యులు కలయు కాంతి 

యమునా నదీ జలాలలో కన్యల జలకాల కృష్ణ కాంతి 


నవనీత చోరుడు గోపకులకు పుణ్యమిచ్చెడి కాంతి 

అవని అవతరించి అలరించె దివ్యానంద హేల కాంతి 

వేణుగానలోలుడు గోపీజన మానస చోరుని లీల కాంతి 

మేలు మాటతో బతుకులకు ధారిగా శ్రీ కృష్ణ లీలా కాంతి 


యమునా నదీ విహారి సర్వుల రక్షణ మౌన లీల కాంతి 

జ్ఞాన మార్గ బోధకుడు మహదానంద జనక లీల కాంతి 

ఫణిరాజ శయనుడు మణిమయ భూషణుని కాంతి 

కాలము చేయు మేలు అని చాటి చెప్పిన కృష్ణ లీలా కాంతి 


నదీ తీర సంచారి హృదయాలు దోచే మధుర కాంతి 

యాదవ కులము నందు సర్వ శ్రేష్ఠులతో స్నేహకాంతి 

పుట్టిన వాడే శౌరిగా మార్చే మహిమాన్వితునికాంతి 

దీనజన పాలకా దయామయా మాధవుని కాంతి 


గోప వంశమున మెరిసెను భయ రక్కసుల కాంతి 

దీపమై ప్రకాశించెను కృష్ణ సంహరించు శక్తి కాంతి 

యశోదమ్మ గర్భమున శక్తి తో ఉన్న బిడ్డల కాంతి 

గొల్లభామల కేళీ వినోదాల మధ్యన  కృష్ణ లీలా కాంతి 


తను ప్రకాశింప జేసె హృదయతాపం తగ్గించు కాంతి 

చిన్ని బాలుడు ఎన్ని మహిమలు చేసెనో మౌనలీలా కాంతి 

చన్నొసగిన పూతన ప్రాణము హరించె ఆటలీల కాంతి 

కన్నుల విశ్వము జూప మన్నుదినె మాధవుని కాంతి


గోవిందా..

****

77..ప్రమాదములన్ని  మలచె ప్రమోదముగ జేయు కాంతి 


ప్రమాదములన్ని  మలచె ప్రమోదముగ జేయు కాంతి 

కాళిందీ తీరాన కాళీయ సర్పాన్ని లొంగదీయు కాంతి 

తాడుచే కట్టబడెన రోలు లాగి మోక్షమిచ్చు కాంతి 

దామోదరుదన బడె శ్రీకృష్ణ భగ వవానుని కాంతి 


పుష్పములతో పూజించిన చాలును శక్తినిచ్చు కాంతి 

పదములతోటి కీర్తించిన చాలు శాంతి నిచ్చు కాంతి 


గత జన్మ పాపాలన్ని భక్తితో తొలగించేటి  కాంతి 

నిప్పున పడ్డ దూది వలె పాపాలు నశింప కాంతి 

వ్రతమును ఆచరించిన మోక్షము కల్పించేటి కాంతి 

శ్రీకృష్ణుని మనసార ధ్యానించిన ధైర్యమిచ్చు కాంతి 

 

పూర్వ పాపరాశంత తొలగించేటి గోదా వ్రత  కాంతి 

ఉదర మందున్న జగముల చెదరనీయని కాంతి 

యదునందనుడు నందయశోదానందునిసుత కాంతి 

కర్మాను సారముగా ధర్మోద్దరణ చేయు కృష్ణ కాంతి 


మునిజన హృదయానంద మూలకందుని  కాంతి 

మనమోహనుడు నీలగగన ఘనశ్యాముని కాంతి 

జ్ఞానమిచ్చు నాచార్యుడు దారిచూపు నాచార్యుని కాంతి 

తననే విశ్వసిస్తే తరింప జేయు సద్గురుని కాంతి 


జనన మరణములు లేనట్టి స్వసంకల్పుని కాంతి 

దుష్ట శిక్షణార్థమై శిష్టులను రక్షణార్థుని లీలా కాంతి 

ధర్మ రక్షణ చేయ నిత్య సత్యవాక్కు ల మహా మనిషి కాంతి 

మనుషుల్లో మహాత్ముడుగా హృదయాల్లో నున్న శ్రీకృష్ణ కాంతి 

గోవిందా.. గోవిందా.. గోవిందా 


***


..78.సర్వ యారోగ్య కరమై..సమిష్టి స్సహకారమై


సర్వ యారోగ్య కరమై..సమిష్టి స్సహకారమై

సుఖసంతోష మూలమై ..సుఖాలతొ సంభందమై 

ధర్మార్ధ బోధ పరమై.. దేశలక్ష్యము ధర్మమై 

జన్మ పరిపక్య సత్యమై ..  జీవితంలొ దుఃఖమై 

శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరుని ప్రార్ధనలుగా 


అర్ధ అర్ధాంగి ఆరాటమై ..ఆరోగ్య కాపుర ప్రేమై 

ప్రేమ సంతృప్తి పరమై.. ప్రేమ తోను పరిచయమై 

మేలు చేయు స్నేహమై ..  మిధ్యా జీవితమై 

ఒకరికి  కొకరు యేకమై..బంద0 తోను భాగ్యమై 

శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరుని ప్రార్ధనలుగా 


సహనము చూపి యేకమై..హితమైన పలుకు వేదమై 

నిత్య ప్రోత్సాహ పరమై .. విద్యా వృద్ధిగా పయనమై 

సత్యపలుకుతో సుఖమై.. సమస్య తీర్పుల లక్ష్యమై 

గతం చేసిన పుణ్యమై..ఙివిత మలుపు విధాన మై

శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరుని ప్రార్ధనలుగా 


ఆడదాని పై మొహమై..ఆకలి పొందిక పరమై 

మగాడి మచ్చిక న్యాయమై .. మమతల చెక్కిలి మయమై

మనస్సు ఇఛ్ఛా దేహమై .. మెరసే వెన్నెల దాహమై 

తనని తాను గా పర్వతమై..పర్వతంపై పచ్చదనమై

శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరుని ప్రార్ధనలుగా 


సకలమ్ము భరించ యుక్తమై ..పెదాలపైనను సౌఖ్యమై 

నిత్యమాకలి తీర్మానమై ..చీకటి మనసుకు సుఖమై 

వలపుల వాన హ్రదయమై ..వికసించె పువ్వు తత్త్వమై 

హృదయము రసజ్వలితమై..జ్వలితం మనిషి దాహమై

శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరుని ప్రార్ధనలుగా 


గోవిందా.. గోవిందా.. గోవిందా 

***

79.కమల నయన మనసు కామ్యపు పరమౌను 


కమల నయన మనసు కామ్యపు పరమౌను 

చూపు మాలొ ధర్మ పూజ యగు 

నిలిపి మనసు విప్పి తెల్పేటి సత్యము 

నిత్య ధర్మ చలువ నీదె దృష్టి 


కమల నయన మమ్ము పెంచియు పోషణ 

ప్రేమ భుక్తి పంచి నిష్ట నేర్పి

మనసు తలపు లన్ని మాకు పంచగలుగు 

వినయము మది తీర్పు వెలుగు దృష్టి


కమల నయన మనసు అర్పించి భక్తితొ

వేడు చుంటి నిన్ను వినయమందు 

కరుణ దయయు భయము నాకున్న తెల్వియూ 

నీకు అన్ని తెలుసు నియమ మందు 


కమల నయన మమ్ము కాలాన్ని బట్టియే 

నీకు తప్ప లన్ని చెప్పు చుంటి

మక్కువైన మాట మానసమ్ముగనౌను 

మోక్ష మిచ్చ మార్గ మోహ మవదు 


కమల నయన మనవి జనులను బ్రోచుము

ప్రేమ భందనా న్ని నిలుపు శక్తి

మాకు జన్మ అర్థ  మాపుము దేవరా 

సర్వ సభ్య సాక్షి శ్రీ నివాస


కమల నయన చూడు కరుణగా జగతినన్

నిద్ర నుంచి మేలు కొల్పు మిపుడు 

కోటి సూర్య తేజ గొప్ప ధర్మముతెల్ప

వైపు ఉంచి విధులు వైన తీయ 


కమలనయన భోగ కావ్యము చూస్తావు

సొత్తు చూపి మత్తు లోకి దింపె

మాది నిన్న నేడు మాత్రము అంతయు

రేపు మారు చుండు రీతి వేరు 


గోవిందా.. గోవిందా.. గోవిందా


***

80..రాధా నీ కల మదిగా -కృష్ణా నీ కల నిధిగా 


రాధా నీ కల మదిగా -కృష్ణా నీ కల నిధిగా 

రాధానీ కళ నదిగా - కృష్ణా నీకళ విధి గా 


నీ మాయన్ బడితిని గా.. నిర్లక్ష్యమ్ము వలదు గా 

దాహమ్మున్ అడిగితి గాఁ.. దాంపత్యమ్ము వలదు గా 

నీ కాలమ్ యిది కథ గా.. నీ ధర్మమ్ మది సుధ గా 

దేహమ్మున్ వడివడి గా.. దీ నత్వమ్ము పలుకు గా...          రా..


నీకై కోర్కెలు మది గా.. నీ వాక్కే సమరము గా 

ప్రేమమ్మేగ కథలు గా .. ప్రేరత్వమ్ము మనసు గా 

నాకై తీర్పుగ మది గా.. నాకై వోర్పుగ విధి గా 

స్నేహమ్మే గ మనసు గా.. చిత్రమ్మే వలపులు గా...       రా 


లోకమ్మంతయు కన గా .. కోపమ్మంతయు స్థితి గా 

జీవంమ్మంతయు కల గా.. జ్ఞానమ్మంతయు కళ గా 

నాకంమ్మంతయు మన గా.. నా పుణ్యం సమయము గా 

ప్రేమమ్మంతయు కళ గా.. ప్రీతిత్వమ్ము ధనము గా..       రా 


ఏకాంతమ్ము న నెల గా .. యే కత్వమ్ము యెరుక గా 

శ్రీ కాంచమ్మును వల గా.. శ్రీ కామమ్ము తలపు గా 

శ్రీ శాంతమ్ముయు నెల గా .. శ్రీ శాస్త్రమ్ము మలుపు గా 

శ్రీ శాంతిత్వము వల గా.. శ్రీ సౌఖ్యమ్ము సుఖము గా... రా 


ప్రేమాచ్ఛాదక మన గా.. ప్రేరత్వమ్ము సమము గా 

దేహత్యాగము నన గా.. దాహత్యమ్ము గమన గా 

ప్రోత్యాహమ్ముయు యన గా.. పోరాటమ్ము మమత గా 

ఉచ్చాహమ్ము యు అన గా.. ఉన్మాదమ్ము కళలు గా.. రా 


రాధానీ కలమది గా -కృష్ణానీ కలనిధి గా 

రాధానీ కళ నది గా - కృష్ణా నీకళ విధి గా 


గోవిందా..


****


81..మరవలేనే దేవీ ! మనసు విప్పి చెప్పవేమీ!


మరవలేనే దేవీ ! మనసు విప్పి చెప్పవేమీ!

నీ కన్నుల నయగారాలు!  నన్ను రమ్మంటున్నాయిl

చెప్పలేనే చెప్పవేమీ దేవీ ! చేరువగా నున్నా చూడవేమీl 

శ్రీనివాసుని నేను చిత్తము చూడరేమిl


నీ కులుకుల వయ్యారాలు! హృదయాన్ని కదలించాయిl

తెలపలేనే తరుణివి  ! మనసులోనున్న మహారాణివి l 

నీ అధరాల మధురిమలు! యీ తుమ్మెదకు తేనియలుl 

వర్ణించలేనే వనితా శిరోమణివి ! వదలలేను దేవీ 

శ్రీనివాసుని నేను చిత్తము చూడరేమిl


నీ ముంగురుల నాట్యాలు! చిందులేస్తున్న చిటికలుగా 

వివరించలేనే లలనా ! వినయమ్ముగా చెప్పనా 

నీ నునుబుగ్గల సిగ్గులు! ఎరుపెక్కిన లేత మొగ్గలుగా 

పొగడలేనే పడతులే ! కదలలేని పరిస్థితిగా 

శ్రీనివాసుని నేను చిత్తము చూడరేమిl


నీ బిగువు పరువాల సొగసులు! కౌగిలికై ఘుభాలింపులుగాl

కొలవలేనే కోమలివి ! నా మనసులోనున్న వైశాలివిl

నీ నాజూకు నడుమొంపు అందాలు! ఇంద్రధనస్సు కన్నా మించిన రంగుల హంగులు మీవి 

శ్రీనివాసుని నేను చిత్తము చూడరేమిl


మానలేనే చెలులారా ! నన్ను మరిచారా యిక నేను చలిచలిl

పొద్దస్తం నను వేదించే నీ తలపులు.!! మరచిపోని మీ తీపి గురుతులు


శ్రీనివాసుని నేను చిత్తము చూడరేమిl

మేము మిమ్ము విడిచి ఉండలేము గోవిందా 

మా ధైర్యము శక్తి అంతా నీవే గోవిందా 

మా వయ్యారాల కులుకులు మీకే గోవిందా 


గోవిందా.. గోవిందా.. గోవిందా 

***

82..గళము విప్పి చెప్ప లేను


గళము విప్పి చెప్ప లేను..గ్రహచారమని నమ్మ లేను 

ఆక్రో సంతొ ఉండి నాను.. ఆవేశము వదల లేను... 

శ్రీదేవీ  భూదేవి సమేత వేంకటేశ్వరా 


కలము రాత రాయ లేను..కాల మాయకు చిక్కాను 

తప్పు తప్పు గా అనలేను.. తప్పును సమర్ధించలేను

 శ్రీదేవీ  భూదేవి సమేత వేంకటేశ్వరా 


పెద్ద లెవరికీ చెప్ప లేను.. పేరు బయట పెట్టలేను 

మోద్దులెవరొ ఎంచ లేను.. మొహానికి చిక్కినాను...

 శ్రీదేవీ  భూదేవి సమేత వేంకటేశ్వరా 


బాధ తోనె బతుకు తాను..బానిస గా భరిస్తాను

దైవ కృప కోరు చున్నాను.. వైనతీయుని ప్రార్ధిస్తున్నాను.. 

శ్రీదేవీ  భూదేవి సమేత వేంకటేశ్వరా 


కులం కోసము బతికాను..కల్తీయను సంఘంలో నలిగాను 

చెడ్డను చింపమన్నాను.. చెడును నమ్మ లేకున్నాను.. 

శ్రీదేవీ  భూదేవి సమేత వేంకటేశ్వరా 


తెల్ల కాగిత మయ్యాను.. తెలివి తక్కవ గాను నేను 

మంచీ చెడును వ్రాసాను ..మనించమని వేడుకున్నాను.. 

శ్రీదేవీ  భూదేవి సమేత వేంకటేశ్వరా 


ఊహ కదలికల లోను..ఉయ్యాల ఊగుతున్నాను

నరజన్మ సార్ధకమ్మును..నిజము చెయ్యాలనుకున్నాను.. 

 శ్రీదేవీ  భూదేవి సమేత వేంకటేశ్వరా 


బతుకు నావలా సాగాను..బంధాలు నమ్మి బతికాను 

నిజ మార్గ సంసారమును.. నిజాయితీగా బతికించలేను 

.శ్రీదేవీ  భూదేవి సమేత వేంకటేశ్వరా 


గోవిందా.. గోవిందా.. గోవిందా 


***


83..ఎంతటి వారికో ఏ దోక కళయె


ఎంతటి వారికో ఏ దోక కళయె

చెంతను జేరియు చేర్చును కళయె

వింతగ యేమియో వేడుక కళయె

చింతన వేంకటే శ్వర లీల కళయె


పూలవర్షాన నే పులకించి పోయి,l

ప్రేమపంచాలనే పిలుపాయె నోయిl 

కేళి కోసం మేను కిలకిల మనగ ,l

జాలి చూపెందుకో జాతర మనగl


పిలిచాను దేవరా ప్రేమతో నిన్ను !

పలికేను వేదమే పాఠమ్ము గాను l

నిలిచాను యిచ్చోట నీకోసమేను !

చలిలోను వెచ్చగా చెలిగాను నేనుl


ఒకసారి రావేల ఒయ్యారి కొరకు !

మనసాయె నీమీద మాధుర్య పలుకుల్

సెగలన్ని చల్లార్చ సిగపట్టు లేల 

మొగమాట మేలరా మురిపాల తేల !


అధరాల మాధురీ అందించ బూని ,

వదనార విందాన్ని వలపుతో నింపి ,

కథలన్ని తెల్పాను కాలము బట్టి 

పదములే పట్టాను పాలన బట్టి 


సరసాల తేలంగ సంపెంగి తోడ ,

విరజాజి మాలనై వేచాను స్వామి !

పరదాలు మార్చాను పరువమ్ము తోను l

సరదాగ పలుకాయె సరసాల స్వామి l


కరుణించి ననుజేరి కాపాడ వేమి !

అరుదెంచి ఒడిజేరి హాయి నీవేమి !

చిరుహాస సమయమ్ము సందర్బ మే ను l

సిరిమువ్వ శబ్దంమ్ము సేవలు స్వామి l


మదినిండ నీవేను మార్తాండ తేజ !

గదియంత చీకటి గాలమ్ము రాజ l

కదలాడ లేనురా కథనాల రాజ !

ఫదకమ్ము యేలరా పాలనా తేజ l


వేసారి పోయాను విసిగించ బోకు !

మోసాలు కావులే మోహమై కాకు l

ఓసారి విచ్చేయి ఊరింపు చాలు !

ప్రాసలు యేలనో ప్రభలుగా చాలు l


పుడమిగా హృదయాన పొంగేను ప్రేమ !

పుట్టుక తోప్రేమ పూజ్యమ్ము ప్రేమ l

సన్నాయి మేళమే సమరమ్ము ప్రేమ!

చిన్నారి మేనులో చిందేను చూడు !


ఎంతటి వారికో ఏ దోక కళయె

చెంతను జేరియు చేర్చును కళయె

వింతగ యేమియో వేడుక కళయె

చింతన వేంకటే శ్వర లీల కళయె


గోవిందా.. గోవిందా.. గోవిందా 

****


84..జ్ఞానమనేది విద్య హరి సామ్యము నిత్యము యేక రూపమే 


జ్ఞానమనేది విద్య హరి సామ్యము నిత్యము యేక రూపమే 

ధ్యానము నిత్య యద్భుతము ధ్యాసయు ధర్మమనేటి సత్యమే 

ప్రాణము బ్రహ్మ సూత్రమగు పాలజగద్గురు జ్ఞానదీపమే 

మానమనే మనస్సగుట మస్తక వైనము వేంకటేశ్వరా


ధరణిన ధర్మమే మనిషి దానము చేసెది లక్ష్య సిద్ధిగన్ 

కరుణగ కాలమే కలుగు కావ్యము వ్రాసెడి విద్య పొందగన్ 

కరువుయెలేని రాజ్యమగు కామ్యపుబుద్దియు సత్యమేయగున్ 

తరువుల సేవలే జయము తక్షణ యుక్తియె వేంకటేశ్వరా


కలయిది కానిదైన హరి కాలము మార్పుగవిద్య దేవరా 

తలపులు తత్త్వమేను విధి తన్మయ రూపము కాంతి గాంచితిన్ 

మలుపులు యెన్నియున్న మదిమంచిని కోరియుసేవచేయగన్ 

పలుకుల ధర్మసత్య తిధి పాఠ్యము రీతిగ వేంకటేశ్వరా


సురనుత!దేవదేవ!హరి! సుందర చంద్ర నిభాస్య దైవమా 

మురహర! యీభవాబ్ధిఁబడి మున్గుచుఁదేలుచు 

నుంటిదేవరా 

కరిమొర నాలకించిజని కాచిన రీతిగ నన్నుఁగావవే!

సరసిజనాభ!ధర్మ ! భవసాగర నేస్తము !వేంకటేశ్వరా


ధాత్రిభరించుటే సహనతత్త్వము విశ్వము తృప్తి పర్చటన్ 

రాత్రియె నిద్ర సౌఖ్యమగు రవ్వల వెల్గుల నీడలే యగున్ 

మైత్రియె సర్వమున్ చెరుపు మైకపు మాటలు మంత్రమున్ మహిన్ 

యాత్రల చేయగా చెలిమి యానతి నీదయ వేంకటేశ్వరా

గోవిందా.. గోవిందా గోవిందా

***


085..ఎంతకాలమో జీవన మెంత వరకు


ఎంతకాలమో జీవన మెంత వరకు 

దేహధారణము భరించు దీన బతుకు 

చింతలపరమే కదలిక చేష్టలగుట 

జిక్కువడవలసేనులే జీవిగాను    ॥


 పల్లవి॥


మనసు మోహంబువలలఁతొ మార్గ మేది 

సహజ ఋణముతీర్చ గలుగు సమయ మేది 

గర్భనరకము లీఁదటే గమన మేది 

నడిమిసుఖముల చెంతనే నడక నాది 


॥ఎంత॥


ననుపుసేయఁగఁవిధిగాను నాట్య మగుట 

తొడవ తొడవకీ వేదన తోడు యగుట 

చేయు పూజకు యంతరం చింత యంగుట 

కాల మాయకు చిక్కియే గాల మైతి 


॥ఎంత॥


పాపపుంజములు యెరుక పాలనగను 

 బట్టుబడకయే జీవితం బాధ యగును 

ఆపదల తోడిదేహము అలుపు గాను 

మోవవలసెడి బంధము మోయు చుండ 


॥ఎంత॥


చూపులకులోనగు సుఖము సూత్ర మేది 

దీపమెలుగు లో చీకటి దివ్వె నైతి 

భ్రాంతిచేఁ దిరిగాడితి బాధ్య తేది      

హితుడు తిరువేంకటేశుని హితము కోర 

  

॥ఎంత॥


గొలువ గలిగేటి తిరునాళ్ల గొప్ప గాను 

నరకకూపమునఁ బడెడి నరుని బతుకు 

అతని కరుణారసంబుయే ఆ శ్రితమగు 

హీన బ్రతుకు మార్చు రమణా హితము కోర 


   ॥ఎంత॥


తప్పు చేయునొకడి వల్ల తన్నులొకడు

న్యాయశాస్త్రమనే విద్య నడత మరువ

కష్టపడిన సొమ్ము బతుకు కలలు తీర్చ

తృప్తి లేని మనిషిగాను తీవ్ర మాయ 

వేదనయగుట యేలను వేంకటేశ


   ॥ఎంత॥

గోవిందా.. గోవిందా.. గోవిందా 


***



86..కలల మెరుపు... కావ్య మాయలే  


కలల మెరుపు... కావ్య మాయలే  .. శిలల మెరుపు .... శిల్పమాయలే

కళలు తలపు ... కళ్ళ లాయాలే   .. వలల తలుపు .. బంధ మాటలే     

కళలు గెలుపు.... కచ్చ లాయలే   .. గెలలు కుదుపు .. గంతు లాయలే   

తలలు తడుపు .. తంతులయాలే .. మొలల పొదుపు .. మోక్షమాయెలే ..శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాస 


కరుణ గుణము... చూపవచ్చులే  ... అరుణ మెరుపు ... ఆట పట్టులే 

తరుణ మయిన... తత్వమాయలే  ... మరణ పిలుపు ... మచ్చ తెచ్చులే 

బరువు మరుచు.. . భాగ్యమేనులే   ... మరియు మురియు ... ముప్పు తెచ్చులే 

గరుకు బెరుకు  ... గంధ మవ్వులే  ... తరువు గిరులు ... స్నేహ మిచ్చులే శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాస 


నవవిధ మున .. నాట్యమాడు లే .. అవసరమున  .. అట చూపులే  

అవయవములు... ఆట పల్కు లే .. చవక పలుకు .. చాటు తిట్టులే 

భవభవములు... బాధ్యత వ్వులే  ..  నవకలువలు ... నాటు ఒప్పులే  

సవరమలులె... సాధ్యమౌను లే  ...  సకలముకద ... సౌఖ్యమేనులే  శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాస 


మలుపు కథలు.. మానసమ్ములే  .. గెలుపు మనిషి ... గమ్యమౌనులే

మరువ వలదు... మాన్య బత్కులే .. కరువు బతుకు ... కల్లొలమ్ము  లే

 

మధురిమలుగ.. మల్లెజాజులే ..  మమత కులుకు .. మచ్చ చూపులే  

సమవిధి కను ....విద్య పొందుటే .. సమరము విధి .. శాంతా మెప్పులే   శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాస 

గోవిందా.. గోవిందా.. గోవిందా 

***


87..దుర్మార్గంలోంచే మనిషికి  సన్మార్గం తట్టదు 


దుర్మార్గంలోంచే మనిషికి  సన్మార్గం తట్టదు 

దేహతాపం తగ్గనదే న్యాయ మార్గం  తట్టదు

స్వార్ధ చింతన తొలగందే నిస్వార్థం తట్టదు

దర్మం తప్పని  ప్రవర్తనకు ఫలితం పుట్టే వేంకటేశ్వరా  


నేను నాది అనేది విచ్ఛిన్నం అయితేనే తట్టదు   

మొహం, దాహం, అహం, అణగారి పోతేనే తట్టదు    

కామం ఆకర్షణ ఆలోచన,ద్వేషం తగ్గి పోతేనే తట్టదు 

దైవ ప్రార్ధన చెయ్యాలని తపన  పుట్టే వేంకటేశ్వరా  


ఎది యైనా చావందే కొత్తదిగా పుట్టదు 

మెహమ్మే తొలగందే మోక్షంమ్మే పుట్టదు

దాహమ్మే తీరేదాక సౌభాగ్యమ్ము పుట్టదు 

దేహమ్మే నల్గెదాక భయ్యమ్మే  పుట్టే వేంకటేశ్వరా


మేఘమ్మే తొలగేదాకా కిరణంమ్ము పుట్టదు 

బూడిద తొలగే దాకా నిప్పు కణిక  పుట్టదు

చెరువులో నాచు తొలగే దాకా నీరు పుట్టదు

ప్రపంచం దుప్పటి తొలిగేదాకా బుద్ది పుట్టే వేంకటేశ్వరా     

          

ఆధ్యాత్మికానుభూతి లేనిదే ప్రేమ పుట్టదు  

అలౌకికానుభూతి దాహం లేనిదే పుట్టదు 

ఆనందకాసారం లేందే  బ్రహ్మానంద పుట్టదు 

జీవిత సార్థక్య సంసారం రహస్యం పుట్టే వేంకటేశ్వరా


ఒక చల్లని గాలి తెర కదలందే కదలిక పుట్టదు  

స్పర్శ అనుభూతి పొందందే జన్మ పుట్టదు 

అర్ధాంగి అర్ధం తెలియందే నిజ ప్రేమ పుట్టదు 

కాల గమనాన్ని బట్టి తిండి లేక ఆ రోగ్యం పుట్టే వేంకటేశ్వరా   


అనుభవాల్లోంచి ఆధ్యాత్మిక భావం పుట్టదు  

ప్రకృతి ప్రతి అణు స్పందనలో నిజం పుట్టదు  

న్యాయ, ధర్మ, సత్య, స్పర్శలనుండి తృప్తి పుట్టదు   

నిశ్శబ్దంలో భగవంతుని అనుభూతితో భక్తి పుట్టే వేంకటేశ్వరా 


***

88..చెట్టు కళ్ళు తలలపైకి చింత గాలి


చెట్టు కళ్ళు తలలపైకి చింత గాలి

పుట్ట వాస్తవాలు తెలుప బుద్ధి మారు

గుట్ట చక్కగా చూడటం గుర్తు ఏది

మెట్ట రాజకీయము జూడ మోహ మేల వేంకటేశ్వరా 

.......

మన శరీరాన్ని సహన మార్గ ధీమ

మెదడుని పదును చల్లగా మోక్ష ధీర 

పలుకుల లొ పవిత్రత గాను ప్రతిభ సూన్య

నిత్య ఆలోచనలు రాని దృష్టి ధీర వేంకటేశ్వరా 

.......

మార్పు మంత్ర సాధన విధి మార్గ మగుట

శ్వాస మార్చు కుంటే మది సాక్షి యగుట

సంపద సకల భోగము సహజ మగుట

అగ్ని తో రాజ కీయము ఆశ బతుకు వేంకటేశ్వరా 

..........

నమ్ము నమ్మకపో చేయు నటన ఇదియు

కమ్ము కొస్తున్న ఉప్పెన కాల మిదియు

చిమ్ము తున్నరోగ జలుబు చింత దగ్గు

వమ్ము చేయక జీవితం వంక జూడు వేంకటేశ్వరా 

......

ఇంద్రియ సుఖాల సంపద ఇష్ట మగుట

అనుభ వించు ఆలోచన ఆశ యగుట

మనసు మీద ముద్రలు పడి మబ్బు యగుట

సూక్ష్మ మైన బుద్దియు ఇది సూత్ర మగుట వేంకటేశ్వరా 

........

నీలొ నీవుగా నిలకడ నిజము తెలుపు

నిత్య సత్యమై జీవితం నియమ మందు

నీదు యుక్తి మలుపులగు నీడ మనసు

నాణ్యత నిముష కాలము నడక నేర్పు వేంకటేశ్వరా 

........

ఎవరి దారిలో వారుగా నడవ గలిగి

ఏది అనకుండ కదిలినా ఏడ్చు వారు

కథలుగా తెలిపినది సకాల మార్పు

రాజకీయ మలుపు తెచ్చు రభస వల్ల వేంకటేశ్వరా 


గోవిందా.. గోవిందా.. గోవిందా 

***


89..తాను నమ్మిన ప్రత్యక్ష  తత్వ యుక్తి 


తాను నమ్మిన ప్రత్యక్ష  తత్వ యుక్తి 

తాను నమ్మక యె పరోక్ష ధర్మ  శక్తి 

జ్ఞాన మన్నది మేలుగా జ్ఞప్తి భక్తి 

జనన మరణాలు నమ్మేది జీవ ముక్తి వేంకటేశ్వరా

.....

రెండు జీవ కణాలతో సిరుల శక్తి 

జీవిలో రసాయనిక నిజాల యుక్తి 

జీవ నవ విద్యుదయ కాంతి చేత రక్తి

జీవి చైతన్య బుద్ధితొ  జన్య ముక్తి వేంకటేశ్వరా

.....

కంటి పాపతో చూసిన కనుల శక్తి 

భావ మాత్రము పొందేటి బంధ యుక్తి 

విశ్వ సాధన చైతన్య విద్య  భక్తి  

జీవి అంతర్గత కళల జీవ  ముక్తి    వేంకటేశ్వరా

.....

మూర్క మనిషిని స్నేహము ముడుచు శక్తి 

విశ్వ మాయను ప్రేమమ్ము వింత  యుక్తి  

మనసు నిజమును తెలుసుకొ మోట్ట వ్యక్తి  

చెలిమి విలువలు స్థిరము చెప్ప ముక్తి  వేంకటేశ్వరా

......

దేహ పరిణామ కణముల దీన యుక్తి 

కర్త అనునయ వినయము కామ్య శక్తి 

కర్మ పరిపక్వ చైతన్య కాల రక్తి 

తెలుసు కోలేని మేధస్సు తృప్తి శక్తి వేంకటేశ్వరా

.......

ఎన్ని శక్తులు ఉన్నను ఏదొ భక్తి 

ముందు ఆరోగ్య ఆకాంక్ష ముంపు రక్తి 

కలియుగ బతుకు దీక్షతో కళల యుక్తి 

ముక్తి కొరకును ధర్మమ్ము ముఖ్య శక్తి వేంకటేశ్వరా

......


లేత పువ్వును చూడంగ లేమి బుద్ధి 

కొర్క చితిపియు నమిలియు కొట్ట బుద్ధి 

నీకు పరిమళ మివ్వగ నీచ బుద్ధి 

పెట్టి కోప స్వభావము పెంచ బుద్ధి  వేంకటేశ్వరా   

.......

ద్వి. మనసు పడుటయేను మాత్రమే భోగి

మనసునే పట్టుట మధ్యస్త యోగి

రెంటి నీ తెలియక రెప్పల రోగి

కంటి నీ వంటిని కలయు జోగి వేంకటేశ్వరా


90..అక్షర క్షీరాన్ని పంచుతూ,


అక్షర క్షీరాన్ని పంచుతూ, ఆశల వలయాన్ని చేదిస్తూ,

చైతన్య పదాల్ని నిర్మిస్తూ, న్యాయ సంకటాలను వివరిస్తూ, 

లక్షిత గమ్యాన్ని చేరవేస్తూ,ధర్యాన్ని నూరిపోస్తూ,

 సాగే జీవితం వేంకటేశ్వరా.


జారిపోయిన అనుభూతులను ఆస్వాదిస్తూ,

కొన్ని జ్ఞాపకాలై వెంబడిస్తూ,కలం ఊతముతొ నడుస్తూ,

జ్ఞాపకాలను మిత్రులతో చర్చిస్తూ,అనుభవాలను వెల్లడిస్తూ,

 సాగే జీవితం వేంకటేశ్వరా.


అడుగులో అడుగు కలుపుతూ అడ్డెవాళ్ళని అడ్డగిస్తూ, 

నా వేగం ద్విగుణీకృతం కవిత్వ పారాయణం చేస్తూ,

గమనమార్గంలో ఆశలునిండిన కళ్ళతో సరిచేస్తూ,

సాగే జీవితం వేంకటేశ్వరా


మధురం, మృధుత్వం,  ప్రేమ,  ఆప్యాయత చూపిస్తూ,

కాఠిన్యం, క్రూరత్వం, ద్వేషం, అశ్లీలత, అర్ధాన్ని వివరిస్తూ 

వినోదం, విరోధం, వివేకం, అవివేకం, ఏకం చేసి ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ, అనుకరిస్తూ, కయ్యానికి కాలుదువ్వుతూ, వియ్యానికి బాట వేస్తూ, నిరంతరం కృషి తో 

ధర్మాన్ని తెలియపరుస్తూ, సత్యంగా మాట్లాడుతూ, న్యాయంగా సహాయ సహకారం అందిస్తూ తెలిసినవి తెలియపరుస్తూ, 

సాగే జీవితం వేంకటేశ్వరా


గోవిందా.. గోవిందా.. గోవిందా 


***


91..మెడలోని పులిగోరు..ఎగురుతూ మలుపు 


మెడలోని పులిగోరు..ఎగురుతూ మలుపు 

నిజప్రేమ గంధమే..ఉడుకుతూ నిలుపు 

సంతృప్తి బ్రతుకుగా.. సనుగుతూ సలుపు 

వినయ వివేకము..  చెరుగు తూ విరుపు

చితికిపోవు బతుకు చెలిమి బాలాజి 


నీ భయ నీ బెంగ..తెలుపుతూ తలుపు 

కోరికే ఊరికే..రక్కుతూ సొలుపు 

చైతన్య యాత్రలో..చిక్కుతూ పిలుపు 

ప్రతిగుండె గొంతులో..పొంగుతూ వలపు 

చితికిపోవు బతుకు చెలిమి బాలాజి 


మనసెన్ని కళలనో..కమ్ముతూ మెరుపు 

తీరకే జన్మలను..ఎత్తుతూ తడుపు 

ఒక చిన్ని గింజలో..మెక్కుతూ పరుపు 

తనగుట్టు గాలిలో..ఆడుతూ తెలుపు 

చితికిపోవు బతుకు చెలిమి బాలాజి 


పుడమిన బంగారు.. మునుగుతూ చెరుపు 

పలుకులో మురిపాలు.. పంచుతూ పొదుపు 

సొగసులే తనవిలే.. తేలుతూ నిలుపు 

నిజచెలి వనమదే..పెంచుతూ తెలుపు

చితికిపోవు బతుకు చెలిమి బాలాజి


కాలమ్ముయు నీదియె సేవ కనుల కమనీయమౌను 

గాలమ్ముయు నీ దయ సేవ గళము సహనమ్ము గాను 

తాళమ్ముయు నీ కృప సేవ తరము కళ లవ్వుటేను 

మేళమ్ముయు నీమది దివ్య మెరుపు గనగా నిజమ్మె


సమేఖ్య క్షేమదాయకం సదా సలక్ష్యణం గతిమ్ 

 ప్రమాణ మార్గ ప్రేరణం  ప్రమోద లక్షణే గతిమ్ 

 అమోఘ శక్తి దాయతం సమాన రక్షణే గతిమ్ 

 సమర్థ భక్త పాలకం సహాయ వేంకటేశ్వరమ్


తిరుమల తిరుపతి వేంకటేశ్వరా నమో నమః 

శ్రీదేవీ భూదేవి సమేత శ్రీనివాస నమో నమః 


గోవిందా.. గోవిందా.. గోవిందా 


**-


92..అలిగిన అలలై స్వ సంద్రమే జీవితమ్ 


అలిగిన అలలై స్వ సంద్రమే జీవితమ్ 

తలవని తరమై స్వ మాయలే శంకటమ్ 

పిలవని పరమై స్వ బుద్ధులే బొంగరమ్ 

కలవని కధలై స్వ  కర్మలే వేంకటేశ్వరా 


పలుకుల మనసై స్వభావమే జీవితమ్ 

థళుకుల మెరుపై స్వధర్మమే దోహదమ్ 

కులుకుల వరమై స్వలక్ష్యమే ప్రేరణమ్ 

మలుపుల కరునై  స్వ కర్మయే వేంకటేశ్వరా 

    

ఒకటని ఒకటిగా పొందుటే  జీవితమ్ 

శకటము  సెగ దెబ్బ ఉండుటే కీలకమ్ 

తకధిమి తక తోం త నాట్యమే సంబరమ్ 

తికమక తిక ఉండు రోగమే వేంకటేశ్వరా 

    

వికసిక కధలన్ని రాగమే జీవితమ్ 

మకతిక తరుణమ్ము శాంతమే సంతసమ్ 

తకధిమి కళలన్ని భావమే తన్మ యమ్ 

ఒకటికి ఒకటౌను ఓర్పుయే వేంకటేశ్వరా 

      

సరిగమ  సతి పాటలే మనో జీవితమ్ 

మురిపము మనువాడి నోడికే సౌఖ్యమమ్ 

సిరి కలసియు  వేడుకే కధా కోపమున్ 

చరితము  మది సంతసం కదా వేంకటేశ్వరా 


పదనిస పతి మాటలే కళా జీవితమ్ 

యద వినయపు సేవలే కధా సంగమమ్ 

కధ కళ కిల యవ్వుటే సదా మోహనమ్ 

రొద  మది రమ కోరుటే కదా వేంకటేశ్వరా 


గోవిందా.. గోవిందా.. గోవిందా 

***


93..నిన్నొదిలి నేను పోలేనులే 


నిన్నొదిలి నేను పోలేనులే 

నిన్ను అర్ధం చేసుకో లేక పోతున్నా

వాస్తవ మనోభావాలు తెల్ప లేకున్నా

నీవు ఒక వస్తువు కాదు లోకరక్షకా 

నేస్తమైనావు నాకు వేంకటేశ్వరా 


నిన్ను వలచి వెంబడించానులే 

నన్ను తలచి తపన చెందావను కున్నా 

నిన్ను కలసి ఎన్నో మాటలుచెప్పాలనుకున్నా 

నీవు ధర్మమార్గాన్ని చూపే ఆత్మబంధువుగా 

నేస్తమైనావు వేంకటేశ్వరా     


స్వార్ధమునకు మనమధ్య చోటు లేదులే 

నిస్వార్ధ సేవలే మనమధ్య ఉన్నాయనుకున్నా 

సుస్వరభావామృతము కలిగిస్తావనుకున్నా 

మదిని మరిపించుటకే ప్రేమదాసుగా 

నేస్తమైనావు వేంకటేశ్వరా 


వర్ణ వివక్ష మన మధ్య రాదులే 

వర్గ విలక్షణ అసలు లేదని చెపుతున్నా 

దుష్ట గణము మనమధ్య దూర లేదన్నా 

ఉత్సాస నిస్వాసాలు ఒక్కటేనన్నా 

మనమధ్య ప్రేమ దయాళువుగా 

నేస్తమైనావు వేంకటేశ్వరా 


మనసారా నన్ను పిలిచావులే 

మదితీరా మనసును తెలిపావులే 

హృదయ స్పందన ఒక్కటిగా మలిచావులే 

వడిలో ఉండి ఓదారుస్తూ

 నేస్తమైనావు వేంకటేశ్వరా    

      

ఎప్పుడొస్తావో తెలపవు లే 

ఎలా వస్తావో తెలపవు లే 

ఏకంగా మమత పంచేసావు లే 

మరువ లేనని అంటూనే 

నేస్తమైనావు వేంకటేశ్వరా 


అలసి సొలసిన కాలానికి నివేదిక్కు 

అనంత ఆలోచన తరుణానికి నీకే మొక్కు 

అమృత ఘడియల ఆనందానికి సేవా దిక్కు 

పరమానందాన్ని మాకు పంచియు 

నేస్తమైనావు వేంకటేశ్వరా  


నేస్తానికి నేస్తం ప్రాణమే నన్నావు 

ప్రాణానికి ప్రాణం దేహమే నన్నావు 

దేహానికి దేహం ప్రేమ యే నన్నావు 

ప్రేమకి ప్రేమే దాసోహం అని చెపుతూ 

మాతో నేస్త మైనావు వేంకటేశ్వరా 

   

గోవిందా.. గోవిందా.. గోవిందా 

***


94..మాటలు తో, మైమరిపించాలి,

మాటలు తో, మైమరిపించి,
సరసాలతో, హృదయాన్ని కదిలించి,
అలకలు ,బుజ్జి గింపులతో, ఓదార్చి,
హత్తుకోవడం, స్పర్శ కలిగించే వల్లభరాయ వేంకటేశ్వరా.

కొరకడం, ముద్దులతో ముంచేసి,
స్పర్శించడంతో కౌగలించి ,
చూపులతో, లొంగదీసి,
పెదాలతో, పెదాలను కలిపే వల్లభరాయ వేంకటేశ్వరా.,

చేతులతో, అలింగణం చేసి,
మాటలు తో, మైమరిపించి,
వెచ్చని కౌగిలిలో,కాలం గడిపి,
మత్తెక్కించే గుసగుసలా మాటలతో
మైమరిపించే వల్లభరాయ వేంకటేశ్వరా.

వెచ్చని శరీరానికి చల్లదనపు స్పర్శ సుఖమే అందించి,
తలపుల్లో నీ ఊహలై పండించి ,
వలపుల్లో నీ ఊసులై చూపించి ,
పెదాలంతా నీ మధువులై తడిపావు వల్లభరాయ వేంకటేశ్వరా ,

మనసంతా నీ గురుతులై ఫలించి,
రేయైతే నీ స్వప్నాలతో సుఖించి ,
నా మాటలో నీ నామ స్మరణే నమ్మి ,
నా పాటలో నీ జ్ఞాపకాల రొధలే విన్నా వల్లభరాయ వేంకటేశ్వరా.

నా ధ్యాసలో నీ ఆలోచనలై శాంతి నిచ్చావు ,
నా శ్వాసలో నీ ప్రేమ నిట్టూర్పులే మిగిల్చావు,
జన్మ జన్మలంబంధం వల్లభరాయ వేంకటేశ్వరా

నా జన్మ నీకొరకేలేరా నీరజాక్షా.
నాప్రేమ నీకొరకే లేరా శ్రీనివాసా
నీతోడు నానీడ యేకమవ్వాలి వేంకటేశ్వరా

గోవిందా.. గోవిందా.. గోవిందా
***

95..చాలా మంది తిరుమల చేరాక ఎదో మొక్కుబడిగా ఓ నమస్కారం చేసి వచ్చేస్తారు. తిరుమల చేరిన తర్వాత మొదటిగా శ్రీ వరాహ స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోండి..🙏

ఇక స్వామి వారి ప్రధాన ద్వారం నుండి బయటకు వచ్చే వరకు దేవాలయంలో వీటి నన్నిటిని దర్శించుకొని బయటకు రండి..🙏 వరుస క్రమంలో 🙏 సేకరణ🙏

1. మహాద్వార గోపురం
2. శంఖనిధి - పద్మనిధి
3. కృష్ణరాయ మండపం
4. అద్దాల మండపం
5. రంగనాయక మండపం
6. తిరుమలరాయ మండపం
7. తులాభారం ( తులా దండం)
8. రాజా తోడరమల్లు
9. ధ్వజస్తంభ మండపం
10. ధ్వజస్తంభం
11. బరి పీఠం
12. క్షేత్రపాలకశిల (గుండు)
13. సంపంగి ప్రదక్షిణం
14. నాలుగుకాళ్ల మండపాలు
15. శ్రీవేంకటరమణస్వామి కల్యాణమండపం
16. ఉగ్రాణం
17.విరజానది
18. పడిపోటు
19. పూల అర
20. పూలబావి
21.వగపడి అర
22. వెండివాకిలి
23. విమానప్రదక్షిణం
24. శ్రీరంగనాథుడు
25. శ్రీ వరదరాజస్వామిఆలయం
26. ఘంటామండపం
27.గరుడమందిరం
28.జయ విజయులు
29. బంగారువాకిలి
30. స్నపన మండపం
31.రాములవారి మేడ
32.శయన మండపం
33.కుల శేఖరపడి
34.శ్రీస్వామివారి గర్భాలయం
35.శ్రీ వేంకటేశ్వరస్వామి(మూలవిరాణ్మూర్తి)
36. భోగ శ్రీనివాసమూర్తి
37. కొలువు శ్రీనివాసమూర్తి
38. ఉగ్ర శ్రీనివాసమూర్తి
39. శ్రీ మలయప్పస్వామి
40. శ్రీ సుదర్శనచక్రత్తాళ్వారు
41. శ్రీ సీతారామ లక్ష్మణుల
42. రుక్మిణీశ్రీకృష్ణులు
43. సాలగ్రామాలు
45. వకుళాదేవ
46. బంగారుబావి
47. అంకురార్పణ మండపం
48. యాగశాల
49. నాణేలపరకామణి
50. నోట్ల పరకామణి
51. చందనపు అర
52. ఆనందనిలయ విమానం
53. విమాన వేంకటేశ్వరస్వామి
54. రికార్డుల గది (సెల్)
55. వేదపారాయణలు
56. సభ అర
57. సంకీర్తన భండారం
58. సన్నిధి భాష్యకారులు
59.శ్రీవారి డాలర్లు
60. శ్రీ యోగనర సింహస్వామి
61. శంకుస్థాపన స్తంభం
62. పరిమళం అర
63. శ్రీవారి హుండీ (కొప్పెర)
64. బంగారువరలక్ష్మి
65. కటాహతీర్థం
66. శ్రీ విష్వక్సేనులవారు
67. ముక్కోటి ప్రదక్షిణం
68. సాష్టాంగ నమస్కారాలు.

ఏడుకొండలవాడా🛕 🚩వెంకటరమణా 🌹
గోవిందా 🌸🙏గోవిందా 🌼🙏


96..సీస పద్య మాలిక.. మనసుకు శాంతి యేది?వేంకటేశ్వరా 


ధర్మ మార్గము చూప ధరణి సంపద యేది?

ధ్యాన తత్త్వము తెల్ప ధర్మ మేది?

పద్యాల బోధన బతుకు సాధ్యముయేది? 

తెలుగు తల్లియు బాధ తెల్ప వేమి?

గద్దెనెక్క పాలక గమ్య మార్గము యేది?

జనులపై శ్రద్ధేది? జపము యేది?

బాధ్యతగల పుత్రు  బంధ భాగ్యము యేది 

కన్నవారిని చూడు కాల మేది 

నడవడి నేర్పేటి నడక మర్మము యేది?

ఆచార పాఠము ఆత్ర మేది? 

విజ్ఞులు ఒప్పిన విన విధేయతయే ది?

విశ్వ మాయ వలన విద్య యేది?

తెలుగు భాష బతుకు తెల్ప రాజ్యము యేది? 

ప్రేమపంచు కళలు ప్రీతి చెందు కలేది 

అమ్మాయనెడిపిల్పు ఆశ యేది? 

ఉమ్మడిగా కుటుంబాలు చూడుట యేది ? 

స్పర్ధలు విడిపోని సంఘ మేది?


తే..గలసి అన్నోన్యతగనుండు గమ్య మేది?

విలువ దిగజారిపోతున్న విద్య యేది?

నేటి నరుని మనస్తత్వ నిజము యేది?

భక్తితోను దేవుని పూజ భజన యేది ? 

విశ్వ మందు వినయమేది వేంకటేశ

***


మానవత్వపు జాడ మంచికి విలువేది? 

గౌరవించు పలుకు గుణము యేది?

నీతి నిజాయతీ నీడ గురుతులేవి?

సంస్కార మును చూపు సంఘ మేది? 

కట్టు బొట్టు నడక కాలము బట్టేది ? 

పడతులు చూపేటి పద్ధతేది?

చదువుల గుడిలోన జయమగు విధ్యేది?

గురువుకు మర్యాద గురుతు యేది?


మనసు శాంతి పర్చు గుణము మార్గ మిమ్ము 

క్షణము నిలువ లేనిది బుద్ధి క్షమయు జూపు 

ప్రణతి నాద బ్రహ్మవునీవు ప్రభలు నీకు 

వినుము వినయ విధేయత వేంకటేశ


గోవిందా... గోవిందా.. గోవిందా


97..గుండెపిండి చేయు వనిత గుర్తు తెలప  హృదయ శ్రీ వేంకటేశ్వరా 


గుండెపిండి చేయు వనిత గుర్తు తెలప 

గొంతుక పిసికేయు కోరిక యగు 

కండరాల బలము కాంచి సౌఖ్యమునిచ్చి 

కసికసి మసిచేయు కఠిన హృదయ శ్రీ వేంకటేశ్వరా  


శ్వాసకోశంబులో శాంతి నిలిపెడిది 

శక్తిని పీల్చుట సరళ హృదయి 

దాసిగా మార్చెడి దాతగా నిలిపేది 

ధైర్యాన్ని పెంచెది ద్వైత హృదయ శ్రీ వేంకటేశ్వరా  


క్షణంలో మార్చిది క్షేమము చూపెడి 

వ్యాధి గ్రస్తునిమార్చు వాక్కు హృదయ శ్రీ వేంకటేశ్వరా  


దయలేని శత్రువుని తరిమితరిమి కొట్టు 

తనువునే కాల్చెడి తపతి హృదయి 

మాయగా వచ్చును మనసునే దోచును 

మార్చెడి మనసుగా మాయ హృదయ శ్రీ వేంకటేశ్వరా  


ప్రాయంబు యందించు ప్రాణములను నిల్పు 

భద్రత గతోడు బంధ హృదయి 

ధూమపానంబును దుష్టబుద్దిని మార్చు 

 రోగికీ సేవిగా తోడు హృదయ శ్రీ వేంకటేశ్వరా  


చీము నెత్తురు త్రావి చింత చేకూర్చెడి 

తీర్పుగా మార్చేటి తిష్ట హృదయి 

పొరుగున సేవనము ప్రోత్సాహ మదిగాను 

భయమునే పోగొట్టు భాగ్య హృదయ శ్రీ వేంకటేశ్వరా  


వగపుతో వయసునే వయ్యార ముగచేసి 

బ్రతుకులో శాంతిగా భవ్య హృదయి

ధనమునే నుపయోగ ధర్మమును నిలుప 

సత్యపు తనువుగా సాధు హృదయ శ్రీ వేంకటేశ్వరా  


ఘనకార్యములుచేయు గమ్యము చూపెడి 

కాయము  బ్రతికించ కామ్య హృదయి 

దురలవాట్లను మర్చి దూరబుద్దిని జేర్చు 

దూరము వెళ్లక దూత హృదయ శ్రీ వేంకటేశ్వరా  


పరువుతో బ్రతుకుటే పాఠము నేర్పుటే 

బ్రతుకునే దిద్దుటే పాల హృదయి 

తెలుసుకొమ్ము నిజంబు తేట తెలుగు నీతి 

తెలివితో మసలుటే చిలిపి హృదయ శ్రీ వేంకటేశ్వరా  


కలతనే మార్చును కానుకయే యిచ్చు 

కలిమితో కదులును కళల హృదయి

పరిశుద్ధునిగ మార్చు పరమ పావనిగను 

శోభితంబుగనులే శోభ హృదయ శ్రీ వేంకటేశ్వరా 


గోవిందా.. గోవిందా.. గోవిందా 


***


98..జీవిత కాలం చాలదు బ్రహ్మము తెలియదు 

గడిచిన సమయం దక్కదు విలువే దొరకదు 

సౌఖ్యము విజయము పొగడ్త  ధ్యేయము పొందుదు 

పిల్లలు భార్య బాధ్యత బరువని ఎరుగదు వేంకటేశ్వరా 


స్వస్థత ఒసగును సంపద, శాంతము  లాభము మరువదు 

ధనమును గడించు కోరిక చేటని పలుకదు 

తెలుగే నేర్చిన సిద్ధులు చెడునని విరియదు 

ధర్మము జ్ఞానము మోక్షము కూర్చునొ తెలుపదు వేంకటేశ్వరా 


భుక్తిని మొదలిడి రక్తిని చివరకు పొసగదు

శక్తిని భక్తిని చేర్చును "రాజబోధ"లను ఎంచదు 

తల్లియు తండ్రియు ఒజ్జయు భిన్నమొ కుదరదు 

వేదము మంత్రము శాస్త్రము స్తోత్రము తర్కము నేర్వరు  వేంకటేశ్వరా 


ఏ హాయి సుఖమనుట -  యేమాయ మనసనుట -  

యే ధ్యాస పిలుపునుట - యే ధర్మ మోనో

 ఏదైన పనియనుట -  యేదైన విలువనుట - 

యేదైన శుభమనుట -    యే సత్య మౌనో వేంకటేశ్వరా 


ఏ రూపు విధి యనుట - యేరూపు కథలనుట - 

యే రూపు సమమనుట - యే న్యాయమౌనో 

ఏపుణ్య సమయమిది - యేపుణ్య సహనమిది - 

యేపుణ్య విలువయిది - యేసర్వ మౌనో వేంకటేశ్వరా 


 గోవిందా... గోవిందా... గోవిందా 

***




100..*మంత్ర పుష్పం*. తెలుగుభావం

   1.

*ఓం ధాతా పురస్తాద్య ముదా జహార*

*శక్రః ప్రవిద్వాన్ ప్రదిశః  చతస్రః*

*తమేవం విద్వానమృతమిహ భవతి*

*నాన్యః పంథా అయనాయ విద్యతే*


అన్ని దిక్కుల నుండి రక్షించు దైవం

బ్రహ్మ ముందుగా పూజించిన దైవం

ఆది దైవమును తెలిసిన చాలును

ఇదే అందరికి అమృత మార్గము 

వేరేది లేదని ఇంద్రుడు ప్రకటించెను

మూలం :వేదం

భావగాన రచన:

 2.

 *సహస్ర శీర్షం దేవం*

*విశ్వాక్షం విశ్వశంభువం*

*విశ్వం నారాయణం దేవం*

 *అక్షరం పరమం పదం*


అంతటా తలలున్న దేవం

అంతటా కనులున్న దైవం

అన్ని లోకాల శుభ  దైవం

విశ్వమంతానిండిన దైవం

నశించని నారాయణుడు

ముక్తి కి పరంధాముడు

  3.

*విశ్వతః పరమాన్నిత్యమ్*

*విశ్వం నారాయణగ్o హరిమ్*

*విశ్వమే వేదం పురుషస్త*

 *ద్విశ్వ ముపజీవతి*

విశ్వము కన్నా ఉన్నతుడు

అందరిలోనుండు ఆత్మ

శాశ్వత పోషకుడు హరి 

సర్వాత్మ పరమాత్ముడు

విశ్వ లోకాల కారకుడు

విశ్వానికి తోడు దైవమే


*మంత్ర పుష్పం -సందర్భం*


 

 4.

*పతిం విశ్వస్యాత్యే శ్వరగ్o*

 *శాశ్వతగ్oశివమచ్యుతమ్*

*నారాయణం మహాజ్ఞ్యేయమ్*

*విశ్వాత్మానం పరాయణం*


పతిలా పోషించువాడు

లోకాలకు ఈశ్వరుడు

శాశ్వితుడు శుభకరుడు

సకల లోక ఉన్నతుడు

సకల జీవ నాయకుడు

అతడు నారాయణుడు

అతడు మహా దేవుడు 

లోకమంత ఆత్మ వాడు

పూజింప తగు దేవుడు


 5.

*నారాయణ పరో*

*జ్యోతి రాత్మా*

 *నారాయణః పరః*

*నారాయణ పరమ్*

*బ్రహ్మ తత్వం*

*నారాయణః పరః*

*నారాయణ పరో*

*ధ్యాతా ధ్యానం*

*నారాయణః పరః*


నారాయణుడే  పరమలోకం

నారాయణుడే జ్యోతిరూపం

 నారాయణుడే ఆత్మ రూపం

నారాయణుడే  పరబ్రహ్మం

నారాయణునే  ధ్యానిoచుము

 6.

 *యచ్చకించి జ్జగత్సర్వం*

 *దృశ్యతే శ్రూయతే౭ పివా*

*అంతర్బహిశ్చ తత్సర్వం*

 *వ్యాప్య నారాయణ స్స్థితః*


చూసేదంతా  వినేదంతా

లోకమంతా  మారేదంతా 

లోనా బైటా వుండేదంతా

పైనా కింద  వుండేదంతా

నారాయణుడే అదంతా

7.& 8

 *అనంతమవ్యయం*

*కవిగ్o సముద్ద్రే౭ న్తమ్*

*విశ్వశంభువం*

*పద్మకోశ ప్రతీకాశగ్o*

*హృదయం చాప్యధోముఖం*


*అధోనిష్ట్యా వితస్యాన్తే* 

*నాభ్యా ముపరి తిష్ఠతి*

*జ్వాలామాలాకులం భాతి*

*విశ్వాస్యా౭యతనం మహత్*


అంతం లేనివాడు

నశించని దేవుడు

అన్ని తెలిసినవాడు

సంసార సాగర హరుడు

సకల జీవుల శుభుడు


మెడకు జానెడు కింద

నాభికి జానెడు పైన

ఎర్ర తామరమొగ్గలా

గుండె వుండును

దిగువకు చూచును

అగ్ని లా ప్రకాశం

అదే ప్రాణ స్థానం


 శ్లో. 9 &10

*సంతతగ్o శిలాభిస్తు*

*లమ్బత్యా కోశ సన్నిభమ్*

*తస్యాంతే సుషిరగ్o సూక్ష్మం*

*తస్మిన్ త్సర్వం ప్రతిష్ఠితమ్*


*తస్యమధ్యే మహానగ్ని*

 *ర్విశ్వార్చి ర్విశ్వతో ముఖః*

*సో ౭ గ్రభుగ్వి భజంతిష్ఠ*

 *న్నాహార మజరః కవిః*

*తిర్యగూర్ధ్వ మధశ్శాయీ*

 *రశ్మయస్తన్య సన్తతా*


అది హృదయ నివాసం

అది నాడినరాల కమలం

అది వేడి వెలుగు ప్రకాశం

అక్కడ చిన్నరంద్రం ఉంది 

అక్కడ అగ్నిసర్వం ఉంది 


అది అనంతం అగ్నిరూపం

అదే విశ్వములోని ప్రకాశం

ఆహారాన్ని విభజించును

అన్నీ వైపులా అందించును

మీదకి కిందకి అందించును

తేజో సంతానము పంపును


 శ్లో.11&12

*సంతాపయతి స్వం దేహ*

 *మాపాద తల మస్తకః* 

*తస్య మధ్యే వహ్ని శిఖా*

 *అణీ యోర్ధ్వా వ్యవస్థితః*


*నీలతో యద మధ్యస్థా*

 *ద్విద్యుల్లేఖే వ భాస్వరా*

*నీవార సూక వత్తన్వీ పీతా*

 *భాస్వత్యణూపమా*


పాదాల నుండి తలవరకు

వేడిసెగలు అందించును

అది మహా అగ్ని చక్రము


మధ్య పుల్లలా నిలచును 

అగ్నిశిఖలతో పైకిచేరును  

ఉన్నత కాంతుల చక్రము 


బియ్యం చివర ములుకంత

అక్కడే  బంగారు ప్రకాశం

మబ్బులో మెరుపు కాంతి


 13.

*తస్యా శ్సిఖాయ మధ్యే*

*పరమాత్మా వ్యవస్థితః*

*స బ్రహ్మ సశివ స్సహరి స్సేన్ద్ర*

*స్సో౭క్షరః పరమస్స్వరాట్*


ఆ అగ్ని పైభాగం మధ్యన

అదే పరమాత్మ నివాసం

అతడే బ్రహ్మ  అతడే శివుడు

అతడే హరి  అతడే ఇంద్రుడు

అతడే నశించని పరమాత్మడు

అతడే నడిపించు పాలకుడు


ఓం ఇది శ్రీ కృష్ణ యజుర్వేదము లోని

తైత్తరీయ అరణ్యక మందు

 పదవ పాఠకమున  

నారాయణ ఉపనిషత్ లో

13వ అనువాకము సమాప్తము.

 14.

 *యో ౭ పాం పుష్పం వేద*

 *పుష్పవాన్ ప్రజావాన్*

 *పశుమాన్ భవతి*

*చన్ద్రమావా అపాం పుష్పం*

 *పుష్పవాన్ ప్రజావాన్*

 *పశుమాన్ భవతి*

*య ఏవంవేద*


ఎవరు నీటిని  పువ్వులని తెలిసేదరో

వారు స్త్రీలు ప్రజలు పశువులు పొందెదరు


ఎవరు చంద్రుడే నీరు పువ్వులని తెలిసెదరో

వారు స్త్రీలు  ప్రజలు పశువులు పొందెదరు 

15.

 *యో౭పామాయతనం*

 *వేద,ఆయతనవాన్ భవతి*

*అగ్నిర్వా అపామాయతనం*

 *వేద,ఆయతనవాన్ భవతి*

*యో ౭ గ్నే రాయతనం వేద*

*ఆయతనవాన్ భవతి*

*అపోవా ఆగ్నేరాయతనం*

*ఆయతనవాన్ భవతి*

*య ఏవంవేద*


ఎవరు నీటి స్థానము తెలిసెదరో

వారు నీటి స్థానము పొందెదరు

ఎవరు నీరే అగ్నికి మూలమని తెలిసెదరో

వారు నిప్పు స్థానము పొందెదరు

ఎవరు నిప్పుకి నీరే ఆధారమని ఎరుగుదురో

వారు నీటి స్థానము పొందెదరు

నీటికి నిప్పు, నిప్పుకి నీరు ఆధారముని ఎరుగుదురో వారే తెలిసినవారు

16

*యో౭పామాయతనం వేద*

*ఆయతనవాన్ భవతి*

*వాయుర్వా అపాం ఆయతనం*

*ఆయతనవాన్ భవతి*

*యోవాయో రాయతనం*

 *ఆయతనవాన్ భవతి*

*అపోవై వాయోరాయతనం*

 *ఆయతనవాన్ భవతి*

*య ఏవంవేద*


 (నీరు = హైడ్రోజన్ గాలి + ఆక్సీజన్ గాలి)


ఎవరు నీటి  నివాస మెరిగెదరో

వారు ఆ నివాసము పొందెదరు 


ఎవరు గాలి నీటిదని తెలిసెదరో

వారు ఆ నివాసము పొందెదరు


ఎవరు గాలి నివాసం ఎరిగెదరో

వారు గాలి నివాసం పొందెదరు


ఎవరు నీరే గాలిదని తెలిసెదరో

వారు ఆ  నివాసం పొందెదరు

 17

*యో౭పామాయతనం వేద*

*ఆయతనవాన్ భవతి*

*అసౌవై తపన్నపా మాయ తనం*

*ఆయతనవాన్ భవతి*

*ఆముష్య తపత ఆయతనంవేద*

*ఆయతనవాన్ భవతి*

*అపోవా ఆముష్య తపత*

 *ఆయతనం ఆయతనవాన్ భవతి*

*య ఏవంవేద*


( హైడ్రోజన్ + ఆక్సీజన్ = 💥🔥+నీరు)


ఎవరు నీటి నివాస మెరిగెదరో

వారు ఆ నివాసము పొందెదరు


సూర్య తేజో నివాస మెరిగెదరో

వారు ఆ నివాసము పొందెదరు


నీరు జ్వాలల  బంధ మెరిగెదరో

వారు ఆ నివాసము పొందెదరు


18

*యో౭పామాయతనం వేద*

*ఆయతనవాన్ భవతి*

*చన్ద్రమా వా అపామాయతనం*

*ఆయతనవాన్ భవతి*

*యశ్చన్ద్ర మసఆయతనం*

*వేద ఆయతనవాన్ భవతి*

*అపోవై చన్ద్రమస ఆయతనం*

*ఆయతనవాన్ భవతి*

*య ఏవంవేద*


ఎవరు నీటి నివాస మెరిగెదరో

వారు ఆ నివాసము పొందెదరు

నీరు చంద్రుని దని  తెలిసెదరో

వారు ఆ నివాసము పొందెదరు

ఎవరు చంద్ర నివాస మెరిగెదరో

వారు ఆ నివాసము పొందెదరు

నీరుచంద్రుల నివాస మెరిగెదరో

వారు ఆ నివాసము పొందెదరు


 23

*కిం తద్విష్ణోర్బల మాహుః*

*కా దీప్తిః కిం పరాయణం*

*ఏకొ యధ్ధారాయ ద్దేవః*

*రేజతీ రోదసీ ఉభౌ*


ఈ భూమిని ఈ ఆకాశంని 

విష్ణువే భరించు దైవము

అంత బలం ఎలా పొందెను?

ఏది అందుకు కారణం?


24.

 *వాతాద్విష్ణోర్బల మాహుః*

 *అక్షరాదీప్తిః రుచ్యతే*

*త్రిపధా ద్దారయః ద్దేవః*

*యద్విష్ణో రేక ముత్తమమ్*


వాయువు  బలం కారణం

శాశ్వతం నుండి ప్రకాశం

త్రిపాద విభూతుల నుండి

ఈ లోకం  పరలోకం రెండూ

అందరి కన్న ఉత్తమదైవం

శ్రీ మహావిష్ణువు పొందెను


25.

 *రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే*

*నమోవై యం వై శ్రవణాయ కుర్మహే*

*సమే కామాన్ కామకామాయ*

 *మహ్యం కామేశ్వరో వై శ్రావణౌ*

 *దధాతు కుబేరాయవై శ్రవణాయ*

*మహారాజాయ నమః*


ఆయనే రాజాధి రాజ దేవం

పరులకు లాభాలిచ్చు దైవం

మహా వైశ్రవణునకు వందనం

సకల కోరికల తీర్చు దైవం

మా కోరికలన్ని తీర్చునోయి

అతడే కుబేరుడు వైశ్రవణుడు

ఆ మహారాజుకు వందనం

19.


 *యో౭పామాయతనం వేద*

*ఆయతనవాన్ భవతి*

*నక్షత్రాణివా అపామాయతనం*

*ఆయతనవాన్ భవతి*

*యో నక్షత్రాణా మాయతనం వేద*

*ఆయతనవాన్ భవతి*

*అపోవై నక్షత్రాణా మాయతనం*

*ఆయతనవాన్ భవతి*

*య ఏవంవేద*


ఎవరు నీటి నివాసం తెలిసెదరో 

వారు ఆ నివాసము పొందెదరు

నక్షత్రాలకు నీరు నివాసమని

నీటికి నక్షత్రాలు నివాసమని


నీరు, తారల నివాసాలు తెలిసే

వారు ఆ నివాసము పొందెదరు

 20.


*యో౭పామాయతనం వేద*

*ఆయతనవాన్ భవతి*

*పర్జన్యో వా అపామాయతనం*

*ఆయతనవాన్ భవతి*

*యః పర్జన్యస్యాయతనం*

 *ఆయతనవాన్ భవతి*

*అపోవై పర్జన్య స్యాయతనంవేద* *ఆయతనవాన్ భవతి*

*య ఏవంవేద*


ఎవరు నీటి నివాసమెరిగెదరో

వారు ఆ నివాసం పొందెదరు


మబ్బులు నీరునివాసమని తెలిసే

వారు ఆ నివాసం పొందెదరు


మబ్బు నీరుల నివాసం తెలిసే  

వారు ఆ నివాసం పొందెదరు


  21

*యో౭పామాయతనం వేద*

*ఆయతనవాన్ భవతి*

*సంవత్సరో వా అపామాయతనం*

*ఆయతనవాన్ భవతి*

*యస్సంవత్సరస్యాయతనం వేద*

*ఆయతనవాన్ భవతి

అపోవై* *సంవత్సరస్యాయతనం*

*ఆయతనవాన్ భవతి*

*య ఏవంవేద*


ఎవరు నీటి నివాసమెరిగెదరో

వారు ఆ నివాసం పొందెదరు


నీరు సంవత్సర నివాసమని తెలిసే 

వారు ఆ నివాసం పొందెదరు


సంవత్సరం నీరు నివాసమని తెలిసే 

వారు ఆ నివాసం పొందెదరు

నీరు ,సంవత్సరాల నివాస తెలిసే

వారు ఆ నివాసం పొందెదరు


 26.

*ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు,*

 *ఓం తదాత్మా

ఓం తత్సత్యమ్*

*ఓం తత్సర్వం , ఓం తత్పురోమ్ నమః*


అతడే బ్రహ్మం అతడే వాయువు

అతడే సత్యం  అతడే ఆత్మ

అతడే సర్వం  అతడే ఆదిదైవం

 

27.

 *అన్తశ్చరతి భూతేషు*

 *గుహాయామ్ విశ్వమూర్తిషు*


జీవులలోవున్న దైవం

బయట వున్న దైవం

తెలియవలసిన దైవం 

విశ్వమంతా వున్న దైవం

 

28.

*త్వం యజ్ఞ్యస్త్వం* 

*వషట్కారస్త్వం మిన్ద్రస్తగ్o*

 *రుద్రస్త్వం విష్ణుస్త్వం*

 *బ్రహ్మత్వం ప్రజాపతిః*

*త్వం తదాప ఆపొజ్యోతీ*

 *రసో ౭ మృతం*

*బ్రహ్మ భూర్భువస్సువరోమ్*


నీవే యాగం  యాగమంత్రము

నీవే విష్ణువు బ్రహ్మ ఇంద్రుడవు

నీవే  జలం తేజము రసము

నీవే శాశ్వతం విశ్వరూపము

నీవే ఓంకారం బ్రహ్మరూపము

  29.

 *ఈశాన స్సర్వ విద్యానా మీశ్వర*

 *స్సర్వభూతానామ్ బ్రహ్మధిపతిర్*

*బ్రహ్మణో ౭ ధిపతిర్ బ్రహ్మశివోమే*

*అస్తు సదా శివోమ్*


సకల విద్యలకు ఈస్వరుడవు

సకల జీవులకు ఈస్వరుడవు

నీవే బ్రహ్మకు  యజమానివి

నీవే బ్రాహ్మల యజమానివి

నీవే బ్రహ్మం సదాశివుడవు

 

30.

*తద్విష్ణో పరమం పదగ్o*

*సదా పశ్యన్తి సూరయః*

*దివీవ చక్షు రాతతమ్*


విష్ణులోకమే పరమ పధం

జ్ఞానులు సదా చూసే లోకం 

ఆకాశమంతా చూసే లోకం


  31.

*తద్విప్రాసో విపన్వవో*

 *జాగృవాం స్సమిన్దతే*

*విష్ణోర్య త్పరమం పదమ్*


కోరికలు దోషాలు లేని వారు

జాగృతి చలనాలు కలవారు

విష్ణులోక కాంతులు పెంచేరు

పరలోక ప్రకాశము పెంచేరు


  32.

*ఋతగ్o సత్యం పరమ్బ్రహ్మ*

*పురుషం కృష్ణ పింగళమ్*

*ఊర్ధ్వరేతమ్ విరూపాక్షం*

*విశ్వరూపాయ వై నమో నమః*


ముక్తినాధుడు సత్యరూపుడు

బ్రహ్మ రూపుడు నల్లనివాడు

పైకి వెలుగు  తేజోవంతుడు

విరూపనేత్రం విశ్వరూపుడు

దేవదేవునకు మరల వందనం


 33.

 *నారాయణాయ విద్మహే*

 *వాసుదేవాయ ధీమహి*

*తన్నో విష్ణు ప్రచోదయాత్*


నారాయణుని ఉహించెదను

వాసుదేవుని ధ్యానించెదను

విష్ణు చైతన్యము కలుగుగాక

34

*ఆకాశ త్పతితం తోయమ్*

 *యథా గచ్ఛతి సాగరం*

*సర్వదేవ నమస్కారః*

*కేశవమ్ ప్రతి గచ్ఛతి*


ఆకాశ మబ్బుల నీరు

ఎలా సాగరమే చేరునో

సకలదేవ వందనాలు

పరమాత్మనే చేరును


మంత్రపుష్పం సంపూర్ణం

సర్వం భగవదర్పణం స్వాహా.

***


99..ప్రళయపయోధిజలే ధృతవానసి వేదం
విహితవహిత్రచరిత్రమఖేదం
కేశవ ధృతమీనశరీర జయ జగదీశ హరే  ౧

క్షితిరతివిపులతరే తవ తిష్ఠతి పృష్ఠే
ధరణిధరణకిణచక్రగరిష్ఠే
కేశవ ధృతకచ్ఛపరూప జయ జగదీశ హరే  ౨

వసతి దశనశిఖరే ధరణీ తవ లగ్నా
శశిని కళంకకలేవ నిమగ్నా
కేశవ ధృతసూకరరూప జయ జగదీశ హరే  ౩

తవ కరకమలవరే నఖమద్భుతశృంగం
దళితహిరణ్యకశిపుతనుభృంగం
కేశవ ధృతనరహరిరూప జయ జగదీశ హరే  ౪

ఛలయసి విక్రమణే బలిమద్భుతవామన
పదనఖనీరజనితజనపావన
కేశవ ధృతవామనరూప జయ జగదీశ హరే  ౫

క్షత్రియరుధిరమయే జగదపగతపాపం
స్నపయసి పయసి శమితభవతాపం
కేశవ ధృతభృఘుపతిరూప జయ జగదీశ హరే  ౬

వితరసి దిక్షు రణే దిక్పతికమనీయం
దశముఖమౌళిబలిం రమణీయం
కేశవ ధృతరామశరీర జయ జగదీశ హరే  ౭

వహసి వపుషి విశదే వసనం జలదాభం
హలహతిభీతిమిళితయమునాభం
కేశవ ధృతహలధరరూప జయ జగదీశ హరే  ౮

నిందతి యజ్ఞవిధేరహహ శ్రుతిజాతం
సదయహృదయదర్శితపశుఘాతం
కేశవ ధృతబుద్ధశరీర జయ జగదీశ హరే  ౯

మ్లేచ్ఛనివహనిధనే కలయసి కరవాలం
ధూమకేతుమివ కిమపి కరాలం
కేశవ ధృతకల్కిశరీర జయ జగదీశ హరే  ౧౦

శ్రీజయదేవకవేరిదముదితముదారం
శృణు సుఖదం శుభదం భవసారం
కేశవ ధృతదశవిధరూప జయ జగదీశ హరే

*****
🌼96..*శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం*🌼🌿

నారాయణం పరబ్రహ్మం సర్వ కారణకారణం |
ప్రపద్యే వేంకటేశాక్యం తదేవ కవచం మమ ||

సహస్ర శ్రీర్షా పురుషో వేంకటేశ శ్శిరోవతు|
ప్రాణేశః ప్రాణ నిలయః ప్రాణం రక్షతు మే హరి ||

ఆకాశరాట్ సుతానాధ ఆత్మానం మే సదా (అ)వతు |
దేవ దేవోత్తమః పాయాద్ దేహం మే వేంకటేశ్వరః ||

సర్వత్ర సర్వ కాలేషు మంగాంబాజానిరీశ్వరః |
పాలయే న్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు ||

ఫల శృతి:

య యేతద్ వజ్రకవచ మభేద్యం వేంకటేశితుః |
సాయం ప్రాతః పఠే న్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ||

"వేంకట వజ్ర కవచస్తోత్రం" మార్కండేయ మహర్షి చెప్పిందని ప్రసిద్ధి. ఈ స్తోత్రం లో నాల్గు శ్లోకాలు 'నన్ను రక్షించు గాక ' అని అర్ధం వచ్చేవి. చివరి ఒక్కశ్లోకం ' ఫల శృతి' రూపమైనది. మొత్తం ఐదు శ్లోకాలు.

భావం :-
1.  శ్రీ వేంకటేశ్వరుడు సాక్షాన్నారాయణుడు. పరబ్రహ్మ, సర్వకారణాలకూ కారణము తానే అయినవాడు. కనుక అట్టి శ్రీవేంకటేశ్వరుణ్ణి నేను శరణు పొందుతున్నాను. శ్రీ వేంకటేశ్వరుని పేరే (ఆ స్వామిని స్మరించుటే) నాకు భద్రకవచమై రక్షించుగాక !

2.  వేయి తలలు - అంటే అనంతమైన శిరసులు కల పరమాత్ముడైన వేంకటేశుడు నా శిరస్సును రక్షించుగాక! సకల ప్రాణుల ప్రాణాలకు ప్రభువూ, అందరి ప్రాణాలకు నిలయుడూ అయిన ఆ శ్రీహరి నా ప్రాణాన్ని రక్షించుగాక !

3. ఆకాశరాజుకూతురు పత్మావతికి భర్త అయిన వేంకటేశుడు నా ఆత్మను (నన్ను) సదా కాపాడుగాక ! దేవదేవోత్తముడైన వేంకటేశ్వరుడు ఈ నా దేహాన్ని కాపాడుగాక !

4. అలమేలుమంగమ్మపతి అన్నిటికీ ప్రభువూ అయిన వేంకటేశ్వరుడు అన్ని చోట్లా, అన్ని కాలాలలో నా సత్కర్మల నన్నింటిని రక్షించి వాటిల్ని సఫలం చేయుగాక !

ఫలశృతి భావం:-
ఈ వేంకటేశ్వరవజ్రకవచ స్తోత్రం అభేద్యమైనది. ఉదయం, సాయంకాలం ప్రతిదినమూ భక్తితో పఠించేవాళ్ళు మృత్యుభయం లేకుండా ఆనందంగా ఉంటారు.

లఘు వివరణ:-
కవచమంటే శరీరాన్ని రక్షించే సాధనం. అది వజ్రంతో తయారయిందంటే ఇక దేనిచేతనూ దెబ్బతినకుండా కాపాడుతుంది. ఈ వేంకటేశ్వరవజ్రకవచస్తోత్రం భక్తులపాలిటికి వజ్రకవచమై వాళ్ళను కాపాడుతుంది. శ్రీస్వామివారిని శరణు పొంది, ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో, శ్రద్ధతో పఠించే వాళ్ళు అన్ని ఆపదలనుండీ, శారీరకంగానూ, మానసికంగానూ రక్షింపబడతారు. మృత్యుభయం లేకుండా హాయిగా వుంటారు .

🌼🌿ఓం నమో వేంకటేశాయ🌼🌿


🙏🌹🙏🌹🙏#శ్రీ_వేంకటేశ్వర_సుప్రభాతం 


కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ।


ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ॥ 1 ॥


ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ।


ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥


మాతస్సమస్త జగతాం మధుకైటభారేః


వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే ।


శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే


శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం ॥ 3 ॥


తవ సుప్రభాతమరవింద లోచనే


భవతు ప్రసన్నముఖ చంద్రమండలే ।


విధి శంకరేంద్ర వనితాభిరర్చితే


వృశ శైలనాథ దయితే దయానిధే ॥ 4 ॥


అత్ర్యాది సప్త ఋషయస్సముపాస్య సంధ్యాం


ఆకాశ సింధు కమలాని మనోహరాణి ।


ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః


శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 5 ॥


పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః


త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి ।


భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్


శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 6 ॥


ఈశత్-ప్రఫుల్ల సరసీరుహ నారికేళ


పూగద్రుమాది సుమనోహర పాలికానాం ।


ఆవాతి మందమనిలః సహదివ్య గంధైః


శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 7 ॥


ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంజరస్థాః


పాత్రావసిష్ట కదలీ ఫల పాయసాని ।


భుక్త్వాః సలీల మథకేళి శుకాః పఠంతి


శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 8 ॥


తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా


గాయత్యనంత చరితం తవ నారదోఽపి ।


భాషా సమగ్ర మసత్-కృతచారు రమ్యం


శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 9 ॥


భృంగావళీ చ మకరంద రసాను విద్ధ


ఝుంకారగీత నినదైః సహసేవనాయ ।


నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః


శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 10 ॥


యోషాగణేన వరదధ్ని విమథ్యమానే


ఘోషాలయేషు దధిమంథన తీవ్రఘోషాః ।


రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః


శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 11 ॥


పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః


హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యాః ।


భేరీ నినాదమివ భిభ్రతి తీవ్రనాదం


శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 12 ॥


శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో


శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో ।


శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే


శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 13 ॥


శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః


శ్రేయార్థినో హరవిరించి సనందనాద్యాః ।


ద్వారే వసంతి వరనేత్ర హతోత్త మాంగాః


శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 14 ॥


శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి


నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ।


ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి


శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 15 ॥


సేవాపరాః శివ సురేశ కృశానుధర్మ


రక్షోంబునాథ పవమాన ధనాధి నాథాః ।


బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః


శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 16 ॥


ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ


నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః ।


స్వస్వాధికార మహిమాధిక మర్థయంతే


శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 17 ॥


సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి


స్వర్భానుకేతు దివిశత్-పరిశత్-ప్రధానాః ।


త్వద్దాసదాస చరమావధి దాసదాసాః


శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 18 ॥


తత్-పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః


స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః ।


కల్పాగమా కలనయాఽఽకులతాం లభంతే


శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 19 ॥


త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః


స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః ।


మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే


శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 20 ॥


శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్దే


దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే ।


శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే


శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 21 ॥


శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ


వైకుంఠ మాధవ జనార్ధన చక్రపాణే ।


శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత


శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 22 ॥


కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే


కాంతా కుచాంబురుహ కుట్మల లోలదృష్టే ।


కల్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే


శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 23 ॥


మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్


స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర ।


శేషాంశరామ యదునందన కల్కిరూప


శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 24 ॥


ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం


దివ్యం వియత్సరితు హేమఘటేషు పూర్ణం ।


ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః


తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతం ॥ 25 ॥


భాస్వానుదేతి వికచాని సరోరుహాణి


సంపూరయంతి నినదైః కకుభో విహంగాః ।


శ్రీవైష్ణవాః సతత మర్థిత మంగళాస్తే


ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతం ॥ 26 ॥


బ్రహ్మాదయా స్సురవరా స్సమహర్షయస్తే


సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః ।


ధామాంతికే తవ హి మంగళ వస్తు హస్తాః


శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 27 ॥


లక్శ్మీనివాస నిరవద్య గుణైక సింధో


సంసారసాగర సముత్తరణైక సేతో ।


వేదాంత వేద్య నిజవైభవ భక్త భోగ్య


శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 28 ॥


ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం


యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః ।


తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం


ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే ॥ 29 ॥



వేదాల్లో చెప్పబడిన...గణపతి తాళం👍💐💐


ఈ స్తోత్రం పాడినా, విన్నా తక్షణ ఫలితమేమంటే  ఆ స్థలంలో ప్రతికూల ప్రకంపనల(negative vibrations)ను తొలగించి, శ్రేయస్సును, సంతోషాన్ని ఇస్తుందీ స్తోత్రం.


వికటోథ్కట సుందర తంధి ముఖం | 

భుజ కేంద్రసుసర్ప గాధాభరణం ||


గజ నీల గజేంద్ర గణాధిపథిమ్ | 

ప్రణతోస్మి వినాయక హాస్తి ముఖం ||


సుర సుర గణపతి సుంధర కేశం | 

ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం ||


భవ భవ గణపతి పద్మ శరీరం | 

జయ జయ గణపతి దివ్య నమస్తే ||


గజ ముఖ వక్త్రమ్ గిరిజా పుత్రం | 

గణ గుణ మిత్రం గణపతి నిశప్రియం ||


కరద్రుత పరశుమ్ కంగణ పానిం కపలిత పద్మ రుచిం | సురపతి వంధ్యం సుందర డక్తం సుందరచిత మని మకుటం ||

ప్రాణమత దేహం ప్రకటిత కాలం షట్గిరి  తాళం ఇధం, తత్ షట్గిరి తాళం ఇధం తత్ షట్గిరి తాళం ఇధం |

లంభోధర వర కుంజా సురకృత కుంకుమ వర్ణ ధరం | శ్వేతస శృంకం మోధక హస్తం ప్రీతిన పనసఫలం ||

నయనత్రయ వర నాగ విభూషిత నా నా గణపతితం, తతం నయనత్రయ వర నాగ విభూషిత నా నా గణపతితం తతం నా నా గణపతితం, తతం నా నా గణపతితం, తతం నా నా గణపతితం ||


ధవలిథ జల ధర ధవలిథ చంద్రం ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం | తను తను విషహర శూల కపాలం హర హర శివశివ గణపతి మభయం, ధవలిథ జల ధర ధవలిథ చంద్రం ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం | తను తను విషహర శూల కపాలం హర హర శివశివ గణపతి మభయం ||


కట తట వికలిత మత జల జలజిత గణపతి వాధ్యమ్ ఇధం | కట తట వికలిత మత జల జలజిత గణపతి వాధ్యమ్ ఇధం తత్ తత్ గణపతి వాధ్యమ్ ఇధం, తత్ తత్ గణపతి వాధ్యమ్ ఇధం ||


థక తకిట థక తకిట థక తకిట తతోం, శశి కలిత శశి కలిత మౌళినం శులినమ్ |

థక తకిట థక తకిట థక తకిట తతోం, విమల శుభ  కమల జల పాధుకం పానీనం |

ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట త తోం, ప్రమధ గణ గుణ కచిత శోభనం శొభితం |

ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట త తోం, మ్రిథుల భుజ సరసి జభి షానకం పోషణం |

థక తకిట థక తకిట థక తకిట తతోం, పనస ఫల కధలి ఫల మొధనం మోధకం |

ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట తతోం, ప్రమధ గురు శివ తనయ గణపతి తాళనం |

గణపతి తాళనం ! గణపతి తాళనం !!..