నాలో నీవు .. నీలో నేను కథానిక.. (1 ) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ
అంబరానన మేఘ మాలలు ఆద మర్వక వేగమై, సంబరమ్ముగ వాన జల్లులు సాక్షి వెల్లువ ఎక్కువై, చుంబ నమ్ముల చల్ల దారియు చూప గల్గిన, పంబ రేగిన వర్షపాతము పాడు చేసెడి బుద్ధిగా, అలా సాగేను రంగులు మార్చు కుంటూ మేఘాలు గగన మందు విహారము చేయగా గాలి తోడైనది.
ఉదయ వేళన సాగు కామ్యము ఉజ్వలమ్మగు, దారి తెన్నులు తెలియక, జనులు ఆహారము లేక, ఉప్పెనలా వచ్చి పడుతున్న, వరద ధాటికి తట్టు కోలేక భయం గుప్పెట్టిన చిక్కి హా హా కారాలు చేయగా , వింజామరములు వీచి నట్లుగా, చెట్లు కొమ్మలు గాలిలో ఎగురుతూ స్వారీ చేయు చుండెను, అదే సమయాన న్యాయవాది (జైలర్) రామారావు, ప్రాంజలి ప్రభ సేవా సంఘ అధ్యక్షుడు హనుమంతుడు (అందరిదృష్టిలో ఆపద్భా0ధవుడు నిత్యా రామ నామము రాగ సేవ తత్పరుడు) తోటలో చిక్కగా ఒక చెట్టు నీడన చేరగా చెట్టు కొమ్మ విరిగి పడే సమయాన హనుమంతుడు అడ్డుకొని రక్షణ దిశగా ఇద్దరు ప్రక్కన ఉన్న భవన సముదాయమును చేరిరి.
మనసు కొలనులోన మనసును కనలేను, తామర పత్రము థలుకు బెలుకు లా ఆదుకున్న వాడివి, తపము, జపము తోనున్న నాకు రక్షగా నీ లక్ష్యము నిర్వహించావు, తీర్చలేను నీ ఋణమును, పలుకు లన్ని వాన చినుకుల మధ్య కలసి పోయి, బ్రతుకు తెరువు అంటూ కదలిక
మధ్యన, కీలక మగుటయే, వర్షమునకు చిక్కి, పెదవుల మధువులు హృదయ స్పందన హాయి గొలుపు నట్లు నీతోడు భావన ప్రేమయే భాగ్యరేఖ అన్నాడు రామారావు.
సన్నజాజి థలుకు సమయ మందు, సన్నాయి రాగము సరపడ నీయని, కనలేని కష్టము కామ్య మిదియు, తన్మయ మిది, తాపము తారుమారు, తత్వముయిది సృష్టి మలుపు, సంతృప్తి జీవితం వాన వళ్ళ కొద్ధి ఆటంకమే అన్నారు హనుమంతరావు
ఇంకా వుంది..(2 )
ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
*నాలో నీవు .. నీలో నేను కధానిక.. (2 ) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ
మేలి ముసుగులో మేలిమి బంగారం, కలువ పువ్వులా వికసించింది సూర్య బింబము, తీవ్రమైన కాంతి కిరణాలు తెల్లటి మంచుని కరిగించి, సౌందర్యం కనులెత్తి చూసి కొంటెగా నవ్వింది
గుండెల్లో కళలు నింపే వెలుతురులో ప్రేమ గంట మ్రోగించిందిలా కల కల లాడుతూ పచ్చతోరణమై నిలిచింది, కోయల కూత ఆరంభమైనది
కొండ వాగులు గలగల పారుచు నవ్వులే నవ్వులు, నిండు జలములు నిలిచిపోక కదలిక సాగుతున్నది, పుష్పరాజము సంతసమ్ముగా కదలికలు చూపుచున్నది.
గుసగుసగా ముసిముసిగా నవ్వుల పువ్వుల వనితలు శృతి గా లయగా అల్లరిగా పల్లవి గా, ఆశగా శ్వాసగా గీతా లాపము మొదలైనది. కాంతి, శాంతి మంత్రము మాయచూపి చిత్త మంతా చిత్తు చేసి, మోహ మాయలో ముంచేసి, ఏమి తెలియనిదానిలా కదిలింది
తోటలో యదావిధిగా నడవ కుండా పరిగెత్తుతూ వయసు కూడా గుర్తించకనే హనుమంతరావు, అక్కడ వున్నా కొందరితో కలసి పాడు తుంటున్నాడు, అప్పుడే రామారావు వస్తూనే చూస్తున్నాడు, అక్కడ ఉన్న అంబేత్కర్ విగ్రహము వద్దకు చేరారు అందరు పుష్పమాలలవుట్ అలంకరించారు కొందరు. తప్పెట వాయిస్తూ భావాలు తెలిపారు నినాదాలతో మారుమోగింది స్థానిక మంత్రుల కోలాహలం ఏర్పడింది రక్షక భటుల వలయం అక్కడ అందరికి రక్షణగా యున్నది. ఒకతను మైకు పట్టుకొని పద్యం పడుతున్నాడు అంబేత్కర్ గురించి
ఉ.యోధుడు ధర్మరక్షకుడు యోగ్యత వెల్గులు పంచు ధీరుడే
సాధువు దీక్ష కంకణుడు సాధన శోధన బీద విద్య కో
రే ధవుడే మనో నియమ రాజ్యపు రక్షణ దీక్ష సహాయ మూ
ర్తీ దయ విశ్వ విద్య యను దీనుల సేవల లక్ష్యమేనుగా
అప్పుడే అవేశము ఆపుకోలేక హనుమంతుడు అంబేత్కర్ గురించి గజల్ వినిపించాడు
నావెనుకే ఉంటివనే యోచనలే అంబేత్కర్
నీఊపిరి సోకినదను భావనయే అంబేత్కర్
నిలువెత్తున వెంటాడుతు నను వదలదు నీ రూపం
దూరమాయె మనసులోని వేదనలే అంబేత్కర్
ఏ చోటను నీవున్నా మాలో నీ రూపమ్ము
హృదయ వీణ తంత్రి మీటు రాగములే అంబేత్కర్
రాజ్యాంగం నేతగా మామేలు యినుమడించె
ప్రేమరాగ సుధలొలుకగ సంతసమే అంబేత్కర్
నిండుగున్న పున్నమిలో వెన్నెలొలుకు చంద్రునిగా
నీదు చెలిమి వలన కలిగె సంబరమే అంబేత్కర్
నా కన్నుల లోగిలిలో హరివిల్లుల వర్ణాలే
నిను వరించి నిలువరించు సయ్యాటలే అంబేత్కర్
మనోరథపు వేగానికి కళ్ళెమేసె అంబేత్కర్
మనస్సాక్షి కోరుకున్న పరిణయమే అంబేత్కర్
......
అందరు ఆనందంగా కరతళ ధ్వనులు మారుమ్రోగినాయ
ఇంకా వుంది .. (త్రీ)
ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
.....
*నాలో నీవు .. నీలో నేను కథానిక.. (3 ) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ
ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
*నాలో నీవు .. నీలో నేను కథానిక.. (4) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ
నేను ఒక ప్రత్యేక తరానికి చెందిన వాన్ని. మన చెలిమి వల్ల అనుభవాలు మరొక్కసారి గుర్తు చేసుకుందాం, చల్లగా కూర్చో చెపుతాను అంటూ రామారావు
చాలా సాధారణ స్థాయి బళ్ళో అనగా తెలుగు భాషలో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు.
నేను చదువు తప్ప నేను చూడలేదు వేరెవ్వరిని, కన్ను మిన్ను కాన రాక శక్తి ని దుర్విని యోగము చేయలేదు, విశ్వాస ముంచి కష్ట పడ్డాను, ఒక్కోసారి కొత్తగా మలిచిన రెక్కల సిద్ది, ఒక్కోసారి ఆకాశం మది నడవాలని బుద్ధి, ఒక్కోసారి ఆశయా లన్ని బతకాలని సిద్ది, ఒక్కోసారి మనోభవము కధలల్లెడి బుద్ధి.
విధి వాంఛలే ప్రాణ నమ్మకమ్మని, చిరు హాసమే కాల నిర్ణయమ్మని, మది భావమే సేవ లక్షణమ్మని నమ్మిన వాడిని. నడిచే దారిలో నవరత్నాలు వున్నా చూడలేదు, తలచే ప్రతి నిముషము చదువుపై తన్మయ భావముండేది, కర్తవ్యమేధర్మమని తలంచేవాడిని.
ఆంగ్ల మాధ్యమంలో చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము. లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము.
పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న *సామాజిక -ఆర్థిక* పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి.
సీ:: నువ్వుల హృదయము నవనీత మయము గా మారియు ప్రేరణతో ను ఉండు
నవ్వుల వల్లనే ఆరోగ్య మంతయు మార్పులు చేర్పులు జరుగు చుండు
సంభాషణల మధ్య జరిగే టి విషయము విన్నను నవ్వులు వచ్చి తీరు
వింత వేషము చూసి మనసును ఉంచక వేంటనే తెల్పి యు నవ్వు చుండు
ఆ:: చెప్పి నంత మాట నవ్వులు విరజిమ్మి, హాయి బతుకు వెల్ల బుచ్చు చుండు
చెప్ప లేని మాట విన్న ను చెప్పుతూ, హాస్య మంత కుమ్మరించి ఉండే
నీలినింగి నిగలలో నక్షత్ర, రవ్వవై శ్వాస రమ్యతయగు, శ్వేత హంస యగుట స్వేచ్ఛ బ్రతుకు,అలా నవ్వుకుంటూ సాగింది ఆనాటి కధ
ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఉంటి లోకమందె గాని యీ లోకమన్న బ్రీతి నాకు లేదు, లోకమందు నడచి వెళ్లితినే గాని వస్తు వేది కొనెడి వాంఛ లేదు. మనసుతో నేను ప్రయాణము చేసిన రోజులెన్నో చెప్పినా చెప్పకపోయినా నామనసు వెతుకుతూ వుంటుంది, బ్రతికి బ్రతుకున రుచి చూసి, బ్రతికిం చాలనియే, యుంటినీ, కొంచె మైనను గూడ విశ్రాంతి ఎరుగను, ఎల్లరకు నైన వాడనే సహాయ స్పృహ గలిగిన వాడిని, శూన్యహస్తములతోనె, గోడపై గనబడు వట్టి నీడ నేను, అయినా నిదానముగా విలువలను పెంచితిని, ఎవ్వరికి కంటకమ్మును మాత్రము కాను నేను
శ్లో.యుక్తి యుక్తం వచోగ్రాహ్యం బాలాదపి సుభాషితమ్ ,
వచనం తత్తు నగ్రాహ్యం అయుక్తం తు బృహస్పతేః.
తా.లోకము మెచ్చునట్టి మాటను, బాలుడు చెప్పినను గ్రహింపవలెను. లోకములో సరిపడని మాటలను బృహస్పతి చెప్పినను గ్రహింపరాదు.
అప్పుడే హనుమంతుడు అవునండి కాలం మనతోనే ప్రారంభం కాలేదు. మన ముందు ఎందరో గొప్పగా బతికారు. ఎక్కడికక్కడ ఎలా అడ్డంకుల్ని అధిగమించి వెళ్ళాలో జీవించి మనకు ఒక దారి చూపించారు. ధైర్యం ఉంది. భయం లేదు.. అలా ముందుకు వెళ్ళి పోదాం మన బుద్ధికుశలతతో అక్కడ మనకు ఎదురయ్యే ఆటంకాలను, అవరోధాలను పరిష్కరించి, మార్గాన్ని ఎలా సుగమం చేసుకున్నా మంటే రాబోయే తరాలకు మనము కూడా ఆదర్శాలమవుతా కదా రామారావు.
అవును మానవజాతి మొత్తం తరించిపోవడానికి ఆ దారి ఒక్కటి చాలు, కథలున్నాయి. గాధలున్నాయి. కావ్యాలున్నాయి. ప్రబంధాలున్నాయి. పురాణాలున్నాయి. శతకాలున్నాయి. నీతులున్నాయి. ధర్మాలున్నాయి. మనిషి ఎలా బతకాలో, ఇతరులను ఎలా బతికించాలో తెలిపే ధర్మసూక్ష్మాలున్నాయి. మన ఊపిరి మాతృ దేశ,మాతృభూమి, మాతృభాష వారసత్వాన్నే మన సంపదగా అందుకోవాలి.
అపూర్వ: కోపి కోషోsయం .. విద్యతే తవ భారతి ౹
వ్యయతో వృద్ధిమాయాతి ... క్షయమాయాతి సంచయాత్ ౹౹
దేవి విద్యాభారతి నీ ఈ జ్ఞాన కోసము అపూర్వమైనది.దీన్ని ఉపయోగించినంతగా అభివృద్ధి అవుతోనే ఉంటుంది.అలాగే,సంగ్రహించినంతా క్షీణిస్తుంది
*నాలో నీవు .. నీలో నేను కథానిక.. (6) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ
ఆతోటలో ఎందరో మహానుహవులు విశ్రాంతి తీసుకుంటున్నారు, వారిలో ఒక సన్యాసి మంచి మంచి విషయాలు చెపుతూ గంతులేస్తూపడుతున్నాడు, రక్షకభటులు ఆపుదామని వచ్చారు, అక్కడ వున్నా జనులు వాక్ స్వాతంత్రయాన్నీ హరించకండి అనగా ప్రేక్షలకుగా చూస్తూవున్నారు వారు . పిల్లలు పెద్దలు చూస్తున్నారు, అక్కడికి రామారావు హనుమంతుచేరారు. చెప్పే విషయాలు వింటున్నారు.
మారాలి మారాలి ఈలోకం, దేహం రాచపుండుగా మారినా గుర్తించరు, ప్రజాహంతకులు కళ్ళ ముందు తిరుగుతున్నా పాటించుకోరు, నేరసామ్రాజ్యాన్నిఎన్నుకున్నారు, దివాణం సొమ్ము కాజేసిన పట్టించుకోలేరు, చెదలకు మందు, చెడు ఆలోచనకుమందు, మంచికి పొందు,
దుర్మార్గుల చిందు, మరి ఘోరంగా మారుతుతున్నది, రోగం లేనివారికి రాగం, ఉన్నవాడికి ధనం పిండుకొనే రోగం, మనుష్యులకు సగం మందులని ఆరోగ్యం పాడుచేసే లోకం, సన్మార్గుల పొందు, మనల్ని రక్షించడంలో దేవుడు లేక ప్రకృతి అలక్ష్యం చేయదు. ప్రకృతో దేవుడో ఎవరైతేనేం ధర్మసంస్థాపన జరగటం ఖాయం, అధికారం కాలసర్పం, అహంకారం కారు మేఘం, మోసం వినాశనచక్రం, కుట్ర , హత్య, నమ్మకద్రోహాలు, మనిషిని వెంటాడే వేటకుక్కలు. కక్షలకు శిక్షలు తప్పవు.
మనిషంటేనే ప్రేమరూపంలో ఉన్నదైవం, ప్రేమలేని మనిషి బతికున్నశవం, నటించే ప్రతివాడూ నేరస్తుడే, కాలపరీక్షలో శిక్షార్హుడే, మనిషిని ఈ భూగోళంపై ఏ దుష్టశక్తులు అడ్డుకోలేవు, అందరికీ ఆనందం పంచే ఆత్మను ఏ అణుబాంబులు ధ్వంసం చేయలేవు, బాధించే జాతి నాశనమై పోతుంది, బోధించే జ్ఞానజ్యోతి బ్రహ్మాండాన్ని వెలిగిస్తుంది.
వినరా వినరా నరుడా లోక లీలలు, లోకమంతా స్వార్ధపరులుగా మారిరే, నటన సూత్రధారి ఆటలు కనరా, నవరంధ్రాలు ఆటల వేటలైన తీరు మార్చి మోక్షం ఎప్పుడురా
మందహాసమే, మధుర గానమా ఏ తీరునా ,
నందనందనా, నవ కవిత్వమా ఏ వ్రాతనా
ముందురమ్ము కాపురుష భంజితా ఏ లాభమా,
ఎందు నీవెగా, హృదయ రంజితా ఓ దేవ దేవా
వినరా వినరా నరుడా లోక లీలలు, లోకమంతా స్వార్ధపరులుగా మారిరే. నటన సూత్రధారి ఆటలు కనరా, నవరంధ్రాలు ఆటల వేటలైన తీరు మార్చి మోక్షం ఎప్పుడురా
పూలమాలలే, పులకరింపుగా చుపించావే
ఈల పాటలే , యెపుడు హాయిగా కల్పించావే
తాళ వృత్తమై, తనరు చిత్తమే చదివించావే
నీలమోహనా, నెనరు ముత్తెమే ఓ దేవ దేవా
వినరా వినరా నరుడా లోక లీలలు, లోకమంతా స్వార్ధపారులుగా మారిరే, నటన సూత్రధారి ఆటలు కనరా, నవరంధ్రాలు ఆటల వేటలైన తీరు మార్చి మోక్షం ఎప్పుడురా
చుక్క చుక్కగా, సుమదళమ్ములై వికసించెనులే
యక్కజమ్ముగా, నవని సొమ్ములై తరిలించునులే
దిక్కుదిక్కులందెలి హిమమ్ములే మరిగించునులే
యెక్కడుంటివో, యిచట నిమ్ములే ఓ దేవ దేవా
వినరా వినరా నరుడా లోక లీలలు, లోకమంతా స్వార్ధపారులుగా మారిరే, నటన సూత్రధారి ఆటలు కనరా, నవరంధ్రాలు ఆటల వేటలైన తీరు మార్చి మోక్షం ఎప్పుడురా
కొందరికి పాట అర్ధమయ్యే, కొందరికి పిచ్చి పాటలుగా అనుకున్నారు ఏది ఏమైనా గౌరవించటం తగ్గిపోయింది అప్పుడే రామారావు తన జేబులోంచి 500 రూపాయలు నోటు ఇవ్వగా సన్యాసి నాకు వద్దండి మీచేతులతో నాకు భోజనం పెట్టించండి నాకు అదే తృప్తిగా ఉంటుంది, నా దేవ దేవుని పాడుకొనుటకు ఓపికవస్తుంది, నాకు ఏరోజుకారోజు ఆహారం అందిస్తున్నాడు ఆ పరమాత్ముడు ఈ రోజు మీ వంతు, హనుమ ఈయన బాగా చదివిన వాడిలాగున్నాడు కదా, పదా ముందు వీరికి భోజనం పెటిద్దాం మంచి భోజన సాలయందు మరలా రేపు అనేది నున్నది కదా, అవునవును పదా పదా అంటూ బయలుదేరారు ముగ్గురు
ఇంకా వుంది .. (7)
ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
****
*నాలో నీవు .. నీలో నేను కథానిక.. (7) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ
ఆ వచ్చిన సన్యాసి ఆతోటలో వున్నా గణపతి విగ్రహం వద్దకుచేరి ఐ విధముగా ప్రార్ధన చేసాడు
శ్రీ గణపతి అథర్వ శీర్షము
త్వంగుణత్రయాతీతః । త్వం అవస్థాత్రయాతీతః ।
త్వం దేహత్రయాతీతః । త్వం కాలత్రయాతీతః ।
త్వం మూలాధారస్థితోఽసి నిత్యం । త్వం శక్తిత్రయాత్మకః ।
త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం । త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం
సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువఃస్వరోం
తే.గీ. మాలిక
మూడు గుణములు మించిన మూర్తి వగుచు, మూడ వస్థలు మించిన మూర్తి వగుచు
మూడు దేహముల్ మించిన మూర్తి వగుచు, మూడు కాలముల్ మించిన మూర్తి వగుచు
మూలమందున స్థితుడగు మూర్తి వగుచు, మూడు శక్తుల మూలపు మూర్తి వగుచు
మునులు నిత్యము ధ్యానించు మూర్తి వగుచు, బ్రహ్మ విష్ణు రుద్రుల పరబ్రహ్మ వగుచు
ఇంద్రు డగ్నియు వాయువు నినుడు శశియు, నగుచు సర్వత్ర వ్యాపించి నట్టి విఘ్న
పతివి నిను ముందు ప్రార్థింతు వరము లీయ, ఆ పరబ్రహ్మ పరమాత్మ వగుచు బ్రోవు
అప్పుడే రామారావు హనుమంతు నమస్కారం పెట్టుతూ నిల్చున్నారు, అప్పుడే మీరు నాకోసం ఆహారం అంటున్నారు నేను ఎక్కడా భోంచెయ్య నండి, అందుబాటులో దొరికిన ఫలాలు తిని గాలి నీరు ద్వారా సంచారి జీవిగా కాల గడుపుతున్నాను. మీ సహృదయాంకి వందనాలు,మీరు నాకు ఏమన్న ఆహారము పెట్ట దలుచు కుంటే మైక్ శ్రమ వద్దు ఆ కనబడుతున్న అరటి పండు కొనిపెట్టండి చాలు ఈ జానెడు పొట్టకు
ఆమాటలకు హనుమంతుడు ఆ బండిలో వున్న పళ్ళని కొని బట్ ముందు పెట్టాడు, భలేవాడివయ్యా అట్లయితే అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడదాకా మోసుకురా అంటూ నడుచుకుంటూ బయలుదేరారు ముందుకు.
ముగ్గురు కలసి అక్కడ ఉన్న వారికీ మూడు పళ్ళు మిగిల్చి మొత్తం పంచారు వారు.
వెంటనే బైరాగి మీరిద్దరూ ఈ పండు తీసుకోండి ఈ పండు నాకు చాలు అంటూ గబగబా తినేస్తూ మీరు తినండి అంటూ గంతులేస్తున్నాడు బైరాగి
వీళ్లకు అర్ధం కాలేదు ఆ ఒకపండు తిన్నాక ఎక్కడలేని బలం వచ్చింది అందరిలో
... ఇంకా వుంది .. (8)
ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
*నాలో నీవు .. నీలో నేను కథానిక.. (8) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ
గురువుగారు మీరు మాకు ఉపదేశం ఇవ్వండి మేము మీ శిష్యులు అవుతాము అన్నాడు హనుమంతుడు,
స్వేచ్ఛ హరించే శక్తి లేదు నాకు, నాకు ఇల్లూ వాకిలి లేదు, ఇక మీరెందుకు మీ సంసారాలను వదలి నాకు సేవలనవసరం, ఇది కలియుగం మీ లాంటి వారు ఈ దేశానికి అవసరం, నా లాంటివారు భక్తిని పంచటం, పెంచటం ఈ జన్మకు చాలు అలా కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటూ చెట్టుదగ్గ చేరి పీఠముపై కూర్చున్నాడు బైరాగి, క్రింద రాళ్లపై కూర్చున్నారు ఇద్దరు, చెప్పేవి వింటున్నారు.
శ్లో𝕝𝕝 ప్రభూతం కార్యమల్పం వా యన్నరః కర్తు మిచ్ఛతి |
సర్వారమ్భేణ తత్కార్యం సింహా దేకం ప్రచక్షతే ||
తా𝕝𝕝 మనుష్యుడు తాను చేయదలచిన పని పెద్దదికాని చిన్నదికాని దానిని పూర్తిచేయుటకు సర్వశక్తి నుపయోగించి యన్నివిధముల ప్రయత్నము చేయవలెను. ఈ విషయము సింహమునుండి నేర్చుకొనవలెను.
పరమాత్మ శక్తి యొక్క సర్వవ్యాప్త స్వభావం కారణంగా, ఒక వ్యక్తికి కనిపించే ప్రతి వస్తువు దైవికంగా మారుతుంది. ఇది స్వచ్ఛమైన జ్ఞానం యొక్క ప్రాథమిక వివరణ. చైతన్యం యొక్క స్వచ్ఛత రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ‘నేను అది కూడా’ అని అనిపిస్తుంది. ఇది రెండవ దశ అయిన 'నేను అది' నుండి గణనీయంగా భిన్నంగా ఉంటుంది. మొదటి దశలో, వ్యక్తిగత గుర్తింపు పూర్తిగా కరిగిపోదు, రెండవ దశలో వ్యక్తిగత ఉనికి ఉండదు.
జీవితం అష్ట దొంతరల ఆట, జీవి భావాల ఆశ కళ ఆట, ముదిరిందా పలుకు పైమాట, కుదిరిందా బ్రతుకు సైయ్యాట, బలిమి వేషము మత్తుల ఆట, కలిమి లేముల జిత్తుల పుట,గోళం తిరుగుటలో ఓ ఆట, కాలం చెడుగుడులో ఓ బాట, గీతము మది నిధాన పోపు లాట, జీవన విధి విధాన తోపులాట, లాంతర్ వెల్గుల్ కిటికి ఆట, జంతర్ మంతర్ సుడుల బాట.
కనివిని తెల్పనిది కొమ్మ లాట, దిన దిన సూచికల బొమ్మలాట, చుక్కల నొక్కులలో దమ్ము లాట, దిక్కుల పిక్కలలో కుమ్ము లాట, చెడుగుడు మడుగు చేతు లాట, అడుగడుగు గొడుగు మూతలాట, నిక్షేప కారకుల మది ధీరత్వాల కోట, అక్షేపణావధుల విధివీరంగాల కోట, నిషన్న నటనాల నిర్మల జీవాలాట, విషన్న వదనాల విప్లవ గీతాలాట, సంత ధర్మాల ధరణి మనసున ఆట, వింత వర్ణాల వికసిత విరుల తోట, మనసు మంజరి సిరు ఝరుల వేట, అణువు ఆటలు మురిపముల వేట, సంద్ర అల మలుపు వలల సమ్మెట, చంద్ర కళలు తలపు వల సొమ్మెట
దుర్జనః ప్రియవాదీతి .. నైతద్విశ్వాస కారణం ౹
మధుతిష్ఠతి జిహ్వాగ్రే .. హృదయేతు హాలాహలమ్ ౹౹
దుర్జనుడు మధురంగా మాట్లాడ వచ్చు.అయినా ఆ మాత్రముచే వానిని విశ్వ సింప రాదు. వానికి నాలుక చివరన తేనెయూ, మనసులో హాలాహలమైన విషము ఉండును. అది గుర్తుంచుకోండి మీరు అన్నాడు బైరాగి. ఇంకా వుంది .. (9)
ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
*నాలో నీవు .. నీలో నేను కథానిక.. (9) రోజువారీ సీరియల్ గా వ్రాస్తున్నాను ఆదరించగలరని ఆశిస్తున్నాము ఇది కధ కాని కధ
సర్చరిత్రము, జ్ఞాన విజ్ఞానము, సద్బొధలు వారికి వినపడవు, పరమాత్మతత్వమును, దివ్య లీలలు గ్రహించ లేరు
మనిషి కన్నా విలువైనది మనస్సు దీనికి బుద్ది తోడైతే మరోరకం అనగా ఎండలో కొబ్బరిబొండం (మనసు ) నీరు త్రాగాలి అనేది (బుద్ది ), ఆవేశం కన్నా విలువైనది ఆలోచన వయసుని బట్టి మాటలు ఆలోచన (బాధ వద్దు బాధ పెట్టవద్దు ), కోపం కన్నా విలువైనది జాలి నిగ్రహించుకొని (విని ఆచరణ జాలి ), స్వార్ధం కన్నా విలువైనది త్యాగం నీవంతు సహాయమే (ఫలితం ఆశించకుండా).
*యత్ర వేదధ్వని శ్రాంతం న చ గోభిరలంకృతమ్
యన్నబాలైః పరివృతం శ్మశానమివ తద్గృహమ్!!
తా𝕝𝕝 ఏ ఇంట్లో వేదధ్వని వినబడదో, ఏ ఇల్లు అవులతో అలంకరించబడదో, ఏ ఇంట్లో చిన్నపిల్లలు ఉండరో ఆ ఇల్లు శ్మశానము వంటిది అని అత్రిస్మృతి హెచ్చరించింది.....
*రూప యౌవనసంపన్నా: విశాలకుల సంభవా:
విద్యాహీనా: న శోభన్తే నిర్గంధా ఇవ కింశుకాః
అపురూపమైన రూప లావణ్యాలతో ఉన్నా,యౌవనములో ఉన్నా,మంచి వంశములో పుట్టినా,విద్యావిహీనులై ఉంటే మాత్రం ఏ విధముగా శోభించరు.చదువు లేనివారిని ఎవరూ గౌరవించరు.మోదుగు పువ్వువలె రాణించరు.
ఇంకా వుంది .. ( 10 )
ఏ కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు మీ విధేయులు .. మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అమితశ్రమ పనికిరాదు - జపం చేయడంలోకాని, ధ్యానం చేయడంలో గాని శక్తినంతా వెచ్చించడం, మితిమీరిన శ్రమే అవుతుంది. పై నుండి దివ్యానుభూతులను అవిచ్ఛిన్నంగా పొందగలిగే ఘట్టాలలో తప్ప, ధ్యానమందెంతో ఆరితేరిన వారు సైతం అట్టి శ్రమకు తట్టుకొనడం కష్టం.
మన బాధ్యతని మన మీద వేసుకోవడం వల్ల స్వేచ్ఛ వస్తుంది. బాధ్యత సృజనాత్మకతని తీసుకువస్తుంది. దాని వల్ల నీ పరిసరాల నుండి నువ్వు విముక్తుడవుతావు.
ఉత్పలస్యారవిందస్య మత్స్యాస్య కుముదస్య చ ౹
ఏకయోనిప్రసూతానాం తేషాo రూపః పృథక్ పృథక్ ౹
ఒకే నీటిలో పుట్టినా నీల తామర పువ్వు,తెల్ల తామర పువ్వు,చేపలు వీటి రూపాలలో వేరే వేరేగా ఉంటాయి.
చిత్తస్థాయి - సత్వర సాధనకు ముఖ్యంగా చిత్తస్థాయి కావాలి. ఫలితాల కొరకు వేగిపడడం, మితిమీరి శ్రమ చేయడం తగదు. అనుభూతులు పొందగల యోగ్యతను పెంపొందించు కోడానికి చిత్తానికి వ్యవధి యివ్వాలి. లోపలి నుండి కవిత్వం, సంగీతం పుట్టుకు వచ్చినంత సహజంగా ఆ అనుభూతుల నతడు పొందవలసి వుంటుంది.
భగవంతుడు చాలా అందంగా ఉన్నాడని, భక్తుడు-యోగి ఇంకేమీ చూడకూడదనుకుంటాడు. అందమైన వస్తువులను చూడాలనే అతని కోరిక భగవంతుని దర్శనంతో పూర్తిగా తీరుతుంది. భౌతిక ప్రపంచంలో మనం అందాన్ని చూడాలనుకుంటున్నాము, కానీ కోరిక ఎప్పుడూ సంతృప్తి చెందదు. భౌతిక కలుషితం కారణంగా, భౌతిక ప్రపంచంలో మనం అనుభవించే అన్ని ప్రవృత్తులు ఎప్పుడూ సంతృప్తి చెందవు. కానీ మన కోరికలు చూడటం, వినడం, స్పర్శించడం మొదలైనవాటిని భగవంతుని తృప్తి కోసం ఉపయోగించినప్పుడు, అవి అత్యున్నతమైన పరిపూర్ణత స్థాయిలో ఉంటాయి.
*నాస్తి మాతృ సమం దైవం నాస్తి పితృ సమో గురుః।
నాస్తి మాతృ సమో బంధు ర్జంతూనా మస్తి భూతలే।।
తల్లితో సమానురాలైన దేవత లేదు. తండ్రితో సమానుడైన గురువు లేడు.ఇంకా చెప్పాలంటే.... తల్లితో సమానమైన హితులు బంధువులు లేరు గాక లేరు.
దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు. *ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది...* అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది.
*పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.*
పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. కట్టెల పొయ్యిలో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన *ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.*
దాదాపు అందరం దుంపల బడిలోనో, ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మాలో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే!
ఆ రోజుల్లో చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు.
ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే. మాథమెటిక్ లో చేరితే చదివేవారులేక ఫిజిక్సు మెయిన్ చదివి పాసయినాను నేను.
మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. *మూడు అణాలు ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో.* అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.
చాణిక్య చంద్రగుప్త సినిమా నాచదువు మలుపు తిప్పింది, ఆరాధన సినమా నాకు ప్రేమ నేర్పింది, పెత్తందార్ల సినిమా నా వాచ్ పోగొట్టింది, ఇలా చెప్పుకుంటూ పొతే నందమూరి రామారావు సినిమాలే ఎక్కువగా చూసేవాణ్ణి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో సైకిల్ పోగొట్టుకున్నాను, ఇలా న జీవితం సనసముగా మారింది మా తల్లితండ్రులు చనిపోయిన తర్వాత నా దారే మార్చుకొని కష్టపడ్డాను, అప్పుడే నాకు తోడు ఆ పరమాత్ముని కధలు చెప్పుకుంటూ కదులుతున్నాను. ఇలా ఎన్నో మరెన్నో మల్లి కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం
ఆశతో కూడిన ఆలోచనలు లేనప్పుడు త్రివిధావస్ధలు సమంగా, సహజంగా, శాంతిగా.. ఉంటాయి !!
ఆలోచనామృతం విని అర్ధం చేసుకొని ఆచరిస్తే అందరికి శ్రేయస్కరం
రామారావు ఇంటికి చేరగానే భార్య శ్రీమతి జానకి జమ్బుతో నీళ్లు తెచ్చి చేతికి కండువా అందించింది, ఏమిటో ఈరోజు చాలా ఆలస్యంగా వచ్చారు మీరు అన్నది నవ్వుతు
నేను యధాప్రకారముగా నడక సాగగా నాతో హనుమంతు కలిసాడు, కూర్చొని కధలు చప్పుకుంటుంటే ఒక బైరాగి పాట్ పడుతూ వచ్చాడు అతనితో కాలక్షేపం ఇంట సమయం పట్టింది, ఆయనను ఇక్కడి లి తే పోయ్యారా ఎమన్నా సహాయం చేద్దాం అవునే నేనుకూడా ఏంతో అభినయించా వప్పుకోనంటే పండు ఇచ్చి సాగనంపాను .
పండు పండు ఇచ్చి పంపావా ఏమిటి అంట్లా అంటావు, అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం పదా లోపలకి అని బదులు చెప్పాడు రామారావు.
సరదాగా సరసమాడుతూ రామారావు మాటలు
సఖీ:: నీకిష్టమైతే, చెంతకొస్తావు, చేయిచాస్తావు , చెలిమిచేస్తావు, సలహాలిస్తావు, సహకరిస్తావు, కానీ నాకిష్టమైతే పట్టించుకోవు, పలుకరించవు, ప్రతిస్పందించవు, ఎరగనట్లు ఉంటావు.
సఖీ: నీకునచ్చితే నవ్వుతావు, నవ్విస్తావు, నమ్మిస్తావు, నటన చూపుతావు, కానీ నాకునచ్చితే నసుగుతావు, నటిస్తావు, నాలుకవెళ్ళబెడతావు, తెలియనట్లు చూస్తావు.
సఖీ: నీవుమెచ్చితే ఇంద్రుడవంటావు, చంద్రుడువంటావు, చప్పట్లుకొడతావు, సంబరపడతావు
కానీ నేనుమెచ్చితే, గమ్ముగుంటావు, వమ్ముచేస్తావు, పొమ్మనంటావు, అలక ప్రవర్తిస్తావు.
సఖీ: నేనుపిలిస్తే, ఉలకవు, పలకవు, కదలవు, ఇకన్నా రుబ్బురోలు నయమనిపిస్తావు కానీ
నీవు పిలిస్తే బరాబరారావాలి, బదులివ్వాలి, బద్ధకంవీడాలి, లేదా భద్రకాళివైపోతావు.
సఖీ : నీవుకోరితే కాసులివ్వాలి, కొనిపెట్టాలి, కష్టపడాలి, కాదనకుండా ఒప్పుకోవాలి కానీ
నేను కోరితే బెట్టుచేస్తావు, బదనాంచేస్తావు, బ్రతిమాలించుకుంటావు, గాంభీర్యం ప్రదర్శిస్తావు
సఖీ: నీవుమెడవంచితే, తాళికట్టాలి, తోడుగుండాలి, తృప్తిపరచాలి కానీ నేనుమెడవంచితే గేళిచేస్తావు గంతులేస్తావు గడుసుగుంటావు
సఖీ : నీకు షోకులుకావాలి, సుఖంకావాలి, సంసారంకావాలి, అందరిలో గోపా అనిపించుకోవాలి
కానీ నేను పాట్లుపడాలి, పోషించాలి, పరిరక్షించాలి, అని హుకుం జారీ చేస్తావు
సఖీ : మనం బాగుపడాలంటే అన్యోన్యంగా యుండాలి, కలసిముందుకుసాగాలి సంసార సాగరము నీదాలి, కలసి మెలసి నలుగురికి, దేశానికి సహాయంచేస్తూ జీవించాలి కానీ
మనమెప్పుడు తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు, రట్టుచేసు కోకూడదు, కలసుండాలంటావు.
సఖీ: మనకుకుదిరితే ముందుకెళ్దాం, లేకపోతే వెనుకడుగేద్దాం, ఆలోచించు నిర్ణయం చెప్పు ఔనంటే బంగారుభవితకు పూలబాట వేసుకుందాము.
ఏమిటండి ఎంత ఉపోద్ఘాతము వెలువరించారునేను మీదగ్గర అట్లా ప్రవర్తించానా, మీదగ్గర పిల్లల దగ్గర తప్పుచేసినా ఇన్ని మాటలన్నారు.
ఇప్పుడు నేను చదివినదంతా నమ్మవా మరి నాగురించేగా మీరు వ్రాసింది అవును కాదననుకో
ఎదో సరదాగా వ్రాస్తే ఎలాఉంటుందో అని హనుమంతు అడిగితె వ్రాసాను,నీకు చదివి విని పించాను .
ఆ అంతే
అయితే మీ మాటలు నమ్మవచ్చా,
వెళ్లి కాఫీ పెట్టి తీసుకురా తాగుదాం, రండి ఇద్దరం కలసి పెట్టుకుందాం, ఎన్నాళ్ళ కెన్నాల్లకు
వయసులో వేషాలు గుర్తు కొస్తున్నాయి, ఆ వస్తాయి వస్తాయి
ఆ ... అ ... ఆ
ఇతకముందే మీ తాతమ్మగారు వచ్చింది, ఆవిడకు పాతలవాట్లు మాత్రం మారలేదు, పలకరించండి, ఈరోజు మధ్యాన్నం మీ స్నేహితుని ఇంటికి వెళదాం.
తాతమ్మ వచ్చిందికదే, అందుకనే వెల్దామంది, ఏమనుకుంటుందో అంటా నేను చూసుకుంటాగా మీరు రడీగా వుండండి, తాతమ్మకు చెప్పి వెళదాం.
మాటల్తో భోజనాలు ఆయినాయి, తతమ్ముకు చెప్పారు, వెళుతున్నామని, అనగా తలుపేసుకొని లోపలకు నడిచినది, బయట జానకి రామారావు కార్ కదిలింది.
తాతమ్మ టివి పెట్టుకొని చూస్తున్నది.
అప్పుడే కళింబెల్ నొక్కగా
* త్యాగం ఒక గొప్ప శక్తి
ఓంశ్రీమాత్రే నమః
త్యాగమనేది ఒక గొప్ప శక్తి. ఈ శక్తి కలిగినవారు ఎంతో గొప్పవారవుతారు. చాలామంది త్యాగం చేయటం ఒక పిరికితనంగా భావిస్తారు. సహనాన్ని కూడా పిరికితనమనుకొని తమను తాము వంచన చేసుకుంటారు. త్యాగంతో పాటు సహనం కూడా ఎంతో గొప్ప శక్తి, త్యాగమంటే వస్తువైభవాలు, వ్యక్తులు, పరిస్థితులపైన మన అధికారాన్ని వదిలిపెట్టడం.
ఎన్నోసార్లు ఈ అధికారాన్ని వదిలిపెడతాం కానీ ఇష్టంతో సంతోషంతో ఇతరుల సుఖాన్నాశించి సమాజ శ్రేయస్సు కోసం చేస్తే అది సత్వ గుణమన బడుతుంది. భయం, స్వార్థం, మొండితనాలతో బలవంతంగా చేసిన త్యాగం రజోగుణం, తమోగుణాలతో కూడిన త్యాగమన బడుతుంది.
చాలాసార్లు వ్యక్తి స్వార్థానికి లోబడి త్యాగం చేస్తాడు. నేను కొద్దిగా త్యాగం చేస్తే ఎంతో గొప్ప లాభం దొరుకుతుందనుకోవడం రజోగుణ త్యాగం. కొన్నిసార్లు వ్యక్తి మొండితనంగా త్యాగం చేస్తాడు. నిజానికి త్యాగమనేది ఎంతో లోతైనది, విలువైనది. ఒకసారి త్యజించిన వస్తువు గురించి మనసులో ఆలోచన కూడా రాకపోవడమే త్యాగానికి సరైన అర్థం. అంటే త్యాగాన్ని కూడా త్యజించాలి. ఒకవేళ ఎవరికైనా త్యాగం చేసి నేనేమైనా తక్కువగా త్యాగం చేశానా ఏమిటి? అనే సంకల్పమొచ్చినా కూడా చేసిన త్యాగానికి ఫలితముండదు. నిజమైన సుఖాన్ని పొందాలంటే త్యాగమే ఆధారం.
మోహాలోభాలలో దేనికైనా లోబడి ఉన్నవారు మనస్ఫూర్తిగా త్యాగం చేయడం వారి భాగ్యానికి నిదర్శనం. ఇందులో కష్టమనేమీ ఉండదు. ఎందుకంటే దీని ఆధారంతో ఆత్మకు అసలైన సుఖం లభిస్తుంది. విషయ వికారాలను, చెడు అలవాట్లను, వస్తువైభవాలు, సంబంధాలను మనసావాచాకర్మణా త్యాగం చేయడమనేది సత్యమైన త్యాగంలో భాగమే. అప్పుడే మనకు సత్యమైన శాంతి అనుభవమవుతుంది. కోరికలను త్యజించిన వారే శ్రేష్ఠాత్మలనబడతారు.
త్యాగం చాలా గొప్ప శక్తి కావటం వల్ల వ్యక్తి ఎంతో శక్తివంతుడవటమే గాక ఎందరో ఆత్మలకు ప్రేరణ నిచ్చిన వాడవుతాడు. యోగ సాధన చేసే ఆత్మలో త్యాగమనే శక్తి నిండుతూ ఉంటుంది. వారి మనసు బుద్ధిలో ఎల్లప్పుడూ నేనొక పవిత్రమైన ఆత్మననే శ్రేష్ఠ చింతన ఉంటుంది. ఈశ్వరుని పట్ల నిజమైన ప్రేమ ఉన్నవారు దేన్నైనా సహజంగానే త్యాగం చేస్తారు.ఈ ప్రపంచాన్ని వదిలి సన్యసించడం అనేది పిరికితనం లేక పలాయనవాదం.
రాజయోగం మనకిచ్చే శిక్షణ ఏమంటే ఈ సమస్తమైన వస్తువైభవాలు, వ్యక్తులు మన మధ్య ఉన్నప్పటికీ మన దృష్టి వాటిని ఆకర్షించరాదు. వేటిపైనా లోభమోహాలు ఉత్పన్నంకానపుడే సాత్విక త్యాగం చేయగలం. తనను తాను సుఖంగా ఉంచుకోవడానికి ఎందరినో బాధ పెట్టడం నిజమైన సుఖం కాదు. ఇతరుల సుఖంలోనే మన సుఖముందని గ్రహించి మనం ఇతరులకు సుఖాన్ని ఇవ్వగలిగితే మనం వారి ఆశీస్సులను పొందగలం.
మనమిపుడు మానసిక విషయవికారాలు మొదలైన అపవిత్రతను త్యజించాలనే దృఢ సంకల్పం చేసి ప్రతిజ్ఞ చేద్దాం. ఈ త్యాగం ఆధారంగా మనకు ఉజ్జ్వలమైన భాగ్యం తయారవుతుంది.
....
సన్యాసి ఉపన్యాసం విపులీకరించే టప్పుడు తన ఉదేశ్యము తెలియ పరచాలని, రామారావు దగ్గరకు వచ్చాడు. నేటి పిల్లల ప్రేమ గురించి తెలపగలరు. అనగా అనాదిగా వస్తున్నా సంప్రదాయాలు మారుతున్నాయి అని చెప్పారు
*సన్యాసి, ముఖ్యంగా నేను చెప్పేది స్త్రీలు పురుషులు (యువతీయువకులు) చదువులంటూ వయసొచ్చిన తర్వాత కూడా ఆ సుఖాన్ని పొందక, కామాన్ని అదుపులో పెట్టుకొని జీవించటం మొదల పెట్టడము, ఉద్యోగాలు సంపాదన, పెరగటం, తల్లితండ్రుల ప్రోత్సాహం, బిడ్డలు పెళ్లి వద్దన్నా ఊరుకోవడం, సంపాదన వున్నా సరిపోదని, ఆడవారుకూడా పనులు చేయడం, ఎన్నో ఆశలను పెట్టుకొని పిలల్లను పెంచడం మనం అందరం చూస్తున్నాము.
ప్రస్తుతసమాజం లో ఆధునిక పరికరాలు వచ్చాయి, క్షణంలో లోకంలో వింతలూ విడ్డురాలు తెలుసుకుంటున్నారు, ఎంత తెలుసుకున్న ప్రేమ అనేది యువ తీ యువకుల్లో పుడుతుంది. వాసుల్లో జరిగే ముచ్చట ఆవసువు జరగాలి అప్పుడే అందరికి ఆరోగ్యం. అందుకే సంభాషణలు.
అందాన్ని చూశాక ఆనందాన్ని పొందాలని ఆశ, అధరాన్ని పొందాలని ప్రేమరుచి చూడాలని, చూపుల వలను విసిరాలని, మగువ అనే గులాబీని పొందాలని, పూలను వర్ణిస్తూ మనసు లక్షణాలను తెల్పి, ఇచ్చా ప్రేమనుకోరా, మనసు విప్పా హృదయ ముచ్చట పరచా, చెంతకు పిలిచా చెలిమిని కోరా, ఆమెను మెచ్చా ఆమెకు నచ్చా, విషయాన్ని విశదీకరించా, ఒంటరిగా పిలిచా తుంటరిగా మాట్లాడా, అనుభవాలను, ఆశయాలను, తెలియపరిచా, నవ్వులు పంచా ముగ్గులోకి దించా, మనసు, మనసు కలిపా, మమతాను రాగాలను పంచా, మతి పోగొట్టా మత్తులో పడవేశా, హృదయ శబ్దాన్ని అర్ధం పరమార్ధ మనితెలిపా, సమయస్ఫూర్తి గా సహాయాన్ని అందించి, ఆరోగ్యం పెంచేటి పోషకాహారం అందించి, నిద్ర సుఖాన్ని కల్పించి, సమస్యలు లేని కాపురంగా సాగుతున్నది.
ఈడు కుదిరింది జోడు కొచ్చింది, తోడుగా నిలిచింది నీడగా మారింది, కల నిజమయ్యింది కోరిక
నెరవేరింది, చేరువయ్యింది స్వర్గం చూపించింది, సుఖము ఇచ్చింది శాంతి కూర్చింది, బంధం పడింది బంధీ అయ్యింది, కాలనిర్ణయాలను తెల్పింది, స్వప్న్మం సార్ధకమయ్యింది
సమస్య పరిష్కారమయ్యింది, ఆనందాల సంద్రమయింది, కాపురం కలిసొచ్చింది కుటుంబం
వృద్ధిచెందింది, బ్రతుకు బంగారమయ్యింది జీవితం సుఖమయమయ్యింది
దివ్యప్రేమానుభవం - మానవ ప్రేమ వలె దివ్య ప్రేమ ఒక భావావేశం కాదు. భావావేశాలకు అతీతులమై అంతర హృదయం ద్వారా పరమాత్మతో ఏకత్వం భజించి నప్పుడు అనుభవానికి వస్తుంది దివ్యప్రేమ. ఇంద్రియ సంబంధమైన భావావేశపు పరుగులు దాని నెంత మాత్రమూ అందుకొనజాలవు. అలా ప్రేమ గురించి సన్నాసి గారు తెలియపరిచారు, రామారావు మైక్ వద్దకు వచ్చి ఈరోజు మనకు మంచి విషయాలు తెలియపరిచారు మరలా అందరు కలుద్దాం సెలవు అనుటు ముగించాడు.
నాయకుడనేవాడు గతాన్ని వదిలివేసి, క్షణ క్షణ మార్పులను గమనించి, ఎవరి లక్షణాలు ఎలాంటి ఓ తెలిసికొని, కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడం ఆపకుండా, మనసులో ఉన్న విషయం బయటకు చెప్పి, ఈగో వదిలేసి, బాద్యత సక్రమంగా నిర్వర్తించి, తప్పును కూడ శాoతoగ చెప్పి, పరిష్కారంకూడా తెలియపఱచి, ఎవరైనా బాధలో ఉంటే ఓదార్పు చూపి, బరోస ఇచ్చి, అన్నీ సందర్భాలనీ స్వీకరించి, ఎంత కఠిన నిర్ణయం ఆయన తీసుకునే దైర్యం చూపి, జనులకు మార్గ దర్శకుడు గా మారి, ఎల్లప్పుడూ నవ్వుతూ పలకరింపు ఉంచి, సమస్యలపై ఆందోళన తెలపక, పరిశీలనచేసి, తన అనుచరుల కంటే ఒక అడుగు ముందు ఉండి, తన అనుచరులకు ఎల్లప్పుడూ అభినందనలు తెలిపేటట్లు, సహాయ సహకారం అందింస్తు, తను ఉన్న చోట్ల నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తూ, సమాజం నుండి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ, ఎల్లప్పుడూ ఎంతోకొంత ఇస్తూనే ఉండి, అనుచరుల ఎదుగుదలను కోరుకునే. వాడైఉండి, కానీ వారి ఎదుగుదలను అడ్డుకో కుండా, తన స్వార్థం కోసం కాకుండా అనుచరుల కోసం అందరికోసం పనిచేసి, ఇలా ఎన్నో ఉండాల్సిన లక్షణా లున్న నాయకుడి ఎన్నుకోవాలి -
బ్రహ్మవేదముతోను బ్రహ్మాండమున వెల్గు .. బోధకు నిలయమై పడచు వెల్గు
పరమాత్మ నాలంబ నతొ జొచ్చు నిజవెల్గు .. నఖిలజగంబుల నిండు వెల్గు
ఆది మధ్యాంతర ప్రేమ వెల్గు .. నాదాంత సీమల నడచు వెల్గు
చూడు జూడగ మహా శోభితంబగు వెల్గు .. సాదు జనానంద సంఘములో వెల్గు ..
మేరు శిఖరంబు నిండిన మేలు వెల్గు .. ప్రేమ మోహము వేషము పెంచు వెల్గు
మేను పులక రించేదియు మనసు వెల్గు .. ప్రాంజ లిప్రభ నాయక ప్రేమ వెల్గు
వేదాంత సూక్తులు విని కొన్ని తెల్పినంత .. వేదాంతి రాజుగా యోగి కాడు
కుండకళ్ళునుత్రాగి తెలియక వాగినంత .. పూర్వపు శాస్త్రవేక్తగను కాడు
మనిషిగా ఉన్నంత మాత్రాన ఎప్పటికి .. అసలు గుణాన్నియే మార్చలేడు
స్త్రీల వెంట తిరిగి స్థిరమైన నాయక .. సీఘ్రము నిజమైన వాడు కాడు
ఎంత చదివిన గుణహీను డెంచ లేడు .. సింహము జయించె నంతనే సిరులు తేడు
నమ్మ పల్కులతో వాడు నటనకాడు .. ప్రాంజలిప్రభ నాయక ప్రేమ వెల్గు
***
40 దాటిన తరువాత ఏ పని మీద మనసు లగ్నం కాదు. గడప దాటి బయటకు వెళ్లడానికే మనస్కరించదు.28 - 30 లో అయితే చాలా బాగుండేది. ఎక్కడికైనా ఏ సమయంలోనైనా వెళ్లినా అలసటే అనిపించేది కాదు.మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేది. 20-25 లో అయితే వసంతంలా ఉండేది. జీవితపు ఆనందం వేరేలా ఉండేది. మజా మస్తీ తిరగడం. గాభరా అస్సలు ఉండదు. 42-45 దాటితే ఏమవుతుందో నన్న ఆందోళన. ఆలోచిస్తూ ఉంటేనే భయంగా ఉంటుంది.
*
నేను చెప్పేది వయస్సు గురించి కాదు.
ఉష్ణోగ్రత (Temparature) గురించి చెబుతున్నా. వేసవి వచ్చింది కదా! మరి.😂😀👍🏻
***
సంగీతం ఆపాత మధురం, సద్భావం సమ్మోహ అధరం
సాహిత్యం ఆలోచనామృతం, సామీప్యం సందేహనివృతం
రెక్కలు విచ్చుకుంటేనే, విహంగాలు ఎగురగలవు
కోర్కలు మానుకంటెనే, కుటుంబాలు మనగలవు
మబ్బులు ముసురుకుంటేనే, వానజల్లులు కురువగలవు
ఒప్పులు సరిలేకుంటేనే, గిల్లికజ్జాలు పెరగగలవు
సూర్యుడు ఉదయించితేనే, తూరుపు తెల్లవారుతుంది
చంద్రుడు అస్తమించుతేనే, వెల్గుల కళ్ళు కదులుతుంది
చంద్రుడు పొడిస్తేనే, వెన్నెల వ్యాపిస్తుంది
తారలు మేరిస్తేనే, థళుకు ఆవహిస్తుంది
పూలు పూస్తేనే, తోటకు అందంవస్తుంది
కాయలుంటేనే, సిహత్తుకు అందం వస్తుంది
పిల్లలు ఉంటేనే, ఇల్లు కళకళలాడుతుంది
స్త్రీలు ఉంటేనే, సుఖము నిత్యమై ఉంటుంది
కాంతలకు కురులుంటేనే, కొప్పేదైనా అందాన్నిస్తుంది
శాంతి కొరకు మనసుంటేనే, బంధమే అందాన్నిస్తుంది
ఆలోచన తడితేనే, భావము బయటకొస్తుంది
పోరాటం పుడితేనే, నామాంకం బయఁటకొస్తుంది
ఆవేదన కలిగితేనే, అద్భుతరచన అవతరిస్తుంది
సహకారం కుదిరితేనే, సమయ రచన అద్భుతమౌతుంది
మనసు ముచ్చటపడితేనే, మంచికవిత ముందుకొస్తుంది
వయసు తాపత్రయంతగ్గితేనే, మనసు కవిత ముందుకొస్తుంది
చక్కనికైత చదివితేనే, చదువరులకు సంతోషంకలుగుతుంది
చుక్కల కాంతి మక్కువ ఐతేనే, చూపరులకు సంతోషం కల్గుతుంది
డబ్బులు జేబులోయుంటేనే, కడుపులు నిండుతాయి
జబ్బులు లేకయుంటేనే, సుఖాలు నిండుతాయి
విరులు విచ్చుకుంటేనే, సౌరభాలు వెదజల్లుతాయి
కురుల విచ్చుకుంటేనే, మల్లెపూలు గుబాలిస్తాయి
కవితకు ప్రాసలేకపోతే, కూరలో ఉప్పులేనట్లుచప్పనే
హృదయానికి శబ్దం లేకపోతే, జీవం ఉన్నా జీవితమ్ లేనట్లునే
సరుకున్నకవి చక్కనికవితను, అనునిత్యము అందించగలడు
బ్రతికున్న కవి గుర్తింపు కవితను, నిత్య సత్యమును పంచగలడు
దినదినం కవితలుచదవండి, ప్రతిదినం పరవశించిపోండి
తెలుగును చదివి చదవమనండి, మాతృ భాషను గౌరవించండి
మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట ఏడుపెంకులాట బుచ్చలాట
రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం
ఈ నాటికీ దాదాపు అందరం 48-65సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే!
అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకొని పిలుస్తున్న వాళ్ళమే.
*ఇక మాకన్నా అదృష్టవంతు లెవరుంటారు?*
*****
*ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా మన బాల్యాన్నిమనమే రాసుకున్నట్టుగానే వుంది!!!*
విద్యా విధానం లో తాజా వార్తలు
కొత్త విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
36 ఏళ్ల తర్వాత కొత్త విద్యా విధానం అమల్లోకి వస్తోంది.
కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కొత్త విధానం ప్రకారం-
కొత్త విద్యా విధానం 2023కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త విద్యా విధానంలోని అతి ముఖ్యమైన ప్రతిపాదనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ఐదు సంవత్సరాల ప్రాథమిక
1. నర్సరీ @ 4 సంవత్సరాలు
2. Jr KG @ 5 సంవత్సరాలు
3. Sr KG @ 6 సంవత్సరాలు
4. స్టడీ 1వ @ 7 సంవత్సరాలు
5. Std 2nd @ 8 సంవత్సరాలు
మూడు సంవత్సరాల ప్రిపరేటరీ
6. 3వ తరగతి @ 9 సంవత్సరాలు
7. 4వ తరగతి @10 సంవత్సరాలు
8. 5వ తరగతి @11 సంవత్సరాలు
మూడు సంవత్సరాలు మిడిల్
9. 6వ తరగతి @ 12 సంవత్సరాలు
10. 7వ తరగతి @ 13 సంవత్సరాలు
11. 8వ తరగతి @ 14 సంవత్సరాలు
నాలుగేళ్ల సెకండరీ
12. 9వ తరగతి @ 15 సంవత్సరాలు
13.Std SSC @ 16 సంవత్సరాలు
14.Std FYJC @17ఇయర్స్
15.Std SYJC @18ఇయర్స్
ప్రత్యేక లక్షణాలు:
#బోర్డు పరీక్ష 12వ తరగతిలో మాత్రమే జరుగుతుంది
ఎంఫిల్ డిగ్రీ రద్దు చేయబడుతుంది 4 సంవత్సరాలు
■ 10వ బోర్డు పరీక్షలు లేవు
◆ 5వ తరగతి వరకు విద్యార్థులకు మాతృభాష, స్థానిక భాష మరియు జాతీయ భాషలలో మాత్రమే బోధించబడుతుంది. మిగిలిన సబ్జెక్టు ఇంగ్లిష్ అయినా సబ్జెక్టుగా బోధిస్తారు.
● ఇంతకుముందు 10వ బోర్డ్ పరీక్షకు హాజరు కావడం తప్పనిసరి, అది ఇప్పుడు రద్దు చేయబడుతుంది.
★ 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు సెమిస్టర్ వారీగా పరీక్ష జరుగుతుంది. పాఠశాల విద్య 5+3+3+4 ఫార్ములా కింద బోధించబడుతుంది.
కళాశాల డిగ్రీ 3 మరియు 4 సంవత్సరాలు ఉంటుంది. అంటే గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరంలో సర్టిఫికేట్, రెండవ సంవత్సరంలో డిప్లొమా, మూడవ సంవత్సరంలో డిగ్రీ.
◆ ఉన్నత విద్యను అభ్యసించకూడదనుకునే విద్యార్థులకు 3 సంవత్సరాల డిగ్రీ. మరోవైపు, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు 4 సంవత్సరాల డిగ్రీ కోర్సును అభ్యసించవలసి ఉంటుంది. 4 సంవత్సరాల డిగ్రీ చదివిన విద్యార్థులు ఒక సంవత్సరంలో MA చేయగలుగుతారు.
●MA విద్యార్థులు ఇప్పుడు నేరుగా PhD చేయగలుగుతారు.
★విద్యార్థులు మధ్యలో ఇతర కోర్సులు చేయగలుగుతారు. ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2035 నాటికి 50 శాతం ఉంటుంది. మరోవైపు, కొత్త విద్యా విధానం ప్రకారం, ఒక విద్యార్థి ఒక కోర్సు మధ్యలో మరో కోర్సు చేయాలనుకుంటే, అతను ఒక కోర్సు తీసుకున్న తర్వాత రెండో కోర్సు చేయవచ్చు. పరిమిత సమయం వరకు మొదటి కోర్సు నుండి విరామం.
ఉన్నత విద్యలో అనేక ఇతర సంస్కరణలు కూడా ప్రతిపాదించబడ్డాయి. సంస్కరణల్లో గ్రేడెడ్ అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ మరియు ఫైనాన్షియల్ అటానమీ మొదలైనవి ఉన్నాయి. ఇది కాకుండా, ప్రాంతీయ భాషలలో ఇ-కోర్సులు ప్రారంభించబడతాయి. వర్చువల్ ల్యాబ్‌లను అభివృద్ధి చేస్తారు. నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ ఫోరమ్ (NETF) ప్రారంభించబడుతుంది. దేశంలో ఇప్పటి వరకు 45 వేల కాలేజీలు ఉన్నాయి.
● అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్ సంస్థలకు ఏకరూప నియమాలు ఉంటాయి.
ధర్మేంద్ర ప్రధాన్
విద్యా మంత్రి,
భారత ప్రభుత్వం
"పిలుపు విని బాల్య మిత్రులను కలవాలని"
విచ్చేశారు అందరూ బానపొట్టలు, బట్టతలలతో, నెరసిన జుత్తుతో, పురుష పుంగవులు, వయసు చూపుతున్న వృద్ధులు నవ్వులమధ్య, సెలయేరు శబ్దముగా కూనిరాగాలు తరువుల కొమ్మల కదలికలుగా, ఆయాస పడుతూ పరిగెడుతున్న పిల్లవాడిలాగా కదలిక !
బారెడుజడలూ, మూరెడుకాగా, సోడాబుడ్డి, కళ్ళద్దాలతో మహిళా మణులు !!
వాడు వీడేనా ?, వీడు వాడేనా?, ఆమె ఈమేనా ?, ఈమె ఆమేనా ?, గుర్తింపుల గుబాళింపు !
పలకరింపులూ, నమస్కారాలూ, కరచాలనాలు, కౌగిలింతలూ, పరామర్శలూ, వర్ణనలూ, మార్పు చూపుతున్న కాల రాజకీయ ముచ్చట్లు, పిల్లలుపెడుతున్న అగచాట్లు, చాటుమాటున కన్నీరు దిగమింగిన చివాట్లు, నిత్యము జరుగుతున్న సిగపట్లు, మరచిపోలేని ఉడుం పట్లు,
సాగుతున్నాయి ముచ్చట్లు
తాతలుగా మారిన, అలనాటి అబ్బాయిలు, అమ్మమ్మలూ నానమ్మలుగా మారిన ఆరోజుల అమ్మాయిలు, కొత్త కొత్త వేషాలతో, మెడ నిండా పుత్తడి తళుకుబెళుకులతో, హావభావవిన్యాసములతో పదహారేళ్ళ పడచుపిల్లలా గంతులు ఆ సమయాన
మరోవైపు కాళ్ళనొప్పులు, కీళ్ళనొప్పులు, చెంగు చెంగున అలనాటి గెంతులస్ధానంలో
జాగ్రత్తగా అడుగులు వేస్తూ చేరారంతా ఒకచోటికి
అలనాటి అల్లర్లు, కొట్లాటలు, ఆటలు, పాటలు, సరదా సన్నివేశాలు, పదవతరగతి చదివిన పాట మాజేటి గురవయ్య పాఠశాల, గుంటూరు, కలయ తిరుగుతూ, నాటి జ్ఞాపకాలు కలబోసుకుంటూ ఆనాటి గురువులను, అధ్యాపకులను, ఉపాధ్యాయినులను, కలసి ఆనాటి విద్యార్థులందరూ నేటి వృద్దులై వివిధ ఉద్యోగ వ్యాపార నిష్నాతులుగా ఏకమయ్యారు
తమకలల రాణి కోసం, గుంపులో వెతుకులాడుతూ, దొంగ చూపులు చూస్తూ, గుర్తించలేని మార్పు, కోల్పోయిన వ్యధ, ఎన్నెన్నో జ్ఞాపకాలలో, మరెన్నో మార్పుల వాస్తవాలు.
బ్రతుకు పండించుకున్న వారు కొందరైతే, పోగొట్టుకున్న వారు మరికొందరు, అందరి మోములోనూ, చెరగని చిరునవ్వు , నాటిమేటి విద్యార్ధి, ఏదో సాధిస్తాడనుకున్నవాడు
బడుగు జీవిలా, సంసార సాగరాన్ని, ఈదుతూ అలసిపోగా, ఎందుకూపనికిరాడనుకున్నవాడు
గొప్పవాడై కనుల ముందు, అరేయ్ ఒరేయ్ మావ బావ నాటి పిలుపుల ఆప్యాయతల స్థానాల్లో
సార్, గారు మర్యాదల మార్పులు !!!
కాలగర్భంలో జారిపోయి, కరిగిపోయిన కొందరు, నేస్తాల కన్నీటి జ్ఞాపకాలు,
ఏదైతేనేం సుఖదుఃఖాల కలబోత, జ్ఞాపకాల దొంతరల వెదుకులాట, చేరుకున్నావా ? జాగ్రత్త !
చరవాణి హెచ్చరికల మోత ! తెలియకుండానే కరిగి పోయిన కాలం !
బాధాతప్త హృదయాలతో, అడ్డుపడే కన్నీటిపొరల, మసకచూపుల తడిలో, వీడ్కోలు తీసుకునే సమయం !
మరలా కలిసే మరోరోజుకు అందరూ కలవాలనే ఆశతో !
కాలగమనంలో ఎందరో చదువులు ముగించి, వెళ్ళేవారికి వీడ్కోలు, వచ్చేవారికి స్వాగతాలు పలుకుతూ , ఏమార్పూలేని పాఠశాల , చిద్విలాసంగా నవ్వుకుంటూ, వెళ్ళి రండని ఆప్యాయంగాఆశీర్వదిస్తూ, మరోకలయిక కోసం ఎదురు చూస్తూ !!!
🙏🙏🙏