హారతి కర్పూరం.. కధ..1
వందనాలు గురువుగారు
ఎవరు నాయనా అంటూ కళ్ల జోడు సర్దుకుంటూ
చేతి కర్ర కదిలిస్తూ అసలు మీరెవరు నాయనా,
నేను మీశిష్యుడునండి, మంచిది కాలాన్ని బట్టి మనము బ్రతుకు నేర్చుకోవాలి, ఏదినిజమో ఏది అబద్దమో తెలుసుకొనే జ్ఞానము భగవంతుడు మనకిచ్చాడు.
నన్ను గుర్తించినందుకు ణీ అవసరమేమిటో తెలుపు తీర్చగల స్థోమత ఉన్నదోలేదో
ఈ వయసులో ముందు నీవు మన శరీరంపై మనం పట్టు కలిగి ఉండడం 'దమము'
మన మనస్సుపై అదుపు కలిగి ఉండడం 'శమము', పై రెండింటిపై పట్టు కలిగి ఉండడమే "యోగము". అర్థం లో పరమార్ధం తెలుసుకో తరువాత అనుభవాలు పంచుకుందాం.
ముందు వాతావరణం వేడిగావుంది నీడజెరుదాం, మనిషికి ఓర్పు మనసుకు నేర్పు అవసరం, కాస్త అలా నడుచుకుంటూ పోదాం రాగలవా
అయ్యో వస్తా నండీ
సరే నడువు
ఇంకావుంది....2
.......
హారతి కర్పూరం...2
ఇంతకీ నీపేరు చెప్పనేలేదు
నా పేరు నాపేరు
అసలు నీపేరు ఉన్నట్టా, లేనట్టా
అదేంటండి అట్లా అన్నారు
ఏమిలేదు మాటలు ప్రకృతి, అనుకరణ ఆచరణ వికృతి, పేరుకుమాత్రం ఆక్రతి కదా
ఎంతమాటన్నారు గురువుగారు, మీశిష్యుడుగా ఒకపేరు ఉండేది, తర్వాత పేరు మార్చుకున్నా అంతే
నన్ను నన్ను
ఆ... ఆ...
నన్ను బెత్తం విరిగేదాకా కొట్టేవారు మొద్దబ్బాయి అని తిట్టేవారు కదండీ.
నీవు పొరబడినట్లు వున్నావు, ఎవరిని చూసి ఎవరనుకున్నావు, ప్రేమించే హృదయాన్ని బాధపెట్టకు, సూటిపోటి మాటలతో చిత్రవధ చేయకు, కాలాన్ని వ్యర్థ పరచి సమయాన్ని దుర్వినియోగం చేసి సంబరపడటం దేనికి, వాడుకొని వదిలేయటానికి నేను ఒక వస్తువు కాదు, నాగుండెకు వత్తిడి తీసుకు రాకు ఈ వయసులో నేను భరించలేను. నీ మాటలు నమ్మేంత మూర్ఖుని గాను, నీ మాటలు నన్ను మోహ పెట్టుటలేదు, అసలు నీపేరు చెప్పు నాకు గుర్తుకు వస్తుందో ఆలోచిస్తాను. నాపేరు శ్రీరామ్
నీపేరు రంగయ్య సనుకున్నానే
బాగా గుర్తుందండి మీకు నా అసలు పేరు అదియే
తర్వాత మార్చుకున్నాను
సంతోషం
నీవు నన్ను కలవటంలో అర్ధం మాత్రం తెలపలేదు, మీరు నిదానంగా ఒకచోట ఆగాక మాట్లాడుకుందాం గురువుగారు.
చూడు బాబు మనలో మంచి గుణాలున్నా, ఎదుటివారిలోఉన్న గుణాలను తెలుసుకొని ఆనంద ప్రవర్తనే ముఖ్యం, ఆలస్యం అమృతం విషం, విషయం తెలుపు,
నిదానమే ప్రధానం అనికూడా అన్నారుకదా గురువుగారు,మాటలు నేర్చావు ఎవరికోసమో.....
ఇంకావుంది....3
.....
హారతి కర్పూరం....3
శ్రీ రామ్ నాలాగ కూడా నడవలేక పోతున్నావు, వయసులోఉన్నావు ఆవేశ పడుతున్నావు, మిమ్మల్ని చుస్తే ఏదొ భయము ఆవహిస్తున్నది, నీ మాటలకు బాధ కలిగి నెమ్మదిగా నడక సాగింది.
గురువుగారు నడుస్తూ బాధపడుతున్నారెందుకు
ఏమని చెప్పేది చెట్లునరుకుతున్నారు, గాలి వెలుతురు లేని గృహములలో కాపురాలు సంపద చుట్టు తిరగడం ఒక ఎత్తు, *పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో.* *మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది.*
ఎవరికి తెల్పిన ఫలితము లేనిస్థితి
శ్రీ రామ్ తనూ పలకాలనీ
అంతా పరుగుల లోకమండి, ఆధునికయుగమంటూ, సంస్కృతి సంప్రదాయాలు ప్రశ్నలుగా మారుతున్నాయండి.
చూడు నాయనా భూమి గుండ్రముగా తిరుగుతుంది, ఏమీ మారలేదు మూర్ఖుల వాదమేయిది, కొందరు భ్రమలు సృష్టించి పబ్బం గటిస్తారు.
అలలు కలలుగా
అర్థం కాలేదు గురువుగారు
అలల కలల పరుగు పరుగు... అలలు గట్టును దాటలేక వెనక్కివచ్చి కడలిలో కలసిపోతాయి, అట్లాగే నిద్రలో కలలు వచ్చి నిద్రలో కలసిపోతాయి, నిత్యమూ వెంబడిస్తాయి ఆలోచనలో కలసిపోతాయి.
వయసు ఉడికిన మనసులో బంధాలు అనుబంధాలు ఆలోచన చక్రాలుగా తిరుగుతుంటాయి, బిడ్డలను వదులుకోలేరు, వారివద్ద ఉండలేరు. కడలిలో అలలుగా, నిద్రలో కలలుగా అట్లాగే వయసుడికిన వారిలో ప్రేమ ఉట్టి పడుతుంది, జగతి నందు ఇదెప్రకారము ఉంటుంది
గురువు గారు మీరడిగిన దుకాణము వచ్చింది అంటుండగానే రక్షక భట వాహన శబ్దముతో ముందు కొచ్చింది
...... ఇంకావుంది......4
.....
హారతి కర్పూరం....4
సుఖంగా ఉన్న వాళ్లకు కష్టాలు తెలియవు
కష్టాలలో ఉన్న వాళ్ళకు సుఖాలు తెలియవు
మనిషికి కాలం కాటు ఎంత భయంకరమో
మనసుకు గాయంవేటు ఎంత నరకమో
అన్న గురువు గారి మాటలు వింటున్నాడు శ్రీ రామ్, ఏమీ తెలియని అమాయకుడుగా రక్షక భట వాహనమునుండి ఒక స్త్రీ కోపంగా వచ్చి శ్రీ రామ్ చొక్కా పట్టుకుంది. ఏమిటి ఈ ఆవేశం ఇతను ఏమిచేసాడు, మీరు దగ్గరుండి చేస్తున్నారా, మీరు సూత్రధారలా శ్రీ రామ్ పాత్రధారుడా.
ఇతనికి నాకు సంబంధము ఏమిలేదు
అప్పుడే శ్రీరామ్ పరిగెత్త boyydu భటులు వెంటాడి పట్టుకున్నారు.
ఆ వచ్చిన శ్రీ పూనకం వచ్చినదానిలా అరవడం మొదలుపెట్టింది
గురువుగారు నోటమాట రాక అలా నిలబడి జరుగుతున్నది చూస్తున్నారు ఏమీ చెయ్యలేక
మల్లెపూనై వస్తే నలిపేసావురా, మంచి గంధం ఇస్తే పారబోసావురా, మనిషి గా మార్చుదామంటే మాట వినకున్నావురా, ఎట్టరా నీతో నా జీవితం సాగించనురా, సెప్పరా నా ఆవేదన వినరా, కాలమంతా కర్పూరమవ్వగా, మానసంతా గాయమయిందిరా, అగ్గి లా దహించుతుంటే మొగ్గలోనే బుగ్గి చేసావురా, సిగ్గుసచ్చినా ఈ సిన్నదాని మనసు వేదన చూడవేమిరా, సెప్పు కుంటే తీరని ఈ ఆవేదనా, నీతో బ్రతకాలి లేదా సావుతోనైనా చెలిమి చెయ్యాలి. ఈ జన్మంతా ఇట్టా బతకలేనురా, కొంతైనా కనికరం చూపించాలిరా,
వీసమెత్తైనా దయచూయించరా, జాలి లేకుండా దాటిపోకురా,గాలిలో కలిసి పోయేలా చేసిపోకురా, రేపటి వెలుగును చూసేలా సాయం సేయరా, నే సేసిన సాయం మరిసి పోయావురా, నీ వెలుగుకు కారణం ఈ సీకటేనురా, నీ కలల జ్యోతిని ఆరిపోకుండా అడ్డునిలిచిన ఆడదాన్నినేనురా!!
లోకం తీరే ఇంతేనని చాటావురా, నా శోకానీకి ఆజ్యం పోస్తున్నావురా, అందరూ అందరే
అంటూ నోటికి వచ్చినట్లుగా అంటుండగా శ్రీరామ్ ను బంధించి వాహనం ఎక్కించారు రక్షక భటులు
ఇంకేవుంది...... ........5
.....
హారతి కర్పూరం...5.. రోజువారి కధ
ఉడుకు రక్తం ఉప్పొంగినట్లు, గాలి వేగనికి చెట్లే వాలినట్లు, పొగల సెగలమధ్య రంకెలు పెరిగినట్లు, కాళుతున్న సేవం ఒక్కసారి పగిలి నట్లు, సముద్ర కేరటాలు ఊరవడి ఉరకలు వచ్చి వెనక్కు మళ్ళినట్లు, పోలీసులు వెనక్కి వచ్చి గురువుగారు మీరు ఎక్కాలి వాహనం అనంటం జరిగింది.
శ్రీరామ్ కూ సహకరించారుకాబట్టి నడవండి స్టేషన్క్.
మీతో నేను వస్తా " మీ మాటను ధి క్కరించను, అతనేవరో నాకుతెలవదు, దారినపోయే దరిద్ర తీగను తగిలించు కున్నా, ఎదో కాలక్షేపం కోసం సహకరించాను, మొహమాటంకు పోయి ఎదో తగిలించుక్కున్నట్లు నా పరిస్థితి అయ్యింది. ఈ తప్పంతా నాది.
నిరంతరం ఉన్నతమైన ఆలోచనలు మరియు భావాలతో తోటివానికి సహాయం చేసే వ్యక్తిత్వం నాది.
అవును పదపద అంటూ పోలీస్ అధికారి హుకుం జారీ చేసినట్లు అరిచే.
మా దగ్గర మీకు జీవితాంతం తృప్తిని ఎనలేని ఆనందాన్నిస్తుంది.* స్టేషన్లో ఉంచి నాలుగు అంటిస్తే అంతా బయటపడుతుంది.
అధికారం అర్భాట అర్పులు దేనికి మీతో వస్తానన్నానుగా.
మీ ప్రవర్తన నాయకుల వద్ద ఒకరకం, సామాన్య జనులతో మరోరకం పదవి అహం చూపిస్తారు.
ఆపవయ్యా, ఉపన్యాసం అందరూ చెప్పేవి నీతులు దూరేది దొమ్మరి గుడిసెలన్నారుట ఎవరో నడువు నడువు అనడం.
మీరు జీవితంలో ప్రవర్తన మార్చుకోవాలి, ఎల్లప్పుడూ తెలివి కంటే గొప్పది, ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో మన తెలివి తేటలు పని చేయక పోవచ్చు. కానీ మన ప్రవర్తన పరిస్థితులను చక్కదిద్దుతుంది, గుర్తుపెట్టు కుంటే మంచిది. కాని కనిపించేది పైకి అందర్లో ముఖం, కానీ కనిపించని అంతరమ్ముఖం ఉండి తీరుతుంది.
నాది పేజీకీ ఓ కథ ఎన్ని పేజీలు వ్రాసినా తరగదు నా వ్యధ, గుర్తుంచుకోవాలి
విసిరేసిన పుస్తకం కాదు జీవితం ఎంతో విలువైనది ప్రతి కాగితం *తెలుసుకోవాలి ప్రతిఒక్కరు "ప్రతి అక్షరం నీ గురువు, తరువు, పరువు తెలియకుంటే బ్రతుకే బరువు, కరువు"
కళ్లజోడు సర్దుకుంటూ వచ్చిన ఇన్నోవా ఎక్కారు గురువుగారు.
ఇంకావుంది ..... 6
***
హారతి కర్పూరం...6.. రోజువారి కధ
జడ్జ్ గారు కేస్ నెంబరు చెప్పుతూ వాడి ప్రతివాదములను పిలిపించారు, కేసు సూక్ష్మ వివరాలు " భార్యను మోసం చేసి 5 గురుని వివాహం చేసుకున్న ఘనుడి వివరాలు"
౩వ భార్య భామామణి పెట్టిన కేసు
లాయరు : ముందు గురువుగారిని ప్రశ్నలు వెయ్యడానికి అనుమతి కోరారు
గురువు గారు, గురువు గారు, గురువు గారు, అప్పుడే జడ్జ్ గారు లేచి నిలబడి గా అందరు లేచారు
గురువుగారు మీరు ఈ కేసులో
గురువుగారు భగవద్గీతపై ప్రమాణము చేసి చెపుతున్నాను
మీకు తెలిసిన వివరాలు తెలపండి, అన్న లాయరు గారి మాటలకూ
ఎంచేద్దాం, కలి ప్రవేశము చాలా ఎక్కువైంది, ఎవరి నమ్మాలో, ఎవ్వరి నమ్మకూడదో తెలియుటలేదు, లోకం అంతా అగమ్యగోచరం, ఎం చెప్పాలో ఏమి చెప్పఁకూడదో తెలియుటలేదు.
ఉపోద్గాతము కాదండి మీకు శ్రీ రామ్ కు మధ్య సంభంధం
అదే చెప్పఁ పోతున్నాను మీరు అడ్డు పడ్డారు
జడ్జ్ గారు కలగ చేసుకుంటూ వారి చెప్పనీయండి
మనిషికి జీవితంలో శాంతి చేకూరడం ప్రధానం. అది రావాలంటే ఏకాగ్రత అవసరం, మంచి చెడులు అర్ధం గ్రహించే శక్తి దానికితోడు ఆచరణ శక్తి ఉండాలి, ఇది ఒకరి వళ్ళ అయ్యే ది కాదు, శాంతి నెలకొనడం ముమ్మాటికీ అసాధ్యం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యం, యువతి యువకుల ప్రేమ మధ్య కుటుంబాల్లో అంతఃకలహాలకు ఇదే మూలకారణం.
లాయరు : మీ మాటలలో అర్ధ ఏమిటి ?
మనమందరం మనుషులమేననే సంగతి ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. పరస్పర సమానతా భావం ఉండాలి. వారి మనసుల్లో ఎక్కడైనా వెలితి అనిపిస్తే, అది వారిని లోలోపల తొలిచేస్తూ ఉంటుంది. వేదనకు గురవుతారు. ఆ ఆక్రోశాన్ని ఇంట్లో ఉన్నవారి మీద చూపిస్తారు. బయటి వాళ్ళమీద చూపిస్తే ఎలా ఉంటుందో తెలుసు, కాబట్టి ప్రేమగా చూడాల్సిన కన్న బిడ్డల మీద ప్రదర్శిస్తారు. అలాంటి వారితో ఎలా మసలుకోవాలో తెలియక... కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా అసహనానికి లోనవుతూ ఉంటారు. అటువంటి మనిషి ఈ శ్రీ రామ్ అతడు ఎం చేసాడో, ఎవరిని మోసం చేసాడో తెలుపుట లేదు కారణం ఆ కనిపిస్తున్న అమ్మాయి అక్రన్దనమాత్రం పరిశీలించాల్సిందే అని చెప్పారు గురువుగారు.
నాకు మాత్రం దారిలో తటస్థపడ్డాడు అంతవరకు నిజం, ఇతను, ఈమె చేసినది మోసమో నిజమో మీరు తేల్చగలరు, నేను చెప్పఁల్సినది కూడా ఏమి లేదు.
నేను ఇక్కడ నుండి వెళ్ళుటకు మీ అనుమతి కోరుతున్నాను.
జడ్జ్ గారు: వీరిని ఇంకేమన్నా ప్రశ్నలు అడగాలా
లేవండి : అనుమతి ఇవ్వగలరు
ముందు పోలీస్ వ్యవస్థను హెచ్చ రిస్తూ ఎవరు నేరస్తులో గమనించి ప్రవర్తించాలని మీరు ఎప్పుడు పిలిస్తే, అప్పుడు వచ్చే విధముగా వ్రాయించుకొని పంపగలరు, శ్రీరామ్ మరియు భామామణి విచారించుటకు రేపు ఉదయం అనుమతించబడినది ఈ రోజు కోర్టు ముగింపు.
ఇంకావుంది ..... 7
హారతి కర్పూరం ... 19-- .
గురువుగారు (శీలం ) గురించి ఈ విధంగా తెలియయపరిచారు
మనిషిలో కళల చేతలు, మాటలు, సక్రమ పద్ధతిగా ఉన్న విలువలు పెరుగుతాయి,. దీనికి ప్రకృతి సహకారం ఉంటుంది. మనసు ప్రశాంతిగా ఉండి, దైవ కృపతో, ఆరోగ్యంగా, ఉండ గలుగుతారు. లోకంలో జరిగే విషయాలకన్నా మనలో ఉన్న జ్ఞానము, ఎంతమందికి అందించగలిగాము, ఎంతమందికి, ఉపయోగపడింది అనేది గ్రహించి, నడక సాగిస్తే అంతా శుభమే
అంద చందా లంటూ ప్రకృతి అందించిన అందాలు మరచి కుత్రిమముకు ఆశపడుతున్నారు లోకపు జనులు ఉదా : పూల (వంటి స్త్రీల) ను చూసి నలిపి మింగేయాలని ఆశపడుతున్నారు అందుకే నేను చెపుతున్నా
ఇంకావుంది ..... 11
.....
***