23, నవంబర్ 2022, బుధవారం

దత్తపది, న్యస్తాక్షరి.

కొత్త సంవత్సర నుండి 1-1-2022 నేను రోజూ ప్రాంజలి ప్రభలో వ్రాసిన గురువుగారు నిత్యమూ ఉషదయకాలములో ప్రాంజలి ప్రభ గ్రూపులో శ్రీ  రామిరెడ్డి గారు పంపిన  "సమస్యాపూరణలు, దత్తపది, సప్తాక్షరి, నిసిద్ధాక్షరి" ఎప్పటికపుడు, ఏరోజుకారోజు వ్రాసినవి ఇందు పొందు పరుస్తున్నాను నాతోపాటు మరికొందరి వ్రాసేవారు వారు "  " మా గురువు గారు చెప్పారు   

! " తమ పద్యాలలోని భావాలమోఘాలే !!! 

కాకపోతే।।వ్యావహారికాలను।।తగ్గించుకొనినచో।। యింకా సొగసుగ నుండును।।అయినా నాప్రయత్నము అమ్మ కృపతో వ్రాస్తున్నాను,  మీ అందరి సహకారం అర్ధిస్తున్నాను తప్పులు ఉంటే తెలపండి, మీరు కూడా మీ వంతుగా పద్యాలు వ్రాయగలరని ఆశిస్తున్నాను   

తెలుగు సాహిత్యాభివృద్దికి ప్రాంజలి ప్రభగా గూగుల్ ఫేస్బుక్ ట్విట్టర్ సహకారంతో ముఖ్యంగా అభిమాల ప్రోత్సాహంతో ఈ ప్రయత్నం 

సర్వేజనాస్సుఖినోభవంతు --- ఓం శాంతి:    

 దత్తపది:---ముద్దు,వద్దు,రద్దు,హద్దు

ముద్దుల చింతణ.. ముడుపై కదిలే 

వద్దులె అన్నను.. వలపై ముదిరే

రద్దని చెప్పిన.... రకమై బెదిరే

హద్దలు దాటిన.. భయమై చెదిరే

ఆధారం.. భ. భ.. స. స/7

......

హద్దు వున్నది జీవితమ్మిన హాయి పొందడ మెక్కడా

వద్దు వద్దని చేర నిచ్చిన వెన్ను పోటున తక్కెడా

ముద్దు చేసియు బంధ మాయెను ముప్పు తెచ్చెను ముందరా 

రద్దు చేయక సర్దు కొమ్మని చెప్ప రందు జనార్ధనా



నేడు వీరేశలింగం పంతులు గారి వర్ధంతి.


తే.గీ.ముద్దు పళని పద్యా లుండు ముద్దుగాను

వద్దు వద్దను లంచము పాపమగును

హద్దు మీరిమాటాడకు అమ్మ తోడ

రద్దు చేయవలెజియస్టి ప్రభుత యిపుడు

పి.మోహన్ రెడ్డి.

....

మమత మానవత్వమ్ముగా మనసు పంచ

సమత ఊసులు వివరణ సమయ పాల

అభిరుచుల అభినయ వాది అభినవకళ

ఘనుడు వేరేశ లింగం సు ఘన చరితుడు

(మల్లా ప్రగడ )

తన దేహము,తన గేహము

తన కాలము, తన దనంబు తన విద్య జగ

జ్జనులకు వినియోగించిన

ఘనుడీ వీరేశలింగకవి జనులారా!

(రామిరెడ్డి )

.......

“ కందుకూరికి కవితాంజలి “


ఆ.వె. “ కందు కూరి “ వారి దిందు వర్ధంత్యట

           స్త్రీల విద్య కతడు వ్యాప్తి నొసగె

           ప్రోత్సహించె చూడ భూరి వితంతు పు

           నర్వివాహములను నడుము కట్టి

           సంఘ సంస్కరణకు సాటి లేరు జగతి 

           నతులు శతము వారి నడత గతికి. 


27-5-2023

ముద్దులు మూటగట్టు సతి మోహన కృష్ణుని వేడె నీ గతిన్ "వద్దు.. మనోహరా! యితని పట్టి వధింపకుమా! ప్రయత్నమున్ రద్దు నొనర్పుమా! అఘము రాగల.. దీతడు బావమర్దియౌ.. హద్దులు మీరఁ బాడి యగు నా! విడిపింపుమ!.. సాగనంపుమా!"       ✍️డా.వెలుదండ సత్యనారాయణ                        పరమార్థ కవి

వయసు ఉడుకు ఆట వలదన్న ముద్దుకై వద్దు వద్దు అన్న వంక పెట్టు హద్దు పొద్దు కేక హారతి కాదులే రవ్వ వెలుగు ఆశ రద్దు పరుచు



🙏🙏🙏🙏🙏🚷🚷 వర్ణన...... హంస....వర్ణన హంస.......ప్రకృతి అంచ.......వికృతి 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️✅ హంస మేలును చూడలేవు సహించలేవుయు ఎందుకో మాంస మైనను పక్షియేయది వల్లమాలిన ప్రేమ మీ మాంస మేలను శ్వేతవర్ణ సమాన పక్షియు నేత్రమై హంసవాహన వాగ్దేవీ మది విద్యగాను జనార్ధనా ఇంటి పోరును గౌప్యమ్ము ఇంతి గతియు వంటి దుడుకుతనము వ్యాధి వవక మారు కార్య తత్పరత ధనము కామ్య మంత్ర నవివిధాల మందుయు దాన తపము జగతి దినవహి సత్యవతి: హంస వర్ణన ****** ఆ.వె. ధవళ వర్ణ పులుఁగు ధారుణిఁలో హంస, వాణి వాహనముగ వాసికెక్కె, పాలు నీరు వేరు పరుచు శక్తిగలది, అందమైన పక్షి యవనియందు!


భగబగ సెగలే తగ్గే జగమున వీడ్కోలు విడిదియు చలనము వేడీ తగువే లేకయు వానలు ఎగువన మొదలై నగోస ఎగసి పడేలే వ్యక్త అవ్యక్త ప్రేరణవర్ణములగు సృష్టి ధర్మము తెల్పుచు శృతిలయళగు మొగ్గ విచ్చి పువ్వగు ఎండ పోయి వాన కాంతి వచ్చి చీకటి తర్ము కాల మిది యు రోహిణి కార్తెకు వీడ్కోలు తెలుపుట ఉత్పల మాల పద్యం ఉక్కిరి బిక్కిరే యగుట ఉన్కిన వేడియు దృశ్యసంద్రమై చెక్కెర కర్గ భయ్యమగుట వేడియు వల్లన చెప్పలేకయే ముక్కెర జారెను స్వెదము ముచ్చమటే కలిగేను దృశ్యమై మక్కువ మేఘ వర్షమగు మానస శాంతికి మార్పుకేవిదీ సీస పద్యము నీల ద్యుతి అమృత నీలాల లావణ్య శుభకావ్య సంతోష శుభము నిచ్చు దాయని సౌఖ్య ప్రదాయినీ అలివేణి నడకల నయనాల నాట్య మిచ్చు భాషిణీ సుమనో శుభాంగి హాసిని గాను హృదయాంత మందున హద్దు నిచ్చి విద్యముఖ్యమనియు విశ్వాస ము చ్చియు వాగ్దేవి వినయమే వాసవి గను తే . విద్య పొందను లేనులే వినయము మది కఠిన శిలను నేను కళలు కలుషితములు వేడు కొందును వాగ్దేవి విద్య 😂కొరకు పుణ్య పాపము తెల్వదు పుడమి నందు మ.. తరుణమ్మే వినయమ్ముగాను మహి తార్ధ మ్మే స శోభా గురుం గురు సమ్మోహనమే మదీయ భవ గోప్యమ్మే స సేవే శుభమ్ ధరణీ తత్త్వ సమానమే సహన ధర్మాత్మా వివేకం జయమ్ గిరిజా నందన విఘ్ననాయక సుఖీలక్ష్యం ణ దేవం భజే 🙏🙏🙏🙏✅✅✅✅✅ నిశిద్దాక్షరి....... సరస్వతీదేవి వర్ణన...... ర........నిషిద్దము మీకు యిష్టమైన పద్యంలో అమ్మ శాంభావి వాణివి నాది శక్తి - సదువులకు తల్లి మానస సమయ యుక్తి ఎంత కొల్చిన అంతయే యదల భక్తి - భాగ్య సౌభాగ్య దేవత బంధ మందు

0001 న్యస్తాక్షరి.......... వై కుం ఠ ము పద్య పాదాది న రావాలి........

వైన తీయభవిత ఇదీ వైర మవని
కుంపటి సెగలు తప్పవు కూటి కళ ప
ఠము ఇదియగుట సహజము ఠంక శబ్ద
ము కదిలేనులే కలలకు ముఖ్య మౌను

0002 న్యస్తాక్షరి....... సు స్వా గ తం పద్య పాడాది న రావాలి...
సుమధుర పలుకులు పికము సుధలు చెల్లు
స్వాగతము పలికి వలపు సాధు వీచు
గతము వర్ధమాన జగము గారవిల్లు
తంత్ర మంత్రమగుట ఏను తల్లడిల్లు.
సుమతి మాట వినకశోభ సుఖము వదలి
స్వార్ధ పైత్యమే మనిషిగా సాగనీక
గతము తవ్వేగుణము మతి గమ్య మౌను
తంత్ర మంత్ర మనుచు బొంకు తరుణ మందు
* సు * రుచిరతనూవిలాస్యవిశోభితమ్ము
* స్వా * మిబాలకృష్ణునితాండవమ్ముఁగనఁగ
* గ * రుడవాహన శ్రీపతి గతియె మనకు
* తండ్రి * యు తల్లియు నాతఁడె త్రాతయుగద !!! "

0003 దత్తపది........ జొన్నలు కందులు పెసలు రాగులు
జొన్నలుడికించు అన్నము చొప్ప కాదు
కందులుడికించు పప్పుయు కధలు కాదు
పెసలు పిండిగా దోశలు పేద కాదు
రాగులు పిండిగా జావయు రక్ష కాదు
జొన్నరొట్టెలు బహురుచి జొల్లుకురియు
కందులపొడి గంధగుమలు కండ పెంచు
పెసలు పునుకులు నోటికి పెంచు రుచియు
రాగిజావయు బలమిచ్చి రమ్య మగుటె.
....
న్యస్తాక్షరి...... చంద్రమతి: తే:: చంద్రునికళలు విశ్వమై చేయు లీల ద్రవము సుఖమైన మనసును ధనమునిచ్చు మాన నీతియు తెల్పుచు మనుగడగుట తిమ్మిరి మనసు మార్చియే తీపి జేయు **** ఆ:: చ0దమామ చూడు చల్ల గా వెన్నెలే ద్రవము వెలుగు మనసు రమ్య పరుచు మానవాళి కళ్ళు మమతచేరుని వేళ తియ్యదనము తేన తీపి వలెను ***** చంద్ర బింబమోలె చక్కనిది ముఖము ద్రయభయంభుతో నదయకుసాక్షి మతిగతియునుమార్చు మాతశ్రీ వేధమ తివిరజల్లు ధననిధివిగ నీదు... *** తే:: శక్తి మూర్తులు పిల్లలే సకలమందు అవని అవతార మూర్తులు అరయు చుండు బ్రహ్మ విష్ణు మహేశ్వర భరత భూమి గానుగాపుర గురువుల గురువు దత్త ****** : భావ భావావేశం గల భాగ్య సీమ నిత్య.సంఘర్షణతొ ఉన్న నియమ దీక్ష భక్తి భావంతొ ఓర్పుతో భజన చేయు ధనము బలము సుఖము ధరణి యందు ***** ఉ:: జీవన సారము ఆకలి వేగము అర్ధము కాదును ఏల అనే మానవ మాత్రుడు చేసెను కర్మలు తీరక బాధల వల్లననే కాలము నీదియు కర్మలు నీవియు మానస ముంచుము సాధనగా కోరిన కోర్కెలు తీర్చెడి దత్తుని సేవలు నీకును ధర్మముగా .... ఉ:: మౌనమనోహర, గానవిలోలుడు, జ్ణానపిపాశుడు ధ్యానపరాా గానగలేకను చేరిక గాకును చేతులు చాచితి వేదికగా వైనము నాదియు వాదము దేనికి సాహస మైనను ప్రేమపరా దానము చేసితి,ధ్యానము చేసితి, కాలము నీదియు దైవపరా ****
నేటి శీర్షిక పూరణం వరములు పొంది నా, వయసు తొందర పోరును మార్చ లేకయే శిరము ను వంచి నా, మనసు మార్పుల కోరును ఉంచ లేకయే కరముల తోను నీ, పదము పట్టియు పూజలు చేయ లేకయే అరయగ నేతలూపినటి అప్పుకు తంబుర యీడ బెట్టిపో .... ఆమె మనసు నాది అనుట నటన తప్పు కలువ లేక ఉన్న ఏమి చెప్పగలను ఎవరికి చెప్పెదను ఆమె కొరకు ఉన్నానని కోమలాంగి అదియు కోటి మంది కన్న మిన్న అందమైన ఆమెకామెసాటి అణువు అణువు పంచు దేవతయే ఆమె ..... దర్శనము పొందలేని దుర్గతి నేటి ఆలోచన లో మధురిమలు ఆయుధ మేరా - భయము తెచ్చురా కర్తవ్యము రా - యుద్ధమే నురా మనసు ఉందిరా - జయము మందిరా ఆశ వద్దురా - ఓర్పు ఉంచరా కలను గాంచరా - విజయ ముందిరా కాలమందిరా - హృదయము తో రా బేధ మొద్దురా - లాభ మొద్దురా కధలు హద్దురా - నీతి ఉందిరా భరత భూమిరా - భాగ్య సిమరా మేలు చేయరా - జాతి మందిరా ఎందుకు తొందరా - ఆశలు వద్దురా ముప్పు తెచ్చురా - అప్పు తేకరా కళ నీ దేరా - కధ మనదేరా కలత వద్దురా - అదృష్ట మేరా చెలిని చూడరా - అంద మేనురా పెళ్ళికి ఒప్పరా - ముహుర్త మేరా పండు చూడరా - నోఋ యూరురా హాయి పాందురా - కొరుకు తీపిరా ణ కష్టం కలరా - నష్టం వలరా ఇష్టం అలరా - దుష్ట జనులురా
న్యస్తాక్షరి- తృ ప్తి లే దు - పద్య పాదాదిన రావాలి....... తే:: తృణము భక్తినుంచి ననేను తృప్తి గజ్ణ ప్తి గను శాంతిగా ఉండుటే ప్రేమ యగుటె లేత చిగురు మనసు కదిలేను విషయ దుఃఖమును తరిమేనులే దూర బుద్ధి ... తే:: సంకర మను జాతి ఘనులే సాకు చున్న గాంధి వారు అనుటయేల గాయముగను చిత్రమో ఇది ధనము తో చేయు మాయ ఋణము గాభాజ భజంత్రీ రుబ్బురోలె .... ఆ:: తృప్తి లేని చోట తృణమైన సుఖము ప్రా ప్తియును కలుగు లేదు పికము బ్రతుకు లేపనము లు వల్ల లేత మనసవదు దులుపు కున్న పోదు దూడ బుధ్ధి ... ఆ:: తృణకణముచిరుదయి గుణమునయాణువా ప్తిఘనమిలనబీజముగనెరుగుదు లేమిమనమునందులెక్కలే పెక్కుయు దుఃఖ భారమెరుగు దురితిలోన ... ఆ:: ఆదినుంచి నున్న ఆదరణను జూపె భరత మాత ప్రేమ భాగ్య లక్ష్మి మర్వ లేని బ్రతుకు మనసులో మాట యే సర్వ జనుల రక్ష సమత మమత ... తే:: పోషణకు నిత్య ఘటనలు పోరు లాగ వేషము లు వేయు బ్రతుకులు విద్య లగుటె భాషణకి అందులొ తెలుగు బాధ పెట్టె దూషణలు ఏలు రాజ్యపు దూది ఎగురు ***
తే::వృత్తి ధర్మాన్ని సలిపిన కృషి వినయుడు నిత్య ఆరోగ్య సంరక్ష నియమ దీక్ష వైద్య విద్య దేవాలయం వైన తీరు దైవ మానుష రూపేణ ధర్మ విధియె *** ఇ:: ఆనంద లాశ్యాలు.. అనురాగ రాగాలు అనుబంధ భావాలు ...అక్షర సత్యాలు మనసంస్కృతీ కళ ...మనసున వికసించు చిన్నతనంలోనె..చిన్మయ దీపాలు ... తే:: కవితలు కవిత్వ పట్టుగా కళలు ముందు నిత్యమూ పునశ్చరణ యే నియమ దీక్ష అక్షర మనుమాల లు పుట్టె ఆది నుంచి ధైర్య మన్నదైవకృపయే ద్వైత సిద్ధి .... తే:: వయసు వలపు దుమ్ము నుజూపు వాక్కు నందు నడక నేర్పు యువకుల కే వయసు కాదు ప్రక్క ప్రక్కనే మేధస్సు ప్రగతి తోడు తక్కువన ఏల సమయమే తనకు తాను ....
దత్తపది.....పప్పు,చారు, పెరుగు,కూర ఆ:: బేల పప్పు చారు భోజనం పెట్టుమా అప్పు చేసి పప్పు కూడు ఇదియె పెరుగు లోన ఉప్పు ప్రేమను పంచులే అరటి ఊచ కూర అధిరి పోయె ..... తే:: పప్పు అంటూనె పిలిచేను పుడమి తల్లి గుత్తి వంకాయ కూరను ఘుమఘమలు గ మలగ చారును పెడుతున్న ముందు తెలుపె పెరుగు లోఉల్లి నంచుము పలుకు వినుము .... సోయగాలు పప్పుచారు పెరుగు అన్నమే అప్పు చేయ కుండు ఆకుకూరలు పండ్లు పాలు నే మాకు చాలు అనకె చద్ది అన్నము దిబ్బ రొట్టె నూ వద్దు వద్దు అనకు తిండి వద్ద మనసు సోయగం .... ఉత్పల మాల తప్పులు చేయుటే వలదు తెప్పలు లాగున తేలు బుధ్ధవున్ అప్పులు చేసియే మనము పప్పు ను తిన్నను తప్పెయవ్వుటన్ కప్పల లాగనే కదలి కూరను తిన్నను జీర్ణ మవ్వదున్ చెప్పిన మాటలే మనసు చేష్టలు మారక కష్టమవ్వుటన్ ... si కాలము ఎదురీత.. గ్రాహ్యము లో శక్తి - మారు మాటలు లేవు మోన యుక్తి రమ్యపర్చని ఘ..నిరర్ధంబు పునరుక్తి - దోషంబలంకార దుష్ట రక్తి రస విరుద్ధం క్రియా రాహిత్య యుక్తి - రమ్యంబు కానట్టి .. రాస ముక్తి భంగమ్ము తెలపక.. భాగ్యమ్ము చూపియె - మాటలు పురికల్ప మచ్చరమున తే:: పుష్టి భోజనమ్ము కొరకు పలుకు మారు షష్టి పూర్తైన ఆకలి షకిలజోరు ముష్టి బతుకు లో ఆకలి మాయ జేరు ఇష్ట మైన పప్పు పెరుగూ ఇకను చారు ... నేటి దత్త పది :: తండా,గ్రామము,ఊరు, నగరము సంగ్రామము జరిగే అటుఇటు సందడిగా కురుక్షేత్రం భీమ విక్రమ పరాక్రమ భీకర సంగ్రామంగా ఊరులొ తండాలు తంతుయే ఉరుకులు వెల్లువయ్యె నగరము కు కరువు తాండవ నమ్మకం పెచ్చు పెర్గే .... అనుభవ పాఠాలే విలువగా ఆశయ సంగ్రామంలో ఆచార్య మాటల ఆధార మే మారి నగరమే ఇష్టంగా గుర్తించు ఊరుగా ఈశ్వర లీలలు గా మంచిని పెంచే టి తండాలొ మనసుకు విజయమే .... ఆనంద మోచ్చా క నగరము ఆత్రుత పెరిగే ను సంతోషం పట్టలేక నగర శోభయే మార్చెను లే కోపంతొ ఉన్న గ్రామము లోన కష్టాలు వచ్చెనులె ప్రేమలు చెరుగక స్నేహము పుడమి లో బతుకయ్యే మనసులో మలినమ్ము తొలిగితే మనుగడే న్యాయముగా కన్నీటిలొ కఠిన శిలలన్ని కరిగితే జయమేగా హృదయాలు ఒకటిగా మారితే శృతులన్ని శోభలుగా మనిషి వేదన లన్ని వేదాంతమైతేను ఆచార్య గా ... ఊరు తండా గ్రామము నగరం ఊయలే ఈశ్వరా నేటి దత్తపది....... పూరించిన పద్యాలు చెంబు, లోట, గిన్నె, బిందె తే:: చెంబు కలశమై పూజకి చరిత మయ్యె లోట పాలును పిల్లకు లాల అయ్యె గిన్నె రొట్టియు రుచిలోన రమ్య మయ్యె బిందె నీళ్లు పానకము యే బలము గయ్యె .... ఉ:: నీళ్లు ను చెంబడే కడెగె నీళ్లతొ కాళ్ళను మోఖమంతయున్ లోలుకె లోటలో చిలుకె లోలక పెర్గును మజ్జిగవ్వుటన్ నీళ్ళతొ బియ్యమే ఉడికి నిర్ణయ గిన్నెలొ అన్నమవ్వుటన్ నీళ్లు యె బిందలో నియమ నిర్ణయ దాహము ప్రాణమవ్వుటన్ ... తే::చెంబు మొహము నీదియె. చెత్త లాగ గిన్నె లో తల వుంచియు లుకలుకలు గ బిందె నెత్తిపై ఉంచియు బిరబిరా న లోట తోకొల్చి బియ్యాన్ని లయగ అమ్ము .... సీ:: కనలేని చూపులు.. కనువిందు చేస్తాయి - మనసైన వానితో.. మరులు గొల్పు మది తెల్పు పలుకు లే.. మనకిచ్చు ఘనకీర్తి - హృదయమే తృప్తి గా...హరిత మయ్యె మసృణమే కధలాయె.. మోనమ్ము ఛేదించె - మర్మమ్ము మాయలే ... మహిమ జూపె మృషలేని దృఢిమగా .. మాటలు తీరుగా - మేలైన విధి వాంఛ... వరుస కల్పె ఆ:: నన్ను గనము అమ్మ..నయన పూజలు నీకు - విన్న మాట తెల్పు చుంటి నమ్మ నిన్ను గొలుసు నమ్మ.. నిజము నే తెల్పితి - నన్ను నమ్మ వమ్మ... నాదు బుధ్ధి ... సీ:: ఈ శరద్వేల గా నిండు పున్నమి గాను - అనువైన దిశ గాను .. అంద మిచ్చె విహరణ వేళలు .. విజయవెన్నెలగును - ఆహ్లాద వేళలు.. హాయి గొలుపు పడచు జంటలు గాను.. పకపక నవ్వులే- వేడుక చెలికాడు.. విధిగ తెలుపు సమ్మోహితుడు గాను... సమ్మతి తెల్పె - కలువభామలతోను..కళల వేళ ఆ:: బిందె నెత్తిపై న...బక్కచిక్కె మహిళ - లోట యెత్తి కొట్టె చెంబు మోము గిన్నెమోముమొగుడు గంతులేసియును లే - ప్రేమపుట్టు బిగువుపడతి మొగుడు ((())) దత్త పది --- నారద ,శారద సోదర , బాదర ఉ:: నారద తెల్పెనే జగతి నేలును విష్ణు వె రక్షణమ్ముగన్ శారద పంచునే వినయ శాశ్విత విద్యను రక్షణమ్ముగన్ సోదర భావమే శివుడు సంపద శక్తి గ రక్షణమ్ముగన్ బాదర బంధనం వదిలి భ్రహ్మయు సృష్టి కి రక్ష ణమ్ముగన్ చంద్రిక శారద శ్రీ మాత శంకర పత్నియే సర్వ రక్షణగన్ నారద నారాయణా పలుకులే నిత్యముయె రక్షణగన్ సోదర భావమే సోదరి సౌఖ్య మే నిత్యము రక్షగన్ బాదర బందీలె భయము పెంచు మనుసు శాంతి తెంచు ... కం:: శారద తత్వమే మనసు నారద భాష్యమ్మే జగతి నేలు చుండు సోదర భావమ్మే కృషియు బాదర బందీలే భయము బాధ్యత యగు ... సమస్యను పరిష్కరించడం.... కాకి కోకి లౌనె కనక రాజ నా పూరణలు * ఆ..రాని వాన్ని పిలిచి రక్షణగా నేను ఆచి తూచి అడుగు ఆశ లేల ఆలి మాట విన్న ఆశలు తీరునా కాకి కోకి లౌన కనక రాజ .... *తే::.పొదిగి పిల్ల జేసి పొరలు నేయ జేర్చి కదిలెఁయండమందు కలవు కాల నీతి నిదుర మాని ని న్ను మధురం గహృదినింప కాకి కోకిలవున ఏమి కనకరాజ! .... తే:: అవసరం కాబట్టి మనసు మాట తెలుపు నిత్య ఆలోచనల తోను నేటి బ్రతుకు శాంతి విశ్రాంతి అవసరం సానుభూతి మనిషి జీవితంలో కళే మాన మగుటె ... *చిన్న పెద్ద యనే మంచి చేటు తనకు కష్ట నష్టము ఒక్కటే కాని రోజు గడ్డి తాడుయే గజమునే కట్టి వేయు మంచి యన్నది శాశ్వత మేను మనకు .... "*.. సరోరుహాక్షి ! హే రమ్యే సరోరుహాక్షభామిని.. సరోరుహప్రభే , లక్ష్మి , సరోజిని నమోऽస్తు తే !!! " ----
దత్తపది....... స్వామి ... ఏమి ... కామి .. లేమి ఆ. స్వామి చెంత నుండి శరణుకోరితిని ఏమి భాగ్య మిదియు ఏల బ్రతుకు లేమి తనము మాది లింగయ్య చూడుము కామి తములు తీర్చు గరళ కంఠ ...... తే:: స్వామి తడిక కంతలగుట సాధనమ్ము ఏమి దినమొక యుగ మాయె ఏల నయ్య కామి తార్ధ దర్శనము లేదు కాల మేళ లేమి దీన బ్రతుకు చింతలాఎ మనసు ...... తే స్వామి పదముల వ్రాలితి శరణు కోరి, ఏమి భాగ్యము పొందిన వాముని దయ, కామి తములను తీర్చుమా గరళకంఠ, లేమి మాపి మోక్షమిడుమా లింగమూర్తి **** వాముడు = శివుడు ...... మ. స్వామి తార్దము చేయ నెంచితి సామ రస్యత కోరియే ఏమి అన్నను మార్చ లేరును ఎల్ల వేళల ఏకమై కామి తార్ధము తెల్ప లేనిది కాల మైనను జీవమై లేమి ధైనను కాని ధైనను లేత దైనను జీవితం ... సామిని చేరలేక విధి సాధన చేయక ఏల నున్ననున్ కామిత భావ కుండు గను కాలము తీర్పును నమ్మి సేవలున్ లేమియు చూడు దేవుడుగ లీలలు పొందుట నిత్య సత్యమున్ ఏమియు తెల్ప లేని గతి ఏలను బ త్కు ట నేను శంకరా ...... వర్ణన...... శివరాత్రి జాగరణ ఫలితము తే. ఆది అంతము నుండును ఆట శివుడు పగలు రాత్రియు ఉపవాస ప్రకృతి తోడు జాగరూకత జాగార జాము రాత్రి హృదయ మందు శంకర నామ హృద్య ఫలము .... సీ:: లోకాల లేలేటి లోకేశ లయకారి - లింగ రూపము కల్గి లేచి రాగ లింగని ప్రార్ధించ నీడ నిచ్చు భవుడు - వల్లమాలిన భక్తి విజయ మిచ్చు శిరసున చంద్రుడు శీతల జాహ్నవి - మెడలోన హారము మేలు సర్ప దేహ బూడిద వస్త్ర తేజ త్రినేత్రుడు - మాపాహి శంకరా మౌన మేళ .... తే. నీదు శిరముపై దళమును నిజము నుంచి - నీదు నిర్మల మనసుయే విజయ మిచ్చు నీదు కైవల్య పదమును నిచ్చగించి - నీదు కళ్యాణ మొనరింతు నీల కంఠ .... .దత్తపది....... స్వామి ... ఏమి ... కామి .. లేమి .... తే *స్వామి* పదముల వ్రాలితి శరణు కోరి, *ఏమి* భాగ్యము పొందిన వాముని దయ, *కామి* తములను తీర్చుమా గరళకంఠ, *లేమి* మాపి మోక్షమిడుమా లింగమూర్తి ************ వాముడు = శివుడు సమస్యా పూరణ : పెళ్లి వలదంచు చెప్పిన వినక పోతి *** తే..చెల్లి కలనెంచి కథలన్ని చెవిన తెల్పి కళ్ళు కాచేట్లు వినయ వికాస ముంచి ఒళ్ళు గగర్పాటు విషయమే ఓటమి యని పెళ్లి వలదంచు చెప్పిన వినక పోతి ..... తే. విద్య నేర్చెడు వయసునే వేగిర పడి వల్లె యంటిని కన్యయే వలచి చేర పెండ్లి వలన నాశనమౌను విద్య నిజము, పెళ్లి వలదంచు చెప్పిన వినక పోతి ..... తే. చెప్ప నల్లవికాని మనసు చేష్టలగుట విద్య నభ్యశించా వెళ్ళ వేళ లగుట పెళ్లి అయినా సుఖము సౌఖ్య విద్య రాదు పెళ్లి వలదంచు చెప్పిన వినక పోతి ...... యక్షరాజ బంధవే దయాళ వేనులే నమః శివాయ దక్షపాణి సోభి కాంచనాల వేనులే నమఃశివాయ అక్ష పాద విభత పూత తా లవేను లే నమఃశివాయ వచ్చే రాజవాహ హృత్క పాల వేనులే నమశ్శివాయ ...... దత్తపది....... డబ్బు, రుబ్బు, మబ్బు, గబ్బు తే:: డబ్బు తోకొండపైకోతి డరగవచ్చు రుబ్బు మనసు మాయను మార్చు రూక కొరకు మబ్బుల మెరుపు కళ్ళను మనసు కుదుపు గబ్బు లేనట్టి బాంబుతొ గళము విప్పు ---- తే:: డబ్బు ఖర్చు ఫలితమేమి డాంబికమ్ము రుబ్బు తారు పాఠములన్ని తురుము మల్లె మబ్బు పట్టి పోవు భవిత మాయకమ్మి గబ్బు పట్టేను దేశపు గుణము నందు --- ఆ:: డబ్బు ముందుచూపు ఢాంబిక మగుటేను రబ్సు పత్రమగుటు ఋణము మల్లె మబ్బుకమ్మెపొగలు మనిషి బుద్ధులు మారు గబ్బువున్న తోడు గుండె యగుట --- *మల్లాప్రగడ వారి న్యస్తాక్షరి........ పూరించండి సం స్కా ర ము పద్య పాదాదిన రావాలి. ఆ::సంపదలులె కరుణ సంస్కృతి విశ్వాసం స్కార మగుటె కళల శాంతి కోరు రమణి చూపులన్ని రంజిల్లు చుండుటే ముదిమి విశ్య మాయ ముందు జేరు ... వర్ణన....... మత సంయమనం.......... తే. వాక్కుతో వర్ణనయు శఖ్యమేను కాదు మనసు ఊహింప నిత్యమూ మనుగడవదు శుభమగు గుణము మతముయే సుఖము అవదు నిష్టులగు వారి ధర్మము నీడ మతము ... న్యస్తాక్షరి........ శా స్త్ర మే నా పద్య పాదాది న రావాలి ..... రా.. శాత మవ్వుతే బ్రతకు శాంతికై బ్రహ్మ స్త్రముయె విశ్వమ్ము విజయ సాక్షిగా నుండు మేలు చేసినా కీడు చేసినా నిజము నాడు నేదునూ నీవు నేనూను నటన ......


ప్రాంజలి ప్రభ వర్ణన...... 07 -౦౩-2023 ప్రధాని మొడీ గారి ప్రతిభను వర్ణించండి. .... కర్మఫలములందాసక్తి కలుగుచుండ జన్మలెత్తెడి యోగంబు జరిగితీరు కరిగి పోవగనయ్యది కర్మ తీర జన్మనందక ముక్తుడై చనగనోపు ....... విత్తనాన్ని పాతి జలము పెట్టుటేను మొక్క ఎదిగి పూలును కాయ మొక్కకిచ్చు కర్త మోడీ మాత్రము నిత్య కార్య దక్ష దేశ ప్రగతికోరి విధిగా దినము సేవ ...... దేశ వృద్ధిసంకల్పము దీక్షగాను విజయ విజ్ఞాన సహచర వినయమేను దీన జనరక్ష పథకాలు ధరణి యందు ధైర్య మోడీ విజయముగా ధర్మ పాల ..... అరటి చెట్టు మొదలు నరికేసినాక కాయు అరటిగెలను చూడు కక్షకాదు ఎన్ని ఆటుపోట్లున్నాను యదును తెలుపు దేశ భక్తి మోడీ మన దివ్య పరము ..... ఇక్కడ పోతనగారి పద్యం స్మరణీయం. ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై; యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం బెవ్వఁ;డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్. భావం:- ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో; ఎవరిలో కలిసి ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; తుది, మొదలు మధ్య లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో; అటువంటి స్వయంభువు, ప్రభువు ఐన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను. ***
న్యస్తాక్షరి....... వి శ్వ క ర్మ 
తే:: విధ్య విశ్వానికందించు వినయ మునివి   
శ్వవిజయమ్ము విశ్వామిత్ర స్వానుభవము  
కమ్మని రచన సృష్టియు కాల మగు మ    
ర్మమును తెలుపగా సత్యమై రంగ రించె
.......
విద్య నువ్వే మమతగాను  జీవితము వి   
శ్వమున నిత్య అబద్దము శుభము కాగ 
కలల జగతిలో మాయేను కాల మది మ 
ర్మముయె  వేద వాక్కు పలుకు రంగ రించె  , 
........
విద్య ఫలితమ్ము  ఇంద్రియ కీర్తి సభ వి 
శ్వ మయ కుల, జాతి సమస్త శుభము నివ్వ  
కళలు పరమాత్మ మాత్రమే కాల మది మ 
ర్మముయె కేవలం  సత్యమే రంగ రించె
......
విద్య నువ్వే మమతగాను  జీవితము వి   
శ్వమున నిత్య అబద్దము శుభము కాగ 
కలల జగతిలో మాయేను కాల మది మ 
ర్మముయె  వేద వాక్కు పలుకు రంగ రించె  , 
........
విద్య ఫలితమ్ము  ఇంద్రియ కీర్తి సభ వి 
శ్వ మయ కుల, జాతి సమస్త శుభము నివ్వ  
కళలు పరమాత్మ మాత్రమే కాల మది మ 
ర్మముయె కేవలం  సత్యమే రంగ రించె  
.......

*దత్తపది...........
కథ  ...   కావ్యము ...  నాటకము  .... యక్షగానము
......
కథలు మొదలుగా రచయిత కలలు తెలిపి 
మనిషి జీవిత కావ్యము మాయ తెలిపి 
నిత్య నాటకము బతుకు నీతి తెలిపి 
యక్ష గానము చేయుటే యదకు తృప్తి 
......
" वैतालीय वृत्ते -- ( 1-3 చరణయోః..న న ర య ;
2-4 చరణయోః..న జ జ ర  గ..)
--
కథల వెతల కావ్యమే మనస్సే
వ్యధ కథ నాటకమ్ము యె జీవితం యశస్సే
విధి నడవడికా ఇదే తమస్సే
కధలతొ యక్ష మనస్సు గానమే సంతసం 
.....
*ఆ. ఇదిమది కథ కాదు ఈశ్వర సృష్టియే 
కలల కావ్యము ఇది కలసి బ్రతుకు 
నిత్య నాటకముయె నిర్మలమగుటయే  
యక్షగానము ఇది యదను తట్టు
....
దత్తపది....... రాళ్లు, నీల్లు, కోళ్లు, బీల్లు తేటగీతి రాళ్లు చెక్కి న శిల్పమై రమ్య పరుచు నీల్లు జల్లిన పుడమిన నిజము గనుము కోళ్లు ఆహారమగుటయే కొంత తృప్తి బీల్లు లోగడ్డి పశువు ల కేను తిండి ....... రాళ్లు రాజసముతొరమణీయజవరాళ్ళు నీల్లు గావధనము నిత్య శోభ కోళ్లునిలుపుపాన్పుకోరివచ్చుసుఖము బీల్లు బిక్కులేల బీధ లేల .... ఉ: రాళ్లునె చేక్కి నేర్పుగను రాసిన పోసిన పైడిబొమ్మగున్ నీళ్లు యె దాహతృప్తిగను నిర్మల తేజము సంభవమ్ముగన్ కోళ్లు యె నిత్య తిండిగను కోరిన కొందరి అశ తీరుటన్ బీళ్లున గ్రాసమే పశువు బృత్యము అవ్వుట నిత్యసత్యమే ...

త్రివర్ణ పతాకము....జాతీయ జెండా మధ్యలో అశోక చక్రము... మన జాతీయ జెండాను వర్ణించండి. * ప్రకటి త్రివర్ణ పతాకము ప్రగతి కొరకు భారత స్వతంత్ర కళలు భాగ్య మగుట గగన మెగురు యేలే జండ గమ్య మగుట వందనం త్రివర్ణ పతాక వర్ణ విధియె న్యస్తాక్షరి........ చి క్రో డ ము పద్య పాదాదిన రావాలి గీ*.చిన్మయి పరిచే యుద్ధము చేరువగుచు క్రోధమును అదుపులోనుంచె పోరు నందు డమఢమాశబ్ధ ఘోషలో డరుగు దెంచె ముఖ్య రామరావణ యుద్ధ ముసుగు నీడ ఆ..*.చింత యేల నీకు చెంతనే నుండగా క్రోధ లోభ మోహ శోక మేల డబ్బు కోసమాశ డుబ్బుకు కొరగావు ముప్పు తెచ్చు తప్పు ముఖ్య మేల చిక్రోడము = ఉడుత సమస్యా పూరణ న్యస్తాక్షారి ఆటవెలది: చిక్రోడము : పాదాదిన.. చి ర్రు బుర్రులాడి చేటు తెచ్చుకొనకు, క్రో ధమెప్పుడైన కొరివి యౌగ, డ బ్బు మించియున్న డాంబికము పెరుగు, .... ఆటవెలది: పతాక వర్ణన **** *. మూడు వన్నె లున్న ముచ్చటై నపతాక నీలి చక్రమొకటి నిలిచె మధ్య భేషుగాను చేసె పింగళి వెంకయ్య భరత దేశ కీర్తి వ్యాప్తి జేసె ** * సర్ప సయణసామి యుపేంద్ర సాగరమ్ము సర్ప భూషణ ధారియు శివుడుయేను సర్ప పూజలు పాటలు సతులు పతులు సర్ప కళలు నాయకులలో సరయు పలుకు * జీవన తతంగ పయనమే గీత బోధ జీవన కళ చిత్రపటమే గాలి బోధ స్వేచ్ఛగా అవకాశ మే స్నేహ బోధ మనిషికి నియంత్రణలు వుండు మాన మందు *. పెద్ద ముల్లు నాతో మీరు పెనుగు లాటె చిన్న ముల్లు ముద్దు కలిపి చేరువగుటె ప్రతి సెకనుకు నిముషాలు ప్రీతి నిచ్చె గంటలు తిరిగి రోజులు ఘడియ ఘడియ
....
దత్తపది....... దంతెలు దూలాలు స్తంభాలు కిటికీలు
* దంతెలు వరుస పైకప్పు ధర్మ మగుటె
నిలువు దూలాలు మోయుటే నేటి వసతి
మధ్య స్థంభాలు కిటికీలు మనసు యిల్లు
గాలి వెలుతురూ చేరుటే గోప్ప నిలయ
...
*..గాలి ఇచ్చి పుచ్చు గాళము యగు తోట
చిల్ల రగుట ఏల చేరు వగుట
మనసు మెచ్చు పూలు..మమత ఆటల బాట
వయసు వుడికి నడక వరుస  మాట
...
*..జాతి యనుచు గొప్ప జాడ్జ్యము ఎందుకు
గతియు కూడు గూడు గుడ్డ లేదు
జాతి లక్ష్య మగుట జనులకు రక్షగా 
రాజ కీయ లబ్ధి రాసి వద్దు
...

*..సౌఖ్య జీవితమ్ము సంతోష సంబరం
తీపి చేదు కలిసి తపము దారి
ఆశ దుఃఖ మగుటె ఆటప్రయత్నాలు
సామ దాన భేధ సమత జీవి
***
ఆటవెలది
సం స్కృత సమమైన సముచిత "తెలుగు" సం
స్కా ర సహిత విభవ సంపదిలను
ర జము నొసటి తిలక రమణీయ సౌభాగ్య
ము దము గూర్చునట్టి ముదిత ముఖము
#చెన్నమాధవునిభాస్కరరాజు

ఆ|| సంపదలను గోరె స్వార్థుల కన్న సం
స్కార గుణము గలుగు వారు మిన్న
రత్న శోభ కన్న రవ్వంత కుంకుమ
ముదిత బెట్టుకున్న ముఖము వెలుగు
సందీప్ రెడ్డి 
...
సం*స్కృతులను దాగు సారమ్ము మదిపుర
స్కార ధర్మ నిరతి గర్వ మగును
ర*మ్యమైన జాతి రంజిల్లు లోకాన
ముదము శాంతి గూర్చు హృదయమంత
M N మూర్తి 
....
* దత్తపది...బొమ్మ..నిమ్మ...కొమ్మ...అమ్మ బంగరు బొమ్మవిశ్వమున బంధము నిల్పుట బాధ్యతేయగున్ మంగళగౌరి ఆశ్రయము మానస నిమ్మ నె కోరివేడుకన్ రాగము వల్లనైననులె కొమ్మలు పువ్వులు నాట్యమవ్వుటన్ యోగము నిత్యయవ్వనము యమ్మల దీవెన పొంది బత్కుటన్ .... *దత్తపది :: కరము, చేయి, మిక్కిలి, తొ0డము తే ::కరము లందున యరుణపు కమలములతొ చేయివేడుకే ధనపాత్ర చేతఁబట్టి మిక్కిలి ముదమునిత్తువు మిక్కుటముగ తొండములపూలవిరజాజిదండలిడుతు ..... తే..కరము ఆశ్రయించిన వారి కార్య* శోభ చేయి చేయి కలిపు కళ చెప్పుకోక మిక్కిలి కళలు సినిమాలు మీన కళ్ళు తొండము నచిక్కి నలిగేను తోడు కొరకు ... దత్తపది......పెక్కు, చిక్కు, ముక్కు,క్రక్కు ..... తే...పెక్కు సంఘటనలు మాకు పేరుతెచ్చె చిక్కు ముడులు ను విప్పి యు చింత మార్పు ముక్కు పుడక యే మెరిసేను ముఖము వెలుగు క్రక్కు ఎంగిలి బ్రతుకులో కూడు గూడు .....

*దత్తపది...... కనము, వినము, మనము, జనము

* చం.. కనముగనే మనోమయ కవిత్వ పటుత్వ జపత్వ మవ్వుటే
వినము సహాయసేవలు విచిత్ర కళత్ర పవిత్ర మవ్వుటే
మనము వినోదమేయని మనస్సు వయస్సు యశస్సు కోరుటే
జనము నకామమోక్షము సుశాంతి సుధర్మ సురక్ష కోరుటే
.....
*: సీ..కనము జనుల బాధ కనికరం ఏలనో - జనవేదనలనెప్డు..జపము ఘోష
వినముఏనిమషాన...వేదన పల్కులు - మనకేల ననుచునే ..మనసు ఘోష
మనముచల్లగనున్న..మనుగడ చల్లగా - మనలోన మంటలు..మాట ఘోష
జనముసొమ్మ కొరకే..జపము చేయు పలుకే - నగుటవలనకన ..నయన ఘోష
ఆటవెలది
కష్టం సుఖ మందు కన్నవారి కళలు - కోపము వినుము మనము కాని దైన
ఉపశమనమగుటకు ఉత్త మమునుకోరు - నిర్దయవలన మనిషి నీడజేరు
---
* వికసిత కుసుమం విశ్వమై వినయ మగుటె
నిత్య ప్రభల లోకం కళ నేటి తీర్పు
గగన సాకార పుడమియే గశము విప్పె
నిర్మల సుఖశాంతి గమనం నిజము ఓర్పు
.....
* తల్లి అశృ ఒకటి కనేను తప్పు కాక
కుంకుమ భరణ లేకయు కూలి పోయె
నక్షత్రమువలె రాలెను నయన అశృవె
కాల మాయతెలియకేను కంటి ధార
......
*వయసు తరగి ముసలితనం వేడు కగుటె
వయసు పెద్దరికం లోన వాద నగుటె
వయసు లోనిరంతరమేను వాక్కు లగుటె
వయసులో నేర్చు పాఠము విజయ మగుటె
......
" సువచశ్శాస్త్రాదిబుధా !
కువచోవారక ! గురుగుహ ! కుమతినిహంతా !
సువపుస్సురుచిర  ! కనుమా
సువచస్స్తుత్యా ..కరుణను 'సుబ్రహ్మణ్యా' !!! "
----
* వికటకవి గాను కనమును వేగ పరిచి
సంకటపుబుద్ధి ని వినము సంధి వలదు
మనము ఏకమైన కళలు మాయ యగుటె
జనము మనమాట ధనదాహ జపము యగుటె
----
* కనము * జనవేదనలనెప్డు కాతరమున
* వినము *  జనఘోష మనకేల పిలిచినంత
* మనము * ౘల్లఁగనుండెడి మనుగడకద
* జనము * సొమ్ముకమ్ముడుపోయి శఠవశులుగ

నగుట వలనకనమనుటనంతఁదప్పు.."
----
* తే..భారత చరిత్ర కనముగా భాగ్య పరచి
రాజకీయమే వినమను రంగరించి
దేశ భక్తి గా మనముయే దేహ మందు
జనము నేడదియేయుక్తి జయమునిచ్చు
......
* కనముమదినందుమధురమే కమలపతిని
వినముసుమధురపలుకులువీనువిందు
మనమునందున మహనీయ మాధవున్ని
జనముమునిగిరి ధనదాహ జలములందు..
......
సమస్యను పూరింవడం.......08-02-2023 సుగ్రీవుని యెడమకాలు శునకము గరచెన్ 🛑🛑🛑🛑🛑🛑🛑🟢🟢 కం. నిగ్రహ విద్యయు నిత్య స మగ్ర వినోదము వివాద మనుగడ వళ్ళన్ సంగ్రామ ముగాంచి యొక సుగ్రీవుని యెడను కాలు శునకము కరచెన్ ..... కం. యోగి పలుకులే మనసును మూగగ మార్చే విధిగ సమూహ అరుపులే మ్రాగిన శబ్దము మాదిరి సుగ్రీవుని ఎడమకాలు శునకము గరచెన్ ........ దత్తపది........09-02-2023 శ్రీపతి .... శ్రీసతి ... శ్రీమతి .... శ్రీయతి ❤️❤️❤️❤️❤️❤️🚷 ..... ఆ..కోట్లు పెట్టి గుణము కొనలేము శ్రీసతి శ్రీ పతి దయ నిత్య శీగ్ర సుఖము చీకటాపలేము చేష్టలు శ్రీ మతి అహము వల్ల బ్రతుకు అగచాట్ల శ్రీ యతి ......... తే. రుచులు వేరు శ్రీపతి తృప్తి ఋతువు వలెను09- గుణము వేరు శ్రీ సతి తృప్తి కులము వలెను తరుణ మాయ శ్రీమతి తృప్తి తనువు వలెను కరుణ వేరు శ్రీ యతి తృప్తి కథల వలెను ....... ఉ. శ్రీపతి కోరగా కదిలె శ్రీ సతి తోడుయు నీడ గుండుటన్ శ్రీ సతి ఆశయమ్ము కళ శ్రీ పతి తీర్చియు సేవ చేయుటన్ శ్రీమతి నిర్ణయమ్ము కళ శ్రీ యతి మార్చును సృష్టి ధర్మముగన్ శ్రీ యతి దైవధ్యానమున శ్రీ శృత భాష్యము తెల్పగల్గుటన్ ........ న్యస్తాక్షరి......10-02-2023 నై .. ష .. ధ .. ము పద్య పాడాదిన రావాలి ✅✅✅ నైమిశారణ్య భోధలు నిత్య విధి వి షయ విజయ విశ్వ జనని యశోదయమ్ము ధరణి లీలలు వికసించ ధర్మ తేజ ము సమయమ్ముగా సుఖముయే ముఖ్యమగుట

నేటి పద్యాలు
వర్ణన....
తటాకము......(చెరువు)  ను  వర్ణించండి
⚫⚫⚫
మ. నీరు నిండియు పోర్లి పోవుట నింపు గానను లక్ష్యమై
సారమైనది పంట బాగుకు శ్రద్ధ చూపుట సత్యమై
పారు భూమిన సృష్టి ధర్మము పాడి పంటకు నిత్యమై
దారుణమ్మును తొల్గజేయును ఆ తటాకము దివ్యమై
......
✅✅✅🙏🙏🙏🙏⚫⚫
వర్ణన..........
ఉగాది పచ్చడిని గూర్చి వర్ణించండి.

తీపి పలుకులు కరిగేను తిష్ట యున్న
వగరు పొగరు చూపులు యుండు వేడి యున్న
చేదు విషము ఇచ్చెది బుద్ధి చింత యున్న
పులుపు మనసువికట మైన స్ఫూర్తి యున్న
.....
మమత కారపు మంటలు మనసు చేరు
ఉప్పు పప్పుకూడు బతుకు ఊయలూగు
నవయుగాది సృష్టికి ఆది నమ్మ బలుకు
శోభ కృత్ బ్రతి కెడి బాట ఓర్పు నిచ్చు
..
తీపి పలుకులు కరిగేను తిష్ట యున్న
వగరు పొగరు చూపులు యుండు వేడి యున్న
చేదు విషము ఇచ్చెది బుద్ధి చింత యున్న
పులుపు మనసువికట మైన స్ఫూర్తి యున్న
......
సమస్యను పరిష్కరించడం.....
నెల బాలను జూచి బాల నెల బాలాయెన్....

కం. కాలమనస్సుకు అర్ధము 
బేల పిలుపు లో న మాయ కీలకమగుటే    
గాళము తిరిగేట్లు కదులు 
నెల బాలను జూచి బాల నెల బాలాయెన్....
.....
 న్యస్తాక్షరి........ వీ  ర  బ్ర  హ్మ పద్య పాదాది న రావాలి.

వీణ నాదము వీనుల విందు వినయ  
రమ్యత తరుణ శోభలు రంగ రించు    
బ్రతుకు పాటల మాటలు బంధ పరబ్ర    
హ్మముగను విధిగా విశ్వము హాయి గొలుపు
--
* చెట్టు *:నిచ్చునుసౌఖ్యంపు శీతలమును
* పుట్టఁ * గలయహిజేజియె పూర్తిరక్ష
* గుట్ట * నుండుసుగ్రీవుఁడు కోరెమైత్రి
* మెట్ట * లఁదిరుగు రాముఁడే మేఁటియనుచు !!! "
----
 పుట్టమట్టి తెచ్చి లింగ రూపు చేసి తీ నమః శివాయ
చెట్టు నీడ నుంచి పూజ చేసి మొక్కి తీ నమః శివాయ
గుట్ట లన్ని తీసి వేసి గుడిని కట్టి తీ నమః శివాయ
మెట్ట పల్ల ములను మార్చి మోక్ష మడ్గి తీ నమః శివాయ
....
వర్ణన.........
కామధేనువు......వర్ణన

కోర తగ్గదియే కోరికలను దీర్చ
కామధేనువన్నది చేరి కాదనదియు
తపము చేత పొంద గలిగె తనము యుక్తి 
బలిమి కలిమి పనికిరాదు భక్తి ఒకటి
.....
న్యాస్తక్షారి.. కా  కీ  కే  కై 

కా ల మనోహర మాధవ 
కీ లక నిర్ణయము తెలుప ఈశ్వర కృపగా
పలుకే కై వారము గా
తెలిపే కులు కే సుమధుర తిష్టగ నుండెన్
....
పాదాది న్యస్తాక్షరి:--మం,త్రా, ల,యం.

తే.గీ.మంచు కొండని వాసము మదన వైరి
త్రాడు తోతీయును యముడు ప్రాణములను
లయముచేసేత్రిపురముల త్ర్యంబకుడు 
యంథకాసురుఁ జంపెను అగ్గికంటి
.....
దత్తపది:--కొడవలి,గొడ్డలి,పార,గుద్దలి

తే.గీ.కమల,కొడవలితో  కోయు కందిపంట
తరుణి నరకు గొడ్డలిచేత తాటి చెట్టు
పార తోచేయు మిట్టను పల్లముగను
కలికి,గుద్దలితోత్రవ్వు కందకమును
.......
న్యస్తాక్షరి..... పు ట్ట ప ర్తి పద్య పాదాది న రావాలి 
💙💙💙
ఆ.. పుడమి నందు బ్రతుకు పుట్టుట గిట్టు ట
ట్ట పని పట్ట తట్ట టక్కు ఢమర
పగలు రేయి ఒట్టు పెట్టి పంచు బ్రతుకా
ర్తి యిది ఆట పట్టు రెచ్చ గొట్టు
.....

తే:: బురద అంటనిదే శుభ్ర భుక్తి పోతు  
దురద తాకని దే బుద్ది దున్నపోతు 
వరద రానిదే మురికిఏ వాస నుంచ      
చిరుదరువులేక మనిషియే చిక్కి పోవు 
న్యస్తాక్షరి......... క ... ర్మ .... యో ... గి ... పద్య పాదాది న రావాలి తే:: కలిమి బలగము సకలభోగ్యములు గలధ ర్మ మిది నిత్య సత్యము గాను రమ్య మైన యోగ్యతలనుబట్టి కదిలే మోక్ష మిదియు గిరిని నదిని విధిని నమ్ము గెలుపు మాయ న్యస్తాక్షరి......... క ... ర్మ .... యో ... గి ... పద్య పాదాది న రావాలి ఆ:: కలలు వచ్చి మనసు కధలు గా ఏల మ ర్మము సుఖాలయ మగు రంగుల కల యోగి చెప్పు బోధ యోగ్యమైన దగుటే గిరిధరుని కొలుచుట గొప్ప కళలు న్యస్తాక్షరి......... క ... ర్మ .... యో ... గి ... పద్య పాదాది న రావాలి కర్ణకుండలధరి వీవు కాలపాశ మే నమశ్శివాయ ర్మర్మ విశ్వ శుభతరుణము రమ్య తగుటే నమశ్శివాయ యోర్మి శూరసింగమోలె యోగ ధరణి యే నమశ్శివాయ గిర్మి హిత్యశుభయు తెలుపు గెల్వ గలుగుటే నమశ్శివాయ *దత్తపది..సత్యము, ధర్మము,న్యాయము,నడవడి సత్యము అహింస కరుణ యే స్థితికి నిధియు ధర్మము ప్రకారము జీవి దారి విధియు న్యాయము హృదయాన్ని కదుల్చు నడక తిధియు నడవడి మనసు బట్టి యే నాట్య నదియు ...... * దత్త పది పెడా, పేడా,పెండా, పండు గంపె డాశలు జీవికి గుండె తట్టు ఆవు పేడతో పాలతో ఆశ నెట్టు గెలుపు పండుకోసము ఓర్పు గొప్ప పట్టు మనిషి లోన పెండాశలు మనసు గుట్టు ..... * న్యస్తాక్షరి....... ఏ కా ద శి ఈ అక్షరాలు పాదాదిన రావాలి. పూరించిన పద్యాలు ఏకమగు చెలిమి యేను ఏలు బడి గ కాపు రమ్మునసఖ్యత కాల మార్పు దశల ఫలితములను పొందె ధరిణి యందు శివుడు నారాయణుడి యందు సీఘ్ర చెలిమి ...... (ఏ )క లవ్యుని అంగుష్టి కేది సాటి? (భార.) (కా )ర డవుల కేగిన రామ గాధ లెన్నొ!(రామా.) (ద )ధి మహర్షి దానంబు తలప తరమె? శిరము వంతు భారత సాహితీ!రవళికి ..... * న్యస్టాక్షరి......... రా, వే , రా , ధా ఈ అక్షరములు పద్య పాదాదిన రావాలి. సీస పద్యము రావాలి రావాలి రతి రాజ సుందరా - రాస లీల ళ వేళ రమ్య పరచు వేవేల దండాలు వేకువ జామున - విధి నీది మతి నీది విజయమే ను రాచరికం కాదు రాజ్యమే ఏలు ము - రమ్ము వేద విహార రమ్య పరచు ధారణ ధారిణి ధావ న పరుచు ము - దాత్రిగ పొందుము ధర్మ నీరు ....... ఆ. రావె రవ్వ ల చిలుకా పంచు ప్రేమను - వేల కాని పలుకు వేళ అనకు రామ కృష్ణ నామ మే నేడు పలుకులే - ధార గాను సా గె ప్రేమ పిలుపు .... న్యస్తాక్షరి......లం, కా, పు, రీ లంకె బిందెలు ధరణి లో లయలు చెంది కాల నిర్ణయ ప్రభవమే కదులు చుండి పురము సంఘటనలు ఏన్నొ పుడమి నందు రీతి ఏదైనా సాధ్యమే రమ్య పరచు .... * న్యస్తాక్షరి సీ , తా ,రా ,మ 🙏ఈ నాలుగు అక్షరాలు పాదాదిని రావాలి 🙏 పాదాది తో 1 కలిపి 1 ===2పద్యాలు పాదాది లో సీస పద్యం ==లౌకికార్ధం సీ : (సీ)మంత మొందిన శ్రీమతి చిరునవ్వు - పురుషుల కిచ్చును పూర్ణ యశము!! (తా)నేక పత్నీ వ్రతాన నుండెడు వాడు - శ్రీమతి కిచ్చెడి సిరియు గాదె? (రా)గ బంధాలతో రాజిల్లు బంధంబు - వంశాల కిచ్చెడి వైభవంబు!! (మా)జంట నాదర్శ మౌ మీ కటంచును - జగతికి నిత్తురు! సాక్ష్య మెపుడు!! తే. వదలనే? సీత! రాముని వనముల దరి!! - రాముడొదిలెనే? సీతను!! రావణు దరి!! హనుమయే!సాక్షి!!వారి కహరహము నట!! - అట్టి దౌ బంధంబు నెపుడు! గట్టి దౌను!! --- దత్తము (రాయి -రప్ప -చెట్టు -పుట్ట ==తే. గీ.) తే: రా! యిటంచు జానకియె! హారమ్ము నీయ! రప్పల, కనపడడె? రఘు రాము డటంచు! *చెట్టు దిమ్మరి, హృదయంబు చీల్చు కొనగ! పుట్టెనె! హనుమ హృదయాన పూర్వ మందు!! (*చెట్టు దిమ్మరి =వానరము (శబ్ద రత్నాకారుడు ) ) (నాకు పంచపాది నిషిద్ధం 🙏🙏 బా. వ్యా.---రాయి >>రాతిని నేయి >>>నేతిని @అన్నట్టుగా ) ....... తే:: రాతి నేలిన వాడట కోతి నేలె!! రప్పల నడచి రావణు కుప్ప గూల్చె!! చెట్టు చాటున దాగున్న సీత మగడ!! పుట్టవేమయ్య!!మాయింట!పుణ్య పురుష .......
*న్యస్తాక్షరి...అ. ధ్య. క్షు. లు అన్ని వేళలా సుఖముగా ఆటలతొ మ ధ్యమము మవ్వుటే సహజమే ధ్యానమధ్య క్షులగ జీవితంలో ననే క్షమ గుణమగు లుప్త బుధ్ధితో ప్రేమగా లుండ గలుగు ...... ఆటవెలది అదియ ఇదియు ఏదియు అనటయేలను మ ధ్యమము నవ్వు లగుట ధ్యాస మధ్య క్షులుగ దుఃఖ మయము క్షణముయే సుఖమగు లుప్త బుద్ధి తోను లుండ గలుగు ..... వర్ణన..........7........ తల్లి....భార్య వీరిద్దరి తారతమ్యం సమస్యా పూరణ: *తల్లికి భార్యకి తారతమ్యం* ************** తేటగీతి: అమ్మ యిడును నీ కస్తిత్వ మవని యందు, స్వార్థ రహితముగ పంచు జనని ప్రేమ, తల్లి వలెనె సేవలు చేయు ధరణి యందు, నీదు జన్మకు సఫలత నిడును సతియె తల్లి నిత్య జీవిత మందు తప్పు తెల్పి సమయ సందర్బ పలుకుగా సహకరించు భార్య తృప్తి పర్చియు నిత్య బంధ మౌను మనసు గుణ సంపదకు మూల మగుట సతియె చంద్రిక పద్యం అమ్మ నిత్య సత్య ఆత్మ తృప్తి పరచు ప్రేమ నందించుట అమ్మ సర్వ మయము ఆత్ర ఆకాంక్షను తీర్చు దేవతేయగుటే అమ్మ వేరొకరికి కాల నిర్ణయమ్ము భార్య యగుట ఏను అమ్మ కితోడుగా ఆత్మబంధమగుట కోడలిసేవయే ద్విపద... సతితో.. పతి వగగుల్కు సతితోను వాసుడై వెలయు నగ ధరండు సతికి నాటక తృప్తి భాగంబు పంచుచూ భాద్యత కరుణ రాగుడై సతిదయ రాశిచే వెలసి మగధీర మనసునే మాయలో తేల్చి వగలన్ని సవిచూపి వరుసగా పంచి చిగురాకు సొగసుగా చింతనే తొలచి సుగుణాల చిరుహాస సుమధుర సుదతి *సాటిజీవుల మేలుకొరకు* జీవధాత్రినందు ప్రేమగల్గినజీవి మనుజులుందురుకళ మాయ యందు తోటిజీవులకళ మేటి రక్షణకోరు కోరిచేయుచుండు కొంత వరకు నాల్గుగింజలేయ నటన ❤️నెంచకయుండు పక్షి రక్షచాలు పగలు రాత్రి నలుగురి కళ మెచ్చ నిజమునే తెలుపుటే నాల్గుదిక్కులందు నటన ఏల సహజవనరుల కళ సహన రక్షలగుట పక్షులన్ని జీవ బంధ మగుట నేలతల్లియందు సేమమెంచెడిజీవి మేలుకోరెడి కళ మేలు చేయు 0
న్యస్తాక్షరి........ క వు లా రా పద్య పాదాది న రావాలి. తే:: కన్నె వయసు సొగసు చూసి కలలు తీర్చ వుండ బట్టలేని గతిగా ఉరక పెరిగి లాస్య మాడుచు మగువ చలాకి చూడ రాస పుండులా తొలచును రాత్రి వేళ

💙💙💙💙💙❤️❤️

న్యస్తాక్షరి.......

ఛీ 
ఛా 
పా
పో

పద్య పాడాది న రావాలి.

🚷🚷🚷🚷🚷🚷🟢🟢🟢

ఛీ యని కోప భావమును చేర్చు మనో మయ ఇంతి బత్కు గా
ఛా యని చెడ్డ మాటల ను తామస బుద్ధియు తెల్ప గల్గినా
పాయల నీరు సల్పెడిది పారెడి లక్ష్యము పొంచి యున్ననూ
పో యని చెప్పలేక కళ పోరు తనమ్ముయు వేళ బత్కు గా
......
✅✅✅✅✅✅❤️❤️❤️

న్యస్తాక్షరి......

పా
పా
పో
పో

పద్య పాదాది న రావాలి.

🚺🚺🚺🚺🚺🚺🚺💚💚

పాప మైనను మంచికై పారు తీరు
పాడు బుద్ధియు ఆశగా పాకు తీరు
పోటు తనముయే ప్రోద్బ ల పోపు తీరు
పోరు బ్రతుకుయే జీవితం కోరు తీరు
.......

ప్రాంజలి ప్రభ వారి..04-10-2022
దత్తపది పూరించండి

మట్టి , గట్టి , ఉట్టి , తొట్టి

ఇచ్చా చందస్సు

*********************
🌹🌹🌹🌹🌹

మట్టిని నమ్ముటే ను మన మానస శోభకు నిర్మలమ్ముగన్
గట్టిగ వాద నేల మన గమ్యము మారుతు కార్యసాధనల్
ఉట్టిని పట్టి గెల్చితిని ఊయల లాగను ఊగి పోవుటన్
తొట్టిన నీరులాకదలి పోవుట జీ విత జీవసత్యమున్

🙏🙏🙏

దత్తపది..... కరము, వరము, పరము, తిరము 🌞🌞🌞 తే. కరములు కలిపి కౌగిలి కార్య మగుట వరము తలవని తలపుల తపన మగువ పరము మధణుడి కోరిక ప్రణతి భావ తిరము సంతోష సౌఖ్యము సేవ యగుట ---- * కరము * లుకరములనదఁగును * వరమ * గునుపకృతిసబుద్ధిపరములయినచో.. *పరము * నయశములభించును *తిరము * నులేనిపుటుకయిది ధీనిధి వినరా !!! " ---- న్యస్తాక్షరి........ వా .... క్యాం .... త ... ము .... పద్య పాదాది న రావాలి తే. వాసనా సుకుమార సువాస వర స క్యాంత సుమధుర సుకన్య కాంతి కరుణ తమక విద్యు లతావిత తరుణ దయయు ముఖ్య మమకార వాంఛ ప్ర ముఖము విధియు --- ఆ..వావి వరుస తలపు విజయము వాంచ స క్యాంత కామ్య కళలు కాల మదియు తరుణ మందు సుఖము తనువుగా తృప్తి యు ముందు వెనుక కధలు మురిపము లగు


న్యస్తాక్షరి......


రు
డా
ద్రి

పద్య పాదాదిన రావాలి......

♠️♠️♠️

రా..గమన జీవితం ఇదియు గమ్యము లేదు
రుద్ర భూమినా బ్రతుకు ఋతువులా ఇది త
డార ని కళల కధలు డమరకం లాగ
ద్రితము ద్రుతములా కదలి తీర్చును బ్రతుకు

సమస్యా పూరణ: దత్తపది
*మట్టి, గట్టి, ఉట్టి,తొట్టి*
*************
ఆ.వె.
*మట్టి* కుండలోన మంచి వెన్నను నింపి,
*గట్టి* మూత గట్టి *ఉట్టి* మీద
కుదురుగానుయుంచ, కృష్ణుడు దానిని,
*తొట్టి* మీద ఎక్కి దొంగి లించె

శ్లోక తత్వాన్ని తెలప శోభను పొందు
పండిత సమక్ష మందు ప్రభలుగా నుండు
పామరులయందు గడ్డి పాకమగుటె
లోప మయ్యే లకార శోకము పెంచు

మదిలొ వీణలు మ్రోగె మధుమాస మగుటె
ఆశ లెన్నియో రేగె అనుసరమగుటె
కలలొ కనలేని కళలె కథలుగా మనుటె
ఇలలొ విరిసేను మతియు ఈశ్వర జగతి

సమస్యా పూరణ : న్యస్తాక్షరి
*గ రు డా ద్రి*
***************
ఆ.వె.
** రుడ వాహనుడిని కాంచ వెడలితి తి
*రు* పతి, భక్త ప్రియ తిరుమల నాథు
*డా* తడు తొలగించి వెతలు కాచు గరుడా
*ద్రి* నిలయుండు, యొసగు దీవెనలును.

వ్యాధి బాధతో చేరె వైద్యుణి చెరకు
దండు కోవటం డబ్బు తరుణమే యదియు
పుండుపైకారమేను పూర్తిగా 😂దోచు
ఎద్దు పుండుకు కాకి పెట్టు ముద్దుయగు

దేవ దూతలరూప దేహ రహిత మె
మీదు సంస్కార మగుట మేలు హితము యె
తీవ్ర లక్ష్యము వల్ల తీరు దేహమ్ము
సర్వ మానవ సృష్టి సహనము తీర్పు

రా..వయసు ఉడుకుతో పొందె వలపుల నలుసు

చక్క దనములో నున్న చదువుల తల్లి
పసిడి మేని ఛాయగను పలుకుల సొగసు
మనసు పులకించు నటుల మముచూడు తల్లి

ఆ:: ముదిమి వయసు నందు పుట్టెనాకు నలుసు,
చక్కదనములొలుకు చుక్కయామె,
పసిడి మేని ఛాయ, పలుకు సొగసు లొలి
కించె, మనసు యె  పులకించునటుల

***
*** న్యస్తాక్షరి..పు లి పి రి పదము చివరా ఆటవెలది విషయ వాంఛ లన్ని వివరములు తెలుపు వినయ ముంచి పలుకు విధము జాలి సకల సుఖము కోరి సాధనలు తెలిపి కళలు తీర్చు కొనుట కవుల లొసిరి --- విషయ వాంఛలోని వేషాలను మలుపు మంచివారి చెలిమి పంచు డోలి మంచి పెంచునట్టి మార్గమును నడిపి పేరు తెచ్చుకొనిన చేరును సిరి

సమస్యా పురాణం చివరి పాదం ఇద్దరు ఒక్క టేయగుట ఈశ్వర లీలయె జీవితమ్మునన్ ముద్దులు చేర్చుటే బ్రతుకు ముచ్చట తీరుట నిత్యసత్యమున్ ఒద్దికగా నులే వినయ ఓర్పును చూపుట సౌఖ్యమవ్వుటన్ అద్దము నేర్పెనేమనకు ఆటలు ఆడిన అంతచూపుచున్ --- దత్తపది : శక్తి, భక్తి, యుక్తి, రక్తి, ఉ:: శక్తియె జీవమవ్వటయు శాంతికి తోడుగ ధర్మచక్రమున్ భక్తియు ధైర్యమే తెలిపి బాధ్యత బంధము ప్రేమశక్తిగన్ యుక్తి యు దేశకాలమున యుక్తము అవ్వుట మేధసంపదన్ రక్తి యు నిత్యసౌఖ్యముయె రవ్వల కీర్తికి దోహదమ్ముగన్ ---- *దత్తపది............ కారణము, రణము, ణము, ము ఆ:: కారణము యె లేదు కథలు గొప్పలుకును రణముజరుగు చున్న రుధిరమగు క ణముయ విషయ వాంఛ నరకము చూపెను ముందు వెనుక వెతుకు ముప్పు లున్న --- తే:: కారణము గను సంతోష కళలు సాగు రణము దుఃఖాన్ని తొలగించు ఋణము అను క ణముగ గుండె బరువు యేను నడక సాగు ముడుపు లన్నియు బంధమై మునక యగును ---- నమ్మక మన్నదే సతియు నాన్యత గూర్చియు తెల్పుచుండుటన్ నమ్మక సృష్టి కే తనువు అర్పిత దాహము తీర్చి పొందుటన్ నమ్మక పోయినా మనసు నావగ నిల్పియు దర్శకత్వమున్ నమ్మిన భార్యగా పలుకు నేస్తము నిత్యము భర్తతోడుగన్ ..... భార్యకి సాటిరారు కద బాధ్యత చూపుట లెందరుండినన్ భార్యయె సత్యపల్కులుగ బాధలు తెల్పియు సృష్టి కార్యమున్ భార్యగ ప్రేమపంచకళ భాగ్యము పెంచును భర్త సౌఖ్యమున్ భార్య నిగౌరవించుటయు భర్తకు నిత్యము సేవలక్ష్యమున్ ..... పుత్రుడు పుట్టనే కలుగు పూర్వపు భారము జీవితమ్మునన్ గాత్రము లేకనే మనసు గాళము వెళ్లెను గాయమెందుకో ఆత్రము వల్లనే మగువ ఆశలు చూపియు ఏడ్పు ఏలనో చిత్రము గాదె మంచు గురిసెన్ మరుభూముల మండుటెండలో --- కళ్ళలొ కాంచగల్గుటయె కార్యము మిక్కిలి భక్తిమార్గమున్ కళ్ళలొ కావ్యభావములు కష్టమునష్టము తెల్పగల్గటన్ కళ్ళలొ కామ్యతత్వమును కావడి మోయుట పద్ధతేయగున్ కళ్ళలొ సార్వభౌమ కళ కట్టడి లేదులె చిత్రకాంతులన్ --- చం:: కవితలు వార్తలే మనసు గాయము పీల్చు ను వారి వల్లనన్ భవితను తెల్పునే గతము భాగ్యము కోరుటయేగ మోహమున్ వివరణ దేనికో ననను వీలుగ వీడక వారి వెంటనన్ సవితిని దెచ్చె నామొగుడు సంతసమందుచు మెచ్చితిన్ మదిన్ --- సమస్యల ను పూరించండి. దును గొల్చినం తొలగు దోషము లన్ని లభించు పుణ్యముల్ *ఉ :: దానము చేసినా కలుగు ధర్మపు బుద్ధి యు నిత్య పుణ్యముల్ దున్నను గొల్చినం తొలగు దోషములన్ని లభించు పుణ్యముల్ మానము జీవితమ్మునకు మానస లక్ష్యము గాను పుణ్యముల్ ప్రాణము ఉన్నతోడ్పడుట ప్రాధమికమ్ముగ చేయుపుణ్యముల్ *****" *తనసతి పెండ్లి జూచుటకు తానును నే గెను సత్వరంబునన్ *చ:: మనుటకు మార్గమే యగుట మాటను తెల్పిన కష్టమన్ననన్ కనికరమే మనోమయము ఆశను నింపిన ధర్మబుద్ధి గన్ వినదగు కాలమే మనసు ప్రేమను చూపిన ఇష్టమేదియున్ తనసతిపెండ్లి చూచుటకు తానును నేగెను సత్వరంబునన్ --- దత్తపది...... బీడి సిగరెట్టు పొగాకు గుట్క ఈ పదాలు పద్యంలో ఎక్కడైనా రావచ్చు * నీవు త్రాగకుబీడి కఫము నీకు చేర్చు ఘడియ సిగరెట్టు త్రాగినా గంపు పుట్టు చుట్టల పొగాకు త్రాగినా చురుకు లేదు గుట్క త్రాగిన మండించి గుండె నందు * బీడి యనుచు మనిషి వేడిగా పొగత్రాగి కాల్చికాల్చిబ్రతుకుకసిగరెట్టు పొగ పొగాకుతినుచుపొందువే బాధను గుట్కవేయలేక గుణముపోయి! ---
సమస్యను పరిష్కరించడం..... ఉత్తరమున భానుబింబ ముదయంబయ్యెన్ 🚷🚷🚷🚷🚷🚷🚷♣️♣️ కం. బెత్తము కదిలే సమయం చిత్తము చెదిరీ కదిలెను చెలిమయి విధిగన్ చెత్తను మండించ కదలె ఉత్తరమున భానుభింబ ముదయంబయ్యేన్ ....... మాత్ర బద్ధము చెత్తగుణము యున్న బీద ధనికంబయ్యేన్ మెత్తని మనసున్న కీడు సహజంబయ్యేన్ విత్తము పలికేను విద్య సుఖ మార్గమ్మెన్ ఉత్తరమున భానుభింబ ముదయంబయ్యేన్ ..... ఉత్తర భానుభింబ మది ముత్య ము కాంతియు యుజ్వలమ్ముగన్ యుత్తమ కాంతి వేడి ఇది ఊయల మీరుచు నీకుసాటియే? మత్తును పంచ బూయితివి మా నము రక్ష ధరా తలాన భూ పొత్తును పొందదల్చియు మనోమయ తెల్పుచు నిత్య సత్యమున్ ........ మ. ఉత్తరమ్మున భానుబింబము యుజ్వ లమ్ముగ దిట్టగా మొత్తుగా మది పృథ్విపైనను మోహ పర్చెడి యుక్తిగా విత్తుగా ఎదిగే మనస్సును విశ్వ మందున పంచగా చిత్తముంచియు నిత్యసత్యము తీవ్రపర్చెడి దైవమే ........

న్యస్తాక్షరి.......28-01-2023 సం స్కృ త ము పద్య పాదాది న రావాలి. తే. సంభ వించేటి విజయము విధి విశ్వసం స్కృతియు లక్ష్య సాధన మది సంఘ మందు తరుణ సంతృప్తి పలుకులే తన్మ యమ్ము ముఖ్య ధర్మ కాల కరుణ ముందు శక్తి ....... ఆ. సంభవమ్ము యగుట సంతృప్తి భాష సం స్కృతము మనసు తృప్తి సమయ శాంతి తన్మయమ్ము తనువు తరుణమాణందము ముఖ్య సూత్ర మగుట యుత్యవమ్ము కం. సంతృప్తి బ్రతుకు సమ సం స్కృతి గాను సహాయమనస్సు సక్యత యగుటే తత గతి వయసుకు శుభ శో ము తపన వ్యక్తమగుటేను ముందర యగుటన్ ఆ. *సం* స్కృతమును నేర్వ చక్కని భాష సం *స్కృ* తము భాషలందు సరళ భాష, *త* దుపరన్నిటికది తల్లి భాషగ నిల్చె *ము* ఖ్య గ్రంథములకు మూలమదియె. (D. Satyavathi ) సుప్రభాతం. శుభ మాఘ సప్తమి శనివారం. రథసప్తమి శుభాకాంక్షలు. --- దత్తపది.. రమ్ము, తెమ్ము,కుమ్ము, పొమ్ము ఉ. రమ్ము వినోదకాలమిది రక్షణ యున్న సమోన్నతీ మదీ తెమ్ము సహాయసం బరము పేరును కోరకు నిత్య సత్యమున్ కుమ్ము శిరస్సు ఆటలగు కూడి మనోబల ధైర్య సాహసమ్ పొమ్ము సుఖాలకై తరుణ పోరును సల్పుట సంఘతృప్తి కై 0

ప్రాంజలి ప్రభ వారి..దత్తపది పూరించండి

వగలు , సెగలు , నగలు , పగలు 

ఇచ్చా చందస్సు

*********************
🌹🌹🌹🌹🌹

తే..వగల మారి వయ్యారి లొ వలపు కులుకు
సెగలు ఎగసిపడుట చుండు చిత్ర కళలు
నగలు కోరియు చూపేను నంగనాచి
పగలు కోరి దగాచేయు పగటి చుక్క
......
రా..వెలుగు చీకటి నడుమ వేకువ గువ్వ
పలుకు చైతన్య మేను ప్రతిభను చూప
నలుసు బిడ్డడై నటన నాట్యము చేసె
తల్లి ఆస్తియు ప్రేమ తరుణమ్ము నందు

రా..నిజము దాచటం కష్ట నీతిగా మారు 😂
తేలిక అబద్ధ మాట తీర్పుగా ❤️చేరు
నీతి వల్లించి అసలు నిర్ణయం మార్చు
ప్రాంజలి ఘటించి తెలుపు ప్రభలుతో గీత

......

రా..మనకు ఇప్పటి వరకు మానము గొప్ప
మనసు సంకల్ప మేను మనుగడ గొప్ప
ధ్యాన చిత్తము వల్ల ❤️ధర్మము గొప్ప
బలము తేజస్సు భార్య భర్తలు 😂గొప్ప

.....
ప్రాంజలి ప్రభ
దత్తపదులు
ప్రభాశాస్త్రి జోశ్యుల,మైసూరు.
29-9-2022.

ఆ.వె.వగలు పొగరు కళలు వనిత చూపులలోన 
         సెగలు పుట్టి చెలిమి చేత లగుట 
         నగలు హొయలు వల్ల నారికీ సంతసం 
         పగలు రాత్రి సుఖము  పతికి సేవ
......

ऊँ !
----
" కం.
--
* మత్తు * గనుండురచనమది
* చిత్తు * నుతుడుచుచు విశిష్ట శేవధినిచ్చున్..
* పొత్తు *నుఁగలుఁగుమనుగడయె
* సొత్త * గునుసహృదయపీఠి సూడఁగ హితుఁడా !!! "
...


🙏🙏🙏🙏🟢🟢🟢🟢👍👍👍👍🤎🤎🤎🤎🚺🚺🚺🚺🚷🚷🚷🚷🚷😄😄😄😈😈😈😆😆😆😆♠️♠️♠️♠️♠️🖤🖤⚫😁✳️🈯

దత్తపది........

మత్తు
చిత్తు
పొత్తు 
సొత్తు

🟢🟢🟢🟢🟢🟢🟢🍅🍅🍅🍅🍅🍅⚫⚫⚫⚫⚫✳️✳️✳️😆😆🖤🖤🈯✳️👌🟡♥️🔴💙💙✅✅🕉️🕉️🕉️🕉️🛑🛑

ఉ..మత్తున చిక్కితేను కధ మారును సొఖ్యము ప్రశ్న ఏ యగున్
చిత్తు యనేది పొత్తుగను చేరువ యై నది కాదు కాదులే
పొత్తు ను బట్టి జీవితము పోరును చేయగ ముందు కొచ్చుటన్
సొత్తుయు సోంపులన్నియును పొందుటకే కల తీర్చు కోవటమ్

.....

రా...మత్తు గమ్మత్తు చేయు మనుగడ వత్తు
చిత్తు అయినది ఒకటి చేరువ ఎత్తు
పొత్తు యున్నాను పుడమి పోరుయే సిత్తు
సొత్తు నీదైన ప్రేమ ఒత్తిడి మత్తు

.......

ఆ..కన్న బిడ్డ తృప్తి కనులలో సంతృప్తి
జ్యోతి వెలుగు నిచ్చు జీవి యగుట
బాల్యమందు బోధ బానిస తల్లిగా
ప్రేమ పంచు తల్లి ప్రేమ బిడ్డ
......
ऊँ !
----

*దత్తపది..ఆ॥వె॥
అమెరి కరిరథమున ఆనతిచ్చు దేవుని 
తేజపాన్ యుదయపు రాజమోలె
హరహరయనునోటసుమధురష్యాష్టక
ములనుముదమురుచై నాల్కబలుక
.....
*నింగి కెగసిన నెలవంక నెమరు వేసి
గగన చీకటి తగ్గించె కనుల ముందు
చుక్కల నిడుమ చిక్కకా చురుకుగా ను
చుక్కలతొ మక్కువగు చీర చెంగు లాగె
....
దత్తపది......... అమెరికా , రష్యా , చైనా , జపాన్ 
ఈ పదాలు పద్యంలో ఎక్కడైనా రావచ్చు.
🟠🟠🟠🟠🟠🟠🟠🟠

*మారెనో రక్కసి మదపు అమెరికా 
మనుజులఁ ప్రేమతో మాతవోలె!
మహేశుఁడరుదెంచి మహిమరష్యాకృతి
జూసి పాశమునేయ చూర్ణమాయె!
....
కరిచర్మ మేదాల్చి  గళముగాచైనాకు
కృత్తివాసపులింగ  కాల పాశ!
విద్య అవిద్యకు విశ్వనాథులజపాన్
శివరుద్ర రూపులై శివుని మ్రొక్క!
....
ఆ॥వె॥
ఙ్ఞాన ధనులుఁజేరి ఙ్ఞానంబుఁబొందిరి
జాతిమతముయనక జగతి నందు!
కొలుచుకృత్తివాస కోటేశ రూపము
కలియుగమునఁదీరుకలత లన్ని!
___

*న్యస్తాక్షరి...... . ప్ర హ్లా దు డు --పద్య పాడాదిన రావాలి. ప్రగతి జాడ లేదు బ్రతుకు ప్రాభవమనె హ్లాద మోందియు ఆత్రము హంస వలెనె దురిత సంఘటనలు వల్ల దూర మయి ము డుపులు కట్టెదేవుని తీర్పు డూరనుండె ----- *ఆటవెలది ---న్యస్తాక్షరి ప్రకృతి పరమ సాధ్వి పరవశ మేగ,యా హ్లాద హిమ తుషార యరుణ కిరణ, ధునిమిశశినియామ దురసుధా యుదయ,వే డుకల వేళ పూర్ణిమ కలువేల... ప్రగతిశీల భావ ప్రతిభకు మేలు యా హ్లాద తరుణిగా ను యదను తాకె దుష్ట శిక్షణ వలె ధూర్తుని మార్చు వే డుకల శోభ యిదియు డూర విద్య ----- *దత్తపది..సూర్యాకాంతం,ఛాయాదేవి,జయప్రద,ఆమెని,భూమిక,జయసుధ,అరుణ పదాలతో ఇఛ్ఛిచందమూ తేటగీతి సూర్య కాంతం వెలుగు జయ సుధల మెరుపు భూమిక అరుణ హృదయమే భూమి తలపు ఆమని జయప్రద కలియు అరుణ మెరుపు దేవి ఛాయా తలపులన్ని ధీన మలుపు ........
చివరి పాదము సమస్య ఆ...కలల లాగ కరిగె కాపురాన పలుకు బతుకు ఈదలేక మొగుడు పోయె బ్రతుకు తెరువు కొరకు బాధ్యత గాపెండ్లి తల్లి బెండ్లి జూడ తనయు డొచ్చె ..... ఆ...రోజు రోజు పెరుగు రధమందు చమురు యే ధరలు పెరిగి జనులు దారి కోరె బంధు పధక మంటు బాధలు పెంచేను ఉడత భక్తి లాగ ఊరు వాడ ...... ఆ.. ఆమె మనసు పలుకు నాకు తెలుపు గుండె కళ్ల చూపు నెపుడు కలలు కనుటె ఆమె కళలు జూడు శాంతి చే కూర్చుటె నాకు ఇంక ఏమి కాన రాదు ......... ఆ...మాట చిలుకు కోప మంతయు ఒకనాడు ఈర్ష్య ధ్వేష భావ ఈశ్వరేచ్ఛ జిగురు వగరు పొగరు జగతిలోన జుగుప్స దారి జూపు మాట ధరణి యందు ..... ___((()))___

సమస్యను పరిష్కరించడం...22-01-2023
చెలువుగ రామలక్ష్మణులు
    సీతకు తమ్ములు శంభు డన్నయున్
🛑🛑🛑🛑🛑🛑🛑💙💙
మలుపులు ఎన్ని ఉన్న దయ మేలును కల్పనలేల యున్నతిన్
పిలుపులు వల్ల భేద ములు పేరును మార్చుట నిత్య సత్యమున్
తలపులు తారుమారగుట తప్పుల ఒప్పులు వచ్చి చేరుటన్
చెలువుగ రామలక్ష్మణలు సీతకు తమ్ములు శoబు డన్నయున్
.......
సీస పద్యం... ఉషోదయం 
మబ్బుల్ని చీల్చేను మౌనమ్ము తేజస్సు
సూర్యాస్త కిరణాలు  సమయ వెలుగు
అంబరం పుడమిని ఆత్రంగ తిలకించె
విప్పారె నయనాలు విశ్వమందు 
అజ్ఞాత కుసుమాలు ఆరాట మానంద
చలికాగు వెచ్చనై చెపల చిత్త 
అశృగాన హృదయమై అలసిన పుడమిగా
పరిమళ శ్వాసతో ప్రకృతి తోడు
తే. జగతియొక్క నిశ్శబ్దాన్ని  చేదన కళ
సూర్య భగవాణుడి వెలుగు సూత్ర మగుట
ధరిత్రి విస్మయంతో స్వేచ్ఛ తలపు తెలుపు
సూర్య గమన మే ఆరోగ్య ప్రాణుల కళ

వర్ణన.......నేటి 21... సంసారి.....బ్రహ్మచారి వీరిద్దరికి గల తేడాను వివరించండి.... మల్లాప్రగడ రామకృష్ణ 🛑🛑🛑🛑🛑🛑🛑✅✅ తే.సంఘ దృష్టిలో సంసారి సమయ ఓర్పు బ్రహ్మచారి సంఘము నందు భయము నేర్పు నిత్య సంసారి వినయమ్ము విశ్వ మందు బ్రహ్మచారి వాంచ్ఛా లయ బంధ ఆట .... మళ్ళి మళ్ళి వచ్చేదము మనసు నీది వెళ్లి బ్రతుకుభారము దించి వేగ మిదియె నీదు దర్శన భాగ్యమ్ము నిత్య తృప్తి నమ్మి యుంటిమి నీసేవ నాకు ఇపుడు .... సీస పద్యము సంసారి విజయమే సహనమ్ము మార్గమే బ్రతుకుతున్న నిజము భయము లేక బ్రహ్మచారి బ్రతుకు బంధమెతుకు చుండు విద్య వినయ మేను విధిగ వాక్కు సంసారి కళలన్ని సంతసం చుట్టూనే సమయ సంతృప్తిగా సంఘ మందు బ్రహ్మచారి మనసు భాద్యత అనుభంద ఆత్మీయ ఆనంద ఆత్ర మేను వెలుగు ఎక్కడుందో చెప్పు అడిగె గురువు దీప మార్పి చీకటి ఏది ధీన పలుకు రెప్ప వాల్చితే చీకటి రంగు లేదు రెప్ప విప్పతే రంగుల రవ్వ కన్ను ... ఉ. ఒక్కటి చెప్పకే మగువ ఓర్పును చూపుట నిత్యసత్యమున్ చక్కని చూపులే వలపు చేష్టలు తన్మయ భావ జీవి యా పక్కను వీడకే విధిగ పీకెడి బుద్దియు దండమయ్య మీ కుక్కను సైపలేననుచు యుగ్మలి చేరెను పుట్టినింటికన్ 0
దత్తపది.............8---- ధర్మము ... అర్థము ... కామము ... మోక్షము ❤️ తే. ధర్మము అవతరణ కళలు ధరణి యందు అర్ధము నెలకొనెడి శక్తి ఆశయగుట కామము మురిపాల మయము కామ్య మగుట మోక్షము ఉగ్ర సమగ్రము మౌకరించు ........ ఆ.ధర్మ ముడుపు కట్ట ధరణి తీర్పనుచునే అర్ధ ముడుపులగుట ఆట ఏల కామముడుపు కట్టి కడుపుతీపి యనుచు మోక్షముడుపు జగతి మోహ మగుట 0 న్యస్తాక్షరి.... ధ ... ర్మ ... దా .... త ..9...... పద్య పాదాది న రావాలి. ❤️కం. ధర్మము మనగడ నందు మ ర్మము కలియు బ్రతులనందు రంగులు మార్చూ దానము జీవితమగుటే తరుణీ సహనం సహాయ తాపము తీర్చూ -- కం * ధ * ర్మరహస్యమ్మునెఱుఁగని క * ర్మ * ములొనరించనేలకైవల్యమునన్ నర్మఁపు* దా * తవగుమయా శర్మమునిడు* త *ప్పకుండ చక్కఁగ నీకున్ !!! " ---- . తే. ధరణి లో అవమానాలు దారిగా ఆజ్యం మ ర్మమము తెలియక జీవుడు రాత్రి పగలు దారి వెతుకుపక్షియగుట తప్పు చేసి తరతరాల బ్రతుకు మారక తన్ను కొనుట ..... ఆ. దరువు ఉన్న చోట తప్పొప్పు లన్ని మ ర్మమము మాయ బ్రాంతి రంగు మార్చు దాన మన్న లేక దారిద్ర మనుగడ తరతరాల బ్రతుకు తారుమారు 0 co దత్తపది... కర్మము.. మర్మము ... ధర్మము .. శర్మము ........10.... శర్మము= సంతోషము 🈯 కర్మము కాలనిర్ణయము కామ్య మనోమయ విశ్వశాంతిగన్ మర్మము మాయ జీవితము మభ్య సహాయ వివాద కాలమున్ ధర్మము నిత్య సత్య మగు ధార్మిక భావ నిజమ్ము తెల్పుటన్ శర్మము దైవ నిర్ణయము శాంతి సు శర్మము జీవ ధారగన్ ---- " కం. -- * కర్మము * నుఁజేయ పుణ్యఁపు * మర్మము * లకుపథముసూపు మానవ ..వినుమా *ధర్మమ * తిసూక్ష్మరూపము * శర్మము * నిడుబ్రతుకునంత శాస్త్రోక్తియిదే !!! " ---- న్యస్తాక్షరీ...ర... ఘు.... వం శం.....11----- ---- " తేటగీతి( షట్పాది ).. -- * ర * హినిఁగలిఁగించు రామునిరౌచ్యమునల * ఘు * తమమనియంద్రు శిష్టులు గురువులంత * వం * శమూలపురుషుఁడును వాసికెక్కె * శం * పకుసమానదీధితి నిండుగఁగల ముద్దులదశరథసుతుని మోముఁగాంచి ప్రజలు మురిసిరి ముదమార పర్వమటుల !!! " ---- ఆ. రమ్యమైనధాత్రి రవ్వల వెలుగుగా ఘుమ ఘుమ లతలగుట ఘడియ ఘడియ వంత బలుకు నీరు వేకువఝామున శంస సుఖము చేరి శాంతి నిచ్చు ..... దత్తపది... తీపి, చేదు, వగరు, పులుపు ......12.... ⚫తే. తీపి కబురు శంకరిని మ తీ ఇదియగు చేదు లేని నిజము తెల్పు పిలుపు ఇదియు వగరు పొగరు చూపసవరణ కాదు పులుపు ఏదిలేని మనసు పుడమి ఇదియు ..... ఆ...తీపి కారమేను తేట తెలుగు భాష చేదు తీపి కాదు చింత ఏల వగరు పొగరు చిగురు వరదలా కదులుటే పులుపు ప్రక్రియ ఇది పుడమి నందు 0 నేస్తంంక్షరీ.. క.. న్య.. కా.. దు...13....13=01=2023 .. ఆ. కరుణ హృదయ తెలుపు కమణీయ సుఖ లావ ణ్య మది విషయ వాంఛ నయన కలలు కాల మాయ తరిమె కధలు తెలుపుటయే దుష్ట బుద్ధి నైన దులుపు చుండు ...... తే. కష్ట పధమున నిర్ణయం కాల కారు న్యము కుటుంబ ప్రయాణము నయన విందు కామ్య మేదైన జీవితం కథలుగాను దుర్మదాంధులు ఉండిన దూర ముండ ..... కం. కల్ల లాటలు ఏలను న్యస్తపు సొబగులును పంచు నయనాల కళే కాలమహిమయని కాంతయు దురుసు తనమగుటే మనోమయ సుఖాలయమే -- *తే. క * లువలయ్యెను కన్నులు కన్యకవియ * న్య * స్తఁపుసొబగులందునునళిననేత్ర *కా * రుమొయిలువన్నెలుఁగలకాంతయామె * దు * రుసుతనమునులేనిది యరుసమిచ్చు !!! " ---- 0 నేటి స్పందన పద్యాలు

న్యస్తాక్షరి.........

సం

స్కా

ర 

ము

పద్య పాదాదిన  రావాలి.


ఆ.వె.సంతుచూడబోవసంపదకోరిరి

స్కాము లైన చేస సర్దు మాకు

రగడ చేయ వద్దు రయమున కావలె

మునిగి తేలి యైన మూడు కోట్లు

(యం సాంబమూర్తి గారు ) 

*..కవిత ఒక దర్పణము గాను కాన వచ్చు

కవి హృదయ మేను కనగల కవిత పుట్టె

కవి కనులముందు కదెలెడి కధల కవిత

కవి మనసును కల్పనలను కాల బ్రతుకు


*..అమ్మ ఒడిలోన కమ్మగా అడుకొంటి

చంద మామ కధలు కొన్ని చెప్పగవినె

ఉగ్గుపాలతో ధైర్యము యుంచి పోసె

సాహసమ్ము శౌర్యం తెల్పె సమయ మందు


*..బాల రామాయణం తెల్పె బాల్య మందు

మిత్ర లాభాన్ని తెలిపెను మేలుకోరి

మిత్ర భేదాన్ని వివరించె మేలు పెంచి

సంధి విగ్రహం చదివించె సమయ మందు


*...కం..అన్నీ తెల్పిన జరగవు

కొన్నీ మొరిగే సమయము...కోరక జరిగే

కన్నీరొచ్చిన సమయము

పన్నీరు చిలికె ను ఒప్పు.. పదములు కదిలే


*..ఎద్దు నెక్కేను ఈశ్వరా ఏమి అనక

గద్ద నెక్కేను విష్ణువు గళము తెల్ప

మోద్దు బల్లపై మన్మధ మోహ చూపు

బధ్ధ కమ్ముతో కదలకే బడలి మనిషి


* కీర్తి అన్నది నీకు విజేతగాను

ఎదుగుదలకు తోడ్పడుతుంది ఎవరి కొరకు

ఎవరిని అడిగినా భయం ఎందు కనక

నిన్ను నీవు గా ఎదుగుటే నీకు రక్ష

3 commen


భోగి.... పై... ఇష్ట చందస్సు.....14...

తే. కట్టగా మేలిరకముల బట్టలొసగి పొట్టనింపంగ బట్టెడు బువ్వనిచ్చి కడుపు చల్ల కదలనీక కాచి బ్రోచు భోగి మంటలు వెలిగింప భాగ్య మగునె ....... తే. భోగి మార్పుకు వైద్యుడు రోగి యనుచు యోగి పలుకులు వల్లనే యోగ మవ్వు ఆగి కోపాన్ని తరిమి మనోమయముయె భోగి మంటలు వెలిగింప భాగ్య మగునె ..... తే భోగ భాగ్యాలు సొంతమై కోరు కున్న శాంతి సౌఖ్యము పొందుటే కాల కళ లు నిత్య సంతోష సౌభాగ్య నియమ మౌను సర్వ వెలుగుల సంక్రాంతి సంబరమ్ము ....... తే. నీదు కలలన్ని కల్లలే నీడ లగుట కలుషితాలోచనను నీవు కాల్చు కాల నిర్ణయామ్ముయే మనసుకు కీడు కాదు భోగి మంటలు దుర్మార్గ కోప దగ్ధ .... సీ. చెలిమి కుటుంబము చెలరేగి మంటలు బలిమి సంబరములు బంధమందు స్థితిగతులుబట్టియె స్థిర సంతసమ్ముయే స్థిమిత ఆశయములు స్థిమిత తృప్తి ప్రకృతి ప్రగతి గాను ప్రతిఇంట ఆటలు పిండివంటల పాట పిలుపు కళలు అమలక్కల పలుకు ఆత్రమ్ము చూపుటే కోడిపందాలతో కొల్లగొట్టు తే. తహతహలు బిగికౌగిళ్లు తలుపు తట్టు రంగవల్లి గొబ్బెమ్మలు రంగ రించు కొత్త అల్లుళ్లు హరిదాసు కొత్త మాట పర్వ దిన శుభాకాంక్షల ప్రభల కాంతి ...... మ. భోగి మంటలు పాప బుద్దిని భోగ రాశిని మార్చుటే భోగ రాగము భూరి సంపద కోప మాపుట కూర్చుటే మాగ తీ యిది ధర్మ మార్గము మానసమ్ముయు పొందుటే యోగ మాయయు నిత్య వేళయు యోగ్య మవ్వుట ఇష్టమై -- ఉ..' భో ' గిశయానుపత్నిహరి పూర్ణమనోజ్ఞనుఁగొల్వరండహో భో' ' గి ' విశేషమౌ సకలభోగఁపురాశిని కోరునెంచుచున్ ' మా 'గతి లక్ష్యమౌ విమల ' మం ' జుల సేవలుసేయభక్తులౌ భోగసరాగసస్యముల భూరిగనిచ్చెడిబా' ట ' వాంఛతో !!! సీస పద్యము సంక్రాంతి చక్రము శ్యామలపున్నమి సకలజనాళికి సంతసమ్ము బంధ ప్రభావము భోగి సందడి కళ ప్రేమ తో పిల్లలు పెద్దలంత సంక్రాంతి అల్లుళ్ల సంబరాళ్లు ఇవియు ఇంటింట హర్షము నింగి కెగసె కోళ్ల పందాలుగా కొత్త దుస్తుల కళ ఆటపాటల జోడు ఆశయమగు సర్వ సంతోష ఏకమ్ము సమయ మదియు ఇష్ట తృప్తి సంతృప్తిగా ఇంటి కళలు చిన్న పెద్ద కలసిసందడి ఇదియేను కలలు తీరు సమయ మేను కార్య పంట -- సీ.. సంక్రాంతి పర్వమ్ము సకలజనాళికి క్రొవ్వెలుంగులనిచ్చి కూర్మిఁపంచు భోగిపండుగనాఁడు భోగిపండ్లనుతోడ పిల్లలవృద్ధికై పెద్దలంత దీవింత్రు ముదమున దేవునిపక్షాన రైతుబాంధవులంత రహినిఁగాంత్రు సంక్రాంతికల్లుళ్ళు సరసములాడఁగ నింటింట హర్షము నింగికెగయు ---- తేటగీతి.. -- కనుముపండుగనాఁడహో కలిఁమినొసఁగు బసవనియలంకరింతురు భాగ్యమంచు యింట సస్యాల పూర్ణమౌనింపుగాను అట్టి పౌష్యలక్ష్మికిసతమంజలింతు !!! " ---- డా.పల్లేరు వీరాస్వామి పూరణ న్యస్తాక్షరి: భోగిమంటను గురించి ఉత్పలమాల వ్రాయాలి. 1వ పాదంలో 1వ అక్షరం 'భో' 2 వ పాదంలో 2 వ అక్షరం'గి' 3 వ పాదంలో 10వ అక్షరం'మం' 4 వ పాదంలో 17 వ అక్షరం'ట' ఉ. 'భో'గము లందగోరుటకు పోకిరి వేషములేయగోరు వై భో'గి'కి వేడిపుట్టు తలపుంగల కోర్కెలు దీరినప్పుడే; బాగుగ భక్తులీదినము 'మం'దిరమేగుచు నాడి పాడుచున్ భోగిన మంటలేసుకొని పొందిరి సంబ్రము మిం'ట'నంటుచున్ ---- ౦ దత్తపది.. భోగి ... సంక్రమన.... కనుమ .... ముక్కనుమ.......15...
✅ తే. ప్రాణ భయము వాటిల్లిన.. పలుకు భోగి మెపుడ సంక్రమణ కలయ మే యనువున నైన మంచి యుద్దేశము నందు కనుమ దయ బ్రకటన ముక్కనుమయె తలగ కెపుడు
.... తే. ఇంట సౌభాగ్యపు వెలుగు ఇంతి తలపు సహజ ఆనంద వెల్లువ సమయ మందు హృదయ సంతృప్తి చెప్పాలి హాయి గొలుపు భోగి సంక్రాతి కనుమయే భోగ మవుట 0
న్యస్తాక్షరి..... వ ర రు చి ఈ అక్షరాలు పాదం చివర రావాలి 🍅🍅🍅 వెంబడించే టి కలువతో వేకువ మగువ అంబర చినుకు తడిపేను ఆశ తీర చుంబన తలుపు పెరిగే ను చూపు చిగురు తబ్బుర పరిచే రచయిత తన విరంచి .... వర్ణణ........ హిమాలయాల వర్ణణ.... .... ఆటవెలది లలిత ఫాల దేశ భ్రూలతా శోభితం సుందర కనుగవ బెళుకుల తెలుపు లేత ముదురు మొగ్గ నాసిక మంచుయే స్మిత చలితొ కనికరమును జూపు మీకు ఇష్టమైన పద్యంలో ..... సమస్య: జన్మదినం బటంచుఁ గడు సంబరముల్ జరిపించుటేలనో ( ఎందరెందరి హృదయాలలోనో స్థిరనివాసుడైన గురువుకు ప్రత్యేక జన్మదినోత్సవాలతో పనేముంది?) ..... తన్మయ భావమే మనలొ తర్జన భర్జన ఏలయిప్పుడున్ చిన్మయ లక్ష్యమే మనకు చింతలు ఏలన దైవసన్నిధిన్ మన్నన పొంద దీక్షలతొ మాన సమర్పిత శంకరయ్యకున్ జన్మదినం బటంచుఁ గడు సంబరముల్ జరిపించుటేలనో (ఈ నెల 17 శంకరార్యుల జన్మదినం) .... దత్తపది........ సరి గమ పద నిస ".సరిక మెరుపులు మగువలో శోభ పెంచు గమన మే చూడ ఆకర్ష గమ్య మగుటె పదములు కదలిక చూచినా పలక మారు పదనిసలు చెప్పె పరువాన ప్రేమ లీల ..... *..సరియైన శైలి తెలుపే తరుణాన గమనము తేరు తపనలు చెందున్ కరుణా పదవాక్కులుగా చిరుహాసపు నిస చరితము చింతలు తీర్చున్ ..... న్యస్తాక్షరి..........ప తం జ లి పలకు బంగార మయ్యెను పదవిలోన తంతు ఏదైన బ్రతికేటి తరుణమిదియె జనలు గొర్రెలు, మాటల జపము పలు క లి తెలి పేటి గొప్పలు నీతులు లికను చెల్లు .... ప తం జ లి.. ఆ:: పనస పొట్టు కూర పట్టు బట్టి తినుట తంతు అనెడి మాట తిప్పు కాదు జనుల తిండి గూర్చి జాగృతి చేసి ఫ లితము మంచి ఆకలేనను కొను ---- " * ప * బ్బమేయగునుమనకు పంటపండ * తం * డులమ్ములు దొరకును దండిగాను * జ * నతకుబ్రతుకుకలుఁగును చక్కగాను * లి * ప్తపోయినరాదయ్య రీతిఁగనుమ !!! " ----
సమస్యను పరిష్కరించడం...... గోగ్గూరకు సాటి వచ్చు కూరయు గలదే సిగ్గుల పువ్వుల కథలే మొగ్గలు విచ్చియు మనస్సు మోహము మార్చున్ నెగ్గుకు రాకకు చెప్పేన్ గోగ్గూరకు సాటి వచ్చు కూరయు గలదే గోగ్గూరపచ్చడి తినియు గోగ్గూర పులుసు తిని నను గొగ్గో పలుకే గోగ్గూర పప్పు వుల్లియు గోగ్గూరకు సాటి వచ్చు కూరయు గలదే .... మగ్గము తిరగెను నిత్యము గొగ్గుల నేత సరిచేయు గోప్యమగుటయే నెగ్గుకు వచ్చెను కాలము గోగ్గూరకు సాటి వచ్చు కూరయు గలదే * దత్త పది... కరి కరి కరి కర కామ ధేనువు కరియావు కలకలముయె కనికరము కరిమెడదొర కళలు తీర్చు ధర్మ మార్గమే కరివేల్పు ధరణి నందు కరి గజముభక్తి మెచ్చెను కమల నాభ కరిమెడదొర.. శివుడు కరివేల్పు... విష్ణువు .... దత్తపది...... ఇల్లు , ముల్లు , జల్లు , కల్లు తే:: ఇల్లు వల్లు గుళ్ళయగుటె ఈశ్వరేచ్ఛ ముల్లుగచ్చుకున్నను నెప్పి ముప్పు తెచ్చు జల్లు వల్లును తడిపిన జాత రగుటె కల్లు త్రాగినా కోతిలా గంతు లేయు ..... న్యస్తాక్షరి........ వ్యా, లం, టై, ను పద్య పాదాదిన పై అక్షరాలు రావాలి. తే:: వ్యాకరణముయే జీవితం వ్యాధి లాగ లంఖణములన్ని బ్రతుకులో లాస్యమేను టైము బట్టియే బ్రతకాలి టైటు వద్దు నురుగుల పరుగు కడలిలో నమ్మ వచ్చు .... న్యస్తాక్షరి....... వై ష్ణో దే వి --- పద్య పాదాదిన రావాలి.. ఆ. వైరి యందు జీవి వైధవ్యమున రోచి ష్ణోగ గమన శక్తి షకలకగను దేని నైన చూడు దైవము సృష్టియే విశద పరచ కలుగు వరము కలిగె న్యస్తాక్షరి। ::శం భో రా వా । పద్య పాదాదిన రావాలి। గీ:: శంకరుని పూజ విజయము సాధనమ్ము భోజ్య మననది మనసులో బొమ్మ యేను రాజ్య వాంఛలు వయసులో రమ్యమేను వాజ్య మననది నమ్మకం వ్యాధి యేను ..... ఆ:: శంకలన్ని తొలగు శంకర పూజకే భోజ్య రాజ్య వాజ్య భోగ మందు రాస లీలలన్ని రమ్యత కొరకుయే వాక్కునందు మనసు పెట్టి బ్రతుకు .....
దత్తపది............నేటిఉషోదయం పద్యాలు.... గలగల.. పకపక ... చకచక .. టకటక సీస పద్యము గలగల పారును గళము విప్పి జలము ఇదియొక స్వరముగా ఇష్టమగును పకపక నవ్వులు పాఠము నేర్పును పడచుల హాస్యము పడక చేర్చు చకచక నడకలు చేటును చేయుటే చిరుగుల కాంతికి చేరుటయగు టకటక శబ్దము తప్పుల హేలనే తెలిసీ తెలపకయు తేట జీవి తే.గలగల మొతల స్వరములు గమ్య మగుట పకపక పలుకు నేస్తము పాఠమగుట చకచక కదలి ప్రేమకు చేరువగుట టకటక తపల తప్పదు తప్పులకడ ..... చె. బెకబెక కప్పలా గళము విప్ప బహిర్గతమేను నేస్తమా పకపక నవ్వులా కులుకు నిప్పు సమర్ధతగాను నేస్తమా చకచక మెప్పుగా పలుకు త ప్పును ఒప్పుగతెల్పు నేస్తమా టకటక పాద రక్షల విలాపముయే గమనించు నేస్తమా ....... కం.బెకబెక గలగల శబ్దము పకపక నవ్వుల పడచుల పందెపు గళమే చకచక కదలికల కళే టకటక హృయము కదలికయు తకధిమ తాళమ్ ....... రా. గలగల జలము పారు గమ్యము తీరు పకపక కులుకు తీరు పడచుల పోరు చకచక కడలి హోరు జాడ్జ్య ము జోరు టకటక తురగ తేరు నటనలు మారు .... తే.చకచక వనవాసమునకై జనెనతండు - పకపక నగు సూర్పణఖను వగవ జేసి - గలగల కదలు సాగరు గమన మాపి - టకటక రణమున గెలిచె లంక నతడు!!! ....

.: ❤️❤️❤️❤️❤️
*****************
ప్రాంజలి ప్రభ వారి..03-10-2022
దత్తపది పూరించండి

నీవు,రావు,నిదుర, రాదు ❤️

ఇచ్చా చందస్సు

*********************
🌹🌹🌹🌹🌹
కొలత ఉద్దరణలకు కొంచమూ లేదు
కొలత విలువల పలుకు కొంతయు లేదు
కొలత ప్రేమ మాటలకు మొదము లేదు
ఘనత హృదయంతొ పలుకు గమ్యమ్ము తెలుపు

వృద్ధి కిసహాయ మేను ఉన్నతి బ్రతుకు
మర్ధన సహాయమేను మానస బ్రతుకు
మధముతో సహాయములు మత్సర బ్రతుకు
మదిని పంచి పొందుటయు మనిషి బ్రతుకు

నిజమనేటి నావయిది నీడలా ❤️కదులు
మన నిజాయితీ బట్టి మనుగడ కదులు
జీవి నమ్మకమ్ము గను జీవనం కదులు
మనిషి 🌹గౌరవం తీర్చు మాధుర్య వెతలు

ఊహలు గుసగుసలవి ఊపిరి పోయు
ఊతము కలల కాల ఊసులు యగుట
ఊరు మూగపోయినను ఉన్నంతవరకు
నీకు నేను నాకు మదినీవు గా బ్రతుకు

🙏🙏🙏

దత్తపది........

అవ్వ
బువ్వ
మువ్వ
రవ్వ

♠️♠️♠️

అవ్వ మదీయభావమును ఆత్రుతగాతెలిపేను ఇప్పుడున్
బువ్వను కోరి విద్యలను బుద్ధియు పంచెనుసంధిగానులే
మువ్వల శబ్ద లక్ష్యమును ముందరతెల్పియు ముఖ్య  మవ్వుటన్
రవ్వల వెల్గు నందు విస రన్నయరమ్యత తెల్పగల్గుటన్

పండిత సజ్జ బుద్దిగను పంచెడి మాతగ మానసమ్ము ❤️నన్
ఎండిన జీవితమ్మునను ఎక్కువ ధర్మము తెల్పు మాతలున్
మాడున విద్య సంపదయు మక్కువ చూపిసరస్వతీగతిన్
వీడక నుండె లక్ష్మి గను వేదము పంచియు వేద మాతగన్


సమస్యా పూరణ: దత్తపది
*నీవు, రావు, నిదుర, రాదు*
***************
ఆ.వె.
*నీవు* చెంతనున్న నిశ్చింతయే నాకు,
*రావు* పీడ కలలు,రాదు బాధ,
*నిదుర* యందు కూడ నిన్ను విడువ లేను,
*రాదు* వేరు తలపు నీదు మించి

దృంచె శంబు నిశంబు ధరణినే రక్ష
దృంచె మహిషా సురులశిక్ష ధ్రువతార నీవు
దృంచె దూర్థుల 🌹బుద్ధి దృఢ దృతి నీవు
దృంచె దుష్ట లక్ష్య మును దృతిగాను మాత

ऊँ !
----
"  * అవ్వ * యెసెప్పును నడతను
  * బువ్వ * కొఱకునై కితవము మ్రుచ్చిలులేలా ?
* మువ్వ * లగోపుఁడె శరణము
* రవ్వం * తబగితినిఁబొందు రామార్చనలో !!! "
----
వైరి వర్గాల మతియు ❤️వైనతీయమగు
గెలుపు రాజకీయమగు వేళయి దేను
ప్రేమ మర్మమై మ్రోగ ప్రకటిత ధర్మ
ఘంట ప్రజలకు మేలు ఘనతయే ఇదియు

రా..బ్రహ్మ చారిణీ కర్మ బ్రాహ్మిణీ దేవి
హే విలంబిత కేశ హితకారి దేవి
మహిష మర్ధన శీల మహితగా దేవి
కేళి భయత నర్తన కాళికగాను దేవి
దుష్ట ధూర్థుల హింస దుర్గ ఈశ్వరియె

దీప కళికలు గాను దివ్వెల మహిమ
మగువ కులుకులు గాను మాధవ లీల
తనువు భాసించె మహిళ తాపము గోల
నిర్మల నయనాలతోను నీ మది కృష్ణ

🙏అవ్వ-రవ్వ -బువ్వ -మువ్వ 🙏
అవ్వనజాక్షి  భక్తి నిడ, యంబువు లందరి పైన భక్తిగాన్
రవ్వయు సిగ్గు నొందదుగ, బ్రహ్మను విష్ణును శంకరున్ గనిన్
బువ్వను పెట్టు చుండగ త్రి మూర్తుల  కా యనసూయ దేవి యున్
మువ్వల యందియల్ మడియ ముగ్గురు తల్లులు మ్రొక్కి రప్పుడున్!!

🙏రవ్వ -మువ్వ -బువ్వ -అవ్వ 🙏
రవ్వల  నకిలీసు గని యూరంత మెచ్చు!
మువ్వ పట్టాల శబ్దంబు మొగుడు మెచ్చు!
బువ్వ పెట్టంగ తినువాడు బువ్వ మెచ్చు!
అవ్వలకు బువ్వ పెట్టుము!హరియె యవ్వ!!

సమస్యా పూరణ: న్యస్తాక్షరి ,, చె న్న పు రి

ఆ:: చెరపకు చెడిపోవు చేసిన కష్టము
న్నను నదిగను సాగు నియమ మందు
పురుగు లాగ తొలచు పురముయగుట యేను
రిక్త సిక్త మగుట రిపుడు ఏల

ఆ:: చె లగు చెన్నపురి విశేష నగరిగ, యు
న్న దిది కడలి తటమునందు నిలయమిది,
పు ణ్య క్షేత్రములకు,  పూజింతురిట ఈశ్వ 
రి ని మనమున నమ్మి, రేయి పవలు.
--
"  కం.*చె * న్నగుసూక్తిని వినుమా 
* న్న* న్నన యఁ పుజీ వనంబు నరయన్
* పు* న్నెమెభాగ్యమునంద్రు హ
* రి* న్నీవుశరణముఁగోరు ( రే )ఱేయింబవలున్ !!! "

దత్తపది పూరించండి

ఇష్ట , కష్ట , నష్ట ,నిష్ఠ 

ఇచ్చా చందస్సు

*******

🌹🌹🌹🌹🌹


తే:: యిష్ట మనెడి ఊబికి చిక్కి ఇంట చేరి

      కష్టము లను భరించియు కమిలి పోయి

      నష్ట మనెడి కాలవ పడి నలిగి పోయి

      నిష్ఠ లేక ఓర్పుయు లేని నేటి మనిషి


కం..చిగురించి ఘుభాలించియు

      మగువ మంత్రమహిమలను మాయను చూపెన్

      పొగరే బట్టియు గర్జన

      రంగులు ఘోషించె మేఘ 😂రావము వో లెన్


" గీతాలంబనవృత్తః -- త జ జ వ..11/8. 

-- 

సర్వార్థశుభప్రదసౌఖ్యగతే ,

శర్వప్రియమోదితచారుకృతిన్

సర్వైర్జనపూజితమూర్తివర ,

సర్వార్థఫలాప్త గణేశ నమే !!! "


దత్త పది 

🙏కష్ట-నష్ట-నిష్ఠ -ఇష్ట 🙏

    

 

ఆ:: ఇష్ట మైనదేది కష్టపడక రాదు,

      కష్ట ములను దాటి, నష్ట ములకు

      వెరువకుండ యడుగు వేసి నడువ  నిష్ఠ

      తోడ, జయము నిన్ను వీడదెపుడు


🙏ఉట్టి -గట్టి -మట్టి -తొట్టి 🙏
ఉట్టిది కాని "వేద ఝరి", నొద్దిక నేర్పెడి "గీత గ్రంధమున్!
గట్టిగ పోరు" సైనికులు" కట్టుగ నిల్చిన "కష్టజీవులున్ "
మట్టిని నమ్ము "కర్షకులు "మంచిని పెంచెడి "గాంధి" సూత్ర ముల్
తొట్టిల జేసి పాపముల ద్రోయు "జలంబుల"దేశ మిద్దియే!!!

🙏వయసు -మనసు -సొగసు -నలుసు 🙏
తే!గీ!
వయసు తోడ మారుచునుండు పాడు మనసు
మనసు చెప్పు రీతి నరుడు మార్చు సొగసు
సొగసు చూచి మురువ  నది  చూడ నలుసు
నలుసు వంటి సొగసు వద్దు నరుడ నీకు!!


😂😂😂😂😂😂😂😂
😂నీవు -రావు -నిదుర -రాదు 😂
నీవు కలయందు వచ్చుట  నిజము నిజము
రావు నాచేతి కెప్పుడూ రావు రావు
నిదురలో చూచి మురిసెద నిన్న రేపు
రాదు కరువు భత్యంబది రాదు రాదు 😂
😂😂😂😂😂😂😂

న్యస్తాక్షరి।:: వి శ్లే ష ణ -- పద్య పాదాదిన రావాలి। గీ:: విశ్వ మందు ఆకర్షణ విజయ వాంఛ శ్లేష మగుకన్య సౌందర్య సేవ కళ్లు షష్టి నాడు నూ ప్రేమతో షక లకలు గ ణపతి నివరము కోరేను నటన యువతి న్యస్తాక్షరి:: లం కా పు రి -- పద్య పాదాదిన రావాలి। కం:: లంకాధి పతే భక్తుడు కాకా కోసం సహనపు కార్యపు ఘనుడే పుకారు నమ్మని భక్తుడు రిక్థము కొరకే నుపూజ రిష్టపు ఘనుడే నా దృష్టిలో విభీషణుడు రామిరెడ్డి: సమస్యను పూరించుట ..... వారికి వారికిం మరియు వారికి వారికి వారివారికిన్ చేరిక వల్లనే మరియు చేతలు చూపిన చూపులవ్వుటన్ కోరిన యవ్వనం మరియు కోరిక మధ్యన నల్గిపొవ్వుటన్ మారిన మానసం మరియు మాధురి మోహము ప్రేమనమ్మకమ్ వారికి వారికిం మరియు వారికి వారికి వారివారికిన్ **** దత్తపది : నాగ, రాగ, బోగ,వేగ నాగ ప్రతిమ నందు నాగపూజ చేసి పాలు పోయుచుండె రాగ ములతొ పాట రాశి కెక్కు తృప్తి రవ్వ వెల్గుమల్లె వేగ వంతమైన వెలుగు తల్లులుగను పుట్ట వద్ద పూజ భోగములుతీర్చమని తోరణములతోను వేడుకలను జరిపె ****
దత్తపది:: రంభ, ఊర్వశి,మేనక,ఘృతాచి । అందానికి దాసులైతే వారి ఊహలు ..... కం:: మనసున రంభయె చేరే తణువున ఊర్వశి నటనలు తహతలు కలిగెన్ అణువణువులోన మేనక కణముననె ఘృతాచి కలిసి హృదయము నందున్ ..... దత్తపది : నిలయము,భయము,హయము,వ్యయము ..... నియమ నిబంధనలు నిష్టలకును ఖచ్చి తమవుటేను భయము లేని జీవి బాధ్యత గను బంధ మవుట ప్రేమ యగును హయము మల్లె సాగు హాయి జీవితమ్ము మనసు నెరిగి బ్రతుకు వ్యయము అనక ప్రేమ వయసు కోర్క తీర్చి సంఘ సేవ చేయు *** న్యస్తాక్షరి.... క ణ క ణ ..... కనులలో నీరు కానుక కనులు భూష ణముయె చెప్పనలవికాదు నయన విలువ కనుల చూపులోనే వుంది కామ్య భూష ణముయె సుఖము తృప్తి కళలు నయన తీర్పు **** చెళ్ళ పిళ్ళ వారి విద్య తొ చేయు చున్న తొలిగ తెలుగు సాహిత్య సోధనలుగ తెలుగు అవధాన ప్రక్రియ తేట తెల్పి బిరుదు గకళాప్రపూర్ణడు వినయ కవియె **** ఘనత వహించినా గమ్య మేయగుటే నిత్య ధర్మ మగుటె ఘనత సాధించిన గోప్యమతిని నొసగి గుణము సత్య మగుటె ఘనత పొందినాక గళము తెల్పుచుండె వర్ణ దేహ మగుటె ఘనత శాంతి శ్రీల గర్జనలు లేకే తృప్తి సంతృప్తయె **** దత్తపది : బలము, పొలము, జలము,హలము , ..... బలము బుధ్ధి తోనె బాధ్యత చూపుటే భావి పౌరుడు గా పొలము ఏపుగా ను ప్రకృతి సహకారం ఎండ వాన మలుపు జలము నింపె చేల కలుపు తీసె రైతు బాగుజూడు ఇపుడు హలమునేబట్టీ హర్షముతో దున్ని పంట పండించున్ **** " చంపకమాల.. -- హలమునుఁబట్టరైతునకుహర్షముఁగల్గు మనమ్మునందునన్ జలమునునింపుచేలకునుచాలినపంటలకెప్డు లెక్కఁగా పొలమునుఁజూడసస్యభరపూర్ణమునంచుఁదలంచి మోదియై బలమునుపొందునాతఁడు విభావ్యమనస్కుఁడునౌను సేవకై !!! " ****
దత్తపది........ బెత్త, జాన, మూర, బార -- ఇవన్నీ కొలతలకు సంబంధించిన పదాలు. బెత్తము చేతను బట్టియు చిత్తుగ ఏలను లె జాన చేష్టలు తెలిపే పంతంమేమూ రమ్యత బొత్తిగ బారయని బాదె బ్రోచే పలుకై * బెత్త గున్న గుండె కరిగె సత్తెమేగ జాన నాభిజూడ మనసు జరజరాన బార పూలదండ శిరాన భామ పిలుపు గమ్యమూరసరమ్యత గాను జూచె *నాభి నుండి జాన నరజన్మ స్థానమే బెత్తెడుండుగుండె సత్తెమేగ కోట్ల మనుషులయినకొలతలుబారడే మూరలేగపంచె మరుయు మనిషి *మదిని కలవరం బెత్త గ మౌనముగను, తలచితిని గ జాన నుడిని దయను చూప, నాదు బార క మతడిదేనని తెలిపియు నిరత మూ ర మా వల్లభుని కొలిచెదను. ***** బారకము = బరువు దత్తపది: "‘పేపరు - పెన్ను - టైపు - మెమో'"ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ*భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో పద్యం . *కామపు తలపే సమమని సహనము పెన్నుద్ధిగనులె సంతోషముగన్ మొప్పుకొనుటయే జీవితం మోముకు మేమె కలిపుటయు మోక్షముకలగన్ *..అమ్మా నాన్నా వర్షము అమ్మో ఇల్లే మునిగిన అన్నియు తడిసే మమ్మాదుకొనే దెవరే మమ్మానందపరిచేటి మనసే ఏదీ దత్తపది: పేపరు,పెన్ను,టైపు,మెమో... ఉ ::పేరుకు సాధనమ్ము జరి 'పే పరు 'లెవ్వరు చూసి ఏడ్పు లై చేరుట నవ్వుటై పు కళ చేతు'మె మో'సము ఏలబాధయున్ మారుట పెన్నుదీ మనము మానస వత్తిడి జర్గి ఉండటన్ వారును వీరునై ననులె వారధి గాంచుము దైవనిర్ణయమ్ ఉ. పేరుకు మిన్నకుంద్రు జడు'పే పరు'లెవ్వరికైన పాండవుల్ పోరున యొక్క'టై పు'లుల పోలిక 'పెన్ను'ది సాగి వచ్చినన్ జోరును జూపు జోదులిట చూతు'మె, మో'సము నొందకుండగన్ కౌరవనాథ! సంధికయి గాంచుము మేలగు నాలసింపకన్ శ్రీమాత్రేనమః 🔴

వెలిని లోనను నంతట వెలుగుచుండి
మురిసి నిలచు నారాయణమూర్తి యనుచు
నిగమ వాక్యము తెలిపిన నిజము నెరుగ
నీవు వాడును నొక్కటై నిలచియుండు

(తోపెల్ల సత్యనారాయణ మూర్తి,
అమలాపురం.)


" ఉత్పలమాల ( పంచపాది )..
----

భార్గవి చూపుమమ్మెపుడు భాగ్యఁపు వీక్షణ మాత్రమౌ దయన్..
మార్గళి దైవమమ్మవుగ మాకును పూజలు సేయనీకు..నా
గర్గుఁడు శౌనకాదులును గానముఁ జేతురు సంతతమ్ముగా..
మార్గము నీయుమా రుజలు మారకమొందువిధిన్ బ్రసన్నతతో..
మార్గముఁ జూపుమా శాంభవి ! మంగళ కామ్యములిమ్ముమా..నమః!!!"

 సాహిత్యం (2): ऊँ!

-----
"మాతంగి ! శాంకరి ! కృపాను కటాక్ష భాగ్యం ,
దుష్టఘ్ని ! భక్త జన పాలన తత్పరేశి ! 
త్రైలోక్య మోహిని ! ప్రదేహి వరప్రసాదం ,
కామేశి రాజ్ఞి!మమ దేహి కరావలంబమ్ !!!"

--(())--
దత్త పది... కరి కరి కరి కర కామ ధేనువు కరియావు కలకలముయె కనికరము కరిమెడదొర కళలు తీర్చు ధర్మ మార్గమే కరివేల్పు ధరణి నందు కరి గజముభక్తి మెచ్చెను కమల నాభ కరిమెడదొర.. శివుడు కరివేల్పు... విష్ణువు తే..ఖనిజ సంపద లవణము కాంచ గలుగు ఎన్ని సుడిగండముల గున్న ఏమి మారు నదుల కలసినా కెరటాలు నడక ఒకటె సాగర ఘోషలు తప్పవు సమయ మందు కళ్ళలోన కవిత్వము కళ్ళ కెరుక అనుభవం ఆదరణ పొందు ఆశ కెరుక ఆత్మ తృప్తి యు ఆకలి ఆట కెరుక పాశ మే దైన బంధ పదాలు ఎరుక ఆకలి కొరకు చేసేటి ఆట యిదియె రోగ నిర్దారణ కొరకు రంగు యిదియె దాన ధర్మాలు నమ్మకం దారి యిదియె దైవ నిర్ణయాలు తెలిపే ధరణి యిదియె భక్తుల చదరంగం ఆట యిదియె ఈశ్వరా 0 co దత్తపది -- వా ర ణా సి పద్య పాదం చివర రావాలి చివర రావాలి.... *..సకల సృష్టి కర్త సమరమ్ము చేయు వా రణము వల్ల భవిత రమ్య మేది విశ్వ మందు కళలు వెల్లు విరియుఋణా బంధ మంత తెలిపె బడయు వాసి 0 న్యస్తాక్షరి...అ త్యం త ము *.అమ్మ గమన లీలలు ఆ త్యంత మగుటయే సమయము తృప్తిని తెల్పెన్ తత్వము అర్ధము కాదు లె ముత్యము మల్లెను మెరియుట ముఖ్య మగుటయున్ నేనే చేసిన వాడను నానా గుణకర్మలగని నాలుగుభాగాల్ ఈ నా కర్మల కర్తను నేనే అయినా యెఱుంగు నేను అకర్తన్ *అమ్మ నుంచి తెల్పు ఆత్రుత ప్రేమ గ త్యంత భావ ములను తెల్పు తల్లి తరుణ సూర్యుని వలె తపము తాపముయును ముఖ్య మనుచు పలుకు ముందు నేర్పు *.అమ్మ పలుకులు కలుగుట ఆటగను అ త్యంత బుధ్ధియు గుణము యే తరుణ మందు తపము లేక యే కోర్కలు తొక్కు కక్కె ముడుపు లెన్ని కట్టిననులే ముక్తిరాదు * అ మ్మ దైవ సమము అందరికనుట స త్యం, తొలి గురువామె ధరణి యం దు, త నను మరచి సేవ తల్లి చేయు నిరత, ము నిలిపి మదియందు పూజ చేయి. * అరుణకాంతులిచ్చుయధ్బుతసొబగుయ త్యంత సుందరమువు యాకసమున తన్మయత్వమొందితలతురే జనులెల్ల ముగ్థమోహనములమూర్తినీదు... సమస్య: మారుని పెండ్లియాడినది మంజులరూపుడటంచు సీతయే కోరెను భాగ్యమైనదియు కొత్తగ వింతగ యిచ్ఛపూర్తిగా మారుని పెండ్లియాడినది మంజులరూపుడటంచు; సీతయే వీరుడు విశ్వమందు ననె విల్లును ద్రుంచిన ధీర చేతికిన్ ధైర్యముగాను తెల్పుటయు ధర్మము తెల్పెను నామె తండ్రియే 0 రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము గారి అదృష్టమును వర్ణి0చండి....... *ద్రౌపది ముర్ము జగతికి దౌత్రి అగును భారత ప్రగతి శీలత భాగ్య మగును భరత జాతికి మేలుగా భవ్య జీవి దేశ సౌభాగ్య మునుచాటు ధీర వనిత -- ఆదివాసుల బ్రతుకులు హాయినొందు ముర్ము ద్రౌపది సేవలకర్మచేత పంతులమ్మ నెఱుంగును వంతఁదీర్చ రాష్ట్రపతిపదవివరమ్ము రాణికెక్క.." ---- మత్తేభము అప శబ్దమ్ములు పల్కెడీ సమయమే ఆశయె కష్టమ్ముగన్ అపవాదమ్ముగ భాద్యతే భయముగా ఆత్రము బాంధవ్యమే విపరీతమ్ముగ దేహమే కదలగా విద్వేష భావమ్ముఁయే విపరీతప్రతిభాషలాడినపుడే విద్వాంసుఁడంచందురే ..?! ఉత్పలమాల ఇల్లుయె ఈశ్వరేచ్ఛగను ఈప్సిత బుద్ధిని కల్గి జీవనమ్ మల్లుయె గుచ్చుకొన్ననులె ముందర కాళ్ళకు బంధమేయగున్ జల్లుయె హృద్యతాపముయు జాడ్జము మాపియు తృప్తి నిచ్చుటన్ కల్లును త్రాగినా మనసు కళ్ళను కాళ్ళను త్రీప్పె మాటలున్
దత్తపది....... మీరు, మేము, జనం, మనం

ఆ::* మీరు మారి నపుడు సృష్టి వేరగుపించు 
        మేము, రుచిని బట్టి కనుట కద్దు
        జనులు చూడ నేర్వ జాతిబాగును జూడు 
        మనము బ్రదుకు లక్ష్య మవని యందు 

గీ ::* మీరు లేకుండ ఏపని మేలు కాదు   
        మేము ఉన్నాను మీవలె మేలు కాదు 
        వాక్కులో జనం ఖచ్చిదం వాదమేను 
         కనుక జాగర్త యే మనం కలసి బ్రదుకు 

* సాకరోపాసన కలిగి సాముచేయు   
  నీ నిరాకర రోపాసనముయె దిక్కు 
  దేహ భ్రాంతి వదలడము దీన స్థితియు 
  ఆత్మజ్ఞానము పొందడ0 అసలు స్థితియు 
 
* దానిని (ఆత్మజ్ఞానం) పొందడానికి కాదు,
  దీనిని (దేహ భ్రాంతి) వదలడానికి.
  దేహాత్మ భావనే - సాకరోపాసన.
  దేహాత్మ భావం వదలడమే - నిరాకారోపాసన.

* మట్టి బంగార మునుమాట మనిషి శక్తి 
  పుత్తడిని ఇష్టంగ మార్చు పుడమి శక్తి 
  దృష్టి వలన సృష్టే మార్చు ధరణి శక్తి 
  బ్రదుకు లక్ష్యము సాధన బ్రాంతి శక్తి 

* పుట్టుక ఇది ప్రశాంతత పుడమి నిచ్చు  
   కాల భావనలను నీలొ కలిపి వేయు   
   భావతీత మనసే ఇది భగ్యమగుట 
   అసలు సాధన అవసరం లేక బ్రదుకు 
   నీలొ శాంతిని దర్శించ నిజము తెలుపు 

పురులు , తరులు, గిరులు, విరులు,

* పురులు ముంచె వరద, లేక, పోవు దారి,
  తరులు స్వార్థమునకు బలై ధరణిగూలె,
  గిరులు త్రవ్వకముల పాలై తరిగి పోయె,
  విరులు, బాల వెతలుగాంచి, విరియ మనియె.

నిన్ను నువ్వు తెలుసుకొని నిజము తెలుపు
సర్వసంగపరిత్యాగి సమయమే ను
హృదయ వాంఛను తీర్చియు హాయి పొందు
జయతపస్వి మనోహర జయసజాత

సమస్య:
వంద వధానముల్ బుధులు బాగనఁ జేసెను మందబుద్ధియే
( బాలావధానిని చూసి బాధపడే కొందరిని మందలిస్తున్న విజ్ఞులు )

*పొందిక బుద్ధియే కలిగి పోరును ఆపుము వర్ధమానుడా 
చెందకు మార్పులేమియును చేరువనుండియు చేయుమేలిదే  
అందరి ప్రేమపొందియును యత్యమనోమయ భావమేనులే  
వంద వధానముల్ బుధులు బాగనఁ జేసెను ; మందబుద్ధియే ?

🙏భవ్య -సవ్య -నవ్య -దివ్య -(ప్రాంజలి )🙏
భవ్యము. పద్యవేదికగ  ప్రస్తుతి పొందెను మాధ్యమందునన్!
సవ్యము. తోటివారికిని చక్కని సూచన లిచ్చుటెంతయున్!
నవ్యము. వర్ణణాదులను నవ్య కధా గమనంబులిందునన్!
దివ్యము. దీర్ఘకాలమిది దీప్తిగ నాకశ వీధి ప్రాంజ లై!!
 నాకశ  వీధి వెల్గుటే!!!

తే:: భవ్య భావమ్ము భాగ్యమ్ము  బంధ మగుట
      సవ్య చక్కని సూచన సమయ మందు
      నవ్య విధమునే కథలుగా నవవిధాన
      దివ్య దీర్ఘ ప్రభల గీత తేజ మిది యు  
మ:: విరిసేనే మది విశ్వమందు సుఖమై విశ్వాసమేలే శుభమ్
సిరులన్నీ కళ వైభవమ్ము కధ చూ సీ చూడకేలే భయమ్
అరివీరా వినయమ్ము గాను సుఖదా ఆత్రమ్ము పొందులే మయమ్ 
దరితో గూడి సుఖింప న్యాయ మటరా దర్వీకర ధ్యoసకా 
      
 ద ర్వీకరము =  పాము
పాము (కాళీయ మర్డనము) ను
చంపిన వాడు శ్రీకృష్ణుడు.
 
తే::ప్రేమ తరవాత ఏమిటి ప్రతిభ చూపు 
     పెళ్లి తరవాత ఏమిటి పిల్లలగుట 
     బిడ్డ తరవాత ఏమిటి పెల్లె యగుట  
     ప్రశ్న తరవాత ఏమిటి ప్రతిజవాబు 
 
తే::ఎగర లేవుపక్షులు రెక్క లేవి లేక   
     ఎగరలేని పక్షుల ఊహేల నీకు 
     మనిషిలోఊహ గమ్యము మనసు ఉంది 
     దేవుడే సంకల్ప సిద్ధిని ఇవ్వ గలిగె     

తే::బ్రతుకు అక్షరాలైనను భాధ ఏల  
     కనులు చేతనమైనను కామ్య మేళ    
     నిజ చెలిమిఏ విలాసమై నిద్ర ఏల   
     మౌన వీణ సరాగమై మౌఖ్య మేళ
 
 తే::ప్రేమనదిగా ప్రవాహమై పేరు ఏల
      సృష్టికి సమానమైనను సమయమేళ 
      విధికి వింతఆటైనను వేదనేల         
      మనసుమర్మముమాటలై మంత్ర మేల 

చం.
తరగనిసొత్తు విద్యయని తాతలు దండ్రులు జెప్పుచుండియున్ 
యరయగ విద్యలన్నిటికి నాద్యవునీవని బల్కుచుండి యెం
దరయగ నిన్ను గొల్వమని దప్పక నందురు భక్తితోడుతన్ 
విరివిగ విద్యలిమ్మనుచు వేడెద శారద నన్ను గావవే!

మత్తేభం
‘’చదువా లేదు ,పురాణమన్న నెరుగన్ ,శాస్త్రం బదెట్లుండునో
పదమా  తోచదు శయ్య వృత్తియెరుగన్బద్యంబు లల్లంగా గో 
విదుడన్ గానిక ,దప్పులన్ విడిచి తృప్తిన్ నాదుపద్యాళిలో 
దుదిపాదంబున నొప్పు నామ సుధనెంతో గ్రోలి నాదండముల్ 
పది వేల్ గైకొని  భక్తులార తరియి౦పన్ మిము వేడెదన్ ‘’

 ’ఆధారంబు పయిన్ షడక్షరయుత ,ప్రాంచద్దళో పేతమై  
బోధ బ్రాహ్మి సకామ బీజములచే బొల్పోంది తానిత్యమున్
సాధిష్టాన విదాతయై రుధిర రమ్యంబౌ నుపస్థాశ్రిత –స్వాధిష్టాన నివాస మొందుజననిన్ బ్రార్ధింతు సర్వేశ్వరా ‘’
‘’వరదా! నే శత వందనంబులిడి నా వైరాగ్య పాత్రంబునన్ 
భరమౌ కర్మ చయంబనా బరగు కప్ర౦బున్ వెలిగింతు భా
స్వర నీవారజ శూక సూక్ష్మమగు ప్రజ్ఞాన దీప్తిన్ విభూ స్థిరమై మంగళ హారతి౦గొనుచు దృప్తిం బొందు సర్వేశ్వరా ‘’

శార్దూలం.
కైలాసాధిపతీ శివా శశిధరా కైవల్య దాతా!హరా!
కాలాతీత మహాప్రభావధవళా! కాత్యాయనీ మోహనా!
ఫాలాక్షా! దశకంఠ గర్వదమనా!వాగీశ సంసేవితా!
నీలగ్రీవ భుజంగభూష గిరిశా! నేత్రత్ర యాపాహిమాం!

ఉ:: దండము ణమ్మ మీకు యమ దండన మింకిట జేరనీకు నీ
దండయె రక్ష రేకు హరిదాసుని నన్ విడ బోకుమో వే
దండము రీతి నా కిక ముదంబొ నరింపుము సర్వ సృష్టి వీ
తాండము మాడు మానసము తప్పులు దిద్దుము సేవ చేసెదన్
సమస్య:
సంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోక‌ సౌఖ్యార్థులై
శా.
జంధ్యాధారులు మాటదప్పరు కదా సాయంబునున్ గోరినన్
నింద్యాపూర్వకమైన వాక్కులను రానీరండి యే వేళలన్
గంధ్యాదుల్ తనువంత బూసుకొనగన్ గాంక్షించి సంసిద్ధులై
సంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోక సౌఖ్యార్థులై

ఈ అక్షరాలు పాదం చివర రావాలి.

న్యస్తాక్షరి...... మం , గా, దే, వీ

మాత్రాబద్ధము

విజయ మందు ఆశ విశ్వాస సౌఖ్యమం
వలయ మార్పు ఓర్పు విద్యా లయమ్ముగా
కళల నేర్పు చూపి కర్తవ్య విద్యదే
మనసు ఆట పాట మానస మాధవీ

ఉత్పల మాల
సర్వము తెల్పినా మనసు శోకము వెంటన ఉండుటే సుమా
గర్వము తోడుగా కలిసి గాయము చేసియు తోడ్పడే మెగా
పూర్వము తోడ్పడే కళలు పూర్తిగ నాశన పర్చుటే ఇదే
ధైర్యము వెంటనే మలుపు దౌత్యము ధారుణ కాండయే కవీ

******

సందేశ వాక్యం

నేటి పత్రికా రంగం ? ఓం చిత్రికా  అంగం
స్వకుల మర్ధనం రంగుల మయం!
సద్భావన పద్యము
నేటి పత్రికా రంగంలొ నిజము లేదు

నాయకుని చుట్టు చిత్రికా నాన్య తేది
స్వకుల భజన మాత్రమే సత్య మేది
రంగులామార్చు కధలన్ని రవ్వ వెలుగ
******

సంక్షేమ లక్ష్యంగా ప్రయాణం  ప్రధాని
అధికార దుర్వినియోగం ఎలా?
సంక్షేమ ప్రధాని గ వస్తె శంక లేల
గౌరవము తగ్గు చేయుట గుణము ఏల

రక్షక భటులు ఉన్నాను రంగు లేల
వృద్ధి చెందేది ఆపియు వక్ర మేల
శక్తి నాపలేరు ఎవరు సమయ తీర్పె ఈశ్వరా
******

*నేటి తేదీ 6-1-2022

అంశం:దేవరాజు మహారాజు-నేను అంటే ఎవరు(కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం 2021)

పేరు: మల్లాప్రగడ రామకృష్ణ

పరమ హంస శిష్యుడు సత్య పావనుండు        
చరమ మందు దెలుయు అభయ రచయితుండు 
తరము మారినా తలచేటి మహాను బావుండు
శరణు అన్న నిత్య సత్య వెల్గు శోభితుండు
తరుణ శాంతి నిచ్చు దేవరాజు మహారాజు ఈశ్వరా

*****

హృదయ వీణ కదిలెను లే హాయి గొలుపు
మదిలొ మాయలు తొలగులే మగువ పిలుపు
కదిలె గుండెలో శబ్దాలు కధలు కలుపు
చెదలు చేరని హృదయమే చేరు తలపు
వలపు తలపుల మధ్యనా వరుస మలుపు ఈశ్వరా

******

నిషిద్ధాక్షరి :లక్ష్మీస్తుతి 

ధర్మమేజీవ నాధార ధరణి యందు 
జీవ మాధుర్య భవమే జపము నందు 
అర్ధము నిరర్ధ మనుటయే ఆశ యందు 
ప్రార్ధనా భావము యెను స్త్రీ ప్రేమ యందు 
సర్వ సృష్టి యందునె అమ్మ సాకు చుండు ఈశ్వరా 

దత్తపది : ఆరుద్ర , శ్రీ శ్రీ ,ఆత్రేయ , వేటూరి 

ఆ రుద్ర జపము సర్వశ్రే యస్సు కొరకు 
శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సేవ కొరకు 
ఆత్రముగను ఆత్రేయడు పాట తళుకు 
పాట మాటల వేటూరి పదము చురుకు 
స్వర్గ మున మాట పాటల సావ డిదియు ఈశ్వరా 

న్యప్తాక్షరి : గణనాధ 

గణము గుణములు మారక గాలి లాగ 
ప్రాణముకురక్ష చేయుట ప్రధమ పాగ 
ఆనతి వినాశ మును మార్చె ఆట కాగ 
ధరణి కష్టము తొలగించు ధనము ఏగ
నిత్య గణనాధ బ్రతుకుయే నీరు కాగ ఈశ్వరా 

దత్తపది..రక్త..భక్త.భక్తి..ముక్తి... శివుని స్తుతి...

రక్త వర్ణ ఫాల నేత్ర రాత్రి వెలుగు దీపమై 
భక్త కోటి రక్షా చేయు భక్తి పంచు లక్ష్యమై 
భుక్తి కొరకు శక్తి పంచు భుజము పంచు స్నేహమై 
ముక్తి నిచ్చు యోగ విద్య మోక్ష మగుట బ్రోవఁగా 
 
దత్తపది...... మందు, పొందు, విందు, సందు
....
మందు బ్రతుకు న ప్రేమయే మాట గుండె
పొందు కోరు టే జీవము పోరు గుండె
విందు భోజనం లాగుంది వింత గుండె
సందు దొరికితే చాలును శబ్ద గుండె
.....
న్యస్తాక్షరి......లం, కా, పు, రీ
.....
లంకె బిందెలు ధరణి లో లయలు చెంది
కాల నిర్ణయ ప్రభవమే కదులు చుండి
పురము సంఘటనలు ఏన్నొ పుడమి నందు
రీతి ఏదైనా సాధ్యమే రమ్య పరచు
.....
- న్యస్థాక్షరి...నా ర  సిం  హ.

నాది అనకు అంతయు దైవ నాడి  నీలొ 
రసము వల్ల ప్రయోజనం రమ్య పరచు 
సింహ గర్జన అన్నిటా సేతు వవదు 
హరిని పూజించు సర్వమూ హాయి గొలుపు 

 యేసు - మేరి- సిలువ - చర్చి
....
జయముయే శుభ సూచిక జాతి యందు 
అలసి లువముయే కారును ఆట యందు 
తనువు చర్చియు ఎవరికీ తాపమందు 
ఆశలు సుఖమే రివ్వున ఆకలనుట

 దత్తపది...... నూరు, వేయి, లక్ష, కోటి 

నూరు గురు కౌరవలు కృష్ణ నమ్మ పలుకు
వేయి ఏనుగుల బలము భీమ బలుడు
లక్షణాలను జూపెను లౌక్య మయ్యె
కోటి కోర్కలు కూటికే కళల వెలుగు

జీవి నూరేండ్ల బ్రతకుయే జపము చేయు
మనిషి వెయ్యేండ్లు ఆశలు మధుర మయ్యె
దుష్ట లక్ష ణాలబతుకు దురద తెచ్చు
కోటి దీపాలు వెలుగులు కూటి కొరకు

దత్తపది----  గద్వాల, అలంపూరు, పాలమూరు, వనపర్తి

4 ఇంద్ర।।యతి 4వగణం 5 చంద్రగణం
గద్వాల చీరెలు ప్రసిద్ధి గొప్పగ తెలంగాణ
అమ్మ అలంపూరు దేవమ్మా ఆరాధ్య తెలంగాణ
పాలమూరు న ఆట కోలాటం ప్రసిద్ధి గ తెలంగాణ
వనపర్తి రంగనాయకుని దేవాలయ తెలంగాణ
((()))

మనసు చెప్పేది చేసి  మనసుతో చూడాలి
మనసు చేసేతి తెల్పి మనసుతో చెయ్యాలి
మనసు అనుభవం ఉన్న మనసులో ఉంచాలి
మనసు భారాన్ని మోసి మనిషిగా ఉండాలి

 చంద్రిక

చూడు అలంపూరు చూడు జోగిలాంబ ఆదుకొనెడి అమ్మ
చూడు గద్వాల్లో చూసి చీరల్నీ  కొనియు కట్టిచూడు
చూడు పాలమూరు చూడు కోలాటం అంటె ఆనందం
చూడు వనపర్తిని చూడు రంగనాధ దైవ పూజ చేయు
(())
 దత్తపది....ఇంపు, సొంపు, ముంపు, కంపు

ఇంపు గున్న ఏనుగు మూడు ఈశ్వరేచ్ఛ
సొంపు గున్న పడుచు కోర్క సొమ్ము ఇచ్ఛ
ముంపు గున్న ఆంబోతు కు ముడ్డి ఇచ్ఛ
కంపు గుణాన్ని కలిగి నా కామ ఇచ్ఛ
దత్తపది రూపాన శృంగారం శ్వేచ్ఛ ఈశ్వరా

నేటి సమస్యను పూరించుట ..... ..కొంత సుఖించి పెరవారికి  తావొసంగుచున్.....

ఇంతని చెప్ప లేని దగుటే మనసెర్గిన తానొసంగుచున్ 
వింతని అన్న ఏమి ఫలితమ్ విడమర్చియు తెల్పనెంచయున్
శాంతిని కోరి భావములనే తెలపాలని నే నొసంగుచున్ 
కొంత సుఖించి పోయిరెటకో పెరవారికి  తావొసంగుచున్.....
--(())--
 దత్తపది....... దూలము, ద0తె ,వాకిలి, కిటికి

నిలువు అడ్డదూలములతో నీడ గూడు
దంతె ఆధారమే గూడు దాక పాడి
వాకిలి వెలుగు సంసార వాస మవ్వు
కిటికి సంధాన కర్గగా పెంచు గాలి

దత్త పది...పాత రోత గీత వాత

పాత పెళ్లాం అనియు చెప్పి పాఠమోద్దు
రోత గున్నావు అనుటయు రొప్ప వద్దు
గీత మోజుగా యుధ్ధమే గీత వద్దు
 వాత పెట్టిన పెద్దల వాక్కు వద్దు
అనెడి మూర్ఖమానవులుయే ఆట చూడు 

పంచపది 
ఎలుకకు పిల్లితో జాతి వైరం
శునకం వరాహాలది శత్రు వైరం
దొంగలకు పోలీసుల కు వృత్తి వైరం
‌స్తీలకు శత్రువు స్త్రీ అందమే  వైరం
పురుషునకు పుత్ర ప్రేమే తెచ్చు వైరం ఈశ్వరా

పాత పెళ్లాం అనియు చెప్పి పాఠమోద్దు
రోత గున్నావు అనుటయు రొప్ప వద్దు
గీత మోజుగా యుధ్ధమే గీత వద్దు
 వాత పెట్టిన పెద్దల వాక్కు వద్దు
అనెడి మూర్ఖమానవులుయే ఆట చూడు ఈశ్వరా

వాడిన కుసుమాలు వాసనలు రగిలిస్తాయి
విచ్చిన కుసుమాలు వికాసాన్ని విరజిమ్ముతాయి
మోగ్గా ఉన్నవి ఆశలు పురిగొల్పుతాయి
జక్కన్న చెక్కిన శిల్పాలు మనసు దోచాయి
యోగులు చెప్పిన భోధలు శాంతి నింపాయి ఈశ్వరా

అంద మంతయు చూడలేములె ఆశ వెల్గల శిల్పమే
కొంద రాశయు గొప్పశిల్పము కోస మేకృషి చేయుటే
పేద జక్కన చేయు శిల్పము జేయు సుందర దృశ్యమే
మందిరానన చేత చిక్కిన మాయ రూపము చెక్కుటే
వేదమాతను చెక్కె శిల్పియె వెల్లు విర్శెను ఈశ్వరా
*****
 
అరటి పండుతిన్నను జీర్ణమగును తిండి
అరటి ఊచకూర బహుపసందు గుండు
పచ్చి అరటి కాయ తొబజ్జి బాగు గుండు
అరటిపండు యవ్వనమిచ్చు అనుచు చుండు

పనస పొట్టు కూర తినుము పలకరింపు 
పెరుగు పనసతొనలు బహు పచ్చ గుండి
రిచియు అద్భుతం అమోఘం రిస్కుతోను
తీయ గలుగుట ఒకకళ తప్పదిదియు
((()))]


 న్యస్తాక్షరి  ల , క్ష్మీ , దే, వి

ప్రతి పాదం చివర రావాలి।।

ఆటవెలది 

అమ్మ కృప శక్తి  ప్రేమ పాత్రుల కల  
తల్లి తండ్రి దీవెన తో ధైర్య శ్రీ లక్ష్మీ   
విషయ వాంఛ తెల్పు వివరము ప్రేమదే 
సకల శోభ నిచ్చు తృప్తి తావి 

 సప్త పది  ( ఇందులో..' చారు , పారు , దారు , సారు ' పదాలతో సుందరకాండస్థ హనుమద్వర్ణన )..

చారుల పలుకు హనుమతొ చాంద్రి బతికె 
పారు తూ లంక వెతికేను పృద్వి కొరకు 
దారుణము యుద్ధ గమనపు దారి హనుమ 
సారు రక్కసు లతొ చూసె సీత దిగులు    

  న్య  స్తాక్షరి........... సీ, తా, రా, మా

నాలుగు పాదాలలో పాదాదిన రావాలి.

తేటగీతి
సీఘ్ర దృష్టి యే చిన్నా య సమర మయ్యె
తాప సమ్మున తృప్తి యే తప్పు కాదు
రాజ్య మేదైన బుధ్ధి యే రక్షగుండు
మాన మే స్త్రీపురుష శక్తి మదన మొద్దు

ఆటవెలది
సీత చిలక పలుకు చిత్రమైనది గాను
తామ సమ్ము చూపకయును తెల్పె
రామ ప్రేమతో సద్భావం రంగరించె
మానసమ్ము మహిమ చూపు చుండె

 ఉత్పలమాల
సీతగ కష్టమై బతుకు సర్వము రాక్షస నీడనుండుటన్
తాతగ పల్కులే వినని దౌత్యుడు రావణ మృత్యవవ్వటన్
రాతను ఎవ్వరూ మరచి రంజుగ రాతిరి గడ్పలేరులే
మాత గ ఓర్పు యే తలచి మోక్షము కోరుట మంత్రమవ్వుటన్

((()))
న్యస్తాక్ష రి.. సిం, గ, రా,యా

సింహ గర్జన సభలో న సిరుల కొరకు
గమన లక్ష్యము ఆస్తులు గోల ఆపు
రాచ మర్యాదలు తొ తిర్గి రాటు తేలు
యాచనగ ఓటు అడుగుట యాత్ర చేసె

 సింధువు కదిలె మదనంతొ సంతసించె
గమ్య మేదైన మనసున గాయమాపు
రాటు తేలివిజ్రుంభన రవ్వ వెలుగు
యామము కోరిక తీరుటే యాత్ర మారు

క చ ట త ప నిషిద్దాక్షరి. తెటగీతి..

సర్వ రోగాలు మెరిసేను సూర్య'రశ్మి
ఇష్ట ఇష్టాలు వలలాయె ఈశ్వరేచ్ఛ
ధర్మ సందేహములు వల్ల దారి మార్చు
విశ్వ విద్యాలయం వారు విద్య నేర్పు

దత్తపది...... అంగి, నింగి, కృంగి, చెంగి 
చెంగుట= ఓడిపోవుట
చెంగి= ఓడిపోయి

అంగి ఆభరణము మేను అర్ధ రక్ష
నింగి విస్తృత స్థాయిలో నిగమ దీక్ష
కృంగి పోవుట అవముని కృపగ దీక్ష
చెంగి ధైర్యము లేకయే చింత దీక్ష

అంగి మోహనసుధ అంగ మంద గమన సిధ్ధి శుభ్ర బుధ్ధి      
నింగి యుందు వెలయు  నిత్య శోభితుండ సర్వ నీడ నిచ్చె         
కృంగుటేల నీకు  కాల వేషకునికి తలను వంచ నేల
 చెంగి దైర్యమ్ముగ చింత  వలదు నీకు సర్వ శక్తి తోడు

న్యస్టాక్షరి.......స్వా గ త ము

నాలుగు పాదాలలో పాదాదిన రావాలి.
స్వాగతము తెల్పి వేడుక సరయు చుండు
గమన మార్గము ధర్మ మై కాల తీర్పు
తనయులతొ ఆశ వలదు తరణ మంత
ముల్లు గుచ్చుకొన్న మనసు ముల్లె తీయు

న్యస్తాక్షరి..........అ  మె రి కా
నాలుగు పాదాలలో పాదాదిన రావాలి.

అలుక లేలనో దరహాస మాడకుండ
మెరుపు చూపి యే మరుపేల మనసు నందు
రిచట ఆశలు రేపకే రేడు మనసు
కాల మంతయు నీదియే కలలు తీర్చు

మాత పిత భ్రాత మోత

మాతగ మేలునే తలచి మానస మంతయు మేలు చూపుటన్
శ్రీ తప ధైర్యమే పతికి శ్రీ కర శోభయు లక్ష్య మవ్వుటన్
భ్రాతయు సర్వమూ కలపి భ్రాంతిని మార్చి యు తోడు అవ్వుటన్
మోతయు వద్దులే మనలొ మౌనము ఏలను సౌఖ్యమందునన్

ఆటవెలది

మాత పితలు మనుకు ఆది దంపతులు లే
తాత భ్రాత కలసి తెల్పు కధలు
మాకు సంత సమ్ము  మనసు తట్టు 
హృదయ శ్వాస హాయి గుండు టగుట

న్యస్తాక్షరి....... , హీ హీ హీ హీ

నాలుగు పాదాలలో పాదాదిన రావాలి.
ఆటవెలది

హీన భావ మోద్దు హేలగా పలకొద్దు
హీలియమ్ము వాయువంత నుండు
హీహి హాహు ఓహొ కేకలు దేనికో
హీచరితను తెల్ప లేను నేను

సమస్యను పూరించండి.
వాని జన్మ0బదొక్క పూటైన చాలు

దాన ధర్మాలు లేవులే దారి ఏది
వాని వల్లనే ధనమును వ్యాధి కలిగె
ఎన్ని పల్కులు నిజము యో ఏల చెప్ప
వాని జన్మంబదొక్క పూటైన చాలు

7-4- వర్ణణ....... మనం రోజూ త్రాగే " కాఫీ*  ని గూర్చి

వర్ణించండి. మీ ఇష్టమొచ్చిన పద్యంలో.......


*.కం....ఆహా ఏమిరుచి ఇదీ

ఓహో అమృతం ఇదేను ఓర్పును పెంచెన్

మోహము తగ్గించుటయే

దాహము తీర్చేది నాకు దారియె కాఫీ

.....

*మ స జ భ ర లగ -8  

నిద్రే లేవగ నేను -- నేటి ఇష్టముగంటి కాఫీయే   

చెదైనా సుగరైన - చేరి ఇచ్చిన వారి కాఫీయే

కాదేదీ సమయమ్ము - కాని సంతసమేను కాఫీయే    

పొందేలా సుఖమాయె - పోరు కష్టముగంటి కాఫీయే

......

*కం...ముగ్ధా కలిపే కాఫీ

స్నిగ్ధా తెచ్చేను పాలు సెగలే కాషీ

వాగ్ధాటి పెంచును కాఫీ

వాగ్దానం కళలు తీర్చి భార్యయె ఇచ్చెన్

(మల్లాప్రగడ రామకృష్ణ )

.....

మధురాధర సంసర్గా

శ్యామా చారు పయోదారా

స్నిగ్ధా సర్వాంగ సురభి:

కాపీ కస్మై న రోచతే.....

పూర్వ కవుల శ్లోకం......🙏🙏🙏( రామిరెడ్డి గారు )

......

" కాఫీ కలిపిన వైఫా

  కాఫీ - టేస్టీ గనుండె  'కాఫీ - దేదో '

కాఫీ సిప్పుచు భణితము

కాఫీ ' జోషు ' ను నిడునుగ ..' కాఫీ .. జయహో !!! "

--

( ఇందులో..వొక '  కాఫీ '..* ఉర్దూ * ,జోషు ( / ష్ )..దేదో.. హిందీ..)

----(గోపాలా చార్యులు)

 కం...' కప్పు' న ' హాటీ - కాఫీ '

' కప్పు ' నకుసాసరుండెను కాపుగ మనకున్

' సిప్పు ' నుఁజేయుచు త్రాగిన

చప్పున తలనొప్పివోవు శారదభక్తా !!! "

----(అప్పాజీ గారు)

03..దత్తపది --- క్రికెట్టు , ఫుట్ బాల్ , టెన్నిస్ , ఖో కొ
ఈ పదాలు పద్యంలో ఎక్కడైనా రావచ్చు.
🤎🤎🤎🤎🤎🤎🤎🤎
*..తే...చెక్రి కెట్టున పూజలు చేయగలవు
జీవి మనసు ఫుట్ బాల్ వలే జేత్ర యాత్ర
మనిషి జారుటె న్నిస్ కళ మహిమ వలెనె
కళలు చేరుఖో కోరుకో కాల మందు

---
*దత్తపది...అల్ల, ఏసు, బుద్ధ, విష్ణు

జీవితాన అల్లము బేల జిత్తులగుట
మనిషి మనసు ఏ సుఖమంత మాయలగుట
బుద్ధ లీలలు మానస బుడగలాయె
విష్ణమాయలు విధిలోన వింత లాయె
----
అల్లరసపుతేనె యారోగ్య మిచ్చునే
ఏసుదాసు గళముఎంచఁదగున
బుద్ధదేవమాటభువిలోకసుఖమిచ్చు
విష్ణు మాయనెరుగువిశ్వమందు.
----
నేటి..ప్రాంజలి ప్రభ వారి
(తల,మెడ,కడుపు,వీపు - పదములతో అన్యార్థమున ఇచ్చాఛందమున పద్యము)
===
*తల పు లెన్నెన్నొ చైతన్య తలుపు తట్టు
కడు పు నీతుడై అక్కర కక్కె కూడు
కాల మెడ పైన కధలన్ని కధలు గలవు
తగ్గవీ పు లకింత కలలు తెగువ చూపు
---
నాప్రయత్నము
(వర్ష బీభత్సములో ఈ ఊరు)
*ఊరవ తల జలాశయమురకలేసె
వర్ష మెడ తెగకుండగ పడుచునుండె
నొ కడుపు రవీధిలోనుండ నొళ్ళు తడిసె
కానరా వీపు రమ్మున కరువులింక!!
===
(చెన్నమాధవునిభాస్కరరాజు)

*..దత్తపది..ఈగ,దోమ,నల్లి,పేను
ఈ గలగలలు దేనికో యీద లేక
మనసు ఏదో మదిని దోచె మాయ కమ్మె
నల్లిని నలిపే బుధ్ధితో నటన ఏల
కప్పు నింపేను కాఫీయె కలలు గుర్తు
---

దత్తపది...........
అప్పు
నిప్పు
కప్పు
మెప్పు
♦️♦️♦️
*..అప్పలు చేయుట బ్రతుకున
నిప్పులు కురియుట సహజము  నిందయు కాదే
కప్పులొ కాఫీ త్రాగుట
మెప్పుయె ముప్పుకు మలుపుయె మేలును అవునా
*..అప్పులేనియిల్లు తెలుపు ఆశకాదు
నిప్పు లాంటి మనసు మార్చు నిజము కాదు
కప్పులోనపుట్టుతుఫాను కాని దగుట
మెప్పు వలన ఫలము ఏది మేత అవదు
----
*." * అప్పు ల* నులేనిబ్రతుకున
  * కప్పు* రముఁబగిదినుపకృతిఁగావించుమయా..
* నిప్పు * గఁజూడుపరధనము
* మెప్పు * నుగడియించుమోయి మెఱియుచుభువిలో !!! "
----
అప్పు లేని జనులు యానంద మొందుతూ
నిప్పు లాగ బ్రతుకు నిజము నెరిగి 
కప్పునిన్ను దెలువు కాంతకాంచనములు
మెప్పు  పొందు రిలన మేలు జేయ
---
సమస్యను పరిష్కరించడం.......
కణితి,హరి,జింక,పులి,కేకి కలసి తిరిగె
కణితి = దుప్పిలాంటి ఒక జంతువు
హరి = సింహము 
కేకి = నెమలి

తృణము బ్రతుకైన జీవించు తృప్తి పొందు
ఋణము పొందక పొదుపుగా ఋతువు నందు
మౌనముద్ర లు మనిషి గా మేలుచెందు
కణితి హరి జింక పులి కేకి కలసి తిరిగె
0----

నాతొ నవ్వవా ఇప్పుడే నమ్ము మమ్మ
నన్ను చూసిభయమ్మోద్దు నీవు కూడ
నటన కాదులె ప్రేమయు నీదు నాది 
నవ్య చరితమ్ము మనమధ్య నవ్వ కమ్మ

ఏమి రూపమది మనసు ఎదను తాకె
కురులు అందము హృదయాన్ని కుదిపి వేసె
విశ్వ శాంతి కి కళలేలు జయము చూపె
తగిన మెలకువ కురులతో నావ లేలెె

పాలు ఇచ్చే టి బర్రెకే భారమయ్యె
దున్నపోతు లే పాలించె ధరణి యందు
దుష్ట దుర్మార్గ రాజ్యంలొ దారి ఏది
ప్రజల కోరిక తీర్చేటి పుడమి ఇదియె

తే...పెక్కు మాటలు  మాటాడు పెదవి  నీది
చిక్కు లెల్లయు తెచ్చునా చిలిపి మాట
ముక్కు మూసి చూడు కనులు మురుయు మదిన
క్రక్కునిజము యదిమదికి కాంతి నిచ్చు..

నేటి స్పందన పద్యాలు
 న్యస్యాక్షరి...సం..స్క్ర..తము
* సంతానముయే మనసం
స్కృతిగా గుణమే ను దేవ సమ్మతి జీవా
తత్త్వము మనసై మమతై
ముత్యము మల్లెను వెలుగులు ముఖ్యము యగుటే

* మంచి మాటతో ఆశల మదిని దోచె
వెనుక దాగియు చెలిమిని వేటు వేసె
నమ్మ కానికి మూర్ఖుని నటన చేసె
పాలలోవిషం చిమ్మేటి పాశ మతడు

ఆటవెలది 
* సంతసంబుతోన సత్కవు లంత, సం
స్కృతపు యాంద్ర సారరసము లెల్ల 
తన్మయంబుతోడ తలచికవులినిపించ
ముగ్థమోహనముగమురిసె మనము
----
*  బాల వాక్కు బ్రహ్మ పలుకు భాగ్యమెంచ
పండిత సమీక్ష పాఠము పందెరముయె
పద్య సమరభేరి కళలు ప్రగతి కొరకు
పొందు విద్యనే పరులకు  పంచి వేయు

*  ఒక గడియ తీరు లేనట్టి ఓర్పు నున్న
శాస్త్ర విన్యాస పాఠంతొ శాంతి నిచ్చె
హృదయ వాంఛ విషయ చర్చ హాయి నింపె
కావ్య గణనతో నిత్యమూ కలయు కీర్తి

*. " నాగేంద్రముఖాభిభూషం , 
నాగేంద్రసూత్రవీతినమ్..
నాగేంద్రభూషపత్నీష్టం ,
 కేకివాహాగ్రజం భజే !!! "
---
 సీ //
*  గణపతినిఁదలువ ఘన విఘ్నపతిగొల్వ
గానపత్యములిచ్చు గజముఖధరి!
గిరిజ సుతుడుగాద గిరిహిమపురినందు
విఘ్నాలుఁదొలగించు వీర శివుడు!
యోగులందరుధ్యేయ యోగపతిగజేయ
మూలధారపుమూర్తి   ముద్దుగాను!  
వేదవ్యాసపలుక  వేడుకై సాగేవు
పంచమ వేదాల పాలకుండ!

* విశ్వనాథునాపి వినయంభుగాజెప్పి
వీరశైవశోభ విశ్వతేజ
యాత్మ లింగమదియెయాభువినతా
కింప రావణుండురగిలె రామయనుచు

*కం:  వందన మయ్యా గణపతి  
పొందుము ఉండ్రాళ్ళు పోపుతో వడపప్పే
విందును నేనే చేసే
పొందికగానులె మనస్సు పద్ధతి నీకే

*శ్రమ విలువ జీవ ఆహార శాంతికొరకె
సమయ పాలన బ్రతుకు లో సానుభూతి
వినయ క్రమశిక్షణ పలుకు వేద మగుటె
మనసు మమతానురాగమై మసులు చుండె

*ఉచిత విద్య లేదు పలుకు ఉడత భక్తి
ఉత్తములు ను గుర్తింపు యు ఊసు ఏది
అమ్మ భాష లేని చదువు ఆటఇదియె
చదువుని చులకన యనక చక్క జేయు

* వలచి నాను నిన్ను వాలు చూపన్నది
కలకలముయె వలదు కామమదియె
తలపు తెల్ప లేక తాపత్రయం చూపె
నాతి సొమ్ము భళిర నాతి చేష్ట

* మండే ఎండల బాధలు
ఉండే నీడలు తొలగియు ఊపిరి కొలువై
నుండే పనులే కరువై
పండే ఫలమే దొరకక పలుకులు కధలై
.............
* నా కస్సలు అర్థ మేది
నీ కస్సలు కోర్కలున్న నే పలుకులుగా
నా కస్సలు బాధలేదు
నీ కస్సలు కష్టమున్న నాకు తెలుపుమా
----







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి