6, ఆగస్టు 2019, మంగళవారం

నేటి పద్యం - తప్పులు

కష్టాల్లో అనుకోని సంఘటనయే ఓర్పును ఓదార్పు నూ

విశ్లేషిం చె మనో బలాన్ని సమర్ధత సదా చూపాలి దూరాన్ని ద

గ్గర్లోఉన్నటులే మనీషి బతుకే శీలస్య ప్రాధాణ్యతే

ఆకాంక్షల్ని కధా పరంగ కదిలే తప్పుల్ని తప్పించులే

--((***))--

శ్లోకం :- సర్వథా సుకరం మిత్రం
దుష్కరం పరిపాలనం|
అనిత్యత్వాత్తు చిత్తానాం
మతిరల్పేsపి భిద్యతే||

రామాయణము : కిష్కింధకాండ

తా:- స్నేహము చేసుకొనుట సులభము కాదు. కానీ దానిని నిభాయించుట చాలా కష్టము, కారణము మనసే. ఈ మనసు కోతి వంటిది. ఈ క్షణము ఈ కొమ్మ మీదయితే మరుక్షణము ఇంకొక కొమ్మ మీద. ఎన్ని చెట్లు చుట్టుకొస్తుందో తనకే తెలియదు. కావున మనసు మీద మనకు పట్టు వుండవలెను. స్నేహితము చేయుటకు వ్యక్తీ యోగ్యత పరిశీలించడము అత్యవసరము. స్నేహము చేసిన తరువాత మాత్రము దానిని ఎట్టి పరిస్థితిలోనూ కాపాడుకొనవలసినదే కానీ చిన్న చిన్న పోరపొచ్చాలతో దూరము కాకూడదు. మనసును నియంత్రించుకొనుట మనిషికి మిక్కిలి అవసరము.

"కేన రత్నమిదం సృష్టం మిత్రమిత్యక్షర ద్వయమ్!
............"
  ' మిత్రం ' అనే రెండు అక్షరముల రత్నాన్ని ఎవరు సృష్టించారో కదా!!

దదాతి ప్రతిగృహ్ణాతి
గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి !
భుంక్తే భోజయతేచైవ
షడ్విధం మిత్ర లక్షణమ్ !!

స్నేహితుడు తన మిత్రునికి - కావలసినవి తన దగ్గర ఉన్నవి ఇస్తాడు, తను తీసుకుంటాడు; అతని రహస్యాలను అడుగుతాడు, తనవి చెప్తాడు;  తను తింటాడు, స్నేహితునికి తినిపిస్తాడు. ఈ ఆరు మిత్ర లక్షణములు.

శ్లోకం

పాపాన్నివారయతి,యోజయతే హితాయ
గుహ్యం నిగూహతి,గుణాన్ ప్రకటీకరోతి !
ఆపద్గతం చ న జహాతి,దదాతి కాలే
సన్మిత్రలక్షణమిదం,ప్రవదన్తి సంత:!
భావం :
ఒక మంచి మిత్రుడు "పాపాన్నివారయతి"అంటే తన స్నేహితుడు చేసే పాపాలను నివారించి,
"యోజయతేహితాయ"అంటే మంచి పనుల యందు
 నియమిస్తాడు.
"గుహ్యంనిగూహతి"అంటే తన మిత్రుని రహస్యాలను రహస్యము గానే ఉంచుతాడు.
"గుణాన్ప్రకటీకరోతి"అనగా తన మిత్రుని సద్గునాలను నలుగురిలో ప్రకటిస్తాడు తప్ప చెడుగా చెప్పడు.
"ఆపద్గతం చ న జహాతి "అనగా ఆపత్కాలంలో తన మితున్ని వదిలి పోడు
"దదాతి కాలే "భవిష్యత్ లో కష్ట సుఖాలలో చేయూతనన్దిస్తాడు.
ఇవి నిజమైన మన మేలుకోరే మిత్రుల లక్షణాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి