24, ఏప్రిల్ 2020, శుక్రవారం

ఓం నమః శివాయ:
శ్రీ ఆది శంకరాచార్య విరచిత
శ్రీ మంత్రమాతృకా పుష్పమాలా స్తవం
🕉ఓంశ్రీమాత్రేనమః🕉

శ్రీ మంత్రమాతృకా పుష్పమాలా స్తవం శ్రీ శంకర భగవత్పాదాచార్యవిరచిత శ్రీ మంత్రమాతృకా పుష్పమాలాత్మక నిత్య మానస పూజ!!!

భగవంతుని మనము పంచ పూజ (5 ఉపచారాలు)షోడశోపచార పూజ (16 ఉపచారాలు)చతుష్షష్టి పూజ (64 ఉపచారాలు)అని పలువిధములైన ఉపచారాలతో పూజిస్తుంటాము. భగవంతునికి నిత్యమూ జరిగే ఉపచారాలు ధ్యానం,ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యం, ఆచమనీయము, పంచామృతస్నానం, శుద్దోదకస్నానం, వస్త్రం, యజ్ఞోపవీతము, ఆభరణములు, గంధము, పుష్పములు, అంగపూజ, స్తోత్రం(అష్టోత్తరం / సహస్రనామావళి ), ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలం, నీరాజనం, ఛత్రం, చామరం, నృత్యం, గీతం, వాయిద్యములు, మంత్రపుష్పం, ప్రదక్షిణం, మొదలగునవి.

శ్రీ మంత్రమాతృకా పుష్పమాలస్తవం (పంచదశి మంత్ర యుక్తమైన స్తవం) ద్వారా  శ్రీ శంకర భగవత్పాదులవారు నిత్యము అమ్మవారిని మానసికంగా ఎలా షోడశ ఉపచారాలతో పూజించవచ్చో మనకు తెలియ జెప్పారు. శ్రీ మంత్రమాతృకా పుష్పమాలలో 17 శ్లోకాలు ఉనాాయి.అందులో 16 శ్లోకాలు  16 ఉపచారాలకునూ, ఆఖరి శ్లోకం ఫలస్తుతిగాను వర్ణించ  బడినది. అంత కంటే అద్భుతమైన  విషయం ఏమిటంటే స్వామివారు  ఈ స్తోత్రాన్ని పంచదశీ మంత్రానికి అనుసంధానంగా వ్రాసారు. మీరు గమనిస్తే ప్రతీ శ్లోకం మొదటి అక్షరము పంచదశీ మంత్రంలోని బీజాక్షరములతో మొదలవుతుంది. (క..కల్లోలోల్లసితా, ఏ...ఏణాఙ్కానల, ఈ...ఈశనాదిపదం, ల..లక్ష్యే యోగిజనస్య, హ్రీమ్,......).


ప్రశాంతంగా సుఖాసనములో కూర్చోని  శ్రీ మంత్రమాతృకా పుష్పమాలను పఠిస్తూ, అమ్మవారిని  ధ్యానిస్తూ మనసనే అనే మందిరానికి  అమ్మవారిని  ఆవాహన చేసి, ధ్యానాది  షోడశ ఉపచారాలు చేసుకునాంత మాత్రాన , మనకు అమ్మవారి  కరుణా, కృపా, కటాక్షము సంపూరణంగా లభంచి, మనస్సుకు, శాంతి, ఆనందం  చేకూరుతాయి.


ఉద్యోగస్తులు, భౌతికమైన బాధలతో సతమత మౌతున్నవారు, తీరిక లేనివారు, ఎవరైనా సరే, నిత్యమూ భగవంతుని ఆరాదించ లేకున్నామని  అని చింతిస్తున్న వారందరికీ  శ్రీ శంకర భగవత్పాదుల వారు ప్రీతితో ప్రసాదించిన వరము శ్రీ మంత్రమాతృకా పుష్పమాల అని చెప్పాలి.


శ్రీ మంత్రమాతృకా పుష్పమాలా స్తవం  ప్రతినిత్యము  సంధ్యాసమయములో ఎవరైతే స్తుతిస్తారో  వారి సర్వ అభీష్టాలు సిద్ధిస్తాయి !!!

॥ మన్త్ర మాతృకా పుష్పమాలా స్తవః ॥

1)కల్లోలోల్లసితామృతాబ్ధిలహరీమధ్యే విరాజన్మణి- ద్వీపే కల్పకవాటికాపరివృతే కాదమ్బవాట్యుజ్జ్వలే ।

రత్నస్తమ్భసహస్రనిర్మితసభామధ్యే విమానోత్తమే చిన్తారత్నవినిర్మితం జనని తే సిహ్మాసనం భావయే ॥

ఓ అమృతవల్లీ! నా మనస్సులో ఉపొంగుతున్నపాలసముద్రంలో, అమృతభరితమైన అలల మధ్య, మిక్కిలి తేజోవంతమైన మణిద్వీపము ఒకటి విరాజిల్లుతున్నది. ఆ మణిద్వీపము కల్పక వాటికతో పరివృతమై ఉన్నది. అందు కాదంబ వృక్షములతో కూడిన ఉద్యాన వనములో రత్నావైధుర్యాలతో నిర్మించబడిన వెయ్యి స్తంభాల మంటప ఉపరి భాగమున, చింతామణులతో నిర్మించిన సింహాసనాన్ని నీకోరకై అమర్చినట్టుగా భావిస్తున్నాను!



2)ఏణాఙ్కానలభానుమణ్డలలసచ్ఛ్రీచక్రమధ్యే స్థితాం బాలార్కద్యుతిభాసురాం కరతలైః పాశాఙ్కుశౌ బిభ్రతీమ్ ।

చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుమ్భవస్త్రాన్వితాం  తాం త్వాం చన్ద్రకలావతమ్సమకుటాం చారుస్మితాం భావయే ॥

ఓ బాలాత్రిపుర సుందరీ!! చంద్ర-సూర్య-అగ్నికాంతుల అవర్ణముతో ప్రకాశిస్తున్న శ్రీచక్రముపై ఉపస్థితవై (ఆసీనురాలవై), ఎర్రటి వస్త్రమును ధరియించి,  ఉదయభానుని కాంతితో ప్రకాశిస్తూ, ప్రసన్నవదనంతో - ఒక చేత పాశము, ఒక చేత అంకుశము, ఇంకోచేత ధనస్సు, మరోచేత బాణము ధరించి,  చంద్రకళలతో భాసిల్లుతున్న కిరీటముతో మృదు మందహాసముతో దరిశనమిస్తున్నట్టుగా భావిస్తూ నిన్ను నా మనస్సున ధ్యానిస్తున్నాను తల్లీ!



3)ఈశనాదిపదం శివైకఫలదం రత్నాసనం తే శుభం  వర ఫలకం పాద్యం కుఙ్కుమచన్దనాదిభరితైరర్ఘ్యం సరత్నాక్షతైః ।

శుద్ధైరాచమనీయకం తవ జలైర్భక్త్యా మయా కల్పితం కారుణ్యామృతవారిధే తదఖిలం సన్తుష్టయే కల్పతామ్ ॥

ఓ కారుణ్యామృతవర్షిణీ! బ్రహ్మ , విష్ణు , ఈశుడు, రుద్రుడు పదములుగాను, సదాశివుడు ఫలకాగా అమర్చిన శుభ కరమైన రత్నాలతో నిర్మించిన ఆసనాన్ని నీకు సమర్పిస్తున్నమ్మ!కుంకుమ పువ్వు మరియు చందనంతో కూడిన పాద్యమూ (పాదములను కడుగుటకు), రత్నాలు మరియు అక్షతలతో కూడిన అర్ఘ్యము (చేతులు కడుగుటకు) నిరమలమైన జలాలు ఆచమనీయము (త్రాగుటకు): నీకు ఇవన్నీ భక్తి శ్రద్దలతో సంతోషముగా మానసికముగా సమర్పిస్తున్నాను, ఇవి నీకు సంతుష్టిని కలిగించుగాక!!



4)లక్ష్యే యోగిజనస్య రక్షితజగజ్జాలే విశాలేక్షణే ప్రాలేయామ్బుపటీరకుఙ్కుమలసత్కర్పూరమిశ్రోదకైః ।

గోక్షీరైరపి నాలికేరసలిలైః శుద్ధోదకైర్మన్త్రితైః స్నానం దేవి ధియా మయైతదఖిలం సన్తుష్టయే కల్పతామ్ ॥

ఓ విశాలాక్షి! నీ విశలా వీక్షణతో లక్షలాది యోగిజనులను, యావత్ జగత్తును  రక్షిస్తున్న ఓ జననీ! నీకు ప్రాతఃకాలమున (తెల్లవారుతుండగా)  మేలైన కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము, ఆవుపాలు, కొబ్బరి నీళ్లు, వేదం మంత్రములతో కూడిన పరిశుభ్రమైన జలములు అభిషేకార్థము (స్తానారిము) నీకు ఆనందముతో సమర్పిస్తున్నట్టుగా భావిస్తున్నాను, ఇవి నీకు సంతుష్టిని కలిగించుగాక!  



5)హ్రీఙ్కారాఙ్కితమన్త్రలక్షితతనో హేమాచలాత్సఞ్చితైః రత్నైరుజ్జ్వలముత్తరీయసహితం కౌసుమ్భవర్ణాంశుకమ్ ।

ముక్తాసన్తతియజ్ఞసూత్రమమలం సౌవర్ణతన్తూత్భవందత్తం దేవి ధియా మయైతదఖిలం సన్తుష్టయే కల్పతామ్ ॥

అమ్మా!హ్రీంకారముతో కూడిన మంత్రముతొ తేలియబడు స్వరూపిణ వైన నీకు బంగారు కోడయైన మానస సరోవరములోని ఉజ్వలమైనా రత్నాలతో తయ్యారు చేయబడిన ఉత్తరీయమును, ఎర్రటి వస్త్రాన్ని, బంగారు తీగతో చుట్టబడిన మేలిమి ముత్యాల యజ్ఞసూత్రాన్ని సమర్పిస్తున్నట్టుగా భావిస్తున్నాను.  ఇవి నీకు సంతుష్టిని కలిగించుగాక!



6)హమ్సైరప్యతిలోభనీయగమనే హారావలీముజ్జ్వలాం హిన్దోలద్యుతిహీరపూరితతరే హేమాఙ్గదేకఙ్కణే ।

మఞ్జీరౌ మణికుణ్డలే మకుటమప్యర్ధేన్దుచూడామణిం నాసామౌక్తికమఙ్గులీయకటకౌ కాఞ్చీమపి స్వీకురు ॥

ఓ లావణ్యవతీ!హంసలకుకూడా ఈర్ష్యను కలిగించు నడక గల ఓ దేవీ| నీకు మిక్కిలి ప్రకాశవంతమైన హారములను, కూర్చిన బంగారు భుజకీర్తులను, కంకణములను, అందేలను, మణికుండలమును, కిరీటమును, అర్ధచంద్రచూడామణిని, ముక్కుపుడిక, నత్తి (బులాకీని), ఉంగరములను కడియములను, ఒడ్డాణమును నీకు ప్రీతితో అలంకరింపచేస్తున్నట్టుగా భావిస్తున్నానమ్మా, స్వీకరించు తల్లీ!.



7)సర్వాఙ్గే ఘనసారకుఙ్కుమఘనశ్రీగన్ధపఙ్కాఙ్కితం కస్తూరీతిలకఞ్చ ఫాలఫలకే గోరోచనాపత్రకమ్ ।

గణ్డాదర్శనమణ్డలే నయనయోర్దివ్యాఞ్జనం తేఽఞ్చితం కణ్ఠాబ్జే మృగనాభిపఙ్కమమలం త్వత్ప్రీతయే కల్పతామ్ ॥

ఓ మీనానేత్రీ| ఇదిగో ఘనమైన కుంకుమ పువ్వుతో కూడిన శ్రీగంధలేపనం నీకు ఆపాదమస్తకము అలంకరింపజేస్తున్నాను. సుగంధ భరితమైన కస్తూరికొమ్ముతో చేయబడిన తిల్లకాన్ని నీ నొసటి దిద్దుచున్నాను, దివ్య అంజనముతో నీ కన్నులకు కాటుకను దిద్దుతున్నాను,  నీ కంఠానికి సుగంధ భరితమైన కస్తూరిజింక నాభి మామలాన్ని ఆలింకరింపజేస్తున్నాను, ఇవన్నీ నా  నాభావనతొ సమర్పిస్తున్నాను. ఇదంతా నీకు సంతుష్టిని కల్గించుగాక!



8)కల్హారోత్పల-మల్లికా-మరువకైః సౌవర్ణపఙ్కేరుహై-ర్జాతీ-చమ్పక-మాలతీ-వకులకై-ర్మన్దార-కున్దాదిభిః ।

కేతక్యా కరవీరకై-ర్బహువిధైః కౢప్తాః స్రజో మాలికాః సఙ్కల్పేన సమర్పయామి వరదే సన్తుష్టయే గృహ్యతామ్ ॥

ఓ కోమలీ! చక్కగా వికసించిన ఏర్రని కలువలు, మల్లేలు, మరువము, బంగారు తామర పూలు, జాజులు, సంపంగులు,(చాపకాలు) మాలతీ, వకులము, మందారం, కుంద పుష్పములు, మొల్లలు, మొగలి పువ్వు, ఏర్రగన్నేరు ||మె || వివిధ రకములైన పుష్పాలతో దండలు గుచ్చి నాభావనతో నీకు సమర్పించు చున్నాను. వరములనిచ్చు ఓ తల్లీ| సంతోషముగా స్వీకరించుము.



9)హన్తారం మదనస్య నన్దయసి యైరఙ్గైరనఙ్గోజ్జ్వలై- ర్యైర్భృఙ్గావలినీలకున్తలభరైర్బధ్నాసి తస్యాశయమ్ ।

తానీమాని తవామ్బ కోమలతరాణ్యామోదలీలా గృహా- ణ్యామోదాయ దశాఙ్గగుగ్గులుఘృతైర్ధూపైరహం ధూపయే ॥

ఓ దయామయీ!తన మూడోకంటి జ్వాలతో మన్మధుణ్ణి ఆహుతి చేసిన శంకరునికి ఆనందాన్ని కలిగించు నటువంటివిన్నీ, మన్మధుణ్ణి తిరిగి పునర్జీవితుణ్ణి చేసినట్టివిన్నీ, తుమ్మెద రేకులవలె నిగనిగలాడుతూ, శృంగారంతో సమస్త సుగంధాలకూ ఆలవాలమై, పట్టు కుచ్చు వాలే, అత్యంత మృదువుగా  వున్నా నీ శీరోజములకు పరిమళోపేతమైన దశాంగం గుగ్గులమును గోఘృతంతోను  దూపాన్ని సమర్పిస్తున్నాను స్వీకరించు తల్లీ!



10)లక్ష్మీముజ్జ్వలయామి రత్ననివహోత్భాస్ త్త్తరే మన్దిరే మాలారూపవిలమ్బితైర్మణిమయస్తమ్భేషు సమ్భావితైః ।

చిత్రైర్హాటకపుత్రికాకరధృతైఃగవ్యైర్ఘృతైర్వర్ధితై- ర్దివ్యైర్దీపగణైర్ధియా గిరిసుతే సన్తుష్టయే కల్పతామ్ ॥

శ్రీ మహాలక్ష్మీ!లక్ష్మీ కళలతో దేదీప్యమానంగా వెలుగొందుచున్న నీ భవనంలో, మాలారూపముగా ఉన్న మణిమయ స్తంభాలలో, చిత్రంగా నిర్మించబడ్డ బంగారు బొమ్మల చేతులతో దివ్యమైన ఆవునెతి దీపమాలికలను సమర్పించుచున్నాను తల్లీ ! నీకు ఇది సంతుష్టిని కలుగజేయుగాక!



11)హ్రీఙ్కారేశ్వరి తప్తహాటకకృతైః స్థాలీసహస్రైర్భృతం  దివ్యాన్నం ఘృతసూపశాకభరితం చిత్రాన్నభేదం తథా ।

దుగ్ధాన్నం మధుశర్కరాదధియుతం మాణిక్యపాత్రే స్థితం మాషాపూపసహస్రమమ్బ సఫలం నైవేద్యమావేదయే ॥

హ్రీకారేశ్వరీ!వేలకొలది నివేదనలు - బంగారు పళ్లెరారలో కరిగించి పోసిన నెయ్యితో  పప్పుకూరలు, మాణిక్య పాత్రలలో నిండియున్న దివ్యాన్నము, చిత్రాన్నాము(పులిహోర), పాలు తేన నెయ్యి తో చేసిన పాయసాన్నము,   చెక్కెరపొంగలి, పెరుగన్నము, గారెలు, బూరెలు,  వేలకొలది వివిధ రకాల దివ్యమైన ఫలములతో  (పండ్లు) కూడిన నైవేద్యాన్ని నీకు సమర్పింస్తున్నాను, జననీ స్వీకరించు!



12)సచ్ఛాయైర్వరకేతకీదలరుచా తామ్బూలవల్లీదలైః పూగైర్భూరిగుణైః సుగన్ధిమధురైః కర్పూరఖణ్డోజ్జ్వలైః ।

ముక్తాచూర్ణవిరాజితైర్బహువిధైర్వక్త్రామ్బుజామోదనైః పూర్ణా రత్నకలాచికా తవ ముదే న్యస్తా పురస్తాదుమే ॥

*ఓ కౌమారీ!స్వచ్ఛమైన  మొగలియాకుల  కాంతితో సమానకాంతిగల లేత తమలపాకులకు మేలిమి ముత్యాలతో తయారు చేసిన తెల్లటి సున్నము పూసి,
శ్రేష్టమైన వక్కపొడి, పచ్చకర్పూర మిశ్రితమైన సుగంధ ద్రవ్యాలు కలిపినా మిశ్రమాన్ని కుర్చీ, పరిమళ భరితమైన తాంబూలాన్ని నీకు సమర్పిస్తున్నాను, అమ్మా స్వీకరించు, దీనితో  రత్నములతో పొదగబడిన బంగారు కళాచికను(చిన్నపాత్రను)  కూడా నీ ముందు ఉంచుతున్నాను తల్లీ!  నీ తాంబూల శేషాన్ని మాకు ప్రసాదించడానికి.*

(గమనిక: కామాక్షి అమ్మవారి  తాంబూల కబళాన్ని గ్రహించిన తరువాత కదా శ్రీ మూక శంకరేంద్ర  సరస్వతీ స్వామివారు  మూకపంచశతి  రచించి యున్నారు! అందుకె  మనము కూడా అమ్మవారి త్యంబూల శేషము ప్రసాదముగా పొందుటకై అమ్మనవారి చెంత కళాచికను  ఉంచవలెను ).   



13)కన్యాభిః కమనీయకాన్తిభిరలఙ్కారామలారార్తికాపాత్రే మౌక్తికచిత్రపఙ్క్తివిలసద్కర్పూరదీపావలిః ।

వర దీపాలిభిః ఉతత్తత్తాలమృదఙ్గ తసహితం నృత్యత్పదామ్భోరుహం మన్త్రారాధనపూర్వకం సువిహితం నీరాజనం గృహ్యతామ్ ॥

ఓ కళావతీ! కమనీయమైన కాంతితో తేజరిల్లె కన్యలచే అత్యద్బుతముగా అలంకరించిన హారతి పళ్లెరాలలో ముత్యాలతో అలంకరించిన ముగ్గుల మధ్య కర్పూర దీపాలను  ప్రజ్వలింపజేసి, తాళమృదంగ గీత నృత్యాలతో, వేదమంత్రాలతో  తల్లీ నీకు నీరాజనం అర్పించుచున్నాను, స్వీకరించువమ్మా!



14)లక్ష్మీర్మౌక్తికలక్షకల్పితసితచ్ఛత్రం తు ధత్తే రసాద్- ఇన్ద్రాణీ చ రతిశ్చ చామరవరే ధత్తే స్వయం భారతీ ।

వీణామేణవిలోచనాః సుమనసాం నృత్యన్తి తద్రాగవ- ద్భావైరాఙ్గికసాత్త్వికైః స్ఫుటరసం మాతస్తదాకర్ణ్యతామ్ ॥

భువన జననీ! లక్ష్మీ ప్రదమైన లక్షలాది ముత్యములతో కల్పించిన శ్వేతా చిత్రాన్ని నీకు సమర్పిస్తున్నానమ్మా! ఇంద్రాణియైన శచీదేవి మరియు రతీదేవి ఇరువైపులా నీకు చామరాలు వీచుచున్నారమ్మా, సరస్వతీ దేవి వీణాగానం చేయుచుండ అప్సరసలు మధుర కంఠముతో వివిధ నృత్య భంగిమలతో మహిషాసురమర్దనాది నీ దివ్యలీలలను భావయుక్తముగా ప్రదర్శిస్తున్నారు, ఆలకించు తల్లీ!



15)హ్రీఙ్కారత్రయసమ్పుటేన మనునోపాస్యే త్రయీమౌలిభి- ర్వాక్యైర్లక్ష్యతనో తవ స్తుతివిధౌ కో వా క్షమేతామ్బికే।


సల్లాపాః స్తుతయః ప్రదక్షిణశతం సఞ్చార ఏవాస్తు తే సంవేశో నమసః సహస్రమఖిలం త్వత్ప్రీతయే కల్పతామ్ ॥

ఓ వేదజనని!  వేద శీర్షాలైన ఉపనిషత్తుల విచారణ ద్వారా లక్ష్యమైయ్యే అంబా! నిన్నెవరు స్తుతించగలరమ్మా! నా సల్లాపాలు నీ స్తోత్రాలుగా, నా సంచార సర్వస్వం నీకు అసంఖ్యాక ప్రదక్షిణలుగా మదీ యాగణిత సంకల్పాలే నీ ధ్యానముగా  స్వీకరించు తల్లీ!



16)శ్రీమన్త్రాక్షరమాలయా గిరిసుతాం యః పూజయేచ్చేతసా సన్ధ్యాసు ప్రతివాసరం సునియతస్తస్యామలం స్యాన్మనః ।

చిత్తామ్భోరుహమణ్డపే గిరిసుతా నృత్తం విధత్తేరసా- ద్వాణీ వక్త్రసరోరుహే జలధిజా గేహే జగన్మఙ్గలా ॥

ఫలస్తుతి:-
^^^^^^^^^^^^^^^
ప్రతినిత్యమూ సాయంసమయమున నిర్మలమైన సుస్థిరమైన చిత్తముతో గిరిరాజానందిని యగు జగదంబను హృదయములో నిలుపుకొని శ్రీ మంత్రాక్షరమాలచే మానసికంగా పూజించే వారి హృదయరా విందాలలో పరదేవతా నృత్యం చేస్తుంది. వారి వాక్కులో సరస్వతియు, గృహసీమలో జగన్మంగళ అయిన శ్రీ మహాలక్ష్మియు తాండవం చేస్తారు.


ఇతి గిరివరపుత్రీపాదరాజీవభూషా భువనమమలయన్తీ సూక్తిసౌరభ్యసారైః ।

17)శివపదమకరన్దస్యన్దినీయం నిబద్ధా మదయతు కవిభృఙ్గాన్మాతృకాపుష్పమాలా ॥

ఈ మంత్రమాతృ
కా పుష్పమాల - జగజ్జనని పాదారవిందానికి అందెగాను, జ్ఞాన  సుగంధముచే విశ్వాన్నంతటిని స్వచ్ఛంగా పవిత్రంగా ఉంచేటట్లుగా, పరమశివుని చరణ కామాలలందు అచంచల భక్తిని ప్రసాదించేదిగాను, జ్ఞానులైన  కవీశ్వరులందరికీ ఆనందాన్ని ప్రసాదించేదిగాను అగుగాక!


ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవత్పాదవిరచితః మన్త్రమాతృకాపుష్పమాలాస్తవః సమ్పూర్ణః ॥

(((())))

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి