25, మే 2015, సోమవారం

Self confidence -25 (Family-comedy-Love- Sanskrit slokaala telugu vachassu))

 ఓం శ్రీ రామ్              ఓం శ్రీ రామ్                                 ఓం శ్రీ రామ్ 
మనోధైర్యానికి మార్గాలు -25

యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మత్రుప్తశ్చమానవ:  !
ఆత్మన్యేవ చ సంతుష్ట: తస్య క్రార్యం న  విద్యతే   !!

ఎవడైతే ఆత్మ యందె ప్రీతి కలిగి, ఆత్మయందే సంతృప్తి  చెందుతూ, అత్మయందే ఆనందాన్ని పొందుతాడో అల్లాంటి వాణికి చేయాల్సిన కార్యం ఏది ఉండదు (గీత 3. 7)

మనసు ఒక కోరికల  పుట్ట. ఆ కోర్కలను తీర్చుకొవడానికి ఎన్నో కర్మలు చెస్తూ ఉంటాం "మనం కర్మలు చేస్తున్నంత వరకూ మనస్సులో చింతలు దూరమవుతాయి " 
సంసారంలో కర్మలు నిర్వర్తిస్తున్నంత వరకు మనస్సు అల్లకల్లోలంగా ఉంటుంది. సాంసారిక చింతల నుండి శాంతిని పొందాలంటే మొదట  సత్సాంగత్యం చెయాలి. దాని ద్వారా భవత్ కథా శ్మరవణం పట్ల ఆసక్తి  ఎర్పడు తుంది. ఆ తరువాత భగవన్నామంపై  అబిరుచి కలుగుతుంది. భగవన్నామస్మరణలో నిమగ్నమైన మనస్సు భక్తి పారవశ్యమై  ఒలలాడుతుంది.  అలా సంసారం నుండి మనస్సును భగవంతునివైపు మరలించిన కొద్ది చింతలు తగ్గుతూ వస్తాయి. చివరికి సంపూర్ణ చిత్త  శాంతి చేకూరుతుంది
ఎవరైతే ఒక్కసారి భగవన్నామరుచిని ఆస్వాదిస్తారో అలాంటివారు ఎలాంటి ప్రలోభాలకూ, ఆకర్ష ణలకూ లోను కారు అని హనుమంతుని కథను వివరిస్తాను
" ఒకసారి హనుమంతుడు, రావణాసురుని భవనంలో ప్రవేశించి, అక్కడ స్పటిక స్తంబాలను చూస్తు ఉండుట ఒక స్త్రీ చూసెను వెంటనే తన మాయా రూపాన్నిప్రకటించి అందమైన స్త్రీగా మారి ఏంతో  ఆత్మీయతగా పళ్ళను స్వీకరించమని వేడుకుంది, అందచందాలతో ప్రలోభ పెట్టింది. కాని హనుమంతుడు ఎటువంటి ప్రలోభాలకు లొంగ కుండా తన కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకొని సీత కొరకు క్షణకాలం కుడా వ్యర్ధం చేయక వెతికెను.     



."మరణం ప్రకృతిః శరీరిణాంవికృతిర్జీవితముచ్యతే బుధైః
క్షణమప్యవతిష్ఠతే శ్వసన్ యది జంతుర్నను లాభవానసౌ"
.
విజ్ఞులు మరణము ప్రకృతిసిద్ధమైనదని జీవితము యాదృచ్చికము అని నుడువుతారు.
ఒక్క క్షణము శ్వాస పీల్చి వదలినామంటే ఆక్షణము జీవితమును సాదినట్లనుకొనవలెను.
.
రఘువంశము(మహాకవి కాళీదాసు)




పులి-కంకణము-బాటసారి .!
.
నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి మిత్రలాభము
.
ఒక ముసలి పులి స్నానముచేసి దర్భలు చేతఁబట్టుకొని కొలని 

గట్టుననుండి 'యోయి తెరువరీ, యీ పయిఁడి కంకణము వచ్చి పుచ్చుకొ'మ్మని పిలిచి చెప్పెను. ఒక పాంథుఁడా మాట విని 'యిది నా భాగ్యముచేతనే వచ్చుచున్నది. ఏల సందేహపడవలె'నని చింతించి, 'యేదీ కంకణము చూపు'మని యడిగెను. పులి చేయిచాఁచి 'యిదిగో హేమ కంకణము చూడు'మని చూపెను. 'నీవు క్రూర జంతువవు కాఁబట్టి యేలాగున నిన్ను నమ్మవచ్చు'నని పాంథుఁడు పలికెను. ఆమాట విని పులి యిట్లనియె. 'ఓరీ పాంథా! విను, మునుపు యౌవనమందు మిక్కిలి దుష్టుఁడనయి యుంటిని. అనేకములగు గోవులను మనుష్యులను వధించి మితిలేని పాపము సంపాదించి భార్యాపుత్రులను బోఁగొట్టుకొని యేకాకినయి నిలిచితిని. అనంతర మొక పుణ్యాత్ముండు నా యందు దయచేసి, యికమీదట గోవులను, మనుష్యులను వధింపకు, సత్కార్యములు చేయుమని చెప్పెను. అది మొదలుకొని పాపకృత్యములు విడిచి మంచి కార్యములు చేయుచున్నవాఁడను, వృద్ధుఁడను, బోసి నోరి వాఁడను. గోళ్ళు పోయినవి, లేవ సత్తువలేదు. నన్ను నీవేల నమ్మవు? నీవు దరిద్రుఁడవు కాఁబట్టి యిది నీకు దానము సేయవలెనని కోరితిని. సంశయపడక యీ కొలనిలో స్నానము చేసి వచ్చి పసిఁడి కంకణము పుచ్చుకొమ్ము' అనఁగానే వాఁడు పేరాసచేత దాని మాటలకు లోఁబడి కొలనిలో స్నానము చేయ బోయి మొలబంటి బురదలో దిగఁబడెను. అప్పుడు పులి చూసి 'యయ్యయ్యో, పెను రొంపిలో దిగఁబడితివి గదా! నేను వచ్చి నిన్ను లేవ నెత్తెదను. భయపడకు' మని తిన్నతిన్నఁగా సమీపించి వానిని బట్టుకొనెను. ఈలాగున వాఁడు తగులుకొని - 'క్రూరజంతువును నమ్మరాదు. నమ్మి యీ గతి తెచ్చుకొంటిని. మించినదానికి వగచి యేమి ప్రయోజనము? ఎవ్వరికైన విధి తప్పించుకో వశముగాదు.' అని చింతించుచు దానిచేత భక్షింపఁబడియె.
.
కాఁబట్టి సర్వవిధముల విచారింపని పని చేయరాదు. చక్కఁగా విచారించి చేసిన పనికి హాని యెప్పటికి రాదు."


22, మే 2015, శుక్రవారం

Selfconfidence-24 (Family-Comedy-Love) Manobhaavaalu-1

om Sri raam                         om sri raam               om sri raam 
మనోధైర్యానికి మార్గాలు -24
                       
                   


ఆశలెప్పుడూ సజీవమె- ఆచరణ చేతుల్లో 
అబద్దాలేప్పుడు నిజాలే -అనుకరణ చేతుల్లో 
కష్టాలేప్పుడు సుఖాలే -అనుభవించే చేతుల్లో 
వడ్డి లెప్పుడు ఆశలే- వసూలు చేసే చేతుల్లో

నీ సన్నిధికై తపిస్తున్నా 
శ్వాసిస్తూ జీవించాలని 
నీ ప్రతిభను తెలుసుకున్నా 
ప్రశంసిస్తూ జీవించాలని
నీ శ్వాసను అర్ధం చేసుకున్నా 
నీ స్మరణతో జీవించాలని 
నీ నేర్పును గ్రహిస్తున్నా 
నీ ఓర్పుతో జీవించాలని


 కోర్కలకు వలవేయకు 
కొండనాలుక కొరుక్కోనేంత,
మనసును అనుచుకోకు 
పిచ్చివానిలా మరే యంత,
ప్రేమ అని పదే పదే అనుకోకు
అనారోగ్యునిగా మారే యంత,
కలలు నిజమనుకోకు
ఆశలతో ఎదురు చూసి నంత 


జీవితం ఒక్కటే  యుద్దాలు అనేంకం
చదరంగం ఒక్కటే ఎత్తులు పైఎత్తులు అనేకం
మానవత్వం ఒక్కటే ఆశా ఆశయాలు అనేకం
ప్రేమ ఒక్కటే ప్రేమకు  మార్గాలు అనేకం 


వేదనా భాస్పాలెన్నో నాలో
నిదురలేని కన్నుల్లో అవిరియై పోతూ,
వికసించాలన్న పువ్వు లెన్నో నాలో
మొగ్గలోనే మసిబట్టి ఆవిరై పోతూ, 
వేకువజాములెన్నో నాలో
మనసు లేని మనసుకు ఆవిరై పొతూ,
పరువాన్ని పదిలంగా ఉంచాలన్న ఆశలెన్నో నాలో
తాపానికి ఆశ నీరై ఆవిరై పోతుంది.  


సామాన్యున్ని రంజింప చేయగలుగును కాని,
అత్యాస పరుడ్ని రంజింప చేయలేదు ధనం.  
మానవుల అభ్యున్నతికి పనికొస్తుంది కాని,
ధర్మాన్ని, న్యాయాన్ని బ్రతికించలేదు ధనం. 
ప్రేమతో అనుమానం పెంచు తుందేమోకాని,
ఎప్పుడూ ప్రేమను బ్రతికించ లేదు ధనం.  
బ్రతికే వాన్ని చంపు తుందేమో కాని,
చచ్చేవాన్ని బ్రతికించ లేదు ధనం.  


నీ రాగమే నయం సంగీత స్వరాల ముందు
నీ మనసే నయం ఈ మొండి ఘటం ముందు
నీ తాపమే నయం సూర్య తాపము ముందు
నీ జపమే నయం  ఈ బ్రహ్మ చారి  ముందు


పిచ్చి పట్టిన ప్రేమికుడు -ప్రేమతో మట్టు బెట్టు
సిగ పట్టిన  శిరోమణి - సిగతో  మట్టు  బెట్టు
కరుడుగట్టిన ఘనుడు -భయంతో మట్టు బెట్టు
పగబట్టిన భానుడు -వృద్ధులను మట్టు  బెట్టు

నచ్చ లేదనేవారు లేరు
మచ్చలేని వారు  అసలే లేరు 
పిచ్చ లేని ఎవరూ లేరు  
రచ్చ చేయని  వారెవరు
లేరు
 

కళాకారుని హస్తవాచకుము అద్భుతము
ఆరని అందాలు గీతమ్ మరీ అద్బుతం
ముఖం లేని ఊరువుల అందం అద్బుతం
ఆత్రుతఆనంద సాగారునికి మరో అద్భుతం 


ఇచ్చకాల భార్య దొరకటం- భర్తకు సంతోషం
మెచ్చుకోలు భర్త దొరికితే -భార్యకు సంతోషం
సంసారంలో చదరంగం -సరిగమలే సంతోషం
అనురాగాల మేలి కలయకే- అందరి సంతోషం 
  

అరవిరిసిన చందమామను- అరచేతితో పట్టాలనుకోకు
ఆనందాల హరివిల్లును- అందుకోవాలని ప్రయత్నించకు
అనురాగం అందలేదని- అలిగి వెళ్లి  భర్తను ఏడిపించకు
చందమామను నీలల్లో పట్టినట్లుగా-అందని దాని కోసం ఆశించకు


గ్రీష్మం ప్రజండంగా ప్రజ్వలించి
వయసు నిండిన వారిని తృంచి
చంటి పిల్లలను వేడితో వేదించి
గ్రీష్మం కుటుంబాలనే వణికించె

గ్రిష్మాన్ని తట్టుకొని- మల్లెలు పరిమళించే
మల్లెల సువాసనలకు -మనసు జలదరించే
వేడికి మంచు తోడై -వయసు ఇంకా ఉడికించే
చల్లని వేడికి పరిమళం జోడించి-  పరవశించే
   

నీశ్వాసలొ చేరినందుకు -నా మనసులో అలజడి
శ్వేత కమలమువంటి హృదయం- ఎందుకో అలజడి
శ్యామల వర్ణం, శ్వేతవర్ణం -కలియుటే బ్రహ్మ ముడి
అమరత్వం పొందే -ఎక శ్వాసతో కలవటమే
మడి

మల్లెల కుంటుంది ఉబలాట - మనసు కుంటుంది తపనల ఆలాట
మల్లెలు తెల్లని పువ్వుల బాట - మనసు కోర్కలతో ప్రతి పూట
మల్లెలు మగువులకు ఇష్టంట - మనసు మగువు చుట్టూ ఉండునట
నవ్వుల మల్లెల పూదోట - మనసుతో భవ భందాలతో ఆడే ఆట   



ఆశయాల కోసం- కోర్కలు అవసరం
కోర్కలు ఆశలుగా మారటం- అనవసరం
కోరితేనే దొరకుతుంది -అధరం
ఆధరమే ఆశగా మారితే -అనర్ధం


21, మే 2015, గురువారం

Self confidence-23 (Family-comedy-Love- Sanskrit slokaala telugu vachassu))

  

ఓం శ్రీ రాం      ఓం శ్రీ రాం        ఓం శ్రీ రాం 
మనోధైర్యానికి మార్గాలు -23




మూకమ్ కరోతి వాచాలం పజ్గుం లజ్జయతే గిరిం
యత్క్రుపా తమహం వందే పరమానంద మాధవం

(దానిలో ఆశ్చర్యపడవలసిన దేమియూ లేదు ,భగవానునకు అసాద్యమగు కార్య మేముండును?)

భగవత్ సాక్షాత్కారం కోసం ఇద్దరు యోగులు తపస్సు చేస్తున్నారు, ఒక నాడు నారద మహర్షి ఆప్రాంతము నుండి  నారాయణ జపం చేసుకుంటూ పోవు చుండెను, అతని గాంచి యోగులు ఒకనాడు "స్వామీ తాము వైకుంఠం నుండి   వచ్చు చున్నారా  అని ప్రశ్నిమ్చెను. నారదుడు " ఔను " అనెను . వెంటనే యోగులు మీరు వెళ్ళినప్పుడు 
భగవంతుడు ఏమి చేయు చున్నాడో సెలవియ్య రా? అని అడిగెను. "ఏనుగులను లొట్టిపిట్టలను సూది బెజ్జముగుండా దూర్చుచూ క్రీడించు చుండగా  జూచితిని" అని నారదుడు సమాధానము చెప్పెను. అది విని ఒక   యోగి, "దానిలో ఆశ్చర్య పడ వలసిన దేమియు లేదు,. భగవంతునికి అసాద్యమగు కార్య మేముండును ? అనెను. కాని రెండవాడు ఇట్లు ప్రతిఘటిమ్చెను : " వేర్రిమాట! అది యసంభవము మీరు  వైకుంఠం బోనేలేదని దీనివలన రుజువగుచున్నది అనెను. ఆనాడే వాద ప్రతివాదనలు జరిగెను, నారదుడు చక్కగా తప్పు  కొనెను చేస్తున్న తపస్సు వ్యర్ధమాయెను

మెదటివాడు దేవుడున్నాడు అని నమ్మినవారికి ఆదేవుని చేసి క్రియలు ప్రక్రియలు అన్ని అర్ధమవుతూ ఉంటాయి, అట్లాగే శక్తి వంచన లేకుండా మానవ ప్రయత్నం ద్వారా మనుష్యు లకు మనస్సును రంజింప చేయుట కుడా దేవుని ప్రక్రియ అని నమ్మవలెను.  మానవులు మనసులో ఆలోచన వచ్చినట్లయితే ఆచరణ పెట్టుటకు ప్రయత్నించవలెను, వాటి వలన కొంత నష్టము జరిగినా అది లెక్కలోనికి తీసుకొకూడదు. మానవ ప్రయత్నమునకు ఆదేవుని కృప ఉండుట వల్లె ఈ దేశం ఇంత  సుభిక్షముగా ఉందని గ్రహించగలరు
కొన్ని చిత్రములద్వార నా భావ కవితలు పొందు పరుస్తున్నాను
    
రండు రండూ రండు రండందరూ రండు
రండు కృష్ణ ప్రేమను రండు గైకొన రండు
కపట ఆలోచనలను విడిచిరండు రండు
హృదయమనోహరుని వేడుకుందాం రండు    



పువ్వు విచ్చే , వన్నె తెచ్చే, నవ నవ లాడే సొగసు వచ్చే
మనసుకు మెచ్చే, వయసు వచ్చే, అనురాగానికి ముందుకు వచ్చే
అధరాలు ఆత్రుత పెంచే, అలసట కనిపించక ఆనందం పంచే 
కళ్ళు మెరిసి, పెదాలు చిందించి, వలపు లందించే లేత సింగారం వచ్చే 


నవ్వుల హరివిల్లు
నయనాలకు విరిఝల్లు
ఆనందాల పరవళ్ళు
ఆహ్లాదానికి సంకెళ్ళు


image not displayed

వయసులో ఉన్నాను
పెదాలతో పిలుస్తున్నాను
అందుకోవటానికి రంమంటున్నాను
ఆనందాని కోసం నేనునున్నాను

image not displayed

నేనొక పరువాల కన్యను
జలాల్లో అందాలు చూపె కన్యను
పరవసించే వారికి పసందును
క్షణ ఉల్లాసాల బిందువును
image not displayed

నా వెళ్ళు చూస్తున్నావా
నా సళ్ళు చూస్తున్నావా
నా వళ్ళు చూస్తున్నావా
నే పోతున్నా వస్తావా

image not displayed

వాలు చూపుల వయ్యారి
మనసు దోచే గులాబి
కురులు విప్పిన సింగారి
చూపులతొ రమ్మంటున్న చకోరి
image not displayed

తిరుగుతున్న ఆకాశ నివాసిని
వార్తలు అందించే అకాశవాణిని
ముందుగా తేలిపే వాతావరణాన్ని
నేను చిత్రం చూపందే కొన్ని ప్రాణుల బ్రతకుల్ని 




ఇది ఒక వినూత్నమ్గా తయారైన ట్రాక్టర్
గాలిలో తేలుతూ ముక్కలయ్యే ట్రాక్టర్
అగ్గేపెట్టేలతో,గుడ్డలతో చేసిన ట్రాక్టర్
ఎట్లా ఉన్నా ఆనందం పంచుతున్న ట్రాక్టర్

image not displayed

ఇది ఒక సముద్రంపై తేలే ఆట
మూగజీవులను రక్షించే ఆట
ఆకాసంలో తేలియాడుతూ పరవశించే ఆట
చేస్తున్నారు ప్రాణుల బ్రతుకుల ఆట



మురిపాల ముద్దు గొమ్మ
పరువాల పసిడి  బొమ్మ
మనసెరిగిన మర బొమ్మ
మనసు నమ్మిన  బొమ్మ


మనసు మనసులో లేదు
మనువాడే వయసు కాదు
పువ్వులో పువ్వుని కాదు
అపరంజి బొమ్మను నేను


image not displayed


తూర్పుకు తిరిగి నడుం వంచి అందుకో తుపాకి
అందిన దాన్ని అందలం మీదగా అందించు 4వ వాడికి
కర్తవ్య దీక్ష గుర్తుతో  యాక్షణ్  తో తూర్పుకు తిరిగిరి
 ఆనందంతో ఎక్సర్ సైజు గా మారింది ఆ నలుగురికి

image not displayed


ఏమి అద్భుతము, ఆనందోస్చాహము
ఏమి ఆత్మ ధైర్యము, ఆనందాల ఆట మయము
అందలం నుండి దూకుట, నేత్ర పర్వం
అందులో ప్రకటన స్టాండ్ ఆధారం మరీ అద్భుతం  


 కర్తవ్యం మరచి ప్రవర్తిమ్చవద్దు - వచ్చే ఆనందాని వదలవద్దు 
  
(గమనిక నా మెయిల్లో వచ్చిన చిత్రములద్వార  ఈ చిన్న కధను వాసినాను చూసి ఆనందించగలరు ) 













16, మే 2015, శనివారం

Self Confedence - 21 (Music - Old History )

ఓం శ్రీ రాం        ఓం శ్రీ రాం        ఓం శ్రీ రాం 
మనోధైర్యానికి మార్గాలు - 21


సంగీతం ఒక దివ్యకళ
         డ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైన కధ                   
                      (పురాణంలో నుంచి )

ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణుభక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గానమాధుర్యంతో మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. స్థూలశరీరాన్ని విడిన తరువాత విష్ణులోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియభక్తుని స్వాగతించి అతని గౌరవార్థం ఆంతరంగిక సంగీతసభ ఒకటి ఏర్పాటుచేసాడు. ఆ సభలో దేవర్షి నారదునికి ప్రవేశం లభించలేదు. తుంబరునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు. తనకు ప్రవేశం లేకపోవడం అటుంచి తన ప్రత్యర్థి అయిన తుంబరునకు స్వాగత సత్కారాలు లభించడం చూచిన నారదుడు మండిపడ్డాడు. అయినా, తమాయించుకుని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవడానికి ప్రయత్నించాడు. అక్కడ కూడా ఆ దేవి చెలికత్తెలు అడ్డుపెట్టారు. దానితో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు. అదితెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని ముందు ప్రత్యక్షమైయ్యారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికి నారదుని కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలైంది. శరీరమంతా చెమటలు పట్టాయి.

కీలెరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గు పడుతున్న నారదుని చూచి అన్నాడు - 'నారదా! నీ కోపకారణం నాకు తెలియును. నిజానికి భక్తి జ్ఞానములందు, శీల వర్తనములందు తుంబరుడు నీకన్న కపటి కాడు, గర్విష్టి కాడు. కపట భక్తిని ప్రదర్శించు వారెన్ని తీర్థాలు సేవించినప్పటికి వ్యర్థం. భక్తిశ్రద్ధలతో నన్నుకొలుచువారలకు అవశ్యం వశ్యుడనే. సంగీతం చేత ననుజేరవచ్చునని చాటి చెప్పుటకే కౌశిక తుంబరులను నేను సత్కరించాను. నీ శాపానికేమీ బాధ పడటం లేదు. లోకహితమే జరుగుతుంది. చింతించ వద్దు.'

నారదునికి అప్పటికి జ్ఞానోదయమైంది. "ఓ దేవదేవా! నా తప్పులను క్షమించుము. అవివేకివలె ప్రవర్తించాను. నన్ను కాపాడుము. తుంబర కౌశికులవలె సంగీతంలో మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా!' అంటూ కట్టెలు తెంచుకుని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణుని పాదాలమీద పడ్డాడు.

భక్తుని పశ్చాత్తాపం భగవంతుని హృదయాన్ని కరిగించింది. తన దివ్యహస్తాలతో నారదుని పైకి లేపాడు. ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చేయమన్నాడు. ఉత్తరాన మానససరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది. దాని మీద ఒక దివాంధం ఉంది. ఆ ఉలూకపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు.

శ్రీమన్నారాయణునికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చెతులు జోడించిన నారదుడు సెలవుపుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానససరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తోంది. తెరలు తెరలుగా వస్తున్న ఆ గానమాధుర్యాన్ని పట్టుకుని ఆవలిగిరి శిఖరం చేరాడు. గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరాసాదులెందరో అక్కడ సంగీతాభ్యాసం చేస్తున్నారు. వారి మధ్య గురుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న 'గానబంధు' నారదుని చూడగానే వినయంతో ఆశనం దిగి ఎదురేగాడు. ఆనందంగా ఆసనం చూపి కుశలప్రశ్నలు వేసాడు. ఏతెంచిన కారణం చెప్పమని ప్రార్థించాడు.

నారదుడు గానబంధు వినయానికి, సంగీత పాటవానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీత వేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు. అతడెవరైతేనేం! తనకు కావలసింది సంగీతవిద్య. ఉలూకపతికి నమస్కరించి జపతపాదులకు సాధ్యంకాని శ్రీహరిని తుంబుర కౌశికులు గానమాధుర్యంతో వశం చేసికొన్నారని, తనకూ అలాంటీ దివ్యగాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు. గానబంధు, నారదుని ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరింప సాగాడు -

పూర్వం భువనేశుడనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలి గుండెగలవాడు. ధర్మవర్తనుడు. సంప్రదాయానుసారం ధర్మకార్యాలన్నీ క్రమం తప్పకుండా నిర్వహించాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు. భగవంతుని కూడా భక్తిగీతాలతో స్తుతించకూడదని చాటించాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజాజ్ఞను మరచిపోయి భగవంతుని కీర్తిస్తూ గానం చేసాడు. ఆ గానమాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని మరచిపోయారు. వెంటనే రాజబటులు వచ్చారు. హరిమిత్రుని రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్య మహాపాపం. మరణశిక్షతో సమానమైనది రాజ్యబషిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుని సంపదనంతా స్వాధీనం చేసికొని రాజ్యం నుండి వెళ్లగొట్టాడు. కాలచక్రం తిరగడం మానదుకదా! కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. అలాగే గిట్టినప్రాణి కూడ పుట్టక తప్పదు. నరుడుగా మరణించిన రాజు గుడ్లగూబగా జన్మించాడు. దివాంధజన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారయింది. పురాకృత దోషఫలితం కాబోలు; ఒకసారి నాలుగు రోజులైనా ఆహారం దొరక లేదు. ఆకలి దుర్లభమైపోయింది. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసికొన్న సుకృతం వల్ల మరణ దేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముని చూచి 'ధర్మరాజా! ఎందుకు ఈవిధంగా నన్ను బాధ పెడుతున్నావు? నేను గతజన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదక్షిణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయ చూపవు?' అన్నాడు భువనేశుడు.

దివాంధ స్థితికి యమధర్మరాజు జాలి పడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా! తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది! అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు.

"దివాంధమా! నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసినమాట నిజమే. కాని పరమాత్ముని వేద మంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం. పరమపావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుని శిక్షించిన పాపం తక్కువైనదియా! ఆ పాప ఫలితం కొండంతయై నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టిపీడిస్తోంది. విష్ణుభక్తులకు చేసిన కీడు నీకీ అవస్థ తెచ్చిపెట్టింది. దీనినుండి బయట పడటం ఎవరికీ సాధ్యం కాదు". సమవర్తి చెప్పింది విన్నాక గాని, దివాంధానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుని స్తుతించ వచ్చన్న జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాలమీద పడ్డాడు.

యముని హృదయం కూడా ద్రవించింది. "ఉలూకరాజా! చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోని కేగుము. అందులో నీ గత జన్మ దేహముంది. అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకుని భక్షించు. అది పూర్తి అయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది" అని దీవించి వెళ్ళాడు.

"ఓ మహర్షీ! ఆ దురదృష్టవంతుడను నేనే! ఆ తరువాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చొని ఉండగా, దివ్య తేజస్వియైన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవమును చూచి రథాన్ని నిలిపాడు. దగ్గరకొచ్చి చూసి, 'ఇది భువనేశుని కాయము వలెనున్నది. ఇందేల పడియున్నది? దీనిని యీ పక్షి భక్షించుటేమి?" అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికి నేను ఆ విపృని గుర్తించాను. అతడు నా చేత బహిష్కరింపబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదములపైబడి ప్రార్థించాను. తప్పుకు క్షమించమని అడిగాను. దుఃఖాశ్రువులు నేల రాలుతుండగా యమధర్మరాజు తెలియజెప్పిన విషయమంతా వివరించాను. హరిమిత్రుడది విని చలించిపోయాడు. తన అంతరంగ భావమున కనుగుణంగా ఇలా పలికాడు. 'నీ బాధలు చూస్తుంటే నాకెంతో విచారం కలిగింది. నీవు నాయెడల చూపిన కాఠిన్యం నేను ఆరోజునే మరచాను. నీవనుభవించిన బాధలిక చాలు. ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండునుగాక! గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధింతువు గాక!' అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికేగాడు. వాని దీవనలు ఫలించి నేనిట్లున్నాను" అంటూ గానబంధు తన కథనంతా వివరించాడు.

ఆ తరువాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలిరోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్యకళ అన్నాడు. తపంతో గాని, తామసంతో కాని అది పట్టుబడదన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధనచేస్తే ఎవరైనా అపురూపమయిన ఈ కళలో ఆధిక్యం సాధించవచ్చన్నాడు. గౌరవ భావం మొహంలో ఉట్టిపడుతుండగా వినయంగా తలవంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా వేయేళ్లు గడిచాయి. కఠోరమైనదీక్షతో నారదుడు 3,60.006 రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు. సహపాఠులంతా పొగిడేస్తుంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదనే గర్వంతో ఉబ్బిపోయాడు. అమితానందంతో గురువును జేరి కృతజ్ఞతలు చెల్లించాడు. గురుదక్షిణ చెల్లిస్తాను. ఏమికావాలో సెలవిమ్మన్నాడు. ఎంతటి కోరికైనా సంశయింప వద్దన్నాడు.

శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. 'ఓ మహర్షీ! దేవర్షులైన మిమ్ము నేనేమి కోరగలను! దివాంధమునకు వలసిన అవసరములేమి ఉంటాయి? శిష్యుడవైనందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ ధరాతలం నిలిచి ఉండునంత వరకు సంగీతకళతోపాటు నేను సహితం లోకంలో గుర్తుండేలా వరము ప్రసాదింపుము' అని మనసులోని మాట బయట పెట్టాడు.

నారదుడు విశాలంగా నవ్వాడు. 'గురువర్యా! ఇది మరీ చిన్న కోరిక. ఈ చిరుకోరిక మీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రశిష్య కోటి వలన భూతలమున సంగీతకళ నిలిచియున్నంత వరకు మీ కీర్తికి చ్యుతి లేదు. మీరు చేసిన ఈ మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము, వారి సేవాభాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాధిస్తున్నాను. ప్రళయం సంభవించినవేళ శ్రీ మహావిష్ణువునకు గరుత్మంతునివలె శ్రీమహాలక్ష్మికి నీవు వాహనమై తరియింతువు గాక!' అంటూ శిష్యునిగా కానుకను, దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకొన్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైంది

14, మే 2015, గురువారం

Self confidence-20 (Family-comedy- Sanskrit slokaala telugu vachassu))



ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం
 మనోధైర్యానికి మార్గాలు 20 

విజ్ఞాన సారథిర్యస్తు మన: ప్రగ్రహవాన్నర: 
సోద్ధ్యన: పారమాప్నోతి  తద్విష్నో: పరమం పదం 

(ఎ మానవుడు విజ్ఞానముగల సారథివలె వుండి  మనస్సును స్వాధీనము చేసినవాడై ఉండునో, అట్టివాడు సంసారమార్గాము యోక్క సారమును సుఖముగా పొందు చుండును )



చూడండి మనమ్మాయి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నది, చూడండి ఆనోటితో ఏదో ఆడుతూ ఊదుతున్నది, ఈఆటలు మాకాలంలో లేవు, వద్దమ్మా అని చెప్పినా మాటలు అసలు వినటం లేదు. 

నిజమే 

మరి మీరు అమ్మ మాటలు వినమని చెప్పొచ్చుగా 

నిజమే చెప్పటానికి నా నోరు రావద్దో, నీవు అవకాసం ఇస్తేగా 

మరి నామీద ఎగరటానికి మాత్రం  నోరు వస్తుంది 

ఇది మాత్రం కరెక్టు 

ఈ మొగుడ్ని, పిల్లలను పట్టుకోవటం నావల్ల కావటం లేదు 

ఇది మాత్రం రాంగ్ 

ఎవరన్నా వస్తే మాత్రం చెట్టంత ఎత్తు  ఎగిరుతారు, ఇప్పుడు మాత్రం ఇది  రైట్, ఇది రాంగ్ అంటూ ఉంటారు, మిమ్మల్ని అడిగాను చూడు  నాది బూద్ధి తక్కువ (అంటూ చెంపలు కొట్టుకోవడం)

ఇది మాత్రం కరెక్టు, భార్యామణి నాకిచ్చేది ఇస్తావా

దీనితొ ఒకటి ఇవ్వాలా (చీపురు చూపిస్తూ ) అది ఎప్పుడూ  ఇచ్చేదేగా, అది ఇప్పుడొద్దులే, వేరేది ఇస్తే 

అబ్బా మీ మాటలు నాకర్ధం కావటంలేదు, మీకు  సిగ్గు లేక పోయినా  నాకు సిగ్గు ఉన్నది, అసలు నేను ఎప్పుడైనా దీనితొ ఇచ్చానా అంటూ మాటలతో, భర్త దగ్గరకు వచ్చింది భార్య. 

అసలు నేను ఎప్పుడైనా దీనితొ ఒక్కటిచ్చానా  అసలు చెప్పండి ముందు

ఇట్లా అడిగావు బాగుంది, ఇది కరెక్టు 

ముందు అసలు విషయం చెప్పండి, ఎపుడైనా దీనితొ ఒక్కటిచ్చానా(అంటూ చీపురు చూపిస్తు) 

ఎందుకె పాత విషయాలు చెప్పి, నిన్ను భాద పెట్టలేను. 

అసలు విషయం ఉంటేగా మీరు చెప్పటానికి, నోటికి వచ్చినట్లు వాగుతారు, ఏదన్న మాట తారుమారయినా నన్ను ఇరికిస్తారు మీరు.   

అదేనే మన యింటికి సున్నం కొట్టే అమ్మాయి నిచ్చెన ఎక్కి సున్నం కొడుతుంటే, క్రింద నుంచి చూస్తున్నప్పుడు 

అబ్బా ఆపండి ఇంకా గుర్తు పెట్టుకొని మరీ చెపుతున్నారు, మీరు చేసిన ఘనకార్యం మాత్రం చెప్పరు నేను చేసిందే చెపుతున్నారు, అసలు నేను మీ ముందు తలవంచి తాళి కట్టుకొని తప్పు చేసాను 

ఇది మాత్రం కరెక్టు, ఈ నల్ల తోలుకు, ఎర్రతోలు కలిస్తే  బాగుంటుందని ఆశపడి తప్పు చేసింది నేను, నోరు ఎత్తకుండా జీవిస్తున్నా

ఇది మాత్రం  కరెక్ట్ మీరు చెప్పింది ( అంటూ దగ్గరకొచ్చి ఒకటిచ్చింది )

ఏమి టనుకున్నారు శృంగారపు,  సెగలు, పొగల ముద్దు. 

" నాకు సిగ్గు లేదు చూసెవారికి ఉండాలి  సిగ్గు 
నేను ముగ్గులోకి దిగాను , అందరు దిద్దాలి ముగ్గు
నేను నుగ్గు నుగ్గు అయ్యాను, త్రుప్తిగా ఉంది నుగ్గు 
నేను జగ్గు నీరు చూసి మారాను, దాహం తీర్చింది జగ్గు "

ఏమిటండి ఈకవితలు వ్రాయటం, పిల్ల లేవరన్న చూస్తె ఏమను కుంటారు . 
చెపితే నవ్వు, పనిచేస్తే కొవ్వు, ఆనందించే పువ్వు, దీనిని ఎవ్వరికి చెప్పలేవు నువ్వు. 

మహా ప్రభు మిమ్మల్ని కదిలించాను చూడు నాదే తప్పు, అసుద్ధం వాసనని తెలుసు, కాని కెలికి చూసాను వాసనను, అదే తప్పు 

ఇది మాత్రం కరెక్టు 

నాన్న, అమ్మా  నాకు ప్రవేట్ క్లాసుంది వేల్లోస్తాను 

చూడమ్మాయి, నీవు వయసులో ఉన్నావు, నీ కోరికలు తీర్చటం మా ధర్మం, మాకు అబద్ధాలు చెప్పి పోవాలను కోవటం వళ్ళ మాకు వరిగేది ఏముండదు, అబద్దాలు చెప్పటం నీ జీవిత మార్పుకు తొలి మెట్టవుతుంది. 

అమ్మ మాటలు, నామాటలు విని బుద్ధిగా ఉండటమే కరెక్టు 

అట్లాగేనాన్న బాగా చదువుకొని డాక్టర్ నవుతాను నాన్న 

ఇది కరెక్టు వెళ్లి చదువుకో 

ఏమిటే అట్లా మూతి ముడుచుకొని వెళ్తావు 

నేను చెపితె వినలేదు, మీరు చెపితే విని అట్లాగే అని తల ఊపింది

నీవు చెప్పినా, నేను చెప్పినా,  పిల్లలు బాగుండాలి, వారి జీవితాలకు మనం మార్గదర్శకులము మాత్రమే, వారి కర్మకు వారే భాధ్యులు మనము మాత్రం కాదు. 

"సంసారం అనేది ఒక త్రాసు ఎక్కువ తక్కువలు సరిచేసుకొని జీంచటమే  జీవితం "
     

7, మే 2015, గురువారం

Self confidence-19 (Family-comedy- Sanskrit slokaala telugu vachassu))



ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం
 మనోధైర్యానికి మార్గాలు 19


ఈశ్వర: సర్వ భూతానాం హృద్దేశే  అర్జున తిష్ఠతి:
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూధాని మాయయా 
(గీత -18-61)
(అర్జునా! భగవంతుడు సర్వ ప్రాణుల హృదయాలలో ఉన్నాడు. తన మాయ లేదా శక్తి ద్వారా ఈ యంత్రాలలో ఉంటూ వాటిని నడిపిస్తున్నాడు )

తల్లి తండ్రుల సంభాషణ, తల్లితో కూతురు కొడుకు సంభాషణ 

కూతురు : అమ్మా నేను ఫ్రెండ్స్ తో సినమాకు వెళ్తాను 
మంచిదమ్మా : సినమాహాల్లో వేనకున్నవారు చేసే గొడవలు పట్టించుకోకమ్మా, అసలే జిప్పు  జాకెట్టు వేసు కుంటావు వళ్ళంతా పవిట  కప్పుకొని కూర్చో
కూతురు : అమ్మా బాయ్ ఫ్రెండ్స్ పబ్బుకు రమ్మంటున్నారు వెళ్ళ మంటావా 
మంచిదమ్మా : డబ్బున్న వాడితో స్నేహంచేసి, అవసరమైతే వాడితో డ్రింక్  త్రాగి, నీచుట్టు తిరిగేటట్టు చేసుకొని , అల్లుడుగా తీసుకురామ్మా 

కొడుకు : అమ్మా నేను ఫ్రెండ్స్ తో సినమాకు వెళ్తాను 
మంచిదిబాబు : అక్కడ గొడవ పెట్టుకో, నలుగురిలో మంచి వాడని పించుకో, డబ్బు మాత్రం ఖర్చు చేయకు 
కొడుకు : అమ్మా గర్ల్స్  ఫ్రెండ్స్ పబ్బుకు రమ్మంటున్నారు వెళ్ళ మంటావా   
మంచిది బాబు : అమ్మాయిలు నిన్ను లొంగతీసు కోవటానికి ప్రయత్నిస్తారు, చూడ కూడని అందాలూ చూపిస్తారు, 
లొంగి పోయి, ఇదే నా పెల్లాం అన్నావనుకో మా మాటలు ఎట్లా ఉంటాయో మాకే తెలియదు

భార్య:  భర్త గారు  నేను మా  ఫ్రెండ్స్ తో సినమాకు వెళ్తాను
మంచిది శ్రీమతిగారు : ఒక్క మాట కుర్తుంచుకో అక్కడ ఆడవారు నిన్ను ములగ చెట్టు ఎక్కించిన మన ఇంటి రహస్యాలు చెప్పకు, అసలే నీకు నోటి దురద ఎక్కువ 
భార్య : భార్తగారు నేను గర్ల్స్  ఫ్రెండ్స్ క్లబ్బుకు రమ్మంటున్నారు వెళ్ళ మంటావా 
మంచిది శ్రీమతిగారు : ఊరికె దొరికింది కదా అని త్రాగావనుకో వంటి మీద గుడ్డ వుందో కుడా చూసుకోలేవు, అక్కడ కుర్రవాళ్ళు చేసి కోతివేషాలకు నీవు భాద పడక తప్పదు 

భర్తః    భార్య  గారు  నేను మా  ఫ్రెండ్స్ తో సినమాకు వెళ్తాను
మంచిది శ్రీ వారు : వేల్తే వేల్లండి, మీ స్నేహితులు చెప్పే మాటలకు నన్ను అనుమానించ కుండా ఉంటెచాలు, అసలే మీరు నమ్మలేని పక్షి
భర్త : భార్యగారు పక్కింటావిడ భర్త ఊరుకెళ్ళాడుట ఆమెకు తోడుగా క్లబ్బుకు రమ్మంటుంది  వెళ్ళ మంటావా
ఏమిటండి మీరు వాగుతున్నది :  మన కొంప కొల్లేరవుతుంది, ఎవరిదారి వారు ఇష్టం వచ్చినట్లు తిరిగితే ఇది సంసారం గల ఇల్లనుకోరు, మీరు కుడా ముర్ఖుడుగా మారితే, నన్ను కూడా  అమ్మేసారనుకో, నా బతుకు నా పిల్లల  బ్రతుకు ఏమవ్యాలి. 

ఉండండి మీరు ఎక్కడకు పోవద్దు, పిల్లలను పిలుస్తా, ఇప్పుడే అంటూ 

పిలిచింది భార్య : మనలో కోరికలే పుట్ట కూడదు, పుట్టిన తాహతుకు మించిన కోర్కల జోలుకు పొకూడదు, పిల్లలూ బుద్ధిగా చదువుకొని, ఒక ఇంటివారిగా మారి అప్పుడు కోరికలు తీర్చు కోవటాని ప్రయత్నించండి, అప్పటిదాకా మమ్మల్ని తల్లి తండ్రులుగా గుర్తించి మా మాటలు విని బుద్ధి మంతులుగా ఉండండి. మీరు స్థిరపడండి. 

 ఆ తరువాత  మాకు మీరు స్వేచ్చ ఇస్తే ప్రపంచము అంతా తిరిగి మీ పిల్లలకు కధలు చెప్పు కుంటూ బ్రతుకుతాం. 

ఏమండోయో శ్రీమతిగారు కాఫీ కలుపుకు వచ్చా త్రాగండి, కళ్ళు తుడుచుకుంటూ ఇప్పటిదాకా నేను చూసింది " కలా "

" అందరం - ధర్మ మార్గాన్నే ఎల్లప్పుడూ అవలంబించుదాం, సత్పురులను సేవించుదాం, అత్యాశలను విడనాడుదాం, 
పరులగుణ దోషలను ఎంచక జీవించుదాం, భగవత్సేవ గావించుదాం,
మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని అందరికి సహాయ పడదాం "      



Self confidence-18 (Family-comedy- Sanskrit slokaala telugu vachassu))


ఓం శ్రీ రాం                     ఓం శ్రీ రాం                    ఓం శ్రీ రాం 
మనోధైర్యానికి మార్గాలు -18




ద్వివిధో వ్యాధి రస్తేహ సామాన్య: సార ఏవచ !
వ్యవహారస్తు సామాన్య: సారో జన్మమయ: స్మ్రుత:
(వసిష్టరామాయణం లో వసిష్ఠ మహర్షి రాముడితో అన్న మాటలు )

వ్యాధులు రెండు రకాలు. గాలి, ప్రకృతి మార్పులద్వారా కలిగే వ్యాధులు సామాన్యమైనవి. రెండవది జన్మతోనే వచ్చేవ్యాదులు 

 ప్రపంచము మొత్తము మానవులు అనేక వ్యాధులకు  లోనవుతున్నారు, వ్యాధులకు  తగిన మందులు వాడి ఆరోగ్యవంతులగుతున్నారు. ఆర్ధిక పరిస్థితులు బాగోలేక రోగాలతో చనిపోతున్నారు,  సరియైన వైద్యులు లేక చనిపోతున్నారు.
  
 మానవులు ఆకర్షణ వికర్షణకు లోనవుతున్నారు, నేను దీనిని సాధించాను, నేను ఇంకా సాధించాల్సించి ఉన్నది  అని పదే పదే అనుకుంటారు. నిరంతరం మదన పడు తుంటారు, భోజన శయనాది క్రియలు వేళ  ప్రకారముగా చేయరు, అనారోగ్య కరమైన ఆలోచనలు వెంబడించే మనుష్యులే  రోగులుగా మారుతున్నారు. 

ఇంకా దురలవాట్లు, దుష్ట ఆలోచనలు, చెడు సహవాసాలు ఉన్న మనుష్యులే  అనారోగ్యులుగా మారుతున్నారు. ఇవి అన్ని శారీరక రోగాలు, రెండవ రకం మానసిక రోగాలు పుట్టుకతో కలగినవి దీర్ఘకాలిక రోగాలు, మద్యలో మానసిక వత్తిడి జరిగి శారీరకముగా ఉన్నా ఎ పని చేయలేరు, వారు జీవితాంతము మందులు వాడు తుంటారు. భయం, వత్తిడి, ఆందోళన, తాపత్రయం, ఆలోచనలు, అపనమ్మకము తో బలహీనులవుతారు. వైకల్యాన్ని భగవంతుడు కల్పించాడని అనుకోని దేవున్ని తిట్టుకుంటూ  ప్రార్ధణలు చేస్తారు.  
      
ఓ అభాగ్యురాలు భాదతో భర్తకు లేఖవ్రాసిన విధానము

నీకోసం ఈ రెండు కళ్ళతో, ఎదురు చూపులు
రొమ్ములు ఎండమావులు  గా మారుతున్నాయని, తెలియదా
నీకోసం ఈ శరీరం నెత్తురు, కదలికలు
నీళ్ళు  త్రాగుతున్న నోటి నుండి నెత్తురు కారుతుందని, తెలియదా
 
నీకోసం ఉన్నా వెంబడిస్తున్నాయి కొందరి చూపులు
చూపుల కే  కళ్ళు  కాయలు అవుతాయని  తెలియదా
నీకోసం ఉన్నా ఇబ్బంది పెడుతున్నాయి పెద్దల మాటలు
మనసు ఇబ్బంది చెప్పటానికి వీలు లేదని తెలియదా  

నీకోసం ఉన్నా వెంబడిస్తున్నారు, ఉగ్రవాదులు
నేను రహస్యాలు తెలుపనని, తెలియదా 
నీకోసం ఉన్నా నా, నెత్తురు గడ్డలు
నీ ప్రేమ కోసం ఉన్నానని పిల్లలకు, తెలియదా 

నీకోసం ఉన్నా భయ పెడుతున్నారు, విరోధులు
నన్ను ప్రేమ  చేయాలని చూస్తున్నారని, తెలియదా
నీకోసం ఉన్నా ఆశగా పిలుస్తున్నారు, నాయకులు
ఆశకు చిక్క కుండా జీవితం,  కత్తెర లా మారుతుందని, తెలియదా 

నీకోసం ఉన్నా కలవర పెడుతున్నాయి, మధురానుభూతులు
కలలు కంటూ ఉన్నాను,  ఎన్నో రాత్రులు, నీకు తెలియదా
నీకోసం ఉన్నా కొందరు పడుతున్నారు, ఆయుధాలు
నేను అందంగా ఉన్నా,  విడిపోయే గులాబి అని, తెలియదా  

నీకోసం ఉన్నా మారవు ఈ సముద్ర కెరటాలు
వేదనలో ఉన్నా నీకోసం ఈ ఎదురు చూపులు
నీకోసం చదువుతున్నాను మనో నిగ్రహ మార్గాలు
నీకోసం  ఈ చూపులు, నీకోసం ఈ  ప్రేమ లేఖ

 దగ్గరగా ఉన్నప్పుడు  విలువ తెలియదు -
 దూరంగా ఉన్నప్పుడు దాని విలువ  తెలుస్తుంది      

ఆవేశానికి పోయి, అనవసర తాపత్రయాన్ని పెంచుకొని మానసిక రోగులుగా మారకూడదు, ప్రకృతి ననుసరించి, భోజనము, నిద్ర, మైధునం ఉన్నవారికి ఎటువంటి రోగాలు ఉండనే ఉండవు





5, మే 2015, మంగళవారం

Self confidence-17 (Family-comedy- Sanskrit slokaala telugu vachassu))

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం
 మనోధైర్యానికి మార్గాలు 17


ఏకేనాపి కృవృ క్షేణ
కోటరస్థిత వహ్నినా !
దహ్యతే తద్వనం సర్వం  
కుపుత్రేనా కులం యథా !!


వనంలో ఉన్న చెట్లలో ఒకచెట్టు తొర్రలో నిప్పు పుట్టిందే అనుకోండి, అవృక్షాన్నే కాల్చుతుందని  అనుకోకండి.  మొత్తం వృక్షాల్ని కాల్చి బూడిద చేస్తుంది. 

అలాగే ఒక కులంలో ఒక దుర్మార్గుడు పుట్టాడనుకోండి, వాడు చేసే చేష్టలవల్ల, దుర్మార్గపు పనులవల్ల  తను నాశనమై పోతాడు. అట్లాగా వాని ప్రభావము వళ్ళ  వంశ మంతా నాశనమై  పోతుందట. 

అలాగే ఒక కులంలో పుట్టి, మనసులో ప్రేమ అనే అగ్ని పుట్టి , వయసు ఉరకలతో పరుగు పెట్టి, ప్రేమికులుగా మారి ఒకరి కొకరు ఎకమై, జీవిత సాగరం ఈదాలి. మానవులలో పుట్టే ప్రేమ అనే అగ్ని కుటుంబాన్ని కలవర పెడుతుంది కాని ప్రేమికుల్ని కలుపుతుంది. ప్రేమ గెలుచుటకు ఇరువురిలో ఉండే కొన్ని భావాలు ఇందు పొందు పరచు చున్నాను  


కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటలేం 
కళ్ళు తడవ కుండా జీవితాన్ని దాటలేం
వళ్ళు తడవ కుండా సంసారం చేయలేం  
ముళ్ళు గుచ్చుకోకుండా జీవితాన్ని ఈదలేం 

కష్టాల్లో  కన్నీరు ఉప్పదనం 
సుఖాల్లో పన్నీరు కమ్మదనం 
అందరు తెలుసు కున్న  నిజం
తెలుసు కోక పోతే ఎడారి జీవితం 

వయసు ఉంటె  కోరిక   పుడుతుంది 
కోరిక ఉంటె సంపాదన పెరుగుతుంది
సంపాదన ఉంటె ప్రేమ పుడుతుంది 
ప్రేమ వళ్ళ ఇద్దరు ఒకటవ్వాలని ఉంటుంది

మీ పక్షాన నా పక్షాన అడ్డు లేదు 
మీఇబ్బంది నాఇబ్బంది అసలే లేదు
మీ గోత్రం  నాగోత్రం  ఒకటి కాదు
ఇక మనసులు కలియుటకు అడ్డు లేదు

నామనసుకు నీ మనసు తోడవ్వాలి 
నా వయసుకు నీ సొగసు తోడవ్వాలి 
నా పరువానికి నీ కోరిక తీరాలి 
నా ధీర్ఘానికి నీ ముడి కలుసుకోవాలి

పరిమితిలో పరువాన్ని బద్రపరుస్తూ 
కోరికల గుర్రాన్ని కళ్ళాలతో బిగిస్తూ 
గడసరి సొగసుల అందాన్ని భరిస్తూ 
నీ ప్రేమ కొరకు ఉన్నాను విలపిస్తూ 

చేతులు చేతులు కలవాలి 
మీరు నేను ఒకటై పోవాలి  
కలసి మెలిసి ఒకరిగా బ్రతకాలి 
ఆధరాలు అందుకొని ఆనందించాలి

నిప్పురవ్వ వనాన్ని కాలుస్తుంది 
చెడ్డవాడు  వంశాన్ని కాలుస్తాడు 
కాని ప్రేమ పుడితే మనసులో రగులుతుంది 
ప్రేమ ఎకమతె జీవితం సుఖమవుతుంది

                                 ప్రేమికులారా తెలుసుకోండి 
నరస్యాభరణం రూపం 
రూపస్యాభరణం గుణం
గుణస్యాభరణం జ్ఞానం 
జ్ఞానస్యాభరణం క్షమ

మానవుడికి రూపం ఆభరణం లాంటిది
రూపానికి గుణమే ఆభరణం లాంటిది 
గుణానికి జ్ఞానం ఆభరణం లాంటిది
ఆ జ్ఞానానికి క్షమే (ఓర్పే ) ఆభరణం 

కేవలం రూపం ఉపయోగపడదు. దానికి తగిన గుణం ఉండాలి.  రూపం, గుణం ఉన్నా  బుద్ధిహీనుడైతె ప్రయోజనం ఏమిటి? 
జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉన్న ఓర్పు లేకపోతె ఉపయోగం లేదు

ప్రేమించేటప్పుడు ఎంత ఓర్పు వహిస్తారో, జీవించెటప్పుడు కూడా అంతే ఓర్పు వహించాలి 
చెట్టుకు మరణం, మూర్ఖునకు మరణం ఉన్నది కాని ప్రేమకు మరణం లేదు

4, మే 2015, సోమవారం

Self confidence-16 (Family-comedy- Sanskrit slokaala telugu vachassu))

ఓం శ్రీరామ్                              ఓం శ్రీ రామ్                     ఓం శ్రీ రామ్
మనోధైర్యానికి మార్గాలు -16



హరినాపి హరేనాపి
బ్రహ్మానాపి సురైరపి!
లలాట లిఖితారేఖా 
పరిమాష్టుం నశక్యతే !!

(బ్రహ్మ విష్ణు మహేశ్వరులకైనా, దేవతా శ్రేష్ఠుల కైనా నుదుట వ్రాయబడిన వ్రాతను చెరిపి వేయుట అసాధ్యమైన విషయం )

లోకంలో ప్రతి ప్రాణి ప్రకృతి ననుసరించి నడుస్తారని, సూర్య భగవానుణ్ణి ప్రత్యక్ష దైవంగా కోలుస్తారని,నక్షత్రాల బట్టి గ్రహాల బట్టి జాతక చేక్రాలు వేసి మనుష్యుల జీనణ గమనాన్ని తెలియ పరుస్తారని కొందరి నమ్మకము. 
మరికొందరి నమ్మకం బ్రహ్మా దేవుడు మనం చేసిన కర్మల ననుసరించి భూలోకంలో పుట్టుట జరిగిందని, మనం పుట్టిన కుటుంబమే ఉన్నతమైనదని వాదించు కుంటారు. మానవుల జీవన గమనానికి శ్రీ మన్నారాయణుడు సహకరిస్తాడని, అదిశంకరుడు (హనుమంతుడు) మనోనిగ్రహ శక్తిని పెంచుతారని మానవుల నమ్మకం. 
మానవులు చిట్ట చివరిలో చేసే పనికి వయసు సహకరించక, ఓపికలేక , భాధలు భరిస్తూ ఉన్నవారికి మరణ విధానాన్ని శంకరుడు అమలు పరుస్తున్నాడని ఆద్యాత్మిక పరులు గ్రందాల ద్వారా తెలియ పరుస్తున్నారు. 
  
లోకం తీరు 

ఒకరి మాటలు ఒకరికి నచ్చటం
 సామాణ్య మైన విషయం కాదు
చెప్పిన సలహాలను ఆచరించటం
అను కున్నంత సులభం కాదు

ప్రేమికులు విజయం పొందడం
మామూలు విషయం కానే కాదు
ఒకరి కొకరు దూరముగా ఉండటం
నిరీక్షన అంత  తేలిక పని కాదు

అజ్ఞాతంలో ఉన్న వారు రావడం
ఆనందం కోసం వచ్చారనక తప్పదు
ఒంటరితనం నుండి జంటగా మారడం
దేవుని లీల అని అనుకోక తప్పదు

ఒక్కడు నలుగురిలో ఒక్కడవటం
గుణాన్ని బట్టి అనుకోక తప్పదు
స్పర్శిమ్చుకున్న కళ్ళు ఎకమవ్వడం
సాశ్వితమని అను కోక తప్పదు   

అతిగొప్ప పూవు  పూయడం 
చెట్టు చేసుకున్న పుణ్యమని అనుకోక తప్పదు 
నట్టింట్లో ప్రేమ ఊయల కట్టడం 
 యిరువురి ఆనంద హొళీ అనుకోక తప్పదు 

గగనంలో హరివిల్లు చూసి ఆహా అనుకోవడం
అది స్థిరంగా  ఉండదని తెలుసుకోక తప్పదు 
మైదానంలో పిల్లలు ఆడుకోవడం 
కొంతవరకు వ్యాయామమని అనుకోక తప్పదు 

జంక్షన్లో రెడ్ లైట్ పడటం 
ఎంతటి వారికైనా ఆగక తప్పదు 
జంక్షన్లో గ్రీన్ లైట్ పడటం 
ఎంతటి వారికైన పరుగులేయక తప్పదు

వసంతం వచ్చిందని సంబరపడటం 
వేసవి వేడిని భరించక తప్పదు 
తప్పతడుగుల ముద్దు మాటలు వినడం 
పిల్లల్ని ప్రేమతో కొట్టక తప్పదు  

బ్రహ్మా లేఖినిని ఉల్లంఘించే శక్తి  బ్రహ్మా, విష్ణు, మహెశ్వరులకు కూడా  
లేదని ఈ శ్లోకం ద్వారా తెలుస్తున్నది 
సత్యం- ధర్మం- న్యాయం  విడువకుండా ప్రకృతి ననుసరించి జీవించడం 
మానవులకు తప్పదు