10, ఏప్రిల్ 2024, బుధవారం

 అర్ధనీరీశ్వర లీలలు (1)

(దాంపత్య సుఖలీల.. గోల శృంగార భరిత పద్య కావ్యం)


కం..సౌందర్య ఆరాధ్య మగుట 

సందేహముతీర్చగల్గు సమ్మోహనbమే 

సుందర చరణాలు గనే 

పొందే ప్రియురాలు భాగ్య పొందిక సుఖమే 


కం.తక్కెక్కువకాదునులే 

మక్కువగు రసికతలోన మానస తృప్తే 

దక్కే గెలుపోటములే  

చక్కా శృంగార కేళి చెలి ప దములో 


కం..అద్భుత కళలుగు ప్రేమే 

సద్భా వపు సుఖమును పొంద సందర్బముగా 

సద్భంధ మనసు ప్రేమే 

తత్భా వ సతిపతిలీల తన్మాయకళే


కం..ప్రేమే జగతిన నిత్యం 

ప్రేమే ప్రాణం సతిపతి ప్రగతికి మూలం 

ప్రేమే నిధి గా మదియే 

ప్రేమే ఆశయము గాను ప్రీతిగ జీవం


ప్రాకృతి లీలా గమనము 

జాగృతి సుఖమగు యుగమున జాతర ప్రేమే 

ఆకృతి జపమే సతిపతి 

స్వీకృతి హృదయ మగుటయె శ్రీకర ప్రేమే


సీ.నిండు పున్నమిరేయి పండు వెన్నెలవోలె

మధుపమ్ము గొనితెచ్చు మధువువోలె

చక్కని చుక్కవు చెంతను సుఖమేలె 

మింట విద్యుల్లతమెరుపువోలె

పలకరింపు మనసు పరిమళంబుల వోలె

అలుకతీర్చవయసు ఆటవోలె

భార్య గుండెలపైన భారమవక వోలె

సమయ తృప్తి పరచ స్పర్శవోలె


తే.మనసు గెలువ పతికి మేలు మార్గ మోలె 

ముద్దు ముద్దుగ తెలవారు పొద్దువోలె

కనులు కలలు తీర్చ సమయ కాల మోలె 

నియమ శృంగార రంగమ్ము నిజము లేలె


తే. ఎంత వారికైన మగువ యెరుక గలుగు 

ఎన్ని యన్నను మనసుగా యేల గలుగు 

తప్పు ఒప్పు లనక సేవ తలచు పతియు 

కాల నిర్ణయం కలియుటే కళలు తీరు  


తే..క్రోధియనిన ద్రోహీ యన కోప మున్న

విధిగ వీధిన పెట్టినా వినయ ముంచ 

ఆలి మాట యెదురనక ఆశ లేక 

బాధ లున్న పతిగసేవ బంధ మందు


తే..మిత్రులు సజ్జనుల్ దుష్టులు మేటి కవులు 

పండితోత్తముల్ శిష్యులు భక్త వరులు 

గౌర వించుచుందును గాని, కన్నసంతు

పితరులను భక్తితో గౌరవించ లేదె 


తే.బంధువులుగాని స్నేహితుల్ బ్రాహ్మణవరు 

లాదరించుచుఁ బ్రేమతో మోదమలరఁ

బలుకరింతురుగాని,యా స్వసుతులెవరు 

ప్రియముతోఁ బల్కరించరు ప్రేమతోడ.


తే.జాలిఁజూపుచు పతినందు సహృదయముగఁ

బొగడుచుందుచు గాని,యా పంత కలిఁకఁ

బితరులను నీచముగనెంచి ప్రేమలేక 

గబ్బికంటె హీనంబుగాఁ గాంచుచుంద్రు.


తే.వారి నధికంబు ప్రేమించ వలదు వలదు 

మోక్ష దాయకమన్నను మోదమలరఁ

పతిని బ్రేమించ కలలుగా పలుకు లగుట 

సతము గొలువుము మనసు సతిని నిజము


అర్ధనీరీశ్వర లీలలు (2)

(దాంపత్య సుఖలీల.. గోల శృంగార భరిత పద్య కావ్యం)

స్త్రీలు తమ ఆలోచనలు మగవారి కొంటె చేష్టలు ఒకరికొకరు ముచ్చట్లు 

అందులో ఒక స్త్రీ తన అనుభవము ఇలా చెప్పింది 

"ఆహా అక్కడ ఒక పండితుడు ఇలా చెప్పాడు"  


తే..పట్నవాస మహిళ గాను పక్కనవ్వె   

లొల్లి చేయకె  కదలేను  లోకతృప్తి 

గాలి సవ్వడి  కదిలెను  కాలవలువ 

గాజులు థలథలలుగాను  గాలమేయ


తే. కళ్ళజోడుయు కదలేను కన్యగాను 

కళ్ళు నెత్తికి వచ్చియు కలల కులుకు 

నడవ లేకనడుచు నవనారి స్థితియు  

ఎత్తు చెప్పులగుట వళ్ళ ఎగురుకొంటు  


ఆ..వానమబ్బు మెరిసె వాలుజల్లు కురిసే 

జల్లు ఒళ్ళు తాకె జలము కార్చె 

పునుముకున్న రంగు పూర్తిగా మారియు 

అసలు రంగు బయట అంద మౌనె 


ఆ..బురదలో నడకాయె బురబురా శబ్దమే 

చెప్పు తెగెట వళ్ళ చింత చేరె 

నడక చేతకాక నాడు చెప్పు లిసిరే 

బురదతోను చేరె బుసలు బుసలు 


ఆ..పల్లె చేరు నున్న పగడాల మెరుపులై 

జూచువారి శోభ చూపు లయ్యె 

అదిరె బెదిరె వారు అలకల చూపులై 

పల్లెటూరి జనులు పకపకపక 


తే.. ఏమి యందపు గంధము ఏల వదల 

రక్తి లిఖియించు కొంటి రమణి రూపు 

భావభాసురమగు హృదంబరమునందు 

ఇంట గెలువు ముందుమగడా  ఇంతి పలుకు  


"అక్కడేవున్న మరో స్త్రీ ఇలా వాపోయింది"  

యి.రోజూ నె చూస్తున్న  రోకటి పోటుయే 

అయినా యి మోములో అలుపుయే ఎరుగదు

ఏదొ కొత్తదనమే యేల చెప్పగలను 


ఆ చిలిపి కనులు ఆశలు రేపునే 


యి.తెలియని మహత్మ్య తీరుబడిగ యేది 

చిరుహాస పెదాల చిత్రవిచిత్రాలు 

దాయలేని కళలు ఆత్మీయ ఘటనలు 

ఎంతసేపు తనువు ఎంతో సహకరించు 


యి.తనివితీరని సుఖ తన్మయత్వముగాను 

ప్రేమ. ఆరాధన .. ప్రియుని కౌగిలి 

మనసుకు ఎరగని మమతల సంధిగ్ధ 

మరవలేని తనము మరచి పోని సుఖము 


ఆ..అంత నయిరువురును అన్యోన్యముఖపు వి  

లోకనంబు నెయ్యముల్‌ కొ సరిక , 

పదియడుగులు నడచి పాఠమగు కదియ  

చిటికలోపల కల సింరుత్కటభరాప్తి. 


ఒక స్తిని జూసి వెంటడు 


ఆ..ప్రతిభ స్త్రీ కొరకునె  ప్రవచించ నెన్నైన

నటన జూపువాఁడు నరుల గెలిచి

కొసరి వెంట పడగ కొన్నైన నెరవేర్చ

ప్రేమికుడగు నతడు ప్రేమ కోరి 


తే..అకట వేధించుట విధిగా దాహఫలము 

వరుడు వీడు నీవేలను వగచ  నేల 

మోహమా వేపెదేల యీ మౌన కృపను  

శూన్యమగుచు నెందేని గాంచుము ప్రశాంతి.


తే..ఆజనన బద్ధబాంధన మయిన చనువు, 

చిరసమేళన కాంక్షావిశేష రక్తి, 

బలవ దాశావిభంగ తాపంబు; ఆ ప 

డుచుజతను నేమి సేయు నట్టుల నొనర్చె. 


కం.. స్వగత విలాపములన్‌ గని    

ప్రగతి హృదయంబు తోడగు ప్రతిభే జూపుల్ 

భోగపు యౌవనుని కళే   

యోగ కళలగుటయు ప్రేమ యుక్తమగుటగన్


అర్ధనీరీశ్వర లీలలు (3)

(దాంపత్య సుఖలీల.. గోల శృంగార భరిత పద్య కావ్యం)


తే. తాండవ కళలు కేళీ నీతాప మాయ 

భోగ లాలస మానసం భోద్య మవదు 

పంకజం కిరణాలతొ పలుక రింపు 

సర్వ సమ్మోహ శివలీల సృజన శక్తి


తే..రమ్యత సహచరి కూడగా రాస లీల 

సౌమ్యపు కులుకు కదలిక సమ్మతి గుణ

కామ్యపుకళల జీవన కాల ప్రక్రియ 

గమ్యపు ప్రేమే బ్రతుకుగాను కల్వ తీర్పు


తే.. వలచి వచ్చి తిని పలుకవేమి భామ ?

పిలచి కలచి వయిచినేను , బిగువ దేల ?

పలుక వేమి చెలియ సమ పాఠమౌను 

అలుక చిలుక బోకు యిపుడు ! అమల వదన !


తే.."కాలమా! ఆస నడియాస గాగ జేసి 

వేసటల ద్రోసి యాయాసపెట్ట దలతె! 

వృంత మెడ సేసి, తింక లతాంత మెంత 

తడవు కృశియించి సొబగులు చెడకయుండు? 


కం..నా ప్రియసఖి! అనురూప గు 

ణప్రతిమ! ప్రసన్నశీల! నవనీత శిరీ 

ష ప్రణయ మృదులహృదయ! క 

టా! ప్రాణము లుండ యెటు విడంబడి సయితున్‌?


కం..నాప్రేమ కుదిపి కులుకగు  

ణ ప్రతిభ జూపితి నశీల నవనీత విధీ

సుప్రభాతముగా కదిలే 

యీప్రాణముగాను దేహ మీశ్వర కృపగన్


తే..హృదయమా! ఆసయే లేదు మొదల పూల 

మీద, నభిలషించితి వొక్క మృదు సుమంబు 

చిరతరోత్కంఠ నెటులో సైచితివి; కాని 

కాలము నిరాశ తార్చెనే గతి భరింతు!


తే..ప్రేమమా మది దాహము ప్రియుని చెంత  

కామమా సకలంబగు కామి చెంత

కాలమా సహనమ్మగు కావ్య చెంత  

 మోక్షమా మోహ సుఖమగు మోము చెంత 


తే..భావభాసురమగు హృదంబరమునందు 

రక్తి లిఖియించుకొంటి వే రమణి రూపు, 

అదియె ముద మీక యలత కాస్పదమ యయ్యె 

గ్రహణగత మైన చంద్రుని కల విధాన.


తే..ఏ దొ చెప్పలేనిది గతి ఏల కినుకు 

రుచులు ఏమో తెలపకయే రుసలు ఏల 

మీకు యే కళో చెప్పండి మేలు జేయ 

అన్యధా వెతకాలిగా అసలు తెలియు


తే..పెళ్లి కాని పడుతు లున్న యిల్లు కళలు 

పెళ్లి పడతికైన మనసు పీకు చుండు 

తల్లి లల్లలాడు గుణము తల్ల డిల్లు 

సుదతులకు సిగ్గు దుఃఖము సుఖము విలువె


కం..స్వామీ యేమిది యనుటే 

కామిత భావపు సుఖమ్ము కనులే కలిసే 

మామీ ననక ప్రకృతి గా 

ప్రేమ ల చిగురే హృదయపు ప్రీతిగ మారుణ్



అర్ధనీరీశ్వర లీలలు (4)

(దాంపత్య సుఖలీల.. గోల శృంగార భరిత పద్య కావ్యం)


తే..వదలబోకు  చెలియనన్ను , వాదనొద్దు 

వేద నేల నింకయు నీకు , బేల వలెను !

చంద్ర బింబ వదన తెల్పు , జగడ మేల 

ఇంద్ర చాపము వలె కళ , యేల వెలుగు !


తే..*తేటవలపులు మొలక లెత్తినది మొదలు 

నిలిపితి పవిత్రరాగ మా నెలత యెడల, 

తుదకు భగ్నమనోరథ దోషి వగుచు 

ఏటి కారాటపడ మరులెత్తి మనస! 


తే.*వలపునిండిన యకలుషభావముందు 

ఎద్ది కాంక్షించి తది లభియింప దయ్యె! 

కడకు ననుతాప మొకడె నీయెడల నిలిచె, 

ఆమె ప్రణయ స్మరణచిహ్న మగుచు నకట! 


తే..*హృదయ మోహన మయి, ప్రేమమృదుల మైన 

తావకీన రీలాదాన దళపుటంబు, 

మామకీన ప్రణయభంగి మధుకణములు 

విడిచెడు విరక్తి బాష్పముల్‌ విడుచుపోల్కి. 


తే..హృదయమందుయాకర్షణ మృదులమైన 

యూహలందున ఉడికియు యున్నతంబు   

మా మనందు ప్రణయభంగి మధుకణములు 

విడిచెడు విరక్తి బాష్పముల్ విడుచు నారి 


తే.. తేటవలపులు మొలక లెత్తినది మొదలు 

నిలిపితి పవిత్రరాగ మా నెలత యెడల, 

తుదకు భగ్నమనోరథ దోషి వగుచు 

ఏటి కారాటపడ మరులెత్తి మనస! 


తే.. మాయ వలపు మొలకలెత్తి మనసు మొదలు   

తెలిపితి పలుకతోను లెత్తినది నెలఁత 

పిదప భగ్నమనోరథ చిత్త వగుచు 

ఎందు కారాటపడ మరులెత్తి మనస    


తే..*వలపునిండిన యకలుషభావముందు 

ఎద్ది కాంక్షించి తది లభియింప దయ్యె! 

కడకు ననుతాప మొకడె నీయెడల నిలిచె, 

ఆమె ప్రణయ స్మరణచిహ్న మగుచు నకట! 


తే..కలుపు తీయుము కలవాలి కాలమందు 

ఎద్ధి యాశించ తది లభియింప దయ్యె!

యెదన ననుతాప మొకడె నీయెడల నిలిచె,

ఆమె ప్రణయ స్మరణచిహ్న మగుచు నకట! 


తే..*లలిత లావణ్య పుర్ణమౌ లలన చెలువ 

మొదట కన్పట్టుచుండు నెల్లెడల నాకు, 

కనులు మూసినన్‌ విప్పినన్‌ కలలె వచ్చు; 

పగలు రే లను భేద మేర్పడక యుండ. 


తే..చలన చంచల చిన్నది చిత్త చెలువ 

వచ్చి వచ్చినట్లును రాక వాలుచూపు 

కనులు మూసినన్‌ విప్పినన్‌ కలలె వచ్చు; 

పగలు రేయి కలలు వెంట పాడు మనసు 


తే..*నిదుర లేనట్టి రేలను నెలత! నీదు 

ప్రణయ జాగరరక్తి నేత్రముల గాంతు, 

నిదురపట్టిన రేల గాంచుదు సుఖంబు 

స్వప్నపు టవస్థలనుజూసి సమయ తృప్తి 


తే..*భావభాసురమగు హృదంబరమునందు 

రక్తి లిఖియించుకొంటి వే రమణి రూపు, 

అదియె ముద మీక యలత కాస్పదమ యయ్యె 

గ్రహణగత మైన చంద్రుని కల విధాన.


అర్ధనీరీశ్వర లీలలు (5)

(దాంపత్య సుఖలీల.. గోల శృంగార భరిత పద్య కావ్యం)

మల్లాప్రగడ రామకృష్ణ 

కంటి కాటుక సూపులు కమ్ము చుండ 

కనులు కవ్వించి కాటేయు కళలు బుద్ధి 

పెదవి నంటిన నగవులు పిలుపు కళలు 

నమ్మ పేనాలు తీయును నమ్మి నాక

చిలిపి పలుగింజ దానిమ్మ సిలుక లొలక 

మదిని తొలిసేయు మగువల మాయ మెరుపు 

పలుకు పలికేను యదజూపి పమిట  కుదిపి 

కాలి గజ్జెల మోతతొ ఘల్లు ఘల్లు 

సాగి గుండెలో గుచ్చెడి సోకు కదలె 

యేటి కెరటాల మల్లెను ఎరుక పరచు 

ఎదను తాకుతూ మళ్ళగు ఎరుక పరుచు 

మొద్దు మొరటుగా గుండెలో మోదు గుండె 

ఎంకి సుట్టూన సేరియు యెగిరి గంతు 

హంస నడకల తీరులు హాయి గొలుపు 

హృదయ మదిలించు నోసారి ఇష్ట మొచ్చి 

వెంట పడకానె నుండ లే నేదు మారి !

నిత్య కవ్వింత కౌగిలీ నియమ సూరి 

వేడి నులిమేయు పేనాన్ని  విరియు చున్న 

నాదు ఎదసాటు పరువాలు నటన మీరు 

తట్టి సరిసేయు దాహాన్ని తాప  మందు 

రొదలు దూరమ్ము బెట్టియు దొరక పుచ్చు 

మొదలు సరిసేత్త మనుచునే మొక్క నాటు 

కడలికట్టాలు కన్నీళ్లు కాల తీరు

చురకలు సుగుణాల లలన చూపు కళలు  

చెరకుగడ కోరి చెలిమితో చేరువ కళ   

తరుణ సుఖమిచ్చి పొందిక తరుణి యేలు 

బరువు యనకయే బలపడు బంధమందు    

విసర చిఱునవ్వు వెన్నెల చెండ్లు కదల 

పూల పాలు పిదుక కళ పూని  కళలు 

వలపు కాంచన కొమ్మలు వదల లేక   

వలపుటుచ్చుల చూపులు  వాడి వేడి  

ప్రేమభావముల్‌ గను నూత్న ప్రీతి చెంద   

నడలు ప్రాయంపు సన్నల నడక సూప

కనుల నఱవాల్చి క్రీగంటికొసలు పాతి

తాక్షముల తోడకాంచియు  కాంచలేని 

తరుణి తపనలు సరియగు తాళమేయ 

పెడల వాలికల్‌ రాల నిల్చెడు వేళ   

మౌగ్ధ్య మెడబాయలేదు నా మదియు నింక   

భావబంధ మందిన విభ్ర మం  లతాంగి!"

*చిదికి చిదుకని వలపులన్‌ చెనకువగలు, 

విడిచి విడువని మౌగ్ధ్యంబు వడయు లజ్జ, 

సమయభరమును, వినయ ప్రసన్న బుద్ధి, 

ఒకటి నొకటి మచ్చరికించు చుండ నామె 

చలిత జపమని తలపులన్ చెనకువగలు, 

కలువ కదలని మౌగ్ధ్యంబు కలయు లజ్జ,

తరుణ తమకము తనువున తత్వ బుద్ది    

ఒకరి కొకరు మచ్చరికించు చుండ నామె

*సోగకన్నులు విప్పారజూచి ప్రియును 

పలుకుల హృదంతరార్థ మేర్పడగ ననియె; 

అస్ఖలిత మగు ప్రేమరహస్య సూత్ర 

విశద బుద్ధిన్‌ హృదయవాద కుశల యగుచు. 


స్నేహ కన్నులు విప్పార సిగ్గు ప్రియము 

తలపులు కళలు యేర్పడ తన్మయ ననె   

అవసరపు హృధ్య ప్రేమరహస్య సూత్ర

 ప్రణయ బుద్దిన్ హృదయవాద కుశల యగుచు.   


"సఖుల మనః ప్రియబంధము 

లఖండము లటంచు విందు మకటా! యెటులన్‌ 

లిఖియింపక తాళితివి, న 

ను ఖిన్న పడజేయుట తగునో నీకు సఖా! 


ప్రియశి మనః ప్రియభంధము       

ప్రియాతిప్రియమనుచు విందు ప్రియుడై యెటులన్‌

పయణింపక తాళితివి న    

ను యాసల పల్లకి యైన నో నీకు సఖా


అర్ధనారీశ్వరి లీలలు ..7


సీసము  

పెట్టకు పెట్టకు నెప్పుడు ఇబ్బంది 

చూడకు చూడకు చూపులు జార్చి 

తొందర తొందర తోడుగా ఎందుకు 

కాలము అంతయు కానిదవదు 

ఆకలి తీర్చుకో  ఆశల గుట్టుగా 

చేసి సంతోషమ్ము  చెలిమి రుచిని చూడు 

పందాలు కట్టకు పరువమ్ము వ్యర్ధము 

చేయకు అందుకో చిందు సుఖము 


ఆటవెలది      

వద్దు వద్దు హద్దు అంటూనే కవ్వించి 

చాక చక్య మంత చిమ్మ రించి  

ముందు వెనుక అనక ముద్దు ఆ లోచన  

అందు కున్న దంత హద్దు చేయి 

***


సీ.. పరుగులు ఉండవు ... పలకరింపు వెలుగుకు 
బతుకులు నిత్యమూ .. పాడు చుండు 
ఉరకలు ఉండవు ... ఉయ్యాల ఊపులు 
ఉజ్వల వెల్గులు ....  ఉండు చుండు 
కరుణతొ ఉన్నను ... కారుణ్య తలపులు 
కమనీయ వెల్గులు ... కాంచు చుండు 
సహనము చూపుతూ ... సాహస మునుచూపు 
సౌందర్య వెల్గులు ... సేవ చేయు 
 
తేటగీత 
సమరమును చేయుటయు తేలి సమముగుండు  
సహనమును చూపు టయు నిత్య సత్య మవ్వు
నిముషమును కూడ నష్టము నియమ ముండు 
సమము తెలుపుట సౌందర్య సాక్షి గుండు  
      

--(())--


*అశ్రుకణీకామలీమస మయిన యతని 
కౌతుకాభోగ నేత్రయుగ్మమ్ము, నపుడు 
తెఱచి యుండియు కనలేని తివుట లొదవె 
కలికి నవఘర్మకలుషితగండములను.

చిలికి మనసుగెలుచు చుండి చెలిమి గాను 
తలపు లుండియు కనలేని తీరమగుట 
గమ్యకాభోగ సూత్రయుగ్మమ్ము నపుడు 
అతని కళలు తీర్చుట కామి బుద్ధి   


ఆలివి నీవు నా మలుపు ఔదల చూపుల సందడేయగున్  
ఏలిక  మేను సేవ మది యేలుట నీకృప ధర్మమేయగున్ 
నాలిక మౌన దీక్షతయు నానుడి  చిత్తము నేస్తమేను  ఆ
ఏలిక శాంతిగా కను వియోగపు జూపుల ధార్మికమ్ముగన్ 

"నాయనుగున్ జెలీ! చెలిమినానిన చిత్తమె మెత్తగిల్లు, నా 
శాయతరంజనం బయి ప్రియంబు లిగిర్చిన యా దశల్‌ కడుం 
దీయము లేమి చెప్ప! విడదీసిన రేకులపూవు చంద మై 
పోయిన మైత్రి కే గతులు పో వలవంతలుదక్క నీ భువిన్‌. 

కాలము నీదిగా కలియు కామము నున్నతి మెత్తగిల్లు నా 
ఫాలము నీదిగా తడిసి పోవు రగిల్చియు వేడి సేవఁగాఁ
తాళము నేయుమా మనసు తాపము మార్చుము పూవు గంధమై 
నాళము మైత్రిగా విధిగనె నాదియుచూపితి నీది నా గతిన్                   

బాలా! యేటికి మాటలెత్తి నను నొవ్వంజేసె దింకన్‌, వృథా 
లీలాభ్రాంతి యటం చెఱుంగక వ్యధాలీనుండ నైతిన్‌ తుదిన్‌, 
చాలున్‌ నెయ్యపుతీరుతియ్యములు, బాష్ప జ్ఞానవిద్యార్థినై 
కాలంబు న్వయసున్‌ వ్యయించెదను సౌఖ్యంబౌను నిశ్శాంతిమై. 

బేలా పిల్పులుగాను యేల నను శోభింపా నువేద్రక్షలే      
లీలాక్రాంతి పుటం మెఱుంగక మజాలీ యండవైతిన్ తుదిన్ 
చాలున్ నవ్వులమేనుమోహములు బాష్ప ప్రేమ మాధుర్యనై 
కాలంబు న్వయసున్ రాయింపదల కామ్యంబౌను నీప్రీతి గన్   
***
నను వదలి  నీ వేటకు పోవద్దురా  

చిరు నగవు  చూపే మది పొంగెనురా  

విరహమును తెల్పే సమయమ్ము ఇదే 

వినయనును చూ పేందుకు వచ్చి పొరా యీశ్వరా 


అది ఇదని నే నెప్పుడు చేపన్నురా 

ఇది అదని వేదించుట లేదే నురా 

తరుణ మిది  నీ వెప్పుడు వావెంటనే 

పరువము ను నీ కర్పణ చేసేందుకే  యీశ్వరా


కల నిజము చేసేందుకు వేగమ్ము రా 

సహనమును చూపేందుకు కాలమ్ము రా  

నవ విధము నా పూజలు చేసేద  రా  

పలుపలుకు తో హాయిని  కల్పించెదా యీశ్వరా 


మన మనసు యేకమ్మగు క్షేమమ్ము రా  

కను లు కలలే కమ్మగ నేనుం డు  రా    

చనువు మనకే తామసమే కాదును రా

పనులు నీవంతు సమేకమ్మునురా  యీశ్వరా 

 

***