25, డిసెంబర్ 2019, బుధవారం



అప్పు అయ్యేలా ఖర్చు
ఆలస్య మయ్యేలా నడ్కా
అజీర్తి అయ్యేలా తిండి
వ్యర్ధ మయ్యేలా పని
ఉన్నా మనిషి లేనట్లే

చూసి చూడలేదనే వారు
విని వినలేదనే వారు
చేప్పి చెప్పలేదనేవారు
సమయాన్ని మింగేశేవారు
ఉన్నా లేనట్లే వారు

నిజాన్ని అర్ధం చేసుకోలేనివారు
 అబధ్ధాన్ని వత్తాసు పల్కేవారు
నమ్మించి మోసం చేసిన వారు
నిజాయితీ గుర్తించ లేనివారు
ఉన్నా లేనట్లే వారు

--(())--
 శూద్రులంటే ఎవరు?
--------------------------
శూద్రులంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు కాని మిలిన చాతుర్వర్ణ కులవ్యవస్థకు చెందిన వారు. అనగా రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, సాలె, కమ్మరి, కుమ్మరి, ఈడిగ, చాకలి, మంగలి, దళితులు మొదలైన కులాలను శూద్రులు అంటారు. వీరు ద్విజులు కాదు.

'" బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మనులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడలనుండి వైశ్యులు, పాదాలనుండి శూద్రులు పుట్టారు." అని ( ఋగ్వేదం 10 - 90 - 12 ) అపౌరుషేయాలని చెప్పబడే వేదాలు పేర్కొంటున్నాయి.

" భగవద్గీత " 4 వ అధ్యాయం 13 వ శ్లోకంలో శ్రీకృష్ణుడు కూడా పేర్కొన్నాడు.

మనుధర్మ శాస్త్రం కూడా ఇదే అంశాన్ని 1వ అధ్యాయం 91 వ శ్లోకంలో పేర్కొనబడింది. సాక్షాత్తు శ్రికృష్ణుడే మనువుకు తాను భోధించినట్లు భగవద్గీత ( 4 - 1 ) లో పేర్కొన్నాడు.

బ్రాహ్మణ మత సామాజిక వ్యవస్థలో శూద్రుల స్థానం ఏవిధంగా నిర్ధేశించబడింది?
------------------------------------–--------------------------
1. " బహ్మ శూద్రులకు ఒకటే ధర్మం నిర్ధేశించెను. అదేమనగా పై మూడు ద్విజ వర్ణాలకు గుణనింద చేయక వారికి శుశ్రూష ( సేవ ) చేయటం". ( మనుస్మృతి 1 - 91 )
2. " శూద్రుడు ధనము సంపాదించ కూడదు. అతడు ధనం సంపాదించి యెడల బ్రాహ్మనులను హింసించును. " ( మను 10 - 129 )
3. " ,బ్రాహ్మణుడు ఎప్పుడైనా సందేహచకుండా శూద్రుని సంపద, వస్తువులను బలవంతంగానయినా స్వాధీనం చేసుకోవచ్చును. ఎందుకనగా శూద్రునికి స్వంత ధనం అంటూ ఏదీ లేదు కదా." ( మను 8 - 417 )
4. " బ్రాహ్మణులకు సేవకులుగా ఉండటమే శూద్రులకు తగిన వృత్తి. మరే పని కూడా దీనికి సాటి రాదు. " ( 10 - 123 )
5. " జీతభత్యాల ప్రమేయం లేకుఢా బ్రాహ్మణుడు శూద్రులతో సేవలు చేయించుకోవచ్చు. ఎందుకంటే బ్రాహ్మనులకు బానిసలుగా ఉండటానికే భగవంతుడు శూద్రులను సృష్టించాడు. " ( మను 8 - 413 )
6. " బ్రాహ్మణుడు తినగా మిగిలిన ఎంగిలి అన్నాన్ని, చికిగిపోయిన పాతబట్టలను, పాత సామానును శూద్రులకివ్వాలి. " ( మను 10 - 125 )
7. " శూద్రుడు బ్రాహ్మణున్ని దూషిస్తే ఎర్రగా కాల్చిన పది అంగుళముల ఇనుపకడ్డీతో వాని నాలుకను కాల్చాలి. " ( మను 8. 271 )
8. " ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతని నోటిలో , చెవుల్లో మరిగించిన నూనె పోయాలి. " ( మను 8 - 272 )
9. " బ్రాహ్మణునితో సరిసమానంగా కూర్చోడానికి ప్రయత్నించే శూద్రుని పిరుదులను కోసివేయాలి లేదా కాల్చిన ఇనుప కర్రుతో కాల్చాలి. " ( మను 8 - 281 )
10. "శూద్రుడు బ్రాహ్మణున్ని చూస్తూ మూత్రం పోస్తే వాని అంగమును ఛేదించి వేయాలి. ఉమ్మివేస్తే పెదవులు ఖండించాలి " ( మను 8 - 282)
11. " బ్రహ్మణున్ని శూద్రుడు ఏ అంగంతో బాధిస్తాడో ఆ అంగాన్ని ఖండించివేయాలి. " ( 8 - 283 )
12. " శూద్రుని సమక్షంలో వేదాలు పఠించరాదు. " (మను 4 - 99 )
13. " బ్రాహ్మణుని పేరు శుభప్రదమైనది గాను, క్షత్రియుని పేరు శక్తి సూచకంగానూ, వైశ్యుని పేరు సంపద సూచకంగానూ, శూద్రుని పేరు హేయమైనదిగానూ ఉండవలెను. " ( మను 2 - 31 )
14. " బ్రాహ్మణున్ని సేవించిన శూద్రుడు మరో జన్మలో ఉత్తమ కులంలో జన్మించును. "
( మను 9 - 335 )

ఇలాంటి ఉదాహరణలు మనుధర్మ శాస్త్ర ఆధిక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. చాతుర్వర్ణ వ్యవస్థలో పై మూడు వర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల పెత్తనాన్ని తిరుగులేని విధంగా సూత్రీకరించింన మనుధర్మశాస్త్రం. శూద్ర, అతిశూద్ర కులాను అంటరానివారుగా బానిసలుగా చిత్రీకరించింది.
శూద్ర, అతిశూద్ర కులాలకు స్వర్గప్రాప్తి కలగాలంటే బ్రాహ్మణులకు సేవ చేసుకోవాలని నిర్ధారించింది. ఈ శ్లోకాన్ని చూడండి!

‘స్వర్గార్థ ముఖయార్థం వా విప్రానారాధయేత్తు పః
జాత బ్రాహ్మణశబ్దస్య సా హ్యస్య కృతకృత్యతా॥

బహుజనులు, పై మూడు వర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు గుణదోషాలెంచక శుశ్రూష చేసి జీవనం సాగించాలనే నియమాన్ని విధించింది.

‘ఏకమేవతు శూద్రస్య ప్రభు: కర్మ సమాదిత్‌ ఏతేషామేవ వర్ణానాం శశ్రూషా మనసూయయా॥

శూద్రులు, అతిశూద్రులు ఎప్పటికీ వెట్టిచాకిరి చేసే వారిగానే ఉండాలి తప్ప, విద్య (నశూద్రాయా మతిందద్యాత్), జ్ఞానం, డబ్బు సంపాదించరాదు

శక్తేనా పిహి శూద్రేణ న కార్యో ధన సంచయ: శూద్రోహి ధన మాసాద్య బ్రాహ్మణానేవ బాధతే॥
--((***))--

"ఒక"అన్నమ"య్య కథ!!(అన్నదాతకథ) -
ఆయనది యాయావార వృత్తి. యాయావారం అంటే ఈ రోజు భాషలో చెప్పాలంటే అడుక్కోవడం.ఇల్లిల్లూ తిరిగి అడుక్కునేవాడు. తాను తినేందుకు కాదు. ఇతరు లకు పెట్టేందుకు.ఇతరులెవరు? ఇతరులంటే భక్తులు. ఎక్కడెక్కడినుంచో రామచంద్ర స్వామిని చూసేందుకు వచ్చే భక్తులు.

ఆ రోజుల్లో భద్రాద్రి రామయ్యను చూడటమంటే మాటలా? బస్సులు, కార్లు, రైళ్లు లేని రోజులవి.అశ్వారావుపేట అడవులనో, పాల్వంచ అడవులనో దాటుకుని గోదారి అవతలి ఒడ్డుకు చేరాలి. అక్కడ నుంచి పడవలో విశాల గోదావరిని దాటిరావాలి. అందుకే భద్రాద్రికి వచ్చే సరికి భక్తులు అలసిపోతారు. సొలసిపోతారు. ఆకలితో అలమటిస్తూంటారు.

ఒడ్డున దిగి స్నానం చేయగానే ఆవిరులు చిమ్మే వేడివేడి అన్నం, కమ్మనిపప్పు, కాసింత మజ్జిగ, అయితే గియితే ఒక అవకాయ బద్ద.... అది దొరికితే చాలు. ఆత్మారాముడు శాంతిస్తాడు. అప్పుడు అసలు రాముడిని ఆత్మశాంతితోచూడొచ్చు.సరిగ్గా ఒడ్డుకి దగ్గరలో ఆయన అన్నం వండి పెట్టేవాడు. క్రమేపీ భక్త కోటికి ఈ సంగతి తెలిసింది. వచ్చేవారి సంఖ్య పెరిగింది. ఆయన కూడా వచ్చిన వారందరికీ లేదనకుండా అన్నం పెట్టేవాడు. ఈ రోజుల ఉడిపి హోటల్ కాదది. అంతా ఉచితమే.ఒంటిపై ఒక చిన్న కౌపీనం తప్ప ఆయనకు ఇంకో ఆస్తి లేదు. రోజూ యాచించడం, తెచ్చింది వచ్చినవారికి వండి పెట్టడం. ఇదే అతని రామ సేవ. ఏదైనా రాముడే చూసుకుంటాడన్న ధీమా ఒక్కటే ఆయన సంపద.నిజంగా అంతా రాముడే చూసుకున్నాడు కూడా.

ఒక సారి వంటపాత్రలు చోరీ అయ్యాయి. వంట వాళ్లూ పారిపోయారు. సరిగ్గా భక్తులు వచ్చే సమయం. ఏం చేయాలో పాలుపోలేదు ఆయనకి. రామా లక్ష్మణా మీరే దిక్కు అనుకున్నాడు.అంతలో ఇద్దరు కుర్రాళ్లు వచ్చారు. చేతుల్లో పెద్ద గుండిగలు (అన్నం వండే పెద్ద పాత్రలు). చకచకా అన్నం, పప్పూ వండేశారు. అందరికీ వడ్డించేశారు. ఇంత రుచి ఇంతకుముందెన్నడూ చూడలేదు అన్నారు భక్తులు.ఆయన వంటకుర్రాళ్లను చూసే సరికి వాళ్లు మాయమైపోయారు. కనుచూపుమేరలో కనిపించలేదు. ఎంత వెతికినా దొరకలేదు. గుండిగలు మాత్రం మిగిలిపోయాయి.ఆయనకి అర్థమైపోయింది. వచ్చినవాళ్లు అన్న రాముడు, తమ్ముడు లక్ష్మణుడు. అన్నం అంత రుచిగా ఎందుకుందో ఆయనకి తెలిసిపోయింది.

శ్రీరామ నీనామమేమి రుచిరా అనుకున్నాడు ఆయన.భక్తులుపెరిగిపోతున్నారు. యాచించింది సరిపోవడం లేదు. రామా నీవే దిక్కు అనుకున్నాడు. హఠాత్తుగా ఒక వాహనం వచ్చి సత్రం ముందు ఆగింది. అందులోనుంచి ఒక ధనవంతుడు దిగాడు. అయ్యా... నాకు రాత్రి కల వచ్చింది. ఆ కలలో చనిపోయిన నా తల్లి కనిపించింది. మీ సత్రానికి నా భూములన్నిటినీ ఇచ్చేయమని చెప్పింది. నా నాలుగు వేల ఎకరాలు ఇదిగో మీకు రాసిచ్చేస్తున్నాను అని పత్రాలు ఇచ్చి వెళ్లిపోయాడు. ఆయన ఒక పెద్ద వకీలు. హనుమకొండ ఆయన ఊరు. తుంగతుర్తి నరసింహారావు ఆయన పేరు.

ఇక ఆ సత్రానికి ఏలోటూ లేదు. నాలుగువేల ఎకరాలూ ఆ సత్రానివే. సత్రం నడిపిస్తున్న ఆయన కొంతకాలానికి వృద్ధుడైపోయాడు.అన్నం పెట్టీ పెట్టీ పున్నెం గడించాడు. అంతా రాముడికే వదిలేశాడు. నాలుగువేల ఎకరాల్లో అంగుళం కూడా ముట్టుకోలేదు. దేవుడే ఇచ్చిన గోచీపాతను కూడా వదిలేసి ఒక రోజు ఆయన ఆ దేవుడి దగ్గరకే వెళ్లిపోయాడు. ఇప్పుడు భద్రాచలానికి రోడ్డు వచ్చింది.

చాలా ఏళ్లయిన తరువాత ఈ మధ్యే కొన్ని సంవత్సరాల క్రితం ఆ సత్రాన్ని శృంగేరీ పీఠం తన అధీనంలోకి తీసుకుంది. శ్రీచక్ర సిమెంటు వారు దీనికి కావలసిన వనరులుసమకూరుస్తున్నారు. ఒక వేద పాఠశాల నడుస్తోంది. వేదవిద్యార్థులకు అక్కడ అన్నం దొరుకుతుంది. అంటే అన్నదాన యజ్ఞం మళ్లీ మొదలైందన్న మాట. ఆ సత్రం ముందు ఈ అన్నదాన యజ్ఞాన్ని ప్రారంభించిన వ్యక్తి విగ్రహం ఉంటుంది. ఇంతకీ ఆయన పేరు చెప్పనే లేదు కదూ. .ఆయన పేరు పమిడిఘంటం వెంకటరమణ దాసు. 1896 లో పుట్టిన ఈయన ప్రకాశం జిల్లా నుంచి భద్రాచలం వచ్చాడు. ఇక్కడే జీవితమంతా గడిపేశాడు. ఆ సత్రం పేరు అంబ సత్రం.

తెలుగువాడు ఎప్పుడో ఒకప్పుడు భద్రాచలం చూడకపోడు. ఈ సారి రాముడిని, రామదాసును దర్శించుకున్నప్పుడు ఈ రమణదాసుని మరిచి పోకండి. కాస్త ఒపిగ్గా అడిగి అయినా సరే వెతుక్కుంటూ వెళ్లి అంబసత్రాన్ని చూడండి. ఎందుకంటే అక్కడ రెండు గుండిగలున్నాయి.ఒకటి రామ గుండిగ, ఒకటి లక్ష్మణ గుండిగ.

(భూముల్నయితే దోచేసుకున్నారు కానీ గుండిగల్ని దోచుకునే ధైర్యం ఎవడూ చేయలేదు మరి)("credit padma telang)
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే |
రఘునాధాయ నాధాయ సీతాయాం పతయే నమః |

24, డిసెంబర్ 2019, మంగళవారం






 

మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు:

* మన కడుపులో ఉండే ఆమ్లము (acid) రేజర్ బ్లేడ్ లను కూడా కరిగించగలదు.

* మనం రోజుకి సగటున 40 నుండి 100 వెంట్రుకలు కోల్పోతున్నాం.

* మన ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి.

తర్వాత అవి రాలిపోయి వాటి స్థానంలో వేరేవి పెరుగుతాయి

* ఒక్క అంగుళం చర్మం మీద 3 కోట్లకు పైగా బాక్టీరియా ఉంటుంది.

* రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఓ సాధారణ ట్రక్ ని 30 కిలో మీటర్ల వరకు నడిపించవచ్చు.

* లేవకుండా ఒక మనిషి నిద్రించిన రికార్డు 11 రోజులు.

* 90 శాతం కి పైగా జబ్బులు స్ట్రెస్ వల్లనే అని తేలింది.

* శరీరం నుండి తల వేరు చేసినా.. తల 15 సెకన్ల వరకు స్పృహ కోల్పోదు.

* మీరు పడుకునే గది ఎంత చల్లగా ఉంటె... మీకు పీడ కలలు వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి.

* నిద్రించే సమయంలో మన వాసనా పీల్చే భావం పనిచేయదు.

* మనవ శరీరం లో ఉన్న DNA మరియు అరటిపండులో ఉన్న DNA 50 శాతం కలుస్తాయి.

* మనం తిన్నది అరగడానికి మన శరీరంలో ఏవైతే సహాయ పడతాయో... చనిపోయిన 3 రోజులకి అవే మనల్ని తినడం మొదలపెడతాయి.

* గుండె పోటు వల్ల చనిపోయే వారిలో 20 శాతం మంది సోమవారం నాడే చనిపోతారు.

* 7 గంటల కన్నా తక్కువ నిద్రిస్తే.. త్వరగా చనిపోతారు.

* వెలి ముద్రలు ఉన్నట్టే.. నాలుక ముద్రలు కూడా ఒకరితో ఒకరికి పోలిక లేకుండా ఉంటాయి.

* ఒకవేళ మన కళ్ళు కెమెరా అయితే.. 576 మెగా పిక్సెల్స్ ఉన్న కెమెరాలా ఉండేది.

* మనిషి కన్నుని తయ్యారుచేయాలంటే కొన్ని లక్షల కోట్లు కర్చవుతుందట.

* మన నోరు 100 కోట్లకు పైగా రుచులను గుర్తించగలదు.

* మీకు 60 ఏళ్ళు వచ్చే సరికి నోటిలో ఉండే టేస్ట్ బడ్స్ సగానికి పైగా చనిపోతాయి.

* మీకు ఎంత ఎక్కువ IQ ఉంటె.. అన్ని కలలుగంటారు.

* మన కాళ్ళ గోర్లకన్నా చేతి గోర్లు 4 రెట్లు త్వరగా పెరుగుతాయి.

* చింపాంజీ శరీరం పై ఉన్నన్ని వెంట్రుకలే మన శరీరం పై కూడా ఉంటాయి. కాకపోతే మనవి చాలా సన్నగా ఉంటాయి.

* మన శరీరం 30 నిమిషాలలో ఉత్పత్తి చేసే వేడితో 114 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు.

* మన చర్మం నిమిషానికి 50000 సెల్స్ ని వదిలేస్తుంది. అంటే జీవిత కాలంలో అది 18 కిలోలనమాట.

* మీ బెడ్ పై ఉండే దుమ్ములో సగానికి పైగా మీ చర్మందే.

* మన బ్రెయిన్ 25 వాట్స్ విద్యుత్త్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ తో ఓ బుల్బ్ ని వెలిగించవచ్చు.

* మీకు 40 ఏళ్ళు వచ్చే వరకు మీరు ఎదుగుతూనే ఉంటారు.

* మన బ్రెయిన్ పగటి పూటకన్నా రాత్రి పూటనే చురుకుగా పనిచేస్తుంది.

* ఒక సంవత్సరంలో 15000 కలలుగంటారట.

* మీరు వింటున్న మ్యూజిక్ కి తగ్గట్టుగా మీ గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది.

మన శరీరం ఒక అధ్భుత సృష్ట అని నమ్మండి. దానిని హాని పరచడం మానుకోండి.

మీరు ఈ పోస్టుని అందరికి పంపండి. వాళ్లు చాల హ్యాపీ గా ఫీల్ అవుతారు....

--(())--


👉 ఒకడేమో 2030 కల్లా భారతదేశాన్ని హిందూ దేశంగా చేస్తాం అంటాడు..

👉 ఇంకోకడేమో 2035 కల్లా భారతదేశం ఇస్లాం దేశం అయిపోతుంది అని భయపెడతాడు..

👉 ఇంకోకడేమో 2వ రాకడ, రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు, 2030 కల్లా మొత్తం క్రైస్తవంతో నిండిపోతుంది అంటాడు..

      అరేయ్ సన్నాసుల్లారా...

      2030 - 2040 కల్లా ఈ భూమి ఉష్ణోగ్రత 58 - 60 డిగ్రీలకి చేరబోతుందిరా.. మీ హైందవ వీరులు, మీ క్రైస్తవ వీరులు, మీ ఇస్లాం వీరులు,, మీ మత రాజ్యాలు ఏర్పాటు చేయడానికి, శవాల కుప్పలు తప్ప,, మనుషులు మిగిలే పరిస్థితి లేదు..

-- పీల్చుకోడానికి స్వచ్ఛమైన గాలి లేదు...
-- కొనుక్కుని తాగితే తప్ప తాగగలిగే నీరు మిగలలేదు..
-- అయితే అతి వర్షాలు, లేకపోతే వర్షాభావ పరిస్థితులు..
-- భగభగ మండే ఎండలో నిలబడడానికి, నీడనిచ్చే చెట్టు మిగలలేదు..
-- తినే తిండి మొత్తం పురుగుల మందుల మయం..
-- భూమి మీద ప్లాస్టిక్ పొరలు పొరలు పెరుకుపోతున్నాయి..
-- నదులు మొత్తం మురుగు కాల్వలుగా మారుతున్నాయి..
-- సముద్రాలు అన్నీ మృత్యు కుహూరాలుగా మారుతున్నాయి..
-- కొత్త కొత్త జబ్బులు, క్యాన్సర్లు, వైరస్లు..,

       ఇంకో పది సంవత్సరాల్లో ఈ దేశమే కాదురా,, ధ్రువ ప్రాంతాల్లో మంచుకొండలు కరిగి ఈ భూమ్మీద 40 % నాగరికత అంతరించబోతుంది.. తుఫానులు, భూకంపాలు, పేదరికం, అంటురోగాలు ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేయబోతున్నాయి..

       అంతా నాశనం అయ్యాక... అందరూ చచ్చాక.... ఇంకెక్కడ ఏర్పాటు చేస్తార్రా మీ మత రాజ్యాలు.. ఇంకా ఎవడికోసంరా మీ దేవుడి రాజ్యాలు...

       మన బిడ్డలు, వాళ్ళ బిడ్డలు,, హాయిగా సుఖంగా బ్రతకాలంటే,, కావలసింది,, ఈ దేవుళ్ళు, మతాలు కాదురా.... వ్యర్ధాలు లేని భూమి కావాలి... స్వచ్ఛమైన గాలి కావాలి... కలుషితాలు లేని నీరు కావాలి...

       మీ తరువాతి తరాల మనసుల్లో విద్వేషపు విషబీజాలు నాటడం మాని... అందరూ కలిసి కనీసం తలోక చిన్న మొక్క నాటండి...

       స్మశానాల మీద మతరాజ్యాల నిర్మాణం కోసం కాదు... సాటి మనిషిపట్ల, ప్రేమభావం, సమభావం గల, నవనాగరికతను నిర్మించడం కోసం ఆలోచించండి...

       మతాలకు పుట్టిన వాళ్ళలాగా కాకుండా, మనుషులకు పుట్టిన వాళ్లుగా జీవించండి....

-- ఒక పర్యావరణ ప్రేమికుడైన🌹 మిత్రుడు పంపించాడు. దీనిని ఒక నినాదంగా మీరు కూడా అన్ని గ్రూపులకు పంపించండి. దేశాలను మానవజాతిని కాపాడుకుందాం.

ఈరోజు కధలు (3) మరియు కవితలు

నేటి శ్లోక సూక్తి

శ్రేయో హి జ్ఞాన మభ్యసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే!
ధ్యానాత్ కర్మ ఫలత్యాగ: త్యాగాత్ శాంతి రనంతరం!!

తా: అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్ఠమయినది, జ్ఞానముకంటె ధ్యానము శ్రేష్టమైనది, ధ్యానము కంటే కర్మ ఫలత్యాగము శ్రేష్టమైనది, ఆకర్మఫల త్యాగము వలన గొప్ప శాంతి లభించును.     



_*🌅గురుభక్తి 🌅*_

_*గురువు* అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం.._

_*"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః*_
_*గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"*_

_అయితే ఈ శ్లోకం ఎందులోది ?_

_ఏ సందర్భంలోది ? ఎవరు వ్రాశారు ? వంటి సందేహాలు ఎవరికయినా ఎప్పుడయినా వచ్చాయా ? నాకొచ్చాయిగా ! అందుకే ఈ టపా._

_ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమయిన కథ ఉంది. ఈ కథ ఇంతకుముందు తెలిసినవారు మళ్ళీ చదివేయండి, తెలియని వాళ్ళు శ్రద్ధగా చదవండి (ప్రశ్నలేమీ అడగనులెండి)._

_కొనేళ్ళ క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు ఆయన పేరు వేద ధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందఱో పిల్లలని చేరదీసి, ఆయన వద్దే ఉంచుకుని, భోజనం పెట్టి, ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్ధంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ, విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ (మన గ్రాడ్యుయేషన్ వంటిదనుకోండి) ముగించుకుని గురువుని, ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు._

_అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒక సారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళతారు. ఆయన తిరిగివచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యధావిధిగా జరుగుతుండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు._

_ఇదిలా ఉండగా, స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకుని, ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్ళకు వెళిపోయారు. ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు, తల్లి దండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళిపోతారు._

_గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్లకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు. అప్పుడు కౌత్సుడు బోరున విలపిస్తూ "గురువుగారూ! మీరు పొరుగూరు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను, ఈ కార్తీక మాసం (పదిహేను రోజుల్లో) నుండి తమకి దారుణమయిన కుష్ఠురోగం రాబోతోందని మీ గ్రహస్థితి చెబుతోంది. నాకు చదువు నేర్పించి, తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమయిన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తరువాతే వెళతాను, అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను" అంటాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద భాష్పాలు రాలుస్తారు._

_కౌత్సుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువు గారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు "ప్రారబ్ధం భోగతో నస్యేత్" అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడయినా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతున్నాను అన్న ఆనందముతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు._

_అప్పుడు గురువుగారి మాటను కాదనలేక, కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కనుక మనం అక్కడకి వెళ్ళి పుణ్య కార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. సరేనని ఇద్దరూ అక్కడకి ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తరువాత అక్కడ విద్యాదానం చేయటం, శివపంచాక్షరీ మంత్ర జపం చేయించటం, చేతనయినంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయటం, ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌత్సుడు._

_మిట్టమధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోలె పట్టుకుని (భిక్ష ద్వారా వచ్చినది మాత్రమే తినేవారు అప్పట్లో) తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి, తను తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తినక, తినని తిననీయక అన్నాన్ని విసిరేసేవారు. చీటికీ మాటికీ కౌత్సుడిని కొట్టడం, తిట్టడం చేయటం, చీదరించుకోవటం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధపెడుతోంది కాబోలు పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు, "మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్దనుండి పంపుతారో వారే మనలో గొప్పవారు" అని._

_ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం, గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ళ లక్ష్యం కాదు, కౌత్సుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని చేరుకున్నాడు అని._

_సరే, అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారు వేషంలో వచ్చి "నువ్వు కాశీ వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను, ఎందుకాయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు, పెద్ద వాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "గురువుని, అదీ ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు ? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా ?" అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు._

_తదుపరి విష్ణువు మారు వేషంలో వచ్చి "రోగముతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కానీ చేసిన మేలు మఱిచే కృతఘ్నునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనని వదిలి వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "కృతఘ్నత అన్నది ఏదయినా ఉంటే ఇటువంటి సమయములో వదిలి వెళిపోతే నాదవుతుంది కానీ నన్ను చేరదీసి, భోజనం పెట్టి, నా నుండీ ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా ధారపోసిన ఆయనది కాదు" అనేసరికి విష్ణువు వెను తిరుగుతాడు._

_ఇహ ఈశ్వరుడు మారు వేషములో వెళ్ళి "మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు ? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా ? నువ్వు దూరమయితేనే నీ విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు" అంటాడు. దానికి కౌత్సుడు సాష్టాంగ పడి, "తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువయిన విద్యని నాకు ధారపోశారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావా !! వీలయితే నాకొక సాయం చేయండి. మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు, మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమయిన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు" అంటాడు._

_అంతే ఆ ముగ్గురూ ఇతని గురుభక్తికి మెచ్చి "కౌత్సా! మేము త్రిమూర్తులం. నీ గురుభక్తికి మెచ్చాం, మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమయిన గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము" అంటారు. దానికి ఆనందించిన కౌత్సుడు "మీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ గురువుగారే. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, మీ ముగ్గురినీ సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరయితే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే, నాకు ఇన్ని నేర్పించి, ఇంతలా తీర్చిదిద్దిన మా గురువు గారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి" అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడినీ, అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువునీ ఇద్దరినీ మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికీ మోక్షాన్ని ప్రసాదిస్తారు._

_ఇటువంటి కథలు విన్నప్పుడు, చదివినప్పుడు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి. ఏ పనయినా పూర్తి చేయటానికి అత్యంత ముఖ్యం, అతి ముఖ్యం, ముఖ్యం అని మూడు కారణాలుంటాయి(ట). ఉదాహరణకి అన్నం వండాలనుకోండి, అత్యంత ముఖ్యమయినది బియ్యం, అతి ముఖ్యమయినవి నీళ్ళు, మంట, పాత్ర, మొ., ముఖ్యమయినది వండే విధానం తెలియటం. అదే విధముగా ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవిస్తున్నారు అంటే గురువులు నేర్పిన విద్య అత్యంత ముఖ్యమయినది, అతి ముఖ్యమయినవి మన శ్రద్ధ, క్రమశిక్షణ, మొ., గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల బుద్ధిని ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమయినవారు. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ తరువాత ప్రాముఖ్యతని ఆచార్యదేవోభవ అంటూ గురువుకి ఇచ్చారు. ఇటువంటి జ్ఞానం మనకి అలవడిన నాడు నా కృషి వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది అన్న అహంకారం ఉండదు. మరీ కౌత్సుడంత లేకపోయినా అసలంటూ గురుభక్తి పెంచుకుని, గురువులని గౌరవించాలని ఆశిస్తూ గురువులందరికీ  అంకితం..!_

--(())--

"అహం కృత్స్నస్య జగతః - ప్రభవః ప్రలయస్తథా|" 

(" నేనే యావత్పప్రంచానికీ మూలమూ,అంతమూ కూడా!") 


- గీతా 7-6


అహంభావము 


క్షణం మనిషిలో ఉండేది అహం 

అహం ప్రభావం చేదు అనుభవం 
క్షణ భంగురమైనది మనిషి జీవితం 
తనకు తానుగా చెప్పుకోలేనిది ప్రపంచం 

పరమాత్మ స్తూల పదార్ధంకు అతీతం 

నిద్రలేకుండా చేస్తుంది నేను అనే అహం
ఊహల ద్వారా కలల్లో చేరు తెలియని దాహం 
సాక్షిగా మారి నిరంతరం కలిగించును ఆవేశం

రక్తమాంసముల లో ఇమిడి యుండి ధనదాహం

భవిషత్ వర్తమాన కాలాల్లో చూపుతార్భుద్ది మాన్యం  
శాంతి అశాంతిఁ లమధ్య జరుగు నిరంతర పోరాటం 
అహం చేరిన వారిని ఆపటం సాధ్యముకాని సత్యం  

శాశ్వితము కాని శరీర పోషణకు చేస్తావు వ్యర్థం 

వంశమని, కుటుంబమని తపనతో పొందవు ఆనందం
అంతర్గత యొక్క సత్యముతో పొందాలి  పూర్ణ జ్ఞానం 
భౌతిక భావాన్ని తెలుసుకొని అహం వదిలితే జీవితం 

--(())--



*బ్రహ్మరాత*

బోధ చేస్తూ ఒక మునిదంపతులు ఉండేవారు. ఆ ముని చాలా ప్రతిభావంతుడు. సకలశాస్త్రాలు, విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తూ అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తన కన్నబిడ్డల్లా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది. అలా, ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో, అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అబ్బేవి.
వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తనవద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో, తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు. ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమవద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు.
ఇదిలావుండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో, వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ, తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు క్రింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమంలోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు.
కాసేపట్లో లోపలి నుండి చంటిబిడ్డల ఏడుపులు వినవచ్చాయి. గురుపత్ని కవలపిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్యపురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెడుతూ, గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి వుండేవాడు కాదు. కాని వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు. అతడు ''బ్రహ్మ''. అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకుని కూర్చున్నాడు వసంతుడు. బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి ''స్వామి'' మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరు అనరి వినమ్రపూరితంగా అడిగాడు.
బ్రహ్మ తనను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని, వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి, ఇతరులకు తెలియజెయ్యరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా చెప్పాడు - నాయనా! ఈ అబ్బాయి నిరక్షర కుక్షి అవుతాడు. ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప మరిక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కనాకష్టంగా పెళ్లాన్ని, పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు.
ఇక ఆ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తూ దైవసమానులైన తన గురుదంపతులకి పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాసాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువుగారిని బ్రహ్మ రాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి, ఆయన అది సాధ్యం కాదు నాయనా. అది ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవడం వసంతుడికి కనిపించసాగింది.
ఆ ఇద్దరికీ చదువులు వంటపట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా? అనే దిగులుతో, వసంతుడికి దేనిమీద ఏకాగ్రత కుదరడంలేదు. దానికితోడు ఆ పిల్లలిద్దరు వసంతుడి వెంటపడి అన్నయ్య, అన్నయ్య అని తిరుగుతూ వుంటే, అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒకరోజు గురువుగారితో చెప్పి, ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు. ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిసాడు.
వారందరిని వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా? దానికి వసంతుడికి అందరు చెప్పిన సమాధానం బ్రహ్మరాత మార్చడం అసాధ్యం. అది ఎవరితరమూ కాదు అని. అలా అక్కడా ఇక్కడా తిరుగుతూ, తన అన్వేషణను కొనసాగిస్తూ ఇరవై సంవత్సరాలకు పైగా గడిపాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు పాతికేళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది.
ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలిపని చేస్తునా&ఉనడని, గురువుగారి కుమార్తె పేరు వసంతసేన అని దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి, గురు దంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు.
వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్యా! అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్య్రం ఇదీ శంకరుడి దుస్థితి. తమ్ముడూ, నువ్వు బాధపడకు. ఇప్పటినుండి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు, ''సరే అన్నయ్యా! ఇకనుండి నువ్వు ఎలా చెపితే అలానే

చేస్తాను'' అన్నాడు శంకరుడు.
ముందు ఆ ఆవుని తోలుకుని పట్టణానికి వెళదాం పద అన్నాడు వసంతుడు. ఏమి మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్టణంలోని సంత దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి ఈ ఆవుని ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు. తరువాత అతను చెప్పిన ధరకు అమ్మేసాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా, వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరం అయిన సరుకులను, శంకరుడి భార్యకు, పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురుమని తిని ఆకలి తీర్చుకున్నారు.
తర్వాత వసంతుడు శంకరుడితో తమ్ముడూ అన్నదానం చేద్దాం. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్యా! ఇంతవరకు ఆ ఆవు వుంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది, ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా వుంది అని అన్నాడు. దానికి వసంతుడు తమ్ముడూ, నువ్వు ఏమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో. ప్రొద్దునకంతా సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పాడు.
ప్రొద్దున్నే లేచి తలుపు తెరచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. శంకరుడి ఇంటిముందు ఒక ఆవు నిలబడి వుంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక్క ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మయే స్వయంగా ఒక ఆవుని తీసుకొని వచ్చి అక్కడ కట్టేసాడు.
ఆ రోజు కూడా ఆవును తీసుకెళ్ళి సంతలో అమ్మి, వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడూ, ఇక ఇలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు.
వసంతుడు వాళ్ళని, వీళ్ళని అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భోరుమని ఏడ్చేసింది. అన్నయ్యా! నేను మహాపాపిని. ఈ పాపపంకిలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని బావురు మంది. ఊరుకో చెల్లీ! ఊరుకోమ్మా! ఈ పాపపు పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన.
ఆ రాత్రికి విటులు ఎవ్వరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు. ఆమె ఆశ్చర్యపడుతూ అయ్యా! ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. ఆ రాత్రి ఇద్దరు, ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం.
కాని అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటిరోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని, లక్ష వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తూ ఆ బ్రహ్మే నని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటివరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమైంది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి, గురుదంపతుల రుణం తీర్చుకున్నాడు.
ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు, దానిని నిరూపించాడు. అలా బ్రహ్మ రాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపాడు వసంతుడు.
 🙏🙏🙏

-+(())--
నా మిత్రుడి బంధువు ఒకాయనకి ఒకడే కొడుకు. వాడికీ ఒకడే కొడుకు. అమెరికాలో శాశ్వతంగా సెటిలై అక్కడే కోట్లు సంపాదిస్తున్నాడు. అక్కడి నుంచి వాడు పంపే డబ్బుతో ఇక్కడ ఇతడు భూములు కొంటూ ఉంటాడు. భార్య మరణించింది. ఇండియాలో ఒక్కడే ఉంటాడు. డెబ్భై ఏళ్ళు. ఒక రోజు రాత్రి తమ ఎకరం భూమిని ఎవరో పొలిటీషియన్ తాలుకు మనుష్యులు ఆక్రమించుకున్నారని తెలిసింది. ఆ రాత్రి గుండెపోటు వచ్చి ఆస్పత్రి పాలయ్యాడు. పాతిక లక్షలు ఖర్చు. ఆ పైన ఆర్నెల్లకి మరణించాడు. తండ్రికి గుండె జబ్బు వచ్చి మరణించినప్పుడు మాత్రం కొడుకు విదేశాల్నుంచి వచ్చి ఓ నాలుగు రోజులు వెళ్ళాడు.

ఈ సందర్భంగా బుద్ధుడి కథ ఒకటి చెపుతాను. ఒక ఇల్లు తగలబడి పోతోంది. జనం చుట్టూ చేరి చూస్తున్నారు. యజమాని దూరoగా నిల్చుని రోదిస్తున్నాడు. ఎంతో అందమైన ఇల్లు. పది రోజుల క్రితం ఎవరో రెట్టింపు ధర ఇస్తామన్నా అమ్మలేదు. అందుకే దుఃఖం. ఇంతలో పెద్ద కొడుకు వచ్చాడు. "నీకు తెలీదా నాన్నా? మూడు రెట్లు ధర వస్తే, ఇల్లు నిన్నే అమ్మేసాను. నీకు చెప్పేటంత సమయం లేక పోయింది" అన్నాడు. చేత్తో తీసేసినట్టు ఒక్క సారిగా వేదన పోయింది. గుండెల్నిండా సంతోషంగా గాలి పీల్చుకున్నాడు. ఆ తరువాత తనూ ఒకడిగా మంటల్ని చూస్తూ పక్క వారి సంభాషణలో పాలు పంచుకొనసాగాడు…!

అదే ఇల్లు. అవే మంటలు. క్షణం క్రితం వరకూ ఉన్న అటాచ్‌మెంట్ పోయింది. ఇప్పుడు నిజం చెప్పాలంటే, కా... స్త ఆనందిస్తున్నాడు కూడా. ఇంతలో రెండో కొడుకు వచ్చాడు. "నువ్వు సంతకం పెట్టకుండా అమ్మకం ఎలా పూర్తి అవుతుంది నాన్నా. ఆమాత్రం తెలీదా?" అన్నాడు. అంతే. తిరిగి దుఃఖం చుట్టు ముట్టింది. ఈ లోపులో మూడో కొడుకు వచ్చి, "మాట మీద నిలబడే నిజాయితీ గల మనిషి ఆయన. మాటతోనే అమ్మకం జరిగిపోయిందన్నాడు. సగం డబ్బు చెల్లించేశాడు కూడా" అన్నాడు. తిరిగి సంతోషం పెనవేసుకుంది.

‘ఇది నాది’ అనుకున్నప్పుడు దుఃఖం వస్తోంది. కాదనుకున్నప్పుడు పోతోంది. నిజానికి ఏమీ మారలేదు. ఇదే బుద్ధుడు చెప్పిన నిర్వికార నిర్వాణ యోగం. అప్పుడు దుఃఖం మిమ్మల్ని వదిలేస్తున్నందుకు దుఃఖిస్తుంది.

తాపత్రయ విమోచనం గురించి మరో కథ. అయిదేళ్ళ వయసులో ఒక కుర్రవాడు హిమాలయ పర్వత శిఖరాగ్రాల మీద ఉండే బౌద్ధారామాలకి విద్యాభ్యాసం కోసం పంపబడ్డాడు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సంవత్సరాల తరబడి సిద్ధాంత మూలసార జ్ఞానాన్ని సముపార్జించుకున్న తరువాత, ఆ జ్ఞానాన్ని ప్రజలకు పంచమన్న గురువు ఆదేశంతో, ఆ భిక్షువు పర్వతశ్రేణుల మధ్య నుంచి దిగి మొట్ట మొదటిసారి నాగరిక ప్రపంచంలో అడుగుపెట్టాడు. అప్పటి వరకూ ఆశ్రమం దాటి బయటకురాని ఆ పద్దెనిమిదేళ్ళ యువకుడికి అంతా కొత్తగా ఉంది. బౌద్ధసాధువులకు సాంప్రదాయకమైన భిక్షాటన నాశ్రయించి, ఒక ఇంటి ముందు నిలబడి మధుకరము అర్థించాడు. ఇంటి యజమాని యువ సాధువు కాళ్ళు కడిగి సగౌరవంగా లోపలికి ఆహ్వానిoచి, భిక్ష వేయమని కూతుర్ని ఆదేశించాడు. ఒక పదహారేళ్ళమ్మాయి లోపల్నుంచి ఏడు రోజులకి సరిపడా బియ్యాన్ని తీసుకొచ్చి అతడి జోలెలో నింపింది. ఆమెని చూసి యువకుడు చకితుడయ్యాడు. అప్పటివరకూ పురుషులనే తప్ప ‘స్త్రీ’ని చూడలేదతడు. ఆమె గుండెల కేసి చూపించి తామిద్దరి మధ్య తేడా గురించి గృహస్థుని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి తండ్రికి కోపం రాలేదు. ఎదుట ఉన్నది మనుష్యుల మధ్యకి తొలిసారి వచ్చిన సన్యాసి అని తెలుసు. స్త్రీ పురుషుల తేడా గురించి చెపుతూ, ‘...వివాహం జరిగి తల్లి అయిన తరువాత పాలు ఇచ్చి పిల్లల్ని పోషించవలసిన బాధ్యత స్త్రీకి ఉన్నది కాబట్టి ప్రకృతి ఆమెకు ఆ విధమైన అవయవాలను సమకూర్చింది’ అని వివరణ ఇచ్చాడు.

సుదీర్ఘమైన ఆలోచనలో పడిన యువకుడు, ఆ రోజుకు సరిపడా బియ్యం మాత్రం ఉంచుకొని, మిగతా ఆరు రోజుల దినుసులు వెనక్కి ఇచ్చి తిరిగి తన గురువు దగ్గరకు చేరుకున్నాడు. ‘అలా ఎందుకు చేశావ’ని అడిగాడు గురువు.

“తర్వాతెప్పుడో దశాబ్ద కాలం తరువాత ప్రపంచంలోకి అడుగిడబోయే బిడ్డ కోసం తగు ఏర్పాట్లన్నీ ప్రకృతి ముందే సమకూర్చినప్పుడు, రేపటి ఆహారం గురించి ఈ రోజు తాపత్రయపడటం ఎంత నిష్ప్రయోజనమో నాకు అర్థమయింది స్వామీ..!” అన్నాడా భిక్షువు.

“బౌద్ధం గురించీ, బంధం గురించీ సంపూర్ణమయిన జ్ఞానం నీకు లభించింది నాయనా" అంటూ శిష్యుణ్ణి కౌగిలించుకొని అభినందించాడు ఆచార్యుడు.

--(())--

డెలివరీ బాయ్..💐🤝
--------------

మా అబ్బాయి బిర్యాని కావాలన్నాడు.. హోటల్ కి వెళ్లి తేవాలంటే ఒళ్ళు బద్దకం కదా..
 జొమాటోలో రెండు బిర్యానీలు ఆర్డర్ ఇచ్చా.. ఈ 'బద్దకం' కూడా ఒకందుకు మంచిదే. ఎందుకంటే..మాలాంటి బద్దకిస్టుల వల్లే కదా.. కొంతమంది నిరుద్యోగులకు డెలివరీ బాయ్ ల కింద ఉపాధి లభిస్తోంది.. జొమాటో యాప్ ఓపెన్ చేయగానే 'ON TIME OR FREE 'అనే అప్షన్ కనిపించింది.. దానికి అదనంగా ఇంకో ఇరవై తీసుకున్నాడనుకోండి.. ఇచ్చిన టైం లో డెలివరీ ఇవ్వకపోతే ఆ ఫుడ్ మొత్తం ఫ్రీ అనేది దాని సారాంశం..'ఫ్రీ 'అనగానే దానికి పడిపోని భారతీయుడు ఉంటారా... ఆ అప్షన్ కింద రేటింగ్స్ చూసుకుని మరీ ఒక రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ ఇచ్చా..

అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ అయింది.. జొమాటో యాప్ లో నేను మా అబ్బాయి శాస్త్రవేత్తల మాదిరి వెదుకుతున్నాం.. ఆర్డర్ రెడీ నుంచి మొదలు పెట్టి డెలివరీ బాయ్ బైక్ సింబల్ మ్యాప్ లో మూవ్ అవుతున్న ప్రతి అంశం భూతద్దంతో చెక్ చేస్తున్నాం..సగటు భారతీయ మెంటాలిటీ కదా.. ఒకవేళ డెలివరీ బాయ్ అనుకున్న టైం కి ' ఫుడ్' డెలివరీ ఇవ్వకపోతే..జొమాటో మొత్తం ఫుడ్ ఫ్రీగా ఇస్తుంది కదా.. బుద్ధులు ఎక్కడికి పోతాయ్.. అందుకే బాయ్ లేట్ కావాలని ఎదురు చూస్తున్నా.. టైం స్కెల్ మీద 32 నిమిషాల నుంచి తగ్గుతూ వస్తోంది...ఇంకా ఇరవై నిమిషాల్లో డెలివరీ అని చూపిస్తోంది.. యాప్ లో రెడ్ కలర్ లో బైక్ సింబల్ వేగంగా కదులుతోంది.. లేట్ గా వస్తాడా..టైం కి ఇస్తాడా ని ఎదురు చూపులు..లేట్ అయితే బాగుండు అని కుట్రపూరిత ఆలోచనలు..

ఇంకా పదిహేడు నిమిషాల్లో డెలివరీ అని టైం చూపిస్తున్న టైం లో జొమాటో నుంచి కాల్ వచ్చింది.. అవతలి నుంచి డెలివరీ బాయ్.. ఆయాసపడుతూ మాట్లాడుతున్నాడు.. సార్.. వస్తున్నాను సర్.. కొద్దిగా ఆలస్యం అవుతుందేమో సర్.. క్షమించండి ..అంటున్నాడు..
అప్పుడే నాలో ఒకప్పటి కన్నింగ్ నాగభూషణం, రాజనాల, రావుగోపాల్ రావు, అమ్రిష్ పురి లు మేల్కొన్నారు.. ఒంటికన్నుతో జొమాటో యాప్ చూస్తూ యాహూ ..అని అరిచా.. ఇవాళ 493 రూపాయల బిల్ మిగిలిపోయినట్టే.. వాడు లేట్ అవడమే నాకు కావాలి.. ఫ్రీ అప్షన్ కింద మొత్తం కొట్టేయాలి.. నాలో ఉన్న కక్కుర్తి టన్నుల కొద్దీ ఆ టైం లో బయట పడింది.. పైకి మాత్రం ఆ కుర్రాడి మీద విపరీతమైన ప్రేమాభిమానాలు కురిపిస్తూ.. పర్వాలేదు..జాగ్రత్తగా రా..అని చెప్పా..

ఎదుటోడి కష్టం గురించి ఆలోచించకుండా మన స్వార్ధం మనం చూసుకున్నప్పుడు వచ్చే ఆలోచనలు బుర్రలో కిలోల కొద్దీ పైశాచికానందాన్ని నింపుతాయి.. ఇలాంటి టైం లో మన హోదా, స్థాయి ఏమీ గుర్తుకు రావు..ఎదుటోడు నాశనం అయిపోయిన పర్వాలేదు.. మనం మాత్రం బాగుండాలి కదా.. ఆ అరగంట లో మనకి ప్రపంచంతో సంబంధం లేదు..ఎలాగైనా సరే 'బేవార్స్' గా బిర్యాని దొబ్బేయాలి అంతే..

టైం దగ్గర పడింది... ఇంకో ఐదు నిమిషాల్లో డెలివరీ అని చూపిస్తోంది.. నేను విజయానికి చేరువలో ఉన్నాను.. రన్నింగ్ రేసులో ఉన్నోడు..పక్కోడి కంటే ఒక సెకన్ వెనుక పడినప్పుడు. ముందున్న వాడికి గుండె పోటు వచ్చి పడిపోతే.. నేనే ముందుకెళ్తా అని దుష్ట ఆలోచనతో ఎదురు చూసినట్టు, ఓడిపోయే క్రికెట్ మ్యాచ్ లో వర్షం వచ్చి మ్యాచ్ ఆగిపోతే బావుండు అని ఎదురు చూసే క్రికెటర్ లా.. నేను ఎదురు చూస్తున్నా..

అప్పుడే మళ్లీ ఫోన్ వచ్చింది...సర్..అడ్రెస్ ఒకసారి చెబుతారా.. మీ స్ట్రీట్ లోనే..
ఉన్నాను..అంటున్నాడు డెలివరీ బాయ్.. అప్పుడే ఎలా వస్తాడు..రాకూడదు..వాడు టైం కి వస్తే నా పధకం ఫెయిల్ అవుతుంది.. వాడిని ఎలా అయినా సరే ఇంకో ఐదు నిమిషాలు లేట్ చేయించాలి.. అని ఎక్కడున్నావ్ అంటూనే సెకండ్ ఫ్లోర్ బాల్కనీలోకి వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాను.. ఇంతలో అతనే కింద నుంచి పైకి అరుస్తున్నాడు..సార్.. మీరే కదా పైన ఉంది అంటున్నాడు.. అయ్యో దొరికిపోయానే.. ఇంకా ఎలాగోలా లేట్ చేయిద్దామనుకుంటే.. నన్ను చూసేసాడే.. ఏమి చేయాలి.. మనకి బేవార్స్ బిర్యానీ దక్కదా.. అనేలోపు ఆ కుర్రాడు పైకి వచ్చాడు..

రెండు ఫ్లోర్లు ఎక్కి పైకి వచ్చి బ్యాగ్ ఓపెన్ చేసి రెండు బిర్యానీ ప్యాకెట్లు చేతికిచ్చాడు.. అప్పుడు యాప్ లో చూసా.. ఇంకా ఒక నిమిషంలోడెలివరీ అని చూపిస్తోంది.. సార్ లేట్ అయ్యుంటే..సారీ సర్ అంటున్నాడు.. అప్పటికే చెమటల తో పూర్తిగా తడిసిపోయాడు.శీతాకాలం చలిలో కూడా అతను వేసుకున్న ఎర్ర చొక్కా.. చెమటతో తడిసిపోయింది.. నుదుటి నుంచి చెమట చుక్కలు కళ్ల మీదికి కారుతుంటే తుడుచుకుంటున్నాడు..చూడటానికి బక్కపల్చగా ఉన్నాడు ఆ కుర్రాడు..నన్ను చూసి లేట్ అయ్యుంటే కాస్త చెప్పకండి సర్..నాకు పెనాల్టీ వేస్తారు ..సైకిల్ కదా .. తొక్కి.. తొక్కి కాళ్ళు నొప్పులు పడుతున్నాయి..అప్పటికీ ఫాస్ట్ గానే తొక్కాను.. మీకు లేట్ కాకూడదని.. షార్ట్ కట్ లో వచ్చాను..అని చెబుతూ మెట్లు మీది నుంచి కిందికి వెళ్లి పోతున్నాడు..

బాబూ...నీ పేరేంటి అన్నాను..నవీన్ సర్ అన్నాడు.. సైకిల్ మీద వచ్చావా. అని అడిగా..అవును సర్.. ఉదయం నుంచి పధ్నాలుగు డెలివరీలు ఇచ్చాను.. ఇదే లాస్ట్ డెలివరీ..అన్నాడు..అతని కడుపు నింపుకోవడానికి అంత దూరం సైకిల్ తొక్కుకుంటూ బిర్యానీ తెచ్చి..మా కడుపులు నింపాడు..
 ఇప్పుడు నాకు డెలివరీ తెచ్చిన హోటల్ ఎంత దూరం ఉంటుంది అని అడిగా.. నాలుగున్నర కిలోమీటర్లు ఉంటుంది...అన్నాడు.. అక్కడి నుంచి సైకిల్ మీదే వచ్చావా..అని అడిగా.. ..
అవును సర్ సైకిల్ మీదే..

 సరే వెళ్ళొస్తా సర్..మా అమ్మ ఇంటిదగ్గర ఎదురు చూస్తుంటుంది.. మళ్లీ పరీక్షలు దగ్గర పడుతున్నాయి..చదువుకోవాలి అంటూ ఈల వేసుకుంటూ మెట్లు దిగుతుంటే మళ్లీ నవీన్ అని పిలిచా..ఏంటి సర్.. అంటూ పైకి వచ్చాడు.. నువ్వు చదువుకుంటున్నావా..అన్నాను..
అవును సర్ బీటెక్ ఫైనల్ ఇయర్..కాలేజీకి వెళ్లి పర్మిషన్ తీసుకుని ఈ ఉద్యోగం చేస్తాను..అన్నాడు.. ఎంత వస్తాయి రోజుకి అంటే..ఎంత సైకిల్ తొక్కితే అంత సర్.. ఒక్కోరోజు ఆరు వందల వరకూ వస్తాయి అన్నాడు.. ఆ డబ్బులు ఏమి చేస్తావు అంటే.. ఇంట్లో అవే ఆధారం సర్..ఆ డబ్బుతోనే అందరం బతుకు తాం.. నా కాలేజీ ఫీజులు నేనే కట్టుకుంటాను..అన్నాడు..ఎక్కడో నాలో దాగి ఉన్న మానవత్వం అప్పుడు నిద్ర లేచింది...అతని చెమట చుక్కల్లో నాకు అసలైన జీవితం కనిపించింది.. అతని మాటల్లో తత్వం బోధపడింది..

 ఒక్కసారిగా అతన్ని హగ్ చేసుకున్నా..ఎండిపోయిన చెరువులో  నీళ్లు ఉబికినట్టు.. నా కళ్ళల్లోంచి కన్నీటి బొట్లు బయటకు రావడానికి ట్రై చేశాయి..జర్నలిస్టుని కదా ..కంట్రోల్ చేసుకుని.. అతన్ని సారీ..నవీన్ అన్నాను.. ఎందుకు సారీ చెబుతున్నానో అతనికి అర్ధం కాలేదు.. బిర్యానీ తిను నవీన్ అని ఒక ప్యాకెట్ ఇవ్వబోయా.కానీ అతను తీసుకోలేదు..వద్దు సర్..మా అమ్మ ఇంట్లో వండుతుంది.. ఇవాళ బిర్యానీ తింటే..రేపు తినాలనిపిస్తుంది..మేము బిర్యానీ తేవాలి..మీలాంటోళ్లు బిర్యానీ తినాలి అంతే సర్.. అంటుంటే.. అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న కన్నీళ్లని ఇక నేను అపలేనంటూ నా కళ్ళు బయటకి పంపేసాయి..... 😢😭
--(())--



వనితా లతా కవితా మనలేవు లేక జత...ఇవ్వాలి చేయూత మనసివ్వడమే మమత

చిత్రం : కాంచన గంగ (1984)
రచన : వేటూరి
సంగీతం : చక్రవర్తి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

పల్లవి :

వనితా లతా కవితా మనలేవు లేక జత
వనితా లతా కవితా మనలేవు లేక జత
ఇవ్వాలి చేయూత మనసివ్వడమే మమత
మనసివ్వడమే మమత...
వనితా లతా కవితా మనలేవు లేక జత

చరణం : 1

పూలు రాలి నేలకూలి తీగబాల సాగలేదు
చెట్టు లేక అల్లుకోక పూవు రాదు నవ్వులేదు
మోడుమోడని తిట్టుకున్నా తోడు విడిచేనా
తొలకరించే కొత్త ఆశ తొలగిపోయేనా
వనితా లతా కవితా మనలేవు లేక జత

చరణం : 2

ఆదరించే ప్రభువు లేక కావ్యబాల నిలువలేదు
కవిత అయినా వనిత అయినా ప్రేమలేక పెరగలేదు
చేదు చేదని తిట్టుకున్నా చెలిమి విడిచేనా
చేదు మింగి తీపి నీకై పంచ మరిచేనా
వనితా లతా కవితా మనలేవు లేక జత

చరణం : 3

తనది అన్న గూడు లేక కన్నెబాల బతకలేను
నాది అన్న తోడు లేక నిలువలేదు విలువలేదు
పీడపీడని తిట్టుకున్నా నీడ విడిచేనా
వెలుగులోనా నీడలోనా నిన్ను మరిచేనా
వనితా లతా కవితా మనలేవు లేక జత
ఇవ్వాలి చేయూత మనసివ్వడమే మమత
మనసివ్వడమే మమత...

https://www.youtube.com/watch?v=TO4IEjwtnQI
Vanitha latha kavitha వనిత లతా కవిత..మనలేవు లేక జత
www.youtube.com
Movie: Kanchana Ganga (1984) Lyricist: Veturi Sundararama Murthy Music: Chakravarthy Singer: SP.Bala...

18, డిసెంబర్ 2019, బుధవారం


శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతకము(1986 సం.)
కవయిత్రి:- శ్రీమతి గుదిమెళ్ళ కమలారాఘవన్
ఫేస్ బుక్ లో పోస్ట్ చేయబడిన తేదీ:7-12-2019 సంll

1)ఉll శ్రీరమణీ మనోరమణ శ్రీకరమౌని హృదబ్జ భృంగ శృం,
         గార గుణాన్వితా విమలకాంచన రత్న విభూషణా లస,
         ద్వారిద మంజులాంగ సురవందితకోటి మనోజరూప లా,
         క్షారుణ పాదపంకజ వృషాచలమందిర వేంకటేశ్వరా!





శ్రీ శ్రీ శ్రీవేంకటేశ్వర ప్రభ (1)
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
 
నమో శ్రీవేంకటేశాయ
నమో నమో శ్రీ తిరుమల తిరుపతిశ్రీవేంకటేశాయ
నమోనమ:

శ్రీ రమణీ మనో రమణ
శ్రీకరమౌని హృదబ్జ భృంగ
శృంగార గుణాన్వితా
విమలకాంచన రత్న విభూషణా  .....

లసద్వారిద మంజులాంగ
సురవందిత కోటి మనోజ్ఞరూప
లాక్షారుణ పాదపంకజ
వృషాచలమందిర వేంకటేశ్వరా! .....

శ్రీ కరుణా మనో రమణ
శ్రీపదలక్ష్య మనోజ్ఞ బృంగ
శృంగార దళాన్వితా
వినయపోషణ రత్న విభూషణా ......

హిమప్రేరిత మంజులాంగ
నవపూజిత కోటి మనోజ్ఞ రూప
శ్రావ్యాశృతి పాదపంకజా
కృపాకర వందిత వేంకటేశ్వరా ......

శ్రీ వినయా మనో రమణ
శ్రీమతిలక్ష్య మనోజ్ఞ బృంగ
శృంగార బలాన్వితా
మదిని దోచిన రత్న విభూషణా ......

గుణజ్యోతియు మంజులాంగ
సమభావిత కోటి మనోజ్ఞ రూప
ప్రేమాన్విత పాదపంకజా
వృకోదర సమ్మతి వేంకటేశ్వరా .....

శ్రీ పతిగా మనో రమణ  
శ్రీ గుణభాష్య పదాబ్జ బృంగ
శృంగార రమాన్వితా
మమత పంచిన రత్న విభూషణా .....

కలాన్వేషిత మంజులాంగ    
తులసీదళకోటి మనోజ్ఞ రూప
సత్యాన్విత పాదపంకజా
గృహాలయ పూజిత వేంకటేశ్వరా ....


నమో శ్రీవేంకటేశాయ
నమో నమో శ్రీ తిరుమల తిరుపతిశ్రీవేంకటేశాయ
నమోనమ:


--(())--




 2)ఉll మక్కువ సప్తశైలముల మాటున దాగితి వేలకో గనన్,
మ్రొక్కులు దీర్చ వచ్చునెడ ముందుకు సాగగలేక భక్తులున్,
స్రుక్కుచునుండ నీకిదియ చూడ్కికి వేడుకయయ్య  నేవడిన్, 
చక్కగ నేలకున్ దిగియు చక్కికి రాగదె వేంకటేశ్వరా!

మక్కువ తో ఏడుకొండలపై ఉన్నావు 
చక్కగ చూచేటి వేదికపై నుంచున్నావు
మ్రొక్కులు తీర్చేటి భక్తులనే రక్షించావు
పక్కగ ఆకల్ని తీర్చుట లక్ష్యమైనావు !

కష్టాలను తీర్చుటపై సహకరించావు
నష్టాలను మాన్పుటపై అనుకరించావు
ఇష్టాలను పంచుటపై ఉపకరించావు
ఇష్టుల్ని రక్షణయే  లక్ష్యమైనావు!

సాగగలేక ఉన్న భక్తులన్ రక్షించావు 
ఆగగలేక ఉన్న శక్తులన్ మాన్పించావు 
వేగగలేక ఉన్న ఏడ్పులన్ తగ్గించావు 
దాగగలేక వెంట నేతీర్చే వేంకటేశ్వరా!    

--((***))--


3)ఉll చక్కనివాడవంచు మరిచిక్కులు బెట్టె దవంచు యెందరో,
నిక్కముగాగ బల్కినను నెమ్మది యించుక నమ్మకేనియున్,
మక్కువ నమ్మియుంటి ననుమట్టుకు నేగతిబ్రోచెదో గదే,
చక్కని సామి నీదు పదసారస మేగతి వేంకటేశ్వరా!

చక్కని వాడవయ్యా
చిక్కులను తొలగించవయ్యా ...... 
నిక్కముగా తెల్పుతున్నామయ్యా
మక్కువగా ప్రార్ధిస్తున్నమయ్యా తండ్రి ......     
 
ఏ గతిన బ్రోచెదవో  మమ్ము
ఏ తీరున చూచెదవో మమ్ము
ఏ మాయ చేసెదవో  మమ్ము
ఏ మన్న కొలిచెదము తండ్రి  ....... చక్క

నమ్మి యుండి నిన్నే కొల్చెద
నమ్మకము వమ్ము చేయకయ్యా  .....
కమ్ము కున్న బాధల్ని తొలగించి 
చెమ్మకళ్ళను తుడవవయ్యా తండ్రి ... చక్క   

నీదు పదసారస మేగతి
నీదు సమపూజల మేగతి
నీదు సమసేవల మేగతి
నీవు మా సమస్యలు తీర్చు తండ్రి ...       

చక్కని వాడవయ్యా
చిక్కులను తొలగించవయ్యా ...... 
నిక్కముగా తెల్పుతున్నామయ్యా
మక్కువగా ప్రార్ధిస్తున్నమయ్యా తండ్రి ......     
 
--(())--

 4)ఉllగంగ కుజన్మభూమి శ్రితకాండము కెల్లను కల్పవాటి శ్రీ,
మంగకు కొంగుబంగరును మౌని హృదంబుజ షట్పదంబులున్,
సంగతులైన వారికిని సంసరణార్ణవ ముద్ధరింపగా
రంగగునావ నీపదములౌ గద శ్రీకర వేంకటేశ్వరా!

మమ్ముద్ధరింపగ నావవై
మా కళత్రాన్ని తొలగిన్చే దైవమై
మా ఆనందానికి ఉషోదయమై
సుప్రభాతవేళ కొలుస్తున్నాము శ్రీ వెంకటేశ్వరా

శ్రీ గంగకు జన్మభూమి 
శ్రీ మంగకు మాతృభూమి 
శ్రీ రంగ కు పుణ్యభూమి 
శ్రీ పదం తో పసిడిభూమి

మౌని హృదంబుజ షట్పదంబులున్,
మౌన బిజాంకుర  షట్పదంబులున్,
మేని సత్యవ్రత షట్పదంబులున్,
మనసు గళత్ర షట్పదంబులున్,

సంస్కరణార్ధముగా వెలసి
సంప్రదాయబద్ధముగా ఉండి
సాహిత్య పరంగా తొణికిసలాడి
సత్య ధర్మ పాలన నీదే వెంకటేశ్వరా

మమ్ముద్ధరింపగ నావవై
మా కళత్రాన్ని తొలగిన్చే దైవమై
మా ఆనందానికి ఉషోదయమై
సుప్రభాతవేళ కొలుస్తున్నాము శ్రీ వెంకటేశ్వరా
--((***))--

5)ఉll చక్కసుషుప్తి జెందువిధి చక్కికినేగియు సోమకుండు మున్,
అక్కజమార వేదముల నల్లన మ్రుచ్చిలి యబ్దిడాగినన్,
చొక్కపు మీనమై జలధిజొచ్చియు రక్కసుద్రుంచి వేదముల్,
మక్కువదెచ్చి బ్రహ్మకును మానుగనీయవె వేంకటేశ్వరా!

విధిగా కార్యనిర్వాహణ చేసి
మది తలపులను నెరవేర్చి
దధి ని చిలికినట్లు చిలికి
నిధి నందించి ఆదుకున్న వేంకటేశ్వరా!

వేదములకొరకు మత్యవతారమెత్తి
సంద్రమున రక్కసులతో పోరాడీ
ధర్మరక్షణార్ధమై వేదములు తెచ్చి
విధాతకు అందించావా వేంకటేశ్వరా!   ...... వి

అమృతము కొరకు కూర్మావతారమెత్తి
మోపుపై పర్వతన్నే మోసి
రక్కసులు, దేవతలు ఆడించినట్లు ఆడి    
అమృతాన్ని దేవతపారం చేసిన వేంకటేశ్వరా! ...... వి

ధర్మరక్షణార్ధమై వామనునిగా అవతరించి
రాక్షసుల శక్తి పెరగనీయకుండా బలిని ఆశ్రయించి
మూడుఅడుగులతో ముల్లోకాలను దానంగా గ్రహించి
బలిని పాతాళంలోకి తొక్కిపెట్టి మమ్ము ఆదుకున్న వేంకటేశ్వరా! ...... వి 
 
విధిగా కార్యనిర్వాహణ చేసి
మది తలపులను నెరవేర్చి
దధి ని చిలికినట్లు చిలికి
నిధి నందించి ఆదుకున్న వేంకటేశ్వరా!

--((***))--

ఉll పయ్యెద జక్కనొత్తుచును భౄలత ద్రిప్పుచు రెప్పలార్పుచున్,
చయ్యన దానవాళికటు సారెకుమోహములుప్పతిల్లగా
నెయ్యము జూపి యాసుధను నేర్పున మోహినివై,సురాళికిన్,
అయ్యడబోసి తీవెకద యార్తజనావన వేంకటేశ్వరా!

శ్రీ వెంకటేశ్వర లీలల్ - (8౩)

పయ్యెద జక్కనొత్తుచుఁన్
భృలత ద్రిప్పి ద్రిప్పుచున్
కనురెప్ప లార్పి తెరుచుచున్
వయ్యారపు చూపుతో మత్తెక్కించెన్
    
రక్కసులకున్ దేవతలకున్
చేతనున్న అమృత భా౦డమున్
హావభావ విన్యాసములన్ 
చూపి మోహములో ఉంచేన్

నెయ్యముచూపి యా సుధన్
వియ్యముగా వంచి వంచకున్
రక్కసులన్ ఉడికించి దేవతలకున్
అయ్యడబోసిన మోహిని అవతారమున్ 
    
ఆపదమొక్కులవాడవున్
ఆపద్భాందవుడవున్
ఆనందామృతమున్
అందించే శ్రీ వెంకటేశ్వారా
గోవిందా గోవిందా గోవిందా

--((***)-- 
 8)ఉll ధారుణి చాపకైవడిని తద్దయు జుట్టియు నబ్ది డాగు యా
క్రూరుని హేమనేత్రు వడికోరల జీల్చియు పుథ్వి నెల్ల పెం,
పారెడి శృంగమందు తగ భద్రత లాంఛనమై రహింపగా,
ధీర వరాహ రూపమున దీప్తిజెలంగవె వేంకటేశ్వరా!

పృథ్విని చాపగా చుట్టి
సంద్రమున దాగే క్రూర రక్కసుడున్
ధీరవరాహ రూపమున్ దాల్చి
ఘోరరాక్షసుంతో యుద్ధం సల్పే

హేమనేత్ర కోరలతో
రక్కసుని హృదయాన్ని చీల్చి
పృద్విని శృంగమందు తగ భద్రతతో
పుడమిపైకి తెచ్చిన మహనీయుడున్

దేవతాగణంబుకు రక్షణ కల్పియున్
సమస్త సృష్టికి మూలంబయ్యెన్
ఆద్యాఆత్మిక ఆర్తుల ఆర్ఢ్యడయ్యెన్
ఆత్మగా అందరిలో ఉన్న
ఆపద్భాదవ శ్రీ వెంకటేశ్వరా
గోవిందా గోవిందా గోవిందా


--((***))--

6)ఉll కవ్వముగాగ మందరము కవ్వపు తాడల వాసుకై తగన్,
నివ్వటిలంగ క్షీరజలథిన్ సుధగోరి సురాసురల్ తమిన్,
మవ్వముగా మథింపగను మందర మబ్దిని మున్గ కూర్మమై,
నెవ్వగ మాన్పి వారలకు నీప్సిత మీయవె వేంకటేశ్వరా!


7)ఉll పయ్యెద జక్కనొత్తుచును భౄలత ద్రిప్పుచు రెప్పలార్పుచున్,
చయ్యన దానవాళికటు సారెకుమోహములుప్పతిల్లగా
నెయ్యము జూపి యాసుధను నేర్పున మోహినివై,సురాళికిన్,
అయ్యడబోసి తీవెకద యార్తజనావన వేంకటేశ్వరా!

8)ఉll ధారుణి చాపకైవడిని తద్దయు జుట్టియు నబ్ది డాగు యా
క్రూరుని హేమనేత్రు వడికోరల జీల్చియు పుథ్వి నెల్ల పెం,
పారెడి శృంగమందు తగ భద్రత లాంఛనమై రహింపగా,
ధీర వరాహ రూపమున దీప్తిజెలంగవె వేంకటేశ్వరా!

 9)చంll హరిగిరి యెక్కడంచు కనకాక్షుని యన్న కుమారు నుద్ధతిన్,
కరకర పండ్లుగీటి యడుగన్ సకలంబున నుండు నన్న యా,
చిరుతని గావ కంబమున శ్రీనరకేసరివై జనించి నీ,
నరయుగ యూరులన్ బొదివి వానిని జీల్పవె వేంకటేశ్వరా

10)ఉll కూరిమి గుజ్జువై బలిని గొంకక నిద్ధర మూడడుంగులన్,
నేరుపుతోడ వేడి తగ నీ చరణద్వయి భూనభంబులన్,
ధీరత గొల్చి మూడవ పదిన్, బలిశీర్షముద్రొక్కివేడ్క పా,
కారి కొసంగవే సిరుల కామిత దాయిక వేంకటేశ్వరా!

11) ఉll విందును యారగించి కృపవీడియు తండ్రిని ద్రుంచినట్టి యా,
మందుని కార్తవీర్యు దునుమాడియు కక్షను రాజులందరన్,
మ్రందగ జేసి వారి రుధిరంబును తండ్రికి తర్పణంబుగా,
క్రదిల జేయవే పరశురాముడవౌచును వేంకటేశ్వరా!

 12) ఉll ఈ ధరగావగా ధశరథేసుని పుత్రుడవై జనించి యా,
గాధి తనూజు యాగమును గాచి యహల్య బ్రోచి యం
త గంగాధరు విల్లుద్రుంచి జనకాత్మను చట్టనుబట్టి లీల లం,
కాధిపు ద్రుంచి రాఘవుడవై విలసిల్లవె వేంకటేశ్వరా!

13)ఉll దేవకి గర్భమందునను దీప్తిజనించియు నందు పల్లెలో‌,
నీవల పూతనాదులను నేర్పున ద్రుంచియు వేణువూది బృం,
దావని రాసమున్ సలిపి తద్దయు రాముని గూడి కంసునిన్,
లావున ద్రుంపవే సొరిది కృష్ణుడవౌచును వేంకటేశ్వరా!

14)ఉllధారుణి జంతుహింసలను త్రాగుడు లౌచును ధర్మమొల్లకన్,
జారులు చోరులై మరియు సత్యము వీడియు బొంకులాడుచున్
దూఱుల బల్కుచున్ ప్రజలు దుర్మతులై చెడిపోవ బుద్ధుడై,
బోరన బుద్దులను గరపిబ్రోవవె వారల వేంకటేశ్వరా!

15)చంll ధరణిని యొంటి పాదమున ధర్మువు నిల్చియు నుండునంతలో,
నరయగ నద్దియున్ కలియుగాంత్యములో నశియింప ధర్మమున్, 
వరుసగ నాల్గు పాదముల వారక నిల్పగ కల్కిమూర్తివై సరగున దుష్టులన్
దునిమి సాధుల బ్రోవవె వేంకటేశ్వరా!

16)ఉll వాసిగ శౌనకాది మునివర్యులు యజ్ఞ ఫలంబు నందగా,
వాసితమైన సత్వగుణ భాసితు డెవ్వడొ దెల్పనా భృగున్,
థీసము నంప రుద్రుని విధిన్ పరిశోధనసల్పి యొల్లకన్,
రోసి వికుంఠ మేగి నిను రూఢిని గాంచడె వేంకటేశ్వరా!

17)ఉll అంతట లక్ష్మి తో సరసమాడెడి నిన్ గని క్రోధనేత్రుడై,
చింతిలి నీ యురం బవియజెచ్చెర దన్నిన లక్ష్మి యల్గి నీ,
చెంతను బాసినన్ మునికి చిత్రముగా పదసేవ సల్పుచున్,
పొంతన పాద నేత్రమును పూనిక నొత్తవె వేంకటేశ్వరా!

 18)చంll మునికటు గర్వమెల్లదిగి మోకరిలంగను మ్రొక్కి శాంతుడై,
అనుపమ సత్వమూర్తి నమరావళి లోపల నీవెగా హరీ!
నినువలె బోలు దైవమిల నెచ్చటలేరు హవిస్సునందగా,
మునుకొని నీకె జెల్లునని మున్ ముని యేగడె వేంకటేశ్వరా!

19)ఉll ఆపయి లక్ష్మి కై వెదకి 'హా'యని యార్తరవంబు దోప సం,
తాపము మీరగా పరము దప్పియు భూమికి వచ్చి కానలన్,
తోపక గ్రుమ్మరన్ సిరియు దుఃఖిత యౌచును నీకునై మదిన్,
దీపితమౌ నుపాయమును తేకువ నెంచరె వేంకటేశ్వరా!

20)ఉll ధాతయు గోవునై హరుడు తద్దయు వత్సమునై చెలం గగా,
ప్రీతిని గొల్లభామగను శ్రీవిలసిల్లియు చోళరాజుయెం,
తేతనివార గోసరళి దెల్పగమెచ్చియు రాజు వేడ్కమై,
యాతని మందలన్ గలప యావు చరింపదె వేంకటేశ్వరా!

 21)ఉll ఎండకు వానకున్ దడిసి యేర్చిన నెమ్మది వృక్ష మూల మం,
దుండెడు పుట్టలో విథిని దూరుచు వాసము చేయుచు న్నెదన్,
దండిగ క్షుత్పిపాసలకు తాళక నీవును క్లేశమొందగా,
అండగ నిల్చెగా సిరియు నయ్యెడ కానక వేంకటేశ్వరా!

22)ఉll కానకు నేగి యాపసుల కాపరి కందక క్రొత్తగోవు దా,
మానుగ నీదు పుట్టకడ మానక నిత్యము పర్వుపర్వునన్,
తాను పొదుంగు పాల్ గురిసి తాలిమి నీదగు క్షుత్తు బాపుచున్,
ధేనువు లందు చేరుకొని దీప్తి చరింపదె వేంకటేశ్వరా!

23)చంll ప్రతిదిన మెన్న యావుకడ పాలను గానక రాణి,
కాపరిన్, కతమెరుగంగ నోపునన కారణమేమి యటంచు నిత్యమున్,
జతగొని మేయుచుండు పసుసంతతి నంచని వాడు దెల్పగా,
చతురత మంతనంబున విచారము సేయడె వేంకటేశ్వరా!

24)చంll పసరము వెంటనంటి యెక వాసరమందున గొల్లడేగగా,
కసిమసి పుట్టజేరి నిను కమ్మని పాలను త్రాపుచుండగా,
పసువును యల్గి గొడ్డలిని బట్టియుమోదిన దెబ్బ గాటమై,
విసురున నీ తలన్ దగుల వేదన జెందవె వేంకటేశ్వరా!

25)చంllశిరమున గారు రక్తమును చిక్కగబట్టి కరంబుతో నినున్,
దురమున గొట్టినట్టి యలదుష్టుని భూతముగా శపించినన్,
కరములు మోడ్చి వాడడలి కావవె శాపము ద్రిప్పియన్న నా,
వరవుడవౌచు వుందువని వానిని యేలవె వేంకటేశ్వరా!

26)చంll శ్రమమని దోచి యానెలవు చెయ్యన బాసి వరాహమూర్తి యా,
శ్రమమును జేరి స్వామిని ధరన్ యెక కొంత వసింపవేడి నే,
మమున వసింప యావకుళమాత యనుగ్రహమూని మాతయై,
కొమరునిగానినున్ తలచి కూరిమి బెంపదె వేంకటేశ్వరా!
ఇంకావున్నాయి.,
27)చంll మును వనమాలికాంశ ముదమొప్ప యశోద కళన్ విరాజిలన్,
మనియెడి యీమె దా వకుళమాలిక గాగను కృష్ణు తేజమున్,
కనుగొన నీవవై చెలగు కారణ మౌటను నీకు తల్లియై,
చనువుగ నొప్పుచుండెకద సాధుజనావన వేంకటేశ్వరా!

28)చంll ఒకదినమందు వేట తమినొప్పుగ తల్లిని వేడికానలో,
మెకముల వేట సల్పి కడు మేనును డస్సి పిపాసచెంది చే,
రిక గల పూవుతోట గని లీలను జొచ్చి కొలంకు జేరు నిన్,
చకితయు నౌచు రాకొమరి చెయ్యన జూడదె వేంకటేశ్వరా!

29)ఉll ఆమని యాదినంబునను నంగజ పూజలు సల్ప నెచ్చెలీ,
స్తోమము గొల్వ రాకొమరి సోయగ మొప్పగ పుష్పతోటకున్,
నేమముతోడ వచ్చి మది నీప్సిత మేర్పడ నుత్సవంబులో,
కోమలి మున్గగా యెదను కూరిమి దోచవె.వేంకటేశ్వరా!
ఇంకావున్నాయి.,
 30)ఉll నీవిరహంబు తాళకను నీరజ లోచన చోళపుత్రి యున్,
వావిరి చిల్కతో కబురు పంపియు తన్నును చెట్టబట్టగా,
భావముదెల్ప నీవిరళి బల్మరు యామెకు దెల్ప చిల్కచే,
భావజుడింపు మిమ్ములనుభద్రతగూర్చడె వేంకటేశ్వరా!

31)ఉll దేవమునీంద్రు పల్కువిని తేజముతో వకుళామతల్లి,
ప,ద్మావతి నీకు దేవి యగుమాడ్కి విచారముసల్పి ప్రేమతో,
దీవెనలిచ్చి ఛోళపురి దీప్తిని జేరగసోదెసానివై,
తావక వాక్యమందు భవితవ్యము దెల్పవె వేంకటేశ్వరా!

32)ఉll దేవతలందరున్ గలిసి తేజము మీరగ పెండ్లి పెద్దలై,
చేవ కుబేరుడర్థమిడ చెన్నువహించియు పెండ్లియై ధరన్,
నీవల పద్మతోడుత వినిర్మల ప్రేమము నొప్పగా వనిన్,
భావుకులై చరింప సిరిభామిని జూడదె వేంకటేశ్వరా!

 33)చంll అలుక వహించి నీయెడల నార్తి సపత్నితొ కయ్యమాడగన్,
చెలుల వివాదమున్నుడుప చేతనుగాక కడింది కుందియున్,
శిలవగు చరిత నిల్వగను చేడెల చింతల వంతలన్నియున్,
చలమున బట్టి వందురుచు సాగిలి మ్రొక్కరె వేంకటేశ్వరా!

34)ఉll ఆ సురమౌని పల్కునను నర్చితులై శిలలౌచు
నొప్పగా, భాసుర శేషశైలమున భక్తజనావళి నేలుచున్
సదా, వాసిగ వడ్డికాసులను బట్టి శిరోజములందుచున్న
నీ,వాసము శ్రీనివాసమన వర్ధిలు చుండదె వేంకటేశ్వరా!
 

9, డిసెంబర్ 2019, సోమవారం

 నమామి నారాయణ పాద పంకజం
కరోమి నారాయణ పూజనం సదా
వదామి నారాయణ నామ నిర్మలం
స్మరామి నారాయణ త్తత్వ మవ్యయం

భావము :-- నారాయణుని పద్మములవంటి పాదములకు నమస్కరింతును. ఎల్లప్పుడూ నారాయణుని పూజ యొనరింతును.నిర్మలమగు నారాయణ నామ ముచ్చరింతును.
నాశరహితమగు నారాయణ స్వరూపమును ధ్యానింతును.
--(())--

అవాహూతః ప్రవిశ్యతి అపృష్టో బహుభాషతే,
అవిస్యస్తే విశ్వసితి మూఢ చేతా నరాధమః

భావము:-- మూఢ మతియగు నరాధముడు పిలువబడకయే పరులకడకేగును, ఎవ్వరెమియు అడగకకున్నను అధికముగా మాటలాడును, నమ్మగూడని వారిపై విశ్వాసముంచును. (విదురనీతి)
--(())--

చిక్కియున్నవేళ సింహంబు నైనను
బక్క కుక్క గఱచి బాధచేయు
బలిమిలేనివేళ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినుర వేమ

అలసస్య కుతో విద్యా
అవిద్యస్య కుతో ధనం
అధనస్య కుతో మిత్రం
అమిత్రస్య కుతో సుఖం

తా:--సోమరికి విద్య పట్టుబడదు, విద్యలేనివానికి ధనమురాదు, ధనము లేనిచో మిత్రులు దొరకరు, మిత్రులు లేనివారికి సుఖమెక్కడిది? అనగా జీవితములో సర్వసుఖములూ
విద్యవల్ల కలుగుతాయని, అట్టి విద్య నిరంతర పరిశ్రమ వల్లనే సాధ్యమని భావము.
'రమాకుమార' అంటే మన్మథుడు. అందులో 'ర' తీసేస్తే 'మా'కుమార. మా అంటే లక్ష్మి. లక్ష్మీ కుమార అంటే మన్మథు డే కదా!ఇప్పుడు మా తీసేస్తే 'మార'అంటే మన్మథుడు. ఇప్పుడు 'మా'తీసేస్తే మిగిలేది 'ర' ఏకాక్షర నిఘంటువు ప్రకారం 'ర' అంటే కూడా మన్మథుడే.'రమాకుమార' ఎటునుంచి చదివినా అలాగే ఉంటుంది. 'తమాషాగా లేదూ!
--(())--

పరోపకరణం యేషాం జాగర్తి హృదయే సతామ్
నశ్యంతి విపదేస్తేషాం సంపదః స్యుః పదే పదే
తీర్థస్నానైర్న సా శుద్ధిర్బహుదానైర్న తత్ఫలమ్
తపోభిరుగ్రైస్తన్నాప్య ముపకృత్యా యదాప్యతే...

భావము:--ఏ సుజనుల హృదయంలో పరోపకార భావన జాగరూకమై వుంటుందో వారి ఆపదలన్నీ తొలగిపోతాయి. సంపదలెన్నో వారికి ప్రాప్తిస్తాయి. పరోపకారం వల్ల ప్రాప్తించే పవిత్రత అనేక పుణ్య తీర్థాలలో స్నానం ఆచరించినా ప్రాప్తించదు. అందువల్ల కలిగే పుణ్యఫలితం అధిక దానాలు చేసినా, తీవ్ర తపస్సు చేసినా కలుగదు. నిష్కామ భావనతో పరోపకారం చేయడం కోసం పాటుపడేవారికి భగవత్ప్రాప్తి కూడా కలుగుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
==))((==

యోవనం ధనసంపత్తి: పభుత్వమవివేకితా !
ఏకై కమప్యనర్ధాయ, కిముయత్ర చతుష్టయం!!

భావం: మానవుడు కన్నుమిన్ను గానని నడియవ్వనములో నుండుట, అప్పుడు ధనసంపదకల్గుట, అట్టి సంపద సమయంలో ఉన్నతో ద్యోగం లబించుట, ఈ మూడింటికి తోడుగా అట్టివానికి అవివేకం అ బ్బును అనే ఈ నాలుగు సన్నివేశాలలో మానవునకు ఏ ఒక్కటి ఉన్ననూ అది అతనిని అనర్ధములలో  పడవేయును, పైని చెప్పిన నాల్గును కలసి ఉన్నవాడు మూర్ఖాటి మూర్ఖుడై పతితుడై పోవును.
--(())--
 


ఈ శ్లోకం కూడా మద్దులపల్లి వారి కవితా సంకలనం లోనిదే.

పానీయం పాతుమిచ్చామి త్వత్తః కమలలోచనే
యది దాస్యసి నేచ్చామి నో దాస్యసి పిబామ్యహం


అర్థము:-- ఇందులో ఒక చమత్కార మున్నది.ఒక ఒక వనిత బావిలో నీళ్ళు తోడుకొని కుండలో పోసుకొని వెళుతున్నది. ఆ దారిలో వెళుతున్న ఒక బ్రాహ్మణుడు.ఆమెను నీరడుగు చున్నాడు.
ఓ! కమల లోచనా !త్వత్తః =నీదగ్గర నుండి పానీయం=మంచినీళ్ళను, పాతుమిచ్ఛామి =త్రాగదలచి నాను.
కానీ, యది దాస్యసి=నీవి చ్చినట్లయితే, నేచ్చామి=నాక్కరలేదు, నో దాస్యసి=యివ్వక పోయినట్టయితే
పిబామ్యహమ్= త్రాగుతాను.ఇది చిత్రముగా నున్నది కదా!యిక్కడ యది దాస్యసి నేచ్చామి=నీవు దాస్యసి
దాసీ+అసి అంటే దాసీదానవు అయితే నాకక్కర లేదు.నో దాసీ+అసి=దాసీ దానవు కాకపొతే త్రాగుతాను.
(పూర్వం బ్రాహ్మణులు వేరే జాతి వాళ్ళ చేతి నీళ్ళు త్రాగే వాళ్ళు కారు కదా!) .

చిత్ర కవిత కర్ణపేయంగా ఉన్నప్పటికీ, వ్యర్థ పదాడంబరము తో నిండి సులభంగా అర్థం కాదు. రసపుష్టి కూడా లోపిస్తుంది. చిత్రకవితా పంచాననులైన కాశీపతిగారు చిత్రకవిత్వము లో వ్రాసిన పద్యాలలో పేర్కొనదగినవి రెండు. అందులో మొదటిది
'పాద భ్రమకం' రెండవది 'పద్యభ్రమకం' ప్రతి పాదము ఎటునుంచి చూసినా
'వికటకవి' లాగా ఒకటిగానే వుంటాయి. 'పద్యభ్రమకం' లో పద్యమంతా క్రిందినుంచి చదివినా ఒకటిగానే వుంటుంది. కాశీపతిగారు వ్రాసిన 'పాదభ్రమకం' పద్యము చిత్తగించండి.
సార సుర ధీర సురసా
తారసగా తత సభా సతత గాన రతా
వీర సభా భాస రవీ
మార పరా యమర వార మయ రా పరమా

టీక:-- సార=చేవగల, సుర= దేవతలయందున, ధీర=విద్వా౦సుడైన వాడా,లేక ధైర్యము
గలవాడా, సురసా=మంచియనురాగము గలవాడా, తారనగ =వెండికొండయే, ఆ

తత=విశాలమైన. సభా =కొలువుకూటముగ గలవాడా, సతత=నిరంతరము,
గాన= సంగీతము నందు, రత= ఆసక్తి గలవాడా, వీర= శూరుడా, సభా=ప్రభావయుక్త మైన
వాడా, భాస=కాంతియందున, రవీ=సూర్యుడైనవాడా, మార= మన్మథునకు, పరా=శత్రువైనవాడా, అమర=దేవతలయొక్క, వార =సముదాయముతో,
మయ=నిండినవాడా, పరమా =ఉత్కృష్టమైన వాడా, రా =రమ్ము
ఈ పద్యములో ఏపాదానికా పాదం ఎటునుంచి చదివినా ఒకటిగానే వుంటుంది.
--------------------------శుభసాయంత్రం------------------------

పురుషుడు ఎలా ఉండాలో ధర్మ శాస్త్రం చెప్పింది..కానీ ఎందుచేతో ఈ శ్లోకం జనబాహుళ్యం లోకి రాలేదు.

కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)
--> కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
--> కరణేషు దక్షః
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
--> రూపేచ కృష్ణః
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే (ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు) ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.
--> క్షమయా తు రామః
ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
--> భోజ్యేషు

తృప్తః
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.
--> సుఖదుఃఖ మిత్రం
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.
 కోకిలానాం స్వరో రూపం
పాతివ్రత్యంతు యోషితాం
విద్యారూపం విరూపాణాం
క్షమా రూపం తపస్వినాం
అర్థము: కోకిలకు స్వరమే అందము.మహిళలకు పా తివ్రత్యమే అందము.
కురూపులకు విద్యయే అందము.యతులకు(మునులకు) క్షమ,శాంతి యే అందము.
------------------------------------
ఉత్సవే వ్యసనే చైవ
దుర్భిక్షే రాష్ట్ర విప్లవే
రాజద్వారే స్మశా నేచ
యాస్తి ష్టతి స బాంధవః
అర్థము: శుభ కార్యములలో అవసరము వచ్చినప్పుడు,కష్టములు చుట్టుముట్టినప్పుడు ,
దేశమున తిరుగుబాట్లు జరిగినప్పుడు ,అధికారుల సమక్షమునందు, మరణాది దుఃఖము
తట స్థించి నప్పుడు,మొగము తప్పించక వెంటనుండి సహాయము చేయువాడే నిజమైన బంధువుడు.
-------------------------
నాస్తి విద్యాసమం చక్షు:
నాస్తి సత్యసమం తప:
నాస్తి రాగసమం దు:ఖం
నాస్తి త్యాగసమం సుఖం.
అర్థం:విద్యనూ పోలిన కళ్ళు, సత్యమును పోలిన తపము,
మాత్సర్యము వంటి దు:ఖ కరము ,త్యాగమును పోలిన సుఖమును లేవు.
--------------------------------------
అన్నింటిని సఫలం చేసేది నమ్మకం
అన్నింటి లోనూ జీవం నింపేది ఆశ
అన్నింటికీ అందం అద్దేది ప్రేమ

ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మ దలంచి యుగ్ర వా
క్పరుషత జూపినన్ ఫలము గల్గుట తథ్యము గాదె యంబుదం
బురిమిన యంతనే కురియకుండునె వర్షము లోక రక్షణ
స్థిరతర పౌరుషంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా!
తా:--మేఘు౦డు ప్రాణంబునకు భయము కలుగునట్లురిమిననూ వెంటనే జనులను రక్షించు పట్టుదలతో నానందము కలుగునట్లు వర్షించును. ఆ విధముగా మిక్కిలి
దయగలవాడు సమయానుకూలంగా కఠినముగా మాటలాడిననూ తదుపరి తప్పక మేలుచేయును గానీ కీడు చేయడు

మచ్చిక లేని చోట ననుమానము వచ్చిన చోట మెండుగా
కుచ్చితులున్న చోట గుణ కోవిదులుండని చోట విద్యకున్
మెచ్చని చోట రాజు కరుణింపని చోట వివేకు లుండి రేని
అచ్చట మోస ముండు సుగుణాకర పెమ్మయ సింగధీ మణీ
గుణ కోవిదులు=మంచి పండితులు.

కారము లేని కూర యుపకారము లేని మనుష్యు డాది నోం
కారము లేని మంత్ర మధికారము లేని ప్రతిజ్ఞ వాక్చమ
త్కారము లేని మాట గుణకారము లేని లెక్క సా
కారము లేని పాట కొరగావు సదాశివ సద్గురు ప్రభూ!

పుణ్యస్య ఫల మిచ్చంతి ' పుణ్యం నేచ్చంతి మానవా: :
న పాపఫల మిచ్చంతి ; పాపం కుర్వంతి యత్నతః .
అర్థము:--: మానవులు పుణ్యమును చేయుటకు నుత్సహించరు గాని పుణ్యము
చేయుట వల్ల గలుగు ఫలము కావాలని మాత్రం కోరుకుంటారు .
పాపం చేయటానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు గానీ పాప ఫలం తమకు
కలగ కూడదని కోరుకుంటారు.ఎంత విపరీతము .

అక్షరాలలో స్త్రీ కి నిర్వచనమిది
అ - అపురూపమైనది
ఆ - ఆప్యాయత పంచేది
ఇ - ఇంటికి దీపం వంటిది
ఈ - ఈశ్వరుడి మూడోకన్నులాంటిది
ఉ - ఉన్నంతలో సర్దుకుపోయేది
ఊ - ఊరటనిచ్చేది
ఋ - ఋణం తీర్చుకోలేని సేవచేసేది
ఎ - ఎన్ని ఇబ్బందులు ఎదురైనా
ఏ - ఏకాగ్రత కోల్పోకుండా
ఐ - ఐనవారికోసం
ఒ - ఒంట్లో శక్తినంతా ధారపోస్తూ
ఓ - ఓరిమితో నేరిమితో
ఔ - ఔదార్యం చూపేది
అం - అందరి అవసరాలూ తీర్చేది
అః - అః అనిపించేది

పుణ్యస్య ఫల మిచ్చంతి ' పుణ్యం నేచ్చంతి మానవా: :
న పాపఫల మిచ్చంతి ; పాపం కుర్వంతి యత్నతః .
అర్తఃము: మానవులు పుణ్యమును చేయ నుత్సహించరు గాని పుణ్యము
చేయుట వల్ల గలుగు ఫలము కావాలని మాత్రం కోరుకుంటారు .
పాపం చేయటానికి నిరంతరం యత్నిస్తున్తారే గని పాప ఫలం తమకు
కలగా కూడదని కోరుకుంటారు.ఎంత విపరీతము .

---------పద్యభ్రమకం-----------
సారసజ నుత జయ తరళ
శూరహరా సాదరి వరసు సురా పరమా
సూర పరా సుసుర వరద
సారా హర శూలతర యజతనుజ సరసా
టీకా:- సారసజ =పద్మసంభవుడైన బ్రహ్మదేవుని చేత, నుత =కొనియాడబడు
జయ=జయముగలవాడా, తరళ =చరించునట్టి, శూరహర =రణసాహసులను హరించినవాడా, సాదరి =ఆదరముతో గూడిన, వర=ప్రభువా, సు= శ్రేష్ఠుడవైన
సుర= వేలుపా, పరా=పరమాత్ముడా, మర= మన్మథునకు, పరా =శత్రువైనవాడా,
సుసుర=మంచి వేల్పుల యొక్క, వర= కోరికలను, ద=ఇచ్చువాడా, స+హరా=వేగయుక్త
హర=హరనామము గలవాడా, శూలరత =త్రిశూలాయుధము నాదాసక్తి కలవాడా,
సరసా= రసికుడవైన వాడా.

ఈ పద్యము చివరినుండి మొదటికి చదివినా,మొదటినుండి చివరకు చదివినా ఒకేవిధంగా వుంటుంది. (కాశీపత్యావధానులు గారి రచన)

డా.మాడుగుల నాగఫణిశర్మ గారు చేసిన ద్విశతావధానంలో ఒకావిడ అడిగారు.సురలోకం లో సురాపానాన్ని నిషేధిస్తే ఎలా వుంటుందో ఒక శ్లోకం లో చెప్పమని . సంచాలకులైన రామబ్రహ్మం గారు, వారికి సుర లేక పిచ్చెక్కి పోతూవుంది.ఏమి చెయ్యాలో తోచడం లేదు. అవధానిగారు దీనికొక ఉపాయం చెబుతున్నారు.దేవలోకానికి దగ్గరలో 'యానాం' లేదు కదా! అని తమాషా గా చెప్పారు. మధ్యలో అప్రస్తుత ప్రసంగి శంకరనారాయణ గారు అయితే "కల్లుతెచ్చు కోమని చెప్తారా? అంటే అవధాని గారు 'కల్లు'కాదు 'కళ్ళుతెరుచుకోమని' అని చెప్తూ ఈ క్రింది శ్లోకం చెప్పారు.

శ్లోకం:- సురలోకోయమితి ప్రభాతి నితరా తత్రాపి నోచేత్సురా
కరణీయం కిమధ ప్రయోగ కుశలై: ర్దేవైస్య నిత్యమ్ము దా
సతతం మాద్యమహోకధతం ఘటతే చేతం తదా చేత్తదా
ద్వి శతం దివ్యవధానకం భవతు తత్ త్పద్య మాద్యంకరం.
అర్థము:-- అసలే సురలోకం మరి అక్కడ సుర లేకపోతె దేవతలు పిచ్చి వాళ్లై పోయారు.. ఏమిచేద్దామని వాళ్ళు ఆలోచిస్తూంటే, ఇంద్రసభలో ఇంద్రుడు దేవ భాషలో ద్వి శతావధానం ఏర్పాటు చెయ్యాలి అని అవధానిగారు సలహా యిస్తున్నారు. .దానితో ఒక్కో శ్లోకం వింటూ వుంటే మద్యం తాగినట్టు తన్మయత్వంతో వాళ్ళు తూలి పోతారట.అంత రసవత్తరంగా సాగుతుందట ఆ అవధానం. అవధాని గారి ఊహకు నమోవాకాలు

---------------------శుభసాయంత్రం-------------------------------


---------------శుభోదయం ------సుభాషితాలు----------------------
గుణవ దగుణవ ద్వా కుర్వతా కార్యమాదౌ
పరిణతి రావధార్యా యత్నతః పండితేన
అతి రభస కృతానాం కర్మణా మా విపత్తే:
భవతి హృదయదాహీ శల్యతుల్యో విపాకః
బుద్ధిమంతుడగు వాడు ఏపని నైనా చేయబూని నప్పుడు, దానివల్ల ఎట్టి ఫలితాలు కలుగుతవో బాగుగా విచారించి మరీ చెయ్యాలి.అలా కాకుండా అనాలోచితంగా తొందరపడి ఏ పనైనా చేస్తే అది మరణ పర్యంతము బాధించే మనశ్శల్యముగా పరిణమిస్తుంది.

పెట్టక కీర్తిరాదు వలపింపక యింతికి యింపు లేదు తా
దిట్టక వాదులేదు కడు ధీరత వైరుల సంగరంబులో
కొట్టక వాడ లేదు కొడుకొక్కడు బుట్టక ముక్తి రాదయా
పట్టపురాజుకైన నిది పద్ధతి పెమ్మయ సింగధీమణీ !

నిముసమైనను మది నిల్పి నిర్మలముగ
లింగ జీవా వేశు లను గాంచి భంగ పడక
పూజ మదియందు జేయుట పూర్ణపదవి
పరము గోరిన నిది చేయ బాగు వేమా
అర్థము:-- పనులెన్ని యున్నా వేరు విషయముల గురించి ఆలోచింపక క్షణ కాలమైనను తీరిక చేసుకొని నిర్మల మైన మనస్సుతో,నిశ్చల మైన బుద్ధితో పరమాత్మను పూజిస్తే ముక్తి కలుగుతుందని వేమన చెప్తున్నాడు.

తనుజులనుం గురు వృద్దు ల
జననీజనకులను సాధుజనుల నెవ్వడు దా
ఘనుడయ్యు బ్రోవడో యా
జనుడే జీవన్ మృతుడు జగతి కుమారా
అర్థము:-- ఓ! కుమారా తన కుమారులను,గురువులను,పెద్దవారిని,తల్లిదండ్రులను,సజ్జనులైన వారిని తగిన సమయమున రక్షింపడో
అతడు బతికి యున్నను చచ్చిన వానితో సమానము.
(కుమార శతకం)

మమ్మీ డాడీలు వద్దు అమ్మ,నాన్నలే ముద్దు
అచ్చమైన తెలుగు వీడి ఆంగ్ల బాట నడవద్దు
అవసరమున్నంత వరకే ఆంగ్లాన్ని నేర్వండి
అనవసరపు ఆర్భాటం ఆత్మ వంచనే నండి

నియత తపమును నింద్రియ నిగ్రహంబు
భూరివిద్యయు శాంతికి కారణములు
వాని యన్నిటికంటె మేలైన శాంతి
కారణము లోభముడుగుట కౌరవేంద్ర !
ఇంద్రియాలు చంచలమైనవి వాటివల్ల ఒక్కోసాగారి బుద్ధి క్షీణిస్తుంది. వాటిని అదుపులో పెట్టడానికి నియమనిష్టలతో చేసే తపస్సు, ఇంద్రియ నిగ్రహం, విద్య శాంతికి సాధనాలు. వీటన్నిటికీ మించి లోభగుణాన్ని వదిలేస్తేచాలు. పరమ ప్రశాంతత లభిస్తుందని ధృతరాష్ట్రుడితో చెప్పాడు విదురుడు. లోభి తాను తినడు,యితరులకు పెట్టడు. ఎప్పుడూ సంపదగురించే ఆలోచిస్తూ ఆ క్రమంలో జీవితంలోని ఆనందాలన్నిటికీ దూరమవుతాడు. ప్రతిక్షణం ఏదో తెలియని అశాంతికితొ

బతుకుతాడు పిసినారితనాన్ని పక్కనబెట్టి పరులకింత మేలు చేస్తే ఆ సంతృప్తి కలిగించే శాంతి బ్రహ్మానంద భరితమన్నది విదురుడి మాట. “లోభికి నాలుగందాల నష్టం” అన్న సామెత ఉందనే ఉంది కదా!

దగ్గర కొండెము చెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మరి తా
నెగ్గు ప్రజకాచరించుట
బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ!
తా:--చెప్పుడు మాటలు,పొగడ్త లకు లొంగిపోయి ప్రజలకు కీడు తలపెట్టు రాజు
బొగ్గులకోసం కల్పతరువును కాల్చేసే మూర్ఖుడితో సమానమని చెప్పాడు బద్దెన
---------------శుభోదయం-------సుభాషితాలు-----------------
విద్యయే మనుజుల వికసింప జేసెడు
మహిత సాధనంబు మనుజులందు
విశ్వ హితము లేని విద్వేష పూర్ణమౌ
విద్య వున్నవాడు వింత పశువు (డా. మూలే రామముని రెడ్డి,ప్రొద్దుటూరు)

పరోక్షే కార్య హంతారం
ప్రత్యక్షే ప్రియవాదినం
వర్జయే తాదృ శ మ్ మిత్రం
విషకుమ్భం పయోముఖం
అర్థము: ఎదుట ఎప్పుడూ ఇచ్చకము లాడుతూ,చాటున అపకారములు చేయునట్టి మిత్రుడు పయోముఖ విష కుంభము వంటి వాడు.(పాల లాగా కనిపించే విషముతో నిండిన కుండ)
వాడికి దూరముగా యుండవలయును.

ముఖం పద్మదళా కారం వచశ్చందన శీతలం
హృత్కర్తరి సమం చాతివినయం ధూర్త లక్షణం


అర్థము:-ముఖము తామరరేకుల్లాగా అందముగా వుంటుంది,మాటలు మంచిగంధము వలె చల్లగా
వుంటాయి,కానీ మనస్సు కత్తెరలాగా పదునుగా వుండి మనకు హాని కలిగిస్తుంది.అతివినయం దుర్మార్గుల లక్షణము.కనుక వారితో జాగ్రత్తగా మెలగవలయును.
------------------------------------
మిత్ర ద్రుహః క్రుతఘ్నస్య స్త్రీ ఘ్నస్య పిశునస్యచ
చతుర్ణా మాపి చైతెషాం ని ష్కృతి ర్నైవ విశ్రుతా
అర్థము:-- మిత్ర ద్రోహి, కృతఘ్నుడు, స్త్రీని బాధించు వాడు ,చాడీలు చెప్పువాడు ఈ నలుగురూ మహా పాపులు. వీరి పాపములకు నిష్కృతి లేనే లేదు.
----------------------------------
"నీతో యుధ్ధముసేయనోపఁగవితా నిర్మాణశక్తిన్ నినున్/
బ్రీతుంసేయగలేను,నీకొఱకు తండ్రింజంపఁగాఁజాల,నా/
చేతన్ రోకటనిన్నుమొత్తవెఱతున్, జీకాకు నాభక్తి,యే/
రీతిన్ నాకిక నిన్నుజూడఁగలుగున్ ,శ్రీ కాళహస్తీశ్వరా!

కాళహస్తీశ్వర శతకము. ధూర్జటి మహాకవి.

భావము:స్వామీ! కాళహస్తీశ్వరా! నీభక్తులందరూ అసాధ్యమైన కార్యములొనరించి నీమెప్పువడసినారు.తెలిసీతెలియనివాడనునాభక్తియెట్టిదో నాకేతెలియనిపామరుడనునీతో యుధ్ధమొనర్చుటనాతరమా?కవిత్వమును జెప్పినిన్నుమెప్పించు శక్తియు లేనివాడనే, నీకొరకు కన్నతండ్రినైనను జంపుసాహసములేదే,నాచేతిరోకటితో నిన్నుదంచలేనే?మరియెట్లుస్వామీ నీసన్నిధినిచేరుట.నాకాఉపాయమేదో ఉపదేశింపుమని కవియభవుని అడుగుచున్నాడు.

విశేషములు:
ఇందు నిందాస్తుతి యలంకారమున్నది.నిందించుచున్నట్లు పైకిగానవచ్చినను వ్యంగ్యముగా శివుని ,యతనిభక్తులను ప్రశంసించుటయే కవియొనరించినకార్యము.
1అర్జునుడు పాశుపతాస్త్రముకొరకై తపమొనర్చునపుడు మాయాకిరాతవేషధారియగుశివునితో యుధ్ధమొనరించును.ఆరీతిగా నీతో యుధ్ధము నేనుచేయలేనుస్వామీ!అనుచున్నాడు.(సమరమున అర్జునుడు శివునిపలురీతులనొప్పించెను)
2నత్కీరుడనే శివభక్తుడు శివునికవిత్వమునతప్పులుబట్టి తనకవితాశక్తితో శివుని మెప్పించినాడు.నాకు అటువలె కవితచెప్పుశక్తిలేదనుచున్నాడు.
3విచార,శర్మయనునాయనారు పశువులను మేపుటకుగొనిపోయి,భక్తిపారవశ్యమున మునుగ,పశులు పంటపొలమునబడినవి.ఇదేమిరాయని అడుగ వచ్చిన తండ్రిని తనఏకాగ్రతకుభంగముకల్గించెనని, కోపావేశమున గొడ్డలితోనరకును.అదిగో ఆనాయనారువలె తండ్రిని చంపలేననుచున్నాడు.
4చిరుతొండనంబియను శివభక్తుడు కపటజంగముకోర్కెదీర్చుటకై కొమరుని జంపి యతనిశిరోమాంసమునురోకటదంచి కూరవండి పెట్టినాడు.
ఈరీతిగా శివభక్తులు చేసినత్యాగములను నేనుచేయలేని యశక్తుడననుచు,"చీకాకునాభక్తి"-యనుచున్నాడు(.అనగా తనభక్తిస్వరూప స్వభావ ులేవో చెప్పుటకు వీలులేనిది)
అట్టిశక్తిహీనుడను నన్ను నీవే నీదరికి చేర్చుకొనవలె ననుచున్నాడు.
స్వస్తి!(శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి సౌజన్యముతో)

ఉపకారేణ నీచానా మపకారోహి జాయతే
పయః పానం భుజంగానాం కేవలం విష వర్ధనం
తా:-నీచులకు ఉపకారము చేసినా వాళ్ళు మనకు అపకారమే చేస్తారు.ఎలాగయితే పాముకు పాలు పోయడం వలన దానికి విషము వృద్ధి యై మనల్ని కాటువేస్తుందో అలాగ.

ఆయుర్వేదేన నిర్ణీత మౌషధం రోగిణాం
జ్ఞానం తదైవ నిర్ణీతం సర్వేషాం భవ రోగిణాం
అర్థము: ఆయుర్వేదము రోగముగల సర్వ మానవులకొఱకు ఎట్లు యేర్పడినదో అలాగున అజ్ఞాన రోగముగల సర్వ మానవులకు
బ్రహ్మ జ్ఞానమను ఔషధము భవరోగము లను తగ్గించుట కొఱకు వేదము చే నిర్ణయింప బడి నది.

యాంతి ధర్మ ప్రవృత్తస్య తిర్యం చోపి సహాయతాం
అపంథానంతు గచ్చానం సోదరోపి విముంచతి.

అర్థము:-ధర్మ మార్గమున నడచు వానికి పశు పక్ష్యాదులు కూడా సహాయ పడతాయి.అధర్మ నార్గం లో నడిచే వానిని సోదరుడు కూడా విడిచి పెడతాడు.(సోదరుడు విడిచి పెట్టినా వానికి పాపము అంటదు)(రామునికి కోతులు సహాయము చేశాయి కదా!)

కట్టడ దప్పి తాము చెడు కార్యము చేయుచు నుండి రేని దో
బుట్టినవారినైన విడిపోవుట ధర్మము దౌర్మదాంధ్యముం
దొట్టిన రావణాసురునీతో నెడబాసి విభీషణాఖ్యు డా
పట్టున రాము జేరి చిర పట్టము గట్టుకొనండె భాస్కరా!

గుడ్ మార్నింగ్ వచ్చేను నేరువక
శుభోదయం చచ్చేను తలువక
ఎన్నడూ తెలుగేను మరువక
ఓ కూనలమ్మ!
--(())--


తెట్టు గ్రామవాసి వెంకన్నకు ప్రభువు యాచమానాయుడు యిచ్చిన సమస్య
సమస్య:-"వక్త్రంబుల్పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వేయగున్"
(నోర్లు పది,కన్నులు ఐదు, చేతులు వర్ణింపగా వేయి అవుతాయి.)
క్రమాలంకారములో పూర్తి చేశారు, తెట్టు గ్రామ వాసి వెంకన్న కవి.


ఈ 'క్త్రా'ప్రాసము కష్టమౌననుచు మీరింతేసివారాడగా
వాక్త్రాసంబది సత్కవీశ్వరుల త్రోవ ల్గామి నే జెప్పెదన్
దిక్త్రారాతికి బార్వతీశ్వరులకున్ దిగ్మప్రభారాశికిన్

వక్త్రంబుల్పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వేయగున్


ఈ 'క్త్రా' ప్రాస కష్టము లే పూరింప లేడని మీరు యింతగా అనుకుంటున్నారేమో,
సత్కవీశ్వరులకు వాక్కు యెలాగైనా త్రిప్పుటకు దారులు వుంటాయి.నే చెప్పెదను వినుడు. దిక్కులకు శత్రువైన రావణునికి నోర్లు పది, పార్వతికి, ఈశ్వరునకు గలిసి
కన్నులు ఐదు (అర్ధనారీశ్వరుడు కదా)ఇక ఆకాశములో వెలుగు సూర్యునకు కిరణములు
వేయి వుంటాయి.(కరములు =కిరణములు)ఆయన సహస్ర కిరణుడు కదా!

ఒకసారి అవధానం లో ఈ దత్తపది యిచ్చారు. సోనియా,తెరిసా,మండేలా,గాంధీజీ నాగఫణి శర్మ గారి


పూరణ.
వాల్లభ్యంబును వీడి వచ్చితి మహో వా సోనియామ్యస్థితిన్
చల్లంగా గడతేరిసాగి గహనీ సంచార ధారా గతిన్
జిల్ల్లన్ గుండియ మండే లాలిత జనశ్రీ జూపు నా ప్రేమతో
నల్లాడెన్ పితృవాక్య నిర్వహణ రాగాంధీ జిత క్రోధమై
అర్థము:-ఈ మాటలు లక్ష్మణుడు అంటున్నాడు రాముడితో వదిన కష్టపడుతూందనే బాధతో అన్నగారి
మీద మిక్కుటమైన ప్రేమతో అంటున్నాడు. వాసోనియమము అనగా(వల్కలములు నారచీరలు) )ధరించవలెనను నియమముతో అంతఃపుర


సౌఖ్యాలన్నిటినీ విడిచి పట్టి పితృ వాక్య పరిపాలన కోసం ఈ అడవుల్లో సంచరిస్తున్నాము.అయోధ్య ప్రజలు చూపిన ప్రేమతో నా గుండె మండిపోతూ వుంది.అని అన్నగారి మీద ప్రేమతో అంధుడై పోయినలక్ష్మణుడు క్రోధమును జయించిన అన్నగారితో అన్నాడు..
------------------------------
ఇరుక రాదు, కొరుకరాదు,నరుకరాదు,పెరుకరాదు అని నాలుగు పదాలు యిచ్చి పూరించమన్నాడట. యాచామనాయుడను రాజు తెట్టు గ్రామ వాసి యైన వెంకన్నకు.
పూరణ:-


ఇరుక రాదు చేత నిసుమంత నిప్పైన
గొరుకరాదు ఇనుము కొంచెమైన
నరుకరాదు నీరు నడిమికి రెండుగా
బెరుకరాదు బావి పెల్లగిలగ

------------------------శుభరాత్రి------------------------



    --------------శుభోదయం----సుభాషితాలు------------------------
    ఐశ్వర్యస్య విభూషణం సుజనతా శౌర్యస్య వాక్సంయమః
    జ్ఞానస్యో పశమః శ్రుతస్య వినయో విత్తస్య పాత్రే వ్యయః
    అక్రోధ స్తపసః క్షమా ప్రభావితు ర్ధర్మస్య నిర్వ్యాజతా
    సర్వస్యాపి హి సర్వకారణ మిదం శీలం పరం భూషణం (భర్తృహరి సుభాషితం)
    అర్థము:--ఐశ్వర్యమునకు అలంకారము మంచితనము, పరాక్రమమునకు మంచి మాట

    శోభ నిచ్చును. జ్ఞానమునకు శాంతము,పాండిత్యమునకు వినయము, శోభించును. ధన
    మున్నందుకు సత్పాత్ర దానము, తపస్సునకు కోపము లేకుండుట,సమర్థునికి క్షమా
    గుణము అలంకారము లగును. ధర్మ మునకు
    నిర్వ్యాజత, సమత తేజస్సు నొసగును. మిగిలిన ఏ గుణములుండనీ లేకపోనీ మంచి
    నడవడి సర్వ జనులకూ శోభ నిచ్చును.

    పద్దెము లోభికేల? మఱి పందికి జాఫరు గంధ మేల? దు
    క్కెద్దుకు పంచదారటుకులేల?నపుంసకుడైనవానికిన్
    ముద్దులగుమ్మయేల? నెఱ ముక్కఱ యేల వితంతురాలికిన్
    గద్దకు స్నానమేటికి? గావలె? బెమ్మయసింగధీమణీ!

    అడిగిన జీతంబియ్యని
    మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
    వడిగల ఎద్దుల గట్టుక
    మడి దున్నుకు బతుకవచ్చు మహిలో సుమతీ!

    సుఖార్థీ త్యజతే విద్యాం
    విద్యార్థీ త్యజతే సుఖం
    సుఖార్తినః కుతో విద్యా


    కుతో విద్యార్తినః సుఖం.
    అర్థము:సుఖము ను కోరువాడు విద్యను వదులుకోవల్సిందే.
    విద్య కావలిసిన వాడు సుఖాన్ని వదులు కోవలిసిందే. సుఖార్థు లకు .విద్య ఎందుకు?విద్యార్థులకు సుఖము ఎక్కడ?
    -------------------------------
    ఉత్సవే వ్యసనే చైవ
    దుర్భిక్షే రాష్ట్ర విప్లవే
    రాజద్వారే స్మశా నేచ
    యాస్తి ష్టతి స బాంధవః
    అర్థము: శుభ కార్యములలో అవసరము వచ్చినప్పుడు,కష్టములు చుట్టుముట్టినప్పుడు
    దేశమున తిరుగుబాట్లు జరిగినప్పుడు ,అధికారుల సమక్షమునందు, మరణాది
    దుఃఖము తట స్థించి నప్పుడు,మొగము తప్పించక వెంటనుండి సహాయము చేయువాడే
    నిజమైన బంధువుడు.

    అనభిద్యా పరస్వేషు ; సర్వ సత్వేషు సౌహృదం
    కర్మణాం ఫల మస్తీతి ; మనసా త్రితయం చరేత్
    అర్థము:-- పరుల సొమ్ము పై ఆశ లేకుండుట, సర్వ జీవుల యందు కరుణ కలిగి వుండుట, చేసిన కర్మకు ఫలముండి తీరునన్న నమ్మకము; ఈ మూడింటిని మనసునందు వుంచుకొని ప్రవర్తించ వలయును.

    ==((***))--


    యజమాని క్షేమాన్ని కోరుకునే బ్రాహ్మణుడు వెంటనే దక్షిణ తీసుకోవాలి.

    శ్లో౹౹దక్షిణా విప్రముద్దిష్య తత్కాలంచే న్నదీయతే౹
    ఏక రాత్రే వ్యతీతేతు తద్దానం ద్విగుణం భవేత్౹౹
    మాసే శత గుణం ప్రోక్తం ద్విమాసేతు సహస్రకం౹
    సంవత్సరే వ్యతీతేతు స దాతా నరకం వ్రజిత్౹౹
    దాత్రా న దీయతే మూర్ఖో గ్రహీతాచ న యాచతే౹
    ఉభౌ తౌ నరకం యాతౌ దాతా వ్యాధియుతో భవేత్౹౹
    విప్రాణాం హింసనం కృత్వా వంశహానిం లభేద్ధ్రువం౹
    ధనం లక్ష్మిం పరిత్యజ్య భిక్షకశ్చభవేద్ర్వజన్౹౹

    - బ్రహ్మవైవర్త పురాణం

    తాత్పర్యం:-

    బ్రహ్మణుని ఉద్దేశించి ఇవ్వవలసిన దక్షిణ వెంటనే ఇవ్వాలి.ఒకవేళ అలా ఇవ్వకపోతే..
    ఒకరాత్రి గడిస్తే ఆ ఇవ్వవలసిన దానం రెట్టింపు అవుతుంది.
    నెలకు నూరు రెట్లు అవుతుంది.
    రెండునెలలకు వేయి రెట్లు అవుతుంది.
    సంవత్సరం గడిస్తే ఆ దాత నరకాన్ని పొందుతాడు.ఇది నిశ్చయం.
    ధనం,లక్ష్మీ వీటిని పోగొట్టుకుని వెళుతూ భిక్షకుడౌతాడు.
    మూర్ఖుడైన దాత ఇవ్వకపోయినా..తీసుకునే బ్రాహ్మణుడు అడగకపోయినా ఇద్దరూ నరకానికి వెళతారు.
    చివరకు దాత రోగగ్రస్తుడౌతాడు.విప్రులను హింసిస్తే వంశహాని జరుగుతుంది.


    వేదాంతంలో కస్తూరీమృగం కధ చెబుతారు. కస్తూరీమృగం అంటే ఒక రకమైన జింక. సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది. అది మంచి మదపువాసనగా ఉంటుంది.అప్పుడు ఆ వాసన ఎక్కణ్ణించి వస్తున్నదా అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది.ఆ వాసన తనవద్ద నుంచే వస్తున్నదని అది గ్రహించలేదు.ఆ అన్వేషణలో అలా అడవంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది. ప్రాణాలు కోల్పోతుంది. వేదాంత గ్రంధాలలో ఉన్న ఈ కధ అందరికీ తెలిసినదే.

    మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా వ్యర్ధంగా ఇలాగే తిరుగుతూ ఉంటాడు. పుణ్యక్షేత్రాలనీ తీర్ధయాత్రలనీ అనవసరంగా తిరిగి డబ్బునీ కాలాన్నీ వృధా చేసుకుంటూ ఉంటాడు. నిజానికి వీటివల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగం అంటూ ఏమీ ఉండదు.
    పాండవులు తీర్ధయాత్రలకు వెళుతూ కృష్ణుణ్ణి కూడా తోడు రమ్మని పిలుస్తారు. సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్ధయాత్రల అవసరం ఏముంది? ఆ సంగతి మాయామోహితులైన పాండవులకు తెలియదు. కనుక కృష్ణుని కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్ధయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు. ఆయన చిరునవ్వు నవ్వి వారికొక దోసకాయ నిచ్చి 'నా ప్రతినిధిగా దీనిని తీసుకువెళ్ళి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి.'అని చెబుతాడు. వారు అలాగే చేసి తీర్ధయాత్రలు ముగించి తిరిగి వస్తారు.

    అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింపచేస్తాడు కృష్ణుడు. ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది.

    'అదేంటి బావా? ఇది చేదు దోసకాయ.కటికవిషంలాగా ఉంది.ఇలాంటి వంటకం చేయించావేమిటి?' అని వారు అడుగుతారు.

    దానికి కృష్ణుడు నవ్వి.' బావా. ఎన్ని గంగలలో మునిగినా ఈ దోసకాయ చేదు పోలేదు చూచావా?' అంటాడు.

    ఎన్ని తీర్ధయాత్రలు చేసినా, మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పూ రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం.

    మనిషి ప్రయాణం బయటకు కాదు. లోపలకు జరగాలి. యాత్ర అనేది బయట కాదు.అంతరిక యాత్రను మనిషి చెయ్యాలి.ప్రపంచమంతా మనిషి తిరిగినా చివరకు ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు. అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలోనుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు. పాతకాలపు మహర్షులు

    దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు. ఒకచోట స్థిరంగా కూచుని తపస్సు చేశారు. జ్ఞానసిద్ధిని పొందారు.

    సర్వేజనా సుఖినోభవంతు
    ==))((==

        ---------------శుభోదయం ------సుభాషితాలు----------------------
        మాడలమీద నాసఁగలమానిసి కెక్కడి కీర్తి?కీర్తి పై
        వేడుకగల్గు నాతనికి విత్తము మీద మరెక్కడాస? యీ
        రేడు జగంబులందు వెలహెచ్చిన కీర్తి ధనంబు గాంచి స
        స్ప్రౌఢ యశంబు జేకొనియె బమ్మయసింగడు దానకర్ణుడై

        అక్కరకు రాని చుట్టము
        మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా
        నెక్కిన బారని గుఱ్ఱము
        గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!

        అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
        తినగ తినగ వేము తియ్యనుండు
        సాధనమున పనులు సమకూరు ధరలోన
        విశ్వదాభిరామ వినుర వేమ

        అతనికి వార్ధి కుల్యయగు నగ్ని జలంబగు మేరుశైల మ౦
        చిత శిలలీలనుండు మదసింహము జింక దెరంగుదాల్చు గో
        పిత ఫణి పూలదండ యగు భీష్మ విషంబు సుధారసంబగున్
        క్షితిజన సమ్మతంబగు సుశీల మదెవ్వని యందు శోభిలున్
        తా:--దేశము లోని జనులు మెచ్చుకొనే సౌశీల్యము యెవనియందుండునో, అతనికి సముద్రము పిల్లకాలువ వలెను,అగ్ని నీరైపోవును,మీరు పర్వతము ఒకచిన్నరాయిగానూ,
        మదించిన సింహము జింక మాదిరిగానగును, కోపించిఉన్న సర్పము పూలదండలాగున
        ను, విషము అమృతములాగునను మారిపోవును.

        ప్రేమను గూర్చి యల్పునకు బెద్దతనంబును దొడ్డ వానికిం
        దామతి తుచ్ఛపు౦బని నెదం బరికింపఁగ యీయరాదుగా
        వామకరంబు తోడ గుడువం గుడిచేత నపామార్గము౦
        దోమగవచ్చునే మిగుల దోచని చేతలు గాక భాస్కరా!
        తా:--లోకంలో నీచునకు గొప్ప పదవిని, గొప్పవానికి చిన్న పదవిని నిచ్చి పనులు చేయించుచో ఆ పాలనమంతయు ఆలోచన లేనిదిగా క్రమబద్ధరహితముగా యుండును.
        ఎట్లనగా ఆలోచనలేక ఎడమచేత భుజించుటయును, కుడిచేతితో మలమూత్రములు శుభ్ర పరచుటయును నగును.

        సమస్య:"విద్య వున్నవాడు వింత పశువు"
        పూరణ:--తెలుగు పుడమిన తెలుగు వారికి బుట్టి
        తెలుగు గడ్డ మీద కొలువు దీరి
        తెలుగు వారితోడ తెలుగు మాట్లాడని
        విద్య వున్నవాడు వింత పశువు (భక్తకవి. వేంకటగిరి )

        వినయ మిచ్చు విద్య వెలిగించు నెడదను
        వినయ శోభ లేని విద్య యేల?
        వినయమును హరించు విత్తదాయకమగు
        విద్య వున్నవాడు వింత పశువు (కొర్రపాటి. చంద్రశేఖరరావు,గుంటూరు)

        విద్యనెరిగి విజ్ఞాన మెరుగక
        ధరణి ప్రగతి సుంత దలపక
        తానె జ్ఞాని ననెడి తలబిరుసున్నట్టి
        విద్య వున్నవాడు వింత పశువు (భళ్ళమూడి. శ్రీనివాసరావు,హైదరాబాదు)

        వివిధ విద్యలెల్ల విరివిగా నేర్చినా
        వినయ హీనుడగుట వింత గాదె?
        సంఘ హితము గోరు సౌశీల్యము లేని
        విద్య వున్నవాడు వింత పశువు (Jaada.Rajeswara Rao Jaggampeta)

        దుర్జనో నార్జవం యాతి


        సేవ్యమానో ఫై నిత్య శ:
        స్వేద నాభ్యన్జనో పాయై:
        శ్వపుచ్చ మివ నాపితం.

        అర్థము:ఎంత మంచి చేసి ప్రయత్నిచినను దుర్జనులు మంచి మార్గమునకు రారు ఎలాగంటే ఎన్ని విధము ల సాగ దీసి,చమురు రాసి,కట్టిపెట్టి ఉంచినా కుక్క తోక చక్కగా అ వదు కదా!
        __(())--


        6:31 pm, 04/12/2019] Hari: విత్త మార్జనంబె
        విద్య లక్ష్యంబాయె
        విలువ లెండమావి
        విధములాయె
        విజ్ఞులు కరువాయె
        విజ్ఞాన మెడమాయె
        విబుధ సేవనంబు
        వికృతాయె
        [6:31 pm, 04/12/2019] Hari: వినయ మిడని విద్య
        విఖ్యాతి నొందదు
        విలువ లేని విద్య
        వెలుగు నిడదు
        విశ్వ శాంతి నిడని
        విద్య పూర్ణమవదు
        విబుధులవక విద్య
        విభవ మిడదు
        [6:34 pm, 04/12/2019] Hari: తలపు మంచి దైన
        తప్పు దారిని పోరు
        తలపు చెడ్డ దైన
        తప్పు దారి
        తలపులె మన పాలి
        తలరాతలుగ మారు
        తలపులు సరిదిద్దు
        తప్పు ముప్పు
        [6:34 pm, 04/12/2019] Hari: ఏల జనులు వెంట
        యేమియు తేకుండ
        యేమగు తన దనుట
        యెంత వింత
        యేది మనది కాదు
        యేది మనతొ రాదు
        యెచటి దచటె యుండ
        యేల చింత
        [6:35 pm, 04/12/2019] Hari: ఘంటసాల
        సీ।శ్లోకమ్ము చదివెనా లోకాల నన్నిటిన్
        మంత్ర ముగ్ధము చేయు మధుర మూర్తి
        పద్యమెత్తుకొనిన భావాను గుణముగా
        నవ రసాలొలికించు నటన మూర్తి
        పాటలు పాడెనా ప్రాణి లోకమునెల్ల
        పరవశింపగ జేయు ప్రణయ మూర్తి
        స్వరములు కూర్చెనా సరస మాధుర్యాలు
        సరసాన్న ములు పెట్టు సరస మూర్తి
        గీ। వినయ సంపన్న శోభిత విదిత మూర్తి
        లలిత సంగీత సామ్రాజ్య రమ్య మూర్తి
        సరస సంగీత సాహిత్య చక్రవర్తి
        చలనచిత్ర రంగాన సంచలన మూర్తి
        గాన మాధుర్యముల సీమ ఘంటసాల
        అతని గొప్పను పొగడ నా కలవి యౌన?
        డా మీగడ

        గోత్రము - సూత్రము

        తిరుచ్చి రైల్వేస్టేషన్ లో పనిచేసే ఆ వ్యక్తికి ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె. అతను పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తుడు. మహాస్వామి వారు ఎక్కడ మకాం చేసినా, సంవత్సరానికి కనీసం నాలుగైదు సార్లు కుటుంబంతో సహా దర్శించుకునేవాడు. కేవలం దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళిపోకుండా కనీసం రెండు రోజులు స్వామివారితో ఉండి వారి కరుణా సముద్రంలో మునుగిపోయేవాడు.

        ఒకసారి స్వామివారితో, “ఈ అబ్బాయికి తొమ్మిది సంవత్సరములు. ఉపనయనం చెయ్యాలి” అన్నాడు.

        “తప్పకుండా చెయ్యి” అన్నారు స్వామివారు.

        “ఇతని గోత్రము సూత్రము నాకు తెలియవు” అని బదులిచ్చాడు అబ్బాయి తండ్రి.

        “అతను మీ అబ్బాయే కదా?”

        ”కాదు. ఇతను తన తల్లి కడుపులో ఉండగా తండ్రి మరణించాడు. పుట్టిన రెండు నెలల తరువాత తల్లి కూడా కాలం చేసింది. ఈ పసివాని బాగోగులు చూడడానికి ఆ పల్లెటూరిలో ఎవరూ లేకపోవడంతో, మేము తీసుకుని వచ్చాము. యాతని గురించి కాని, యాతని బంధువుల గురించి గాని ఎటువంటి సమాచారము లేదు. తిరునల్వేలిలో ఒక ఆగ్రహారానికి సంబంధించిన వాడుగా తప్ప ఇతర వివరాలు ఏవి తెలియవు పెరియవ” అని మొత్తం చెప్పాడు.

        మహాస్వామివారి మోహంలో అసాధారణమైన చిరునవ్వు కనిపించింది. అక్కడే ఉన్న కణ్ణన్ మామతో, “చూడు, ఇతను ఒక అనాథను పెంచుకుంటున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా పెంచడమే కాకుండా ఇప్పుడు ఉపనయనం చేయాలని కూడా యోచిస్తున్నాడు. ఎంతటి ఉన్నతుడు ఇతను” అన్నారు స్వామివారు.

        “ఇప్పటి దాకా ఆ పిల్లవాడు అతని కుమారుడే అనుకున్నాము” అన్నాడు కణ్ణన్ మామ.

        మహాస్వామివారు ఎంతో సంతోషంతో, “నేను విన్నట్టుగా గోత్రము తెలియని వారికి కాశ్యప గోత్రమని, సూత్రము తెలియక పొతే భోదాయన సూత్రమని ప్రమాణం. అలాగే సంకల్పించి ఈ బాలునికి ఉపనయన సంస్కారం జరిపించు. అతను అనాథ అని, పరాయివాడని ఎన్నటికి ఆలోచించకు. అతను నీవాడు; నీ కుమారుడు” అని ఆదేశించారు. ఆ వ్యక్తీ స్వామికి నమస్కరించి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయాడు.

        --- vandeguruparamparaam.blogspot.in నుండి

        అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
        శ్రీ

        చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

        #
        --(())--

        ఇది ఒక చమత్కార శ్లోకం. సమస్య:-"మృగాత్ సింహః పలాయతే " జింకను చూసి సింహము పరిగెత్తి పోయింది .ఇది అసంబద్ధం కదా! దీన్ని క్రమాలంకారం లో పూర్తి చేశారు.('చమత్కారశతం' పుస్తకము నుండి)

        శోకం:-- కస్తూరీ జాయతే కస్మాత్?
        కోహంతి కరిణాం కులం?
        కిం కుర్యాత్ కాతారో యుద్ధే?
        మృగాత్ సింహ పలాయతే
        కస్తూరి దీనినుంచి పుడుతుంది?సమాధానం మృగాత్ =మృగమునుండి (కస్తూరి అనే మృగమునుండి కారే మదమే కస్తూరి )
        ఏనుగుల గుంపును చంపేది ఎవరు? సింహం సమాధానం
        యుద్ధములో భయపడినవాడు ఏమి చేస్తాడు?పలాయతే =పరిగెత్తి పోతాడు.సమాధానం

        పన్నేండ్లక్రిందటి మాట.మదనపల్లి రచయితల సంఘం ఏర్పాటు చేసిన అష్టావధానం జోరుగా సాగుతోంది. ఓ పృచ్ఛకుడు లేచి అవధాని గండేపల్లి శివరామయ్యగారికి ఒక సమస్యను సంధించాడు. "తద్దినంబేను సుదినమ్ము తరచి చూడ"

        దీన్ని అవధానిగారు ఎలా పూరిస్తారోనని సభాసదులందరూ ఎదురు చూస్తూవున్నారు.
        అవధానాలంటే సాధారణంగా పృచ్ఛకులు కవులూ,రచయితలూ వుంటారు. వాళ్ళను దృష్టిలో పెట్టుకొని కాబోలు అవధానిగారు యిలా పూర్తి చేశారు

        పత్రికలలోన మనపేరు పడిన దినము
        రేడియోలన్నిమనపాట పాడు దినము,
        టెలివిజను నందు మన బొమ్మ వెలుగు దినము
        తద్దినంబేను సుదినమ్ము తరచిచూడ

        'తద్దినం'అంటే తత్ =ఆ, దినం =రోజు -ఆరోజు
        (సేకరణ: చీనేపల్లి రాజ్యలక్ష్మి తెలుగువెలుగు మాసపత్రిక సౌజన్యముతో )

        ఒకసారి అవధానం లో ఈ సమస్య యిచ్చారు.
        "కపిన్ పూజలు జేసే రాముడు కపుల్ గనగా కపిలేని వేళలోన్"డా. నాగఫణి శర్మ గారి పూరణ
        ఈ జననంబు ధన్యమై హేమ వితీర్ణ సువర్ణ పాత్రమై
        భ్రాజ దనన్య గుణ రాజ శిఖామణి దేవ దేవతా
        రాజిత నిరంతర వరప్రదాత నా వృషా
        కపిన్ పూజలు జేసే రాముడు కపుల్ గనగా కపిలేని వేళ లోన్
        తా:-రావణుడు బ్రాహ్మణుడు. ఆయనను చంపినందు వలన రామునికి బ్రహ్మ హత్యా పాతకం అంటుకుంటుంది. దాన్ని పోగొట్టుకోవడానికి అక్కడ సముద్రపు ఒడ్డు దగ్గరనే శివలింగ ప్రతిష్ఠ చేయమని సలహా యిస్తారు.అక్కడి ఋషులు. ప్రతిష్ఠ
        చేయడానికి ఆత్మ.లింగము తేవడం కోసం హనుమంతుడు కైలాసానికి పోతాడు.హనుమ .ఎంతసేపటికీ రాకపోయే సరికి ముహూర్తము దాటి పోతుందని సైకత (యిసుక)లింగము చేసి దానికి పూజలు చేయమని మునులు సలహా యిస్తారు. రాముడు ఆ సైకత లింగానికే ముందు పూజ చేస్తాడు.అదీ కథ.అక్కడ హనుమ లేకుండానే కపిలేని వేళలో వృషాకపి((శివుడు)ని రాముడు పూజించి ప్రతిష్ట చేస్తాడు.
        తనుతెచ్చిన లింగానికి కాక సైకత లింగానికి ముందు పూజ చేసినందుకు హనుమకు కోపం వస్తుంది సముద్రము లో పడి ప్రాణత్యాగము చేసుకుంటాను అంటాడు.అప్పుడు రాముడు అతనిని వారించి గర్భగుడిలో నీవు తెచ్చిన లింగానికే పూజలు జరుగుతాయని వరమిస్తాడు.యిప్పటికీ రామేశ్వరము లో రెండు లింగాలు వుంటాయి.

        ద్విశతావధానం లో యిచ్చిన సమస్య:--"శేషనుభూతమయ్యెమనచేతలరాతలు మార్చినాడహో"డా.నాగఫణి శర్మ గారి పూరణ:-

        సోషను గల్గ జేసెనిక శూరత జూపెడు నాయకాళికిన్
        సోషలిజమ్ములోన గల సూక్ష్మ మహస్థితి సంఘటించె యా
        శ్లేషిత వర్తమానుడయి చిత్రిత భవ్య భవిష్యుడింక యా
        శేషను భూతమయ్యె మనచేతల రాతలు మార్చినాడహో.
        మన నాయకులకు శోషవచ్చేటట్లుగా ఎన్నికల సంస్కరణచేసిన శేషన్ గారు
        మానతలరాతలు మార్చి భూతకాలం లోకి వెళ్లిపోయారు.మనం ఆయనను
        మర్చిపోయాము.మళ్ళీ ఎన్నికలు షరా మామూలైపోయాయి.
        ------------------శుభసాయంత్రం ----------------
        
        ==(())--
        

            -------శుభోదయం-----సుభాషితాలు--------------------
            కోమటివేముని దానము
            భూమి ప్రసిద్ధంబు ..కల్ప భూజముచెంతన్
            పామున్నపగిది తురగా
            రాముండున్నాడు ..చేరరాదెవ్వరికిన్'

            మనవికి నొక్కయేడు; ననుమానపు మాటకు నాఱునెల్లు; నే
            డనిపెదనన్న మాసమవు; నన్పెదపొమ్మన్న బక్షమౌను; తత్
            క్షణ మిదె యంపితన్న మఱి సంతయువచ్చును; మోక్షమింక నా
            మనవికి నెన్నడో? సుజనమాన్యుడ! పెమ్మయసింగధీమణీ!

            న భోగ హార్యా నచ బంధు హార్యా
            న భాతృహార్యా నచ రాజహార్యా
            స్వదేశ మిత్రం పరదేశ బంధు:
            విద్యా సుధా౦ ఏ పురుషా: పిబంతి.
            అనుభంచినా తరగనిది, బంధువులు, సోదరులు, రాజులు అపహరించలేనిదీ, స్వదేశమున మిత్రుని వంటిది, పరదేశమున బంధువు వంటిది యగు విద్యామృతమును పానము జేయువారు ధన్యులు గదా!

            "నీపంచంబడియుండగాఁగలిగినన్ భిక్షాన్నమేచాలు, ని/క్షేపంబబ్బిన రాజకీటముల నే సేవింపఁగా నోప,నా/
            శాపాశంబులఁ జుట్టిత్రిప్పకుము సంసారార్ధమై, బంటుగా/
            జేపట్టందగుఁబట్టి మానదగదో శ్రీకాళహస్తీశ్వరా!

            కాళహస్తీశ్వర శతకం. ధూర్జటి మహాకవి.

            భావము:స్వామీ! నన్ను నీపంచన పడియుండనిమ్ము,భిక్షాన్నమబ్బినను అగియేనాకు చాలును.
            నిధి నిక్షేపములొసంగినను రాచపురుగులను సేవింపను.ఆశాపాశముతో నన్నుబంధించి నన్ీసంసారముకొఱకై త్రిప్పవలదు.నీసేవకునిగా గైకొనుము నన్నెచ్టిపరిస్థితులలోను దూరముగావింపకు.
            విశేషములు:
            పంచ అనునది పల్లెలలో వసారాగా చెప్పబడు చిన్నఅరుగు.
            శినసన్నిలోనున్నపంచయైనచాలునట.భిక్షాన్నమైనను అభ్యంతరములేదట.(శివుడునిత్యభైక్షికుడు అతనికడదొరుకునది భిక్షాన్నమేకదా! "లోకంలోవాడుక మీయిట్లో పచ్చడి మెతుకులైనా నాకుపరమాన్నమే"-ననివాడుక,అట్లే యిదియు.
            నిధినిక్షేపములనిచ్చిననురాజకీటములసేవింపనొల్లడట! ఇటప్రభువులు కవికి కీటక సమానులుగా దోచుచున్నారు.బహుశఃఇది రాయలయనంతరపు మాటయైయుండవచ్చును

            సంసారభారమునుజూపి ఆశాపాశములతో ననుబంధించి పరిభ్రమింపజేయకుము.నీబంటుగా సేకొన్నచాలును చేపట్టి యెన్నటికి విడువబోకుము.నాకంతకుమించి వలదనుచున్నాడు.
            లోకమున నాశనుజయించినవాడు.లేడు.నిజముగా నదిపాశమువంటిదే"ఆశాపాశముదాగడున్నిడుపు లేదంతంబు రాజేంద్ర!" యన్నవామనోక్తులు సర్వధాస్మరణీయములు.ఆశను జయించినవాడే ఆధ్యాత్మిక సింహాసనమున నధివశిచుటకు యోగ్యుడు.ఆయోగ్యనుప్రసాదింప గోరుట ధూర్జటి యాధ్యాత్మిక జ్ఙానపరిపక్వతకు నిదర్శనము.
            (శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి సౌజన్యముతో)

            పరహితము సేయు నెవ్వడు
            పరహితుండగును భూత పంచక మునకున్
            పరహితమే పరమ ధర్మము


            పరహితునకు నెదురు లేదు సర్వేందుముఖీ!

            మ్రింగెడి వాడు విభుండు
            మ్రింగెడిది గరళమని మేలని ప్రజకున్
            మ్రింగుమనె సర్వమంగళ
            మంగళసూత్రము నెంత మదినమ్మినదో (భాగవతము)

            పాల సముద్రము ను మధించే సమయములో భయంకరమైన విషము పుట్టింది.అది కాసేపట్లో లోకాలన్నిటినీ కబళించివేస్తుంది అని .అందరూ భయపడిపోయి కాపాడమని
            శంకరుడిని వేడుకున్నారు. ఆయన పార్వతి వైపు చూశాడట మ్రింగ మంటావా?అని అప్పుడు పోతనగారు చెప్పిన పద్య మిది.పరోపకారము చేయడానికి అమ్మవారే నాంది పలికింది.


            --((***))--
            

            --------ఇది గూఢచిత్రం.-----
            లచ్చి శంకరుండు లలిమీర గలిసిన
            ఇదేమిటి లచ్చి శంకరుండు లలిమీర గలిసిన -
            ఇదేట్లా సాధ్యం.
            ముందు ఈ పద్యం చూడండి.

            లక్ష్మి శివుని తోడ లలిమీరగూడిన
            భువనకారకుండు పుట్టవలయు
            లచ్చి శంకరుండు లలిమీర గలసిన
            విష్ణుదేవుడుద్భవింప వలయు
            ఇది పైకి అశ్లీలగా, భ్రాంతి కలిగించి, మెదడుకు పదును పెడుతున్నది. నిదానంగా
            ఆలోచిస్తే విషయం అర్థమౌతుంది. లక్ష్మి కి పర్యాయపదాలు చూస్తే - కమల, లచ్చి,
            రమా, ఇందిర .... ఉన్నాయి. .అలాగే శంకరునికి పర్యాయపదాలు - భవుడు,

            ఈశ్వర,ఈశ,....

            పై పద్యంలో మొదటి రెండు పాదాలు తీసుకుంటే

            లక్ష్మి శివుని తోడ లలిమీరగూడిన
            భువనకారకుండు పుట్టవలయు
            లక్ష్మి పర్యాయపదం కమల,
            శంకర పర్యాయపదం భవుడు,
            లక్ష్మి కి శంకరుడు కలిసిన భువనకారకుడు పుట్టాలికదా
            పర్యాయపదాలను తీసుకుంటే
            కమల(లక్ష్మి) - భవుడు(శంకరుడు) ఈ రెండిటిని కలిపిన కమలభవుడు
            అంటే భువనకారకుడు(బ్రహ్మ)కదా!
            అలాదే చివరి రెండు పాదములు తీసుకొన్న
            లచ్చి శంకరుండు లలిమీర గలసిన
            విష్ణుదేవుడుద్భవింప వలయు
            లక్ష్మి ని శంకరుడు కలిసిన విష్ణువు పుట్టాలి
            పర్యాయపదాలను తీసుకుంటే
            రమా(లక్ష్మి) - ఈశ(శంకరుడు) - రమేశ అంటే విష్ణువేకదా!
            మరి ఇందులో అశ్లీలము లేదుకదా!
            (శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి వివరణ)
            -----------------------------------
            ------------ఇది మరొక గూఢచిత్రము------------------
            ఈ పద్యం చూడండి.

            ఆననాధరగళ మూర్తు లతివ కజుఁడు
            చంద్రకురువిందశంఖ చంచలలఁజేసి,
            చెలఁగి, తచ్చిహ్న కాఠిన్య సితచలతలు
            సొరిదిఁ కచకుచహాసదృష్టులుగఁ జేసె
            (చాటుపద్యమణిమంజరి-1భా. పుట.108)
            ఈ పద్యం తెనాలి రామకృష్ణునిదిగా ప్రసిద్ధమయినది.

            పద్యంలోని క్రిందిపదాల వరుస చూడండి.
            ఆనన-చంద్ర-చిహ్న - కచ
            అధర- కురువింద- కాఠన్య- కుచ
            గళ- శంఖ- సిత- హాస
            మూర్తి-చంచల- చలత-దృష్టులు
            ఈ వరుసక్రమంలో పదాలను గుర్తుంచుకొని వివరణలో గమనించండి.

            బ్రహ్మదేవుడు వనితయొక్క
            ముఖాన్ని(ఆననమును) చంద్రునితోను,
            పెదవిని(అధరమును) పద్మరాగ(కురువింద)మణులతోను,
            కంఠము(గళము)ను శంఖముతోను,
            ఆకారమును(మూర్తిని) మెరుపు(చంచల)తోను,
            క్రమంగా ఉంపమింప సృష్టించినాడు.
            కానీ,
            క్రమంగా వాటిలోని దోషాలను తర్వాత గమనించి, మరల విజృంభించి(చెలగి)
            ముఖము చంద్రునితో చేశాడుకదా చంద్రునిలోని మచ్చ(నలుపు)ను
            తొలగించటానికి ఆమె వెంట్రుకల(కచ)తోను,
            పద్మరాగంలోని కఠినత్వాన్ని స్తనాలలోను,
            శంఖంలోని తెల్లదనాన్ని(సిత) ఆమె నవ్వు(హాసం)లోను,
            మెరుపులోని చంచలత్వాన్ని ఆమె చూపులలోను,
            క్రమంగా రూపొందిచి తప్పు చేసినాడనే
            అపవాదు నుండి తప్పించుకున్నాడు బ్రహ్మ.
            (శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి వివరణ)
            -----------------శుభసాయంత్రం ----------------------------
            
            --(())--