1, డిసెంబర్ 2019, ఆదివారం

01-12-2019

ప్రాంజలి ప్రభ
ఆధ్యాత్మికానందారోగ్య పత్రిక
దర్శక రచయిత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

ప్రాంజలి ప్రభ - నేటి కవిత
*క్షణం క్షణం వీక్షనం
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ


వీక్షనం లో దొరుకుతుంది నిర్మలం
నిర్మలత్వంలో తెలియదు కాలం
కాలంలో కరిగిపోయిన వయసుతిరిగి రాదు

నిమ్మిత్తం లేకుండా వస్తుంది ఉన్మత్తం

ఉన్మత్తం లో అవుతుంది జీవమ్ నిర్జీవం
నిర్జీవం లో అవుతారు నిస్తేజం
నిస్తేజం లో ఉన్నవారు పొందలేరు శాంతి

శాంతి పొందుటకు వదలాలి ఆక్రోశం
 

ఆక్రోశం వదిలితే ఉంటుంది ప్రశాంతం
దేహంలో చేరే వికృతుల ప్రభావం
పనిచేయకుండా అడ్డుపడేదే మనోధైర్యం

గమ్య అగమ్యాల తెలిపుతున్న గోళం
 

గోళం బ్రమణాలు చూపు మన శరీరం
శరీరం లో రక్త ప్రసరణ మారుతూ
నిత్యమూ శ్వాసతో ఉత్తేజం పొందే
జీవనమే మనస్సుకు శాంతమయం


మనస్సులోని బాధ దేని కోసమో
కల్లలోని నీరు ఎవరి కోసమో
గుండెలోని మంటకు కారకు లెవరో
అది ఒంటరితనం లో ఉన్న మౌనం


మనోధైర్యం ఉంటె అంతా సుఖమయం
సుఖమయం లో అంతా శుభప్రదం


--((*))--


--(())--

మహిళ ఉద్యోగులకు,మహిళ విద్యార్థులకు,మహిళలకు కొన్ని ముఖ్యమైన విషయాలు.

👉మీరు ఉద్యోగానికి వెళ్లేటప్పుడు పబ్లిక్ తిరిగే దారిలోనే వెళ్ళండి ఒంటరిగా కొత్త దారిలో వెళ్ళకండి.

👉కాలేజ్ విద్యార్థులు నైట్ లో బర్త్ డే పార్టీ లకు మరియు వివిధ పార్టీలకు మీ స్నేహితులు పిలిచిన వెళ్ళకండి.ఒక్క వెళ్ల కచ్చితంగా వెళ్ళాలి అని వుంటే వెంటా పేరెంట్స్ లో ఒక్కరిని తప్పకుండా తోడు తీసుక వెళ్ళండి.

👉మహిళలు ఒక్క వేళా ఏదైనా ఫణి మీద వెళ్ళి రావడం లెట్ ఐ ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే కుటుంబసభ్యులు అందుబాటులో వుంటే వారికి రమ్మని చెప్పండి.ఎవరైనా వచ్చిన తరువాతే బయలుదేరండి.

👉మీరు వెకిల్స్ పార్క్ చేసేటప్పుడు సీసీ కెమెరాలు ఉన్నదగ్గరే పార్క్ చెయ్యండి.

👉మీ కు ఎవరిమిదనైన సందేహం ప్రమాదకరం అనిపిస్తే వేటనే 100 ఫోన్ చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.వారు మీకు సహాయపడుతారు.

👉 మహిళలు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒంట్టిమీద నగలు ఎక్కువగా వేసుకోకండి.

👉 మహిళలు ముక్యంగా బయటకు వెళ్ళేటప్పుడు అసభ్యకరంగా ఉన్న బట్టలను వేసుకోకండి.ఫుల్ డ్రెస్ వేసుకోకండి.

👉ముఖానికి కచ్చితంగా స్క్రాప్ ధరించండి.

👉మీరు దూరంగా కాని దగ్గరలో కాని షేర్ ఆటోలో ప్రయనిచేటప్పుడు ఆటోలో ప్రజలు వుంటే నే ఆటోలో వెళ్ళండి ఒంటరిగా షేర్ ఆటోలో వెళ్ళకండి.

👉మీరు ప్రయనిచేటప్పుడు మీ వెంట ఏదైనా స్ప్రే బట్టిల్ తప్పక ఉంచుకోండి.

👉 మీ వెకిల్స్ ఏదైనా ప్రబ్లేమ్స్ వస్తే బస్ లో వెళ్ళండి వెహికిల్ అక్కడే వదిలెయ్యండి.

👉 మీరు ఎవరికోసమైన అగాలిసి వస్తే పబ్లిక్ ఎక్కువగా వున్న ప్లేస్ లోనే ఉండండి,ఒంటరిగా వుండకండి.

👉ముక్యంగా ప్రమాదంగా ఉంది అనిపిస్తే మీరు ఖచ్చితంగా 100 సమాచారాన్ని అందించండి వారు మీకు సేఫ్ జోన్ లో తీసుకవెళ్తారు.

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి స్కంద షష్ఠి అనగా ఏమి?

ఆరోజు ఏం చేస్తారు ? ఏం చేస్తే శుభం కలుగుతుంది?

--(())--



నేటి హస్యం 

"శ్రీమతిగారు! నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు, నా జీవితంలో ఒక భాగమైనందుకు నీకు కృతజ్ఞతలు. ఇప్పుడు నేనీస్థితిలో ఉన్నానంటే దానికి నువ్వే కారణం. నువ్వు నా దేవతవి. 
నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థాంక్స్. 
నువ్వు చాలా మంచిదానివి నువ్వు నా దేవతవి" 

"శ్రీవారూ! మీ SMS ఇప్పుడే చదివాను. ఆలస్యానికి మన్నించగలరు. తాగడం అయిందా, 
ఇంక SMSలు ఆపి ఇంటికి వేంటనేి దయచేయండి. 
ఇవాళ మిమ్మల్ని నేనేమీ అనదల్చుకోలేదు, 
మీకిష్టమైన గోళీకాయంత బంగాళాదుంప ఫళంగా కరకరలాడే వేపుడు, చిన్ని వంకాయ కాయ ఫళంగా వుల్లికారం కూరా, పనసపొట్టు మసాలా కూర, మామిడికాయ పచ్చడి, కందిపప్పు పచ్చడి, సాంబార్, బెంగాల్ టైప్ తీయని గడ్డ పెరుగు మీ కోసం రెడీ.. 

అన్నట్లు చెప్పడం మరిచాను! మీ క్రెడిట్ కార్డ్ మీద నెక్లెస్ కొనుక్కున్నాను"

--((*))--

🕉🌞🌎🌙🌟🚩

*_Swami Vivekananda's wisdom for daily inspiration - _*

*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - ._*

*Everything can be sacrificed for truth, but truth cannot be sacrificed for anything.*

*సత్యం కోసం అన్నింటిని త్యాగం చేయవచ్చు. కానీ సత్యాన్ని దేని కోసమూ త్యజించకూడదు.*

🕉🌞🌎🌙🌟🚩

2/12/2019 సోమవారం సుబ్రహ్మణ్యస్వామి షష్ఠి💐👍

మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు.

శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామియే కుమారస్వామి,కార్తీకేయుడు,స్కందుడు,షణ్ముఖుడు, మురుగన్,గుహూడు అనే మొదలగు పేర్లుతో పిలవబడుతున్నాడు. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి ,సుబ్బరాయుడు షష్టి,తమిళులు దీనిని స్కంద షష్టి అని అంటారు.దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజునే "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా వ్యవహరిస్తారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు,కధా క్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది. పూర్వం మూడులోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న"తారకా సురుడు" అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు.

అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేసాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కావునా చంపడం మన తరంకాదు కాని ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది అనిచెప్పాడు. కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు. దేవతలు శివున్నిఒప్పించి పార్వతితో పెళ్ళి జరిపించారు.ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందగా ఉన్నసమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. ఆరుముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు. ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో పిలువబడ్డాడు.

కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి,దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంతట ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"గా పిలుచుకుంటున్నాము, "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు.

ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు,పువ్వులు,వెండి పడగలు,వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజ దోషం,కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడిలో మొసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం లో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విదానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది. మార్గశిర మాసమంటే చలి ఎక్కువగా ఉండే మాసం చలి బాధను తట్టుకోలేని,ఆర్ధిక స్తోమతలేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కోలది సాటి వారికి సహయ పడమని,దానం చేయమని సందేశం ఇస్తుంది. ఈ దానాలు చేసిన వారికి గ్రహ భాదలు తోలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావం. పురాణాలు తెలిపినట్టుగా "పరోప కారం మిధం శరీరం" అని భావించి పేదవారికి స్వేటర్లు , కంబళ్ళు, దుప్పట్లు మొదలగు చలి నుండి రక్షించే దుస్తులను,తిను బండారాలను దానం చేయాలని తెలుపుతున్నాయి.

ఈ స్కంద షష్ఠి పర్వదినాన అత్యంత శక్తివంతమైన " శ్రీ స్కంద షష్ఠి కవచం " పారాయణ చేయడం విశేష ఫలప్రదం.

సర్వేజాన:సుఖినోభవంతు

ఓం శం శరవణభవ💐👍


60+Commonly Used English Abbreviations You Should Know 2
-
‘ఆధార్’... తప్పుగా ఇస్తే... జరిమానా...
💳💳💳💳💳💳💳💳💳

హైదరాబాద్ : ఏ సందర్భంలోనైనా సరే... మన ‘ఆధార్’ నంబర్ తప్పుగా ఇస్తే... రూ. 10 వేల వరకూ జరిమానాను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మేరకు... ఆదాయపు పన్ను చట్టం 1961 కు సవరణలు చేశారు. ఈ క్రమంలో... ఆధార్ నెంబర్ తప్పు చెబితే రూ. 10 వేల మేరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. సాధారణంగా పాన్ నెంబర్ తప్పుగా చెబితే లేదంటే, ఒకటి కన్నా ఎక్కువ పాన్ నెంబర్లు కలిగి ఉంటే రూ.10 వేల జరిమానా ఖచ్చితంగా ఉంటుంది.

ఐటీ రిటర్నులు దాఖలు చేసే సమయంలో ఆధార్ నెంబర్ తప్పుగా ఇవ్వడం మాత్రమే కాకుండా పాన్ కచ్చితంగా ఇవ్వాల్సిన స్థానాలలో ఆధార్ నెంబర్ ఇచ్చినప్పుడు కూడా ఈ పెనాల్టీ రూల్స్ వర్తిస్తాయి. అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, డీమ్యాట్ అకౌంట్ తెరవడం, మ్యూచువల్ ఫండ్స్‌ లో ఇన్వెస్టెమెంట్, రూ. 50 వేలకు పైన లావాదేవీలకు పాన్ బదులు ఆధార్ ఇచ్చినప్పుడు, ఆ ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే అప్పుడు రూ.10 వేల పెనాల్టీ చెలించాల్సి వస్తుంది.


గతంలో జరిమానా కేవలం పాన్ నెంబర్‌‌కు మాత్రమే పరిమితమయ్యేది. అయితే ఆధార్, పాన్ ఇంటర్‌ ఛేంజబిలిటీ అమలులోకి రావడంతో ఇప్పుడు ఈ రూ. 10 వేల ఫైన్ ఆధార్ కార్డుకు కూడా వర్తిస్తుంది.
మీరు ఎన్ని సార్లు ఆధార్ నెంబర్ తప్పుగా ఇస్తారో... అన్ని సార్లూ మీకు ఫైన్ పడుతుంది. అంటే ఆధార్ నెంబర్ రెండు ఫామ్స్‌లో తప్పుగా వేస్తే, అప్పుడు రూ. 20 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే యూఐడీఏఐ కాకుండా ఈ జరిమానాను ఇన్‌ కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వేస్తుంది


--(())--


నేటి కవిత : సాగిపో
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

అర్దార్ది అభిష్టాలను తీర్చి,
సంతోషం పంచి
ఆర్తుల ఆలాపననుండి రక్షించి

ముందుకు సాగిపో 

వయసును బట్టిశక్తిని పెంచుకొని
శక్తి హీనులకు శక్తినిపెంచుకొనే
మార్గాలు చూపి,ఆదుకొని సాగిపో

శరణు శరణు అన్న 
వానిలోని తప్పులు ఎంచకు
పశ్చాతాపముతో ఉన్నవానికి

సహకరించి సాగిపో

అర్ధాని అపేక్షించి ఆరాదించే 
నమ్మి ఉన్నవారకు దుర్మార్గులైన అర్ధాన్ని
అర్ధిస్తే ఆదుకొని సాగిపో

ధర్మాన్ని వదలక
నిత్యమూ భరించే భాదలకు
ఓర్పుతోజీవించే వారికి

ఆర్ధికసహాయం చేసి సాగిపో

మాయ, మోహ, పాశాలకు చిక్కి
ఉన్న మానవులకు
భగవత్ గీత జ్ఞాన మార్గాన్ని భోధించి

ముందుకు సాగిపో

--(())--



సేకరణ ప్రాంజలి ప్రభ 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన

పాఠశాల విద్యార్థుల ప్రవేశాల, నిష్క్రమణ ల ( అడ్మిషన్ ) రిజిష్టర్  - నిర్వహణ, నియమాలు, పద్దతులు


🌅 1. నమోదు:

⏩ 1) ప్రతి విద్యార్థికి , ఈ అడ్మిషన్ రిజిష్టర్ రెండు పేజీలు గా ఉంటుంది. ప్రతి మొదటి పేజీ ( ఎడమ వైపున ) పైన స్కూల్ స్టాంప్ ( రౌండ్ స్టాంప్ కాదు ) వేయాలి, రెండవ పేజీ ( కుడి వైపు ) పైన అకాడమిక్ సంవత్సరం రాయాలి.

⏩ 2 ) నమోదు చేసే సమయం లో విద్యార్థి పుట్టిన తేది ని అంకెలలో మరియు అక్షరాలలో తప్పనిసరిగా రాయాలి. తగిన ఆధారాలు అడ్మిషన్ ఫారం తో జత చేయాలి.

⏩ 3) అడ్మిషన్ తీసుకునే సమయంలో తగిన ఆధారిత సర్టిఫికెట్ లను అడ్మిషన్ ఫారం తో జత చేయాలి. ఉదా: ఆధార్ కార్డు జీరాక్స్, బోనాఫైడ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు జీరాక్స్, రికార్డ్ షీట్ ( 1 నుండి 5 తరగతులు ) ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్ ( 6 వ తరగతి మరియు ఆ పైన ) విద్యార్థి లేదా తల్లి / తండ్రి ది కుల ధృవీకరణ పత్రం,

⏩ 4) అడ్మిషన్ ఫారం లు భద్ర పరచడం తప్పనిసరి.  ఎందుకంటే, అడ్మిషన్ రిజిష్టర్ లో రాసే ప్రతి అంశానికి ఈ ఫారమే ఆధారం ( ప్రుఫ్ ) . భవిష్యత్ లో వచ్చే అన్ని సమస్యలకూ ఇది సమాధానంగా ( ప్రూఫ్ ) ఉంటుంది.

⏩ 5 ) నవీన కాలంలో వచ్చిన మార్పులు ( ఆన్ లైన్ విధానం , చైల్డ్ ఇన్ ఫో ) ఇపుడు మార్కెట్ లో దొరికే అడ్మిషన్ ఫారం లు పనికి రావు.

⏩ 6 ) అడ్మిషన్ ఫారం ను విద్యార్థిని చెర్పించువారే  నింపాలి ఒకవేళ వారు నిరక్షరాస్యులు అయినప్పుడు మాత్రమే వేరే వారు నింపవచ్చు.

⏩ 7 ) అడ్మిషన్ ఫారం నింపిన తర్వాత అన్ని వివరాలు మరియు జత చేసిన జిరాక్సు లు సరిగా ఉన్నాయో చూసి క్లర్క్ గాని లేదా ఇంచార్జ్ గారు సంతకం చేయాలి. తర్వాత మరొకసారి అన్ని చూసి ప్రధానోపాధ్యాయులు ధృవీకరిస్తూ సంతకము చేసి స్టాంప్ వేయాలి. ప్రధానోపాధ్యాయులు సంతకం చేయడం తప్పనిసరి.

⏩ 8 ) అడ్మిషన్ రిజిష్టర్ రాయాల్సిన పని మరియు భాధ్యత పూర్తిగా ప్రధానోపాధ్యాయులు దే. అడ్మిషన్ రిజిష్టర్ లో రాసిన పిదప సంబంధిత తరగతి రిజిష్టర్ ( మొదటి పేజీ ) లో రాసే పని కూడా ప్రధానోపాధ్యాయులు వారిదే. తదుపరి పేజీలలో తరగతి ఉపాధ్యాయులు వారు రాసుకోవాలి.

⏩ 9 ) విద్యార్థిని అడ్మిషన్ రిజిష్టర్ లో నమోదు చేసిన తర్వాత HM సంతకం చేయడం తప్పనిసరి. కొన్ని రిజిష్టర్ లలో HM సంతకం చేసే వరుస ( రెండవ పేజీ మద్యలో ) లేవు. వరుస లేక పోతే కల్పించుకొని వీలైన ( అడ్మిషన్ వివరాల తర్వాత బాక్స్ లో ఉదా. టీకా ల వివరాలు బాక్స్ లో ) దగ్గర సంతకం చేయాలి. నాన్ గెజిటెడ్ అధికారులు అయితే రెడ్ బాల్ పాయింట్ పెన్ తో గెజిటెడ్ అధికారులు అయితే గ్రీన్ బాల్ పాయింట్ పెన్ తో సంతకం చేయాలి.

⏩ 10 ) ప్రాథమిక పాఠశాల లు అడ్మిషన్ తీసుకునే సమయంలో , అంగన్ వాడి కేంద్రం నుండి ఒక సర్టిఫికెట్ తీసుకోవాలి.

⏩ 11 ) ఈ రిజిష్టర్ లో స్కెచ్ పెన్ గాని జెల్ పెన్ గాని మరియు ఇంక్ పెన్ గాని వాడకూడదు. కేవలం బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే వాడాలి.

⏩ 12 ) అడ్మిషన్ రిజిష్టర్ లో అనివార్య కారణాల వల్ల ఏవైనా తప్పులు జరిగినట్లు అయితే వాటిని దిద్ద కూడదు,వైట్ నర్ వాడ కూడదు, రౌండ్ అప్ చేసి పైన రాసి HM సంతకం చేయాలి.

⏩ 13 ) కొన్ని కారణాల వల్ల పాత రికార్డ్ మార్చ వలసివస్తే తగిన ఆధారాలు అడ్మిషన్ రిజిష్టర్ కు జత చేయాలి, కారణం ఆ లైన్ లో చివరన రిమార్క్ లో రాయాలి. మార్చిన చోట HM సంతకం చేయడం తప్పనిసరి. ఈ సమస్య ప్రాథమిక పాఠశాల లో తరచూ ఎదురు ఔతుంది. తల్లి తండ్రి నుండి డిక్లరేషన్ తీసుకోవడం తప్పనిసరి. ఈ డిక్లరేషన్ ను రిజిష్టర్ కు అంటించాలి.

⏩ 14 ) ఒకటో తరగతి లో చేర్చుకునే సమయంలో పిల్లలకు పుట్టు మచ్చలు రాకపోవచ్చు, అలాంటప్పుడు పుట్టు మచ్చలు ఎపుడు వస్తే ఎపుడు నమోదు చేయాలి. పని సులభం కొరకు T.C ఇచ్చే సమయంలో తప్పక నమోదు చేయాలి. పుట్టు మచ్చలు నమోదు చేయునప్పుడు బహిరంగ కనపడే భాగాలు అనగా ముఖం,చేతులు,కాళ్ళు పై ఉండే వాటిని మాత్రమే రాయాలి. ఒక వేళ అక్కడ కూడా పుట్టు మచ్చలు లేకపోతే బర్ర లు గాని ఇంకేమైనా గుర్తులు గాని రాయాలి. ఖచ్చితంగా రెండింటిని రాయాలి.

⏩ 15 ) R.S / T.C ఇచ్చినపుడు అడ్మిషన్ నంబర్ పై గుండ్రం గా రాయడం పరిపాటి. ఇలా రాయడం తప్పని సరి కాదు. కానీ, ఇలా రాస్తే ఆ విద్యార్థి కి R.S / T.C ఇచ్చామా లేదా గుర్తు పట్టడం సులభం గా ఉంటుంది.
⏩ 16 ) పోయిన సంవత్సరం వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం , విద్యార్థి యొక్క ఆధార్ కార్డు నెంబర్ అడ్మిష్ రిజిష్టర్ లో తప్పకుండా రాయాలి. కానీ, దీని కొరకు ప్రత్యేకంగా కాలం ( బాక్స్ ) లేదు. అందువలన పుట్టు మచ్చలు రాసే వద్ద రాయవచ్చు.


🌅 2. నిష్క్రమణ:

⏩ 17 ) నిష్క్రమణ ( విత్ డ్రా )  లకు ప్రత్యేకంగా ఒక రిజిష్టర్ పెట్టడం చాలా అవసరం. దీని వల్ల ఒక సంవత్సరం లో ఎంత మంది బడి నుంచి వెళ్లిపోయారు ? , ఎక్కడికి వెళ్లారు? ఎందుకు వెళ్లారు ? అనే వివరాలు తెలుస్తాయి. పైగా ఆన్ లైన్ లో ( చైల్డ్ ఇన్ ఫో ) లో వివరాలు ఎడిట్ చేయవలసి వచ్చినప్పుడు ఈ రిజిష్టర్ లేకుండా ఎడిట్ చేయలేము.

⏩ 18 ) విద్యార్థి బడి ని వదిలి వెళ్లి పోయినప్పుడు, తనకు రెండు బొనాఫైడ్ లు , R.S లేదా T.C , ప్రోగ్రెస్ రిపోర్ట్, హెల్త్ కార్డు ఇవ్వాలి. ఇలా ఇచ్చేటప్పుడు ప్రధానోపాధ్యాయులు గారు, అడ్మిషన్ రిజిష్టర్ లో విద్యార్థి వదిలి వెళ్లి న తేదీ మరియు తరగతి నమోదు చేసి ఉన్నదో సరి చూసుకుని చివరి వరసలో సంతకం చేయాలి. అనగా అడ్మిషన్ రిజిష్టర్ లో H M సంతకం చేసిన తర్వాత మాత్రమే పై సర్టిఫికెట్ లు విద్యార్థికి అందజేయాలి. లేనిచో విద్యార్థి కి తీరని నష్టం వాటిల్లుతుంది.

⏩ 19) గతం లో H M లు, అడ్మిషన్ రిజిష్టర్ లో H M సంతకం చేసిన తర్వాత మాత్రమే పై సర్టిఫికెట్ లు విద్యార్థికి అందజేయాలి  ఇలా చేయక పోవడం వల్ల ఇప్పుడు విద్యార్థి కి బోనాఫైద్ ఇవ్వడానికి అటెండెన్స్ రిజిష్టర్ లు , మార్కు ల రిజిష్టర్ లు వెతక డానికి రెండు రోజులు సమయం పడుతుంది ఒక వేళ వివరాలు దొరకక పోతే బొనాఫైద్ ఇవ్వలేని పరిస్తితి తరచూ ఎదురౌతుంది.

⏩ 20 ) అడ్మిషన్ రిజిష్టర్ లో ఎక్కడైనా చిరిగి పోతే అక్షరాలు కన పడే విధంగా సెల్లో టేప్ తో అతికించారు. అట్ట లాంటివి అక్షరాలు లేని చోట చిరిగితే గం తో ఎప్పటికప్పుడు అతికిస్తు ఉండాలి.

⏩ 21 ) విద్యార్థి కి ఇచ్చే ప్రతి T.C మీదా నంబర్ ఉంటుంది. ఎందుకంటే T.C బుక్ D.E.O ఆఫీసు నుండి వస్తాయి. సరిగ్గా ఇలాగే ప్రాథమిక పాఠశాలలో రికార్డ్ షీట్ లు మార్కెట్ లో దొరుకుతాయి. వీటిని విద్యార్థులకు ఇష్యూ చేసేటప్పుడు వీటికి కూడా నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఉదా. వరుస నెంబర్/సం, 01/2018, 02/2018....ఒక విద్యార్థి కి రెండు రాసి ఒకటి విద్యార్థికి మరొకటి ఆఫీస్ లో భద్ర పరచాలి.

⏩ 22 ) ఒక వేళ విద్యార్థి తనకు ఇచ్చిన రికార్డ్ షీట్ పోగుట్టుకున్నట్లు అయితే మరొకటి ఇష్యూ చేసేటప్పుడు విద్యార్థి లేదా తండ్రి దగ్గర నుండి డిక్లరేషన్ తీసుకోవాలి. మరొకటి ఇష్యూ చేసేటప్పుడు అదే నంబర్ రాసి కుడి వైపు పై భాగాన రెడ్ పెన్ తో డూప్లికేట్ అని రాయాలి

⏩ 23 ) ప్రాథమిక, ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాల లోనూ మరియు అన్ని రకాల విద్యా సంస్థల లో నూ పై సర్టిఫికెట్ లను జారీ చేసిన సమయంలో , పై సర్టిఫికెట్ లు ఆన్ని విద్యార్థి కి ముట్టినట్టుగా విద్యార్థుల నుండి సర్టిఫికెట్ ల పేర్లతో సహా సంతకం తీసుకోవడం తప్పనిసరి.


శ్రీ సీతామరామాంజనేయ చరితం (2)
శ్రీరాముడు-యోగరహస్యము -అరణ్యకాండ.6
పంచవటి
పంచవటి ప్రస్తుతము నాసిక్ ప్రాంతమందు ఉన్నట్లుగా కొందరి నమ్మకము. ఇక్కడ ఐదు వటవృక్షాలు ఉండుట వలన ఇది పంచవటిగా ప్రసిద్ధి చెందినది. అయితే కొంత శోధన చేసిన తర్వాత తెలియునది ఏమనగా ...  శ్రీరాముడు దండకారణ్యములో ఉన్న సమయములో సీతాపహరణ తర్వాత కలత చెంది, దుఃఖించుతూ లక్ష్మణునితో కలసి ఘోర అరణ్యములు తిరుగుతూ కర్తవ్యము పాలుపోక ఉన్న స్థితిలో అగస్త్య మహాముని శ్రీరాముని సమీపించి మోహము వీడమని చెప్పి విరజా దీక్ష (పాశుపత. శివ దీక్ష) ఇచ్చెను. ఆ మహర్షి ఆనతిన శ్రీరాముడు రుద్రాక్షలు, త్రిపుండరములు ధరించి గోదావరి తీరమున రామగిరి యందు శివ లింగము ప్రతిష్టించి శివానుగ్రహము కొరకు చాతుర్మాస్య దీక్షలో తపస్సు చేసెను. అందుకు శివుడు సంతోషించి పార్వతి పరివార సమేతంగా దర్శనము ఇచ్చి గొప్ప ధనస్సును, అమ్ములపొదిని, పాశుపతాస్త్రమును అనుగ్రహించి ఆశీర్వదించెను. సంశయాత్మ కలిగిన శ్రీరాముడు పరిపరి ప్రశ్నలు వేయగా శివుడు అతని మోహము పోగొట్టుటకు సమాధానాలు చెప్పెను. ఈ శ్రీరామ పరమేశ్వర సంవాదమే "శివ గీత". ఇది వ్యాస మహర్షి చేత వ్రాయబడిన పద్మ పురాణాంతర్గత ఉత్తర ఖండములోగల ఈ శివ గీత లో 779   శ్లోకాలు ఉన్నవి.   శ్రీరాముడు శివుని కోసము తపస్సు చేసిన రామగిరి ప్రదేశము భద్రాచలమునకు 55  కి.మీ.దూరంలో కూనవరం దగ్గర రామగిరి కొండలలో గోదావరి నదీతీరంలో శివాలయము ప్రతిష్టించబడినది. ఇది భైరవ క్షేత్రంగా ఆరాధించబడుతున్నది.  భద్రాచలం దగ్గర ఉన్నటువంటి పర్ణశాలయే పంచవటిగా మన తెలుగు ప్రజల ప్రగాఢ విశ్వాసము. సీతాపహరణము తర్వాత శోకతప్తుడైన రామునికి ఈ ప్రదేశము నందే పరమ శివును గురించి చాతుర్మాస్య దీక్షను తీసుకొనెను. అక్కడ నుంచి సీతాన్వేషణతో జటాయు మరణించిన ప్రదేశమునకు వెళ్లెను అదియే ఆంధ్ర ప్రదేశ్ అనంతపూర్ జిల్లాలోని లేపాక్షి (లే పక్షి అదియే కాలాంతరమున లేపాక్షిగా నామాంతరం చెందింది). అక్కడ నుంచి ఋష్యమూక పర్వతము నకు వెళ్లెను. అది ప్రస్తుతము కర్ణాటక లోని హంపి దగ్గర ఉన్నది. ఆయా ప్రదేశములన్నియు లేఖకుడు (దుర్గా ప్రసాద్ చింతలపాటి) దర్శించియున్నాడు. ఇక్కడ ఇంకొక విషయము గమనించ వలసినది. సీతను అశోక వనములో పెట్టునప్పుడు, రావణుడు సీతకు పండ్రెడు మాసముల గడువు ఇచ్చినాడు (శృణు మైథిలి, మాద్వాక్యం మాసాన్ ద్వాదశ భామిని). అక్కడ నుంచి గమనించితే శ్రీరాముడు నాలుగు నెలలు పరమ శివుడుని గురించి తపస్సు చేయుచు చాతుర్మాస్య దీక్షలో యున్నాడు. తరువాత వర్ష ఋతువు కారణంగా (మూడు నెలలు) సీతాన్వేషణకై  సుగ్రీవాదులు  ప్రయత్నము చేయలేదు.  తరువాత సీతాన్వేషణకై ఒక నెల గడువు వానరులకు సుగ్రీవుడిచ్చెను. దక్షిణమునకు ఏగిన అంగదాదులు మరియొక మాసము అదనంగా తీసుకొనిరి. హనుమ సీతామాత దర్శనము చేసుకున్నప్పుడు, రావణుడు ఇచ్చిన గడువు రెండు నెలలే ఉంది అనును. ఇవి మొత్తము 11 నెలలు అయినది. కావున భద్రాచలం వద్ద ఉన్న పంచవటీయే నిజమైన పంచవటి అని మదీయ ప్రగాఢ విశ్వాసము. (శబరి నదీరూపమున ప్రవహించెనని కొందరి అభిప్రాయము. కానీ రామాయణకారుడు ఇట్టి విషయము చెప్పలేదు గావున గమనించవలసినది) ఏదైనా ఎవరి విశ్వాశములు వారివి.
శ్రీరామ జయరామ జయజయ రామ



ఆమె మరణానికి కారణం... (లోకం)
ఆ నలుగురే కాదు...!

# 26 ఏళ్ల ఓ ఆడ కూతురు చీకటి పడుతువుతున్న వేళ తన బైక్ ను పార్క్ చేసేందుకు వస్తే నిరాకరించిన టోల్ ప్లాజా సిబ్బంది...
# లారీ బే లో కాకుండా టోల్ ప్లాజా సమీపంలో గంటల తరబడి లారీ ఆపుకుని, మధ్యం సేవిస్తున్నా పట్టించుకోని హైవే పెట్రోలింగ్ సిబ్బంది...
# రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎంతో బిజిగా ఉండే తొండుపల్లి(శంషాబాద్) హైవేపై ఓ యువతిని లాక్కెళుతున్న అటు వైపు దృష్టి పెట్టని వాహనదారులు, స్థానికులు...
# బాటిల్ లో పెట్రోల్ పొయ్యొద్దని ఉత్తర్వులున్నా అర్ధరాత్రి అనుమాన పడకుండా బాటిల్ లోనే పెట్రోల్ పోసిన బంకు సిబ్బంది...
# తమ బిడ్డ కనిపించటం లేదని నిస్సహాయ స్థితిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రియాంక కుటుంబ సభ్యులకు, మా పరిధి కాదంటే మాది కాదంటు తిప్పి పంపిన రెండు పోలిస్ స్టేషన్ల సిబ్బంది...
# పరాయి స్త్రీ మన తల్లి, చెల్లితో సమానం అనే బావన కల్పించకుండా ఆ నలుగురు మృగాలను పెంచి పోషించిన వారి కుటుంబసభ్యులు...
# సంస్కారం, విలువలు, మంచి, చెడు అనే అంశాల జోలికి వెళ్లకుండా కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా చదువు మాత్రమే నేర్పిస్తున్న విద్యా సంస్థలు...
# మన రాజ్యాంగం అమలులోకి వచ్చాక కొన్ని వేల సవరణలు చేసినప్పటికి కామాందులను, కర్కోటకులను నడి రోడ్డుపై కాల్చి చంపేలా చట్టాలను మార్పుచేయలేకపోతున్న ప్రభుత్వాలు...
# ప్రియాంక రెడ్డి లాంటి ఘటనలు జరిగిన నాలుగు రోజులు సోషల్ మిడియాలో హడావిడి చేసి ఆ తర్వాత ఎవరి పనిలో వారు బిజి అయిపోయే నువ్వూ నేను అందరం...కారణమే... నిజం కాదా!
.....!


pranjali prabha songs 

బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా...ఏ బొమ్మా మిగలదు ఆ బ్రహ్మయ్యకీ...

చిత్రం: బొబ్బిలి దొర(1997)
రచన: జె. సుధాకర్
సంగీతం:కోటి
గానం: కె.జె. ఏసుదాసు

ఏమి చేయగలదు ఏ సాగరమైనా
తన మీదే అలక బూని అలలు వెళ్ళి పోతుంటే
ఏమి చేయగలదు ఏ హృదయమైనా
కంటిలో నలకుందని కలలు జారి పోతుంటే

బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా
ఏ బొమ్మా మిగలదు ఆ బ్రహ్మయ్యకీ
ఏ బొమ్మా మిగలదు ఆ బ్రహ్మయ్యకీ
జన్మనిచ్చి పెంచినా ప్రేమ ఎంత పంచినా
కడుపు కోత తప్పదు ఈ దేవుడికీ ఓ…
బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా
ఏ బొమ్మా మిగలదు ఆ బ్రహ్మయ్యకీ

ఏడడుగులు వెనక నడిచీ ఎదలో సగమైన మనిషీ
ఇరుసు లేని బండినెక్కీ ఇల్లు విడిచి వెల్లిందా
ఇంటి దీపమౌతుందనీ కంటి పాపలా చూస్తే
కన్న పేగు బంధమేమో కన్ను పొడిచి పోయిందా
కొరివి తలకు పెట్టినోడు కొడుకౌతాడింటా
కొరివి తలకు పెట్టినోడు కొడుకౌతాడింటా
కొంపకు నిప్పెట్టినోడు ఏమౌతాడంటా
ఏమౌతాడంటా
బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా
ఏ బొమ్మా మిగలదు ఆ బ్రహ్మయ్యకీ

కలి కాలపు జూదంలో కడుపు తీపి ఓడితే
వంచన తల తుంచైనా మంచి గెలవకుంటుందా
నావ తోడు లేదనీ ఏరు ఒంటరౌతుందా
పొద్దు వాలి పోయిందనీ నింగి దిగులు పడుతుందా
కణకణమను నిప్పునేమో కమ్ముకుంది నివురు
కణకణమను నిప్పునేమో కమ్ముకుంది నివురు
నిప్పులాంటి నిజం విప్పి చెప్పేది ఎవరూ
చెప్పేది ఎవరూ

బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా
ఏ బొమ్మా మిగలదు ఆ బ్రహ్మయ్యకీ
ఏ బొమ్మా మిగలదు ఆ బ్రహ్మయ్యకీ
జన్మనిచ్చి పెంచినా ప్రేమ ఎంత పంచినా
కడుపు కోత తప్పదు ఈ దేవుడికీ ఓ…
బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా
ఏ బొమ్మా మిగలదు ఆ బ్రహ్మయ్యకీ

https://www.youtube.com/watch?v=APB4Qlvxf5A


--(())--

🕉🌞🌎🌙🌟🚩

*_Swamy Vivekananda's wisdom for daily inspiration - _*


  • *_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - *

*He(God) reveals him self to the pure heart.*

*పవిత్ర జీవనం గడిపేవారు మాత్రమే పరమాత్మ దర్శనం పొందగలరు.*

*స్వామివివేకానంద-ధీరయువతకు...*
*_ఆత్మవిశ్వాసం_*

*మీ భాగ్యానికి మీరేగదా కర్తలు. మీ వ్యధలకు మీరే కారకులు. మంచి చెడులను సృష్టించుకునేది మీరే. చేతులతో కళ్లు మూసుకొని చీకటి అంటున్నది మీరే. చేతులను తీసివేసి వెలుతురును చూడండి.*


🕉🌞🌎🌙🌟🚩

*శివుడికి జలుబు చేసింది* (హాస్యం)

నిన్నటిదాకా బాగానే ఉన్నారు కదా. కనీసం మాతో మాట్లాడే టైమ్ కూడా లేదు నెల నుంచి. అంతలో ఏమైంది? అడుగు తూనే చెయ్యి పట్టుకుని చూసింది పార్వతీ దేవి. కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంది. జలుబు తో వణికి పోతున్నాడు శివుడు.😖😞😤

నెల రోజుల బట్టి మొత్తుకుంటున్నా! చెబితే విన్నారు కాదు. ఏదిబడితే అది. పండా, కాయా, రేషన్ చెక్కరా, కల్తీ తేనె....ఏమీ చూడకుండా.. అభిషేకాలు చేయించుకున్నారు. ఇప్పుడు అవస్థ పడుతున్నారు..🤨😙

పాపం భక్తులు.... ప్రేమతో పోస్తున్నారు కదా అని........ఏమీ అనలేకపోయాను.😌

"భక్తులు ప్రేమతో కాదు. TV ఛానెళ్లల్లో ఏది చెబితే అది పోస్తున్నారు. వింటుంటే నాకే భయమేస్తుంది. ఒక్కొక్క పండుకి ఒక బెనిఫిట్ ఇస్తారట గా మీరు? నవ్వుతూ అంది అమ్మవారు.

" నేనెప్పుడూ ఆ మాట చెప్పలేదు. భక్తి తో నన్ను తలుచుకుంటే చాలు. ఈ స్కీం లు నావి కావు. అప్పటికీ చాగంటి చేత, గరికపాటి చేత చెప్పిస్తున్నా ఎవ్వడూ వినిపించుకోవట్లేదు.😟😟


"కనీసం కన్నెర్ర చేయొచ్చు కదా."

'ఆ పని కూడా చేశా. కళ్ళల్లోకి పోయి ఇంకాస్త మండుతున్నాయి.' ఇంకా వణుకుతూనే అన్నాడు శివుడు.

"సర్లేండి. ఈ కషాయం తాగండి".  ఇచ్చింది పార్వతి.

ఇదంతా చూస్తున్న నారదుల వారు, వెళ్లి వైకుంఠంలో చెప్పాడు.

వెంటనే TV ఆన్ చేసిన అమ్మవారికి...షాక్ తగిలింది. విశాఖ, కనక మహాలక్ష్మి గుడి చూపిస్తున్నారు. పాలప్యాకెట్లు, కుంకుమ పొట్లాలు అమ్మవారి మీద కు *భక్తి* తో విసిరేస్తున్నారు. పాపం అది చూసి అమ్మవారు ఉక్కిరిబిక్కిరి అయ్యింది. అసలే చలికాలం.

అది చూసి, విష్ణువు పకపకా నవ్వసాగాడు.

" మరీ సంబర పడిపోకండి. ధనుర్మాసం కూడా వస్తుంది. మాకూ నవ్వే అవకాశం వస్తుంది"అంటూ, ఎందుకైనా మంచిది ఆ కషాయం కొంచెం మనకు కూడా ఉంచమని చెప్పు నారదా అంది మహాలక్ష్మమ్మ.


భక్తి తో.....

--(())--

అనుభవమే కవిత

ఓ మనిషి నీలో ఉన్నది
మనస్సు ఉల్లాస పరిచేది
ఉషస్సులా నీలో వచ్చేది
భావామ్రుతాన్ని తెలుపు


అక్షరాలతో కవిత వ్రాయాలన్నా
మనం లక్ష్య సాదనలో ఉండాలన్నా
మనస్సు ప్రశాంతముగా ఉండాలన్నా
చక్కటి కవితలు చదివి తెలుపు


ఉద్వేగం పోయి ఉస్చాహము రావాలన్న
ఆవేశం పోయి ఆలోచన రావాలన్నా
ఆవేదనలు తీరి సంతోషం రావాలన్న
హాస్యం చదివి ఆనందంగా తెలుపు


అనుభవాల నుండి వచ్చేవి కవిత
ప్రేమపరవశం నుండి వచ్చేది కవిత
జ్ఞాన, వైరాగ్యం నుండి వచ్చేది కవిత
అమృత ఘడియందు కవిత తెలుపు


విధి ఆడిస్తున్న ప్రకృతి విపత్తు
మనుషుల్లో మదిని తొలిచే మహత్తు
మానవ కుటుంబాలలో జరిగే గమ్మత్తు

కవితాక్ష రాలు వ్రాసి తెలుపు

ఆశమోహాలు దరి రానీకోయి
బాదేసౌఖ్యమనే బావన రానీవోయి

అన్యుల కొరకే శ్రమించవోయి
అనుభవమే కవితగా వ్రాయాలోయి

--((*))--
ప్రాంజలి ప్రభ (విద్య)
*గణిత విద్యార్థి ప్రతిఙ్ఞ* :
6281190539
*(జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా విద్యార్థుల చేత ప్రతిఙ్ఞ కోసం)*
గణిత విద్యార్థి నైన నేను నా బాద్యతలను తెలుసుకుని, బాధ్యతాయుతమైన గణిత విద్యార్థిగా నడుచుకుంటానని ప్రతిఙ్ఞ చేస్తున్నాను ...
గణిత శాస్త్రం పట్ల
ప్రేమ, అభిమానం, అభిరుచి కల్గి, గణితం పట్ల సానుకూల వైఖరి, సానుకూల దృక్పథంతో , గణిత అంశాలను ప్రతి రోజు నిరంతర అభ్యాసన ద్వారా, క్రమశిక్షణతో , పాఠశాలలోని
తోటి విద్యార్థులతో గణిత శాస్త్ర ఙానం పంచుకోవడంతో పాటు , గణిత ఉపాధ్యాయుల సహాయ సహకారాలు స్వీకరించి , పాఠశాల ఆవరణలో ఆహ్లాదకరమైన గణిత అభ్యాసన పద్ధతులు నేర్చుకుంటూ, అంకిత భావంతో నేను ప్రయత్న పూర్వకంగా ఆత్మ విశ్వాసంతో చదువు పట్ల శ్రద్ధా భక్తులతో నిరంతరం గణితం నేర్చుకుంటాని ప్రతిఙ్ఞ చేస్తున్నాను ...
నిరంతరం ప్రతి రోజు గణిత శాస్త్రం అభ్యసిస్తానని ప్రతిఙ్ఞ చేస్తున్నాను ......
విద్యార్థి దశలో నా లక్ష్యం పట్ల జాగరూకతతో అప్రమత్తంగా నిరంతరం గణిత శాస్త్ర జ్ఞాన సముపార్జన కోసం అందుబాటులో వున్న అవకాశాలు, విద్యా వనరులను సక్రమంగా వినియోగించుకుని నేను సాధించవలసిన నా విద్యా లక్ష్యాలను సాధించేందుకు ప్రతి రోజు కృషి చేస్తూ విజయాలను సాధిస్తూ, నా సమర్థత ప్రతిభ ప్రదర్శించి ఇతర విద్యార్థులకు ఆదర్శంగా వుండి ఆదర్శ విద్యార్ధినని నన్ను నేను నిరూపించుకుంటానని ప్రతిఙ్ఞ చేస్తున్నాను ....

గణిత ప్రపంచంలో నేను సైతం విజయాలు సాధించగలనని నమ్మకంతో , గణిత విద్యార్థిగా నాకు నేను నా హృదయ అంతరంగాల్లో ప్రతిజ్ఞ చేస్తున్నాను ...
గణిత శాస్త్రం నా జీవన ప్రగతి కి, అభ్యున్నతికి మూల సూత్రాలు నిర్దేశించగలదు ...
గణిత శాస్త్ర రంగంలో తరగతి అభ్యసన సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు సాధించుటతో పాటు అద్భుత గణిత విజయాలు సాధించగలనని ప్రతిఙ్ఞ చేస్తున్నాను ...
గణిత శాస్త్రంతో నా నిత్య జీవితంలో ఎన్నో ఎన్నెన్నో ఘన విజయాలు సాధించగలనని ప్రతిఙ్ఞ చేస్తున్నాను ...

గణిత విద్యార్థి నైన నేను భారత మాత గర్వించదగిన బిడ్డగా నా నడవడిక, ప్రవర్తన, ఆలోచనలు, ప్రయత్నాలు వుంటాయని ప్రతిఙ్ఞ చేస్తున్నాను ...
జైహింద్ .. జైహింద్ .. జైహింద్
సేకరణ
*రచన:*
*సరస శ్రీనివాస కుమార్*
*9441443131*
 --(())--


శ్రీ సీతా రామాంజనేయ చరితం రోజూవారికధ (1)

శ్రీరాముడు-యోగరహస్యము -అరణ్యకాండ.5
అగస్త్య ముని ప్రభావము
 
అగస్త్య ముని ఆశ్రమానికి వెళుతూ శ్రీరాముడు ఆ ముని యొక్క ప్రభావమును లక్ష్మణునికి చెప్పుచున్నాడు........
పూర్వం ఇక్కడ ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం దాల్చేవాడు, తన సోదరుడైన వాతాపిని శాకరూపమున మార్చి, శ్రాద్ధమునకు తగినట్లుగా కూరగా వండి విధివిధానంగా శ్రాద్ధ భోజనంలో ఆ కూరను వడ్డించే వాడు. భోజనము పూర్తి అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడికి  హస్తోదకం వేసి ' వాతాపి! రా........' అనేవాడు. అప్పుడా వాతాపి ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని చీల్చుకొని బయటకి వచ్చేవాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని భుజించేవారు.
ఇలా చాలా మందిని వారు సంహరించారు. ఒకనాడు అటుగా వెళుతున్న అగస్త్య మహర్షిని కూడా మిగతా బ్రాహ్మణుల్ని పిలిచినట్టు పిలిచారు. అగస్త్యడు త్రికాలవేది కనుక వీళ్ళు చేస్తున్న మోసాన్ని గ్రహించాడు. ఇల్వలుడు పిలిచేసరికి, అగస్త్య మహర్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. భోజనం చేశాక తన కడుపు మీద చెయ్యి వేసి, 'జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం' అన్నారు. ఇది తెలియని ఇల్వలుడు హస్తోదకం పోసి 'వాతాపి! రా.....' అన్నాడు.

కుతో నిష్క్రమితుం శక్తి: మయా జీర్ణ స్య రక్షసః
భ్రాతు స్తే మేష రూప స్య గతస్య యమ సాదనమ్ 3.11.64

“నీ తమ్ముడిని జీర్ణం చేసుకొని యమలోకానికి పంపించేసానురా " అని అగస్త్య మహర్షి ఇల్వలుడితో అన్నారు. ఆగ్రహించిన ఇల్వలుడు ఘోరమైన రూపాన్ని దాల్చి అగస్త్య మహర్షి మీద పడ్డాడు. అప్పుడు అగస్త్యుడు ఒక హుంకారం చేసేసరికి ఆ ఇల్వలుడు బూడిదై పడిపోయాడు. ఆ వాతాపిని, ఇల్వలుడిని అగస్త్య మహర్షి సంహరించిన ప్రదేశమే ఈ అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం లక్ష్మణా" అని రాముడు అన్నాడు.

అగస్త్య ఇతి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణా
ఆశ్రమో దృశ్యతే తస్య పరిశ్రాన్త శ్రమ అపహః      3.11.79
 
మార్గం నిరోద్ధుం నిరతో భాస్కర స్యా౭౭చలోత్తమః
సందేశం పాలయం స్తస్య విన్ధ్య: శ్శైలో న వర్ధతే     3.11.85
 
తన తపః ప్రభావముచే వింధ్య పర్వతమును స్థంబింప చేసినాడు కావున ఈయనకు అగస్త్య మహర్షి అని పేరు వచ్చినది. ("అగమ్ (పర్వతం) స్థంభయతీతి అగస్త్య"). సూర్యుని మార్గమునకు (గమనమునకు) అడ్డు వచ్చుచున్న ఈ మహా పర్వతము అగస్త్యుని ఆదేశానుసారం పెరుగుట మానివేసింది. అట్టి ప్రభావశాలి అయిన అగస్త్య మహర్షి ఆశ్రమము లోకి సీతారామలక్ష్మణులు వెళ్లి సాదర నమస్కారములు చేసిరి. అగస్త్యుడు స్త్రీల స్వభావమును వివరించుతూ .... స్త్రీల స్వభావము సృష్టి మొదలు ఎల్లకాలముల యందు ఒకే విధముగా ఉండును. ఎంత ప్రేమింతురో అంత తొందరగా వారి మనసు మారును. పరిస్థితులు అనుకూలముగా ఉన్నచో ఎక్కువగా ప్రేమింతురు. విషమము అయినచో ప్రియుని కూడా విడుతురు. మెరుపు లోని చాంచల్యము, శస్త్రము లోని తీక్షణత, వాయువు యొక్క, గరుడుని యొక్క వేగము స్త్రీలకూ ఉండును. కానీ సీత అందరి వాటి స్త్రీ కాదు. ఈమెకు ఇట్టి దోషములు లేవు.
 
త ద్ధను స్తౌ చ తూణీరౌ శరం ఖడ్గం చ మానద
జయాయ ప్రతిగృహ్ణీష్వ వజ్రం వజ్రధరో యథా   3.12.35
 
మహర్షి రాముడికి విష్ణు ధనుస్సుని (పూర్వము ఈ వైష్ణవ ధనుస్సు పరశురాముని నుండి శ్రీరామునికి చేరెను. అతడు దీనిని వరుణునికి ఇచ్చెను. ఆ వరుణుడు దీనిని అగస్త్యునికి ఇచ్చెను. ఇప్పుడు మరల అగస్త్యుడు రామునకు ఇచ్చెను), బ్రహ్మగారు ఇచ్చిన సూర్య తేజస్సు కలిగిన బాణాన్ని, ఇంద్రుడు ఇచ్చిన రెండు అక్షయబాణ తూణీరములు, ఒక బ్రహ్మాండమైన పిడి కలిగిన ఖడ్గాన్ని ఇచ్చి, వీటి ద్వారా జయాన్ని పొందు అని ఆశీర్వదించారు. శ్రీరాముని కోరిక మేరకు మహర్షి ... ఇక్కడికి దగ్గరిలో పంచవటి అనే గొప్ప వనం ఉంది, అక్కడ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. కావున అక్కడ నువ్వు ఆశ్రమాన్ని నిర్మించుకో, అప్పుడు నీ కోరిక తీరుతుంది. నువ్వు సీతమ్మను భద్రంగా కాపాడుకో " అన్నారు. ఇక్కడ "సీతమ్మను భద్రంగా కాపాడుకో" అనడంలోనే మహర్షి రాబోవు సీతాపహరణమును సంకేతముగా సూచిస్తున్నారు.
 
స్పందన లేని శూన్య అవస్థకు "అగస్త్యుడు" అని పేరు. నిర్వికల్ప సమాధి అవస్థకు చేరిన తర్వాత ఈ శూన్య అవస్థ ప్రాప్తమగును. వృత్తి రహిత శూన్య అవస్థ యందు ఎల్లప్పుడును ఉండెడి ఉచ్చసాధకుని రామాయణకారుడు "అగస్త్యుడు" అని పేరిడెను. సంసారమును సాగరముతో పోల్చినారు. అలాంటి సాగరమును ఒకే ఆచమనముతో త్రాగినాడు. అటువంటి పరాక్రముడు, పురుషార్థి అగస్త్య మహర్షి. మూడు పగళ్లు, మూడు రాత్రులు శ్రీరాముడు అగస్త్యుని ఆశ్రమమున ఉండెననగా రామసాధకుడు శూన్య నిర్వికల్ప అవస్థ యందు మూడు రోజులు ఉండెను. పంచ ప్రాణముల సాధనయే పంచవటి.
శ్రీరామ జయరామ జయజయ రామ

--((***))--



*చక్కని మార్గం

ఓ అకాశసమా నీవు ఒక అనంతం
నీవే సూర్య చేంద్రులకు చక్కటి మార్గం
ఓ మేఘమా ఇది వర్షించే కాలం
పృధ్విపై కురిసి తరించే చక్కటి మార్గం


ఓ పుష్పమా ఇది వికసించే ఉదయం
ప్రాణులకు పరిమాళాలను పంచే మార్గం
ఓ ద్రువతారలలారా ఇది తరుణోదయం
ప్రాణులకు తన్మయత్వం పెంచే మార్గం

ఓ ప్రకృతీ చూపు ప్రశాంతత తత్త్వం
ప్రాణులు పరవశించిటకు చక్కని మార్గం
ఓ వెన్నెలా యామినిలో విహంగం
ప్రాణుల హృదయాలను కలిపే మార్గం

ఓ సంఘమా ఇది మనసును తెలిపే యుగం
ప్రతి ఒక్కరు ధర్మాన్ని నిలబెట్టుటకు మార్గం
ఓ స్నేహమా ఇది ఆత్మీయతకు నిదర్సనం
మనసు మనసు అర్ధంతో ముడిపడిన మార్గం

ఓ స్త్రీ ఇది నీ గృహం, ఇది నీ సర్వస్వం
సుఖించి సుఖపెట్టుటకు ఇది చక్కని మార్గం
ఓ పురుషా నీ భాద్యతల నిర్వహించే యుగం
సంసారాన్ని సంతోష పెట్టుట చక్కని మార్గం

--(())--

ఖీ - ప్రియా (ప్రేమ కధ )

సూర్యుడు అస్తమించే దిశగా బయలు దేరాడు, చీకటి ఆవరించింది, గుంటూరు లో ఉన్న సొంత ఇంటి   పెరటిలో పెంచిన ఉసిరిక చెట్టుకు దగ్గరగా అప్పుడే శ్రీతారామయ్య గారి భార్య దీపారాధన చేసి పూజ చేసి ప్రసాదం తన ఇద్దారి కొడుకులకు భర్తకు  పెట్టింది. 
పెద్దకొడుకు  రామా రావు   గుంటూరు లో స్కూలు   టీచర్ గా  పనిచేస్తున్నాడు, పెద్దలు కుదిరించిన వివాహము చేసుకున్నాడు, తండ్రి రిటైర్ గుమాస్తా, ప్రస్తుతం పెన్షన్ పొందుతూ ఉన్నాడు,
 ఇక రెండవ కుమారుడు తను కాలేజీలో చదువు తున్నప్పుడు రాధ ని ప్రేమించాడు, పెళ్లి చేసుకుందామనుకున్నాడు, విధి ఎప్పుడు అనుకున్నవి జరగనీయదు అని కొందరు అంటారు అది మాత్రం ఇతనికి అక్షరాలా నిజం జరిగింది.

ఎం . బి . ఏ . చదివిన ఉద్యోగము లేదు,  కాని   పెళ్లిచేసు కుంటానని తండ్రిని అడిగాడు.
తండ్రి ఒక్కటే చెప్పాడు నేను నిన్ను నీ భార్యను పోషించే శక్తి నాకులేదు, నీవు వేరేగా వెళ్లి బ్రతకమని చెప్పను, నేను చెప్పేది ఒక్కటే నీప్రేమ నిజమైతే నీకే శక్తి  నిస్తుంది, నీ  బ్రతుకుకు మార్గం చూపుతుంది, నీ  స్వేశ్చకు మేము ఎవ్వరమూ అడ్డురాము, నీవు ఉద్యోగము సంపాయించి ప్రేమించిన రాధ ని పెళ్లి   చేసుకో, రిజిస్టర్ మ్యారేజ్ ఐతే మేము సంతకము పెడతాము, రాధ పెద్దలని సంప్రదించి పెళ్లి చేయమంటే చేస్తాను.
ఒక్కసారి నీవు పేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకునిరా ఆమె అభిప్రాయము కూడా తెలుసు కుంటాను, ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను, నీ అంత నేను చదువుకోలేదు

అట్లాగే నాన్న రేపు తీసుకొస్తాను ఇంట్లో అందరికి చూపి స్తాను, అని చెప్పి బయటకు నడిచాడు మాధవ్ .

తను ప్రేమించిన రాధ ఇంటికి బయలు దేరాడు మాధవ్ , ఇంటికి తాళం ఉంది, ప్రక్క వారిని అడుగగా తన బావను పెళ్లి చేసుకుంటున్నది అని మాత్రం తెలుసు కున్నాడు, వెంటనే స్నేహితురాలు సురేఖ ఇంటికి బయలు దేరాడు ఇది నిజమో కాదో తెలుసుకొనేందుకు, సురేఖ చెప్పింది నీతో ప్రేమ జరిపి, తల్లి తండ్రులను ఎదిరించలేక పెళ్ళికి ఒప్పుకున్నది అని తెలుసుకున్నాడు.

ఇక్కడేదో పొరపాటు జరిగింది, పెళ్లి  చేసున్నారో తెలుసుకోలేక ఇంట్లో తల్లి తండ్రులకు మొఖం చూపలేక స్నేహితుని రూంలో ఉండిపోయాడు. అప్పుడే  ఒక డైరీలో  ఈ విధముగా వ్రాసుకున్నాడు
      
"నిన్ను వీక్షించనిదే ఉండలేను, నిన్ను ఆశ్రయించి నీతోనూ ఉండలేను, నిన్ను విడిచి  అంతకన్నా ఉండలేను,  పున్నమి వెన్నెల ఎలా ఉంటుందో తెలియదు, నీ కళ్ళ మెరుపు నాకు గుర్తు ఉన్నాది, ఎంత దూరము పోయినా, ఎక్కడ ఉన్నా నీ హృదయ స్పన్దన నాకోసమే అని, నీ ఆలోచనలు నన్ను దాటి పోలేవని, నా  ఆశల దీపానివి, నా ఆలోచనా రూపానివి, నన్ను ఆకర్షించిన దేవతవి, నాహృదయాంతరములో  ఎక్కడో కదిలించి, ఏమి తెలియని అమాయకురాలిగా, నన్ను మోసగించి,  నీలోఉన్న నా ప్రేమను అణగతొక్కి,  పెళ్లి  అనే నెపముతో నన్ను విడిచి దూరముగా వెళ్లిన, నీకోసం, నీ ప్రేమ కోసాం నీవు వచ్చి నాప్రేమ పొందే దాకా ఇక్కడే ఉంటా ...

విరిదండ -
రమ్ము నను జూడ సకీ - రాగములఁ బాడ సకీ
చిమ్ము మిఁక ప్రేమ సకీ - చిత్త మిటఁ జింద సకీ
యిమ్ము సుధ పాత్ర సకీ - యీప్సితము దీరు సకీ
కొమ్ము విరిదండ సకీ - కోమలము గుండె సకీ 

నాలో ప్రేమను పెంచావు, మమతను  పంచావు, కరుణతో కనికరించావు, చివరకు నన్నే మరిచావు, అయినా నీమీద ప్రేమ మరువ లేను, నిన్ను విడిచి ఉండలేను. 

తలపులు తల్లకిందు లవలేదు, కోరికలు మరచి ఉండలేదు, జ్ఞాపకాలను వదలి ఉండలేదు, 
తాను నన్ను వదలి వెళ్లినా నేను ఆమెను మరువలేను. 

మనసుని తొలచిన ప్రేమ కొరకు ఆశలతో ఉండుట తప్పు కాదు, ఈ ప్రేమకోసం నాలో బి.పి, షుగర్ పెరిగినా, నాలో  అను కోని రోగం వెంబడించిన, ప్రేమ    సఫలమయ్యేదాకా కొన ఊపిరితో బ్రతుక గలను    

తన  స్నేహితుని ద్వారా అదే డైరీలో తండ్రికి లేఖ ఈ క్రింది విధముగా  వ్రాసి ఇచ్చాడు. 
 నాన్న గారు మీరు చెప్పినట్లుగా నేను ఉద్యోగము సంపాదించేవరకు వివాహము చేసుకోను, మీకు భారముకాను అందుకే ఉద్యోగము వేటకు బయలు దేరుతున్నాను, మీ ఆశీర్వాదము నాకు పంపగలరు, త్వరలో ప్రయోజకునిగా మారి మీవద్దకు రాగాలను, అమ్మ భాదపడవద్దను, అన్నయ్యను వదినను అడిగినట్లు చెప్పగలవు
అందరికి  నమస్కారములు 

అలా డైరీని పంపి  తల్లి తండ్రులకు మొఖం చూపించలేక, ఎవరితోనూ చెప్పుకోలేక ఊరుకాని  ఊరు పయన మయ్యాడు మాధవ్
కాల చక్రం 2 సంవత్సరాలు అనుకోకుండా జరిగి పోయిన్ది
                               
సముద్రపు కెరటం గట్టు దాటాలను ఉవ్విళ్లూరుతు వస్తుంది, తర్వాత దాటలేక వెనక్కు తగ్గు తుంది. అట్లాగే మన మాధవ్ మంచి సాఫ్ట్వెర్ కంపెనీలో ఉద్యోగం సాంపాదించాడు, తల్లి తండ్రులు ఎంత కోరినా వివాహము చేసుకోమన్న చేసుకోను, నేను రాముని భక్తుణ్ణి, నాప్రేమ ఫలిం చేదాకా ఇట్లాగే ఉంటా, నాకు చేతనయినంత సాహాయము చేస్తా అని ఇంట్లో వాళ్ళందరి తెలియపరిచాడు, ఎవరు ఏమి మాట్లాడలేక ఊరుకున్నారు. 

అప్పుడే టి.వి. లో ఒక పాట వస్తున్నది 

పున్నమి వెన్నెలలో నీవునేను ఒకటవుదాం 
మురిసిపోయి మైమరిచి పోయి ఆనందంగా విహరిద్దాం 
గగనాన  తారలన్నీ మనల్ని చూసి సిగ్గుపడతాయి 
సంద్రంలో ఉన్న అలలన్నీ మనల్ని చూసి నవ్వు కుంటాయి 

అడవి జింకలు మన చుట్టు చేరి కేరింతలు కొడతాయి 
మనల్ని చూసి నెమలి నాట్యమాడుతుంది 
చిరు కొమ్మలు మనల్ని చూసి కొమ్మ కొమ్మ రాచుకొని పూలు కురిపిస్తాయి 
కొమ్మ ముద్ద కోయల మనల్ని చూసి ఓర్వలేక కూత కూస్తూనే ఉంటుంది 

తుమ్మెద ఝుంకారం   మనకు శ్రవణానందము కలిగిస్తాయి 
సలయేరుల గలగలలు మనస్సును ఉల్లాస పరుస్తాయి 
సెలయేరులో  హంసలు శబ్దము చేస్తూ మనల్ని చూస్తాయి 
మధువును వెదజల్లే పారిజాతాలు, సంపెంగలు మనచుట్టు ఉన్నాయి 

నాకు నీవు నీకు నేను ఒకరి కొకరమై పెనవేసుకొని లతల్లా అల్లుకొని 
వేణు గానంతో రవళి నాదంతో పరవశించి ఏకమవుదాం 

అన్న పాట చక్కగా పాడుతున్నారు ఇరువురు 

వెంటనే చలపతి కి గుర్తుకు వచ్చింది ఇది నేను శ్రావణికి వ్రాసి ఇచ్చిన పాట, కొద్ది మార్పులలో ఉన్నది తప్పా ఇది నేను వ్రాసిన పాట తెలుసుకున్నాడు. 

వెంటనే టి.వి. స్టేషన్ కు వెళ్ళాడు, పాట ఎవరు రచించారు, ఆ చిరునామా తీసుకోని ఇంటికి వెళ్ళాడు. 
ఆ ఇంటిలో రాధ కనబడటం తో తన సంతోషాన్ని ఆపుకోలేక పోయాడు మాధవ్

చాలా రోజుల కు నేను గుర్తుకు వచ్చానా, రా కూర్చో ముందు కాఫీ తెస్తా ఉండు అని  చెప్పి లోపలకు వెళ్ళింది 
ఇల్లు అంతా చూసాడు నిశ్శబ్దముగా ఉన్నది 
కాఫీ త్రాగుతూ మీవారు లేరా, ఇంట్లో ఎక్కడా మీ పెళ్లి ఫోటో కనిపించ లేదు అని అడిగాడు. 

నాకు ఇంకా పెళ్లి కాలేదను కున్నావా మాధవ్ , నా విషయము అట్లా ఉంచు, నీకు పెళ్లైందా, ఏదన్న ఉద్యోగము చేస్తున్నావా, ఒక్కసారిగా ప్రేమకు ఉన్న గుర్తులన్నీ చక చక అడిగింది. 
అయ్యో నిన్ను ప్రశ్నలమీద ప్రశ్నలు వేస్తున్నాను నన్ను క్షమించు, నిన్ను చూసేటప్పటికల్లా నా మనసు మనసులో లేదు అయ్యో ఉండు టిఫిన్ చేస్తా ఎప్పుడు తిన్నావో అంటూ లేవబో యింది, వద్దు వద్దు నీవు మాట్లాడుతుంటే నా మనసు  హాయిగా   ఉన్నది. 
నాగురించి విను నేను పెళ్లి చేసుకోలేదు నీకోసమే వేచిఉన్నాను, మంచి ఉద్యోగము సంపాదించాను. 
మరి నీ విషయము చెప్పు 
నీకు ఉద్యోగము లేదని మా బావకు మంచి ఉద్యోగం ఉందని నేను ఎంత బతిమి లాడిన వప్పుకొనలేదు, ఈ పెళ్ళికి వప్పుకోకపోతే మేము చనిపోతామని బెదిరించారు   , నేను నమ్మిన దేవుడు  రామ చంద్రుడు కాపాడుతాడని  చదువుకున్నా ఏమీ చాతకాని దానిగా మారాను, అప్పటికప్పుడే రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి జరిగింది. 
తిరుగు ప్రయాణంలో తిరిగి వస్తున్నాము కారులో ఉండి  నాన్న అక్కడ ముసలమ్మ సంపెంగ పూలు అమ్ముతుంది ఒక నిముషము కారు ఆపితే కొనుక్కొ స్తాను అని నేను దిగాను కొనుక్కొని తిరిగి వస్తున్నాను లేదో పెద్ద శబ్దం చేస్తూ ఒక లారీ మాకారును డాష్ ఇచ్చింది 
ఆ విషాద సంఘటన నేను నీకు చెప్పలేను, అప్పుడే అందరూ చనిపోయారు. 
నాకు  నచ్చిన కధలు వ్రాస్తూ ఎడిటర్ గా భుక్తి కోసం పనిచేస్తున్నాను ఇదే నా కధ 

మీ ఇంట్లో వారందరూ బాగున్నారా అందరూ బాగున్నారు 

నిన్ను నేను పెళ్లి చేసుకుందా మనుకున్నాను, అదియు నీకు ఇష్టమైతేనే 
ఇష్టం కాక పొతే నీప్రేమనే తలుచుకుంటూ జీవితాంతమూ బ్రహ్మ చారిగా ఉండి  పోతాను అంతే తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోను 

నీవు  ఒక  సారి వ్రాసిన పాట గుర్తుందా, ఆపాటేగా నన్ను నిన్ను కలిపింది అని లేచి దగ్గరకు వచ్చి కౌగిల్లో బంధించాడు, ఆగు ఆగు వేదమంత్రాల మధ్య పెళ్లి జరగనీ ఈ తనువంతా నీ సొంతమే అని ఒకటే నవ్వులు వేళ్ళు విరిసెను

చదవండి  ప్రాంజలి ప్రభ కధలు నచ్చితే షార్ చేయండి (1)

1 కామెంట్‌: