26, ఏప్రిల్ 2017, బుధవారం

మల్లాప్రగడ రామకృష్ణ కధలు -4

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

రాధాబాయ్.
అది ఒక చిన్న గ్రామం, నగరానికి దూరముగా ఉన్నది,  సూర్యుడు ఉదయిస్తున్నాడు, పల్లెవాసులు మేల్కొంటున్నారు, కాలకృత్యాలు తీసుకొని నిత్య విధులకు ఉపక్రమించుటకు ప్రయత్నం చేస్తున్నారు, పేపేరు కోసం ఎదురు చూస్తున్నారు, ఇక్కడే రెండు ఎకరాల విస్తీర్ణంలో పూలచెట్ల మధ్య చుట్టు కొబ్బరి చెట్లు ఉన్న ప్రాంతము నందు ఒక ఆశ్రమము కాదు, అది స్త్రీ బాధిత రక్షణ హనుమాన్ నిలయం, దీనిని
నిర్వహిస్తున్నది రాధాబాయ్ గారు, ఈమెకు పెద్ద వయసు ఉంటుందనుకున్నారో పప్పులో కాలేసినట్లే కేవలము 40 వత్సరములు ఎప్పుడు పచ్చటి వస్త్రములు ధరిస్తూ స్త్రీ రక్షణా కేంద్రముగా భాద్యతలు వహిస్తున్నది.

అప్పుడే టివి, రేడియో, పత్రికా, విలేఖరులు వచ్చారు మీరు స్త్రీల కోసం ప్రత్యేకంగా ఏర్పటు చేయడంలో అంతరార్ధం ఏమిటి ?
మీలో స్త్రీలు ఎవరు లేరా వారే చెప్పగలరు దీనికి సమాధానము, నేను చేసే పనుల్లో తప్పులుంటే నాకు తెలియపరచండి లేదా నేను స్త్రీలకు ఏమిచేయాలో మీరు తెలియ పరచండి అని అడిగింది వచ్చిన విలేఖరులను రాధాబాయ్.
అందులో వచ్చిన ఒకరు మేము అడిగిన వాటికి సమాధానములు చెప్పకపోతే మేము వ్రాసే వ్రాతలకు భాధ్యతలు మీరే అన్నాడు.
ఎవరో ఆమాట అన్నది అతన్ని ముందుకు రమ్మన మనండి , ప్రశ్నలు అడగమనండి
మీరు ఆడవారిని ఆదరించినట్లు నటిస్తున్నారని నాకు అనుమానం అది నిజమేనా?
మీ అమ్మగారు, మీ చెల్లి అక్క గాని ఇక్కడ చేర్చండి పూర్తిగా ఉచిత వసతి, భోజనము, విద్యలు నేర్చుకొనుటకు అవకాశము కల్పిస్తాను, పంపించండి వారే మీకు సమాధానము చెప్పగలరు. ఎవరైనా సరే అభ్యంతరము లేదు
మీరు చందాల రూపములో తీసుకుంటున్నారు అని  తెలిసింది  అది నిజమేనా.
మీకు ఆధారాలు ఎమన్నా ఉంటె చూపి అడగండి, ఆధారాలు లేకుండా ప్రశ్నలు వేయకండి.
ఆధారాలు మాదగ్గరున్నాయి రేపు సమాధానములు మీరే చెప్పు కోవాలి తెలుసా.
చూడండి నేను సత్యం, ధర్మం, న్యాయం మా ఆయుధాలు "విద్య, వ్యాయామము, ఉచిత భోజనము, వసతి, చేతికి పనికల్పించటం  మరియు నిత్యము వేద పండితులచే ధర్మ బోధలు "
చివరగా స్త్రీలకు మీరు చెప్పేదేమిటి ఏదైనా చెప్పండి
నేను ఒకటే చెప్పేది స్త్రీలకు  
             
ఓ వనితలారా  ఓ వనిత లారా, తెన్ను తప్పి పోబోకు, నిన్ను నువ్వు కోల్పోకు, నీకున్న ధర్మాన్ని ఆచరించుటలో కష్ట నష్టాలను తెలిపుకొని బ్రతుకుదాం, నలుగురికి సహాయ పడుతూ సాగుదాం 

ఆగకుండా కదిలిపోతూ, సాగి పోదాం, స్త్రీ శక్తి నిరూపిద్దాం, అడ్డులన్నీ దాటుకుంటూ, ఎదురుదెబ్బలు తగిలితే, బెదిరింపులు కలిగితే, ఆగిపోకుండా సాగుదాం

భయంతో ఆగిపోకు, న్యాయ పయనాన్ని ఆపబోకు, ఎదురు నిలిచే వారిని చూసి అదిరిపోకు, బెదిరించిన
బెదిరిపోకు, నీవు నమ్మిన సిద్ధాంతాన్ని అనుకరించి సాగిపోదాం … సాగిపోదాం ..

ఎంతదూరం సాగినా, ఎన్ని మలుపులు తిరిగినా, అలసిపోకు, సొలసిపోకు, అలసిపోయి
సొలసిపోయి, జీవితాన్ని అర్పించి నష్ట బోకు, ధైర్యమే ఆయుధముగా సాగిపోదాం  సాగిపోదాం  ఓ వనిత లారా ... .

ధైర్యం విడవకు, పిరికి దానిగా మారకు, నీకెవరూ దిక్కులేరని, నీకెవరూ తోడు రారని, నెన్నెవ్వరూ  గుర్తించ లేదని, మన్ననంటూ నీకు లేదని, రోదించకు, బాధపడుకు, బాధపడుతూ-నీ ప్రజ్జను
వేధించకు, కష్టాలకు లొంగకు, కలతలకు అందకు, నష్టాలకు కుంగకు, నైజాన్ని వీడకు, పెద్దలను గురువులను ప్రేమిస్తూ సాగిపోదాం …వనితలారా , సాగిపోదాం … వనితలారా

ప్రతికూల పరిస్థితులను, చెండాడుతూ, చీల్చుకుంటూ, సాగిపో వనితా సాగిపో వనితా, నీకు ఆదర్శ్యం  ఉదయభాను కిరణాలుగా చీకటిని తరిమి వెలుగును నింపే పద్దతిలో జీవించుదాం .. సాగిపోదాం …వనితలారా , సాగిపోదాం … వనితలారా

భారత్ మాతాకి జై, నన్ను కన్న తల్లి తండ్రులకు జై, విద్య నేర్పిన గురువులకు జై, పంచ భూతములకు జై, రక్తమంతా వక్కటే, దేశాన్ని సస్యస్యామలంగా మార్చటమే మాధ్యేయం, మా సత్ సంకల్పానికి అందరి సహకారం అవసరం, కలసి మెలసి బ్రతుకుదాం, సాగిపోదాం …వనితలారా , సాగిపోదాం … వనితలారా, సాగిపోదాం …వనితలారా , సాగిపోదాం … వనితలారా
    
అంటూ పాట పాడింది రాధాబాయ్
అక్కడకు వచ్చిన విలేకర్లు అందరు ఆపకుండా చప్పట్లు కొట్టారు

చప్పట్లు కొట్టడం కాదు మీవంతు సహాయంగా ఏమి ఇవ్వగలరో చెప్పండి అన్నది.
అందరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.

మేము మీ ఖ్యాతిని, తెలివిని, మీరు చేసున్న కృషిని ప్రపంచ ప్రజలకు తెలియ పర్చాలను కున్నాము
అన్నారు.
నేను ఒకటే చెపుతాను అన్నం తింటేనే ఆకలి తీరుతుంది, అన్నాన్ని చుస్తే ఆకలి తీరుతుందా ?
అట్లాగే నాకు ఎవరి ప్రచారము అవసరము లేదు, మా సహాయము పొందినవారు చెప్పే వాక్యాలే మాకు ప్రచారాలు అన్నది.

అయితే ఇంట పెద్ద ఆశ్రమం కట్టడానికి ఎవరి సహాయము డబ్బు తీసుకున్నారో తెలుపుతారా అని అడిగాడు.

మీరు ఇక్కడకు రావడానికి నెంబరు షిప్ రుసుము కట్టారు కదా అదే మాకు పెట్టుబడి, నిత్యావసర వస్తువులు శుభ్రపరచి ప్యాకెట్లద్వారా తక్కువధరకు ఇవ్వడం, పేదలకు వస్త్రములు తక్కువధరకు అందచేయడం మా ఉద్దేశ్యం.

నేను సహజముగా కోటీశ్వరు రాలను, ఇంతమంది సాహాయ్యము తో ఇంకా సంపాదించ గలిగాను ప్రభుత్వానికి తగు విధముగా టాక్సు కడుతున్నాను.
నానినాదం

" సువాసన పువ్వువై ఆకర్షించి పరిమళాలను పంచు
  వెలుతురు దీపమై హృదయాంతర వేదన తొలగించు
  దుర్మార్గాన్ని ధైర్యంతో ఎదుర్కొని ధర్మాన్ని రక్షించు
  దేవుణ్ణి, గురువు,పెద్దల్ని, ప్రేమించి జీవితం సాగించు "
                 
మీ భర్త,  మీపాప విషయాలు గురించి చెపుతారా.
ముందు మీ కందరికీ భోజనాలు ఏర్పాటు చేసాను, భోజనము చేసిన తరువాత కొన్ని విషయాలు తెలుసు కోగలరు, మీకందరికీ ధన్యవాదములు తెలియపరుస్తూ ఇప్పటికి ముగిస్తున్నాను, మరల మధ్యాన్నం 3 గంటలకు మంచి విషయాలు తెలుసు కుందాము అని చెప్పి లోపలకు వెళ్ళింది రాధాబాయ్.      

విలేఖరు లందురూ ఒకచోట చేరిన వారితో రాధాబాయ్ చెప్పటం మొదలు పెట్టింది. 
మీరు సమయ పాలన చేసే వారని నాకు తెలుసు, మావారి పేరు మాధవ్ పోలీస్ ఆఫీసర్, ఒకరోజు డ్యూటీ లో  ఎదో ఫోన్ రావటం వల్ల అక్కడికి వెళ్లారు, అక్కడ ఒక అమ్మాయిని దారునంగా   బలాత్క రించి చంపేశారు, వారితో పోరాడటం వల్ల  కొంత మంది చనిపోయి కొందరు పారి పోయారు, దుర్మార్గుల కుట్రకు  నా భర్త కూతురు బలై పోయారు, మావారి చివరి కోరిక స్త్రీలకు ధైర్యము కల్పించే ఆశ్రమమును స్థాపించి ధైర్యవంతులుగా మార్చే శక్తి మనం ఆరాధించే ఆంజనేయుడే మనకు రక్షణగా ఉంటాడు, నాకు మన పాపకు బ్రహ్మ వ్రాసిన కాలము వచ్చింది, నీ ధైర్యమే నీ కుబలం, నీ ఊపిరి నీకు శక్తి అంటూ నేలకు ఒదిగారు, కళ్ళవెంబడి నీరు కారుస్తూ అందరికి నమస్కారము చేసినది, విషాద గాధ విని అందరూ అలా ఉండి పోయారు .
           --(()))--


**మల్లాప్రగడ రామకృష్ణ కధలు -3

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:

3. సంసారి
విషంక్రక్కే భుజంగం లా, కదంత్రొక్కే తురంగం లా, మదం పట్టిన గజం లా, వలయ విచల ద్విహంగం లా, విలయ సాగర తరంగం లా, చిత్రకార్తి కుక్కలా నావెంట పడ్డా వెందుకు,  నాదగ్గర ఏమి ఆశిస్తున్నావు, ధనమా, సుఖమా, మరి ఏమి కావాలి నీకు, నన్ను వెంబడించ కుండా ఉండాలంటే నేను నేమి చేయాలో చెప్పు, నన్ను వదలి వెళ్ళు, నాదగ్గర నీవు ఏమి ఆశించిన అంతా సూన్యము తప్ప ఏమి దొరకదు అది మాత్రం గుర్తించుకో, నామీద ఆశలు వదులుకో, నీ మాయలో చిక్కే మనిషిని కాదు, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని అందాలు చూపిన నేను మారి మూర్ఛ పోయే మనిషిని కాదు.

నీకో విషయం తెలియపరుస్తా నిష్టా గరిష్టుడుగా ఉన్న సంసారిని ఎవరూ వేరు చేయలేరు, ప్రలోభాలకు లొంగ దియలేరు ఇది సత్యము ఆది శంకరాచార్యలు ఇవిధముగా తెలియపరిచారు " మోక్షమం దత్వంతా సక్తి గల పురుషుడు శబ్దాది విషయ వాసనలను నిర్మూలించి, సర్వ కర్మలను బరిత్యజించి, గురు వేదంత వాక్యములందు విశేష శ్రద్ధతో  శ్రవణ మననాదుల సభ్య సించిన ఎడల, వట్టి వాని బుద్ది రాజోగుణ రహితమై పరిశుద్ధ మగును "

నేనంత వాడిని కాక పోయినా నీతో వాదన దిగే శక్తి నాకులేదు, నీతో మాట్లాడుతే తప్పు, అయిన ఓర్పుతో ఆడదాని వని ఎటువంటి గట్టి దండన చర్య తీసుకో కుండా నన్ను వెంటాడ వద్దని తెలియ పరుస్తున్నాను.

గులాబీ నెమ్మదిగా ఈ విధముగా అన్నది మాధవ్ తో

ఈ పూట కేమేమి -ఈ రాత్రి వెన్నెల్లొ - నవ్వు ల్లె పువ్వుల్లొ
 నావెల్గు నీవేగ - నాతృప్తి నీ వేగ  - ఈ వేష మెచ్చేన 
 ఈ మాట ఏ తీర్పు- ఈ ఆశ ఏ మాయ- ఈ బొమ్మ నీదేను   
రారాసు రామా- నువే నాప్రియా నిన్ను పొందాలి ఇప్పట్లొ 

   
ప్రాణమ్ము నీదేను, ప్రాణమ్ము మాయేను  - ప్రాణమ్ము బ్రహ్మమ్ము
 ప్రాణమ్ము ధైర్యమ్ము, ప్రాణమ్ము మోక్షమ్ము ప్రాణమ్ము దేహమ్ము    
ను వ్వాడు  యీసంధ్య వెల్గుల్లొ - నమ్మించు యీసృష్టి వెల్గుల్లొ
మాట్లాడు  ఈ మంచి వెల్గు ల్లొ - ప్రేమంత చూపాలి  ఈ రాత్రి వెల్గుల్లొ 


నీవు మొగడివి, మఘధీరుడివి, నా కళ్లకు నీవు గోపాల కృష్ణుడివి, అందుకే ఒక గులాబీ గా నిన్ను అరాదిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ఈ రోజుకు వెళుతున్నాను, నా ప్రయత్నములు మానను ఏ రోజు కైనా సరే నిన్ను నా పాదాలు పట్టించు కోక పోతానా అని అంటూ వెను తిరిగింది గులాబి.

నెమ్మదిగా ఇంటికి చేరాడు మాధవ్, తలుపు కోట్టాడు, తలుపు తీస్తూనే ఏమిటండి మీ మొఖం అట్లాగుంది, ఎదో మార్పు ఉన్నది అన్నది, ఏమి లేదులే ఎండలో వచ్చాగా అందుకే నీకు నా మొఖము కమిలి నట్లు కనిపించి ఉంటుంది, ఏమి లేదు బాగానే ఉన్నాను, మీకు వంట్లో బాగా లేక పోతే చెప్పండి ఆసుపత్రికి వెళ్దాం, రోగం దాచు కోకండి అన్నది, నాకు పట్టిన రోగం చెపేది కాదు, చెప్ప కూడనిది కాదు అని గొణుక్కున్నాడు, ఏమిటండి అలా గోనుక్కుంటారు ఎమన్నా అనాలంటే మొఖం మీదే అనండి అన్నది. అబ్బా కాసేపు కూర్చొనిస్తావా, మంచి నీల్లెమైనా ఇస్తావా రాధ అని వాలు కుర్చీలో ఫాన్  వేసుకొని నడుం వాల్చాడు మాధవ్ .

ఇదుగోనండి మంచి నీరు అనగా తీసుకోని గడ గడ త్రాగి ఒక 10 నిముషాలు నన్ను లేపకు అని కళ్ళు మూసుకొని పడుకున్నాడు.

నిద్రలేచిన తర్వాత రాధ మాధవ్ తో ఈ రోజు గుడిలో ఒక వింత జరిగింది, ఒక ఆరడుగుల అందకత్తె మంచి పట్టు చీరకట్టుకొని అక్కయ్యగారు బాగున్నారా అని అడిగింది. నాకేం అర్ధం కాలేదు అసలెవరమ్మా మీరు అన్నా, ఏమిటండి నన్ను అమ్మా  అంటారు మీ కన్న చిన్నదాన్ని, మీ వారికి బాగా తెలిసిన దాన్ని నన్ను చెల్లీ అని పిలవండి చాలు అన్నది, మల్లో ఉన్న అంతరార్ధం అర్ధం కాలేదు. మీ వారు చాలా మంచి వారండి,  పరస్త్రీ మొఖం కూడా చూడరు, కానీ మీ వారు మిమ్మల్ని వివాహము చేయక ముందు నుంచి నాకు బాగా తెలుసు, మిమ్మల్ని మోసం చేస్తున్నారామె నని అనుమానం ఉన్నది  అన్నది. నాకు కోపం వచ్చింది పైకియా కనిపించకుండా నేను అసలు విషయం సూటిగా చెప్పండి, డొంక తిరుగుడు వద్దు చెప్పండి, ఏమీ లేదండి మీరు వప్పుకుంటే మీవారిని నేను పెళ్లి చేసుకుంటా, మోకిష్ట మున్న లేకున్నా ఉంచు కుంటా అని గట్టిగా చెప్పిందండి. పేరు చెప్పింది, ఆ గుర్తు రావటంలేదు బంతో, చామంతో ఆ ఆ గుర్తొచ్చింది "గులాబి " అన్నది.

ఏమి తెలియని వాడిలా మాధవ్ ఇంతకీ ఆమెతో ఏమి చెప్పావు
నేనేమి చెప్పలేదు కొందరు మనుష్యులు వచ్చి ఆమెను తీసుకెళ్లారు అదీ జరిగింది.
ఆ మనుష్యులు ఎవరో కనుకున్నావా ఏమో నాకేం తెలుసు
కనుక్కొనే ఉంటావు నా దగ్గర దాస్తున్నావు నీవు
అవునండి తెలుసుకున్నా నేను "ఆమె పిచ్చాసుపత్రి నుండి తప్పించుకొని వచ్చిందట, ఆమె మీద 3 మర్డర్ కేసులు  కూడా ఉన్నాయిట .
పాపం ఏ తప్పు చేసిందో
ఈమెకు మపిచ్చి పెరిగి ఒకర్ని ప్రేమించిందట, పేమించినవాడు దిన్ని మోసం చేసి వేరొకర్ని పట్టుకొచ్చి సర్వం అర్పించ మన్నాడుట అంతే ఆమాటలకు తట్టుకో లేక వచ్చిన వాడ్ని ప్రేమించిన వాడ్ని చెడుగుడు ఆడి మరి చంపి పోలీసులకు లొంగి పోయిన్ది.మానసిక రోగిగా మారింది. ఎర్రగా బుర్రగా అందంగా ఉన్న మగవాడ్ని చూస్తే బుట్టలోకి లాగి మరీ చంపు తున్నదిట, మొన్న జైల్ నుంచి వచ్చాక ఒకర్ని లొంగ దీసుకొని మొగవాళ్ళు మూర్కులు అని మరీ చంపి, తప్పించుకొని వేరొక మొగాడితో తిరుగు తుందట, పెళ్లైనవాడ్ని వారిని సంభందించిన వారిని లొంగ దీసుకొని వేటాడు తుంటూ ఉంటుందట. ఆమె కధ వింటుంటే నా ప్రాణం పైన పోయిన్ దనిపించింది. నామంగళ సూత్రం గట్టిది,
మావారు అలాంటి వారు కాదని నమ్మకము నాకు ఉన్నది అని చెప్పింది.

ఒక్కసారిగా ఊపిరి పీల్చాడు ఇదుగో రాధా ఇక్కడ ఆడవారు చాలా గట్టివారు మోసకారి లాగున్నారు కదూ. ఎందుకండీ అలా అంటారు మగవాళ్ళు గట్టిగా ఉంటే ఏ ఆడది భయపడ నవసరము లేదు.
ఇలాంటి మానసిక వ్యధకు గురైనవారు తటస్థపడితే మనమే జాగర్తగా ఉంటే చాలు, భయపడ నవసరంలేదు.

ఓరాధా  నీవు చెప్పింది మంచి విషయమో, చెడ్డ విషయమే తెలుసు కోలేకున్నాను ఒక స్త్రీ బాధపడితే నామనసు భాదలో ఉంటుంది పాపం ఆమెకు మంచి జరగాలని ఆదేవుడ్ని కోరుకుందాం పదా గుడిదాకా వెళ్లి వద్దాము అన్నాడు మాధవ్ .

అప్పుడను కున్నది రాధ మావారు ఎంత మంచివారు ఇతరులకోసం కోసం కూడా గుడికి వెల్దామంటున్నాడు ఏమిటో  విషయం
ఏమిలేదు మీ ఆడవాళ్ళ బుధ్ధి మాత్రం మార్చుకోరు, ఏది అన్న ఎదో తప్పు పడుతుంటారు
అంతలేదండి నాలో మీరెలా గంటె అలా ..  లేదు లేదు నీవెలా అంటే ఆలా
మహాప్రభూ మీతో మాట్లాడలేను నేను పదండి గుడికి ...  ఆ ఆ వసున్నా                                                                       




25, ఏప్రిల్ 2017, మంగళవారం

**మల్లాప్రగడ రామకృష్ణ కధలు 2***

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

2. నడక ... సంసార పక్ష కథ 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణారునసంవాదే, జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయఃఅని టివిలో ఉపన్యాసం వసున్నది, మాధవ్ వింటూ ఉంటాడు 

ఓ శ్రీమతీ నీకు భగవద్గీత ఎమన్నా అర్ధ మవుతున్నదా, నా  బదులు మీరేవింటారు ఎక్కువగా, మీకు అర్ధ మయితే చెప్పండి, అలా నడుచుకుంటూ మాట్లాడు కుంటూ, లోకాభి రామాయణం వింటూ పోదాము, కాస్త ఉండండి చీర కట్టు కొని వస్తా, ఏమిటీ ఇప్పటిదాకా చీరకట్టుకోలేదా, ఏమీ ఇప్పడి దాకా నామోహమే చూడలేదా, ఇక నా వళ్లెం చూస్తారు మీరు, దున్నపోతు లాగా  వంటి మీద ఏమి ప్రాకినా మీకు తెలియదు, అన్నీ నేను చూసి చెప్పాలి, అబ్బా ఎందుకే  అన్ని  మాట లంటావు, ఎదో జోకేద్దా మనుకున్నా అంతే , ఆవునులెండి ఈ మొగవాళ్లందరికి ఆడదానిని చూస్తే జోకు లేసి ఏడి పించాలని బుద్ధి వుంటుంది. అబ్బా ఆందరిని ఎందుకు కలుపు తావు, నేను అడిగిన విషయము చెప్పగా, ఇక నడు తాళాలు వేసి, బయలు దేరుదాం, ఆ అట్లాగే వస్తున్నా, తాళం వేసి తాళం జాగర్తగా పెట్టుకోండి, అసలే మతి మరుపు మీకు అంటూ నవ్వు కుంటూ నడవటం మొదలు పెట్టారు మైదానం వైపు.

మైదానం చేరారు, రెండు వృత్తాలుగా తిరగటం జరిగింది, విశ్రాంతిగా ఒక బల్లపై కూర్చొని ఉన్నారు రాధా మాధవ్,   ఆ   ఇప్పుడు చెప్పండి భగవద్ గీత అన్నది మాధవ్ తో రాధ. 

అమ్మో అది చెప్పటం నావల్ల కాదే, గుర్తున్న కొన్ని విషయాలు చెప్పగలను అంతే, అంతవరకు చాలు మన మేమి స్వామిజీలు, కాము పర్వాలేదు చెప్పండి.

1. అగ్ని కట్టెలను ఎలాబూడిదచేయునో, మనిషిలో చేరిన అజ్ఞానము వలన సమస్తము   భాధపడుటకు కారణ మగును, వయసు పెరిగిన కొలది జ్ఞానము పెరుగును, ఆ జ్ఞానమును నలుగురికి పంచకపోతే ఉన్న జ్ఞానము బూడిదలో పోసిన పన్నీరగును, జ్ఞానమనే అగ్ని సమస్త కర్మలను భస్మము చేయును.

2. ఈ లోకములో జ్ఞానానికి మించినది ఏదియు లేదు, అట్టి జ్ఞానమును (కర్మ) యోగస్థితిని బొందినవాడు కాలక్రమమున పరమాత్ముని యందే స్వయముగ లినమై పోగలడు. 

3. (గురు, శాస్త్రవాక్యములందు) శ్రద్ధగలవాడును, (ఆధ్యాత్మిక సాధనలందు) తదేకనిష్ఠతో గూడినవాడును, ఇంద్రియములను లెస్సగా జయించినవాడునగు మనుజుడు జ్ఞానమును 
పొందుచున్నాడు. అట్లు జ్ఞానమును బొందినవాడై యతడు పరమశాంతిని శీఘ్రముగ బడయగల్గుచున్నాడు.
 
4.జ్ఞానము లేనివాడు, శ్రద్ధారహితుడు, సంశయచిత్తుడు వినాశమునే పొందును. సంశయచిత్తునకు ఇహలోకముగాని, పరలోకముగాని, సౌఖ్యముగాని లేవు.
 
 
 5. ఓ అర్జునా! నిష్కామకర్మయోగముచే కర్మ ఫలములను త్యజించినవాడును, (లేక ఈశ్వరార్పణ మొనర్చినవాడును), జ్ఞానముచే సంశయములు నివర్తించినవాడునగు ఆత్మనిష్ఠుని (బ్రహ్మజ్ఞానిని) కర్మములు బంధింపనేరవు. 

6. ఓ అర్జునా! కాబట్టి నీయొక్క హృదయమున నున్నదియు, అజ్ఞానమువలన బుట్టినదియునగు ఈ సంశయమును జ్ఞానమనుఖడ్గముచే చేదించివైచి నిష్కామ కర్మయోగము నాచరించుము. 

లెమ్ము.
 
7. ఓ అర్జునా ! మనిషిని తప్పు దోవ పట్టించే వాటిలో మొహం ముఖ్యమైనది. అది లోభానికి దారితీస్తుంది. అహంకారానికి అదే కారణం. దీనివల్ల వివేకం నశిస్తుంది. అటువంటి వక్తి దేనికి పనిరాని వస్తువు క్రింద ఉన్నట్లే అది గమనించు 

8. ఓ అర్జునా ! ఖ్యాతి కైనా, అపఖ్యాతి కైనా కారణాలు రెండు. ఒకటి హృదయం రెండవది నాలుక. హృదయ వైశాల్యమే సత్కిర్తికి  కారణం. నాలుక దురుసుతనం అపకీర్తికి మూలం. ఈ  రెండు మనిషిలో ఉంటాయి. మాట విలువ తెలుసుకొని హృదయం అర్పించుటలో ఉన్న ముఖము వర్ణించుటలో   కాదు. 
 
భగవంతుడు మనకు తెలియపరిచారు జ్ఞాన సంపదవలన  అజ్ఞానము తొలగించుకొని కర్మలాచరించమని, ధైర్యముగా చేయవలసిన పని చేయమని మనకు హితబోధగా 4వ 
అధ్యాయంలో తెలియపరిచారు, నాకు తెలిసినవి క్లుప్తముగా తెలియపరిచాను రాధా రోజుకి. చాలండి ఈరోజుకు మీరు చెప్పింది, మంచి విషయాన్ని రెండ్ మూడు సార్లు వింటేగాని మనసు కెక్కదు, అదే చెడ్డ విషయమైతే వెంటనే మనసును చేరి బాధకు గురిచేస్తున్నది. అందుకే పతి  మాట సతికి వేదవాక్కు, భర్తను బట్టే భార్యకు గౌరవము 
పెరుగుతున్నది. మీరు చాలా మంచి విషయాలు, ఇక ఇంటికి బయలు దేరుదామా, 
ఇంకా చమట పట్టలేదు, ఇంకా కొద్ది సేపు తిరిగావనుకో దేవుడెరుగు, కాళ్ళ నెప్పుల బామ్ ఉపయోగించాలి, అదికూడా నేనే వ్రాయాలి అవసరమా .. అంతదాకా నేను రానులే,  నీవు చెప్పినట్లుగా బయలు దేరుదాం ....

అంత మాట అనకండి, మీరంటే నాకు ప్రాణం, మీ క్షేమమే నా క్షేమము ఏమిటే పొగుడు తున్నావా, తిడుతున్నావా ఏమో నాకర్ధం కావటంలేదు, భగవద్గీతనే అర్ధం చేసుకున్నవారు నామాటలు అర్ధం చేసుకోలేరా ....   ఎందుకు చేసుకోలేను

నీ ఊహలకు ఊపిరి నాది ..., నీ భావాలకు భాండాగారం నాది ..., నీ చిలిపితనానికి చిరునామా నాది ... నీ విరహానికి విహంగం నాది ... నీ ఆర్ద్రతకు ఆలంబన నాది ...నీ వేదనకు వేదిక నాది ... నీ ప్రతి కదలికకు హంస తూలిక నాది ... నీ ప్రతి స్పందనకూ ప్రతిబింభ తోడు నాది ...నీ ఒంటరితనానికి ఓదార్పు నాది ...నీ తుంటరి తనానికి ఆటవిడుపు  నా తెలివి ... నీ మొండి తనానికి కారణం నేను - నీ అమాయకత్వానికి తోడు నా ప్రతిభే ...
 
అబ్బా ఏంతో అద్భుతముగా పలికావు, భర్తకు భార్య తోడు, భార్యకు భర్త తోడు జీవితాంతం ఉండాలి అదేనేను కోరుకునేది ...... అయ్యో నేను కూడా అన్నది అదే అన్యదా భావించవద్దు ... మన ఇద్దరి మధ్య ఎదో ఒకటి అనుకోక పోతే అది సంసారమే కాదు .... అట్లాగా అయితే నన్ను 5 స్టార్ హోటల్ కు తీసికెళ్తావా ... నీవు ఎక్కడికి తీసుకెళ్లమంటే అక్కడికి మోసుకొని తీసుకోని వెళ్ళగలను ...
ఆమ్మో నన్ను మోస్తూ తీసుకెళ్లొద్దులే . తీసుకెళ్తనన్న మాటేచాలు ....

--(())--

**మల్లాప్రగడ రామకృష్ణ కధలు 1***

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ:
ఓ శ్రీమతి ఇది ప్రేమా - సాధింపా 

ఏమండోయి మీరు నిద్రపోయే ముందు ఒక్కసారి అన్నీ తలుపులు వేసారో లేదో చూడండి, టీవి ప్లగ్ తీసేయండి, మంచినీళ్ళు రాగి చెంబుతో తీసుకొచ్చాను, మీరు కష్ట పడతారని ఆపని చెప్పలేదు. అన్న మాటలకు భర్త మాధవ్ అట్లాగే నీవు ఏమిచెప్తే అదే చేయాలిగా, ఒక్కటి ఆటో ఇటో అయ్యేందనుకో ఇక పస్తే నాకు, ఏమిటండి ఆమాటలు మనమే మన్న చిన్న పిల్లలమా మనవళ్లు ఎత్తుకొనే వయసు మనది. ఆమ్మో ఆపని మాత్రం నాకు పెట్టకు, నాకు అంత ఓపిక లేదు, పిల్లలను మోయటం, వాళ్ళ ఏడుపుని తగ్గించడం నావళ్ల కాదు, ఇది నాకు చాలా కష్టమైన పని, నీవు చెప్పిన పనులే చేయుట చాలా తేలిక అంటూ మంచం చేరాడు.

ఏమిటో అప్పుడే అలసి పోయిన్ది,  ఉషోదయం నుండి బొంగరం తిరిగినట్లు తిరుగుతూ, ఎవరో తాడు పెట్టి ఆడించి నట్లుగా ప్రతిదీ శుభ్రం చేస్తూ ఇంటిని అందంగా ఉంచాలి అని పదే పదే అరుస్తూ, చెప్పులు సర్దుతూ పడిన మట్టిని తుడుస్తూ, అన్నీ ప్రత్యేకంగా ఉండాలని సర్దుతూ ఉంటుంది శ్రీమతి రాధ . భార్యని మెచ్చుకుంటున్నాడు మాధవ్ .

అప్పుడే ఏవండీ ఏమిటి ఆలోచిస్తున్నారు నన్ను గాట్టిగా పట్టుకోండి, నాకు పాడు కలలు వస్తున్నాయి, భయంగా ఉన్నది అంటూ కౌగలించుకొని పడుకున్నది. ఇదండీ నిత్య సత్య కాపురం ఎప్పుడు ఏమి జరుగునో ఎవరూ చెప్పలేరు, కానీ శ్రీమతి జరగబోయే వాటిని ఊహించుకుంటూ దానిలో కష్ట నష్టాలు వర్ణించు కుంటూ భాదను సంతోషం వ్యక్త పరుస్తూ ఉంటుంది. ఎప్పుడు నిద్రపోతుందో, ఎప్పుడు మేల్కొంటుందో నేను మాత్రం గమనించలేను.

ఒకసారి నేను నవ్వు కుంటూ ఉన్నాను, శ్రీమతి నిద్ర పోతున్నది కదా అని, మేల్కొంటు ఏమిటండి ఆ నవ్వుకు అర్ధం చెప్పండి, మీరు చెపితే గాని నాకు నిద్రరాదు, ఆ ఏమి లేదే మనపెళ్ళి విషయం గుర్తు కొచ్చి నవ్వు కుంటున్నాను, 30 ఏళ్ల తర్వాత ఎం వేషాలేద్దా మను కుంటున్నారు నిద్రపోతూ అన్నది, అమ్మతోడు ఎటువంటి దురాలోచన లేదు, వద్దులేండి మీమీద అమాత్రం నమ్మకం నాకున్నది నాతొ మాట్లాడే టప్పుడు అమ్మతోడులు, ఓట్లు మనమధ్య తేకండి, నవ్వుకు కారణం చెప్పండి చాలు, అసలు విషయం చెప్పనీయకుండా నీవంతు నీవు మాట్లాడు తున్నావు, సరేలేండి ఇక చెప్పండి
             
వినండి నామాట వినండి  ఉన్నారంటే మనసు ఊరుకోదు, మనసులో ఉన్న విషయాన్ని నోటితో కక్కేయండి, అలా కక్కలేదనుకో మనసు వాదనకు గురి అవుతుంది, దీపం చుట్టూ తిరిగే పురుగౌతుంది,    అందుకే  స్త్రీ - పురుషులమధ్య అవగాహనం, మౌనం ఉండాలి తెలుసుకోండి . 

మౌనంగా పొరాడటం అంటే, మాట కట్టేసి మనసుతో సంఘర్షణ పడటమే..అది చాలా కష్టతరమే..వేరెవరితోనో పోరాడటం ఒక ఎత్తు..స్వీయంగా మనసుతో పోరాడటం మరో ఎత్తు..ఇక్కడ మౌనం నెగ్గుతుందా మనసు నెగ్గుతుందా అనే అంశం ఆలోచిస్తే ..ఎటూ తేల్చలేని స్థితి.. అవి రెండూ ఒకరి లో జరగటమే ఈ సంఘర్షణకు కారణం.. ఎక్కువ సార్లు మౌనమే గెలవొచ్చు..మనసు ఓడిపోవడం వెనకాల రహస్యం పెద్దగ ఏమీ లేదు..మనసు మాట ను వినక పోవడమే కొన్నిసార్లు మౌనానికి గెలుపునిస్తుంది.. మౌనంగా ఉండటమే గెలుపు..ఆ గెలుపుకు సహకరించిందే  వ్యక్తిత్వం, వ్యక్తిత్వం అర్ధం చేసుకోవటం ఎవరి తరం కాదు, కాలాన్ని బట్టి, ఉషోగ్రత బట్టి, ఆకలి బట్టి మౌనం వీడి మనసు అవగాహన అర్ధం చేస్కోవటానికి ప్రతిఒక్కరు ప్రయత్నం చేయటమే మానవజన్మ సార్ధకం, మనసుని బట్టి అర్ధం చేసుకొని ఒకరికొకరు బ్రతకటమే జీవితం.

ఏమిటండి నవ్వు ఆపేసారు నీమాటలకు నా బుర్ర గిర్రమని తిరిగింది, ఇక నవ్వేక్కడొస్తుంది మౌనం గురించి నిద్రబోతు చెప్పావు, ఇక నాకు నిద్ర వస్తున్నది పడుకుంటా, అదే నేను చెప్పింది గురక పెట్టకుండా మౌనంగా పడుకోండి నాకు నిద్రపట్టదు .. అది ఇట్లాగే ఏమో నాకు తెలియదు ప్రయత్నం చేస్తే సాధింపలేనిది లేదన్నారుగా ప్రయత్నం చేయండి అంటూ నిద్రకు ఉప క్రమించింది రాధ, ఎప్పుడు ఘర్కా వస్తుందో అని భార్యకు భాధ కలిగించ కూడదని తెల్లవార్లూ నిద్రపోకుండా మేల్కొన్నాడు మాధవ్ .         

19, ఏప్రిల్ 2017, బుధవారం

Internet Telugu Magazine for the month of 4/2017

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
 


1*కాన్పు మరో జన్మ కదా ?

తాడు బొంగరము లేని అనాధ 
గుండెనిండా ధైర్యముతో ఉంది 
కామాందుని కొరిక తీర్చిన వనిత
నిండు గర్భిణిగా మారిన యువతి 

కడుపులో పెరుగుతున్న బిడ్డను తలుస్తూ 
కూటి కోసం కాయ కూరలు అమ్ము కుంటూ 
ఒంటెద్దు ఓడలా నెట్టు కుంటూ సాగింది 
వైద్యము లేక పోయినా నిగ్రహ శక్తి తో ఉన్నది 

9 మాసములు నిండిన గంప నెట్టిన పెట్టి 
కదిలే కడుపును అరచేత్తో పట్టు కుంటూ 
కూని రాగంతో పుట్టే బాలునికి జోల పాడ్తు
కిరణాల క్రింద నడక సాగించింది పడచు 

రాలేరా కన్నా రా ... బయటికి రా 
ఓర్చుకోరా రా .....   సమయముంది రా 
నేర్చు కోరా రా ... సహనము ఇది రా 
సంపదే రా  రా ...  గొప్ప మనసుతో రా 

వేదాలు నేర్పలేనురా - కధలు చెప్పలేనురా 
కష్టము నేర్పుతానురా - ధైర్యము నేర్పుతానురా 
బ్రతికి  బ్రతికించే మార్గాన్ని మాత్రం చూపు తానురా
మాధవుడే మనకు ఆదరా వేడుకోరా తన్నకురా 

నెప్పులు వస్తున్నట్లు తెలిసింది, ఉన్నది నడివీధి 
నల్లమందు తిన్నట్లుగా మత్తు ఎక్కి కళ్ళు తిరిగే
తెలియని భయం ఒక్కసారి నడకలో ఆవహించే 
నడక వేగము తగ్గించి అడుగులో అడుగు వేస్తూ 

కడుపులో కదలిక గుండె చప్పుడు వేగంతో  
కన్నవారు, భంధువులు తోడు ఎవ్వరు లేక
ఏమిటి నా స్థితి ఒక వైపు వేడి, మరోవైపు దడ
నెత్తిన బుట్ట దించి శరీరాన్ని ఊపిరి బిగపెట్టే 

ఓ దేవా నీవెక్కడ నా కష్టం చూస్తూ ఉన్నావా 
ఓ అమ్మా  దయలేదా నేను చేసిన పాపమేది
నమ్మి  మోస పోవుటమే నేను చేసిన తప్పు 
మొగవాడ్ని వదలి ఆడదానికే ఇందుకు కష్టం 

కాన్పు అనేది ఆడదానికి మరొక జన్మ కదా 
బ్రతు కంతా ఆదు కుంటాడని ఆశ కాదే  
భూమాతకు మరో బరువును చేర్చటం తప్పా
వంశాకురం ఏమోగానీ స్త్రీకి కాన్పు ఒక వరం 

స్దన బరువుల కదలికలను భరిస్తూ 
దిగజారుతున్న ధై ర్యాన్ని చేరదీస్తూ 
వళ్లంతా తడిసి తల తిరిగిన స్థితిని చూస్తూ 
నడకలో కాళ్లకు రాయ్ తగిలి గుంటలోకి పడే 

తెలియ కుండానే కెవ్వు కెవ్వు మని అరిచే 
చెట్టు అనేది లేదు,  గాలి స్తంభించే 
కళ్ళు మూసుకొని ఊపిరితో చేసే ఆర్తనాదం 
శరీరమును కుడి యడముకు కదిల్చే 

ఉచ్వాస నిస్వాసములతో గట్టిగా ఏడ్చే 
అతి కష్టముగా  తొడలు వెడల్పు చేసే 
భాదను తట్టు కోలేక హృదయాన్ని చేతులతో 
గట్టిగా బిగించి ఊపిరితో గట్టిగా మూలిగే 

కరంటు షాకు కష్ట ఒక్కసారి వచ్చే 
కాళ్ళ మధ్య జారీ పడ్డ బిడ్డ కెవ్వు కెవ్వు మనే 
కష్టానికి ఫలితముగా బిడ్డ ఉద్భవించే 
శరీర చల్లదనంతో నీరసంతో మత్తు కమ్మే 

ఓపికతో ప్రక్కన ఉన్న రాయితో బొట్టు కోసి 
కట్టిన చీర సగం చింపి బిడ్డకు చుట్టి 
నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ 
బుట్టలోనివి అక్కడే క్రుమ్మరించి  
గుడ్డలో ఉన్న రక్తపు గుట్టును బుట్టలోపెట్టి 
నాకొచ్చిన కష్టం మరెవరికి రాకుండా చూడు దేవా
నేను కోరేది అది ఒక్కటే, అది ఒక్కటే .  

( ఈ కవిత నా ఆలోచన మాత్రేమే - స్త్రీల కష్టం 
ఎంత వర్ణించిన తక్కువే )

3. తప్త - స/భ/త/త/గ 
13 అతిజగతి 2356 

IIU UII UUI UUI U -13



మనసే అల్లిన వేదాంగ భావాలు గా 

వయసే విప్పిన పుష్పా0గ కోర్కేలు గా 
తనువే ఎప్పుడు సాహిత్య సంగీత గా 
ప్రేమయే ఇప్పుడు సద్బావ సంతోషగా 



వినుటే వింతలు - చూడాలి అర్దాలుగా 

మలుపే మాయలు - మందిర భాష్యాలుగా 
పరువే ప్రేమల  - సంసార సంతోషి గా 
మగువే సేవల - శృంగార వేషాలు గా 


కలలో కమ్మని -చిత్రాలు చూసేను గా 

చలిలో కౌగిలిలో - జక్కగా  వెచ్చ గా  
కురులే విచ్చెను - కళ్ళల్లొ  గమ్మత్తు గా 
మరులే కొల్పెను - పంతాలు విద్దూరంగా  



కదిలెన్ నా మదిలో - గమ్మగా గీతికల్

మెదిలెన్ నా కలలో - వేగమే రమ్మురా 
కరముల్ నీ వలలో - చిక్కెనే మత్తుకే 
వెలిగించన్ దివెలన్ - వేగమే రమ్మురా
  
--((*))--


 4. *అక్షర  మాల  (కవిత )
ఛందస్సు 

మదిర నీకేలరా -
 మధువు నేనిత్తు -
 మానసమ్మిత్తు

వ్యధలు నీకేలరా - 
వనిత నేనుండ -
 వలపుతో నిండ

తక్కువ చేయనురా -
 తాపము చూడుమురా -
 తమకం విడుమురా

భాధలు ఎందుకురా -
 భద్యత నాదియురా -
 భారము నాదియురా

ఆకలి అణకురా -
 ఆశ లు నీకేనురా -
 అంతయు పొందుమురా

దాహము తీర్చుకోరా  -
 దాపరికం వద్దురా  -
 దావాలనం తగ్గునురా      

సుఖాలు మనవిరా  -
 సంతోషాలు మనవిరా  -
 సంబరం మనదిరా

కోపాలు మరువురా - 
కోలాట ఆడుమురా  -
 కోరిక తీరునురా

మదిర నీకేలరా -
 మధువు నేనిత్తు -
 మానసమ్మిత్తు

వ్యధలు నీకేలరా -
 వనిత నేనుండ -
 వలపుతో నిండ

పక్క చూపు నీకేలరా -
 పరువం నేనిత్తు -
 వలపు అందిస్థా

లేదని అనుకోకురా -
 లోకాన్ని చూడరా -
 లోకులను గమనించారా  

కలవరింపు ఎందుకు - 
కనులముందు ఉండగా -
 కనువిందు చేస్తుండగా

పలకరింపు చూపరా - 
పక్కను మరువకురా -
 పదిలంగా ఉందాంరా

పోగొట్టుకొంటిరా -
 పొగమంచులోనఁ -
 బొదరింటిలోన

నాగవేషణ యెల్ల - 
నన్ను కన్గొనుట -
 నగుచు నే మనుట

సాన పట్టుమురా -
 సతతము కలవరా -
 సరిగమ అనరా

వేషము వద్దురా - 
వేగిర రమ్మురా - 
వెతలు తీరునురా

రాగవీణను మీటె -
 రమణి రంజిల్ల -
 రవము రాజిల్ల

యోగ మేమిటొ నాది -
 యురికి యొప్పారె -
 నురము విప్పారె

రామకీర్తన పాడే -
 రవళి రంగరించి -
 రసము శోభిల్లే

వేగము మరిచా -
 వేకువ చేరితి -
 వేదన తీర్చితి

--((*))--

5. మనోహారి -2 

(1) మల్లాప్రగడ రామకృష్ణ (ఛందస్సు)
అపరంజి  


అపరంజి బొమ్మవివి - నీవు మనసివ్వు 

కనుపాప మల్లివివి - నానావ రేవు 
అనురాగ నవ్వులతొ - నాకు సిరి పంచు 
సుఖభోద చేయవలె - నానావ రేవు


కలయందు మాటలతొ - ఆదరము చూపె  

మనసంత సంతసమె - నానావ రేవు
తనువంత తాపముతొ - ఉంటె మతి పంచె 
సుమలాస్య శాంతమునె - నానావ రేవు 


అరిటాకు తాపసివి - కాలమును బట్టి 

అలకొద్దు  ఆకలివి -  నానావ రేవు        
అనురాగ వాహినివి - యందముల ప్రోవు 
నను నీవు చేకొనుము - నానావ రేవు
 --((*))--

ప్రాంజలి ప్రభ -6. లలిత లేక అను - I III UUI
న-య-ల, యతి లేదు (ఛందస్సు )

కమలము నీ రూపు - లలితము నీ చూపు
సమయము నీ సేవ - వినయము నీ కీర్తి

సరళము నీ దృష్టి - పదిలము  వాక్దృష్టి
అనునయ నీ సృష్టి - లలితము నీ ప్రేమ 
 
లలితము రాగాలు - లలితము భావాలు
లలితము కోపాలు - లలితము దోషాలు

అనునయ మాలించి - నను పరిపాలించు
మనసును లాలించి - మనుగడ చూపించు

మనసును పండించు  - సుఖమును పంచాలి
భయమును తుంచాలి  - అభయము ఇవ్వాలి

నయనము కవ్వింపు - సుమసుధ అవ్వాలి
కరముల కవ్వింపు - పెదవుల భాష్యాలు   

 --((*))--

రక్షణ కవచం 'శ్రీచక్రం'
శ్రీచక్రం లేదా శ్రీయంత్రం ఒక పవిత్రమైన యంత్రం. గణిత శాస్త్రీయ విధానంలో, తనకు తానై ఆవిష్కరించుకొన్న మహా యంత్రం ఇది. సృష్టి వైచిత్రినీ, రహస్యాలను ఇంత సంపూర్ణమైన అధ్యయనంతో అన్వయించి సాధకుడి సకల మనోభీష్టములను సిద్ధింప చేయగలిగిన ఇలాంటి యంత్రం మరొకటి లేదు.
శ్రీచక్రంలో 9 అనుసంధానించబడిన త్రిభుజాలు కేంద్రంలోని బిందువు చుట్టూ అమర్చబడి ఉంటాయి. ఇది శ్రీ లలితా లేదా త్రిపుర సుందరి అనే దేవతను తెలుపుతాయి. దీనిలోని 4 త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివున్ని లేదా పురుషున్ని సూచిస్తాయి. 5 త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. అందువలన శ్రీచక్రం స్త్రీపురుషుల సంయోగాన్ని తెలుపుతుంది. ఇందులో 9 త్రిభుజాలున్నందున దీనిని నవ యోని చక్రం అని కూడా అంటారు.
శ్రీచక్రంవంటి యంత్రం, నవావరణ పూజ వంటి పూజ మరొకటి లేదు. బీజాక్షరాలు లేని యంత్రం, దేవతా నామంలేని మంత్రం, ఏ రూపమూ లేని తంత్రం. శ్రీచక్రంలో బీజాక్షరాలు రాసి యతులు పూజిస్తారు. కాని సాధారణంగా ఏ విధమైన బీజాక్షరాలు లేకుండానే శ్రీచక్ర యంత్రం మహా పవిత్రం, శక్తివంతం అయింది. అలాగే ఈ యంత్రం మంత్రమైన పంచదశిలో దేవతానామమేదీ రాదు. ఉండదు. మామూలుగా మంత్రాలలో బీజాక్షరసహితంగా ఆయా ఉపాస్యదేవతల నామాలు కూడా వుంటాయి. కాని పంచదశిలో ఏ దేవతానామమూ ఉండదు. శ్రీచక్రోపాసనా విధానంలో ఏ దేవతా స్వరూపమూ ఉండదు.
శ్రీచక్రం ఒకరు నిర్మించింది కాదు. మహర్షులు, మంత్ర ద్రష్టలు దర్శించినటు వంటిదీ చక్ర రాజం. అధర్వుడనే వేద పురుషుడు మానవ కల్యాణానికై తాను దర్శించిన ఈ యంత్ర రాజాన్ని ప్రపంచానికి ప్రసాదించాడనేది చెబుతారు.
శ్రీచక్ర ఆవిర్భావ పురాణగాథ
బ్రహ్మాండ పురాణంలో భండాసురుని బాధలు పడలేక ఇంద్రాది దేవతలు పరాశక్తిని ప్రార్ధించగా ఆమె చతుర్సాగరంలలో ఒక సాగరాన్ని ఎండబెట్టి మహా హోమ గుండాన్ని నిర్మించి యాగం చేయమని ఆదేశిస్తుంది. దేవతలామె ఆజ్ఞను శిరసావహించి తమ దేహ ఖండాలను సమిథలు చేసి హోమం చేస్తారు. అప్పుడా మహా అగ్ని గుండంలో నుంచి 'చిదగ్ని' అయిన ఆది పరాశక్తి శ్రీచక్రాకారంగా ఆవిర్భవించి 'దేవకార్యసముద్యుతురాలై' భండాసుర వధకావించింది. శ్రీచక్రాకారంలోని ఆ దేవి.
కోటిసూర్య ప్రతీకాశం, చంద్రకోటి సుశీతలం,ల
తన్మధ్యతస్స ముదభూర్చక్రాకార మనూపమం,
తన్మధ్యతో మహా దేవీ ముదయార్క సమ ప్రభం'
చక్రాసుర రూపంలో కోటి సూర్య సమప్రభలను విరజిమ్ముతూ కూడా మళ్లీ కోటి చంద్ర సుశీలతంగా, చల్లగా ఆ మహాదేవి ఉదయార్క సమప్రభలతో అరుణారుణకాంతులతో 'చిదగ్ని కుండ సంభూత' అయి వెడలి వచ్చింది.