26, ఆగస్టు 2018, ఆదివారం

( అధిక్షేప ప్రేమ లీల )


ప్రాంజలి ప్రభ. నేటి కవిత
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 
కవితా పంచాంగాన్ని చదవండి  

1. మేషం(మేక) 
చేతలోన సున్న, మేతప్రేమయే మిన్న 
పనిలో సున్న, మాటలు మిన్న 
విషయ మేది లేకున్న 
వింత పోకడ చూపుతూ ఉండు 

2. వృషభం(ఎద్దు) 
ఎద్దు లాగ తిరుగు - మొద్దులాగా నాలుగు
సద్దు చేయక కరుగు - వద్దు అన్నా మెరుగు 
విషయమేది లేకున్నా 
శుద్ధ మొద్దు స్వరూపంగా ఉండు 

3. మిధునం(దంపతులు) 
పగలు రేయి సరిగమలు
బిడ్డల మేలు కల్వరింతలు 
సర్దుబాటు సంప్రదింపులు 
విషయమేది లేకున్నా 
ఒకరికొకరు వాదనలు మెండు 

4.కర్కాటకం(ఎండ్రకాయ/పీత) 
" బీచి " గట్టులందు బీటు గొట్టుచునుండు 
అలలా కళలు గానే అల్పజీవులైయుండు 
కష్టములు కోరి తెచ్చుకొనుచుండు 
విషయమేది లేకున్నా 
అల్పజీవులుగా చేతకాక తిరుగు చుండు    

5.సింహం 
చిన్నవారి నెపుడు చీల్చి చెండగబోదు 
గజము కున్భస్థలమునే  గొట్టు  ఆహారం పొందు ; 
జిత్తుల మారి నక్క మాటకు మనసు మార్పు చెందు   
విషయమేది లేకున్నా 
రాజుగా డాంభికము చూపి తర్ఫీదు పొందు  

6. కన్య 
ఊకదంపులన్న, ఊసులన్న ప్రియము 
పెళ్ళి యన్న విసుగు, ప్రేమ మోజు; 
నోటగొలుసు నుంచు నోమును సల్పెడు 
విషయమేది లేకున్నా 
వంపు సొంపులతో వలవిసురు చుండు  

--((**))--

ప్రాంజలి ప్రభ. - నేటి కవిత 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 
ముందొకమాట - వెనకో మాట 
మాట్లాడే వారి మస్తత్వం చదవండి 

కల్లోలాలతో  కళ్ళాపి జల్లి 
మూర్ఖత్వంతో ముగ్గు జల్లి 
సమస్యలతో రంగు జల్లి    
పూజలతో స్వాగతం పల్కే 

దు:ఖాలతో కన్నీళ్లు జల్లి 
దరహాసంతో వత్తిళ్లు జల్లి 
వేదాంతంతో మత్తుళ్ళు జల్లి 
పూజలతో స్వాగతం పల్కే 

మాయాజాలం మనసుకు జల్లి 
అంతరాంతరాలు ఆశలు జల్లి 
నక్షత్రాల గాలి తళుకులు జల్లి 
పూజలతో స్వాగతం పల్కే

దౌర్జన్యంతో మాటలు జల్లి 
చేష్టలతో కష్టాలు జల్లి 
కోపంతో కారాలు జల్లి 
పూజలతో స్వాగతం పల్కే
--((**))--



నేటి కవిత ( అధిక్షేప ప్రేమ లీల ) 
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

41 . శక్తి లేని వాడు సాధుత్వం వహించు
       - సంపాదించ లేనివాడు ధర్మం బోధించు

       రమణి లేకున్నా విరక్తి మంచిది యంచు
       - వ్యాధి పీడితుడు దైవాన్ని నమ్మి యాచించు

       వృద్దత్వము నందు పాతివత్యముగూర్చి వచించు
        - స్త్రీలమధ్య తగువ వచ్చినా చెప్పలేక సన్యసించు

       భారంబు పైబడ్డా నిజం గ్రహించి శాంతి వహించు
        - సర్వం కోల్పోయినా నీతోడు నిన్ను భరించు

విరక్తిగా ఉంటె ఏమి ఫలము - సంయుక్త భక్తి కలిగితే ఫలము
తెలియక తప్పుచేసినా తెలిసి తప్పుచేసిన అనుభవ ఫలము
అందించుట ఇది వేణు గోపాల ప్రేమసుమా 

--((**))--


42. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేకపోవచ్చు
        - పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగవచ్చు  

      తెరచాటున సరసాలు బయట పడక పోవచ్చు 
      - మానభంగానికి రుజువు లేకపోవచ్చు 
\
      వడ్డున పడ్డ చాపలా గిల గిలా కొట్టుకొనవచ్చు
       - మగణిని మత్తులో ఉంచి సంపాదించ వచ్చు 

      అప్పులు చేసి నడివీధిన పడవచ్చు 
      - బ్రతికి బ్రతికించు అనే సామెత మరువ వచ్చు 

ఏది ఏమయినా తల్లి తండ్రులు పిల్లలను - పిల్లలు తల్లి తండ్రులను మరచినా 
వారు బ్రతికి ఉన్నా మరణించిన వారితో సమానమని చెప్పవచ్చు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--

43. మేళము మ్రోగని ఊరు - తిట్లు తిట్టని నోరు 
      బిడ్డల మధ్య ఉందని పోరు - ఉప్పు పులుపు లేని చారు   
      పొలములో ఎదగని నారు - ఎండకు కరగని తారు
      గుర్తించ బడని పేరు - బంధువులు పిలిచినా రారు 

పై వాటిలో ఎవరు గుర్తించిన గుర్తించక పోయినా 
మనిషి మేధస్సుతో ఆదుకునే వారు మాత్రం ఉంటారు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా  

--((**))--


44.  త్యాగముతో కూడిన ధనమున్నూ
        - గర్వము లేని విద్య యున్నూ 
       
       క్షమ కల్గిన శౌర్యమున్నూ 
       - ప్రియవచనంతో దానమున్నూ 
      
       నిత్య ప్రార్దనతో దైవమున్నూ
       - అనారోగ్యునికి ఔషదమున్నూ 
      
        ఇచ్చు పుచ్చుకొనే నిర్మల మనసున్నూ 
        - అపకీర్తి కన్నా చావున్నూ 

ఒకరికొకరు తోడుగా మానవత్వాన్ని నిలబెట్టి 
మౌనవత్వాన్ని వీడి తన్మయత్వాన్ని చెందుటే 
ఇది వేణుగోపాల ప్రేమ సుమా  
    -
-((**))--

45.   ఒకరికొకరు తోడైనట్లు 
         - తనువుతపనతో ఒడి చేరినట్లు  
        
        నీడలు ఏకమైనట్లు 
        - చెవిలో గుసగుసలు సోకినట్లు 
        
        కళలతో కరిగినట్లు 
         - శ్వాస వేగముగా మారినట్లు
        
        యదలో కదిలినట్లు 
       - నువ్వు నేను ఒకటైనట్లు 

ఇట్లు ఎట్లు అనక, మత్తులో 
గుబాళింపులు కమ్ముకున్నాట్లు   
సిగపట్లు లేని పట్లు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--

46.  అచ్చిన వాని ఇల్లాలి గట్టగజూచు 
       - ఇవ్వవలసిన దండ ఇచ్చా ననుచు    
       
        అలుసైనా వాని ఇల్లు ఆక్రమింప జూచు
        - తనకిష్టమైన వాడైన పాదాలు పట్టుచు  
       
        అణువుగా చూచు వానిని తప్పు పెట్టుచు
         - గోరంత తప్పును కొండంత చేయుచు 
       
        అలక చూపి బంధువులందు దూషించు
         - చీటికి మాటికీ తప్పు పట్టి వేదించు 

దుర్ణయుల దుర్గుణంబులఁ ద్రోయరాదు
దానికి ఫలంబు యమ సన్నిధాన మందె
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((*)--
     



47.    పరుల కొంపలు కాల్చి రావచ్చు
           - తన ఇల్లు కాలితే నవ్వక ఏడ్వా వచ్చు  
         
         పడచు గుఱ్ఱము తోక బట్టి ఈడ్వా వచ్చు
           - ప్రేమనుండి తప్పించుకోలేక పోవచ్చు
         
         పెద్దపులి జనంలోకి రావచ్చు 
         - దాన్ని చూస్తూ భయము లేకుండా తిరగవచ్చు   
         
          కందిరీగలు ఒక్కసారి దాడి చేయవచ్చు
           - మచ్చబడ్డ మాన్పించ లేక పోవచ్చు  

గార్యతతులెల్లఁజేసి తత్కార్యఫలము
లనుభవింపుదు రాయాయి యవసరముల
ఇది వేణుగోపాల ప్రేమ సుమా 

--((**))--


48.   వద్దన్నా రాంద్రాన్వేషణా సక్తి ఎందుకు
          - యతి వినయంబుతో బెదిరించుట ఎందుకు
      
        కార్యం సఫలం అవుటకు గర్వం ఎందుకు 
         - సమాయంబు కాదంటూ త్రిప్పుటెందుకు
       
        దర్శనం కోసం వస్తే అడ్డుపెట్టుటెందుకు
         - పెడమోముతో తిరస్కరించుట ఎందుకు
        
        నీవు లోభంతో గదిమి వేయుట ఎందుకు
         - సమాధానము చెప్పక మౌనం ఎందుకు       

లిట్టి ప్రభుదుర్ణయపుఁ జేష్ట లెఱుగలేక
వెంబడించెడి వాడెపో వెఱ్ఱివాడు
దానికొడ బడ డింగిత జ్ఞానశాలి
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--



49. ఋణశేషమ్ము, శత్రు శేషమ్ము ఉన్నా కీడు
      - అగ్ని శేషమ్ము, జల శేషమ్ము ఉన్నా కీడు 

      రక్తి శేషమ్ము, నిద్రా సక్తి శేషమ్ము ఉన్నా కీడు
       - భక్తి శేషము, యజ్ఞ శేషమ్ము ఉన్నా కీడు         

      కుత్సుతిని శేషమ్ము, స్త్రీ శేషమ్ము ఉన్నా కీడు
       - నర్తకి శేషమ్ము, కాపాడు శేషమ్ము ఉన్నా కీడు  

        అర్చకుని శేషమ్ము, దాన శేషమ్ము ఉన్నా కీడు
        - ప్రేమ శేషమ్ము, పొరపాటు శేషమ్ము ఉన్నా కీడు     

ఇట్టి నయమార్గ మెఱుఁగక యిచ్చవచ్చి
నట్లు చరియించువారికి హానివచ్చు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--


50.  పెట్టి పోషించనాడే చుట్టాల పిలుపు
        - కలిమి ఉన్న నాడే వారకాంత వలపు
     
        సేవ చేసి నప్పుడే అధికారి గుర్తింపు
         - దయ చూపిన నాడే వనితా రక్తి పిలుపు
     
         అవసర మున్న నాడే ప్రేమ మలుపు
          - ఆశ ఉన్న నాడే ఆకలి కుదుపు   
     
         మంచి మాట ఉన్న నాడే ఆదరింపు
          - మగని మాట నమ్మిననాడే మెరుపు

ఆత్మశక్తి తొలగిన యవసరమునఁ
దనకు నెవ్వరు గానిది తథ్యమరయ
ఇది వేణు గోపాల ప్రేమ సుమా

--((**))--



51. అల్పునిపై ప్రేమ చూపినా, పగవాని పక్క చేరినా
       - మైత్రి దూరముగా ఉన్నా కార్య హాని
     
      గర్విష్టి మాటలు విన్నా, నాయకులపై ప్రేమ పెంచుకున్నా
      - మనసు మనుగడకే హాని 
     త్యాగంబు చేయకున్నా, భోగము పై ఆశలు పెంచుకున్నా
       - అక్రమసంపాదన ఉన్నా హాని
     స్నేహానికి ద్రోహం చేసినా, తక్కువచేసి తూలనాడినా
       - ప్రేమ ఇచ్చి పొందాక పోయినహాని   

ఇట్టి నయమార్గమెరుగక యిచ్చవచ్చి
నట్లు చరియించువారికి హానివచ్చు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా

--((**))--

52  .  సూర్యుడు వెలుగును పంచినా
          - విశ్రాంతికి చీకటిని ప్రవేశించిక తప్పదు   
       
         వెలుగుచుట్టు దీపపు పురుగుతిరిగినా
           - మృత్యువాత పదాక తప్పదు
       
          చీమలు కష్టముతో గూడు ఏర్పరుచు కొనినా
           - భుజంగానికి నిలయమావ్వగ తప్పదు
       
          వాల్మికములో సర్పము దాగి ఉండినా
           - గరుడకు ఆహారము కాక తప్పదు

బలము గలవాడు దుర్బలు బాఱదఱుమ
దైవమొక ప్రాపు గల్పింపఁదలఁపకున్నె
పొరలు నే ప్రొ ద్దహంకారమున నరుండు
ఇది వేణుగోపాల ప్రేమ సుమా 

--((**))--


53.   తన వారి కోరికలు తీర్చలేడు
         - ఇతరులకొరకలు తీర్చుటకు వస్తాడు
     
         కుక్క తోక వంకర తీయలేడు
         - వంకర బుద్ధి మార్చుటకు ప్రయత్నిస్తాడు 
     
         వేళ్ళ వంకరలు మార్చ లేడు
         -  సంకలు లేని కుటుంబాన్ని నిస్తానంటాడు
     
         అనారోగ్యునికి మందివ్వ లేడు
         - రోగం మాన్పిస్తానని నక్క బుడ్డి చూపుతాడు 

దైవక్ర్తమైన వంకర దలఁగ ద్రోయ
వశముగాకుండు గద యెంత వానికైన
ఇది వేణు గోపాల ప్రేమ సుమా

--((**))--


54.  విధాత కైనా మృత్యువు తప్పదు
       - దీర్ఘాయువు ఉండే మందు లేదు కనుక
     
       మంత్రిగా ఆహారపదార్ధాలు పంచినా
         - ఇంకి పోదు జగతిలో అనావృష్టి
     
       పిడుగువల్ల మృత్యువాత పడక తప్పఁదు
        - గంగ పొంగు ఆపుట కష్టం 
     
       దుర్దశ నిన్ను వెంబడించినప్పుడు
        - దాచిన సన్నికల్లు కుడా మాయమవ్వు

అర్కుఁడుదయింపఁ జెడునె గుహా తిమిరము
తాళ మెత్తుక పోవ మందసములోని
విత్త మలపడకుండెనే వెచ్చమునకు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--

55.  పనస ఫలమునకు బిరుసైన తొక్క ఉండిన
        - ఆరగించంగ యోగ్యము గాక కుండునా
     
       దోడిమ పట్టున ఉన్న జీడీ తొలగించి ఉండిన
        - మామిడి పండుకు మాధుర్యము వెడలునా   
     
        అఖిలాంగ సీమ యొయ్యారంబు కల్గి ఉండిన
          - జత కూడిన స్త్రీని దేశాన్ని వదలి వెడలునా
     
        చిరు జల్లుకే నెమలి పురివిప్పి ఆడు చుండిన
         - తాకక ఆడ నెమలికి గర్భమ్ము రాక మానునా                    

గుణము బహుళంబు దోషంబు గొంచ మైనఁ
గొదవఁ జెందక యుండు నెక్కుడు గుణంబు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా

--((**))--


56.   గోవధ గావించు జనమ్ములు
        - రోగార్తులు కాక, ఋణాత్ములగుతారా  
     
       గుడికట్టి తులసికోట కట్టినా
       - దుర్మార్గుడు ధర్మనిరతుడిగా మారుతాడా 
   
        తటాకము చుట్టూ గోడ ఖండించినా
        - నీటిలోని చేపలను రక్షించి మాన్యుడౌతాడా     
     
        కష్టముతో శాఖములను పండించినా
         - భూసురులకు అర్పించక తినగలుగుతాడా 
   
ప్రబలపాతక పూర్ణుఁడల్పంపు సుకృత
మునను శుద్ధుండు గాకుండు ననుట నిజము
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--

57. ఎవరి కెవరు ఈ లోకంలో అనుకోకు
        - అంతా నా వారని అనుకో
   
      ఏ నిముషాన ఏమి జరుగునో అనుకోకు
         - జరిగిన దంతా మన మంచికే అనుకో
   
       ఏ మతం, ఏ కులం, ఏ జాతి అనుకోకు
        - మానవాభ్యదాయానికి తోడ్పడే మనుష్యులనుకో
   
       ఏ మార్గం, ఏ దీపం, ఏ దైవం అనుకోకు
         - మనుష్యుల్లో ఉన్న దైవాన్ని గుర్తించి మసలుకో

చీకటి వెలుగులు తప్పవు - మంచి చెడు చేయక తప్పదు
సుఖసంతోషాలతో సముద్ర కెరటాలను దాటుకుంటూ
పోవటమే నిజమైన జీవితం
ఇది వేణు గోపాల ప్రేమ సుమా       

--((**))--


58.  ఆనాటి విషయం మరిచిపో
        - అది ఆవేశముతోనే, అనాలోచనతోనే చేసినది
     
       జరగబోయే విషయం గుర్తు తెచ్చుకో
           - బంగారు భవిషత్తుకు వేయాలి పునాది
     
        చెడును మరచి మంచి చేసి శోభా తెచ్చుకో
        - కాలంతో పాటు నడక అనేది అనాది
   
         ప్రాణుల కోసమైన ప్రాణం నిల్పుకో
         - బ్రతికి బ్రతికించట మానవత్వానికి ఉగాది

ఏనాటికి మారదు, ఏనాటికి తెలియదు, ఏబుర్రకీ ఎక్కదు
ఆనుకోవటాం పొరపాటు, కాలు జారితే కడుక్కోవాలి
శీలం జారినా మృగాలను ఎదిరించి బ్రతకాలి
ఇది వేణుగోపాల ప్రేమ సుమా   

--((**))--


59.   ఏ నాటి పూజయో, ఏ నాటి తపమో
        - ఈనాడు నేనంద నిట్టిది కృప
   
        ఏ ప్రేమ ఫలితమో, ఏ నీతి ఫలితమో
        - ఈ నాటి సంసార దయ దీప
   
        ఏ ధర్మమో, ఏ సత్యమో, ఏ న్యాయమో
        - ఈ పగలు రాత్రిల్లు ఉండే జత పాప
   
        ఏ  ప్రేమ సుఖమో, ఏ బిడ్డ ఫలితామో
         - ఈ తల్లి జ్ఞానమిచ్చెడి  సత్యస్వరూప       

నిశ్చింతయే తాను నిలువ నా జతగఁ
నాశ్చర్యమిడుగాని యందించు హితము
ఇది వేణు గోపాల పేమ సుమా

__((**))--


60. నంది గణం బెక్కి నడివీధినే వచ్చెరో
       - దెయ్యమ్ము, దమ్ము మంత్రి కలసి వచ్చెరో 
   
      దైవమో, కాటికాపరో, యీరుఁడో వచ్చెరో
        - యీసృడైతే లేదె యెనకఁ దోఁకతో వచ్చెరో
   
      గణపతితో అమ్మ సీతమ్మ వచ్చెరో
       - చీతామ్మ రైయుంటె సింగంతో వచ్చెరో
   
      మంచిది చూతము మారమ్మ వచ్చెరో
       - మారమ్మరో మాలయేది, బలి ఏమి తెచ్చెరో 

ప్రాకృత జనంబు లీరీతిఁ బలుకుచుంద్రు
తెలివి యించుక లేకను దెలిసి కొనక
ఇది వేణు గోపాల ప్రేమ సుమా

--((**))--


61. బడవాలకు లేని భడవాలకును రంకు
        - రాట్నాలకును శుంఠ రండలకు
   
       కలిమి దుండగులకు గారడీ విద్యకు
        - దోడబోతుల కాట దొమ్మరులకు
   
       సారాయి నీళ్ళకు జాతరగాండ్లకు
       -  బంగు భాయీలకు బందెనకు
   
        సుంకరులకు వర్ణ సంకరులకుఁ
        - పొత్తొసంగెడి తొత్తు ముండలకు

లోభితనమున నేడ్చ నిద్రాభవాని
గడనవీండ్లకె కాక సత్కవుల కౌనె
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--


62.  మునివర్యులు, మానవులు తపసెల్ల
        - బోగొట్టుకొనుట సంభోగమునకె
   
       లోకాల దేవతలు కూడా భ్రమగొని
       - మురియుట యీ పాడు భోగమునకె     
   
       మంచి అని తలంచి నేర్చురు విద్యలు
        - కోటినేర్చుట పొట్టకూటి కొరకె
   
        రాజ్యమేలే ప్రధాన మంత్రి అయినా
         - గడ కేడు జేనల కాటి కొరకె    

కీర్తి యపకీర్తి దక్కఁ దక్కినవి నిల్వఁ
బోవు శాశ్వత మౌనట్లు పుడమి మీద
ఇది వేణు గోపాల ప్రేమ సుమా  
--((**))--


6౩.  దైవాన్ని దూషించేవాడు, భారతా వనిపైన
         - బ్రతికి ఉన్నా లేనట్లు లెక్కే
     
       మాత్రృ దేశం గురించి హీనంగా మాట్లాడిన
         - దేశంలో ఉన్నా లేనట్లు లెక్కే
     
       తల్లి తండ్రలను ప్రేమతో గౌరవించకపోయిన
         - కుటుంబంలో ఉన్నా లేనట్లు లెక్కే
     
        స్త్రీ ని ప్రేమించి ప్రేమ పోంద లేక పోయిన
          - సంసారిగా ఉన్నా లేనట్లు లెక్కే

కాలంతో పాటు, దేశాన్ని బట్టి, మనసును బట్టి
 అర్ధం చేసుకొని జీవితమే మానవాభ్యుదయం
ఇది వేణుగోపాల ప్రేమ సుమా 

--((**))--


64. ఇది నా ప్రాంతమని ఏ రీతిగా పలికెద
      - నేను ఒకచోటనే ఉండునని ఏల చెప్పద
   
      ఎవ్వరికి చెందిన వాడవని నీకు తెల్పెద
       - నేను స్వేశ్చగా ప్రేమను అందరికీ ఇచ్చేద
   
       నా వృత్తి, ప్రవృత్తి ఇదే నాని ఎలా చెప్పెద
       - పగలు రాత్రి మేల్కోగలనని వక్కాణించెద
   
       సమస్త విద్యలను గురువుగా ఎలా బోధించెద
        - స్త్రీ, సిరి, ఇచ్చి సహకరించేది కృష్ణే కదా కథ       

ప్రతి ఒక్కరూ ఎవరికీ ఎవరు కారు
అయినా ప్రేమ, దయ, కృప, ధర్మం,
పశ్చాత్తాపం చుట్టూ తిరిగే వారే
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--


6 5.   చెవులకు ఇంపు సామవేద గానం - కళ్ళకు ఇంపు ప్రకృతి వైనం
         నాసికకు ఇంపు పరిమళ మౌనం - ముఖానికి ఇంపు దర్పణ వైరం
         కేసాలకు ఇంపు పుడమి తైలం - నోటికి ఇంపు అధరం ఆస్వాదం
         మీసానికి ఇంపు మొగతన గర్వం - మనసుకు ఇంపు మమతానురాగం

మానవునకు ఎన్ని ఉన్న ఆహం చేరితే
సర్వం అయ్యోమయ్యం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా

--((**))--


66.    దిక్కు తోచకున్నది జాబిల్లి వెన్నల
          - కంటి చుక్కలు సాక్షిగా గగనాన
   
         ఆర్తిని తెల్ప హృదయ హాయి లీల
          - ఆరోగ్యం పంచె స్నేహప్రేమ జగాన
     
         పుడమి పురిటి నెప్పులు తగ్గే లీల
          -  మనసు తనువు ఏకమయ్యే సమయాన
       
         వయసు కరిగి తనువు చల్లనయ్యె లీల
          - రక్తి ముక్తి శక్తి యుక్తి కలిసే తరుణాన

ప్రకృతి పరవశానికి లొంగని వారు లేరు
జీవన్ముక్తి కీ, స్నేహ భుక్తి కీ, మన: శాంతి కీ
ఒకరికి ఒక్కరవ్వటమే లోక ధర్మం
ఇది వేణు గోపాల ప్రేమ సుమా         

--((**))--


67.   పాలన లేని మంత్రిని గెల్చుట రోత
         - యోదార్యహీనుని నడుగుట రోత
   
        కులహీనజనులతో నడుగుటయు రోత
         - గుణహీనకామిని గూడ రోత
   
        పాషా౦డ జనులపై భ్రాంతినొందుట రోత
          - మధ్యపాయుల తోడ మైత్రి రోత
     
        తుచ్ఛంపు బణులకు నిచ్చనొందుట రోత
         - చెలఁగి సద్గురు నిండా సేయు రోత

వేదబాహ్యుల విద్యలు వినుట రోత
క్రూరుఁడైనట్టి హరిభక్తుఁ గూడ రోత
ఇది వేణు గోపాల పేమ సుమా

--((**))--

68. పసచెడి యత్తింటఁబడి యుండు టది రోత,
      - పరువు దప్పినయెడ బ్రతుకు రోత
   
      ఋణపడి సుఖమున మునిగియుండుట రోత,
       - పరులకల్మికి దుఃఖపడుట రోత
   
      తన కులాచారంబుఁ దప్పి నడువ రోత,
       - ధరణీశునకు బిర్కితనము రోత
   
      పిలువని పెత్తనంబునకుఁ బోవుట రోత,
       - యల్పుతో సరసంబు లాడ రోత

ఒకరి యాలిని గని వగనొంద రోత
సతికి జార పురుషుని బ్రతుకు రోత
ఇది వేణు గోపాల ప్రేమ సుమా

--((**))--

69. హిమాలయం ఎక్కినంత మాత్రాన వీరుడు కాదు
         - కాకి కూస్తే కోకిల గానంలా ఉండదు 
      
గంగ మునిగినంత మాత్రాన మోక్షమన్నట్లు కాదు
         - తల వెండ్రుక ఎప్పటికీ దర్భగా మారదు
     
 తెగతిని తలెగరేసి నంతమాత్రాన బలాఢ్యుడు కాదు
         - దున్నపోతు ఎప్పటికీ  ఏనుగు కాదు 

     పొదుగు లావై ఎంత పొడుగుగా పెరిగిన స్థిరం కాదు
        - కుక్క ఎన్నటికీ గోవు కాదు

ఉన్నత స్థానమందు గూఎచుండగానె
భ్రష్టు భ్రష్టే యగుం గాని శిష్టుగాడు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--

70.   అప్రయోజునకు ఆర్భాటము ఎక్కువ
         - ఆరిపోయే దీపానికి కంటి ఎక్కువ
   
       బ్రతుకు జాలిబిడ్డకు ఖర్చు ఎక్కువ
        - మోసం చేసేవారు చనువు చూపుటెక్కువ
   
       అసలు అదే లేని వాడికి మిడిసిపాటు ఎక్కువ
        - ఎదగలేని మనిషికి ఆకలెక్కువ 
   
        ముందుకన్నా వెనుక వెనకవారికి తొందరెక్కువ
        - రోజూ సుఖం పంచేవారికి మెరుగు ఎక్కువ

బెరుగుటయు విఱుగుటకని యెఱుఁగలేక
యదిరిపడుచుండు నొక్కొక్క యల్పజనుడు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--

71.  వార్ధక్యమున చిన్నవయసు పెళ్ళాం మైన
        - దరిద్రునకు పెక్కు బిడ్డలైన
   
       పొరుగున అత్తిల్లి పొసగ నైన
         - ఆత్రుడౌ మన్మధునికి కతిభాషి ముండైన 
   
       సంగీతకారునకు జతగాడు తోడైన
        - వానాకాలంబు నందు ప్రయాణమైన
   
       చలి కాలంబున దీక్ష సలుపు టైన
        - సముద్రాన్ని ఈదుటకు ప్రయత్ని౦చిన

మరణ మిక లేదు వేఱె భూమండలమున
గణనసేయంగ నగునె యీ కష్టమహిమ
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--

72. క్షణం క్షణం ఒక్క క్షణం మమేకం
       - క్షణ వీక్షణం మమకార బ్రమరం

     క్షణం క్షణం మనసు మనసు బక్షణం
       - క్షణ నిరీక్షణ అనురూప సమన్వయం

     క్షణం క్షణం ఆలోచన అర్ధం పరమార్ధం
      - క్షణ రక్షణ జగతికి ప్రేమామ్రృతం

     క్షణం క్షణం స్నేహ, ప్రేమభక్తి మేకీక్రృతం
      - క్షణ జ్ణాణ సముపార్జణ జీవతలక్ష్యం

ఏ క్షణమైనా మనస్సు బాధపడకుండా, బాధ పడేటట్లు మాట్లాడకుండ సుఖాన్ని అందించి సుఖం పొందటమే మానవజన్మకు సార్ధకం

ఇది వేణుగోపాల ప్రేమ సుమా

--((**))--

73.  అత్యాశతో నిత్యం ఆరాట పడేవానికి
       - జీవితంలో సంతృప్తి అనేది ఉండదు 

       చేసిన మేలు మరచి అవమానించే వానికి

         - జీవిత సమరం నిత్యం తప్పదు 
      
       అదేపనిగా చెడ్డ పనులు చేసే వానికి
      - మనస్సు చెడి స్థిమితం కోల్పోక తప్పదు 
       
       మాట్లాడ దోరణి మార్చక వాదించే వానికి
        - అనురాగ లోపం కోపం రాక తప్పదు      

తల్లి తండ్రులను, గురువులను గౌరవించనివాడు 

విరక్తి లక్షణం ఉన్న వాడు జీవితానికి పనికిరాడు 
అవలక్షణం లేనివాడే ప్రేమ పాత్రుడు 

ఇది వేణుగోపాల ప్రేమ సుమా    

--((**))--

నేటి కవిత ( అధిక్షేప ప్రేమ లీల ) 
ప్రాంజలి ప్రభ (లోకం తీరు)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

74.  ప్రాణుల మనస్సును ఏకీకృతం చేసే హనుమ బలం 
       -ఓం శ్రీ రామ నామమే నిత్యసౌభాగ్యమూలాధారమైనది    

       గణ నాయక వినాయక ధైర్య ప్రోత్సాహ బలం 
       - ఓం నమ: శివాయ నామమే విద్యా బలం పెంచునది  

       సమస్త ప్రాణుల నిత్య కృత్య వీర్య స్వర బలం 
       - ఓం నమో నారాయణ నామమే ప్రాణాన్ని బ్రతికించేది 

     స్త్రీ, సిరి, సౌఖ్య, కరుణ, సంతోష మూలాధారం 
      - ఓం శ్రీ మాత్రేణమ: నామమే ఆయురారోగ్యం కలిగించేది

ఏ దైవాన్ని ప్రార్ధించిన మనకు లభించేది 
మాట, మమత, మన:శాంతి మాత్రమే 
అంతకు మించినది మనకు అవసరమా ?
ఇది వేణు గోపాల ప్రేమ సుమా         

--((**))--

75.  చెలియ మోముపై చిరునవ్వు సింగారించే
        - ముంగురులు ముచ్చట గొలిపి పిలిచే

        ముంజేతి గాజులు కెరటాలులా ధ్వనించే
        - కాలి మువ్వల కదలిక ఘల్ మనిపించే

        ముడిరెవిక బిగువు తో తడిసి వికసించే
        -పెదవి సిగ్గు దోంతరులు తొందర చేయించే

        సిరిమల్లే పరవాలు చిందులు వేయించే
        - కుచ్చిల్ల తపన హృదయాన్ని కరిగించే

మగువ అందం మగధీరునికి సొంతం
మగని పొందు మాతృత్వానికి సొంతం
ఇది వేణు గోపాల ప్రేమ సుమా

--((**))--


76. ప్రపంచ దేశాల్లో చాటాలి మనదేశ ఘనత  
       - దుష్ట శక్తుల మధ్య చేరి తెచ్చుకోకు కలత 

      ఒకరికొకరు అర్ధం చేసుకొని ఉండేదే సమత
       - రాజకీయాల్లో ఎప్పుడు ఆవహించేది మగత 

     హృదయ స్పందనతో ప్రేమను ఆశించేది మమత  
      - మాటలతో కృషితో ధర్మమార్గాన నడిచేది మానవత

      విజ్ఞానం గురువు, తల్లితండ్రులవద్ద పొందేది నవత
      - ప్రభుత్వ ఉద్యోగ ద్వారా కుటుంబాన్ని చూసేది భవిత    
  
జరిగి పోయిన "చరిత" తెలుసుకుంటూ 
మనసుకు నచ్చే " కవిత" చదువుకుంటూ 
స్వతంత్రముగానే "భద్రత" కల్పించుకుంటూ 
"జనత" బ్రతకాలనేదే వేణుగోపాల ప్రేమ సుమా 

  
--((**))--

నేటి కవిత ( అధిక్షేప ప్రేమ లీల ) 
ప్రాంజలి ప్రభ (లోకం తీరు)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

77. ఆలింగన స్పర్శ ఇది అని ఎలా చెప్పేది

      - అంతులేని ప్రేమతో  అవధులు దాటే ఆనందం

      ఒకరి మనసు మరొకరికి ఏమని చెప్పేది
       - క్షణ మాయను చేధించు కుంటూ సాగే ఆనందం         

     హృదయానికి హృదయ స్పర్శ ఎం చెప్పేది
        - జిహ్వచాపల్యంతో ఆశలు పంచుకొనే ఆనందం

      పగలు కృషి రాత్రి విశ్రా0తి సుఖమే ఎలా చెప్పేది
        - కొత్త ఖర్చులతో సుఖదు:ఖాల ఆంనందం
     
నల్లేరులా పెళ్లైన కొత్తలో పరుగెత్తి
పల్లేరు ముళ్ళ బాధను భరించి 
జీవిత మలుపుల్లో సాగే పరవళ్లు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా

--((**))--

78.  ముప్పు ముప్పు అనకు, తప్పు తప్పు అనకు
        - పరిష్కారం నీముందే ఉంది వెతుకు

       మోసం, ద్రోహం అనకు, ఓర్పు ఉంది మనకు

        - స్వార్ధం వీడి నిజాన్ని గమనించి బ్రతుకు 

       మనమధ్య ఉంది ఐకమత్యం, అది మరువకు

       - బలహీనతను తరిమి ధైర్యముతో బ్రతుకు    

       కృషితో ప్రగతి జగతికి, మన ఆకలి తీర్చుటకు

        - మానవత్వానికి ప్రేమే ఆయుధమని మరువకు     

దేశం ఏమిచ్చిందని అనకు - దేశానికి నీవేం చేశావో ఆలోచించు 

తల్లి తండ్రులను తక్కువ చేయకు - నీ జన్మ కారకుల్ని మరువకు
ఇది వేణు గోపాల ప్రేమసుమా  

--((**))--


79. మనసుకు మనసే తోడైన అదే భాగ్యము 
       - బ్రతుకుకు బ్రతుకు తోడైన అదే స్వర్గము  

      ఆశల బాసలు తోడైన అదే సౌభాగ్యము 

      - ఆశయాలు సుఖాలుగా మారినా అదే స్వర్గము 

      చీకటి వన్నెల తోడైన అదే సంసారము

      - వేడితో చలి కలసి వెచ్చగ మారినా అదే స్వర్గము

      మనసు మమత తోడైతే అదే సంతోషము

      - నీప్రేమ నాప్రేమ ఒక్కటిగా మారినా అదే స్వర్గము
    
క్షణం కన్నీరు, క్షణం అనుమానం
క్షణం కష్టం, క్షణం నష్టం, ఓర్పుగా 
పరిష్కారం ధర్మంగా తెలుసుకోవటం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా  


    --((**))--

 80.  సంగీత స్వరములతో పాడుతున్నప్పుడు కాని
        - చేతులతో వాద్యము వాయించు నప్పుడు కాని 

        ఆటలయందు గట్టి పట్టు చూపునప్పుడు కాని
         - శత్రువులపై యుద్దము చేయునప్పుడు కాని  

        మంచి ఆకలితో భోజనం చేయు నప్పుడు కాని
        - వ్యవహారములు జరుపు తున్నప్పుడు కాని 

       పట్టు విడుపులతో సిగ్గు విడిచిన వారికే సుఖము కాని
        - మొండిగా వాదించే వానికి కష్టాలు అని 

ఏపని అయిన దారం తెగేదాక లాగా కూడదు
చెప్పిన మాటవిని, కృషితో, తెల్వితో, పట్టుదలతో 
ఉండి కొన్ని పరిస్తుతులలో సిగ్గి విడిచిన తప్పుకాదు   
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 


 --((**))--

81.   పవళింపు పట్టు పాన్పులు సుఖము కన్నా
        - చల్లని వెన్నెలలో పచ్చ గడ్డి చేను మిన్నా 
      
        తియ్య తియ్యని మధుర ఫలాల రుచి కన్నా
         - మనస్సును నొప్పించని మాటలు మిన్నా  
       
        అందానికి అందం ఆభరణాలు అనుకున్నా
         - అనురాగమైన ఆప్యాయత చూపే భర్తే మిన్నా 
      
       రంగు రంగులు విరజిమ్మే విద్యు కాంతులు కన్నా 
      - ఒకే ఒక్క సూర్య కాంతి ప్రపంచానికి మిన్నా 

ఏది ఉన్న ఎంత మంది అన్నా 
జరిగేపని జరగక మానదన్నా 
ఆశకుపోతే అంటే నిండు సున్నా   
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 


--((**))--


82.  కుటుంబాన్ని కనిపెట్టేవారు లేరు, మానధనులు లేరు 
       - దేశ హితము కోరు వారు లేరు, ఆశ లేని వారు లేరు 

      ధర్మ రక్షణ చేసే వారు లేరు, సత్యం పల్కే వారు లేరు 
       - ఓర్పు వహించే వారు లేరు, శాంతి పొందే వారు లేరు       

       ఓదార్చేవారు లేరు, సహాయము చేసే వారు లేరు  
       - ప్రేమను పంచే వారు లేరు, నీతిని నమ్మే వారు లేరు   

      కలసి ఉందామన్న వారు లేరు, కాలం బట్టి నడిచే వారు లేరు  
       - ప్రేరణ నిచ్చేవారు లేరు, ప్రేమతో సంతృప్తి పడేవారు లేరు 

ఈ లోకంలో ఎన్ని ఉన్నా 
ఆకలి తీర్చే ధనమ్, పొందు ఉన్నా      
లోకమంతా నాకు వెన్న 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--

8౩.  మనసంతా ఆందోళనతో గుబులుగా ఉందిలే
        - గుండెలో బరువు నింపి బాధను పెంచిందిలే

       ప్రేమ మైకము వద్దన్నా వచ్చి చేరింది లే   
       - అడుగులు వేయ నీయక ఆపుతున్నది లే

       నా ఊహలు సాగుతూ కల్లోల పరిచెనులే 
       - నా కలలు కల్లలుకావు ఈరోజు నిజమౌనులే

       కొత్త బంగారు లోకం నాకు వింతగా ఉందిలే 
        - కోరువాడు ప్రతిక్షణం ఆనందం పంచునులే    

అవునంటే కాదనులే - కాదంటే అవునులే 
అర్ధాలు వేరైనా పరమార్ధము ఒక్కటే లే 
ఇది వేణు గోపాల పేమ సుమా 

--((**))--


84.    కపాల పుర్రెల మాల తోడ
          - ఘనమైన నాగ కంకణంబులు తోడ
   
        చేత సూలాయుధము తోడ
         - కొప్పులో బాల చంద్రుని తోడ
   
         కమనీయ మైనట్టి కందుకంఠముతోడఁ
         - మొల పులితోలు తోడ
     
         తనువంతా నేరపూత భూతి తోడ
         - దయతోడ నభయ హస్తము తోడ 

భక్త భాంధవుండు భవుడు ప్రత్యక్షమై
పార్వతిని ఆహ్వానించే, గంగను ఊర డించే
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--

85. శుంఠ వలె చూసింది చెప్పకు, చెప్పింది చేయకు
      - చవట వలె విన్న తిట్లు వల్లించకు, శాపాలు బెట్టకు

      పోకిరి వలె వేషాలు వేయకు, అందరినీ ఏడిపించకు
      - పిరికి వలె బిగిసికోకు , తాడును చూసి పాము అనకు     

     డాంబిక వలె గొప్పలు పోకు, తేలికచేసి మాట్లాడకు
      - ఆడంగి వలె ఆడదానివలే ఉండకు, స్త్రీ లా కులకకు

     మూర్ఖుని వలె మొండిగా వాదించకు, చుల్కనవ్వకు 
      - నాయక వలె చెయ్యలేనివి చెప్పకు, పదవి వదలకు

ఇది కలియుగం ఏ విధముగా ఉన్న నడచిపోతుంది
 మంచికి విలువ ఉండదు, చెడుకు చోటుఎక్కువ
కొన్ని పరిస్థితులలో కొందరు ఓడిపోక తప్పదు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా

--((**))--

ప్రాంజలి ప్రభ - అధిక్షేప ప్రేమ లీల
లోకం తీరు 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

86.   దేశ హితము కోరు తెలివి లేదు
         - కలుష మతుల మధ్య మంచి లేదు
   
        నాయకులయందు నిజాయతి లేదు
        -  ఎంత తిన్నా ఇంకా తృప్తి లేదు   
   
       ధర్మ రక్షా తలపు మనిషిలో లేనే లేదు
         - సత్య వాక్కుకు విలువే లేదు 
   
       కలసి ఒక్క మాటపై నిలబడుట లేదు
        - ధాత్రిపై మూర్ఖులు బాధ ఆగలేదు

భరత మాత రోదిస్తున్నది - శాంతి దూతలు కాన రాక
ఓర్పుతో ఓదార్పు కాన రాకున్నది - ఆశ పెరిగుతున్నది
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--           

87.  నాకోసం తాను, తనకోసం నేను
        - రోజూ వెదుకులాట వెంపర్లాట
     
       నాకోసం నీవు, నీకోసం నేను
        - రోజూ పిలుస్తూ కలుస్తూ ముచ్చర్లాట
     
       నాసొమ్ము నీవు నీసొమ్ము నేను
        - రోజూ పగలు ఆట రాత్రి కీచులాట
     
       నాదారి నీవు నీ దారి నేను
        - రోజూ చదువాట రాత్రి కలల వేట
     
దోమో, మనిషో,తలపో, అసహనమే
ఏది ఏమైనా మానవులకు నిత్యా లోచన
మనుగడకు నాంది అదే మయా భ్రాంతి
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--

88.  వచ్చేను వచ్చేను వర్షం వరద పొంగులా
       - పుడమితల్లి పులకరించి పరవళ్ళుత్రొక్కే

      నచ్చేను నచ్చేను కర్షక స్వభావ మేటికలా
      - విత్తువిచ్చి శాఖలుగా విస్తరించి మ్రోక్కే
   
       తెచ్చేను తెచ్చేను నఫ్టాలు ఉద్రృతంగా
       - పెనుతుఫాన్  ‌‌‌‌‌శబ్ద ఘోషతో కదంత్రొక్కే

       కలిసేను కలిసేను కొండలు గుట్టలు దాటుతూ
       - ఉరకలు పరుగులు తీస్తూ సంద్రమలో కల్సే

క్షణ సంతోషం, క్షణ దుఃఖం
 ప్రకృతి విలయతాండవం
కాలాను బట్టి గమనం నేర్చుకోవటమే
ఇది వేణు గోపాల ప్రేమసుమా

--((*))--


89 . కనులార్పక తాను నిలిచే ముభావంగా
       -  సుంపెంగ వనంలో సిగ్గునంత కుమ్మరిస్తూ

       చీకటిలో వెన్నెల నిలిచే సుతారంగా
        -   పువ్వు సడేలేని నవ నవ్వులు కుమ్మరిస్తూ

       పరిమళించే ఆ సొగసంతా పవిత్రంగా
       -  మాట పలుకు మౌనంగా వలపు కుమ్మరిస్తూ

       అద్దం లా పంచుకొనే  సుమ భావగంగా
       - తన తలపు వీణ అనురాగాలను కుమ్మరిస్తూ

స్త్రీ నిత్య పరిమళం, అందుకే అది నిత్య పుష్పం
చూపు దారలతో చిత్త  శాంతి కల్పించేది పుష్పం
అందంతో ఆనందం, ఆరోగ్యం అందించే పుష్పం 
   ఇది వేణు గోపాల ప్రేమ సుమా

                    --((**))--

90.  కురులు పసిడి మోముపై కవ్వింపుతో
         - కనురెప్పల కదలికలు అమాయకంతో

        ముద్దిచ్చేపెదవులు పలకరింపుతో
        - గోర్వెచ్చని గాలి గుండె తాకే  అమాయకంతో

        పరిమళించు మల్లెల గుభాలింపు తో
        - మౌన జలధిని ఊరడించు అమాయకంతో
     
         చెలిమి పెంచు ప్రేమ గాలి చూపులతో
       - మనసు దోచి సుఖం పంచు అమాయకంతో

పగలే వెన్నలన్నట్లు,
 సౌందర్యమే మనసైనట్లు
మదిలోని కోరిక మగువపట్ల
 చక్రబ్రమణం ఆయనట్లే 
ఇది వేణుగోపాల ప్రేమ సుమా

--((**))--


91.   కానగా లేనురా కన్నులార - ధ్యానమే నీదిగా ధ్యాస మీర
        గానమే సేతురా గతులు జార - ప్రాణమే నీదిగా ప్రభో రార
        కాముకా రావేల కన్నె చోర - ప్రేమలో మునగంగ ప్రియము లేర
        ఏమదీ కోపమా వీడి రార - నామదీ నీదెగా నమ్మవేర

రార,చోర,జార ప్రేమతో అనుట తప్పు కాదు 
కల్ముషం లేని పలుకు ప్రేమపలుకౌనుర
ఇది వేణుగోపాల ప్రేమ సుమా

--((**))--

92.   ఓరగా చూడకూ వలపు లూర - దోరగా పండేను దోచు కోర
        హారమే వేయ రా హాయి తీర - సారమే నీదిగా సమరవీర
        కోరుతూ పిలిచేను కోర్కె మీర - మారుడా రావేల మనసు తీర
        జోరుగా రావేల చెంత జేర - జారుగా వెన్నెలా చింత తీర

రార,చోర,జార ప్రేమతో అనుట తప్పు కాదు 
కల్ముషం లేని పలుకు ప్రేమపలుకౌనుర
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--



93.  నీరు కావాలంటే మట్టిని తవ్వాల్సిందే -
       - పంట పండాలంటే నేలను దున్నాల్సిందే

      తోడు కావాలంటే ప్రేమను ఇవ్వాల్సిందే
      - మైత్రి పొందాలంటే మంచిగ ఉండాల్సిందే

      వెలుగు రావాలంటే పొద్దులు పొడవాల్సిందే
      - తెలుగు నిలవాలంటే బుద్ధులు మారాల్సిందే

       వాన కురవాలంటే మబ్బులు పట్టాల్సిందే
       - కవిత వ్రాయాలంటే బావన పొంగాల్సిందే

 మనిషి మెఱవాలంటే సౌఖ్యం కావాల్సిందే
నిజం తెలియాలంటే లోతుల కెళ్లాల్సిందే
- చరిత కెక్కాలంటే ఎత్తుల కెదగాల్సిందే
ఇది వేణు గోపాల ప్రేమ సుమా

--((**))--

94. తావి వీచాలంటే పువ్వులు పూయాల్సిందే
       - కళను చూడాలంటే కళ్లను తెఱవాల్సిందే

      వ్యాథి తీఱాలంటే వైద్యం జరగాల్సిందే
      - తిక్క కుదరాలంటే దెబ్బలు తగలాల్సిందే

      పాట అమరాలంటే పల్లవి పుట్టాల్సిందే
      - వలపు కలగాలంటే తలపులు కదలాల్సిందే

      గెలుపు నాశిస్తుంటే పరిశ్రమించాల్సిందే
       - ఫలితముండాలంటే సాధన చెయ్యాల్సిందే

చెడుపు పోవాలంటే తప్పులు తొలగాల్సిందే
 మంట లాఱాలంటే మమతలు చిందాల్సిందే
శాంతి వెలయాలంటే దౌష్ట్యం చావాల్సిందే
ఇది వేణు గోపాల ప్రేమ సుమా

--((**))--


95.  అక్షరాలతో అందాన్ని వర్ణించనా
       - ముక్తి సరిగా ముచ్చట్లు చెప్పనా

       పద మాలలను పదిలంగా చెప్పనా
       - గుప్పెడు భావాలు తెలియ పరచనా

      గుండెచిక్క బెట్టుకొని ఎదురు చూడనా
      - నునువెచ్చని గాలులు కోసం ఉండనా

      ప్రకృతిలో నీ ప్రేమ కోసం వేచిఉండనా
      - తాళి విలువ తెలిపి నాదానిగా చేసుకోనా

ఓర్పు చూపి కాలాన్ని బట్టి
గమ్యమేదో తెలిపి, కరుణ చూపి
ప్రేమతో మనసును జాయించాలి
ఇది వేణుగోపాల ప్రేమ సుమా   

--((**))--

96. ప్రత్యూషమే ప్రపంచ శాంతికి మూలమై 
       - ప్రశాంతమే ప్రపంచ కుటుంబానికి మూలమై 

      ప్రణయమే ప్రపంచ మేధాసంపత్తికి ఆధారమై 

       - ప్రసూనామీ ప్రపంచ జీవితానికి ఆధారమై 

     ప్రణవ నాదమే ప్రపంచ ఆరోగ్య కారణమై 

     - ప్రబంధమే జగతి జీవిత మార్గానికి మూలమై   

    ప్రమోదమే ప్రపంచ నిత్యకల్యాణం కారణమై

     - ప్రహ్లాదమే ప్రపంచ సత్య ధర్మ న్యాయాలయమై

ప్రమదావనం, బృదావనం, నందనవనం 

 నిర్మల వనం, మౌనవనం, సంతోష వనం 
ప్రపంచ శాంతికి మూలం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--

97.  మంగలి కత్తిపై కాలు పెట్టి నాట్లు - కోడె త్త్రాచును ముద్దులాడినట్లు 

       కొరివితో నడి నెత్తి గోకినట్లు - పులితోడ సాముకు పూనినట్లు 
      సింగమును రాల నదిలించుకొనినట్లు - మినుకు వజ్రంపు రవ్వ మింగినట్లు 
      గొంతుమీద కట్టి పెట్టినట్లు - నూతిపై పసిబిడ్డ నునిచినట్లు 

క్ష్మాతలేంద్రులసేవ కష్టంబు వార

లిచ్చి రని గర్వమున నిక్కి యెగురరాదు
ఇది వేణుగోపాల ప్రేమ సుమా 

--((**))--


98.  మకరంద పానంబు తుమ్మెద గాక - జోరీగ చవి గని జుర్రగలదె 

      శ్రీరామ ధ్యాన మామనస్కులు గాక - చెనటిసద్భక్తితో జేయగలడె
      కవితా రసజ్ఞత సువివేకులకు గాక - యవివేకి చెలి యొగ్గి యానగలడె        
      పద్మిని సతి పొందు పాంచాలునకు గాక - షండుడు తెలియ గలఁడె 

రాజసభలఁబరోపకారములు తెలుప

శ్రేష్ఠులేకాక దుష్టులు చెప్పఁగలరె
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--


99.   మద్యపాయులతోడ మచ్చిక కారాదు, బడవాల గొప్పగాఁ బట్టరాదు

        శాత్రవునింత భోజనము చేయఁగరాదు, సన్యాసులను గేలి సలుపరాదు
       దేవభూసురవృత్తి తెరువు పోవఁగరాదు, పరు నాలి గని యాస పడగఁరాదు
       కంకోష్ఠునకు నధికార మియ్యగరాదు, చెలగి లోభినిఁ జేర బిలువ రాదు

లంచగాండ్రను దగవుల నుంచ రాదు

మాతృపితరుల యెడ భక్తి మఱువరాదు
ఇది వేణుగోపాల ప్రేమ సుమా 

--((**))--



100.   గుర్తింపులేని నాయకుని కొల్వు 
         - లాలింపనేరని భార్య పొందు 
          
          లేనివారియింట చుట్టరికంబు చెర
           - బుద్దితక్కువవాని ఇంట ఋణము పొందు  
         
           సరగాని వానితో సరసోక్తి చేయుట 
           - బలవంతుని ఇంట బడచు గొనుట 
         
          మూర్ఖుని మైత్రికి మోహపడుట 
         - సామాన్యజాతితో జగడంబు పూనుట
    
నరులు తలవంచిన, మోహపడిన 
మరచి ఒప్పిన  ప్రాణ, మాన హాని   
ఇది వేణు గోపాల ప్రేమ సుమా


--((**))--



ప్రాంజలి ప్రభ - అధిక్షేప ప్రేమ లీల
లోకం తీరు 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

101.  కన్నీటి జ్వాల హృదయ తాపన్నీ తగ్గించ లేక
          - కవి హృదయంతో మౌనరాగాన్ని కదిలించి లేక

         రవి వెల్లువకు కన్ను కానరాక కలత చెంద లేక
         - తీరని వ్యధను చూపలేక, మనసుతో చెప్పలేక 

         నమ్మిన నీతులు నడకగా ముందుకు  సాగలేక
        - కమ్మిన చీకట్లు ఉదయ కలలుగా కరిగి పోలేక

        తరములు మారిన శోకించు బతుకుకు దారిలేక
        - స్వార్ధముతో తనవాదనే గొప్పదని ఒప్పుకో లేక   

మనిషి నిరంతరం చావు బతుకులమధ్య
సుఖ దు:ఖాల మధ్య, చీకటి వెలుగుల మధ్య 
యద తాప మనలేక కన లేక అనలేక ఒకటే లేఖ 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా

--((**))--
అధిక్షేప ప్రేమ లీలా
లోకం తీరు
మల్లాప్రగడ రామ కృష్ణ

102.   నుదుటి మీద వ్రాత బ్రహ్మకు తప్పదు
          - జ్ఞానామృత గ్రంథ బోధ గురువుకు తప్పదు

          మేధస్సుతో ప్రేమ వ్రాత విద్యార్థికి తప్పదు
          - కన్ను ఆకర్ష, వికర్షన తెల్పే రెప్పకు  తప్పదు

         సంద్రపు నీటి ఆవిరిమోత నింగి మేఘానికి తప్పదు
         - మనసు కలయిక మమతానురాగానికి గం తప్పదు
       
          హృదయ వేదన మార్పు విధి రాతకు  తప్పదు
          - ప్రకృతి, వికృతి  సహజ మార్పు కాలానికి తప్పదు
     
దేనిని తప్పించు కున్న తప్పించు కోలేక పోయినా
కాలగమనాన్ని మార్చలేరు, ధర్మ పరులకు మన: శాంతి
అధర్మ పరులకు నిత్యం అశాంతి 
ఇది వేణుగోపాల ప్రేమ సుమా

--((**))--

103 .  పరిమళించే పువ్వుకు లేదు చుట్టరికం
          - ప్రజ్వలించే నిప్పుకు లేదు చుట్టరికం

          వసంతానికి పంచె ప్రేమకు లేదు చుట్టరికం
          - నిత్య వృద్ధి క్షిణ కాంతికి లేదు చుట్టరికం

          నిత్య చీకటి వెన్నలకు లేదు చుట్టరికం
          - తోడు నిలవని నీడకు లేదు చుట్టరికం

          నక్షత్రాల మధ్య ఆకర్షణలేదు చుట్టరికం
           - ఆశా, పాశం, నమ్మకపై లేదు చుట్టరికం

ఒకరికి ఒకరిపై ఉన్న సహజ లక్షణాలను
పెనవేసుకు పోయే బంధం
కలువ విచ్చుకొని ముడిచినట్లే
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--


104.   మానవత్వానికి పుస్తకం ఒక భూషణం
          _ మనో నేస్తంగా అది ఒక నిలయం

         మమకారానికి ఆశయ నేత్రాలయం
         - మేధస్సుకు ఒక జ్ణాణ భాండాగారం

        మనోవాంఛ సిధ్ధికి ఒక దేవాలయం
        - మోన నీతి తెలిపే ఒక గ్రంధాలయం

       మార్గదర్శిగా మలిచే ఈశ్వరాలయం
       - మనస్సు పరిష్కారం చూపే దిక్కులయం

సాహిత్య పుస్తకం ఒక ఊట బావి తోడిన కొద్ది ఊరే అమృతం,
 ఆకలిని తీర్చే అక్షైయ పాత్ర,
 మాత్రృదేశ ఆత్మగౌరవం నిలిపే అనురాగ సంగమం
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--

105.  శ్రీమతి గురుతొస్తే ఏద నిండిపోతుంది
         - నవ్వుల పువ్వులు విసిరుతుంది కనుక

         మైకము వచ్చి మనసూగి పోతుంది
         - కన్నుల్లో వెన్నెల్లు చూపుతుంది కనుక 

         గుండెలో దూరి గంట కొడుతుంది
         - అశ చూపి ఆరాట పెడుతుంది కనుక

         వంక పెట్టలేని ఆరోప్రాణ మౌతుంది
         - ఉండి అలికిడిచేసి కులికిస్తుంది కనుక

ఎవరు ఎమన్నా బ్రహ్మ ముడి పడ్డాక
కింద మీద పడ్డా, మీద కింద పడ్డా,
కాలానుగుణంగా సర్దుకుపోయే గుణం
ఉండాలి ఇది వేణుగోపాల ప్రేమ సుమా   
--((**))--

106.  ఉదయకిరణాలు నీళ్లపై పరివర్తనంటే ఇష్టం 
         - చీకటి వెన్నెల తుషార జల్లుల మధ్య ఇష్టం   

         మువ్వల సవ్వడితో వేణుగానం వింటే ఇష్టం  
         - చల్లని కాలంలో వెచ్చని కౌగిలి అంటే ఇష్టం

        ముద్దుల కవ్వింపులో చమత్కారంగా అంటే ఇష్టం 
        - మౌనంగా ఉండి, కొంటెగా మూతివిరుపంటే ఇష్టం   

        నవ్వులతో విరహబాధ తొలగించట మంటే ఇష్టం 
        - సిగ్గుల నీడల మధ్య ఒదిగి పోవట మంటే ఇష్టం

ఇష్టా ఇష్టాలతో పని ఉండదు, ఆశ, ఆవేశం, ఆరాటాం 
స్వార్ధం, అశాంతి, అసమాన్యాత ఉన్న చోట 
ఇది వేణు  గోపాల ప్రేమ సుమా        

--((**))--

107   కాలానికి కదిలే భావాలు, మెరిసే ఆశలు 
         - క్షణిక ఆవేశాలు, క్షణికానంద కలియకలు 

         యదకు తగిలే తలపులు, క్షణిక ఆలోచనలు 
         - తమకంతో తపనలు, మమతల్లో మునకలు 

         సందర్భ సలహాలు, సమస్యల పరిష్కారాలు 
         - సంకోచ లక్షణాలు, సంఘటిత తీర్పులు 

        మనస్సును దోచే నేత్రాలు, కొన్ని ఆకర్షణలు 
        - ప్రకృతి సహకారాలు, ప్రపంచ వేడుకలు 
      
నిగ్రహ శక్తినిసమం చేసుకుంటే 
మనకు ప్రతిదీ ఆనందనమే,
 ఆరోగ్యమే, ఆధ్యాత్మికమే   
 ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--


ప్రాంజలి ప్రభ - అదిక్షేప ప్రేమలీల
లోకం తీరు
రచయత.మల్లాప్రగడ రామకృష్ణ
1౦8. నీ ప్రేమ నాది కానప్పుడు నా కళ్ళలోకి చూపెందుకు 
        - కలవటానికి దారి చూపనప్పుడు నీ ఈ జీవమెందుకు  

       డబ్బుతో కొందామన్నప్పుడు ఈ ప్రేమకన్నీరెందుకు 
       - గంధాన్నిపొందాలన్నప్పుడు ఓర్పు వహించ వెందుకు 

       గుండెలో నిదిరించాలన్నప్పుడు మన:శాంతి లేదెందుకు 
       - తాళం తియలేనప్పుడు నీవు తాపత్రయ పడుట ఎందుకు

       నిశ్శబ్దపు వనవాసం చేయ లేనప్పుడు ఫలము నీకెందుకు 
       - మౌనం వదలి కోపం తోడున్నప్పుడు ప్రేమ బుద్ది నీకెందుకు 

రాయి రాయి రాపిడికి వేడి పుట్టు 
లింగ భేద రాపిడికి జీవం పుట్టు 
ప్రేమ స్నేహ రాపిడికి శాంతి పుట్టు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా  

   --((**))--