2, జనవరి 2024, మంగళవారం



బ్రహ్మతత్వభావాలు ..౧ సీస పద్యాలు 


అన్యాయమును దుష్టబుద్ధిని తరిమియు 

ధీరుడుగాను విధేయుడగుట, 

సిద్ధాంతములనువశీకరములగాను     

నిర్భీతిగా నుద్ఘాటించుచుండె 

తెగువతో కాపాడి గుప్తవిద్య లనేవి  

నేర్పి మానవుని పురోభివృద్ధి

పరిపూర్ణతల యెడ పరమావిధినిచూపి    

జనుల సేవయు చేయు జపత రామ 


జాగరూకత కలిగి యుండుటయు రామ 

మానవ పురోభివృద్ధిగా మనసు పంచు 

ప్రజల రక్షణ ధ్యేయంగ పాకులాడు 

ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు   



***

అంబవు నీవునా మలుపు ఔదల చూపుల సందడేయగున్  

అంబర మేను సేవ మది అక్కడ నీకృప ధర్మమేయగున్ 

బంబర మౌన దీక్షతయు బంధపు చిత్తము నేస్తమేను  ఆ

డంబర శాంతిగా కను విడంబన జూపుల ధార్మికమ్ముగన్