29, ఆగస్టు 2016, సోమవారం

Inernet Telugu magazine for the month of 9/2016/33

 ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
GIFS
 
ప్రాంజలి ప్రభ - వార పత్రిక
సర్వేజనా సుఖినోభవంతు

*వర్షపు శబ్దం

మధ్యరాత్రి నన్ను లేపేసింది వర్షపు శబ్దం
మజాగా ఉంది కిటికీలో నుంచీ చూడటం
ప్రియమైన పలక రింపైంది చల్లని సమీరం
బయట చూస్తే వెలుతురులో మెరుస్తోంది ఆ వర్షం

ధారలుగా పడుతూ ఎంతో బాగుంది దృశ్యం
ప్రకృతితో చేసుకుంటోంది సరాగ సౌజన్యం
కురిపించేస్తోంది జల్లుల్లొ మైత్రీ ప్రభంజనం
పూర్తిగా, ఇష్టంగా చేసుకుంటోంది అభిషేకం

వర్షాన్ని చూస్తూ ఐ పోయాను సమ్మోహితం
ప్రకృతి లోఈ వర్షపు సౌందర్యము ఓ అద్భుతం
జల జలా రాలుతున్న ఆ నీటి ప్రవాహం
ఓ మోహన వాయిద్యం మిళితమైన శ్రవణానందం .
అపురూపానుభూతితో తడిమిన నా అంతరంగం ......

ఏకాంతంలో ఓ మాధుర్యం దొరికినట్లుగా
నిద్దురలో లేచినా , చక్కని కల కన్నట్టుగా .
ఆ వర్షం నా నేస్తమై పంచింది ఆహ్లాదం
చల్లనైన మదితో సంతోషం పొందాను ఆతరుణం 

గత బాల్య  స్మృతలు గుర్తుకు వస్తున్నాయి 
జలాల్లో నాట్యాలు, వెన్నెలలో ఉయ్యాలలు 
 పెద్దల ఆర్తనాదాలు, పిల్లల ఆరాటాలు 
 నన్ను జల్లులు పిలుస్తున్నాయి 
సంతోషానికి ఇది ఒక జల్లుల ఆలయం

--((*))--


ఊహలు

ఊహలు గాలి బుడగలు
బుడగలు వర్ణ వివర్ణాలు
వర్ణాలు మనలో ఉషస్సులు
ఉషస్సులు మన ఆశయాలు

ఆశయాలు ఉండు అహర్నిసాలు
అహర్నిసాలు కదిలే ఋతువులు
ఋతువు లో మారు సమీరాలు
సమీరాలు మనిషికి   ప్రాణాలు

ప్రాణముంటే వినవచ్చు గాణాలు  
గాణస్వరాలు గంధర్వ మిలితాలు
మిళితమే జీవితానికి మలుపులు
మలుపులే మనసు యొక్కఆశలు

ఆశలే మానవుల బ్రతుకులు
బ్రతుకులో ఉండాలి ఎప్పుడు విజయాలు
విజయాల్లోఉండాలి సహకారాలు
సహాకారమే ఆదర్శప్రాయాలు
--((*))--


 Photo: Sri Kalyana Venkateswara Swamy
@ www.gotirupati.com







*కొత్త కోక

నాన్న నాన్న నాకు కావలి కొత్త కోక
అమ్మాయి నీవు తొక్కి వచ్చావు నక్క తోక
నీ మొగుడు తెచ్చాడు కొత్త కోక
మీ అమ్మ కొన్నది కొత్త కోక
నేను కొన్నాను కొత్త కోక
మరి ఎప్పుడు కట్టు కుంటావు కోకాలు

అన్నీ కోకలు ఈ శుక్రవారం అమ్మవారికి
సమర్పించి కట్టుకుంటాను నాన్న

నాన్న నన్ను దీవించు అంటూ
పాదాభి వందనం చేయగా
పుత్ర పుత్రాభివృద్ది కలుగు గాక

అమ్మా నన్ను దీవించు అంటూ
నమస్కరించగా చూడమ్మా ఆ అమ్మవారి
దీవెనలు నీకు ఎప్పుడు కలుగు గాక

ఏవండీ నన్ను దీవించండి
ఓలమ్మో నా పెళ్ళాం కట్టింది కొత్త కోక
నేనెందు కుంటాను ముద్దెట్టుకోక
నా జేబును అందుబాటులో పెట్టు కోక
తప్పదంటుంది కొత్త కోక         
 --((*))--

 
ప్రేమకోసం పాట
ఓ ఓ సుందరాంగీ, ఓ ఓ
లయకార లాస్య లావంగీ 
మమకారం చూపవే సంపంగీ
చిర్రు బుర్రు లాడాకే సివంగీ 

చెంతకు చేరి చింతలు తొలగిస్తానే
చిరునవ్వుతో ఒక ముద్దివ్వవే
నా ముద్దుల మోహనాంగీ 

మాయలుచేసే మాయలోడివి మామా
మనసును దోచే మాయ గాడివి మామా
ప్రేమా దోమా అంటూ ముగ్గులోకి లాగావుమామా
కూడు గుడ్డకు ఉద్యోగము ఎతుకు మామా
ముందు త్రాగుడు, పేకాట మాను మామా
నా మాట వినుకొని నడుచుకో మామా
చిరునవ్వుతో మొత్తం అర్పిస్తాను మామా

ఓ సంపంగి, ఓ లావంగి ఓ సివంగి
నీ ప్రేమకోసం అన్ని వదులుతానే,

ఉద్యోగం సంపాయించి మొనగాడ్నిఆవతానే
ఓ మాయాలోడా, ఓ సుందరాంగా, ఓ మనోహరా
నీవు మారిచూపు, నీ మాటకు నేను బానిస నవుతాను
నా నవ్వులు నీకు అందించి సంతోష పెడాతాను     

ఓ సంపంగి, ఓ లావంగి ఓ సివంగి
ఓ మాయాలోడా, ఓ సుందరాంగా, నా మనోహరా
    --((*))--


 
* చిగురించిన ప్రేమ

నీ రూపు నా మెనులో నిల్చి
సతతము నా మనసుని కదల్చి 
నీ ఆధారము నాకు సేద తీర్చి
ఓ మాలినీ నన్ను వదలి పోవుకాదా 

ముందు వెనకాల నీ మూర్తి నిల్చి
నా తనువు వేడి నంతా చల్లార్చి 
సౌందర్యాతి శయముతో జిగర్చి
ఓ లలితాంగి నన్ను వదలి పోవు కదా

కర పద్మములతో కలలో కౌగిలించి
తావులపై ఉన్న పువ్వుల వికసించి
విరహ బాధల తో ప్రకృతిని మించి  
ఓ భామిని నన్ను వదలి పోవు కదా   

జీవిత వాకిటిలో మనసు వికసించి
మమతల కోవెలలో మనసును పంచి
మనో నిగ్రహ శక్తిని మనసుకు అందించి
ఓ స్వేతాంగి నన్ను వదలి పోవు కదా 

--((*))--


 తప్పు కదా నాన్న 
* కొందరి స్త్రీల మానసిక క్షోభ ?

నేను చెప్పేది నీకు అర్ధం కాదని 
అర్ధమైన అమలు చేయటకు ప్రయత్నించవని
నాకోసం అర్ధం అయినట్లు నటిస్తావని
తెలిసినా నిన్ను వదలి నేను పోలేను   

మాట్లాడుకుంటాం, మాటల్లో నవ్విస్తావని
తప్పు పట్టి ఒక మూర్కుడిలా ప్రవరిస్తావని
నవ్వు కుంటాం, నవ్వులో ఎగతాలిని 
పుట్టించి కుళ్లు మాటలతో చంపుతావని 
తిట్టు కుంటాం, తిట్టులోని మాటలని
పదే పదే చెప్పి అనుమానిస్తావని  
తెలిసినా నిన్ను వదలి నేను పోలేను

ఎప్పుడూ కలుసుకుంటాం సుఖం లేదని
కొత్త కొత్త కోరికలతో వాతలు పెడతావని
తలుపులా హృదయాన్ని అందిస్తానని
తెలిసి కూడా మృగంలా ప్రవర్తిస్తావని
మనసును తనువును అర్పిస్తానని
గ్రుడ్డి వాడిలా గడియ తీసి భాదిస్తావని  
తెలిసినా నిన్ను వదలి నేను పోలేను

 సుఖం అందించే ఒక తారగా ఉన్నా
జాబిల్లికి తృప్తి ఉండదని 
పృథ్విలా సహకరించి మనసు అర్పించినా
ఆకాశానికి సంతృప్తి లేదని
శీతల పవనాలతో సుఖపెట్టినా
ఇంకా ఎదో వెలితి ఉందని 
తెలిసినా నిన్ను వదలి నేను పోలేను

మల్లె సొగసుల సువాసనని
అనుభవించి నలిపి పిప్పి చేస్తా వని
సంపెంగ పువ్వు సువాసనని
ఆస్వాదించి మైమరచి చితిపేస్తావని
గులాబీ పూలకు వాసనని
గ్రహించి రేఖలను తొలగిస్తావని  
తెలిసినా నిన్ను వదలి నేను పోలేను

నదిలా వచ్చి నీలో కలుస్తానని
సముద్రుడిలా గుర్తింపులేకుండా చేస్తావని
గ్రుడ్లు అందించి సహకరిస్తానని
పక్షిలా కాపాడక హింసిస్తావని
ఏంతో కష్టపడి మోసి గుడ్లను అందిస్తాను
అయినా పాములా తనగుడ్లను తినేస్తావని  
తెలిసినా నిన్ను వదలి నేను పోలేను

నేటి నా ఆలోచనా భావ కవిత 
ఇదే భారత స్త్రీ ఓర్పు అని భావించి
కొందరి మగబుద్ధిని తెలియపరిచా 
ఈ   కవిత నచ్చితే షేర్ చేయండి
--((*))--



           
* వడియాలు (నవ్వుకోవటానికి ) 

అందరి ముందు నేనొక హీరో  
పెద్దల ముందు నేనొక జీరో 
పిల్లకు ఏంతో నచ్చేది పోగొ 
కొన్ని పనులకు ఉపయోగం రోబో  
  
చెవులను మర్దన చేసేవారు సింగర్స్ 
కాలికి బుద్ధి చెప్పే వారు రన్నర్స్ 
నోటి నిండా పని కోరేవారు యాంకర్స్ 
వండ కుండా అన్నీ తినేవారు బెగ్గర్స్ 

వాడండి, వాడొద్దని చెప్పేది సెల్ 
చూడండి చూడొద్దని చెప్పేది ఫిలిం 
తిలకించండి ఏడిపించండి అనేది T.V.
అవసరాన్ని బట్టి ఉపయోగపడే ధర్మం గీత   

అన్ని వాహనాలకు ఉండాలి బ్రేక్    
కొందరు తినటానికి ఇషపడేది కేక్ 
ఎప్పుడూ ఉండాలి నీ వెంట  లక్        
ఏ విషయంలో ఎప్పుడు కాకు షాక్ 

సినిమా నటులకు ఉండాలి గ్లామర్ 
ఇంగ్లిష్ మాస్టర్ చెపుతారు గ్రామర్
కుటుంబనియంత్రణాధికారి అంటాడు నోమోర్
వ్యవసాయాధికారి అంటాడు గ్రోమోర్

స్త్రీలకు విన్నమాట మనసులో ఉండని దురద
ఉన్నా కనిపించనిది వీలు కానిది వీపు దురద
మందులు వాడినా ఎప్పుడుతగ్గనిది నోటిదురద
నచ్చినా నచ్చక పోయినా పెల్లైతే  ఒకటే దురద
    
--((*))--




పగటి చుక్క  సూర్య బింబం
కంటి చుక్క  కాంతి బింబం
ఎదుట చుక్క ప్రపంచ బింబం
నుదుట చుక్క సింధూరబింబం

రేయి చుక్క చంద్ర బింబం  
నీటి  చుక్క ముత్యం బింబం
రక్తం  చుక్క వజ్ర  బింబం
వెన్న చుక్క  స్వేత బింబం

చీకటిలో వెన్నెల బింబం
వెలుగులో ఆనందాల బింబం
మహర్షులకు ఆదర్శ బింబం
ఆద్యత్ములకు అమృత బింబం

నిత్య సంచార బింబం
వెన్నెల వెలుగుల బింబం
మానవులను తృప్తి పరిచే బింబం  
 సకల ప్రాణులు సంతృప్తి పరిచే బింబం
--((*))--

 
     
* పరిష్కారం ?

ప్రభుత్వాన్ని అడిగే హక్కు మాకు లేదంటారు
ఉంటే మా సమస్యలు తీర్చే వారు ఎవరూ లేరా
గద్దె ఎక్కిన ప్రజా ప్రతినిధులు పట్టించుకోరు 
మా సమస్యలకు పరిష్కారం ఎవ్వరూ చూపలేరా

ఆదాయం కోసం మత్తు పానీయాలు ఎందుకు అమ్ముతారు
మా ఆరోగ్యం చెడిపొమ్మని స్వయముగా చెపుతున్నారా
రోగులకు కావలసిన మందులు దొరక్కపోయినా పట్టించుకోరు
మందులు లేక వసతిలేక చనిపోయేవారిని పట్టించుకోరా

చిన్న వ్యాపారులను దెబ్బకొట్టే బడా వ్యాపురులొస్తున్నారు
పెద్ద వ్యాపారులకు కొమ్ముకాసి చిన్నవారిని గమనించరా
తప్పుడు లక్కలతో టాక్సు ఎగగొట్టేవారిని వదులుతున్నారు
ఒకనెల టాక్సుకట్టకపోతే తిండికే లేక కట్టలేదని తెలుసుకోరా

అంతర్జాలంపై ప్రతి ఒక్కరు ఎందుకు ఆధార పడుతున్నారు
మేధావులను ఉపయోగించుకొనే శక్తి ప్రభుత్వానికి లేదంటారా
పెద్దభవనాలకు నిర్మించుకు పంటపొలాలు మారుస్తున్నారు
పొలాలులేకపోతె తిండికి కష్టంవచ్చి బాధపడకుండా ఉండగలరా

ఆధునిక సౌకర్యాలు ఎన్నిఉన్నా రైళ్లు సకాలంలో నడపలేకున్నారు 
ప్రభుత్వం ఉద్యోగాలు ఎక్కువ కల్పించి నిరుద్యోగులను ఆదుకోలేరా
స్త్రీలు ఎక్కువచదువుకోని, ఉద్యోగం చేస్తున్న పెళ్లికిఖర్చు చేస్తున్నారు
స్త్రీల వివాహముల యందు ఖర్చు లేకుండా సహాయం చేయలేరా      
    --((*))--

Photo: गणपति बप्पा मोरिया,

सभी के जीवन में खुशियां ला।।।।

आप सभी को गणेश चतुर्थी की शुभकामनाएं
*సత్కారం

మనసును అర్ధం చేసుకోని -  వానికి సత్కారమేల
మాతృభూమిని గౌరవించని - వానికి సత్కారమేల

అరచేతి అడ్డు పెట్టి - కిరణాలను ఆపాలని అనుకొనే
నాయకుల చేష్టలు -  గొప్ప వాణి అని మెచ్చి సత్కారమేల

మాయలు, మంత్రాలతో - మరణాలను ఆపగలమనే
బాబాల భోధలను చూసి - మహాత్ములని మెచ్చి సత్కారమేల

సంసారము చేయక - ఔషధముతో  పిల్లలు పుడతారనే
మూడ వైద్యుల మాటలకు - ధనం అర్పించి సత్కారమేల

ఇళ్ళ కొరకు వృక్షములు నరికి, - ఎత్తైన భవనములు కట్టెనే 
పుడమి తల్లికి భారము కల్పించిన - మేధావికి  సత్కారమేల
 
శృంగారాన్ని అద్భుతంగా వర్ణించి - కొందరిని ఆకట్టుకొనే
కవిత చెప్పిన కవికి - గొప్ప కవిత్వమని తలంచి సత్కారమేల
--((*))--      

23, ఆగస్టు 2016, మంగళవారం

అక్షర గోవిందనామాలు

 ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ  రాం
 Photo: Sri Kalyana Venkateswara Swamy
@ www.gotirupati.com
ప్రాంజలి ప్రభ- అక్షర గోవిందనామాలు
సర్వేజనా సుఖినోభవంతు

1/1.  అనాధరక్షక గోవిందా, 
     అభిషేక ప్రియ గోవిందా,
     అనంత రూప గోవిందా,
     అలుపే తెలియని గోవిందా,
   
2. అరమరికలు లేని గోవిందా,
    అపరాజితుడవు గోవిందా,
    అభిప్రాయుడవు గోవిందా
    అర్ధాంగిని ఆదుకునే గోవిందా,
               
3.. ఆరోగ్య వంతువు గోవిందా,
    అక్షోభ్యుడవు గోవిందా
    అమృతాశనుడవు గోవిందా,
    అనిలుడవు గోవిందా

4. అశ్వథాముడవు గోవిందా,
    అనఘుడవు గోవిందా
    అచించుడవు గోవిందా,
    అగ్రజుడవు గోవిందా

 5. ఆత్రత్రాణువు గోవిందా  
     ఆద్యమ్త రహితవు గోవిందా
    ఆదృతవు గోవిందా,
    ఆశ్రమ వాసవు గోవిందా

6. ఆనందదాయక గోవిందా
    ఆపద్భాంధవ గోవిందా
    ఆపన్నివార  గోవిందా
    ఆనందరూప గోవిందా

*ఏడుకొండలవాడా వేంకట రమణ గోవిందా గోవిందా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా

*2/7. అనామయాయ గోవిందా
    అమృతాంశాయ గోవిందా
    అమృతాయా గోవిందా
    అవ్యయాయ గోవిందా

8. అచ్యుతాయ గోవిందా
    అనేక మూర్తయే గోవిందా
    అవ్యక్తాయ గోవిందా
    అనేకాత్మనే గోవిందా

9.  అనఘాయ గోవిందా
    అశ్వారూడాయ గోవిందా
    ఆర్తలోక భయప్రదాయ గోవిందా
   ఆకాశరాజ వరదాయ గోవిందా

10. ఆశ్చర్య భూతుడవు గోవిందా,
    అకృరుడవు గోవిందా
    అరమరికలేనివాడవు గోవిందా,
    అనంతైస్వరుడవు గోవిందా  

11. ఇహపర సుఖములిచ్చె గోవిందా,
    ఇష్ట్తాన్ని ఇచ్చె గోవిందా
   ఇంతే ఇస్తున్నావు గోవిందా,
    ఈశ్వర రూప గోవిందా

12. ఇరువురిమధ్య సఖ్యతవు గోవిందా,
    ఇహపరదాయకవు గోవిందా
    ఇటీవల ఆదుకున్నవాడవు గోవిందా,
   ఇభరాజ రక్షకుడవు గోవిందా

*ఏడుకొండలవాడా వేంకట రమణ గోవిందా గోవిందా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా

*3/13. ఇష్ట దేవుడవు గోవిందా,
     ఇంటిల్లి పాటి అరాధకుడవు గోవిందా
      ఇలలో ఆరాధ్యుడవు గోవిందా,
      ఇప్పుడే సంపద ఇచ్చే గోవిందా

14. ఉరవడి తగ్గించే వాడవు గోవిందా,
     ఊయలలో ఊగేవాడవు గోవిందా
     ఉరుములవర్షం కురిపించేవాడవు గోవిందా,
     ఊరూరా ఊరేగింప బడేవాడవు గోవిందా
              
15. ఓనామాలు నేర్పేవాడవు గోవిందా,
      ఓంకార స్వరూపుడవు గోవిందా
      ఓపికలేనివారిని ఓదార్చావు గోవిందా,
      ఓర్వలేని తనం మార్చావు గోవిందా

16. ఓర్పుతో ఆరాధించిన వారిని కాపాడావు గోవిందా,
       ఓర్పే ఆయుధం కలవాడవు గోవిందా
      ఓపికను పరిక్షించి, రక్షించిన వాడవు గోవిందా,
      ఔదార్యము కలవాడవు గోవిందా

17. ఔషదము అందించే వాడవు గోవిందా,
      ఔను కాదు అని నిర్ధారించేవాడవు గోవిందా
      ఔనత్యము కల్గించావు గోవిందా,
      ఔరా అనేవిధముగా మార్చావు  గోవిందా

18. కపిల వర్ణము కలవాడవు గోవిందా,
      కపీంద్రుడవు గోవిందా
      కపిలా చార్యుడవు గోవిందా,
      కామ పాలకుడవు గోవిందా

*ఏడుకొండలవాడా వేంకట రమణ గోవిందా గోవిందా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా

*4/19. కాలనిర్ణయాధి కుడవు గోవిందా,
      కామ దేవుడవు గోవిందా
      కాలాన్ని గుర్తిమ్చేవాడవు గోవిందా,
      కారడవుల్లో ఉన్నావు గోవిందా 

20. కష్టములు నివరించావు గోవిందా,
      కామిత ఫల దాతవు గోవిందా
      కరుణాసాగరుడవు గోవిందా,
      కాంచనాంభరధరుడవు గోవిందా

21.. కటిహస్తాయ  గోవిందా,
      కస్తూరి తిలకం ఉన్నవాడవు గోవిందా
      కామ క్రుతుడవు గోవిందా,
      కలలో కనిపించే గోవిందా

22..    కరుణ పూర్ణ హృద్యాయ గోవిందా
          ఖడ్గధారిణే  గోవిందా
          కేశవాయ గోవిందా
           కమలాయతలొచన గోవిందా

23. . కుందరుడవు గోవిందా,
      కుముదుడవు గోవిందా
      కుండలీకుడవు గోవిందా,
     కులములేని వాడవు గోవిందా

24.. కురూపిని కాపాడు వాడవు గోవిందా,
      కృష్ణను ఆదుకున్నవుగోవిందా  .
      కుంటి వారిని ఆదుకూన్నవాడవు గోవిందా,
      కర్మలేని వాడవు గోవిందా

*ఏడుకొండలవాడా వేంకట రమణ గోవిందా గోవిందా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా

5/25. కుమారాయ గోవిందా
          కార్తికేయవపుర్ధరాయ గోవిందా
          కేతాధ్యవతారాయ గోవిందా
          క్లిమ్కార జాప కామ్యార్ధాయ గోవిందా

26.   కృతజ్ణుడవు గోవిందా,
      కృతగాముడవు గోవిందా
      కృష్ణుడవు గోవిందా,
      కృ తాక్రుతుడవు గోవిందా

27.  కృతకర్మా చారుడవు గోవిందా,
       కృత గాముడవు గోవిందా
       కలిని తొలగించిన వాడవు గోవిందా,
       కొర్కలు తీర్చావు గోవిందా

28. గతిదాత్రే గోవిందా
     గుణవేంకటాయ గోవిందా
     గోపీశ్వరాయ గోవిందా
      గోపాలాయ గోవిందా

29. త్రివిక్రమాయ గోవిందా,
      త్రిపదుడవు గోవిందా
      త్రిదలాద్యక్షుడవు గోవిందా,
      త్రికాలజ్ఞుడవు గోవిందా

30. త్రిసాముడవు గోవిందా,
      త్రిలోకద్రుతుడవు గోవిందా
      త్రిలోక రక్షక గోవిందా,
      త్రినేత్ర గోవిందా

*ఏడుకొండలవాడా వేంకట రమణ గోవిందా గోవిం దా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా

6/31. ధరణీ నాయకుడవు గోవిందా,
      దక్షిణా పరుడవు గోవిందా
      ధర్మానుస్టాన పరుడవు గోవిందా,
      ద్యుతిధరుడవు గోవిందా

 32.  దాన ధర్మ పరాయ గోవిందా
        దానవర్గ పరిత్రాతాయా గోవిందా    
        దోషనివారణాయ గోవిందా
        ద్వాదశోత్తము లీలాయ గోవిందా

33.   దరిద్ర జన రక్షితాయా గోవిందా
        దక్షిణ స్థితాయా గోవిందా
        దయాంత రంగాయ గోవిందా
        దేవపూజితాయ గోవిందా

34. నిత్య నిర్మలా కారుడవు గోవిందా,
      నీల మెఘశ్యాముడవు గోవిందా
      నంద నందనుడవు గోవిందా,
      నవనీత చోరుడవు గోవిందా

35. నిత్య శుభ ప్రదుడవు గోవిందా,
      నిఖిల లోకేశ్వరుడవు గోవిందా
      నార సింహుడవు గోవిందా,
      నారా యనుడవు గోవిందా

36. న్యాయ పరుడవు గోవిందా,
      నేతలకు నేతవు గోవిందా
      నివృతా త్ముడవు గోవిందా,
      నహుషుడవు గోవిందా

*ఏడుకొండలవాడా వేంకట రమణ గోవిందా గోవిం దా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా

37. నానా రూప వ్యవస్థితాయా గోవిందా
      నేత్రహీనాక్షి ప్రదాయ గోవిందా
      నరకాది భయధ్వ0సినే గోవిందా
      నేత్రానంద కారోత్సవాయ గోవిందా

38.  నటద్వాలక పోషితాయాగోవిందా
       నిరుపద్రవాయ గోవిందా
       నిత్యతృప్తాయ గోవిందా
       నిరంజనాయ  గోవిందా

39. నిర్వికల్పాయ గోవిందా
       నిష్కళంకాయ గోవిందా
       నిర్ణాశాయ  గోవిందా
       నిరంతరాయ గోవిందా

40.  పావనాయ గోవిందా
        పాలి తాఖిల సేవకాయగోవిందా
         ప్రధాన పురుషోత్తమాయ గోవిందా
         పరం జ్యోతిషే గోవిందా   

41.  పద్మ నాభుడవు గోవిందా,
     పరమాత్ముడవు గోవిందా
      ప్రజా భవుడవు గోవిందా,
       పావనుడవు గోవిందా

42. ప్రతిష్టితుడవు గోవిందా,
      పద్మ నిభేక్షుడవు గోవిందా
      పరకాయ ప్రవేసుడవు గోవిందా,
       ప్రలోభాన్ని అనేచేవాడవు గోవిందా

*ఏడుకొండలవాడా వేంకట రమణ గోవిందా గోవిం దా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా

       8/43.    త్రిధాంనే గోవిందా
       త్రిగుణాశ్రయాయ గోవిందా
       తత్వవతే గోవిందా      
       తేజోరాశికరాయ గోవిందా

      44. చతుర్భుజుడవు గోవిందా,
    చతుర్గతుడవు గోవిందా
      చతుర్భాహుడవు గోవిందా,
      చతుర్మూర్తుడవు గోవిందా

      45. చతురాత్ముడవు గోవిందా,
      చతుర్భావకుడవు గోవిందా
      చతురతలను మార్చావు  గోవిందా,
      చత్వారం తొలగించావు గోవిందా

      46. చిన్మయాయ గోవిందా
      చింతి తార్ధ ప్రదాయ గోవిందా  
     చాతుర్మాఖాయ గోవిందా
        చింతి తార్ధ ప్రదాయ గోవిందా

      47. దుర్జయుడవు గోవిందా,
      దురతిక్రముడవు గోవిందా
      దుర్లభుడవు గోవిందా,
      దుర్గముడవు గోవిందా

     48. దురా వాసుడవు గోవిందా,
      దురాక్రమను తొలగించవాడవు గోవిందా
      దుర్మార్గాన్ని తొలగించేవాడవు గోవిందా,
      దూర దృష్టి గలవాడవు గోవిందా

*ఏడుకొండలవాడా వేంకట రమణ గోవిందా గోవిం దా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా

      9/49..  గోహితుడవు గోవిందా,
      గోపతుడవు గోవిందా
      గోప్తుడవు గోవిందా,
      గోవిందుడవు గోవిందా

    50. గోపాలుడవు గోవిందా,
      గోపికా రక్షకుడవు గోవిందా
      గరుడ ధ్వజుడవు గోవిందా,
     గోపీ జనలోలుడవు గోవిందా

     51. గోవర్ధనో ధారకుడవు గోవిందా,
      గోకుల నందనుడవు గోవిందా
      గజరాజ రక్షకుడవు గోవిందా,
      గుణ శీలుడవు గోవిందా
     
      52. గతి ధాత్రే గోవిందా
       గుణ వేంకటాయ గోవిందా
       గోపీశ్వరాయ గోవిందా
       గదాధరాయ గోవిందా

      53.  భయ నాశకాయ గోవిందా
       భక్తలోకైక వరదాయ గోవిందా
       భుజంగ సయనాయ గోంవిందా
       భక వత్సలాయ గోవిందా

       54. భక్త వచ్చలుడవు గోవిందా,
       భాగవత ప్రియుడవు గోవిందా
       బ్రహ్మామ్డ రూపుడవు గోవిందా,
       భక్త రక్షకుడవు గోవిందా

*ఏడుకొండలవాడా వేంకట రమణ గోవిందా గోవిం దా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా

    10/ 55. ధర్మ సంస్థాపక గోవిందా,
     దరిద్ర జన పొషక గోవిందా
     దశరధ నందన గోవిందా,
     దశ ముఖ మర్ధన గోవిందా

     56. దుష్ట సమ్హారణ గోవిందా,
     దురిత నివారుణ గోవిందా
     దుష్టబుద్ధిని దురిమే గోవిందా,
     దుర్ధరుడవు గోవిందా, 

     57. పురాణ పురుష గోవిందా,
      పుందరీ కాక్ష గోవిందా
      ప్రత్యక్ష దేవ గోవిందా,
      పరమ దయాకరా గోవిందా

     58. పద్మ దలాక్ష గోవిందా,
         ప్రభువులకు ప్రభువు గోవిందా
         పరమాత్ముడవు గోవిందా
         పరబ్రహ్మణే  గోవిందా

     59. పద్మినిప్రియాయ గోవిందా
           పాపఘ్నాయ గోవిందా
          పీతాంబరధరాయ గోవిందా
          పరమార్ధ ప్రదాయ గోవిందా

      60. భూతాది పతుడవు గోవిందా,
            భావనా పరుడవు గోవిందా
            భూత నాధుడవు గోవిందా,
           భవనాదీ సుడవు గోవిందా 

*ఏడుకొండలవాడా వేంకట రమణ గోవిందా గోవిం దా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా

     11/61. మధుసూధనుడవు గోవిందా,
            మాధవుడవు గోవిందా
            మహా భాహుడవు గోవిందా,
            మహా బలుడవు గోవిందా

      62 . మహా బుద్ది మంతుడవు గోవిందా,
             మహా వీర్య వంతుడవు గోవిందా
             మహా శక్తి మంతుడవు గోవిందా,
             మహా ద్యుతి మంతుడవు గోవిందా

       63. మహీ భర్తవు గోవిందా,
             మనో హరుడవు గోవిందా
             మహీదరుడవు గోవిందా,
             మహా భాగ్య వంతుడవు గోవిందా
      
     64.  మోక్ష లక్ష్మీ ప్రాణ కాంతాయ గోవిందా
                   మృగయాసక్త మానసాయ గోవిందా
                   మహాత్మనే గోవిందా
                   మాతృకార్చితాయ గోవిందా

         65. ముఖ్యమూర్తయే గోవిందా
               మానసంరక్షణాయ గోవిందా
               మతిహీన మతిప్రదాయ గోవిందా
               మోహజాలవికృంతాయ గోవిందా

66.  యజ్ఞ పరాహాయ గోవిందా
       యత్న యత్ఫల సంధాత్రే  గోవిందా
       యజుర్వేదసిఖాగమ్యాయ గోవిందా
       యాతుధాన వినాశాయ గోవిందా

*ఏడుకొండలవాడా వేంకట రమణ గోవిందా గోవిం దా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా

   . 12/67. జనేశ్వరుడవు గోవిందా,
      జగదీశ్వరుడవు గోవిందా
      జగత్స్సేతుడవు గోవిందా,
      జహ్నువుడవు గోవిందా

        68. జగజ్జేతుడవు గోవిందా,
      జగదాదిజుడవు గోవిందా
      గోవిందా శ్రీ హరి గోవిందా,
      గోకుల నంద గోవిందా

69. యజ్ఞశేఖరభావితాయ గోవిందా
       యక్షగంధర్వవరదాయ గోవిందా
       యాదవాచల వాసాయ గోవిందా
        యడుకులాగ్రగణ్యాయ గోవిందా

70.  యోగిహృత్పద్మమందిరాయ గోవిందా
       యజ్ఞరూపాయ గోవిందా
       యజ్ఞభోక్త్రే గోవిందా
       యమాద్యష్టాంగగోచరాయ గోవిందా

71.  రక్షస్సందోహసంహార్తే గోవిందా
        రఘుపుంగవాయ గోవిందా
         రామావతారమంగేశాయ గోవిందా 
        రాకాజనకసుప్రియాయ గోవిందా
       
72.  రూపార్ధలక్ష్యాయ గోవిందా      
       రాజా రాజా వరప్రదాయ గోవిందా
       రమ్య విగ్రహాయగోవిందా
       రధోత్సవకళాధరాయగోవిందా

*ఏడుకొండలవాడా వేంకట రమణ గోవిందా గోవిం దా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా

13/73. రమణాయ గోవిందా
      రమాయై గోవిందా
      రాత్రోదేవగణార్చినాయ గోవిందా
      రాజీవలోచనాయ గోవిందా
 
74. . లక్ష్మీ ప్రసాదకాయ గోవిందా
లక్ష్మీ సల్లాపసాముఖాయ గోవిందా
లోకనాధాయ గోవిందా
లోక ప్రయాయ గోవిందా

75. లోకసారంగుడవు గోవిందా,
     లోక నాయకుడవు గోవిందా
      లోకా ధీశుడవు గోవిందా,
      లోకోత్తముడవు గోవిందా

. 76. లోక భందుడవు గోవిందా,
      లోకేశ్వరుడవు గోవిందా
      లోకాలేలే వాడవు  గోవిందా,
      లోకనాయకుడవు గోవిందా

 77. వృద్ధాత్ముడవు గోవిందా,
     వికారము పొందువాడవు గోవిందా
      వ్యవ సాయకుడవు గోవిందా,
      వ్యవస్తానుడవు గోవింద

 78. వారణుడవు గోవిందా,
     వాచస్పతుడవు గోవిందా
      వృషబాక్షుడవు గోవిందా,
      వరము లిచ్చు వాడవు గోవిందా

*ఏడుకొండలవాడా వేంకట రమణ గోవిందా గోవిం దా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా

14/79. వరప్రదాయ గోవిందా
      వనమాలినే గోవిందా
       వర్చస్వినే గోవిందా
       వరేణ్యాయ గోవిందా
       
. 80. వైకుంఠపతయే గోవిందా
      వృద్ధికృత్యాయ గోవిందా
      విష్ణురూపాయ గోవిందా
      విద్యాభక్తార్తి భంజానాయ గోవిందా
 
. 81. విష్వక్సేనుడవు గోవిందా,
      వేద శరీరుడవు గోవిందా
      వరాలు ఇచ్చావాడవు గోవిందా,
      వలపు పంచె వాడవు గోవిందా

. 82. విద్యాయ గోవిందా
       విష్ణవే గోవిందా
       వరప్రదాయ గోవిందా
       వన మాలినే గోవిందా
 .
83. విక్రముడవు గోవిందా,
      వైకుంటాధీశుడవు గోవిందా
      వృష కర్ముడవు  గోవిందా,
       వరారోహుడవు గోవిందా

. 84. విశ్వo స్థాపనాయ గోవిందా,
      విజయుడవు గోవిందా
      వ్యవస్తాపకుడవు గోవిందా,
      వాసు దేవుడవు గోవిందా

*ఏడుకొండలవాడా వేంకట రమణ గోవిందా గోవిం దా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా

  15/85. సద్గతుడవు గోవిందా,
      సజ్జన పాలకుడవు గోవిందా
      సత్కార్యుడవు గోవిందా,
      సద్భూతుడవు  గోవిందా

. 86. సత్యనారాయణుడవు గోవిందా,
      సత్యసంకల్పుడవు గోవిందా
      సాధకులకు విశ్రాంతి ఇచ్చావు గోవిందా,
       సందేహములు తీర్చావు గోవిందా

. 87. సమస్తభూతములకు నివాసుడవు గోవిందా,
     సహస్త్రప్రాణులను రక్షకుడవు  గోవిందా
      సంతతి కల్పించు వాడవు గోవిందా,
      సమస్తరోగములను హరించు వాడవు గోవిందా

88. సర్వేశాయ గోవిందా
సర్వసిద్ది సంధాత్రే గోవిందా
సచ్చిదానంద రూపాయ గోవిందా
సుధానవే గోవిందా

89. సిరా నందుడవు గోవిందా,
      సుందరుడవు గోవిందా
      సురారిహుడవు గోవిందా,
      స్థిరము గలవాడవు గోవింద

90.  సువర్నా భరుడవు గోవిందా,
      సృష్టిలయ కారుడవు గోవిందా
      సత్య వంతుడవు గోవిందా,
      సత్య పరాక్రముడవు గోవిందా

*ఏడుకొండలవాడా వేంకట రమణ గోవిందా గోవిం దా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా

91. సహస్త్ర శిరస్సుడవు గోవిందా,
      సహస్త్ర నేత్రుడవు గోవిందా
      సహస్త్ర పాదుడవు గోవిందా,
      సుప్రసాదుడవు గోవిందా

92. సిద్ధార్ధుడవు గోవిందా,
      సిద్ధి సంకల్పుడవు గోవిందా
      సిద్ధి సాధకుడవు గోవిందా,
     సిద్ధులను రక్షకుడవు గోవిందా

  94.  సురేశ్వరుడవు గోవిందా,
      సహస్రజతుడవు గోవిందా
      సుఘోషుడవు గోవిందా,
      సుఖపరుడవు గోవిందా

   95.  స్వాపనుడవు గోవిందా,
      స్వశనుడవు గోవిందా
      సత్య సంధుడవు గోవిందా,
      సత్య పాలకుడవు గోవిందా

    96. సుదర్శనుడవు గోవిందా,
      స్తావరస్తాణుడవు గోవిందా
     స్రవదర్శకుడవు గోవిందా,
      సర్వజ్ఞుడవు గోవిందా

*ఏడుకొండలవాడా వేంకట రమణ గోవిందా గోవిం దా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా

     97. సుముఖుడవు గోవిందా,
      సువ్రతుడవు గోవిందా
      వరదుడవు గోవిందా,
      వరమాలాకరుడవు గోవిందా

 98. శంక దారకాయ గోవిందా
శాంతాయ గోయిందా
శేష శైల కృతస్థలాయ గోవిందా
శతృకృతా భీతిజ్ఞాయ గోవిందా

99. శిష్ట పరిపాలకాయ గోవిందా
శాస్త్రముఖ్యానంత లీలాయ గోవిందా
శాస్త్ర ప్రమాణ ముఖ్యాయ గోవిందా
శ్రీనివాసాయ గోవిందా

100. శాశ్వితాయ గోవిందా
శేషాద్రినిలయాయ గోవిందా
శార్జపాణయే గోవిందా
శింశుమారాయి గోవిందా

101. శ్రీ గర్భుడవు గోవిందా,
      శ్రీ మంతుడవు గోవిందా
     శ్రీ నిధిగలవాడవు గోవిందా,
     శ్రీ విద్యావంతుడవు గోవిందా

. 102. శ్రీ లక్ష్మీశ్వరూపుడవు గోవిందా,
      శ్రీ వేంకటేశ్వరుడవు గోవిందా
      శ్రీ ధరుడవు గోవిందా,
      శ్రీ కరుడవు గోవిందా

*ఏడుకొండలవాడా వేంకట రమణ గోవిందా గోవిం దా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా

. 103. శ్రీ నిధికలవాడవు గోవిందా,
      శ్రీ విభావనుడవు గోవిందా
      శ్రీ లక్ష్మీ శ్రీనివాసాయ గోవిందా,
      శ్రీ హరి గోవిందా గోవిందా

 104. శ్రీ  అఖిల కారణాయ గోవిందా,
      శ్రీ అఖిల పాలకాయ గోవిందా
      శ్రీ సుర నాయకాయ గోవిందా,
      శ్రీ దైత్య విమర్ధనాయ గోవిందా

105. శ్రీ భక్త జనప్రియాయ గోవిందా,
      పాప విదారణాయ గోవిందా
      దుర్జన నాశకాయ గోవిందా,
     తస్మై జగదీశ్వరాయ గోవిందా

106. శ్రీ భూమినాయకాయ గోవిందా
        శ్రీ వత్సచిహ్నాయ గోవిందా
        శ్రీ స్వామిని శ్రీఆంజనే గోవిందా
        శ్రీ మన్నభీష్ట గోవిందా

107. శ్రీ శేషశైల వాసా గోవిందా
        శ్రీ రక్షోమ్బునాథ గోవిందా
        శ్రీ నిత్య కళ్యాణ నాయకా గోవిందా
         శ్రీ వైష్ణవాయ గోవిందా

108. శ్రీ హయగ్రీవాయ గోవిందా
        శ్రీ హిరణ్యదానగ్రహీనే గోవిందా
        శ్రీ హారాదిసర్వదేవాధ్యాయ గోవిందా
        శ్రీ వెంకటేశ్వరాయ గోవిందా

*ఏడుకొండలవాడా వేంకట రమణ గోవిందా గోవిం దా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా

శ్రీరామ చంద్రుడు హనుమంతుని పిలిచి "జగత్కల్యాణం కొరకు ఇక్కడే ఉండు" అని ఆదేశించాడు. ఈ విషయం వాల్మీకంలో ఇలా ఉంది

మత్కథా ప్రచరిష్యన్తి యావల్లోకే హరీశ్వర!!
తావద్ రామస్వ సుప్తితో మద్ద్వాక్యమనుపాలయన్ !! వా.రా.ఉత్తర.108/త్రీత్రీ-34)

"హరీశ్వరా! ప్రపంచంలో నా కథలు ప్రచారంలో ఉన్నంతకాలమూ నీవు నా ఆజ్ఞను పాలిస్తూ ఆనందంగా సంచరిస్తూ ఉండు ము" అలా పలికిన ప్రభు వచనాలకు పరమ సంతుష్టుడై హనుమంతుడిట్లు అన్నాడు.

యావత్తవ కథా లోకే విచరిష్యత పావనీ!
తావత్ స్థాస్యామి మెదిన్యాం తవాజ్ఞామను పాలయన్ !!

"ప్రభు ప్రపంచంలో నీ పావనగాథా ప్రచారంలో ఉన్నంతవరకూ నీ ఆదేశాన్ని పాలిస్తూ నేని భూతలంపై ఉంటాను "

భగవంతునకు భక్తునకు జయమగును గాక
సర్వేజనా సుఖినోభవంతు - ఓం శాంతి శాంతి: శాంతి
ఓం శ్రీ ఆమ్   ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ 
--((*))--

15, ఆగస్టు 2016, సోమవారం

Internet telgu magazine for the month of 8/2016/32

ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ - వార పత్రిక 

సర్వేజనా సుఖోనోభవంతు 

*శ్రీ మహాగణాధిపతయే నమ:

బ్రమణ తరుణంలో ఉన్నాము గణాధిపాయ
అనుకరణ తోరణంలా ఉన్నాము ఉమాపుత్రాయ
కరుణ అరుణా రుణ గణ కిరణాలతో ఉన్నామయ్యా
గణాల గుణ గణాల్నికరుణించవయ్యా వినాయకాయ

తృణ ప్రాణంతో బ్రతికి బతికించు తున్నామయ్య
గణగణ నాదంతో గణాంకాన్ని సరిచేసే ఈసపుత్రాయ
వాణి నాదాన్ని శ్రవణానందంగా అందించే ఏకదంతాయ
మణిమయ దివ్య మణులను అనుగ్రహించే ఇభవక్త్రాయ

సర్వ సిద్ధులను అనుగ్రహించే వరసిద్ధి ప్రదాయకాయ
బుద్దిని ప్రకాశింపచేయు పరిపూర్ణ మూషికవాహనాయ
యోగుల హృదయముల నందు ఉండే గజాననాయ
సర్వలోకాలను సమదృష్టితో చూసికాపాడే విశ్వనేత్రాయ

శరణాగతులను ఆదుకున్న ఆశ్రీత వత్సలాయ
మాకు విఘ్నాలను  తొలగించే విఘ్నహన్తరాయ
సర్వవిద్యా సంపదలను కల్పించే సుప్రదీపాయ        
శేషు గణాలను ఆభాణాలుగా ధరించే గణాదక్షాయ

సమస్తలోక మానవులు అది పూజగా కొలిచే శ్రీవిఘేశ్వరాయ
వస్త్రం, గంధం, పుష్పం, దూపం, అందుకో పార్వతీ నందనాయ
ఏకవింశతి (21) పత్రాలతో పూజిస్తున్నాము లంబోదరాయ
మా కణాలను కదిలించి, వనాలను విస్తరించి,  ఋణం
తీర్చుకొనే అవకాశము కల్పించవయ్యా  శ్రీ గణేశ్వరాయ       

--((*))-- 


image not displayed
*స్పర్శ

వెచ్చని స్పర్శ
నా గుండెను తాకింది
ఒంటరి స్పర్శ
కొంతకాలం వేచి ఉండ మంది

ఆమని స్పర్శ
నా మనసును తాకింది
అద్దపు స్పర్శ
కొంత కాలం నిలబడుతానంటుంది

సుఖాల స్పర్శ
కౌగిళ్లు కోరుకో మంటుంది
నీడల స్పర్శ
ఎంతోకాలం కనిపించలేనంటుంది

సిగ్గుల స్పర్శ
నా  మొము వెంటాడుతుంది
కలల స్పర్శ
నిద్రించ నంతసేపు కనబడుతుంది

జ్ఞాపకాల స్పర్శ
నా ఆణు వణువూ వణికిస్తుంది
ఘటాల స్పర్శ
ఎంతకాలం సహకారం అందిస్తుంది

అక్షర స్పర్శ
నాకు మోక్ష మార్గ మవుతుంది
గణాంక స్పర్శ
బ్రతుకుకు మార్గమవుతుంది

ఉదయ స్పర్శ
నా ఆరోగ్యాన్ని భద్ర పరుస్తుంది
వ్యాయామ స్పర్శ
నిగ్రహా శక్తిని పెంచు తుంది

వెన్నెల స్పర్శ
నా మనసు ఉల్లాస పరుస్తుంది
జల్లుల స్పర్శ
హృదయస్పందనకు దారితీస్తుంది

ఇల్లాలు స్పర్శ
జీవితము సుఖమయ చేస్తుంది
దేవుని స్పర్శ
నీలోఉన్న నన్ను మరవద్దంటుది
--((*))-- 



* కల పుట్టుక

రెండు ఆత్మలు కలిస్తే
 వెలుగు కల పుట్టుక
రెండు శిలల రాపిడికి
అగ్ని కల పుట్టుక

భక్తికి దైవం లొంగి
గంగ కల పుట్టుక
సాగరంలో నది కలసి
ముత్యాల కల పుట్టుక

నెల నింగి మధ్య
ప్రకృతి కల పుట్టుక
సంస్కార సాంప్రదాయం కలిస్తే
నిత్య శోభల కల పుట్టుక

మంచి చెడు కలిసి
మనసు కల పుట్టుక
సుఖ దు:ఖాలు కలిసి
జనన కల పుట్టుక

నాలుగు చేతులు కలిసి
జీవిత కల పుట్టుక
వెలుగు నీడలు కలిసి
కరుణ కల పుట్టుక

బాహ్యాన్తరాలు కలిసి 
బ్రహ్మ కల పుట్టుక
మనసు మనసు కలిసి   
మానవత్వ కల పుట్టుక  
   --((*))--


Children special

పంజలి ప్రభ -జ్ఞాన ప్రభ 

 పొడుపు కధలు
వినండి -  వినమని చెప్పండి


--((*))--


 
సముద్రం 

అంతర్వేదిని చేరా 
నాలో అంతర్మధనం కలిగింది 
అలుపెరుగక అలా అలా వస్తున్నా సముద్రపు 
 అలలు నాపాదాలు తాకి వెను తిరిగాయి
ఒక్కసారి పాదాల క్రింద భూమి
కదిలినట్లుగా గగుర్పాటు  కలిగించింది సంద్రం 
నాకళ్ళు ఒక్క సరిగా చెమ్మగిల్లి 
మొద్దుబారి కనుపాపలు మధ్య 
ఎర్రని నెత్తుటి చెమ్మ వెచ్చగ తగిలింది 
కెరటాలు నాలుక బయట పెట్టి వెక్కిరిస్తున్నట్లుగా 
నా మనసును వేదనకు గురిచేసింది 
అనంత ఖనిజ ఓషదములు ఉంచుకొని 
ఒడ్డుకు కళేబరాలను నెట్టివేస్తుంది 
      నదిని తనలో చేర్చుకొని 
నిరంతరం నవ్వుతూ ఉరకలువేస్తూ 
వస్తున్నా సముద్రానికి ఒక్క నమస్కారము చేసి 
ఓ సముద్రుడా నీకు పునర్ జన్మలేదు
నీ కెరటాల నీటిలో స్నానమాడినాను 
నాకు పునర్ జన్మలేకుండా 
మనస్సును ప్రశాంతముగా 
సహాయక గుణంగా ఉండమని 
 దీవించు " అర్ణవ "తండ్రి   
--((*))-- 



హాస్య గీతమ్ (కాసేపు నవ్వు కోండి)

అబ్బబ్బ  ఎంత బాగున్నావే
నా మనసు లాగేస్తున్నావే
ఏ మాయ చేసావే నా మనసు గుంజేస్తుందే

ఏరువాక పొంగులా, ఎగసి విరసి  పడుతున్నావు
పున్నమి వెన్నెలలా నా హృదయాన్ని తాకుతున్నావు

అంత లేదు, ఆ మాయేనిన్ను కమ్మింది
సహజ సౌందర్యమే నాది, వయసులో విరిసిన
సొగసు మత్రామే, పువ్వులా గుబాళిస్తున్నాను అంతే

ఏ మంత్రం వేసావే, నా వళ్ళంతా తడిసి పోతున్నదే
నీవు మంచులా కరిగి పోతున్నావు, చల్ల లో వెన్న ముద్దలా
తేలి పోతున్నావు, ఆ తెల్లదన్నాన్ని చూసి మరువలేకున్నానే

ఏ మంత్రం వేయలేదు, అంత తొందరెందుకు
వేడికి కరిగితే నా తప్పు కాదు, వయసు పొంగు
ముద్దలా తేలితే నా తప్పు కాదు అంతే

ఏ తంత్రం చేసున్నావో నాకళ్ళు నిలవ నంటున్నాయి
నిన్ను వదలి పోలేకున్నాను, ని రూపు నన్ను ఉక్కిరి
బిక్కిరి చేస్తున్నది

ఏ తంత్రం చేయలేదు, నిన్ను చూసి నా మనసు
మార్చుకున్నా, నీ రూపం నా హృదయంలో
పదిలంగా ఉంచాలను కున్నా అంతే

ఏది మాయయో , ఏది మంత్రేమో, ఏది తంత్రమో
నాకు తెలియదు, నిన్ను వదల లేని ప్రేమ నన్ను
వెంటాడుతున్నది, నీవే నా సొంతం కావాలని ఉన్నది

మాయ మాంత్రం, తంత్రం ఏమి లేదు ఈ హృదయ
స్పందన, నిను కోరు కుంటున్నది నీతో 7 అడుగులు
నడవ మంటున్నది, మరి నీ కిష్టమేనా 

ఇష్టమీనా అనకు, నీ మీద మరచి పోలేని ప్రేమ
అలాగే నాకు కుడా నీ మీద మరువలేని ప్రేమ

అలాగే కలసి మెలసి వలపులు పంచుకుంటూ సాగి పోదామా
ఓ అట్లాగే కలసి మెలసి సాగి పోదాము అట్లాగే అట్లాగే

ఏ మాయ లేదు మంత్రం లేదు తంత్రం లేదు ఈ ప్రేమకు
అవును ఏ మాయ లేదు మంత్రం లేదు తంత్రం లేదు మన ప్రేమకు
--((*))--


                        




*మానవ జీవన రేఖలు (1)

విధాత జివిత సత్యాలను లిఖించిన నుదుటిపై రేఖలు
లయకారుడు సత్యప్రయాణాలను లిఖించిన పాద రేఖలు
స్థితి కారుడు కష్టానికి ఫలాన్నిచ్చి అర్ధం తెలిపే హస్త రేఖలు
శ్రీ మాతా, ప్రకృతి, ఫంచభూతాలు కదిలించే జీవన రేఖలు

రివ్వున వచ్చి మనసును  కదిలించే గాలి రేఖలు
కెరటంలా ఎగసి పడుతూ చేరే అహంకారపు రేఖలు
కుటుంబంలోకాలాన్నిబట్టి మారే సుఖ:దుఃఖ రేఖలు
స్త్రీ ధైర్యముతో పురుషునకు ధైర్యము చెప్పే రేఖలు


చెవులకు వినిపించక పోయిన మనసుకు చేరే దివ్య కాంతి రేఖలు
పెద్దలు వినిపించే ప్రవచనాలవల్ల కుటుంబానికి అందె శాంతి రేఖలు
మంత్రంవల్ల విషం దిగినట్లు స్పర్శ సుఖం వళ్ళ ఆనందాశ్చర్య రేఖలు
వార్ధక్యం వళ్ళ ఇంద్రియాలు నిరుపయోగం చేదాకా భక్తిని రేపే రేఖలు

సామాన్యుని హృదయాలలో తృప్తి మయం కలిగించే రేఖలు
సంపన్న హృదయా ల్లో ఆశా పాశాలను కల్పించే రేఖలు
ఆక్రోశం హృదయాల్లో అసంతృప్తి పోరాటం కల్పించే రేఖలు
కష్టజీవుల హృదయాలలో అనుభవ సారాన్ని తెలిపే రేఖలు 

ఒక వీరుడు మరణిస్తే వేలకొద్ది వీరులు ప్రభవించే రేఖలు 
ఒక కవి మరణిస్తే వేలకొద్దీ రసజ్ఞులు విలపించే  రేఖలు 
ఒక నాయకుడు మరణిస్తే కొందరికి ఆశల పెంచే రేఖలు
ఒక బ్రాహ్మణుడు మరనిస్తే వేలకొద్దీ దేవతలు ఆవేదన లేఖలు
  
--((*))--


*మానవ జీవన రేఖలు (2)

యువకులు ధీరవచనం చెప్పే దివ్య రేఖలు
నదీమ తల్లులు ఉత్సాహముతో పొందే రేఖలు
సాగర కెరటములు వడ్డును తాకాలని రేఖలు
కాల పురుషులు సాగించే కాంతి నౌక రేఖలు 

పుడమి పురిడించిన కంకుల జీవబింబ రేఖలు
ఆకాశము పురిడించిన మేఘ జీవబింబ రేఖలు
ప్రకృతి పురిడించిన తరువుల జీవబింబ రేఖలు
కాలయోని పురిడించిన అరుణారుణ జీవబింబ రేఖలు

భయానక కార్పణ్యముతో కలిగిన నలిగిన రేఖలు 
క్రియాశీలతలు అరణ్యవాసం నలిగిన రేఖలు
కళాత్మకలను ఎదగలేక కళలానలిగిన రేఖలు
కవిత్వము పటుత్వము ఆదరణ తగ్గిన రేఖలు

అక్షయ జీవనానందానికి అభినందన రేఖలు
అక్షయాభ్యుదయ పరంపరకు ఆహ్వానాల రేఖలు
అక్షర పరంగా తెలుగు విద్య నీతి బోధనల రేఖలు
ఆకాంక్షముగా విలసిల్లే కవుల భావాల రేఖలు

కవి విరజిమ్మే అక్షర కాంతి రేఖలు
సుకవి జీవించే ప్రజల నాల్కులపే ఉండే రేఖలు
జ్ఞాన విజ్ఞాన సంకేత ఆదరణ పొందే రేఖలు
కవి మరణం జీవిత సత్యాలు తెలిపే రేఖలు

జనన మరణాలు కాంతి  వెలుగుల రేఖలు
పుణ్య పాపాలు ప్రేకృతి లో తెలిపే లేఖలు
 ఊర్ధ్వ అదో దిశలు అన్ని కాలాల్లోచూపే రేఖలు
అక్షర సాహిత్య సంపద ఇంటింట వెలిగే రేఖలు

నీరు చల్లని ఉష్ణం చేరి ఉష్ణత్వం పొందే రేఖలు
స్వభావం శాంతం  అహంచేరి అహంకారత్వ రేఖలు
 జలంలో వెలుగు చేరి స్వెతతత్వం చెందే రేఖలు
పురుషుల పొందు స్త్రీల చల్లదనం కలసి చేరే రేఖలు        

--((*))--

హాస్య గీతం ( కాసేపు నవ్వుకోండి)

అబ్బో::  ఎర్ర కొక కట్టి, నడుం చుట్టూ, చీర చుట్టి
కన్ను కొట్టేటట్టు ఉన్నవే పిట్టా
అట్లాగా
అవునే
కట్టు బొట్టు పెసరట్టులా ఉన్నవే పిట్టా
అట్లాగేట్లా అనకే, ఆట పట్టించకే
అత్తెసరలా, ఉన్నానే పిట్టా

ఉంటె నాకేంటి
నీటుగా  సూటు బూటు వేసావు
కంత్రీ బుల్లో డా
మాటలతో చోటు చూసి, కాటు వేయకు
ఖలేజా బుల్లో డా

ఓహో తట్టలో లొట్ట పిట్టలా
తట్టి తట్టి చెప్పకే పిట్టా
ఇట్లా అట్లా అనకే, 
నీ వెట్లాగంటే అట్లాగే  పిట్టా

నన్ను అట్లా,:: చాటు మాటు చూడకు రా 
కందిరీగ బుల్లో డా
వెయిట్  చేస్తే, స్వీట్ రూట్
చూపెట్తా  బుల్లో డా 

బెస్ట్ చీపెష్టు హోటల్కు
పోదామా పిట్టా
జేష్టు వేస్టు చేయకు టైం
బుల్లో డా

ఎందు కట్లా గంటావ్ " పిట్టా"

ముందు చదువు పూర్తి
చేయరా బుల్లోడా
చక్కని ఉద్యోగం లో చేరి 

అప్పుడు కనిపించు బుల్లోడా

అంతే నా ,
అంతే

అయితే వెళ్లొస్తా
మళ్ళెప్పు డొస్తావ్

చక్కని పిట్టకోసం :: ఉద్యోగం వచ్చాక వస్తా
అట్లాగే బుల్లోడా
అట్లాగే వెళ్ళొస్తా పిట్టా   
     

అట్లాగే బుల్లోడా    
 వెళ్ళొస్తా పిట్టా
అట్లాగే  
వెళ్ళొస్తా 
 --((*))--

* మానవ సేవే మాధవసేవ
మనసు మనసులో లేదండి
కరుణ చూపాలన్నా అవకాసం లేదండి
మనం పెట్టుక్కున్న ఆశలు
అడియాశలు ఆఇనాయి కదండీ
అలా అనుకోకే నేను చెప్పే మాట విను ముందు


"గతస్మ్రుతులు మరచి
వర్తమానంలో ఉందాము ఒక్కరమై
బిడ్డల కోసం వ్యధ చెందకు
ఉండేదము స్వతంత్రులుగా 


మదితలపులు అర్ధం చేసు కుంటూ
మమ కారమతో ఉండెద మమేకమై
మానవ సేవ మాధవ సేవే అని
సేవా దృక్పధముతో ఉందాము


మనోనిగ్రహ శక్తితో మనలో శక్తి
ఉన్నంత వరకు మనం సేవకులమై
మానవాభ్యుదయమునకు,
భగవద్గీతను భొధిస్తూ ఉందాము


ప్రకృతి వనరులను ఉపయోగించండి
ఆరోగ్యమును కాపాడుకోమని హెచ్చరిద్దాము
మనలో ఉన్న ప్రతి రక్త బిందువును
మనభాషను, దేశాన్ని రక్షించుటకు
ఒక ద్యేయముగా జీవిద్దాము


అవునండి మనలక్ష్యం, మన ఔనత్యం
మారకుండా ఆ దేవదేవుని ప్రార్ధించుద్దాం

పాదరసాన్ని పట్టలేనట్లుగా
గాలిని ఎవ్వరూ చూడలేనట్లుగా
అకాశాన్ని కొలవ లేనట్లుగా
హృదయంలో ఉన్న శక్తిని గమనించ లేనట్లుగా
 

ఎవరు గుర్తించిన గుర్తించక పోయినా
మానవులను విజ్ఞానవంతులుగా
మార్చుటకు శక్తి వంచన లేకుండా
కృషిచేద్దాము, ఆ హనుమంతుని అరద్యులుగా
అందరికి వందనములు సమర్పిస్తూ
ప్రజాసేవ ప్రారంభించుదాము
* మానవ సేవే మాధవసేవగా జీవిద్దాము
--((*))-




*రాధాకృష్ణ ప్రణయ సాగరము

వలపుల తలపులు తెలుపవా
మెరుపుల సొగసులు చూపావా
మనుసున మమతలు పంచవా
ఓ రాధికా నీ మనసు నాదికా    

గంధము పూసెద, చందనం పూసెద 
తులసి మాలను వేసెద,   
మేఘశ్యామ రూప
శిఖ పింఛమౌళి ముకుందా

ద్రాక్షాపాకం త్రాగెదవా
కదళీఫలములను గ్రోలెదవా
మదన కదన కుతూహలముకొరకు
మనసును రంజింపచేయుటకు  
ఓ రాధికా నీ మనసు నాదిక

నారికేళములు కావలెనా
కదళీఫలములుకావలెనా
నవనీతము కావలెనా
ఇక్షు రసములను కావలెనా 
శిఖ పింఛమౌళి ముకుందా

మూగ మనసుతో కోరుతున్నావు 
మౌన గీతములు పడుతున్నావు 
నుదుటి రాతలు గురించి చూస్తున్నావు 
ప్రేమను పంచుతున్నావు
ఓ రాధికా నీ మనసు నాదిక

మోహనమురళి నీకోసమే ఉన్నా
యదు వంశీకృష్ణ నిన్ను ప్రార్ధిస్తూఉన్నా 
అధరామృతాములను అందించాలని ఉన్నా
నంద గోపాల కృష్ణ, గోకులనందా
ఈ రాధిక ఆరాటం తగ్గించుకు రావా
      ;
వలపుల తలపులు తెలుపవా  రాధిక
మెరుపుల సొగసులు చూపావా కృష్ణ 


--((*))--

 *హాస్య గీతము

నీలి మేలి రంగు గల తుమ్మెదా
అందు కోవా మకరందము
పసిడి వర్ణము గల పుష్పమా
అందు కుంటా అమృతము

నీలిరంగు మేనిలో
నిన్ను చూస్తూ ఉంటే
నాలో దాగి ఉన్న సిగ్గులు
పురి విప్పిన పువ్వులో
దాగినవి దోచుకోవా తుమ్మెదా

పచ్చ పచ్చ ఆకుల మధ్య
పసిడి మేను సింగారాలతో
వయ్యా రంగా  ఊపులతో
ఎగిరెగిరి పడుతున్నావే పుష్పమా

తరువు చెంత ఉండ లేకున్నా
పరువు పోయి వాడక ముందే
వెచ్చని పరిమళాన్ని
అందించాలని ఉన్నది తుమ్మెదా

పరిమాళాలు భద్ర పరుచుకో
మధుర స్మృతులు దగ్గ రుంచుకో
మది తలపులు దోచుటకు
తొందర్లో వస్తానే పుష్పమా   

వేచి ఉండక తప్పదా తుమ్మెదా
వేచి ఉండాలి పుష్పమా

నీలి మేలి రంగుగల తుమ్మెదా
అందుకోవా మకరందము
పసిడి వర్ణము గల పుష్పమా
అందుకుంటా అమృతము

అందుకోవా మకరందము
అందుకుంటా అమృతము
--((*))--

 *మధురవాణి

పట్టుదల ఉన్నది -
 విజయం మనదేనంటున్నది
మౌనం వద్దంటున్నది -
 సంతోషం పంచుకోమంటున్నది

భావం తెలుప మంటున్నది -
 భాషకు విలువ పెంచమంటున్నది
స్త్రీలకు గౌరవం పెరుగుతున్నది -
 ధైర్యముగా బ్రతకాలంటున్నది

మనసుతో నవ్వమంటున్నది -
నవ్వులు పంచి బ్రతకమంటున్నది
కన్నీటిని అదుపు చేయద్దన్నది -
 వెలుగుకు కన్నీటి సాక్షమన్నది

ప్రమిదకు వెలుగివ్వాలని తపన ఉన్నది-
 స్నేహితులతో కలసి వెలుగిస్తున్నది
భంగ పడవద్దన్నది -
 ఓర్పుకు అది ఒక పరీక్షయని తలవమన్నది

కాంతి ధార పంచమన్నది -
నిగ్రహశక్తితో నలుగురిని బ్రతికించమన్నది  
నేల చినుకును కోరుకుంటుంది -
 నింగి సహకారంతో పులకరించిపోతుంది

మధురవాణి మనవెంటే ఉన్నది -
 మమతలు పంచుతూ విజ్ఞావంతులుచేయమన్నది
తనువును స్పర్శ అవసరమన్నది -
 జిహ్వచాపల్యంనకు  స్పర్స్ సుఖమన్నది

రచ్చబండ రాజకీయ మొద్దన్నది
ఉడతలా సహాయ బడమన్నది
వయసుని బట్టి  ప్రవర్తించమన్నది
వానరుడిలా సహాయపడుతూ బ్రతకమన్నది

--((*))--

11, ఆగస్టు 2016, గురువారం

Inernet Telugu magazine for the month of 8/2016/31



 ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - వార పత్రిక
స్వాతంత్రదినోత్సవ సందర్భముగా
భారతదేశ ప్రజలందరికి ప్రాంజలి ప్రభ వారు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు
మచ్చుతునకగా ఈ దేశభక్తి గీతం చదవండి

యువతి యువకుల్లారా మేలుకోండి 
నవతేజంతో దేశానికి సహకరించి మిమ్ము మీరు
ఉద్ధరించుకొని అందరికి సహకరించిండి 

సమభావమనే యోగశబ్దంతో,
హృదయ స్పందన  ఆనందంతో
మనస్సు నిగ్రహ శక్తితో, పెద్దలతో
సహకరించి దేశసేవకు సహకరించండి

కర్తవ్యమనే దృఢసంకల్పంతో
మాతృభూమి, మాతృభాష, మాతృదేవత
ఋణం తీర్చుకొని దేశసేవకు సహకరించండి

జన్మలకు మూలం మిరే, ప్రగతికి మూలం మీరే
మీ శక్తిని అధోగతి పాలు చేయక మట్టిని బంగారం చేయండి
నాకు దేశం ఏమి ఇచ్చిందని ఆలోచించకండి
దేశానికి మేము ఏమి ఇచ్చాం , ఏమి ఇవ్వగలం
అని ఆలోచించి సమస్త ప్రాణుల శ్రేయస్సే
మా శ్రేయస్సుగా భావించండి,
మేధా సంపదను పెంచండి       
దేశమాత క్షోభను తగ్గించండి

యువతి యువకుల్లారా మేలుకోండి 
నవతేజంతో దేశానికి సహకరించి మిమ్ము మీరు
ఉద్ధరించుకొని అందరికి సహకరించిండి 
--((*))--


*ధరణీ దిశ

నల్లని మేఘముల్ - తెల్లని మేఘముల్
ఎర్రని మేఘముల్  - నింగి ఆవహించెన్
ఎనిమిది దిక్కుల్  - పెళ్ళని గర్జనల్
తలుక్ మెరుపుల్ - పిడుగు శబ్దముల్
విస్త  రించెన్     - ప్రపంచమునందున్   

పుడమి తల్లి పురివిప్పేన్ 
మయూరం పింఛము విప్పేన్
నాట్య మాడి పరవశించెన్        
చల్లని గాలి తనువు తాకెన్
పృద్వి వర్షపుజళ్లుకు పులకించెన్
పుడమి భామిని వెచ్చని చీర దాల్చెన్ 
జల ప్రేమతో శోభనందించి సంతసించెన్

నింగి మరుడు నీటి బాణములతో కొట్టెన్
నెల మగువ కేమో నెలలు నిండెన్
కడుపు పండి తాను కంకులం ప్రసవించెన్ 
వర్ష ఋతువు యందు వసుధ సంతశించెన్

విరామము ఎరుగని గాలి చేతన్    
స్వేశ్చ సూర్య కిరణముల చేతన్
భేదము చూపని వసంతుని చేతన్
ధరణీ దిశ ప్రసారిత వృద్ధి చెందెన్  
--((*))--


 
*ఊహలు

ఊహలు గాలి బుడగల్లా తేలిపోతాయి
బుడగలు వర్ణ వివర్ణాలు మారి మాయమౌతాయి 
వర్ణాలు మనలో ఉషస్సులుగా మారి మనసును చేరుతాయి
ఉషస్సులు మన ఆశయాలుగా మారి వేధిస్తాయి

ఉషస్సుల యశస్సుతో మైమరిచి మానవాళి 
ఉషస్సుల ఆశీస్సులతో పరవశించే ప్రకృతి 
గమనం ఏదైనా మనుష్యులకు ఆశయాలు ఉండు 
మార్గం ఏదైనా లక్ష్యం దిశగా మారుతూ ఉంటాయి 

లక్ష్యాలు ఉండు చీకటి వెలుగుల్లా మనిషిలో
అహర్నిసాలు కదిలే ఋతువుల్లా  మారుతాయి
   లక్ష్యాలు సమీరాలులా కనబడకుండా పోతాయి  
సమీరాలు మనసున్న మనిషికి ప్రాణాలవుతాయి 

ప్రాణముంటే వినవచ్చు గాణాలు వెంబడిస్తాయి   
గాణస్వరాలు గంధర్వ మిలితాలు మారిపోతాయి
మిళితమే జీవితానికి మలుపులు సహజమౌతాయి
మలుపులే మనసుకు ఆశలు దివిటీలా వెలుగుతాయి


--((*))--


1328514.gif (240×320)
 *హరిత వనం

అలసిన హృదయాలకి హాయ్ ని కల్పించే 
ఎండకి తట్టుకొని చల్లటి నీడను అందించే  
మానవుల మనస్సుకు ప్రశాంతత నిచ్చే
హరిత వనాలను మనం రక్షించడమే శ్రేయస్కారం

అవని నుండి ఆకాశము వరకు విస్తరించే
తరులు విందుచేస్తూ విస్తరించి ఒదిగి ఉండే
పుష్ప ఫలాలతో ప్రాణు లందరికి సహకరించే   
హరిత వనాలను మనం రక్షించడమే శ్రేయస్కారం

దుర్వాసన నుండి వచ్చే  గాలిని స్వీయకరించే
ప్రాణులకు మంచి ప్రాణవాయువులను అందించే
పుడమి తల్లిని పలకరిస్తూ జలాల్ని స్వీకరించే    
హరిత వనాలను మనం రక్షించడమే శ్రేయస్కారం

మరుగు నీటిని పీల్చి ముచ్చటగా పెరిగే
దుర్గందాన్ని ఆస్వాదించే కాయము ఎదిగే
ప్రకృతితో సహకరించి వనంగా విస్తరించి ఒదిగే  
హరిత వనాలను మనం రక్షించడమే శ్రేయస్కారం

సృష్టిలో కనిపించే గంబీరమైన పుష్పవన సమూహలను 
పోషణ సమయంలో కనిపించే శాంతి వన సమూహలను 
ప్రళయంలో కనిపించే భయంకర స్వరూప వనమునులను
కలిగిన హరిత వనాలను మనం రక్షించడమే శ్రేయస్కారం

అనారోగ్యులకు ఔషధ మూలకల అందించేవియును 
తపోధనులకు ప్రశాంతత కల్పించే ఆశ్రమ నివాసమును
మృగ పక్షులకు, కీటకములకు ప్రత్యేక స్థానాలములను
కలిగిన హరిత వనాలను మనం రక్షించడమే శ్రేయస్కారం

అడవి తల్లికి సమానంగా వనములను పెంచుదాం
వనములకు తగు రక్షణను కల్పించి బ్రతుకుదాం
వనాలను కంటి రెప్పలా కాపాడు కుంటూ ఉందాం
అందుకే హరిత వనాలను మనం రక్షించుకుందాం    



--((*))--

https://fbcdn-photos-b-a.akamaihd.net/hphotos-ak-xfp1/v/t1.0-0/s526x395/13925419_1798890093680237_1504799384673338694_n.jpg?oh=3d224707063a2b7b290c106711c9f2ad&oe=5855F97E&__gda__=1481718191_e4bc9308745deb71babfaef10ea07af6

*మనస్సు  పలురకాలుగా మరుతుందా ?

మానవత్వం నిలబడాలంటే
దేశాన్నిఅర్ధం చేసుకోవాలంటే
మనుష్యుల లక్షణాలు తెలుసుకోవాలంటే
ఓర్పుతో ఓదార్పుతో శాంత పరిచేది మనస్సు 

మనసుని అర్ధం చేసుకొనే మనస్సు
మమతని ప్రశ్నలు వేయని మనస్సు
మనిషిలోని మనిషిని వెతికే మనస్సు
మాటల లోని తప్పు వెతకని మనస్సు

అపరాధ భావన అత్యున్నతతో వెలిగే మనస్సు
ఆరాటభావముతో సంతృ ప్తిని పొందలేని మనస్సు
ఉన్నతస్థానమునకు ఎదగలేక జబ్బుపడే మనస్సు
వాస్తవం తెలుసుకోక గృడ్డిగా ప్రవర్తిస్తున్న  మనస్సు

నిర్భయంగా ఉండి  అభయం పొందే మనస్సు 
పోటీతత్వాన్ని వదలి విజయాన్ని పొందే మనస్సు
ఓటమిలో ఉన్న తప్పును సరిదిద్దు కొనే మనస్సు
సందర్భాన్ని బట్టి పరి స్థితిని బట్టి మరే మనస్సు

నిర్మలమైన ప్రేమలో ప్రశాంతత కల్పించే మనస్సు
మనోనిగ్రహంతో నిదానంగా పల్కును చేరే మనస్సు
భౌతికస్థితి నుండి పరమాత్మ ధ్యాన స్థితి చేరే మనస్సు
హృదయానికి హృదయానికి మధ్య ఉండే ప్రేమ మనస్సు
 
--((*))--

 
రాధా కృష్ణ మనోహరం

పువ్వుల సవ్వడి మనసును తాకే
బీడుగా బారిన మదిలో మెరుపు మెరిసే
కురిసిన వెన్నెల మనసంతా నిండే
మమతలు పండించగ రావా రాధ 

మౌనంలో నిలిచి ఉండ లేని వయసే
కాంతుల వైపుకు తరలే సమయామే
రతి మన్మధ నీడలు వెంటాడే తరుణమే
ఒద్దుగా బుద్దిగా ఉంటె కుదరదే రాధా
.
కన్నులతో బిత్తర చూపులు ఎందుకే
ఊహల పందిరిలో వలపు అందుకో
మదిలో మెదిలే తాపము తగ్గించుకో
ఆశ్చర్యము వ్యక్త పరుచు టెందుకే  రాధా     
     .
చీకటిలో హాస్యాలాడుట సహజమే
పువ్వుల గుభాళింపులు మరీ సహజమే  .
స్వాగత వెలుగులు తరించుట సహజమే
చిలికే వెన్నెల చెంతచేరి పిలుస్తుంది రాధా

వేదనలు మనసున రా నీయకే
సుఖాలు తీరాన్ని దాట నీయాకే
కోరికల ఆశలు  మరువ నీయకే
కులికే  వెన్నెల కోరికతోఉన్నది రాదా    
.
బాల్యపు చేష్టలు కోరే చినుకుల్లో
యవ్వన తళుకులు తీరే జ్ఞాపకాల్లో
తియ్యని భావాలు తపించే కలల్లో
ఒలికే వెన్నెల కవితై పిలుస్తుంది రాధా

లావన్యా  లాస్య మాడక దరిచేరి
క్షణకాలం సంతృప్తి శాస్వితమనిపించి
సుస్వర రాగమాలికలతో మురిపించి
సప్తవర్ణ శోభితం పొందుటకు రావా రాధా   
--((*))-- 

కృష్ణ పుష్కరస్నానాలకు అందరిని ఆహ్వానిస్తున్నాం

మనసుతో పిలిస్తుంది
మమత  లందిస్తుంది
మరచి పోవద్దంటుంది
ఆంద్రుల ప్రాంజలి ప్రభ   

మంగళ గిరి పానకాల స్వామిని
అమరావతి అమర లింగేశ్వరుని
కృష్ణఒడ్డున వెలసిన దుర్మమ్మని
ప్రతిఒక్కరు దర్శించి ప్రార్ధించాలని
కృష్ణ పుష్కరాల ప్రాంతం ఆహ్వానిస్తుంది    

తెలుగింటి ఆడబడుచులు స్వర్ణ తోరణంతో
కళలు, కవిత్వాలు, సర్వానంద అలంకారాలతో
యావత్ ఆంధ్రులు గర్వపడే సహకార ఆదరణతో   
త్యాగానికి పౌరుషానికి పదహారణాల ఏర్పాట్లతో

కులమతాలు ఏవైనా  ప్రతి ఒక్కరినిఆదరిస్తాం
మానవత్వంతో ఆదు కోవటమే మా లక్ష్యం 
ఎవ్వరిని నమ్మవద్దు, నమ్మి మోసపోవద్దు 
కృష్ణ పుష్కరస్నానాలకు అందరిని ఆహ్వానిస్తున్నాం

సర్వేజనా సుఖినోభవంతు - ఓం శాంతి: శాంతి: శాంతి:
--((*))--

ఓ రచయతను సమర్దిస్తారా ?

సంస్కృత సాంప్రదాయాలే
మానవుల కదలిక కధలు
ఇతి హాస వేద పురాణాలే
కవి మధుర స్మ్రుతి కణాలు

స్త్రీ సౌన్దర్య ముఖ కవలికలే
కవులకు మదుర కావ్యాలు
నిత్యమూ అర్చన నీరాజనాలే
దేవునిపై మనం చూపే ప్రార్ధనలు

భగవద్గీత భోధనలే
మనస్సాంతికి మార్గాలు
ప్రకృతిలో వచ్చే మార్పులే
మనుష్యుల జీవిత సుఖాలు

చచ్చు పుచ్చు భావాలే
మనకు విరోధులు
నిర్మొగ వ్రాతలే
మనసుకు ఇబ్బందులు

మంచి మనిషికి మార్గాలే
మనం వ్రాసిన కవితలు
బ్రతుకు నేర్పే కష్టాలే
భవిషత్తుకు పునాదులు

ఆధునిక విజ్ఞానములే
అలసత్వానికి సంకేతాలు
ఆధునిక ఆంగ్ల చదువులు
మాత్రుభాష మరిచే చదువులు

నిర్మొహమాటముగా కవి రాతలు
బ్రతికి బ్రతికిన్చుకోలేని బ్రతుకులు
రాజకీయపు విమర్స నాస్త్రములు
అవకాసవాదులకు ఉపయోగాలు
--((*))--



ప్రమే కోసం పాట -2 

ఓహో చెలి, నాలో రగులుతుంది చలి
కావాలి వెచ్చని బిగి కౌగిలీ
ఓహో రాజా నాలో రగులుతుంది తాజా
కావాలి వెచ్చని బిగి కౌగిలీ 

కళ్లపై రెప్పలా,  జడలో పువ్వులా
కళ్లల్లో కాంతిలా,  మేనిలో మెరుపులా
మొఖానికి అద్దంలా, ఎదపై పావాడాలా
ఉండాలనుంది చెలి, గిలిగింతలు పెట్టాలని ఉంది చెలి

తీగకు చుట్టే పువ్వులా,  గాలికి రాలే పువ్వులా
పూల చాటున తొడిమలా, ముళ్ళ పక్క గులాబీలా
సరస్సులో కలువలా,  చేతికందే నీటి ముత్యంలా
ఉండాలనుంది రాజా, గిలిగింతలు పెట్టాలని ఉంది రాజా 
   
ఓహో చెలి, నాలో రగులుతుంది చలి
కావాలి వెచ్చని బిగి కౌగిలీ
ఓహో రాజా నాలో రగులుతుంది తాజా
కావాలి వెచ్చని బిగి కౌగిలీ 

మంచులా కరగాలని ఉంది చెలి
నీటి చుక్కలా నిన్ను తడపాలనుంది చెలి
 
వెన్నముద్దల కరగాలని ఉంది రాజా
ముద్దులపై ముద్దులు పెట్టి తడవాల నుంది రాజా

ఒకరి కొకరం ఏకమై చలికాచు కుందాము
తడి పొడి తపనలతో సర్దు కుందాము

ఓహో చెలి, నాలో రగులుతుంది చలి
కావాలి వెచ్చని బిగి కౌగిలీ
ఓహో రాజా నాలో రగులుతుంది తాజా
కావాలి వెచ్చని బిగి కౌగిలీ 
 --((*))--