29, జూన్ 2016, బుధవారం

Inernet Telugu magazine for themonth of 7/2016/1/25

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - కవితల ప్రభ 

సర్వేజనా సుఖినోభవంతు


* వెన్నెల

చీకటి వెనుక దాగి ఉండి
నా కడ్డం తొలుగు అన్నది వెన్నెల 
పరదా చాటుగా  ఉండి
గాలికి తోలగ వేమి అన్నది వెన్నెల 

మనసు లోతును కదిలించి
మనస్సు శాంతిగా మార్చేది వెన్నెల
కన్నీటి కధలను తొలగించి
ఆనంద భాష్పాలుగా మార్చేది వెన్నెల

ప్రకృతి సుఖాలు అందించి
విధి వేసిన చీకటిని తరిమేది వెన్నెల
మౌనంగా గుండెను కదిల్చి
వేడితగ్గించి చల్లదనం ఇచ్చేది వెన్నెల

ఆవేదనలను  తొలగించి
మనసు పడే విధంగా మార్చేది వెన్నెల
సంఘర్షణలు తొలగించి
మౌన వాణిని  విని పించేది వెన్నెల   

ఎకాంతపు సుఖాన్నిచ్చి 
చెలిమిగా నేనున్నానన్నది వెన్నెల
మనసైన వలపు ఇచ్చి   .
మనో ధైర్యాన్ని ఇస్తున్నది వెన్నెల

--((*))--.


*మరి నేనెవర్నో మీరె చెప్పండి ?

నేను అందరికీ గుర్తుగా ఉంటాను
అంతర్గత శక్తి ఇంతని చెప్పలేను
బాహిర్గత శక్తి ఎవ్వరికీ చూపలేను
శిధల మౌతు ఆనందం కల్పిస్తాను

ఆవేశాలను అనగ  త్రొక్కు తాను
ఆలోచనను ఆచరణలో పెడ తాను
ఆలశ్యాన్ని క్షణమైనా ఓర్చు కోను
గాయలెన్ని తగిలిన ఓర్చు కుంటాను

ఆణువణువూ చూపులకు చిక్కిన దానను
అట్టహాస వత్తిడులకు అలవాటు పడ్డదానను
అయినా కొరత తీర్చ లేని దాననై  ఉన్నాను
యుగాలు మరీనా నా ఉనికి మారకున్నాను

గాలిలా ప్రాణానికి ప్రాణంగా ఉంటాను
నీటిలా దాహాన్ని, తాపాన్ని, తగ్గిస్తాను
అగ్నిలా పైకి ఎగసి బూడిదవు తాను
పృద్వి లా ఓర్పు వహించి ఉంటాను  

ఆకాశమే హద్దుగా జీవితం గడుపుతాను
ఘటములోని నీరులా చల్లదనమందిస్తాను  
మనస్సు , బుద్ధి,  ఒకటిగా  ఉంచు తాను 
మొక్ష మో, కపాళ మోక్షమో, ఇవ్వ గలను

మైదానంలో బంతిలా తిరుగుతాను
ఆడేవాడ్ని బట్టి అనుకరిస్తూ ఉంటాను
మెత్తబడ్డా పనికిరావన్న ఎమీ అనను
క్రీడల్లో శల్యమైనా గుర్తింపు  ఉండను

సుందర స్వప్నాల జీవితం గదుపుతాను 
పరిపక్వత చెంది పారవశ్యంలో ముంచేస్తాను
వంశాకురాలను అందించ ఆనంద పరుస్తాను
కలియుగ జీవితపు అంచులు ఇక చూడలేను

కన్నవారికి బరువుగా మారుతున్నాను
కట్టుకున్నవారిని తృప్తి పరచలేకున్నాను
విధివంచనకు చిక్కినవారిలో నేనోక దానను
ఇంతకీ నే నేవర్నో మీకు చెప్ప లేకున్నాను 

మరి నేనెవర్నో మీరె చెప్పండి ?                

 --((*))--


*ఛందస్సు (వృత్తము ద్వారా)
 
తాతలు తప్పదు వరుణ్నాహ్వానిద్దాం
మామలు ఇప్పుడు వరుణ్ణి ప్రార్దిద్దాం
బావలు ఒప్పుడు వరుణ్ణి  అర్ధిద్దాం
మరిది త్వరగా వరుణ్ణి కొలుద్దాం 
 అంటూ వర్షాలకోసం రైతులు ఆలాపన
--((*))--

*ఉషోదయం -శుభోదయం 

ఉషోదయకిరణాలు విస్తరించగా
సముద్రపు నీరు థళ థళ మెరుపులతో
మీనాలు పరవశంతో పల్టీలు కొట్టగా
కెరటాలు ఎగసి పడుతూ ఉండే తపనతో    

వృక్షాలు తన్మయంతో,  ఆకులు కదల్చగా
కొండగాలి, చిరుగాలి, కలిసే స్నేహముతో  
అలారం మ్రోగినట్లు,  తొలికోడి కూయగా
కోకిల తనవంతుగా, బాకా ఊదె ఆలాపనతో

సైనికుల వ్యాయామం మొదలవ్వగా
ఎర్ర నేల ఆణువణువూ ఆవేదన కళ్ళతో
పక్షి పిల్లలు ఎగరాలని తపన పడుతుండగా
అష్ట దిక్కులు కలయ చూసి ఎగరండి నాతో

కొలనులో కమలాలు వికసించగా
పరిమళాలందించి పరవశించే, తుమ్మెదతో
మమతతో చకోర పక్షులు చేరగా
తన్మయత్వం చెందే, వేడి కిరణాల వెచ్చధనంతో

పిలుస్తున్నాము సుప్రబాత సేవలుగా
దినకరా మమ్మేలు కోరే, ఆసీర్వాదములతో
మాలో ఉన్న అంధకారాన్ని తరమగా
రవితేజ శుభోదయాన్ని ఆశించి వేడుకుంటున్నాము

-((*))-


*యశోదను ఆట పట్టించిన కృష్ణుడు

గోపాల కృష్ణ రా రా , నా ముద్దుల కృష్ణ రా రా
నవ్వుల కృష్ణ రా రా, నా రత్నాల కృష్ణ రా రా

తలచి పిలుస్తున్నాను, రా రా కృష్ణ
నలుగు పెట్టి లాలా పోస్తాను., రా రా కృష్ణ
మన్ను తిన్న చేతులు కడగాలి, రా రా కృష్ణ
నవ్వుతూ నన్ను ఏడిపించకు, రారా కృష్ణ 

అన్న వచ్చును త్వరపడి, రా రా కృష్ణ
లాలి పోసి పట్టు వస్త్రాలు కడాతాను, రా  రా కృష్ణ
నీటితో ఆడితే జలుపు చేయును, రా రా కృష్ణ
ఈ తల్లి మాట విని వస్తావు కదా రా  కృష్ణ

బుగ్గను చుక్కను పెట్టనియ్యరా కృష్ణ
కళ్ళకు కాటుక పెట్టనియ్యరా కృష్ణ
ఉగ్గు పెట్టెద నా దగ్గరకు రా రా కృష్ణ 
కాళ్ళకు గజ్జలు కట్టనియ్యరా కృష్ణ

వేళ్ళకు ఉంగరాలు పెట్ట నియరా కృష్ణ 
నుదుట తిలకం దిద్ద నియ్యరా కృష్ణ
కాళ్లకు గోరింటాకు పెట్టనియ్యరా కృష్ణ
దిష్టి తగల కుండా దిష్టి తీయ్యాలి రా కృష్ణ

కురులు దువ్వి, పించెము ఉంచెదను రా కృష్ణ
చందనము పూసి హారములు వేసెదను రా కృష్ణ
మోలతాడు చుట్టు మల్లె దండను చుట్టెద రా కృష్ణ      
నవనీతము పెడతాను రా బుద్దిగా తినిటకు రా రా కృష్ణ

నా గోపాల కృష్ణ రా రా , నా ముద్దుల కృష్ణ రా రా 
నా నవ్వుల కృష్ణ రా రా, నా రత్నాల కృష్ణ రా రా 
--((*))--
 

Photo: ये भीगे भीगे से लम्हें,
ये बारिशों के दिन ।।
ये तेरी यादों का मौसम,
और फ़िर से जीना तेरे बिन
*నీ వెవరు ?
ఆటు పోట్లకు తట్టుకునే మనస్సు నీది
అమృతాన్ని అందుకొనే వయస్సు నీది
ఆకాశంలో చుక్కలను లెక్కించే చూపు నీది
ప్రకృతి అందాలను మించిన తేజస్సు నీది


కమ్ముకున్న చీకట్లు మాయ మవుతాయి
వెంబ డిస్తున్న ఇక్కట్లు తొలగి పోతాయి
తట్టి లేపుతున్న చప్పట్లు దగ్గి రవుతాయి
చుట్టు ముట్టుతున్న కుంపట్లు చల్ల నౌతాయి


చరిత్ర గర్భంలో నీవొక మైలు రాయి
ధరిత్రి పై మరిచి పోలేని గీటు రాయి
కొందరి హృదయాల్లో నీవొక కీచురాయి
కవితా పత్రికలో నీవొక పదమాయి


నీ భావాలు స్వప్న లోకాలు విహరిస్తాయి
నీ అనుభూతులు ఆనందంతో పంచు కుంటాయి
నీ అక్షర స్వరాలు పారవశ్యంతో పాడు తాయి
నీ ఆలాపనలు నిలువలేక నాట్య మాడుతాయి


అందుకే మెదడుకు నిండిన భావవేశం నీది
మనసుకు పంచిన తన్మయత్వం నీది
అలుపెరగని అక్షరకక్షలో ప్రయాణం నీది
మనస్సుకు ప్రశాంతత కల్పించే మనస్సు నీది

" మరి నేనెవరో మీరే చెప్పండి "
" షేర్": చేసి భావాలు పంచు కోండి
--((*))--

Photo: ★﹏☆﹏★﹏☆﹏★﹏☆﹏★﹏☆﹏★

Nigaah meri tarasti hai mujhe tum
yaad aate ho,

Mohabbat jab tarapti hai mujhe tum
yaad aate ho,

Sama jata hai aankho main tere
jazbon ka bheega pan,

Kaheen baarish barasti hai mujhe
tum yaad aate ho

★﹏☆﹏★﹏☆﹏★﹏☆﹏★﹏☆﹏★

* నన్నువెంబడిస్తున్నాయి ఎన్నో 

నిద్ర లేని రాత్రులెన్నో
నిజం తెలుసుకోలేక మూగవైనాయి
నిషీధ సమయాలెన్నో
నిగురుకప్పిన నిప్పులా మెరుస్తున్నాయి

నిర్ణయాలు మరి ఎన్నో
నీ మనసును బ్రతికంచ లేకున్నాయి
నియమాలు మరి ఎన్నో
నివేదనలు మాత్రమే మిగిలిఉన్నాయి

నిస్వార్దాలు ఎన్నో
నిన్ను తాకినా నిలబడ లెకున్నాయి
నిశ్శబ్ధాలు ఎన్నో
నిరుత్సాహం తో నలిగి పొతున్నాయి 

నిరాశలు ఎన్నో 
నిముషము కుడా తాక లేకున్నాయి
నిమిడాంధకారా లెన్నో
నిరాశం నిసీధంలో పయనిస్తున్నాయి

నిప్పు కణిక లెన్నో
కన్నిరుచుక్కలా మారి వెదిస్తున్నాయి
నిక్కముగా కధలెన్నో
నిద్రను ఒకమాదిరిగా భాదపెడుతున్నాయి

నిస్వార్ధపు నాణాలెన్నో
చీకటిలో సంజాయిషీ చెపుతున్నాయి
నిజమైన కణాలెన్నో
నన్నుఎడిపించాలని ప్రయత్నిస్తున్నాయి

నిష్టలేని క్షణా లెన్నో
స్పష్టముగా కలలు కూడారాకున్నాయి                    
నిద్రలో కళ లెన్నో
వెదిస్తూ బయటకు రాకుండా ఉన్నాయి
--((*)--

*కన్నయ్యా .... ఓ కన్నయ్యా

కలవపూల కళ్ళు గల కన్నయ్యా
కోమలమైన చూపుతో ఉన్నావు గదయ్యా
కమ్మనైన పత్రపాన్పు గదయ్యా
మమ్ము కమ్ముకున్న చీకట్లు తొలగించవయ్యా  

అమృత ధార కాదయ్యా 
కోమలమైన వామ పాదం  వదలవయ్యా   
కమ్మని పాలుతాగవయ్యా
నమ్ము నీ నవ్వే స్వర్గాన్ని చూపునయ్యా

కన్నయ్యా నిను కనలేని కనులెందు కయ్యా
లోపల రాగంతో వెలుపల దానంతో ఉన్నావుగదయ్యా
హద్దు లేనిసక్తి, సంపదను, ఇచ్చావుగదయ్యా
రాగా ద్వేషాలకు అతీతుడు వయ్యా

యమున యందు విహరిస్తున్నావయ్యా
వ్యామోహాలనుండి మమ్ము రక్షించవయ్యా
సమ్మోహనాస్త్రం ఉండు నట్లు చేయవయ్యా 
రామ కృష్ణామృతాన్ని  ధన్యం చేయవయ్యా
--((*))--

*ఉప్పెన
ఉప్పెన చెప్పినప్పుడల్లా
కుప్పి కుప్పి గంతు లేస్తూ రాదు
చెప్పి చెప్పక, ఒప్పి ఒప్పించక,
కప్పలు, చేపలు, కదిలించక రాదు


ఎప్పటి కప్పుడు తప్పించు కోలేక
తప్పు చేయుటకు ముందుకు రాదు
ఉప్పు తెప్పలా తేలి, చిప్ప డిప్పలా
మారి గుట్టు చప్పుడు కాకుండా రాదు

కప్పులు కదిలించటానికి, లప్పం లా
అతుక్కొని వుండటానికి ఎప్పుడూ రాదు
గొప్పలు చెప్పక, అప్పడంలా ఎగురుతూ
ఇళ్లను కుప్ప కూల్చుటకు త్వరపడి రాదు

సముద్ర కెరటపు గాలితో హోరెత్తి
చుట్టు కుంటూ వచ్చి పోయేది ఉప్పెన
ప్రజల రక్షణకు తగు ఏర్పాట్లు హోరెత్తి
కూడు, గూడు, గుడ్డ అందించి ఉప్పెన
నుండి ప్రజలను కాపాడేది ప్రభుత్వం

ఆధునిక సమాచార వ్యవస్థ వల్ల
ఉప్పెన నుండి ప్రాణులను
రక్షించుటే అందరి కర్తవ్యం
ప్రతిఒక్కరు సహకరించుకుంటూ
ఉప్పెన నుండి ఎదుర్కొనుటే
ప్రధమ ప్రధాన లక్ష్యం
--((*))--

22, జూన్ 2016, బుధవారం

Interne Telugu Magazine for themonth of 6/2016/


ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం  

ప్రాంజలి ప్రభ - కవిత్వ వార పత్రిక (6/2016)/

సర్వేజనా సుఖినోభవంతు
రచయత మల్లాప్రగడ రామకృష్ణ


*కన్నయ్యా .... ఓ కన్నయ్యా

కలవపూల కళ్ళు గల కన్నయ్యా
కోమలమైన చూపుతో ఉన్నావు గదయ్యా
కమ్మనైన పత్రపాన్పు గదయ్యా
మమ్ము కమ్ముకున్న చీకట్లు తొలగించవయ్యా  

అమృత ధార కాదయ్యా 
కోమలమైన వామ పాదం  వదలవయ్యా   
కమ్మని పాలుతాగవయ్యా
నమ్ము నీ నవ్వే స్వర్గాన్ని చూపునయ్యా

కన్నయ్యా నిను కనలేని కనులెందు కయ్యా
లోపల రాగంతో వెలుపల దానంతో ఉన్నావుగదయ్యా
హద్దు లేనిసక్తి, సంపదను, ఇచ్చావుగదయ్యా
రాగా ద్వేషాలకు అతీతుడు వయ్యా

యమున యందు విహరిస్తున్నావయ్యా
వ్యామోహాలనుండి మమ్ము రక్షించవయ్యా
సమ్మోహనాస్త్రం ఉండు నట్లు చేయవయ్యా 
రామ కృష్ణామృతాన్ని  ధన్యం చేయవయ్యా
--((*))--

image not displayed 


*వర్షమా మాపై కురువుమా
 
వర్షమా ఆకాశాన్ని వదిలి
వచ్చి మా దాహాన్ని తీర్చుమా
ఆకాశానికి నీవు అతిధివి
అల్లుడుగా ఎన్నాల్లు దిగుమా

ఆడంబరాలలో మునిగినా
కర్తవ్యము మరువక కురువుమా 
బేష జాలకు పోక అలుక మాని
చిరుజల్లులా  కురువుమా 

ఉరుములు, మెరుపులు, సుడి 
గాలిని వెంట పెట్టుకొని రాకుమా 
ఎంతో ప్రేమతో  ఎదురుచూస్తున్నా
మాపై కరుణతో వర్షంగా కురువుమా 

పృద్వి తనువెల్ల కళ్ళు చేసుకొని
బీటలు బారిన మనస్సును ఓదార్చుమా
చెరువులు, వాగులు, సెలయేర్లు,
నిన్ను అహ్వానిస్తున్నాయి నేస్తమా  

ధరణి తలాన్ని పులకరింప
చేయుటకు పన్నీటి జల్లు కురిపించుమా
నీకొసమ్ అలమటిస్తూ, విలపిస్తూ    
ఉన్న ప్రజలపై దయా వర్షము కురువుమా

ఆకలి తీర్చి ఆదుకునే వాడవునీవే
సమస్త ప్రాణులకు దిక్కు  నీవే
సమస్త  జగతికి ఆధారుడవు నీవే
పుడమిని చల్లబరుచుకు కురువుమా         

మా ప్రార్ధన విని వచ్చినందుకు
శతకోటి దండాలు అర్పిస్తున్నాము వర్షమా
చుట్టపు చూపుగా రాక, ఒక స్నేహితుడుగా
పృద్విపై మీకు ఎప్పుడు ఆహ్వానమే వర్షమా     

--((*))--  



image not displayed * ( ప్రేమ తత్వం)

తొలి జాము పరవశం తో
మనసుకు నచ్చే పనితో
మత్తుని దించే మాటతో
హత్తుకొనే చేతులు కదులు   

చెత్తను తుడిచే పోకడతో
మత్తుని వదిలించే నడకతో
గుణాన్ని బట్టి గౌరవంతో
శుబ్రం చేసే పాదాలు కదులు   

కలుషితాన్ని తొలగించేందుకు
కుతంత్రాన్నితిప్పి కొట్టేందుకు
కుత్సితాన్ని కడిగేసేందుకు  
మత్సరాన్ని మాపేందుకు కదులు

రగిలే వారిని చల్ల బరుస్తూ
తగిలే వారిని శాంత పరస్తూ  
ఆకలి గొన్న వారి ఆకలి తీరుస్తూ
ఆశలు రేపకుండా ముందుకు కదులు

అవ లక్షణాలను సరిచేస్తూ
హితాన్ని, సన్నిహితాన్ని కల్పిస్తూ   
ప్రస్తుత ధర్మాన్ని వివరిస్తూ
గతాన్నిమరచి ముందుకు కదులు  

చూసింది చూసినట్లుగా అనుకరిస్తూ
చెప్పేది విని చెప్పినట్లుగా చేస్తూ 
వంశగౌరవం నిలుచు నట్లు చేస్తూ
పెద్దలముందు నిలిచి ముందుకు కదులు

అందరిలో ఒకరిగా కలసి పొతూ
బిడ్డలమధ్య ఎకత్వముగా కలిపేదిగా చెస్తూ 
నదీ ప్రవాహంలా కదులుతూ చలిస్తూ
సూర్య కిరణంలా వెలుగుని పంచుతూకదులు 

పడిపోయిన వాళ్లను నిలబెట్టుతూ
చెడిపోయిన వాళ్లను సరి చేస్తూ
బ్రతక లేని వారిని బ్రతికిస్తూ
బ్రతికుండే అధర్మాన్ని ఎదిరిస్తూ కదులు

తెలివితో సమస్యలను పరిష్కరిస్తూ
విజ్ఞానంతో అజ్ఞానులకు వివరిస్తూ
వృక్షంలా అందరికి సహకరిస్తూ
మేలిమి బంగారమని అనిపించుకొని కదులు  

శబ్దం రాకుండా నిశ్శబ్దం పనులు చేస్తూ
నిరవిద్యా వంతురాలైన అన్నీ వివరిస్తూ 
సత్వరము తత్వాన్ని తెలియపరుస్తూ
మనసును మెచ్చే గుణంతో అందరిని ప్రేమించు
--((*)0-- 



* (మల్లెపువ్వు) 

మరు మళ్లి మల్లిక వైతే
మనసంతా మమేకం చేయవా
తిరునాళ్ళు విహంగ మైతే
తనువంత సందడి చేయవా

పరవళ్ళు పరవశ మైతే
పరువాన్ని పదిలం చేయవా
చిరుజల్లు జవ్వని వైతే
చుక్కలా యవ్వారం చేయవా  

కల్పవళ్లి కరుణ వైతే
కలకాలం నాతో ఉండి పోవా
సిరి తళ్లి జాగృతి వైతే
సిరులతో తృప్తిని అందించవా

కళా వళ్లి మనసు వైతే
కళ నుద్దరించటానికి సహరించావా
ప్రేమ పెళ్ళికి  తరుణ మైతే   
ప్రేమతో సుఖాన్ని పంచవా 

కొంచం తెలుసుకోండి
--((*))--


*గరిక పువ్వు

నేనొక గరిక పువ్వు
వర్ణాల వెలిగే పువ్వు
వాసన  లేని పువ్వు
రాగము లేని పువ్వు

ఋతువులతో పనిలేని పువ్వు
ఎ తావి దరిచేరనీయని పువ్వు
మనస్సును హత్తుకొని పువ్వు
శల్య మై రెప రెప లాడే పువ్వు  
-(*)-


* నవ్వే నువ్వు -నువ్వే నవ్వు

పక పక నవ్వే విరబూసిన పువ్వు
పసితనపు ముత్యాలువిరిసిన నవ్వు
ఉషోదయ వెలుగులకు చిక్కే లవ్వు
మనసు మనసు కలిపే నవ్వే నువ్వు

ఉ ఊల చిలుక పలుకల చిరునవ్వు
ఉంగ ఉంగ యంటూ ఊయల నవ్వు
మనసారా పిల్లల ఏడుపు లో నవ్వు
జోలపాటలో సంగీతాలలో చిరు నవ్వు

రాలి పడే పువ్వు గుభాలిమ్పుల నవ్వు
నటుల హాస్య, రోదన సంభాషణల నవ్వు     
సొగసు ఆవిరై మృదుత్వం లోవచ్చే నవ్వు
రాగ మాలికల ప్రతిధ్వనులచే వచ్చే నవ్వు

ఉక్రోషంతో వయసు వికటాట్టహాసం చేసే నవ్వు
మంత్ర ముగ్దులగా మనసును మార్చే నవ్వు
ఎదగటానికి ఎందు కంత తొందర ప్రశ్నే నవ్వు
పెద్దవాళ్ళ బోసి నవ్వుల మాటలే కొంత నవ్వు

కష్ట ఫలితాల నుండి వచ్చే సంతోషాల నవ్వు
బాల్య చేష్టలు గుర్తు చేసుకొని తెలిపే   నవ్వు
వింతలూ, నిరంతరం తాజాదనంతో వచ్చేనవ్వు
కలయకలో వినరాని మాటల తో  వచ్చే నవ్వు
--((*))-- 

Photo

*జీవితాన్ని దిద్దుకో
 

వయసుని బట్టి ఆలోచనతో
మనసుని బట్టి పురోగమనంతో
ప్రపంచాన్ని బట్టి భావాలతో
జీవన సత్యాన్ని తెలుసుకో

తోటి వారి సహాయముతో
పెద్దలు నేర్పిన  విద్యతో
వంశానికి ఉన్న కళాభి వృద్దితో
జీవితాన్ని ఉన్నతంగా మలుచుకో

స్త్రీ సంకల్ప బలముతో
యువ శక్తి సహకారముతో
గురువుల వేద వాక్కులతో
అనితరసాధ్యాన్ని సాధ్యంగా మలుచుకో

స్వశక్తి నమ్మక బలముతో
వివేక మనే నడవడికతో
శూన్యమ్ లో వెలుగులతో
లక్ష్య సాధనకు మనసును పంచుకో

ప్రకృతి నేర్పే సంతోషాలతో
మనసు నేర్పే ఆశయాలతో
అనుభవం నేర్పే గుణపాఠంతో
తప్పు చేయక ఒప్పే ధ్యేయంగా నడుచుకో

శాంతి సౌభాగ్యాలతో
మనో వాంఛలతో
కష్ట సుఖాలతో
ధైర్యమే ఊపిరిగా నడక మార్చుకో

ఓర్పు వహిస్తే సర్వం సుఖం
నేర్పు పరకటిస్తే దేశ క్షేమం
తీర్పు సిరసావహిస్తే బ్రతుకే ధర్మం
బాధలను ఓర్చుకొని మౌనాన్ని నేర్చుకో

రోషము లేని సమబుద్దితో
శోకము లేని స్నేహముతో
ప్రియ అప్రియలను త్వజనముతో
అంటి అంటని వాడుగా జీవితం మార్చుకో   
      --((*))--




*పొదరిల్లు

మనసుల్ని ఉద్దరించడం మన సంస్కృతి
స్నేహితుల్ని ఆదరించడం మన సంస్కృతి
ప్రేమకు విలువనిచ్చి బ్రతికించడం మన సంస్కృతి
మమతాను రాగాలు అందించడం మన సంస్కృతి

రెక్కలు వచ్చిన పక్షిలా నిరంతరం సంచారకులం
పాలునీరు కలిసినట్లు ఒకరికి ఒకరమై ఉండే జీవులం
రైలు ప్రయాణంలా మంచి చెడు గమనించే వాళ్ళం
అబద్దపు రెక్కలు హద్దులు చేరకముందే గమనిస్తాం

సంపాదనకు తగ్గ ఖర్చు చేసు కుంటాం
శాంతితో క్రాంతిని అందిచి జీవిస్తాం
మాతృ భూమికి, దేశ రక్షనకు శ్రమిస్తాం
కలహాలు లేని కాపురంలా విశ్రమిస్తాం

దారులు ఎన్ని ఉన్న గమ్యం ఒక్కటే
ప్రేమలు ఎన్ని ఉన్న హృదయమొక్కటే
ఆశలు ఎన్ని ఉన్న ఆశయం ఒక్కటే
ఆలోచనలు ఎన్నిఉన్నా ఆచరణ ఒక్కటే

హృదయాల సంగమం అనంత కోటి ఆనందం
ఆత్మ సౌందర్యం ఆహ్లాదానికి, ఆదర్స్యానికి,
సాక్షీ భూతంగా విస్తరించిన పరిమళం
మాయల హరివిల్లు అదే మన పొదరిల్లు  
  --((*))-- 


*ఎటు చూసిన అటు

ఎటు  చూసిన  అటు
కన బడుతా వెందుకు
అటు ఇటు ఎందుకు
వచ్చేయి రూట్ కరక్టు

బెస్ట్ చీపెస్ట్ లవ్ గేమ్
డోమ్ ట్ వెస్ట్   టైం 
ఈ టైం మనకు పెర్ ఫెక్ట్   
వచ్చేయి రూట్ కరక్టు

ఐ ఆమ్ సారీ ఐ నాట్ ఇంట్రెస్ట్
యు ఫస్ట్ డిస్కస్ పేరెంట్స్
జస్ట్ ఐ  లోన్లీ పర్సన్ 
వచ్చేయి రూట్ కరక్టు

జస్టు థింక్ ఫస్ట్
నెక్స్ట్ డిస్కస్ వెస్ట్
మై లవ్  పర్ఫెక్ట్  
వచ్చేయి రూట్ కరక్టు

ఎటు  చూసిన  అటు
కన బడుతా వెందుకు
అటు ఇటు ఎందుకు
వచ్చేయి రూట్ కరక్టు

నీకు నేను చెప్పలేను
నాకు నీవు చెప్పవద్దు
మన ప్రేమ మధురం
మనకు మనమే వరం
--((*))--


* నాన్న గారు
నాన్న నీవే మాకు పెన్నిధి
నాన్న నివే మాకు సన్నిధి
నాన్న నివే మాకు నిధి
నాన్న గారికి పాదాభి వందనం


పరిస్థితులను గమనించి
మనోధైర్యాన్ని పెంచింది నాన్న
తన తీపి జ్ఞాపకాలను పంచి
కాలంతో బ్రతుకు నేర్పింది నాన్న

జీవితంలో స్పూర్తిని పంచి
కష్టాలను ఎదుర్కొనే శక్తే నాన్న
ప్రభావాలను గమనించి
అభిమానాన్ని పంచేది నాన్న

భంధం విలువను పంచి
ప్రేమనుపంచి ఆదుకొనేది నాన్న
ప్రపంచాన్ని గూర్చి వివరించి
నమ్మక మార్గం చూపేది నాన్న

ఆత్మవిశ్వాసం కలిగించి
భయం లేకుండా చేసింది నాన్న
అందరి అవసరాలు అందించి
వయసుమీరినా సహాకరించేది నాన్న

నష్టాలకు ఓర్పును పెంచి
లాభాల బాటను చూపించింది నాన్న
విజయాలకు సహకరించి
ఆరాధ్య దైవమే మా అందరికి నాన్నే

--((*))--

*బృహతీ చ్చందము
(ఛందస్సు )

నడక  తెలిపె  శ్రీనాధా  
వయసు పెరిగె  అంభోజా
మనసు కలిగె  ఓ కృష్ణా
తనువు తరిగె  శ్రీ మాతా 

హలముఖి
మాధవా  నలుసు వలసా
రాగమా  రజని మనసా
కాలమా  వయసు తెలుసా
రోగమా  మనసు ఎరుకా 

 ఉత్సుక

కేశవ  అర్చన రమ్యమా   
రాఘవ దీవెన పుణ్యమా
శ్రీముఖ వల్లన ప్రాణమా
ప్రేమతొ తల్లికి  వందనా
ఇది నేను వ్రాసిన పద్యాల భావము అనుకుంటున్నాను 

1. తండ్రిలాగా నడక నేర్పావు, యవ్వనం వచ్చిందని గుర్తు చేసావు, మనసు చెదిరే ఓ కృష్ణా, తనువు తరిగి పోతుంది తల్లి నాకు పెళ్ళిచేయి.
     ,
2. నలుసు లాంటి పిల్ల వలసి రాదా, రాగముతో నా మనసు రంజిమ్పదా, కాలము ఇంకా రాలేదనుకుందునా, నాలో ఉన్నరోగము నాకు తెలుస్తున్నది, తల్లి నాకు పె
ళ్ళి చేయి
  
3. ఓ శివా నీకు అర్చన చేస్తే కుదురుతుందా, రామచంద్రుని దీవెనెల నాకు ఉండవా,, శ్రీ ముఖముగా నా ప్రాణంతో ప్రేమిస్తాను, అమ్మ ప్రేమతో వందనాలు అర్పిస్తున్నాను నాకు పె
ళ్ళి చేయి. 
 


20, జూన్ 2016, సోమవారం

"సీతా పతి " సలహా (కధ )

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - "సీతా పతి " సలహా  (కధ )
 Photo: Good Morning

Happy weekend 🌹
సర్వేజనా సుఖినోభవంతు

"సీతా పతి " సలహా  (కధ )(రచయత : మల్లాప్రగడ రామకృష్ణ)

ఏమిటే నాకు ఎమీ కనబడుట లేదు, మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఎక్కడకు పోయిన కళ్ళజోడు పెట్టుకొని వెళ్ళమని చెప్పాను, ఆ చెప్పావు గుర్తుంది, దానికోసం మే వెతుకు తున్నాను, కళ్ళు కనిపించటంలేదు, నీవు ఒక్కరవ చూసి చెప్పు,  అని అరవగా "సీత" భర్త దగ్గరకు పప్పు  గరిటను పట్టుకొని వచ్చి మీ తలమీదే ఉంది, జాగర్తగా వెళ్లి స్నానం, అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రండి టిఫిన్ రడీ చేస్తా, ఆ వచ్చేస్తా రడీ చెయ్ అంటూ బక్కెట్ తన్నాడు, ఏమిటండి ఆశబ్దం ఏమైంది మీకు " ఎమీలేదే బక్కెట్ తన్నా అంతే అన్నాడు సీతాపతి " ఏమిటో మీమాటలు చేష్టలు అసలు అర్ధం కావు అంటూ వచ్చి భర్తను చూసి మరీ వెళ్ళింది సీత.  
సీతా సీతా పంపులో నీల్లు రావటం లేదు, బుస్సు బుస్సు మంటూ బొట్టుపడుతున్నది, అయ్యో మర్చిపోయానండి ఈరోజు మనకు నీరు రావు కదండీ, క్రిందటి రాత్రి ఓవర్ హెడ్ ట్యాంక్ లో నీళ్ళు ఆయి పోయిన సంగతి మీకు చెబుదామనుకున్నా మర్చి పోయాను. 
ఇప్పటి నా పరిస్తిని చూసి, జాలిపడితే నీరు దొరుకుతాయ, దొరకవు కదా, ఒక గంట ఓపిక పట్టండి బోర్ మోటార్ వేస్తారు అప్పుడు స్నానం చేయవచ్చు అన్నది. 
ఈ నీటి కొరత ఎలా వస్తుందో నీకు తెలుసా తెలియదు కాఫీతీసుకొని రా తాగుతూ కధ  చెపుతా, అట్లాగే అంటూ లోపాలు వెళ్లి కాఫీ తెచ్చి ఇచ్చింది సీత. త్రాగుతూ చెప్పటం మోదల పెట్టాడు సీతపతి.. 
"అడవులు నరికేయడంవల్ల, వర్షాలు కురవక, భూగర్భజలాలు ఇంకి పోయాయి, అడుగంటి పోయాయి, అందుకే అడవుల్లో పెరిగే మృగాలు నీరు కోసం గ్రామాలపై పడుతున్నాయి " తెలిసిందా నీకు,   నాకు ఎప్పుడో తెలుసు పరిష్కారం ఏమిటో చెప్పండి. "వృక్షో రక్షిత, రక్షిత:" అని ఏనాడో చెప్పారు కదా .        
మంచిది మనం ఒక పని చేద్దాం మన ఇంటి చుట్టూ ఒక వంద చెట్లు పాతుదాం, దానికోసం ఒక బోరింగ్ వేద్దాం, అన్ని చెట్లు పెంచుదాం . 
ఎన్నాళ్ళకు నామాట అర్దం చేసుకున్నావు, ఎప్పుడూ నీ మాటను జవదాటను, నన్నే మీరు సరిగా అర్ధం చేసుకోరు, చిన్న మాటకు కోపం తెచ్చుకుంటారు, అదికాదు సీతా, మంచి విషయాలునీవు చెప్పిన నేను  ఆచరణలో పెడుతాను, ముందు తరాలకు మార్గాదర్సకుల మనమే   కదా, అవనవును బోర్ వచ్చింది, స్నానం చేసి రండి అంటూ  లోపలకు వెళ్ళింది సీత . స్నానం చేసి వచ్చి "సీతాపతి" నవ్వుకుంటూ కూర్చున్నాడు. 
సెల్ ముందు పెట్టుకొని ఒకటే నవ్వు, ఆజోకునాకు చెప్పవచ్చుగా నేను నవ్వుతా, " ఆ ఏమియు లేదే ట్యాక్ బండు మీదనుంచి ఒక అమ్మాయి దూకబోతున్నది, దారిన పోయే ఒకడు స్కూటర్ ఆపి చావద్దు చావద్దు ఆగు అన్నాడు, సరేనని ఆగింది, నీవు చచ్చేముందు నేను ఒకటి  అడుగుతా అది తీర్చి మరీచ్చావు అన్నాడు " పక్కనే భార్య ఆ అబ్బాయి ఏమికోరాడు,  ముద్దు కోరాడు అన్నాడు భర్త, అవును మొగవాళ్ళ బుద్దిని పోనిచ్చారు కాదు, ముద్దిచ్చి చావమన్నాడు కదూ అన్నది భార్య, అక్షరాలా అదే అడిగాడు, సరే నీ మాటకు నేను అడ్డు చెప్పను ముద్దు తీసుకో అన్నది, వెంటనే భార్య అన్నది ఎంతకు తెగించింది ఆడది ఇది కలియుగం కదండీ, ఉండవే మొత్తం చెప్పనీవే, ఇక చెప్పేదేముంది తెలిసి పోయిందికదా అన్నది, సరే చెప్పండి, ఆ వచ్చిన అబ్బాయి ముద్దు తీసుకొని ఎందుకు చస్తున్నావు అని అడిగాడు, ఆ "ఏముంది చీరకట్టుకొని ఆడదానిలా తిరగాలని ఆశగా ఉన్నది, ఇంట్లోవారు వప్పుకోలేదు అందుకని చద్దామనుకున్నా" ఆ  ఆ అంటూ నవ్వటం మెదలు   పెట్టాడు, వచ్చినవాడు పిచ్చివాడుగా మారి పరిగెత్తాడు,  అందుకనే నాకునవ్వొచ్చింది అన్నాడు. నవ్వుకుంటూ భార్య లోపలకు వెళ్ళింది.   

అప్పుడే కాలింగ్ బెల్ మోగటం జరిగింది, మీరు తీస్తున్నారా నేను వచ్చి తీయాల లోపలనుండి భర్యసీత. నేను తీస్తున్నను లేవే అంటూ తలుపు తీసాడు.
భాగున్నారా అంటూ పలకరించాడు చిన్న నాటి స్నేహితుడు శ్రీధర్, అవును నా విషయం అట్లా ఉంచు మీ పాపకు పెల్లిచేసావా అని అడిగాడు సీతాపతి.
అప్పుడే అన్నయ్యగారు బాగునారా అంటూ మంచి నీరు అందించింది. గబా గబా త్రాగి ఇంకో గ్లాసు ఇవ్వమ్మా అంటూ పలకరించాడు శ్రీధర్.
నీరు త్రాగుతూ తియ్యటి నీరు ఎన్ని త్రాగినా ఇంకా త్రాగాలని పిస్తుంది అనుకుంటూ "నీటి దాత సుఖీభవ "
సీతాపతిగారు మీ కేం పిల్లలకు పెళ్ళిళ్ళు చేసారు, నాకూతురురుకుపెల్లి చెయ్యాలంటే ఎంత ఆలోచించిన ముడి పడుట లేదు ఏంచేయాలో తోచుటలేదు, ఏదన్న సలహా ఇస్తారని మీదగ్గరకు వచ్చాను ఏదన్న సలహా ఇచ్చి ఆడపిల్ల పెళ్ళికి సహకరించండి.
అసలు విషయం చెప్పు  "నేను మా అమ్మాయిని డిగ్రీ దాకా చదివించాను, నా భార్యతరుఫున ఒకరు మాఅమ్మాయిని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామన్నారు, అబ్బాయి అమెరికాలో సాప్ట్ వేర్ ఉద్యోగం, ఆస్తిబాగాఉన్నదని చెప్పారు,  మా అమ్మాయిని అడిగాను చేసుకుంటావా అని,  నాన్న మీ ఇష్టం ఎవరిని  చేసుకోమంటే వారిని చేసు కుంటాను అన్నది సీతాపతి, ఇంకేం పెళ్లి చేయవచ్చు కదా?

నేను మా ఆవిడా ఒక నిర్ణయానికి వచ్చాము ఒక సంపన్న కుటుంబం లోకి పంపాలన్నదే మా ఉద్దేశ్యము. అప్పుడే ముందుగా చూసినవారు మేము మియు అమ్మాయిని చేసుకుంటామని వాచ్చారు, అప్పుడే సమస్య మొదలైనది. 
ఆ వచ్చినవారు  నా స్నేహితుడు బ్రహ్మానందం వాళ్ళ ఊరిలొ ఒక చక్కటి కుటుంబమునాకు చెందినవారు, వారికి ఒక్కడే కొడుకు  పి.జి వరకూ చదివాడు, .రాజకీయులతో తిరుగుతాడు, వాళ్ళ ఊరిలో ఎ చిన్న పనికైనా తనే ముందు ఉంటాడు, అందులో ఒక గ్రూపు తయారు చేసినాడు, గ్రామాన్ని ఆదర్శగ్రామంగా దిద్దాలి అని తిరుగుతాడు, అన్నిటికన్నా  ముఖ్యం గా  వారికి జలసంపద ఎక్కువగా ఉన్నది. శాస్త్రీయ పద్దతిప్రకారముగా ఇంకుడుగుంతలు రక్షిమ్చుకోవటమువలన వారి పొలం లో ఉన్న బావియందు, ఇంటి యందు  ఉన్న బావి యందు సమృద్ధిగా నీరు ఉన్నది, ఆఊరి ప్రజలను ఆ బావి నీరే  కాపాడుతున్నది.
ఇక నేను చెప్పేదేమి టంటే ఈ అబ్బాయి కూడా మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, వీరు కూడా కట్నం వద్దు, మీ అమ్మాయికే మేము నగలు పెడతామని మరీ చెపుతున్నారు.                           
       
నీఉద్దేశ్యము చెపితే నా ప్రయత్నం నేను చేసుకుంటా సీతాపతి.
అప్పుడే లోపలనుంచి కాఫీ తెస్తూ అన్నయ్యగారు మీ శ్రీమతిగారికి ఫోన్ కలిపి నాకివ్వండి, ముందు  మాట్లాడుతాను  అన్నది సీత. అట్లాగే అని నెంబరు  కలిపి ఇచ్చాడు స్నేహితుడు శ్రీధర్,
పది నిముషాలుకూతురితో భార్యతో మాట్లాడింది సీత. అన్నయ్యగారు మీ  ప్రాబ్లమ్ సాల్వయిపోయింది. అంటూ సెల్ చేతి కందించింది. వెంటనే ఇంటి నుండి ఫోన్ మీరు వెంటనే రండి అని భార్య మాట విని,  మీరు నాకుసెలవు ఇవ్వండి, మరలా శుభవార్తతో నిదగ్గరకు వస్తాను అంటూ వెళ్ళిపోయాడు శ్రీధర్ . 
ఇంతకీ వాళ్లతో నీవు ఏమిచెప్పావు అని అడిగాడు సీతాపతి  భార్యతో,
ఏముందండి పెళ్లి చేసుకొనే పిల్లతో గ్రామంలో ఉన్న చదువుకున్న వాణ్ణిచేసుకుంటే, ముందు మండలాధ్యక్షుడువుతాడు, తర్వాత ఎం ఎల్ ఏ అవుతాడు, తర్వాత మంత్రి అవుతాడు, తరువాత ముఖ్యమంత్రి అయినా అవ్వవచ్చు, అప్పుడు నీవు మంత్రిగారి భార్యవు ప్రజలు 
న్నీరాజనాలు పడతారు, అటువంటి భర్త కావాలా, పొద్దున్నే  ఎనిమిదింటికి పోయి రాత్రి పదింటి దాకా రాని భర్త కావాలా ఆలోచించుకో, నీకు కావల్సినది డబ్బు కాదు, సుఖం అది గమనించు అన్నాను, వెంటనే గ్రామంలో ఉన్న అబ్బాయినే చేసుకుంటాను, అమ్మా నాన్నకుకూడా మీరుచెప్పండి, అని తల్లికి ఫోన్ ఇచ్చిది అనిచెప్పి చెప్పటం అపింది  సీత. 
ఆమెకు ఏమి చెప్పావో అదికూడా చెప్పు అన్నాడు సీతాపతి 
ఏముంది "" మీరు మంత్రిగారికి అత్తగారు అవుతారు, ఆ చాన్సు మీ కేరావాలి, గ్రామంలో ఉన్న అబ్బాయి కిచ్చి ఘనంగా పెళ్ళిచేయండి అని చెప్పా''' 
అట్లా చెప్పుట తప్పు కాదే వాళ్ళల్లో ఆశలు రేపినదానవౌతావు, నూరు అభద్దాలు ఆడినా ఒక పెళ్ళిచేయమన్నారు, నేను కలియుగ నీతి చెప్పి   పెళ్లి చేసుకోమన్నా అంతేకదా 
ఆ ఆ అంతే
మళ్ళీ తలుపు ఎవరో కొడుతున్నారు తియ్యనా, తియ్యండి ఎవరు వచ్చిన ఈ సారి సలహా మాత్రం నేను చెపుతా, నీవు తలదూర్చకూ ... 
అట్లాగే అసలు వచ్చిన దెవరో చూడండి ముందు 
సీతాపతిగారు అంటూ ఒక ఆడమనిషి లోపలకు అడుగు పెడుతూ నా  ప్రశ్నలకు సమాధానము కొరకు మీ దగ్గరకు వచ్చాను. " నా భర్త దగ్గర లేని సమయాన నా కొడుకు నా కూతురు నా దగ్గర ఉండు నా దగ్గర ఉండు గట్టిగా అడుగుతున్నారు, నేను ఎవరి దగ్గర ఉండాలి ? చెప్పండి ?

ఇదిగోనండీ ముందు మీరు కాఫీ త్రాగండి, మీ కధ విన్నాక మీకు తగిన సలహా ఇస్తాము అన్నారు "సీతా - పతి "

                                                         వచ్చేవారం మరో కధ

12, జూన్ 2016, ఆదివారం

"సీతాపతి" - ఫంక్షన్ హాల్ (కధ )

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - హాస్య కధ 
image not displayed

సర్వేజనా సుఖినోభవంతు

"సీతాపతి" - ఫంక్షన్ హాల్ (కధ )

చాలా  రోజుల  తర్వాత  ఒక  కధ వ్రాయటం  మొదలు  పెట్టాడు  "సీతాపతి"
ఏమిటండి మీరు వ్రాసేది, ఈ వయసులో కూడా కధలు వ్రాయాలా, హాయిగా కూర్చొని"కృష్ణా రామా " అను కోవటం మంచిది అన్నది భార్య సీత. 
నేను చేస్తున్నది అదే కదే, నీ మొఖం నేను, నా మొఖాన్ని నీవు చూసుకొని, ఉండటమే కదా రోజూ చేస్తున్నది.
ఏదో కాస్త నవ్వుకొనే కధ వ్రాయాలని పించింది, ఒక్కరౌవ్ సలహా ఇస్తావా, ఏదో మీ ఆడవాళ్ళ సలహాతో ప్రారంభిస్తే  అంతా మంచి జరుగు తుందని మానాన్న గారుచెప్పారే అందుకనే అడుగుతున్నా.
అమ్మో ఎన్నాల్లకు మీనోట నుండి ఒక మంచి మాట వచ్చింది, సరే నేను చెపుతున్నా "ఓం శ్రీ రాం " అని వ్రాసి కధ మొదలు పెట్టండి, నాకు ఇంట్లోకాస్త పనివుంది మల్లా వచ్చి చదువుతా, అవసరమైతే, నాకు నచ్చకపోతే కధ మొత్తం మారుస్తా అందుకు ఇష్టమైతే వ్రాయండి, మీరు నేను ఎమన్నా కోపం తెచ్చుకోనంటేనే  వ్రాయండి.

ఏమిటే ఫేస్ బుక్ చూస్తున్నావా ఆ రూం లో, లేదండి పేస్ వాష్ చేస్తున్నా అన్న మాటలు పెద్దగా వినబడి నాయి, అదేనే అంతర్ జాలంలో ఫేస్ బుక్ నే నేను అడిగింది, నాకు ఎ అంతర్ జాలం తెలియదు, నీ మయా జాలం నా మీద ప్రయోగించ కుండా ఉంటేచాలు అని గట్టిగా ఆరిచిది సీత. అలా కధ మొదలైనది సీతపతి గారి సంసారం.
ఒక ఫన్షన్ కు పోవాలని భార్య సీత ఏంతో పట్టుదలతో భర్తను ఒప్పించి బయలు దేరింది. భార్యను పలకరిస్తూ 
ఏమండోయ్ శ్రీమతి గారు నేను కాస్త V  శ్రాంతి ని తీసుకొని వస్తా, నీవు ముందు బయలుదేరు అన్నాడు సీతాపతి
నడవండోయ్ నడవండి  V  శ్రాంతి వద్దు V  క్రాంతి వద్దు, నన్నే భరించలేక క్రింద మీద పడుతున్నారు. ఇంకో అమ్మాయి కావాల్సి వచ్చిందా, అదికాదే కొంచము నీరసముగా ఉన్నది విశ్రాంతి తీసుకొని వస్తాను అంతే, అదా సరే రండి.    వస్తున్నారా ...    
ఆబ్బా వస్తున్నానులే  నీవెనుకే ఉన్నాను, అంత తొందరెందుకే భోజనాల వేలకు పోవటము లేదు కదే ముందుగానే పోతున్నాంకదా, ముందు గిఫ్ట్ కొనాలి డబ్బులు తెచ్చారా, అసలే అయ్యోమయ్యం జగన్నాధం మీరు, అవునేవ్ నీ వన్నది కరెక్ట్ ఎందుకంటే నీవు రమ్మనమనగానే వచ్చాను, జేబులో డబ్బులు తేవాలనీ కూడా గుర్తుకు రాలేదు, అంతా  నీ మీద ప్రేమ ఉండుట వళ్ళనే కదే.
ప్రేమా మట్టి గడ్డ, ఇప్పుడు ఎట్లాగండి, మరలా వెనక్కు పొతే టైం సరిపోదు, ఇంటికి వెళ్లి వస్తే భోజనానికి కూడా పోలెం ఎంచేయా లండి అని అడిగింది సీత.
అసలు నీవు నన్ను లెక్క చేయకుండా మాట్లాడుతున్నావు, అందుకే ఈ కష్టాలు .....
నాకు లేక్కలు రాకే కదండి మిమ్మల్నికట్టుకుంది,....   నిజమా
సరేలే అదిగో అక్కడ మన పాత ఇంటి ఆవిడ ఉన్నది ఆవిడా దగ్గర డబ్బు లడిగి తెస్తాను, గాబరా పడకు తర్వాత ఇద్దాం.
అమ్మో ఆవిడా నోరు విప్పితే చాలు కుళ్ళు జోక్సువేస్తుంది, వయస్సు పెరిగినా బుద్ధి మాత్రం మారలేదు, ఆవిడని కదిలిస్తారా, ఆవిడ మంచిది కాదని మీకు తెలుసు, నాకుతెలుసు, తెలిసి తెలిసి అశుద్దం మీద ఎవరైనా రాయి వేస్తారండి, చూడు, మనం మంచి వారం, మన పని మంచిగా జరిగి పోతుంది, నీ వేమి గాబరా పడకు, నీవు ఇక్కడే ఉండు  వెళ్లి డబ్బులు తెస్తా, తోదరగా వెళ్ళండి, ఆలస్యము అయితే మాత్రం నేను ఇక్కడ ఉండనండి, ఎంచక్కా ఇంటికి వెళ్లి పోతాను, ఫంక్షన్ వద్దుఎమీ వద్దు అన్నది కోపంగా భార్య.
కోపం వద్దే నేను పోవాలి, అడగాలి, తేవాలి కదా
ఎంత స్పీడుగా పోయాడో, అంతే స్పీడుగా,  వెనక్కు తిరిగి వచ్చాడు.
కాయ, పండా చెప్పండి ముందు అన్నది, కాయ కాదు, పండు కాదు, కాసుల పంట అంటూ నోట్ల కట్ట చూపించాడు సీతాపతి.
ఏమండి నిజం చెప్పండి ఆవిడతో మీరు ఏమి మాట్లాడారు, వెంటనే ఇవ్వటానికి కారణం ఏమటండి, చెప్పండి.
ముందు నడువు ఫంక్షన్ కు పోదాం, తర్వాత అన్నిచేపుతాలే అంత తొందర పడకు అన్నాడు సీతాపతి.
ఏమండి అలా బిగేసుకొని నడుస్తున్నారు, ఏదన్న జోక్ చెప్పండి, నవ్వు కుంటూ పొతే సమయమే తెలియదు కదండీ.
అవునే మొన్న పార్కులోజరిగిన విషయం చెపుతా విను అంటూ మొదలు పెట్టాడు సీతా పతి.
పార్కుకు రోజు వాకింగ్ వస్తుంది కదా అని లిఫ్టు ఇద్దామని స్కూటర్ ఆపి ఎక్క మన్నా ఒక అమ్మాయిని, 
ఇంకేముంది సొంగ కార్చుకుంటా ఎక్కించుకొని ఊరంతా తిప్పి తిరిగోచ్చుంటారుకదా మీరు, అందులో మీరు మగ మహారాజులు తడుము కోకుండా సహాయం చేస్తారు అన్నది భార్య.
అబ్బా నీ అడబుద్ధి పోనిచ్చావు కాదు, నీవు అనుకున్నట్లుగా  కాదులేవే, అసలే టెన్క్షన్ పెట్టక జరిగింది ఏమిటే చెప్పండి, మీమాటలు చూస్తే అదోరకంగా ఉన్నది, ఏమన్నదేమిటి.
నే చెపితే నీవు భాద పడతావ్ , అసలు ఏమి జరిగిందో చెప్పండి  నేను భాద పడనులే. 
" పోరా చచ్చినోడా పో మూడు రోజులనుంచీ లిఫ్టు తీసు కుంటూనే ఉన్నా ఇంతవరకూ ఇంటికి చేరనే లేదు అన్నదే "
ఆ మాటలకు భార్య ఒకటే నవ్వు . 
ఫన్షన్ హాల్ దగ్గరకు చేరారు ఇద్దరు, ఏమండి మనం ఫన్షన్ కార్డు తేవటం మరిచాను, మరి  ఏమిచేయాలో చెప్పు ఇక్కడ నాలు ఇదు ఫన్షన్ లు జరుగుతున్నాయి అన్నది.   పెర్లు గుర్తున్నాయి కదా
నిముషములో కనుకుంటాను, మనం వచ్చింది ఎంగేజ్ మెంటు ఫంక్షన్ కదా అడిగోస్తా అని లోపలకు వెళ్ళాడు సీతాపతి.     
విచారణ విభాగంలో అడుగగా " బోర్డు పై  అన్నీ వ్రాసి ఉన్నాయి" , ఎ ఫ్లోరో చూసి చెప్పండి లిప్టు ద్వారా తీసుకెల్తాము అన్నారు. కళ్ళ జోడుసరి చేసుకొని చూసాడు ఎన్నో ఫ్లోరో తెలుసుకున్నాడు సీతాపతి. 
మొత్తం మీద 5వ ప్లోర్లో జరిగే ఫంక్షన్ అని తెలుసుకొని లిఫ్ట్ లో బయలు దేరారు. ఆ లిఫ్టు లో ఎవ్వరులేరు వీరిద్దరే. 
నెమ్మదిగా పైకి పొతూ ఒక్కసారి ఆగి పోయింది, కరంటు పోయిందేమో నండి, జనరేటర్ ఆన్ కాదే ఇంత పెద్ద హోటల్లో అని అడిగింది భర్తను సీత, ఏమో నాకేం తెలుసు అన్నడు భర్త, అదికాదండీ నాకు భయంగా ఉన్నది ఎప్పుడు కదుల్తుందో మరి, భయపడకు నీకుతోడు నేనున్నాగా,భయపడకు,  ఒకవేపు భయము కమ్ముకోస్తున్నది, ఊపిరి ఆడుట లేదు, ఎంత అరిచిన పట్టించు కొనేవారు లేరు,  నరకము ఎక్కడా లేదు ఇక్కడే ఉన్నదని భావించారు, కొంత కదిలి మరలా ఆగి పోయింది. బయట ఎవ్వరూ  కనిపించుట లేదు, సగంలో దిగాలంటే చాలా కష్టమై పోయింది, అప్పుడే ఎవరో వచ్చి మా ఇద్దరినీ నెమ్మదిగా దించారు. అక్కడే సీతపతి కళ్ళజోడు పడిపోయింది. 
ఇదిగో సీతా ఎం ఫంక్షన్ హలో నాకు గుండె ఎలా కొట్టు కుంటుందో చూడు, మీకు నేను ఎం చెప్పాలండీ నా గుండె జట్ విమానంగా వేగంగా కోట్టు కుంటుంది, ఇటు వంటి పరిస్తితి ఎవ్వరికీ రాకూడదు,   నెమ్మదిగా మెట్ల మీద నుండి క్రిందకు పోదాం పదండి, క్రింద హోటల్ ఉందట అక్కడ భోజనం చేసి ఇంటికి పోదాం. నీకు ఆకలేస్తుందా ఏమిటీ, నాకు ఆకలి చచ్చిపోయింది నేను మాత్రం ఎమీ తినను ఇంటికి పోదాం పదా అంటూ కదిలారు. ఏమండి మీ కళ్ళజోడు, ప్రాణాలతో బయా పడ్డాము, కొత్త కళ్ళజోడు కొనుకుంటానులే, ఇప్పుడు నాకుతోడుగా నీవు ఉన్నావు నీకు నేను ఉన్నాను, నెమ్మదిగా పోదాము, ఆటోను పిలువ్ అసలే నేను అటో ఏదో కారు ఏదో గుర్తు పట్టలేను కలజోడు లేదుకదా, బాధలో కూడా  నవ్విస్తారుమీరు అంటూ నవ్వుకుంది సీతాపతి భార్య.   
గేటు దాటుతూ వస్తూ ఉంటే వెనుక నుండి పిలుస్తూ అడుగుతున్నారు 
" ఏమండోయ్ ఫంక్షన్ హాల్ ఇదండీ, మీ స్నేహితురాలిని నన్ను మర్చి పోయారా మీరు " 
సీత అందుకొని నేను నిన్ను మర్చి పోలేదు, నీ కోసమే ఇంత  దూరమ్ వచ్చాము, ఇదిగోనమ్మా మేం తెచ్చిన గిఫ్ఫ్టు అందుకోండి అసలే మాకు గుండె దడ పెరిగింది,లిఫ్టులో ఆగిపోయి నరకం చూసాము, మాకు ఒక అనుభవము జరిగింది, మేము వెల్లోస్తామమ్మా ఎమీ అనుకోకండి  మిమ్ముకలుస్తాములే అంటూ అటో  ఎక్కారు ఇంటిదాకా .....  
ఏమిటి కధ అప్పుడే వ్రాసారా మీరు అవునే ఇది మన కధ గుండెదడ వ్యధ కలిగించిన క్షేమంగా తిరిగివచ్చిన ఫంక్షన్ హాల్ నిన్నటి అనుభవమే నేటి నా కధ, బాగుందండి ఇదిగో కాఫిత్రాగి రెష్టు తీసుకోండి ఈరోజున మా  వేలు విడిచిన మేనమామ కూతురి పుష్పవతి ఫంక్షన్ పోవాలండి  ..... 
ఆ ఆ  ....  అంటూ మడత కుర్చీలో కూల బడ్డాడు సీతాపతి  ..... 

                                                   వచ్చేవారం వేరొక కధ ...

            

9, జూన్ 2016, గురువారం

Internet Telugu magazine for the month of 6/2016/23


ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ -వార పత్రిక 
 సర్వేజనా సుఖినోభవంతు 

--((*))--





*దినపత్రిక

ఉషోదయంతో వస్తుంది
మనసు ఉస్చాహ పరుస్తుంది
అక్షర సాహిత్యం తెలుపుతుంది
పాఠాలను పొందు పరిచి మనసును చేరుతుంది

జ్ఞాన జ్యోతుల విశేషాలను తెలుపుతుంది
రాజ్య రాజకీయ తంత్రాన్ని విపులీ కరిస్తుంది
వాగ్దానాలను ఖర్చు చేసే ధనాన్ని తెలుపుతుంది
గతాన్ని తెలియపరుస్తూ నిద్ర లేపుతుంది

ప్రజల కష్టాలు, దోపిడీ వీర కృత్యాలు,
అగాధాలు, ఆనందాలు, సినమాలు,
పగలు , ప్రతీకారాలు, చీకటి వ్యాపారాలు
షేరులు, ఆద్యాత్మిక,ఉపన్యాస వివరాలు

మదిలో నిక్షిప్తమైన భావాలు
ఆలోచనా అక్షరామృత కధలు
వర్తమాన విశేషాలు, లగ్న ఫలితాలు
పురోగతి ప్రణాలికలు, వ్యాపారాలు

చితికిన బ్రతుకుల గాధలు
ఆధునిక ఉపయోగ పరికరములు
ఉద్యోగ ప్రకటనలు, ఉష్నోగ్రతలు
మనసుకునచ్చే హస్యగుళికలు

క్షణం క్షణం మనల్ని మేల్కొల్పి
నిరంతరం చైతన్య వంతులుగా చేసి
ఆవేదనలు దూరమ్ చేసి
ఆశలకు ప్రాణం పోసి
పురోగతికి ప్రణాళిక వేసి  
మస్తాకానికి స్నేహితుడుగా ఉండి         
ఇంటిల్లి పాటి ఆనందాల్లో ముంచి

విద్యారుల ప్రగతిని చూపే అక్షర దీపమ్   
అదే అందరి మాతృభాషా ఆశాజ్యోతి
                ప్రపంచ వార్తా విశేషాలు తెలిపే గీతమాల                   
ఎప్పటికప్పుడు విషయాలు తెలిపేదే దినపత్రిక 
    --((*))-- 


 
*నిద్ర రాదా  ?

ఉద్యోగాల్లోని డెడ్ లైన్ల హెచ్చరికల వళ్ళనేమో
వికసించని గాఢమైన  ప్రేమసాహిత్యాలవల్లనేమో
ఆధునికి జీవిత జాడ్యాల ఆలోచన వల్లనేమో    
కళ్ళు మూసుకున్నా  నిద్ర రావాటం లేదు నిజమా

లక్ష్యాన్ని చేరు కొనేదాక కష్ట పడుట వల్లనేమో
రెప్ప వాల్చకుండా దృశ్యాలను చూడుట వల్లనేమో
రెచ్చకొట్టే పదజాలాన్ని మరువలేకుండుట వల్లనేమో 
కళ్ళు మూసుకున్నా నిద్ర రావాటం లేదు నిజమా

సరియైన తిండి తినక, మెత్తని పరుపు లేకుండెనేమో 
విశాలమైన పడక, A.C. సదుపాయాలు లేకుండెనేమో
చెప్పలేని బెరుకు, అర్ధం లేని మానసిక భయం వళ్ళ నెమో   
కళ్ళు మూసుకున్నా నిద్ర రావాటం లేదు నిజమా

నిద్ర వచ్చుటకు మత్తు మాత్రలకు బానిసగా మారుట వళ్ళ నేమో 
మత్తు మాత్రలు వళ్ళ  జ్ఞాపకశక్తి, తలనెప్పి వచ్చి భాదవల్ల నెమో 
నరాల బలహీనతతో కలత నిద్రతో భయంగా ఉండుట వల్లనేమో
అయినా కళ్ళు మూసుకున్నా నిద్ర రావాటం లేదు నిజమా

ధనం, స్త్రీ సుఖం, అప్పులు మనస్సును వేదించకుండా  ఉంటే
స్నేహం, ప్రేమ, నమ్మకం, ఆత్మీయులు  ద్రోహం చేయకుండా ఉంటే
కులం, మతం, సమాజం, కన్నబిడ్డలు వేధించకుండా ఉన్నప్పుడే      
అప్పుడే నిజంగా కళ్ళు మూసుకున్నా వెంటనే నిద్ర రావాటం సహజం

పగలు కష్ట పడ్డ వారికి రాత్రి నిద్రరావటం సహజం
చీకటి పడగానే ప్రకృతి నిద్రకు గాలివీచుట సహజం
మనస్సు ప్రశాంతంగా వెన్నెలలో నిద్రే ఎంతో సహజం
ఆరోగ్యానికి, దృడశక్తి, సుఖశాంతికి నిద్రవళ్ళ కలుగుట సహజం
--((*))--




*(రైతే ఆధారం పభుత్వానికి)

చినుకులు పండగోస్తుంది గిష్మాలు దాటేస్తూ
కర్షకులు ఓర్పుతో దుక్కి దున్ని దమ్ముచేస్తే
నారు పోసి నాట్లుచేసి నీరు పెట్టి నారు పోస్తే
రేయి పగలు నిద్రాహారాలుమాని కాపు కాస్తే

ఆశతో రైతు ఆకాశం వైపు జలదారకోసం చూస్తే
చేను పురుగు పట్టగా మందులకు  అప్పులుచేస్తే     
నీరులేక ఋణగ్రస్తూన్ని చేసి రైతుని వీధిన పడేస్తే
బ్రతుకుపై ఆశచచ్చిన దిగులు చెందక ఉండు కర్షకా

మెతుకు నిచ్చు నేలను మేడలను నిర్మించాలా
బ్రతుకును పంచె నేలను వట్టిగా ధారా పోయాలా
రైతు కూలీ జనమ్ నోటిలోమట్టి కొట్టి కోట కట్టాలా
కర్షకులు వలస పొతే ప్రభుత్వాలు నిలబడతాయా

రైతువిశ్రాంతి పొందితే, పచ్చని పైరుపండక పోతే
ఆహారము లేక తనువు తపించే తపనలు పొతే 
మనుష్యుల మద్య ఉన్న మనస్సు కలవక పోతే
శాంతి లేక సృష్టి జరుగదు, అందుకే పంట పండించు కర్షకా  

రైతులకు మంచి విత్తనాలు తక్కువ రేటుకు అందించి
అవసరానికి నీరును, పురుగు మందులను అందించి
రైతులకు ఆర్ధిక అవసరాలకు బ్యాంకులు లోను అందించి
ఉండకపొతే రైతులు వలసపొతే, మనప్రగతి కుంటు పడుతుంది             

రైతు ఉత్సాహముతో నుండుట  ఏంతో మేలు
రైతు కష్టపడి పంట పండించుట అందరికీ మేలు
రైతు మృత్యువుకు చిక్కక ఆదుకోవటం అందరికీ మేలు
ప్రభుత్వాలు రైతుపై ఆధారపడి ఉన్నాయని గమనించుట మేలు  

--((*))--
Photo: लगता तो बेखबर सा हूँ पर खबर में हूँ।
तेरी नज़र में हूँ तो सबकी नजर में हूँ। 
 * (మృత్యువు)

ఓ మానవ, నీ మృత్యువుని  నీవే
జాగర్తలు చేసుకోక, పిలుస్తున్నావు

విసృంఖల సౌకర్యాల మత్తులో
స్త్రీ సుఖాల ఖాంక్షల వేటలలో
ధనమదంతో, అనారోగ్య అంచులలో
చిక్కి మృత్యువాత పడుతున్నావు

శబ్ద కాలుష్యంతో
వాయు కాలుష్యంతో
నీటి కాలుష్యంతో    
అనారోగ్యుడవై మృత్యుడౌతున్నావు

వ్యాయామం లేక
ఊపిరి సరిగా లేక
తగు ఔషదము వాడక
హృద్రోగంతో మృత్యుడౌతున్నావు

కుషన్ సీట్లో ఎక్కువ సేపు కూర్చొని     
పిస్టూల్లా, పైల్సు రోగాలు వెంబడించి
ఏసీ రూమ్లొ ఎక్కువసేపు కూర్చొని
డి. విటమిన్ తగ్గగా బలహీనుడౌతున్నావు

పాలరాతి బండలు నేలపై పరిచి
అందం చూసారుకాని జారితే వచ్చే నెప్పిని
బాత్ రూముల్లో కూడా వేయించి
మేక్కాల్ల నెప్పులకు దారిచూపు తున్నావు

సెల్ ఫోన్ లు ఎక్కువగా వాడి
కంప్యూటర్ , టి. వి. అదేపనిగా చూసి
తెలియని రోగాలను ఆవహించి
మనసును భాధకు గురిచేస్తున్నావు

మానవ పౌష్టికాహారము తీసుకొని
మనసు ప్రశాంతముగా మార్చుకొని
కాలాన్ని అనుకరించి జీవితాన్ని
గడిపే వారిని మృత్యువు దరిచేరదు  
 --((*))--  


*(కంప్యూటర్ )

ప్రపంచ ప్రజలను ఆకర్షిస్తూ,
మనసులో మనసై  ఆ "విరించి"
అఖిలాండ బ్రహ్మాండాన్ని సర్వం
తన్మ యత్వంతో  ఆ "విరించి"

మేధావుల ప్రయత్నాల
పరంపరల మేథా శక్తి వెల్లువలే
సర్వ భాషా భాండా గారాన్ని
నిక్షిప్తంగా వెల్లువరించే ఆ "విరించి"  

గాడాంధకారాన్ని మటుమాయం
చేసే, విజ్ఞాన మానవ శక్తి పరులే
విశ్వజ్యోతి వెలుగులు అందించే
సర్వ విజ్ఞానం తో ఆ "విరించి"

చిత్ర, విచిత్ర, దృశ్య , శబ్ధ,
శృగార, హాస్య మేల వింపులే
వేదంత, సంస్కృత సాహిత్య,
పలుకోటి భాషలతో ఆ "విరించి"

వ్యాయామ, వ్యవసాయ,
అంతరిక్ష వాతావరణ వివరాలే
మానవల మేలుకొనే, సుఖ
సంసార సంభాషణలతో ఆ "విరించి"

తల్లి తండ్రుల పోషణ, దేవతా
మూర్తుల అరాధనా వివరాలే
మన: శాంతికి, మనో నిగ్రహ
శక్తికి, పలు శుభాలతో ఆ "విరించి"

ఆరోగ్య, అనారోగ్య, నిత్య వార్త,
ప్రపంచంలో చేసే సేవా వివరాలే
సంక్షిప్త, నిక్షిప్త, విశ్వ వ్యాపిత
సమమాచార కంప్యూటర్ గా ఆ "విరించి"
(విరించి అర్ధం (త్రిమూర్తులు)           
--((*))--




Photo:

*(సరసాలు)

విధి వీధిలో కొత్త సందడిలే
పున్నమి వెన్నెలలో సరిగమలే
పుడమికి కొంత  పులకరింతలే
తొలకరి జల్లులతో మన  సరదాలు   
 
మొగ్గ పువ్వు కొత్త పలకరింపులే
చిరు బుగ్గలపై తొలకరి సిగ్గులే  
మధువు త్రాగే పెదవుల కదలికలే
గ్రోలు తున్న తుమ్మెదల సరసాలు 

అందాలు విరుస్తున్న పువ్వులే
పచ్చికలో పైరుగాలికి కదిలే తీగలే      
చుట్టుకున్న కోకలు కదలికలే
కోకలో దాగిఉన్న సోకులతో సరసాలు 

ప్రేమ జంటల ఆరాటాల కదలికలే
ఎద పొంగు తడిసి పైట రెపరెపలే
పైట లాగుతుంటే కులుకుల వలపులే
చేయి చేయి కలిపి చేసుకొనే సరసాలు  

కన్ను కన్నుకలసి పెరుగును విరహాలే
విరహానికి ఊగిపొవు కందిరీగ నడుములే
ఎదురుచూపు ఆశలకు ఇది  అవకాశములే 
చిరుజల్లుల సైయ్యాటలే మానవుల సరసాలు
--((*))--


*ఇచ్చేసేయ్

నీ ఆశల వలయాన్ని కాలానికి ఇచ్చేసేయ్
సుఖ మంతా ప్రకృతి మార్గానికి ఇచ్చేసేయ్

నడకకు ముల్లున్నా, వయసు తుల్లుతున్నా
నీ మనసు గమన మార్గానికి ఇచ్చేసేయ్

జీవిత చదరంగంలో యాత్రలు ఎన్ని ఉన్నా
ఎదురయ్యే సమస్యలను కాలానికి ఇచ్చేసేయ్

కళ్ళను మురిపించే నవ వనితలెందరున్నా
వ్యసనాలకు చిక్కక మౌనానికి ఇచ్చేసేయ్

మాటవిలువ ఓపికతో ఎదురుచూస్తూ ఉన్నా
మౌన వేదనతో కన్నీరు కారుస్తూ ఇచ్చేసేయ్

ప్రయత్నంలో ఎన్ని అపజయాలు ఎదురై ఉన్నా
ఓపిక,ఓర్పుతో మనసును సమయానికి ఇచ్చేసేయ్

--((*))--




image not displayed 
అరుస్తూ కదులుతుంది శకటం వీధుల్లో
వేగంలా కదులుతుంది మనసు కలల్లో

సుఖాంతం ఎక్కడో తెలిసి కోలేక ఉంటే
ఆలోచనా సర్వం నిరంతరం ఉండు తలల్లో

మనపై కోర్కల వసంతం వెంబడిస్తూ ఉంటే
ఖర్చులు కనిపిస్తాయి బ్రతకాల్సిన జీవితాల్లో

ఆశయాలుకు చీకట్లు కమ్ముతూ ఉంటే
వెలుగు లేక నిరాశలు ఉండు మనసుల్లో

తనువుల తపనలకు తట్టుకొని ఉండి ఉంటే
మనసులు చిక్కు మగువ వలపుల వలల్లో

కోపం మనిషిని మృగం గా మార్చిన వైనం
కృస్సించిన జీవితమ్ మారుతున్నది వ్యధలో

--((*))--




* (అంచులు )

మనసులోని మమతలు 

తెలుసుకోలేని దూరపు అంచులు
కళలు కార్యములో పెట్టుటకు

 చూడాలి కొన్ని దూరపు అంచులు

పండితులు తమ వాక్చాతుర్యముతో 

ఎదుటి వారి మెప్పు పొందు
మాటల గారడిలో ముంచి మేధావికి

 చూపు కొన్ని దూరపు అంచులు 

శక్తి అదృశ్యంతో ఎప్పుడూ ఉండి 

మానవులమనోధైర్యాన్ని పెంపొందు    
భాషలు ఎన్ని ఉన్నా మానవత్వానికి 

మనుగడ తెలిపే కొన్ని అంచులు 

కల్పనలు వెంబడించిన మనం ఏది 

సత్యం ఏది ధర్మం అదే పొందు 
దేవుని సంకల్పం కోసం కన్నీటి చలములు

 చూడాలి దూరపు అంచులు 

మబ్బులు మేఘాలతో దోబూచులాడి 

జలాన్ని పుడమితల్లి పొందు
వానలు కురిసి పృధ్వి సుక్షేత్రంగా మారి 

ప్రకృతికి సహకరించే అంచులు 


--((*))--

ఉన్నదిలే

ఆలోచన అనంతమై వేదిస్తూ ఉన్నదిలే
నటనలో అభినయం ప్రకటిస్తూ ఉన్నదిలే


శృంగారాన మోహముతో కళలన్నీ చూపునులే
తాపముతో, పౌరుషంతో, పరవశంతో ఉన్నదిలే


మొఖముపై కమ్ముకొనే కురుల గుసగుసలే
కురువిప్పే తమకంతో ఊరిస్తూ ఉన్నదిలే


చీకటిలో తారలా వెన్నెలను కురిపించునులే
తమాయించే విరహంతో తపిస్తూ ఉన్నదిలే


కర్కసమైన హృదయంలో కరుణ ఉందిలే
మౌన సంభాషణలతో భావాలాతో ఉన్నదిలే


మయూరాల ఎదురుచూపులకు పసందులే
ప్రాంతమంతా తళుకు బెలుకులతో ఉన్నదిలే


మమకారం పంచుతూ మనసు అందించునులే
ప్రేమ లహరి తీరానికి చేర్చుటకు వయసు ఉన్నదిలే

--((*))--


* (ఈ లోకం ) 

వేకువ లెన్నో వచ్చును
చీకటి లెన్నో  మారును
వేకువ చీకటి  లోకాన
కష్టసుఖాలు కాక ఏముండును

మాటలు వినిపించును
మాయలు కప్పి వేయును
మాయ మాటలు నమ్మటం
కాక ఈ లోకం లో ఏముండును

సత్యము పలికే వాడును
నిత్యము తిరిగే వాడును    
నిత్య సత్యాలు తెలియుట
కాక ఈ జగతిలో ఏముండును

భావముతో వ్యక్త పరుస్తాను
రాగముతో త్రుప్తి పరుస్తాను
రాగ భావములు మించినవి
ఈ యుగములో ఏముండును

పతు లంతా శ్రమల తోను
సతు లంతా మాటలతోను
సతీ పతులంతా కలియుట కాక
ఈ ప్రేమలోకంలో మరి ఏముండును        

సృష్టి యంత తల్లి దగును
పోషణంతా తండ్రి దగును
తల్లి తండ్రుల సేవ కాక
ఈ ప్రపంచములో ఏముండును  

సృష్టికి మూల ఒకటుండును
లయ కారకుడు వేరొకడుండును
స్థితి ఆధార భూతములే కాక
ఈ కలియుగంలో మరి ఏ ముండును

--((*))-- 


*  (ఈ లోకం -2)

వెన్నెల కురియు చుండును
మల్లెలు విరియు చుండును
ప్రేమలు పెరుగు చుండును
అయిన కల్లోలాలు రాకమానవు

దేహము శ్వాసకు బ్రతుకును
మోహము ప్రేమకు పెరుగును
స్నేహము చరిత్ర  తెలుపును
అయిన దేహానికి రోగాలు రాకమానవు

వేదము ధర్మము తెలుపును
జూదము మనసు చరచును
వాదము మనిషిని మార్చును
మానవులకు వాదాలు రాక మానవు

మృగాలు అడవి యందుండును
రోగాలు ప్రాణులకు వచ్చును
త్యాగాలు మనుష్యులు చేయను
అయినా మానవ మృగాలు రాక మానవు

మనరణం ఎప్పుడూ అనివార్యం
మార్పులు ఎప్పుడూ అనివార్యం
తీర్పులు ఎప్పుడూ శిరోధార్యం   
అయిన ప్రాణుల మారణాలు రాక మానవు

భాధ్యత పెద్దరికం నిలుపు
మద్యము బీదరికం మలుపు
సాద్యము మధ్యరకం మెరుపు
అయిన పెద్దరికాలు మారక మానవు  
 --((*))--