26, మార్చి 2022, శనివారం

నాటిక


 మే మే -- మే మే (చిన్నపిల్లల నాటిక )

చిన్న-- నాటిక (రచయిత మల్లాప్రగడ రామకృష్ణ )  

పాత్రలు -- పాత్రధారులు 

తాత -- పేడ్డ వయస్సులో నున్న వ్యక్తి 

బాస్ తండ్రి -- మధ్యవయస్సు 

పాపేర బాయ్ : మధ్య వయస్సు 

ఇక చదవండి -- మీఅభిప్రాయం తెలపండి 

*****

బాయ్ : ఏమిటీ నీవు పాపర్ చదువు తావా, లేదండీ ఆకలేస్తే తిద్దామని తెచ్చా

బాస్ : చిన్నాపెద్ద లేకుండా ఏమిటి ఆ వెటకారం

బాయ్ :వెటకారం కాదండీ మీ మీద నాకున్న మమకారం

బాస్ : మరి చక్కగా మాట్లాడొచ్చు గా

బాయ్ : నేను వార్తలు చెపుతా, మీకు కోపం వేస్తే ముక్కలు చేసి అతికించ 

           మంటారు కదా 

బాస్ : నిన్ను చూస్తే కాపీ కొట్టే వానిగా కనిపిస్తున్నానా, బర్రెలాగ మోత్తం తినేదాకా 

          ఊరుకుండే వాన్ని కాను

బాయ్ : అది నాకు తెలుసండి అందుకే వెళ్ళొస్తా, 

బాస్ : పాపర్ తీసికొనివెళ్ళావే 

బాయ్ : పరుగెత్తుతూ వచ్చి తీసుకెళతాడు పేపర్ మీద ఉన్న కల్లజోడు 

            కృందపడేసి వెళ్ళాడు 

బాస్ : ఓరి టింగు రంగడా, మాటలపోకిరి, నా కళ్ళ జోడు పగలు గొట్టావురా...

బాయ్ : మరలా వచ్చి ఆ పగిలింది,  నాకల్లజోడండీ మీది కాదు,  

                                                                    సశేషం 

బాస్ : నాదగ్గర నీకళ్ళజోడు పగిలిందికదా, నాదనుకొని కోపం తెచ్చుకున్నా,  ఇదిగో 

          ఈ 500 తీసుకొని బాగు చేయించుకో అంటాడు

బాయ్ : డబ్బు తీసుకొని వెళతాడు

            (అయ్యగారి బలహీనత తెలిసిన పాపరోడు)


బాస్ ::  ఎవరు మీరు?, ఈ వేషం మేమిటి?

బాయ్స్: ఆ మేమం డీ

బాస్ :    ఆ మీరే 


బాయ్స్: మేమండీ, బాల్యంలో బాలకులం, యవ్వనంలో యువకులం, 

             వృద్ధాప్యంలో పండుటాకులం, రాలిపోయే ఎండుటాకులం..!


బాస్ : మీ బుఱేమి తిరిగిందా,  నేనడిగిందేమిటి, మీరు చెప్పేదేమిటి


బాయ్స్: మమ్ము తక్కువ చేసి మాట్లాడకండీ,  మేము  ఎవరూ లేకున్న ఏకాకులం 

             కాదు,  ప్రేమలో ఉండే ప్రేమికులం కాదు, పెళ్ళైతే సంసారికులంతెలుసా       

             కాకుంటే బ్రహ్మచారికులం మేము

బాస్ :  సరే వచ్చిన పనేంటి? చెప్పండి ?

బాయ్స్: అది మాత్రం అడుగ కుండీ, అది మీరే కొనుక్కోవాలి


బాస్ : చెప్పకపోతే వెళ్లి పోండి, ఇక్కడినుంచి,  కొంచెం కోపం తగ్గించు కోండి,  

          మేము రక్షిస్తే రక్షకులం, మేము భక్షిస్తే భక్షకులం,మేము దేశ సైనికులం

          మేము సమాజ సేవకులం, మీకు ఆత్మీయులం,  సహాయం చేసే 

          మనుషులం


తాత : ఎవరండీ వచ్చింది అని లోపలనుంచి ఒకే అరుపు

బాస్ : ఆ వచ్చిన వారు

తాత : ఆ వచ్చిన వారె వరురా, ( కల్ల జోడు సర్దుకుంటూ, కర్రచప్పుడు )  

          అన్నీ చెప్పాలి 

బాస్ : ఆ చెపుతా విను నాన్నా, ప్రయాణిస్తే ప్రయాణికులంటా, నిత్య వాహన 

          చోదకులంటా, యాత్రలు చేస్తే యాత్రికులంటా, మాయలు చేస్తే 

          మాంత్రికులంటా

తాత : ఏమిటి దొంగలా, యాత్రికులా, మాంత్రికులా, కంత్రీగాల్లా , వాళ్లతో మనకేమి 

          పనిరా, ఇలాంటి వారితో స్నేహం చేస్తున్నావా, పాడైపోతావ్, 

          సర్వనాశనమైపోతావ్  


బాస్ : ఏమిటి నాన్న ఆ మాటలు, అసలు వాళ్లెవరో నాకే తెలియదు,      

తాత : ఆ ఏమిటీ నీకె తెలియదా అలంటి వాల్లతో ఇంతసేపు మాట్లాడా వెందుకు  


బాస్ :మార్పు కోరే పరివర్తకులటా, వినూత్న ఔత్సాహికులటా

          కొత్త కొత్త ప్రయోగకులటా, సరికొత్త ఆవిష్కర్తకులటా

          వ్యాపారాలు చేసే వర్తకులటా, సంస్థల,సంఘాల వ్యవస్థాపకులటా

తాత :  అసలు వాళ్ళ నేందుకు పిలిచావురా 

బాస్ :  నాన్న నేను ఆన్ లైన్లో నేను కొందరిని పంపిచామన్నా 

తాత :  వారే వీరంటావా, అసలు ఏమి వ్రాసావురా  

బాస్ : నేను ఉపన్యసించె ఉపన్యాసకులు, హాస్యం పందించే విధూషకులు 

          పాడడానికి గాయకులు,సభలో ఉండే సభికులుగా ఉండే వారు కావాలన్నా 

తాత : అసలు నీకు ఇక్కడినుంచే వచ్చింది ధార్యము, ఒక పెద్ద వాడ్ని ఉన్నాడు, అడగాలని ఇంకిత జ్ఞానము లేదు, న అకష్టార్జితము అంట ని చేతుల్లో పెట్టా, నీవేమో ఏ పని చేయకుండా లుచ్చా లాగా , తిరిగి ఇలాంటివారిని సేకరిస్తున్నావా 

సాలు నీకు బుద్ధి ఉందా? ప్రజల హృయంలో ఉండాలి, వాల్లకు సేవలు చేయాలి, వాళ్ళు నిన్ను గౌరవించాలి, ఫలాని వాడి కొడుకు అనిపించాలి అదిరా రాజకీయం దుబాసీలను ఎత్తుకొని ఎన్నాళ్ళుతిరుగుతావు,  నాగరికత నేర్పిన నాగరికులం  మనము, జాతకాలు నమ్మే అమాయకులం కాదు , మూఢత్వంపోని మూర్ఖులం ..! అయినా  

బాస్ :  ఆయసం దేనికి నాన్న, నేను ఇప్పుడు ఏ తప్పు చెయ్యలేదు, అసలు 

          మనము ఎలాంటి వారమంతె 

    

         సమానత్వ సాధకులం, మతాలను గౌరవించే లౌకికులం, ఎల్లలు లేని దేశ 

         ప్రేమికులం..

          అసలు కష్టపడే కర్షకులం, నిరంతర శ్రామికులం, పరిశ్రమించే 

         పారిశ్రామికులం,  కర్మాగారాల్లోని కార్మికులం, నిజాలు చెప్తే వాస్తవికులం, 

         చెప్పకుంటే అపద్దీకులం

తాత : ఎన్నాళ్లకు నీనోట ఒక మంచి మాట విన్నా ఇంకా చెప్పు ఇంకా చెప్పు 

బాస్ : పరిపాలిస్తే పాలకులం, పాలించబడితే ఎలీకులం, వంచిస్తే వంఛకులం

         పంచుకుంటే భాగస్వామికులం, ఎదురుతిరిగితే మాకన్నా మూర్ఖులు ఎవ్వరు 

         ఉండరని నిరూపిస్తాం 

తాత : తొందర్లో మాట తప్పుతున్నావు, నీవన్న చివరి పదం తీసేయ్, మనము 

          మూర్ఖలమని నిరూపించాలా ప్రేత్యకతగా, మనం చేసే పనులు ఒకరికి 

          నచ్చవచ్చు, మరొకరికి నచ్చక పోవచ్చు            

బాయస్ : ఆపండి మీ తండ్రి కొడుకుల గోల ఇక్క కుర్రవాళ్లున్నారని వాళ్ళకి 

         ఆలోచనలున్నాయని మిలో ఒక్కరకన్నా ఉందా ఎదో సాధిచామని ఘనతగా 

         చెప్పుకుంటుంటున్నారు, అసలు మాకు ఉద్యోగాలు ఇస్తున్నారా లేదా,      

         మీరు ఇవ్వకపోతే ఇవ్వలేమని చెప్పండి, అదే విషయం మేము మీడియా 

         వారికీ తెలియపరుస్తాము అంటే అంటూ చేలు  దులిపారు 

తాత : పిలిపించావుగా ఎదో ఉద్యోగం ఇవ్వు లేదా వాళ్లకు బయటకు పోయి కారు      

         కూతల కూస్తారు, ఆయినా వారు చదివింది గురుకులం, అభ్యసిస్తే 

        అభ్యాసకులం, బోధిస్తే బోధకులం, వృత్తిరీత్యా అధ్యాపకులం, పత్రికల 

        పాఠకులం, నేర్పించే శిక్షకులం అంటూ నీవెంటే ఉంటారు,  మోసం మాత్రం 

        చెయ్యకు, చదివింది గురుకులం, అభ్యసిస్తే అభ్యాసకులం, బోధిస్తే 

        బోధకులం,  వృత్తిరీత్యా అధ్యాపకులం, పత్రికల పాఠకులం, నేర్పించే 

        శిక్షకులం అంటూ నీవెంటే ఉంటారు,  మోసం మాత్రం చెయ్యకు,  

 

ఇది అరబిక్ బాష లో రాసిన ఒక అందమైన సందేశం, దీన్ని తెలుగులో ఎవరో వ్రాసారు నేను చదివింది తెలుపుతాను వినండి. 

నాన్న ఆ సోది మనకిప్పుడు అవసరమా 

సోదిని తక్కువ అంచనా వేయుట తప్పు వాక్కులో వున్న మహాత్య్మ ఎవరికీ తెలుసు కొన్ని వెంటనే జరుగుతాయి అది కూర్తుంచుకో, తొండారి పది మాట్లాడకు అర్థమైందా 

అర్ధమైంది నాన్న చెప్పు 

వినటానికి కూడా మనిషిలో ఓర్పు ఉండాలి, నిజానిజాలు గ్రహించాలి, ఎంతవరకు మనకు సరిపడతాయో అనుకరించాలి ఆపదానివి మరచిపోవాలి            

అసలు విషయానికి వద్దాం 

జీవితమంటే ఏమిటి? 

జీవితాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే నీవు ఈ3ప్రాంతాలకు వెళ్ళాలి 

1.ఆసుపత్రికి

ఆరోగ్యానికి మించినది ఏదీ లేదని ఆసుపత్రిలో నీకు అర్థమౌతుంది, నిజమైన బ్రతుకేమిటో  

2.జైలుకు 

జైల్లోకి వెళితే స్వేచ్ఛ కంటే మించినది ఏదీ లేదని నీవు గ్రహించగలుగుతావు.

3.స్మశానవాటికకు 

ఈ జీవితం ఏమాత్రం విలువలెనటువంటిదని స్మశానానికి వెళితే నీకు తెలుస్తుంది. ఈరోజు మనం నడుస్తున్న ఈ భూమియే రేపు మన పైకప్పు ఔతుందని తెలుసుకుంటావు.

చేదు నిజం; 'మనం వచ్చేటప్పుడు ఏమీ లేకుండా నే వచ్చాము అలాగే పోయేటప్పుడు కూడా ఏమీ లేకుండానే పోతాము,'అందువల్ల అణుకువగా వినయంగా,సర్వదా సర్వత్రా ఆ భగవంతుడికి కృతజ్ఞతతో వుందాము.

ఒక ధనవంతుడు కిటికీ లోంచి బయటికి తొంగి చూసాడు,ఒక నిరుపేద చెత్త కుండిలోంచి ఏరుకుంటు ఉండటాన్ని గమనించి, అతడన్నాడు"భగవంతుడా నేను పేద వాణ్ణి కానందుకు నీకు కృతజ్ఞతలు "అని పేద వాడు చుట్టూ చూస్తూ నగ్నంగాఒకడు వీధిలో పిచ్చిచేస్టలు చేస్తూ ఉండటం గమనించి "ఓ భగవంతుడా నేను పిచ్చివాణ్ణి కానందుకు ఎంతో కృతజ్ఞుడను "అని అన్నాడు.

పిచ్చివాడు అలా ముందుకు చూస్తూ  అంబులెన్స్ లో ఒక రోగగ్రస్తుడిని తీసుకుని వెళ్తూవుండటం గమనించి "భగవంతుడా నేను రోగగ్రస్తుడిని కానందుకు నీకెంతో కృతజ్ఞుడిని"అని అన్నాడు

తరువాత ఆసుపత్రిలోఒక రోగి ట్రాలీలో ఒక శవాన్ని మార్చురీ లోనికి తీసుకొని పోతూ ఉండటాన్ని చూసి "భగవంతుడా నేను ఇంకా బ్రతికే ఉన్నందుకు మీకెంతో కృతజ్ఞుడిని "అని అన్నాడు

ఒక్క చనిపోయిన వాడు మాత్రమే భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేయలేడు.

నీకు ఈ జీవితాన్ని కానుకగా ఇచ్చినందుకు ఇంతవరకు నీకు దీవెనలు అందిస్తున్నందుకు భగవంతుడికి నీవెందుకు కృతజ్ఞతలు తెలియజేయలేవు; 

ఇదేలోకం ఎవరికివారు నాకష్టం అని వాదించే లోకం ఎప్పుడు మారుతుంది అంటూ తాతగారు లోపలకు వెళ్లరు. 

అంతా వింటూ వున్నారు.   

 కధ చెప్పి  లోపలికెళ్ళాడు తాతగారు) 

బాస్ : తుఫాన్ వెలిసిన ప్రశాంతత గా ఉంది, మీకు ఉద్యోగాలు ఇస్తున్నాను మా 

       కంపెనీలో ఎకౌ0ట్స్ అసిస్టెంసుగా    

బాయస్ : ధన్యవాదాలు అంటూ బయటకు చేరారు వారు, వీరు

బాస్ : ఉండబట్టలేక టివి పెట్టాడు

          అపుడే జండాలు పట్టుకొని పటపడుతున్నారు కొందరు 

      

మేమే కొందరితో ఉంటే సామాజీకులం

మేమే అందరితో ఉంటే అనేకులం

మేమే ఫలానోల్ల కుటుంభీకులం

మేమే ఆ వంశ సంబంధీకులం


మేమే ధనముంటే దనికులం 

మేమే లేకుంటే బీదకులం

మేమే దేవుణ్ణి నమ్మితే ఆస్తికులం

మేమే నమ్మకుంటే నాస్తికులం

 

మేమే కొందరికి పూర్వీకులం

 మేమే  మరికొందరికి సమకాలికులం

 మేమే ప్రస్తుత వర్తమానికులం

 మేమే కొందరికి స్ఫూర్తిదాయకులం 

 మేమే మరికొందరికి మార్గదర్శకులం


మేమే..

మేమే..

         

మొత్తానికి మేమే 

బాల్యంలో చిగురుటాకులం

కుర్రతనంలో బాకులం

యవ్వనంలో చాకులం

మధ్య వయస్సులో మేకులం

చరమాంకంలో రేకులం

రాలిపోయే ఆకులం 


మేమే మాతృభాష తెలుగు రక్షకులం 

మేమే భరత జాతి వంశీకులం..

మేమే భావి భారత రథసారథికులం...

మేమే తెలుగు జాతి గౌరవాన్ని నిలిపేవాళ్ళం 


తాత గారు పాట వింటు నిద్దర్లోకి జారిపోయారు 

 

__(())___

    


12, మార్చి 2022, శనివారం

అష్టావక్ర గీత

 






 దయచేసి పైనది టిక్ చేసి వినండి 


'అష్టావక్రగీత' 18వ ప్రకరణ (606)_
🕉🌞🌎🌙🌟🚩

కర్తృత్వం లేకపోతే నిరంతరం స్వస్థ చిత్తులమై ఉంటాము !!

స్వస్వరూపం తెలుసుకొని అందులోనే పరవశించే జ్ఞాని మనసు ఇక విక్షేపము కాదు. అదే జీవితానికి నిజమైన ధన్యత. ఏ స్వస్థితి కోసం ధ్యాన సాధనతో సమాధిని పొందుతారో అది విచారం చేత పొందిన వానికి ధ్యాన, సమాధులతో పనిలేదు. ఆ కారణంగా అతడు సాధన విషయంలో జడుడిగా కనిపించినా, అతను చేయు కార్యాలు లౌకిక ఫలాపేక్షతో చేసేవి కావు. కనుక జడత్వం అతనికి ఆపాదించలేము. సృష్టి నియమానుసారం అతనికి పాండిత్యం ఉన్నా ఆ గుర్తింపు అతని స్వస్వరూప జ్ఞానం ముందు అది అత్యల్పం అవుతుంది. కర్మానుసారంగా ప్రవర్తిస్తున్నా... అతనిలో లేశమాత్రం కూడా కర్తృత్వంలేని కారణంగా నిరంతరం స్వస్థ చిత్తుడై ఉంటాడు !

🕉🌞🌎🌙🌟🚩
'అష్టావక్రగీత' 18వ ప్రకరణ (607)
🕉🌞🌎🌙🌟🚩

సమభావం ఉన్న చోట ద్వంద్వానికి తావు ఉండదు !!

నిత్య తృప్తుడుగా ఉన్న జ్ఞానికి ప్రాప్తించిన విషయాలపైన, ప్రాప్తించని విషయాలపైనా మనసుకు కొలతలు ఉండవు. సంపూర్ణమైన సంతుష్టిలో ఉన్న మనసుకు చేసిన కార్యాల విషయమై గానీ, చేయని కార్యాల విషయంలో గానీ... అదే సంతుష్టితో ఉంటుంది. జ్ఞాని కర్మలను చేస్తాడుగానీ చేసిన కర్మలనుగాని, చేయని కర్మలను గాని స్మరించడు. జ్ఞానికి  నిందాస్తుతులపై సంతోష పరితాపాలు ఉండవు. జీవన్మరణాలపై భావోద్వేగాలు ఉండవు. చిత్తము పూర్తిగా ఉపశమించి ఉంటుంది కనుక జనసమూహం నచ్చక అడవిలోకి, అడవిలోని ఒంటరితనం నచ్చక జనసంచారంలోకి పరుగులు పెట్టడు. సమభావం ఉన్న చోట ద్వంద్వానికి తావు ఉండదు. జ్ఞాని జీవితంలో జరుగు ప్రతీదీ మనకు బోధగానే ఉంటుంది !

🕉🌞🌎🌙🌟🚩

అష్టావక్రగీత' 18వ ప్రకరణ (609)_
🕉🌞🌎🌙🌟🚩

కారణమేమిటో అర్ధమయ్యే కొద్ది భగవంతుడంటే ఏమిటో తెలుస్తుంది !!

_*విచారణ అంటే కనిపించే కార్యంతోపాటు, దాని వెనుక ఉన్న కారణాన్ని కూడా పరిశీలించడమే. మన శ్వాసను మనం సాధారణంగా భావిస్తాం. అసలా శ్వాస నిరంతరాయంగా జరగడానికి ఊపిరితిత్తులు కొట్టుకోవడం కారణం. ఊపిరితిత్తులు అలా పనిచేయడానికి మనలోని ప్రాణశక్తి కారణం. ఆ ప్రాణశక్తిని అందిస్తున్నది ఎవరు. మనం తినే ఆహారం కూడా గొంతు దాటేవరకే మన ప్రయత్నం, ప్రమేయం ఉంటాయి. ఆ తర్వాత జరిగే ఏ క్రియలోను మన ప్రయత్నం ఏదీ ఉండదు. అదంతా ఎవరు నిర్వర్తిస్తున్నారు. విత్తనం నాటటం మన ప్రయత్నం ఆ తర్వాత మొలక, మొక్క ఏదీ మన ప్రయత్నంతో జరగదు. ఇలా మనలోనూ, మనచుట్టూ జరిగే కార్యాలవెనుక ఉన్న కారణమేమిటో అర్ధమయ్యే కొద్ది భగవంతుడంటే ఏమిటో మనకు తెలుస్తుంది.  

 🕉🌞🌎🌙🌟🚩
అష్టావక్రగీత' 18వ ప్రకరణ (610)_
🕉🌞🌎🌙🌟🚩

వ్యక్తావ్యక్తాలు రెండూ ఆత్మలో భాగమే !

ప్రతికార్యం వెనుక కారణం అర్ధమయ్యే కొద్ది చెరకుగడలో ఆసాంతం వ్యాపించిన తియ్యదనంలా దైవం ఈ సృష్టి అంతటా వెలుపలా, లోపల ఎలా వ్యక్తమవుతున్నాడో, ఎలా నర్తిస్తున్నాడో తెలుస్తుంది. ఆత్మ అంటే అదే ! అంతర్గతంగా ఉండే అవ్యక్త శక్తిమాత్రమే కాదు. వ్యక్తావ్యక్తాలు రెండూ ఆత్మలో భాగమే !! ఈ సృష్టిలో ఆత్మకాని వస్తువు, ఆత్మలేని స్థలంలేదు. పగటిపూట భౌతికంగా ఇంట్లో ఉండే వెలుగుకు బయట ఉన్న వెలుగే ఎలా కారణం అవుతుందో... అంతరంగంలో మనలోని వెలుగే బయట వెలుగుగా మారి మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని అనుభవించడానికి కారణమవుతుంది !

🕉🌞🌎🌙🌟🚩

సత్యం అనుభవమైతే.. జీవితం స్వప్నానుభవంలా ఉంటుంది !!


తాడు పాములా కనిపించిన తర్వాత అది పాము అన్న భావంతోనే ఉంటాము. నిశితంగా పరిశీలించి అది తాడు అని తెలిస్తేగానీ పాము అన్న భావం కేవలం భ్రాంతి మాత్రమే అని తెలుస్తుంది. మనం గుర్తించిన భ్రాంతి ఇక మనలో ఇమడలేదు. పలాయనం చిత్తగిస్తుంది. అలాగే ఇప్పుడు కనిపించే ఈ ప్రపంచం సత్యమని, మన భావాలు, అనుభవాలు సత్యమని అనుకుంటున్నాం. విచారణతో సత్యాసత్య వివేచన జరిగితే గాఢనిద్రలో మచ్చుకైనా కనిపించని వాటి వాస్తవికత ఎంతో  జాగృతిలో కూడా తెలుస్తుంది. సత్యం అర్ధమైనంత మాత్రాన ప్రపంచాన్ని తృణీకరించం. అతి విలువ, అనవసర ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటారు. స్వప్నం సత్యం కాకపోయినా స్వప్న అందులోని అనుభవాలు తప్పనట్లే సత్యంకాని ఈ ప్రపంచ జీవనంలోనూ తత్కాల అనుభవాలు ఉంటూనే ఉంటాయి. కానీ నిద్ర లేవగానే స్వప్నాల గురించి ఎలాగైతే తీవ్రంగా పరిగణించి జ్ఞాపకం పెట్టుకోమో, అలాగే సత్యం అర్థమైన మనసు నిత్యజీవితంలోని అనుభవాలకు కూడా తీవ్రమైనవిగా తీసుకొని గుర్తుంచుకోదు !


🕉🌞🌎🌙🌟🚩

ఓం నమః శివాయ:

12)అష్టావక్ర గీత

1-అధ్యాయం - ఆత్మ సాక్షిగా - అందరిలో:-

మహాపండితుడు, విజ్ఞాని, రాజర్షి, అయిన జనకుడు తన సందేహాలను, సమస్యలను ఆత్మనిష్ఠుడైన అష్టావక్ర మునీంద్రుని ముందుంచి తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాడు.

భగవంతుడన్నా, సత్యమన్నా, ఆత్మ అన్నా, ఏ పేరుతో పిలిచినా ఉన్నది ఒకే ఒక సత్యం. అదే ఇంద్రజాల సమానమయిన తన మాయా కల్పిత జ్ఞానంలో తానే చిక్కుకున్నట్లు, దేహ మనో బుద్ధులతో కూడిన జీవిగా, తాను చూస్తున్నా ననుకునే ప్రపంచంలో వ్యవహరిస్తున్నట్టు గా, మనస్సుతో భావిస్తున్నది. తనలో అసంఖ్యాకములయిన రాగద్వేషాలను, నిశ్చయానిశ్చయా లను, ఆశా నిరాశలను, అనుభవిస్తూ తనదైన ప్రపంచంలో మానసికానుభవం పొందుతూ ఉన్నట్టుగా జీవుడు భావిస్తున్నాడు.

 ఈ కర్తృత్వ భావన కారణంగా తత్ఫలితమయిన జన్మ-కర్మచక్రంలో భ్రమిస్తున్నట్లుగా భ్రమపడుతున్నాడు.ఈ బాధలలో ఉండిపోకుండా బయటపడడానికి, తనకూ, జగత్తుకూ సృష్టికర్త అయిన జగదీశ్వరుని, ప్రార్థించాలనే కోరికతో ఏకాగ్రత పెరుగుతున్నది. ఈ ఏకాగ్రత, ఈ భావనాబలం తన పరిస్థితులకు అనుకూలంగా మార్చి సరైన మార్గాన్ని చూపి సత్యమైన జ్ఞానాన్ని అందిస్తుంది.

ఏ బుద్ధితో తానుగా, జగత్తుగా జగదీశ్వరుడుగా భావిస్తూ, భ్రమపడుతూ భ్రమిస్తున్నాడో అదే బుద్ధితో ఉన్నది ఒకేఒక సత్యమనీ, అదే తాననీ, కనిపిస్తున్నట్టున్న దంతా భ్రమ అనీ తెలుసుకోవడంతో భ్రమాజన్య భావనా చక్రంలో భ్రమణం సమాప్త మవుతున్నది. అజ్ఞానం నశించి జ్ఞానం మిగిలిపోతున్నది. తిమిరం పోయింది, తేజస్సు మిగిలింది. జ్ఞానజ్యోతి నిశ్చలంగా, ఏకంగా, అద్వితీయంగా, నిత్యంగా తానుగా ప్రకాశిస్తున్నది.

భ్రమాజన్య జ్ఞానంతో తాదాత్మ్యం చెందినపుడు జీవుడుగా భావించిన జీవాత్మ ఏదైతే ఉందో అదే ఆత్మ, అదే సత్యం, తత్వజ్ఞానం సహాయంతో, సాక్షిగా నిలబడి, తన స్వయంజ్యోతిగా ఆనందంగా, కేవలంగా ఉంది, ఉంటున్నది.

శ్రీ కృష్ణభగవానుడు స్వయంగా అర్జునుడికి బోధించిన ఉపదేశం భగవధ్గీత. అప్పటి వరకూ యుద్ధం పట్ల నిరాసక్తత ప్రదర్శించిన పార్థుడు(అర్జునుడు) భగవానుడు ఉపదేశంతో కార్యోన్ముఖుడై కురుక్షేత్రంలో అడుగుపెట్టాడు.

భగవద్గీత గురించి తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. శ్రీ కృష్ణభగవానుడు స్వయంగా అర్జునుడికి బోధించిన ఉపదేశం గీత. దీంతోపాటు అష్టావక్ర గీత కూడా వేదాంతపరంగా చాలా కీలకమైంది. అయితే, దీని గురించి అతి తక్కువ మందికి తెలుసు. ఒకసారి శ్రీ రామకృష్ణ పరమహంస తన శిష్యుడైన స్వామి వివేకానందుడికి అష్టావక్ర గీతను అందజేసి, అందులోని కొన్ని శ్లోకాలను బెంగాలీలోకి తర్జుమా చేయమన్నారు.

 దీనివల్ల అద్వైత సిద్ధాంతం గురించి నరేంద్రుడికి తెలుస్తుందని శ్రీ రామకృష్ణుల భావన. ఈ విషయాన్ని 1950లో స్వామి నిత్యస్వరూపానంద రాసిన రామకృష్ణ పరమహంస చరిత్రలో ప్రస్తావించారు.

ఇక, అష్టావక్ర గీతను ఎవరు రాశారు అనే విషయానికి వస్తే ముందుగా ఆయన గురించి తెలుసుకోవాలి. అష్టావక్రుడు గురించి మహాభారతంలోని అరణ్యపర్వంలో పేర్కొన్నారు. ఆయన ఒక ఋషి. అష్ట అంటే ఎనిమిది, వక్ర అంటే వంకర అని అర్థం. శరీరంలో ఎనిమిది వంకరలు ఉన్నవాడు కాబట్టి ఆయనకు అష్టావక్రుడు అనే పేరు వచ్చింది.

ఉద్దాలకుడనే ఋషి వేదవేదాంగాలను తన శిష్యులచే అభ్యాసం చేయించేవాడు. వారి వేదఘోషతో అరణ్యమంతా పులకించిపోయేది. అయితే, అయనకు కహోదుడనే శిష్యుడు అంటే ప్రత్యేక అభిమానం. కాలక్రమంలో తన కుమార్తె సుజాతను కహోదునకు ఇచ్చి వివాహం చేశాడు ఉద్దాలకుడు.

సుజాత గర్భవతిగా ఉన్నప్పుడు ఒక రోజు కహోదకుడు వేదాలను మననం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన ఎనిమిదిసార్లు తప్పుగా ఉచ్చరించారు. అయితే, ఈ వేదాలను వింటున్న గర్భంలో ఉన్న శిశువు.. తన తండ్రికి ‘మీరు తప్పుగా ఉచ్ఛరిస్తున్నారు’ అని తెలిపాడు.

గర్భంలోని శిశువు తన లోపాన్ని ఎత్తిచూపడంతో ఆగ్రహించిన కహోదకుడి ‘నేను ఎనిమిది చోట్ల తప్పు చదివానన్నావు కాబట్టి నువ్వు అష్ట వంకర్లతో జన్మిస్తావు’ అని శపించాడు. అలా తండ్రి శాపం కారణంగా అష్టావక్రుడిగా జన్మించాడు. ఒకసారి విదీశ రాజ్యంలో జరిగిన పండిత సభకు వెళ్లిన కహోదకుడు అక్కడ జరిగిన ఒక సంవాదంలో వందినుడు అనే పండితుడి చేతిలో ఓడిపోయాడు. దీంతో రాజు ఆయనను చెరశాలలో బంధించాడు. అనంతరం 12 ఏళ్ల వయసులో అష్టావక్రుడు తన తండ్రిని విడిపించడానికి విదీశకు వెళ్లి అక్కడి పండితులను ఓడించాడు.

 కహోదకుడ్ని బంధ విముక్తున్ని చేసి, ఆ తర్వాత సామంగ నదిలో స్నానం చేసి తన వైకల్యాన్ని పోగొట్టుకున్నాడు.

అనంతరం దేశాటన ప్రారంభించి, మళ్లీ విదీశ చేరుకుని రాజు జనకుడి చేత అనేక సత్కారాలు పొందాడు. ఈ సందర్భంలో అష్టావక్రుడు చేసిన బోధలనే అష్టావక్ర గీత అంటారు. దీనిలో మొత్తం 20 అధ్యాయాలు ఉన్నాయి. అష్టావక్ర గీతలో అద్వైత సిద్ధాంత పోకడలు స్పష్టంగా కనిపిస్తాయి. దీనిని ఎప్పుడు సంకలనం చేశారనే విషయాన్ని చెప్పడం చాలా కష్టం. కానీ, భగవద్గీత తర్వాతే దీనిని రచించినట్టు భావిస్తారు. సంస్కృతంలో ఉన్న గీతను అనేక భారతీయ భాషల్లోకి అనువాదం చేశారు.

అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన అతి క్లిష్టమైన భావాలను అష్టావక్రగీత సున్నితంగా స్పృశిస్తుంది. సనాతన ధర్మంలో ఎనిమిది అంకెకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అంగాలను (కాళ్లు, చేతులు, మోకాళ్లు, ఛాతి, నుదురు) ఈ సంఖ్య సూచిస్తుంది. ఇవి సక్రమంగా ఉంటేనే భగవంతుడికి సాష్టాంగ నమస్కారము చేయగలము.

*****

*🧘‍♂️ 49 అష్టావక్ర గీత🧘‍♀️*

*అధ్యాయం - 3*

*ఆత్మ అందరిలో - అందరూ ఆత్మలో*

'అహంబ్రహ్మాస్మి" అన్న ఉపనిషద్ మహావాక్యమే అసలైన నిత్య సత్యం, అద్వయమైన ఆత్మలో నిష్ఠ కలిగిన మనిషికి ఈ కనిపించే ప్రపంచమంతా అర్థరహితమూ ఆధారశూన్యమూ అయిన భ్రమగా నిశ్చయంగా తెలుస్తుంది.

 మృత్యుభయమూ, రాగబంధమూ, కోరికల తీవ్రతలో జనించే అలసటా అసంతృప్తి అన్నీకూడా ఆత్మజ్ఞానంతో అదృశ్యమయిపోతాయి. అటువంటి మహాత్ముని ద్వారా ఆత్మప్రకాశం బహిర్గతమవుతూ దివ్య సౌందర్యాన్ని అద్భుత ప్రకాశాన్ని అందిస్తుంది అందరికీ.

జ్ఞాని అయిన జనకుడిని ఆత్మనిష్ఠుడయిన అష్టావక్రుడు పరీక్షించదలచిన హేళనాస్వరంతో ప్రశ్నలడగడాన్ని ఈ అధ్యాయంలో చూస్తాం.

 మనస్సుకు అతీతంగా నిలవగలిగి, ఆత్మానుభవాన్ని పొంది, దృశ్యప్రపంచమంతా నామరూపాత్మకమనీ మిథ్య అని గుర్తించిన జనకుడు ఇంకా తన ధర్మాన్ని ఎందుకు విడిచి పెట్టలేదు?

రాజరికపు హోదాలూ, దర్బారు మర్యాదలూ, కట్టుబాట్లూ, నియమాలూ, రాజ్యపాలనలోని బరువు బాధ్యతలూ, కష్ట సుఖాలూ, శాసననిర్మాణాలూ పాలనలూ ఇవన్నీ ఏ రాజూ తప్పించుకో లేనటువంటివి?

 అయితే ఆత్మదృష్ట్యా ఇవన్నీ భ్రాంతితో కూడిన కల్పనలే. కాబట్టి, ఇవన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నాడంటే, ఆత్మపరంగా, "అజ్ఞానం" మిగిలి ఉందని అనుకోవలసి ఉంటుంది. 

ఇటువంటి తర్కంతో అష్టావక్రులు తన శిష్యుని జ్ఞాననిష్ఠను, అనుభవజ్ఞానాన్ని పరీక్షిస్తున్నారు. దీని తరువాత అధ్యాయంలో జనకరాజర్షి తన మీద ఆరోపింపబడిన వాటన్నిటికీ అర్హమయిన సమాధానాన్నిస్తున్నారు.

 అద్వైతాన్ని అధ్యయనం చేసే సాధకులకు ఈ రెండు అధ్యాయాలూ సంయుక్తంగా ఎంతో ఉత్సాహాన్ని స్ఫూర్తినీ ఇస్తాయనడములో సందేహం లేదు.

జనకుడు పూర్తిగా ఆత్మనిష్ఠుడు కాకపోతే.

అష్టావక్రుని ములుకుల వంటి ప్రశ్నలు హేళనతో కూడిన మాటలు జనకుని అహంకారాన్ని తీవ్రంగా గాయపరచి తీరాలి.

...........


*🧘‍♂️ 50 అష్టావక్ర గీత 


*అధ్యాయం - 3*

*ఆత్మ అందరిలో - అందరూ ఆత్మలో* 


 *శ్లోకం 01*


*అష్టావక్ర ఉవాచ ॥*


*అవినాశినమాత్మానమేకం విజ్ఞాయ తత్త్వతః ।*

*తవాత్మజ్ఞానస్య ధీరస్య కథమర్థార్జనే రతిః ॥ 3-1 ॥*


అష్టావక్ర ఉవాచ ॥

అవినాశిన మాత్మనం ఏకం విజ్ఞాయ తత్త్వతః ।

తవాత్మజ్ఞానస్య ధీరస్య కథమర్థార్జనే రతిః ॥ 1 ॥



*अष्टावक्र उवाच ॥*


*अविनाशिनमात्मानमेकं विज्ञाय तत्त्वतः ।*

*तवात्मज्ञानस्य धीरस्य कथमर्थार्जने रतिः ॥ ३-१ ॥*



*asht’aavakra uvaacha ॥*


*avinaashinamaatmaanamekam vijnyaaya tattvatah’ ।*


*tavaatmajnyaanasya dheerasya kathamarthaarjane ratih’ ॥ 3-1 ॥*


*టీకా*


 ఏకం = అద్వయమైన, అవినాశనం = నాశరహితమైనట్టి, ఆత్మానం ఆత్మను, తత్త్వతః = యథార్థముగా, విజ్ఞాయ = తెలుసుకొని, ధీరస్య = ధీరుడైనట్టియు, ఆత్మజ్ఞస్య = ఆత్మజ్ఞానుడైనట్టియు, తవ = నీకు, అర్థార్జనే = అర్థార్జనమునందు, కథం ఎట్లు, రతిః= ఆసక్తి, (భవతి = కలుగుచున్నది).


*వివరణ:-*

అక్షరమూ ఏకమూ అయిన ఆత్మను తెలుసుకున్న ధీరుడవూ జ్ఞానివీ అయిన నీవు, ఈ సంపదలను సంపాదించాలని ఇంకా ఎందుకు కోరుచున్నావు?

*తాత్పర్యం:-*

ఆత్మానుభవం పొందిన తరువాత కూడా జనకుడు తన రాజ్యపాలన యథాప్రకారంగా కొనసాగించేడు. హేళనధ్వనించే ప్రశ్నలతో ఈ శ్లోకాలలో అష్టావకుడు జనకుని పరీక్షిస్తున్నాడు.

 అద్వయమైన ఆత్మానుభవాన్ని తాను పొందేనని చెప్తూనే, బాహ్యంగా ద్వైతమయమైన ప్రపంచంలో సమర్థతతో కర్మలను ఆచరిస్తున్నాడు.

 విదేహాధిపతి నాశరహితమూ, నిత్యసత్యమూ, ఏకమూ అయిన ఆత్మని తెలుసుకొని కూడా, బాహ్య ప్రపంచంలో తన సామాజిక రాజకీయ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ, ధనాన్ని సంపాదిస్తూ వెచ్చిస్తూ నిరంతర కర్మ శీలిగా ఎలా ఉంటున్నాడు జనకుడు?

---

* 51 అష్టావక్ర గీత*

*అధ్యాయం - 3*

*ఆత్మ అందరిలో - అందరూ ఆత్మలో* 

 *శ్లోకం 02:-*

*ఆత్మాజ్ఞానాదహో ప్రీతిర్విషయభ్రమగోచరే ।*

*శుక్తేరజ్ఞానతో లోభో యథా రజతవిభ్రమే ॥ 3-2 ॥*

ఆత్మాజ్ఞానాదహో ప్రీతిః విషయ భ్రమగోచరే ।

శుక్తే రజ్ఞానతో లోభోః యథా రజతవిభ్రమే ॥ 2 ॥

*आत्माज्ञानादहो प्रीतिर्विषयभ्रमगोचरे ।*

*शुक्तेरज्ञानतो लोभो यथा रजतविभ्रमे ॥ ३-२ ॥*

*aatmaajnyaanaadaho preetirvishayabhramagochare ।*

*shukterajnyaanato lobho yathaa rajatavibhrame ॥ 3-2 ॥*

*టీకా*

యథా = ఏప్రకారము, శుక్తేః = ముత్యపు చిప్ప యొక్క, అజ్ఞానతః = జ్ఞానం లేకపోవుటవలన, రజతభ్రమే = వెండియనెడి భ్రాంతియందు, లోభః = లుబ్ధత గలుగు చున్నదో, తథా=అట్లే, ఆత్మాజ్ఞానాత్=ఆత్మను తెలిసిన కొనక పోవుటవలన, విషయభ్రమ గోచరే=నశ్వరములగు దృశ్యవిషయముల యందు, ప్రీతి:= ప్రీతి, (భవతి=కలుగుచున్నది). 

*వివరణ:-*

అజ్ఞానం వల్ల నత్త గుల్లని వెండిగా భ్రమించి లోభంతో సంపాదించడానికి శ్రమపడతారు. ఇదేవిధంగా ఆత్మ తెలియని కారణంగా, ఆజ్ఞానం వల్ల, ఇంద్రియ గోచరమైన ప్రపంచం మీద రాగభావం ఉదయించి వృద్ధి చెందుతుంది.

*తాత్పర్యం:-*

 క్రిందటి శ్లోకంలో భావాన్నే వివరిస్తూ, అష్టావక్రులు ఇలా అంటున్నారు. ఆత్మనిvగురించిన అజ్ఞానం వల్లనే, భ్రమకు లోనైన అహంకారం. ఇంద్రియ గోచరమైన విషయభోగాలను వాంఛిస్తుంది.

జనకునికి ఆత్మానుభవం ఉంటే విషయభోగాల మీద వాంఛ ఉండరాదు. తనకి ఆత్మానుభవం ఉందని తానే అంటున్నాడు. అయినా రాజుగా ఐశ్వర్యాన్ని సంపాదిస్తూనే ఉన్నాడు.

 సమాజ సేవ చెయ్యాలనీ, ప్రాపంచిక కర్మల నాచరించాలనీ, అద్వైతానుభవస్థితుడైన జ్ఞాని ఎలా అనుకుంటాడు? నత్తగుల్ల అని తెలియక, వెండి అని భ్రమించడం వలన మాత్రమే దానిని సంపాదించి భద్రపరచాలని అనిపిస్తుంది!

జనకుని పరీక్షించాలనే దృష్టితో అష్టావక్రుడు, అతడు సింహాసనాన్నీ అధికారాన్ని వదల లేకపోవడమే 'అజ్ఞానానికి నిదర్శనం అని అంటున్నారు.

***

 52 అష్టావక్ర గీత

అధ్యాయం - 3 ఆత్మ అందరిలో - అందరూ ఆత్మలో  

శ్లోకం 03:-

విశ్వం స్ఫురతి యత్రేదం తరంగా ఇవ సాగరే ।

సోఽహమస్మీతి విజ్ఞాయ కిం దీన ఇవ ధావసి ॥ 3-3 ॥

శ్లో|| విశ్వం స్ఫురతి యత్రేదం తరంగా ఇవ సాగరే ।

సోఽహమస్మీతి విజ్ఞాయ కిం దీన ఇవ ధావసి ||3.

विश्वं स्फुरति यत्रेदं तरङ्गा इव सागरे ।

सोऽहमस्मीति विज्ञाय किं दीन इव धावसि ॥ ३-३ ॥

vishvam sphurati yatredam tarangaa iva saagare ।

so’hamasmeeti vijnyaaya kim deena iva dhaavasi ॥ 3-3 ॥

టీకా

 యత్ర = ఏ ఆత్మరూప సముద్రమునందు, ఇదం = ఈ, విశ్వం = ప్రపంచము, తరంగా ఇవ = తరంగములవలె, స్ఫురతి = తోచుచున్నదో, సః=ఆ యాత్మయే, అహం = నేను, అస్మి = అగుచున్నాను, ఇతి ఈ ప్రకారము, విజ్ఞాయ = తెలిసికొని, కిం = ఎందుకొఱకు, దీన ఇవ = దీనునివలె, ధావసి = (విషయములపైకి) పరుగెత్తుచున్నావు.

 వివరణ:-

సముద్రం నుండి కెరటాలు జనించినట్టుగా, నానుండే విశ్వం ఉద్బవిస్తుంది అని తెలుసుకున్న నీవు, ఎండమావుల వెంట ఎందుకు పరుగెడుతున్నావు?

తాత్పర్యం:-

అసంపూర్ణంగా తనను భావించిన అహంకారం, తన చుట్టూ ఉన్న అసంఖ్యాకమయిన వస్తువులను సంపాదించి పూర్ణత్వాన్ని సాధించాలనుకుంటుంది. అన్నిటికీ అధిష్ఠానమయిన ఆత్మగా, పూర్ణంగా నిన్ను నీవు గుర్తించానని అంటున్నావు.

నీలోనుండే విశాలవిశ్వమంతా ఉదయించి నర్తించి లయం అవుతుందని అంటున్నావు, అయితే ఎందుకు? దేనిని కాంక్షించి ఇంకా ఇలా కష్టపడి ప్రణాళికలను వేస్తూ, అమలు జరుపుతూ సమాజ సేవ చేస్తూ విశ్రాంతి లేకుండా నికృష్టంగా జీవిస్తున్నావు? భ్రమాజనిత అహంకారానికి బానిసలయిన జీవులు మాత్రమే ఇలా ప్రవర్తిస్తారు. 

జనకుడు కూడా ఈ జీవులలాగే ప్రవర్తిస్తూ ఉంటే ఈ అతనిలో ఈ జ్ఞానం ఉందని ఎలా అనుకోవడం?

కావాలనే ఈ విధంగా అష్టావక్రుడు తన శిష్యుడిని హేళన చేస్తున్నారు. ఆత్మానుభవంలో నిష్ఠ ఏర్పడిందో లేదో పరీక్షించాలనే ఇలా ప్రశ్నిస్తున్నారు.

***

 53 అష్టావక్ర గీత

అధ్యాయం - 3 ఆత్మ అందరిలో - అందరూ ఆత్మలో

 శ్లోకం 04:-

శ్రుత్వాపి శుద్ధచైతన్య ఆత్మానమతిసుందరం ।

ఉపస్థేఽత్యంతసంసక్తో మాలిన్యమధిగచ్ఛతి ॥ 3-4 ॥

శ్లో|| శ్రుత్వాఽపి శుద్ధచైతన్య ఆత్మానమతిసున్దరమ్ ।

ఉపస్థేఽత్యంతసంసక్తః మాలిన్యమధిగచ్ఛతి ॥4.


विश्वं स्फुरति यत्रेदं तरङ्गा इव सागरे ।

सोऽहमस्मीति विज्ञाय किं दीन इव धावसि ॥ ३-३ ॥

shrutvaapi shuddhachaitanya aatmaanamatisundaram ।

upasthe’tyantasamsakto maalinyamadhigachchhati ॥ 3-4 ॥

టీకా

అతిసున్దరం = మిక్కిలి సుందరమైనటువంటి, శుద్ధ చైతన్యం శుద్ధచైతన్య స్వరూపమగు, ఆత్మానం = ఆత్మను, శ్రుత్వా ఆపి = వినియు (తెలిసికొనియు, ఉప సే = సమీపమునందున్న విషయములయందు, అత్యన్తసంసక్తః = మిక్కిలి ఆసక్తిగలవాడు, మాలిన్యం = అపరిశుద్ధతను, అధిగచ్ఛతి = పొందుచున్నాడు.

వివరణ:-

ఆత్మ శుద్ధమయినది అత్యంత సౌందర్యపూర్ణమూ అని విన్నాక కూడా ఏ విధంగా విషయభోగాలనాశిస్తూ మలినమయిన జీవితం గడుపగలడు?

తాత్పర్యం:-

ఆత్మ అనంత సౌందర్యభావ సంపన్నమనీ, నిత్యశుద్ధమనీ, విని బుద్ధితో అర్థం చేసుకున్నవారికి, భ్రమాజన్యమయిన ప్రాపంచిక భోగాలమీద విరక్తి జనించి తీరుతుంది.

 స్వప్నంలో సౌందర్యరాశిగా కనిపించిన భార్యను మెలకువ వచ్ఛాక కూడా ఎవరైనా ప్రేమిస్తారా? మహారాజైన జనకుడు భోగభాగ్యాలతో నృత్య గానాలతో వైభవంగా జీవిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఆత్మజ్ఞాని ఏ విషయ భోగాన్నయినా ఎలా ప్రీతితో అనుభవించగలడు?---అని అష్టావక్రులు ఆశ్చర్య పడుతున్నారు.

విషయభోగాలు మనస్సులో కోరికలనూ అశాంతినీ అలజడినీ సృష్టిస్తాయి. ఈ కోరికలూ అశాంతీ మనస్సును దావానలంలా దహించి వేస్తాయి.

కల్లోలిత మనస్సు సత్యాన్ని దర్శింపజాలదు. కాబట్టి నిజాయితీగా సాధనచేసే వారంతా విషయ భోగాసక్తికి దూరంగా ఉంటేనే శాంతంగా ఉంటారు, అందుకే దూరంగా ఉండాలి.

**

 54 అష్టావక్ర గీత 🔥ఓంశ్రీమాత్రే నమః🔥 

అధ్యాయం - 3 ఆత్మ అందరిలో - అందరూ ఆత్మలో

 శ్లోకం 05:-

సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని ।

మునేర్జానత ఆశ్చర్యం మమత్వమనువర్తతే ॥ 3-5 ॥

సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని ।

మునేర్జానత ఆశ్చర్యం మమత్వమనువర్తతే ॥5.

सर्वभूतेषु चात्मानं सर्वभूतानि चात्मनि ।

मुनेर्जानत आश्चर्यं ममत्वमनुवर्तते ॥ ३-५ ॥

sarvabhooteshu chaatmaanam sarvabhootaani chaatmani ।

munerjaanata aashcharyam mamatvamanuvartate ॥ 3-5 ॥

టీకా

సర్వభూతేషు = సమస్త భూతములయందును, ఆత్మానం = తనను చ = మఱియు, సర్వభూతాని = సమస్తభూతములను, ఆత్మని = ఆత్మయందును, జానతః = తెలుసుకున్నటువంటి (చూచుచున్నటువంటి), మునేః=మునికి, మమత్వం = మమకారము,అనువర్తతే = అనుసరించి వచ్చుచున్నది, (అనునది), ఆశ్చర్యం = ఆశ్చర్య కరమైనది.

వివరణ:-

సర్వప్రాణులలోనూ తనను చైతన్యంగానూ, చైతన్యమయిన తనలో సర్వప్రాణులనూ చూడగలిగిన జ్ఞాని ఏ విధంగా, "నేను" "నాది" అనే మమత్వంతో వ్యవహరించగలడు? ఇది ఆశ్చర్యకరమే!

తాత్పర్యం:-

మామూలు మనుషులు "నేను చేస్తున్నాను", "ఇదినాది" అనుకోవడంలో వారి అహంకారం వ్యక్తమౌతుంది. ఈ అహంకారం కర్మలను చేస్తున్నాననుకున్నప్పుడు "నేను" గానూ, తన చుట్టూ ఉండే తనకిష్టమయిన వస్తువులలో "నావి" గానూ వ్యక్తం అవుతూ ఉంటుంది. ఈ"నేను", "నావి" కలిస్తే వ్యక్తిత్వమవుతుంది. ఈ వ్యక్తిత్వం తానెవరో తనకు తెలియని అజ్ఞానం నుండి జనిస్తుంది.

ఆత్మజ్ఞానినంటూనే జనకుడు ఏవిధంగా ఈ అహంకార మమకారాలను ఇంకా కలిగి ఉన్నాడా? అని అష్టావక్రులు ఆశ్చర్యపడుతున్నారు.

 విదేహరాజ్యం తనదేననే భావం ఉండడం వల్లనే కదా ఇంకా రాజ్యాన్ని పాలిస్తున్నాడు జనకుడు అని అంటున్నారు. రాబోయే అధ్యాయంలో వినయశీలి అయిన జనకుడు తన గురువుకి అర్హమయిన సమాధానలివ్వడం చూస్తాము.

ఈ శ్లోకంలో మొదటిపాదం భగవద్గీతలో కూడా ప్రతిధ్వనించడం గుర్తు వస్తుంది.

సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః!! (భగవద్గీత-6-29) 

యోగారూఢుడైన జ్ఞాని సర్వప్రాణులలోనూ చైతన్యాన్నీ, చైతన్యమైన తనలో సర్వాన్నీ గుర్తించి సమదృష్టి కలిగి ఉంటాడు.

***

*🧘‍♂️ 55అష్టావక్ర గీత 🧘‍♀️*

*అధ్యాయం - 3*

*ఆత్మ అందరిలో - అందరూ ఆత్మలో*

 *శ్లోకం 06:-*

*ఆస్థితః పరమాద్వైతం మోక్షార్థేఽపి వ్యవస్థితః ।*

*ఆశ్చర్యం కామవశగో వికలః కేలిశిక్షయా ॥ 3-6 ॥*

ఆస్థితః పరమాద్వైతం మోక్షార్థేఽపి వ్యవస్థితః ।

ఆశ్చర్యం కామవశగః వికలః కేళిశిక్షయా ॥6.

*आस्थितः परमाद्वैतं मोक्षार्थेऽपि व्यवस्थितः ।*

*आश्चर्यं कामवशगो विकलः केलिशिक्षया ॥ ३-६ ॥*

*aasthitah’ paramaadvaitam mokshaarthe’pi vyavasthitah’ ।*

*aashcharyam kaamavashago vikalah’ kelishikshayaa ॥ 3-6 ॥*

*టీకా*

పరమాద్వైతం = పరమాద్వైతమును, ఆస్థితః = ఆశ్రయించినటువంటివాడై, మోక్షార్థే అపి = మోక్షార్థమునందుకూడ, వ్యవస్థితః = ప్రయత్నపరుడైన = పురుషుడు, కామవశగత: = కామమునకు వశుడై, కేళిశిక్షయా = క్రీడాభ్యాసముల చేత, వికలః = వికలుడగుచున్నాడు (అనునది), ఆశ్చర్యం = ఆశ్చర్యకరమైన విషయము. 

*వివరణ:-*

అద్వైతానుభవనిష్ఠుడైన జ్ఞాని, కామవశుడై కర్మలను చెయ్యడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

*తాత్పర్యం:-*

నిర్దాక్షిణ్యంగా వరుసగా లోపాలను చూపిస్తూ జనకునికి ఆత్మజ్ఞానం లేదని అంటున్నారు. పరీక్షించదలచిన గురువైన అష్టావక్రులు, స్వానుభవంతో, సమత్వబుద్ధితో సవినయంగా శాంతంగా గురువు మాటలను వింటూ తన్ను తాను చూసుకుని తృప్తితో నిల్చున్నాడు, శిష్యుడైన జనకుడు.

*రాజుగా, గృహస్థుగా తన బాధ్యతలను నిర్వహిస్తూ రాణులతో సంతోషంగా సంసారం చేస్తున్న జనకునికి ఆత్మానుభవం ఉందా? ఉంటే సామాన్యుని వలె దేహ మనో బుద్ధులతో కామవశుడై ఎలా సుఖంగా ఉండగలుగుతున్నాడు? అతని అనుభవం నిజమైనదేనా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆచార్యులు.*

జ్ఞానబలంతో జనకుడు ములుకుల వంటి ఈ మాటలను వింటూ కూడా శాంతంగా ఉండగలుగుతున్నాడు.

* 56) అష్టావక్ర గీత *

*అధ్యాయం - 3*

*ఆత్మ అందరిలో - అందరూ ఆత్మలో* 

*శ్లోకం 07:-*

*ఉద్భూతం జ్ఞానదుర్మిత్రమవధార్యాతిదుర్బలః ।*

*ఆశ్చర్యం కామమాకాంక్షేత్ కాలమంతమనుశ్రితః ॥ 3-7 ॥*

శ్లో|| ఉద్భూతం జ్ఞానదుర్మిత్రం అవధార్యాతిదుర్బలః ।

ఆశ్చర్యం కామమాకాంక్షేత్ కాలమన్త మనుశ్రితః ॥7.

*उद्भूतं ज्ञानदुर्मित्रमवधार्यातिदुर्बलः ।*

*आश्चर्यं काममाकाङ्क्षेत् कालमन्तमनुश्रितः ॥ ३-७ ॥*

*udbhootam jnyaanadurmitramavadhaaryaatidurbalah’ ।*

*aashcharyam kaamamaakaankshet kaalamantamanushritah’ ॥ 3-7 ॥*

*టీకా*

 ఉద్భూతం = ఉత్పన్న మైన, జ్ఞానదుర్మిత్రం = జ్ఞానశత్రువైన కామమును, అవధార్య = ధారణ చేసి, అతిదుర్బలః = మిక్కిలి దుర్బలుడై, అన్తకాలం = అంత కాలమును, అనుశ్రితః = ఆశ్రయించినటువంటివాడు, కామం = కామమును, ఆకాంక్షేత్ = కోరును ఆశ్చర్యం = ఆశ్చర్యము.

*వివరణ:-*

జ్ఞానానికి కామం శత్రువు వంటిదని తెలిసి కూడా, జవసత్వాలు ఉడిగిన వృద్ధాప్యంలోనైనా కామాన్ని విడువలేకున్నారు సామాన్యులు--ఇది నిజంగా ఆశ్చర్యమే!

*తాత్పర్యం:-*

అష్టావక్రుని శిష్యుడయ్యేనాటికి జనకుడు యవ్వనదశను దాటి చాలా కాలము అయినదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కామవశులైన వారి మనస్సు శారీరకమైన కోరికలతో సదా సంక్షుభితమై ఉంటుంది.

అల్లకల్లోలమైన మన్నసుకు ఆధ్యాత్మిక సాధన అసాధ్యం. సాధకులందరికీ కామం జ్ఞానానికి శత్రువు వంటిదని తెలిసే ఉంటుంది.

శిష్యుడు యౌవనదశలో ఉంటే అతని యౌవనం దృష్ట్యా అర్థం చేసుకుని క్షమించవచ్చు.

 అంత్యకాలమనదగిన వృద్ధాప్యంలో ఉన్న జనకుడు, ఆత్మజ్ఞానినని చెప్పుకుంటూ, విషయభోగాలను యధాపూర్వంగా అనుభవించడం చూస్తే అనుమానం వస్తున్నది. అతడు మాయా మోహితుడయి అజ్ఞానంలోనే ఉండి తీరాలి. 

57) అష్టావక్ర గీత 🧘‍♀️ 

అధ్యాయం - 3

ఆత్మ అందరిలో - అందరూ ఆత్మలో

  శ్లోకం 08:-

ఇహాముత్ర విరక్తస్య నిత్యానిత్యవివేకినః ।

ఆశ్చర్యం మోక్షకామస్య మోక్షాద్ ఏవ విభీషికా ॥ 3-8 ॥

శ్లో|| ఇహాముత్ర విరక్తస్య నిత్యానిత్యవివేకినః |

ఆశ్చర్యం మోక్ష కామస్య మోక్షా దేవ విభీషికా ||8.

इहामुत्र विरक्तस्य नित्यानित्यविवेकिनः ।

आश्चर्यं मोक्षकामस्य मोक्षाद् एव विभीषिका ॥ ३-८ ॥

ihaamutra viraktasya nityaanityavivekinah’ ।

aashcharyam mokshakaamasya mokshaad eva vibheeshikaa ॥ 3-8 ॥

టీకా

ఇహ = ఇహలోక భోగముల నుండియు, అముత్ర = పరలోకభోగముల నుండి యు, విరక్తస్య = నిరక్తుడైనటువంటిన్నీ, నిల్యానిత్య వివేకినః = నిత్యసత్య వివేకము, కలిగి నటువంటిన్ని, మోక్ష కామస్య = మోక్ష మును గోరు పురుషునకు, మోక్షాదేవ = మోక్షము నుండియే, బిభీషికా = భయము (కలుగుచున్నది) అనునది, ఆశ్చర్యం = ఆశ్చర్యము.

వివరణ:-

ఇహపరలోకాల రెండు రకాల సుఖాలయినా నిరాసక్తత గలిగి నిత్యానిత్య వివేకం కలిగి మోక్షకామియైన వాడు, ఇంకా తన శరీర నాశనం గురించి భయపడడం ఆశ్చర్యకరమే!

తాత్పర్యం:-

మాయాప్రభావం మహావిచిత్రమైనది. శరీరం తాను కానని తెలుసుకుని, తానుగా సత్యానుభవంలో నిలవాలని కోరుకునే మోక్షకామి కూడా శరీరం పైన ప్రేమ కలిగి ఉంటాడు. ప్రాపంచిక విషయ భోగాల మీద, పరలోక సుఖాల మీదా విముఖతను సాధించవచ్చును.

ఏది నిత్యమో,ఏది అనిత్యమో వివేకవంతమైన బుద్ధితో నిశ్చయంగా తెలుసుకోవచ్చును, నిత్యమైన సత్యాన్ని సాధించాలనే దృఢమైన దీక్ష కూడా ఉండవచ్చును.

ఇన్నీ ఉన్నా స్థిర గంభీరమైన ధ్యానంలోకి వెళ్ళడానికి మనస్సు నిరాకరిస్తుంది. అప్రయత్నంగానే, అయిష్టంగానే ధ్యానానికి విఘ్నం కలుగుతూ ఉంటుంది.

రేఖామాత్రంగా తన వ్యక్తిత్వంపై ఉన్న ప్రేమే ఈ విఘ్నానికి కారణం. అహంకారం తనకు ఉనికి ఉండదని భయపడుతూ ఉంటుంది! ఈ సహజ దేహతాదాత్మ్యాన్ని విడనాడడం చాలా కష్టసాధ్యం.

ఆత్మానుభవానికి చివరిగా వచ్చే అడ్డు ఇదే. స్వ శరీరాన్ని ప్రేమించడం ప్రాణికి సహజ ధర్మం. ఈ సహజత్వంలోంచి అహంకారం బలాన్ని పుంజుకుంటుంది. శరీరానికి అనేక రకాలయిన సుఖానుభవాల్ని అందించాలని తాపత్రయపడుతుంది.

ఈ తాప త్రయమే, ఈ కోరికే దేహతాదాత్మ్యాన్ని శతాధికం చేసి అహంకారాన్ని మరింత బలీయంగా చేస్తుంటుంది! ఇలా పరస్పరాధారంగా సహజ దేహతాదాత్మ్యమూ అహంకారమూ వర్ధిల్లుతుంటాయి.

జనకుడు చెప్పిన మాటలకు చేసే చేతలకూ గల వైరుద్ధ్యాన్ని విమర్శిస్తూ ఈ శ్లోకం వరకూ అష్టావక్రులు జనకుని శంకిస్తూనే ఉన్నారు.*

---

60) అష్టావక్ర గీత  

అధ్యాయం - 3

ఆత్మ అందరిలో - అందరూ ఆత్మలో  

శ్లోకం 11:-

మాయామాత్రమిదం విశ్వం పశ్యన్ విగతకౌతుకః ।

అపి సన్నిహితే మృత్యౌ కథం త్రస్యతి ధీరధీః ॥ 3-11 ॥

శ్లో|| మాయామాత్రమిదం విశ్వం పశ్యన్విగత కౌతుకః |

అపి సన్నిహితే మృత్యౌ కథం త్రస్యతి ధీరధీః ||11.

मायामात्रमिदं विश्वं पश्यन् विगतकौतुकः ।

अपि सन्निहिते मृत्यौ कथं त्रस्यति धीरधीः ॥ ३-११ ॥

maayaamaatramidam vishvam pashyan vigatakautukah’ ।

api sannihite mri’tyau katham trasyati dheeradheeh’ ॥ 3-11 ॥

టీకా

విగతకౌతుకః = దూరము చేయబడిన అజ్ఞానాది కుతుకము గలిగినటువంటి, ధీరధీః = ధీరపురుషుడు, ఇదం విశ్వం= ఈ ప్రపంచమును, మాయామాత్రం = మాయా మాత్రస్వరూపము గలదానినిగా, పశ్యన్= చూచుచున్నవాడై, మృత్యౌ = మృత్యువు, , సన్నిహితే అపి = సన్నిహితమైనదయినప్పటికిని, కథం= ఎట్లు, త్రస్యతి = భయపడును.  

వివరణ:-

ఈ సర్వచరాచర జగత్తును మిథ్యగా గుర్తించి, నిరాసక్తుడై శాంతుడైన జ్ఞానికి మరణ మాసన్నమయినా భయమెందుకు?

తాత్పర్యం:-

తనలో కనిపించని సుఖసంతోషాలను సంపాదించాలనే ప్రయత్నంలో నిరంతరమూ విషయభోగాసక్తులయి, వాటిని సాధించడానికి శ్రమపడుతూ యిష్టా యిష్టాలనూ రాగద్వేషాలనూ పెంచుకుంటూ తీరని కోరికలతో జనన మరణ వలయంలో చిక్కుకుంటారు.

 పరిపూర్ణమయిన సుఖాన్ని సాధించగలమనే ఆశతో ఇంకా శ్రమిస్తూనే ఉంటారు. ఇంతకాలమూ ప్రయత్నిస్తూ విఫలులవుతున్నాసరే తను సాధించలేనిది తనవారైనా సాధించగలరేమో అన్న భావమే సంతతి మీద ప్రేమగా వ్యక్తమౌతూ ఉంటుంది.

 సంతాన కాంక్షతో, వారిని కని పెంచడంలో సమస్యలు వృద్ధి అవుతూ ఇంకా బంధిస్తూ అశాంతినే సృష్టిస్తుంటాయి. శాంతిని కోరుతూ అశాంతిని చేరుకుంటున్నారు. జ్ఞాని తన ఆత్మానుభవంతో ప్రపంచాన్ని మిథ్యా మాత్రంగా గుర్తిస్తాడు.

కాబట్టి, ఈ సుఖసంపాదనాభిలాషా, తదనుగుణమయిన ప్రయత్నమూ కూడా అర్థవిహీనమయినవనీ,ఎండమావుల వెంట పరుగుల వంటివనీ తెలుసుకుని నిరాసక్తంగా నిర్లిప్తంగా శాంతంగా ఉంటాడు.

ఆకర్షణీయంగా బాహ్యప్రపంచంలో కనిపించే విషయాలే మనస్సులో అశాంతిని సృష్టిస్తాయి. బుద్ధిలో ఆలోచనలని రేకెత్తిస్తాయి. వాటిని సాధించాలనే ప్రయత్నమే జీవనసంగ్రామం.

 ఆత్మానుభవస్థితుడయిన జ్ఞాని, తన అజ్ఞాన జనిత భ్రమాకార్యమనదగిన మిథ్యా జగతిని గుర్తించి, విస్మరించి స్వస్థితిలో శాంతంగా ఉంటాడు. అట్టివానిని మరణమయినా ఎలా భయపెడుతుంది?

మరణం శరీరానికేగాని శరీరి అయిన తనకు కాదని తెలుసతడికి. పుట్టిన శరీరం నశించడం దానిధర్మమనీ అందుకు బాధపడవలసిన పనిలేదనీ తెలిసినవానికి మరణమయినా మరోదృశ్యమే!

---

61) అష్టావక్ర గీత  

అధ్యాయం - 3

ఆత్మ అందరిలో - అందరూ ఆత్మలో  

శ్లోకం 12:-

నిఃస్పృహం మానసం యస్య నైరాశ్యేఽపి మహాత్మనః ।

తస్యాత్మజ్ఞానతృప్తస్య తులనా కేన జాయతే ॥ 3-12 ॥

శ్లో|| నిస్పృహం మానసం యస్య నైరాశ్యేఽపి మహాత్మనః |

తస్యాత్మజ్ఞానతృప్తస్య తులనా కేన జాయతే ||12.

निःस्पृहं मानसं यस्य नैराश्येऽपि महात्मनः ।

तस्यात्मज्ञानतृप्तस्य तुलना केन जायते ॥ ३-१२ ॥

nih’spri’ham maanasam yasya nairaashye’pi mahaatmanah’ ।

tasyaatmajnyaanatri’ptasya tulanaa kena jaayate ॥ 3-12 ॥

టీకా

 యస్య = ఏ, మహాత్మనః = మహాత్మునియొక్క, మానసం = మనస్సు, నైరాశ్య అపి = మోక్షమునందుకూడ, నిస్స్పృహం = ఇచ్చారహితముగా నున్నదో, తస్య = అటువంటి, ఆత్మజ్ఞానతృప్తస్య= ఆత్మజ్ఞానమువలన తృప్తు డైనవానికి, తులనా = సామ్యము, కేన = ఎవనితో, జాయతే = కలుగుచున్నది (అతనితో సదృశుడెవడు లేడని భావము)

వివరణ:-

కోరదగినదేదీ లేదని 'తెలిసి నిత్యతృప్తుడై ఉన్న జ్ఞానికి సాటిరాగల వారెవ్వరు, ఎటువంటి నిరాశాపూరిత నికృష్టమయ సంఘటననీ కూడా మిథ్యా దృశ్యంగా, సాక్షిగా వీక్షించి స్వస్థితిలో ఆనందంగా ఉండగలుగుతాడు జ్ఞాని.

తాత్పర్యం:-

మానవుని మనస్సు ఎప్పుడూ ఒక క్రమమూ నిర్ణీతమూ అయిన పద్ధతిలోనే పనిచేస్తూ ఉంటుంది. ఏదైనా ఒక వస్తువును చూస్తుంది, యిష్టపడుతుంది, తప్పకుండా సంపాదించాలనుకొని శ్రమపడుతుంది.

కోరబడే వస్తువులు కొద్దిగానూ కోరేవారు చాలమందీ ఉండడం వల్ల ప్రయత్నించిన వారిలో ఏ కొద్ది మందో సాధించగలరు, మిగిలినవారంతా నిరాశ చెందవలసిందే.

సాధించిన తరువాత ఆ వస్తువులో అనుకున్నంత విలువ కనుపించకనో, పరిస్థితుల ప్రాబల్యం వల్ల వస్తువు తనది కాకుండా పోవడమో లేక వస్తుసహజమయిన పరిణామం సంభవించి అది తనకు నచ్చకనో మరలా అశాంతి మొదలవుతుంది.

ఇలా తరుచుగా అశాంతికి లోనయిన మనస్సు విచారావృతమయి, తన్నివారణార్థం మరలా ప్రయత్నిస్తూ విచారానికి లోబడుతూ "సంసారం" లో చిక్కుకుంటుంది. సర్వసాధారణంగా సామాన్యులందరి మనస్సూ ఈ విధంగానే పనిచేస్తూ ఉంటుంది.

ఎటువంటి సంకట పరిస్థితిలోనూ సంతోషంగా ఉండగలిగే జ్ఞాని మనస్సు నిజంగా అభినందించదగిందే, అందుకే అష్టావక్రులు "మహాత్ములతో సరిపోల్చదగినదేదీ లేదు" అంటున్నారు. జీవితలక్ష్యం గురించి చర్చించే ప్రతి గ్రంధంలోనూ ఇటువంటి వాక్యాలు తరుచు కనిపిస్తూనే ఉంటాయి.

యోగ వాశిష్ఠంలో ఇలా ఉంది.........

"వితతం హృదయస్య, మహామతేః హరిహరాజ్జ జలక్షశతైరపి తులనామేతిన.. మానసిక బంధాలను మిథ్యగా గుర్తెరిగి శాంతుడయిన జ్ఞానికి లక్ష త్రిమూర్తులయినా సాటిరారు.

"నైరాశ్యేపి మహాత్మనః ----నైరాశ్య అన్నమాటకి కోరికలులేనట్టి అని అర్థం. మోక్షం కావాలనే కోరికను కూడా మిథ్యగా భావించి విడిచి పెట్టిన జ్ఞానికి సాటి ఏదీలేదు. అతడు నిత్యశాంతుడు, శాంతస్వరూపుడు.

**

62) అష్టావక్ర గీత 

అధ్యాయం - 3

ఆత్మ అందరిలో - అందరూ ఆత్మలో  

శ్లోకం 13:-

స్వభావాద్ ఏవ జానానో దృశ్యమేతన్న కించన ।

ఇదం గ్రాహ్యమిదం త్యాజ్యం స కిం పశ్యతి ధీరధీః ॥ 3-13 ॥


శ్లో|| స్వభావాదేవ జానానో దృశ్యమేతన్న కించన |

ఇదం గ్రాహ్యమిదం త్యాజ్యం స కిం పశ్యతి ధీరధీః ||13.


स्वभावाद् एव जानानो दृश्यमेतन्न किञ्चन ।

इदं ग्राह्यमिदं त्याज्यं स किं पश्यति धीरधीः ॥ ३-१३ ॥


svabhaavaad eva jaanaano dri’shyametanna kinchana ।

idam graahyamidam tyaajyam sa kim pashyati dheeradheeh’ ॥ 3-13 ॥

టీకా

 యః = ఎవడు, ఏతత్ = ఈ, దృశ్యం = దృశ్యప్రపంచము, స్వభావాత్ = స్వాభావికముగనే, న కించన = కొంచెముగూడ లేదు, ఇతి ఇట్లని, = జానానః =తెలుసుకొనునో, సైట్ = అట్టి, ధీరధీః = ధీరపురుషుడు, ఇదం = ఇది, గ్రాహ్యం గ్రహించదగినదని, ఇదం త్యాజ్యం = ఇది విడిచి పెట్టదగినదని, కిం = ఎట్లు, పశ్యతి = చూచుచున్నాడు.

వివరణ:-

ఈ కనిపిస్తున్నట్టున్న ప్రపంచం నిజంగా అస్తిత్వం కలిగి లేదని తెలుసుకున్న జ్ఞానికి కొన్ని విషయాల మీద ఇష్టత మరికొన్నిటి మీద అయిష్టతా ఏవిధంగా ఉండగలదు?

తాత్పర్యం:-

ఆత్మానుభవస్థితుడయిన జ్ఞానికి ఈ ప్రపంచమంతా కేవలం స్వప్నం వంటి దృశ్యమనీ, వాస్తవంలో లేదనీ దృఢంగా తెలుసు. ప్రపంచాన్ని నిజంగా భావిస్తున్న సాధారణ వ్యక్తి యొక్క బుద్ధిమాత్రమే తాను చూస్తున్న విషయాలలో కొన్ని ఆహ్లాదకరంగా ఉపయోగకరంగా ఉన్నాయని అంగీకరిస్తూ కొన్నిటిని నిరుప యోగమని భావిస్తూ ఉంటుంది.

జ్ఞాని కూడా వస్తుమయ ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాడు. అయితే అతని చూడడం మనం చూడడంకంటే భిన్నంగా ఉంటుంది. వాసనానుగుణంగా యిష్టా యిష్టాలతో మనచుట్టూ ఉన్నవాటిని చూస్తూ, వాటి ఉపయోగాన్ని విలువనీ నిర్ణయిస్తుంటాము.

 జ్ఞాని దేనినీ ఉపయోగమనికానీ నిరుపయోగమనికానీ భావించకి కేవలం దృశ్యంగా చూస్తుంటాడు. అతని దృష్టిలో వాసనల ప్రమేయం ఉండదు.

నత్తగుల్ల అని గుర్తించే అది ఎంతగా మెరుస్తున్నా ఎవరు దానిని వెండివలె భద్రపరచాలని అనుకుంటారు?

మహోపనిషత్తులో ఇటువంటి భావమే ఇలా వ్యక్తీకరింపబడింది. "తతో బ్రహ్మధనే నిత్యే సంభవ, న కల్పితాః............... "యదస్తీహ తదేవాస్తి విజ్వరో భవ సర్వదా!! (మహోపనిషత్తు-(V-13,14) --- నిత్యమూ ఏకమూ అయిన ఆత్మ సర్వానికి అధిష్ఠానంగా ఉంది, అజ్ఞానంవల్ల కలిగే భ్రమలకూ, ఊహాకల్పనలకూ ఆత్మతో ఏ సంబంధమూ లేదు.

 భ్రమ ఉన్నా లేకున్నా కూడా ఆత్మ పరిణా రహితంగా స్థిరంగా ఉంటుంది. అట్టి ఆత్మవైన నీవు కలతలను వీడి శాంతంగా స్థిరంగా జీవించు.

**

*63) అష్టావక్ర గీత 

అధ్యాయం - 3

ఆత్మ అందరిలో - అందరూ ఆత్మలో 

 శ్లోకం 14:-

అంతస్త్యక్తకషాయస్య నిర్ద్వంద్వస్య నిరాశిషః!

యదృచ్ఛయాగతో భోగో న దుఃఖాయ న తుష్టయే ॥ 3-14 ॥

శ్లో|| అన్తస్త్యక్తకషాయస్య నిర్ద్వన్ద్వస్య నిరాశిషః |

యదృచ్ఛయాఽఽగతో భోగోః న దుఃఖాయ న తుష్టయే ||14.

अन्तस्त्यक्तकषायस्य निर्द्वन्द्वस्य निराशिषः ।

यदृच्छयागतो भोगो न दुःखाय न तुष्टये ॥ ३-१४ ॥

antastyaktakashaayasya nirdvandvasya niraashishah’ ।

yadri’chchhayaagato bhogo na duh’khaaya na tusht’aye ॥ 3-14 ॥

టీకా

అనుః త్యక్త కషాయస్య = అంతఃకరణమునుండి నెట్టి వేయబడిన విషయ వాసనా ములాది దోషములు గలిగినటువంటిన్నీ, నిర్ద్వఛ్వస్య = ద్వంద్వములగు శీతోష్ణ సుఖదుఃఖాదులు లేనటువంటిన్నీ, నిరాశిష: = ఆశారహితుడైన వానికి, యదృచ్ఛయా = దైవ యోగమువలన, ఆగుతః =వచ్చినటువంటి, భోగః భోగము (భోగవస్తువులు), దుఃఖాయ = దుఃఖము కొరకు, న = కావు, తుష్ట యే సంతోషము కొఱకున్ను, న = కావు.

వివరణ:-

కోరికల నుండి ముక్తి పొందినవాడు, ద్వంద్వాతీత స్థితిలో ఉన్నావాడు అయిన జ్ఞానికి యాదృచ్ఛికంగా లభించే వస్తువుల పట్ల సంతోషంగానీ విచారం గానీ ఉండవు..

తాత్పర్యం:-

మనిషి మనస్సులో సూక్ష్మంగా, అంతర్గతంగా ఉండే కోరికలవల్లే అతని మానసికోద్రేకాలూ, బుద్ధిపరమైన ఆలోచనలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి. వీనినే వాసనలు అంటారు.

ఈ వాసనలే మనం చూసే సమస్త విషయాలనూ రెండు రకాలుగా విభజిస్తూ ఉంటాయి. ఉపయోగకరమైనవి, నిరుపయోగమైనవి అక్కడనుండి మానవ ప్రయత్నమంతా ఇష్టమయినవానిని సాధించడం కోసమూ అయిష్టమయిన వాటిని దూరంగా ఉంచడం కోసమూ జరుగుతూ ఉంటుంది.

ఈ ప్రయత్నంలో మనస్సు ఒత్తిడికి, అలజడికి,అశాంతికి లోనవుతుంది. సంతోష విచారాలు, జయాపజయాలు, శీతోష్ణాలు మొదలయిన ద్వంద్వాలన్నీ మనస్సును మరింత కృంగదీసి నీరసింపజేసి శక్తివిహీనంగా జేస్తాయి.

పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన జ్ఞాని వాసనలనన్నింటినీ జయించి ఉంటాడు కాబట్టి మానసిక సంబంధమయిన బాధలేవీ, అతడి శాంతిని ధ్వంసం చేయజాలవు. మానసిక బంధాలనదగిన కోరికల నుండి ముక్తుడయిన అతనికి, వస్తువులుండడంగానీ, లేకపోవడంగానీ సంతోష విచారాలను కలుగజేయవు.

యాదృచ్ఛికంగా సంభవించిన దేనితోనయినా అతడు సంతోషంగా సర్వదా ఉండగలడు. అతని ఆనందాన్ని ఏ వస్తువులు ఎక్కువా చెయ్యవు, ఏ వస్తువులు దానిని తగ్గించనూ లేవు. నిత్య తృప్తుడై సమత్వబుద్ధిలో సదా శాంతంగా జీవిస్తాడు. 

జ్ఞాని నిత్యమూ స్వస్థితిలో ఉంటాడు, ఏకమూ అద్వయమూ ఆనందమయమూ అయిన ఆ స్థితిలో నిష్ఠగలిగి ప్రపంచంలో జీవిస్తూనే ఉన్నా, ప్రపంచం ఆ అతని నేవిధంగానూ బాధింపజాలదు. భ్రమ పెట్టనేరదు. ఏకత్వంలో అనేకత్వాన్ని నానాత్వంలో ఏకత్వాన్నీ సమభావంతో చూస్తూ సదా శాంతంగా జీవిస్తాడు.

3వ అధ్యాయం సమాప్తం.

***

64) అష్టావక్ర గీత 

అధ్యాయం - 4

*ఆత్మానుభం (ఆత్మసాక్షాత్కారం) విశిష్టత - ప్రత్యేకత:-

గురువయిన అష్టావక్రుడు తనపై ఆరోపించిన వాటన్నిటికి శాంతంగా అర్హ మైనరీతిలో సమాధానం చెప్తూ,తన అనుభవ సత్యత్వాన్ని నిరూపిస్తున్నారు జనకులీ అధ్యాయంలో.

తనలో ఆత్మ చైతన్యాన్ని, చైతన్యమయిన తనలో సర్వసృష్టినీ చూడగలిగిన జ్ఞానికి తానూ ప్రపంచమూ వేరుకాదని తెలుసు, సృష్టి ---సృష్టికర్త వేరు కావు కాబట్టి, తానూ సృష్టికర్త కూడా వేరుకాదని తెలుసు.

నిజానికి తన ఎఱుకలో తన చైతన్యంలో, సర్వసృష్టి సృష్టి కర్త కూడా రజ్జువులో సర్పంవలె, స్తంభంలో భూతంవలె, భ్రమాకల్పితా జ్ఞానంతో తెలియ బడుతున్నారు.

ఈ సత్యాన్ని అర్థం చేసుకుని నిర్భయంగా ఆనందంగా జీవిస్తాడు జ్ఞాని తన కోరికలకు తానేదాసుడై తన భయాల బాధల బరువును తానే మొయ్యలేక, అజ్ఞానంతో అశాంతితో గాను గెద్దువలె జీవించే సామాన్యునికీ, ఆత్మజ్ఞాననిష్ఠుడై అనంతానంద స్వరూపంగా జీవనలీలను సాక్షిగా చూస్తున్న జ్ఞానికీ, స్వర్గనరకాలకున్నంత తారతమ్యం ఉంది.

ఈ ప్రపంచమంతా మనిషి యొక్క భాగమే. మనిషి దీనినుండి ఏవిధంగానూ వేరుకాదు. కుట్టుమిషను, టేపు రికార్డరువలె వేరు వేరు నతికిస్తే మనిషి తయారు కాడు.

 తల, కాళ్ళు, చేతులు, గుండె, కాలేయము మొదలయినవన్నీ మరలతో బిగింపబడి అతకబడ లేదు. పేర్లు వేరయినా అవన్నీ మనిషిలోని భాగాలే. ఇదే విధంగా మనిషి ప్రపంచం నుండి నామం చేత మాత్రమే వేరుగా గుర్తింపబడతాడు.

నిజానికి ప్రపంచంలో అతి ముఖ్య భాగమే మనిషి, ప్రపంచమే మనిషి,ఆ మనిషే ప్రపంచము. గుండె కాలేయం భాగాలు మనిషిలోని భాగాలుగా నామమాత్రంగా గుర్తింపబడుతున్నా అవి మనిషి నుండి ఎలా వేరు కావో అదేవిధంగా ప్రపంచమూ మనిషీ వేరు కావు.

ప్రసంచంతో మనకున్న ఈ అవినాభావసంబంధం అర్థం కాకపోతే, మన నామమే మనలను మోసం చేసి బంధిస్తుంది! అందుకే మన మహర్షులు ప్రపంచమని పిలువబడేదంతా కేవలం నామరూపాలేననీ ప్రపంచమూ మనిషీ వేరు కావనీ గట్టిగా చెప్పుతున్నారు. మన భయాలన్నీ మనం ప్రపంచంనుండి వేరుగా ఉన్నాం అన్న భావనవల్ల కలిగేవే.

ఉన్న ఏకైక సత్యానివి నీవే అని తెలియడంతో ద్వైతభావం నశించి భయం అదృశ్య మయిపోతుంది. ఏకమూ అద్వయమూ అయిన ఆత్మను నేనే అని తెలుసు కోవడం అంటే, ఈ సమాజమూ ప్రపంచమూ నా మనసులోని భాగాలే అని గుర్తించడమే.

ఆకాశంలో వస్తువుల ఉనికిగాని, వాటి కదలికగాని, ఆకాశాన్ని ఏవిధంగానూ బాధించదు. బాహ్యంగా ఉండే వస్తువులుగాని, శరీరం అనుభవించే విషయభోగాలుగాని ఆత్మను బాధించవు.

 ఆ ఆత్మే తానని తెలుసుకున్న జ్ఞానిని కూడా ఏ అనుభవాలూ బంధించవు, బాధించవు, సూక్ష్మమయిన దానిని స్థూలమయినది పరిమితం చెయ్యజాలదు.

***

65) అష్టావక్ర గీత 

అధ్యాయం - 4

 ఆత్మానుభం (ఆత్మసాక్షాత్కారం)విశిష్టత - ప్రత్యేకత 

శ్లోకం 01:-

జనక ఉవాచః-

హంతాత్మజ్ఞానస్య ధీరస్య ఖేలతో భోగలీలయా ।

న హి సంసారవాహీకైర్మూఢైః సహ సమానతా ॥ 4-1 ॥

జనక ఉవాచః-

శ్లో|| హన్తాత్మజ్ఞస్య ధీరస్య ఖేలతో భోగలీలయా | 

న హి సంసారవాహికైః మూడై స్సహ సమానతా || 1.


जनक उवाच ॥

हन्तात्मज्ञानस्य धीरस्य खेलतो भोगलीलया ।

न हि संसारवाहीकैर्मूढैः सह समानता ॥ ४-१ ॥

janaka uvaacha ॥

hantaatmajnyaanasya dheerasya khelato bhogaleelayaa ।

na hi samsaaravaaheekairmood’haih’ saha samaanataa ॥ 4-1 ॥

టీకా

భోగలీలయా = భోగలీలలతో (లీలా భోగములతో), ఖేలతః - క్రీడించుచున్న, ఆత్మజ్ఞస్య = ఆత్మజ్ఞానియగు, ధీరస్య = ధీరపురుషునకు, సంసారవాహి కైః = సంసార భారమును మోయుచున్న, మూడైః = మూఢులతో, సమానతా = సమానత్వం, హస్త = అయ్యో! నహి = లేదు.

వివరణ:-

అద్భుతం! ఆత్మనే తానని అర్థం చేసుకున్న జ్ఞాని జీవితాన్ని ఆటవలె జీవించగలడు. మాయా మోహితులయి సంసారభారంతో జీవితాన్ని నరకప్రాయంగా శాపంగా భావించే సామాన్యులకూ జ్ఞానికి పోలిక ఎక్కడ?

తాత్పర్యం:-

తన మొదటి శ్లోకంలోనే జనకుడు తను చెప్పదలచుకున్నదంతా సూచిస్తూ, జ్ఞానికి ఎవరూ సాటిరారని అంటున్నారు.

బాహ్యప్రపంచంలో లీలా మాత్రంగా వ్యవహరించే జ్ఞాని ఎక్కడ? అనేక జన్మల ప్రారబ్ధాన్ని మోస్తూ, ఆ వాసనానుగుణంగా గానుగెద్దులాగా, అనేక కోరికలు కోరతూ, శ్రమపడుతూ, యిష్టాయిష్టాలతో రాగద్వేషాలు పెంచుకుంటూ కొత్త వాసనలను మళ్ళీ పోగు చేసుకుంటూ దుర్భరమూ నికృష్టమూ అయిన జీవితాన్ని భరించలేక భరిస్తూ ఉన్న సామాన్యుడెక్కడ? ఇద్దరినీ పోల్చి చూడడం ఏమిటి?

మనశ్శరీరాలే తానుకాననీ వాటి కాధారమయిన ఆత్మ చైతన్యమే తాననీ తెలుసుకున్న జ్ఞాని మనశ్శరీరాలతో బాహ్యంగా కర్మలు చేసినా సంతోషంగా ఆటాడుతున్నట్టుగా చేస్తాడు కాని,

 చెయ్యవలసి వచ్చిందే అని బాధపడుతూ చెయ్యడు. చిన్నపిల్లలకు ఆట అతి సహజం. ఒక చిన్నపిల్లవానిని ఎందుకు ఆడు కుంటున్నావు? అని అడిగితే జవాబు చెప్పలేడు. జవాబు చెప్పగలిగితే ప్రయోజనం ఉంటే అది ఆట కానే కాదు.

ఆట అనేది అతి సహజంగా ఆనందంగా ఉన్నప్పుడు పాటలాగే శారీరికంగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఆట, ఆటకోసమే ఆనందంతో ఆడబడుతుంది.

కానీ వేరే ఏ ప్రయోజనంమూ ఉండదు. ఇటువంటి భావంతో లీలామాత్రంగా సర్వకర్మలనూ చేస్తూ ఉంటాడు జ్ఞాని బాహ్యలోకంలో, జ్ఞానికి అజ్ఞానికీ బాహ్యంగా పనిచే సేతీరులో ఏ భేదమూ కనిపించదు. అయితే పని మీద ఉండే దృష్టిలోనూ, చెయ్యడం పై ఉండే అభిప్రాయంలోనూ ఎంతో తేడా ఉంటుంది.

 సోమరిగా విచక్షణారహితంగా దూరం నుండి చూసేవారికి ఏ భేదమూ కనిపించకపోవచ్చు, కాని నిశితంగా వివేకంతో చూసేవారికి స్వార్థ పరత్వంతో అజ్ఞానంతో సామాన్యుడు పనిచెయ్యడమూ, నిస్వార్థంగా లీలా మాత్రంగా జ్ఞాని పనిచెయ్యడమూ స్పష్టంగా కనబడుతూనే ఉంటుంది.

అజ్ఞానంతో సామాన్యులు చేసే కర్మలతో తనపనులను పోల్చతగదని జనకులు అంటున్నారన్నమాట. అన్నపూర్లోపనిషత్తులో ఇదే భావం దృఢంగా ఇలా చెప్పబడింది.

 అన్తః సంసిక్త నిర్ముక్తో జీవో మధురవృత్తిమాన్! 

బహిః కుర్వన్నకుర్వన్ వా కర్తా భోక్తా న హి క్వచిత్ . (అన్నపూర్ణపనిషత్తు 157)!!

మనశ్శరీరాలు తానుకానాని తెలుసుకుని వాటిమీది మోహభావం వీడి, నిర్మమత్వంతో, నిరహంకారంతో ప్రేమపూరిత హృదయంతో జీవించే జ్ఞాని ఏ పనిని చేసినా, తాను కర్తననీ, భోక్తననీ భావించడు.

---

66) అష్టావక్ర గీత  

అధ్యాయం - 4

 ఆత్మానుభం (ఆత్మసాక్షాత్కారం)విశిష్టత - ప్రత్యేకత  

శ్లోకం 02:-

యత్ పదం ప్రేప్సవో దీనాః శక్రాద్యాః సర్వదేవతాః ।

అహో తత్ర స్థితో యోగీ న హర్షముపగచ్ఛతి ॥ 4-2 ॥

శ్లో|| యత్పదం ప్రేప్సవో దీనాః శక్రాద్యాః సర్వదేవతాః |

అహో తత్ర స్థితో యోగీ న హర్షముపగచ్ఛతి || 2.

यत् पदं प्रेप्सवो दीनाः शक्राद्याः सर्वदेवताः ।

अहो तत्र स्थितो योगी न हर्षमुपगच्छति ॥ ४-२ ॥

yat padam prepsavo deenaah’ shakraadyaah’ sarvadevataah’ ।

aho tatra sthito yogee na harshamupagachchhati ॥ 4-2 ॥

టీకా

యత్ = ఏ, పదం = స్థానమును, ప్రేప్సవః = పొందకోరుచున్న టువంటి, శక్రాద్యాః దేవేంద్రుడు = మొదలుగాగల, సర్వదేవతాః = సమస్తదేవతలు, దీనాః = దీనులై యుంటున్నారో, తత్ర = ఆ స్థానమునందు, స్థితః = ఉంటున్నటువంటి, యోగీ = యోగి, హర్షం = సంతోషమును, న ఉపగచ్ఛతి = పొందడు, అహో = ఆశ్చర్యం.

వివరణ:-

ఇంద్రాది దేవతలు కూడా ఏ స్థితిని సాధించాలని వాంఛిస్తుంటారో అట్టి స్థితిలో ఉండికూడా యోగి అయినవాడు గర్వపడడు.

తాత్పర్యం:-

పూర్ణత్వ స్థితిని పొందిన యోగి పొందే ఆనందం ఇంద్రాది దేవతలు కూడా ఈర్ష్యపడేటటువంటిది. ఆనందస్వరూపమయిన తన స్వస్థితిలో ఉండడమే ఆ ఆనంద హేతువు, ఇది నిత్యమయినది. పూర్ణమయినది. దేవతల ఆనందం వారి పుణ్యఫలంగా కొంతకాలమే ఉండేటటువంటిది. అందుకనే వారు కూడా ఈ నిత్యానందస్థితిని పొందాలని వాంఛిస్తుంటారు.

తన స్వరూపమే ఆనందం, తన కన్నా రెండవదేదీ లేదు. కాబట్టి యోగి (జ్ఞాని) రెండవదానితో పోల్చి చూసి గర్వపడవలసిన కారణం ఉండదు.

ఆనందం తన స్వభావమే కావడంతో అనుభవించే అహంకారం ఉండకపోవడం చేతనూ ఆనందంగా జ్ఞాని సహజ స్వస్థితిలో నిలిచిపోతాడు.

సుషుప్తి అవస్థలో ఆనందాన్ని అనుభవించే అహంకారం ఉండదు. అయినా అది ఆనందమయ స్థితి కాబట్టే అందరూ నిద్ర అంటే అంతగా ఇష్టపతారు. ఇటువంటిదే యోగి స్థితి.

స్వస్థితి అయిన ఆనందంలో నిష్ఠకలిగిన జనకుడు తన సహజస్థితిని వర్ణిస్తూ అట్టి తన్ను రాజభోగాలు మోహ పెట్టజాలవనీ రాజ్యభారం తనదృష్టిని మళ్ళించనేరదనీ నిశ్చయంగా చెబుతున్నారు.

---

68) అష్టావక్ర గీత 

అధ్యాయం - 4

 ఆత్మానుభం (ఆత్మసాక్షాత్కారం)విశిష్టత - ప్రత్యేకత  

శ్లోకం 04:-

ఆత్మైవేదం జగత్సర్వం జ్ఞాతం యేన మహాత్మనా ।

యదృచ్ఛయా వర్తమానం తం నిషేద్ధుం క్షమేత కః ॥ 4-4 ॥

శ్లో|| ఆత్మైవేదం జగత్సర్వం జ్ఞాతం యేన మహాత్మనా |

యదృచ్ఛయా వర్తమానం తం నిషేద్ధు క్షమేత కః || 4.

आत्मैवेदं जगत्सर्वं ज्ञातं येन महात्मना ।

यदृच्छया वर्तमानं तं निषेद्धुं क्षमेत कः ॥ ४-४ ॥

aatmaivedam jagatsarvam jnyaatam yena mahaatmanaa ।

yadri’chchhayaa vartamaanam tam nisheddhum kshameta kah’ ॥ 4-4 ॥

టీకా

యేన మహాత్మనా = యే మహాత్మునిచేత, ఇదం సర్వం = ఈ సంపూర్ణమైన, జగత్ = ప్రపంచము, ఆత్మైవ = ఆత్మయే, (ఇతి అని), జ్ఞాతం = తెలుసుకొనబడుచున్నదో, తం= అటువంటి, యదృచ్ఛయా = ప్రారబ్ధవశమువలన స్వేచ్ఛగా, వర్తమానం = ఉంటున్న జ్ఞానిని, నిషేద్ధుం = నిషేధించుటకు, కః = ఎవడు, క్షమేత = సమర్థుడగును? 

వివరణ:-

ఈ ప్రపంచమంతా తనలో లీలామాత్రంగా భాసిస్తున్నదని తెలుసుకున్న జ్ఞాని ఇచ్చా పూర్వకంగా సంతోషంగా ఆ లీలలో పాల్గొనగలడు. అతనిని అడ్డేవారెవరు?

తాత్పర్యం:-

అటువంటి జ్ఞానికి వేదాలు కూడా విధినిషేధాలు విధింపజాలవు. వేదాలలో చెప్పబడిన ధర్మాలూ విధి నిషేధాలూ అన్నీ కూడా నిజానికి ఇటువంటి జ్ఞానుల ప్రవర్తన ఆధారంగా నిర్మింపబడినవే.

అహంకారరహితుడయిన జ్ఞానిలో సర్వప్రపంచమూ తన రూపమేనన్న భావం ఉంటుంది కాబట్టి అతడు అధర్మంగా ప్రవర్తించలేడు. ఎవరి మీదా ద్వేషభావం ఉండే ఆస్కారం లేదు కాబట్టి అన్యాయంగా పరుషంగా ప్రవర్తించలేడు. అందుకే జ్ఞానులకు శాస్త్రాలు విధించిన ధర్మాలేవీ లేవు. ఒక మహాగాయకుడు, ఒక నాట్యాచార్యుడు ఏవిధంగా ఎన్నడూ లయతాళాలు తప్పరో అదే విధంగా ఆత్మానుభవస్థితుడయిన యోగి ప్రవర్తన ఎన్నడూ అధర్మంగా ఉండజాలదు.

మహాభారతంలో శ్రీ శుకులు ఇలా అన్నారు. 

భేదాభేదా సపది గలితౌ పుణ్యపాపే విశీర్ణే!

మాయామోహౌ క్షయముపగతౌ నష్టసందేహవృత్తేః!

 శబ్దాతీతం త్రిగుణరహితం ప్రాప్యతత్త్వావబోధమ్!

 నిస్త్రైగుణ్యే పథి విచరతాం కో విధిః కో ని షేధః || (శుకాష్టకం)

భేదభావం నశించి, పుణ్యపాపాల పై ఉదాసీనభావం కలిగి, మాయా ప్రభావం నుండి బయటపడి, సంశయరహితుడై, త్రిగుణాతీతుడై "భావాతీత స్థితిలో నిష్ఠ కలిగినవాడై, చరా చరసృష్టి అంతటిలో తననూ, తనలో సర్వసృష్టినీ చూడగలిగిన జ్ఞానికి విధి నిషేధాలు విధించగలవారెవ్వరు?

---

69) అష్టావక్ర గీత 

అధ్యాయం - 4

 ఆత్మానుభవము (ఆత్మసాక్షాత్కారం)విశిష్టత - ప్రత్యేకత 

శ్లోకం 05:-

ఆబ్రహ్మస్తంబపర్యంతే భూతగ్రామే చతుర్విధే ।

విజ్ఞస్యైవ హి సామర్థ్యమిచ్ఛానిచ్ఛావివర్జనే ॥ 4-5 ॥

శ్లో|| ఆబ్రహ్మస్తంబపర్యన్తే భూతగ్రామే చతుర్విధే |

విజ్ఞస్త్యేవ హి సామర్థ్యం ఇచ్ఛానిచ్ఛా వివర్జనే || 5.

आब्रह्मस्तम्बपर्यन्ते भूतग्रामे चतुर्विधे ।

विज्ञस्यैव हि सामर्थ्यमिच्छानिच्छाविवर्जने ॥ ४-५ ॥

aabrahmastambaparyante bhootagraame chaturvidhe ।

vijnyasyaiva hi saamarthyamichchhaanichchhaavivarjane ॥ 4-5 ॥

టీకా

ఆబ్రహ్మస్తంబపర్యన్తే = చతుర్ముఖబ్రహ్మ మొదలుకొని తృణపర్యంతముగల, చతుర్విధే = నాలుగు విధములైన, (జరాయుజ అండజ స్వేదజ, ఉద్భిజములను), భూతగ్రామే = భూతసమూహము నందు, విజ్ఞస్య ఏవ =  జ్ఞానికొక్కనికే, ఇచ్ఛనిచ్ఛా వివర్జనే = ఇచ్ఛానిచ్ఛలను త్యజించుటయందు, సామర్థ్యం = సామర్థ్యమున్నది, హి = నిశ్చయము.

వివరణ:-

చతుర్విధమయిన దృష్టిలో బ్రహ్మ నుండి గడ్డిపోచ వరకూ ఒక్క జ్ఞాని మాత్రమే కోరికలను, యిష్టాయిష్టాలను త్యజించి సంతోషంగా జీవించగలడు.

తాత్పర్యం:-

ఈ ప్రపంచంలో ప్రాణులన్నీ నాలుగు రకాలుగా ఉద్భవించాయని ఉపనిషత్తులలో చెప్పబడింది. అవి---1) గర్భజ -గర్భం నుండి జనించేవి,

2) అండజ--గ్రుడ్డులో నుండి పుట్టేవి

3) స్వేదజ---చెమట నుండి జనించేవి,

4) ఉద్భిజ---విత్తానాల నుండి పుట్టేవి. మనచుట్టూ ఉండే జీవులన్నీ ఈ నాలుగు రకాలలోనే ఇమిడి ఉంటాయి. మొత్తం సృష్టి అంతా అని చెప్పడం కోసం బ్రహ్మ నుండి గడ్డిపోచ వరకూ అని జనకుడు వాడారు.

క్లుప్తంగా చెప్పాలంటే, సృష్టిలో ఉన్న సర్వప్రాణులలోనూ, ఒక్క జ్ఞాని మాత్రమే కోరికలకూ యిష్టాయిష్టాలకూ లోనుగాకుండా సంతోషంగా జీవించగలడు, కోరికలూ యిష్టాయిష్టాలూ---ఈ రెండూ మాటలలోనూ మొత్తం మనస్సు చేసే పని అంతా ఇమిడి ఉంది. మనస్సును అధిగమించి యిష్టాయిష్టాలకూ, రాగ ద్వేషాలకు అతీతంగా ఉండగలడు, కాబట్టే జ్ఞానిని అందరూ అంత గౌరవిస్తారు. అతనిలో అహంకారం ఉండదు కాబట్టి అతడు చేసే కర్మలు రాగద్వేషాల పై ఆధార పడి ఉండవు.

వాసనాధీనమైన మనస్సు తనవైన రాగద్వేషాలతో,యిష్టాలతో, ప్రపంచాన్ని చూస్తూ ప్రత్యేక ప్రపంచంలో బంధింపబడి పోతుంది. చూడబడే ప్రపంచమంతా మనోనిర్మితం--వాసనాధీనం.

జ్ఞాని వాసనలకు అతీతంగా ఉండగలడు కాబట్టి వాసనాధీనమయిన ప్రపంచం అతనికి కనిపించదు. అతడు నిత్యమూ ఏకమయిన స్వస్థితిలో ఉంటూ తననే సర్వత్రా చూస్తూ సమత్వ బుద్ధితో సంతోషంగా జీవిస్తాడు. ఇదే భావం మహోపనిషత్తులో ఇలా చెప్పబడింది.

దృశ్యమాశ్రయసీదం చేత్ తత్ సచిత్త్యోపి బన్దనాన్

దృశ్యం సంత్యజసీదం చేత్ తద్వాచిత్త్వోసి మోక్ష వాన్. (మహోపనిషత్తు-VI-35) *

 నీవు చూసే దృశ్యప్రపంచాన్నే సత్యంగా భావిస్తే నీవు బంధింపబడే ఉంటావు, దృశ్యాన్ని మిథ్యగా గుర్తించగలిగిన మనస్సు ముక్త స్థితిలో ఉంటుంది.

---

71) అష్టావక్ర గీత 

అధ్యాయం - 5

 చతుర్విధ మార్గాలు-అహంకార వినాశనం-లయం

ప్రత్యక్ష ఆత్మానుభవంలో, చూస్తున్నామనుకునే మనశ్శరీరాలనూ, చూడబడే ప్రపంచాన్నీ, భావాలుగా, నామరూపాలుగా గుర్తించి విస్మరించడమే అష్టావక్రుల దృష్టిలో లయం.

 ఇది సాధ్యం అవడానికి నాలుగు విధాలుగా ప్రయత్నించాలి. ఈ నాలుగూ నాలుగు సోపానాలవంటివి. అన్ని సోపానాలనూ ఒకేసారి దాటడం ఎవరికీ సాధ్యం కాదు.

 ప్రతివారూ ప్రయత్నించి ఒక్కొక్క మెట్టునూ అధిరోహించి తీరాలి. ఈ విధంగా ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ చివరగా అహంకారరహితంగా స్థిరంగా సత్ చిత్ ఆనందరూపమయిన ఆత్మానుభవంలో ఎలా నిలవడం అన్నదే ఈ అధ్యాయంలో చెప్పబడింది.

శరీరస్పృహను, శరీరంతో తాదాత్మ్యాన్ని విడనాడడంతో మొదలయి ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ చివరగా కేవలమయిన తన స్వస్వరూపంలో నిలచేటట్టు చేస్తుంది.

 సాధకుని, ఈ లయ యోగం, క్రమమూ దృఢమూ అయిన భావంతో నిత్యమూ పూర్ణమయిన ఆత్మ చైతన్యం మీదే దృష్టి నిలపడంతో శరీరం బాహ్యవస్తుమయ ప్రపంచమూ కూడా విస్మరించబడతాయి.

 దీనినే పూర్ణలయయోగము అంటారు. ఒక్క క్షణం కూడా విడిచి పెట్టకుండా సదా భగవంతుని స్మరిస్తూ ఉండడమే అన్నిటి కంటే చాలా సులభమైన లయయోగ సాధన.

 ఇలా చెయ్యడంలో తప్పకుండా కొంతకాలానికి మనస్సు బాహ్య దృష్టిని వీడి అంతర్ముఖం అయి తన మూలమైన చైతన్యంలో లయం అయిపోతుంది.

---

72) అష్టావక్ర గీత  

అధ్యాయం - 5

చతుర్విధ మార్గాలు-అహంకార వినాశనం-లయం

శ్లోకం 01:-

అష్టావక్ర ఉవాచ ॥

న తే సంగోఽస్తి కేనాపి కిం శుద్ధస్త్యక్తుమిచ్ఛసి ।

సంఘాతవిలయం కుర్వన్నేవమేవ లయం వ్రజ ॥ 5-1 ॥

అష్టావక్ర ఉవాచ :-

శ్లో|| న తే సంగోఽస్తి కేనాపి కిం శుద్ధః త్యక్తుమిచ్ఛసి |

సంఘాతవిలయం కుర్వన్ ఏవమేవ లయం ప్రజ || 1.

अष्टावक्र उवाच ॥

न ते सङ्गोऽस्ति केनापि किं शुद्धस्त्यक्तुमिच्छसि ।

सङ्घातविलयं कुर्वन्नेवमेव लयं व्रज ॥ ५-१ ॥

asht’aavakra uvaacha ॥

na te sango’sti kenaapi kim shuddhastyaktumichchhasi ।

sanghaatavilayam kurvannevameva layam vraja ॥ 5-1 ॥

టీకా

తే = నీకు, కేనాపి = దేనితోగూడ, సంగః = సంగమము, నాస్తి=లేదు, (అతః - ఈ కారణము వలన), శుద్ధః = శుద్ధుడవైన నీవు, కిం = దేనిని, త్యక్తుం = విడుచుటకు, ఇచ్ఛసి = కోరుచున్నావు, ఏన మేవ = ఈ ప్రకారముగానే, సంఘాత విలయం = దేహాద్యభిమాన సంఘాత త్యాగమును, కుర్వన్ = చేయుచున్నవాడవై, లయం = మోక్షమును, ప్రజ = పొందుము.

వివరణ:-

నీవు దేనికి సంబంధించి లేవు, నీవు శుద్ధమైన ఆత్మ చైతన్యానివి. నీవు త్యజించవలసినది ఏముంది? నేను శరీరాన్ని అనే భావాన్ని విడనాడగానే నీ మనస్సు తన మూలంలో లయం అయిపోతుంది.

తాత్పర్యం:-

దృశ్యముగా దర్శింపబడుచున్న ఈ మిథ్యా జగత్తంతా శుద్ధచైతన్యమైన నీలో ఉన్నట్టుగా భాసిస్తుంది; నీపై ఆరోపింపబడింది. నీవే ఈ సర్వానికి అధిష్ఠానమువు. నీవు త్యజించవలసిన దేదీ లేదు. నీవు దేనితోనూ సంబంధించి లేవు. అసంగుడవై కేవలంగా ఉన్నావు. స్తంభం భూతంచే స్పృశింపబడదు. స్తంభం దేనిని త్యజించాలి?

మనశ్శరీరాల కూటమిని వేదాంతపరిభాషలో "సంఘాతం"అని అంటారు. జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అన్నీ కలిసి సంఘాతమనబడుతుంది. శుద్ధమయిన ఆత్మ చైతన్యంలో రెండవదేదీ లేకపోయినప్పటికీ, ఉన్నదేదో తెలియని అజ్ఞానం వలన ఉన్న దానిని పొరపాటుగా, మరొకటిగా ఊహించడం సంభ విస్తున్నదని తెలుసుకున్నాము.

 ప్రస్తుతంలో ఈ భ్రమాజన్యమయిన మనశ్శరీరాలతో తాదాత్మ్యం చెంది ఇవే మనమనుకుని జీవిస్తున్నాము. వీటన్నిటికీ చూచే సాక్షి చైతన్యమే నేను అని అవిచ్ఛిన్నంగా అనుక్షణమూ ధ్యానిస్తే, ఆ భావం బలీయమయి, భ్రమ నశిస్తుంది.

అహంకారం అదృశ్యమైపోతుంది. ఈ విధంగా మనోలయాన్ని సాధించి శాంతంగా జీవించు అని అష్టావక్రులు సలహా ఇస్తున్నారు.

ఇటువంటి భావమే అన్నపూర్ణోపనిషత్తులో ఇలా వ్యక్తీకరింపబడింది.

పదమాద్యమనాద్యన్తం త్యస్య బీజం న విద్యతే! 

తత్ర సంలీయతే సంవిత్ నిర్వికల్పంచ తిష్ఠతి!!

భూయో న వర్తతే దు: ఖై:.. (అన్నపూర్ణోపనిషత్తు, I V-69)

దేనికైతే ఆది అంతము ఉండవో దానికి కారణమూ ఉండదు. అట్టి దానిలో నీ మనస్సునూ బుద్ధినీ, లయం చేసి శాంతంగా ఉండు. అటువంటి వ్యక్తిని ఎన్నటికీ బాధలు స్పృశింప జాలవు.

---

*🧘‍♂️73) అష్టావక్ర గీత 🧘‍♀️* 

అద్చ - 5*

 *చతుర్విధ మార్గాలు-అహంకార*

 *వినాశనం-లయం*

*శ్లోకం 02:-*

*ఉదేతి భవతో విశ్వం వారిధేరివ బుద్బుదః ।*

*ఇతి జ్ఞాత్వైకమాత్మానమేవమేవ లయం వ్రజ ॥ 5-2 ॥*

 శ్లో||

 ఉదేతి భవతో విశ్వం వారిధేరివ బుద్బుదః |

ఇతి జ్ఞాత్వైకమాత్మానం ఏవ మేవ లయం ప్రజః ||2.

*उदेति भवतो विश्वं वारिधेरिव बुद्बुदः ।*

*इति ज्ञात्वैकमात्मानमेवमेव लयं व्रज ॥ ५-२ ॥*

*udeti bhavato vishvam vaaridheriva budbudah’ ।*

*iti jnyaatvaikamaatmaanamevameva layam vraja ॥ 5-2 ॥*

*టీకా*

వారిదేః = సముద్రమునుండి, బుద్బుద ఇవ = బుడగవలె, భవతః=నీ నుండి, విశ్వం = ప్రపంచము, ఉదేతి = పుట్టుచున్నది, ఇతి = ఇట్లని, ఏకం = ఒకటియైన, ఆత్మానం =   ఆత్మను,ఏవమేవ = ఈ ప్రకారముగానే, జ్ఞాత్వా = తెలిసికొని, లయం = శాంతి రూప మోక్ష మును, వ్రజ = పొందుము.

*వివరణ:-*

సముద్రంలో నుండి ఒక నీటి బుడగ జనించినట్టుగా నీలో నుండి ఈ జగత్తు ఉద్భవిస్తుంది. ఇది తెలుసుకుని అద్వైతజ్ఞానంతో ఆత్మగా నిలచిపో, ఈ విధంగా మనోలయాన్ని సాధించు.

*తాత్పర్యం:-*

ఈ గీత అంతటా ఈ సముద్రం, తరంగాలు, బిందువు, ఉపమానం విరివిగా వాడబడింది. ధ్యానానుకూలమయిన ఒక చక్కటి భావం, ఈ శ్లోకంలో అందించబడింది.

 సముద్రపు నీటి నుండి ఏవిధంగా ఒక నీటి బిందువు వేరుగా ఉన్నట్టు కనబడి కొంతకాలం విహరించి మళ్ళీ సముద్రంలో నీరుగా లయం అయి పోతుందో అదేవిధంగా నీ చైతన్యంలో జగద్భావం ఉదయించి నర్తించి లయం అయిపోతుంది.

 జలకణంగా ఉన్నా అది సముద్రపు నీరే, కేవలం నామ రూపాలు మాత్రమే వేరుగా ఉన్నాయి ఇదే విధంగా జగత్తు అనేక నామరూపాలతో తెలియ బడుతున్నా అధిష్ఠానమయిన ఆత్మ చైతన్యంకంటే వేరు గాదు...

నిత్యమూ దృఢ భావంతో ఈ భావాన్ని మననం చేస్తుంటే మనస్సులోని ఉద్రేకాలూ బుద్ధిలోని అలజడులు తగ్గి శాంత స్థితి నంది ప్రగాఢ ధ్యానంలో అనంత చైతన్యరూపమయిన ఆత్మానుభవం లభ్యమవుతుంది. ఈ విధంగా మనోలయాన్ని సాధించవచ్చు.

ఇక్కడ ఈ రెండవ మెట్టులో అష్టావక్రులు ఇలా సూచిస్తున్నారు. ప్రగాఢ ధ్యానంలో సాధకుడు తన మనస్సునూ, మనోభావజనిత కల్లోలాలనూ కూడా పూర్తిగా లయం చెయ్యాలి.

అనంతమైన ఆత్మనే నేను అనుకోవడానికి ఎంతో ధీరత్వమూ, శాస్త్ర హృదయాన్నర్థం చేసుకున్న శుద్ధమైన తేజోవంతమైన బుద్ధి అత్యవసరం. ఇవి లేనిదే వేదాంత ధ్యానమూ అభ్యాసమూ సాధ్యంకావు. "అహం బ్రహ్మాస్మి"- "నేను అనంతమైన ఆత్మ చైతన్యాన్ని" అనే భావం యోగవాశిష్టంలో ఒక శ్లోకంలో ఇలా చెప్పబడింది.

బ్రహ్మేంద్ర విష్ణువరుణాః యద్యత్కర్తుం సముద్యతాః!

తరహం చిదీవపుః సర్వం కరోమిత్యేవ భావయేత్. (యోగవాశిష్టం 121 -8)!!

బ్రహ్మనిష్ణువు వరుణుడు మొదలైన దేవతలు సాధించగలిగిన దేదైనాసరే, శుద్ధ చైతన్యమయిన నేను నిశ్చయంగా సాధించగలను.

ఇది అభూతకల్పనో ఊహాగానమో కాదు. సత్యమైన ఆత్మబలం అంతటిది! అయితే ఈ స్థితిని ఒక్క మారుగా ఎవరూ సాధించలేరు. క్రమంగా ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ భగవద్గీతలో సూచించినట్లుగా ఓర్పుతో అచంచల దీక్షతో సాధించాలి.

 శనైః శనైః రుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా!!

 ఆత్మసంస్థం మనఃకృత్వా న కించిదపి చింతయేత్ . (భగవద్గీత-VI-25)

క్రమంగా మెల్లమెల్లగా శాంతస్థితిని సాధిస్తూ బుద్ధిని దృఢంగా ఉంచి మనస్సును ఆత్మభావంలో లగ్నం చేసి అన్యభావాలను విడనాడాలి.

......


75) అష్టావక్ర గీత 

అధ్యాయం - 5

చతుర్విధ మార్గాలు-అహంకార వినాశనం-లయం

శ్లోకం 03:-

ప్రత్యక్షమప్యవస్తుత్వాద్ విశ్వం నాస్త్యమలే త్వయి ।

రజ్జుసర్ప ఇవ వ్యక్తమేవమేవ లయం వ్రజ ॥ 5-3 ॥

ప్రత్యక్షమవ్యవస్తుత్వాత్ విశ్వం నాస్త్యమలే త్వయి |

శ్లో రజ్జుసర్ప ఇవ వ్యక్తం ఏవ మేవ లయం ప్రజ  3.

प्रत्यक्षमप्यवस्तुत्वाद् विश्वं नास्त्यमले त्वयि ।

रज्जुसर्प इव व्यक्तमेवमेव लयं व्रज ॥ ५-३ ॥

pratyakshamapyavastutvaad vishvam naastyamale tvayi ।

rajjusarpa iva vyaktamevameva layam vraja ॥ 5-3 ॥

టీకా

 వ్యక్తం = దృశ్యమానమగు, విశ్వం = సంసారము, ప్రత్యక్షమపి = ప్రత్యక్ష మైనప్పటికినీ, అవస్తుత్వాత్ = వాస్తవముగా లేనిదైనందున, అమలే = మలరహితుడవగు, త్వయి = నీయందు, రజ్జుసర్ప ఇవ = రజ్జువునందు సర్పమువలె, నాస్తి = లేదు, ఏవమేవ = ఈ ప్రకారముగానే, లయం = శాంతిని, ప్రజ = పొందుము. 

వివరణ:-

తాడులో భ్రాంతసర్పంవలె నీలో ఈ జగత్తు ఉన్నట్టుగా కనిపిస్తున్నా, పరమార్థతః విశ్వం లేనే లేదు. నీవు శుద్ధమైన చైతన్య స్వరూపానివి. ఈ భావం నీలో దృఢపడితే నీ మనస్సు నశిస్తుంది. ఈ విధంగా మనోలయాన్ని సాధించు.

తాత్పర్యం:-

సాధారణంగా మనం ఏదైన వస్తువును చూస్తే అది ఉంది అనే అనుకుంటాము. ఆ వస్తువు నిజంగా లేదేమో అనే అనుమానం అయినా మనకు రాదు. మనం చూసినదంతా నిజం కానక్కర లేదని కొన్ని ఉదాహరణలలో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.

తాడులో పామును ఊహించి భ్రమ జెందడమూ నత్తగుల్లను వెండి వస్తువుగా పొరపడడమూ, స్తంభాన్ని చూసి భూతమని భయ పడడమూ,ఇవన్నీ ఆయా సమయాలలో ఎంతనిజంగా కనిపించినా కేవలం మనః

కల్పితాలే.

ఉపనిషత్తులలో తరుచుగా వాడబడే ఈ ఉపమానంతో అష్టావక్రులు ఇలా సూచిస్తున్నారు. ఈ జగత్తు కనిపిస్తున్నా వస్తుతః మనఃకల్పిత భ్రమ మాత్రమే, చూడడానికి నిజంగా కనిపిస్తూ అనుభవయోగ్యంగా మనస్సుచే గుర్తింపబడుతూ ఉన్నప్పటికీ మనస్సును అధిగమించి చైతన్యానుభవంలో ఆత్మనిష్ఠ కలిగినప్పుడు జగత్తుకు ఉనికి లేనేలేదు.

 భావప్రవాహమయిన మనస్సులో  గుర్తింపబడుతూ భావనామాత్రంగా అనేక నామరూపాలుగా మనోబుద్ధులచే తెలియబడుతూ ఈ జగత్తంతా నిజంగా ఉన్నట్టుగా భావింపబడుతున్నది.

ఆత్మ చైతన్యం తనదైన "సత్ ' లక్షణంతో ఉనికిగా స్ఫురిస్తూ, "చిత్" లక్షణంతో తెలుసు కుంటున్నానని భావిస్తున్నది నేననే భావంచే, వివిధ ప్రత్యేక రూప సమన్వితమయిన, విశ్వంగా, నామరూపాలతో, భావాలుగా, భావప్రవాహమయిన మనస్సులో గుర్తింపబడుతున్నది.

ఈ మనఃకల్పిత మాత్రమయిన జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని స్పష్టంగా గుర్తిస్తూ,తన పై ఆరోపింపబడిందని తెలుసుకుని, ఆరోపింపబడిన నామ రూపాలను విస్మరిస్తే, మనస్సు లయ స్థితిలో ఉంటుంది. ఈ విధంగా మనో లయాన్ని సాధించి స్వస్థితిలో నిలిచిపో.

ఇది లయ యోగంలో మూడవ మెట్టు. కనిపిస్తున్న దృశ్యజగత్తు యొక్క మిథ్యాత్వాన్ని గుర్తించి ప్రపంచం లేదనే నిశ్చయభావంతో, మిథ్యాత్వభావాన్ని సాధకుని చైతన్యంలో లయం చేయాలి. ఈ విధానం అన్నపూర్ణోపనిషత్తులో ఇలా వివరింపబడింది.

యథా విపణగా లోకా విహరన్తోఽప్యసత్సమాః । 

అసంబన్ధాత్తథా జ్ఞస్య గ్రామోఽపి విపినోపమః ॥

 (అన్నపూర్లోపనిషత్తు 1-23)

 ఈ లయాన్ని సాధించిన జ్ఞాని నిత్యమూ కేవలుడై ఆ అనుభవంలో ఉండగలుగుతాడు. జనసమూహ మధ్యంలో ఉన్నా అతని శాంతికి భంగం కలుగదు.

గౌడపాదుని కారికలో కూడా ఈ లయయోగాభ్యాసం ఎంతో ఫలవంతంగా వర్ణింపబడింది. ఏకాగ్రమయిన మనస్సుతో,ధ్యానంలో,బాహ్యవస్తుమయ ప్రపంచ జ్ఞానాన్ని లయం చెయ్యాలి. ఆత్మనే ఏకాగ్రతతో ధ్యానించాలి.

"అపరోక్షానుభూతి" లో ఆచార్యశంకరులు,ధ్యానంతో మనోలయాన్ని మూడు దశలుగా సాధించ వచ్చునని బోధించేరు.

1) శరీరమూ అది చూసే ప్రపంచమూ నేను కానని తెలుసుకుని దేహతాదాత్మ్యాన్ని విడవాలి.

2) ఆత్మనే నేనని తెలుసుకొని ఆ భావంలో ధ్యానంలో నిలవాలి.

3)ఆత్మజ్ఞానాన్ని కూడా మరిచిపోయి నిశ్చలంగా చైతన్యంగా నిలచిపోవాలి.

ఈ లయ యోగాన్ని శూన్యవాదంగా పొరపడకూడదు. అన్ని లేవనుకుంటూ శూన్యంలో నిలచిపోవడమే దీని లక్ష్యం కాదు. భగవద్గీతగానీ, అష్టావక్రుడు కానీ ఉపనిషద్ ఋషులు కానీ, ఈ శూన్యవాదాన్నీ బోధించలేదు. అహంకారం కేంద్రంగా మనస్సు అనునిత్యమూ అనేకత్వాన్ని గుర్తిస్తూ భ్రమపడుతున్నది. ఈ భ్రమను తొలగించడానికి అద్వైతసత్యాన్ని అర్థం చేసుకుంటూ ఆ స్థితిలో, అనుభవంలో నిలువగలగడాన్నే వీరందరూ బోధిస్తున్నారు.

___

76) అష్టావక్ర గీత 

అధ్యాయం - 6

 పరమాత్మ   

గురువైన అష్టావక్ర మునీంద్రునికి శిష్యుడైన జనకరాజర్షికి జరిగిన సంవాదరూపంగా అష్టావక్రగీత ఉపదేశింపబడినది.

అద్వయమైన ఆత్మ తత్త్వాన్ని వేదాంత దృష్టితో అర్థం చేసుకోగోరుతున్న సాధకులమైన మనకు, ఆ మహర్షి చూపించే సత్యం దిగ్భ్రాంతులను చేస్తుంది.

సత్యద్రష్ట అయిన జనకుని దృష్టి, స్థితి అను మహోన్నతానుభవమూ రేఖా మాత్రంగానయినా అర్థం చేసుకుని మనస్సు మౌనంగా నిశ్చలంగా భావరహితంగా నిలచిపోతుంది.

కిందటి అధ్యాయంలో లయయోగం గురించి అష్టావక్రులు వివరించారు. ఈ అధ్యాయంలో వారి శిష్యుడయిన రాజర్షి జనకుడు లయం చేయవలసినదేదీ లేదని, తాను చూస్తున్నదంతా సత్ చిత్ ఆనందమయమైన ఆత్మ మాత్రమేనని అంటున్నారు.

అద్వయమైన ఆత్మలో లయం చెయ్యబడవలసిన రెండవదేదిలేనే లేదు. ఇది అన్నిటికీ అతీతంగా ఉంది----- "ప్రకృతేః పరాః పరాత్ పరా!?"--లయ యోగంతో లయం చేసే ప్రయత్నమే అజ్ఞానానికి నిదర్శనం. అద్వయమైన ఆత్మలో దేనిని లయం చెయ్యాలి? ఇదీ జనకుని ప్రశ్న.

సర్వానికీ అతీతంగా ఉన్న ఈ ఆత్మస్థితే ఈ అధ్యాయంలో వివరింపబడుతుంది. ఆత్మ మహాకాశంగానూ, జగత్తు అందులో ఉన్న ఘటతుల్యం గాను వర్ణింపబడి, ఆత్మతత్త్వాన్ని అర్థం చేసుకున్నాక జగత్తు ఆత్మను ఏ విధంగానూ పరిమితం చెయ్యనేరదని స్పష్టం చేస్తున్నారు. 

అష్టావక్రగీతలో ఆత్మ యొక్క సగుణ నిర్గుణ తత్త్వాలు రెండూ సమానస్థాయిలో చూపబడ్డాయి. సత్ చిత్ లక్షణాల ఏకత్వమూ, అవినాభావ సంబంధము వివరింపబడ్డాయి. భగవద్గీత కూడా దీనినే ఘంటాపథంగా చెప్తోంది. "సర్వజగత్తు ఆత్మలోనే ఉంది ఆత్మ సర్వజగత్తులోనూ ఉంది!

ఇటువంటి స్థితిలో దేనిని ఎందులో లయం చెయ్యాలి? లయ = యోగాభ్యాసం అసందర్భం, అర్థరహితం అనవసరం అంటున్నారు.

 రాజర్షి చూస్తున్నాననుకునే అహంకార రూపంలో కొంత అజ్ఞానం మిగిలి ఉంటేనే, దానిని లయం చెయ్యడానికి ప్రయత్నం చెయ్యాలి. ఉన్నది ఒకే ఒక ఆత్మ అని సర్వదా తెలుసుకున్నప్పుడు లయంతో అవసరమేముంది? 

***

79) అష్టావక్ర గీత 

అధ్యాయం - 6

పరమాత్మ 

శ్లోకం 03:-

అహం స శుక్తిసంకాశో రూప్యవద్ విశ్వకల్పనా ।

ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః ॥ 6-3 ॥

అహం స శుక్తిసంకాశః

రూప్యవద్విశ్వకల్పనాః |

ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః ||3.

अहं स शुक्तिसङ्काशो रूप्यवद् विश्वकल्पना ।

इति ज्ञानं तथैतस्य न त्यागो न ग्रहो लयः ॥ ६-३ ॥

aham sa shuktisankaasho roopyavad vishvakalpanaa ।

iti jnyaanam tathaitasya na tyaago na graho layah’ ॥ 6-3 ॥

టీకా

సః = ఆ,అహం = నేను, శుక్తి సంకాశః = ముత్యపు చిప్పతో సమానుడను, విశ్వకల్పనా = ప్రపంచకల్పనము, రూప్యవత్ = వెండితో సమానముగా నున్నది. తథా = ఆ కారణమువలన, ఏతస్య = దీనికి, త్యాగః న = త్యాగము లేదు, గ్రహః = గ్రహణము, న = లేదు, లయః = లయము, న = లేదు.

వివరణ:-

నత్తగుల్లలో వెండిని చూసినట్లు భ్రమచెందడం వంటిదే---నాలో జగత్తును చూడడం, నన్ను నేను తెలుసుకోవడానికి త్యజించవలసినది, ఆమోదించవలసినది నశింపజేయవలసినది ఏదీ లేదు.

తాత్పర్యం:-

శుద్ధచైతన్యం జగత్తుగా కనబడడానికి పరిణామం చెంది ఉండాలనే సందేహం మిగిలి ఉంటుంది. చాలా మంది సాధకులలో ఈ సందేహ నివారణార్ధమే ఈ ఉపమానాలు ఉపయోగింపబడుతున్నాయి.

 వెండిగా కనబడడంలో గుల్ల ఏ విధంగానూ మార్పు చెందడం లేదు. గుల్ల యధాప్రకారంగానే ఉంటుంది. భ్రమ వల్ల గుర్తించే బాహ్యరూపాల వల్ల అధిష్ఠానం మార్పు చెందదు. శుద్ధ చైతన్యమే నేనని తెలుసుకోవడమే జ్ఞానం.

 అహంకారమూ, అహంకారం అనుభవించే బాహ్య వస్తుమయ ప్రపంచ భావనలూ కూడా కేవలం మిథ్య. భ్రమాకల్పితమైన భావనలు మాత్రమే. ఇటువంటి అఖండ చైతన్యానుభవంలో లయయోగాన్ని అభ్యసించడం అనవసరమే, అసాధ్యమే.

80) అష్టావక్ర గీత 

అధ్యాయం - 6

పరమాత్మ 


శ్లోకం 04:-

అహం వా సర్వభూతేషు సర్వభూతాన్యథో మయి ।

ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః ॥ 6-4 ॥


अहं वा सर्वभूतेषु सर्वभूतान्यथो मयि ।

इति ज्ञानं तथैतस्य न त्यागो न ग्रहो लयः ॥ ६-४ ॥


aham vaa sarvabhooteshu sarvabhootaanyatho mayi ।

iti jnyaanam tathaitasya na tyaago na graho layah’ ॥ 6-4 ॥

టీకా

అహం = నేను, వా = నిశ్చయముగా, సర్వభూతేషు = సమస్తభూతముల యందును, అథో = మరియు, సర్వభూతాని = సకలభూతములును, మయి = నాయందును, (సన్తి = ఉంటున్నవి), తథా = ఈ కారణమువలన, ఏతస్య = దీనికి, న త్యాగః = త్యాగము లేదు, న గ్రహః = గ్రహణము లేదు, న = లయః = లయమున్ను లేదు, ఇతి = ఈ ప్రకారమైనదో, జ్ఞానం = జ్ఞానము. 

వివరణ:-

సర్వప్రాణులలోనూ నేనున్నాను. నాలో సర్వజగత్తూ ఉంది. ఇదే నిజమైన జ్ఞానం. నేను త్యజించవలసినది కాని, ఆమోదించవలసినది కాని, లయం చేయవలసినది కాని----ఏది లేదు.

తాత్పర్యం:-

ఉపనిషద్వాఙ్మయంలో ఆత్మజ్ఞానం లభించడం అంటే మిగిలిన చరాచర జగత్తు అంతటి కన్నా భిన్నంగా సాధకుడు తన దివ్యత్వాన్ని గ్రహించడం అని అర్థం కాదు.

అనంత సౌందర్యమయమూ సత్యజ్ఞాన స్వరూపమూ అయిన తన్ను తాను తెలుసుకొని, తనకంటే వేరుగా రెండవదేదీ లేదని నిశ్చయంగా గ్రహించి ఆ స్థితిలో నిత్యమూ ఉండడమే ఆత్మనిష్ఠ అనబడుతుంది.

 స్వప్నం నుండి మేలుకోగానే స్వప్న ప్రపంచమంతా జాగ్రత్ జ్యోతిలో లీనమై పోతుంది. ఇదేవిధంగా ఆత్మజ్ఞానానుభవంతో అఖిలజగత్తు మిథ్యాకల్పిత. భావనా భ్రమగా చైతన్యస్వరూపమయిన తనలోనే ఉండడాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తాడు జ్ఞాని.

భగవద్భావాన్ని వర్ణించేటప్పుడూ, ఆత్మజ్ఞానవర్ణనలోనూ, కూడా సౌందర్యం అన్నపదం వాడబడుతూనే ఉన్నా, ఇది చాలావరకూ అపార్థం చేసుకోబడుతున్నది అని చెప్పక తీరదు.

సౌందర్యం అనగానే కంటికి కనిపించే రూపానికి మాత్రమే చెందినదనే అర్థంలోనే చాలామంది చూస్తున్నారు. ఏ ఒక్క వస్తువూ ఏ యిద్దరికీ ఒకే విధమయిన సౌందర్యభావన కలుగజేయదు.

పోగా కొందరికి ఇదే వస్తువు అనాకారంగా, అసహ్యంగా కనబడినా ఆశ్చర్యపోనక్కర లేదు! వస్తువులో సౌందర్యం లేదనీ, చూసే దృష్టిలో, భావంలో సౌందర్యం ఉన్నదనీ స్పష్టపడుతున్నది. ఈ సౌందర్యానికి ప్రమాణం ఏమిటి అన్నది చూడాలి. సౌందర్యానుభూతిలో మనస్సు నిశ్చలం అయి, ఆలోచనలు ఆగిన తరుణంలో స్వస్వరూపమయిన ఆనందంలో నిశ్చలంగా కాలాతీతంగా ఉండగలుగుతుంది.

 పరస్పరాధారమయిన బాహ్యప్రపంచ జ్ఞానంలోకి వచ్చిన తరువాతే ఆ అనుభవాన్ని తెలుసుకుని విలువను నిర్ణయిస్తుంది బుద్ధి. ఈ బుద్ధి దృష్ట్యా అలా కాలాతీత స్థితిలో ఎంతకాలం ఉండగలిగేమో, ఆ కాల పరిమాణమే అనుభూతికి కొలతబద్ద. ఈ కొలమానంతో కొలిస్తే అనంత సౌందర్య సంపన్నం ఆత్మానుభవం అన్నది నిర్వివాదాంశం.

కళ్ళతో చూసే దృశ్యసౌందర్యం, వీనులవిందైన సంగీత మాధుర్యం, మంచివాసన, అద్వైతానందాన్ననుభవంలోకి తెచ్చే స్పర్శానుభూతి, మంచి రుచీ, హృద్యంగమమైన కవితాసుధామాధురి, సర్వ కారణ కారణాన్నన్వేషించే తీవ్రబుద్ధి విభవమూ, ఇలా ఏ అనుభూతిని తీసుకున్నా వాటిని కొలిచే కొలమానం ఆనందమే.

ఆ దృష్టితో ఈ భావాలన్నిటి యొక్క అనంత అద్భుత రూపంగా ఆత్మను వర్ణించడం సమంజసమే. ఆధ్యాత్మిక సాధనలో వేదాంత వాజ్మయ పరిచయంలో ప్రతీపదానికి వాచ్యార్థమేకాక లక్ష్యార్థం కూడా ఉంటుందని గుర్తించి ఆ లక్ష్యాన్నందుకోవడానికి సాధకులు ప్రయత్నించాలి.

ఇటువంటి పరిపూర్ణతా దృష్టి కలిగిన జ్ఞాని భావాలు ఉపనిషత్తులలోనూ భగవద్గీతలోనూ కూడా ఇదే విధంగా వర్ణించబడ్డాయి. సత్యం ఒక్కటే, జ్ఞానానుభవం ఒక్కటే, కాబట్టే మహాత్ముల వచనాలన్నిటిలోనూ ఒకేభావం ధ్వనించడాన్ని చూడవచ్చు.

జనకుడు కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేస్తూ----" చైతన్యంగా అన్ని ప్రాణులలోనూ నేనే ఉన్నాను, చైతన్యమయిన నాలో సర్వప్రాణులూ ఉనికిని కలిగి ఉన్నాయి" అని అంటున్నారు. భూతం స్తంభం అంతటా పూర్తిగా ఉంది, స్తంభం భూతం నిండా ఆవరించి ఉంది. ఈ భావమే ఈశావాస్యో పనిషత్తులో ఇలా ఉంది.

యస్తుసర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి!

సర్వభూతేషు చాత్మానంతతో న విజుగుప్సతే!! (ఈశావాస్యోపనిషత్తు-8)

అన్ని నామరూపాలనూ తనవిగానూ, తనను అన్ని నామరూపాలలోనూ చూడగలిగిన జ్ఞానికి పతనం ఎన్నడూ లేదు.

ఇదే భావం భగవద్గీతలో ఇలా చెప్పబడింది.

సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని! ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః!! (భగవద్గీత-VI-29)

యోగారూఢుడైన జ్ఞాని, సర్వప్రాణులలోనూ చైతన్యంగా తననూ చైతన్య మయి. తనలో సర్వసృష్టినీ వీక్షించి సమత్వబుద్ధితో శాంతుడై జీవిస్తాడు.

ఇట్టి జ్ఞానికి లయ యోగం అవసరం ఏమిటి?

6వ అధ్యయం సమాప్తం.

81) అష్టావక్ర గీత 

అధ్యాయం - 7

 ఆత్మా - ఆనందనిలయం   

విద్యావంతులూ తెలివైనవాళ్ళూకూడా, మనం ఈ ప్రపంచం లోనికి వచ్ఛామనీ నమ్మడానికి సిద్ధంగా ఉంటారు. ఈ ప్రపంచం లోకి రావడం అంటే, ప్రపంచం మన నుండి విడిగా దూరంగా ఉందనీ, ఎక్కడి నుండో మనం ఇందులోకి వచ్ఛామనీ అర్థం.

ఇక్కడ కొద్దిగా ఆగి ఆలోచిస్తే, విజ్ఞానశాస్త్రం ఏమంటున్నదో పరిశీలిస్తే, సత్యం ఇందుకు భిన్నంగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది. నిజానికి మనం ఈ ప్రపంచంలోనికి రాలేదనీ, ప్రపంచంనుండే మనం పుట్టేమనీ విజ్ఞానశాస్త్రం విశ్వస నీయంగా చెప్పుతున్నది, ఋజువు చేస్తున్నది.

విజ్ఞానశాస్త్రవేత్తల కంటే ఒకడుగు ముందుకు వేస్తూ ఈ అధ్యాయంలో అష్టావక్రులు, ఈ ప్రపంచం మొత్తం ఆత్మ నుండే ఉద్భవించిందని నిశ్చయంగా చెప్పుతున్నారు.

అనంతసాగరంలో విడిగా కనిపిస్తూ కూడా సముద్రంగా ఉన్న తరంగాల వలెనే, అనంత చైతన్య స్వరూపమయిన ఆత్మలో మనమంతా విడిగా కనిపిస్తున్నప్పటికీ ఆత్మ మాత్రమే ఉంది, అనేక ప్రాణులు విడి విడిగా లేవు.

ఇలా విడివిడిగా వ్యక్తిత్వం కలిగిన జీవులతో ఈ ప్రపంచం ఆవరించబడి వేరుగా ఉనికి కలిగి లేదు. ఈ మొత్తం ప్రపంచం ఆత్మ చైతన్యంలోనే ప్రపంచభావంగా, భావప్రవాహమయిన మనస్సులో తెలియబడుతున్నది.

 సముద్రంలోని కదలికలు తరంగాలుగా నామరూపాలతో గుర్తింపబడుతున్నాయి. చైతన్యంలో నామరూపాత్మకమయిన మహాప్రపంచ భావనలు మనస్సులో కల్లోలం కలిగినప్పుడు తెలియబడుతున్నాయి.

ఈ మానసిక కల్లోలాన్ని ధ్యాన బలంతో లయం చెయ్యక పోయినా, ఈ మనస్సుకు మూలమయిన ఆత్మచైతన్యం సదా శాంత గంభీరంగా ఏకంగా ఉంటుంది.

 ఇందులో అలజడు లేమీ లేనేలేవు. బాహ్యంగా ఉపరిభాగంలో కెరటాలున్నప్పటికీ అగోచరమూ అనంత గంభీరమూ అయిన సాగరగర్భపు లోతులలో సదా శాంతంగా నిశ్చలంగా ఉండనే ఉంటుంది.

ఈ మౌన గంభీరమయిన చైతన్యరాశిలో, వాసనాప్రేరితమయిన మానసాకాశంలో అనంతనామాలు అనేక రూపాలు కనిపిస్తూ, మాయం అయిపోతూ నామరూపాలతో ప్రపంచంగా గుర్తింపబడుతూ, గుర్తింపబడడాన్ని కాలభావంతో గమనిస్తూ, విషయాలను అనుభవిస్తున్నాననుకుంటున్నది అహంకార భావం---ఇదంతా ఇంద్రజాలికుని విద్యావిభవం వంటిదే.

చంచలించే మనస్సు కల్పించే భ్రమలే ఈ సృష్టి దాని లయమూ, కూడా. మనస్సును, అందులో తెలియబడే భావనామయ ప్రపంచాన్నీ ఉందని ఆమోదించడం కాని, లేదని నిరూపించడం కాని ఆత్మకు అవసరం లేదు.

చైతన్యసాగరము అనదగిన ఆత్మ నిశ్చల గంభీరంగా శాంతంగా నిత్యమూ ఉంటుంది. భావనాతరంగాలు అప్పుడప్పుడు కదలాడి నామరూపాలతో తెలియబడి గుర్తింప బడుతుంటాయి.

లయ యోగాభ్యాసం చెయ్యడం అజ్ఞానం మిగిలి ఉండడానికి చిహ్నమనీ, దాని అవసరంలేదనీ చెప్పిన జనకులు ఇంకా సంతృప్తి చెందక ఆత్మతత్త్వం గురించి ఆనందంతో ఇంకా వర్ణిస్తున్నారు.

 ఈ అధ్యాయంలో, ఆత్మ ఆనందానికి నిలయం, అద్భుత సౌసౌందర్య తేజో విరాజితం, అనుపమానం, కేవలం అని ఆనందంతో గానం చేస్తున్నారు.

---

82) అష్టావక్ర గీత 
అధ్యాయం - 7
ఆత్మా - ఆనందనిలయం  

 శ్లోకం 01

జనక ఉవాచ ॥

మయ్యనంతమహాంభోధౌ విశ్వపోత ఇతస్తతః ।
భ్రమతి స్వాంతవాతేన న మమాస్త్యసహిష్ణుతా ॥ 7-1 ॥

జనక ఉవాచ :

శో శ్లో|| మయ్యనన్త మహామ్బోధా విశ్వపోత ఇతస్తతః | 
భ్రమతి స్వాన్తవా తేన న మమా స్త్యసహిష్ణుతా ||1.


जनक उवाच ॥
मय्यनन्तमहाम्भोधौ विश्वपोत इतस्ततः ।
भ्रमति स्वान्तवातेन न ममास्त्यसहिष्णुता ॥ ७-१ ॥

janaka uvaacha ॥

mayyanantamahaambhodhau vishvapota itastatah’ ।
bhramati svaantavaatena na mamaastyasahishnutaa ॥ 7-1 ॥

టీకా

 అనన్తమహామ్భోధౌ=అపార మహాసముద్రమువలెనున్ను, మయి= నాయందు, విశ్వపోతః = ప్రపంచరూపనావ, స్వాన్తవాతేన = మనోరూపవాయువు చేత, ఇతస్తతః = ఇటునటు, భ్రమతి = తిరుగుచున్నది (పరంతు = అయితే), మమ = నాకు, అసహిష్ణుతా = అసహనశీలత, నాస్తి = లేదు. 

వివరణ:-

అపారసాగరంవలె ఉన్న నాలో జగత్తనే నావ మనస్సనే వాయువుచే కదలింపబడినదై కదలాడుతున్నది. అందువల్ల నాకు ఏ విధమైన అశాంతీ లేదు. 

తాత్పర్యం
జ్ఞాని అనగానే అతని చుట్టూ ఉన్న నానాత్వాన్ని చూడనివాడనీ, అతని మనస్సులోనూ బుద్ధిలోనూ, ఆలోచనలుండవనీ అర్థం కాదు.

 అవన్నీ ఉన్నా అతడు మనవలె రాగద్వేషాధీనుడై చలించకుండా స్థిరంగా ఉండగలడు. బాహ్యాభ్యంతరాలలో అతనికి ప్రపంచం వలన ఎలాంటి అశాంతీ కలుగదు.

 నిత్యమూ తాను అనంత చైతన్య స్వరూపమయిన ఆత్మననే జ్ఞానం ఉండడంతో, తానుగాక రెండవదేదీ లేదనే దృఢజ్ఞానంతో నిర్భయంగా సంతోషంగా జీవించగలడు.

ఈ చైతన్య మహాసముద్రంలో అలలవలె జగత్తు నామరూపాలతో తెలియబడుతూ ఉంటుంది. వాసనాబలం కారణంగా మనస్సులో కోరికలనే సుడి గాలులు బయలుదేరి చైతన్యసాగర ఉపరిభాగంలో అలలవలె, ప్రపంచం నామ రూపాలతో మనస్సులోన తెలియబడుతుంది.

 వారివారి రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు ఆధారంగా ప్రతివారి మనస్సులోనూ వారిదైన ప్రత్యేక ప్రపంచం నిర్మింపబడుతూ ఉంటుంది. ఈ విధంగా నా మనస్సులో నా భావనా లోకమూ, నీ మనస్సులో నీ మనోసామ్రాజ్యమూ ఉత్పన్నం కావడంతో ఎవరికి వారే, ఒకే చోట ఉన్నా, ఎంతో దూరంగా ఎవరి ప్రత్యేక లోకంలో వారు నివసిస్తూ ఉంటారు.

ఈ వ్యక్తిగత కల్పిత లోకాల సమిష్టిరూపమే బాహ్యంగా మనకు కనబడే చరాచర జగత్తంతా, ఇదంతా ఈ సమిష్టి మనస్సుచే కల్పింపబడి స్థితినంది, లయం అయి పోతూ, ఈ మధ్యలో చరిత్రను సృష్టిస్తూ, అనంతకాలపు వాహనంగా సాగిపోతూ ఉన్నట్టుగా మనస్సులో గుర్తింపబడుతున్నది.

తనచే గుర్తింపబడేదంతా ఈ వ్యష్టి, సమిష్టి మనస్సుల యొక్క కల్పన అని తెలుసుకున్న జనకరాజర్షి " జ్ఞానికి ప్రపంచం వలన అశాంతి కలుగదు, బాహ్యాభ్యంతరాలలో ఏమి సంభవించినా అదంతా భ్రమమాత్రమే అని తెలుసుకుని సదా శాంతంగా తన సహజస్థితిలో ఉండగలడు" అని నిశ్చయంగా చెబుతున్నాడు.

***

84) అష్టావక్ర గీత  

అధ్యాయం - 7
ఆత్మా - ఆనందనిలయం  

 శ్లోకం 03:-

మయ్యనంతమహాంభోధౌ విశ్వం నామ వికల్పనా ।
అతిశాంతో నిరాకార ఏతదేవాహమాస్థితః ॥ 7-3 ॥

 శ్లో|| మయ్యనన్త మహామ్బోధౌ విశ్వం నామ వికల్పనా | 
అతిశాన్తో నిరాకర ఏతదేవాహమాస్థితః || 3.

मय्यनन्तमहाम्भोधौ विश्वं नाम विकल्पना ।
अतिशान्तो निराकार एतदेवाहमास्थितः ॥ ७-३ ॥

mayyanantamahaambhodhau vishvam naama vikalpanaa ।
atishaanto niraakaara etadevaahamaasthitah’ ॥ 7-3 ॥

టీకా

అనన్త మహామ్భోధౌ = అనంతమహాసముద్రమువలెనున్న, మయి =  నాయందు, నిశ్వం = ప్రపంచము, నామ = అనగా, వికల్పనా = కల్పనా మాత్రమై యున్నది, అహం = నేను, అతిశాన్తః = అత్యంత శాంతస్వరూపుడను, నిరాకారః = నిరాకారుడను, చ = మఱియు, ఏతదేవ = ఈ ఆత్మకు, ఆస్థితః = ఆశ్రయుడనై యున్నాను.

వివరణ:-

అనంతసాగరమువలె ఉన్న నాలో జగత్తనే ఊహాకల్పిత భ్రమ తెలియబడుతున్నది. నేను నిత్యమూ శాంతంగా నిరాకారంగా కేవలంగా ఉన్నాను. ఈ నిశ్చయ జ్ఞానంలో నేను నిశ్చలంగా ఆనందంగా ఉన్నాను.

తాత్పర్యం:-

క్రిందటి శ్లోకంలో వాడబడిన సాగరమూ తరంగాలూ ఉపమానం వినగానే తొందరపడి సాధకుడు, సాగరంలో వచ్చిన కదలిక వల్ల పరిణామం చెంది, తరంగాలు ఎర్పడినట్లే చైతన్యం పరిణామం చెంది భావనామయ జగత్తుగా ఏర్పడిందని అనుకోవచ్చును.

చైతన్యం తాత్కాలికమే అయినా నామరూపాలుగా మారిందని అపోహ పడవచ్చు. ఈ అపార్థానికి అవకాశం కలుగకుండా ఈ శ్లోకం చెప్పబడింది.

నామరూపాత్మకమైన ఈ చరాచర జగత్తంతా సమిష్టి మనస్సు యొక్క ఊహాకల్పన మాత్రమే, "వికల్పన మాత్రమే. నిజానికి ప్రపంచానికి ఉనికి లేనే లేదు. ఆత్మ నిరాకారంగా నిశ్చలంగా సదా శాంతగంభీరంగా ఉంది.

 ఈ విషయం ఇది వరకే మొదటి అధ్యాయంలో స్పష్టం చేయబడింది.--- "సాకార మనృతం విద్ధి నిరాకారం తు నిశ్చలమ్"(1-18). రూపం కలిగినవన్నీ భ్రమలే, ఇవి మార్పు చెంది నశిస్తాయి. రూపరహితమైనది మాత్రమే నిత్యం, పరిణామరహితం.

---
85) అష్టావక్ర గీత  

అధ్యాయం - 7
ఆత్మా - ఆనందనిలయం  

 శ్లోకం 04:-

నాత్మా భావేషు నో భావస్తత్రానంతే నిరంజనే ।
ఇత్యసక్తోఽస్పృహః శాంత ఏతదేవాహమాస్తితః ॥ 7-4 ॥

శ్లో|| నాత్మా భావేషు నో భావః తత్రానన్తే నిరంజనే |
 ఇత్యసక్ కస్పృహశ్శానః ఏతదేవాహమాస్థితః || 4.

नात्मा भावेषु नो भावस्तत्रानन्ते निरञ्जने ।
इत्यसक्तोऽस्पृहः शान्त एतदेवाहमास्तितः ॥ ७-४ ॥

naatmaa bhaaveshu no bhaavastatraanante niranjane ।
ityasakto’spri’hah’ shaanta etadevaahamaastitah’ ॥ 7-4 ॥

టీకా 

ఆత్మా = ఆత్మ, భావేషు = దేహాదిభావములయందు, న = లేదు, భావః = దేహాదికభావము, తత్ర = ఆ, అనన్తే = అనంతమైన, నిరంజనే = నిరంజన (నిర్ద్వంద్వ)మైన ఆత్మయందు, నో= లేదు, ఇతి = ఈ ప్రకారముగా, అసక్తః = సంగరహితుడనైన, శాన్తః = శాంతుడనైన, అహం= నేను, ఏతదేవ ఈ యాత్మ స్వరూపుడనైయ్యే, ఆస్థితః = ఉంటున్నాను.

వివరణ:-

ఆత్మ వస్తువులో లేదు, వస్తువు కూడా ఆత్మలో ఉండజాలదు. ఆత్మ అనంతం, అమలం, అద్వయం కాబట్టి ఆత్మలో కోరికలు రాగభావం ఉండే ఆస్కారం లేదు. ఇది నిత్యశాంత స్వరూపం. ఈ జ్ఞానంతో సదా నేను శాంతంగా నిశ్చలంగా ఉంటాను.

తాత్పర్యం:-

స్తంభం భూతంగా మారలేదు. భూతం భ్రమాజన్య కల్పిత భావన, ఈ భూతం స్తంభంలో ఎన్నడూ లేదు.

ఇదే విధంగా మనః కల్పిత భావసమూహమయిన వస్తుమయ ప్రపంచం ఆత్మలో ఎప్పుడూ లేదు. దృశ్యగోచరమయిన ప్రపంచానికి అధిష్ఠానంగా ఆత్మ ఉంది.

ఈ ఆత్మవస్తుమయ ప్రపంచం ఎన్నడూ మారనేలేదు. ఇది సహజంగా, శాంతంగా, స్థిరగంభీరంగా, అద్వయంగా ఉండడం చేత, దేనిమీదనయినా రాగం, ద్వేషం, కోరిక ఉండే ఆస్కారమే లేదు.
ఆత్మ కన్నా రెండవది లేనే లేదు. కాబట్టి ఆత్మచే కోరబడవలసినదేదీ ఉండదు. ఏకంగా అద్వయంగా ఉన్న ఆత్మే ఈ కనిపించే సర్వమూ కూడా అని ఉపనిషత్తు ఉద్బోధిస్తున్నది--

"ఆత్మా ఏకమేవ ఇదం సర్వం" రాగభావమూ, కోరికా మనః కల్పిత భ్రమలు మాత్రమే. ఈ రెండింటిని అధిగమిస్తే మనస్సును అధిగమించి నట్టే.

మనస్సు లేనిచోట అశాంతి ఉండదు, శాంతగంభీరమైన ఆత్మానందమే ఉంటుంది. ఈ దృఢజ్ఞానానుభవ నిష్ఠుడయిన జనకుడు సదా ఆనందంగా తాను మాత్రమే ఉన్నానని అంటున్నారు.

----


88) అష్టావక్ర గీత

అధ్యాయం - 8
బంధము - విముక్తి   
శ్లోకం 01:-

अष्टावक्र उवाच ॥

तदा बन्धो यदा चित्तं किञ्चिद् वाञ्छति शोचति ।
किञ्चिन् मुञ्चति गृण्हाति किञ्चिद् दृष्यति कुप्यति ॥ ८-१ ॥

అష్టావక్ర ఉవాచ ॥

తదా బంధో యదా చిత్తం కించిద్ వాంఛతి శోచతి ।
కించిన్ ముంచతి గృణ్హాతి కించిద్ దృష్యతి కుప్యతి ॥ 8-1 ॥

అష్టావక్ర ఉవాచ ॥
శ్లో॥ తదా బన్ధో యదాచిత్తం కించిద్వాంఛతి శోచతి | కించిన్ముంచతి గృహ్ణతి కించిద్ధృష్యతి కుప్యతి || 1.

asht’aavakra uvaacha ॥

tadaa bandho yadaa chittam kinchid vaanchhati shochati ।
kinchin munchati gri’nhaati kinchid dri’shyati kupyati ॥ 8-1 ॥

 టీకా

 యదా = ఎప్పుడు, చిత్తం మనస్సు, కిఇశ్చిత్ = ఏ కొంచెమునైనను, వాంఛతి = కోరుచున్నదో, శోచతి = దుఃఖించుచున్నదో, ముఇ్చతి = విడుచుచున్నదో, గృహ్ణతి = గ్రహించుచున్నదో, హృష్యతి = సంతోషించుచున్నదో, కుప్యతి = కోపించు చున్నదో, తదా = అప్పుడు,  బన్ధః = బంధము (భవతి = అగుచున్నది.)

వివరణ:-

మనస్సు దేనినయినా కోరినా దేనికోసమయినా విచారించినా, దేని నయినా అమోదించినా, నిరాకరించినా సంతోష విచారాలను పొందినా, బంధింపబడి ఉన్నట్టే.

తాత్పర్యం:-

ముందుగా బంధం అంటే ఏమిటో తెలియబరుస్తున్నారు అష్టావక్రులు, సాధకులమయిన మనందరికి ఇది అనుభవంలో ఉన్నదే కాబట్టి సులభంగా బోధ పడుతుంది. బంధంలో ఉండబట్టే ఈ అష్టావక్రగీతను చదువుతున్నారు.

అలా కాకపోతే హాయిగా ఎవరిగీతాన్ని వారే ఆలపిస్తూ ఏకాంతానందాన్ని అనుభవిస్తూనే ఉందురు!! బంధం అంటే ఏమిటో క్షుణ్ణంగా అర్థం చేసుకున్న బుద్ధికి ముక్త స్థితి ఊహామాత్రంగానైనా అంది తీరుతుంది.

బాహ్యప్రపంచంలో ఒక వస్తువును చూసి, యిష్టపడి, దానిని సంపాదించడం వలన, ఆనందం కలుగుతుందని నిశ్చయించుకుని అందుకు ప్రయత్నించాలను కోవడం "కోరిక" అనబడుతుంది. ఆ వస్తువును పొందలేకపోవడం కాని, పొంది కూడా కాలవశాత్తూ, పరిణామం చెందిన ఆ వస్తువు నచ్చకపోవడం, లేక వస్తువు నశించడం వీటి వల్ల కలిగేది విచారం అనబడుతుంది.

మనస్సుకు ఆహ్లాదం కలిగించే వస్తువులను ఆమోదిస్తుంది. అననుకూల మయిన వానిని త్యజించాలనుకుంటుంది. తనచుట్టూ ఉన్న పరిస్థితులు తనకు నచ్చినట్టు ఉంటే సంతోషంగా ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా ఉంటే, వ్యతిరేకించిన మనస్సు క్రోధావృతమవుతుంది.

ఇటువంటి మనస్సుకు బానిసగా జీవితాన్ని సాగించడం బంధం అవుతుంది. మనశ్శరీరాల యిష్టాయిష్టాలకు వశుడై వాటిని సదా సంతృప్తి పరచడానికి శ్రమిస్తూ, వాటికి కట్టుబడి బానిసవలె జీవించడమే బంధస్థితి.

---
89) అష్టావక్ర గీత

అధ్యాయం - 8

 బంధము - విముక్తి   
 శ్లోకం 02:-

तदा मुक्तिर्यदा चित्तं न वाञ्छति न शोचति ।
न मुञ्चति न गृण्हाति न हृष्यति न कुप्यति ॥ ८-२ ॥

తదా ముక్తిర్యదా చిత్తం న వాంఛతి న శోచతి ।
న ముంచతి న గృణ్హాతి న హృష్యతి న కుప్యతి ॥ 8-2 ॥

శ్లో|| తదాముక్తిర్యదా చిత్తం న వాంఛతి న శోచతి | 
న ముంచతి న గృహేతి న హృష్యతి న కుప్యతి || 2.

tadaa muktiryadaa chittam na vaanchhati na shochati ।
na munchati na gri’nhaati na hri’shyati na kupyati ॥ 8-2 ॥

యదా = ఎప్పుడు, చిత్తం మనస్సు, న నాంఛతి = కోరదో, స శోచతి = దుఃఖించదో, న ముంచతి = విడిచి పెట్టదో, న గృహ్ణతి= గ్రహించదో, న హృష్యతి = సంతోషించదో, న కుప్యతి = కోపించదో, తదా = అప్పుడు, ముక్తి: = ముక్తి, (భవతి = అగుచున్నది)

వివరణ:-

మనస్సు కోరికకూ విచారానికీ లోనుకానప్పుడు, సంతోషము విచారాలను పొందనప్పుడు, ఆమోదము, నిరాకరణము, క్రోధము ---వీటికి వశం కానప్పుడు ముక్త స్థితిలో ఉన్నట్టే.

తాత్పర్యం:-

క్రిందటి శ్లోకంలో వివరించబడిన బంధ స్థితికి వ్యతిరేకమయిన ముక్త స్థితి వర్ణించబడింది. ఈ స్థితి సాధింపబడాలంటే మనస్సుకు బాహ్యవస్తుమయ ప్రపంచంలో లభ్యమయ్యే, ఆనందం కంటే చాలా గొప్పదయిన ఆనందం తనలోనే ఉందని తెలియాలి.

ఈ ఆనందానుభవంలో లగ్నమయిన మనస్సు బాహ్య వస్తువులపై మమతానురాగాలను సృష్టించి పెంచుకోదు. అన్నపూర్ణోపనిషత్తు ఇలా అంటుంది.

న మోక్షే నభసః పృష్ఠేన పాతాలే న చ భూతలే!
సర్వాశాసంక్షయే చేతః క్షయో మోక్ష ఇతిష్యతే!!

( అన్నపూర్లోపనిషత్తు 11-23)

బాహ్యాభ్యంతర చతుర్దశ భువనాలలో ఎక్కడా ముక్తిలభించదు. కోరికల కల్లోలం నశించి శాంతస్థితినందిన మనస్సులో మాత్రమే ముక్తి లభ్యమవుతుంది.

కామాన్ని జయించినప్పుడు, కోరికలు లేనప్పుడు, ఆలోచనా ప్రవాహం ఆగి పోతుంది. మనస్సు తన రూపాన్ని కోల్పోయి స్వస్వరూపంలో నిలుస్తుంది. ఇదే ముక్తసితి.

ఇదే భావాన్ని యోగవాశిష్టం కూడా వ్యక్తం చేస్తుంది. 

భావనాశనం మోక్షా బంధో హి దృఢభావనా,

(యోగవాశిష్టం అధ్యాయం, 85-119) ఆలోచనలు నశించడమే ముక్తి, ఆలోచనా ప్రవాహంలో కొట్టుకుపోవడమే బంధం.

 సాధకుడు తన కోరికలను వివేకంతో విచక్షణా జ్ఞానంతో అర్థం చేసుకుని విడనాడడం కన్నా వేరుమార్గం లేదు. ఈ భావమే ఇంకొక చోట ఇలా వివరింపబడింది.

ఇచ్ఛామాత్రను విద్యేయం తన్నాశోమోక్ష ఉచ్యతే!
స చాసంకల్ప మాత్రేణ సిధోభవతి వై మునే!!

కోరికలకు విడిగా అజ్ఞానం లేదు. కోరికలు నశించిన స్థితే ముక్త స్థితి. కోరికలు నశించిన క్షణంలోనే మననశీలి అయిన మనీషి స్వతంత్రుడు అవుతున్నాడు.

---
*🧘‍♂️90) అష్టావక్ర గీత🧘‍♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*అధ్యాయం - 8*
*బంధము - విముక్తి*   
*శ్లోకం 03:-*

*तदा बन्धो यदा चित्तं सक्तं काश्वपि दृष्टिषु ।*
*तदा मोक्षो यदा चित्तमसक्तं सर्वदृष्टिषु ॥ ८-३ ॥*

*బంధో యదా చిత్తం సక్తం కాశ్వపి దృష్టిషు ।*
*మోక్షో యదా చిత్తమసక్తం సర్వదృష్టిషు ॥ 8-3 ॥*

శ్లో॥ తదా బన్ధో యదా చిత్తం
సక్తం కాస్వపి దృష్టిసు |
తదా మోక్షా యదా చిత్తం
అసక్తం సర్వదృష్టిషు |3.

*tadaa bandho yadaa chittam saktam kaashvapi dri’sht’ishu ।*
*tadaa moksho yadaa chittamasaktam sarvadri’sht’ishu ॥ 8-3 ॥*

యదా =  ఎప్పుడు, చిత్తం = మనస్సు, కాసు = ఎటువంటి, దృష్టిషు విషయములయందు, సక్తం ఆసక్తమగుచున్నదో, తదా అప్పుడు, బంధః = బంధమగుచున్నది, అపి చ = మరియు, చిత్తం = మనస్సు, యదా = ఎప్పుడు, సర్వ దృష్టిషు= సమస్తవిషయముల యందును, అసక్తం=సక్తముకాదో, తదా=అప్పుడు, మోక్షః = మోక్షము కలుగుచున్నది.

*వివరణ:-*

ఇంద్రియగోచరమయిన ఏ వస్తువు మీదనయినా కోరి కవుంటే అదే బంధం. ఇంద్రియగోచరమయ్యే వస్తుప్రపంచంపై నిరాసక్తతతో విడిగా నిలవగలగడమే ముక్తి.

*తాత్పర్యం:-*

మొదటిశ్లోకంలో కామవశుడై ఇంద్రియలోలుడై జీవించడం బంధం అని చెప్పారు. ఇప్పుడు మాసికంగా వాటినుండి విడివడడమే ముక్తి అని చెప్పుతున్నారు మునివర్యులు.


ఈ రెండు శ్లోకాలలోనూ కూడా మనస్సుకూ దానిచే చూడబడే బాహ్య ప్రపంచానికీ గల సంబంధమే రెండు విధాలుగా వివరింపబడింది.


 మొదటిదానిలో కామవశమై బాహ్యప్రపంచంతో రాగబంధం కలిగి ఉండడం బంధహేతువనీ, ఈ శ్లోకంలో, నిరాసక్తతతో వివేక జన్యమైన వైరాగ్యభావంతో బాహ్య ప్రపంచంతో వ్యవహరించగలగడం ముక్తి అని నిరూపింపబడింది.


రెండూ మనోభావాలే. మనస్సుకూ జగత్తుకూగల సంబంధమే, అయిన అనంత వ్యత్యాసం ఉంది, బంధమోక్షాలకు హేతుభూతాలయ్యాయి!


బాహ్యంగా ఇంద్రియ గోచరమయే వస్తుమయ ప్రపంచ ప్రభావం మనస్సు పై చాలా బలంగా ఉంటుంది.


మనస్సుకు మనోగోచరమయే ప్రపంచానికి గల
సంబంధం విషయంలో వివేకజన్య వైరాగ్య భావంతో విచక్షణతో సాధకులు చాలా మెలకువగా వ్యవహరించాలని అష్టావక్రులు సలహా యిస్తున్నారు.


మనోగోచరమయే ప్రపంచాకర్షణ వికర్షణలకు, మనస్సులోబడి జీవిస్తే బంధం అవుతుంది. దృశ్య ప్రపంచ సత్యత్వాన్ని, దృక్ దృశ్య సంబంధాన్ని అర్థం చేసుకుని, ఆకర్షణకూ భ్రమకూ లోబడకుండా వివేకంతో వ్యవహరించడమే ముక్త స్థితి.

🕉🌞🌏🌙🌟🚩


*🧘‍♂️91) అష్టావక్ర గీత🧘‍♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*అధ్యాయం - 8*
*బంధము - విముక్తి*
   
*శ్లోకం 04:-*

*यदा नाहं तदा मोक्षो यदाहं बन्धनं तदा ।*
*मत्वेति हेलया किञ्चिन्मा गृहाण विमुञ्च मा ॥ ८-४ ॥*

*యదా నాహం తదా మోక్షో యదాహం బంధనం తదా ।*
*మత్వేతి హేలయా కించిన్మా గృహాణ విముంచ మా ॥ 8-4 ॥*

శ్లో|| యదా నాహం తదా మోక్షః యదాఽహం బన్దనం తదా| 
మత్వేతి హేలయా కించిత్ మాగృహాణ విముంచమా ||4.

*yadaa naaham tadaa moksho yadaaham bandhanam tadaa ।*
*matveti helayaa kinchinmaa gri’haana vimuncha maa ॥ 8-4 ॥*

*టీకా*

టీ|| యదా= ఎప్పుడు, అహం= నేను, (అహంకారము ఉన్నదో) తదా = అప్పుడు, బన్ధః = బంధము, (భవతి = అగుచున్నది), యదా = ఎప్పుడు, అహం = అహంకారం, న = లేదు, తదా = అప్పుడు, మోక్షః = మోక్ష ము, (భవతి = అగుచున్నది), ఇతి = ఈ ప్రకారముగా, మత్వా = తలంచి, హేలయా = లీలగా, మా గృహాణ = గ్రహించకుము, మా విముంచ = విడచి పెట్టకుము.

*వివరణ:-*

నేను అనే అహంకారం లేకపోవడమే ముక్తి. అహంకారం ఉండడమే బంధం. ఇదే తెలుసుకుని ఆకర్షణ వికర్షణలకు లోను కాకుండా దేనినీ ఆమోదించకుండా త్యజించకుండా శాంతంగా ఆనందంగా జీవించు.

*తాత్పర్యం:-*

ఈ అధ్యాయానికి చివరిదైన ఈ శ్లోకంలో అష్టావక్రులు సాధకులను ఇలా హెచ్చరిస్తున్నారు. "హాస్యానికయినా, ఆటగానయినా, ఇంద్రియగోచరమయే ప్రపంచాన్ని సత్యంగా ఒక్క క్షణం కూడా భావించకు".


 చూస్తున్నది నిజం కాదు అన్నభావం కదలాడినా, చూసే వ్యక్తిగా అహంకారాన్ని బలపరుస్తున్నామన్న మాటే! అందుకే దీనిని ఆమోదించనూవద్దు, నిరసించనూ వద్దు. నిరాసక్తంగా సాక్షిగా దృశ్యాన్ని చూస్తూ, చూస్తున్న దానిని వివేకవంతమూ విచక్షణాసహితమూ అయిన జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. చూస్తూ ఉండే "నేను" లేని స్థితే ముక్తి.


నేను చూస్తున్నాను అనుకోవడమే బంధం. బంధం లేదని తెలుసుకుంటే ముక్తి అనే పదమే అర్థరహితమై, బంధమునకు అతీతంగా కేవలంగా అహం మిగిలి పోతుంది!

🕉🌞🌏🌙🌟🚩