30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

Internet Telugu Magazine for the month of 10/2016/37


ఓం శ్రీ రామ్        ఓం శ్రీ రామ్     ఓం శ్రీ రామ్ 

సర్వేజనాసుఖినోభవంతు

*"గోవిందా - గోవిందా" 

కెరటములు పొంగెను - గోవిందా
కిరణములు తాకెను - గోవిందా
కమలములు విచ్చెను - గోవిందా
నిను కొలుచు చుంటిని - గోవిందా

నిను తలచి వచ్చాను - గోవిందా
ముడుపులు తెచ్చాను - గోవిందా
మమతలకు  లొంగాను - గోవిందా
మది తలపు తొ వచ్చా  - గోవిందా

వలయమున చిక్కాను - గోవిందా
తమకమున ఉన్నాను - గోవిందా
గిరి పదము  తాకాను - గోవిందా
అణువణువు ఏడ్చాను - గోవిందా

అనుకరణకు చిక్కాను - గోవిందా
తనువు తరణికి పంచాను - గోవిందా 
సరిగమలు పలికాను - గోవిందా
పదనిసలతొ కొల్చాను - గోవిందా

పుడమిని ప్రార్ధించాను - గోవిందా
కడలిని అర్ధించాను - గోవిందా
తరువుని పూజించాను - గోవిందా
మనస్సుని నీకె అర్పించాను - గోవిందా

మణులు సిరులు మాకేల - గోవిందా
మనుషుల తలపు నీ వేగ - గోవిందా
వచన కవితలు నీకొరకె  - గోవిందా
నినుకొలిచె గుణముతొఉన్నా - గోవిందా  

--((*))--


* అమృతమును పంచింది "అమ్మ "

తొమ్మిది మాసములు గర్భము మోసి 
ఇంటిల్లి  పాటికి ఆనందము కలగ చేసి
కడుపులో బిడ్డ తన్నినా బాధ భరించి
భర్త కష్టపడ కుండా సుఖమును పంచి
సమస్త భారమ్ము మోసిన భవ్య మూర్తి

బహు సూటి పోటీ మాటలను భరించి
అనేక కష్టములు ప్రకృతిలో అనుభవించి
అత్త మామలను సేవించి, అమ్మ ఇంట చేరి   
ప్రసవింపు సమయాన యాతనల  కోర్చి
మాతృత్వమును పొందిన మధుర మూర్తి   

తండ్రి పాలనలో తల్లిగా అక్షరం ధిద్దించి 
గురు మూర్తిగా బెత్తంపట్టి నీతిని భోదించి
బిడ్డ మనసును తెలుసుకొని ఆకలి తీర్చి
మనకు పుణ్యం గురించే తెలిపే పుణ్యమూర్తి 

లాలించి పాలించి జోలల దేలించి
చిలిపి చేష్టలకు కష్టాలు  భరించి
తండ్రికి కోపం రాకుండా అడ్డు వచ్చి
మనకు ప్రేమను పండించే ప్రేమ మూర్తి

మమతలను పంచిపెట్టిన మాతృ మూర్తి
అనురాగములు అందించి అనురాగ మూర్తి
సహన గుణముచే బాసిల్లు సహన మూర్తి
అందరిని ప్రేమతో ఆదుకొనే ఆది మూర్తి 

ఓర్పు, ఓదార్పులో పుడమి తల్లిగా పుణ్య మూర్తి
అమృతమును అందించి ఆశలు తీర్చే అమృత మూర్తి
నింగినేల మధ్యలో కాలం బట్టి నిజం చెప్పే నిజమూర్తి
భూత,భవిష్యతు వర్తమానంలో "అమ్మ" ఆదర్శ మూర్తి   
--((*))-- 


 తాతా ప్రేమ అంటే ఏమిటి ?
ప్రేమ గురించి కొన్ని విషయాలు చెపుతాను విను బాబు  

 
సకల జీవ కోటి మనుగడకు - సకలైశ్వర్యాల ప్రాప్తికొరకు
వికాసాన్ని అందించుట కొరకు - విలువలు కాపాడుటకు
జ్ఞాన సముపార్జన కొరకు - విశ్వవ్యాప్త విజ్ఞానము కొరకు
మానవుల హృదయములో ఉండేది బీజాక్షజారాలా ప్రేమ

తరువులకు వేరు ఎంత అవసరమో మానవులకు ప్రేమ
అంతే అవసరము, నింగికి మేఘాలను మోయుట ప్రేమ 
ఎంత అవసరమో , పుడమి తల్లి జలము గ్రహించే ప్రేమ
అంతే అవసరము, కలకాలం మనుష్యుల్లో ఉండేదే  ప్రేమ

కడలి కెరటం ఎగిరి పడినా చల్లని నదిని చేర్చుకొనే ప్రేమ
మగణి కోరిక తీరుస్తూ స్త్రీ  హృదయాన్ని అర్పించేదే ప్రేమ
ఒకరికొకరు జీవన యాగానికి పూర్ణాహుతు వంటిది ప్రేమ
బతుకుని, మెతుకుని, సద్గతిని జీవితంలో కల్పించేది ప్రేమ

కంటికి రెప్పలాగా కాచుకొనేది, కడదాకా తోడుండేదే ప్రేమ
మర్మావయవాలకు వస్త్రం ఎంత అవసరమో తెలిపేదే ప్రేమ
మధురం, సుమధురం, ఆధరాల ద్వారా అందుకొనేదే ప్రేమ
ఆధ్యాత్మిక మార్గాన్వేషణలో, ప్రార్ధనలకు సహకరించేది ప్రేమ

మనుష్యుల్ని ప్రేమించి ఆత్మీయతను పంచుకొనేదే ప్రేమ
పువ్వులలోని సుఘందాన్ని అందరు ఆస్వాదించుటే ప్రేమ
కుటుంబానికి శాంతి, సుఖం, స్థిరత్వం ఇచ్చేది నిస్వార్ధ ప్రేమ
అహింసా మార్గంలో లోకకల్యాణం కోసం వ్యక్తం చేసేదే ప్రేమ

ధర్మమార్గంలో నడిచేవాని హృదయంలో ఆణువణువూ ప్రేమ
మనల్ని విజయ తీరాలకు చేర్చిన తల్లి తండ్రుల సేవా  ప్రేమ ,
ఇల్లాలి ఆదరణతో, బిడ్లలకు సన్మార్గంలో విద్య నందించే ప్రేమ
నలుగురికి పంచేది, లాభ నష్టాలను ఆలోచించనిది నిజ ప్రేమ

ఇహాన్ని జయించి, పరానికి చేర్చ గలిగే శక్తి సంపన్నమే ప్రేమ
సత్యం, శివం, సుందరం, సాత్విక భావచైతన్యాన్నికల్పించేదే ప్రేమ
విద్యార్దన, సంస్కృతి సంస్కారాలపైనా నిరంతరం ఉండేదే ప్రేమ
ఆత్మవిశ్వాసాన్ని, విశాల దృక్పధాన్ని, పరిపూర్ణత ఇచ్చేదే ప్రేమ

ప్రేమే తత్త్వం, ప్రేమే దైవం, ;ప్రేమ అనంత కోటి ఆశల దీపం
ప్రేమే అమరం, ప్రేమ అజరామరం, ప్రేమ ప్రకృతి అమోఘ వరం
ప్రేమే వాక్కు,  ప్రేమే నిత్యం, ప్రేమే సత్యం, ప్రేమే కాల సమయం
ప్రాంజలి ఘటించి రెండక్షరాల స్నేహ, కలయిక అవగతమే ప్రేమ                                

ప్రేమకు ప్రియులై పొతే "ఆయురారోగ్య సౌభాగ్య మంద గలరు"

దయచేసి ఈ కవిత మీకు నచ్చి నట్లైతే ప్రేమతో "షేర్ చేసి "
బంధాన్ని  పంచుకో గలరని ఆశిస్తున్నాను
--((*))--




*కుంభవృష్టికి సహాయం చేద్దాం - సహకరించుదాం

కుంభవృష్టి హోరును - ఉరుము తున్న ప్రకృతిని
దారి ఎదో తెలుసుకోలేని ప్రాణిని - ఎవరు ఆపగలరు

నింగినందు ఒకవైపు మేఘ మాల - మరోవైపు కాంతి
రక్తం తో మరిగే ప్రాణిని - కవితా శక్తితో ఎవరు ఆపగలరు

వానను దోసిల్లతో పట్టు కుంటాం - నీటి ఉరవడిని ఆపలేం
ఉరుములు తో వచ్చే పిడుగు జారటం - ఎవరు ఆపగలరు

కారు చీకట్లో పొద్దు తెలియని స్థితిలో వానలో చిక్కన ప్రాణులను
కూకటి వేళ్ళతో లేచే చెట్లనుఁ, పక్షములను - ఎవరు ఆపగలరు

భారం బరువుగా మారినప్పుడు, హృదయం విరిగి నప్పుడు
బరువుని మోసే, శక్తి హృదయానికి - ఎవ్వరు ఇవ్వగలరు   
   
వాన చినుకు, అన్నం మెతుకు, మనిషి బతుకుకు తోడు రాక
నీరు నిప్పు నింగి గాలి నేల బాధపెట్టకుండా - ఎవ్వరు ఆపగలరు

మనసు మసక చీకటిలో చిక్కి వెలుగు కోసం వెంపర్లాడుతుంటే
వానలో ఆత్మీయత తోడు లేక ధీన స్థాయిని - ఎవరు ఆపగలరు   

పువ్వుల పరిమళాలు ఎడారికి - వెన్నెలంతా అడవికి మారినట్లు
మనిషి నోరువిప్పి పలికినా దిక్కులేని స్థితిని- ఎవరు ఆపగలరు  

యదార్ధం తెలుసుకున్న రాజకీయం - రాజీ పడి కన్నీరు కార్చుట
వాగ్దానాల ఒరవడిలో ధనాన్ని ఖర్చు చేయటం - ఎవరు ఆపగలరు

అందుకే నేను అంటాను చేయి చేయి కలుపుదాం - సహాయం చేద్దాం
మానవతా దృక్పధంతో వర్షాల్లో  చిక్కిన వారిని రక్షించి కాపాడుదాం

రక్షించే గుణాన్ని ఎవ్వరూ ఆపలేరు - స్నేహాన్ని ఎవ్వరూ ఆపలేరు
ప్రేమను పంచే, సహకరించే ఆర్ధిక వనరుల సహాయాన్ని ఆపలేరు

వానల్లో చిక్కిన వారికి  సహాయం చేయు లక్ష్యం ఎవరు ఆపలేరు



దయచేసి ఈ కవిత మీకు నచ్చి నట్లైతే ప్రేమతో "షేర్ చేసి "
వరదబాధితులకు సహాయ పడగలరని ఆశిస్తున్నాను 

 --((**))--

* వెలుగు

నవ్వులే పువ్వులే -  వెల్లువ దీపాలే 
- భానోదయా  ప్రేమలే    
మర్మమే తత్వమై - బంధమే పున్నమై
 - భవ్య దివ్యానందమే
సంతసమే రవ్వలై - శబ్దాలే భాణాలై 
- తేజోమయ తిమిరమే
శ్రవణాలే వెలుగులే - ప్రేమలే  కోర్కళై 
- సుందర శ్రావ్య భావమే 
ప్రకృతే మొహమై  - మమతలే వేదమై
- భవిషత్ పరమానందమే
మూడుముళ్లే జ్ఞాపకాలై - జ్ఞాపకాలే పరిమళాలై 
       - మనసుకు తెచ్చు ఉల్లాసమే 

               నిశీదరేఖలే వెలుగురేఖలై - మైనం కరిగి వెలుగులై
                కంటి వెలుగులే చూపులై -   చీకటి తరిమే వెలుగే 
                                                      --((*))--

*విశ్వ శాంతి ?

 హృదయం ఒక్కటే - భావా లెన్నో
రాగం ఒక్కటే - అనురాగాలు లెన్నో
సమీరం ఒక్కటే - సమైఖ్యగాలు లెన్నో
తరువు ఒక్కటే - ఉపయోగా లెన్నో 

సమానత ఒక్కటే -అసంతృప్తి లెన్నో
ఆవేశం ఒక్కటే - కర్కశ హృదయాలెన్నో
ఆలోచన ఒక్కటే - అనాలోచనలెన్నో
ప్రపంచం ఒక్కటే - శాంతి మార్గా లెన్నో 

దయాగుణం ఒక్కటే - తీవ్రవాదన లెన్నో
అందరిలో రక్తం ఒక్కటే - మారణహోమా లెన్నో
దేశ మంతా ఒక్కటే - జాతి, కుల,మతా లెన్నో
సహకారం ఒక్కటే - ఉపకారా లెన్నో 

సానుభూతి ఒక్కటే - సంతృప్తి చెందే మనసులెన్నో
     కలత నిద్ర ఒక్కటే - భయ బ్రాంతు లెన్నో
భావం ఒక్కటే - నిస్వార్ధపు బీజా లెన్నో 
  విశ్వ శాంతి కాంక్ష ఒక్కటే - శ్రమించే చేతు లెన్నో

--((*))--


* ఇంగ్లిష్ పోయం (TWINKLE )
స్వేస్చా అనువాదం

మబ్బుల్లో  చుక్క , చుక్కల్లో చుక్క 
మెరుపుల్లో  చుక్క , తళుక్ అన్న చుక్క
ప్రపంచ తళుక్ చుక్క, ఆహా ఓహో చుక్క
నింగిన ఉన్న చుక్క, అందు కోలేని చుక్క       
బంగారంలా, వజ్రం లా  మీరిసే చుక్క,

జాకు గాడు, జిల్లు గాడు కొండ నెక్కి
జాకు & జిల్లు కుండ నీళ్లు పట్టి ఎక్కి   
జాకు నీల్ల కుండ పగిలి నెత్తి బొప్పి కట్టి
జిల్లు దొర్లి దొర్లి నవ్వి నవ్వే నక్కి వచ్చే
 
జానీ జానీ ..-  ఏందీ నాయనా
తిన్నావా చెక్కెరా - లేదు నాయనా
అబద్దాలు చెపుతున్నావ్ - లేదు నాయనా
ఏది నోరు తెరువు --హ హా హా  చూడు నాయనా

--((*))--

Famous English rhymes translated. . . . . . in Telangana slang .

Twinkle Twinkle little star,
How I wonder what you are!
Up above the world so high,
like a diamond in the sky !

Jack and Jill went up a hill
to fetch a pail of water.
Jack fell down and broke his crown,
And Jill came down tumbling after !

Johny  Johny....yes papa
Eating sugar......no papa
Telling lies.....no papa
Open ur mouth...ha ha ha !!! 



 
*భాస్కరుడు

ఆకాశం నుండి  ప్రపంచాన్ని  చూస్తున్న  వాడవు 
కుణిక పాటున నీవు కునుకు తీయక తిరిగి తావు
అంతరిక్షంలో తూర్పు నుండి పడమరకు వస్తావు
చురుకు తెప్పించే చూపుతో మమ్ము చూసే ఓ భాస్కరా

పగలు పరికిస్తావు అనంతరం విశ్రమిస్తావు  
నిత్యమూ చీకటికి దారిచూపి తప్పు కుంటావు
కిరణాలతో  మౌన సంచారము చేసే వాడవు 
మదితలపులు వేడెక్కిస్తూ ఉన్న ఓ భాస్కరా

పుడమి తల్లికి వేడి నందించి చల్లగా జారు కుంటావు
ప్రేమగా కొమ్మ రెమ్మ ఆకు పువ్వుకు కాయ సహకరిస్తావు
నోటితో చెప్పలేవు, నిన్ను మధ్యాన్నం చూడనీయువు
ప్రపంచ మంతా వెలుతురులో ముంచుతావు ఓ భాస్కరా

నీ కిరణాల క్రింద పనిచేసే వారికి చెమట పుట్టిస్తావు
కొందరి ఉడుకు రక్తాన్ని మరిగే టట్లు చేస్తున్నావు
నీవు వడగాలితో  కలసి విజృంభించు తున్నావు
కిరణాలతో మానవజీవనానికి సహకరించే ఓ భాస్కరా

మానవత్త్వాన్ని, నిద్రను తట్టిలేపుతున్నావు ఓ భాస్కరా
ఆశలకు ఊపిరి పోసి, జ్ఞాన్నాన్ని అందిస్తున్నావు భాస్కరా     
జీవితాశయాన్ని తెలిపే శక్తికి సహ కరిస్తున్నావు భాస్కరా
పరిణతకు పరాకాష్టకు అతీ0ద్రుడవు సప్త కిరణ భాస్కరా

ఎన్నడూ అలక్ష్యం చేయక నిత్య సంచార భాస్కరా
పరమోన్నత స్థితికి, ప్రేమను అందించే భాస్కరా
మేఘాలను సృసష్టించి వర్ష కురిపించే భాస్కరా
నిత్య ఆరాధులకు మోక్షాన్ని అందించే భాస్కరా     

--((*))-- 

 
*. ప్రేమికుల మధ్య మధుర అవసరమా ?

మిలా మిలా మెరిసేటి కనులతో
కనురెప్పల కదలిక పిలుపులతో
మిర మిట్లు గొలిపే కొత్తచూపులతో
నీవు చూస్తే నాకు ఏంతో నిషా నిషా

నా కనుల ముందు నీ వుండగా
నా హృదయం లో నీ వుండగా
నా మనసంతా ఆవరించి నీవుండగా
మధుర నాకు ఎందుకు ప్రేయసీ    

మత్తులా నీవు చెంత నుండగా
గమత్తులా ప్రవర్తి స్తూ ఉండగా
ఎత్త్తులు పైఎత్తులు వేస్తూ ఉండగా  
మధువు ఎందుకే ఓ నా ప్రేయసీ

నిముష మైనా నిన్నువిడువ కుండా
క్షణము వదలక నీవెంటే తిరుగు చుండా   
కలను నిజం చేసు కోవాలను చూస్తుండా
శృంగార దేవత చూపే నాకు నీషా నిషా

నీ మధురమైన ఆధరముండగా
నీ మెత్త నైనా చెక్కిలి ఉండగా
నీ వస్త్ర అందాలు చూపు తుండగా  
మధువు ఎందుకే ఓ ప్రేయసీ

మనం ఒకరి కొకరం ప్రేమించు కున్నాము
మనం ఉన్న ఆకలిని పంచుకొని తిందాము
మనసు విప్పి నిజాలచెప్పి బ్రతుకుదాము
మన మధ్య ప్రేమ ఉండగా ఇక మధుర ఎందుకు 
--((*))--

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

Inernet Telugu magazine for the month of 9/2016/36

ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రామ్ 
 ప్రాంజలి ప్రభ 

 సర్వేజనా సుఖినోభవంతు

సుమంగళి (ఛందస్సు)  దెవరా 

ప్రేమ కోరిక కదురా - వెన్నె లందిన తరుణం
ప్రీతి పొందుట కనరా - మత్తు చిక్కిన సమయం
నా మదీయ కణమురా - నన్ను పిల్చిన దెవరా
కామ కేలియ నిధిరా - వేగు చుక్కను కదురా

కాయ పండిన తినరా - రాగ మోప్పిన కరువే
మాట పల్కిన వినరా  - యోగ చెప్పిన చెయరా
భావ పాటలు కనరా  - మేత తిన్నను వినరా
చేతకాని తనమురా - చెంత ఉన్నది తినరా

నీవు నాకొక విధిరా - నిత్య మంగళ మధురా 
భావ పాటల సుడిరా - ప్రాణ తనువు నిధిరా
బాట చూపెడి దెవెరా - దూర ముండెడు నెలరా
వ్రత  కావ్యపు కవిరా - నిత్య సంచార రవిరా

చల్ల గాలిని పిలువా - ప్రేమ పంచగను రావా
ఈ జగమ్మేల సమయే - ఎందు కాంచిన సడిరా
విన్న పాలును వినరా - కావ్య గీతను చెలియా       
నిన్ను చూడఁగ మనసే - నేడు పొంగెను సఖియా
         --((*))--



 * సంగమం (ఛందస్సు ) 
చిరునగవు చూపినా - మనసు పగ  మారు నా 
తొలి వలపు పంచినా - తనువు తప మోగ్గునా
మరులు గొలిపే సతీ - జత మోన లందించినా
తరులు గిరులొచ్చినా - మగని మది మెచ్చునా

పదనిసలు పాడినా - సరిగమల రాగమే 
లయకురుల లాస్యమే - పలుకులకు శ్రావ్యమే
నది తలల పొంగులే -కడలి తల మారునా
తనువు వల చూపినా - మనసు విరిగొచ్చెనా

లత మలుపు లిచ్చినా - వన మెరుపు లొచ్చినా 
యద తలపు పొంగినా - కథ కతలు చెప్పినా 
మెరుపుగల యవ్వనం - సిరి గలడు పొందునా 
నవ రసము లిచ్చినా - వలువు నకు వచ్చునా

కరములతొ చుట్టినా - పదములతొ తిట్టినా 
నటనలతొ నవ్వినా - వలువలును విప్పినా 
మనసెరగని మొగుడా - నిను తలచు టెందుకూ 
మదనుని పిలుస్తానూ - అణువణువు సంగమం  
    
--((*))--

* ప్రియంవద (ఛందస్సు )
అవని ఆకలి అమృత ప్రాభవం
మనసు వాకిలి సునంద సాగరం
తనువు తాపసి సుకృతి అంకుశం
మనసు మర్మము ప్రకృతి సంభవం


తరచు చూపులు సరాగ బొంగరం
ఎరుక తోడును విధాన సంతసం
మమత భావము అనంత శోదనం
మగువ మానము మనోనె త్రాలయం


వెలుగు భోగము నయాన శోకమే
కటువ బేరము బలంగ నాటునే
మనిషి రోగము ధనంకు లొంగునే
తగువు తీర్చుట సర్దుట తగ్గునే


నకలు బాడుగ వకీలు ప్రతిబే
నడక చెక్కెర నివృత్తి సాధనే
నెరవు నేరిమి మజూరి కొరకే
తుళువ వచ్చుట వివేకి వేదనే

సగటు సిగ్గులు అనేక ప్రశ్నలే
వయసు పొంగులు నవీన మార్పులే
--((*))--


 * కృష్ణుడి కోసం తపించే హృదయాలు
(ఛందస్సు)

కలసి నట్టులా - వెతికి ఇవ్వలా మరీ
పుడమి పువ్వులా -  మెరిసి పొయ్యావా మరీ
కలువ కళ్లకే - వగరు సంతసం మరీ
కళల కన్నయా - కలవ పిల్చావా మరీ

నెమలి నాట్యమే - మనసు మెచ్చెనే మరీ
గుబురు పిట్టలే - కలసి నవ్వేనా మరీ        
వలస పక్షులే - తలచి వచ్చెనే మరీ
కలల కన్నయా  - కలవ పిల్చావా మరీ

చిగురు కొమ్మల్లో - చిలిపి కోయలా మరీ    
పొగరు గిత్తల్లో  - దుముకె సంతోషం మరీ
తెలుపు హంసల్లో - తెలివి పుత్తడే మరీ 
నటన కన్నయ్యా - కలవ పిల్చావా మరీ

పడతి శ్వాసతో - కలవ ముచ్చటే మరీ
వరుణ స్వేదంతో - చలువ పంచెనే  మరీ
మెరిసె గోవుళ్లు   - తడిపె క్షిరాళ్లే మరీ 
అలిగె కృష్ణయ్యా - కలవ పిల్చావా మరీ

--((*))--
* కర్షక హర్షం (ఛందస్సు) (రాజహంస) 

పుడమి తల్లికే - పురిటి నెప్పులే కదా
కడకు విత్తులే - తడసి చెమ్మగిల్లే నూ
మొలక  లెత్తెనా - ఒదిగి సమ్మోహంతొ నూ
భరిత భవ్యైకా - చరిత సాధ్యమే కదా

జలము బంధమే - మొలక విస్వాసం కదా
ఉదయ గాణమే - ప్రకృతి స్వాసయే కదా 
తరువు వెచ్చనై - వలపు వయ్యారం సిగా
కురిసి పువ్వులై తనువూ కంకులే  కదా

దశల వారిగా  - పెరిగి శ్యామలా ఫైరే
మనసు మక్కువా  - పెరిగి పళ్లతో ఫైరే
విరిసి కళ్ళకూ  - మనసు మెప్పించే ఫైరే
శిరులు వర్షించే - పుడమి తల్లీ వందనం

రైతుల స్నేహమే - సంతోషం పక్కగా వచ్చే
చినుకు హర్షంగా - కలలు పండెనే  కదా
దేవుడూ సవ్యంగా - అడుగు పెట్టెనే కదా
మనసు ఉల్లాసం - మమత మమైకం కదా  
--((*))--

*సిరిగల అలకలు

కలువల నగవులు - నయనముల మానసే
కులుకుల సొగసులు - తమకముల తాపసే
నడకల మనసులు - పరువముల గాలమే
మమతల కులుకులు - ఆశయముల భారమే

మెరుపుల మలుపులు - నలిగె బలుతారకల్
తరువుల మోలకులు - హరుసమిడు కోరికల్
వినునవ పదములు - విరహనుని నాదముల్
మగువల చురకలు - నరవరుని పాకముల్

పదముల పలుకులు - నటనల సుకుమారముల్
రధముల నడకలు - రణ గొణ డమరకముల్
మదనుల తలపులు - మదిలొ మెదిలే చురకల్
సిరిగల అలకలు - జలముల మది తలపుల్
--((*))--
*మధూలికా 

మనసు చల్లనే - వయసు వచ్చెనే
వలపు తెచ్చెనే - తణువు విచ్చెనే
సొగసు పండెనే - మమత నిండెనే
కడుపు నిండెనే - రవళి వెల్గెనే

నటన నేర్చెనే - నడక మార్చెనే
వగలు పెంచెనే - తగువు తెచ్చెనే
మొగలి నవ్వేనే - కలువ ఏడ్చేనే
సిగలు వాడెనే - తుళువ నవ్వేనే

సెగలు సాగెనే - పొగలు కమ్మెనే
పరులు తుమ్మెనే - తరువు నవ్వేనే
మురళి మ్రోగెనే - సరస మాడునా 
కళలు వచ్చునా - కలత తెచ్చునా

వనిత లేఖలే - నవత బాధలే
కళలు కళ్లలే  - కలలు రంగులే
మధుర వాణినే - అక్షర మాటలే
వెలుగు రవ్వలే - కవుల నవ్వులే

 కలువ సిగ్గులే - నవల మొగ్గలే
తడక కంతలే - మడత  పిచ్చిలే
మరక గుర్తులే - నసగు చేతలే
వలలో చేపలే - నదిలొ తెప్పలే

నిధుల కోసమే  - బతుకు ఈతలే
హితుల వాలకం  - అసలు దొంగలే
మనిషి విజ్ఞతే  - వయసు వేడుకే
సమయ పెద్దోడే  - ఉదయ భాణుడే

ఆరుణ బింబమే - మరణ శాసనం
కరుణ వాలమే  - ముతక జీవితం
నవమి పూజలే - జయము నిచ్చెనే
మొగలి పువ్వులే - తనయ పల్కులే

వొదిగి వయ్యారం - మిడిసి సింగరం
కనుల సోయగం - ముడుచు రెప్పలా
పగలు సేవలే - ఉచిత శోభనం
తులసి ఆకులే - తెలివి మతలే

వరద పొంగులే - బడుగు బాధలే
సిరుల ఊయలే - విలువ ఆశలే
కురుల మాయలే - మతికి మత్తులే
తెలుగు నేర్చుకో  - తెలివి పెంచుకో

పడతి ప్రేమలే - బడితి మెల్లగా
సరస జేరగా  -  సరస మాడునే
వరుస చెప్పగా  -  నగలు పంచనే
కలలు వచ్చునా - కలత తెచ్చునా

మగువ మార్చకూ - వరుస సత్యమే
వరుని తల్చగా - హరియు వచ్చునా
హరియు తల్చగా - శివుడు వచ్చునా
తెలుగు పాటలో - తియని తేనియల్
--((*))-- 

 
మగువ మనసు (చందస్సు )
మది తలపులు వలపులు మగణి పరువములే
 నయనముల కదలికలు నటన తమకములే
పరువముల పదనిసలు పగలు తడి సెగలే
కురులు మెరుపులు తనువుకు సరిగమలగునే

శిరులు కతలు తనువు శశి కళ కళ కళలే 
మసలు యతలు తపనలు మది కరుణ వలలే 
తెలుగు వెలుగు చదువులె తరుణి తమకములే 
శిరి మళపుల తలపుల శివుడు కధ కలిపే  
   --((*))--

*కనురెప్పలు

 పాదములు చేరెను - మగణి చెంతనా 
స్వరము మారెను - పెదవి అంచునా 
కణముల కదలిక - తనువు అంచునా
నాదములు పలికె  - ప్రియ వదనమునా  

నదిలా పొంగెను - వయసు చాటునా 
కలలా వాలెను - రెప్పల మాటునా 
కురులు విచ్చెను - మనసు జాలినా
మరులు తెల్పెను - సొగసు అంచునా  

ప్రేమను చూపెను - ఆ తరుణములోనా
వయసు అర్పించెను - ఆ సమయానా
తనువు పొంగు - తపనలు చల్లారేనా
తడి పొడి మాటలతో - చల్లగా జారెనా

మరువలేని సుఖము - మనసు దాచేనా
తెలపలేని ప్రణయం - వయసు ఆపేనా
వద్దన్నా ఆనందం - పంచేది కాలానుగునానా
మనసు సుఖ శాంతికి - ఇది ఒక మార్గమేనా  
 
 
మరువలేను మరువలేను - మగువా 
మరువ లేను మరువలేను - మన్మధా 
నిను విడిచి పోలేను - ఈ జన్మ లోనా
నిను మరచి ఉండలేను - ఈ యుగానా 
--((*))--

15, సెప్టెంబర్ 2016, గురువారం

Internet Telugu magazine for the month of 9/2016/35

ఓం శ్రీ రామ్  ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ - ఛందస్సు 
సర్వేజనా సుఖినోభవంతు
   ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 
నేను వ్రాస్తున్న  ఛందస్సు  యందు కవితల తప్పులు ఉండవచ్చు తెలియపరిచిన సరిచేసుకోగలను, తెలుగు సాహిత్యపరులకు పండితులకు మేధావులకు వందనాలు  అర్పిస్తున్నాను 

* శ్రీ రాముడు (ఛందస్సు )

రాముడు రేరాజు కళా
వంతుడు ప్రాయంతో ప్రభా
కాంతుడు వీరాధి సురా
ధీశుడు దివ్యాతి వరా
ధాముడు రాణించె నవా
శాంతుడు సంసార దు:ఖా
తీతుడు జీవాల కథా
నాధుడు స్నేహాల లయా 
కారుడు వాలాల సహా
ఎంతోనె ప్రేమాభి మహే
శ్వరుడు కారుణ్య దయా
ధీనుడు బ్రార్ధించు నిత్యా
స్వేతాంబ రేశ్వర గుణా
బాహుడు శోభిల్లే సుధా
మాయుడు తేజాభి రణా 
ధీశుడు సాకార పరా
ధాముడు ప్రాణాల కతీ
తాముడు సూర్యుడు జయా
లాస్యుడు ప్రాభావ వినా
ప్రాయుడు ఆరోగ్య భవూ
డామృత ప్రాయూడు సుమా
గానమ సాధ్యుడు సదా
భానుడు ప్రాపంచ సెవా
 భవ్యుడు కాలాల  నిధీ 
వంతుడు  ఆస్రిత ధర్మా 
రాజుడు నిత్యాగ్ని సత్యా 
వ్రతుడు వైరాగ్య భక్తా 
గ్రేసుడు విద్యాభి న్యాయా 
శీలుడు సింధుర దయా 
సింధుడు ప్రాధాన్య క్రియా
హితుడు సామాన్య ప్రజా 
బంధుడు నిర్దేశ సమా 
రాధుడు కర్తవ్య భోధా
ప్రియుడు ప్రణీత ప్రేమా 
తత్వుడు ఆరాధ్య రమా 
నాధుడు అనితర సాధ్యుడు 
నమో నమో శ్రీ సీతా 
నమో నమో శ్రీ రామ 
నమో నమో శ్రీ హనుమా 
శ్రీ సీతా రామ హనుమలకు 
 పాదాభి వందనములు 
ప్రణామములు ప్రణామములు ప్రణామములు 
--((*))-- 



    *శ్రీమతిగా  నాకే  నష్టం ?  - శ్రీపతిగా  నాకే  నష్టం ?
(ఛందస్సు ) (తేటగీతి)

త్రాగి అనుమానం వ్యక్తపరిచి - నమ్మి నమ్మ
నట్లు నటించి వేధించి - భర్త ఉంటే
భార్య మనసునే గమనించక - మోసం చేసే
భర్త ఉన్నప్పుడు శ్రీమతిగా - నాకే నష్టం

భార్య కోరికే వప్పుకొనక - భర్త కష్టం
తెచ్చి నటించే ఏడుపునకు - నమ్మ లేక
ఉండి ఉండుటను ప్రేమలను - పంచి పంచ
లేక నాకయాతన శ్రీమతిగా - నాకే నష్టం


కొత్త చీర నగల మత్తెక్కి - కొవ్వు ఎక్కి
కష్ట నష్టాలు గుర్తించక - ఇష్టం వచ్చి
నట్లు తిరిగి తమకముతో - వాడి వేడి
తిట్ల ఓర్పుతో శ్రీపతిగా  - నాకే నష్టం

చిచ్చు బుడ్డిలా పేలేది - చీమ టపా
కాయ తుస్సుమనే లాఉండి - నాకు చింత
భాద కల్పించి నవ్వులతో - నాట్య మాడి
వలపే అందివ్వక కష్టములే - నాకే నష్టం         
  
భాదే ఎరుగనీ శ్రీమతినీ - కష్ట పెట్టి
నేను  మనసునే దోచాను - ఇష్ట మొచ్చి
నట్లే మాటలతో హింసించి - నవ్వి నవ్వి
ఏడ్చే టట్లుచేయుటను - నాకే నష్టం

ప్రేమ కురిపించిను సొగసుతో - నక్కి నక్కి
మొక్కి తమకమును పొంగించి - కళ్ళ బొల్లి
కావ్య కవితలును తెలియబరిచి - చిక్కి చిక్క
 నట్లు ఉండుటలో మహిళామణి - నాకే నష్టం

 
      --((*))--
 
హిమమణి -

మంగళమహాశ్రీ లయతో హిమమణి అనబడే ఒక కొత్త తాళవృత్తమును మీకు పరిచయము చేస్తున్నాను. మహచ్ఛ్రీలోని మొదటి భలము ఇందులో నలల అవుతుంది, రెండవ భలము త-గణమవుతుంది, అలాగే మిగిలిన గణములు కూడ. రెండేసి గణములకు ప్రాసయతి. క్రింద నా ఉదాహరణములు -

న/స/భ/న/య/న/న/త/గగ
IIIII UUI - IIIII UUI - IIIII UUI UU
26 ఉత్కృతి 10461088
 
 హిమమణి (ఛందస్సు)

కలువలతొ నీ పల్కు 
- చలములతొ నీ దోస్తూ 
 - హిమగిరిలొ తేజస్సె కాదా

మగవలతొ నీ చూపు
 - మదితలళపు నీ సోకు 
- మనసెరిగి పొందుకు కాదా 

పెదవులతొ నీ నవ్వు 
- నయనముల నీ చూపు 
- విమలమగు ఈరోజు కాదా

చినుకలతొ నీ చిందు
 - తపనలతొ శోభించు
 - గమనముల యందేను కాదా

తరువులతొ నీ ప్రేమ 
- భ్రమరములు పాడంగ 
- రమణమగు నా గాలి కాదా

లాలితముర నీ వీడు
 - లలితమర నీ తోడు 
- లలితమగు చామంతి కాదా

తొలివలపు నీ సోకు 
- తొలివలపు నీ జీవం
 - తొలివలపు పంచావు కాదా 

మనసెరిగి నీ ప్రేమ 
- మమతెఱిగి నీ తేజం
 - మనసులతొ కల్పావు కాదా 

ద్రుమతళము లూగంగ
 - హిమమణులు వెల్లంగ
                    - హిమయవని భాసించు రారా                
 --((*))--



*దోమ  (ఛందస్సు)

మనుషులకు దూరంగ
-పురుగులతొ  ఉన్నట్టి
-మురికిలలొ ఉండేటి దోమా

మనుషులలొ రక్తాన్ని
-కరుణగల తొండంతొ
-పొడిచి కసిగ పీల్చె దోమా

ఔషదములు చల్లినా
-పొగ పొగలు పెట్టినా
-మనకణము పిల్చేది దోమా   

ఆణువణువు రోగంతొ
-అనవసరపు భయంతొ
-మనుషులను ఏడ్పించె దోమా

భయమునకు తొడైంది
-కరములకు చిక్కంది
-మనసునకు ఇక్కట్లు దోమా

సరిగమలు కల్పించే
-నవ సిరులు ఏడ్పించే
-మదితళపు నవ్వించే దోమా
--((*))--


*శోధన (ఛందస్సు )

నిర్భయముగా త్రాగుట - ముళ్ళ పొదలో చిక్కుట
మందు కులికే  తాపసి  - బుద్ధి,  మనసే మారుట  
భాను వెలుగే ఏలిక - శోధన పనే మేలుట
నీచ చెలిమీ వేడుక - వాడి బతుకే సంకట

గుడ్క తినుటే గుండెకు - చిల్లు బడుటే సత్యము
ప్రేమ పెరిగే కొద్దిన - శోభ తరలే వెళ్ళును
పిచ్చి ముదిరే జొచ్చిన - ఏంతో భయమే వచ్చును
ఖచ్చితముగా మాటలు - నచ్చ పలుకే కష్టము

కన్న వారికీ వేదన - మచ్చ బడుటే తప్పదు 
ప్రేమ ఫలితం మేలును - ప్రేమ విచిత్రం దు:ఖము
కట్టు బడకా కోరిక - చుట్టు తిరిగే మానస
రామ పలుకే తేలిక - దేవా దేవుడే దిక్కుట

ఊట జలమూ త్రాగుట - బాట ఎరిగీ వెళ్లుట
మాట వినుటే  తేలిక - మాట అమలూ కష్టము
ఊరు మాటనే నమ్ముట - సత్య వచనం తప్పదు
ఓర్పు మనకూ ఉండుట - నిత్య ఉద్యోగ శోధన                   
--((*))--


న/భ/జ/ర IIIUIII - UIUIU
* దివ్య కాంతులే  (ఛందస్సు)

కడలి యే అలిగి - గట్టుదాక వ
చ్చి, మనసే నలిగి - నేరుగా వెళ్లే
తరిగి మేనిలొ కెల్లీ-  సజావుగా
మనసు చేర్చితిరిగే - మయావతే

గగన మే వెలుగు - భానుచంద్రుడే
మనసు యే వెలుగు -ప్రేమ ఆనతి
వయసు కే సెగలు - పెళ్లి హారతి
మమత యే పెరుగు - స్నేహబంధమే

కనుల చూపులకు - ఆక తాయిలే
వలలొ చిక్కిన చె  పల్లా  రాగమే
యువకు లే మరలి - ప్రేమ పాటలే
                   మహిళలే మనసు - దోచు కొనునే                     

తరువులే మనకు - మంచి చెడు లే
ఫలము లే మనకు - ఆశ దారులే
నగము లే వనిత  కూన నవ్వులే
      పలుకు టే పరమ - దివ్య కాంతు లే       

నిరుప మే నవ - నీత అందముల్
పరువ మే యువ - మేలు రంగులన్
మెరుపు నందములు - కుల్కు లిచ్చుచున్
వలపు రాగములు - పల్కు లిచ్చుచున్  

ప్రియస కీ వినుము - ప్రేమ గీతికల్
రయముగా మృదుల - రాగమాలికల్
భయములన్ వదలు - భావి భవ్యమే
శ్రియములే కలుఁగు - జీవనమ్ములో

పయన మెక్కడకు - పాంథ తెల్పుమా
శయన మేయరుగు - శ్యామవేళలో
ప్రియముగా నెవరు - పిల్తురో నినున్
నయముగాఁ దినఁగ - నాల్గు ముద్దలన్
--((*))--

* తొలి వలపు శృంగారం  (ఛందస్సు )

కలువ పిలుపు సాగే - మనువు తణువు ఊగే
అణు వణువు చెరేరే  - మది తలపులు లూగే      

పొగలు సెగలు రాగా  - నగలు ధగలు రేగే
కురులు విరులు కాగే  - మనసు వలపు సాగే

మనసు పిలిచె గాదా - వినగ మనసు లేదే
వరుస సమయ గాదా - వలపు తలపు లేదా

దినము వెలుగు నీవే - కలువ మనసు రాదా
సిరులు మోజును చూపే - యినుడు శశియు నీవే

కనులు కరిగి మాగే - తనువు తరిగి పోయే   
వయసు వలపు కాగే - మరువక రమ వేగే

కునుకు వణకు వచ్చే - వలపు తలుపు తెచ్చే
మనసు సొగసు నచ్చే - ఒకరి కొకరు మెచ్చే 

--((*))-- 

5, సెప్టెంబర్ 2016, సోమవారం

Inernet Telugu magazine fro the month of 9/2016/34



 ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం
 
సర్వేజనా సుఖినోభవంతు 
 
గణాధిపాయ నమ: 
సముఖము చేరితి - ప్రార్ధన లివే
పత్రములు తెచ్చితి - పూజలు చెసే
కుడుములు పూజకు - పుష్పాలు నికే
విముఖత చూపకు - విఘ్నవినాయక    

 

చల్లగాలి నళినిలో - ప్రశాంతత కల్పనలో
స్వెతవర్ణపు వెన్నెలలో - తరువుల కదలికలలో
మాకు సహాయ పడుతున్నావు - శ్రీ గణాధ్యక్షాయ నమ:
కడలి కదలికలల్లో - తుమ్మెద జుంకారములలో
పుడమితల్లి ప్రయోజనాలలో - ఆకాశ మార్పులలో
మాకు సహాకరిస్తున్నావు - శ్రీ విఘ్నరాజాయ నమ:
సెలయేరు పువ్వులలో - పకృతి మార్పులలో
ప్రతి యింట వెలుగులలో - ప్రజల హృదయాలలో
స్థిరంగా ఉన్నవాడవు - శ్రీ వినాయకాయ నమ:

పురివిప్పే నెమలి ఆటలలో - మేఘాల జల్లులలో
జాలువారు నది తుప్పర్లలో - సమస్త పత్రాలలో
ఉన్నవాడవు - శ్రీ సముఖాయనమ:

కోకిలమ్మ గీతాలలో - పక్షుల కిలకిలా రావములలో
మనుషుల ప్రేమానురాగాలలో - విద్యాలయాలలో
వెలసి యున్న వాడవు - శ్రీ ఉమాపుత్రాయ నమ:

ఆత్మీయతా భందాలలో - ఆలోచనా మనస్సులలో
కళల నెరవేర్చుటలలో - కోరికలు ఫలించుటలో
సహాయపడేవాడవు - శ్రీ లంబోదరాయణమ:

వినాయక వ్రతము కలసి చేసుకుందాం
ఏక వింశతి పత్రాలతో శ్రీ గణేశ్వరుని పూ
జిద్దాం
శ్రీ వినాయక వ్రత కధలు విని తీర్ధప్రసాదాలు తీసుకుందాం

--((*))--



వినాయక చవితి సందర్బాంముగా (చిన్న పాట)

గజాననాయ, గణాధ్యక్షాయ, విఘ్నరాజాయ నమో నమ:
ఉమాపుత్రాయ, వక్రతుండాయ, సూర్పకర్ణాయ నమో నమ: 
ఏకదంతాయ లంబోదరాయ, సర్వేశ్వరాయ నమో నమ:

శ్రీ రంజిల్లు మోమోముతో, సర్వోన్నత భూషణ మకుటంతో
విష పన్నగ ఆభారములతో, శాంతమైన గజస్వరూపముతో
కరుణామృత దృష్టితో, దృష్టులను అణిచే ఆయుధములతో
మూషిక వాహముపై ఏతెంచి, భక్తవరులు పూజలను స్వీకరించి
ఆశీర్వదించి, మేము పెట్టు ఫలాలు ఉండ్రాళ్ళు ఆరగించవయ్యా 

గజాననాయ, గణాధ్యక్షాయ, విఘ్నరాజాయ నమో నమ:
ఉమాపుత్రాయ, వక్రతుండాయ, సూర్పకర్ణాయ నమో నమ: 

అజ్ఞానుల మైన మేము, చేయు తప్పులను క్షమించుము
సంసార దు:ఖములను కల్పించే మాయను తొలగించిము

సర్వ మంగళా సర్వార్ధ మెఱిగి, శరణ శరణన్న భక్తుల కరణ నేరి
రోగములను బాపు అమృతమును అందించి, సర్వ సిద్ధిలనొసగి
ధర్మ మార్గముపు నడక చూపి, సత్యముగా, న్యాయముగా,
జీవితమును గడుపుటకు మాకు శక్తి నీయవయ్యా వినాయకా        

గజాననాయ, గణాధ్యక్షాయ, విఘ్నరాజాయ నమో నమ:
ఉమాపుత్రాయ, వక్రతుండాయ, సూర్పకర్ణాయ నమో నమ: 
ఏకదంతాయ లంబోదరాయ, సర్వేశ్వరాయ నమో నమ:
--((*))--


ఉపాధ్యాయ దినోత్సవ సందర్భముగా
అందరికి శుభాకాంక్షలు
 "ప్రాంజలి  ప్రభ"

విద్యను మెదడుకు అందించి
ప్రతి ఒక్క విద్యార్థిని ప్రగతి పథంలో నడిపించి
ఉన్నతోన్నతుడుగా మారుటకు కారణం ఉపాద్యాయుడు 

కొత్త పద్ధతుల ద్వారా, ఆధునిక శాస్త్రవిజ్ఞానమును
అందు బాటులో తెచ్చి, సులభ పద్దతిలో తెలుప గల
ఏకైక వ్యక్తి ఉపాద్యాయుడు 

పుడమి యందు విత్తు చేరి వృక్షంగా మారినట్లు
ప్రతి విద్యార్థి మెదడులో తెలుగు, ఆంగ్ల సాహిత్యం
వల్ల "చెట్టు ఉపయోగ పడినట్లు"
ఉపయోగ పదేవిధముగా 
తీర్చి దిద్దేవాడే ఉపాద్యాయుడు  

సాధ్యం కానిదిలేదు మట్టి నుండి బంగారాన్ని,
ఆకాశంలో అద్భుత నాగరాల్ని నిర్మించాలన్నా
మానవులు ఉన్నత స్థితుకి ఎదగాలన్న
క్రమశిక్షణతో నేర్చుకున్న విద్య ఒక్కటే
అది నేర్పిన ఉపాద్యాయుడు ఒక్కడే

నిరంతరం విద్యార్థి శోధకుడై అనేక
మంది గురువుల వద్ద విద్య నభ్యసించి
శమంతకమణి వెలుగులా విద్యను
దానం చేయుటే ఉపాద్యాయుడి విధి     

సర్వేజనా సుఖినోభవంతు అని
ఆశించే వాడు ఉపాద్యాయుడు
--((*))--
   
  , 
*వర్షపు శబ్దం

మధ్యరాత్రి నన్ను లేపేసింది వర్షపు శబ్దం
మజాగా ఉంది కిటికీలో నుంచీ చూడటం
ప్రియమైన పలక రింపైంది చల్లని సమీరం
బయట చూస్తే వెలుతురులో మెరుస్తోంది ఆ వర్షం

ధారలుగా పడుతూ ఎంతో బాగుంది దృశ్యం
ప్రకృతితో చేసుకుంటోంది సరాగ సౌజన్యం
కురిపించేస్తోంది జల్లుల్లొ మైత్రీ ప్రభంజనం
పూర్తిగా, ఇష్టంగా చేసుకుంటోంది అభిషేకం

వర్షాన్ని చూస్తూ ఐ పోయాను సమ్మోహితం
ప్రకృతి లోఈ వర్షపు సౌందర్యము ఓ అద్భుతం
జల జలా రాలుతున్న ఆ నీటి ప్రవాహం
ఓ మోహన వాయిద్యం మిళితమైన శ్రవణానందం .
అపురూపానుభూతితో తడిమిన నా అంతరంగం ......

ఏకాంతంలో ఓ మాధుర్యం దొరికినట్లుగా
నిద్దురలో లేచినా , చక్కని కల కన్నట్టుగా .
ఆ వర్షం నా నేస్తమై పంచింది ఆహ్లాదం
చల్లనైన మదితో సంతోషం పొందాను ఆతరుణం 

గత బాల్య  స్మృతలు గుర్తుకు వస్తున్నాయి 
జలాల్లో నాట్యాలు, వెన్నెలలో ఉయ్యాలలు 
 పెద్దల ఆర్తనాదాలు, పిల్లల ఆరాటాలు 
 నన్ను జల్లులు పిలుస్తున్నాయి 
సంతోషానికి ఇది ఒక జల్లుల ఆలయం

--((*))--


                                                        
 
    * శ్రీ కృష్ణపరమాత్మ 

అనంత జీవన మార్గాన్ని
అమృత వర్ష బాండాగారాన్ని
ఆస్రితులకు సహాకారాన్ని
అందరికి  అందించే అమృత జలాన్ని

బంధాలకు ఆధారాన్ని
నేనొక ప్రణయ ప్రభందాన్ని    
వసంతంతో వికసించేవాన్ని
అందరికి అందించే ప్రకృతి తత్వాన్ని

సరస సల్లాప సారాగాన్ని
ఆకట్టు కుంటున్న అను రాగాన్ని
అర విరిసిన అందాన్ని 
అందరికి  ఆనందాన్ని అందించే గుణాన్ని

ప్రకృతిలో వైవిధ్యాన్ని
వైవిద్యంలో ఏకత్వాన్ని
సుందర స్వప్నాన్ని
అందరికి సుందర స్వప్నాల తత్వాన్ని

దైవ దత్తమైన వరాన్ని
లలిత సంగీత స్వరాన్ని
వెదజల్లే చల్లని సమీరాన్ని
 పంచ భూతాలకు సహకారాన్ని

మధుర భావాల్లో సత్యాన్ని
కవి హృదయంలో సాహిత్యాన్ని
స్మృతి సుమధర పరిమళాన్ని
 కవుల హృదయాలల్లో షాహిత్యాన్ని

నేనొక ప్రేమ తత్వాన్ని
తగ్గిస్తాను ప్రేమ తాపాన్ని
కలుపుతా ప్రేమ తన్మయత్వాన్ని
భోదిస్తా ప్రేమ శృంగార తత్వాన్ని

ఇంతకూ నేనెవరో తెలిసిందా
ఆధరాలలో ఉన్న లాలాజలాన్ని
కాదు జిహ్వాచాపాన్ని
కాదు కాదు అమృత జలాన్ని
కాదు సమస్త లోకాల అధినాయకుణ్ణి
--((*))--
 



 ఒక పాట 

 ఏమిటీ ఆ సూర్య భగవాను కాంతికే
తట్టుకోలేక పోతున్నావా బాబు
అవును తాతా, ఆ భగవానుని గురించి
ఒక పాట పాడు తాతా, ఓ అలాగే పాడుతా విను

ఆ  ఆ ఆ  ఆ  ఆ  ఆ  ఆ ఆ ఆ
ప్రభాత సూర్యునికీ .... ప్రపంచమంతా
ప్రణామాలు చేస్తూ ఉండాలీ .... జీవితమంతా  
ఆ  ఆ ఆ  ఆ  ఆ  ఆ  ఆ ఆ ఆ

మన మనసేమో ... గగన మంతా
రక్తకణాలు అన్నీ ... పచ్చదన మంతా
మనలో కలిగే గుణాలన్నీ -  వర్ణాలంతా 
మనలో కలిగే భావోద్వేగాలే -  ప్రకృతి అంతా
విశ్వముతో పోలిస్తే  - మన హృదయాలే రవ్వంతా     

ఆ  ఆ ఆ  ఆ  ఆ  ఆ  ఆ ఆ ఆ
'అందుకే' ఆ ప్రభాత సూర్యునికీ  ప్రపంచమంతా
ప్రణామాలు చేస్తూ ఉండాలీ ... జీవిత మంతా  

ఆ  ఆ ఆ  ఆ  ఆ  ఆ  ఆ ఆ ఆ

సృష్టి అనుభవమే ....  దాచింది కొండంతా
మానవుల మనసుకూ ... చేరేది రవ్వంతా
సృష్టి రహస్యాలూ ....  ఎవ్వరూ చెప్ప లేరంతా
అమ్మలుగన్నమ్మ ఆశీర్వాదములూ  ...  కావాలి అంతా
సృష్టి, స్థితి, లయ  కారుల దీవెనలూ ... కావాలి అంతా

ఆ  ఆ ఆ  ఆ  ఆ  ఆ  ఆ ఆ ఆ
'అందుకే' ఆ ప్రభాత సూర్యునికీ  ప్రపంచమంతా
ప్రణామమాలు చేస్తూ ఉండాలి జీవితమంతా  
 ఆ  ఆ ఆ  ఆ  ఆ  ఆ  ఆ ఆ ఆ
    
ఆదిత్యుని అడుగులో ...  అడుగేసి అంతా
జీవన ప్రయాణాలూ .... సాగాలి జన్మంతా
ప్రేమను రంగరించీ,  ;;;; ప్రకృతి అనుసరించి అంతా
ప్రపంచ శాంతికి ...  సహాయ సహకారాలు అందించాలి అంతా
   
ఆ  ఆ ఆ  ఆ  ఆ  ఆ  ఆ ఆ ఆ
'అందుకే' ఆ ప్రభాత సూర్యునికీ  ప్రపంచమంతా
ప్రణామమాలు చేస్తూ ఉండాలీ  జీవితమంతా  
ఆ  ఆ ఆ  ఆ  ఆ  ఆ  ఆ ఆ ఆ

తాతా చాలా చక్కగా పాడారు, నేను రోజు ప్రొద్దున్నెలేచి
సూర్య నమస్కారాలతో,  స్తోత్రాలతో ఉదయ భానునిని
ఆరాధిస్తాను తాతా - అట్లాగే మనవడా ఆ భగవంతుడు
చల్లగా చూస్తున్నాడు, హాయిగా ఉన్నాము అంతా

ఆ  ఆ ఆ  ఆ  ఆ  ఆ  ఆ ఆ ఆ
'అందుకే' ఆ ప్రభాత సూర్యునికి ప్రపంచమంతా
ప్రణామమాలు చేస్తూ ఉండాలి జీవితమంతా  

--((*))-- 

 

ఇది నా పాట  (ఉండకురా మామ )

మన్ను తిన్న పాములా, కన్ను గిన్నె కొప్పులా
తన్ను కున్న పక్షిలా, గోతి క్రింద నక్కలా ఉండకురా మామ 

నూతి లోని చేపలా, జాతి లేని కుక్కలా
చిక్ ముఖ్ రైలులా, బెక్ బెక్ బాతులా
కిస్ కిస్ కోతిలా, గబుక్కు దూకే కప్పలా ఉండకురా మామ 

చేమక్ చూపే లేడిలా, తుపుక్ ఊడే తుమ్ములా
నిగురుకప్పిన నిప్పులా,  ఉండకురా మామ ఎప్పుడూ . 

వలద్ వలద్ అనకు, చేయన్ చేయన్ అనకు
తినన్ తినన్ అనకు, వెళ్లన్   వెళ్లన్  అనకు

మనసైన ఆలోచన మన దవ్వాలంటే
మనసున్న మనిషిగా గౌరవం పొందా లంటే
మానవతా దృక్పధం తో మనసివ్వా లంటే
సమస్త మానవాళిని నిస్వార్ధంగా ప్రేమించే 
తత్త్వం నీలో పెంచుకోరా మామా

నచ్చటం, నచ్చకపోవటం చూపుల్లో ఉంటే
కుదరటం, కుదరక పోవటం చేతుల్లో ఉంటే
మెచ్చటం, మెచ్చక పోవటం మనసుల్లో ఉంటే
సహనాన్ని విడువకుండా, ప్రాణాతి ప్రాణంగా ప్రేమించే 
నీ  లచ్చి నీవెంటే ఉన్నదిరా  మామా 
అట్లా ఉండకురా మామా అట్లా ఉండకురా మామా

 --((*))--

ఈ రోజు నా ప్రేమ పాట (ప్రేమించిన బుల్లోడు 
చేనువద్దకు వస్తే "పార "చేతిలో పెట్టి ఆట పట్టించే 
బుల్లెమ్మ పాట) 

చేను కొచ్చి  పారను దాచుతా వేమి బుల్లోడా
చక్కగా వచ్చి నీరు పోయేటట్లు చేయు బుల్లోడా

అడ్డుగా ఉన్న పైన గట్లు  ముందుగా  తడుపు బుల్లోడా
కింద కొచ్చి అడ్డుగా ఉన్న  పైపైవి  తొలగించు బుల్లోడా
శుభోదయం గా వీలు పడును,  నీరు దిగుటకు బుల్లోడా
పారతో మట్టిని కదిలించి నీరు పెట్టి సర్దుకో బుల్లోడా

చేను కొచ్చి పారను దాచలేదు బుల్లెమ్మా
చేనుకు నీరు పెట్టకుండా పోలేనులే  బుల్లెమ్మా

క్షణమాగను అవి స్మృతి కణాలు అవుతాయి బుల్లెమ్మా
ఆలోచించను సందేహాలకు తావివ్వక పనిచేస్తా బుల్లెమ్మా
సాటి మనిషిగా చెపుతున్న బాధలు తొలుగిస్తాను బుల్లెమ్మా 
సంతోషాల బ్రతుకుకి నీరు పెట్టుటకు వచ్చాను బుల్లెమ్మా   

చేను కొచ్చి  పారను దాచుతావేమి బుల్లోడా
చేనుకొచ్చి నీరు పెట్టకుండా పోతావేమి బుల్లోడా

చచ్చు పుచ్చు భావాలు చెపుతున్నానని అనుకున్నావా
బ్రతుకు పాఠాలే చెప్పాను ఛానలైతే ఊరుకోదు ఈ బుల్లెమ్మా 
వద్దు వద్దన్నా ముగ్గులోకి తింపందే ఊరుకోదు ఈబుల్లెమ్మా 
ఈ బుల్లెమ్మ  మాటలు విని చేనులోకి నీరు పెట్టి పోవా

చేనుకొచ్చి పార దాచలేదు బుల్లెమ్మా
చేనుకు నీరు పెట్టకుండా పోలేను బుల్లెమ్మా

చేను కొచ్చి పార దాచుతావేమి బుల్లోడా
చేనుకొచ్చి నిరు పెట్టకుండా  పోతావేమి బుల్లోడా 
--((*))--

 ఈ రోజు నా పాట ఆలాపనా

నిన్ను ఎంతో వెదికినాను
నీకై వేచి వేచి ఉన్నాను
నీకోసం  ఎదురు చూస్తున్నాను
ని జ్ఞాపకాలు మరువలేకున్నాను

కనులు తెరిచినా, కనులు మూసినా
వెన్నెల విసిరినా, పువ్వులు పూసినా
కోయిలలు కూసినా, జల్లులు పడినా

ఈ నిరీక్షణ మారునా
మనసు కలత మారునా
మది తలపులు తీరునా  
మధురభావాలు వచ్చునా

నిన్ను ఎంతో వెదికినాను
నీకై వేచి వేచి ఉన్నాను

నీ వెటువుందువో, నీ వెళా వుందువో
నీ కళలుఎమైనాయో, నీ తలపులు ఎమైనాయో 
నీ కలలు మరువనోయో, నీ చూపులు గుర్తున్నాయో  

నీ భావాలు మరువలేకున్నా ,
నీతోనే లోకాలు తిరగాలనుకున్నా
నీతో కాలాలు కదలిరావాలనుకున్నా
నీ మనసు తెలిసి నీకోసం వేచిఉన్నా

నిన్ను ఎంతో వెదికినాను
నీకై వేచి వేచి ఉన్నాను
--((*))--