2, డిసెంబర్ 2019, సోమవారం

03-12-2019






🕉🌞🌎🌙🌟🚩

*SWAMI VIVEKANANDA-TO THE BRAVE YOUTH...*
*_SELF CONFIDENCE_*

*You have in you all and a thousand times more than is in all the books. Never lose faith in yourself, you can do anything in this universe. Never weaken, all power is yours.*

*స్వామివివేకానంద-ధీరయువతకు...*
*_ఆత్మవిశ్వాసం_*

*సమస్త గ్రంధాలలో ఉన్న జ్ఞానమంతా నీలోనే ఉంది.అంతకంటె వేయిరెట్లు ఎక్కువగా ఉంది. ఆత్మవిశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోవద్దు. ఈ విశ్వంలో నీవు దేన్నైనా సాధించగలవు.ఎన్నడూ దౌర్బల్యానికి లోనుగాకు. సమస్త శక్తీ నీదే.*

🕉🌞🌎🌙🌟🚩
చందమామ కధ.!
బ్రహ్మహత్యా పాతకం ఎవరికి చుట్టుకుంటుంది?
[భట్టి విక్రమాదిత్యుల కథ ]

విక్రమార్కుడు మళ్ళీ భేతాళుణ్ణి బంధించాడు. భేతాళుడు మళ్ళీ మరో కథ ప్రారంభించాడు. ఒకప్పుడు ‘అవినాశి’ అనే నగరం ఉండేది. (వినాశం లేనిది అని ఆ పేరుకి అర్ధం.) ఆ నగరంలో దేవనాధుడు అనే బ్రాహ్మణుడుండే వాడు. అతడి కొక కుమారుడు, అర్జున స్వామి. అతడు రూపవంతుడూ, గుణవంతుడు. అతడికి యుక్త వయస్సు వచ్చాక తండ్రి దేవనాధుడు, ఎన్నో ఊళ్ళు వెదికి తగిన కన్యని తెచ్చి వివాహం చేసాడు. ఆ పిల్ల పేరు అనామతి. ఆమె అర్జునస్వామికి రూపంలోనూ, గుణంలోనూ తగిన భార్య. తీయని మాటలూ, చక్కని చేతలూ గలది. యువ దంపతులని చూసిన ఎవరైనా… వారు ఒకరి కొకరు తగి ఉన్నారనే వారు. గువ్వల జంట వంటి ఆ యువజంట, ఎప్పుడూ కలిసి మెలిసి ఉండేవాళ్ళు. ఏ పని చేసినా కలిసి చేసేవాళ్ళు. క్షణమైనా ఒకరినొకరు ఎడబాయక ఉండేవాళ్ళు. వారి తీరుని చూసి అందరూ ముచ్చట పడే వాళ్ళు. ఇలా ఉండగా…ఓ నాటి రాత్రి… చల్లగాలి వీస్తొందని భార్యభర్తలిద్దరూ, పెరట్లో మల్లెపందిరి ప్రక్కనే మంచం వేసుకు పడుకున్నారు. అది వెన్నెల రాత్రి! అర్జునస్వామి, అనామతి ఆరుబయట ఆదమరిచి నిదురిస్తున్నారు. ఆ సమయంలో ఆకాశంలో ఓ రాక్షసుడు వెళ్తోన్నాడు. అతడు భీకరంగా ఉన్నాడు. అతడి చూపులు అంతకంటే కౄరంగా ఉన్నాయి. దిగువకి చూసిన రాక్షసుడి కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి. అతడికి అనామతి అద్భుతంగా అనిపించింది. ఆమె అందానికి అదిరిపోయాడు. అమాంతం క్రిందికి దిగి, ఆమెని ఎగరేసుకు పోయాడు. రాక్షస మాయ కారణంగా అనామతికి గానీ, అర్జునస్వామి గానీ నిద్రాభంగం కాలేదు. తెల్లవారింది. అందరి కంటే ముందే లేచి గృహకృత్యాలలో నిమగ్నమయ్యే అనామతి ఏది? నిద్రలేచిన అర్జునస్వామికి భార్య ఎక్కడా కనబడలేదు. కుటుంబ సభ్యులంతా కూడా వెతికినా అనామతి జాడలేదు. ఎవరికీ ఏమీ తోచలేదు. కీడెంచి మేలెంచమని, ఊళ్ళోని చెరువులూ నూతులూ కూడా గాలించారు. బంధుమిత్రులందరినీ వాకబు చేసారు. ఆమె ఆచూకీ తెలియ లేదు. అర్జునస్వామికి దుఃఖం కట్టలు దాటింది. అతడు ఎలాగైనా భార్య జాడ తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాంతో దేశాటనం బయలు దేరాడు. అనామతి గురించి వెతుకుతూ ఎన్నో ప్రదేశాలు, ఊళ్ళూ, అడవులూ గాలించాడు. ఏ మాత్రం ఉపయోగం లేకపోయింది. నిరాశా నిస్పృహలతో, స్వంత ఊరు అవినాశికి తిరుగు ప్రయాణమయ్యాడు. లోలోపల మిణుకు మిణుకు మంటూ ఓ చిరు ఆశ… ‘ఒక వేళ ఈ పాటికి అనామతి ఇల్లు చేరిందేమోనని’. తిరుగు ప్రయాణంలో, అలసటతోనూ, ఆకలి తోనూ ఉన్నాడు. అప్పటికి ఓ గ్రామం చేరాడు. ఓ బ్రాహ్మణ గృహం ఎంచుకొని ‘భోజనం పెట్ట’మని అడిగాడు. గృహస్థు భార్యని పిలిచి “అతిధికి భోజనం పెట్టు” అని చెప్పాడు. ఆ గృహిణి అతడికి భోజనం వడ్డించే ప్రయత్నం చెయ్యబోగా…అర్జున స్వామి “అమ్మా! స్నాన సంధ్యలు ముగించుకొని ఆరగిస్తాను. భోజనం కట్టి ఇవ్వు” అని అర్ధించాడు. గృహిణి ఒక చిన్న వెదురు బుట్టలో అరిటాకు వేసి, అందులో అన్నం పప్పూ కూరలూ సర్ధింది. ఓ చిన్న పిడతలో పెరుగు, ప్రక్కనే పండూ తాంబూలం ఉంచింది. భక్తిగా అతిధికి సమర్పించింది. అర్జునస్వామి వారిని “అన్నదాతా! సుఖీభవ!” అంటూ ఆశీర్వదించి, తిన్నగా చెరువు గట్టుకు వెళ్ళాడు. చెరువులో నీళ్ళు నిర్మలంగా ఉన్నాయి. చెరువు ఒడ్డున పెద్ద మర్రి చెట్టుంది. దాని నీడ చల్లగా హాయిగా ఉంది. అర్జునస్వామి, భోజనం ఉన్న బుట్టని ఆ చెట్టు క్రింద ఉంచి, చెరువులో స్నానం, సంధ్యా వందనం పూర్తి చేసుకున్నాడు. చెట్టు క్రింద కూర్చొని ఆవురావురుమంటూ అన్నం తినసాగాడు. ఆ సమయంలో… మర్రి చెట్టు కొమ్మపైకి ఓ గ్రద్ద వచ్చి వాలింది. దాని గోళ్ళల్లో ఓ కాలనాగు గిలగిల్లాడుతుంది. చెట్టు కొమ్మపైన కూర్చున్న గ్రద్ద, ఆ పాముని ముక్కుతో పొడుచుకొని తినసాగింది. మరణ యాతనకి పాము విలవిల్లాడుతూ విషం కక్కసాగింది. ఆ విషం తిన్నగా అర్జునస్వామి అన్నం తింటున్నా అరిటాకుపై సన్నని తుంపరగా పడసాగింది. ఎంత సన్నని బిందువులంటే…ఆరగిస్తున్న అర్జునస్వామికి సైతం దృష్టికి ఆననంత! అసలే ఆకలిగా ఉన్న అర్జునస్వామి, అన్నం పప్పూ కూరలతో స్వాదిష్టంగా ఉన్న భోజనాన్ని ఇష్టంగా ఆరగిస్తున్నాడు. అయితే కాస్సేపటికి, విషాహారం కారణంగా అతడు మృతి చెందాడు. ఇదీ కథ! అంటూ కథ ముగించిన భేతాళుడు…“విక్రమార్క మహీపాలా! ఈ బ్రహ్మహత్యా పాతకం ఎవరికి చెందుతుంది? ఆహారాన్నిచ్చిన బ్రాహ్మణ దంపతులకా? పాముని చంపితిన్న గ్రద్దకా? విషం గక్కిన పాముకా? విషాహారాన్ని తిని మరణించిన అర్జునస్వామికా?” అనడిగాడు. [త్వరపడి ఈ ప్రశ్నకు జవాబు చెప్పకండి. విక్రమాదిత్యుడి తర్కం చదివాక, అప్పుడు చెప్పండి. భారతీయుల నమ్మకాల్లో…బ్రాహ్మణ హత్య (అంటే సత్వగుణ సంపన్నుడి హత్య) మహా పాపమనీ! దాన్ని బ్రహ్మహత్యాపాతకం అంటారు. అలాగే గోహత్య, స్త్రీ హత్య, శిశుహత్యలను కూడా పరమ పాపాలని నమ్మేవాళ్ళు. ఆ కోవలోకే చెందుతుంది ఆత్మహత్య కూడా! ఇప్పుడు నమ్మకాలూ బాగానే సడలి పోయాయి, దృక్పధాలూ మారిపోయాయి. ఎంత పాపానికైనా వెనుతీయని సమాజాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం.] విక్రమాదిత్యుడు స్ఫుటంగా “భేతాళా! ఇందులో ఎవరి తప్పూ లేదు. ఆకలిగొన్న అతిధిని సత్కరించటం గృహస్థు ధర్మంగా భావించి, బ్రాహ్మణ దంపతులు, అర్జునస్వామికి ఆహారం సమర్పించాడు. స్నాన సంధ్యలు ముగించి భోజనం చెయ్యడం సదాచారమని భావించి, అర్జునస్వామి చెరువుకు చేరాడు. చెట్టు నీడన కూర్చొని భోజనం చేసాడు. గ్రద్ద తన ఆహారాన్ని తాను వేటాడి తెచ్చుకుంది. చెట్టు కొమ్మపై కూర్చొంది. మరణ యాతనకి పాము విషం గ్రక్కింది. పాములు గ్రద్దలకి దేవుడిచ్చిన ఆహారం. మరణ సమయాన విషం గ్రక్కడం పాము ప్రారబ్దం. అందుచేత వాటి దోషమూ లేదు. అందుచేత వీరెవ్వరికీ బ్రహ్మహత్యా దోషం అంటదు. అయితే… ఎవరీ కథ విని, పూర్వాపరాలూ, ధర్మసూక్ష్మాలూ ఆలోచించకుండా… ‘ఫలానా వారికి బ్రహ్మహత్యా దోషం అంటుతుంది’ అంటారో, వారికి, ఈ బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుంది” అన్నాడు. విక్రమార్కుడి విజ్ఞతకి భేతాళుడికి చెప్పలేనంత ఆనందం కలిగింది. చప్పట్లు చరుస్తూ తన ఆనందాన్నీ, అభినందననీ తెలిపాడు. అయితే మౌనభంగమైనందున మరుక్షణం మాయమై మోదుగ చెట్టు పైన మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు.


~~ పోరాట ప్రతి ధ్వని~~ 
*********************. Dr.J. Umadevi 

తూటాలకు బలైపోయి జైళ్లలోన మగ్గిపోయి 
అవమానం భరించితమ ఆత్మలన్నినివేదనం ! 

గాంధీజీ జోలెపట్ట నగలన్నీ ఒలిచిచ్చిరి 
ఇంటింటా వడుకునూలు వ్రతదీక్షకి నివేదనం! 

స్త్రీశ క్తిని కూడగట్టి ఉద్యమాల బాటపట్టి 
హరతులుగ శ్రమశక్తిని భారతికీ నివేదనం! 

ఖద్దరుచీరలనుగట్టి మళ్ళలోన ఉప్పుచేసి, 
తమతమ సుఖాలన్నిలాఠీలకి నివేదనం! 

మాతృభూమి రక్షణలో మగువపాత్ర మరువరాదు 
ఆఅమ్మల తెగువలన్ని గతచరిత్రకి నివేదనం. ! 

లక్ష్మిబాయి సరోజినీ హజరత్ కామాలవంటి 
స్త్రీ సైన్యం పటిమగూర్చి లోకానికి నివేదనం ! 

భగత్ సింగు అల్లూరి సావర్కార్ ఉద్యమాలు 
దేశమాత దాస్య ముక్తి యాగానికి నివేదనం ! 

రెపరెపలాడే జండా ఎగరాలని మనపూర్వులు 
జీవితాలు దేశమాత చరణాలకి నివేదనం ! 

గాంధీజీ అహింసనే ఆయుధముగ పట్టినాడు 
చేసినాడు తనప్రాణం ఈజాతికి నివేదనం ! 

మనదేశం అను భావన అందరి కీ ఉన్నప్పుడు 
జ్ఞానధనం భరతమాత ఎదుగుదలకి నివేదనం ! 

మువ్వన్నెల పతాకాన్ని ఎగరేసే పండగొచ్చె 
మన భక్తిని మాతృభూమి శ్రీరక్షకి నివేదనం ! 
~~~~~~~~~~~~~
--(())--

 జీరో ఎఫ్ ఐ ఆర్.

జీరో ఎఫ్ ఐ ఆర్...ఇదొకటుందనే విషయం చాలా మందికి తెలీదు. నిజానికి చాలా మంది పోలీసులకే తెలీదు.

ఇది నేనిప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానూ అంటే ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు పోలీసుల ధగ్గరికి వెళితే అది మాపరిధి కాదు అని శంశాబాద్ పరిధి అనీ కాదు కాదు శంశాబాద్ రూరల్ పరిధి అనీ తిప్పారని తెలిసి ఇది రాస్తున్నాను...

ఈ సమస్య ఇప్పుడే కాదు...ప్రతి పోలిస్ స్టేషన్ లోనూ జరిగే ప్రహసనమే...పోలీసులు చాలా సందర్భాలలో బాధ్యత నుంచి తప్పుకోవడానికి మా పరిధి కాదు అనే ఆయుధాన్ని వాడుతుంటారు. నిజానికి ఇది తప్పు.

మనమొక ఫిర్యాదుతో ఏ పోలిస్ స్టేషన్ కు వెళ్ళినా వారు తప్పకుండా ఆ ఫిర్యాదు తీసుకోవాలి. మా పరిధి కాదు అని వాళ్ళు అంటే జీరో ఎఫ్ ఐ ఆర్ చెయ్యండి అని మనం అడగాలి. అప్పుడు జీరో ఎఫ్ అయి ఆర్ చెయ్యాల్సిందే..

ఇంతకూ జిరో ఎఫ్ ఐ ఆర్ అంటే ఏమిటి..
మన ఫిర్యాదు ఏ స్టేషన్ పరిధి లోదో తేలనపుడు మనం ఎక్కడైతే ఫిర్యాదు చేసామో అక్కడ జీరో ఎఫ్  ఐ ఆర్ గా నమోదు చేసి తరువాత సంబందిత స్టేషన్ ఏదో తెలుసుకుని ఆ ఎఫ్ ఐ ఆర్ ను ఆ స్టేషన్ కు పోలీసులు బదిలీ చేయాలి...

ఇంకా చెప్పాలంటే ఏ పరిధిలోదో తెలిసినా సరే మనం ఫిర్యాదును వేరే స్టేషన్ లో చేసి జీరో ఎఫైఆర్ చేయండి అని అడిగితే అక్కడ నమోదు చేయాల్సిందే.
ఇది నియమం.

మా పరిధి కాదు అని ఏ పోలిస్ స్టేషనూ అనడానికి వీలు లేదు.

జీరో ఎఫ్ ఐ ఆర్ గురించి నిజానికి ప్రజల కంటే ముందు పోలిస్ ఆఫీసర్లే తెలుసుకోవాలి .


--((***))--

 నేటి హస్త్యం 



అమ్మ అనసూయ గారు! మరోసారి ఆలోచించండి.

మీకు వ్రుద్దాప్యము,అనారోగ్యము,ఆర్దిక సమస్యలు.

మీ ఆయన చాలా మంచివారు.

ఈ పరిస్తితులలో విడాకులు సమంజసం కాదని నా అభిప్రాయము.



లాయర్ గారూ! నిజంగా మా ఆయన దేముడేనండీ!

ఆయన లేనిదే నా రోజు గడవదు.

నా అంతట నేనేమీ చేసుకోలేని నిస్సహాయురాల్ని. ఆయనంటే నాకు గౌరవం, ప్రేమ, అభిమానం, జాలి



మరింకేమిటమ్మ?

ఆయనలోని అపరిచితుడు నా మనసును
తీవ్రాతి తీవ్రంగా గాయ పరుస్తున్నాడు.
ఎప్పుడు మేల్కుంటాడో తెలీదు.
నా యుక్తవయసు నుండి నా విషయాలు
చిలువలు పలువలుగా తెలుసుకుని, అనేక కట్టు కధలు వండి వార్చుకుని,
అభూత కల్పనల కన్నా గోప్ప పాత్రలు స్రుష్టించుకుని నాకు సంబందం లేని పాత్రలకు నాతో ముడి పెట్టి ప్రశ్నల పరంపరలతో నా మనసును
కకలా వికలం చేస్తున్నారు

ఆ ఓక్క క్షణం నెమ్మదిగా మట్లాడితే?

అవును.
నెమ్మదిగా మాట్లాడితే
ఇంత అవమానకర విషయాన్ని సహించేవంటే నువ్వు తప్పు చేసేవనీ, గట్టిగా మాట్లాడితే చింత చచ్చినా పులుపు చావలేదని నిలదీస్తారు!!!

--(())--



సాహితీమిత్రులారా!

మధురవాణీవిలాసమును రచించిన
చింతపల్లి వీరరాఘవయ్యగారు క్రీ.శ.1660
ప్రాంతంలో మహబూబునగర్ జిల్లా,
వట్టెం గ్రామంలో నివసించారు.
ఈ కావ్యం అయిదు ఆశ్వాసాలు గలది
దీనిలో మధురవాణీ కార్తవీర్యుల కథ కూర్చబడినది.
ద్వితీయాశ్వాసంలోని చిత్రకవిత్వంలోని
ఏకాక్షర , ద్వ్యక్షర త్య్రక్షర - పద్యాలను చూడండి-

ఏకాక్షరకందపద్యం-
'న'- అనే ఒకే హల్లుతో కూర్చిన కందము.

నిన్నే నెన్నేనని నే
నెన్నైనను నెన్నునిన్నని నేనా
ని న్నాన నూన నేనిన్
నన్నానును నాననాను నననీనన్నా (2-11)

ద్వ్యక్షర కందము-
'న', 'క' - అనే హల్లులుపయోగించి కూర్చినది.

నానా నాకౌకోనీ
కేనాకన నిన్నెకాక నికనేనొకనై
నానెన్ని కినుక నూనక
కానుకకైకొన్న నిన్ను కన్నా నికఁనే (2-12)

న,మ - అనే రెండు హల్లులతో
కూర్చిన ద్వ్యక్షరకందం-

నేమమ్మున నీనామము
మామనమున నమ్మినాము మము మనుమను మో
మామానినాన నెమ్మిని
మే మనుమానమ్ముమాన మి మ్మెన్నేమా (2-13)

త్య్రక్షరకందము-
ద,న,వ- అనే మూడు హల్లులను
ఉపయోగించి కూర్చిన
కందపద్యం ఇది

దానవవనదవవనదా
నానావిద్వన్నవీన నవననిదానా
దీనానాదీనవదా
నానుదు నెద నీదువాదు నాదవినోదా (2-14)

ఈ కావ్యంలోని మరికొన్ని విషయాలను
తరువాత తెలుసుకొందాము.
------------------------------------------------
- ఏ.వి.రమణరాజు
శ్రీ సీతా రామాంజనేయ చరితం (3)


శ్రీరాముడు-యోగరహస్యము -అరణ్యకాండ.7
పంచవటి నివాసము, లక్ష్మణునికి జ్ఞాన బోధ
అచట గృధ్ర రాజైన "జటాయువు" శ్రీరాముని కలిసి అత్యంత మైత్రిని దృఢపరచు కొనెను. ఒకసారి శ్రీరాముడు సుఖాసీనుడై ఉన్న సమయమున జ్ఞాన వైరాగ్య మాయా స్వరూపములను, ఈశ్వరునికి జీవునకు గల బేధములను, మిమ్ములను సేవించు మార్గము ఉపదేశించి వలసినదిగా శ్రీరాముని, లక్ష్మణుడు కోరెను. అప్పుడు శ్రీరాముడు ఈ విధముగా వివరించెను[1].
లక్ష్మణా! మనస్సు, బుద్ధి, చిత్తములను స్థిరముగా ఉంచి వినుము. నేను, నాది, నీవు, నీది అను భావమే "మాయ". ఇదియే జీవులను తన వశము నందు ఉంచుకొనును. ఇంద్రియములు, ఇంద్రియ విషయములు, మనోగతులు - ఇవి అన్నియు "మాయా స్వరూపములే". ఈ మాయ రెండు విధములు. ఒకటి విద్య, మరియొకటి అవిద్య. వీటిలో అవిద్య దుష్టమైనది, మిక్కిలి దుఃఖ ప్రదమైనది. దీనికి వశమైన జీవుడు సంసార కూపమున పడును. రెండవది విద్య. ఇది త్రిగుణాత్మకమైనది. అందరిలో సమత్వ బుద్ధితో పరమాత్మ రూపమునే "జ్ఞానము" అనబడును. సకల సిద్ధులను, మూడు గుణములను గడ్డిపోచ వలె భావించు వాడే పరమ "విరాగి". జీవుడు ఈశ్వరాంశ, కనుక సచ్చిదానంద జ్ఞాన స్వరూపుడు. కానీ మాయాజానితమైన అవిద్య (అజ్ఞాన) ప్రభావమున జీవుడు తన స్వరూపమును గాని, ఈశ్వరుని మాయను గాని ఎరుంగ లేక యున్నాడు. కావున వివిద లౌకిక కర్మాసక్తుడై జీవుడు బంధములో చిక్కు కొనుచున్నాడు. ఈ బంధముల ఛిజ్జడ గ్రంధి నుండి విముక్తుడై మోక్షమును పొందుటకు సర్వాతీతుడు, మాయా ప్రేరకుడైన పరమేశ్వరుని అనుగ్రహము ఆవశ్యకము. దీనికి భక్తియే సాధన మార్గము. ధర్మాచరణము వలన వైరాగ్యము, యోగాభ్యాసము వలన జ్ఞానము జనించును. జ్ఞానము వలన మోక్షము లభించును. ఈ విధముగా వేదములలో చెప్పబడినది. సోదరా! నా హృదయమును త్వరగా ద్రవింప చేయునది భక్తి. ఇదియే నా భక్తులకు పరమానందమును పంచి ఇచ్చును. ఈ భక్తి స్వతంత్రమైనది. దీనికి ఇతర సాధనములు అవసరము లేదు. జ్ఞానవిజ్ఞానములు దీనికి అధీనములు. ఇది సర్వ సుఖములకు మూలము. సజ్జన సాంగత్యము వలననే ఇది లభించును. ఇప్పుడు భక్తి సాధన రీతులను సవిస్తరంగా వివరించెదను. మొదట పూర్తి భక్తి శ్రద్ధలు కలిగి ఉండవలెను. వేదోక్తముగా విధులను నిర్వర్తించవలెను. తత్ప్రభావము వలన విషయవాంఛలపై విరక్తి ఏర్పడును. విరక్తి వలన నా ధర్మము (పూజ) నందు అనురాగము కల్గును. అప్పుడు శ్రవణాది నవవిధ భక్తి మార్గముల యందు మనస్సు దృఢమై ఉండును. మనస్సు నా లీలలు యందు అనన్య ప్రేమతో నిమగ్నమగును. అట్టి నా భక్తులకు సజ్జన పాదపద్మములపై అత్యంత ప్రేమ యుండును. అతడు త్రికరణ శుద్ధి కలిగి నియమ పూర్వకముగా నన్ను భజించు చుండును. నన్నే గురువు, తల్లి, తండ్రి, సోదరుడు, పతి, దైవము అని భావించుతూ సేవించు చుండును. నా గుణములు కీర్తించు చున్నప్పుడు అతడు పులకిత గాత్రుడగును. అతని కంఠము గద్గదమగును. నేత్రములు నుండి ప్రేమాశ్రువులు ప్రవహించు చుండును. అతని యందు కామము, మదము, దంభము మొదలుగునవి ఏ మాత్రము ఉండవు. అట్టి అనన్య భక్తునకు నేను సర్వదా వశుడనై ఉందును.
దో-బచన కర్మ మన మోరి గతి, భజను కరహి ని:కామ|
తిన్హ  కే   హృదయ కమల మహు, కరఉ సదా బిశ్రామ||  (దో|| 16 )
మనోవాక్కర్మల యందు సర్వదా నన్నే స్మరించుతూ నిష్కాముడై నన్ను భజించు వాని హృదయమే నా నివాస స్థానము.
యోగవాసిష్ఠములో వసిష్ఠుడు శ్రీరామునికి అవిద్య, బంధ మోహములు, మోక్షము మున్నగు వాటి గురించి వివరించెను. అవి ... ఎల్లపుడు ఉండునది బ్రహ్మతత్వమే అని, అస్థిరమైన మనస్సు, అవిద్యచే ఈ ప్రపంచము సత్యముగా తోచుటయే బంధమని కానీ నిజముగా ఆత్మ శుద్ధ మైనది అని పూర్వ కర్మలు లేని వానిని మృత్యువు కూడా ఏమిచేయలేదని ఆకాశజో పాఖ్యానమున వివరింపబడినది. పరమాత్మ యొక్క మాయాశక్తి అయిన మనస్సే జగమును సృజించు చున్నది కానీ వాస్తవంగా ఈ జగత్తంతా మాయ అని లీలోపాఖ్యానమున వివరింపబడినది. బ్రహ్మమే సత్యము, జీవుడు ఆ పరబ్రహ్మమే ఇరువురికి భేదము లేదు. మనస్సు నందు జనించిన సంకల్ప వికల్పాలే ప్రపంచముగా తోచును. కావున అట్టి మనస్సును నిగ్రహించి పరమాత్మ జ్ఞానం వలన ముక్తిని పొందాలి అని పరమాత్మ వస్తువు ఒక్కటే సత్యమని కర్కటోపాఖ్యానమున వివరించారు. జగద్రూపముగా ఉన్న మాయాస్వరూపాన్ని దాశురోపాఖ్యానములో వివరించారు. ఉపశమ ప్రకరణము నందు మనస్సు ఎలా శాంతి పొందుతుందో దానికి ఉపాయాలు ఏమిటో వివరించారు.  చిత్తాన్ని జయించనంత వరకు మాయ తొలగదు అని గాధి ఉపాఖ్యానములో చెప్పారు. చిత్త విశ్రాంతి కోసము సంగాన్ని త్యజించాలని, ప్రాణ నిరోధము చేయాలి అని వీతహవ్యోపాఖ్యానములో తెలియ చేసారు.
ఈ విధముగా జ్ఞాన వైరాగ్య గుణ నీతి చర్చలతో కొంత కాలము గడచెను.
శ్రీరామ జయ రామ జయజయ రామ
[1] ఈ కధాంశము శ్రీ తులసీదాసు విరచిత "శ్రీ రామచరిత మానసము" లోనిది. వాల్మీకి రామాయణములో లేదు. కావున గమనించ గలరు.

'వందే సంస్కృతమాతరమ్*
*800. శ్లో|| అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః*
*నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః*
*--పంచతంత్రం. కా.కీ.3-98.*
మన శరీరాలు అశాశ్వతాలు, ధనాదివైభవం స్థిరమైనది కాదు. మృత్యువు దగ్గరలో ఉంది. కాబట్టి, ఉన్న కాస్త సమయాన్ని ధర్మానికి కట్టుబడి జీవించాలి.
***
దానికి కుందేలు - ఈ ఇల్లు నీది కాదు! నాదే. నువ్వు అబద్దాలు మాట్లాడుతున్నావు. 'దిగుడుబావి, చేదబావి, చెఱువు, దేవాలయం, చెట్టు వీటి నిర్మాణం తరువాత వాటిపై పెత్తనం చేయడం ఎవరికీ సాధ్యం కాదని' విజ్ఞులు చెప్పారు.
*ప్రత్యక్షం యస్య యద్భుక్తం క్షేత్రాద్యం దశవత్సరాన్, తత్ర భుక్తిః ప్రమాణం స్యాన్న సాక్షీ నాక్షరాణి వా. మానుషాణామయం న్యాయో మునిభిః పరికీర్తితః, తిరశ్చాం చ విహంగానాం యావదేవ సమాశ్రయః.*,
అలాగే, పది సంవత్సరాల పాటు అనుభవించిన భూమి, అనుభవించినవాడి స్వంతమవుతుంది. ఇందుకు సాక్షులు కానీ, లిఖితప్రమాణం కాని అవసరం లేదు. పై న్యాయాన్ని మహర్షులు, మనుష్యుల పరంగానే చెప్పారు. పశుపక్ష్యాదులకు మాత్రం అవి ఉన్నంతకాలం, వాటి స్వంతమవుతాయి.
*తన్మయైతద్గృహమ్, న తవ' ఇతి. కపింజల ఆహ- 'భోః, యది స్మృతిం ప్రమాణీకరోషి తదాగచ్ఛ మయా సహ, యేన స్మృతిపాఠకం పృష్ట్వా స యస్య దదాతి స గృహ్ణాతు'. తథానుష్ఠితే మయాపి చింతితమ్- 'కిమత్ర భవిష్యతి? మయా ద్రష్టవ్యోయం న్యాయః'. తతః కౌతుకాదహమపి తావనుప్రస్థితః.*,
కాబట్టి, ఈ ఇల్లు నాది, నీది కాదు. ఇది విన్న కపింజలుడు- 'ఓయీ! ధర్మశాస్త్రాన్ని ప్రమాణంగా భావిస్తే నావెంట రా! ఎవరైనా ధర్మశాస్త్రజ్ఞుడిని అడుగుదాం. అతడు చెప్పేదానిని బట్టి నిర్ణయిద్దామని' చెప్పి, ధర్మశాస్త్రజ్ఞుడి కోసం రెండు బయటకు పోవడంతో, నేను (కాకిని), 'ధర్మశాస్త్రజ్ఞుడి సమక్షంలో ఏమి జరుగుతుందో? ఆ తీర్పును చూడాలనే' కుతూహలంతో వాటిని అనుసరించాను.
*అత్రాంతరే తీక్ష్ణదంష్ట్రో నామారణ్యమార్జాల స్తయోర్వివాదం శ్రుత్వా మార్గాసన్నం నదీతటమాసాద్య కృతకుశోపగ్రహో నిమీలితనయన ఊర్ధ్వబాహురర్ధపాదస్పృష్టభూమిః శ్రీ సూర్యాభిముఖ ఇమాం ధర్మోపదేశనామకరోత్-*,
ఈలోపల తీక్ష్ణదంష్ట్రుడు (వాడికోరలు కలవాడు) అనే అడవిపిల్లి, ఆ రెండింటి వివాదం విని, అవి వెళ్లేదారికి సమీపంలో ఉండే నదీ తీరం చేరింది. దర్భచాపను పఱచుకొంది. ఆ దర్భపై కాలి వ్రేళ్లు క్రిందకు పెట్టి, నిలబడి, చేతులు పైకెత్తింది. ధ్యానంలో ఉన్నట్లుగా కళ్లు మూసుకుంది. సూర్యాభిముఖుడై ధర్మశాస్త్రోపదేశం చేయడం మొదలుపెట్టింది.
*'అహో, అసారోయం సంసారః. క్షణభంగురాః ప్రాణాః. స్వప్నసదృశః ప్రియసమాగమః. ఇంద్రజాలవత్ కుటుంబపరిగ్రహోయమ్. తద్ధర్మం ముక్త్వా నాన్యా గతిరస్తి. ఉక్తంచ- అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః, నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః.*,
ఈ సంసారం నిస్సారమైంది. ప్రాణాలు క్షణికాలు. ప్రియులతోడి కలయిక స్వప్నంతో సమానం. కుటుంబ సంబంధం ఇంద్రజాలంతో సమానం. అందువల్ల ధర్మం తప్ప వేరే దిక్కు లేదు. అందుకే, మహాత్ములు- "శరీరాలు అశాశ్వతాలు. మృత్యువు అతి దగ్గరలో ఉంది. కాబట్టి, ఉన్న కాస్త సమయాన్ని ధర్మానికి కట్టుబడి జీవించాలని' చెప్పారు.
తీక్ష్ణదంష్ట్రుడి వేదాంత బోధ ఇంకా ఎంత దూరం కొనసాగుతుందో! దాని పర్యవసానమేమిటో? రేపటి శ్లోక వివరణలో తెలుసుకుందాం!
అందరం *సంస్కృతం* నేర్చుకుందాం. ఇతరులకు నేర్పిద్దాం.

--((***))--

రసికరాజ...చిత్రం:  జయభేరి,  రచన: మల్లాది  రామకృష్ణ శాస్త్రి,   సంగీతం:  పెండ్యాల నాగేశ్వర రావు ,
గానం: ఘంటసాల, అభినయం:  ANR.
పెండ్యాల  గారి   సంగీత విద్వత్తుకు   ఈ పాట  మకుటాయమానం.  16 వ మేళకర్త అయిన   చక్రవాక  రాగాన్ని, 29 వ మేళకర్త  ధీరశంకరాభరణం   జన్యమైన  కన్నడ  రాగాన్ని 
మేళవించి ' విజయానంద చంద్రిక ' అనే కొత్త  రాగం  లో ఈ పాటను స్వరపరిచారు.  వారి కృషిని సఫలం చేస్తూ   ఘంటసాల  గారు   అద్వితీయంగా గానం చేసి   పాటకు  చిరకీర్తి కల్పించారు.
ఈ పాటలో   అక్కినేని గారి నటనతో పాటు  గమనించాల్సింది....రాజసులోచన ,అంజలీదేవి, నాగయ్య, SV. రంగారావుల  హావభావాలు.
1. అక్కినేని...నిజంగానే ఒక   కచ్చేరీలో   సంగీత విద్వాంసుడు ఎలా ప్రవర్తిస్తాడో   అలాగే నటించారు అక్కినేని గారు.  సహకార  వాద్యకారులను ప్రోత్సహిస్తూ..స్వర స్థాయిలకు అనుగుణంగా తలను తిప్పుతూ. డబ్బింగ్  అయినా   స్వరాలకు అనుగుణంగా   లిప్ మూవ్మెంట్   ఇస్తూ  ...అనితరసాధ్యంగా   నటించాడు.
2. రాజ సులోచన :   కాశీనాధ శాస్త్రి ని వ్యతిరేకించినా..ఆ సంగీత  లహరిలో   పడి ఆనదించడం   ఆమె ముఖం లో   చూడవచ్చు.
3. అంజలీదేవి కి భర్త  బాగా పాడతాడు అని తెలుసు కానీ  సంగీతం లో ఇంత ప్రావీణ్యం ఉన్నది అని తెలవదు. పాట  సగం వరకూ  బిడియం గా కూర్చున్నదల్లా తరువాత ఠీవిగా  కూర్చుంటుంది. 
4 . నాగయ్య:  ఒక గురువుకు  శిష్యుడు   తనకంటే బాగా పాడితే వచ్చే ఆనందమే  వేరు. నా శిష్యుడు అనే గర్వం వారి మొఖం లో   కదలాడుతుంది. 
5 . SV. రంగారావు ...ఆస్థాన విద్వాంసుడుగా    కాశీనాధ శాస్త్రి ని  ఎంపిక చేసిన తన నిర్ణయం  సబబే అనే  తృప్తి ఆయన కళ్ళల్లో  కనబడుతుంది.
సంగీత పరంగా  ఈ పాటలో   గమనించాల్సింది..స్వరప్రస్తారం   లో అన్నీ  సర్వ లఘువు లే.  ఇంతసేపు సర్వలఘువు పాడడం   చాలా కష్టం...పెండ్యాల గారు ఎంత శ్రమించారో?
ఘంటసాల మాస్టారు  ఎంత సాధన   చేశారో?  విని, కని   ఆనందించడం  మాత్రం   మన వంతు .

1959 లో వచ్చిన   జయభేరి కథాంశం...శాస్త్రీయ సంగీతం  పామరులకు   కూడా అందాలి, సంగీతానికి   కుల, మత  అడ్డంకులు ఉండవద్దు   అనేది.
198లో వచ్చిన   రుద్రవీణ లో కూడా   ఇదే కథాంశము.  ఇళయరాజా  సంగీతం, బాలచందర్ దర్శకత్వం .....
అయినా    జయభేరి   విజయం సాధించింది, రుద్రవీణ  ఒక మోస్తరుగా   ఆడింది....కారణాలు    సినీ విశ్లేషకులకే   వదిలేద్దాం.......మనం మాత్రం  పి. పుల్లయ్య గారికి జయహో   అందాం.

పల్లవి :
రసికరాజ తగువారము కామా...రసికరాజ తగువారము కామా..
రసిక రాజ తగువారము కామా...అగడు సేయ తగవా... ఆ... ఆ.. ఆ... ఆ
ఏలు దొరవు అరమరికలు ఏలా...ఏల వేల సరసాల సురసాల...
ఏలు దొరవు.. అరమరికలు ఏలా...ఏల వేల సరసాల సురసాల... ఏలు దొరా...  ||రసికరాజ||

చరణం 1 :
నిన్ను తలచి.. గుణగానము జేసి...నిన్ను తలచి... గుణగానము జేసి..
నిన్ను తలచి... గుణగానము జేసి..దివ్యనామ మధుపానము జేసి...
నిన్ను తలచి...పా దపమ గరిసా... నిన్ను తలచి...
దనిప నిదసనిప మగరిస నిసరిస నిససని
సమగమపమ గమగనిసనిప మగమగ సనిస
నిసరిమగ మరినిసనిస దనిస నిపమప మగరిస... నిన్ను తలచి...
దనిస దనిస దనిసని దసనిపమగామాప.. దనిసనిపగామాద
నిరిస దని గమప గనిస గమరిసరిస సరిసనిసని నిసనిద
నిస నిసని సనిప మగమదినిస
సరిస నిసని పనిప మపమ నిసని పనిప మపమ గమగ
నిగనిసరిస నిసని సని సరి సరి సనినిసనిపమగరినిస..
ససససస సనిదని సనిసస సనిదని సనిసస సనిగమగదరి నిసమప సనిదపమమగిరి
నినినినినిని నినినినినిని దదదదదద దదదదదద
దదని దదని దదని దన్ని దన్ని దదని దదని దదని దన్ని దన్ని
దనిసపమపగమ మగినిప గగగమమమ గగగనిరి రిరిరి
గగగమమ రిరిరినిస రిస గగరి నిసరిస గనిస నిసనిస నిసనిసరి
నిసని సనిదనిసని గమగమదని దనిసరి గగని నిగరిస
పమగమరిసమప గమనిసనిస పమగమని దనిసనిస
పమగమదనిస నిసరిస నిపసనిపమగమ సనిపమగప సనిపమగప పమగరిస...  ||రసికరాజ||

చరణం 2 :
నిన్ను తలచి గుణగానము జేసి ..దివ్యనామ మధుపానము జేసి...
సారసాక్ష మనసా వచసా...
ఆ... ఆ... ఆ... ఆ....
ఆ... ఆ... ఆ... ఆ... అ....
సారసాక్ష మనసా వచసా... నీ సరస చేరగనే...
సదా.. వేడనా...ఏలు దొరవు అరమరికలు ఏలా

ఏల వేల సరసాల సురసాల... ఏలు దొరా...                    ||రసికరాజ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి