4, ఏప్రిల్ 2020, శనివారం

శ్రీమాత్రేనమః 
 శ్రీలలితా సహస్రనామ తత్త్వ వివరణ- 

496వనామమంత్రము=ఓంవదనత్రయసంయుతాయై నమః.
మూడు ముఖములతో తేజరిల్లు తల్లికి నమస్కారము.

మణిపూరక  చక్రాధిష్ఠాన దేవతయైన లాకినీ యోగినికి మూడు శిరస్సులు కలవు🌻🌻🌻శ్రీలలితా త్రిపురసుందరి సహస్ర నామావళి యందలి వదనత్రయసంయుతా అను నామమంత్రము ఎనిమిదక్షరములు గలది (అష్టాక్షరి)🌺🌺🌺అత్యంత భక్తిప్రపత్తులతో ఈ నామ మంత్రమును పరమేశ్వరి పాదాలపై ధ్యానముంచి ఓం వదనత్రయసంయుతాయై నమః అని ఉచ్చరిస్తూ ఆ తల్లిని పూజించు  భక్తులు ఆ జగజ్జనని కరుణతో ఐశ్వర్యాది సర్వ విభూతియుతులై, దేవీ ధ్యాననిమగ్నులై, బ్రహ్మజ్ఞాన సంపన్నులై కీర్తిప్రతిష్టలను పొంది శాశ్వతానంద పదమును పొంది తరించుదురు🌸🌸🌸గర్భస్థ పిండానికి మూడవ నెలలో నోరు, ముక్కుతో సహా కన్నులు ఏర్పడును, గాన నోరు, ముక్కు, కన్నులు మూడువదనములుగా సమన్వయమైనవి, అలాగే త్రిగుణాన్వితముగా మూడు ముఖములు సూచింపబడుచున్నవి🌹🌹🌹అందుచేతనే ఆ పరాశక్తి వదనత్రయసంయుతా అని నామ ప్రసిద్ధమై ఓం వదనత్రయ సంయుతాయై నమః అనే నామ మంత్ర ఉచ్చారతో  పూజింప బడుచున్నది 🙏🙏🙏🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🙏🙏🕉🕉🕉🕉ఈ రోజు మంగళవారము🌻🌻🌻మంగళవారమునకు అధిపతి  అంగారకుడు అనగా భౌముడు గాన నేడు భౌమవారము అని కూడా అంటాము🌹🌹🌹పవనసుతుని ఆరాధించు శుభదినము🚩🚩🚩గులాబీ  నేటి పుష్పము🌸🌸🌸సిందూర వర్ణము శుభప్రదం🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐


497వ నామమంత్రము=ఓం వజ్రాది కాయుధోపేతాయై నమః

వజ్రము మొదలగు ఆయుధములను ధరించియుండు తల్లికి నమస్కారము. 

మణి పూరచక్రాధష్ఠాన దేవతయైన లాకినీ నాలుగు చేతులు కలిగి, వజ్రాయుధం మొదలుగా నాలుగు ఆయధుములను ధరించి ఊంటుంది.  వజ్రాదికాయుధోపేతా అను శ్రీలలితాత్రిపురసుందరి సహస్ర నామావళిలోని ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) నామ మంత్రమును అత్యంత భక్తిప్రపత్తులతో ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః అని ఉచ్చరిస్తూ  మణిపూర చక్రాధిష్ఠాన దేవతయనై లాకినీ స్వరూపంలో ఉన్న జగజ్జననిని ఉపాసించు సాధకులను ఆ తల్లి అన్ని ఆపదల నుండి రక్షిస్తుంది, సర్వ శుభాలను అనుగ్రహించి తరింప జేస్తుంది. 

శ్రీచక్రాధిష్ఠాన దేషతకు నాలుగు చేతులు ఉండి, నాలుగు చేతులలోనూ వజ్రాయుధము, శక్తి, దండము, అభయ ముద్రలను ధరించియున్నది, వైరుధ్యాలు, వైషమ్యాలు వంటివి ఇచ్చొట బాగుగా పనిచేయును.  ఆజ్రాచక్రం వద్ద అన్నియు సమన్వయపడగలవు. అమ్మవారికి నమస్కరించునపుడు ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః అని అనవలెను

498వ నామమంత్రము= ఓం డామర్యాదిభి రావతాయై నమః

డామరి మొదలైన పదిశక్తి దేవతలతో ఆవరింపబడియున్న లాకినీ రూప తల్లికి నమస్కారము. 
శ్రీలలితా త్రిపురసుందరీ సహస్రనామావళిలోని డామర్యాదిభిరావృతా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) నామ మంత్రమును ఓం డామర్యాదిభిరావృతాయై నమః అని ఉచ్చరిస్తూ భక్తిప్రపత్తులతో ఆ జగజ్జననిని ఉపాసించు సాధకులకు  ఆ తల్లి కరుణచే భౌతిక సుఖశాంతులతో విరాజిల్లుతారు, అంత్యమందు పరమపదప్రాప్తిని పొందుదురు. ఢమరుకము, అధిబి మొదలైన శక్తి దేవతలచే పరివేష్టింపబడినది ఆతల్లి. మణిపూరక చక్రము నందలి డ కారము  మొదలుకొని ఫ కారము వరకు వరుస క్రమమున 1) డామరి, 2) ఢంకారి, 3) ణామనీ, 4) తామసి, 5) స్థాన్వి, 6) దాక్షాయణి, 7) ధాత్రి, 8) నంధా, 9) పార్వతి, 10) ఫట్కారి అను పది ఆవరణ దేవతలచే చుట్టబడియున్నది.

ఈ పద్మంయొక్క కర్ణిక వద్ద  మణిపూర చక్రాధిష్ఠాన దేవత లాకిని శక్తి ఉండునని భావించవలయును. 

499వ నామమంత్రము: ఓం రక్తవర్ణాయై నమః 

=రక్తం వలె ఎర్రని రంగుతో ప్రకాశించు తల్లికి నమస్కారము, 

రక్తవర్ణా యను నాలుగక్షరముల (చతురక్షరి) లలితా సహస్రనామావళి యందలి నామ మంత్రమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం రక్తవర్ణాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగజ్జననిని ఉపాసనచేయు ఉపాసకులు ఆ తల్లి కరుణతో ఆత్మానుభూతియు, విశ్వానుభూతియు సంప్రాప్తించి తరించుదురు, ఇంత వరకూ విశుద్ధి చక్రాధిష్ఠాన దేవత రంగు ఆరక్తవర్ణా అను నామములో చెప్పబడినది; కాని ఆ దేవత ఎప్పటికీ ఎఱుపు రంగుగా ఉండదు;  ఆ దేవత వర్ణం పాటల వర్ణము అనగా తెలుపు ఎఱుపు కలిసిన సిందూర వర్ణము; మణిపూరక చక్రాధిష్ఠాన దేవత ఎర్రని రక్తం రంగులో ఉంటుంది అందుచే పరాశక్తి రక్తవర్ణా యని నామ ప్రసిద్ధమైనది.


 500వ నామమంత్రము = ఓం మాంస నిష్ఠాయై నమః

మాంస ధాతువులలో అధివసించు తల్లికి నమస్కారము. శ్రీలలితా త్రిపురసుందరీ సహస్ర నామావళిలోని మాంసనిష్ఠా యను నాలుగక్షరముల (చతురక్షరి) నామ మంత్రమును ఓం మాంసనిష్థాయై నమః అని అత్యంత భక్తిప్రపత్తులతో ఉచ్చరించుచూ ఆ తల్లిని ఉపాసించు సాధకులకు ధాతుపుష్టిని కలుగజేయును, ఆ తల్లి ధ్యానమునంధు నిమగ్నతను కలుగజేసి తరింపజేయును. శ్రీ చక్రాధిష్ఠానదేవత సప్తధాతువులలో మాంసధాతువును ఆశ్రయించి మాంసధాతవునకు అధిష్ఠానదేవతయైనది; శరీరమునకు పుష్టి కలిగించునది మాంసధాతువు అని గమనించవలయును; ప్రాణి శరీరానికి ఎముకలు ఆకారాన్ని మాత్రమే ఇస్తాయి; కాని ఆకారము యొక్క పూర్తి రూపం కనపడాలంటే ఎముకలు, కండరములు, మాంసము కలసి యుండ వలయును; ఇల్లు నిర్మాణమునకు ఇనుము, సిమెంటు, సున్నము, ఇటుకలు ఎలాంటివో ఈ దేహమునకు మాంసం, కండరములు అలాంటివి; శరీరము పుష్టిగా ఉండాలంటే మాంసధాతువు పరిపూర్ణమైన స్థితిలో ఉండవలెను; చిక్కిపోయిన శరీరముగలవారికి రక్తధాతువు పుష్టిగా ఉండవలెను; గాన అట్టివారు ఈ నామమును  ఓం మాంసనిష్ఠాయై నమః అని నలువదిరోజులు సంపుటి చేసి జపించి, ఆఖరి రోజు అమ్మవారికి యజ్ఞం, పూజ, గుడాన్నము నివేదన చేసినచో శరీర పుష్టి కలిగి ఆరోగ్యవంతులగుదురు; శుష్కించిన దేహము గలవారు చెట్లు చిగుర్చునట్లుగా పుష్టివంతులగుదురు; గావున ఆ పరాశక్తి మాంసనిష్ఠా యని నామ ప్రసిద్ధమైనది


 501వ నామమంత్రము = ఓం గుడాన్న ప్రీత మానసాయై నమః

గుడాన్న (బెల్లంతో కూడిన అన్న) మనిన ఇష్టము గలిగిన తల్లికి నమస్కారము. 

 గుడాన్న ప్రీత మానసా అను శ్రీలలితా త్రిపురసుందరీ నామావళిలోని ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) నామ మంత్రమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం గుడాన్న ప్రీత మానసాయై నమః ఉచ్చరిస్తూ ఆ జగదీశ్వరిని ఉపాసించు భక్తులను అన్నవస్త్రములకు, విద్యాబుద్ధులకు, సుఖసంతోషాలకు, ధనధాన్యములకు లోటు లేక ఎనలేని కీర్తిప్రతిష్టలతో విరాజిల్లుతో ఆ తల్లియందు విశేష భక్తిప్రపత్తులు కలిగిన వారిగా జేసి తరింపజేయును. 


గుడాన్నమనగా చక్కెరపొంగలి వంటి ఆహారమనిన ఆ పరాశక్తి ఎంతో ఇష్టము; మనసా అనగా చెఱకు రసమునందు ఇష్టము గలిగినది, మణిపూరమునందు ఉండు రాకినీ దేవతకు గుడాన్నమును నైవేద్యము చేయవలయును.శరీరపుష్టిని కోరేవారు దేవిని పూజించి గుడాన్నమును సమర్పించి తానూ ఆ ప్రసాదమును స్వీకరించవలయును మరియు అన్నదానము చేయవలెను; అట్టి వారికి శరీరపుష్టి కలుగును, ఆరోగ్యము చేకూరును🙏🙏🙏చెఱకు రసము అమ్మవారికి సమర్పిస్తే, సమర్పించిన వారికి ఆవేశము తగ్గును, మరియు వారికి కాలేయము బాగుపడును🌹🌹🌹గర్భంలోని పిండ రూపములో ఉన్న జీవుడు మధురాన్నమునే అభిలషించును🌺🌺🌺సామాన్యముగా గర్భిణీ స్త్రీలు మూడవ మాసమూన గుఢమును స్వీకరిస్తారు🌻🌻🌻శిశువు జన్మించిన తర్వాత అన్నప్రాశనమప్పుడు, పాలు, పాయసాన్నమును తినిపిస్తారు🌹🌹🌹గుడాన్నమనిన ప్రీతిగల తల్లి గనుక జగజ్జననని గుడాన్నప్రీతమానసా యను నామ ప్రసిద్ధమైనది🌺🌺🌺అమ్మవారికి నమస్కరించునపుడు ఓం గుడాన్న ప్రీత మానసాయై నమః అని అనవలెను



502వ నామమంత్రము=ఓం సమస్తభక్త సుఖదాయై నమః

భక్తులందరికినీ శాంతి,సుఖ,సంతోషములను ప్రసాదించు తల్లికి నమస్కారము. 

 సమస్తభక్తసుఖదా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) శ్రీలలితా త్రిపురసుందరీ సహస్రనామావళి యందలి నామ మంత్రమును ఓం సమస్తభక్త సుఖదాయై నమః అని ఉచ్చరించుతూ ఆ జగన్మాతను సేవించు భక్తజనులకు సమస్త శాంతిసౌఖ్యములను ప్రసాదించి, బ్రహ్మజ్ఞాన సంపదనొసంగి తరింప జేయును🌻🌻🌻భక్తులు నాలుగు రకములు 1) ఆర్తులు (ఆపదలయందుండు వారు), 2) అర్థార్థులు (పురుషార్థములను కోరువారు), 3) జిజ్ఞాసువులు (అమ్మతత్త్వమును - బ్రహ్మజ్ఞానాభిలాషులు), 4) జ్ఞానులు  (బ్రహ్మతత్త్వమును తెలిసి - ఆ మార్గంలో బ్రహ్మపదమును అభిలషించువారు). ఆ పరమేశ్వరి తనను ఆరాధించు వారందరికి (అన్ని విధముల భక్తులందరికి) నీ సుఖములు  ప్రసాదించి కాపాడును. సుఖసంతోషాలను సమకూర్చును కావున శ్రీపరమేశ్వరి సమస్తభక్తసుఖదా అను నామమును కలిగినది. అమ్మ వారికి నమస్కరించునపుడు ఓం సమస్త భక్త సుఖదాయై నమః అని అనవలెను



503వ నామమంత్రము=  ఓం లాకిన్యంబా స్వరూపిణ్యై నమః

మణిపూర చక్రాధిష్ఠాన దేవత అయిన లాకినీ యోగిని రూపంలో తేజరిల్లు తల్లికి నమస్కారము

ఎనిమిది అక్షరముల (అష్టాక్షరి), శ్రీలలితా సహస్రనామావళి యందలి లాకిన్యంబాస్వరూపిణీ యను నామ మంత్రమును ఓం లాకిన్యంబా స్వరూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరాశక్తిని ఉపాసించు భక్తులకు సర్వాభీష్టములు నెరవేరి, బ్రహ్మజ్ఞాన ప్రాప్తికలిగి తరించుదురు. 

మణిపూరక చక్రాధిష్డాన దేవత అయిన లాకిన్యంబా స్వరూపిణియై దేవి విరాజిల్లుతున్నది. 

బీజ, శక్తి, కీలక, న్యాస మంత్రములు ల కార సంబంధంగా ఉంటాయి.
మణిపూరాబ్జనిలయా అను నామము నుండి ఈ నామము వరకు లాకినీ దేవతయే వర్ణింపబడినది. లాకినీ దేవత ధ్యాన శ్లోకము ఇచ్చట కనబరచడమైనది:

దిక్పత్రే నాభిపద్మే త్రివదన విలసద్దం ష్త్రిణీం రక్తవర్ణాం
శక్తిం దంభోళిదండా వభయమఫి భుజై ర్దారయంతీం మహోగ్రాం
డామర్యాద్యైః పరీతాం పశుజనభయదాం మాంస ధాత్వేకనిష్టాం
గౌడాన్నసక్తచిత్తాం సకల సుఖకరీం లాకినీం భావయామః


అమ్మవారికి నమస్కరించునపుడు ఓం లాకిన్యంబా స్వరూపిణ్యై నమః అని అనవలెను

🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 504వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః🙏🙏🙏స్వాధిష్ఠానచక్రంలో ( కాకిని అనే దేవత రూపంలో) ఉండు తల్లికి నమస్కారము🌹🌹🌹  స్వాధిష్థానాంబుజగతా యను  శ్రీలలితాసహస్రనామావళి యందలి  ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) నామ మంత్రమును ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః అనుచు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉచ్చరించుచు ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకులను ఆ తల్లి కరుణచే తాపస నియమము, సంపదను పొందగలరు; గురుసన్నిధిని తివ్ర సాధన చేసి కుండలినీ జాగృతిని పొందియు ఆత్మానుభూతిని పొందియు తరింపగలరు🌻🌻🌻లింగస్థానమునందుగల స్వాధిష్ఠాన చక్రము ఆరు దళములు గల పద్మమునందు కాకినీ యోగినీ దేవతా రూపంలో విరాజిల్లుచున్నది; ఈ ఆరు దళములలో బ, భ, మ, య, ర, ల అను వర్ణములు వరుసక్రమమున ఉండును🌺🌺🌺ఈ కాకినీ దేవతను సిద్ధేశ్వరి అనిగూడ అందురు; మరియు ఈ దేవత వేదవక్రయ, మూడు కన్నులు గలిగి, చేతులయందు త్రిశూలము, పాశము, కపాలమును, అభయములను ఆయుధములను ధరించి, గర్వము గలిగి యుండును; మేధస్సు అను ధాతువు నందు ఉండునది; మధురరసముచే సంతసించునది; బందిన్యాదులతో ఉండునది; పసుపు, ఎఱుపు రంగులు కలిసిన దధ్యోజనము ఇష్టము కలిగినది; భక్తుల కోరికలను సమకూర్చునదగు కాకిని దేవతను ఈ విధముగా ధ్యానించవలయును; గర్భస్థ పిండమునకు నాల్గవ మాసమున ఉదరం, నడుము భాగములేర్పడుతాయి; ప్లీహము ఈ  చక్ర నియంత్రణములో ఉంటుంది🌸🌸🌸అమ్మవారికి నమస్కరించునపుడు ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః అని అనవలెను


శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 505వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం చతుర్వక్త్ర మనోహరాయై నమః🙏🙏🙏నాలుగు ముఖములతో మనోజ్ఞంగా ఉండే తల్లికి నమస్కారము🌹🌹🌹చతుర్వక్త్ర మనోహరా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) అయిన శ్రీలలితా సహస్రనామావళిలోని నామ మంత్రమును ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించు ఉపాసకులకు భౌతిక బాధలు తొలగిపోయి, క్రమంగా శ్రీదేవి కరుణచే శాశ్వతానందమును పొంది తరించుదురు🌻🌻🌻నాలుగు ముఖములు కలిగి, మనోహరముగా నుండు నది జగదీశ్వరి🌺🌺🌺స్వాధిష్ఠాన చక్రాధిష్టాన దేవతకు నాలుగు ముఖములు కలిగినదై యుండును అనగా నాలుగు తలలుండి నాలుగు ముఖములు గలిగినది🌸🌸🌸 మనోహరా అనగా ఈ దేవత చాలా అందముగా ఉంటుందని, ఈ దేవతను ధ్యానిస్తే కనిపించిన వన్నియు సాధ్యమవును, కాని మనస్సు ఉండదని తెలుసుకొనవలెను🙏🙏🙏గర్భంలోని పిండము నాలుగవ మాసములలో ఇదివరకు ఏర్పడిన నోరు, ముక్కు, కళ్ళు గాక చెవులు కలిగి ఉండును🌹🌹🌹ఈ నాల్గింటినీ మణిపూర పద్మముల నుండి త్రిగుణములకు సంబంధించిన ఆవేశాలు, వాంఛలు ఇక్కడి నుండియే అంకురించును🌻🌻🌻దీనినే కులకుండము అధో త్రిభుజాకారము అని అందురు🌹🌹🌹నాలుగు ముఖములతో, మనోహరముగా,స్వాధిష్ఠాన చక్రాధిష్టాన దేవతా రూపిణియైన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః అని భక్తిప్రపత్తులతో స్మరించవలెను


🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 506వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం శూలాద్యాయుధ సంపన్నాయ నమః🙏🙏🙏శూలము మొదలైన ఆయుధములను నాలుగు చేతులలో ధరించియున్న తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితా త్రిపురసుందరీ నామావళియందలి శూలాద్యాయుధ సంపన్నా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) నామ మంత్రమును ఓం శూలాద్యాయుధసంపన్నాయై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తితత్పరతతో ఆ పరాశక్తిని ఉపాసించు సాధకులకు ఆ జగజ్జనని కరుణ వలన దుష్టగ్రహ పీడలు, అనారోగ్య సమస్యలు, అష్టకష్టముల దురదృష్టములు నశించి జీవించినంత కాలము సిరిసంపదలకు, పాడిపంటలకు, భోగభాగ్యములకు లోటులేక, ఆ జనని పాదారవింద సేవనమందు మరింత నిమగ్నమై, బ్రహ్మజ్ఞానసంపదనంది తరించుదురు🌻🌻🌻స్వాధిష్ఠాన చక్రాధిదేవత నాలుగుచేతులయందు త్రిశూలము, పాశము, కపాలము, అభయముద్రలతో అలరారుతో భక్తజనుల పాలిట కల్పతరువై విరాజిల్లుతుంది🌺🌺🌺నాల్గవనెలలో పిండరూపంలో నున్న జీవునికి పదునైన మరియు కోణములు మొడలగు వాటి  గురుంచి స్ఫురణ కలుగుతుంది🌸🌸🌸 ఆ తల్లికి నమస్కరించునపుడు ఓం శూలాద్యాయుధ సంపన్నాయై నమః అని ఉచ్చరించుచూ స్మరించవలెను


🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 507వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం పీతవర్ణాయై నమః🙏🙏🙏పసుపుపచ్చగా (బంగారు) రంగులో ప్రకాశించు తల్లికి నమస్కారము🌹🌹🌹 శ్రీలలితా త్రిపురసుందరీ సహస్ర నామావళిలోని నాలుగక్షరముల (చతురక్షరి) నామ మంత్రమును ఓం పీతవర్ణాయై నమః అని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఉపాసించు సాధకులకు తాపత్రయ బాధలు నశిస్తాయి, అనుష్ఠానాదులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి🌻🌻🌻తల్లి కరుణచే ఐహిక, ఆముష్మిక శుభములు పొందుతారు🌺🌺🌺స్వాధిష్ఠాన చక్రాధిదేవత పచ్చని శరీర ఛాయతో శోభించుచుండును🌸🌸🌸శ్రీచక్రాధిష్ఠాన దేవత అయిన పరమేశ్వరిని శ్రీమన్నగర నాయికాయై నమః  (56వ నామ మంత్రము)  శ్రీఅనగా లక్ష్మి, ఆమెతో కూడిన నగరము శ్రీచక్రము అగును; శ్రీగౌడపాద సూత్రములందు ఈ వ్యాఖ్యగలదు; అందుచే శ్రచక్ర నాయిక (లక్ష్మీ, సరస్వతి, పార్వతుల కలయిక)  ఆదిపరాశక్తి అనియు, అమ్మ శ్రీచక్ర వాసిని అగుటచే శ్రీమన్నగరనాయిక అనియు, శ్రీచక్రమే శ్రీనగరమనియు అంధు బిందురూపంలో విరాజిల్లుతున్న దేవి శ్రీమన్నగరనాయిక, సుమేరు ఉత్తరకొన యందు ఉండు సుధాసాగరమందలి మణిద్వీపమునందు ( ఓం సుధాసాగర మధ్యస్థాయై నమః ఉండునదియే శ్రీమన్నగరము🌻🌻🌻ఇది మయబ్రహ్మచే నిర్మింపబడినది🌹🌹🌹 ఈ శ్రీమన్నగరమునే విద్యా నగరమనికూడ చెప్పుదురు🌺🌺🌺ఇక్కడినుంచే అమ్మవారు ఆదేశాలు, ఆజ్ఞలు ఇస్తూ పరిపాలన నిర్వహిస్తుంది🌺🌺🌺వ్యక్తియొక్క సహస్రార స్థానము నుండి ఆ వ్యక్తికి కావలసిన పనులన్నియు ఆజ్ఞలు, సంకల్పాలు, సందేశాలు ఇవ్వబడుతాయి🌹🌹🌹 మేరు పర్వతము నందలి త్రికూట మధ్య శిఖరవాసిని ( ఓం సుమేరు మధ్య శృంగస్థాయై నమః) 🌻🌻🌻త్రికూట మధ్య శిఖరము - శ్రీమన్నగరము🌹🌹🌹ఆ నగరమునకు అధ్యక్షురాలు శ్రీదేవి అగును (55వ నామ మంత్ర వివరణము)🌺🌺🌺సుధా సాగర మధ్యమున పంచవింశతి (25) ప్రాకారములు గల్గిన శ్రీనగరము గలదు🌻🌻🌻శ్రీనగరమునకు అధిదేవత శ్రీలలితా పరాశక్తియే అగును🙏🙏🙏ఇక్కడ చెప్పిన ఇరువది ఐదు (పంచవింశతి) ప్రాకారములు పంచవింశతి తత్త్వములు అగును

 
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 508వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం అతిగర్వితాయై నమః🙏🙏🙏గర్వాతిశయంగల తల్లికి నమస్కారము🌹🌹🌹స్వాధిష్ఠానమునందు ఉన్న కాకినీ యోగిని మిక్కిలి సౌందర్యంతోనూ, సకల ఐశ్వర్యములతోను విరాజిల్లుచున్నందున, ఆ తల్లి అతిశయించిన గర్వంగలదై ఉంటుంది🌻🌻🌻శ్రీలలితా త్రిపురసుందరీ సహస్రనామావళిలోని అతిగర్వితా యను అయిదక్షరముల (పంచాక్షరి) నామ మంత్రమును ఓం అతిగర్వితాయై నమః అని ఉచ్చరిస్తూ భక్తిశ్రద్ధలతో ఆ జగజ్జననిని ఉపాసించు ఉపాసకులు సర్వాభీష్ట సిద్ధులై, బ్రహ్మజ్ఞాన సంపన్నులై, ఆ తల్లి పాదసేవయందే జన్మ ధన్యతనందెదరు🌺🌺🌺స్వాధిష్ఠాన చక్రాధిదేవత సౌందర్యాతిశయముతో, సకలైశ్వర్యములతో, నాలుగు చేతులతో అతి మనోహరముగా తన తనూవిలాసంతో అతిశయించిన గర్వము కలిగి ఉండుటచే అతిగర్వితా  అనే నామ మంత్రముతో కీర్తింపబడుతున్నది🌸🌸🌸స్వాధిష్ఠాన చక్రంలో ఏదైనా మార్పుగలగితే మనిషికి గర్వం, దర్పం, దంభం మొదలైనవి కలుగుతాయని భావము🙏🙏🙏అమ్మవారికి నమస్కరించునపుడు ఓం అతిగర్వితాయై నమః అని అనవలెను

🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 509వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం మేదో నిష్ఠాయై నమః🙏🙏🙏మేదస్సు (క్రొవ్వు) ధాతువునకు అధిష్ఠానదేవత అయిన తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితా త్రిపురసుందరీ సహస్రనామావళి యందలి  మేదోనిష్డా అను నాలుగక్షరముల  (చతురక్షరి) నామ మంత్రమును ఓం మేదోనిష్ఠాయై నమః అని మిగుల భక్తి శ్రద్ధలతో ఆ పరాశక్తిని ఉపాసన చేయు భక్తులకు ఆ తల్లి అపారమైన తెలివితేటల నొసంగి , దివ్యజ్ఞాన సంపదయు, బ్రహ్మానందభరితమైన తత్త్వజ్ఞాన సమృద్ధియు సంప్రాప్తింపజేసి వారిని తరింపజేయును🌻🌻🌻మేదోనిష్టా అనగా ధారణ శక్తి, ఇది శిరస్సునందు ద్రవించు చున్న తెల్లని ధాతువు; బుద్ధికిసంబంధించినది కాదు; మెదడుకు సంబంధించినది🌺🌺🌺 ఈ ధాతువు అధిష్ఠానముగా కలిగియున్నందున మేదోనిష్ఠా అనబడును🌸🌸🌸అమ్మవారికి నమస్కరించు నపుడు  ఓం మేదోనిష్ఠాయై నమః అని అనవలెను

సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 510వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం మధుప్రీతాయైనమః🙏🙏🙏మధువు (తేనె) అనిన ప్రీతిగల తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్రనామావళిలోని నాలుగక్షరముల (చతురక్షరి) మధుప్రీతా యను నామ మంత్రమును ఓం మధుప్రీతాయై నమః అని ఉచ్చరించుతూ భక్తిశ్రద్ధలతో ఆ పరాశక్తిని ఆరాధించు భక్తులకు జీవితమంతయు శుభప్రదమై, ఆ తల్లి పాదార్చనమునందు నిమగ్నులై అత్యంత ఆధ్యాత్మిక శుభప్రదమైన బ్రహ్మజ్ఞాన సంపన్నులై  జీవితమంతయు మంగళప్రదముగా  కొనసాగించి తరించుదురు🌻🌻🌻మధువు అనగా తేనె అనగా తీపిదనము, అటువంటి తీపిదనము శుభములకు సంకేతము, మధురాతి మధురమైన  శుభప్రదమైన అనగా ఆధ్యాత్మిక శుభప్రదమైన జీవనము అమ్మ కరుణతో తన భక్తులకు చేకూరుతుంది🌺🌺🌺ఆ తల్లికి తేనె అనే మధువునందు ప్రీతిగలదు; తేనె మాత్రమే కాక ఇతర మధుర (తీపి) పదార్థములు అనగా చక్కెరపొంగలి, పాయసము, కజ్జికాయలు, బూరెలు (పూర్ణములు), అరిశెలు, లడ్డూలు, కొబ్బరి ఉండలు మొదలైనవి అమ్మవారికి, అంతెందుకు గుడాన్నము (బెల్లము కలిపిన అన్నము)...ఇవి అన్నియు అమ్మకు ప్రీతి పాత్రములే, ఇవి నివేదిస్తే, వీటియందు ప్రీతిగల తల్లి తనబిడ్డలైన మనను అత్యంత ప్రీతితో కరుణిస్తుందికదా! మరి మధువు అంటే మద్యము కదా!అందుకని వామాచారులు, సమయాచారులు ఆ తల్లికి మద్యమునే నివేదించి తిరిగి వారు స్వీకరిస్తారు; తేనె, నెయ్యి, చక్కెర..ఈ మూడింటిని త్రి మధురములని అంటారు..ఇలాగ కూడా అమ్మవారికి నివేదిస్తారు🌸🌸🌸 సూర్యకిరణాల ద్వారా ప్రసరించే సూర్యరశ్మియందు అన్ని రకములైన ద్రవ్యములు సూక్ష్మరూపమున గలవు; భూమి ఈ సూర్యరశ్మిని గ్రహించి వాటికి సంబంధించిన విత్తనములో మార్పు చేస్తుంది (చెఱకు తీపి, మిరప కారము, వేప చేదు, మామిడి, చింత పులుపు, మల్లె ఘుమఘుమలు) ఇదంతా ఆ జగజ్జనని లీలయే కదా!🌻🌻🌻చాంద్యోగ్యోపనిషత్తు నందు మధు విద్యా విశకరణమున సూర్యరశ్మి దేవమధువని చెప్పబడినది🌺🌺🌺 అసౌవా ఆదిత్యో చేవమద్వితి అన్నది శృతివాక్యం🌹🌹🌹సూర్యకిరణముల ద్వారా బ్రహ్మాండమంతయు మధుర రసము నింపుచున్నది🌺🌺🌺దేవి ధరా స్వరూపురాలు🙏🙏🙏తృణ, లత, గుల్మ, వృక్షాదుల యందు స్రవించుచూ సస్యశ్యామలము చేయునది శ్రీదేవి గాన మధుప్రీతా అనబడుచున్నది🌸🌸🌸శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం మధుప్రీతాయై నమః అని అనవలెను


శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 511వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం బందిన్యాది సమన్వితాయై నమః🙏🙏🙏బందిని మొదలగు ఆరుగురు దేవతలచే పరివేష్టితయైన తల్లికి నమస్కారము🌹🌹🌹స్వాధిష్ఠాన పద్మమునకు  ఆరుదళములుకలవు; కనుక ఆచక్రాధిష్ఠాన దేవతయైన కాకినీ యోగిని ఆరుగురు దేవతలచే పరివేష్టితయై ఉండును🌻🌻🌻ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) శ్రీలలితా త్రిపురసుందరి నామావళిలోని బందిన్యాది సమన్వితా  అను నామ మంత్రమును ఓం బందిన్యాది సమన్వితాయై నమః ఉచ్చరించుచు ఆ జగదీశ్వరిని భక్తిప్రపత్తులతో ఉపాసించు భక్తులకు అష్టైశ్యర్య ఐహిక  సౌకర్యములతోబాటు, బ్రహ్మజ్ఞాన సంపదలు కూడ ఆ పరాశక్థి కరుణవలన కలిగి అంత్యమున ముక్తి లభించును🌺🌺🌺బందిన్యాది సేవిత అనగా బందినీ మొదలైన పరివార దేవతలచే ఆ పరాశక్తి పరివేష్టింప బడియున్నది🌸🌸🌸 ఆరు దళములు కల్గిన స్వాధిష్ఠాన కమలకర్ణికలో అధిష్టాన దేవత తన చుట్టునూ వరుస క్రమమున ( ట, భ, హ, య, ర, ల ) అక్షరములు బందిని, భద్ర, మహామాయ, యశస్వినీ, రమా, లంబోష్ఠి అను పరివార దేవతలచే ఆరుదళముల యందు వశించుచుండును గాన జగజ్జనని బందిన్యాది సమన్వితా అని నామ ప్రసిద్ధమైనది🌹🌹🌹గర్భస్థపిండము నాల్గవ మాసమున జీవికి కల్గే పోటీ తత్త్వ లక్షణం తాను, తనను పరిమితంలో బంధించు కొనడము మొదలగు వాటికి తగు బీజము లేర్పడ గలవు, అందుచే బందియని భావము🌻🌻🌻అమ్మవారికి నమస్కరించునపుడు ఓం బందిన్యాది సమన్వితాయై నమః అని అనవలెసు

🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 512వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం దధ్యన్నాసక్త హృదయాయై నమః🙏🙏🙏దధ్యోదనము (పెరుగుతో కూడిన అన్నము) అనిన ప్రీతి కలిగియుండు తల్లికి నమస్కారము🌹🌹🌹దధి   అనగా పెరుగు, దధ్యన్నము అనగా పెరుగుకలిపిన అన్నము, దధ్యన్నమునందు ఆసక్త అనగా ఇష్టము గలిగినది ఆ జగదీశ్వరి🙏🙏🙏 ఓం గుడాన్నప్రీతమానసాయై నమః (502వ నామ మంత్రము), ఓం దధ్యన్నాసక్త హృదయాయై నమః (512వ నామ మంత్రము), ఓం హరిద్రాన్నైకరసికాయై నమః (526వ నామ మంత్రము)🌻🌻🌻 అమ్మకు ఇష్టమనవి:- 1) బెల్లము కలిపిన అన్నము (బెల్లము కలిపిన అన్నము, చక్కెరపొంగలి, బెల్లము వేసిన పాయసము) , 2) పెరుగు కలిపిన అన్నము (దధ్యోదనము - కమ్మనిపెరుగు, అల్లమ్ముక్కలు, కరివేపాకు, కొత్తిమిరి, మిరియాలు, వాము, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, రెండు మెంతిగింజలు, జిడిపప్పు, బాదంపప్పు కలిపి ఆవు నేతిపోపు పెట్టిన పెరుగు అన్నము), 3) పసుపుకలిపిన అన్నము (మామిడి పులిహోర, నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, పెసరపప్పు-బియ్యం పులగంతో పచ్చిపులుసు, కొబ్దరి అన్నము) ఇవి అన్నీ ఆ పరాత్పరికి ఇష్టమే అంటే ఏదైనా ఇష్టమే భక్తితో నివేదించితే అనగా మనంకూడా ఏదైనా ఇష్టపడాలి (కలగినకాడికి గంజైనా, పరమాన్నమైనా) అనే పరమార్థమిమిడి ఉన్న నామమంత్రములు ఇవి🌺🌺🌺 శ్రీలలితా త్రిపురసుందరి సహస్రనామావళిలోని ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) దధ్యన్నాసక్తహృదయా అను నామ మంత్రమును ఓం దధ్యన్నాసక్తహృదయాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరాశక్తిని ఉపాసించి, దధ్యోదనము నివేదించి నమస్కరించు భక్తులను ఆ తల్లి కరుణతో చల్లగా చూచి అన్నవస్త్రములకు లోటు లేక, సకల ఐశ్వర్యవంతులుగా విలసిల్లునటులును, బ్రహ్మజ్ఞానసంపన్నులుగాను, కీర్తిప్రతిష్టలనార్జించిన వారిగను, అంత్యమున మోక్షప్రాప్తిని పొందునటుల జేయును🌸🌸🌸 దధ్నా చాన్విత శుద్దాన్నం ఆవణేన సమన్వితం| ఆర్ధ్రమరీచి సంయుక్తం  ధానకః పత్ర సంయుతం తథానాగరఖండాధ్యం దధ్యన్నం చేత్ప్రకీర్తితమ్🌹🌹🌹పెరుగన్నము నందు ఇష్టము గలది కావున  దధ్యన్నాసక్తహృదయా అని నామ ప్రసిద్ధమైనది ఆ తల్లి🌻🌻🌻అన్నప్రాసన చేసిన తర్వాత శిశువునకు పాయసాన్నం, నెయ్యిఅన్నం, చక్కెరతో గూడిన అన్నం, తర్వాత పెరుగన్నము పెట్టవలయునని సూచింపడమైనది🌺🌺🌺 అమ్మ వారికి నమస్కరించునపుడు ఓం దధ్యన్నాసక్త హృదయాయై నమః అని అనవలెను🌹🌹🌹🌹🌹

 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 513వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం కాకినీ రూప ధారిణ్యై నమః🙏🙏🙏కాకినీ దేవతా రూపధారిణియై యుండు తల్లికి నమస్కారము🌹🌹🌹కాకినీ రూపధారణ చేసియున్నది పరాశక్తి🌻🌻🌻స్వాధిష్ఠాన చక్రాధిదేవత కాకినీ దేవత🌺🌺🌺ఈ దేవతకు సంబంధించిన బీజ, కీలక, న్యాస మంత్రములన్నీ క కారముతోనే ఉండగలవు, అందుచేతనే కాకినీ అను దేవత మొదటి అక్షరం కా అని తెలియుచున్నది🌸🌸🌸 స్వాధిష్ఠానాంబుజగతా యను నామ మంత్రము నుండి యింతవరకు ఈ దేవతనే వర్ణింబడినది🌹🌹🌹 ఈ దేవత ధ్యానము ఈ విధముగా చేయవలయునని గుర్తించవలయును:-

స్వాధిష్టానాఖ్య పద్మే రసదళలసితే వేదవక్త్రాం త్రినేత్రాం హస్తాభ్యాం ధారయంతీం త్రిశిఖ గుణ కపాలాభయానాత్తగర్వామ్| మేదో ధాతుప్రవిష్ఠాం అళిమద ముదితాం బంధినీ ముఖ్య యుక్తాం పీతాం దధ్యోదనేష్ఠాం అభిమత ఫలదాం కాకినీం భావయామః॥

🙏🙏🙏ఆ జగజ్జననికి నమస్కరించునపుడు ఓం కాకినీ రూప ధారిణ్యై నమః అని అనవలెను


🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 514వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం మూలాధారాంబుజారూఢాయై నమః🙏🙏🙏మూలాధారమనే చతుర్దళ పద్మంలో (సాకినీ దేవత రూపంలో) ఉండు తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితా త్రిపురసుందరీ సహస్రనామావళిలోని మూలాధారాంబుజారూఢా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) నామ మంత్రమును అత్యంత భక్తిశ్రద్ధలతోనూ, ఏకాగ్రచిత్తముతోనూ ఓం మూలాధారాంబుజారూఢాయై నమః అని ఉచ్చరిస్తూ ఆ జగజ్జననిని ఉపాసించు భక్తులకు భౌతిక బాధలు తొలగి, సర్వ శత్రు విజేతలై ప్రశాంత జీవనమును గడుపుదురు🌻🌻🌻మూలాధార పద్మమునంధు అధివసించు సాకినీ దేవతా స్వరూపిణి ఆ పరాత్పరి🌺🌺🌺మనలోని ముఖ్యమైన విద్యుద్భాండారములో నింపబడిన దివ్యశక్తి; నాలుగు దళములు గల్గిన మూలాధార పద్మ కర్ణికా మధ్యమున అధివసించి ఉండు దేవత🌸🌸🌸  పిరుదుల స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే కుండలినీ శక్తి యుండును. మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆలింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.

మూలాధారచక్ర అధిష్టాన దేవత “సిద్ధవిద్యాదేవి” సాకిణీ రూపములో ఉంటుంది. ఈ దేవతకు సంబధించిన బీజ, కీలక, న్యాస మంత్రాలన్నీ “స” కార సంబంధముగా ఉంటాయి. 514 నుండి 519 వరకూ గల నామములు “సాకిన్యంబ”ను వర్ణిస్తాయి. నామములు - మూలాధారామ్బుజారూఢా, పంచవక్త్రా, అస్థిసంస్థితా, అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా, ముద్గౌదనాసక్తచిత్తా.

మూలాధారస్థపద్మే, శృతి దళలసితే, పంచవక్త్రాం త్రినేత్రాం,
ధూమ్రాభా, మస్థిసంస్థాం సృణి మపి కమలం పుస్తకం జ్ఞానముద్రాం
బిభ్రాణం బాహుదండైస్సులలిత వరదా పూర్వ శక్త్యన్వితాంతం
ముద్గాన్నాసక్త చిత్తాం మధుమదముదితాం సాకినీ భావయామి:

మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము. ఇది షట్చక్రాలలో మొదటిది. ఇది నాలుగు దళాల పద్మము. ఈ మూలాధార చక్రములో ‘సాకిన్యాంబ’ నివసిస్తుంది. ఈమెకు ఐదు ముఖములు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి. గర్బస్ధ శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము కలుగుతుంది. ఈమె ఆస్ధి సంస్దిత అనగా ఎముకలను అంటిపెట్టుకుని ఉంటుంది. వజ్రేస్వరి. ఈ దేవతకి నాలుగు చేతులు. అంకుశము, కమలం, పుస్తకము, జ్ఞానముద్ర కలిగి ఉంటుంది.

సాకిన్యాంబ వరదాది దేవతలు : 1. వరద 2. శ్రియ 3. షండా 4. సరస్వతి ( వ, శ, ష, స అను మూలాక్షరాల) దేవతలచే కొలువబడుతూ ఉంటుంది. ఈమెకు పెసరపప్పుతో చేసిన పులగం అంటే ఇష్టము.🌻🌻🌻గర్భస్థ శిశువు విషయమున పంచమే మాసే పృష్ఠవంశో భవతి అనగా పంచమ మాసమున వెన్నెముక ఏర్పడును🌺🌺🌺 అమ్మవారికి నమస్కరించు నపుడు ఓం మూలాధారాంబుజారూఢాయై నమః అని అనవలెను🌻🌻🌻🌹🌹

 
 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 515వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం పంచవక్త్రాయై నమః🙏🙏🙏అయిదు ముఖములతో తేజరిల్లు తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితా త్రిపురసుందరీ సహస్రనామావళిలోని పంచవక్త్రా యను నాలుగక్షరముల (చతురక్షరి) నామ మంత్రమును ఓం పంచవక్త్రాయై నమః అని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఆరాధించు భక్తులకు ఆ తల్లి కరుణచే జ్ఞానసిద్ధి లభిస్తుంది, పవిత్రమైన కోరికలు నెరవేరి ఆ తల్లి పాదములను సేవిస్తూ తరించుదురు🌻🌻🌻మూలాధార అధిష్ఠాన దేవతయగు సిద్ధవిద్యకు అయిదు ముఖములు కలిగియున్నది, అనగా అయిదు శిరస్సులు సద్యోజాత, వామదేవము, అఘోర, తత్పురుష, ఈశానము పంచవక్త్రములు అనగా పంచభూతములు, పంచేంద్రియములు, పంచతన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు) ఈ మూలాధారచక్రము నందు పనిచేయును అని భావించవలయును🌺🌺🌺అమ్మ వారికి నమస్కరించునపుడు ఓం పంచవక్త్రాయై నమః అని అనవలెను🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి