8, ఏప్రిల్ 2020, బుధవారం

శ్లోకాలు




'అష్టావక్రగీత' 19వ ప్రకరణ (629)_
🕉🌞🌎🌙🌟🚩

వికారం లేని మనసే మౌనం..! అహంకారమే దానికి విఘాతం !!

పంచభూతాలకు కారణం ఏమిటో తెలియడం  పరమశాంతికి కారణమైన ఉనికి తెలియడం ఒక్కటే. అదే జ్ఞాని వైభవం. మూలం తెలిసిన జ్ఞాని మౌనంగా ఉంటాడు. ఎందుకంటే మౌనమే మూలం కాబట్టి. మౌనం అంటే వికారంలేని మనసు. అహంకారమే దానికి విఘాతం. ఈ సృష్టిలో జరిగేదంతా ఈశ్వర కార్యమే అయినా... అహంకారం వల్ల అది మన కార్యం అన్న భావనను కల్పిస్తుంది. ఇదే సృష్టికార్యంతో  సామరస్యతను  దూరంచేసి మనలో వైరుధ్యం తీసుకొస్తుంది. అనుక్షణం ఆత్మ చైతన్యవంతమై అనుభవాన్ని పొందుతూ ఒక అనుభూతిని మిగుల్చుతుంది. అనుభూతి అహంకారంగా మారి సృష్టికార్యాన్ని గమనించకుండా తనకొక ప్రత్యేక జీవితం ఉన్నట్లుగా భ్రమింప చేస్తుంది. పరిశీలించి చూడగలిగితే తన జీవితం అలా విడిగా లేదని, అంతటా ఈశ్వరకార్యం మాత్రమే ఉందని తెలుస్తుంది !

🕉🌞🌎🌙🌟🚩
🕉🌞🌎🌙🌟🚩

దేవుడు లేడు  (నామ రూపాలతో)

దేవుడు ఉన్నాడు (సకల నామ రూపాలతో)

⚡️✨⚡️✨⚡️✨

 శూన్యమే ప్రపంచం గా ఉంది.

  మౌనమే ప్రవచనం గా ఉంది.

⚡️✨⚡️✨⚡️✨

మూడు స్థితులు:-

1. పరమాత్మ వేరు - జీవుడు వేరు.(సముద్రం వేరు - కెరటం వేరు)

2. జీవుడు - పరమాత్మ లోని అంశ మాత్రమే.(కెరటం - సముద్రం లోని భాగం మాత్రమే)

3. అసలు జీవునికీ, పరమాత్మకీ బేధం లేదు.(కెరటం, సముద్రం ఒకటే)

🕉🌞🌎🌙🌟🚩
శ్రీరమణీయం -(492)
🕉🌞🌎🌙🌟🚩

"ప్రకృతిలో నేను అంతర్భాగమేనన్న సత్యాన్ని ఎందుకు తెలుసుకోలేక పోతున్నాను ?"

మన అహంభావనే (నేను అనే భావన) మనం ప్రకృతిలో అంతర్భాగమేనన్న సత్యాన్ని గుర్తించనివ్వదు ! మనకు సంబంధంలేని విషయాల్లో ఎంతటి మార్పునైనా మనం సునాయాసంగా అంగీకరించేస్తాం. కానీ మనకు సంబంధించిన విషయాల్లో అనుకూలం కాని చిన్న మార్పును కూడా ఏమాత్రం సహించలేక పోతున్నాం. నదిలో స్
నానంచేసి వచ్చిన పరమానందయ్య శిష్యులు తమను తాము మినహాయించుకుని వారి సంఖ్యను లెక్కించుకున్నారు. ఒకరు తగ్గారంటూ దుఃఖించటం మొదలుపెట్టారు. మార్పును అంగీకరించడంలో మన పరిస్థితి కూడా అంతే తయారైంది. ప్రకృతిలో జరిగే సహజమైన మార్పు నుండి మనలను మనం మినహాయించుకోవటం అలవాటైంది !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_'మార్పును స్వీకరించేదే ధ్యాన జీవితం.!'-

🕉🌞🌎🌙🌟🚩

'అష్టావక్రగీత' 19వ ప్రకరణ (622)_
🕉🌞🌎🌙🌟🚩

ఉత్కృష్టమైనది, అనితర సాధ్యమైనదే  గురువు గారి నుండి ఆశించాలి !

తత్త్వజ్ఞాని యొక్క శాంతి లక్షణాలే మనకు మార్గదర్శకం. అలాంటి ఉత్తమోత్తమమైన శాంతికోసమే గురువు గారిని ఆశ్రయించాలి. లౌకిక ఫలాలకోసం, జ్యోతిష్యం కోసం, భవిష్యత్ ఫలాల కోసం ఆశ్రయిస్తే సముద్రం దగ్గరకు వెళ్లి ఉద్దరిణతో నీళ్ళు తెచ్చుకున్నట్లే అవుతుంది. గురువు గారికి ఇహము, పరము రెండూ తెలుసు కనుక ఈ జీవనగమనంలో మనకు కొంత అండనిస్తారు. కానీ కేవలం అందుకే వినియోగించుకోవాలని అనుకుంటే అందుకు గురువే అవసరం లేదు. ఈ సృష్టిలో చెట్టూ, పుట్టా దేన్ని నమ్ముకున్నా ఆ ఫలాలు వస్తాయి. ఉత్కృష్టమైనదీ, అనితర సాధ్యమైనదే గురువు గారిని అడగాలి. వారినుండి ఆశించాలి. గురువు గారి ద్వారా లభించే జ్ఞానం చేతనే సంకల్పాలు, వికల్పాలు, సందేహాలు నివృత్తి అయి చిత్తం నిర్మలమై శాంతిగా ఉంటుంది !

🕉🌞🌎🌙🌟🚩



 

శ్రీశివానంద గురుభ్యోన్నమః 'అష్టావక్రగీత' 18వ ప్రకరణ (617)
🕉🌞🌎🌙🌟🚩

అసలు తెలివిని గుర్తించే వివేకం రావడమే నిజమైన తెలివి !!

దైవాన్ని ఎక్కడో వెతికితే దొరకదు. మనలోని ప్రేమను తట్టిలేపి వ్యక్తీకరిస్తే మనలోనే ఉన్న దైవం తెలుస్తుంది. స్వార్థం మనలోని బేధభావాన్నీ, ద్వేషాన్నీ, బంధాన్నీ పెంచి పోషిస్తే, ప్రేమభావం వీటన్నింటినీ పోగొడ్తుంది. వేదాంతం బోధించే వైరాగ్యమంతా మనలోని స్వార్థాన్ని వీడి ప్రేమను పరిమళింప చేసేందుకే. మన సహజ సంస్కారాన్ని దూరంచేసే అసురీగుణాలను వదలుకోవడమే వైరాగ్యం. కళ్యాణగుణాలు మనసు యొక్క సహజసంపద. అహంకారం చేత సంస్కారం దూరమై కళ్యాణగుణాలు మరుగున పడతాయి. అహంకారమే నేనుగా వ్యక్తమై మనలోని అసలు ప్రజ్ఞను తెలుసుకోనివ్వడం లేదు. మనం ఇప్పుడు అనుకునే తెలివితేటలకు మూలమైన అసలు తెలివిని గుర్తించే వివేకం రావడమే నిజమైన తెలివి !

🕉🌞🌎🌙🌟🚩

అష్టావక్రగీత' 19వ ప్రకరణ (631)
🕉🌞🌎🌙🌟🚩

ప్రమేయాన్ని అపాదించుకోవడం అజ్ఞానం... మన ప్రమేయం ఏమీ లేదని తెలియడం జ్ఞానం !!

శబ్దరూపంలో వ్యక్తమైన ఆత్మ చైతన్యమే గురువుగా అవతరిస్తుంది. అది అవ్యక్తమైతే దైవంగా భాసిస్తుంది. అవ్యక్తంగా ఉన్న ఆ దైవమే సర్వత్రా ఉన్న పరమగురువు. మనపై అనుగ్రహంతో వ్యక్తమైన దైవమే మనకు కనిపించే సశరీర గురువు. జీవుడు అనే మాటను ప్రత్యేకమైన ఉనికిగా మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాము. జీవుడంటే జీవిస్తున్నాడన్నమాట. జీవించేవాడే జీవుడు. ఆ జీవిలో ఉన్నది జీవన క్రియే. ఆ జీవనక్రియ అంతా పరమాత్మ క్రియే. పరమాత్మ క్రియగా ఉన్న జీవనక్రియ పవిత్రం, పరమ ఉత్కృష్టం. అప్రమేయం. అమేయం. అలాంటి అప్రమేయమైన జీవనక్రియలో మన ప్రమేయం ఆపాదించుకోవడం అజ్ఞానం. మన ప్రమేయం ఏమీ లేదని తెలియడమే జ్ఞానం !

🕉🌞🌎🌙🌟🚩
139.ఉపనిషద్విచారణ
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
139. ఉపనిషత్తులు – చాందోగ్యోపనిషత్తు
ॐॐॐॐॐॐॐॐॐॐ
షోడశ ఖండం నుంచి త్రయోవింశ ఖండం (23వ ఖండం) వరకూ:

నెమ్మది నెమ్మదిగా సనత్కుమారుడు మనలను ప్రాణం నుంచి భూమా తత్వానికి, గొప్పదైన ఆత్మ తత్వానికి తీసుకొనిపోతున్నాడు.


ఏషతువా అతివదతి యస్సత్యేనాతివదతి సోహం భగవ స్యత్యేయనాతివదానీతి సత్యం త్వేవ విజిజ్ఞాసితవ్య మితి సత్యం భగవో విజిజ్ఞాస ఇతి।।

నారదా! సత్యజ్ఞానాల గురించి బాగా తెలిసినవాడే అధికంగా ప్రసంగించ గలడు. అలా యదార్ధాన్ని చెప్పేవాడినే అతివాది అంటారు. అన్నాడు సనత్కుమారుడు.
దానికి నారదుడు “భగవన్, నేను కూడా సత్యజ్ఞానాల గురించి తెలిసిన వాడిని కనుక అధిక ప్రసంగం చేస్తూ ఉంటాను”. అంటూ తన మనసులోని మాటను చెప్పేడు.


నారదా! నీవు ఎప్పుడూ సత్యాన్ని తెలియ జేయడానికే అభిలాష చూపించు. అంటే నారదుడు, భగవన్! నేను సత్యాన్ని అన్వేషించ డానికి సత్యాన్ని చెప్పడానికి మాత్రమే ఇష్ట పడతాను అన్నాడు. ఎందువలనంటే సత్యాన్వేషణ చాలా విలువైనది.


యదావై విజానా త్యథ సత్యం వదతి నా విజానన్ సత్యం వదతి విజానన్నేవ సత్యం వదతి విజ్ఞాన న్త్యేవ విజిజ్ఞాసితవ్య మితి విజ్ఞానం భగవో విజిజ్ఞాస ఇతి ।।

నారదా! మానవుడు సంపూర్ణంగా సత్యాన్ని గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే సత్యాన్ని వచించగలడు. సత్యం తెలియని వాడు, తెలుసుకోనివాడు సత్యాన్ని పలకలేడు. సత్యాన్ని దర్శించినవాడే (సత్యదర్శనుడు) సత్యం పలుకుతాడు. అందుకే విజ్ఞానాన్ని తెలుసుకోవాలని అభిలషించాలి. అంటే నారదుడు సనత్కుమారునితో “భగవన్ అందుకే విజ్ఞానాన్ని విశేషముగా తెలుసుకోవాలని అనుకొంటున్నాను”.అన్నాడు.


నారదా! మానవుడు మననం చేసి దేన్నయినా తెలుసుకుంటాడు. మననం చేయకపోతే దేన్నీ తెలుసుకోలేడు. మనన శక్తి యే మనం అసలు తెలుసుకోవలసిన శక్తి. శ్రద్ధ కలిగిన వాడే మననం చేయగలుగుతాడు. శ్రద్ధ లేకపోతే మననం చేయలేడు.


ఎవరు శ్రద్ధ కలవాడౌతాడు అంటే గురు శుశ్రూష చేయాలనే నిష్ఠ కలవాడే శ్రద్ధా వంతుడౌతాడు. నిష్ఠ లేకపోతే శ్రద్ధ కలగదు. మానవుడు కర్మనుష్ఠానంలో ములిగి ఉన్నప్పుడు నిష్ఠతో ఉంటాడు. సత్కర్మలను చేయలేనప్పుడు నిష్ఠలేని వాడవుతాడు. ఇంద్రియాలను మనస్సును వశపరచుకొని ఏకాగ్రత సాధించాలి.


ఈ ఏకాగ్రతను సాధించాలంటే నిరతిశయ సుఖం అంటే ఏమిటో తెలియాలి.
సత్కర్మలద్వారా తనకు సుఖం లభించి తన కోరికలు తీరుతున్నప్పుడే మానవుడు కర్మలను ఆచరిస్తున్నాడు. సుఖం లభించక కోరికలు తీరకపోతే మానవుడు కర్మలను ఆచరించడం లేదు.


యోవై భూమా తత్సుఖం నాల్పే సుఖ మస్తి భూమైవ సుఖం. భూమాత్యేవ విజిజ్ఞాసితవ్య ఇతి భూమానం భగవో విజిజ్ఞాస ఇతి।।

ఏది స్వయం భూశక్తియో, విశాల వ్యాప్తమైనదో అందులో ప్రతిష్ఠితమయ్యేదే సుఖం. అద్వితీయం అపరిచ్ఛిన్నం అఖండ స్వరూపమైనదే నిరతిశయ సుఖం. అదే ప్రాణం లో మనస్సు లీనం కావడం. దానినే అంతర్ముఖ ఆనందం అంటారు.


నారదా! ఈ లోకంలో భూమం అంటే గొప్పదైన బ్రహ్మం, ఆత్మ అనేవే సుఖమైనవి. సా
టిలేని ఈ సుఖాన్నే “భూమం” అంటారు. అల్పమైన వాటియందు సుఖం ఉండదు.


 ఈ భూమం మరే ఇతరమైనదానిమీదా ఆధారపడి లేదు. సర్వ వ్యాప్తి గల ఈ భూమమే పరబ్రహ్మ. ఆనంద స్వరూపమైన భూతాన్ని తెలుసుకునినవాడికే ఆత్మానందం కలుగుతుంది. ఆ గొప్పదైన ఆత్మనే తెలుసుకోవాలి. అంటే ఆ భూమా తత్వాన్ని గురించి తెలుసుకోవాలి.
వచ్చే భాగంలో భూమా విద్య గురించి మరింత విపులంగా తెలుసుకుందాం.

🕉🌞🌎🌙🌟🚩


'అష్టావక్రగీత' 18వ ప్రకరణ (616)_
🕉🌞🌎🌙🌟🚩

దైవం ప్రేమతత్వంగా సకల జీవరాశిలో.. అందరి హృదయాల్లో... విశ్వవ్యాప్తమై ఉంది !!

నేను నుండి మనసు, మనసునుండి భావాలు, భావాల నుండి ఆలోచనలు, ఆలోచనల నుండి కార్యాలు వస్తున్నాయి. నేనును పరిశీలించడం అంటే మనంచేసే కార్యాలను, దానికి కారణమైన ఆలోచనలను పరిశీలించడం. విచారించే కొద్దీ మనసు నేనును తెలుసుకొని, అది చైతన్యం యొక్క వ్యక్తీకరణేనని అవగాహన చేసుకుంటుంది. మనం గ్రహించే విషయాలను తెలుసుకుంటున్నాంగానీ, అన్నిటినీ తెలుసుకుంటున్న గ్రహింపును చూడటంలేదు. ఆ ప్రజ్ఞే అసలు "నేను". ఇప్పుడు మనం అనుకునే నేను అనే భావం రాక ముందున్న అసలు నేను అదే. అదే విశ్వవ్యాప్తంగా ఉన్న దైవం. అదే ప్రేమతత్వంగా సకల జీవరాశిలో.. అందరి హృదయాల్లో... విశ్వవ్యాప్తమై ఉంది !!

🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి