5, నవంబర్ 2018, సోమవారం

ఆరాధ్య భక్తి లీల ^*


*ఆరాధ్య భక్తి  లీల- (5)* 
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ

పాల కడలి యందు ఉద్భవించిన కన్యవు
- పరమ దయాల హృదయ తరుణి మల్లెవు    
వెంకటేశ్వర  పట్టపు మహారాణి వైనావు 
- అలమేలు మంగగా ఆనంద పరిచినావు

ముని జన స్తోత్ర, మహలక్ష్మిదేవి వైనావు
- సమస్త మారాధ్య కల్పవల్లీ దేవి వైనావు
హృదయానంద భరిత అమృతాన్ని పంచావు
- తిరుమల శ్రీనివాసుకే నాయక వైనావు

వరలక్ష్మి, గజ లక్ష్మి, రాజ్యలక్ష్మి వైనావు
- భాగ్య లక్ష్మి, శ్రీ లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి వైనావు   
సంతాన లక్ష్మి,, వెంకటా లక్ష్మి,దేవి వైనావు 
శరణన్న వారికి  కొంగు బంగారం చేసావు

మమ్ము కన్నబిడ్డల్లా కాపాడే తల్లివైనావు
- మాతగా తిరుమలేశ్వరుని దేవి వైనావు     
మగువల కోరికలు తీర్చే గౌరి వైనావు
- అయ్యను క్రిందకు రప్పించి తృపి పరిచావు 

అమ్మా మాకు నీవే దిక్కు
మీకే ఉంది కరుణించే హక్కు
మాకు అందిచవమ్మా అమృత వాక్కు
మా కోరికలు తీర్చి కాపాడే తల్లి వైనావు 


--((**))--


ఆరాధ్య భక్తి లీల (4)*
రచయిత: మాలాప్రగడ రామకృష్ణ  

దోష పూరితమైన, కలియుగము ఉండగా 
నాకు భయమన్నది లేదు, నీవు తోడుండగా 

జన్మజన్మ పాపాలు, నన్ను వెంటాడు చుండగా 
శాపములా కోపం, నన్ను చుట్టు ముట్టు చుండగా   
ధైర్యము అందించే నా మనస్సులో నీ ఉండగా  
నీ నామ జపమే నాకు రక్షణగా ఉన్నాదీ 

దోష పూరితమైన, కలియుగము ఉండగా 
నాకు భయమన్నది లేదు, నీవు తోడుండగా 

ఇంద్రియాలు ఇబ్బందిగా తరుముతూ ఉండగా
కర్మ బంధాలు తాళ్లతో కట్టివేయు చుండగా    
నీ శరణాగతితో మన్నస్సు ప్రశాంతముగా  
బంధాలు విడువక నిన్నే ప్రార్దిస్తు ఉన్నానూ   

దోష పూరితమైన, కలియుగము ఉండగా 
నాకు భయమన్నది లేదు, నీవు తోడుండగా 

శ్రీ శ్రీవేంకటేశ్వరా నిన్నే నమ్ము తున్నానుగా 
గతిగా శ్రీ లక్ష్మీ దేవి నాకు మాతృ మూర్తిగా   
నీ సేవలతో పరవశం చెందు తున్నానుగా
నీ కృపయే నాకు శిరోధార్యం అయి ఉన్నాదీ   

దోష పూరితమైన, కలియుగము ఉండగా 
నాకు భయమన్నది లేదు, నీవు తోడుండగా 

--((**))--




ఆరాధ్య భక్తి లీల (3)
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  

శక్తి భక్తునితో తెలిపే వివేకం 
ఆచరిస్తే నీకు అదే దైవం
నేర్పుతుంది, వినయ విధేయతాభావం

సకలభూతాలలో, ఉండే, జీవశక్తి తెలుసుకో 
సర్వాంతర్యామి ఉండే, దైవం శ్రీ వేంకటేశ్వరుడేననీ  
ఓషధులను వృద్ధిచేసే,  సూర్య శక్తి తెలుసుకో
ప్రత్యక్షదర్శన మిచ్చే, దైవం శ్రీ వేంకటేశ్వరుడేననీ 
   
జఠరాగ్నిని శాంతపరిచే, ఉదరశక్తి తెలుసుకో 
అన్నపు శక్తిని పెంచే,  దైవం శ్రీ వేంకటేశ్వరుడేననీ  
స్మృతి, విస్మృతి కల్పించే, గుండె శక్తి తెలుసుకో
వాయు శక్తిని పంచే,  దైవం శ్రీ వేంకటేశ్వరుడేననీ  

సర్వానికి జ్ఞానం అందించే వేదశక్తి తెలుసుకో
అంతర్గత భావన్ని కల్పించే దైవం నేను 

అంతటా అంతరాత్మలో శ్రీ వేంకటేశ్వరుడేననీ 
కలియుగంలో మోక్ష దాయక దైవం  
లక్ష్మీ పద్మావతి  శ్రీ వేంకటేశ్వరుడేననీ  

శక్తి భక్తునితో తెలిపే వివేకం 
ఆచరిస్తే నీకు అదే దైవం
నేర్పుతుంది వినయ విధేయతాభావం

  --((**))--





ఆరాధ్య భక్తి లీల (2)
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

చిన్న రాయిలో దైవం ఉద్భవిస్తుంది - అదే నాహృదయం 
అన్న మాటలో నైజం ఉద్భవిస్తుంది - అదే నా మార్గం  
కన్న చింతలో తల్లి   ఉద్భవిస్తుంది - అదే ప్రేమతత్వం 
ఉన్న ప్రేమలో జాతి ఉద్బవిస్తుంది - అదే మోహనత్వం 
వేంక టేశ మా కొర్క ఉద్భవించావు  -  అదే మా దైవత్వం 
   
నాకు మాన వత్వమే అడ్డు వస్తుంది  - అదే కాల గమనం 
నీకు ప్రేమ తత్వమే అడ్డు వస్తుంది -  అదే ఆశా వాదం 
నాకు మాట తత్వమే అడ్డు వస్తుంది -  అదే ప్రేమ భావం  
నీకు  మాయ తత్వమే అడ్డు వస్తుంది - అదే సేవ వాదం 
ప్రేమ పంచి  ఐక్యమే కోరు కుంటావు  -  అదే అమృత హస్తం 

ప్రమిద లా మానవ బుద్ది ఉంటుంది  - అదే గుణ తత్త్వం  
తైలము లా శాంతియు కర్గు తుంటుంది - అదే శాంతి తత్త్వం  
వత్తులు లా వెల్గితు నీడ ఉంటుంది  - అదే  అంబర తత్వం  
కాలము లా ప్రేమయు పొంచి ఉంటుంది - అదే బాలాజీ తత్త్వం 
వేదము లా ఆశలు తీర్చు తుంటావు - అదే పద్మావతి తత్త్వం 

ఏది ఏమయినా నా అంతరంగంలో 
నీవే ఉన్నావు, శ్రీ శ్రీ శ్రీ వేంక టేశ నీవె నాకు దిక్కు 
నమో శ్రీ శ్రీ శ్రీ వేంక టేశ నమో నమో శ్రీ శ్రీ శ్రీ వేంక టేశ 

--((**))--

(!)

శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధిస్తున్నాను 
నామనవి ఆలకించమని వేడుకుంటున్నాను 

అణువణువూ ఆవేదనలతో - ఆరాధిస్తున్నాను   
తనుతనువూ ఆమోదములతో - అర్పిస్తున్నాను 
కనుకనువూ కామోదములతో  - కల్పిస్తున్నాను  
భగభగ లూ ఆవేశములతో   - బ్రమిస్తున్నాను (శ్రీ శ్రీ శ్రీ ) 

పుణ్యపాపాలు ఏకమోతంతో - చేస్తూ ఉన్నాను 
మంచిచెడ్డాలు తన్మయత్వంతో - తెల్వకున్నాను 
దానధర్మాలు  ఓర్పుతత్వంతో - సల్పుతున్నాను 
వెల్గునీడలు మార్పుతత్వంతో -  నడుస్తున్నాను (శ్రీ శ్రీ శ్రీ )

కల్మిలేములు తీర్పుతత్వంతో - చిక్కి ఉన్నాను 
ప్రేమదోషాలు  నేర్పుతత్వంతో - పల్కియున్నాను 
 తల్లి తండ్రుల సేవాతత్వంతో - నల్గియున్నాను
గురు దైవాల ప్రేమతత్వంతో - ప్రార్ధిస్తున్నాను (శ్రీ శ్రీ శ్రీ )   

శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర నిన్నే నమ్మి ఉన్నాను  
నామనవి ఆలకించమని వేడుకుంటున్నాను 

--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి