26, నవంబర్ 2018, సోమవారం

ఆరాధ్య భక్తి లీల









*ఆరాధ్య భక్తి లీల*
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

దండము పెట్టుట నావంతు - తప్పుల రక్షణ నీవంతు 
ధర్మము పల్కుట నావంతు - అర్ధము చెప్పుట నీవంతు   

కప్పము కట్టుట నావంతు - శక్తిని ఇచ్చుట నీవంతు 
దైవము కొల్చుట నావంతు - అల్పుని దీవెన నీవంతు   

అండగ ఉండుట నావంతు  - బంధన ముక్తియు నీవంతు  
దాసుగ పండుట నావంతు - కర్తను గాచుట నీవంతు 

స్మరణ జొచ్చుట నావంతు - కర్మను తీర్చుట నీవంతు 
పూలతొ పూజించు నావంతు - సంపద పంచుట నీవంతు      

మోక్కులు తీర్చుట నావంతు - శాంతిని ఇచ్చుట నీవంతు  
కోరిక చెప్పుట  నావంతు - మాటను నిల్పుట నీవంతు 


పరమపురుష శ్రీపతివి  
పరిపూర్ణ లక్ష్మీ పతివి 
భక్తులకు పరమాత్మవి  
ఈర్ష్యలేని శ్రీ వెంకటేశ్వరుడివి
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--



ఆరాధ్య భక్తి లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తిరుమల తిరుపతి వేంకటేశ నీవే నాకు ప్రాణం
దాసుడుగా, సేవా భక్తుడుగా, ఉండాలనున్నది ప్రాణం   

నిన్ను గూర్చి నిత్యం పాడు కోకండా ఉండలేదు ఈ ప్రాణం  
నీవు తోడు లేకపోతే క్షణం కూడా నిలవదు  ప్రాణం 

మనసును తృప్తి పరచినా నిన్ను విడువదు ప్రాణం 
నీ శ్వాసల వెన్నెలనే వీడలేదు నిను గాంచు ప్రాణం    

విసుకనేది ఉండదు నిత్య ప్రార్ధనలే నాకు ప్రాణం  
నీ చూపుల ఉయ్యాలను నిత్యం వదలలేదు ఈ ప్రాణం 

కలియుగంలో ధర్మ, సత్య,
 న్యాయ, సాక్షి శ్రీ వేంకటేశే 
మానసిక ప్రాణాన్ని రక్షించే    
వేణుగోపాల ప్రేమ సుమా 

--((**))--

కళాపూర్ణ - IUU IUU - IUU IUU // IUU IUU - IUUIU

*ఆరాధ్య భక్తి లీల*
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

నమోవెంకటేశా - నమోశ్రీనివాసా
నమో లక్ష్మిదేవీ - నమోశ్రీదెవీ

సదాసేవ చేస్తా - సదా పూజ చేస్తా
సదా వేడు కుంటా  - సదా ప్రార్దిస్తా

సుఖం కోరు కోనే - దుఃఖం కోరు తానే
మోసం జోలు పోనే - మౌనం పాటిస్తా   

కళా పూర్ణ రూపా - కధా న్యాయ రూపా
మనో సంత రూపా - మనో దర్శకా

ప్రజా మాయ నీదే  - ప్రజా వెల్గు నీదే
ప్రజా శక్తి నీదే - ప్రజా బాధ్యతే     

మనోనేత్ర మాయా - మనో పృథ్వి దేవా 
మనో దివ్య తేజా - మనో అర్పితా      

రమా బంధ రూపా - రమా మోక్ష రూపా 
రమా తేజ రూపా - రమా దైవమే   

అరాళమ్ము లాశా - స్వరూపమ్ము గాదా
మరాళమ్మువోలెన్ - మదిన్ నిల్వ రా

నమోవెంకటేశా - నమోశ్రీనివాసా
నమో లక్ష్మిదేవీ - నమోశ్రీదెవీ

ఆణువణువూ నిండిన దైవం 
నిరంతర స్మరణ దైవం 
మమ్ము రక్షించే మా దైవం 
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా 
--((**))--




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి