21, నవంబర్ 2018, బుధవారం

ఆరాధ్య భక్తి లీల




ఆరాధ్య భక్తి లీల
రచయత:  మల్లాప్రగడ రామకృష్ణ
 భావము :మానవుడు ప్రయత్నిస్తే దేనినైనా సాధించవచ్చు

మానవ జన్మా, పురుషార్ధక సాధన జన్మా 
జరామరణాల నుండీ, మోక్షాన్ని పొందే జన్మా ..... మా  

వెదకి తలచు కుంటే, విష్ణుడు కానవచ్చు
చేతకాదని కూర్చొంటే, లోకం చీకటవ్వచ్చు ...2  
పట్టుదలే నీలో ఉంటే, లోకం చుట్టి రావచ్చు     
నిదురించితే కాలము నిముషమై పోవచ్చు .... మా 

ఇష్టంగా చదివితే, వేద శాస్త్రజ్ఞుడవ్వచ్చు 
చదువు నాకెందు కనుకుంటే, మూర్ఖుడవ్వచ్చు... 2   
నిగ్రహంతో పనిచేస్తే, ఉత్తముడవ్వవచ్చు 
సోమరిగా కూర్చుంటే, గుణ హీనుడవ్వవచ్చు .... మా 

శ్రీ వేంకటేశ్వరుని ప్రార్ధిస్తే మోక్షం రావచ్చు 
బద్దకించితే జీవితమే వ్యర్ధమై పోవచ్చు 
శరణంటే మనిషి జన్మ సార్ధకమవ్వచ్చు 
సందేహిస్తూ ఉంటే మనస్సే నాశన మవ్వచ్చు .... మా  

మానవ జన్మా, పురుషార్ధక సాధన జన్మా 
జరామరణాల నుండీ, మోక్షాన్ని పొందే జన్మా ..... మా  


--((**))--

ఆరాధ్య భక్తి లీల
రచయత:  మల్లాప్రగడ రామకృష్ణ

భగవంతుని నమ్మినవారికి మిగతా వాటితో పని లేదు

వేరు ఆలోచన లెందుకు ....     
మీపై ఉన్న విశ్వాస మే  మాకు చాలు 

రక్షించుతావో,  లేదో అన్న సంశయం 
మనసు నందుంచక ఉంచా, నమ్మకం 
మిమ్ము ప్రార్ధిస్తూ ఉంటే కల్గు,  నిర్భయం  
మాలో కల్గు అసమాన, మనో ధైర్గ్యం ... వే  

నిత్యం మాపై ఉండు, మీ శుభ ప్రభావం 
ఎవ్వరిపై ఎప్పుడు ఉండదూ, గర్వం 
మీ లీలలు చెప్ప లేనీ, ఊహాతీతం 
మీ భక్తిపై ఉంచి చేస్తున్నా,  ప్రయత్నం ... వే 

మాలో ఎప్పుడు రాదూ,  నాస్తిక భావం 
మీపై పరిపూర్ణ విశ్వాసమే,  భావం 
స్వరూపాన్ని తెల్సు కొనే,  ఆస్తికభావం 
మేము అందరిలో చూస్తా సమభావం ... వే 

ఆశయంతో కోరుతా, నిత్య సహాయం 
తప్పు తెలిపితే చేస్తా, ఆత్మార్పణం  
సమర్పిస్తున్నా, సంపాదించిన పుణ్యం 
వేంకటేశ్వరున్నే తల్చు  మా హృదయం .. వే 

వేరు ఆలోచన లెందుకూ  .....     
మీపై ఉన్న విశ్వాసమే  మాకు చాలు 

--((**))--

ఆరాధ్యా భక్తి లీల
మల్లాప్రగడ రామకృష్ణ  

నన్ను నేను నమ్మలేను వేంకటేశా  
- మిమ్ము నేను నమ్ముతాను శ్రీ వేంకటేశా

మనిషిని నమ్మాలో మానుని నమ్మాలో తెల్వదు 
సందిగ్ధంలో ఉన్న నాకు ఎలా తెల్పాలో తెల్వదు 
మనిష్యుల మధ్య హింసాత్మకమో ప్రమో తెల్వదు 
సిగ్గు పడే విషయాల్ని ఎలా తెల్పాలో తెల్వదు..... న   

ఆశతో చేసే పన్లు,  పాపాలో పుణ్యాల్లో తెల్వదు     
ప్రేమంటూ చేసేటి మూర్ఖం, ఎలా తెల్పాలో తెల్వదు  
మేధస్సు యంత్రము లా, మారితే తెల్పాలో తెల్వదు 
భక్తి సర్దుపాట్లు కోసం, ఎలా తెల్పాలో తెల్వదు .... న  

కుత్తుకలు పడ్తు దేవుణ్ణి, కొలుస్తారో తెల్వదు
నిత్య రాగ ద్వేషాలతో, భక్తి ఉంటుందో తెల్వదు  
మనుష్యులు డబ్బుకోసం, హాత్యచేస్తరో  తెల్వదు 
మనస్సు మారకుండా, ఉంచుతావో లేదో తెల్వదు ..... న  

నన్ను నేను నమ్మలేనూ, వేంకటేశా  
- మిమ్ము నేను నమ్ము తాను, శ్రీ వేంకటేశా


--((**))--


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి