3, నవంబర్ 2018, శనివారం

ఆరాధ్య raక్తి లీల




ఆరాధ్య ప్రేమలీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

నింగి నేల కలిపే హరివిల్లు అందాలు అపురూపం  
చిరుగాలి వానలో తడిసిన రూపము ఆపురాపం 

మదినేలే నా బంగారు చెలికత్తె పాదం అపురూపం 
కలనైన చేయి వీడని నా ప్రియా మౌనం అపురూపం  

పూల వనములో పారిమళాల అందాలు అపురూపం
శ్వాసల అల్లికలో మనసు పొందే అందం అపురూపం 

ప్రేమపూల తలపులలో కౌగిలి అందం అపురూపం
కరుణ రసాకృతమై మెలివేసే భంధం అపురూపం   

వెళ్ళు విరిసి పరిమళించు నిజ స్నేహం అపురూపం   
తను పలుకక పలికించే సహజ భావం అపురూపం   

కోమలాంగి నయనాభినయనా నాట్యము అపురూపం 
కోమలి చూపు తంత్రుల్లో మంగళరవంబు అపురూపం 

స్త్రీకి ఆప్యాయత కల్పించిన బ్రహ్మ సృష్టి అపురూరం
అనురాగ సుమఘంధం పేగుబంధం స్త్రీకి అపురూపం  

స్త్రీ జన్మకు ఉదాత్తతతో పరిపూర్ణత అపురూపం
తల్లికి పునర్ జన్మ సంతాన సాఫల్యమే అపురూపం

నొప్పులకు తాళలేక, నొప్పులను చెప్పలేక 
చెప్పకను,  కను గప్పలేక, రెప్పపాటు 
 నీటిచుక్కతో, పంటి బిగువుతో  స్త్రీ    
బిడ్డకు జన్మ ఇచ్చి సంతృప్తిని పంచే అపురూపం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 


--((**))-- 


ఆరాధ్య లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

చలాకీ కిలాడీ - చలాకీ బిజీలో   
 గిరాకీ తలంపే - మదీ దోచనే   

విలాసాలతోనూ - వినోదాలతోనూ 
కలాపాలతోనూ -  ధనం దోచనే 

సరోజాలతోనూ - సరాగాలు తోనూ    
వివాదాలతోనూ - సమీ పించెనే 

నిరాశా సుమమ్ముల్ - నిషీదా పదమ్ముల్  
తపించే మోహమ్ముల్ - కళాపూర్ణమై

నదుల్ వట్టిపోయెన్  
గతుల్ తప్పిపోయెన్
మతిల్ మట్టి ఆయెన్
పతీ పత్ని మాయే 
వేణుగోపాల ప్రేమ సుమా 
--((**))--


ఆరాధ్య నాయక లీల    
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తాను చేసియు, వేరెవ్వరిని చేయనియ్యకయే  
మాసి అంటక, ముప్పెవ్వరికి రాని ఇయ్యకయే   
ప్రజ్ఞ చూపియు, నష్ట పర్చక కాని పొందకయే
“కందకు లేని దురద ఈ కత్తిపీటకేలనో”  

అని అత్త సొమ్మును అల్లుడు దానమందుకో
శునకమ్ చేసేది గాడిద చేయుట ఎందుకో 
కాలంలో కుక్క తోక వంకర తీయుటెందుకో   
“కందకు లేని దురద ఈ కత్తిపీటకేలనో”    

హోదా ఇవ్వనన్నారని పార్టీ వదిలేద్దామా 
హోదా ఇస్తామన్నారని పార్టీ కలిపేద్దామా  
హోదా అడ్డుపెట్టుకొని రాజకీయం చేద్దామా 
“కందకు లేని దురద ఈ కత్తిపీటకేలనో” 
అని ఊరుకుందామా 

మేడిపండు లాంటి మెరుపు గుట్టును విప్పాలి 
స్వాతంత్ర ఫలితమ్ పొంది సుఖంగా జీవించాలి
కష్టం వచ్చినా ఇష్టంగా ఉండి ప్రేమ పొందాలి   
“కందకు లేని దురద ఈ కత్తిపీటకేలనో” 
అనుకుంటే కడుపు నిండదు 
--((**))--




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి