8, నవంబర్ 2018, గురువారం

ఆరాధ్య భక్తి లీల

ఆరాధ్య భక్తి లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఆత్మలోని పరమాత్మను గ్రహించు
వేంకటేశ అని నామము తలంచు  
ఉత్తమోత్త మని నిత్యము పఠించు 
దోష మేది యును లేదని వాదించు

జాతి బేధం శరీర లక్షణనుచు 
లక్షణం అంతిమం వరకు తలచు        
దైవ చిత్తం మదీయ భావమనచు 
కల్లొ లాలే విత్తము ఆశ యనుచు 

విశ్వ జాతి ఒక్కటె భక్తి యనుచు 
సర్వ భక్తి  ఒక్కటె మోక్ష మనుచు     
మాయ చేధ మొక్కటె లక్ష్య మనుచు 
దైవ ప్రార్ధ నొక్కటె ముక్తి యనుచు       

ధర్మ కర్మ సుజాతి శక్తి యనుచు
నిత్య న్యాయ సుజాతి యుక్తి యనుచు
దివ్య తేజ సుజాతి ముక్తి యనుచు 

వెంకటా సతి మమ్ము కాపాడనుచు    

హరేరామ హరేరామ రామ రామ హరే హరే 
హరేకృష్ణ హరేకృష్ణ  కృష్ణ కృష్ణ హరే హరే యనుచు 

--((**))--


ఆరాధ్య భక్తి లీల 
రచయత: అల్లాప్రగడ రామకృష్ణ

కర్తవ్యాన్నిఅర్ధము తెలుసుకో లేని మూర్ఖుడ్ని నైయున్నాను  
కార్యభార సత్యము యేమెమిటో లేని ధూర్తుడ్ని నైయున్నాను 
కర్మభావ న్యాయము మనుగడో లేని కౄరుడ్ని నైయున్నాను 
చేతుల్చాచి నిత్యము అడుగటే లేని పౌరుడ్ని నైయున్నాను 

వేంకటేశ్వరా నా పని నేను చేస్తాను కాపాడే భారం నీదేను 
నేస్తులెవ్వరూ నా కధ మార్చ లేరూ అయినా వేడుకుంటాను  
పెద్దలెవ్వరూ నా నడకాప లేరూను నిన్ను మదిలో ప్రార్ధిస్తాను  
నాతప్పు ఒప్పా కడదాక శక్తి నివ్వమని కోరుతున్నాను    

తరించే వలపు తేనె రాగాల ఊయలలో ఊగుతున్నావు     
వరించే మనసు తేనె నాదాల మాయలలో నానుతున్నావు 
భరించే తలచు తేనె పాదాల సేవలలో మున్గిఉన్నావు 
మధించే మమత ఆశ పాశాల లోమునిగీ చిక్కితున్నాను 

నమో నమో వెంకటేశ నా మనవి ఆలకించవయ్యా 
నా మనసు మార్చి నీలో ఐక్యం చేసుకోవేమయ్యా 

--((**))--


ఆరాధ్య భక్తి లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఏమని వర్ణించను దివ్య ఆభరణ స్వరూపాన్ని
మానస కలానికి అందని రూప లావణ్యాన్ని
ఆనందం వ్యక్తపరిచే ఆకాశం వెల్గు వైభవాన్ని
దివికాంతుల సురచిర అమోఘ సుందరత్వాన్ని  ... ఏ
   
రవికాంతుల రమణీయ నిర్మల రాజసత్వాన్ని
చంద్రని వెన్నెల వెల్లువిరిసిన పూర్ణ బింబాన్ని
శుఘంధ పరిమళాలను పంచె వాయు మృదంగాన్ని
తరంగాల మంజీర నాద గమకాల గమనాన్ని  ....  ఏ

మంచు తెరల తుషార బిందువుల చల్లఁదనాన్ని
చిలుకు తొలకరి పూల జల్లుల శీతలత్వాన్ని     
మధుర కోకిల సంగీత స్వర మాధుర్య గానాన్ని
ఉషోదయ ఆరోగ్య ఔషద ఆకర్ష కిరణ మార్గాన్ని .... ఏ

శ్రీ శ్రీ శ్రీ వెంకటేశా సమస్తము  నీ ఆకర్షణకు లోనై
తమతమ లక్షణాలను వెళ్లబుచ్చాయి.
నేను సామాన్య మానవులమ్  నీ కరుణా కటాక్ష వీక్షణాలు
మాపై చూఫు శ్రీ శ్రీ శ్రీ వెంకటేశా   

--((**))--