28, నవంబర్ 2018, బుధవారం

ఆరాధ్య భక్తి లీల*


*ఆరాధ్య భక్తి లీల *
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

కణకణము వెలుగు నీ చలవే - హృదయం లో దివ్యమైన జ్యోతిగా    
మదితలపు పిలుపు నీ చలవే-  ఉదయం లో  అందమైన జ్యోతిగా     

అడుగడుగు మలుపు నీ చలవే - సమయం లో నిత్యమైన జ్యోతిగా 
లతకులుకు తెలుపు నీ చలవే - తరుణం లో భవ్యమైన జ్యోతి గా 

సరిగమలు పలుకు నీ చలవే - ఫలితం లో రమ్యమైన  జ్యోతిగా  
తడిపొడిల తపన నీ చలవే  - నిలయం లో సాక్ష్యమైన జ్యోతిగా    

కలిసికొన మెరుపు నీ చలవే - నయణం లో నాణ్యమైన జ్యోతిగా   
చిరునగవు కొలువు నీ చలవే - పయనం లో శ్రావ్యమైన జ్యోతిగా  

అఖండ హారతి జ్యోతి గా 
ఆరోగ్య ఉదర జ్యోతిగా  
అనంత పరమాత్మ జ్యోతిగా  
శ్రీవేంకటేశ్వరుని జ్యోతి 
ఇది వేణు గోపాల ప్రేమ సుమ 

--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి