3, అక్టోబర్ 2019, గురువారం

స్మాల్ స్టోరీస్

Image may contain: 2 people, people standing


స్ట్రీట్ లైట్లు
మీరు చూస్తూ వుంటారుగదా, స్ట్రీట్ లైట్లు సూర్యోదయం తరువాత కూడా వెలుగుతుంటాయి . అప్పుడు మీకు తిక్క రేగుతుంది .ఎవరికీ పట్టదు అని ఎగురుతారు . తర్వాత కామ్ అయిపోయి కాఫీ తాగుతారు .

మనదేశంలో " వీధి లైట్ " (షాపుల్లో లైట్ అయినా , ఇంట్లో లైట్ అయినా ) వెలగంగానే ఉస్చాహంతో ప్రేమతో ఆ కాంతిని కళ్ళకు అద్దుకుంటారు - అటువైపు ఒక ముద్దు పారేస్తారు .

కానీ కొన్నిదేశాల వాళ్ళు " తెల్లవారు జామున , సూర్య దర్శనానికి ముందు,వుండే తొలివేలుగులో వీధి లైట్లు "ఆరటం " గొప్ప శుభశకునంగా భావిస్తారు .

లైట్లు ఆర్పాఋ అంటే , సహజవెలుగుకు స్వాగతం చెప్పినట్లే కదా ? ప్రజలు తాము - సూర్యునికి జరిగే ఆ స్వాగత సన్నాహాలను చూసినట్లు, అందులో తాము పాల్గొన్నట్లు , ఫీల్ అవుతూ .. మంచి దృశ్యంతో రోజు ప్రారంభం అయ్యింది కాబట్టి .. ఆ రోజు తమకి మంచి రోజు అవుతుందని .. మురిసి పోతారు .

సూర్యోదయం చూసి రోజు ప్రారంభంచేస్తే , ఆరోజు శుభం అనే భావన  అందరిలోనూ ఉంటుంది . అదంతా ఉప్పు పాతర వేసి " సూర్యిడితో పాటు వీధి లైట్సు చూడగానే - సూర్యిడికి సరైన రీతిలో స్వాగతం జరగలేదని - మనస్సు గ్రహిస్తుంది . మనస్సు రోదిస్తుంది ..

మీరొక పల్లెటూరి లో వున్నారు . డాబా మీద పండినారు . వూరులోని చెట్టుని వదిలి, పొలంలో పనికి వెడుతున్న పిట్టలు మిమ్మల్ని నిద్రలేపాయి . రొండు తాటి చెట్లమధ్యనుంచీ సూర్యుడు నవ్వు ముఖం పెట్టాడు . ఎప్పుడూ లేనిది .. గుళ్లోనుండి సన్నాయి మేళం వినవచ్చింది .. గంట మోగింది .. జేగంట మోగింది .. పూలు కోస్తున్న ప్రియురాలు కనపడింది .
మీరు అప్పుడు " నాది మంచి రోజు అని నువ్వు చెప్పేదేమిటి ? ఇది రెందువిధాలుగా మంచి రోజు  " అని గంతులేస్తూ మీరే నాకు చెపుతారు


*ప్రాంజలి ప్రభ 
ఓం శ్రీ రాం   శ్రీ మాత్రేనమ:

మల్లా ప్రగడ  రామకృష్ణ 
ఉపవాసము!
.
ఉపవాసం అనగా దగ్గరగా నివసించడం. ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం అని అర్ధం. కొన్ని ప్రత్యేక పండుగల సమయాలలో ఈ ఉపవాస దీక్షను చేపడతారు. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవుని యందు మనస్సు లగ్నం చేయడానికి ఆహార, పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకుని పస్తు ఉంటారు. ఈ ఉపవాసం చేసే దీక్షను బట్టి ఒక పూట లేక ఒకరోజు లేక కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది.
.
భక్తితో కావచ్చు.. బరువు తగ్గేందుకు కావచ్చు.. కారణమేదైనా చాలామంది తరచూ ఉపవాసం చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తరచూ ఉపవాసాలు చేస్తుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా అస్సలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతుంటే బలహీనత, అసిడిటీ, డస్సిపోవటం, తలనొప్పుల వంటి బాధలు చాలా వేధిస్తాయి. కాబట్టి ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా లంఖణం చేయటం కాదని, ఈ సమయంలో కూడా శరీరానికి పోషకాలు అవసరమని గుర్తించాలి.

మధుమేహం, అసిడిటీ వంటి సమస్యలున్నవారు, గర్భిణులు, పిల్లలు.. అసలు ఉపవాసం చేయకపోవటం మేలు. మరోవైపు చాలామంది ఉపవాసం ముగిస్తూనే బాగా నూనె, నెయ్యి వేసి వండిన స్వీట్లు, కొవ్వు పదార్ధాల వంటివి దండిగా తింటుంటారు. ఇదీ మంచిది కాదు. దీనివల్ల ఉపవాస ఫలమూ ఉండదు. కాబట్టి ఉపవాస సమయంలో- మన శరీరానికి అవసరమైన పోషకాహారం, మితంగా తీసుకోవటం మంచిది. ఇలా చేస్తే ఉపవాసం తర్వాత శరీరం మరింత ఉత్తేజంగా, తేలికగా, ఉల్లాసంగా అనిపిస్తుంది.

 ఉపవాస సమయంలో- పండ్లు, కూరగాయ ముక్కల వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. పండ్లు దండిగా తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది, శక్తికీ కొదవుండదు. అలాగే పాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, క్యారెట్ల వంటివాటితో చేసిన పదార్ధాలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి, మాంసకృత్తులు, క్యాల్షియం వంటివన్నీ లభిస్తాయి. ఉపవాస సమయంలో- మజ్జిగ, పండ్ల రసం, నిమ్మ నీరు, కూరగాయ సూపుల వంటి ద్రవాహారం తరచుగా తీసుకోవాలి. ఇలా చేస్తే అసిడిటీ బాధ కూడా ఉండదు.

 ఉపవాసం ముగిసిన తర్వాత కూడా కొవ్వు పదార్ధాలు కాకుండా.. మెంతికూర కలిపి చేసిన మేథీ చపాతీ; సగ్గుబియ్యం, కూరముక్కల వంటివి కలిపిన ఖిచిడీ; పాలు, పెసరపప్పు వంటి వాటితో చేసిన పాయసం వంటివి తీసుకోవటం ఉత్తమం.


. హిందూమతంలో ఉపవాసదీక్ష
శివరాత్రి
నాగులచవితి
తొలి ఏకాదశి
కార్తీక సోమవారం
.ఇస్లాంలో ఉపవాసవ్రతం!


సౌమ్

సౌమ్ అనగా ఉపవాసం. ఇస్లాం ఐదు మూలస్థంభాలలో మూడవది. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా అచరించవలసిన నియమం ' ఉపవాసవ్రతం' . ఈ ఉపవాసంను పార్సీ భాషలో రోజా అని అంటారు. అరబ్బీ భాషలో సౌమ్ అని పిలుస్తారు.
రామాయణం లో వాల్మీకి మహాముని వర్ణించారు ఉపవాసం ఆరోగ్యానికి ఒక దివ్వఔషధము. చెట్లకు సమస్త జీవరాశికి పరిణామ దసలున్నాయి అవేవి మనిషిలా పలురకాల ఆలోచనలతో కుంగి పోవు. వాటికి వర్తమానమే ముఖ్యం దాన్ని అవి ఆనందందంగా గుర్తిస్తాయి. పోను పోను చెట్లు మొడు లౌతాయి పచ్చదనం లేని కట్టెలౌతాయి ఆచెట్లపై ఉన్న పక్షులకు అది గడ్డు కాలమే అవుతున్నది. అయినా నాలుగు చినుకులు పడితే తరువు తనువూ సమస్తము పత్ర హరిత మయమవుతున్నది. పువ్వుల కాయలతో నిండుగా ఉంటుంది.

అదే మనుష్యులు ఆశతో ఆకలితో ఎక్కడా దొరకనట్లుగా చూసిన ఆహారాన్ని ఎక్కువగా తింటారు కొందరు, కొందరు ఏది చూసిన అను మానంతో తింటారు, మరికొందరు ఉదరపోషణ ధర్మానికి శక్తిని ఇచ్చే పోషక పదార్ధాల ఆహారాన్ని తింటారు. ఎంత తిన్న వయసు పెరిగిన కొద్ది మన శరీరంలో మార్పులు వస్తాయి. అమర్పులకు తగ్గట్టుగా మనం ఆహారం తీసుకోవాలి, వయసు పెరిగితే చెట్లలాగా వికసించే శక్తి మనకు ఉండదు.

అందుకే శనివారం, మంగళవారం ఉపవాసము ఉండుట మంచిది అని పెద్దలు చెప్పారు ఎందుకనగా మనం తిన్న ఆహారము జీర్ణము కావాలి అది ఒక సంచి అదే పనిగా తిండిని తొక్కుతూ పోతే శరీర భాగాలు పని చేయటం తగ్గు గుతుంది.  బద్దకం పెరుగుతుంది, నిద్రముంచు కొస్తుంది. ఇది ఎవరికీ మంచిది కాదు.               

ఉపవాసం ఆరోగ్యానికి, వీర్యశక్తికి తప్పని అవసరం. ప్రకృతి ని బట్టి మానవులు అసలు విషయము గ్రహించి ప్రస్తుత స్థితిని బట్టి ఆనందము అను భవించుటకు ఉపవాసము అవసరము.  

--((**))--



(8)చిన్న కథ లో పెద్ద అర్థం

అనగనగా ఒక తండ్రి. ఆయనకు ముగ్గురు పిల్లలు. ముగ్గురూ చాలా తెలివైన వాళ్లు.
కొన్నాళ్లకు తండ్రి చనిపోయాడు. బ్రతుకు తెరువు వెతుక్కుంటూ బయలుదేరారు ముగ్గురూ. 
దారిలో వాళ్లకు ఒక పెద్ద మనిషి ఎదురయ్యాడు. 'నా గుర్రం తప్పిపోయింది. మీకేమయినా కనబడిందా?' అని ఆ పెద్ద మనిషి అడిగాడు.
'ఈ దారినే పోయింది' అన్నాడు మొదటి వాడు.
'దాని కుడి కన్ను గుడ్డిదా?!' అన్నాడు రెండోవాడు.
'దాని మీద ఒక పిల్లవాడు ఉన్నాడు కదా?!' అన్నాడు మూడవ వాడు. ఆ పెద్ద మనిషి ఎంతో సంతోషపడ్డాడు.
'అంతా సరిపోయింది- మీరు ఎక్కడ చూసారు దాన్ని?!' అని అడిగాడు.
'మేము దాన్ని చూడలేదు' అన్నారు అన్నదమ్ములు.
'అవునా?! మరి చూడకుండా ఇవన్నీ ఎలా చెప్పారు?!' అన్నాడు పెద్ద మనిషి , కొంచెం అనుమానంగా.
'మా తెలివి తేటలతో చెప్పాం' అన్నారు అన్నదమ్ములు.
'చూడకుండా తెలివితేటలతో ఇదంతా ఎలా చెప్పగలరు, ఎవరైనా? మీరే నా గుర్రాన్ని దొంగలించారు! పదండి, రాజు దగ్గరకు! అన్నాడు పెద్ద మనిషి.
అందరూ రాజు దగ్గరికి పోయారు.
'అసలు గుర్రాన్నే చూడకుండా దాని గురించి అన్ని వివరాలు ఎలా చెప్పారు? అని రాజు కూడా అడిగాడు.
'మా తెలివి తేటలను ఉపయోగించి చెప్పాం' అన్నారు వాళ్ళు.
'అదే అడుగుతున్నది. ఆ తెలివి తేటలకు ఏమిటి ఆధారం?' అడిగాడు రాజు.
'అడుగు జాడలను బట్టి గుర్రం ఆ దారినే పోయిందని చెప్పాను' అన్నాడు మొదటి వాడు.
'బాట వెంబడి పెరుగుతున్న గడ్డిపోచల్ని గమనించాను. బాటకు ఎడమ ప్రక్కన ఉండే గడ్డి పరకలు మేసి ఉన్నాయి, కుడి ప్రక్కవి మేయలేదు. అట్లా తెల్సింది- అది గుడ్డిదని. దాని కుడి కన్ను పనిచేయట్లేదు' అన్నాడు రెండోవాడు.
'మేం వచ్చే దారిలో ఒక మడుగు ఎదురైంది. ఆ మడుగు దగ్గర గుర్రం అడుగులు, పిల్లవాడి అడుగులు కనబడ్డాయి మాకు. వాళ్లు దాంట్లో నీళ్లు తాగినట్లున్నారు. దాన్ని బట్టి గుర్రం మీద పిల్లవాడు ఉన్నాడని తెలుసుకున్నాను' అన్నాడు మూడోవాడు. రాజుగారు వీళ్ల తెలివికి విస్తుపోయాడు. అయినా 'పరీక్షించాలి' అనుకున్నాడు. భటులకు ఏదో చెప్పాడు. వాళ్ళు ఒక పెట్టె మోసుకొని వచ్చారు. 'ఈ పెట్టెలో ఏముందో చెప్పండి. అప్పుడు గానీ మీ మాటలు నమ్మను' అన్నాడు రాజు.
'ఇందులో తేలికైన వస్తువులు ఉన్నాయి!' అన్నాడు మొదటివాడు.
'అవి గుండ్రని వస్తువులు!' అన్నాడు రెండోవాడు.
'అవి మామిడి కాయలు!' అన్నాడు మూడోవాడు.
"నిజమే ప్రభూ!‌ వీళ్ళు సరిగా కనుక్కున్నారు!" అన్నారు భటులు, పెట్టె మూత తెరిచి చూపిస్తూ.
'ఇదెట్లా చెప్పగలిగారు?' అడిగాడు రాజు, ఆసక్తిగా.
'ఇద్దరు భటులు ఆ పెట్టెను అలవోకగా తీసుకొచ్చారు. వాళ్ళు మోసే తీరును బట్టి అందులో తేలికైన వస్తువులు ఉన్నాయని తెలిసింది' అన్నాడు మొదటివాడు.
'పెట్టెలో వస్తువులు దొర్లిన శబ్దం వినబడింది. అవి దొర్లినప్పుడు పెట్టె వంకర తిరగటమూ, భటులు దాన్ని సవరించటమూ చూసాను. అట్లా అవి గుండ్రనివని చెప్పాను' అన్నాడు రెండోవాడు.
'భటులు పెట్టెను తూర్పు వాకిలి నుండి తెచ్చారు. భవంతికి అటువైపున మామిడి తోపు కనిపిస్తూనే ఉంది. అదీగాక ఈకాలంలో కాచేది మామిడి కాయలే కదా; దీన్ని బట్టి చెప్పాను అవి మామిడి కాయలని!' అన్నాడు మూడోవాడు.
'బలే గమనిస్తారు మీరు! లోకాన్ని చూడటం ఎలాగో మీనుండే నేర్చుకోవాలి' అని రాజు వాళ్లను మెచ్చుకున్నాడు. వాళ్ళకు లెక్కలేనన్ని కానుకలిచ్చి, తన కొలువులోనే సలహాదారులుగా ఉంచుకున్నాడు.
--((**))--

7.ప్రాంజలి ప్రభ (ప్రేమ)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

గురువు గారు గుడి దగ్గర దర్శనము చేసుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. 
అప్పుడే ఒక ప్రేమికుడు "తరుణ్"  వచ్చి సుఖానికి, సంతోషానికి, గల భేదం ఏమిటి గురువు గారు అని అడిగాడు. 
అసలు నీకెందుకు ఆ ప్రశ్న   
నేను ప్రేమించిన అమ్మాయి అడిగింది గురువుగారు.
అట్లయితే చెపుతా విను ప్రాణం లేని పరుపు కూడా సుఖాన్ని ఇస్తుంది. 
ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే సంతోషాన్ని పంచుతారు.      
చూడు బాబు వయసును బట్టి ప్రేమ పెరుగు, ప్రేమించి, ప్రేమ పొందుటలో ఉన్నది
సంతోషం అది గమనించు చాలు. 
గురువుగారు నేను ఒక అమ్మాయిని ఆదరించి చేరదీసాను, స్నేహ పూర్వకముగా కాని ఆవచ్చిన అమ్మాయి చూపులను తప్పించుకొని తిరగ లేక పోతున్నాను ఎందుకు.    
నేను ఎదో తప్పు చేస్తానని భయముగా ఉంటున్నది. 
చూడు బాబు పరిస్థితులు అర్ధం చేసుకొని ప్రవర్తించటమే మేలని నేను చెప్పగలను. మీ ఇద్దరి మధ్య ఎటువంటి ఆకర్షణ ఉందో ఆ బ్రహ్మ కూడా చెప్పలేడు, కాలమే నిన్ను నడిపిస్తుంది.
మేఘంలా కరిగే మనసు నీకు దొరుకుతుంది 
మధువులా అందించేటి మనసు దొరుకుతుంది  
దుప్పటిలా వెచ్చగుండే మనసు దొరుకుతుంది 
ఉత్సాహంలా పనిచేసే మనసు దొరుకుతుంది 

నవ్వులా వెలుగునిచ్చే మనసు దొరుకుతుంది 
వెన్నెలా చల్లగ నుంచే మనసు దొరుకుతుంది  
తక్కెడిలా చెలి తూచే మనసు దొరుకుతుంది 
చీకటిలా చలి పంచె మనసు దొరుకుతుంది  

మనసున్న వాడికి దొరకంది లేదు
ఆకలున్న వాడికి దొరకంది లేదు

గురువు గారండి నమస్కారం మండి, మరలా కల్సు కుంటాను వస్తానండి.     
అంటూ వెళ్లి పోయాడు తరుణ్ . 
కొద్ధి సేపువిశ్రాంతి పొంది గురువుగారు ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. 
అప్పుడే ఓక ఆటోవచ్చి ఆగింది. 
ఏమిటి అలాచూస్తారు ముందు ఆటో ఎక్కండి 
నువ్వు ఆటో వేసుకొని నాదగ్గరకు రావటమేమిటి.  
ముందు ఈ ఉత్తరం చదవండి, తర్వాత మాట్లాడవచ్చు 
ఆ గాబరా ఎందుకు ఎం జరిగింది 
ముందు చదవండి నేను తల్లిని కదండీ నా భయం నాది 
నాన్న గారు, అమ్మగారు నన్ను క్షమించండి, నాభర్తను వదిలి ఎన్నో రోజులు అయ్యాయి. నాకు ఒక ఆధారం కావాలని "తరుణ్ " వద్దకు చేరా. తరుణ్ నేను ఒకే కాలేజీలో చదివాము ప్రేమించుకున్నాము, విధి వక్రీకరించి మీరు చెప్పిన వివాహము చేసు కొన్నానుఁ. ఫలితం మూడు రాత్రులలో తెలిసింది. మీరు సర్దుకోమని చెప్పినా నా వయసు ఒప్పుకోక విడాకులు తీసుకోని ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను. మీరు నాకు చదువు నేర్పిన గురువులు, నేను మీకు భారమవదలచలేదు. యుద్దని ఇడుతున్నవానికి దుంగ దొరికినట్లు నాజీవితంలో తరుణ్ అడుగుపెడతాన్నాడు పీడల ఆశీర్వాదములు అటు ఇటు ఉంటుందని ఆశిస్తున్నాను. 
ఈ రోజే సంతాన గోపాల స్వామి ఆలయంలో చేసుకుంటున్నాము. పేద మనస్సుతో ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము ఇట్లు మీ కూతురు "సుభద్ర ".  
ఉత్తరం చదివి ఒకటే నవ్వు 
ఏమిటండి అలా నవ్వుతారు, 
బిడ్డలను కనేవరకు మనపాత్ర ఉంటుంది, వయసు వచ్చాక స్వేశ్చగా వదిలేయాలి, వారి అభిప్రాయాలు బట్టి మనం నడుచుకోవాలి "మనం ఒకటి తలిస్తే, దేవుడొకటి చేస్తాడు" ఈ  మాయ నుండి ఎవ్వరూ తప్పించు కోలేరు. 
మన పెళ్ళీ ఎలా జరిగిదో గుర్తు తెచ్చుకో దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది కదండీ.        
 ఏది ఏమైనా ఈ పెళ్లి విషయంలో నీ ఉద్దేశ్యం చెప్పు మనం ఏంచేద్దాం   

పిల్లలను పెద్దమనసుతో ఆశీర్వదిద్దాం, అదే మనం చేయగలిగినది. 
అదే 

గుడి దగ్గర ఆటో ఆగింది 
   
గుడి బయట ఎదురుగా ఇద్దరు దండలు వేసుకొని గురువు గారి వద్దకు వచ్చారు. 
చేతిలో అక్షంతలు పెట్టారు.
   
ఇద్దరు తల వంచి నమస్కరించారు. 
లెండి పైకి లేవండి అంటూ అక్షంతలు చల్లారు 

కాలాన్ని ఎదురించి ఎవరు బ్రతకలేరు, కాలంతో పాటు బ్రతకవలసిందే. సంతానంతో సుఖ శాంతులతో జీవించండి అని దీవించి నడిచారు గురువుగారు సతీసమేతంగా.            గుడి లోపలకు   

--((**))--

6. తాత మనవుడి చిన్న కధలు 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

తాతా ఆర్ధతరంగా అధికారాన్ని రద్దు చేసు కొనుట ఎందుకు, వీధి, వీధి తిరిగి ఓటేయమని మరలా అడుగుట ఎందుకు? 

ఇది పెద్దవాల్ల విషయం

పెద్ద వాళ్లంటే ఎవరు తాతా

నేను నీకు ఏమౌతా వయసులో పెద్దవాడివి తాతా అంతేనా

అంతే కదా తాతా నీవే చెప్పావు " అందరికీ అన్నీ తెలియవు"  తెలిసిన దానిలో నిష్ణాతులుగామారి కుటుంబపోషణకు, దేశసేవకు సహకరిస్తారని చెప్పావు" 

అవునురా అవును, కానీ రాజకీయములో నిష్ణాతులకు విలువలేదు, మేధావులకు తావులేదు, విద్యార్థులకు గుర్తింపు లేదు కేవలము ధన సంపాదన, కీర్తి ప్రతిష్టల ప్రభుత్వ సొమ్మునే తనవారు తనచుట్టూ ఉన్నవారికి సహాయము చేసి జై జైలు కొట్టించు కుంటారు. అందరూ అంతేనా 

లేదు అందరూ అలా ఉండరు మహాత్మాగాంధీ దేశం కోసం, మరి ఎందరో ప్రాణాలు అర్పించారు. 

తాతా అసలు విషయం చెప్పలేదు

"చెపితే చాలా ఉన్నది చూస్తే ఏమీ కనబడదు" అన్నారు పెద్దలు. అర్ధం కాలేదు తాత
తలపండిన వారికే రాజకీయం గురించి అర్ధం కాదు, నాకు తెలిసినది చెపుతా విను.

మనిషికి అధికారానికి ఆశే జీవితం, అత్యాశపరుడుగా మారితే అంతా సర్వనాశనం. అధికారాన్ని రద్దు పరుచుటకు ఎదో ఒక ఆశ ఉండి ఉండవచ్చు, తాను అధికారంలో చేసిన పనులమీద నమ్మకం,  నెరవేర్చిన వాగ్దానాలమీద నమ్మకం, అందుబాటులో ఉన్న ధనం మీద నమ్మకం తో ప్రజలను మల్లి ఓటు అడగటానికి ముందుకు రావచ్చు. 
అందరికీ గెలుపు ఖాయమా తాత 
అది ఎవ్వరూ చెప్పలేరు    

మనిషి, అధికారులు ఊహించను గూడా లేని సంఘటనలను విధి జరిపిస్తుంది. జరగటానికి వీలుకాని వాటిని జరిపిస్తుంది. జరిగి పోతున్న వాటిని స్తంభింప జేస్తుంది. ఘటనా ఘటనలు విధి చేతులో వుంటాయి. అందుకే మన పెద్దవాళ్ళు 'విధి బలీయం' అని అంటూంటారు.   

ఇతరుల దోషముల నెంచక చూపు సహజ చాకచక్యమును, తెలివినీ చూపి,  తమ దోషములను తిలి పిన వారిని గుర్తించి, వారు చెప్పిన విధముగా మారి, ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరిస్తూ ఓర్పుతో మాట్లాడుతూ, ఓదార్పుతో అనుకరిస్తూ, ప్రజాసేవకు అంకిత మైన వారినే ప్రజలు గెలిపిస్తారు, ఇదే లోక సహజం.  

మరి గెలిచిన వారందరు మంచివారా తాత

మొదట మంచివారైనా అధికారం వచ్చిన తర్వాత కొంత అహంకారం ప్రవేశించి తను పట్టిన కుందేలుకు 3 డే కాళ్ళని వాదించే వారు లేక పోలేదు.     
పాలు ఉపయేగపడేవేె, కాని ఒక్క రోజుకు మించితే పాడైపోతాయి. అలాగే నాయకుడు ఉపయోగ పడేవాడే అవసరానికి ఒక్కరోజు లో సహాయము చేయని వాడు పాలతో సమానమే.   

పాలలొ మజ్జిగ చుక్క వేస్తె పెరుగు అవుతుంది. అలాగే నాయకుడు మరొక నాయకునితో స్నేహము కలిపితే పార్టీ బలం, పెరుగుతుంది.   
పెరుగు మరొకరోజువరకు ఉపయోగపడతుంది. అలాగే పార్టీల మధ్య మనస్పర్థలు పెరిగితే  మొదటికే మోసం రావచ్చు ఒక్క రోజులో పెరుగులా మారొచ్చు.  
కాని పెరగు వేరొకరోజుకి పాడైపోతుంది.

పెరుగును మదిస్తే వెన్న అవుతుంది. మనస్పర్థలు రాకుండా మంత్రిపదవులు ఇచ్చి, అందు కున్నంత దోచుకో అని అవకాశము ఇచ్చి, నీటిలో వెన్న ముద్ద అంటనట్లు ఉంటె కొంత వరకు అధికారం నిలబడుతుంది. అంతే ఒక్క రోజులో ముదిరిన పాకంలా మారితే బెడిసి కొడుతుంది    

వెన్న మరొకరోజు వరకే ఉంటుంది. తరువాయి అదికూడా పాడైపోతుంది.

ఆ వెన్నను మరిగిస్తే నెయ్యి అవుతుంది. వెన్నలాంటి మనసు ఉండి, న్యాయం, ధర్మం,సత్యమ్, నిరంతరం బ్రతికుంచుటకు శ్రమను ధారపోసి ప్రజా సేవకు అంకితమై, తన కష్టార్జితమును కూడా ఖర్చుచేసి ప్రజల హృదయాలలో ఉండేవాడే నిజమైన 
నాయకుడు, ఇదే నేతితో సమానము        

ఈ నెయ్యి ఎన్నటికి పాడవ్వదు.

తాత కొందరు నేతిని వాడరు కదా

అవునురా మంచి చేసే వారు జీవితము సాగించలేరు, ప్రజల హృదయాలలో నేతిలా కరిగి పోతారు. 
తాత మరి నీవు ఓటు వేస్తావా " ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాలి నిజాయతీని బ్రతికించాలి. 
తాత నాకు ఓటు లేదుగా తొందరెందుకు ముందొస్తుంది ముసళ్ల పండగ అంటారు పెద్దలు. 
అంటే ఏమిటి తాత ..... బాబోయ్ ఇప్పుడు ఏమీ చెప్పలేను పార్టీ మీటింగుకు పోవాలి వస్తా ...          
--((**))--
        





(5)సర్వేజనా సుఖినోభవంతు 

~ పసి తనం  ~(4)

నాకు నిన్ను చూపుతూ నువ్వు మొదలైన క్షణం ఇంకా నా అరచేతుల నిండా ఆకాశమై పరుచుకునే ఉంది, వేవేల వసంతాలు ఒక ఉధృతమై ఒక్క సారిగా
కమ్ముకున్న సవ్వడి ఇంకా వినిపిస్తూనే ఉంది

ముద్దు ముద్దు మాటలని మూటగట్టేసి, నా మౌనాన్ని చిధ్రం చేసిన తీపి గాయం ఇంకా పచ్చిగానే ఉంది, కలల్ని మాట్లాడటం పట్టుబడని నన్ను కలల సరిహద్దుని దాటించేసిన నీ భవిత ఇంకా పలకరిస్తూనే ఉంది, శూన్యం నను తడిమినప్పుడల్లా
నువ్వొక అలారం మోతవై నన్ను తట్టిలేపుతున్న సందర్భాలు కొనసాగుతూనే ఉన్నాయ్, నిద్రిస్తూ నువ్వు కనే కలల లేత చిరునవ్వులలో వెలిగే అమాయకత్వపు వెలుగులు ఎప్పటికీ తరగని ఒక ఆశ్చర్యమై నన్ను కట్టేస్తున్నాయ్.

నిన్ను నేను లాలించడమే అందరికీ తెలిసిన నిజం నువ్వు నన్ను పాలించడం నాకు మాత్రమే తెలిసిన అలౌకిక ఆనందం నవ్వుతూ తుళ్ళుతూ కళ్ళు పెద్ద చేసి నువ్వు ‘నాన్నా' అని పిలిచినప్పుడల్లా నువ్వు యువరాణివై నన్ను ఈ ప్రపంచానికి రాజుని చేసిన ఆనందం నీ పసి స్పర్శలో ఏ మర్మాలు దాచావో ఏమో నా శూన్యాల అలికిడిని చెరిపేస్తూ ఒక దైవత్వం కురుస్తున్న చప్పుడు వినవడుతుంది.
నీ నవ్వుల మంత్రదండంతో నా కలతలన్నిటిని సరి చేసేసి మనఃక్లేశాలన్నిటినీ మాయం చేసేస్తున్న అద్వైత అల్లరివి ఎప్పటికప్పుడు నన్ను కొత్తగా మొదలు పెట్టడం ఎక్కడికక్కడ నన్నునిర్మలంగా ఆవరించుకోవడం తెలిసిన ఏకైక సత్యానివి నువ్వు.

నా వంటినే మెట్లుగా నడచిన నిన్నటి నీ పసినడకల నిర్వచనాలని దాటి
నేడు నేను పరిచే దారిలో రేపటి నీ పరుగుని కలగంటూన్నా… కన్నా… నన్ను తడిపే సున్నితపు ప్రేమ సుమాల తొలకరివి నువ్వు నువ్వు నా ఆనందానివి… నువ్వే నా అనంతానివి…!

 --((*))--


సెల్ మాయ ... (3)


నమస్తే ! మీ నంబర్ ఏంటి?... ఇది ఒక వ్యక్తీ పరిచయం కాగానే అడిగే మొదటి మాట . ముందు అతని నంబర్ సేవ్ చేసుకుని తర్వాత మిగతా ముచ్చట్లు. ఇంతకూ ముందు ఐతే ఇంటికో ఫోన్ ఉండేది. దానికి కాల్ చేస్తే ఇంట్లో ఉంటే మాట్లాడతాడు లేకుంటే వచ్చాక మాట్లాడొచ్చు అని ఉండేది. కాని ఇపుడు ఏ వ్యక్తినైనా ఏ సమయంలో అయినా పట్టుకునే సులువైన మార్గం మొబైల్ ఫోన్. అవసరానికి పనికొచ్చే వస్తువుగా ప్రారంభమైన ఈ సెల్లు వాడకం ఇపుడు అత్యవసరం ఐపోయింది. ఎంతగా అంతే బాత్ రూం లోకి కూడా తీసుకెళ్తున్నారు. గుళ్ళో దేవుడికి పూజ చేసే పంతులు మంత్రాలకు మధ్యలో తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. ప్రదక్షిణాలు చేస్తున్న వ్యక్తి మధ్యలో ఫోన్ వస్తే మాట్లాడుతూనే తిరుగుతూ ఉంటాడు. అదేం భక్తో మరి? స్కూలు పిల్లలకు కూడా మొబైల్ అవసరమే అంటున్నారు కొందరు బడాబాబులు, అమ్మలు. కాలేజీ పిల్లలకైతే అన్నం లేకున్నా సెల్లు ఉంటే చాలు. ఒకటే ముచ్చట్లు. మనిషి మనిషికి మధ్య దూరాన్ని తగ్గించడానికి ఈ సాధనం కనుక్కున్నారు .కాని అది ఆ దూరాన్ని మరింత పెంచుతుంది. పక్క రూం లో, క్యాబిన్ లో ఉన్న వ్యక్తితో మాట్లాడాలంటే సులువైన మార్గం మొబైల్. నడిచి వెళ్లి అతనితో మాట్లాడే ఓపిక లేదో,సమయం లేదో, బద్ధకమో మరి..

ఈ అవసరాన్ని తమ వ్యాపార సూత్రంగా మార్చుకున్నాయి కంపీనీలు. పుట్టగొడుగుల్లా రోజుకో కొత్త మొబైల్ కంపెనీ,మాడలు. వాటికి దీటుగా రింగ్ టోన్లు, కాలర్ ట్యూన్లు. ఈ వ్యాపారంలో పేరు, డబ్బు సంపాదించుకోవడానికి కొత్త ఆఫర్లు. ఒకడిని చూసి ఇంకోడు బట్టలిప్పుకుంటున్నాడు. ఈ మధ్య ఫోన్ రెట్లు, కాల్ రెట్లు ఒకరిని చూసి ఇంకొరు తగ్గించేస్తున్నారు. ఈ కాల్ రెట్లు, మెసేజుల రెట్లు ఎంతగా ప్రభావితం చేసాయంటే పనిమనుష్యులు, బిచ్చగాళ్ళు, కూరగాయల బండి వాడు కూడా సెల్ మెయింటైన్ చేస్తున్నాడు. నాకు సెల్ లేదు అన్నవాడు పిచ్చోడు ఈరోజుల్లో. సేల్ ఫోన్ మోడల్ బట్టి అతని గౌరవం విలువ కడతారు కొందరు మహానుభావులు. ఉద్యోగాలు,వ్యాపారస్తులకు ఈ సెల్లు చాలా ఉపయోగకరమే. కాని అది ఎంతో మంది చేతుల్లో దుర్వినియోగం అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఎన్నెన్నో..
ఓ చిన్న జోకు..

"హలో!"
"హలో! ఇది ఫలానా కస్టమర్ కేర్. మీకే విధమైన సేవ చేయగలం?"
"హలో! నేనో కంప్లెయింట్ చేయాలి"
"చెప్పండి"
"నా నంబర్ కి కాల్ చేయకండి. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.మా అమ్మకు తెలిస్తే అది కాన్సిల్ చేయిస్తుంది.మీరు చేయొద్దు"
"సరే చేయం కాని. ఏ నంబర్ అండి?"
"అమ్మా! నంబర్ చెప్తే మీరు కాల్ చేస్తారు. మా అమ్మకు తెలిస్తే చంపేస్తుంది.మీరు చేయనపుడు ఆ నంబర్ ఎందుకు చెప్పాలి?"
"ఏదైనా ఆఫర్ ఉంటే కాల్ చేస్తాము, బిల్ కట్టకుంటే కాల్ చేస్తాము అంతే"
"వద్దు.. చేయొద్దు.మీరు కాల్ చేసి మా అమ్మకు కంప్లెయింట్ చేస్తే నేను మీ ఆఫీసుకు వచ్చి కంప్లెయింట్ చేస్తాను."
" సరే చేయనులెండి"
ఇలా ఒక అమాయకుడు ఇంగ్లీషులో చేసిన సెల్లు లొల్లి వినండి మరి.
ఇది వింటుంటే మన తెలుగు న్యూస్ చానెల్స్ లో యాంకరమ్మలు తెలుగు మాట్లాడడానికి బలవంతంగా పడుతున్న పాట్లు గుర్తొస్తాయి. కాదంటారా?
ఈ సందర్భంగా ఓ గీతోపదేశం కాదు కాదు.. సెల్లోపదేశం..(మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా స్టైలులో పాడుకోండి) 
మత్తు వదలరా సెల్ ఫోన్ మత్తు మదలరా

ఆ మత్తులోన పడితే అడ్డంగా బుక్కవుదువురా.. //మత్తు//

జీవితమున సగభాగం ఫోన్ సోల్లుకే సరిపోవు
మిగిలిన ఆ సగభాగం బిల్లు కట్టుతకే సరిపోవు.
సెల్లుఫోన్ లేనివారు పనికిరాని మూర్ఖులు
వద్దురా అంటే చెడామడా తిడతారు ... // మత్తు //

రింగ్ టోన్స్, కాలర్ ట్యూన్స్ పిచ్చిగా వాడకురా
పాటలు వింటూ రోడ్డు మాత్రం దాతకురా (చస్తావుర్రోయ్)
బుద్ధి చెప్పడం మావంతు తప్పు తెలుసుకోవడం నీ వంతు
సెల్లు లేకున్నా నడిచే కాలం చూడు మారకుంటే నీ ఖర్మం.. //మత్తు //

ఈ సెల్ పిచ్చోడి చేతిలో రాయా, లేదా  మంచోడి  చేతుల్లో  రాయా ఏదైనా ఒక సమస్త సమాచారమును తెలిపి చూపే ఒక దిక్సూచి. 
ఉపయోగించు కోవటం వచ్చినా చేతకాకపోయినా ఎక్కువసేపు వాడితే చెవులకు కళ్ళకు బాధ ఉంటుంది. 

--((**))--        

(2)
అది నీకు పనికి రాదు --- నువ్వట్టాగా అంటే మాకు ఫుడ్డేట్టాగా అన్నా ??

మాగ్నెటిక్ థెరఫీ అనేది .. తరచూ రాజ్యమేలుతూ ఉంటుంది.
మన రక్తంలో , ఐరన్ ఉంటుంది .అది రక్తానికి , శక్తిని ఇస్తుంది . అందుకని గర్భిణీ స్త్రీలకు "ఐరన్ " టాబిలెట్లు " ఇస్తారు . ఈ వంట్లో వుండే ఐరన్ కి - గోడకి కొట్టే మేకులలో వుండే ఐరన్ కి పోలికే ఉండదు .

కానీ మాటలతో మ్యాజిక్కులు చేసి పొట్ట పోసుకునేవాళ్ళు - 
" నీ వంట్లో ఐరన్ వుంది - నాదెగ్గర - మాగ్నెట్ వుంది - ఈ మాగ్నెట్లు పెట్టి కుట్టిన చడ్డీ తీసుకొని నీ వంటిమీద మీద వేసుకో .. నీవంట్లో వున్నా ఐరన్ ఆంతా.. మాగ్నెట్ కోసమని .. నడుములదెగ్గరికి వచ్చి గడ్డ కట్టుద్ది .నీ నడుములో ఇనుప బలం వస్తది . ముందువైపు కూడా మాగ్నేట్లు పెట్టాము . అక్కడ కూడా ఇనప బలం వస్తది. గర్ల్ ఫ్రెండ్తో మస్తు ఎంజాయ్ చేయచ్చు . ప్లిలలలు లేని వారికి ఇది వరప్రసాదం " అని ప్రకటనలు ఇస్తారు . లాజిక్కు చాలా సింపులుగా , తేలిగ్గా అర్థమయ్యేటట్లు వుంది .అమాయకులు , పిల్లలకోసం పరితపించే వాళ్ళు , 1000/- 2000/- వేలు ఖర్చుచేసి, కొని - పరీక్షించి -- 0% కూడా ఫలితం లేదని - నిరాశ పడుతుంటారు .

అమ్మేవాడు సింపుల్ లాజిక్కు వాడినట్లు -- మనము కూడా సింపుల్ లాజిక్కు వాడాలి . ఒక అయస్కాంతం తీసుకుని మనవంటి కి అతుక్కుంటుందేమో చూడాలి . అతుక్కుంటే , అప్పుడు ఇలాంటివి కొనుక్కోవాలి . అతుక్కోకపోతే , మనరక్తం అయస్కాంతానికి లోంగే రక్తం కాదని - అలాంటి రక్తం ఎవరికన్నా ఉందేమో కానీ - మనకు లేదని - సమాధాన పడాలి . మనకు మనం నచ్చ చెప్పుకోవటమే తెలివంటే .

ఫొటోలో చూపిన చెడ్డీ " మాగ్నెటిక్ " చెడ్డీ . అయస్కాంతాలు ఎక్కడ ఉన్నాయో ? ఎలా పనిచేస్తాయో? అన్నది యానిమేటే చేసి చూపించారు . మీ కళ్ళని నమ్మించటం కోసం. దీనికి ఆర్డర్ ఇచ్చేముందు - మీవంటి అయస్కాంతం అంటుకుంటుందేమో చూడండి - అంటుకోకపోతే ఇది మీకు పనికి రాదు . మీ వంట్లో వాళ్ళు చెప్పే ఐరన్ లేదు . 


(1)


శ్రీమతిగారు! ఈ మధ్య కాలంలో కాస్త విచారంగా కనిపిస్తున్నావేంటి సంగతీ?


నాకెందుకో తెలీని బెంగ పట్టుకుందండీ!


కాస్త విడమరచి చెప్పొచ్చుగా!


ఏమీ లేదండీ, ఈ మద్య మనమ్మాయి పోకెట్ మనీ అడగడం మానేసింది!


ఓస్! అంతేనా! క్లుప్తంగా ఖర్చు చేస్తోందై వుంటుందిలే! 


అది సరే గాని నా జేబులో డబ్బులు నిండుకున్నాయ్, 


ఆ డబ్బులిటివ్వు!


చాలా ఏళ్లగా తీవ్రమైన సమస్యలతో సతమతమౌతున్న ఒక యువకుడు విసిగి వేసారి, అన్ని విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు.


అన్నీ అంటే అన్నీ ...సమస్యలు ,ఉద్యొగం...తనని నమ్మిన కుటుంబాన్నే కాకా తాను నమ్మిన దైవాన్ని ,చివరికి దైవమిచ్చిన జీవితాన్ని కూడా విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు.


చివరిగా ఒక్కసారి భగవంతునితో మాట్లాడాలని ఏకాంతంగా ఉన్న ఒక అడవిలోకి వెళ్తాడు.


" భగవంతుడా ! నేను ఇవన్నీ విడిచిపెట్టకుండా ఉండడానికి కారణం ఒక్కటి చెప్పగలవా " అని అడుగుతాడు


దానికి భగవంతుడు వాత్సల్యంగా " నాయనా !ఒక్కసారి నీ చుట్టూ చూడు ఎత్తుగా అందంగా ఎదిగిన గడ్డి ,వెదురు మొక్కలు కనిపిస్తున్నాయా?"


"అవును .కనిపిస్తున్నాయి."


"నేను ఆ గడ్డి విత్తనాలు వెదురు విత్తనాలు నాటినప్పుడు అవి మొలకెత్తడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. గాలి ,నీరు సూర్యరశ్మి ...అన్ని అవసరమైనవి అన్నీ అందించాను."


గడ్డి వెంటనే మొలకెత్తింది.


భూమి పై పచ్చని తివాచి పరచినట్టుగా ...


కానీ వెదురు మొలకెత్తనే లేదు.


కానీ నేను వెదురును విడిచిపెట్టనూలేదు .


విస్మరించనూలేదు .

ఒక సంవత్సరం గడిచింది .

గడ్డి మరింత ఎత్తుగా ఒత్తుగా పెరిగింది 


అందంగా ఆహ్లాదంగా...


కానీ వెదురు చిన్న మొలక కూడా మొలకెత్తలేదు .


రెండు , 


మూడు , 


నాలుగు సంవత్సరాలు గడిచాయి 


వెదురు మొలకెత్తలేదు


కానీ నేను అప్పటికి వెదురును విస్మరించలేదు 


ఐదవ సంవత్సరం వెదురు చిన్న మొలక భూమిపై మొలకెత్తింది .


గడ్డి కన్నా ఇది చాల చిన్నది


కానీ ఒక్క ఆరు నెలలలో అది వంద అడుగుల ఎత్తు ఎదిగింది ...అందంగా బలంగా ..


ఐదు సంవత్సరాలు అది తన వేళ్ళను భూమి లోపల పెంచుకుంది బలపరచుకుంది.


పైకి ఎదిగిన వెదురును నిలబెట్టగల బలం వేళ్ళు ముందు సంపాదించాయి .


ఆ బలం వాటికి లేకపోతె వెదురుమనలేదు(నిలబడలేదు).


నా సృష్టిలో దేనికీ కూడా అది ఎదుర్కోలేని సమస్యను నేనివ్వను.


ఇన్నాళ్లూ నువ్వు పడుతున్న కష్టాలన్నీ ,ఎదుర్కుంటున్న సమస్యలన్నీ నీ వేళ్ళను (మానసిక స్థైర్యాన్ని ) బలపరుస్తూ వచ్చాయి .


వెదురు మొక్కను విస్మరించలేదు.


నిన్నుకూడా విస్మరించను.


నిన్ను నువ్వు ఇతరులతో 


ఎన్నటికీ పోల్చుకోకు .


రెండూ అడవిని అందంగా మలచినప్పటికీ ...


గడ్డి లక్ష్యం వేరు ..


వెదురు లక్ష్యం వేరు ..


నీసమయం వచ్చ్చినప్పుడు 


నువ్వూ ఎదుగుతావు."


"ప్రభు ! మరి నేను ఎంత ఎదుగుతాను??"


"వెదురు ఎంత ఎదిగింది?"


'అది ఎంత ఎదగగలదో అంత ఎదిగింది."


"నువ్వు ఎంత ఎదగాలని నేను అనుకుంటానో అంత ఎదుగుతావు"


నీతి: భగవంతుడు ఎప్పుడూ.. ఎవరినీ ... విస్మరించడు. విడిచిపెట్టడు.


మనం కూడా భావంతునిపై విశ్వాసాన్ని, మన ప్రయత్నాన్నీ ఎన్నటికీ విడిచిపెట్టకూడదు.


నీ సమస్య ఎంత పెద్దదో దైవానికి చెప్పకు.


నీ దైవ০ ఎంత గొప్పవాడో నీ సమస్యకు చెప్పు.


--((*))--


చండీమాత .. 
కాలాన్ని నడిపించే శక్తిమాత . 
నదీ ప్రవాహానికి అనేక అడ్డంకులు కలిగినట్లు .. కాల ప్రవాహానికి అనేక అడ్డంకులు తగులుతాయి. అనేక విధాలా మురికి నీరు కలసి ఒకనదీ ప్రవాహాన్ని బలహీన పరచినట్లు , కల్మష పరిచినట్లు , మంత్రవేత్తలు , తంత్రవేత్తలు., ఉపాసకులు ,తమ మనోవాంఛలను, మంత్రబలంతో సాధించుకొని - కాలాన్ని బలహీన పరుస్తూ , కల్మష పరుస్తూ వుంటారు .

ఋషులు , మునులు కొందరు లోక కల్యాణ వాంఛలేకుండా , కాలప్రవాహాన్ని అడ్డగిస్తారు . చివరికి - శివుడి అంతటి వాడు - భక్త వాస్త్యల్యము చేత -నీకు మరణము లేదు అని (కాలంతో నశించి పోవు) అని వరము , లిస్తాడు . ఆరకంగా దేవతలా చేత కూడా కాలము కుంటుపడుతూ ఉంటుంది. కాలము గతి తప్పినప్పుడల్లా .. అల్లకల్లోలం సృష్టి అవుతుంది .

ఒకకాల్వలోని నీటి పారుదల రీతిని , డబ్బు, అధికారము , కండబలం ,మోసకారి తనము, వున్నవారు ఆటంక పరుస్తారు . సహజరీతిగా నీరు ఆశించిన వారు అల్లకల్లోల పడతారు .

కాలము మరకపోతుందా ? (సహజధర్మాన్ని పొందక పోతుందా) మంచి కాలము (ధర్మము వర్ధిల్లే రోజు) రాకపోతుందా అని నమ్మి జీవనము కొనసాగించేవారు కొందరుంటారు . వారి పట్ల ఈమె వరదేవత.

నాయందు దోషము లేకపోయినప్పటికీ , పరులవల్ల నా కాలము (జీవితము) ఒడిదుడుకులతో నడుస్తున్నది అని - ఒక నమస్కారము చేతనో , ఒకవేడికోలు చేతనో, ఈమెకు తెలుపుకుంటే, ఈమె ఆ కాలగతి మార్చ సర్వ సమర్ధురాలు 
(నవగ్రహాలు మన కాల గతిని మారుస్తాయనే కదా మనం నుమ్ముతాం -దానికి ఈమె సహస్రవిధాలా రెట్టింపు )

కాలగతిని ఆటంక పరిచిన వారిపట్ల నిరంకుశము ,నిర్ధయగాను ఉంటుంది చెండీ మాత. చెడునడతను , చెడు ఆలోచనలను సహించదు . అత్యంత శక్తీ వంతురాలిగా వుంది . అవతలి వారు ఎంత స్తోత్ర ఫాఠనం చేసినప్పటికి .. వారిలో లవలేశం తప్పువున్నా దర్శన భాగ్యం ఇవ్వదు. అలాంటి వారు ఆమె ప్రీర్త్యర్ధం అని తలపెట్టిన "చెండి హోమము " ని కూడా ఆటంక పరుచు కుంటుంది. ఇక వరముల మాట చెప్పాలా ?

విస్వంతరాళాల శక్తికి, కాలమే ముఖ్యమని , అందుపై అధిపతి గా ఒక మాతవున్నదని గ్రహింపుతో ఈమెను వేదకాలంలో పూజించారు ." అమ్మ చాముండీ "అత్యంత శక్తి వంతురాలు అయ్యీ -సులభ కాక పోవటంతో .." ఉపాసకులు/జనులు ఆమెను, విస్మరించారు .స్మృతి నుండి తప్పించారు.

కాలం గడచి " ఆమెను ఆమె గా అంగీకరించి .. పూజింప దలచినవారు " ఆమెను " బాల చాముండీ దేవి రూపాన , పునః ప్రతిష్ఠిచుకున్నారు . స్మృతి ప్రధాన నిలుపుకున్నారు.
-------------------------------------
ఏదైనా ఒక స్త్రీ దేవత బాలరూపం లో అర్చింపబడుతున్నదనగా , ఆమె పునః స్థాపితమైన విస్వ శక్తిగా చూడ వచ్చు .

మనఇంట్లో బాలికలు వుంటారు . వయసుకు తగిన శక్తి కలిగివుంటారు . ఆ శక్తీ చాలు , మనకు రోజులు (కాలం) సవ్యంగా గడవటానికి . చాల దయగాను .. సులభులు (అందుబాటులో వుండే వారుగాను ) వుంటారు బాలలు . మనుమడి లేదా మనుమరాలు చేయి పట్టుకు నడిచే తాతా/అమ్మమ్మల రూపంలో భక్తులు వుంటారు . 
బాలురు మనకు కాలం - సవ్యంగా గడిపించి చూపిస్తారు.

బాలలు మంచి శక్తి వంతులుగా మారినప్పుడు వారి భాద్యతలు , వారి నిర్ణయాలు వారికుంటాయి .అప్పుడు సులభులు ఎవరు ?
అందువల్ల - బాలరూపాన్ని ఆశ్రయించటం జరుగుతుంది . 




(by. V.S.Rama Krishna) 


ప్రభారాధన----39 నిముషముల లఘుచిత్రం -సంక్షిప్త కధ-----
-----------------------------------------------
భోగరాజు ప్రొడక్షన్స్--------ప్రభారాధన

నిర్మాత----భోగరాజు సత్యనారాయణ B Sc.,M I E ( India)
(సూర్యప్రభాపతి)

నేపథ్య సంగీతం-శ్రీమతి భోగరాజు సూర్యప్రభ B A సకలకళానిధి

కధ,మాటలు- కొవ్వలి నాగేశ్వరరావు( వేయి నవలల రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారి ప్రధమ పుత్రుడు)

సంక్షిప్త కధ-----
---------

చక్రి ,శ్యామల లు సాఫ్ట్ వేర్ఇంజనీర్లుఒకేఆఫీసులోపనిచేస్తున్నారు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ వారి తల్లితండ్రులు వారి వివాహానికి అంగీకరించ లేదు .కారణం, ముఖ్యంగా వారు వేరు వేరు కులములు కావటమే . వారిద్దరికీ వారి తల్లితండ్రులు వేరే వేరే సంబంధాలు చూశారు .కానీ అవి చక్రి, శ్యామల లకు ఇష్టం లేదు . రిజిస్టర్ మ్యారేజీ చేసుకోవటానికి నిర్ణయించు కున్నారు . వారి వారి తల్లి తండ్రులను ధిక్కరించి వారినుండి సంక్రమించే ఆస్తిపాస్తులను కాలదన్ని ఒకరోజు రిజిస్టర్ మ్యారేజ్ చేసేసి కున్నారు .అప్పుడు శ్యామల స్నేహితురాలు మాలతి పెదనాన్నగారు కూడా వచ్చి ఆదంపతులను ఆశీర్వదించి ఒక గిఫ్ట్ ప్యాక్ కూడా ఇచ్చారు 

ఇప్పుడే అసలు కధ మొదలైంది . చూస్తూ చూస్తూండగనే రెండేళ్ళు గడిచాయి . చక్రి కి శ్యామలమీద మొదట్లో ఉన్న ప్రేమ తగ్గటం మొదలైంది ఆఫీసులో ఇంకో అమ్మాయితో తిరగటం మొదలు పెట్టాడు. శ్యామలను ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోమన్నాడు . తాను సాయంత్రం ఆఫీసునుండి అలసిపోయి వస్తే ఇంటిదగ్గర తన భార్య తనకు కాఫీ తో స్వాగతం పలకాలని కోరిక అదీ కాకుండా వారికి పుట్టబోయే సంతానాన్ని ఇంట్లో తనభార్య ప్రేమతో పెంచాలని కోరిక . ఈ కోరికను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోకముందు చెప్ప లేదు . ఇప్పుడేంచేయాలి? కానీ శ్యామలకు తాను చాలా కాలంనుండీ చేస్తున్న ఉద్యోగం మానటం ఇష్టంలేదుచివరకుచక్రి శ్యామల మీద కోపం వచ్చి విడాకులు ఇవ్వటానికే నిర్ణయించుకున్నాడు.

ఈ పరిస్తితిలో శ్యామల చక్రి కి ఒక ఆదర్శ దంపతుల కధను చెప్పటం మొదలపెట్టింది . వారి రిజిస్టర్ మ్యారేజ్ లోఒకరిచ్చిన గిఫ్ట్ ప్యాక్ లో "కర్తవ్యం " "సకలకళానిధి " అనే రెండు గ్రంథాలు ఉన్నాయి శ్యామల స్నేహితురాలు మాలతి యొక్క పెదనాన్నగారే ఆ గిఫ్ట్ ఇచ్చారు మాలతికి వారిపెదనాన్నగారి కుటుంబవిషయాలన్నీ బాగా తెలుసునట
ఆగ్రంధాలను ఆ దంపతులే వ్రాశారువాటిలోచాలా ముఖ్యవిషయాలున్నై ఆ దంపతులు చాలా ప్రేమ మూర్తులు ఆదంపతులిరువురూ కలసి చేసిన యాత్రవిశేషాలు , పుష్కర స్నానాలు,పూజలూ నోములూ వ్రతాలు దానధర్మాలు, మొదలగు పుణ్యకార్యాలు. వారు చేసిన యోగసాధన ప్రత్యేకంగా ఆవిడ శ్రీ రామకోటి రెండు సార్లు వ్రాయటం,వందలాది పాటలు పాడటం మొదలగు విషయాలు చెపుతూ భార్య పోయి మూడు సంవత్సరా లయినా ఆవిడనే ఆరాధిస్తూ సర్వ కాల సర్వావస్తలయందూ ఆవిడ స్మరణే చేస్తూ కాలం గడపుతున్నాడు భార్యను చేరటానికి ఎదురు తీస్తున్నాడు అట్లాగుండాలి దంపతులంటే--అని చెప్పింది శ్యామల చక్రి కి. చక్రి ఇదంతా పిచ్చిపని. చేతగానివాళ్ళు చేసే పని అని
ఆ సకలకళానిధి పుస్తకాన్ని దూరంగా విసిరి పారేశాడు .శ్యామల చాలా బాధపడింది.

చక్రి శ్యామలకు విడాకులనోటీస్ ఇవ్వటానికి ప్రయత్నాలు ప్రారంభించాడు స్కూటర్ మీద వెడుతూ అడ్వకేట్ తో సెల్ ఫోన్ లో మాట్లాడుతూండగా ఏక్సిడెంటు జరిగింది కాలికి ఫ్రాక్చర్ అయింది హాస్పటల్ లో ఎడ్మిట్ అయ్యాడు ఏక్సిడెంట్ విషయం తెలిసిన వెంటనే శ్యామలహాస్పటల్ కువెళ్ళి నెలరోజులు వైద్యం చేయించి ఇంటికి తెచ్చుకుంది చక్రి కి సపర్యలు చేస్తుంది.చక్రి ప్రేమించిన రెండవ అమ్మాయి కనీసం తనను చూడకైనా రాలేదు చక్రి ఫ్రాక్చర్ తో మంచంమీద శ్యామల చేత సపర్యలు చేయించుకొంటూ బాధపడుతూ ఉన్నాడు .

అట్లాగుండగా ఒకరోజు రాత్రి ఒక దేవత (పూర్వజన్మ లో సూర్యప్రభ) చక్రి కలలోకి వచ్చి --బాహ్యసౌందర్యము నకు ఆకర్షితులపై నేటి  యువతి యువకులు ఏవిధంగా మోసపోతున్నారో, అంటూ చెపుతూ " హితబోధ" చేస్తుంది. వెంటనే నిద్రలేచి తాను చేసిన పనులకు పశ్చాత్తాపం చెందుతాడు తన భార్య శ్యామలకు ఈ కల విషయం చెప్పి
తనను క్షమించమంటాడు సూర్యప్రభ తనకు జ్ఞానోపదేశం చేసిందన్నాడు సూర్యప్రభ మూలంగా మన కాపురం నిలబడినందుకు కృతజ్ఞతగా మనకు కలిగే ఆడపిల్లకు
"సూర్యప్రభ "పేరుపెట్టుకుందామనుకున్నారు ఈ విధంగా సూర్యప్రభ తినకున్న దివ్య శక్తులతో ఇంకెన్ని కుటుంబాలు బాగుచేస్తుందో నని అనుకుంటున్నారు మన చక్రి , శ్యామల జంట 

ఇదీ సంక్షిప్తంగా "ప్రభారాధన "అనే 39 ని॥ల లఘు చిత్రం కధ

--((**))--
త్యద్భుతము తప్పక చదవండి పోస్టు పూర్తిగా చదవకపోతే చాల కొల్పొతాం అంత బాగ నచ్చుతుంది. 


ఇవాళ సైన్స్ పురోగతి సాధిస్తున్న అంశాల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది నానో టెక్నాలజీ. దీని మీద పాశ్చాత్య దేశాలు బిలియన్ల కోట్లు పెట్టి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. దురదృష్టం ఏమిటీ అంటే ఈ నానో టెక్నాలజీ కొన్ని వేల సంవత్సరాలనాడే మన దేశంలో వుంది. ఇప్పటికీ వుంది. హిమాలయాల్లో సజీవంగా వుంది. వివరాల్లోకి వెళ్తే.... 

మన ఋషులు,యోగులు, సాధువులు కొన్ని వేల ఏళ్ళ క్రితమే సూక్ష్మ శరీరయానం గురించి చెప్పారు. మనం పుస్తకాల్లో చదువుకున్న తపస్సునే ఇప్పుడు ధ్యానం అంటున్నారు. ఈ ధ్యానం ద్వారా అమోఘమైన సిద్ధులు సంప్రాప్తిస్తాయి. అందులో ఒకటి సూక్ష్మ శరీరయానం. దీన్ని నానో టెక్నాలజీలో అడ్వాన్స్డ్ స్టేజ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చేస్తున్న పరిశోధనల లక్ష్యం కూడా అదే. మన ఋషులు, యోగులు కోరుకున్నదే తడవుగా కోరుకున్న చోటికి ప్రయాణం చేసేవారు. కానీ ఇప్పటి హేతువాదులు దాన్ని నమ్మటానికి సిద్ధంగాలేరు. 

మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం సన్నివేశం గుర్తుంది కదా. దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగినప్పుడు ,మాన సంరక్షణ కోసం తను శ్రీ కృష్ణుడిని ప్రార్ధిస్తుంది. ఎక్కడో ద్వారకలో వున్న కృష్ణుడు తక్షణం అక్కడ ప్రత్యక్షమై ద్రౌపది శీలాన్ని కాపాడుతాడు. దానికి ఆటను ఎంచుకున్న ప్రయాణ సాధనం నానో టేక్నాలజీయే. త్రిలోక సంచారి ఐన నారదుడు నిత్యం నానో టెక్నాలజీ ద్వారానే ప్రయాణించే వాడు. ఇదంతా చదివి నాకు మతి భ్రమించి రాస్తున్నాను అని మిత్రులు భ్రమపడే అవకాశం వుంది. అందుకే ,ఇక్కడ ఒక సజీవ ఉదాహరణ ఇస్తున్నాను. 

హరిద్వార్ లోనూ, త్రివేణి సంగమం లోనూ జరిగే కుంభమేళా లు గుర్తున్నాయి కదా. అక్కడికి లక్షలాది మంది నాగసాదువులు రావటం మనం టీవీల్లో,పేపర్ లలో చూశాం. నాగసాదువులు దిగంబరంగా వుంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలో, కొండల్లో,నదీ తీరాల్లో వుంటారు.మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వుంటాయి. 
ఇక్కడ మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం.కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ,వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా. ఇప్పటి దాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయ్యిందా? ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు వుంటాయి. ఎక్కడైనా,ఏ ఫోటోగ్రాఫర్ కు అయినా ఇన్ని లక్షల మంది దిగంబరులు కన్పించారా? ఎక్కడైనా ఇంతమంది ప్రత్యెక విమానాల్లో ,ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కన్పించాయా?లేదే? సరిగ్గా అందరూ ఒకేసారి, కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్ష మవుతారు? కుంభ మేలా ముగిశాక ,తిరుగు ప్రయాణంలో ఒక కిలోమీటర్ దూరం వరకే కన్పించి హటాత్తుగా ఎలా మాయమైపోతారు? ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కన్పించదు? 
వీటన్నింటికీ సమాధానం ఒకటే అదే సూక్ష్మ శరీర యానం .అదే నానో టెక్నాలజీ.నాగసాదువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం.ఎన్నో ఏళ్ళుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కన్పిస్తుంటే దాన్ని మనం నమ్మం. అమెరికా వాడు, రష్యా వాడు, చైనా వాడు, జపాన్ వాడు,జర్మనీ వాడు చెప్పే సోళ్లు అంతా విని చంకలు ఎగరేస్తుంటాం. ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలు చదవండి. వాటిని అనుసరించి,అమలు చేసే ప్రయత్నం చెయ్యండి. ప్రపంచానికి మళ్ళీ మనం పాఠాలు చెప్పొచ్చు.
కినాడ కథలు :: #ఋణానుబంధరూపేణా
#కాకినాడలోని జగన్నాథపురం బ్రిడ్జి దిగి ఎడమచేతి వైపు వెళ్తుంటే వేంకటేశ్వరస్వామి గుడికి ఎదురుకుండా కనబడుతూ ఉంటుంది బోర్డు మీద తెలుగులో వ్రాసిన రాజస్థానీ మిఠాయి దుకాణం అని. మిఠాయి దుకాణం అన్నాము కదా అక్కడ బోల్డు మిఠాయిలు ఏమీ ఉండవు. దొరికేది వేడి వేడి బెల్లంజిలేబి మాత్రమే. ఆ ఒక్క వెరైయిటీకే అక్కడ ఇసకేస్తే రాలనంత మంది జనం.
***
ఆ దుకాణం యజమాని పేరు ధరమ్ వీర్ సింగ్. 1971లో తన ముప్ఫై ఏళ్ళ వయస్సులో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో రెండు కాళ్ళను మోకాళ్ళవరకూ దేశానికి ఇచ్చేసి... ఓ సైనికుడిగా గర్వంగా తిరిగిన ఊర్లో, సానుభూతిగా బతకడం ఇష్టంలేక... తల్లిని, భార్యను, పదేళ్ల కొడుకు మహావీర్ సింగ్ ని తీసుకుని మా కాకినాడకు వచ్చేశారు.
కాకినాడకు వచ్చిన మూడేళ్లకు చిన్న కొడుకు ఓంవీర్ సింగ్ పుట్టాడు.
***
మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే మనకు ఉండవలసింది పట్టుదలే అని నిరూపిస్తూ తన భార్య, తల్లితో కలిసి మిఠాయి దుకాణం మొదలుపెట్టారు.
బంగారు రంగులో, బెల్లం పాకంతో... వేడి వేడిగా... కరకరలాడుతూ అమృతానికి సరిజోడులా ఉండే ఆ జిలేబి రుచి గుర్తుకు వస్తే చాలు మా కాకినాడ జనాలు ఆ దుకాణం దగ్గర జేరిపోయేవారు.
***
ప్రతీ ఆగష్టు పదిహేనుకి, జనవరి ఇరవై ఆరుకి తన దుకాణం దగ్గర జండా ఎగురవేసి అక్కడికి వచ్చే జనాలకు ఉచితంగా జిలేబి పంచేవారు.
సినిమా రోడ్డులో ఉండే కోకనాడ అన్నదాన సమాజంలో జరిగే నిత్యాన్నదానానికి ప్రతీ ఆదివారం తన వంతుగా పదికిలోల జిలేజీ ఇచ్చేవారు.
ఆయన గొప్పదనం.... చేతి రుచి రెండూ తెలిసిన మా కాకినాడ జనాలు ఆయన్ని ముద్దుగా జిలేబి సింగోరు అని పిలిచే వాళ్ళు.
***
అప్పుడెప్పుడో మల్లాడి సత్యలింగ నాయకర్ గారు కట్టించిన స్కూల్లో చేరి, బాగా చదివే పెద్ద కొడుకు మహావీర్ సింగుని ఎలాగైనా పూణే దగ్గర ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడిమీలో చేర్చి, మహా వీరుడులా చూడాలి అనుకునే వారు.
మనం అనుకున్నవి అన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. బాగా చదివే మహావీర్ తాను డాక్టర్ కావాలని కోరుకున్నాడు.
తన ఇష్టాన్ని తనలోనే ఉంచేసుకుని మహావీర్ ని అతను చదవాలి అనుకునే మెడిసిన్ లోనే చేర్చారు ధరమ్ వీర్ గారు.
***
అలుపన్నది తెలియని సూర్యుడు ఉదయిస్తూ... అస్తమిస్తూనే ఉన్నాడు. అతనితో కలిసి కాలం పరిగెడుతూనే ఉంది.
***
చదువులో అన్నకు తగ్గ తమ్ముడిగా ఉండేవాడు ఓంవీర్. చిన్నప్పటి నుండి లెక్కల్లో ఎంతో ముందు ఉండేవాడు. ఖాళీ దొరికినప్పుడల్లా కొట్లో ఉండి... అక్కడికి వచ్చే మనుషుల మనసులను చడవడం అలవాటు చేసుకోసాగాడు.
***
ఓరోజు ధరమ్ వీర్ గారి తల్లికి బాగా సుస్తి చేసింది. వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్ళారు. కానీ అక్కడ డాక్టర్లు ఏదో స్ట్రైక్ లో ఉండటంతో సమయానికి సరైన వైద్యం దొరకక ఆవిడ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది.
జరిగిన సంఘటన ఆ తండ్రీ కొడుకుల మీద చాలా ప్రభావాన్నే చూపించింది.
***
మెడిసిన్ ఐన తర్వాత ఆ మిఠాయి దుకాణం దగ్గరే కేవలం ఐదు రూపాయల ఫీజుతో ఆసుపత్రిని మొదలుపెట్టారు మహావీర్ సింగ్. హస్తవాసి అంటారు చూడండి... అది నిజం అన్నట్లు ఎంతటి రోగమైనా సరే ఆయన చెయ్యి పడగానే తగ్గిపోయేది. అసలు ఆయన మన చేయి పట్టుకుంటే చాలు... మన రోగం సగం తగ్గిపోతుంది అనే నమ్మకం కలిగింది మా అందరికీ. నెమ్మదిగా ఆయన్ను మా కాకినాడ జనాలు ఐదు రూపాయల డాక్టరుగోరు అనడం మొదలుపెట్టారు.
తనకు మందుల కంపెనీలు శాంపిల్స్ గా ఇచ్చే మందులనే రోగులకు ఇచ్చేవారు. ఓ పాతిక రూపాయలు ఉంటేచాలు... ఆపరేషన్ కాని, ఎంత పెద్ద రోగానికైనా ఆయనతో వైద్యం చేయించుకోవచ్చు అనుకునేవాళ్ళు మావాళ్ళు.
***
దుకాణం పెట్టిన కొత్తలో రోజుకి పాతిక ముప్పై కిలోలు అమ్మే వ్యాపారం... ప్రస్తుతం రోజుకి మూడు వందల కిలోలకు పైగానే పెరిగింది.
దుకాణం నుంచి వచ్చే లాభాలలో చాలామటుకు ఆసుపత్రి నిర్వహణకే ఖర్చు పెట్టేవారు ఆ కుటుంబం.
***
ఆ రోజు రాత్రి కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తున్న వేళ మహావీర్ గారు తమ్ముడు ఓంవీర్ కూడా తనలాగే డాక్టర్ చదివితే ప్రజలకు ఇంకా సేవ చెయ్యొచ్చు అన్నారు. అది విన్న ధరమ్ వీర్ గారు ఉబ్బితబ్బిబ్బైపోయి చిన్న కొడుకు వైపు చూశారు.
తనకు తినడానికి రొట్టెలు పెడుతున్న అమ్మకు, నమస్కరించి తండ్రి వైపు తిరిగి నేను డాక్టర్ అవ్వాలని అనుకోవడం లేదు అని ఓంవీర్ అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.
అన్నయ్యా మీరు చేస్తున్న సేవ నిరాకాటంగా సాగాలి అంటే మన మిఠాయి దుకాణం కూడా కొనసాగుతూనే ఉండాలి. నేనూ చదువుకోసం దుకాణం వదిలేస్తే... నాన్నగారి తర్వాత మనం ఆ దుకాణాన్ని వదిలేసుకోవాలి. అలా చేస్తే ఇప్పుడు ఆసుపత్రి ద్వారా మీరు చేస్తున్న పనులు ఏమీ చేయలేము. మన ఆసుపత్రి ద్వారా మీరు చేసే సేవ ఎల్లకాలం జరగాలి అంటే... మన మిఠాయి దుకాణం కూడా ఎల్లకాలం నడవాలి. అందుకని నేను మిఠాయి దుకాణం బాధ్యతలు తీసుకుందాం అనుకుంటున్నా అన్నాడు.
చిన్నవాడైనా ఎంతో ముందు చూపుతో అతను చెప్పిన మాటలు వింటూ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.
***
ఆ సంవత్సరం సంక్రాంతికి మా కాకినాడ ముస్తాబు అవుతోంది.
కాకినాడలోని జగన్నాథపురం బ్రిడ్జి దిగి ఎడమచేతి వైపు వెళ్తుంటే వేంకటేశ్వరస్వామి గుడికి ఎదురుకుండా కనబడుతూ ఉండే ఆ మిఠాయి దుకాణం, పక్కనే ఉన్న ఆసుపత్రి కొత్త రంగులు దిద్దుకుంటుంన్నాయి.
ఏ జన్మలోని ఋణానుబంధమో... ఊరు కాని ఊరు వచ్చి ఇక్కడి జనాల కోసం తపనపడే... జిలేబి సింగోరు, ఐదు రూపాయల డాక్టరు గార్ల ఋణం మా కాకినాడ జనాలు ఎప్పటికీ తీర్చుకోలేరు.

గురు శిష్యుల లడాయి!
------------------------------------

పండిత లోకంలో " శిష్యాదిచ్ఛేత్పరాజయం"- అనే ఆభాణకం ప్రచారంలో ఉంది. అంటే  శిష్యుని చేతిలో గురువు పరాజయాన్ని కోరుకుంటాడని. ఉత్తమ గురువు విద్యలో తనకన్నా తన శిష్యుని గొప్పవానిగా, సమున్నతునిగా , చూడగోరుతాడని,
దీనిభావం. శిష్యుడు అల్పుడై యెదిరిస్తేమాత్రం చీల్చి చెండాడుతాడు.

గురువుగా చెళ్ళపిళ్ళవారి పరిస్థితిమాత్రం చిత్రాతి చిత్రమైనది.ఈవిషయంలో ఆయనకన్నా అదృష్టవంతుడూ లేడు, ఆయనకన్నా దురదృష్టవంతుడూ కనిపించడు.

తెలుగు వారికి మాత్రమే స్వంతమైన అవధాన కళకు అత్యద్భుతమైన జనాకర్షణ కలిగించిన జంటకవులు
తిరుపతి వేంకట కవులు వారిలో చెళ్ళపిళ్ళవేంకటశాస్త్రి యొకరు. వారిశిష్యులలో ప్రముఖుడు విశ్వనాథ సత్యనారాయణ. ఆయన తమ గురువుగారిని
గురించి మహోన్నతంగా సంభావిస్తూ యిలాచెప్పుకున్నారు.

" అల నన్నయ్యకు లేదు తిక్రనకు లేదాభోగ మస్మాదృశుం

డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో

హల బ్రాహ్మీమయ మూర్తి శిష్యుడైనాడట్టి దావ్యోమ పే

శల చాంద్రీమృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్;

ఇందులో స్వోత్కర్ష ఉన్నప్పటికీ

. తనవంటి శిష్యుడుండేభాగ్యం నాడు నన్నయకూ, తిక్కనకూ
కలుగలేదు చెళ్ళపిళ్ళ వారికి మాత్రమే దక్కిందంటాడు విశ్వనాధ! ఇలా ఒకవంక తనగొప్పతనం చాటుకుంటూనే గురువుగారి గౌరవాన్ని ఆకాశమంత యెత్తు కుపేంచేశాడు. మాగురువుగారు నన్నయ తిక్కనకన్న గొప్పవాడని సాటుకున్నాడు. అటువంటి శిష్యుడు దొరికితే గురువు కింకేమి కావాలి? అనిపించాడు. ఇది మొదటి కోణం!

ఇక రెండో కోణంతోనే ఉంది సమస్యంతా !

చెళ్ళపిళ్ళ వారికి 'ఓలేటి వేంకట రామ శాస్త్రి' అనే శిష్యుడుండేవాడు. ఎందుకో ఆయనకూ చెళ్ళపిళ్ళ వారికి చెడింది.
"నీవునాగురువువు కానేకాదు పొమ్మన్నాడు ఓలేటి. చెళ్ళపిళ్ళవారికి మండింది. కాదంటే  ఊరుకుంటాడా ? అద్యతనాంధ్రకవిత్వ ప్రపంచ
నిర్మాతగదా! వారికి కోపమొచ్చినా తాపమొచ్చినా 'పద్యాలలోనేకదా! ఒకసీసాన్ని గుప్పించి తనదగ్గర గలసాక్ష్యాలన్నీ యేకరువు పెట్టారిలా పద్యంమాట యెటున్నా చూచేవారికది వినోదంగా మారింది.

సీ: ఇంజరం బొకసాక్షి- యేనాము తా సాక్షి

పల్లె పాలెంబు తానెల్ల సాక్షి!

ఇపుడు నీవున్నట్టి- యీపిఠాపురిసాక్షి

ఏలూరుసాక్షి నీయిల్లు సాక్షి

వల్లూరు నృపతి శ్రీ- భాష్య కారులు సాక్షి

నూజివీడ్రామచంద్రుండు సాక్షి

మంజువాణీప్రెస్సు- మానేజరొక సాక్షి

శంకరుండాతని సాని సాక్షి

తే: మధున పంతుల సూరయ బుధుడు సాక్షి

యయ్యనఘు, నన్నసాక్షి సుబ్బయ్యగారు

సాక్షులున్నారు పద్యంబు చాలదింక

వేంకటేశ్వరు శిష్యుడవే! నిజమ్ము !


చిత్ర మైన విషయమేమిటంటే యీవిషయంలో అటూ ఇటూ మధ్యవర్తు లుండటం. చెళ్ళపిళ్ళవారి తరపున వారి సోదర కవులు దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు ఓలేటిని గట్టిగా మందలించారు.

" వ్యాకరణంబుఁ జెప్పె , నది యంటక పోయిన పోవుగాక , నీ

కీ' కవి'నామ మయ్యనఘుఁడే కద పెట్టిన దంతఁ బోక తా

నే కడ కేగె , నిన్ను గొనియే చనె నచ్చటి , కట్టివాని , సు

శ్లోకు , సభాస్థలిన్విడచి చోరుగతి న్మెలగంగ నేమొకో?

" వేంకటేశ్వరు పాదంబు వీడి పిదప

నెవని సేవించితివి? చెప్పు మింత యేల?

యే విషయమీవు సాధించినావొ పిదప?

వ్రాయుమా వేంకటేశ్వరు పదము లాన !

అంటూ హితవు చెప్పారు. అయినా ఇతరుల దుర్బోధలకు లోగిన ఓలేటి యామాటలను లేక్క సేయలేదు.
వారి మనసు మారలేదు. ఓలేటి వారికి వేదుల రామకృష్ణ శాస్త్రి యను మిత్రుడున్నాడు. అతడే ఓలేటివారికి వెనుక నున్నదన్ను.
" పాఠంచెప్పేవాడు గురువైతే, గుణపాఠం చెప్పేవాడే శిష్యుడనే" వాదాన్ని నమ్మేవ్యక్తి రామకృష్ణశాస్త్రి. చెళ్ళపిళ్ళవారికి తమకు మధ్యగల వైరానికి ఓలేటినొక అస్త్రంలా వాడుకోదలచారు. అందుకే ఓలేటివారి పక్షాన చెళ్ళపిళ్ళపై వారోపద్యాస్త్రాన్ని సంధించారు.

" ఎట్టొ చదివితి మూనాళ్ళ పట్ట పగలు,

పట్టుమని రెండు ముక్కలు పలుక కున్న,

తిరుగడిక నెన్ని చెప్పిన గురుడ ననుచు,

తగులు కొన్నాడు , నిన్ను 'సైతాను' లాగు;

"- అనేశాడు.చూశారా ! యెంత నీచంగా వ్రాశాడో! చెళ్ళఫిళ్ళవారిగురించి ఇంతనీచంగామాట్లాడినా

వారిని గురువుగా తానేయొప్పుకున్నాడు.

పాపం చెళ్ళపిళ్ళవారికి శిష్యులతోనేకాదు.గురువుగారు చర్లబ్రహ్మయ్యశాస్త్రిగారితో గూడా గొడవ తప్పలేదు. ఒకసారి గురువుగారిమీద ఒళ్ళుమండి"గురుడైనన్ హరుడైననేమి?"- అంటూ పద్యంచెప్పారట! కొంతకాలానికి అదే తనకూప్రాప్తించింది. ఆయన శిష్యుడు ఓలేటి గట్టిగానే యిచ్చుకున్నాడు "శ్రుత పాండిత్యము దక్క లేనిగురుడు"- అంటూ చెళ్ళపిళ్ళవారిపాండిత్యాన్ని వేళాకోళమాడాడు. చెళ్ళపిళ్ళ యేదో అక్కడాయిక్కడా విని నేర్చుకున్నదే తప్ప డొక్క శుధ్ధిగా చదువుకొన్నవాడు కాదని దాని సారాంశం!

ఏది యేమైనా " వరంవిరోధోపి సమం మహాత్మనామ్" (మహాత్ములతో విరోధంకూడా మంచిదే) అనే' భారవి'
వాక్యం మరువరాదు.

స్వస్తి!
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి