5, అక్టోబర్ 2019, శనివారం

పుణ్యక్షేత్రాలు ***

హాసనాంబ దేవాలయం.

🙏 ఈ దేవత ముందు పెట్టిన అన్నం ఏడాదైనా చెడిపోదు...అందుకే...

భారతదేశం దేవాలయాల నిలయం అన్న విషయం తెలిసిందే. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత.

అయితే ఆ విశిష్టతలకు కారణం మాత్రం ఆ పరమాత్ముడికే తెలుసు.

అందువల్లే అటువంటి విశిష్టతల పై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నా కారణాలు మాత్రం తెలుసుకోలేకపోతున్నారు.

అటు వంటి దేవాలయాలు భారత దేశంలో వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అందులో ఒకటి కర్నాటకలో కూడా ఉంది.

ఈ దేవాలయానికి ఒకటి కాదు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఈ దేవాలయ భక్తులో మాజీ ప్రధానుల నుంచి ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఈ దేవాలయం విశిష్టతలు ఏమిటి?...

దక్షిణ భారత దేశ రాష్ట్రమైన కర్నాటకలో హాసన్ అనే చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణంలోని అమ్మవారి పేరే హాసనాంబ. హాస్యం అంటే నవ్వు అని అర్థం.

ఇక్కడ దేవత సదా నవ్వుతూ ఉంటారు కాబట్టే ఆ దేవతకు హాసనాంబ అన్న పేరు వచ్చిందని చెబుతారు. అంతే కాకుండా తన భక్తులను ఎవరైనా హింసింస్తే అంతే ఉగ్రరూపంగా మారిపోతారు.

అలా మారిపోయన అమ్మవారు భక్తులను హించిసినవారి అంతు చూస్తారని చెబుతారు. అందుకు ఉదాహరణకు హాసనాంబ భక్తులను హాసనాంబ అత్తగారు హింసించేదని చెబుతారు.

దీంతో కోపగించుకొన్న హాసనాంబ ఆమెను బండరాయిగా మారిపోమ్మని శపించింది. ఆ బండరాయిని మనం ఇప్పటికీ హాసనాంబ గర్భాలయంలో చూడవచ్చు.

అంతేకాకుండా ప్రతి ఏడాది ఈ రాయి రూపంలో ఉన్న అత్త ఒక ఇంచు హాసనాంబ అమ్మవారి దగ్గరకు జరుగుతూ ఉంది.

ఇలా ఒక రాయి మరో రాయి వద్దకు ఎలా జరుగుతూ ఉందన్న విషయం పై మాత్రం శాస్త్రవేత్తలు ఇప్పటికీ సమాధానం చెప్పలేక పోతున్నారు.

ఎప్పుడైతే ఆ అత్త రూపంలో ఉన్న రాయి హాసనాంబ అమ్మవారి వద్దకు చేరుతుందో అప్పుడు కలియుగాంతం అవుతుందని నమ్ముతారు. ఇక ఈ దేవాలయం ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు.

అందులోనూ ఏడు రోజులు మాత్రమే దేవాలయంలోని అమ్మవారిని దర్శించు కోవడానికి అనుమతి ఉంటుంది.

ఈ సమయంలో కేవలం కర్నాటక నుంచే కాకుండా భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు.

ఏడు రోజుల తర్వాత ఈ దేవాలయాన్నిమూసివేస్తారు. ఆ సమయంలో నెయ్యితో వెలిగించిన దీపాన్ని హాసనాంబ విగ్రహం ముందు ఉంచుతారు.

అంతే కాకుండా కొన్ని పూలతో పాటు రెండు భస్తాల అన్నాన్ని కూడా అమ్మవారి ముందు పెట్టి ఆలయ గర్భగుడి ద్వారాలను మూసివేస్తారు.

మరలా ఏడాది తర్వాత ఆలయ ద్వారాలను తెరిచినప్పుడు ఆ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. అదే విధంగా పువ్వులు వాడిపోయి ఉండవు.

ఇక ముఖ్యంగా దేవత ముందు పెట్టిన రెండు బస్తాల అన్న కూడా వేడిగా ఉండటమే కాకుండా తినడానికి అనుకూలంగా ఉంటుంది.

దీనిని భక్తులు ప్రసాదంగా తింటారని చెబుతారు. సాధారణంగా దీపావళికి ఏడు రోజుల ముందు ఈ దేవాలయం తలపులను తీస్తారు. దీపావళి రోజున ఆయాలన్ని మూసివేస్తారు.

ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం కనిపించడం లేదు.

ఈ ఆలయంలోపల మనకు తొమ్మిది తలలతో ఉన్న రావణుడు కనిపిస్తాడు. అదే విధంగా సిద్ధేశ్వరస్వామి మనకు లింగ రూపంలో కాకుండా మనిషి రూపంలో కనిపిస్తాడు. ఇవి రెండు చాలా అరుదైన విషయాలు.

బెంగళూరు నుంచి 184 కిలోమీటర్ల దూరంలో ఉన్న హసనాంబ దేవాలయం చేరుకోవడానికి నిత్యం బెంగళూరు నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి.🙏


--((**))--

    శ్రీశైల నల్లమల్ల దట్టమైన అడవిలో వెలసిన స్వయంభూ ఇష్టకామేశ్వరి అమ్మవారు

ఇక్కడ అమ్మవారిని దర్శించి పూజించిన వారికి 41 రోజుల్లో కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం.

కాని అందరూ ఈ అమ్మ వారిని దర్శించలేరు,అమ్మ ఆనతి ఉండి ఆమె తన వద్దకు పిలుపించుకుంటుందని ఆమె అనుగ్రహం లేనిదే అమ్మవారు ఉన్న ప్రాంతం చేరుకోలేరు

పార్వతీ పరమేశ్వరులలో ఉన్నటువంటి అమ్మవారి తత్త్వానికి కామేశ్వరి అని పేరు.

చాలా కాలం క్రితం శ్రీశైల నల్లమల్ల దట్టమైన అడవులలోకి చెంచులు తేనే,చింతపండు వంటి వాటి సేకరణ కు అడవిలో తిరుగుతుండగా అద్బుతమైన ఇష్టకామేశ్వరి అమ్మవారి విగ్రహం దర్శనంఅయ్యింది,
అమ్మను భక్తితో కొలిచి, వారు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి పూజలు జరిపారని, అప్పడి నుండి ఇప్పటికీ వారి సంతతి వారే ఆలయ అర్చకులుగా వ్యవహరి‌అస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

ఇక్కడ వెలసిన అమ్మవారు చతుర్భుజి.

అమ్మ నాలుగు చేతులతో ఉంటుంది.

రెండు చేతులతో లక్ష్మీ దేవి ఎలా తామరమొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకొని ఉంటుంది.

ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకొని యోగినీ స్వరూపంలో ఉంటుంది.

ఎంత గొప్ప కోర్కె తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అయిపోతోంది అనుకున్న వాళ్ళు కూడా శ్రీశైలం అడవుల్లో తపస్సు చేస్తే కోరిక ఫలించి స్వామివారు కరుణిస్తారు అని పురాణ కాలం నుండి పురాణ గాధలు ఉన్నాయి. ఈ మహిమ కేవలం ఉత్తరభారతదేశంలో కాశీ పట్టణానికి ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం మీద శ్రీశైల క్షేత్రానికి మాత్రమే ఉంది ఇలాంటి పుణ్యస్థలి శ్రీశైలానికి 20 కిలోమీటర్ల దూరంలో అడవుల్లో వెలసీన ఇష్ట కామేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే కోరిన కోర్కెలు తీర్చుతుందని భక్తులు చెపుతుంటారు

అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పురాతన గణేష్ విగ్రహం సందర్శించవచ్చు,ఇప్పటికి ఈ ప్రాంతంలో కొందరూ సాధువులు ఇక్కడే ఉంటూ అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు

పచ్చని అడవి,పక్షుల కిలకిల రావాలు,మధ్యలో వాగులు,వంకలతో అద్బుతంగా ఈ ప్రాంతం కు వెళ్లే మార్గం అతి ఆహ్లాదంగా ఉంటుంది

అమ్మవారిని దర్శించి పూజించిన 41 రోజులకు అనుకున్నవి జరుగుతాయని ఇలా జరిగిన చాలా ఆధారాలు ఉన్నాయని అమ్మను దర్శించిన భక్తులు చాలా మంది చెపుతూఉంటారు,

ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించాలనునే ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు,అమ్మవారి కృప ఉంటేనే ఆమె ఇక్కడ దర్శనానికి రప్పించుకుంటుందని చెపుతారు.అమ్మవారికి ఇక్కడ మనమే నేరుగా అభిషేకం చేయవచ్చు

ఇక్కడ స్పర్శవేది చేత ఒకప్పుడు సిద్ధ నాగార్జునుడు శ్రీశైలం కొండనంతటినీ కూడా బంగారం కొండగా మార్చే ప్రయత్నం చేశాడు. ఆయనే మూలికల మూట తెచ్చి త్రిఫల వృక్షం క్రింద పెట్టాడు. అటువంటి గొప్పగొప్ప ఔషద వృక్షాలు ఈ నల్లమల్ల అడవుల్లోఉన్నాయి శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి.

ఇక్కడ అమ్మవారి రాతి విగ్రహం కు బొట్టు పెడితే నుదురు మనిషి వోలే మెత్తగా మనకు స్పురిస్తుంది అమ్మవారి పక్కనే ప్రక్కనే శివాలయం ఉండేది. కానీ గుప్తనిధుల ఆశలో ధూర్తులు శివలింగాన్ని కూడా పెళ్ళగించేశారు. ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యి ఉంటుంది. ఈ పవిత్ర ప్రాంతంలో కాసేపు కళ్ళుమూసుకొని కూర్చుంటే సెలయేళ్ళ ప్రవాహం చేత ధ్యానమునకు అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది. కాపాలికుల దగ్గరినుంచి సాక్షాత్తు శ్రీ శంకరుల వరకు ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో శైవంలో అన్నిమరో అరుదైన విషయం.

ఈ మాతను దర్శించాలనుకునే వారు వారు సూర్యోదయమయిన తర్వాత జీపులు మాట్లాడుకుని వెళ్తే మంచిది.. స్వంత వాహనాలున్నా సరే .. స్వంత వాహనాలలో వెళ్ళే ధైర్యం అస్సలు చేయకండి..
ప్రస్తుతం ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉన్న ప్రాంత సందర్శనను ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారు కొన్ని భధ్రతా కారణాలు,వన్య ప్రాణుల రక్షణ దృష్ట్యా నిలిపి వేసారు.ఈ మాత దర్శనానికి అనుమతి తప్పని సరి

శ్రీశైలం నుండి దోర్నాల కు వెళ్లే దట్టమైన అడవిలో. ఉన్న ఈ క్షేత్రానికి కొన్ని జీపులు మాత్రం వెళ్తాయి. అది కూడా గుండె దిటవు వున్నవాళ్ళు అయితేనే వెళ్ళగలరు. ఎందుకంటే రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉంటుంది.. అంతా డొంకరోడ్డు(అసలు దానిని రోడ్డు అనేదానికి వీలులేదు) ఆలయం దట్టమైన అడవి మధ్యలో ఉంటుంది.. కొంతదూరం మాత్రమే వాహనాలు వెళ్తాయి,దట్టమైన అడవిలో దాదాపు 5 కిలోమీటర్ల పైనే నడవాలి

అందరికీ ఇష్టకామేశ్వరీ మాత దర్శన ప్రాప్తిరస్తుః...

26 

చిదంబరం లేక చిత్తంబళము - చిదంబర రహస్యం
ఓంశ్రీమాత్రే నమః- అద్వైతచైతన్యజాగృతి

తమిళనాడులోని ద్రావిడ రీతుల్లో నిర్మించబడిన దేవాలయాల్లో చిదంబరం ఒక మణిపూస. చిదంబరం అంటే విజ్ఞానాంబరము అని అర్ధము. దక్షిణ ఆర్కాట్‌లోని చిదంబరంకు ముఖ్యకేంద్రం. 13 హెక్టార్ల చదరంలో పరచుకొని ఉన్న ఈ ఆలయ సమూహము అతి పురాతనమైనదిగా ప్రసిద్ధి. అందులో ప్రళయతాండవం చేస్తున్న పరమశివుని విగ్రహం కలదు చాలా పెద్ధది. నలువైపులా 4 గోపురాలు ఉన్నాయి. ఉత్తర దక్షిణ గోపురాలు 49 మీ. ఎత్తున ఉన్నాయి. మిగతా 2 గోపురాల మీదా తాండవ నృత్యమాడే నటరాజస్వామి శాస్త్రీయ భంగిమలు 108 చెక్కించబడి ఉన్నాయి. ఆలయంలో విశేషంగా చెప్పుకోదగినవి నృత్యమందిరం. ఒక చిత్ర రధాకృతిలో నున్న పెద్ద సభా భవనంలో మధ్య ఒక చిన్న మందిరంలో నటరాజ స్వామి విగ్రహం ఉండి అంతా తానై వెలసి ఉన్న భావం గోచరిస్తుంది. మరొకటి ముఖ్యమైనది వేయి స్థంబాల మంటపం. ఆలయ ప్రాంగణంలోని పార్వతీ దేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలతో పాటు శ్రీ మహావిష్ణువుకు అంకితమైన మరో ఆలయం ఉంది. శివకేశవులకు అభేదత్వమును కల్పిస్తూ శివుని దర్శించడానికి వెళ్ళిన వానికి విష్ణువు, విష్ణువును దర్శించడానికి వెళ్ళినవానికి శివుడు కనపడుతూ సర్వజగత్తుకు భగవంతుడు ఒక్కడే అనే భావం మన మనస్సులో మెదిలేట్టు చేస్తుంది. అసలు చిదంబర రహస్యం అనే నానుడి ఎప్పట్నుంచో వాడుకలో ఉంది. అంతూ, దరి తెలియని విషయాన్ని చిదంబర రహస్యం అనడం పరిపాటి. ఇక్కడ ఈ ఆలయంలో కూడా పంచ లింగాల్లో ఒకటైనటువంటి ఆకాశలింగమును చూడటానికి రుసుం చెల్లించి లోపలికి వెళ్ళినపుడు ఇది మనకి అనువైకవేద్యమవుతుంది. ఆకాశలింగం అంటేనే దీనికి ఆకారం ఉండదు. ఆలయపు గోడలో బంగారు రేకుమీద యంత్రంతో బిగించబడి ఉంటుంది. దాని ఎదుట ఒక తెరవేసి ఉంటుంది. లోపలకు వచ్చిన తరువాత ఆ తెర తీసి చూపిస్తారు. అంటే మనకు కనపడనిది చిదంబర రహస్యం అనుకోవాలి. 

ఈ చిదంబరం 907 నుండి 1310 వరకూ చోళరాజుల రాజధాని. వీరచోళరాజ కాలంలో నటరాజ ఆలయం వ్యవస్థీకరించబడినట్లుగా ఉన్నత పాఠాలు చెప్తున్నాయి. వీరచోళరాజు కాలం క్రీ.శ. 927 నుండి 997 వరకు ఆలయ పట్టణం మధ్య నుండి 5 ప్రాకారాలు కలిగి ఉన్నది. మొదటి ప్రాకారంలోనే 4 సింహ ద్వారాల మీద గోపురములు ముందు చెప్పిన 4 గోపురాలు ఇవే. చిదంబరం నటరాజస్వామి వారి ఆలయంలో వేంచేసియున్న శ్రీ నందీశ్వరుని విగ్రహం చాలా పెద్దది ఒకటియున్నది. దాని యెదయందు గంటలు, దానిపై జీను వగయిరాలు చూస్తే రాతితో చెక్కబడినది కాదు సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది. హిందూ దేశాల్లో నంది వాహనాలు అన్నింటిలోకంటే పెద్దది. శివగంగ వేయి స్తంభముల మంటపమునకు పడమటగా అమరి యున్నది కోనేరు. దీనికి సువర్ణ కోనేరు అనే పేరు ఉన్నది. చక్కగా చెక్కిన రాతితో మెట్లున్నవి. పూర్వం ఒకానొకప్పుడు వర్మచక్రుడనే రాజు స్నానం చేస్తే అతన్ని భాదిస్తున్న కుష్ఠురోగం పోయిందని చెప్తారు. ఇంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో చూడదగినది- పెద్ద నెమలి విగ్రహం, స్వామి వారి మయూర వాహనం, వినాయక దేవాలయంలోని వినాయకుని విగ్రహం, హిందూ దేశం మొత్తం మీదనే చాలా పెద్దది అంటారు. శిల్పులు ప్రతి అంగుళంలోనూ చూపిన నిపుణత్వం కౌశల్యము మనకు ఆశ్చర్యము, ఆనందాన్ని కలిగిస్తాయి. చిదంబర నటరాజస్వామి పుండరీ పురంలోని పాండురంగని వలె అనేక మంది భక్తులను, కవులను కాపాడి తనలో ఐక్యం చేసికొన్న భక్తసులభుడు. ఈయన లీలలను తిరువాచకమనే గ్రంధం పేర మణికవచుడు అనే ఆయన వ్రాశాడు. స్వామి అనుగ్రహంతో ఇలా ఎంతో మంది మహాగ్రంధకర్తలు స్వామి అనుగ్రహాన్ని పొంది తరించారు. అనపాయచోరుడు అనే రాజు వైరాగ్యము పొందిన పిదప తన జీవిత శేషాన్ని ఆలయ ప్రాంగణంలోనే నడిపాడు. ఆయన గౌరవార్ధం "జ్ఞానవాసి" అనే చిరు దేవాలయం కూడా ఉంది. ఇంకా చిదంబరంలో చూడదగినవి తిల్లైఅమ్మన్ దేవస్థానము శ్రీరాజ అన్నామలై చిట్టియార్‌ గారి పరిపోషణలో రూపుదిద్ధుకొన్న అణ్ణామలై విశ్వవిద్యాలయము చూడదగినది. చిదంబరంలోని శివాలయంలో ఉన్న తిరుచ్చిత్రకూటము ఒక దివ్యదేశంగా పరిగణించబడు తుంది. శ్రీ గోవింద రాజస్వామి పెరుమాళ్ళు, పుండరీకవల్లీ తాయారు, కుల, తిరుమంగయాళ్‌వార్ల మగయాళ శాస్త్రం వైష్ణవులకు పవిత్రమైన క్షేత్రం.

 .... చిదంబర రహస్యం - కనిపించని మహా దివ్యమంగళ మూర్తి  .... 

 .... ఆకాశం అనంతమైనది .... అలాంటి అనంతమైన  ఆకాశాన్ని వివరించటం .... వర్ణించటం .... అవగాహన చేసుకొవడం కుదరదు .... కానీ ఆ భావనను అనుభవించగలం .... భావించగలం .... ఆ భావనను మనసు భావించి .... అనుభవించి .... అవగాహనకు తెచ్చుకొని .... అనంత ఆనందాన్ని పొంది .... ఆనంద తాండవం   చేయించగల మహాత్యం .... చిదంబరం ఆలయానికి ఉంది .... అయితే ఆ ఆనంద తాండవం భావనను కలిగించే .... దివ్య మంగళ మూర్తి .... అర్ద నారీశ్వరుడు .... మందిరంలొ కొలువై ఉన్నాడు .... కానీ అందరకీ కనిపించడు ఆ ధివ్యమూర్తి .... 

.... దర్శనానికి అడ్డుగా ఓ తెర ఉంటుంది .... పూజారీ పూజ పూర్తీయైన తర్వాత .... ఒక క్షణ కాలం పాటు తెరను తొలగించి .... వేచివున్న భక్తులకు .... దివ్య మంగళ మూర్తి దర్శన భాగ్యం కల్గిస్తారు .... కానీ

లొపల ఉన్న మూర్తి అందరకీ కనబడడు .... అందరి మనసుల్లొ .... ఆనంద తాండవ మృదంగా ద్వనులు మార్మొగుతున్నా .... కొందరు పుణ్యాత్ములకు మాత్రమే .... లొపలి దివ్య మంగళ మూర్తి ....  అసలు దర్శన భాగ్యం కలుగుతుంది .... 

 .... తెర అన్న మాయను తొలగిస్తే గానీ .... అనంత ఆనంద స్వరూపుడైన .... భగవంతుడి దర్శనం కాదని .... మనసును కమ్మిన మాయ తెరలను తొలగించినవారికే .... దర్శనం అవుతుందని వివరిస్తారు .... కానీ ఇంతకీ తెర మాటున నిజంగా ధివ్య మంగళమూర్తి ఉన్నాడా .... లేక శూన్యానికి ప్రతీకగా .... అనంతానందం లొని అనంత శూన్యాన్ని ప్రతిబింబిస్తూ .... లొపల శూన్యంగా ఉందా .... అంటే ఎవరూ ఏమీ చెప్పలేరు .... ఎందుకంటే లొపల ఏముందొ చూడాలంటే .... కళ్లకున్న పొరలు కరగాలి .... కానీ ఏమీ కనబడలేదంటే .... మాయ తెరలు తొలగలేదని ఒప్పుకొవాలి .... అందుకే చిదంబరంలొని .... తెర మాటున "చిదంబర రహస్యం" ఇప్పటికి పదిలంగా దాగి ఉన్నది .... ఇది చిదంబర రహస్యం .... 

 .... ఓం నమః శివాయ .... 

చిదంబర రహస్యం అంటే ఏమిటి.

పృధ్వి, అగ్ని, వాయువు, తేజస్సు , ఆకాశ లింగాలను పంచభూతలింగాలు అని అంటాము. వాటిలో ఆకాశలింగం చిదంబరంలో ఉంది. ఈ దేవాలయంలో లింగం వెనుక ఒక పరదా కట్టి ఉంటుంది. ఆ వెనుక ఏమీ ఉండదు. అంతా ఖాళీ. ఆకాశం అనంతంగా ఉన్నా అంతా ఖాళీగా ఉంటుంది. అలాగే, ఈ పరదా వెనుక ఏమీ ఉండకపోయినా పరదా కడతారు. అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని , అసలు తెలియకుండా దాచి పెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అనటం పరిపాటి అయింది.
దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా తానే దైవత్వంతో ఉట్టి పడుతున్న ప్రధాన పూజారి (శివోహంభవ – శివ – భగవంతుడు, అహం – నేను/మేము, భవ – మన స్థితి) తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచి పెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియ జెప్పే ప్రక్రియ. అందువల్ల చిదంబర రహస్యం ఏమిటంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు భగవంతుడిని తన (భక్త్తుడి) అజ్ఞానాన్ని తొలగించనిచ్చి ఆయనను దర్శించుకుని ఆయన ఉనికిని, ముక్తిని అనుభవించగలడు. మన తిరుపతికి దగ్గరలో శ్రీ కాళహస్తి ఉంది కదా, అక్కడ ఉండే లింగమే వాయు లింగం. మనం చిన్నప్పుడు సాలెపురుగు, పాము, ఏనుగు వారికి తోచిన విధంగా శివునికి పూజలు చేసి మోక్షం సంపాదించాయి అనే కథ విన్నాం కదా, ఆ క్షేత్రమే ఈ శ్రీకాళహస్తి . ఇక్కడి స్వామి పేరు కాలహస్తీస్వరుడు, అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ.
రెండవది జలలింగం. ఈ లింగం కింద ఎప్పుడూ నీటి ఊట ఉంటుంది. ఇది తమిళనాడు లోని తిరుచిరాపల్లి సమీపంలోని జంబూకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఇక్కడి స్వామివారి పేరు జమ్బూకేశ్వరుడు, అమ్మవారు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్న పరమేశ్వరుడు దాని నివారణ కోసం జంబూక వృక్షం కింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జమ్బూకేశ్వరుడు అని పేరు వచ్చింది.
మూడవది తేజోలింగం. ఇది తమిళనాడు లోని అరుణాచల (తిరువన్నామలై ) క్షేత్రంలో ఉంది. అరుణాచలం శిఖరాగ్రం పై అగ్ని శిఖ ఒకటి ఆవిర్భవించి, తేజోలింగ రూపుడయ్యాడు. ఇక్కడి శివుని పేరు అరుణాచలేశ్వరుడు, అమ్మవారు అబిదకుచాంబ లేదా ఉన్నమలై అంబ / ఉన్నమలై నాయగి . ఇక పృథ్విలింగం సంగతేంటంటే ఇది మట్టిలింగం. ఇది తమిళనాడులోని కంచి క్షేత్రంలో ఉంది. ఈ లింగం పార్వతీదేవిచే ప్రతిష్టింపబడింది. ఇక్కడ ఏకాంబరేశ్వరుడు, కామాక్షీదేవి కొలువై ఉన్నారు. ఈ కామాక్షి అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఆఖరిది ఆకాశలింగం. ఇది తమిళనాడులోని చిదంబరం అనే క్షేత్రంలో ఉంది. ఈ ఆకాశలింగ దర్శనం చాలా రహస్యమైనది. ఆకాశం లాగా శూన్యంగా కనిపిస్తుంది. అస్సలు లింగ దర్శనమే ఉండదు. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. (అందుకే చిదంబర రహస్యం అని అంటారు) మరి అంతటి రహస్యమైన ఈ ఆకాశలింగాన్ని దర్శించాలంటే మనం ఎంతటి తపోనిష్ఠులం అవ్వాలో కదా. ఎంతో సాధన చేయాలి. జీవిత కాలంలో ఒక సారయినా చూడ వలసిన ప్రదేశం చిదంబరం...

 చిదంబర క్షేత్ర దర్శన ప్రాప్తిరస్తు.......

🕉చిదంబర రహస్యం🕉

ఓ " చిదంబర రహస్యం " అంటారు చాలా మంది.

*ఇంతకి...ఆ చిదంబర రహస్యం..అంటే

                  (చిదంబర ఆలయం ఒక అద్భుతం )

తమిళనాడులోని చిదంబరంలో గొప్ప దేవాలయం ఉందనీ ,  అక్కడున్న నటరాజ విగ్రహం పంచ ప్రసిద్ధమైనదని మనలో చాలా మందికి తెలుసు.

🕉🌞🌎🌙🌟🚩

చిదంబరం లో ఉన్న నటరాజ విగ్రహం యొక్క కాలి బొటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల 
పరిశోధన అనంతరం పాశ్చాత్య సైంటిస్టులు తేల్చి చెప్పేశారు .

●●●

ఈ విషయాన్ని తన గ్రంధం " తిరుమందిరం " లో ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమూలర్ చెప్పారు.
◆◆◆

ఇపుడు ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం !

ఈ ఆలయం ప్రపంచ అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది.

" పంచ భూతాలు అని మనం చెప్పుకునే భూమి , ఆకాశమూ , వాయువూ , నీరు , అగ్ని లలో చిదంబరం ఆకాశానికి ప్రతీక అనీ , కాళహస్తి వాయువుకు ప్రతీక అనీ , కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వి ( భూమికి ) కి
ప్రతీక అనీ అంటారు .

అయితే ఇక్కడ విచిత్రమైన అద్భుతం ఏమిటంటే.......!

ఈ మూడు దేవాలయాలూ ఒకే రేఖాంశం మీద ఉన్నాయి . 
అవునండీ ! అవును ..... 79డిగ్రీల 41 నిముషాల రేఖాశం మీద ఉన్నాయి . 
ఇది ఆశ్చర్యం కదూ !

చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి . మానవుడికి నవ ( 9 ) రంధ్రాలు ఉంటాయి

చిదంబరం దేవాలయంలో పైన 21600 బంగారపు రేకులు తాపడం చేశారు . మానవుడు రోజుకు 21600 సార్లు గాలి పీలుస్తాడు . ( 15 x 60x 24 = 21600 )

ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72000 బంగారపు మేకులు వాడారు . మన శరీరం లో ఉండే నాడులు 72000 అని ఆయుర్వేదం చెబుతుంది .

దేవాలయం లో " పొన్నాంబళం " కొంచెం ఎడమవైపుకు ఉంటుంది . అది మన హృదయ స్థానం . అక్కడకి వెళ్ళడానికి " పంచాక్షర పడి " ఎక్కాలి . 
అది న + మ + శి + వ + య . పంచాక్షరి ని సూచిస్తుంది.

" కనక సభ " లో 4 స్తంబాలు 4 వేదాలకు ప్రతీకలు 

పొన్నాంబళం లో 28 స్థంబాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు - శివారాధనా పద్ధతులు . ఇవి 64 ఇంటూ 64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి. 64 కళలు ఉన్నాయని రుజువు ఇది . అంతే కాదు అడ్డు దూలాలు రక్త ప్రసరణ నాళాలు 

9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు . 
అర్ధ మంటపం లోని 6 స్తంబాలూ 6 శాస్త్రాలకు ప్రతీకలు .
ప్రక్కన ఉన్న మంటపం లోని 18 స్తంబాలూ 18 పురాణాలకి ప్రతీకలు 

నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్ట్ లు కాస్మిక్ డాన్సు అని వర్ణించారు . 
మూలవర్ చెప్పిన ఈ విషయాలు శాస్త్ర సమ్మతాలని నిరూపించడానికి పాశ్చాత్య పరిశోధకులకు 8 సంవత్సరాలు పట్టింది.

ఓం నమ శివాయః

పంచభూతలింగాలు 

పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.

1. పృథ్విలింగం:
ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.

2. ఆకాశలింగం:
ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.

3. జలలింగం:-
ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.

4. తేజోలింగం:
తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.

5. వాయులింగం:
ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు . సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.

--((**))-
25. ఈ రోజు మనము "వరాహ లక్ష్మీనరసింహస్వామి " దేవస్థానం, సింహాచలం ,... గురించి తెలుసు కొంధాము,.
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉన్నది.
ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ద తదియ నాడు (మే నెలలో) వస్తుంది.

స్థలపురాణం,.....
సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్ధం వరకు కనిపిస్తున్నది. కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తి గా వెలశాడు. ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాల ప్రయత్నించి కూడా కుమారుని విష్ణు విముఖుణ్ణి చెయ్యలేకపోతాడు. చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారీ ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిన హిరణ్యకశిపుడు 'విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏడీ ఈ స్థంభంలో ఉన్నాడా? చూపించు'మని స్థంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొనివచ్చి, హిరణ్యకశిపుని సంహరించి, ప్రహ్లాదుడిని రక్షించాడు.

స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన[యాదవుడు] పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి భూమిలో కప్పబడి ఉన్న నరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే టట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు నరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించడుతోంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి ప్రతీరోజు చందనం తో పూత పూస్తుంటారు. నరుడు మరియు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్ర లో (ఆసనంలో) సింహము తల కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది.

జనశ్రుతి (బౌద్ధ క్షేత్రం),...
ఒక అభిప్రాయం ప్రకారం సింహాచలం ఒకప్పుడు బౌద్ధ క్షేత్రం. ఈ క్షేత్రం లో బౌద్ధులు వజ్రాయని (తార) అనే దేవత ని పూజించేవారు. వైదిక మతం ప్రాబల్యం పొందిన తరువాత బ్రాహ్మణాలు దీనిని హిందూ దేవాలయంగా మార్చివేసారు. ఇక్కడ విగ్రహం నరసింహ రూపం లో వుండదు , అందుకే సంవత్సరం పొడుగునా విగ్రహాని చందనం లో కప్పివుంచుతారు. ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ శుద్ధ తదియ (వైశాఖ పూర్ణిమ కు దగ్గరలో) నాటికి చందనం తీసివేసి నిజరూప దర్శనం ఇస్తారు. ఇది బౌద్ధ క్షేత్రం అనటానికి మరో ప్రభల సాక్ష్యం. వైశాఖ పూర్ణిమ బౌద్ధాల పండగ అ రోజు గౌతమడు తనకి జ్ఞానోదయం అయన తర్వాత మొదట సారి గా 5 గురుకి తను తెలుసుకొన్న సత్యం చెప్పుతాడు .దీనినే ధర్మచక్ర పరివర్తనం అంటారు .బుద్ధుడు మొదటసారిగా గురువు గా మారి భోదించాడు కాబట్టి (అ రోజు పౌర్ణిమ) గురుపౌర్ణిమ (బుద్ధపౌర్ణిమ) అన్నారు.బౌద్ధాల ఆచారం ప్రకారం పవిత్ర స్టలాలు చుట్టు తిరగడం ఆచారం . గురుపౌర్ణిమ రోజు సింహాచలం కొండ చుట్టు భక్తులు ఈ రోజు కి తిరుగుతారు . మన హిందూ సాంప్రదాయ ప్రకారం చూసిన గురుపౌర్ణిమ కి నరసింహ స్వామి కి ఎటువంటి సంబధం లేదు .
ఆలయాన్ని సందర్శించిన ప్రముఖులు - వారు సమర్పించిన కానుకలు,..

విశిష్టాద్వైతము నకు ఆద్యుడైన శ్రీ రామానుజస్వామి ఇక్కడ ఉండే పురాతన 
శివలింగాన్ని వరాహ నరసింహుని రూపముగా (ప్రస్తుతం గర్భగుడిలో ఉండే విగ్రహం) మార్చారని ఇక్కడి పరిసర ప్రాంతాల ప్రజలు చెబుతుంటారు. ఇది కామదహన ఉత్సవాన్ని (మన్మథుడిని శివుడు తన మూడో కంటితో భస్మం చేసిన సందర్భం) తెలియజేస్తుంది.

క్రీ.శ.1098 నాటి చోళరాజు కులోత్తుంగ చోళుడు వేయించిన శాసనం ద్వారా ఈ ఆలయ నిర్మాణంలో ఆయన పాత్ర ఉన్నట్టు విశదమవుతుంది. మరికొన్ని శాసనముల ద్వారా ఈ ఆలయ నిర్మాణంలో 11వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు, 13వ శతాబ్దంలో తూర్పు గంగా సామ్రాజ్యాధిపతి మొదటి నరసింహుడు పాలు పంచుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఆలయ ప్రాంతంలోనున్న దాదాపు 252 శాసనాలు సింహాచలం ప్రాముఖ్యతను వివరిస్తున్నాయి.
శ్రీ కృష్ణదేవరాయలు గజపతి ప్రతాప రుద్రుడుని ఓడించిన తర్వాత సింహాచల పుణ్యక్షేత్రాన్ని రెండు సార్లు (క్రీ.శ.1516 మరియు క్రీ.శ.1519లో) దర్శించుకుని స్వామివారి సేవల కోసం కొన్ని గ్రామాలను ఏర్పాటు చేసాడు. స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణములను సమర్పించాడు. ఇప్పటికీ ఒక పచ్చల హారం ఆలయంలో ఉంది.
14-15 శతాబ్దములలో [1428] కళింగ దిగ్విజయ యాత్ర ముగించుకొని, సింహాద్రి నాథుని దర్శించి నిర్మించిన శ్రీ కృష్ణదేవరాయల విజయ ధ్వజము శిలా శాసనము కలదు. ఇదేకాక, క్షేత్ర పరిసరాలలో క్రీ.శ.1098 తరువాత చెక్కిన దాదాపు ఐదు వందల శిలా శాసనాలు కలవు.

గత రెండు శతాబ్దాలుగా విజయనగర రాజుల కుటుంబ సభ్యులు ఈ ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు.
ఆలయ విశేషాలు,.

సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖముగా కాకుండా, పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారము ఐశ్వర్యమును ప్రసాదిస్తే, పడమర ముఖద్వారము విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం. కొండ మీద నుండి గాలి గోపురము మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 30 మెట్లు ఉంటాయి.
కప్ప స్తంభం,...

దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారములో కప్ప స్తంభం ఉన్నది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం పై ప్రతిష్టితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభమును కౌగిలించుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామి వారికి భక్తులు ఇక్కడే కప్పాలు (కప్పం:పన్ను) చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది.
జల ధారలు,..

సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జలసమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని: గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార లు. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి, దైవదర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకొన్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానంచేసి దైవదర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగములో సహజసిద్ధమైన నీటి సెలయేరు ఉన్నది. స్వామి కల్యాణము తరువాత ఈ ఘట్టంలో స్నానము ఆచరిస్తాడు. ఈ ధారపై యోగ నరసింహ స్వామి విగ్రహం ఉన్నది.

భైరవ వాక,...
సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవ వాక. ఆడివివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉన్నది. ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉన్నది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. 13-16 శతాబ్ధాల మధ్య ఈ ప్రాంతం భైరవపురం గా ప్రాముఖ్యత పొందినది.

వరాహ పుష్కరిణి,...
వరాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద ఆడవివరం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొని వచ్చి నౌకావిహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉన్నది.

మాధవధార ,...

మాధవస్వామి దేవాలయం ఉంది. గిరిప్రదక్షిణం సమయంలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు.

చేరుకొనే విధానము,....
విశాఖపట్టణం వరకు బస్సు, రైలు, విమాన మార్గాలలో రావచ్చును. అక్కడ నుండి సింహాచలం కొండ క్రిందికి (అడవివరం) సుమారు 15 కి.మీ. లోపు దూరం ఉంటుంది. అక్కడికి సిటీబస్సు, ఆటో, టాక్సీలలో చేరవచ్చును. సింహాచలం కొండ క్రింది నుండి పైకి దేవాలయం వరకు మెట్లమీదుగా (సుమారు వెయ్యి మెట్లు) గాని, దేవస్థానంవారి ఘాట్ రోడ్డు మీదుగా దేవస్థానం బస్సులోగాని, టాక్సీలోగాని చేరవచ్చును.,.......
--((***))-

చరిత్ర*
 12 కి.మీ. దూరంలోఉన్న అయినవిల్లి గ్రామంలో వెలపి ఉన్న సిద్ధివినాయకస్వామి గురించి ఆంధ్రదేశంలో తెలియని వారుండరు. ఈ సిద్ధివినాయకుని భక్తిగా తలచుకుని ఏ కార్యం తలపెట్టినా జయప్రదంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ అయినవిల్లి గణపతికి గరిక పూజలన్నా, కొబ్బరికాయ మొక్కులన్నా ఎంతో ఇష్టం. అందుకే ఈ క్షేత్రం గరిక పూజలకు, కొబ్బరికాయ మొక్కులకు పెట్టిన పేరయింది.
ఏటా ఇక్కడకొచ్చే భక్తులు తమ మొక్కుల  స్వామికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటే ఉంటుందంటే నమ్మబుద్ధి కాదు. కానీ ఇది నిజం అని ఈ సిద్ధివినాయకుడు తన కృపాకటాక్షాలతో భక్తుల కోరికలు తీరుస్తూ... ప్రతి సంవత్సరం నిరూపిస్తూనే ఉన్నాడు. స్వయంభువు గణపతి క్షేత్రాలలో ఒకటైన ఈ అయినవిల్లి సిద్ధివినాయక క్షేత్రం కృతయుగం నుంచీ ఇక్కడే ఉన్నట్టుగా స్థలపురాణం చెబుతోంది.
14వ శతాబ్ది కాలంలో శంకరభట్టు సంస్కృతంలో రచించిన ‘శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర’ గ్రంథంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. దీని ప్రకాకం క్రీ.శ. 1320 లో శ్రీపాద శ్రీవల్లభులు జన్మించినట్లు, వారి మాతామహులైన మల్లాది బాపన్నావధానులు అయినవిల్లి క్షేత్రంలో స్వర్ణగణపతి మహాయఙ్ఞం జరిపినట్టు తెలుస్తుంది. ఆ సమయంలో చివరి హోమంలో ఆహుతులను అందుకోవడానికి సాక్షాత్తు ఈ సిద్ధివినాయకుడే స్వర్ణకాంతులతో వచ్చి అందరికీ దర్శనమిచ్చి దీవించాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే శ్రీపాద శ్రీవల్లభులు జన్మించారు.
ఆ కాలంలో ముగ్గురు నాస్తికులు ఈ సిద్ధివినాయకుని అవహేళన చేసిన పాపానికి ప్రతిఫలంగా, ఆ ముగ్గురూ మరుజన్మలో గుడ్డి, మూగ, చెవిటివాళ్ళుగా పుట్టినట్టూ.., వాళ్ళు కాణిపాక స్థలంలో సేద్యం చేస్తూంటే..బావిలో కాణిపాక వినాయకుడు దొరికినట్టు ఈ డ్రంథం చెబుతుంది. దీన్నిబట్టి కాణిపాక వినాయక క్షేత్రం కంటే, అయినవిల్లి
సిద్ధివినాయక క్షేత్రం ప్రాచీనమైందని తెలుస్తోంది.
దక్షప్రజాపతి తన యఙ్ఞ ప్రారంభానికి ముందు ఈ సిద్ధివినాయకుని పూజించాడని స్థానికులు చెబుతారు. అందుకే పూర్వంనుంచీ ఈ స్వామివారంటే భక్తులకు అపారమైన నమ్మకం, గురి. సిద్ధివినాయకస్వామికి ప్రతి నిత్యం రుద్రాభిషేకాలు, అష్టోత్తపుష్పర్చన, పుస్తకపూజ, అన్నప్రాశ్న, అక్షరాభ్యాసాలు, విశేషంగా జరుగుతూంటాయి. ఉభయ చవితి తిథులలోను, దశమి, ఏకాదశి తిథులలోను, పర్వదినాలలోనూ ఈ స్వామికి విశేషపూజలు జరుగుతాయి. సంకటహర చతుర్థినాడు శ్రీ స్వామివారికి ప్రత్యేకంగా గరిక పూజలు చేస్తారు.
వీటితోపాటు సకల ఈతిబాధా నివారణార్థం శ్రీ మహాలక్ష్మీ గణపతి యాగం కూడా చేస్తారు. వినాయకచవితి నవరాత్రి మహోత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి.
వినాయక చవితి
రోజున రకరకాల పండ్లరసాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి పర్వదినాన దేశం లోని సప్త జీవనదుల(గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి) జలాలతో ‘సప్తనదీ జలాభిషేకం’ చేస్తారు.
ఇంతకన్న ముఖ్యమైనది ఏమిటంటే.. ప్రతియేటా విద్యార్థుల కోసం జరిగే వార్షిక పరీక్షల ముందు ఫిబ్రవరి 2,3 వారాలలో దాదాపు లక్ష పెన్నులతో శ్రీ స్వామివారికి అభిషేకం చేసి, వాటిని విద్యార్థులకు ప్రసాదంగా బహూకరించడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ పెన్నులతో పరీక్ష రాస్తే తప్పకుండా మంచి మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తామని విద్యార్థుల విశ్వాసం. విశాల ప్రాంగణం గల ఈ సిద్ధివినాయకస్వామి ఆలయ ప్రాకారంలో...అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరాలయం, శ్రీభూసమేత కేశవస్వామి ఆలయం, ఈశాన్య భాగంలో కాలభైరవస్వామి ఆలయం ఉన్నాయి.
అందుకే ఈ ఆలయం పంచాయతన క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది.మొదట్లో ఈ ఆలయానికి కేశవస్వామి క్షేత్రపాలకుడుగా ఉండేవాడు. అయితే..., తూర్పు చాళుక్యుల కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగినప్పుడు కాలభైరవుడిని క్షేత్రపాలకుడిగా ప్రతిష్ఠించినట్లు చారిత్రక శాసనాలవల్ల తెలుస్తుంది. ఈ సిద్ధివినాయకుని ఘనత నలుదెసలు వ్యాపించడంతో.. ఈ స్వామివారిని దర్శించడానికి ఎందరో రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు కూడా రావడం ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక ఆకర్షణ.
నరసింహస్వామి

ఆంధ్ర దేశం లోని అత్యంత ప్రాచీనమైన నారసింహ క్షేత్రాల్లో మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందిన నవ నారసింహ క్షేత్రం అహోబిలం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి 25 కి.మీ ల దూరంలోను, నంద్యాల నుండి 65 కి.మీ, దూరంలోను నల్లమల అడవుల్లో ప్ర కృతి రామణీయకత మధ్య వెలసిన నరసింహుని దివ్య ధామమిది.

ఎగువ అహోబిల రాజ గోపురం స్థలపురాణం:: ఇందుగల డందు లేడని సందేహము వలదని, హితవు పలికి – చక్రి సర్వోప గతుండని ప్రకటించిన ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిజం చేసి, ఆస్తికత్వాన్ని సజీవంగా ఉంచడానకి, స్ధంభం నుండి ఆవిర్భవించి హిరణ్య కశిపుని మట్టుపెట్టిన ఉగ్ర నరసింహుడు కొలువు దీరిన ప్రదేశమిది. ఇచ్చట హిరణ్యకశిపుని గోళ్ల తోచీల్చి సంహరించిన సమయం లో స్వామిని దర్శించిన ఇంద్రాది దేవతలు —-

“అహోవీర్య అహోశౌర్య అహోబహుపరాక్రమః !
నారసింహ పరః దైవం ఆహోబిలః ఆహోబిలః !!”

అని కీర్తించారట. అప్పటి నుంచి ఈ క్షేత్రం” అహోబలం “అని పిలువబడుతోందని స్ధల పురాణం. ఎగువ అహోబిలం లోని గుహ లో స్వయం భువు గా వెలసిన ఉగ్ర నర సింహు ని ఆరాధించి సాక్షాత్కరింపజేసుకొని దివ్యాను భూతికి లో నైన గరుడుడు స్వామి కొలువు తీరిన గుహను చూసి అహో! బిలం , అన్నాడట. ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రాన్ని అహోబిలమని పిలుస్తున్నారని ఒక ఐతిహ్యం. హిరణ్య కశిపుని సంహరించిన అనంతరం ఇంకా చల్లారని ప్రతాపం తో నరసింహుడు అరణ్యం లో గర్జిస్తూ, క్ష్వేళిస్తూ,పలు ప్రదేశాల్లో సంచరించాడని, అలా సంచరిస్తున్నప్పుడు ఆయన లో విరిసిన వివిధ భావాలకు రూపాలే నవ నారసింహ రూపాలని భావించబడుతోంది.

ఎగువ అహోబిలం స్వామి వారి కళ్యణ మండపం::

వీర రసావతారరూపుడైన తన నాధుని శాంతింప జేయడానికి శ్రీ మహాలక్ష్మి చెంచు లక్ష్మి గా అవతరించి స్వామిని ప్రసన్నుని చేసుకోవడానికి చాల శ్రమించ వలసి వచ్చింది. ఆ సమయం లో ఆ చెంచెతకు స్వామి నవరూపాల్లో దర్శనమిచ్చి, అలరించారని, ఆరూపాలే నవ నారసింహులు గా వెలసి స్వామి ఇప్పుడు భక్తులను అను గ్రహిస్తున్నాడని భక్తులు సంతోష పారవశ్యం తో చెంచులక్ష్మీ నరసింహుల కథలను చెప్పు కుంటుంటారు. జానపద గీతాలు పాడుకుంటుంటారు. ఇచ్చటి గిరిజనులు చెంచెతను మహాలక్ష్మి గా పూజిస్తూ, లక్ష్మీనరసింహ కళ్యాణాన్ని చాల గొప్పగా జరిపిస్తారు.

రాజగోపుర దృశ్యం::

నరసింహుడు హిరణ్యకశిపుని సంహరణానంతరం అరణ్యం లో సంచరిస్తూ భక్తులను అనుగ్రహించడానకే స్వామి నవరూపాల్లో దర్శనమిచ్చాడు. మరొక కథ ను అనుసరించి గరుత్మంతుడు విష్ణువు ను నరసింహ రూపుని గా దర్శన మీయ వేడుకున్నాడు. ఆనాడు గరుడునికి స్వామి సాక్షాత్కరించిన తొమ్మిది రూపాలే నవ నారసింహ రూపాలు. అందుకే ఈ పర్వతాన్ని గరుడాద్రి అని,గరుడాచలం అని, గరుడశైలం అని కూడ పిలుస్తారట.

“జ్వాలాహోబిల మాలోల క్రోండ గరంజ్ భార్గవ !
యోగానంద చత్రవట పావన నవమూర్తయః !!”

జ్వాల, అహోబిల,మాలోల, క్రోడ,కరంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన నార సింహ అను తొమ్మిది రూపాలు గా స్వామి అహోబిలం మీద కొలువు తీరి ఉన్నాడు. ఎగువ అహోబిలం లో ఉగ్రనరసింహుడు కొలువు తీరగా. దిగువ అహోబిలం లో లక్ష్మీనరసింహుడు శాంత మూర్తి యై భక్తులను అనుగ్రహిస్తున్నారు. చుట్టూ 5 కి.మీ పరిధి లో మిగిలిన ఆలయాలను కూడ మనం దర్శించవచ్చు. నవరూపులుగా వెలసిన ఈ దివ్య మూర్తులను దర్శించడం వలన వాని ఫలితాలు కూడ వేరు వేరు గా ఉంటాయని స్థలపురాణం చెపుతోంది. అంటే భక్తులు ఏ ఫలితాన్నికోరుకుంటున్నారో ఆ స్వామి రూపాన్ని ప్రత్యేకంగా ఆరాథించుకొని, సఫలీకృత మనోరధులు కావచ్చు నన్నమాట. ఇది నారసింహ తత్త్వము. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని గురించి కూర్మ పురాణం, పద్మపురాణం, విష్ణుపురాణా లలో ఫ్రస్తావించబడింది. హిరణ్యకశిపుని వృత్తాంతం బ్రహ్మండ పురాణం లో కన్పిస్తుంది.

ఆలయప్రత్యేకత :

శ్రీ భార్గవ నరసింహ స్వామి : దిగువ అహోబిలానికి 2.5 కి మీ దూరం లో కొండపై ఈ స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడే” అక్షయ తీర్థం” ఉంది. ఈ అక్షయ తీర్థంలో స్నానం చేస్తే అనంత సంపదలు ప్రాప్తిస్తాయని ఛెప్పబడుతోంది. పరశు రాముడు ఈ ప్రదేశం లోనే తపస్సు చేశాడు. అందువలన ఈ అక్షయ తీర్థాన్నే”భార్గవ తీర్థమని” కూడ పిలుస్తారు.

శ్రీ యోగానంద నరసింహ స్వామి : వీరు దిగువ అహోబిలానికి తూర్పు దక్షిణం  గా 2 కి.మీ దూరం లో వేంచేసియున్నారు. స్వామి ప్రహ్లాదునకు ఇక్కడ ఎన్నోయోగ శాస్త్ర మెళకువ లను నేర్పారని. అందువలన స్వామి కి ఆపేరు వచ్చిందని చెపుతారు. ఈ ప్రదేశం తపస్సునకు అత్యంత అనువైన ప్రదేశంగా పేరెన్నికగన్నది. కష్టాల్లో ఉన్న భక్తులు ఈ స్వామి ని సేవిస్తే స్వామి కష్టాలను కడతేర్చి, సౌ భాగ్యాన్ని కల్గిస్తాడని ప్రహ్లాదుడు చెప్పాడు.

శ్రీ ఛత్రవట నరసింహస్వామి : ఈ స్వామి దిగువ అహోబిలానికి 3కి.మీ దూరం లో వట వృక్షచ్ఛాయ లో కొలువుతీరి ఉంటాడు. ఈ స్వామిని సేవిస్తే కేతుగ్రహ బాధలు నశిస్తా యని చెపుతారు. లలితకళలను అభ్యసించేవారు ఈ స్వామిని సేవిస్తే సత్ఫలితాలను పొంద గలుగుతారు .

శ్రీ అహోబిల నరసింహస్వామి : నవ నరసింహులలో ఈయన ప్రధాన దైవం. ఈయననే ఉగ్ర నరసింహమని కూడ పిలుస్తారు. ఎగువ అహోబిలం లో చెంచులక్ష్మీ సమేతుడై ఈ స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. శతృభయాలు. గ్రహపీడలు మతిమాంద్యాలు, ఈ స్వామిని సేవించడం వలన పటాపంచలౌతాయి.

శ్రీ వరాహ నరసింహస్వామి: ఎగువ అహోబిలానికి 1 కి .మీ పైన లక్ష్మీ దేవి తో కొలువు తీరి ఉన్నాడు. ఈ స్వామిని సేవిస్తే ఆటంకాలు తొలగి,కార్య సాఫల్యత కల్గుతుంది. ఈయన నే క్రోడ నరసింహ స్వామి అని కూడ పిలుస్తారు.

శ్రీ మాలోల నరసింహస్వామి : ఈస్వామి ఎగువ అహోబిలానికి 2.కి మీ ఎగువున ఉన్నాడు.ఈఆలయం ఉన్న ప్రాంతాన్ని లక్ష్మీపర్వతం గా పిలుస్తారు. మా- అనగా లక్ష్మి మా –లోలుడు అనగా లక్ష్మీప్రియుడు అని అర్థము .ఆయనే లక్ష్మీ సమేత నరసింహుడు. ఈయనను సేవిస్తే ఇహ,పరలోకాలలో సైతం బ్రహ్మానందం లభిస్తుంది.

శ్రీ జ్వాలా నరసింహస్వామి: ఈ స్వామి ఎగువ అహోబిలానికి 4 కి.మీ దూరం లో దర్శన మిస్తాడు. ఈ పర్వతాన్ని “ అచలాచయ మేరు” అని కూడ పిలుస్తారు. హిరణ్యకశిపుని తనవాడియైన గోళ్ల తో చీల్చి, చెండాడిన నరసింహస్వామి ఇక్కడ కన్పిస్తాడు. ఈస్వామిని సేవిస్తే సకల ప్రయత్నాలు సఫలమౌతాయి. పెళ్లిళ్లు కుదురు తాయి. కార్తీకమాసం లో నేతి దీపాన్ని స్వామి సన్నిథి లో వెలిగించి, ఆరాథిస్తే, సమస్త పాపాలు తొలగి, కీర్తిప్రతిష్టలు లబిస్తాయి. మిగిలిన ఎనిమిది ఆలయాల కన్నా ఈ ఆలయాన్ని చేరు కోవడమే మిక్కిలి శ్రమ తో కూడిన పని. ఇక్కడ “రక్తకుండం “అనే అరుణ వర్ణ పుష్కరిణి ఉంది. ఇందులో నీరు ఎల్లప్పుడూ ఎఱ్ఱగానే ఉంటాయి. కారణం నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత రక్తసిక్తమైన తన చేతులను ఈ పుష్కరిణిలోనే కడుక్కున్నాడట. అందువల్ల ఆ నీరు ఎఱ్ఱగా ఉండిపోయింది.

శ్రీ పావన నరసింహస్వామి: ఎగువ అహోబిలానికి 6 కి. దూరం లో పావన నదీతీరాన ఈ స్వామి కొలువు తీరి ఉన్నాడు. నవ ఆల యాల్లో ఈ ప్రదేశం అత్యంత ప్రశాంతమైంది. అందుకే ఈ ప్రదేశాన్ని క్షేత్రరత్నమని పిలుస్తారు. ఈయన కే పాములేటి నరసింహస్వామి అని కూడ పేరు. ఈయనను సేవిస్తే ఈ జన్మలోను, పూర్వజన్మల్లోను తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ తొలగి పోతాయని చెపుతారు. ఈస్వామి భక్తులు ఇచ్చిన నివేదనను ఖచ్చితంగా సగం స్వీకరించి మిగతా సగం ప్రసాదంగా ఇచ్చివేస్తాడని ప్రతీతి.

శ్రీ కరంజ నరసింహస్వామి : ఎగువ అహోబిలానికి 1 కి మీ దూరం లో ఈస్వామి కొలువై ఉన్నాడు. కరంజ వృక్షం క్రింద కొలువు తీరిన స్వామి కాబట్టి ఈయన కరంజ నరసింహస్వామి అయ్యారు. ఈ స్వామిని మనసా వాచా కర్మణా త్రికరణ శుధ్ధి గా సేవిస్తే జీవితం లో అభివృధ్ధి ని సాధిస్తారని, కోరిన కోరికలన్నీ తీరుతాయని చెపుతారు

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి: ఈ తొమ్మిది రూపాలు కాక దిగువ అహోబిలం లో ప్రహ్లాదవరదుడైన లక్ష్మీనరసింహుడు శాంతరూపుడై, భక్తులను రక్షిస్తున్నాడు . ఇది మూడు ప్రాకారాలు కలిగిన దివ్యాలయము. శ్రీరాజ్యలక్ష్మీ దేవి, శ్రీఆండాళ్. ఆళ్వారుల సన్నిథి కూడ ఉపాలయాలు గా మనకు దర్శనమిస్తాయి. నవ గ్రహాలకు ఈ నవ నారసింహ రూపాలకు గల సంబంధాన్ని కూడ భక్తులు విశ్లేషించుకుంటున్నారు.

చారిత్రకప్రాధాన్యం :

దిగువ అహోబిలం లోని శ్రీ లక్ష్మీనృసింహ ఆలయ మంతా విజయనగర శిల్ప  సంప్రదాయం తో అలరారుతుంటుంది. ముఖ మండపం , రంగ మండపాలు చిత్ర విచిత్ర శిల్పాకృతులతో నయన మనోహరంగా కన్పిస్తాయి. ఎక్కువ స్థంభాలమీద చెంచులక్ష్మీ నరసింహుల విలాసాలు మనకు కన్పిస్తాయి. పట్టాభి రాముడు, దశావతారాలు ,వివిథ దేవతాకృతులు, నర్తకీమణుల నాట్యభంగిమలు ఆలయమండప స్థంభాలపై కొలువుతీరి కనువిందు చేస్తాయి.

ఈ శిల్పాకృతు లను చూస్తుంటే అహోబలం ! అహోబిలం!! అనడమేకాదు అహోశిల్పం !!! అనాలనిపిస్తుంది. ఆలయానికి బైట కూడ చాలా మండపాలు మనకు కన్పిస్తాయి. ప్రథాన ఆలయానికి వెలుపల విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు దిగ్విజయ యాత్రా చిహ్నం గా వేయించిన జయస్థంభాన్ని మనం గర్వం గా దర్శించవచ్చు . కాకతి శ్రీ ప్రతాపరుద్ర చక్రవర్తి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు నిధులిచ్చినట్లు, మాలోల నరసింహు నకు బంగారు ఉత్సవిగ్రహాన్ని బహూకరించినట్లు చెప్పబడుతోంది. కాలజ్ఞానవేత్త శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు ఈ ఆలయం లో కూడ కూర్చొని కాలజ్ఞానం వ్రాసినట్లు చెపుతారు. సంకీర్తనాచార్య శ్రీ అన్నమయ్య స్వామి సన్నిధి లో ఎన్నో కీర్తనలను ఆలాపించి, స్వామికి సమర్పించాడు.

తిరుమల శ్రీ శ్రీనివాసుడు పద్మావతీ దేవి తో తన కళ్యాణానికి ముందు లక్ష్మీనరసింహుని ఆశీస్సుల కోసం అహోబిలం వచ్చినట్లు ఒక ఐతిహ్యం. ఎగువ అహోబిలం లో స్వామి ఉగ్రరూపుడై ఉండటం తో దిగువ అహోబిలం లో ప్రహ్లాద వరదుడైన లక్ష్మీనరసింహుని శాంతమూర్తి గా ఆయనే ప్రతిష్టించినట్లు చెపుతారు. దీనికి సాక్ష్యంగా ప్రధాన ఆలయానికి దక్షిణం గా శ్రీ వేంకటేశ్వరాలయం మనకు దర్శనమిస్తుంది.

ఉగ్ర స్థంభం : ఎగువ అహోబిలానికి ఎగువన 8.కిమీ దూరం లో ఈ ఉగ్రస్థంభం  ఉంది. దీనినుండే నృసింహ ఆవిర్భావం జరిగి హిరణ్యకశిపుని సంహరించాడని చెపుతారు. దీనిదర్శనం ,స్పర్శనం సర్వపాపహరమని భక్తుల నమ్మకం. ఈ ఉగ్రస్థంభమే ప్రజల వాడుక లో కెక్కి ఉక్కు స్థంభమై పోయింది. స్థంభోద్భవ నారసింహుని భక్తులు దీనిలో దర్శిస్తారు.

“ఉగ్ర వీరః మహావిష్ణు జ్వాలంతం సర్వతోముఖః !
నృసింహః భీషణఃభద్రంమృత్యుమృత్యః నమామ్యహః !!”

అని ఉగ్రనరసింహునికి చేతులెత్తి జోతలు సమర్పిస్తారు

ప్రహ్లాదమెట్టు: ఎగువ అహోబిలానికి ,ఉగ్రస్థంభానికి మధ్య లోని ఒక గుహ లో ప్రహ్లాదుని రూపం దర్శన మిస్తుంది. ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక అని భక్తగ్రణ్యుడుగా కొని యాడబడు తున్న ప్రహ్లాదుని సేవించడం సకల కల్మష హరం గా భక్తులు భావిస్తారు.

అహోబిలమఠం: ఆథ్యాత్మిక వికాసం కోసం ,వైష్ణవ సంప్రదాయ పరిరక్షణ కోసం, ప్రాచీన మంత్రశాస్త్ర సముద్ధరణ కోసం ఇచ్చట శ్రీ వైష్ణవ సంప్రదాయజ్ఞులచే ఒకమఠం స్థాపించ బడింది. ఈ మఠాథిపతుల్ని జియ్యరులంటారు. ఈ మఠం చాల పురాతనమైంది. క్రీ.శ 1319 లో కేశవాచార్యులకు ఒక కుమారుడు జన్మించాడు.అతనే శ్రీనివాసాచార్యులు. ఇతను ప్రహ్లాదునివలెనే, పసితనము నుండి శ్రీహరి ధ్యానమే చేస్తుండేవాడు. ఈయన పుట్టిన ఊరు తిరునారాయణ పురం. ఈ బాలుని భక్తికి ముగ్ధుడైన స్వామి అతనికి ప్రత్యక్షమై, అహోబిలానికి రమ్మని ఆదేశించాడు.అహోబిలం చేరిన ఆ బాలుని భక్తి ప్రపత్తులను ,దీక్షా దక్షతను చూసి సంతోషించిన ఆనాటి అధికారి ముకుందరాయలు ఆ బాలుని శిష్యుని గా స్వీకరించాడు.

ఈ బాలుని కి సాక్షాత్తు స్వామియే యోగిరూపం లో వచ్చి,అష్టాక్షరీ మంత్రాన్ని బోధించారు. శిష్యుని గా స్వీకరించారు. ఆనాటి నుండి జియ్యరులు శఠగోపయతి గా ప్రసిద్ధులయ్యారు. వీరి ఆధ్వర్యం లో వివిధ సేవా,అభివృద్ధి మత ప్రచార ,సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రపంచ వ్వాప్తం గా ఈ మఠానికి పేరు ప్రఖ్యాతులున్నాయి.

ప్రత్యేక ఉత్సవాలు: ప్రతిసంవత్సరం ఫాల్గుమ మాసం లో బ్రహ్మోత్సవాలు, ప్రతినెల స్వాతి నక్షత్ర పర్వదినాన 108 కలశాల తో తిరుమంజన సేవ,గ్రామోత్సవం జరుగుతాయి. ఈ రోజుల్లో వేలాది మంది భక్తులు ఈ వేడుకలకు హాజరై, స్వామిని సేవించుకుంటారు. నృసింహ జయంతి ఇచ్చట జరుగు గొప్పఉత్సవం గా పేర్కోనవచ్చు.

ఇచ్చటి గిరిజనులు ఛెంచులక్ష్మిని తమ ఆడపడుచు గా భావించి చెంచులక్ష్మీ నరసింహుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో వారి సంప్రదాయాలే కొనసాగటం చూడముచ్చట గా ఉంటుంది


హోబిలం నరసింహస్వామి 
ఆంధ్ర దేశం లోని అత్యంత ప్రాచీనమైన నారసింహ క్షేత్రాల్లో మిక్కిలి ప్రాచుర్యాన్ని ...
--((***))--

. 22💐 💐శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయం💐💐
శ్రీకాకుళం పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో అరసవల్లి శ్రీ ఉషాపద్మినీ ఛాయా సమేత శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయం ఉంది. శ్రీమన్నారాయణుని నేత్రాలనుండి సూర్యుడు పుట్టినందువల్లనే, సూర్య నారాయణుడంటున్నాం! సృష్ట్యాది నుండి పూజలందుకొంటున్న స్వామియే సూర్య భగవానుడు. యుగ యుగాల్లో స్వామి నారాధిస్తున్నా, ద్వాపరయుగంలోనే అరసవిల్లిలో ప్రతిష్టింపబడింది అని పెద్దలంటున్నారు. అంటే 5వేల సంవత్సరాల క్రితమే, ఈ సూర్యాలయం అరసవిల్లిలో దేవేంద్రుడు నిర్మించినట్లు స్థలపురాణం చెబుతుంది.భారతదేశంలోనే అరసవల్లి ఏకైక సూర్య దేవాలయంగా ప్రసిద్ది చెందింది. ప్రత్యక్ష కర్మ సాక్షి సూర్య భగవానుడే. ఇప్పటికీ పొద్దు చూస్తేకాని ముద్ద కూడా ముట్టని వాళ్ళున్నారు.యావద్విశ్వానికి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణుడే! సూర్యుడే ఆరోగ్యప్రదాతగా విలసిల్లడం ప్రత్యేకత, ఆరోగ్యసంపద కన్నా ఏది గొప్పది కాదు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆ భగవానుడు – దేవేంద్రుని స్తుతులకు పొంగి, దర్శనమిచ్చినందునే , మహేంద్రుడెంతగానో సంతోషం చెందిన ప్రదేశం కనుక, “హర్షవల్లి” – గా ప్రసిద్ది చెందిందని అంటారు. కాలక్రమేణా నాటి “హర్షవల్లి అరసవల్లిగా రూపాంతరం చెంది, తెలుగు ప్రజలతోనే కాదు, యావద్భారతీయుల పూజలందుకొంటోంది.
అరసవల్లి సూర్య ఆలయానికి ప్రసిద్ధమైన గాథ పురాణాల్లో ఉంది.

ద్వాపరయుగంలో బలరాముడు, తీర్థయాత్రలకు బయలుదేరాడు. కళింగ దేశం వచ్చేటప్పటికి, ఆప్రాంతమంతా కరువు కాటకాలతో అలమటిస్తోంది. బలరాముడుని దర్శించిన, ఆ ప్రాంతీయులంతా, ఆయన పాదాలపైపడి, ఈ దుర్భరస్థితి నుండి రక్షించమని ప్రార్ధించారు. వారి దీనాలాపాలు విని కరిగిపోయిన బలరాముడు, తన నాగలితో భూమిని గ్రుచ్చి నీటి బుగ్గను పైకి రప్పించి, ప్రవాహాన్ని కల్పించాడు. అదే నాగా వళీ నదీ. ఆ నదీతీరంలో పంచలింగ ప్రతిష్ఠ చేయాలనుకొన్న బలరాముడు, రుద్ర కోటీశ్వరాలయ స్థాపనకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. దేవతలను అహ్వానించి, ఆలయ గోపురము ప్రతిష్ట పూర్తి చేశాడు. వేళకు అందరూ వచ్చారు కాని, దేవేంద్రుడు రాలేకపోయాడు. చాలా ఆలస్యమైంది. రాత్రివేళకు వచ్చిన దేవేంద్రుడుకు కోటీశ్వరుని దర్శనం లభించలేదు. నందీశ్వరుడు, దేవేంద్రుని అడ్డగించటంతో, దేవేంద్రుడుకి కోపం వచ్చింది. దాంతో వజ్రాయుధం ఎత్తాడు. నందీశ్వరుడు, వజ్రాయుధన్నీ, ఇంద్రుని తన కొమ్ములతో విసరిపారేశాడు. దేవేంద్రుడు అరసవల్లి సమీపంలో స్పృహతప్పి పడ్డాడు. కొంతసేపటికి తేరుకొని, సూర్యదేవుని స్తుతించాడు. ఆతడు దర్శనమిచ్చి, నా విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించి, ఆరాధించు అని చెప్పి అదృశ్యమైనాడు. దాంతో దేవేంద్రుడుకి హర్షం కల్గింది. అందుకే ఆ ప్రాంతం “హర్షవల్లి” గా ప్రసిద్ధి చెందింది. అక్కడే, సూర్యదేవుని ప్రతిష్ఠించి, స్వామిని ఆరాధించి, నందీశ్వరుని కొమ్ములచే బాధ చెందిన దేవేంద్రుడు ఆరోగ్యవంతుడై, స్వర్గలోకానికి చేరుకొన్నాడని ప్రతీతి. కనుక, నాటి ఆలయమని ప్రసిద్ధి. దేవేంద్రునంతటి మహనీయునకే హర్షాన్నిచ్చి, ఈ ప్రాంతమే హర్షవల్లిగా పేరొంది, రానురాను “అరసవిల్లి’గా ప్రఖ్యాతి చెందింది.

ఈ క్షేత్రస్వామియగు సూర్యనారాయణుని నియమనిష్టలతో ఆరాధించే వారికి వ్యాధులు దరిచేరవు. వ్యాధులున్న వారికి తొలగిపోతాయి. ఈస్వామిని శరణువేడి పూజలు, అభిషేకాలు, నమస్కారాలు చేసి, తమ కోర్కెలు ఫలించటంతో హర్షంతో జనాళి వెళ్తుంటారు కనుకనే, ఈ క్షేత్రానికి “హర్షవల్లి” అనే పేరు వచ్చిందని, ఆ పేరే వాడుకలో అరసవల్లి అయిందని కూడా కొందరు భక్తులు చెబుతుంటారు. ఈ క్షేత్రస్వామి గ్రహాధిపతి కావటంవలన, వీరి సందర్శన భాగ్యంచేతనే, సర్వ గ్రహారిష శాంతి లభిస్తుందని దైవజ్ఞుల ప్రవచనం. దేశవిదేశాల నుండి, ఎందరో యాత్రికులు అరసవల్లి వచ్చి, స్వామిని దర్శించి, సూర్యాలయ శిల్పచాతుర్యాన్ని కొనియాడి, పరవశిస్తూంటారు.ఈ ఆలయప్రాంగణంలో ప్రవేశిస్తే చాలు, మనశ్శాంతి లభిస్తుంది. భక్తులు ముఖమంటపంలో ప్రవేశించగానే దర్శనమిస్తారు స్వామి మూలవిరాట్ విగ్రహం, నేత్రానందదాయకంగా ఉంటుంది. ఈ దేవాలయంలో ఉషా, పద్మినీ, ఛాయాదేవీ మూర్తులను దర్శించి తరిస్తారు. ఉత్తరాయన దక్షణా యనములు మార్పుచెందే కాలంలో, సూర్యకిరణాలు స్వామివారి పాదపద్మాల మీద పడతాయి. ఆ దృశ్యం మనోహరం. ఇదే ఈ ఆలయ నిర్మాణంలోని ప్రత్యేకత.
సేకరణ- రమేష్ ఎన్

చిత్రంలోని అంశాలు: వ్యక్తులు నిలబడి ఉన్నారు మరియు లోపలి ప్రదేశం

ఇండీషను బుడ్డికి పైన లబ్బరుమూతుండీది గేపకవుందా? దానికి బొంతసూత్తో మయంగా కన్నవెట్టి సీసాలో నీల్లోసుకుని పలకమీద ఇదుపుకుని తుడుసుకునీవోల్లుం గుర్తొచ్చిందా.,
పక్కోల్లుకూడా అడిగీవోరు నాకోసారి ఇదపవొరే అని గేపకవొచ్చిందా?

అప్పుడికి పలకజిడ్డొదలకపోతే ఉమ్మెత్తాకులతో తుడుసుకుంటే పలక మల్లీనల్లగా ఐపోయీది గేపకవొచ్చిందా?

పెన్నులో ఇంకైపోతె ఒరేయ్ రెండుసుక్కలెయ్యవొరే?
అని ఇంకుసుక్కలు అప్పడిగిన రోజులు గుర్తున్నాయా!!!

పెన్ను సరిగ్గా రాయకపోతే నోటితోటి పాళి,నాలిక తీసినరోజులు..., నోరంతా ఇంకైపోయీది., ఆరోజులు మర్సిపోయుండరులే?

ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒకేరకం బట్టలుకుట్టించీవోరు పండగలప్పుడు...,
అయికూడా ఎదిగీపిల్లోడని లూజుగా కుట్టించేసీవోరు.., గేపకవుందా?

వూల్లోకెవరైనా మోటారు సైకిలేసుకొస్తే ఆబండెనకాల పరిగెట్టేసీవోల్లుం.,మనంకూడా నోటితో బ్రూం బ్రూం..
పిపీప్ అంటా ఎల్లీవోల్లం గేపకవుంది కదా?

ఆరోజుల్లో పోలీసోల్లని సూత్తేసాలు దడొచ్చేహేది. పోలీసు కనపడితేసాలు ఎవడింటికాడుపరుగు

అప్పుడు పోలీసులు నిక్కర్లేసుకునుండీవోరు.
ఆయ్యెంత లూజుగా వుండీయంటే వుంకో ఇద్దరు దూరొచ్చు అందులో అలాగుండీయి.,

పోలీసోల్లనే కాదు మేట్టార్లని సూసినా అలాగే పారిపోయీవోల్లం అంత భయం భక్తి వుండీయి.,

సవరం ఎప్పుడూ పురికొస కటింగే.,

చెంపలంటా కారిపోయేలా తలకు గొబ్బరినూని.,

చిరిగిపోయిన మడతమంచం గుడ్డలే కదా మనకి
ఆరోజుల్లో స్కూలుబేగ్గులు.,

బల్లో ఇంటర్వెల్లో కొనుక్కునే సేమ్యా ఐసు గేపకవుందా..? యేండి సేమ్యా ఎక్కువున్నా దివ్వరాండి.., అనడిగిన రోజులు మర్చిపోగలమా.!

పాడేసిన సిగరెట్టుపెట్టి లేరుకుని ఆటితో యీదలోరి బుజ్జిగేడి దూల్లమకాంలో బచ్చాలాడినరోజులు..., ఆటిని మల్లీ బేల్లులాగ పేర్చి మనవెంతో ధనవంతుల్లాగ ఫీలైన రోజులు..మరువతరమా..?

తాటితాండ్ర సేతిగోల్లకు అంటించుకుని తిన్నారోజులు..

ఆకలేస్తే ఆవకాయముక్కలు పైపుకాడికట్టికెల్లి కడిగేసుకుని తిన్నారోజులు..,

ఉసిరికాయలు,మావిడికాయలు తినేసేసి పల్లుపులిసిపోయి ఇంటికాడన్నం తినాపోతే తన్నులు తిన్నారోజులు ఎలా మర్చిపోగలం..?

ఏసెలవొచ్చినా పిల్లలవంతా గుంపులు గుంపులుగా పోగయ్యి ఎన్నిరకాలాటలు..,
ఆరోజుల్లో అందరం ప్రాణస్నేహితులమే కదా..!

ఒరేయ్ నువ్ నాజట్టుంటావొరే..? అనడిగీవోల్లుం.., ఎంతకమ్మగా వుందామాట..,

కబాడీ ఆడితే ఇద్దరుబాగా ఆడీవోల్లు చెరోపక్కన నిలబడి కోరుకునీవోరు..,
ఒరే యీదలోరి బుజ్జి నువ్విలావొచ్చేయరా అనొకడు
ఒరే ముత్తాలోరి బాబి నువ్విలాగరారా అని కోరుకుంటం..., లేపోతే పంటలేసుకుని ఆఖర్న మిగిలినోన్ని దొంగెట్టమంటం.....!

అబ్బబ్బబ్బా ఆరోజుల్ని తలచుకుంటేనే మనసంతా భారమయ్యిందో.., తేలికయ్యిందో తెలియని
మరిన్ని మధురానుభూతులతో..., మల్లీ మరికొన్ని గేపకాలతో వస్తా...,
--(())--

21 . అగస్థీశ్వర స్వామి ఆలయం, తొండవాడ 

తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళే దారిలో 12 కి.మీటర్ల దూరంలో స్వర్ణముఖీ నదీ తీరానతొండవాడ అనే గ్రామం ఉంది. ఈ ప్రదేశాన్నే ముక్కోటి అని పిలుస్తారు. ఇక్కడ 3 పుణ్యనదులు కలుస్తాయి. అవి స్వర్ణముఖి ,భీమా ,కళ్యాణి .. ఇక్కడి లింగాన్ని అగస్తీశ్వరమహాముని ప్రతీష్ఠించారు కాబట్టి అగస్తీశ్వరలింగం గా ప్రఖ్యాతి. ఇది చాలా ప్రాచీన సాంప్రదాయ కట్టడము.పక్కనే చిన్న కోనేరు. నదీమధ్యలో ఓ మండపము.పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. 

అగస్థ్య మహర్షి ని దర్శించు కోవటానికి కళ్యాణ వేంకటేశ్వరుడు పద్మావతి సమేతంగా ఇక్కడకు విచ్చేసాడు. ఇక్కడ అగస్థ్య మహర్షి ప్రతిష్ఠిత శివ లింగమే అగస్థీశ్వర స్వామి గా ప్రసిద్ది చెందింది. అగస్థీశ్వర స్వామిని ఆకాశరాజు, ధరణి దేవి మరియు పద్మావతి దేవి దర్శించుకొనే వారని ప్రతీతి. అగస్థ్య మహర్షి ఇక్కడే ఉన్న ఐదు వృక్షాలూ కలిసి ఉన్నన ప్రదేశం లో తపస్సు చేసుకొనే వారని చెప్తారు. ఇక్కడ మరో విశేషం కూడ ఉంది. వేంకటేశ్వర స్వామి మొట్టమొదట తిరుపతి లో అడుగు పెట్టిన ప్రదేశం ఇక్కడే ఉంది. అదే శ్రీ పాదం అని పేరు.
--((***))_-

20.  పూరీ జగన్నాథ దేవాలయం 

పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన మరియు ప్రముఖమైన హిందూ దేవాలయము 

కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర మరియు బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. జగన్నాథుడు (విశ్వానికి ప్రభువు) పేరుతో ఆలయ దైవం యుంటుంది. సంస్కృత భాషలో జగత్ (విశ్వం) మరియు నాథ్ (ప్రభువు) అని అర్థం. హిందూ ఆచారాల ప్రకారం, భక్తులకు ముఖ్యంగా విష్ణువు మరియు కృష్ణుడిని ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన "ఛార్ థాం" పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది. 

ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా మరియు అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు. మధ్య కాలంనుంచి ఈ ఉత్సవం అధిక మత తీవ్రతతో ముడిపడి వుంది. వైష్ణవ సంప్రదాయాలకు మరియు ఈ ఆలయంతో దగ్గర సంబంధమున్న రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైనది. గౌడియ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రాముఖ్యమైంది. ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షింపబడి చాన్నాళ్ళు పూరిలోనే నివసించాడు. 

దేవాలయ మూలాలు 

పూరి జగన్నాథుని ఆలయ శిఖరాలపై సుదర్శన చక్రానికి సంబంధమున్న వైదికర్మల చక్రాలు మరియు పతాకాలు.ఎరుపు పతాకం జగన్నాథుడు భవనంలోనే ఉన్నాడని సూచిక. 

ఈ మధ్యనే కనుగొన్నగంగా రాజవంశానికి చెందిన రాగి శాసనాల ప్రకారం, ప్రస్తుతమున్న జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మన చోడగంగాదేవ ప్రారంభించాడు.ఈ ఆలయంలోని జగన్మోహన మరియు విమన భాగాలు అతని హయాం (1078 - 1148 CE) లోనే నిర్మింపబడ్డాయి. కాని 1174 CE లో ఒడిషా పాలకుడైన అనంగ భీమదేవ దీన్ని పునఃనిర్మించి ఈ ఆలయానికి ప్రస్తుతమున్న రూపునిచ్చాడు.1558లో ఒడిషాపై ఆఫ్ఘన్ సేనాధిపతి కాలాపహాడ్ దాడి చేయక ముందు వరకు ఆలయంలో జగన్నాథున్ని కొలవటం కొనసాగింది. తర్వాత కాలంలో రామ చంద్ర దేవ, ఖుర్దా అనే స్వతంత్ర రాజ్యాన్ని ఒడిషాలో ఏర్పరిచినప్పుడు ఈ ఆలయాన్ని  పవిత్రం చేసి, విగ్రహాను పునఃప్రతిష్ఠించాడు. 

ఐతిహ్యం 

ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని పన్నెండో శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ మొదలుపెట్టాడు. ఆయన మనుమడు రాజా అనంగభీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనకో కథ ఉంది. జగన్నాథుడు గిరిజనుల దేవుడనీ, నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడనీ స్థలపురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనువాడతాడు. విగ్రహాన్ని చూపించమని పదేపదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు, అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. విద్యాపతి తెలివిగా దారిపొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునే లోగానే విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహారదీక్ష మొదలుపెట్టి, అశ్వమేథయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా, జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమనీ ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ, ఆ 21 రోజులూ అటువైపు ఎవరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. శిల్పి కనిపించడు. చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించనిదీ అందుకేనంటారు. చతుర్దశ భువనాలనూ వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి. 

దేవాలయ మూలాలకు సంభందించిన కథ 

ఈ ఆలయ మూలాలకు సంబంధించిన సంప్రదాయ గాథల ప్రకారం, క్రిత యుగం చివరలో అసలు రూపంలో జగన్నాథుడు (విష్ణువు విగ్రహరూపం), పూరి సముద్రతీర సమీపంలోని మర్రి చెట్టు దగ్గర ఇంద్రనీల లేదా ఒక నీలి ఆభరణంగా అవతరించాడు. అది ఎంత ప్రకాశావంతమైనదంటే దాన్ని చూసినవారికి తక్షణ మోక్షం లభిస్తుంది. కనుక  ధర్మదేవుడు లేక యముడు దాన్ని భూమిలో దాచిపెట్టాలనుకున్నాడు. అందులో విజయం కూడా సాధించాడు.ద్వాపర యుగంలో మాల్వాకి చెందిన ఇంద్రద్యుమ్న అనే రాజు అంతుపట్టని ఆ రూపం గురించి తెలుసుకోవాలని సంకల్పించి తన లక్ష్యం కోసం ఘోరమైన తపస్సు చేయసాగాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యి, పూరి సముద్ర తీరానికి వెళ్లి అక్కడ తేలే చెట్టు దుంగను కనుక్కొని దాని కాండంలో నుంచి తనకు కావలసిన రూపును తయారు చేసుకొమ్మని అతన్ని ఆజ్ఞాపించాడు. ఆ రాజు చెక్క దుంగను కనుక్కొన్నాడు.తర్వాత అతను అద్భుతమైన యజ్ఞాన్ని నిర్వహించాడు. దానికి యజ్ఞనరసింహరాజు ప్రత్యక్షమై నారాయణున్ని నాలుగు అక్షలలో విశదీకరించి నిర్మించమని ఆజ్ఞాపించాడు. అవి పరమాత్ముణ్ణి వాసుదేవుని లాగా, వ్యూహని సంకర్షణ వలె, యోగమయని సుభద్ర లాగా మరియు విభవున్ని సుదర్శన వలె నిర్మించామన్నాడు. రాజు ముందు విశ్వకర్మ చిత్రకారుని రూపంలో ప్రత్యక్షమై చెట్టునుంచి జగన్నాథ, బలభద్ర మరియు సుభద్రల రూపాలను తయారు చేశాడు. 

పురుషోత్తమ క్షేత్ర నామము మరియు దాని విహిష్టత 

స్కంద పురాణ లిపి ప్రకారం జగన్నాథుడే పురుషోత్తముడు .మానవులకు సాధ్గునాలతో జీవితాన్ని ఎలా గడపాలో తెలియచెప్పడానికి ఆయన దారుబ్రాహ్మణ అవతారం ఎత్తాడు.తన తోబుట్టువులైన బలభద్ర, సుభద్ర దేవిలలో అతనే ఉత్తముడు.శ్రీ దేవికి అతను ఉత్తమ భర్త.అన్నింటికన్నా గుర్తించదగినది మార్గాశిర్శ నెలలో అమావాస్య తర్వాత వెంటవెంటనే వచ్చు మూడు రోజులూ తన తల్లిదండ్రులు (కశ్యపుడు-అదితి, దశరథుడు- కౌశల్య, వాసుదేవుడు-దేవిక, నందుడు-యశోద) లకు ఇంద్రద్యుమ్న, రాణి గుండిచలతో కలిసి శ్రద్ధ నిర్వహిస్తాడు.కాని ఒక పాలకుడు కింద అతను రోజూ అలాగే పండుగలలో దొరికే సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు.తన అనుచరులు మరియు తన ముందు లోంగిపోయినవారి పట్ల అమితమైన జాగ్రత్త తీసుకుంటాడు. 

బౌద్ధ మూలాలు 

కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తల సిద్ధాంతాల ప్రకారం, ప్రస్తుత ఆలయ స్థలంనందు క్రితంలో బుద్ధుని దంతాల అవశేషాలు కలిగిన ఒక బౌద్ధ స్థూపం ఉండేదని అంటుంటారు. అది తర్వాత కాలంలో శ్రీలంకలోని క్యాండికి తరలింపబడింది. ఆ సమయంలోనే వైష్ణవ మతంలోకి బౌద్ధ మతాన్ని కలగలిపారు. దీంతోటి జగన్నాథున్ని కొలవటం ప్రాముఖ్యమైంది. ఇదంతా పదవ శతాబ్దానికి ముందు అంటే ఒడిషాకి చెందిన సోమవంశి రాజుల హయాంలో జరిగింది. 

మహారాజ రంజిత్ సింగ్ అనే ఒక గొప్ప సిక్కు చక్రవర్తి ఈ ఆలయానికి అధిక మొత్తంలో బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు. (ఇది అమృత్సర్ లోని బంగారు ఆలయానికి అతనిచ్చిన దాని కన్నా ఎక్కువ). ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన మరియు విలువైన  వజ్రం కోహినూరును కూడా ఈ ఆలయానికే విరాళంగా ఇవ్వమని అతను తన చివరి కోరికగా ఆజ్ఞాపించాడు. కాని ఆ వజ్రం ఈ ఆలయానికి చేరుకోలేకపోయింది. కారణం అప్పటికే బ్రిటీషు వారు పంజాబ్ రాష్ట్ర సర్వ హక్కులను తెగ తెంపి, దాని జమీందారీ ఆస్తులను జప్తు చేశారు. 

సంస్కృతుల మేలుకలయిక 

పూరి జగన్నాథ్ లోని శ్రీక్షేత్రగా పిలవబడే స్థలం భారతీయ సంస్కృతులకు పూర్తిగా అద్దం పడుతుందని నమ్మకంగా చెప్పవచ్చు. ఈ సంస్కృతుల గురించి తెలుసుకోవాలంటే ఎవరైనా దీని స్థల పురాణం గురించి తెలుసుకోవాలి. కాని ఇది ప్రపంచంలోని మిగతా దేశాలకు భిన్నంగా వుంటుంది. భారతీయ చరిత్రలోనే ఆ దేశం ఎక్కడా ఇతర దేశాల మీద దండెత్తడం కాని సరిహద్దు రాగద్వేషాలతో వాటిని ఆక్రమించుకోవటంగాని చేసిన దాఖలాలు లేవు. 

చరిత్ర ప్రకారం జగన్నాథున్నే తీసుకుంటే శబరాలు అనే ఆదివాసీలు ఆయన్ను నారాయణుని మారు రూపంగా పూజిస్తారు. ఇంకొక నేపథ్యం ప్రకారం ప్రాచీన కాలంనుంచి అక్కడే నివసిస్తున్న ప్రజలు ఆయన్ను నీలిరాయితో తయారుచేసిన నారాయణుని ప్రతిరూపమైన నీలమాధవగా కొలుస్తారు. ఆయన్ను నీలగిరి (నీల పర్వతం) లేక నీలాచలకి తీసుకువచ్చి బలరామ (బలభద్ర) మరియు సుభద్ర సమేతంగా  జగన్నాథునిగా నెలకొల్పారు. ఈ చెక్క విగ్రహాలు, ప్రాచీన కాలంనుంచి వస్తున్న చెక్క స్తంభాలను కొలవటం అనే ఆచారంతో ముడిపడివున్నాయి. వీటన్నిటికన్నా ఒడిషాకే చెందిన ఆదివాసీల వంశస్థులుగా చెప్పుకొనే ధైతపతులు ఇప్పటికీ ఆలయంలో జరిగే పూజాకార్యకలాపాలలో అధిక శాతంలో పాల్గొంటూ వుంటారు. వీటన్నిటిబట్టి మొదట్నుంచి శ్రీక్షేత్ర యొక్క సాంస్కృతిక చరిత్ర హిందూ మరియు ఆదివాసీల సంస్కృతుల కలయికతో ఏర్పడిందని దృఢంగా చెప్పవచ్చు. ఇది గర్వించదగ్గ మన జాతి ఔన్నత్యంలో ఒక భాగమయ్యింది. ఈ మూడు విగ్రహాలు త్రిరథ (జైన ఆచారాలు) గా  పిలవబడే సమ్యక్ దర్శన్, సమ్యక్ జ్ఞానంద్ మరియు సమ్యక్ చరితలకు ప్రతీకగా ప్రాచుర్యమయ్యాయి.ఇవి మోక్షం లేక శిఖరాగ్రమైన ఆనందానికి మార్గంగా పిలవబడుతున్నాయి 

స్వామి జగన్నాథుడు విష్ణువు లేదా నారాయణ లేదా కృష్ణుడిగా మరియు బలభద్రుడు శేషునిగా పూజలు అందుకుంటున్నారు. అదే సమయంలో ఈ ఆలయంలో నెలకొల్పబడిన విగ్రహాలను భైరవ (శివ, అజేయుడు) మరియు విమల (భైరవి, శివుని భార్య) గా కూడా చూస్తుంటారు. కాబట్టి పూరి జగన్నాథ్ లో ఉన్న శ్రీక్షేత్ర యొక్క సంస్కృతీ సంప్రదాయాలు, హిందూ మతానికి చెందిన శైవతత్వం, శక్తితత్వం మరియు వైష్ణవతత్వం వల్ల, అలాగే జైనమతం, బౌద్ధమతంలోని కొంత భాగాలు మేలుకలయికతో ఏర్పడి, ఎప్పటినుంచో అలాగే కలగలిపి ఉన్నాయని మనం గుర్తించవచ్చు. 

ఆచార్యులు మరియు జగన్నాథ పూరి 

మాధవాచార్యులు తప్ప ఈ క్షేత్రాన్ని అందరు ఆచార్యులు దర్శించారు.ఆదిశంకరాచార్యులు ఇక్కడ గోవర్ధన మఠాన్ని స్థాపించారు.దీంతో పాటు రామానుజాచార్య, నింబర్కాచార్య మరియు గుడియ వైష్ణవ మతానికి చెందిన అనేక మఠాలను ఇక్కడ చూడవచ్చు.శ్రీపాద వల్లభాచార్య కూడా పూరిని సందర్శించినప్పుడు ఇక్కడ తన భైఠకాన్ని ఏర్పరుచుకున్నారు.గురునానక్, కబీర్ మరియు తులసీదాస్ లు కూడా ఈ స్థలాన్ని దర్శించినట్లు ఆధారాలు ఉన్నాయి. [9] 

నిర్మాణం 

పూరి లోని రథ యాత్ర పండుగజేమ్స్ ఫెర్గుస్సన్ చేసిన చిత్రం 

ఈ భారీ ఆలయ భవనం 400,000 square feet (37,000 m2) కన్నా ఎక్కువ వైశాల్యంతో ప్రహరీగా చుట్టూ ఎత్తైన కోటగోడలను కలిగి వుంది. ఇందులో కనీసం 120 గుళ్ళూ మరియు పూజా స్థలాలు ఉన్నాయి. ఒడిషా శైలి నిర్మాణ గుణాలను మరియు అమోఘమైన శిల్ప సంపదను కలిగిన ఈ ఆలయం, భారత అద్భుత కట్టడాలలో ఒకటి.[10] 

ప్రధాన ఆలయం కిందనుంచి పైకి కొంచెం వంపులు తిరిగి ఉండి దానిపైన విష్ణువుకు చెందిన శ్రీచక్ర (ఎనిమిది ఆకుల చక్రం) వుంటుంది. "నీలచక్ర"గా కూడా పిలవబడి, అష్టదాతుతో తయారైన ఈ చక్రం ఎంతో పవిత్రమైనది. ఈ ఆలయ ధ్వజస్తంభం ఎత్తైన ఒక రాతి దిమ్మపై నిర్మింపబడింది. ఇది విగ్రహాలు వున్న గర్భగుడి కన్నా ఎత్తు214 feet (65 m)లో ఉంది చుట్టు పక్కల పరిసరాలలో పెద్దదిగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న గుళ్ళు, మండపాల యొక్క న్యూచగస్తూప రూపంలోని గోపురాలు ధ్వజస్తంభం చుట్టూ మెట్లుగా ఉండి పర్వతశ్రేణిని తలపిస్తాయి. 

ప్రధాన పూజాస్థలం ఎత్తైన గోడతో చుట్టబడి 20 feet (6.1 m) ఉంటుంది. ఇంకొక గోడ ప్రధాన ఆలయాన్ని చుట్టి ఉంటుంది. 

సింహద్వారం 

బడా దందా లేదా పెద్ద మార్గం 

సంస్కృతంలో సింగద్వారం గా పిలవబడే సింహ ప్రవేశం ఆలయంలోని నాలుగు ద్వారాలలో ఒకటి మరియు ఆలయం లోపలికి వెళ్ళటానికి ప్రధాన ప్రవేశద్వారం. దీనికి ఆ పేరు రావటానికి కారణం ఆ ద్వారం రెండు ప్రక్కల ఉన్న గాండ్రించే సింహాల పెద్ద రాతి శిలలు. ఈ ద్వారం తూర్పు ముఖంగా ఉండి బడా దందా లేదా పెద్ద రోడ్డుకు దారి చూపుతుంది .బైసీ పహచ లేదా ఇరవై రెండు మెట్ల వరుస ఆలయ భవనంలోకి దారి చూపుస్తుంది. సంస్కృతంలో పతిత పావన గా పిలిచే జగన్నాథుని శిల్పం ప్రవేశంలో కుడివైపున చెక్కివుంటుంది. పతిత పావన అంటే అణగారిన మరియు దిగజారిన వారి బాంధవుడు అని అర్థం. ప్రాచీన కాలంలో ఆలయంలోకి అంతరానివాళ్ళకు ప్రవేశం వుండేది కాదు కనుక వాళ్ళు ఈ పతిత పావనున్ని పూజించేవాళ్ళు. జయ, విజయ అనే ఇద్దరు ద్వారపాలకులు ద్వారానికి రెండు వైపులా నుంచుని వుంటారు.[12] రథయాత్ర మొదలయ్యే ముందు జగన్నాథ్, బలభద్ర మరియు సుభద్రల విగ్రహాలను ఈ దారిలోనే తీసుకెళ్తారు.వాటిని గుండీచ మందిరం నుంచి తీసుకు వచ్చేటప్పుడు తనను నిర్లక్ష్యం చేసి తమతో పాటు యాత్రకు తీసుకు వెళ్లనందుకు అలిగిన మహాలక్ష్మిని జాతర రూపంలో శాంత పరుస్తారు. అప్పుడే విగ్రహరూపంలో ఈ ద్వారా తలుపులపైన ఉన్న మహాలక్ష్మి వారిని ఆలయంలోకి రావడానికి అనుమతిని ఇస్తుంది. ప్రధాన ద్వారం ముందు అద్భుతమైన పదహారు ముఖ ఏకశిలా స్తంభామైన అరుణ స్తంభం కూడా వుంది. దీని పైభాగంలో సూర్య భగవానుడి రథసారథి అయిన అరుణుడి విగ్రహం వుంటుంది. అసలు ఈ స్తంభం కోణార్క్ లోని సూర్య ఆలయంలో ఉంటే, ఖుర్దా రాజు ఇక్కడికి మార్పిడి చేయించాడు. 

మిగతా ప్రవేశాలు 

1870లో సింహాల శిలలు మరియు ముందువరుసలో అరుణ స్తంభాన్ని కలిగిన సింగద్వారం. 

పద్మా వేష అలంకారం లేదా తామర గర్భంలో జగన్నాథ, బలభద్ర మరియు సుభద్రల నకలులు. 

ప్రధాన ప్రవేశమైన సింహ ద్వారం కాకుండా ఉత్తర, దక్షిణ మరియు పడమటి దిక్కుల ముఖాలలో ఇంకా మూడు ప్రవేశాలున్నాయి. వాటిని రక్షించే జంతువుల శిలల ప్రకారం వాటి పేర్లు ఉంటాయి. అవి హాథిద్వార లేదా ఏనుగు ద్వారం వ్యాఘ్రద్వార లేదా పులి ద్వారం మరియు అశ్వద్వార లేదా గుర్రం ద్వారం. 

సింహ ద్వారం 

ఆలయానికి మొత్తం నాలుగు ద్వారాలున్నాయి. సింహ ద్వారానికి ఇరు వైపులా రెండు భారీ సింహాల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇది తూర్పు వైపుకు తెరుచుకుని ఉంటుంది. 

విగ్రహాలు 

గర్భగుడిలో త్రిమూర్తులుగా పిలిచే జగన్నాథ్, బలభద్ర మరియు సుభద్రల మూల విరాట్టులు రాత్నవేది అనే ఆభరణాలతో అలంకరించిన దిమ్మెపై కొలువు తీరి ఉంటారు. వీటితో ప

19. శ్రీకూర్మం


దేశంలో ఒకే ఒక కూర్మక్షేత్రం 

భారతదేశం ఆధ్యాత్మికదేశం. ఎందరో ఋషి పుంగవుల, తపోధనుల పాదస్పర్శతో పునీతమైన ప్రదేశమిది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులకు పుట్టినిల్లిది. ఎన్నోన్నో ప్రత్యేక క్షేత్రాలు తమ తమ మహిమలతో ఈ భూమిపై వెలసి, ప్రతీ ఒక్కరిని ప్రభావితులను చేస్తూన్నాయి. తరింపజేస్తున్నాయి. అటువంటి మహత్తు కలిగిన క్షేత్రమే ఆంద్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉన్న ‘శ్రీకూర్మం’. 

“కూర్మావతారం ఛ సంశ్రుతం పాపనాశనమ్” అని అగ్నిపురాణం (3-1) చెబుతోంది. అనగా, లోకహితం కోసం ఆ నారాయణుడు మత్స్యకూర్మాది అవతారాలను ధరించాడు. పురాణాలు చెబుతున్న కూర్మావతారం గురించి వింటే పాపాలు నశిస్తాయి. ఇహ…కళ్ళతో  ప్రత్యక్షంగా ఆ మూర్తిని తిలకిస్తే ఇంకెంత ముక్తిదాయకమో కదా! విష్ణుమూర్తి సలహాపై దేవదానవులు పాలసముద్రములో, మందార పర్వతం కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకొని, మధిస్తున్న సమయంలో ప్రతీసారి పర్వతం సరిగ్గా నిలువకుండా కడలిలో పడిపోయేది. సంగతిని తెలుసుకున్న దేవతలు శ్రీహరిని ప్రార్థించగా, కూర్మావతారాన్ని ధరించి, తన సువిశాలమైన వీపుభాగాన మందార పర్వతాన్ని ధరించి (మద్య మానేతదా తస్మిన్ కూర్మరూపే జనార్థనః) కార్యం నిర్విఘ్నంగా ముగించేటట్లు చేసాడని భాగవతం చెబుతోంది. దశావతారాలలో రెండవ అవతారం శీకూర్మ అవతారం. 
“యావద్భారతంలో కూర్మావతార క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకూర్మం, 

శ్రీకూర్మవతారమైన విష్ణువుకు అంకితమైనందున శ్రీకూర్మంగా పిలువబడుతోంది.” 
కాల నిర్ణయం 

ఆలయస్థలపురాణాన్ని అనుసరించి, శ్వేతమహీపతిని అనుగ్రహించాడనికి స్వామి ముందుగా ఇక్కడికి విచ్చేశాడట.అలాగే రోగి అస్తికలను ఇక్కడి శ్వేతపుష్కరిణిలో వేయగా, అందులో నీరు తాబేళ్ళుగా మారాయనీ, అందుకనే అశుచి కలిగిన మనుషులు అక్కడి నీళ్ళను టాక కూడదన్న నిబంధన ఉంది. ఈ దేవాలయాన్ని గురించి “కాలవివరాలు” అంత సమగ్రంగా లేవు. దాదాపు రెండవ శతాబ్దంనాటి దేవాలయం ఉన్నట్లుగా కొందరి చరిత్రకారుల అభిప్రాయం. ఏడవ శతాబ్దానికి దేవాలయ వైభవం ఉచ్ఛస్థితిలో ఉన్నట్లుగా తెలిపే శాసనాలు, ఆలయ మండపంలోగల స్తంభాలపై లిఖించబడ్డాయి. చోళ చక్రవత్రుల కాలంలో ఈ వైభవం తారాస్థాయికి చేరినట్టుగా మరి కొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ శాసనాలనీ కూడా తూర్పు కళింగ, గంగుల పరిపాలలో ఉన్న అనంగభీముడు నిర్మించిన “తిరుచుట్టుమండపం” స్తంభాలపై ఒరియా, తెలుగు, దేవనాగరి, ప్రాకృత భాషలలోకనిపిస్తాయి. ఈ మండపంలో నిర్మించిన  71 నల్లరాతి స్తంభాలు గాంధార శిల్పకళతో అలరారుతుంటాయి. సింహాచలం “కప్పు స్తంభం” మాదిరిగానే ఈ క్షేత్రంలో కూడా “ఇచ్ఛాప్రాప్తిస్తంభం” ఉంది. దీనిని కౌగిలించుకుంటే కోరికలు తీరుతాయని శాసనాలు తెలియజేస్తున్నాయి. ఈ స్తంభాలపి కలంకారి రంగులతో చిత్రించిన చిత్రములు, శిల్పాలు వగైరా దేనికదే పోలికలు లేకుండా చిత్రించబడటం ఆనాటి కాల నైపుణ్యానికి ప్రతీక. 

ఆలయం విశేషాలు 
శ్వేతకీర్తి చక్రవర్తి నిమిన్చినట్లుగా చెప్పబడుతున్న ఈ ప్రాచీన దేవాలయం, భారతదేశంలోని అతి ప్రాచీన దేవాలయాలలో ఒకటి. అపురూప శిల్పకళ సంపదతో, ప్రతికృతిలో సౌందర్యాలతో అలరారుతున్న ఇటువంటి దేవాలయమం ప్రపంచంలో మరెక్కడా లేదు. దేవాలయ నిర్మాణము తూర్పు గంగ వంశస్థుల శిల్పకళా శైలిని తలపిస్తుంది. కృతయుగంలో వెలసిన ఆది కూర్మనాధుడే ఈ యుగంలో కూర్మనాధదేవునిగా ఇక్కడ వెలశాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలంలో మూలవిరాట్ గర్భాఆలయంలో ఒక ప్రక్కగా వెలసినట్లు కనిపిస్తుంది. సాధారణంగా దేవతావిగ్రహాలు తూర్పు దిక్కుకు అభిముఖంగా ప్రతిష్టించబడటం సహజం. కాని, ఈ క్షేత్రంలో పశ్చిమాభిముఖంగా స్వామిముఖం, తోక భాగాన గల సుదర్శనశాలిగ్రామం తూర్పుకు అభిముఖంగా వెలయడంచేత దేవాలయంలో రెండు ధ్వజస్తంభాలున్నాయి. 
ఈ విధంగా మరే దేవాలయంలో కూడా లేకపోవడం ఒక విశేషం. ఆలయమ్లోకి ప్రవేశించగానే ముందు కూర్మం తోక, ఆ తర్వాత కాస్త పశ్చిమంగా వెళితే ముఖం కనిపిస్తుంది. అనంతరం భోగమంటపం, భోగమంటపానికి ఇరు వైపులా పద్మనిధి, శంఖనిధి ఉన్నాయి. భోగామంతాపం తర్వాత పుష్పాంజలిమంటపం, ఆస్థానమంటపం ఉన్నాయి. వీటిని బ్రహ్మదేవుడు నిర్మించాడని ప్రతీతి. 

“శ్రీకూర్మనాథస్వామి స్వయంవ్యక్తమూర్తి అనీ, ఈ దేవుని కంఠంలో ఉన్న సాలగ్రామమాలికతో పాటూ శ్రీమహావిష్ణువు కూర్మాక్రుతి పొందాడని భక్తుల విశ్వాసం. స్వామివారిని భక్తితో ఆరాధిస్తే సమస్త పాపాలు తొలగి, పునర్జన్మ ఉండదని నమ్మకం! అలాగే ఈ క్షేత్రదర్శనంతో అమరావతి, కాశీ పుణ్య క్షేత్రాలకు యాత్ర చేసినంత ఫలితం ఉంటుంది.” 
ఆలయంలోకి ఈ దేవాలయాన్ని నారద, ఇంద్ర, బ్రహ్మాది దేవతలు తిలోత్తమవంటి అప్సరసలు, మునులు, కవులు దర్శించుకుని తరించారు. త్రిమతాచార్యులకు ఆరాధిం శ్రీకూర్మనాధస్వామి. అష్టపదులను రచించిన జయదేవుడు, చైతన్య ప్రభూ, శ్రీనరహరితీర్థులు, శ్రీనాధమహాకవి, శ్రీకృష్ణదేవరాయలువంటివారు స్వామిని దర్శించినట్టుగా చారిత్రిక కథనాలు తెలియజేస్తున్నాయి. ఈ ఆలయానికి క్షేత్రపాలకునిగా కాలభైరవుడు, రక్షకుడుగా హనుమంతుడు, పరివార దేవతలుగా వైష్ణవీదుర్గా (జమ్మూకాశ్మీర్ ప్రాంత్రం లోగల వైష్ణోదేవీ విగ్రహాన్ని పోలిన విగ్రహం ఈ ఆలయంలో ఉంది) నరసింహస్వామి, గణపతి, శివుడు, వేణుగోపాలస్వామిని బ్రహ్మ ప్రతిష్టించినట్లుగా బ్రహ్మాండపురాణ కథనం. ఈ క్షేత్రానికి పశ్చిమభాగంలో కాలభైరవుడు పూర్వభాగస్థితి వంశధారాది సంగమ ప్రదేశంలో కర్పూరేశ్వరుడు, పశ్చిమభాగస్థితి హరుకేశ్వరస్వామి కొలువయి భక్తులను కరుణిస్తున్నారు. ఇది పంచాలింగారాధ్య క్షేత్రం. అంటే, ఐదుగురు శివులు క్షేత్రపాలకులై స్వామిని ఆరాధిస్తున్నారు. వంశధార సాగరసంగమ ప్రాంతమైన కళింగపట్నంలో కర్పూరేశ్వరుడు, పడమట సింధూర పర్వతంపై (సింగుపురంకొండ) హటకేశ్వరుడు, దక్షిణాన నాగావళి తీరానగల (శ్రీకాకుళపట్టణంలో) రుద్రకోటేశ్వరుడు, ఉత్తరాన “పిప్పల” (ఇప్పిలి) గ్రామంలో సుందరేశ్వరుడు శ్రీకూర్మ క్షేత్ర సుధాకుండతీర్థంలో పాతాళసిద్దేశ్వరుడు ఉన్నారు. ఇక్కడున్న అష్ట తీర్థములలో స్నానం చేస్తే, సమస్తరోగాలు నశిస్తాయని బ్రహ్మాండ, మార్కండేయ పురాణాలు తెలియజేస్తున్నాయి. నారదగుండం, సుధాగుండం, చక్రతీర్థం,  మాధవతీర్థం, కౌటిల్యతీర్థం, వక్రతీర్థం, నరసింహపాతాళం, మహారథి అనే సముద్రం అష్టతీర్థాలుగా ఉంది భూలోక వైకుంఠంగా అలరారు తున్నది క్షేత్రం. 

భారతదేశంలో శ్రీహరికూర్మరూపంలో స్థిరంగా ఉన్నాడని, ఆయన దక్షిణకుక్షిలో ఆంద్రరాష్ట్రంలో వెలసియున్నాడని మార్కండేయ పురాణం తెలియజేస్తోంది.కూర్మనాదుడ్ని శ్రీకాకుళంజిల్లాలోని శ్రీకూర్మంలో అర్చించడం ముక్తిదాయకమని పురాణాల ఉవాచ. అంతేకాక ఈ క్షేత్రదర్శనం వలన ముక్తి మోక్షాలు కలుగుతాయని పద్మపురాణంలో 30 అధ్యాయాల్లో, బ్రహాండపురాణంలో మూడవ అధ్యాయంలో చెప్పబడింది. ఈ క్షేత్రదర్శనం వలన పునర్జన్మకు అవకాశం లేదని పద్మపురాణం ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసంలో డోలోత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. వైశాఖ సప్తమి-పూర్ణిమ దాకా కల్యానోత్సవం జరుగుతుంది. 
శ్రీకాకుళం పట్టణం పాత బస్ స్టాండు నుండి ప్రతి 15 నిమిషాలకు అరసవిల్లి మీదుగా ఆర్టిసి వారి బస్సులు కలవు.ఉదయం 6.00గంటలనుండి,రాత్రి 8.00గంటల వరకు నడుస్తాయి.అంతేకాక ఆటోలు,టాక్సిలు వున్నాయి.వసతి మాత్రం శ్రీకాకుళం పట్టణం లోనే..

--((***))--

18 . మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్ మహారాష్ట్ర 
శ్రీ మహాలక్ష్మీ (అంబాబాయి) దేవాలయం భారతదేశం లోని మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కొల్హాపూర్ లో శక్తి పీఠం. ఇది హిందూ పురాణాల ప్రకారం శక్తి పీఠాలలో ఒకటిగా భాసిల్లుతోంది. 
ఆలయ విశేషాలు 
పురాణాలలో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయం భారతదేశంలో శక్తి నివాసముండే 108 శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది.మహాలక్ష్మిని ప్రేమగా అంబా బాయి అనికూడా పిలుస్తారు, ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించి ఆమె దీవెనలను కోరుకుంటారు. ఈ మహాలక్ష్మి దేవాలయం కారణంగా, కొల్హాపూర్, భారతదేశంలోని ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతుంది.7 వ శతాబ్దం లోని ఈ దేవాలయాన్ని చాళుక్య వంశ రాజైన కరన్దేవ్ తిరిగి చాలాకాలం తరువాత దీని నిర్మాణాన్ని చేపట్టారు. 
ఈ పవిత్ర స్థల నిర్మాణ శైలి హేమండ్ పతి ప్రేరణతో చేయబడింది. ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు 8 వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని నమ్మబడింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూర్యకిరణాలు ప్రతిరోజూ దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది.నవరాత్రి వంటి పండుగల సమయంలో స్థానికులు, భారతదేశం అంతటా ఉన్న భక్తులు అంబాదేవి దర్శనం కోసం కొల్హాపూర్ కి తండోపతండాలుగా వస్తారు. ఈ సమయంలో ఈ ప్రాంతం ప్రకాశవంతమైన రంగులతో, సంగీతంతో ప్రతిధ్వనిస్తుంది. 
ఒక రాతి పీఠం మీద నాలుగు చేతులతోనూ, 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతోనూ మహాలక్ష్మీ కొలువై ఉంటుంది. 3 అడుగుల ఎత్తుగల నల్లరాతిపై మహాలక్ష్మీ ప్రతిమను చెక్కడం జరిగినది. ఆలయంలోని ఒక గోడపై శ్రీ యంత్రం చెక్కబడి ఉంది. దేవత యొక్క వాహనం రాతితో చేయబడిన సింహం ప్రతిమ వెనుక భాగంలో ఉంటుంది. కిరీటంపై విష్ణువు తల్పం అయిన శేషనాగు యొక్క చిత్రం ఉంటుంది. ఆమె నాలుగు చేతులలో గుర్తింపు కలిగిన నాలుగు వస్తువులు ఉంటాయి. కుడివైపు క్రింది చేతిలో మాలుంగ (సిట్రస్ జాతి ఫలం), ఎడమవైపు కింది చేతిలో పాత్ర ఉంటుంది. హిందూ పవిత్ర చిత్రాలలో ముఖం ఉత్తరవైపు లేదా తూర్పు వైపు చూసే విధంగా ఉంటుంది. ఈ దేవతా విగ్రహం పశ్చిమవైపు చూసే విధంగా ఉంటుంది. చిన్న తెరిచిఉన్న కిటికీ పశ్చిమవైపు గోడకు ఉంటుంది. సూర్యాస్తమయం అయినపుడు సూర్యుని కిరణాలు ఈ కిటికీ గుండా ప్రతి సంవత్సరం 21 మార్చి మరియు 21 సెప్టెంబరు లలో మూడురోజులపాటు విగ్రహంపై పడతాయి. ఆలయ పరిసరాల్లో నవగ్రహాల, సూర్యుని, మహిసాసుర మర్థని, విఠల్-రఖ్‌మయి, శివుడు, విష్ణువు, తుల్జా భవాని మరియు యితర విగ్రహాలు ఉంటాయి. వీటిలోకొన్ని విగ్రహాలు 11వ శతాబ్దానికి ముందువి కొన్ని కొత్తగా ప్రతిష్టించినవి. ఆలయం వద్ద మణికర్ణికా కుండం అనే కొలను ఉంది. ఆ కొలను ఒడ్దున విశ్వేశ్వర మహాదేవ్ విగ్రహం ఉన్నది. 
అమ్మవారికి రోజూ అయిదు సార్లు అర్చన జరుగుతుంది .ఉదయం అయిదు గంటలకు శ్రీ మహా లక్ష్మీ దేవికి సుప్రభాత సేవ చేస్తారు. కాకడ హారతి ఇస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం, సాయంత్రాలలో పూజ, శేజ్ హారతి జరుపుతారు. అమ్మవారి 
ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులపుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు. ప్రతి శుక్రవారం సాయంత్రాలలో, పౌర్ణమి నాడు, అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు. 
నిర్మాణ శైలి 
మహాలక్ష్మి_దేవాలయం 'హేమాడ్ పంతి' నిర్మాణశైలిలో కట్టబడింది. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడతో ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళాసృష్టి అని చెప్పవచ్చు. ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా సుమారు వందడుగుల పొడవు గల విశాలమైన మండపం ఉంటుంది. గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం వుంది. గర్భగుడిలో సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమీద మహాలక్ష్మి విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. మూడడుగుల ఎత్తున్న మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని 'అంబాబాయి' అని పిలుస్తారు. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం. ముఖ్యంగా ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విశేషంగా గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా ఐదు కి.మీ. దూరంలో ఉన్నతెంబ్లాయి అమ్మవారి ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. ఇదిగాక చైత్ర_పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు. గుడి ప్రాంగణంలో ఉన్న అనేక ఆలయాలలో విఠోబా ఆలయం కూడా చాలా పురాతనమైనది. 
పూర్వకథ 
అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు. ఏటా కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు. అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీనగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించి, శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించుకోలేకపోతున్నానని, కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే, అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తానని కోరాడు. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని, అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాలనిస్తుందని చెప్పాడట. 
శివుని ఆనతిమేరకు అగస్త్యుడు కొల్హాపూర్‌లో మహాలక్ష్మిని, అతిబలేశ్వరస్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడి స్థలపురాణాల ద్వారా అవగతమవుతోంది. అమ్మవారు వెలసిన తర్వాత ఈ నగరానికి కరవీరపురమనే పేరు సార్థకమైంది. ఈ నగరాన్ని కోల్‌పూర్ అని కోల్‌గిరి అని, కొలదిగిరి పట్టణ్ అని పిలిచేవారు. ‘కొల్లా’ అంటే ‘లోయ’అని, ‘పూర్’ అంటే పట్టణమనే అర్థంలో ఈ క్షేత్రం విలసిల్లిందని చెబుతారు. కొల్హాపూర్ క్షేత్రాన్ని 1359వ సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వికులు పాలించగా, 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రవర్థమానమైందని తెలుస్తోంది. 
సూర్యగ్రహణం రోజు స్నానం చేస్ 
ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షించగా, నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు తన కరములతో పైకి ఎత్తినందువల్ల ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రమనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత కాగా, శివుడు నీరుగా, విష్ణువు రాయిగా, మహర్షులు ఇసుకగా, దేవతలు చెట్లుగా, మూడున్నర కోట్ల తీర్థాలూ సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటారని, అందుకే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానాలు చేస్తే పంచ మహాపాతకాలు సైతం ప్రక్షాళనమవుతాయంటారు. కొల్హాపూర్ క్షేత్రాన్ని కరవీర నగరమని, ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని స్తుతించారని పద్మ, స్కాంద, దేవీభాగవతాలు ప్రస్తావించాయి.
--((***))--

17 . అష్టాదశ పీఠాలు 
అనంత కోటి ఫలదాయకాలు 
ఆశ్వీయుజ మాసమంతా దాదాపుగా స్ర్తిశక్తిని ఆరాధించటానికి ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. కాలం ఈశ్వర స్వరూపం అంటుంది భారతీయం. ఈ ఈశ్వరుడు అర్థనారీశ్వరుడైనట్టుగానే కాలం పగటిని పరమేశ్వర స్వరూపంగాను, రాత్రిని శక్తి అంటే పరమేశ్వరీ రూపంగా భావిస్తాం. అట్లే చక్కని వెనె్నల, శరత్కాలం ప్రవేశించిన ఆశ్వీయుజ మాసాన్ని స్ర్తిరూపంగా భావిస్తారు. అశ్వనీ నక్షత్రంతో కూడిన ఈ ఆశ్వయుజి అంటే స్ర్తి రూపం. శక్తి స్వరూపిణి. వర్షధారాలను తనలో పొదువుకున్న పుడమితల్లి అంకురించి పృథ్వి అంతా పచ్చదనంతో కళకళలాడుతూ పచ్చని పట్టుచీరను శృంగారించుకొన్నట్టుగా ఉంటుంది. రంగురంగుల పూవులతో నయనానందకరంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, మనఃకారకుడైన చంద్రుని వెనె్నల చల్లదనంతో ప్రతివారి మనసు భగవత్ చింతన చేయడానికి ఆయత్తమయ్యేకాలమే ఆశ్వయుజమాసం. అందుకే పాడ్యమి మొదలు కొని దశమి వరకు శక్తిస్వరూపిణి అయిన పరమేశ్వరిని వివిధరూపాలలో పూజిస్తుంటాం. ఆ తల్లి సృష్టి స్థితి లయాదులకు కారణం కనుక ఆ తల్లినే చల్లనిచూపు మనపై ప్రసరించాలనే కోరికతో తల్లిని కొలవడం అనాదిగా వస్తోంది. అసలు ఈ తల్లి వివిధ రూపాలలో రావడానికి ఓ పురాణ కథ. 
ఓసారి సృష్టికర్త సృష్టించిన ప్రజాపతులలో మోహంధకారంలో కూరుకుపోయిన దక్షప్రజాపతి తన కూతురు, అల్లుడైన పార్వతీపరమేశ్వరులను పిలవకుండా తాను నిశ్చయించుకొన్న యజ్ఞారంభం చేశాడు. అన్నీ తెలిసిన పరమేశ్వరుడు శాంతచిత్తంతో తపస్సులో మునిగినా స్ర్తి అతి సున్నితమైన మనస్సు, చంచలమైన బుద్ధితో, మాతృరాధనలో మక్కువ కలిగిన పరమేశ్వరి దక్షుని యజ్ఞానికి వెళ్లింది. అక్కడ అనుకోని అవమానాలను ఎదుర్కొంది. అర్థనారీశ్వరి అయిన అమ్మ తన సగభాగాన్ని అవమానించడం భరించలేక ఆ యజ్ఞగుండంలోనే ఆత్మాహుతి చేసుకొంది. విషయం తెలుసుకొన్న పరమేశ్వరుడు రుద్రుడయ్యాడు. వీరభద్రుని పంపించాడు. యజ్ఞ్ధ్వంసం జరిగింది. దక్షుడు తలలేని వానిగా మిగిలాడు. ఆహుతి అయిన తన సతీ శరీరాన్ని పరమేశ్వరుడే చేతులతో ఎత్తుకొని బయలుదేరాడు. 
అలా బయలుదేరిన పరమేశ్వరుని చేతులలోని సతీ శరీరంలోని అవయాలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్క ప్రదేశంలో లోకకల్యాణం కోసం జారాయి. అలా సతీదేవి అవయవాలు పడిన ప్రదేశాలన్నీ శక్తి పీఠాలుగా రూపొందాయి. ఆ తల్లి ఆ శక్తి పీఠాలల్లో ఒక్కొక్క పేరుతో ప్రసిద్ధురాలైంది. అలా ఏర్పడిన శక్తిపీఠాలు 108గా పరిఢవిల్లాయి. వాటిల్లో పదునెనిమిది పీఠాలు మిక్కిలి ప్రఖ్యాతి గాంచాయి. అవే అష్టాదశ పీఠాలుగా వెలుగొందుతున్నాయి. ఈ ఆశ్వీయుజమాసంలో ఈ పీఠాలల్లో సుప్రతిష్టిమైన అమ్మవార్లరూపాలను పూజించిన వారికి ఇహలోక సంపదలు పరలోక సంపత్తి లభ్యవౌతుంది. ముక్తికాంత అయన అమ్మనే మోక్షాన్ని జీవునకు ప్రసాదిస్తోంది. 
ఆ పీఠాలల్లోని అమ్మ- శాకంబరీ, కామాక్షి, శృంఖలాదేవి, చాముండేశ్వరి, జోగులాంబ, భ్రమరాంబికా, మహాలక్ష్మి, ఏకవీర, మహాకాళీ, పురాహూతికా, గిరిజాదేవి, మాణిక్యాంబ, కామరూప, మాధవేశ్వరి, వైష్ణవీదేవి, మంగళగౌరి, విశాలక్ష్మి, సరస్వతి అనే పేర్లతో అలరారుతోంది. 
01 శాకంబరీ : 
శ్రీలంక రాజధాని కొలంబో నగరానికి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో గల ట్రింకోమలైలో కొలువైన ఈ తల్లి శాంకబరీగా నీరాజనాలందు కొంటోంది. పార్వతీదేవి కాలిగజ్జెలు ఇచ్చట పడుటవలన ఈ ప్రాంతానికి ఈ విశిష్టత లభించింది. 
02 కామాక్షి: 
మోక్షపురాలల్లో ఒకటైన కంచిలో శక్తి స్వరూపిణి కామాక్షీదేవిగా దర్శనమిస్తోంది. నగరేషు కంచి గా మహాకవులచేత పొగడబడింది. విష్ణుకంచి, శివకంచిగా ఉన్న ఈ కాంచీపురంలో శివకంచిలో అమ్మ కామాక్షి చతుర్భుజిగా కొలువుదీరింది. శివోపదేశంతో ఇక్కడ అమ్మవారు తపస్సు చేసి ఏక్రామేశ్వరుణ్ణి కోరి వివాహం చేసుకొంది. భక్తుల కోరిక మేరకు ఏక్రామేశ్వరుడు, కామాక్షి దేవి ఇద్దరూ కంచిలో కొలువై భక్తుల పాలిట కల్పవృక్షమై కాపాడుతున్నారు. 
03 శృంఖలాదేవి: 
ఈ దేవి ప్రద్యుమ్నంలో కొలువుదీరింది. ఈప్రద్యుమ్ననాన్ని గుర్తించటంలో భేదాభిప్రాయాలున్నా పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీజిల్లాలో ఉన్న అమ్మవారే శృంఖాలాదేవిగా చాలామంది భావిస్తారు. ఈ తల్లి పురిటి బిడ్డలను చల్లగా కాపాడుతుంది. పైగా తల్లి నడికట్టుతో దర్శనమిస్తుంది కనుకనే ఈ తల్లి బిడ్డల సౌభాగ్యానికి పేరుపెట్టిన దేవిగా జనులు ఆరాధిస్తారు. ఈ తల్లిని ఒకసారి తన శాపవిమోచనం కోసం ఋష్యశృంగుడు ప్రతిష్టించాడని ఐతిహ్యం. శృంగమహర్షి ప్రతిష్టించిన దేవి కనుకనే శృంఖలా అన్న నామమేర్పడిందని ఓ కథనం ప్రచారం లో ఉంది. పైగా మానవులకు ఉన్న ఈతిబాధలనే సంకెళ్లను త్రెంచి వేసి ఈ తల్లి కాపాడుతున్న దేవిగా భక్తులు ఆరాధిస్తుంటారు. 
04 చాముండేశ్వరి: 
కర్ణాటక రాష్ట్రంలో మైసూరుకు ఒక కిలోమీటరు దూరంలో చాముండేశ్వరి కొలువుదీరింది. మహిషాసురుణ్ణి సంహరించిన ఈ తల్లిని దేవమానవులందరు కొనియాడుతూ మానవులను ఎల్లవేళలా కాపాడడానికి ఇక్కడ కొలువుదీరమని ప్రార్థించగా ఈ తల్లి ఇక్కడ నెలకొంది. పైగా ఇక్కడ సతీదేవి వెంట్రుకలు పడిన స్థానంగా కూడా పరిగణిస్తారు భక్తులు. 
05 జోగులాంబ: 
మహాబూబ్ నగర్ లోని అలంపురం జిల్లాలో కొలు వైన ఈ తల్లి గురించి అనేక స్థలపురాణాలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వకాలంలో పుణ్యవతి అనే కన్య కాశీ విశ్వనాథుడిని మెప్పించి పుత్రరత్నాన్ని పొందింది. ఆ పుత్రుడు మరలా శివుని మెప్పించి శివుని వరాన్ని పొంది ఈ అలంపురంలో తపస్సు ఆచరించగా సృష్టికి ముందే ఇక్కడ పరమేశ్వరుని గూర్చి తపస్సు చేసిన బ్రహ్మ ఓ సిద్ధరసం ఇవ్వగా ఆ యువకుడు ఇక్కడ నవబ్రహ్మల ఆలయాలను నిర్మించాడు. జోగులాంబ దేవతను తన తపస్సుతో మెప్పించి ఆ యువకుడే ఇక్కడ అమ్మ అనుగ్రహంతో జోగులాంబను ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణాలుచెబుతున్నాయి. ఈ తల్లి కూడా చతుర్భుజియై తన భక్తులను కాపాడుతోంది.* 
06 భ్రమరాంబాదేవి: 
శ్రీ పర్వతం, శ్రీనగం, సిరిగిరి, శ్రీగిరి అనే పేర్లతోఖ్యాతి గడించిన శ్రీశైలంలో చుట్టూ నాలుగు గోపురాలతో, కోటగోడల్లాంటి ఎత్తయిన ప్రాకారాలతో సుమారు 2,79, 300 చదరపు అడుగుల విశాలమైన ప్రాంగణంలో మల్లికార్జునితో కలసి శక్తి స్వరూపిణి భ్రమరాంబికగా కొలువుదీరింది. ఈ అమ్మవారి గురించిన అనేక స్థలపురాణాలు ఆసక్తిదాయకాలు గా కనిపిస్తాయి. అమ్మ అరుణాసురసంహారానంతరం మల్లికార్జునితో కలసి కొలువుదీరిందని పురాణ కథనం ఇక్కడ విశేషంగా చెప్తారు. ఈ మల్లికార్జున భ్రమరాంబలను కొలిచినవారికి పునర్జన్మ ఉండదు. 
07 మహాలక్ష్మిదేవి: 
కరవీరంగా ప్రసిద్ధిపొందిన కొల్హాపురిలో కొలువు దీరిన తల్లే మహాలక్ష్మి దేవి. కొల్హుడన్న రాక్షసుడు తన వరగర్వంతో మితిమీరి ప్రవర్తిస్తున్నందున మహిషాసురుణ్ణి చంపిన తల్లి కొల్హుని తో పోరాడి ఈ అసురుడిని సంహరించింది. కాని ఆ అసురుడి చివరి కోరికను తీరుస్తూ ఆ తల్లీ ఇక్కడే కొలువైంది. ఈ నగరానికి కొల్హాపురి నామధేయానికి కారకురాలైంది. ఐదు గోపురాలతో ఉన్న ఈ మహాలక్ష్మి ఆలయం చూపరులకు ఆనందాన్నీ ఆముష్మిక సంపదను ఇస్తుంది. 
08 ఏకవీర్యకా దేవి: 
మహారాష్టల్రోని అహ్మద్ నగర్ కు సుమారుగా 45 కిలోమీటర్ల దూరంలో ఈ మూహూర్యం అనే క్షేత్రం నెలకొంది. ఈ క్షేత్రంలోని దేవి సతీ శరీరంలోని కుడిస్తనంగా చెప్తారు. ఈతల్లిని కొలిచిన వారికి అష్టైశ్వర్యాలతో పాటుగా శక్తిసంపన్నతలు, విద్యాబుద్దులు కూడా ప్రాప్తిస్తాయి. 
09 మహాకాళి: 
ప్రపంచ ఖ్యాతి గడించిన ఉజ్జయిని లో సతీదేవి శరీరాంగమైన మోచేయి ఇక్కడ పడింది. ఈ క్షేత్రంలోనే త్రిపురాసురుణ్ణి సంహరించిన పరమశివుడు దేవతల కోరిక మేరకు జ్యోతిర్లింగంగా రూపొందుకొనగా అమ్మవారు మహాకాళిగా ఇక్కడ కొలువైందనే గాథ ప్రచారంలోంది. వేదప్రియుడను శివభక్తుడిని దూషణుడను అసురుడి నుంచి కాపాడడానికి పరమశివుడు మహాకాళేశ్వరుడుగా అవతరించాడు. ఆ వేదప్రియుడే శ్రీచక్రోపాసన చేసి అమ్మవారిని మహాకాళిగా దర్శనం చేసుకొన్నాడు. వేదప్రియునితోపాటుగా దేవమానవ కోరిన ప్రకారం ఇక్కడే మహాకాళేశ్వరుడు, మహాకాళి ఈ ఉజ్జయినిలో కొలువై పూజలందుకుంటున్నారు. 
10 పురుహూతికాదేవి: 
ఇంద్రుని పూజలందుకొన్న పార్వతీ దేవే పురుహూతికాదేవిగా ఈ ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సుమారుగా 18 కిలోమీటర్ల దూరంలోని పిఠాపురంలో ప్రతిష్టితమైంది. వ్యాసమహర్షి ఈ పురాహుతికా దేవిని, కుక్కటేశ్వర స్వామిని కోరి కొలిచినట్లు పురాణ కథనం. 
11 గిరిజాదేవి: 
ఒరిస్సాలోని కటక్ పట్టణానికి సుమారు104 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాజాపూర్ టౌన్ లో ఈ ఓడాణ్యం అనే క్షేత్రం ఉంది. ఇక్కడ పూర్వం చతుర్ముఖుడైన బ్రహ్మ మహావిష్ణువును స్మరిస్తూ యజ్ఞం చేయగా హోమగుండంనుంచి ఏడుగురు కన్యలు ఆవిర్భవించారు. అందులో గిరిజాదేవి అనే బాలిక బ్రహ్మను ఏమి వరం కావాలో కోరుకొమ్మనగా విధాత నీవు ఇక్కడే కొలువై జనులందరినీ చల్లగా చూడాలని వరం అడిగాడు. బ్రహ్మకోరిక తీర్చడానికి ఆ తల్లి గిరిజాదేవిగా ఇక్కడ అవతరించిందని స్థలపురాణం చెప్తోంది. పైగా ఇక్కడ సతీదేవి నాభిపడిన స్థలంగా కూడా భక్తులు భావిస్తారు. 
12 మాణిక్యాంబాదేవి: 
సతీదేవి కణితి పడిన ప్రదేశమే ద్రాక్షారామం. ఇక్కడ భీమేశ్వరునితోపాటుగా మాణిక్యాంబా దేవి కొలువైంది. కాశి విశ్వనాథుణ్ణి వదిలిన దుఃఖభారాన్ని వ్యాసుడు ఈ భీమేశ్వర మాణిక్యాంబలను కొలిచి పోగొట్టుకొన్నట్టు చెప్తారు. ఈ మాణిక్యాంబదేవిని కొలిచినవారికి తీరని కోరికలు ఏవీ ఉండవు. ఈక్షేత్రమే దక్షిణ కాశిగా ప్రఖ్యాతి వహించింది. 
13 కామరూపాదేవి: 
అస్సాం లోని గౌహతి నగరానికి సుమారు 7కిలోమీటర్ల దూరంలో ఈ కామరూపాదేవి ఆలయం ఉంది. ఈ దేవినే కామాఖ్య అనీ పిలుస్తారు. ఈ అమ్మవారు కోరిక కోర్కెలను ఈడేర్చటంలో ముందుండే తల్లిగా ప్రఖ్యాతి వహించింది 
14 మాధవేశ్వరి: 
సతీ చేతివ్రేళ్లు పడిన స్థలంగా చెప్తారు. ప్రయాగ క్షేత్రంలో కొలువైన అమ్మవారిని మాధవేశ్వరిగా భక్తులు కొలుస్తారు. 
15 వైష్ణవీదేవి: 
కాశ్మీరులోని జమ్మునుంచి సుమారు 60 కిలోమీటర్లదూరంలో ఉన్న త్రికూట పర్వతం పైన ఈ వైష్ణవీదేవి ఆలయం ఉంది. ఈ వైష్ణవీదేవి త్రేతాయుగం నాటి శ్రీరాముడు ద్వాపరయుగంనాటి శ్రీకృష్ణార్జునులు కూడా పూజించారనే ఐతిహ్యం ఉంది. 
16 మాంగల్య గౌరీదేవి: 
పవిత్రక్షేత్రాలుగా ప్రసిద్ధి వహించిన వాటిలో గయ చాలా విశేషమైంది. సర్వమంగళాలను ప్రసాదించే పార్వతీదేవి ఇక్కడ మాంగల్య గౌరిగా దర్శనమిస్తుంది. ఇక్కడ ఈ క్షేత్రంలో సతీదేవి వక్షోజాలు పడిన కారణంగా ఈ గౌరీదేవి ప్రతిష్టితమైనట్టుగా చెప్తారు. 
17 విశాలాక్షి: 
కాశీఅన్న పేరు స్మరించినంత మాత్రానే ముక్తిని ప్రసాదించే విశ్వనాథునితో కొలువైన తల్లే విశాలాక్షి. ఈ తల్లినే శివుని కోపాగ్ని లోంచి వ్యాసుని కాపాడింది. ఈ తల్లినే వ్యాసుని క్షుద్బాధనూ పోగొట్టింది. కనుక ఈ తల్లిని పూజించిన వారికి ఈలోకంలోనే కాక పరలోకసంపదలు కూడా ప్రాప్తిస్తాయి.అంతే కాక శివసాయుజ్యం లభిస్తుంది. 
18 సరస్వతీ: 
ముగ్గురమ్మల శక్తినే శ్రేష్ఠమైన పరాశక్తి అని చెప్పడానికి వీలుగా కొల్హాపూర్‌లో మహాలక్ష్మిదేవిగాను, కాశ్మీరులో మహాసరస్వతీ దేవిగాను కొలువైంది శక్తిస్వరూపిణి. ఈ తల్లిని ఆరాధించిన వారు విద్యాసంపన్నులు అవుతారు. శ్రీనగర్‌కు సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న ఈ తల్లిని కీర్ భవానిగా కూడా ఇక్కడి వారు పిలుస్తారు.

--((***))--

16.  శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి, కసాపురం 

నెట్టి కంటి అంటే ఒకే ఒక కన్ను గల వాడు అని అర్ధం .ఈ దేవాలయం అత్యంత ప్రాచీన మైనది .దీనికొక చరిత్ర ఉంది .క్రీ.శ.1521లొ హంపీ క్షేత్రం లొ శ్రీ వ్యాస రాయల వారు తుంగ భద్రా నదీ తీరం లొ నిత్య కర్మాను స్టానం చేస్తున్నారు .తాను ఒంటికి పూసు కొనే మంచి గంధం తో ,తన ఎదురుగా ఉన్న ఒక శిల మీద శ్రీ ఆంజనేయ స్వామి రూపం చిత్రించారట .అది నిజ రూపం ధరించి నడవటం ప్రారంభించిందట .వ్యాస రాయల వారు పట్టిన పట్టు విడవ కుండా అయిదారు సార్లు అలాగే చిత్రాన్ని రచించటం ,అది నడుస్తూ వెళ్ళి పోవటం జరి గిందట. .చివరికి వ్యాస రాయల వారు శ్రీ ఆంజనేయ స్వామివారి ద్వాదశ నామాల బీజాక్ష రాలతో ఒక యంత్రం తయారు చేసి ,దానిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజ రూపాన్ని చిత్రించారట .అప్పుడు స్వామి ఆ యంత్రం లొ బంధింప బడి అందులో స్థిరం గా ఉండి పోయారట .ఒక నాటి రాత్రి స్వామి వారు వ్యాస రాయల కలలో దర్శనమిచ్చి ‘’నన్ను కీర్తించి పూజిస్తే చాలదు .నాకొక ఆలయాన్ని నిర్మించు .అందులో నా విగ్రహం అత్యంత భక్తీ శ్రద్ధల తో ప్రతిష్టాపన చెయ్యి .’’అని చెప్పారట .వ్యాస రాయల వారు ఎంతో శ్రమించి ,అందరి సాయం తో ఆ ప్రాంతాననే 732 శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ట చేశారట .ఈ నాడు మనకు కని పించే ‘’చిప్ప గిరి ‘’గ్రామం లొ శ్రీ భోగేశ్వర స్వామి వారి దేవాలయం లొ వ్యాస రాయల వారు నిద్రిస్తుండగా శ్రీనేట్టి కంటి ఆంజనేయ స్వామి వారు కలలో కన్పించి తాను ఆ ప్రాంతం నుండి దక్షిణ దిశ గా ఉన్న ప్రాంతం లొ అతి చిన్న రూపం లొ భూమిలో ఉన్నానని తనను బయటికి తీసి మరలా ఆగమ సంప్రదాయాల నను సరించి ప్రతిష్ట చేయమని ఆనతిచ్చారట .ఆ ప్రదేశం ఎక్కడ ఉన్నదో తమకు మార్గ దర్శనం చేయమని వ్యాస రాయల వారు కోరగా స్వామియే ఒక ఎండిన వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గరకు వెళ్ళమని అక్కడికి చేర గానే అది చిగురిస్తుందని అక్కడే భూమిలో తాను ఉంటానని చెప్పారట . 

వ్యాస రాయల వారు కలలో స్వామి చెప్పినట్లే మర్నాడు బయల్దేరి నడిచి వెళ్ళి కొంత దూరం లొ ఎండిన వేప చెట్టును కను గొన్నారు .రాయల వారు దాని సమీపానికి రాగానే ఆ వేప చెట్టు తక్షణమే ఆకు పచ్చ గా చిగురించిందట .ఆశ్చర్య పడిన వ్యాస రాయల వారు అక్కడ భూమిని త్రవ్విన్చారట .అక్కడ దొరికిన ఒంటి కంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు .దేవాలయాన్ని నిర్మించారు . ఈ ఆలయం కసాపురం .గ్రామానికి అతి దగ్గర లొ ఉండటం వల్ల శ్రీ ఆంజనేయ స్వామిని కసా పురం ఆంజనేయ స్వామి అని కూడా అంటారు .నెట్టి కల్లు లొ ఆవిర్భా వించాడు కనుక స్వామిని శ్రీ నెట్టి కంటి ఆంజనేయ స్వామి అనీ భక్తులు ఆప్యాయం గా పిలుచు కొంటారు .శ్రీ నెట్టి కంటి ఆంజనేయ స్వామికి ఒక విచక్షణ లక్షణం ఉంది .స్వామి కి కుడి కన్ను మాత్రమె ఉంటుంది .ఆ కంటి తోనే భక్తులను కృపా కటాక్షాల తో వీక్షిస్తూ ,వారి మనో భీష్టాలను నేర వేరుస్తారని ప్రతీతి .భక్తుల బాధలను స్వామి వారికి విన్న వించు కొంటె, కలలో కన్పించి నివారణ మార్గాలను సూచిస్తారట .స్వామి విగ్రహానికి అపూర్వ తేజస్సు ,సాటి లేని ఆకర్షణా ఉండి,ముగ్ధుల్ని చేస్తుంది . .అందుకే అశేష భక్త జనం స్వామి వారల నుదర్శించి ,స్వామి వారి అనుగ్రహం తో తమ జీవితాలను తీర్చి దిద్దు కొంటున్నారు .స్వామి విగ్రహం తూర్పు ముఖమై ,దక్షిణ దిశ ను చూస్తూ ,,భక్త జనుల మొరలు విని పించు కొంటూ ,బాధలను తీరుస్తూ ,ఉన్నట్లు గా అని పిస్తుంది .స్వామి నిజ రూప దర్శనంను ఆ సుందర దివ్య సుందర విగ్రహానికి అభిషేక సమయం లొ కన్నుల పండువు గా దర్శించి ,తరించ వచ్చు. 

కసాపురం అనంత పురం జిల్లాలో గుంతకల్లు రైల్వే జంక్షన్ కు అయిదు కిలో మీటర్ల దూరం లొ ఉంది.బస మార్గం లొ గుత్తి కి 35కి.మీ .దూరం లొ ఉంది.. ప్రతి ఏడాది ఒక చర్మ కారుడు ఏక భుక్తం ఉంటూ ,బ్రహ్మ చర్యాన్ని పాటిస్తూ శ్రీ ఆంజనేయ స్వామికి ఒక చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు మర్నాడు వచ్చి చూస్తె అది అరిగి పోయి నట్లు చిరిగి పోయి నట్లు కని పించటం విశేషం .స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రి పూట వాహ్యాళి వెళ్ళి వస్తూంటాడని భక్తుల నమ్మకానికిది నిదర్శనం . ప్రతి ఏటా వైశాఖ ,శ్రావణ ,కార్తీక ,మాఘ మాసాలలో శని వారం నాడు అసంఖ్యాకం గా భక్తులు స్వామిని సందర్శించి తమ మనో భీష్టాలను నేర వేర్చుకొంటారు .చైత్ర మాసం లొ పౌర్ణమి రోజున ఈ ఆలయం లొ శ్రీ హనుమద్ జయంతి జరపటం ప్రత్యేకత .
--((***))--
15  బేలూరు . ఆలయవిశేషాలు 
సృష్టిలోని సౌందర్యాన్నంతా ఒక్కచోట రాశిపోసి ఒక్కో పిడికెడు తీసుకొని దాంతో ఒక్కో అందాలరాశిని సృష్టిస్తే ఎలా వుంటుంది? అచ్చం మదనిక లా వుంటుంది. అవును,అలాంటి 38 మదనికలను ఒకేచోట చూడాలనుకుంటున్నారా?అయితే మీరు కర్ణాటకలోని బేలూరు వెళ్ళాల్సిందే.అక్కడ యగాచి నది ఒడ్డున హోయసల రాజైన విష్ణువర్ధనుడు నిర్మించిన చెన్నకేశవస్వామి ఆలయాన్ని సందర్శించాల్సిందే. ఆ ఆలయం ఎలా వుంటుందో తెలుసా? శంకరాభరణం సినిమాలోని” రాగం తానం పల్లవి,నా మదిలోన కదలాడి కడతేరమన్నవి ...: పాట గుర్తుందా?ఆ పాటను బేలురులోనే చిత్రీకరించారు. ఆ పాటలో మంజుభార్గవి మెరుపుతీగలా నర్తిస్తుందే...అచ్చం ఆ మెరుపు తీగాలానే వుంటుంది అక్కడున్న ఒక్కో మదనిక.వాటికి తోడు పక్కనే రతీమన్మధులు. భక్తిలో రక్తి,రక్తిలో ముక్తి .అన్నీ కలిస్తే బేలూరు .ఈ ఆలయవిశేషాలు ...పుట్టు పూర్వోత్తరాలు ,పనిలో పనిగా మన అమరశిల్పి జక్కన్న కథ కూడా తెలుసుకుందామా? 
కర్ణాటక లోని మిగిలిన ఆలయాలతో పోలిస్తే బేలూరులోని చెన్నకేశవస్వామి ఆలయం కాస్త భిన్నంగా కన్పిస్తుంది. క్రీస్తుశకం 1116 సంవత్సరంలో చోళులతో జరిగిన తలకాడ్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత 1117 సంవత్సరంలో విష్ణువర్ధనుడు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. అలా మొదలైన ఆలయం 18 వ శతాబ్దం వరకు క్రమక్రమంగా పలురకాలుగా అభివృద్ధి చెందింది. ఇక్కడ కొలువైన దేవుడు చెన్నకేశవస్వామి.చెన్న అంటే అందమైన అని అర్ధం. అందమైన ఈ కేశవుడు మహావిష్ణువు 24 అవతారాలలో ఒకటైన మోహినీ అవతారంలో పట్టుచీర ,ముక్కు పుడక ,పూలను పెట్టుకున్న రూపంలో అలంకరించుకొని ఉంటాడు.ఆరు అడుగుల ఎత్తు,నాలుగు చేతులు,ఆచేతుల్లో శంఖు,చక్ర,గద,పద్మం వుంటాయి.చిత్రమైన కాంబినేషన్ కదూ.ఈ కేశవున్నే విజయనారాయణ అని కూడా పిలుస్తారు. ఈ విగ్రహం చుట్టూ విష్ణువు అన్ని అవతారాలను సుందరశిల్పాలుగా చెక్కారు.స్వామికి ఇరువైపులా చిన్న ప్రమాణంలో ప్రియసతులైన శ్రీదేవి,భూదేవి ప్రతిమలను స్థాపించారు. అప్పటివరకూ జైనమతాన్ని అనుసరించిన విష్ణువర్ధనుడు రామానుజాచార్యుల బోధనలతో వైష్ణవాన్ని స్వీకరించాడు.దాంతో ఈ ఆలయ నిర్మాణంలో వైష్ణవాలయ పోకడలు చాలా ఎక్కువగా కన్పిస్తాయి.అక్కడ లభించిన 118 శాసనాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.దీనిని హోయసలులు నిర్మించినప్పటికీ ,శిల్పంలో శైలిలో మాత్రం పశ్చిమ చాళుక్యుల ముద్ర అంతర్లీనంగా కనిపిస్తూనే వుంది.తాత మొదలుపెట్టిన ఆలయ నిర్మాణాన్ని మనవడు వీరబల్లాల పూర్తీ చేశాడు.ఇది పూర్తవ్వడానికి మొత్తం 103 ఏళ్ళు పట్టింది. 
ఈ ఆలయానికి మొత్తం మూడు ద్వారాలు వుంటాయి.ప్రధాన ద్వారం వద్ద వున్న గోపురం విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మితమైంది.ద్వారం దాటి లోపలికి ప్రవేశిస్తే మధ్యలో తూర్పుముఖంగా చెన్నకేశవ ఆలయం వుంటుంది. దానికి కుడివైపున కప్పెచన్నిగారాయ మందిరం,కొంచెం వెనుకగా సౌమ్య నాయకి (లక్ష్మీదేవి)మందిరం ,ఎడమవైపున రంగనాయకి (ఆండాళ్) మందిరం వుంటాయి. ఇక్కడే రెండు పెద్ద పెద్ద స్థంబాలు వుంటాయి.ఒకటి గరుడ స్థంభం,రెండోది దీప స్థంభం. మధ్య యుగం నాటి శిల్పులతో పోలిస్తే ,హోయసల శిల్పులకు స్పృహ ఎక్కువ.వారు మందిర నిర్మాణంలోనే తమ పేర్లు,వంశచరిత్రను నిక్షిప్తం చేసి తమ సంతకాన్ని ప్రపంచానికి తెలియచేశారు. ఈ ఆలయంలో చెక్కిన శిల్పాలలో 40 మల్లితమ్మ అనే శిల్పి చెక్కినవే.అలాగే దాసోజ,అతని కుమారుడు చవన చెక్కిన శిల్పాలు కూడా ప్రధానమైనవే. మదనికల శిల్పాలలో అత్యధిక భాగం ఈ తండ్రీకొడుకులు చెక్కినవే,మల్లియన్న,నాగోజ అనే శిల్పులు జంతువులూ,పక్షుల శిల్పాలు చెక్కగా,మంటపం లోని అనేక శిల్పాలను చిక్క హంప,మల్లోజ తదితర శిల్పులు చెక్కారు. ఇక్కడ మరో ప్రధానమైన శిల్పి జక్కన్న,అతని కుమారుడు డంకన ల గురించి,వారు చెక్కిన శిల్పాల గురింవే.ఇక్కడ అమరశిల్పి జక్కన్న కు సంబంధించి ఒక గొప్ప కథ ప్రచారం లో వుంది. 
అమరశిల్పి జక్కనాచారి తన స్వగ్రామమైన క్రీదాపుర (కైదల) వదిలి దేశపర్యటన చేస్తూ బెలూరుకు చేరుకొని దేవస్థాన నిర్మాణ కార్యంలో నిమగ్నుడై ఉంటాడు.అతని కుమారుడైన డంకన చారి తన తండ్రిని చూడకుండా పెద్దవాడై మంచి శిల్పిగా ఎదిగి బేలూరు కు చేరు కుంటాడు.అయితే అక్కడ విగ్రహాలు చెక్కుతున్న గోప్పశిల్పి జక్కన్న తనతండ్రి అని అతనికి తెలియదు.అలా జక్కన్న ఒక దేవుని విగ్రహం చేక్కుతుండగా డంకణాచారి ఆ విగ్రహం లో ఒక లోపం వుందని చెప్తాడు.అయితే అందులో ఎలాంటి లోపమూ లేదనీ,ఎవరైనా లోపం చూపిస్తే చేతిని నరుక్కున్తానని శపథం చేస్తాడు. ఇక అర్చకులు పరీక్ష మొదలెడతారు.విగ్రహానికి చుట్టూ గంధాన్ని పూసి ఆరబెడతారు.చివరకు గంధం మొత్తం ఎండినా లోపం వున్న చోట మాత్రం ఎండదు.అక్కడ పగల కొడితే కొంచెం నీరు,అందులోంచి జీవం వున్న ఒక కప్పు బయట పడతాయి. దీంతో ఆ దేవతామూర్తికి “కప్పెచన్నగారాయ “ అనే పేరు వచ్చింది.దాంతో శపథం చేసిన జక్కన తన చేతిని నరుక్కుంటాడు. డంకన తన కొడుకని తెలుసు కుంటాడు.ఆ తర్వాత తండ్రీకోడుకులిద్దరూ తమ స్వగ్రామమైన కైదాల వచ్చి అక్కడో చెన్నకేశవ స్వామి మూర్తి ని చెక్కుతారు.ఆలయ నిర్మాణం అయ్యాక జక్కన్నకు నరుక్కున్న చెయ్యి మళ్ళీ వచ్చిందని చెప్తారు. తుంకూరు కు తొమ్మిది కిలోమీటర్ల మీటర్ల దూరంలో వున్న కైదల లో ఇప్పటికీ ఆ ఆలయం వుంది.కొన్ని స్వచ్చంద సంస్థలు ఆ ఆలయ పరిరక్షణ,పునరుద్ధరణకు నానా తిప్పలు పడుతున్నాయి.అమరశిల్పి జక్కన్నను ప్రేమించేవాళ్ళు ఆ సంస్థలకు సాయం చెయ్యొచ్చు. 
చివరిగా చిన్న మాట....జక్కన్న కథతో స్ఫూర్తి పొంది 1964 వ సంవత్సరంలో తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు,బి.సరోజాదేవి హీరో హీరోఇన్లు గాను ,కన్నడం లో కళ్యాణ్ కుమార్ హీరో గానూ అమరశిల్పి జక్కన సినిమాలు వచ్చాయి..సూపర్ హిట్ అయ్యాయి.“ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో ...:పాట ఆ సినిమాలోనిదే
--((***))--
14  కార్తికేయ రణశిబిరం " తిరుత్తణి " 

ఆది దంపతులు పరమేశ్వరుడు, పార్వతీ దేవిల రెండో తనయుడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి. దేవసేనానిగా వ్యవహరించిన మురుగన్‌ రాక్షసుడు సూరపద్ముడిని సంహరించాడు. ఈ సంహారం కోసం ఆయన పలు రణశిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే వున్నాయి. అవి పళని, తిరుచెందూర్‌, స్వామిమలై, తిరుపరన్‌కుండ్రం, తిరుత్తణి, పళముదిరి కొలయ్‌. 

సుబ్రహ్మణ్యస్వామికి మురుగన్‌, కార్తికేయుడు, శరవణుడు, శరవణవభుడు, షణ్ముగం, ఆర్ముగం, స్కందుడు అనే పేర్లుకూడా వున్నాయి. సూరపద్ముడిని సంహరించిన అనంతరం స్వామి తిరుత్తణిలోని కొండపై విశ్రాంతి తీసుకున్నాడు. ప్రశాంత వదనంతో కనిపిస్తాడు. అందుకనే ఈ క్షేత్రం అరుల్‌మిగు సుబ్రహ్మణ్య షణ్ముఖ క్షేత్రాల్లో ఒకటిగా పేరొందింది. 

* శ్రీవల్లితో వివాహం 

స్వామివారు శ్రీవల్లిని ఇక్కడే వివాహం చేసుకున్నారు. సూరపద్ముడిని తిరుచెందూరులో సంహారం చేసిన అనంతరం ఇక్కడకు చేరుకున్న షణ్ముఖుడు విశ్రాంతి తీసుకుంటారు. అందుకునే అన్ని మురుగన్‌ ఆలయాల్లో జరిపే స్కంద షష్టిని ఇక్కడ నిర్వహించరు. దీనికి బదులుగా యుద్ధవుత్సవం జరుగుతుంది. ఆ రోజున వేయి కిలోగ్రాముల పుష్పాలతో అభిషేకం కన్నులపండువగా నిర్వహిస్తారు. స్వామివారి వాహనం మయూరం ఇక్కడ కనిపించదు. దీని స్థానంలో ఏనుగు వుంటుంది. దీనికి సంబంధించి ఒక పురాణగాథ ప్రచారంలో వుంది. 

సుబ్రహ్మణ్యస్వామికి స్వర్గలోకాధిపతి దేవేంద్రుడు తన కుమార్తె దేవయానిని ఇచ్చి వివాహం జరిపించే సమయంలో ఐరావతాన్ని కానుకగా ఇస్తాడు. అందుకే ఐరావతం విగ్రహరూపంలో ఆలయంలో వుంటుంది. అయితే దేవలోకం కూడా వృద్ధి చెందాలన్న తలంపుతో ఐరావతం తూర్పువైపు తిరిగి వుండాలని దేవేంద్రుడు అభ్యర్థిస్తాడు. ఆ అభ్యర్థనను మురుగన్‌ అంగీకరించడంతో ఐరావతం వేరే దిక్కును చూస్తుండటం గమనించవచ్చు. 

* చందన విశిష్టత 

ఈ ఆలయంలో స్వామికి ఉపయోగించే చందనం ఎంతో విశిష్టమైనది. చందనాన్ని దేవేంద్రుడే స్వయంగా కానుకగా ఇచ్చినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ గంధాన్ని నుదుటిపై ధరించకుండా నీటిలో వేసి సేవిసే అన్ని జబ్బులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. అయితే పర్వదినాల్లో మాత్రమే ఈ చందనాన్ని పంపిణీ చేస్తారు 

* 365 మెట్లు 

ఆలయాన్ని చేరుకోవాలంటే భక్తులు 365 మెట్లు ఎక్కాల్సివుంటుంది. సంవత్సరంలో 365 రోజులకు గుర్తుగా ఈ వీటిని ఏర్పాటుచేయడం విశేషం. నూతన సంవత్సరాదికి మెట్లోత్సవం నిర్వహిస్తారు. దీనినే పడిపూజ అంటారు. 

* భైరవస్వామి 

ఆలయంలో భైరవుడు నాలుగు శునకాలతో కలిసివుంటాడు. నాలుగు శునకాలు నాలుగు వేదాల పరిరక్షణకు అని తెలుస్తోంది. భైరవుడి ముందు పీఠం ముందు మూడు శునకాలు దర్శనమిస్తాయి. పీఠం వెనుక భాగంలో మరో శునకం వుంటుంది. చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనుకునేవారు ఇక్కడ ప్రార్థన చేస్తే మంచి ఫలితాలు వుంటాయి. 

* వల్లీ, మురుగన్‌ల సందేశం 

సుబ్రహ్మణ్వేశ్వరస్వామి, వల్లీల వివాహం మానవాళికి ఒక సందేశానిచ్చింది. వల్లీదేవిని స్వామివారు వేటగాడి రూపంలో పెళ్లిచేసుకుంటారు. జననం, మరణం అనే వలయంనుంచి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆ పరంధాముడిని ఆర్తితో ప్రార్థించాలి. ఈ ప్రపంచం ఒక బాడుగ ఇల్లు లాంటిదని ఎవరూ తెలుసుకోలేరు. అంతా తమదే, శాశ్వతమనే భావనతో స్వార్థంగా ప్రవరిస్తుంటారు. అయితే ఇవన్నీ అశాశ్వతమని తెలుసుకొని ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని సుబ్రహ్మణ్వేశ్వర, వల్లీదేవిలు మానవాళికి సందేశమిచ్చారు. 

* స్వామి మహిమలు 

అరుణగిరినాథర్‌ అనే మహాభక్తుడు ఇక్కడే స్వామివారిని కొలుస్తూ పరమపదించాడు. కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు ఒకసారి ఇక్కడకు వచ్చారు. మెట్లు ఎక్కుతుండగా ఒక వృద్ధుడు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని దీక్షతులకు ఇచ్చారు. ఆ ప్రసాదాన్ని నోటిలో వేసుకొనగానే ముత్తుస్వామి నోరు పవిత్రమైంది. ఆశుధారగా గానం చేశారు. అమృతప్రాయమైన ఆ ప్రసాదాన్ని సాక్షాత్తు కార్తికేయుడే వృద్ధుని రూపంలో వచ్చి ముత్తుస్వామికి ఇవ్వడం భగవద్‌ లీలావినోదం. 

* ఇలా చేరుకోవచ్చు 

* చెన్నై-తిరుపతి మార్గంలో ఈ క్షేత్రం వుంది. 
* తిరుపతి నుంచి 66 కి.మీ.దూరంలో వుంది. 
* తిరుపతి నుంచి రైలు, బస్సు లేదా ఇతర వాహనాల ద్వారా తిరుత్తణి చేరుకోవచ్చు 
* మెట్ల మార్గం ద్వారా లేదా రోడ్డు మార్గం ద్వారా స్వామి సన్నిధిని చేరి స్వామిని దర్శించుకోవచ్చు.

--((***))--
౧౩.  వీరేశ్వర స్వామి వారి దేవాలయం – మురమళ్ళ  పేరు గురించి 

ఈ ప్రదేశంలో పూర్వం మునులు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ఉండేవారని అందువలన ఈ ప్రాంతానికి ముని మండలి అనే పేరు వచ్చింది. అది కాలక్రమంలో మురమళ్ళగా మారిందని ప్రతీతి. 

గౌతమీ నది తీరాన ఉన్న సుప్రసిద్దమైన క్షేత్రం ఇది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నుండి 25 కి మీ దూరం లో ఉన్న మురమళ్ళ గ్రామం లో వెలసిన వీరేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ది చెందినది. భద్ర ఖాళి సమేత వీరేశ్వర స్వామి దేవాలయం ఇది. ప్రతి రోజు ఇక్కడ కల్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. 

దక్షయజ్ఞం ద్వంసంగావించి తదుపరి మహావిష్ణువు కోరిక పై దక్ష యాగం పుర్తిగావించుటకు సమ్మతించి దక్షుని మొండెమునకు గొర్రె తలను తగిలించి దక్షుని బ్రతికించి ఆయన చేత వేదోక్తముగా యజ్ఞమును పూర్తి చేయించిన తారువాత కూడా శ్రీ వీరభద్రుడు కోపాగ్నిని వీడలేదు. దేవతలందరూ గ్రహించి శ్రీ వీరభద్రుని శాంతింప చేయుటకై వైకుంటమునకు వెళ్లి శ్రీ మహావిష్ణువును ప్రార్తించి శాంతింప చేయమని కోరిరి. మహా విష్ణువు నరసింహ అవాతరం దాల్చి వీరభద్రుని శాంతింప చేయుటకు ప్రయత్నించిన పలితం కలగలేదు. 

అప్పుడు మహా విష్ణువు జరిగినదంతా బ్రహ్మ లోకమునకు వెళ్లి బ్రహ్మ కు చెప్పగా అప్పుడు త్రిమూర్తులు ఆది పరాశక్తిని ధ్యానించి గ షోడ కళ లో ఒక కళ ను భాద్రకాళి నామము తో భూలోకమునకు పంపి వీరభాద్రున్ని శాంతింప చేయుటకు ప్రయత్నించిన వీరభద్రుడు శాంతింప నందున అప్పుడు భద్రకాళి ప్రక్కనగల తటాకమునందు మునిగి భాద్రాకాలి స్వరూపం నుండి కన్య రూపమును దాల్చి వీరభద్రుడి ముందు నిలువగా అప్పుడు వీరభద్రుడు శాంతి అయ్యాడు అని అప్పుడు వారీరువురికి గందర్వ వివాహ పద్దతిన కాల్యణం జరిపించారు అని స్థల పురాణం. 

ఆ నాటి నుండి స్వామీ వారికి గందర్వ పద్దతిలోనే కల్యాణోత్సవం జరిపిస్తారట !! అందుకే ఈ క్షేత్రం లో పెల్లిలు కాని వాళ్ళు కల్యాణోత్సవం జరిపిస్తే తొందరగా పెల్లిలు జరుగుతాయని భక్తుల నమ్మకం. 

* శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవాలయము 

ఐ.పోలవరం మండలానికి చెందిన మురమళ్ళ గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం జిల్లాలోని ఒక చారిత్రక ప్రదేశం.స్వామి వారు నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంన్నారు ఇక్కడ కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది వివాహ సాంప్రదాయం వైదిక స్మార్తాగమం ప్రకారం పురోహితులు నిత్యకళ్యాణం జరిపిస్తారు . దీనితొపాటు ఆలయ అర్చకులు యక్షగానం పాడటం మరోవిశేషం . ఇక్కడ స్వామి వారికి రోజువారీ నిత్యకల్యాణం నిర్వహిస్తారు. ప్రతిరోజు దాదాపు వందల మంది యాత్రికులు వారి పూజలు నిర్వహించడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ప్రతి రోజు రాత్రి 05 గం.ల నుండి స్వామి కల్యాణములు చేయబడుతాయి. 

* స్థల పురాణం. 

దక్షయజ్ఞము అనంతరము వీరభద్రుడు శ్రీ మహావిష్ణువు కోరికపై దక్షునకు మేక తలను తగిలించి దక్షుని పునర్జీవుని గావించి ఆయనచే వేదోక్తముగా దక్ష యజ్ఞమును పూర్తి గావించెను. కాని సతీదేవి అగ్నిని పుట్టించుకుని ఆహుతి అవుటచే కలిగిన కోపము ఎందరు ప్రయత్నించిననూ ఎంతకునూ శాంతించపోవుటచే త్రిమూర్తులతో కూడి దేవతలు ఆదిపరాశక్తిని ప్రార్థించగా జగన్మాత తన శోడష కళలలో ఒక కళను భద్రకాళి నామమున వీరభద్రుని శాంతింప చేసేందుకు పంపించెను. భద్రకాళి ఎంత ప్రయత్నించిననూ వీరభద్రుని క్రోధము చల్లారకుండుటచే 'అశ్శరభ శరభ' అనుచూ ప్రక్కనే గల తటాకమునందు మునిగి భీకరమైన భద్రకాళీ రూపమునుండి అందమైన కన్యగా ప్రత్యక్షమై వీరభద్రునకు కనిపించెను. అంతట వీరభద్రుడు శాంతించుటతో దేవతలు మునులు వారిరువురికీ గాంధర్వ పద్ధతిన మునిమండలి ప్రాంతమున వివాహము చేసిరి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అదేరీతిన గాంధర్వ కళ్యాణం జరుగుతున్నది. 
* ఆలయ నిర్మాణము 

ఈ కథాగమనము జరిగిన పిమ్మట ఆ పరంపరలో పూర్వదేవాలయము ఏర్పడినది. కాలక్రమములో వరదలు సంభవించుత చేతను, ఇతర ప్రకృతి వైపతీత్యముల వలననూ పూర్వదేవాలయము నదిలోనికి వరిగిపోయింది. అంతట కొమరగిరి వాస్తవ్యులు ప్రసిద్ధ శివభక్తులు వెలువలి శరభరాజుగారి స్వప్నమునందు స్వామి సాక్షాత్కరించి ఆలయ పునర్నిర్మాణము తాను అనుజ్ఞ ఇచ్చిన విధమున కావించవలసిందిగా ఆదేశించారు. అట్లే శరభరాజుగారు మరికొందరు పూర్వ ఆలయమునుండి శివలింగమును తీయుటకు ప్రయత్నించగా అశరీరవాణిగా ఈ విధముగా వినవచ్చింది. 

తనను చేతులపై లేపి పోలవరమునందున్న భాణేశ్వరస్వామి ఆలయము మార్గములో తీసుకుపోవలెనని మార్గమున ఏదో ఒకప్రాంతమున అలవికాని బరువుగా మారిపోతాననీ అక్కడే తన ఆలయము నిర్మించవలెననీ తెలియజేసెను. అలా శివలింగమును చేతులపై మోసుకు పోతున్న వారికి మురమళ్ళ గ్రామమున ఒక ప్రదేశమునకు రాగానే మోయనలవికాని విపరీత బరువు అగుటతో అక్కడే దించి ఆలయము గోపుర నిర్మాణములు కావించి వైభవముగా ప్రతిష్ఠా కార్యక్రమములు నిర్వహించిరి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వైభవముగా కళ్యాణ మహోత్సవములు నిరంతరాయముగా నిర్వర్తిస్తున్నారు. 

వెళ్ళు మార్గం :- 

మురమళ్ళ, తూర్పు గోదావరి జిల్లా, ఐ.పోలవరం మండలానికి చెందిన గ్రామము. 

మురమళ్ళ, అమలాపురం నుండి 25 కి.మీ., కాకినాడ నుండి 38 కి.మీ., (వయా యానాం) మరియు రాజమండ్రి నుండి 105 కి.మీ. (రావులపాలెం ద్వారా) దూరంలో ఉంది. మురమళ్ళ గ్రామం మేజర్ పంచాయితీ మరియు ఇది ముమ్మిడివరం మండలం సమీపంగా ఉంది. 

అమలాపురం నుండి 25 కి మీ దూరం లో ఈ క్షేత్రం ఉంది. 
రాజముండ్రి నుండి సుమారు 71 కి మీ దూరం ఉంటుండు ( ద్వారపూడి-యానం రోడ్ ) 

కాకినాడ, అమలాపురం నుండి అనేకం బస్సులు నడుస్తాయి. రాజమండ్రి నుండి బస్సులు పరిమిత సంఖ్యలో ఉన్నాయి.
--((***))--

12. కోణార్క్ సూర్యదేవాలయం.

మహోన్నతమయినది ఒరిస్సా రాష్ట్రలోని కోలార్లో ఉంది.

సూర్యుని రథం ఆకారంలోనిర్మించిన కోణార్క్ ఆలయం విశిష్టతలు
భారతదేశంలో ప్రసిద్ధిచెందిన ఆలయాలలో కోణార్క్ ఆలయంఒకటి. సూర్యునిరథం ఆకారంలో నిర్మించబడిన ఈ ఆలయం...
13వ శతాబ్దంలో నల్లగ్రానైట్ రాళ్లతో కట్టడం జరిగింది. ఈ ఆలయాన్ని తూర్పు గంగా రాజవంశానికి చెందిన మొదటి నరసింహదేవ (క్రీ.శ. 1236 - క్రీ.శ. 1264) నిర్మించినట్లు చారిత్రాత్మక కథనాల్లో పేర్కొనబడింది.
దీని నిర్మాణం ఎంత అద్భుతంగా వుంటుందంటే.. 24 చక్రాలు కలిగిన ఒక భారీరథాన్ని ఏడు అశ్వాలు లాగుతున్నట్లుగా కనువిందు చేస్తుంటుంది. దీనిని ఆనాటికాలపు నగిషీలు ఎంతో అద్భుతంగా అలంకరించారు. మత సంబంధిత (బ్రాహ్మణులకు చెందిన) వాస్తుశాస్త్రానికి ఈ ఆలయం ఒక అద్భుత స్మారక
చిహ్నం. ఇది ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ క్షేత్రానికి 85 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రక్షింప బడుతోంది.
స్థలపురాణం :
పురాణ కాలంలో.. శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు శాపగ్రస్తుడై కుష్టురోగం బారినపడ్డాడు. అప్పుడతడు కోణార్క్ దేవాలయానికి దగ్గరలో వున్న చంద్రభాగ తీర్ధం వద్ద కూర్చుని సూర్యుని స్మరిస్తూ తపస్సు చేశాడు. ఆ సమయంలో అతడు చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా.. అందులో సూర్యభగవానుడి విగ్రహం లభించింది. దాంతో సూర్యభగవానుడు తనని అనుగ్రహించాడని భావించి సాంబుడు కోణార్క్ ఆలయం ఉన్న ప్రదేశంలో ఆ విగ్రహాన్ని
ప్రతిష్టించాడు. అలా ఆవిధంగా ఇక్కడ ఆలయం ఏర్పడింది. అయితే ప్రస్తుతమున్న ఆలయంలో పురాణకాలంలో స్థాపించబడ్డ విగ్రహం మాత్రం కన్పించదు. అసలు ఆ విగ్రహం ఏమైందన్న విషయం ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. ప్రస్తుతం కోణార్క్ లో ఉన్న ఆలయాన్ని గంగవంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు నిర్మించినట్టుగా చెబుతారు. ఆరోజుల్లో దాదాపు 12 వందల మంది శిల్పులు పన్నెండేళ్లపాటు కష్టపడి ఈ ఆలయాన్ని
నిర్మించారని చరిత్రకారులు పేర్కొంటున్నారు.
ఆలయ విశేషాలు :
దేవాలయ ప్రధానద్వారం వద్ద ఉండే రెండు సింహపు విగ్రహాలు యుద్ధ ఏనుగును తొక్కివేస్తున్న ట్టుగా దర్శనమిస్తాయి.
పైనుంచి చూసినప్పుడు ప్రతి ఏనుగు మానవ శరీరం మాదిరిగా కనిపిస్తుంది. ప్రధాన ద్వారం వద్ద ఒక నృత్య మందిరం కూడా కనిపిస్తుంది. సూర్య భగవానుడికి వందనం సమర్పించేందుకు దేవాలయ నృత్యకారులు ఈ మండపాన్ని ఉపయోగిస్తారు. దేవాలయం మొత్తం మీద వివిధ రకాల పుష్ప సంబంధిత, రేఖాగణిత నమూనాలు దర్శనమిస్తాయి. శృంగారాన్ని ఆస్వాదించే రూపంలో మనుష్యులు, దేవతలు, పాక్షిక దైవత్యం కలిగిన రూపాలు సైతం దేవాలయంలో కనిపిస్తాయి.
సూర్యుని రథం ఆకారంలో నిర్మించబడిన ఈ దేవాలయానికిఇరువైపులా 12 జతల చక్రాలు చెక్కబడి ఉన్నాయి. అలాగే వారంలోని ఏడురోజులను సూచించే విధంగా ఏడుగురర్రాలూ ఉంటాయి. ఈచక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని చెప్పగలరు. సూర్య పరిభ్రమణాన్ని చూపించే విధంగా ఈ చక్రాలు చెక్కబడడం ఓ గొప్ప విశేషం.
కోణార్క్లో సూర్యుని దేవాలయంతో పాటు అఖండాలేశ్వర దేవాలయం, అమరేశ్వర ఆలయం, దుర్గ, గంగేశ్వరీ, కెండూలీ, లక్ష్మీనారాయణ, మంగళ, నీల మాధవ ఆలయాలు కూడా ఉన్నాయి.
అద్భుతమైన శిల్పకళకు, ఆధునిక పరిజ్ఞానికి గుర్తుగా కోణార్క్ దేవాలయాన్ని పేర్కొనవచ్చు. నమో సూర్యదేవాయ నమః .
--((***))--


11. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, సింహాచలము
సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉన్నది.
ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ద తదియ నాడు (మే నెలలో) వస్తుంది.
ఈ ఆలయం అనేక విశేషాలతో కూడి ఉన్నది. రాజగోపురము, కోరిన కోర్కెలు తీర్చే కప్పస్తంభము. మాధవధార వంటి అనేక ధారలు. సింహాచలం పైడితల్లమ్మ, మాధవస్వామి దేవాలయం, శివాలయం. ఇలా ఎన్నో ఆలయాలు. స్వామివారి పుష్కరిణి, స్థలపురాణం. చందనయాత్ర, 42కి.మి నడకసాగే గిరిప్రదక్షణం. ఇలా ఏన్నో విశేషాలతో కూడి ఉన్న క్షేత్రం.

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, సింహాచలము

సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణము నకు 11 కి.మీ...
--((***))--


10. మంజునాథ సన్నిధి ధర్మస్థలం

శివుడు లీలామయుడు. సర్వాంతర్యామి. ఆయన లీలలు అనంతం. అనన్య సామాన్యం. శివుని లీలావిశేషాలతో పునీతమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ‘్ధర్మస్థల’ ఒకటి. దేశంలోని అతి పురాతన శైవధామంగా, శివుని సుందర క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ‘బెల్తంగడి’ తాలూకాలో వుంది. బెంగళూరు నగరానికి సుమారు 350 కిలోమీటర్లు దూరంలోఉన్న ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తూ మహేశ్వరుడు శ్రీ మంజునాథ స్వామిగా పూజలందుకుంటున్నాడు.

విశాలమైన వన సంపద, మది పులకించిపోయే ప్రకృతి అందాలు ఈ క్షేత్రం సొంతం. ఇక్కడకు వెళ్ళే భక్తులకు ఓ సుందరవనంలో విహరించామన్న అనుభూతి కల్గుతుంది. శివుని లీలావిశేషాలతో పునీతమవుతున్న ధర్మస్థల దివ్యక్షేత్రం ‘నేత్రావతి’ నదీమతల్లి ఒడ్డున అలరారుతోంది. ప్రకృతి అందాలకు వేదికగా భాసిల్లుతున్న నేత్రావతి నదీమతల్లి భక్తులకు, పర్యాటకులకు కావలసినంత మానసికానందాన్ని, ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేస్తాయి. ఈ ఆలయానికి వచ్చే భక్తులంతా ముందుగా ‘నేత్రావతి’నదిలో పుణ్యస్నానాలు చేస్తారు. నదీస్నానం వల్ల పాపాలన్నీ పోయి సమస్త సుఖ సంతోషాలు సొంతమవుతాయ.

మంజునాథస్వామి ఆలయ ప్రాంగణం చూపరులను దృష్టిమరల్చనీయదు. ఈ ఆలయం కేరళ సంప్రదాయ రీతిలో ఉంటుంది. ఆలయానికి సంబంధించిన గోపురాదులు ఏవీ భక్తులకు కనిపించవు. ప్రధానాలయం ఆలయానికి ముందుభాగంలో పెద్దదిగా ఉన్న గంట భక్తులను ఆకట్టుకొంటుంది. అలనాటి కాలం నాటిదిగా దీనిని చెబుతారు. ప్రధానాలయమంతా భక్తులతో కిటకిటలాడుతుంది. గర్భాలయ మండపం పైన మధ్యభాగంలో పరమేశ్వరుని మూర్తి ఉంది. శ్రీ మంజునాథస్వామి ఆలయం కొన్ని ఆలయాల సమూహం, స్వామివారి ఆలయానికి ఎడమవైపు భాగంలో విఘ్ననాయకుడి మందిరం ఉంది. దీనికి సమీపంలోనే ‘అణ్ణప్పస్వామి’ ఆలయముంది. శ్రీ మంజునాథస్వామికి అచంచల భక్తుడు ‘అణ్ణప్ప’. ఈ కారణంగా స్వామివారి గర్భాలయానికి సమీపంలోనే అణ్ణప్పస్వామివారి ఆలయం నిర్మించారు. శ్రీ మంజునాథ స్వామివారి గర్భాలయం నిత్యనూతనంగా, తేజోవిరాజమానమవుతుంది. సమస్త ఆభరణాయుక్తుడైన మంజునాథ స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. స్వామి ఆలయానికి సమీపంలో ‘అమ్మనవరు’ ఆలయముంది. ‘అమ్మనవరు’ దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. స్ర్తిలు సౌభాగ్యసిద్ధికోసం, సంతానం కోసం ‘అమ్మనవరు’ను దర్శించుకుని భక్తితో పూజిస్తారు.

పురాణగాథ: ధర్మస్థల క్షేత్రానికి సంబంధించి పురాణగాథ ఒకటి ప్రచారంలో వుంది. సుమారు ఐదువందల సంవత్సరాల క్రితం నెల్యాదివీడులో అమ్మాదేవి బళ్ళారి, బ్రహ్మన్న ప్రెగ్గడెలనే పుణ్యదంపతులుండేవారు. ఆ దంపతులిద్దరూ అత్యంత దయామయులు. ధర్మాన్ని కాపాడుతూ, ధర్మపరిరక్షణ కోసం నిత్యం తపనపడుతూ వుండేవారు. ఒకసారి ధర్మదేవతలు మానవ రూపం ధరించి ‘నెల్యాదివీడు’ను తమకిచ్చి, సమీపాన ఒక గృహాన్ని నిర్మించి అందులో నివసించమని, అలాచేస్తే వారి ఐశ్వర్యం పదింతలవుతుందని చెప్పి అదృశ్యమయ్యారుట, ధర్మదేవతల అభీష్టంమేరకు ఆ దంపతులు అలాగే చేశారట. అనంతరం ధర్మదేవతలు ఆ దంపతులకు స్వప్నంలో కనిపించి తాము ‘కాలరాహు’, ‘కాలర్కై’, ‘కుమారస్వామి’, ‘కన్యాకుమారి’అనే ధర్మదేవతలమని, తమకు గుడులను కట్టించి ధర్మాన్ని కాపాడమని కోరారట. అయితే ధర్మదేవతలతోపాటు ఇతర దైవాలను కూడా పూజించనిదే ఫలసిద్ధి కల్గదని భావించి, ఆ దంపతులు ధర్మదేవతల అభీష్టంమేరకు ‘కదిరి’నుంచి మంజునాథ స్వామి లింగాన్ని తెప్పించి, ప్రతిష్ఠించారట.

ఆనాటినుంచి ఆ దంపతులు మంజునాథస్వామిని, ఇతర దేవతలను భక్తిశ్రద్ధలతో పూజించారు. ‘మంజుల’అంటే అభిరామం లేదా అందమని అర్థం. నాథుడనగా అధిపతి దేవుడు. అంటే మంజునాథుడంటే మంజుదైవతమని అర్థం. మంజునాథస్వామి పేరు బోధిసత్వ మంజునాథుని నుంచి ఏర్పడి ఉండవచ్చని, అతడు జైన, హిందువుల నమూనాలో ఉన్న దేవుడంటారు. ధర్మస్థల శ్రీ మంజునాథస్వామి ఆలయం నిత్యం వేలాదిమంది భక్తులతో సందడిగా ఉంటుంది. నిత్యం స్వామి నామస్మరణంతో మారుమోగుతున్న ఈ దివ్యాలయంలోకి ప్రవేశించే పురుషులు శరీరంపై పైవస్త్రాలు ధరించాలి.

ఆలయానికి వచ్చే భక్తులందరికీ అన్నదానం చేస్తారు. దీన్ని శ్రీ మంజునాథస్వామి ప్రసాదంగా భావించి భక్తితో స్వీకరిస్తారు. అపురూపశిల్ప సమన్విత స్తంభాలు, ప్రాకారాలతో ఈ ఆలయం అలరారుతోంది. ఆలయానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో గోమఠేశ్వరస్వామి ఆలయం ఉంది. ప్రకృతి అందాలు, విరబూసిన వనాలు, కొండలు ఈ ఆలయానికి ఆభరణాలుగా భాసిల్లుతాయ. ఈ ఆలయ ప్రాంగణంలో గోమఠేశ్వరస్వామి (బాహుబలుని) విగ్రహం ఉంది.

ఈ విగ్రహం 39 అడుగుల ఎత్తులో ఏకశిలగా దర్శనమిస్తుంది. ధర్మస్థల శ్రీ మంజునాథస్వామి క్షేత్రంలో ఏటా లక్ష దీపోత్సవాన్ని అత్యంత ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఏటా కార్తీక బహుళ దశమి మొదలుకుని అమావాస్యవరకూ ఐదు రోజులపాటు లక్ష దీపోత్సవాన్ని నిర్వహిస్తారు.
--((***))--

9. నైమిశారణ్యం
ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు సుమారు 150 కి.మీ దూరంలో సీతాపూర్ జిల్లాలో నైమిశారణ్య క్షేత్రం ఉంది.
మన దేశంలోని పరమ పుణ్యమైన పుణ్యతీర్థాలలో నైమిశారణ్య దివ్య క్షేత్రాన్ని మొదటిగా చెప్పుకోవచ్చు. పవిత్ర గోమతీ నదీతీరంలో అలరారుతున్న ఈ దివ్య ధామంలోని పాదధూళి సైతం అత్యంత పవిత్రమైనదని పురాణాల ద్వారా అవగతమవుతోంది. సూత, శౌనకాది మహా మహర్షులు నివశించిన ఈ దివ్య ధామం మహా ఋషుల యజ్ఞాల వల్ల యజ్ఞ భూమిగా ప్రశస్తి పొందింది. సమస్త పురాణాలకు పుట్టినిల్లుగా భాసిల్లిన ఈ దివ్య ధామం ఆ మునుల తపశక్తితో మరింత పవిత్రతను ఆపాదించుకుంది. అందుకే నైమిశారణ్య క్షేత్రాన్ని
తీర్థానాముత్తమం తీర్థం
క్షేత్రాణాం క్షేత్రముత్తమం అని పిలుస్తారు.
సుందర ప్రకృతి రమణీయ దృశ్యాలు, సహజమైన వనసంపదతో ప్రశంతంగా ఆధ్యాత్మకాను భూతులను ప్రోది చేసే దివ్యధామంగా విరాజిల్లుతున్న ఈ దివ్య క్షేత్రాన్ని స్థానికులు నీమ్ సార్ గా, నీమ్ చార్ వ్యవహరిస్తుంటారు.
స్థల పురాణం :
ఒక సారి మునులంతా బ్రహ్మ వద్దకు వెళ్లి కలిప్రభావం సోకని పుణ్య ప్రదేశం ఎక్కడైనా వుంటే ఆ ప్రాంతంలో తాము తపోయజ్ఞ కార్యనిర్వహణ చేసుకుంటామని ప్రార్థించారు. బ్రహ్మ కలియుగంలో సత్పురుషులను దృష్టిలో వుంచుకుని ఒక చక్రాన్ని సృష్టించి ఆ చక్రం ఎక్కడ ఆగుతుందో అక్కడ మునులను నివసించమని చెప్పాడు. ఆ చక్రం అన్ని లోకాలు తిరిగి చివరకు నైమిశారణ్య ప్రాంతంలో ఆగింది. చక్రం నేమి (అంచు) తాకిన భూప్రదేశం నైమిశంగా పిలవబడింది. చక్రం స్పృశించిన ప్రాంతం అరణ్యం కావడం వల్ల నైమిశారణ్యం అనే పేరు వచ్చింది. చక్రం భూమిని చీల్చుకుని దిగడం వల్ల అక్కడో నీటిగుండం ఏర్పడింది. ఫలితంగా భూమి నుంచి పవిత్ర జలధారలు పెల్లుబికాయి. ఈ పవిత్ర తీర్థాన్ని చక్ర తీర్థంగా పిలుచుకోవడం జరుగుతుంది. చక్రాకారంలో వున్న ఈ తీర్థంలో రోజూ వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అమావాస్య సోమవారం రెండూ కలిసిన రోజున సోమవతీ అమావాస్య అని పిలవడం జరుగుతుంది. అలాంటి పర్వదినాన లక్షలాది మంది భక్తులు చక్రతీర్థంలో పుణ్యస్నానాలు చేసి తరిస్తారు. చక్రతీర్థం ఒడ్డున చేసే దానాలు, జపాలు అఖండమైన పుణ్యాన్ని ఆపాదించి పెడతాయని పురాణాలు చెబుతున్నాయి. నైమిశారణ్యం దివ్యక్షేత్రం. అనేక మంది దేవీదేవతల కొలువుతో పవిత్ర తీర్థరాజంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రాన అన్ని సంప్రదాయాలతో పాటూ హిందూ ధార్మిక విధానాలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. అనుక్షణం భగవంతుని నామస్మరణతో మారుమ్రోగే ఈ దివ్యధామం ఓ ఆధ్యాత్మిక లోకాన్ని స్ఫురణకు తెస్తుంది.
అలాగే దధీచి మహర్షి లోక కళ్యాణార్థం తన దేహాన్ని త్యాగం చేసిన స్థలంగా నైమిశారణ్యానికి మరో పురాణ వృత్తాంతం ప్రచారంలో వుంది. వృత్తాసురుడనే రాక్షసుడ్ని సంహరించేందుకు దేవతలకు ఓ దివ్యాస్త్రం కావల్సి వచ్చింది. దాంతో దేవతలంతా శ్రీ మహావిష్ణువుని వేడుకోగా దధీచి మహముని ఎముకలు నారాయణ తేజస్సుతో ప్రకాశిస్తాయని, ఆయన వెన్నెముక దివ్యాస్త్రంగా రూపొందుతుందని శ్రీ మహావిష్ణువు దేవతలకు చెప్పారట. దేవతల అభీష్టం తెలుసుకున్న దధీచి మహాముని ప్రాణత్యాగం చేసి పూజ్యనీయుడయ్యాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ దధీచి మహర్షి లోకకల్యాణార్థం తన ప్రాణాన్ని త్యాగం చేసిన దివ్యస్థలం నైమిశారణ్యమేనని పురాణాల ద్వారా అవగతమవుతోంది.
దేవాలయాలు :
నైమిశారణ్యంలో చక్రతీర్థం సమీపంలో భూతేశ్వరనాథ్ ఆలయం వుంది. ఇక్కడ భూతేశ్వరనాథ్ స్వామికి ముఖం వుండటం విశేషంగా చెబుతారు. ఫణి ఫణాచత్రముతో, త్రిశూల చిహ్నాముతో అభిముఖంగా వున్న నందీశ్వరునితో భూతనాథుడు భక్త కల్పవృక్షమై విరాజుల్లుతున్నాడు. ఈ స్వామికి చేసే అభిషేకం ద్వాదశ జ్యోతిర్లింగాలకు చేసిన అభిషేక ఫలంతో సమానమని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. ఈ ఆలయంలో వున్న వినాయకుడ్ని గణేశ్ జీ అని పిలుస్తారు. విక్రమాదిత్యుడు ప్రతిష్టించినట్టుగా చెప్పబడుతున్న ఈ వినాయకుడికి ముందు ప్రణామాలు చేసిన అనంతరమే భక్తులు నైమిశారణ్య దర్శనం చేసుకుంటారు.
సూత, శౌనుకాది మహా మునులు తపస్సు చేసిన పవిత్ర భూమిగా విరాజిల్లుతున్న నైమిశారణ్య దివ్యక్షేత్రంలో ప్రతీ అడుగు మహిమాన్విత దేవీదేవతల ఆలయాలతో విరాజిల్లుతోంది. భూతేశ్వర్ నాథ్ మందిరానికి సమీపంలో వున్న మందిరాలలో బదరి నారాయణుడి (దేవ రాజన్ ) మందిరం చెప్పుకోదగినది. ఈ భూలోకంలో ఉన్న 108 వైష్ణవక్షేత్రాలలో బదరీనారాయణుడి ధామం కూడా ఒకటిగా ప్రసిద్ధి నొందినది. దీనితో పాటూ రాధాకృష్ణ, గోపాల్ , కాలభైరవుడు మొదలైన మందిరాలు ఈ ప్రాంగణంలో భక్తులకు దర్శనమిస్తాయి.
నైమిశారణ్యంలో ఉన్న మరో పవిత్రమైన దివ్యధామం లలితామాత ఆలయం. దేశంలో ఉన్న శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ దివ్యధామంలో లలితామాత దర్శనమిస్తుంది. రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దివ్యాలయం అతి పురాతనమైంది.
అలాగే వ్యాసుడు తపమాచరించిన తపస్థలి వ్యాసగద్ది, సూతుడు తపమాచరించిన తపస్థలి సూతగద్దిలు కూడా ఇక్కడ ప్రశాంత వాతావరణంలో అలరారుతూ ఆధ్యాత్మికానురక్తిని పెంచేవిగా వున్నాయి. అలాగే వాలి ,సుగ్రీవులు విశ్రాంతి తీసుకున్న హనుమత్ టిలామహేశ్వరాలయం తదితర ఆలయాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో పాండవులు సైతం సంచరించారని పురాణాలు చెబుతున్నాయి.
అలాగే ఈ క్షేత్రంలో విజయవాడ వైఖానన సమాజం వారు నిర్మించిన బాలాజీ మందిరం కూడా ఓ ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయంలో తిరుపతిలో మాదిరి అర్చనా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం వల్ల ఉత్తరాదిలోసైతం శ్రీ వేంకటేశ్వర స్వామిని స్వయంగా దర్శించుకునే మహద్భాగ్యం భక్తులకు కలిగింది.
నైమిశారణ్యం సందర్శనం బహు జన్మల పుణ్యఫలం. హిందువుగా పుట్టిన ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ఒకసారైనా దర్శించాల్సిన మహిమాన్విత పుణ్య స్థలం ఇది.

--((***))--

8. భద్రాద్రి నిలయం రామం నత్వపాపైః ప్రముచ్యుతే

భద్రాచల నిలయుడైన శ్రీరాముని సేవించినవారు,సకల పాపా విముక్తులై తరిస్తారు
శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యకి ఎంతటి ప్రదన్యథొ ఉందొ అంతటి ప్ర్రదన్యథ భద్రాచల క్షేత్రానికి ఉన్నది . క్రీ .శ 1658-87 సంవత్సరాల మద్య కాలం లో గోల్కొండ కోటను రాజదానిగా పాలించే తానాషా వద్ద మంత్రులగా ఉండిన అక్కన్న-మాదన్న ల మేనల్లుడైన కంచర్ల గోపన్న (భక్త రామదాసు ) భద్రాద్రికి తహసిలదుర్గ ఉంటూ అలయమను కట్టించారు అని చరిత్ర ఆదరంగా తెలుస్తుంది .
శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్యం కల క్షేత్రం భద్రాచల దివ్య క్షేత్రం. భద్రుడు (రాముడు)అచలుడు (కొండ). రాముడు కొండ పైన నేలువున్నాడు కనుక క్షేత్రం భద్రాచలం గ ప్రసిద్దిచెందింది .

ఇతర క్షేత్రాలలో కోటిమందికి అన్నదానం చేస్తే కలుగు పుణ్యఫలం కాశి క్షేత్రం లో వేయిమందికి చేస్తే కలుగు పుణ్య ఫలం శ్రీ భద్రాచల దివ్య క్షేత్రం లో ఒకరికి అన్నదానం చేసిన కలుగుతుంది అని బ్రహ్మ పురాణం చెబుతుంది .

ఎవరు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు కల్యానముర్తి ఆయన శ్రిరమచంద్రస్వామి వారిని సేవించుటకై భద్రాచల క్షేత్రానికి విచ్చేస్తారో వారు అక్షయమైన ఫలాన్ని పొందుతారు అని బ్రహ్మ పురాణం చెబుతుంది .

భద్రాచలం దగ్గరలో సీతారాములు అరణ్యవాసం చేసిన పర్ణశాలను "శ్రీరాముడు కూర్చున్న రాతిబండ" " అమ్మవారి నారా చీరాల గుర్తులు " చూస్తుంటే మనసు ఎంత పులకించి పోతుందో

--((***))--

7. త్రిపురాంతకం

ప్రకాశం జిల్లా మార్కాపురానికి 40 కి. మీ. కర్నూలు - గుంటూరు రహదారిలోని వినుకొండకు 35 కి. మీ. రక్తనగాఖ్య నగరానికి (యర్రగొండపాలెం) 19 కి. మీ. దూరంలో ఉంది. త్రిపురాంతకం బాలా త్రిపూరాసుందరీ దేవి, పార్వతీ సహిత త్రిపురాంటకేశ్వరుల నివాస భూమి త్రిపురాంతకం. పరమశివుడు శ్రీశైలం వెళుతూ ఇచ్చట నడయాడినాడు. అందుకే త్రిపురాంతకం శ్రీశైలానికి ప్రధాన ద్వారం అయింది. స్వామి వారి గర్భాలయం, పంచముఖ స్వయంభుజాల లింగం, మేరు చక్రం మధ్యగల జలలింగం పై, అభిషేకం చేయబడ్డ జలం భూచక్రపిఠము గుండా క్రిందకు జారి పాతళచక్రము మధ్య రాసాలింగం పై పడటం ఒక అద్భుత దృశ్యం ఇది చూసి తీరాలి.

గర్భాలయానికి ఆగ్నేయదిశలో నాగారేశ్వరస్వామి, దక్షిణ భాగంలో అపరాధేశ్వరస్వామి ఉన్నారు. నైరుతి దిశలో ఆగస్త్యమహార్షి చే నిర్మించబడిన ఒక బిల మార్గం ఉంది. ఈ బిలము గుండా మునులు, తాపసులు, కాశీ,రామేశ్వరం, శ్రీశైలంకు ప్రయాణించే వారని ప్రతీతి. కానీ ఆది ప్రస్తుతం రాళ్లతో, విరిగిపోయిన దులములతొ మూసుకుపోయి ఉంది. ఆలయానికి చుట్టూ కోటికి పైగా శివలింగాలు, శతాధిక జలాశయాలు ఉన్నాయని పూర్వీకులు చెబుతారు.

శ్రీ శైల క్షేత్రానికి తూర్పు ద్వారమైన 'త్రిపురాంతకం'లో శివుడు ... త్రిపురాంతకుడిగా, పార్వతీ దేవి ... త్రిపుర సుందరీ దేవిగా భక్తులతో నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక్కడి 'కుమారగిరి'పై వెలసిన స్వామివారి ఆలయం నుంచి నైరుతి దిశగా చూస్తే ... కింది భాగంలో చెరువు ... దాని మధ్యలో కదంబ వృక్షాల మధ్య వెలసిన అమ్మవారి ఆలయం కనిపిస్తుంది.

గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తి కొన్ని వేల సంవత్సరాలనాటిదని చెబుతారు. ఇది తపో సంపన్నులకు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుందని అంటారు. గణపతి దేవుడి చెల్లెలు 'మైలాంబ' వేయించిన శాసనమును బట్టి ఈ ఆలయ నిర్మాణం 1209 లో జరిగిందనీ ... ప్రస్తుతం పూజలు అందుకుంటోన్న అమ్మవారి విగ్రహాన్ని ఆమే ప్రతిష్ఠింపజేసిందని స్పష్టమవుతోంది. ఈ అమ్మవారు రౌద్రమూర్తి గా కనిపించడమే కాకుండా, గతంలో ఇక్కడ జంతుబలులు విపరీతంగా జరిగేవనడానికి నిదర్శనాలు కనిపిస్తున్నాయి. విశేషమైనటువంటి పుణ్య దినాల్లో అమ్మవారు పులి ... సింహ ... గజ ... అశ్వ ... శేష ... నెమలి వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తుంటుంది.

ఈ క్షేత్రంలో వందకు పైగా శిలా శాసనాలు కనిపిస్తాయి. అయ్యవారికి ... అమ్మవారికి సంబంధించిన వివిధ సేవలకుగాను దాతలు సమర్పించిన వాటి వివరాలు ఈ దాన శాసనాల్లో కనిపిస్తుంటాయి. ఇక ఇక్కడి స్వామివారు మహా సత్యవంతుడనే విషయం మనకి 'బసవపురాణం'లో కనిపిస్తుంది. పూర్వం ఈ ఆలయం దగ్గర ఒక వ్యక్తి ఒక మూగ జీవిని రక్షించడం కోసం మరో వ్యక్తిని హత్య చేశాడు. అయితే అతని మాటలను ఆ గ్రామస్థులు నమ్మలేదు. అతను చెబుతున్నది నిజమేనంటూ స్వామివారి గర్భాలయం నుంచి వినిపించిందట. అందువల ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా భావించి భక్తులు విశేష సంఖ్యలో పూజలు జరుపుతుంటారు.

--((***))--

'6' కామాక్షీ తాయి అంటేనే కంటి చూపులతో కోరికలు తీర్చే తల్లి అని అర్ధము, ఆ తల్లికి సంబంధించిన అద్భుతమైన లీలలు కొన్ని ...

నెల్లూరులోని జొన్నవాడలో కొలువై ఉన్న కామాక్షీ అమ్మవారు, పిలిస్తే పలికే దైవం, ఈ అమ్మవారిని దేవతలా పూజించడం కన్నా కన్నతల్లిలా భావించేవారే ఎక్కువ. మా ఊరు కూడా నెల్లూరు కావడం వలన అనేక సార్లు అమ్మవారి దర్శనం చేసుకునే సౌభాగ్యం కలిగింది నాకు. సాధారణంగా అమ్మవారి పేర్ల చివర దేవి అని ఉండడం మనందరికీ తెలిసిందే, పార్వతీ దేవి, సరస్వతీ దేవి, లక్ష్మీ దేవి ఇలా కానీ ఇక్కడి అమ్మవారి చివర " కామాక్షీ తాయి " అని ఉంటుంది, ఆ పిలుపులోని మాధుర్యము అమ్మ యొక్క వాత్సల్యాన్నీ, ప్రేమను, కరుణను ప్రతిబింబిస్తుంది అంతే కాదు ఇక్కడి అమ్మకు శిక్షణ, దండనే కాకుండా " అలక " కూడా ప్రత్యేకమే ... కామాక్షీ తాయి లీలలు ఇన్నని చెప్పలేము, మల్లికార్జున స్వామి వారితో కొలువై ఉన్న అమ్మవారికి కొద్ది దూరంలోనే ఆవిడ అన్నగారైన నరసింహ స్వామి వారు కూడా ఒక చిన్న కొండపై కొలువై ఉన్నారు. ఈ ముగ్గురు దేవతా మూర్తులు కలిసి ప్రదర్శించిన అద్భుత లీలలు ఎన్నో చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాను వాటిలో కొన్ని తెలుసుకుందామా ...

సుమారు 1960లో జరిగిన సంఘటన ... హైదరాబాద్ కు చెందిన ఒక కుటుంబం అది, వారి ఇలవేలుపు శ్రీ నృసింహ స్వామి వారు. భర్త మిలిటరీ లో పని చేస్తున్నాడు. కాశ్మీరు ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నాడు తను, అది చలి కాలం మంచు ఎక్కువగా కురుస్తుంటుంది, అనుకోకుండా మంచు తుఫాను సంభవించింది. ఒకరితో ఒకరికి మాట్లాడే అవకాశాలు లేవు, జవాన్ల ఆచూకీ ఎవరికీ తెలియలేదు. ఇతను పని చేస్తున్న చోట అధికంగా మంచు పడుతుండడంతో తుఫాను తగ్గేంత వరకూ ఎవరూ ఆ స్థలానికి చేరుకోలేకపోయారు. దాదాపు నాలుగు రోజులు అతని గురించిన వివరాలు తెలియలేదు. మిలిటరీ వారు తన కోసం క్షుణ్ణంగా గాలించిన తరువాత అతని ఆచూకీ తెలియలేదని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ విషయం తెలిసి వారు పడిన బాధ వర్ణనాతీతం. నమ్ముకున్న దైవాన్నే కాపాడమని ప్రార్ధించారు. భర్త ఆచూకీ తెలియడం లేదు అనే విషయం తెలిసిన క్షణం నుండీ అతని భార్య పచ్చి గంగైనా ముట్టక రోధిస్తూ భగవంతుడిని వేడుకుంటూనే ఉన్నది. మరుసటి రోజు రాత్రి ఆవిడకు శోష వచ్చి పడిపోయింది. అప్పుడు స్వప్నంలో శ్రీ నృసింహ స్వామి వారు సాక్షాత్కరించి ఇలా అన్నారు, " నీ భర్త మీ దగ్గరకు రావాలంటే నువ్వు నెల్లూరులోని జొన్నవాడ క్షేత్రంలో కొలువై ఉన్న కామాక్షీ తాయిని ఆరాధించు, అక్కడే ఉంటూ 21 రోజులు దీక్షగా ఆరాధిస్తే నీ భర్త నీకు దక్కుతాడు." స్వప్నంలోనే జొన్నవాడ క్షేత్రాన్ని దర్శింపచేసి , క్షేత్ర మహత్యం కూడా వివరించారు శ్రీ నృసింహ స్వామి వారు.

పూర్వం కశ్యప మహర్షి " జన్న " యజ్ఞం నిర్వహించాడు. జన్న హోమం చేసిన చోటు కనుక జన్నవాడగా ప్రసిద్ధి గాంచింది ఈ క్షేత్రం, కాల క్రమంలో అది జొన్నవాడ అయ్యింది. ఆ హోమానికి సంప్రీతుడైన మహా దేవుడు సాక్షాత్కరించి ఏదైనా వరం కోరుకోమనగా, పరమ శివుడ్ని అక్కడే కొలువై ఉండమని కోరాడు కశ్యప మహర్షి. అందుకు అంగీకరించిన శివుడు అక్కడే ఉండిపోయాడు, ఆయన్ని వెతుక్కుంటూ వచ్చిన పార్వతీ దేవి శివుడ్ని కలిసి కైలాసానికి రమ్మని కోరగా కశ్యపునికి ఇచ్చిన వరం కారణంగా ఇక్కడే ఉంటాను అన్నాడు శివుడు, అప్పుడు కశ్యప మహర్షి పార్వతీ దేవిని ప్రార్ధించి తల్లీ నువ్వు కూడా ఇక్కడే కొలువై ఉండమని కోరగా, పార్వతీ దేవి కూడా ఇక్కడే శాశ్వతంగా ఉండిపోయింది. పరమ శివుని కోసం అనేక లోకాలు వెతుకుతూ వచ్చిన పార్వతీ దేవి కళ్ళు జోన్నవాడలో స్వామి వారిని చూడగానే అమితానందం పొంది ఆనందబాష్పాలు రాలాయి. అవి ప్రక్కనే ప్రవహించే పెన్నా నదిలో పడటం వలన అది నిత్య పుష్కరిణిగానూ పేరు గాంచింది. అటువంటి ఆనందకరమైన కళ్ళతో భక్తుల కోరికలు తీరుస్తుంది కనుక తను " కామాక్షీ తల్లి " అని స్తోత్రం చేసారు ఆది శంకరాచార్యులు. ఇంత విపులంగా శ్రీ నృసింహ స్వామి వారు ఈ భక్తురాలికి వివరించి జొన్నవాడకు వెళ్ళమని ఆదేశించారు.

స్వామి వారి ఆదేశం అత్తమామలకు చెప్పి, జొన్నవాడకు వచ్చి 21 రోజులు నియమ నిష్టలతో అమ్మవారిని సేవించింది ఆ భక్తురాలు. దీక్ష పూర్తయిన రోజున ఆమె భర్త జొన్నవాడకు చేరుకుని తనకు జరిగిన విపత్తును వివరించాడు. మంచు తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసి తన గుడారానికి వెళుతుండగా కాలుజారి లోయలో పడిపోయాడట. అక్కడి ఆటవికులు అతన్ని తమ గ్రామానికి తీసుకునిపోయి వైద్యం చేయడానికి ప్రయత్నించారు కాని, ఏదీ పని చేయలేదట, కానీ నాలుగు రోజుల క్రితం తనకు వైద్యం చేస్తున్న ఇంటికి ఒకావిడ వచ్చి, ఏదో తీర్ధము, కుంకుమ ఇచ్చి, తీర్ధం త్రాగిస్తూ ఉండమని, కుంకుమ పెట్టమని చెప్పి, నేను స్పృహ లోకి రాగానే ఒక చిన్న కాగితం ఇవ్వమని చెప్పిందట. ఆవిడ చెప్పిన విధంగానే నాకు స్పృహ వచ్చాక వారు జరిగినదంతా చెప్పి ఆ కాగితం ఇచ్చారు, అందులో " నీ కోసం నీ భార్య నెల్లూరు లో జొన్నవాడలో వేచి చూస్తోంది, అక్కడికి వెళ్ళి కలువు అని వ్రాసి ఉంది. " నేను మిలిటరీ వాళ్ళకు తెలియజేసి ఇక్కడకు వచ్చాను అన్నాడట. అలా అమ్మవారు ఆ దంపతులను కలిపింది. మరొక లీలను చూద్దామా ...

నెల్లూరు లోనే ఒక శ్రీమంతుల కుటుంబం ఉండేది. వారికి పెళ్లై ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు. జొన్నవాడ కామాక్షీ తాయిని వేడుకున్నాక, అమ్మవారు స్వప్న దర్శనం ఇచ్చి " మీరు జోన్నవాడలో ఒక అన్నదాన సత్రం కట్టిస్తామంటే, మీకు పిల్లలను అనుగ్రహిస్తాను" అని చెప్పింది. అప్పట్లో జోన్నవాడలో ఒక ఆలయంలోనూ అన్నదానం ఉండేది కాదు, ఊరిలో ఒక్క హోటలు కూడా ఉండేది కాదు. చాలా చిన్న గ్రామం కనుక ఇల్లు కూడా ఒకటి రెండు మాత్రమే ఉండేవి. అమ్మవారు కలలో చెప్పిన వాటికి వారు అంగీకరించి భక్తులకు నిత్యాన్నదానం చేయడం ప్రారంభించగానే అతని భార్య గర్భవతి అయ్యింది. అమ్మవారి అనుగ్రహం వలన వారికి ఒక అమ్మాయి పుట్టింది. ఆ కుమార్తె కామాక్షీ తాయి అనుగ్రహం వల్ల జన్మించింది కనుక " కామాక్షీ " అని అమ్మవారి పేరే పెట్టుకున్నారు. కామాక్షికి అమ్మవారంటే చిన్నప్పటి నుండి ఎంతో భక్తి. ఒక దేవతలా కాకుండా తల్లిలానే భావిస్తుండేది కామాక్షి. వాళ్ళ నాన్నగారు కూడా ఏది కొన్నా తన కూతురు కామాక్షికీ , అమ్మవారికీ ఒకే విధమైనవి కొనేవారు. అమ్మవారికి సమర్పించాకే కామాక్షి వాటిని ధరించేది. ఎన్నో అనుభవాలు నిత్యం కలుగుతుండేవి కామాక్షికి. వాటిలో కొన్ని, ఒకసారి కామాక్షి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోగానే అమ్మవారికి కట్టిన చీర బాగా నచ్చింది, " నీ చీర చాలా బాగుంది నాకు ఇవ్వు " అని అడిగింది కామాక్షి. ఆ మరుసటి రోజు ఉదయం ఆలయ అర్చకుడు వీళ్ళ ఇంటికి వచ్చి, " నిన్న రాత్రి అమ్మవారు కలలో కనిపించి మీ అమ్మాయికి ఈ చీర ఇవ్వమన్నారు, తనకు ఇది బాగా నచ్చిందట " అని చెప్పి ఇచ్చి వెళ్ళారు. మరొకసారి అమ్మవారి దర్శనానికి కామాక్షి వెళ్ళింది. ఆ రోజు రాత్రి అమ్మవారు కలలో కనిపించి " నువ్వు పెట్టుకున్న కమ్మలు బాగున్నాయి నాకూ అలాంటివి చేసి పెట్టు " అని అడిగింది

కామాక్షికి పెళ్లి కుదిరింది, పెళ్లి కోసం నగలు, చీరలు కొన్నారు. అమ్మవారి కోసం కూడా ఒక చీర, ఒక బంగారు నగ కొన్నారు. కానీ కామాక్షికి మాత్రం అమ్మవారి కోసం కొన్న చీర బాగా నచ్చింది, కనుక తన చీర అమ్మవారికిచ్చి, అమ్మవారి చీర తను తీసుకుందాం అనుకున్నది. పెళ్లి పత్రిక అమ్మవారికి ఇవ్వడానికి వెళ్ళే రోజు పొద్దున్న బీరువా తెరవాలనుకుంటే ఎంతకీ తెరుచుకోలేదు. తాళం సక్రమంగానే ఉన్నది కానీ ఎందుకు తెరుచుకోవడం లేదో వాళ్ళ అమ్మాన్నాన్నలకు అర్ధం కాలేదు. కానీ కామాక్షి మాత్రం ఇలా చీరలు మార్చాలనుకున్నది అని వారికి తెలియదు. అప్పుడు వారి ఇంటికి ఒక సోది చెప్పే ఆవిడ వచ్చి, వాళ్ళ నాన్నగారిని పేరు పెట్టి పిలిచింది. ఆశ్చర్యంతో ఆవిడను లోపలకు రమ్మని చెప్పారు, అప్పుడు ఆవిడకు దేవత ఆవహించి " నీ కూతురు తన చీరను నాకు ఇచ్చి, నా చీర తను తీసుకుందాం అనుకుంటోంది, నా చీర నాకే ఇవ్వాలి " అని అడిగింది. కామాక్షిని అడిగితే నిజమే అని చెప్పింది, అప్పుడు సోది చెప్పే ఆవిడ బీరువా దగ్గరకు వెళ్ళి తీయగానే తలుపు తెరుచుకుంది, వెంటనే అమ్మవారి చీరను, బంగారు నగను తీసుకుని అందరినీ పక్కకు పంపి ఆ చీర కట్టుకుని నగ పెట్టుకుంది. వీళ్ళకు ఏమి చేయాలో అర్ధం కాలేదు, ఆవిడకు అమ్మవారు ఆవహించారు కనుక ఏమీ అనలేక చూస్తుండిపోయారు. ఆవిడ వాటితోనే వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నగారు అలాంటి చీర, బంగారు నగ మరల కొని అమ్మవారి ఆలయానికి వెళ్ళి చుసేసరికి, సోది చెప్పే ఆవిడ తీసుకెళ్ళిన చీర, నగ అలంకరింపబడి ఉన్నాయి. అర్చక స్వామిని కనుక్కుంటే, అమ్మవారు కలలో కనిపించి, రేపు పొద్దున్న గర్భ గుడిలో ఉండే చీరను, నగను పెట్టమని చెప్పారట. నిజంగానే అవి కనిపించడంతో వాటితోనే అలంకరించారు. మరొక లీలను చూద్దామా ...

కావలిలో నివాసముండే ఒక కుటుంబంలోని కోడలికి పిల్లలు పుట్టగానే చనిపోతున్నారు. ఇలా మూడుసార్లు జరిగింది. ఎన్నో పూజలు, వ్రతాలు చేసారు. దోష నివారణలు, ప్రయశ్చిత్తాలు చేసారు. అయినా నాలుగవ ప్రసవంలోనూ అలానే జరిగింది. అప్పుడు జోన్నవాడలో దీక్ష చేయమని ఎవరో చెబితే ఆ కుటుంబం వారంతా ఆలయంలో నిద్రలు చేస్తూ, అమ్మవారిని సేవిస్తున్నారు. ఒక వారం రోజులు గడిచాక ఆ కోడలికి కలలో అమ్మవారు కనిపించి, " నీకు పూర్వ జన్మ దోషం వలన పిల్లలు బ్రతకడం లేదు, ఒక భూతము నీ పిల్లలను బలి తీసుకుంటోంది, అది శాంతించాలంటే ఒక పని చెయ్యి, ఆ భూతం ఒకరిని ఆవహించి ఉంది, అది రేపు మధ్యాహ్నం ఆలయానికి వస్తుంది, అప్పుడు దానికి తృప్తిగా భోజనం పెట్టు, నేను దాన్ని వదలగోడతాను, నీకు దోషం పోతుంది, దానికి విముక్తి కలుగుతుంది " అని చెప్పింది. మరుసటి రోజు నిజంగానే ఆ భూతం ఆవహించిన ఆవిడను తీసుకుని ఆలయానికి వచ్చారు. ఈ ఆలయంలో అటువంటి భూత ప్రేతాలను అమ్మవారు వదలగొడుతుంది అని ప్రతీతి. అమ్మవారు చెప్పిన విధంగా ఆ భూతానికి భోజనం పెట్టిన తరువాత, " నాకు బాగా ఆకలిగా ఉండేది, అందుకే నీ పిల్లలను తిన్నాను, ఇప్పుడు నా ఆకలి తీరింది, నేను వెళ్ళిపోతున్నాను, కామాక్షీ తాయి నువ్వు చెప్పినట్లు వింటాను, ఇక ఈవిడ జోలికి రాను " అని అరుస్తూ వెళ్ళిపోయింది. ఆ తరువాత ఆ కోడలికి కలిగిన సంతానం వృద్ధి చెందింది.

వేంకటగిరికి చెందిన ఒక స్త్రీకి గర్భాశయంలో కాన్సర్ ఉందనీ, అది తొలగించాలనీ, కానీ తను ఇకపై పిల్లలని కనలేందనీ డాక్టర్లు చెప్పారు. నలుగురైదుగురు డాక్టర్లను సంప్రదించినా అందరూ అదే పరిష్కారం అని తేల్చి చెప్పి, ఆపరేషన్ కూడా వెంటనే చేయాలనీ లేకపోతే ప్రాణాపాయం అని చెప్పారు. ఆ స్త్రీకి ఇంకా పెళ్లి కాలేదు, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఎంత బాధపడి ఉంటుందో ఊహించండి. ఇక చేసేది లేక ఆపరేషన్ కు సిద్ధపడ్డారు. వాళ్ళు జొన్నవాడ కామాక్షీ అమ్మవారిని ఎన్నో ఏళ్ళగా సేవిస్తూనే ఉన్నారు. రేపు ఆపరేషన్ అనగా ముందురోజు సాయంత్రం వారి ఇంటికి ఒక ముత్తైదువ వచ్చి ఆ అమ్మాయితో " నువ్వేమీ భయపడకు, వెంటనే జొన్నవాడకు వెళ్ళి అక్కడే నిద్రచేస్తూ, కామాక్షీ తాయిని సేవించు, నీ ఆరోగ్యం బాగుంటుంది " అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి తన తల్లికి చెప్పింది. బంధువులందరూ, "ఇది ఒట్టి చాదస్తం చావుబ్రతుకుల్లో ఉన్న దాన్ని తీసుకుని గుళ్ళు గోపురాలు తిరుగుతూ సమయం వృధా చేయకు, వెంటనే ఆపరేషన్ చేయించి, ఆరోగ్యం కుదుట పడ్డాక తీరికగా వెళ్ళి సేవ చేసుకోవచ్చు" అని వారించారు. కానీ ఆ తల్లీ కూతుళ్ళు వాళ్ళ మాటను పట్టించుకోకుండా జొన్నవాడకు వెళ్ళి అతి కష్టం మీద సేవ చేస్తూ ఉన్నారు. ఒకరోజు రాత్రి ఆ అమ్మాయికి కలలో కామాక్షీ తాయి కనిపించి నీ సేవ పూర్తయ్యింది అని చెప్పి, ఒక డాక్టర్ లా ఆపరేషన్ చేసి, నీకు ఆరోగ్యం బాగుపడింది, నీ గర్భసంచి అలానే ఉంది, నీకు పిల్లలు కూడా పుడతారు, కుట్లు పచ్చిగా ఉన్నాయి కనుక పత్యం పాటించు, నీ సంచిలో మాత్రలు పెడుతున్నాను అవి అయిపోయేంత వరకూ వేసుకో, ఎలా వేసుకోవాలో చీటిలో చూసుకో అని చెప్పి, అంతర్ధానం అయ్యింది . ఉదయం లేచి చూడగానే ఆపరేషన్ చేసినట్లు కట్టు కూడా కట్టి ఉంది, జాగ్రత్తగా ఇల్లు చేరి ఆ మందులు వాడాక మరల కామాక్షీ తాయి స్వప్న దర్శనం ఇచ్చి, " ఇప్పుడు కట్లు విప్పుతున్నాను, ఇక పత్యం అవసరంలేదు" అని చెప్పింది. వాళ్ళ బంధువులు పరీక్షించడానికి ఈ అమ్మాయిని తీసుకుని ఇది వరకు వెళ్ళిన హాస్పిటల్స్ కు మళ్ళీ వెళ్ళగా, డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు.

ఇటువంటి లీలలు ఎన్నో జన్నవాడ కామాక్షీ తాయివి ఉన్నాయి, వ్రాస్తున్న కొద్దీ ఇంకా ఎన్నో గుర్తొస్తూనే ఉన్నాయి కానీ ఎన్నని వ్రాయగలను, ఆ కామాక్షీ తాయి ప్రసాదించిన శక్తి మేరకు వ్రాసాను. ఒక్కొక దేవతా స్వరూపాన్ని స్మరించినంతనే ఎన్నెనో అత్యద్భుతమైన లీలలు గుర్తొస్తుంటాయి. ఇవి కొందరిలో అయినా భక్తి బీజాలు నాటుతాయేమో అనే ఒకే ఒక్క ఆశతో పోస్ట్ చేస్తున్నాను. మీకు తెలిసిన లీలలు కూడా పోస్ట్ చేస్తూ ఉండండి. ఇటువంటి లీలలు దయచేసి షేర్ చేస్తూ అందరికీ తెలిసేలా చేయండి

వీలైతే నెల్లూరు వెళ్ళి కామాక్షీ తాయిని, మల్లికార్జున స్వామి వారిని దర్శించండి. చూపుతోనే కోరికలు తీర్చే కల్పవల్లి మన అమ్మ శ్రీ కామాక్షీ తాయి ...

మనందరికీ అమ్మవారి అనుగ్రహం, అయ్యవారి అనుగ్రహం కలగాలని ఆశిస్తూ ...

#ఓం_శ్రీ_మల్లికార్జున_సమేత_శ్రీ_కామాక్షితాయినే_నమః








--((***))--

సంతాన మూర్తిగా పేరుగాంచిన సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం మోపిదేవి , కృష్ణ జిల్లా (5)

పుట్టలో సర్పరూపంలో వెలసిన శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయ రహస్యం కోసం మీకు తెలుసా ? శివుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇద్దరూ ఒకేచోట కొలువుదీరి భక్త జనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవక్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరఆలయం.పుట్టలో సర్పరూపంలో స్వయంభూగా వెలసిన కార్తికేయుడు నిజంగా భక్తులపాలిట కొంగుబంగారమే.దీపావళి అనంతరం వచ్చే నాగులచవితిన ఈ క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి లక్షలసంఖ్యలో భక్తజనులు తరలివచ్చి ఇక్కడి పుట్టకి విశేషపూజలు నిర్వహిస్తారు. మరియు అక్కడ స్వామి స్వయంభూగా ఎలా వెలసాడు? ఈ ఆలయం ఎక్కడుంది?ఈ ఆలయవిసేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

దక్షిణభారత దేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం. కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్య క్షేత్రం. స్కాందపురాణంలోని సహ్యాద్రిఖండంలో కృష్ణానదీ మహాత్మ్యము, ఇతర క్షేత్రములను వివరించు సందర్భంలో ప్రస్తావించబడిన ప్రముఖ క్షేత్రమైన మోపిదేవి క్షేత్ర విశేషాలు.

అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరిస్థితుల్లో కాశీని విడిచిపెట్ట వలసి వచ్చింది. వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి, ఆకాశంలో కి చొచ్చుకొని పోయి, సూర్య గమనాన్ని సైతం నిరోధించసాగింది. ప్రకృతి స్థంభించింది. గ్రహ సంచారాలు నిలిచిపో యాయి. ఈ మహోపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్యమ హర్షి మాత్రమేనని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్యమ హర్షికి, విషయాన్ని వివరించారు.

యోగదృష్టితో సర్వము తెలిసిన మహర్షి తాను ఇప్పుడు కాశీని వీడితే కల్పాంత మైనా తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని తెలిసి కూడా లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరించాడు. లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. దారిలో నున్న వింధ్య పర్వ తం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరిం చింది. తాను మరలి వచ్చేవరకు అలాగే ఉండమని శాసించి, కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసులో నిలుపుకొని, దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు.

పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరం లోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. కనకదుర్గామాతను, శ్రీకాకుళాంద్ర మహావిష్ణువుని దర్శించుకొని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు."వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్‌ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్‌" అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది. ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయన ననుసరించారు.

ఒకపుట్ట నుండి దివ్యతేజస్సుని గమనించి ఇదే సుబ్రమణ్య క్షేత్రమని, ఇది భుక్తి ముక్తి ఫలప్రదమని శిష్యులకు వివరించాడు అగస్త్యుడు. కుమారమూర్తికే సుబ్రమణ్యమనెడి పేరని మాండమ్యడనే శిష్యుని సందేహాన్ని నివృత్తి చేశాడు.కుమారస్వామి ఉరగ (పాము) రూపంలో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధంగా శిష్యులకు వివరిం చారు అగస్య్త మహర్షి. సనక, సనకస, సనత్కుమార సనత్సు జాతులనెడి దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారు గానే ఉంటారు, పైగా దిగంబరులు. వారు ఎల్లప్పుడూ భగవదారాధనలోనే కాలం గడుపుతుంటారు.

వారు ఒక పర్యా యం పరమేశ్వర దర్శ నానికి కైలాసం చేరుకున్నారు. ఆ సమయంలో పరమేశ్వరుడు కైలాసంలో లేడు. లోకమాత పార్వతి,కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు. అదేసమయంలో శచీ, స్వాహా మొదలైన దేవతాస్ర్తీలు, లక్ష్మీ సరస్వతులు, పార్వతీదేవి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు రంగు రంగుల వస్త్రాలు ఆభరణాలతో సుందరీమణులను చూచి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోయాడు. ‘‘కుమారా! ఏల నవ్వుచున్నావు? వారు నేనులా కన్పించలేదా? ఆ తాపసులు మీ తండ్రివలే లేరా? భేదమేమైననూ కన్పించినదా?’’ అని జగదంబ కుమారుని ప్రశ్నించినది. ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన పశ్చాత్తాప పడినాడు. తల్లి పాదాలపైబడి క్షమాపణ కోరుకున్నాడు. తల్లి కాదన్న వినకుండా పాపపరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపంతో తపస్సు ప్రారంభించాడు.

ఈ విషయాన్నంతటిని దివ్యదృష్టితో చూచి శిష్యుల కెరింగించిన అగస్త్యుడు మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. పడగ వలే ఉండే శివలింగాన్ని దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు. ‘అత్రస్నానంతు కుర్యాచ్చేత్కోటి జన్మాఘ నాశనమ్‌’ అని కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్రతో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి. కాలాంతరంలో ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండిపోయింది. ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపంలోనే కుమ్మరి కులస్తులు కులవృత్తి తో జీవిస్తుండేవారు. వారిలో వీరారపు పర్వతాలు ఒకడు. ఇతను మహాభక్తుడు. అతనికి స్వామి కలలో కన్పించి, తాను ఎక్కడున్నది చెప్పి, లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి, ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు. పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని తనవారందరికి చెప్పి, దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్టించాడు.

తనవృత్తిని స్వామికి అంకితం చేశాడు. మట్టితో స్వామికి ఇష్టమైన వాటిని తయారుచేసి, వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయంలో భద్రపరచేవాడు.అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మత్తుల సమయంలో శిథిలమై పోగా మిగిలిన నంది, గుర్రము ఈ నాటికీ స్వామి వారి కళ్యాణమండపంలో భద్రంగా ఉండి, భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్లని, కాలక్రమేణా అది మోపిదేవిగ స్ధిరపడిందని చెపుతారు.

క్షేత్రము మరియు విశిష్టత విశిష్టత :

స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానమట్టం. స్వామికి వేరే పానమట్టం ఉండదు. పానమట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన, అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోయడం జరుగుతుంది. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్టనుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామి వారి ఆలయంలో పుట్టలో పాలుపోయడం విశేషసేవగా భక్తులు భావిస్తారు.

సంతానం లేనివారికి సంతానం కలిగించడం, చూపు మందగించిన వారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం, మనోవ్యాధి, చర్మసంబంధ వ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు. స్వామి వారి ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీర్రమొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించుకుంటారు. పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలు.

విశేష పూజలు మరియు విధానం :

నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్టి వంటి పర్వదినాల తోపాటు ఆదివారం, గురువారం స్వామిని భక్తులు విశేషంగా సందర్శించి, మొక్కులు తీర్చుకుంటారు. స్వామి వారికి పర్వదినాల్లో మహన్యాసపూర్వక రుదభ్రిషేకంతో పాటు ప్రత్యేకఅర్చనలు జరుగుతాయి.

రవాణా సౌకర్యం :

కృష్ణాజిల్లాలో విజయవాడకు 70 కిలోమీటర్ల దూరం లోనూ, మచిలీపట్టణానికి 35 కి.మీ.ల దూరం లోనూ, గుంటూరు జిల్లా రేపల్లెకు 8 కి.మీ.ల దూరం లోనూ మోపిదేవి క్షేత్రం ఉంది. అతి సమీపంలోని రైల్వేష్టేషన్‌ రేపల్లె.

--((***))--

కదిరి నృసింహ స్వామి (4)

నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన కదిరి లక్ష్మీనరసింహుని ఆలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్న దివ్యక్షేత్రం. కదిరినే ఖాద్రి అనికూడా అంటారు. కులమత భేదాలు లేకుండా అన్ని మతాలవారూ, అన్ని కులాలవారూ స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం ఇక్కడి విశేషం. ఖదిర అంటే చండ్ర చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి కదిరి అన్న పేరు వచ్చింది. ఈ కదిరి నృసింహ క్షేత్రం అనంతపురం జిల్లాలో ఉంది. కదిరి నృసింహ క్షేత్రం హైదరాబాదుకు దాదాపుగా 500 కిలోమీటర్ల దూరం లో ఉంటుంది. ఇక్కడికి చిత్తూరు, గుంతకల్లు మరియు అనంతపురం మీదుగా బస్సు, మరియు రైలు సౌకర్యాలుకూడా ఉన్నాయి. దగ్గరలో పుట్టపర్తి విమానాశ్రయం కూడా కలదు.
కదిరి ఆలయం 13 వ శతాబ్దం లో నిర్మింపబడినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయం ఎంతో విశాలంగా, ఎత్తైన ప్రహారీ గోడ తో అద్భుతమైన శిల్పకళ తో విరాజిల్లుతుంది. ఆలయానికి నలువైపుల గోపురాలు ఉంటాయి. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదిక్షిణా పథం, ముఖ మంటపం, అర్థ మంటపం, రంగమంటపం ఉన్నాయి. ఇక్కడున్న ప్రధానమైన కోనేరును భృగు తీర్థం అంటారు. భృగు తీర్థం మాత్రమే కాకుండా ఇక్కడ ద్రౌపది తీర్థము, కుంతి తీర్ఠము, పాండవ తీర్థము, వ్యాస తీర్థము మొదలైన తీర్థాలు ఉండేవి. ఇక్కడి స్వామివారు అమ్మతల్లి, తాయారు, ప్రహ్లాదులతో కలిసి దర్శనిమిస్తారు.

నవనారసింహ క్షేత్రాలలో ఎక్కడా లేని విధంగా కదిరి క్షేత్రం లో నృసింహస్వామితోపాటుగా ప్రహ్లాదుడు కూడా దర్శనమిస్తాడు. కదిరికి దగ్గరలోని గూటిబయలు గ్రామం లో 600 సంవత్సరాలనాటి తిమ్మమ్మ మర్రిమాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. మహాయోగి అయిన వేమన గారి సమాధిగల కటారిపల్లే కదిరికి సమీపం లోనే ఉంటుంది.
కదిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి. ఎక్కడెక్కడినుంచో ప్రజలు బ్రహ్మోత్సవాలను దర్శించడానికి తరలివస్తారు.

--((***))--



కంచి కైలాసనాథర్ ఆలయ శిల్పశైలి పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది..!! (3)

కంచి లేదా కాంచీపురం అనగానే మనకు టక్కుమని గుర్తుకువచ్చేది కంచి పట్టు చీరలు, బంగారు, వెండి బల్లి మాత్రమే కాదు, సుమారు వెయ్యికిపైగా దేవాలయాలు కలిగి ఉన్నాయి. తమిళనాడులోని కాంచీపురంలో ఎంటర్ అవ్వగానే మనం కొన్ని దశాబ్ధాలు వెనక్కి వెళ్లిపోతాం. చెన్నైకి 72కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం ఒకప్పుడు పల్లవ రాజుల రాజధానిగా వెలుగొందింది. ఈ నగరానికి కంజీవరం అనే పేరు కూడా ఉంది.

హిందువులకు మోక్షప్రదానమైన ఏడు నగరాల్లో కాంచీపురం ఒకటి. మోక్షభూమి, శక్తి భూమిగా ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనదిగా హిందువుల నమ్మకం. గరుడ పురాణం ప్రకారం మోక్షన్ని ఇచ్చే నగరాలు ఏడు అవి వరసగా అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, అవంతికా, ద్వారక, కంచి. అంత ప్రాముఖ్యత కలిగిన ఈ నగరంలో అడుగడుగునా దేవాలయాలే దర్శనమిస్తాయి.

కంచి నగరంలో ఎక్కువగా ఆ పరమశివుడు మరియు విష్ణు ఆలయాలు కనిపిస్తాయి. అందుకే కంచీపురంను 'శివకంచి' మరియు 'విష్ణు కంచి' అనే రెండు నగర భాగాలు ఉన్నాయి. ముఖ్యంగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవీ ఆలయం కూడా కాంచీపురంలోనే కొలువై ఉండటం విశేషం. అంతే కాదు ఇక్కడ ప్రసిద్ది చెందిన ఏకాంబరేశ్వర ఆలయం, దేవరాజస్వామి ఆలయం కైలసనతార్ లేదా కైలాసనాథ్ ఆలయాలు కూడా సందర్శించతగినవి. మరి ఈ రోజు కైలాసనాథర్ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం...

కైలసనతార్ ఆలయం లేదా కైలసనాథ్ ఆలయం
కైలసనతార్ ఆలయం లేదా కైలసనాథ్ ఆలయం బహుశా నగరంలోని అతి పురాతన ఆలయం. 567వ సంవత్సరంలో కట్టారు, రాజసింహ పల్లవ రాజు 7వ శతాబ్దంలో విస్తరించారు. పల్లవులు నిర్మించిన ఈ ఆలయం అతిపురాతనమైనది. ఈ ఆలయం వాస్తు సంపదకూ, శిల్ప సంపదకూ, ఎన్నో అపురూప శిల్పాలకు ఎంతో ప్రసిద్ధమైనది. కైలాసనాథర్ ఆలయం శిల్పశైలి పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది.

ఈ ఆలయం పల్లవ రాజు నరసింహవర్మన్ నిర్మించారు
ఈ ఆలయంను శివుని మీద భక్తితో ఎనిమిది శతాబ్దంలో పల్లవ రాజు నరసింహవర్మన్ నిర్మించారు. చారిత్రక ప్రసిద్ధిని పొందిన ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన పురాణ గాధ గురించి తెలియకున్నా నిర్మాణ విశేషాలు మాత్రం తరగనివే !

ఇసుకరాయితో చెక్కబడిన అద్భుత శిల్పాలు ఎంతో ముగ్ధమనోహరంగా
మిగిలిన ఆలయాల మాదిరి కొండరాతితో కాకుండా ఈ ఆలయం ఇసుకరాయితో చెక్కబడిన అద్భుత శిల్పాలు ఎంతో ముగ్ధమనోహరంగా ఉన్నాయి. ఈ శిల్పాలు సున్నితమైన నైపుణ్యానికి ఒక ఉదాహరణ. మరో విశేషమేమిటంటే రాతి మీద నిర్మింపబడిన తొలి పల్లవ ఆలయంగా చరిత్ర కారులు పేర్కొనడం!అంతకు ముందు పల్లవులు నిర్మించినవి చాలా వరకు

సువిశాల ప్రాంగణంలో తూర్పు దిశన ఉండే
సువిశాల ప్రాంగణంలో తూర్పు దిశన ఉండే ఈ ఆలయ ప్రాంగణం లోనికి దక్షిణ దిశగా ప్రవేశ ద్వారం ఉంటుంది. గర్భాలయ వెలుపల చెక్కిన నిలువెత్తు సింహ (?) రూపాలు అబ్బుర పరుస్తాయి. . ప్రధాన ఆలయానికి ఎదురుగా తూర్పున పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది.

గర్భాలయంలో ఎత్తైన పదహారు ముఖాలు గల లింగ రూపంలో
గర్భాలయంలో ఎత్తైన పదహారు ముఖాలు గల లింగ రూపంలో శ్రీ కైలాస నాథర్ దర్శనమిస్తారు. ఎదురుగా నంది. నేటికీ నిత్య పూజలు జరగడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

ఈ ఆలయ నిర్మాణం
సాధారణంగా ఆ సమయంలో నిర్మాణాలు మరియు భవనాలు నిర్మించడానికి ఉపయోగించిన ద్రావిడ నిర్మాణ సమకాలీకరణ ఉంది. ఆలయం చుట్టు పక్కల శివలీలలు, శివుని వివిధ స్వరూపాలు అద్భుతంగా మలచబడి ఉన్నాయి. ఈ ఆలయంలో శివలింగం చాలా పెద్దగా ఉంది.

మరో విశేషమేమింటంటే
మరో విశేషమేమింటంటే శివలింగం పక్కన ఉండే బిలంలోకి వెళ్ళి బయటకి వస్తే మరుజన్మ ఉండదని భక్తుల నమ్మకం. ఈ బిలం లోకి పాకుతూ సులభంగానే వెళ్ళవచ్చుకానీ బయటికి రావటం కొంచెం కష్టం.

సంపూర్తిగా పల్లవ నిర్మాణ శైలిని ప్రదర్శించే ఈ ఆలయం
సంపూర్తిగా పల్లవ నిర్మాణ శైలిని ప్రదర్శించే ఈ ఆలయం వెలుపలి ప్రకారం, ప్రదక్షిణ ప్రాంగణం మరియు గర్భాలయం అనే మూడు భాగాలుగా ఉంటుంది. గర్భాలయాన్ని ముఖమండపాన్ని కలుపుతూ ఒక అర్ధమండపం ఉంటుంది. అవ్వడానికి విశాల ప్రాంగణం అయినా ప్రధాన ఆలయం చిన్న రాతిని కూడా వదల కుండా చెక్కిన శిల్పాలతో కిక్కిరిసి పోయినట్లుగా కనపడుతుంది.

ప్రాకారానికి లోపలి వైపున ఎన్నో శివ రూపాలను చెక్కారు.

ఆలయం పై 'విమానం'
సున్నితమైన నిర్మాణంతో పాటు, ఆలయం పై 'విమానం' మరియు మందిరంపై గోపురం ప్రసిద్ధి చెందింది. ఆలయం కూడా నటరాజ్ భంగిమలో ఉన్న శివుడి యొక్క నగిషీలు చెక్కి ఉన్న ప్యానెల్లు ఉన్నాయి.

భారతీయ శిల్పకళా నైపుణ్యానికి, శాస్త్ర విజ్ఝాన కళా వైభవానికి కలికితురాయి
ధ్యాన, నర్తన, అసుర సంహార,త్రిపురాంతక, రుద్ర, గంగాధర, లింగోద్భవ, భిక్షందార్, అర్ధనారీశ్వర ఇలా ఎన్నో ! అదే విధిగా శ్రీ గణపతి, శ్రీ కార్తికేయ, శ్రీ దుర్గ, శ్రీ విష్ణు రూపాలు కూడా కనపడతాయి. ఇవన్నీ మన భారతీయ శిల్పకళా నైపుణ్యానికి, శాస్త్ర విజ్ఝాన కళా వైభవానికి కలికితురాయి ఈ కైలాసనాథర్ దేవాలయం

మండపం లోను, మండప స్తంభాల పైన ఎన్నో శాసనాలు
మండపం లోను, మండప స్తంభాల పైన ఎన్నో శాసనాలు కనపడతాయి. వీటిల్లో చాలావరకు పల్లవ రాజులు శ్రీ కైలాస నాథర్ స్వామికి సమర్పించు కొన్న కానుకల వివరాలు మరియు వారి శివభక్తి తెలిపేవే !

రాజరాజచోళుడు ఈ కైలాసనాథార్ దేవాలయాన్ని దర్శించి ముగ్ధుడై
రాజరాజచోళుడు ఈ కైలాసనాథార్ దేవాలయాన్ని దర్శించి ముగ్ధుడై, తంజావూరులో బృహధీశ్వరాలయం నిర్మించారని ప్రతీతి. 1400 సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయం వేదావతి నదీ తీరంలో కంచి పట్టణానికి పడమర దిక్కున బస్సు స్టాండ్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయం ఇప్పుడు పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది

నారధుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థలపురాణం
నారధుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థలపురాణం. ఇక్కడ శివలింగం చుట్టూ ప్రదిక్షణ చేస్తే పునర్జన్మ నుండి విముక్తి కలుగుతుందని చెబుతారు. ఈ ఆలయ గర్భగుడిలో నల్ల గ్రానైట్ నుండి చెక్కబడిన ఏకైక 16-వైపుల శివలింగం (శివుడిని సూచించే చిహ్నంగా) కలిగి ఉంది. ఏది ఏమయినప్పటికీ, నిర్మాణం యొక్క అత్యంత ఆకర్షణీయమైన లక్షణం దాని ఉప-పుణ్యక్షేత్రాలు, అనేక స్తంభాలు చిన్న దేవతల శిల్పాలతో లేదా ఉపఆలయాలతో అలంకరించబడి ఉంటాయి.

అన్నింటి లోనికి కొన్ని శిల్పాలను అపురూపమైనవిగా
అన్నింటి లోనికి కొన్ని శిల్పాలను అపురూపమైనవిగా పేర్కొనాలి. వీణ ధరించిన పరమేశ్వరుడు. నటరాజ నాట్య విన్యాసాన్ని తిలకిస్తున్న గణాలు, శ్రీహరి, విధాత ఇతర దేవతలు, సోమస్కంద మూర్తి, శ్రీ ఉమామహేశ్వరుడు ముఖ్యమైనవి. అన్నింటినీ వీక్షిస్తూ ప్రదక్షిణ పూర్తి చేసుకొని గర్భాలయానికి చేరుకోడానికి సన్నని మార్గం గుండా వెళ్ళాలి. దర్శనానంతరం మరో సన్నని మార్గం గుండా వెలుపలికి రావాలి. వీటిని జీవి పుట్టుక మరణానికి నిదర్శనాలుగా పేర్కొంటారు.

ఈ గుడి నిర్మాణంలో ఈ సొరంగం ఎంతో దోహద పడి ఉండవచ్చు
ఈ గుడి నిర్మాణంలో ఈ సొరంగం ఎంతో దోహద పడి ఉండవచ్చు? కాని సుమారు *90 కిలోమీటర్లు సొరంగం* చెయ్యడము, దాన్ని ఉపయోగించడము, ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం, నిపుణత ఆ కాలంలో ఉండేవో, అలాంటివి మనం ఎంత కోల్పోయామో ఇప్పటి తరాలకు కనీసం తెలియజేసిన చాలు.

ప్రత్యేకతలు
కంచీపురం పట్టు చీరలకు ప్రసిద్ధి. ఇక్కడ శిల్కు సొసైటీలు ఉన్నాయి. వివిధ రకాలకు చెందిన శిల్కు వస్త్రాలు, ముఖ్యంగా చీరలు ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ కంచి కామకోటి పీఠం ఇక్కడే ఉంది. ఇక్కడకు నిత్యం దేశ, విదేశాలకు చెందిన యాత్రికులు, వ్యాపారులు, భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

ఎలా వెళ్లాలి
కర్నూలు నుంచి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంచీపురానికి వెళ్లాలంటే ముందుగా తిరుపతి లేదా చిత్తూరుకు చేరుకోవాలి. అక్కడి నుంచి నేరుగా బస్సుల్లో వెళ్లవచ్చు. లేదంటే కర్నూలు నుంచి నేరుగా చెన్నై వెళ్లి అక్కడి నుంచి కంచికి చేరుకోవచ్చు.

బస్సు సౌకర్యం

చెన్నై నుంచి కంచి 65 కిలోమీటర్లు ఉంటుంది. జిల్లాలో ఎమ్మిగనూరు నుంచి కంచికి నేరుగా ఆర్‌టీసీ బస్సు సౌకర్యం ఉండేది. అయితే పలు కారణాల వల్ల రద్దు అయ్యింది. రైలు మార్గం ద్వారా వెళ్లాలంటే కర్నూలు నుంచి తిరుపతికి వెళ్లాలి. అక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉంది.

శుభ శుభోదయం మిత్రులారా...








శ్రీ మల్లిఖార్జున-భ్రమరాంబ జ్యోతిర్లింగ క్షేత్రం, శ్రీశైలం , ఆంధ్రప్రదేశ్. (2)

శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.

శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది,అష్టాదశ శక్తి పీఠములలో ఆరవది, మరియు దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది.

చరిత్ర :

ఇక్ష్వాకులు, పల్లవులు, విస్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, శివాజీ లాంటి ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీమల్లికార్జునుని పవిత్రధామం. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ఠ కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు,అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు.

స్థల పురాణం :

పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే మరియు చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతీ భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈరాకలో వింత ఏమి లేదని చెపుతాడు.

అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.

ఆలయవిశిష్టత:

శ్రీశైలంలో దేవాలయాలలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో శివ పార్వతుల విగ్రహాలు వుంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా మరియు, మాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజిస్తారు. శివ భగవానుడికి గల 12 జ్యోతిర్ లింగాలలో శ్రీశైలం ఒకటి కావున, హిందువులు ఈ దేవాలయానికి చాల ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకొంటారు. ఇక్కడ కల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు.

పాతాళ గంగ:

శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలము చాలా ఎత్తులో ఉన్నది, నది మాత్రము క్రింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలము నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చెయ్యాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అనే సార్థక నామధేయముతో వ్యవహరిస్తారు. ఆ మెట్లు అన్నీ దిగి కృష్ణలో మునిగి తిరిగి ఎక్కినపుడు పాతాళగంగ అనునది ఎంత సార్థక నామధేయమో తెలుస్తుంది. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది నీటి క్రింద బండలపై నాచు నిలచి సూర్య కిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది. అయితే అందరూ నీటి క్రిందగల దీనిని పచ్చల బండ అని వ్యవహరిస్తారు.

2004లో పాతాళగంగకు వెళ్ళుటకు రోప్ వే ఏర్పాటు చేయబడింది. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. త్రేతాయుగ కాలం నాటి ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా చూడవలసిన వాటిలో ఒకటి.

సాక్షి గణపతి ఆలయము:

ఇది ముఖ్యాలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయము ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలములో శివుడిని దర్శించినంత మాత్రముననే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతే సాక్ష్యము చెపుతాడు, మనము శ్రీశైలము వచ్చినాము అని.ఇతనిని సాక్షి గణపతి అంటారు.

శ్రీశైల శిఖరం:

శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది, ఈ శ్రీశైల శిఖరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు; దూరంగా ఉన్న ఈ ఎత్తైనకొండ శిఖరేశ్వరం పై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే, శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారు.

పాలధార, పంచధారలు:

శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటకేశ్వరము నకు సమీపాన అందమయిన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉంది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండపగులులనుండి పంచధార (ఐదుధార) లతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్కథార ఒక్కొక్క రుచితో నుండుట ఇక్కడి ప్రత్యేకత. ఒకథార నుండి జలము సేవించి ప్రక్కమరొక దాని నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది.

హటకేశ్వరం:

హటకేశ్వరం, కర్నూలు జిల్లా, శ్రీశైలం మండలానికి చెందిన గ్రామము. శ్రీశైలమల్లికార్జునదేవస్థానమునకు మూడు కిలోమీటర్ల దూరములో కల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం. ఇక్కడ హటకేశ్వరాలయము ఉంది. ఈ పరిశరాలలోనే శ్రీ ఆది శంకరాచార్యులవారు నివసించారు. పరమశివుడు అటిక (ఉట్టి, కుండ పెంకు)లో వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని అటికేశ్వరుడు అనేవారు రానురాను అదేమెల్లగా హటికేశ్వరస్వామిగా మారిపోయింది. హటకేశ్వర నామంతో ఆప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తుల మాటగా హటకేశ్వరంగా పిలువ బడుతోంది. ఇక్కడ చెంచులు అదివాశీలు నివసిస్తున్నారు. ఈ దేవాలయ పరిశరాలలో పలు ఆశ్రమములు, మఠములు ఉన్నాయి. ఇక్కడికి వచ్చెందుకు శ్రీశైలం దేవస్థానము నుండి ప్రతి అర గంటకు బస్సులు ఉన్నాయి.

శిఖరం:

శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది, ఈ శిఖరేశ్వరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు,అక్కడ ఉన్న నందిని రోలుమాదిరిగా నున్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించి అటూ ఇటూ వీలుగా త్రిప్పుకొనుచూ సుదూరంగా ఉన్న శ్రీమల్లిఖార్జుని ఆలయపు విమానంపైనున్న శిఖరాన్ని చూడుటకు ప్రయత్నించాలి.అలా చూసే క్రమంలో ఆవ్యక్తికి గనుక శిఖరం కనిపిస్తే కొద్ది దినాలలో చనిపోతారు మరియు పునర్జన్మ నుండి విముక్తులవుతారు.

కదళీవనము :

శ్రీ దత్తాత్రేయ స్వామి అవతార పరంపరలో 3వ అవతార పురుషుడైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాష్ట్రలోని కరంజా నగరంలో జన్మించి నర్సోబవాడాలోను, కర్ణాటకలోని గాణాగాపురంలోనూ తపమాచరించి చివరకు కదళీవనంలో అంతర్ధానమయ్యారు. వీరశైవ సంప్రదాయానికి చెందిన అక్క మహాదేవి కూడా ఇక్కడే అవతార సమాప్తి గావించారని ప్రతీతి.

భీముని కొలను :

శ్రీశైలంలోని సాక్షి గణపతి గుడి దాటాక కుడివైపు పాపనాశనం తీర్థం ఉంటుంది. దీనికి ఎదురుగా ఉన్న కాలిబాట భీముని కొలనుకు దారితీస్తుంది. ఈ మార్గంలో శతాబ్దాల కిందట రెడ్డిరాజులు మెట్లు కట్టించడం విశేషం. మెట్ల దారిలో ఒక కిలోమీటర్‌ వెళ్లాక.. దట్టమైన అడవితో విశాలమైన లోయ కనిపిస్తుంది. ఇక్కడున్న మహాద్వారం.. అందమైన లోకంలోకి స్వాగతం పలుకుతుంది. పెద్ద పెద్ద మెట్లు.. వీటికి ఇరువైపులా చెట్లు.. వాటికి అల్లుకున్న లతలు.. మనిషంత ఎత్తుండే పుట్టలు.. దారి పొడుగునా కనిపించే దృశ్యాలివి. ఈ దారిలో రెండు కిలోమీటర్లు నడక సాగిస్తే.. త్రివేణీ, త్రి పర్వత సంగమానికి చేరుకుంటారు.వందల అడుగుల లోతున్న లోయల మధ్య తూర్పు నుంచి ఒక సెలయేరు, దక్షిణం నుంచి మరో సెలయేరు వచ్చి.. చిన్న చిన్న జలపాతాలుగా దూకుతుంటాయి లపాతాలు ఏర్పరిచే కొలను మనోహరంగా ఉంటుంది. అదే భీముని కొలను. అంటే పెద్ద కొలనని అర్థం. అయితే ఇది మరీ అంత పెద్దగా ఏం ఉండదు. కానీ చాలా ప్రత్యేకమైనది. తూర్పు సెలయేరు, దక్షిణ సెలయేరు సంగమించి.. జలపాతంగా మారి ఒక గుండంలో దూకుతాయి. అక్కడ దూకిన జలాలు.. అనూహ్యంగా మాయమవుతాయి. ఒక పరుపు బండ కింది నుంచి రెండు వందల అడుగులు ప్రయాణించి మళ్లీ బయటకు వస్తాయి. భారీ పరుపు బండ మీద నిలబడితే.. దాని కింది నుంచి నీళ్లు పారుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. పరుపు బండ కింది నుంచి వెలుపలకు వచ్చిన నీళ్లు కొలనులోకి చేరడంతో నిరంతరం అలలు పుడుతుంటాయి. వేసవిలోనూ ఇక్కడ నీటి జాడ కనిపించడం విశేషం. అహోబిలం నరసింహస్వామి.. చెంచులక్ష్మిని వరించి భీముని కొలనులో సయ్యాటలాడాడని స్థానిక కథనం. కొలను ఒడ్డున భీమాంజనేయుల విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడికి సమీపంలోని పురాతన శివాలయం ఉంది. దీనిని సందర్శించి.. మరోసారి లోయల అందాలను చూస్తూ.. పొద్దుగూకే లోగా శ్రీశైల క్షేత్రానికి చేరుకోవచ్చు.

శ్రీశైలం-రవాణా సౌకర్యాలు:

హైదరాబాదు నుండి శ్రీశైలం 212 కి.మీ. దూరంలో ఉంది.ఈ రోడ్డు అటవీ ప్రాంతం గుండా పోతుంది. అటవీశాఖ వారు రాత్రి వేళల్లో ఈ ప్రాంతం గుండా ప్రయాణించటానికి అనుమతించరు కనుక పగటి వేళ మాత్రమే ప్రయాణించాలి.

గుంటూరు నుండి శ్రీశైలం 225 కి.మీ. దూరంలో ఉంది. గుంటూరు నుండి నరసరావుపేట, వినుకొండ మీదుగా వచ్చే ఈ మార్గం దోర్నాల వద్ద కర్నూలు రోడ్డుతో కలుస్తుంది. అక్కడి నుండి శ్రీశైలంకు కొండ మార్గంలో ప్రయాణం (53 కి.మీ.) కొండల మధ్యగా చాలా బాగుంటుంది... పూర్తి సేకరణ,మిత్రుల నుండి.








నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం.....ఉజ్జ‌యిని (1) 

మన దేశంలో ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే ఆలయం ఒకటుందని మీకు తెలుసా….? 

అవును ….. మీరు చదువుతున్నది అక్షరాలా నిజం . 

ఆ ఆలయం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది.

హిందూ ధ‌ర్మంలో పాముల‌ను ఆరాధించే సంస్కృతి అనాదిగా వస్తోంది. 

హిందూ ధ‌ర్మంలో స‌ర్పాల‌ను దేవ‌త‌ల ఆభ‌ర‌ణంగా భావిస్తారు.

మ‌న‌దేశంలో ఎన్నో నాగ దేవాల‌యాలున్నాయి. 

అందులో ప్ర‌ముఖమైంది, ఇత‌ర ఆల‌యాల‌కంటే భిన్న‌మైంది ఉజ్జ‌యినిలోని నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం. 

ఉజ్జ‌యినిలోని మ‌హాకాల్ మందిరంలోని మూడో అంత‌స్థులో నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం కొలువై ఉంది. 

ఈ కోవెల సంవ‌త్స‌రంలో ఒక‌రోజు మాత్ర‌మే అది కూడా శ్రావ‌ణ శుక్ల పంచ‌మి రోజు మాత్ర‌మే తెరిచి ఉంటుంది. ఆరోజు మాత్ర‌మే భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. ఆల‌యం తెరిచి ఉండే ఈ ఒక్క‌రోజున స‌ర్ప‌రాజుగా భావించే త‌క్ష‌కుడు ఆల‌యంలోనే ఉంటాడ‌ట‌. 

నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యంలో 11 వ శతాబ్దానికి చెందిన అద్భుత‌మైన ప్ర‌తిమ ఉంది. ఇందులో ప‌డ‌గ విప్పి ఉండే పామునే ఆస‌నంగా చేసుకొని కూర్చొని ఉన్న శివ‌పార్వ‌తులుంటారు.¬ ఈ ప్ర‌తిమ‌ను నేపాల్ నుంచి తెప్పించార‌ని చెబుతుంటారు. ఉజ్జ‌యినిలో త‌ప్ప ఇలాంటి ప్ర‌తిమ ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా ఉండ‌ద‌ట‌.

సాధార‌ణంగా అయితే స‌ర్పంపైన విష్ణు భ‌గ‌వానుడు మాత్ర‌మే శ‌యనిస్తాడు. కానీ ప‌ర‌మ‌శివుడు శయ‌నించిన దాఖ‌లాలు ఎప్పుడూ విన‌లేదు. కానీ ప్ర‌పంచంలో మ‌ర‌కెక్క‌డా లేని విధంగా ఉజ్జ‌యినిలోని నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యంలో భోళాశంకరుడు శ‌య‌నించి ఉండ‌డం విశేషం. ఈ ప్ర‌తిమ‌లో శివ‌పార్వ‌తుల‌తో పాటు వారి ముద్దుల త‌న‌యుడు వినాయ‌కుడు కూడా కొలువై ఉన్న అద్భుత దృశ్యం చూడ‌డానికి రెండు క‌ళ్లూ చాల‌వు నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యంలోస‌ర్పంపైన ప‌ర‌మ‌శివుడు శయ‌నించి ఉండ‌డం వెన‌క ఒక క‌థ ప్ర‌చారంలో ఉంది. 

స‌ర్ప‌రాజు త‌క్ష‌కుడు ప‌ర‌మేశ్వ‌రుడి అనుగ్ర‌హం కోసం కఠోర‌మైన త‌పస్సు చేశాడ‌ట‌. ప్ర‌స‌న్న‌మైన శివుడు త‌క్ష‌కుడికి అమ‌ర‌త్వాన్ని ప్ర‌సాదించాడ‌ట‌. ఇక అప్పటి నుంచి త‌క్ష‌కుడు శివుడు సాన్నిధ్యంలోనే ఉండిపోయాడ‌ని చెబుతారు. నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యానికి శతాబ్దాల చ‌రిత్ర ఉంది. 

1050 లో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించాడు. ఆయ‌న త‌ర్వాత సింధియా వంశానికి చెందిన రాణోజీ మ‌హ‌రాజ్ 1732 లో ఆల‌య జీర్ణోద్ధ‌ర‌ణ చేప‌ట్టాడు. ఈ ఆల‌యాన్ని ఒక్క‌సారి ద‌ర్శించుకుంటే చాలు స‌ర్‌యదోషాల‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌. అందుకే నాగ‌పంచ‌మి రోజు ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తుతారు. నాగ‌చంద్రేశ్వ‌రుడి ద‌ర్శించుకొని పునీతుల‌వుతారు. ఈ ఒక్క‌రోజే దాదాపు రెండు ల‌క్ష‌ల మంది భ‌క్తులు ద‌ర్శించుకోవ‌డం విశేషం.

--((***))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి