3, అక్టోబర్ 2019, గురువారం

చిన్న కధలు





పరివర్తన::
సిరిపురంలో గోవిందుడు అనే యువకుడు చిన్నప్పటినుండే దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఎవరికీ పట్టుబడకుండా ఎంతో ఉపాయంగా దొంగతనాలు చేసేవాడు. వాడిని పట్టుకోవడానికి ఎంతో మంది ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ విషయం ఆనోటా ఈనోటా ప్రాకి రాజు గారికి తెలిసింది.

రాజు రంగనాధుడు దయార్ద్ర హృదయుడు. ఇలాంటి వారిని ఎంతో మందిని మంచి వారిగా మార్చాడు. రాజు గారికి వీడి విషయం తెలిసిన మరునాడే వాడిని పట్టుకు రమ్మని భటులను పంపాడు. భటులను పంపుతున్న విషయాన్ని ముందుగానే ఆ ఊరి ప్రజలకు, గోవిందుడికీ తెలిసేట్లు చేశాడు. 


భటులు ఊళ్ళోకి వచ్చారన్న వార్త విని గోవిందుడు పారిపోసాగాడు. పథకం ప్రకారం రాజభటులు గోవిందుడిని చంద్రగిరి అడవుల్లోకి వెళ్ళేట్లు తరిమి కొట్టారు. "ఆడవిని జాగ్రత్తగా దాటితే నందపురం చేరుకోవచ్చు" అనుకుంటూ వడివడిగా నడవసాగాడు గోవిందుడు. 

సాయంత్రం అయింది. చీకట్లు ముసురుకుంటున్నాయి. అలిసిన గోవిందుడు రాత్రికి విశ్రాంతి తీసుకోవడం కోసం ఎత్తైన చెట్టుని ఎక్కబోతుండగా "ఎవరురా నువ్వు?! ఎందుకు, నా చెట్టును ఎక్కుతున్నావు?" అన్న మాటలు వినిపించి భయంగా క్రిందకు చూశాడు. చెట్టు క్రింద ఒక భయంకరాకారుడు నిలబడి ఉన్నాడు. 

భయం వల్ల గోవిందుడికి నోట మాట రాలేదు. "భయపడకు. చెట్టు దిగిరా! నేను నిన్నేమీ చేయను" అన్నాడా భయంకరాకారుడు. 

గోవిందుడు చెట్టు దిగి వచ్చాడు.

"ఎవరు నువ్వు? ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు?" అడిగాడు ఆ భయంకరాకారుడు. 

"నేను ఒక దొంగను. రాజ భటులు నన్ను ఈ అడవిలోకి తరిమారు" అన్నాడు గోవిందుడు వణికిపోతూ.

"భయపడకు. నేను ఒక రాక్షసుడిని. ఎప్పుడూ ఇక్కడే తిరుగుతుంటాను. ఈ చెట్టు నా నివాసం. నేను నీకు కొంత డబ్బు ఇస్తాను. దొంగతనాలు మానేసి వ్యాపారం చేసుకుని బ్రతుకుతావా?" అని అడిగాడు భయంకరాకారం. 

"ఇప్పటికే సగం చచ్చి ఉన్నాను. ఇక దొంగతనాలు చేయను. నువ్వు చెప్పినట్లే వ్యాపారం చేసుకుని బ్రతుకుతాను" అన్నాడు గోవిందుడు సంతోషంగా.

భయంకరాకారుడు ఆ చెట్టు తొర్రలోంచి పెద్ద డబ్బు మూట తీసాడు. అందులోంచి కొంత డబ్బుని తీసి గోవిందుడి చేతికి ఇస్తూ "చెట్టెక్కి పడుకుని రేపు ఉదయాన్నే ఇక్కడి నుండి వెళ్ళు" అని మిగిలిన డబ్బు మూటను తిరిగి తొర్రలో ఉంచి, చీకట్లోకి దూకి మాయమయ్యాడు. 

భయంకరాకారం తన చేతికి ఇచ్చిన డబ్బు అంత సంతోష పెట్టలేదు గానీ; అతను తిరిగి తొర్రలో పెట్టిన డబ్బు మూటను చూడగానే మటుకు గోవిందుడి కళ్ళు మెరిశాయి. 'మొత్తం డబ్బునీ ఎలా కాజేయాలా' అని అలోచనలతో రాత్రంతా గడిపాడు వాడు. ఉదయాన్నే లేచి 'ఆ తొర్రలో డబ్బు మూట ఉందా లేదా' అని చూడాలనుకున్నాడు; కానీ ధైర్యం చాలక, అక్కడ నుండి వెళ్ళిపోయాడు. 

అట్లా నందపురం చేరిన గోవిందుడు నేరుగా తనకు తెలిసిన ఓ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు. తనకు రాక్షసుడు ఇచ్చిన డబ్బునే ఎరవేసి, ఆ రాక్షసుడిని ఆ అడవిలోంచి పారద్రోలమని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మాంత్రికుడిని తను అంతకు ముందు పడుకున్న చెట్టు వద్దకు తీసుకు వచ్చాడు. మాంత్రికుడు చాలాసేపు ఏవేవో మంత్రాలు చదివి; 'రాక్షసుడిని పారద్రోలానురా! వాడు ఇక నిన్ను పీడించడు" అని చెప్పి డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. 

మాంత్రికుడు అటు వెళ్ళగానే ఇటు తొర్రలో చేయి పెట్టి డబ్బు మూటను బయటకు తీశాడు గోవిందుడు. సంతోషంతో పరుగు పరుగున ఇంటికి చేరి మూట విప్పాడు. మూటలో నుండి తేళ్ళు, ఎండ్రకాయలు బయటపడి ఇల్లంతా పాకటం మొదలు పెట్టాయి! భయంతో అరుస్తూ ఇంటి బయటకు పరిగెత్తిన గోవిందుడిని వాకిట్లోనే నిలబడి ఉన్న భటులు బంధించి రాజు గారి దగ్గరకు తీసుకువెళ్ళారు.

అప్పటికే పూర్తిగా చచ్చిన గోవిందుడు రాజు గారి కాళ్ళపైన పడి 'రాక్షసుడిని కూడా మోసం చేశాన'ని ఒప్పుకున్నాడు. వాడు పూర్తిగా మారిపోయాడని గ్రహించిన రాజుగారు "వ్యాపారం చేసుకుంటానని డబ్బు తీసుకున్నావు; కానీ డబ్బు మూటను చూడగానే నీ పాత అలవాటుని మానుకోలేకపోయావు. నీలో మార్పు తీసుకు రావాలనే నా మనిషిని రాక్షసుడిలా నటించేట్లు చేశాను. ఇకనైనా ఆ పాడు బుద్ధిని మానుకుని వ్యాపారం చేసుకో" అంటూ కొంత డబ్బుని వాడి చేతిలో ఉంచాడు. 

సిగ్గుతోటీ, కృతజ్ఞతతోటీ తల దించుకున్నాడు గోవిందుడు. అటుపైన ఉన్న ఊళ్ళోనే అంగడి పెట్టుకుని మంచి పేరు సంపాదించుకున్నాడు అతను.
సౌజన్యం:కొత్తపల్లి.


--(())--
ప్రాంజలి ప్రభ (కధ ) - ౩9  

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
ప్రాణ దాతలు కధ

 ఏమిటోయ్ పొద్దున్నే ఆకుకూర పట్టుకొచ్చావ్, అలా కూర్చొని వాగే బదులు కాస్త మీ భార్యకు సహకరిస్తే మీ సొమ్మేపోదు అన్న మాటలకు అంత రుసరుస పలుకులతో మాట్లాడుట మంచిది కాదే  అన్నాడు భర్త.

మాటలకేం చక్కగా మాట్లాడుతారు,  నా మాటలకు మాత్రం సమాధానము రాదు. ఏమిటే అట్లా మాట్లాడుతావు నీవు ఏదంటే అదే చేస్తున్నాగా, సరే మీరు ఇప్పుడు ఏమిచేయ వద్దులే అంతా  నేను చేసు కుంటాలే, అప్పుడే కోపం వచ్చిందా ఏమిటి, కోపం కాదండి మీచేత పనిచేయిన్చటం మంచిది కాదు కదండీ, అన్ని నీవే అంటావు అంతా మీ ఆడోళ్లకే చెందుతుంది.  ఏమాటైనా నవ్వుతూ ఆకుకూర తీసుకొని లోపలకు వెళ్ళింది.

అవునే మనపిల్లలు కనిపించుట లేదే, అయ్యే రామ మీకు చెప్పలేదా, స్కూలు పిల్లలతో చెన్నై టూర్ కు వెళ్లారు, ఎదో చేతి ఖర్చు కావాలంటే ఇచ్చాను.

అవునే రాత్రి  నిద్రలో పిల్లలొచ్చి అడిగారు నేను ఒప్పు కున్నాను కూడా.
ఈ వయసులో అంత  మతి మరు పేంటీ, ఏమోనే పిల్లలను స్కూల్లో దించే అలవాటుగా అడిగా అంతే.
మనం ఈ కార్తీకమాసంలో విజయవాడ వెళ్లి కృష్ణలో స్నాన మాచరించి, దుర్గమ్మను కొలిచి అక్కడే ఉన్న మాగురువు గారు శర్మ గారింటికి వెళ్లి వద్దామా, పిల్లలు ఎటుతిరిగి చెన్నై కి వెళ్లారుకదా అని అడిగాడు భర్త శంకరం భార్య పార్వతితో.
నీమాట ఎప్పుడు కాదన్నానండి అని నవ్వుతూ పలికింది. అవునే నామాట ఎప్పుడూ కాదనవు, సరేలే ఒక మూడు రోజులు సరిపడే బట్టలు సర్దు నేను బస్సు టిక్కెట్లు తెస్తాను, ఈ రోజు రాత్రికె వెల్దాము,
అట్లాగేనండి అన్నీ సర్దుతా
తెల్లవారుజామునే విజయవాడ లో ఉన్న శర్మగారి ఇంటికి చేరారు.
శర్మ గారి కుటుంబం సాదరంగా ఆహ్వానించింది, అయన భార్య సరస్వతి, పిల్లలు కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు, చేతికి టవల్ అందించారు. అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని ఉభయ పక్షాల క్షేమ సమాచారాలు తెలుసు కున్నాక కృష్ణ స్నానం దైవదర్శనం అంటూ  మేము శర్మ గారి భార్య పిల్లలతో బయలు దేరాము.    

మేము ఘాట్ దగ్గర స్నానం చేసి పైకి వచ్చాము గుడికి పోదామని, అప్పుడే శర్మగారి పిల్లవాడు గబగబా నీటిలోకి దూకాడు నీటిలో కొట్టుకు పోతున్న పిల్లవాన్ని కాపాడాడు, నేలమీద పడు కోపెట్టి పొట్ట వత్తాడు, నోటి నుండి నీరు కారుతూ కదిలాడు, ఆపిల్లవాని తల్లి తండ్రులు ఆ ఆమ్మ వారు నీలో ప్రవేశించి కాపాడింది బాబు, ఈ బాబు వాని తల్లి తండ్రులు చాలా పుణ్యాత్ములు అంటూ దీవించి వెళ్లారు.
అప్పుడే ఒక్కసారి తనపిల్లలు చేసే పనులు  గుర్తు తెచ్చు కుంది పార్వతి. నా పుత్రుడు మోటార్ సైకిల్ తో  ముసలావిడకు  డాషిచ్చి,    అయ్యో పాపం అనక పోగా,  అడ్డు వచ్చిందని తిట్టి మరీవచ్చాడు,    పోలీసులకు డబ్బులిచ్చి కేసులేకుండా చేసాడు.    

నా పుత్రిక ఎమన్నా తక్కువ తిన్నదా ఇంటి ముందుకు బిచ్చగాలొస్తే వారిపై కుక్కను తరిమి సంబర పడేది.  పనివాళ్లను కూడా నీటికి వచ్చినట్లు తిట్టేది. 
మచ్చుకైనా గౌరవ భావము లేదు నా బిడ్డలకు. అనుకున్నది. 

అమ్మవారి దర్సనం చేసుకొని శర్మ గారి ఇంటికి చేరాము.
అప్పుడే శర్మ గారి తండ్రి గారికి సేవలు చేస్తున్నారు, ఆయన వయసు 70 దాకా ఉండవచ్చు, పిల్లలు తాతా బాగున్నావా పలకరింపులు ఆయన ఓపికతో కధలు చెపుతున్నాడు 

శరణ కోరినవారికి అనేక మార్గాలు చూపిస్తాడు ఆ పరమాత్ముడు, అన్నింటికీ మూలం బుద్ధి, ఇది సక్రమముగా నడుస్తున్నప్పుడు, మానవుని  ప్రతిభ, ప్రజ్ఞ, నలుదిశలా పరిమళిస్తుంది. రాగ ద్వేషా లు, మానవుని ప్రధమ శత్రువులు వాటిని మానవులు త్యజించాలి.  కానీ కొందరు ఎవరో ఒకరికి భయపడి బంధాలు తెంచుకుంటున్నారు, వయసు మీరిన తల్లి తండ్రులను దూరంగా ఉంచు తున్నారు. ఎందుకు అలా ప్రవర్తిస్తారో నాకు తెలియుట లేదు, వారు పెద్దవారు కారా వారి పిల్లలు వారిని అట్లా చూస్తారని అనుకోరు ఎందుకు , ఇది అంతా కలియుగ మహిమ అనుకుంటున్నాను అని భాదతో శర్మ గారి తండ్రి గారు భాదతో పలికారు.  అవును శంకరం గారు మీ నాన్నగారు బాగున్నారా, వారు నాకు ప్రాణ దాత ఎలాగంటే మీనాన్నగారు నేను ఒకే ఆఫీసులో పనిచేసే వాళ్ళము, ఒకనాడు క్యామ్పుకు ఇద్దరం కలసి వెళ్ళాము, అక్కడ వాతావారణం నాకు పడ  లేదు, అంతా వర్క్ మీనాన్న చేసాడు అప్పుడే నాకు ఎదో పురుగు కుట్టింది,జ్వరం కూడా వచ్చింది వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు, నాకు సేవలు చేసాడు అటువంటి ప్రాణదాతకు నేను రుణపడి ఉన్నాను 
మీఇంటికి వచ్చి కలవాలని అనుకుంటున్నాను అన్నాడు.      
వింటుంటే పార్వతి మనసు కరిగి పోయింది. నేను ఉద్యో గం మానేసి మావ గారికి, అత్తయ్య గారికి సేవలు అందిస్తాను. 

అప్పుడే నెమ్మదిగా భర్త దగ్గరికి చేరి ఏమండి మీ తల్లితండ్రులను   వృద్ధాశ్రమం నుండి తీసుకొస్తే ఎంత బాగుంటుంది.

అవునే నేను చాలా తప్పు చేసాను,   ప్రాణ దాతలను నిర్లక్ష్యం చేసాను, అన్న  లు  వంత  పలికారని నేనుకూడా వెనకాడాను, వారికి సేవ చేయకుండా వృద్ధాశ్రమం లో ఉంచాను, నెలకు కొంత డబ్బు పంపుతున్నాను కానీ వారి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, ఇప్పుడు శర్మ గారి కుటుంబం చూసాకా నేను తల్లి తండ్రులకు  సేవ  చేద్దా మనిపిస్తున్నది.
అవునండి నాకు అదే అనిపిస్తున్నది        

వృద్దశ్రమంలోకి పార్వతీ శంకరులు పిల్లలతో లోపలకు ప్రవేశించారు. అక్కడ  ఉన్న తల్లి తండ్రుల పాదాలను కన్నీళ్లతో కడిగాడు, "సాగరంలో నీటి బుడగ మరల సాగరంలో కలసి పోవటమే మోక్షమని తెలుసుకున్నాము" తల్లి తండ్రులకు సేవచేయుటయే మానవజన్మ పరమార్ధమని తెలుసుకున్నాను. 
 మావయ్య గారు అత్తయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నాను రండి, మీకు సేవలు  చేయుటకు మేము సిద్ధముగా ఉన్నాము, రండి తాత గారు, అమ్మొమ్మగారు అని పిలుస్తూ పిల్లలు కన్నీళ్లతో అభిషేకించారు.     


--((**))--        

ప్రాంజలి ప్రభ (కధ ) - ౩ 8  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
నేను అన్నానని అనుకోవద్దు మీదగ్గర ఉంటే కనీసం ధైర్యంగా ఉండటం కూడా ఉండటం కూడా నేర్చుకోలేడు అన్నాడు

ఏంచేద్దాం కాలమే నిర్ణయింస్తుంది, తండ్రిగా బాధ్యత వహించక అప్పుడు కదా, అది నిజమే అనుకో అయినా ఒక కధ చెపుతా విను        

"ఒక ధనవంతుడికి పెళ్ళికాని అందమైన కూతురుండేది. ఆయన తన బంగళా వెనుక ఒక కొలనులో భయంకరమైన మొసళ్ళను పెంచేవాడు. ఒక రోజు ఆయన పెద్ద పార్టీని ఏర్పాటు చేసి చాలా మందిని ఆహ్వానించాడు. అందులో ఇలా ప్రకటించాడు.... “ఇక్కడున్న యువకులందరికీ ఒక అద్భుతమైన అవకాశం. ఎవరైతే ఈ సరస్సులో దూకి మొసళ్ళ నుండి తప్పించుకుని బయటకు ఈదుకుని వస్తారో వారికి నా కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తాను లేదా ఒక మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తాను”. ఆయన మాటలు పూర్తి కాక ముందే ఎవరో నీళ్ళలో దూకిన చప్పుడైంది. నీళ్ళలో ఒక యువకుడు తన శాయశక్తులా ఈదుతూ వస్తున్నాడు. పార్టీకి విచ్చేసిన అతిథులంతా అరుస్తూ అతన్ని ఉత్సాహపరుస్తున్నారు. చివరికి చిన్న చిన్న దెబ్బలతో, చిరిగిపోయిన చొక్కాతో అవతలి ఒడ్డుకి చేరుకున్నాడా యువకుడు.... ఆ ధనవంతుడు ఆశ్చర్యంతో దగ్గరికి వచ్చి ” నాకు నిజంగా నమ్మశక్యం కాకుండా ఉంది. పరమాద్భుతం.... ఇది ఎవరూ పూర్తి చేస్తారని అనుకోలేదు. కానీ నేను మాట తప్పను.

చెప్పు. నీకు మా అమ్మాయి కావాలా? ఒక మిలియన్ డాలర్లు కావాలా?”

“నాకు నీ కూతురూ వద్దూ, ఆ మిలియన్ డాలర్లూ వద్దు....

ముందు నన్ను నీళ్లలో తోసిన వాణ్ణి చూపించండి... ..."

కధ బాగుంది అరదః మైందా, ఎందుకు అర్ధం కాలేదు, ఆ నీళ్లల్లో తోసింది కన్న తండ్రే అని తెలుస్తున్నది.

నేను చేయమని చెప్పను కొడుకుకి ధైర్యం వస్తే ఏదైనా సాధిస్తాడు అని తెలుస్తున్నది.

నాకొడుకుకు ఎందుకు ధైర్యము లేదు ఇటు రా చూపిస్తా అంటూ మార్కెట్ లోకి వెళ్ళాడు. అందరూ ఎటు పడితే  అటు పరిగెడుతున్నారు అక్కడ ఎం జరుగుతున్నదో ఇద్దరూ దూరంగా నుంచొని చూస్తున్నారు.   
   
ఆ  మార్కెట్లో అనేక షాపులు ఉన్నాయి, ఒక వైపు కూరకాయల షాపులు, ఆకు కూర షాపులు, మరో వైపు పండ్ల షాపులు ఉన్నాయి అక్కడ ఒక మూల ఒక మందుల షాపు ఉన్నది,  అక్కడే గొడవ మొదలైనది. ఒక 16 ఏళ్ళ పడుచుపిల్ల ఒక చీటీ మందులు కొన్నది, తన దగ్గర ఉన్న 2000 రూపాయల నోటు ఇచ్చింది, చిల్లర లేదు మందుల అక్కడ  పెట్టి పోమ్మా పొద్దున్నే బారం అని  గోనుకుంటున్నాడు,  ఆమె అతన్ని బ్రతిమాలాడు తున్నది,   ఎంత బతిమ లాడినా వప్పు కోవటం లేదు అప్పుడే రామకృష్ణ అక్కడకు చేరి చిల్లర ఇమ్మన్నాడు, ఇవ్వము నీ వెవరవయ్యా నన్ను  అడగ టానికి నీ దారి నీవు చూసుకో అని అరిచాడు, అప్పుడే సరిగా మాట్లాడం నేర్చుకో, నేనొక భారతీయ పౌరుడుగా అడిగే హక్కు ఉన్నది , ముందు చిల్లర తీసి ఆమెకు ఇవ్వు , ఏమిటి బాబు నీకు ఆ అమ్మాయికి ఏమిటి సంభంధం నీ దారి నీవు పోక. ఏమిటి మాటా మారుస్తున్నావు, పేలుతున్నావు అని గట్టిగా అడిగాడు అప్పుడే  పది మంది చుట్టూ మూగారు. 

షాపు వాని తరుఫున కొందరు, రామకృష్ణ తరుఫున కొందరు అక్కడకు  చేరారు, నోటికి వచ్చి నట్లు తలాతోకా లేని సలహాలు ఇస్తున్నారు, అక్కడకు  ఒక టి.వి కి సంభ దించిన వారు వచ్చి ఇది అంతా షూట్ చూస్తున్నారు,  వాళ్లల్లో ఒకతను వచ్చి షాపు వాన్ని  అడిగాడు మీరు మందులు కొనటానికి వచ్చిన వారితో ఏమన్నారు, వారు ఏమన్నారు అంతా  ప్రజలకు వివరించండి అన్నాడు, మాకు ప్రత్యేకంగా ప్రభుత్వమువారు చిల్లర అందించుట లేదు, మేము కుడా బ్యాంకు లైన్ లో  నుంచొని నోట్ల చిల్లర  మార్చుకొని వస్తున్నాము, ఇదిగో చూడండి మాదగ్గర 2000 రూపాయల నోట్లు ఉన్నాయి, చాలా మందికి చిల్ల ఇచ్చాము, ఇప్పుడు చిల్లరలేదు అదే విషయం ఆమెకు చెప్పను,   ఇంకా  500, 1000  రూపాయల నోట్లు ఉన్నాయి, ఇవి చెల్లవు నేను ఎట్లా ఇచ్చేది ఆమెకు అన్నాడు. అట్లైతే  ఎట్లాగయ్యా అన్నాడు టి.వి వారు ,  చిల్లర ఇవ్వండి నేను మందులు ఇస్తానని అన్నాడు షాపువాడు,  అక్కడ చేరినవారు ఏ.టి.యం. పనిచేయకుండా ప్రభుత్వము వారు మనల్ని ఇరకాటం పెడుతున్నారు, చిన్న నోట్లు అందించ కుండా పెద్ద నోట్లు రద్దు చేశారు , మాగోడు ఎవరు పట్టించు కుంటారు, యిప్పటికి 5 రోజులు లయ్యింది , మా పరిస్థితి గమనించే వారు లేరు, అప్పుడే పోలీసువారు వచ్చారు వారు గట్టిగా   నోరు చేసుకుంటూ ట్రాఫిక్ ను ఇబ్బందిలో పడేస్తున్నారు తొలగండి తొలగండి అని అరుస్తున్నారు,  అందరూ వెళ్లారు రామకృష్ణ, ఆ వచ్చి న   స్త్రీ ఉన్నారు, అక్కడకు చక్రధర్ తో పాటు శ్రీధర్ కూడా వచ్చారు, ఈ గొడవంతా మన కెందుకురా  మనదారి  పోదాము పదా అన్నారు,  ఆగండి  శ్రీధర్ గారు, మీరు నాకు 300 రూపాయలు ఇస్తున్నారు ఇవ్వండి అన్నాడు, ఆ చూపులకు నోరు పెదపకుండా జేబులో నుంచి నోట్లు ఇచ్చాడు, అవి తీసుకోని మీరు వెళ్ళండి,  నేను వెనుకవస్తాను అన్నాడు,

అప్పుడే వీడు ఈ జన్మలో మారడు చూసావా వాడి ప్రవర్తన నన్ను అడగ కుండా జబర్దస్తీగా మిమ్మల్ని అడిగి తీసుకున్నాడు, మావాడిని క్షమించండి, ఇదుగోనండీ ఈ మూడు వందలు తీసుకోండి చేతిలోపెట్టి ,   పోదాం పదా శ్రీధర్ అని వాళ్ళు కదిలారు. మరి  కూరలు తీసుకోవా అన్నాడు శ్రీధర్,  నా కొడుకు చేసిన గొడవ చూశాక నాకు ఆకలి  చచ్చిపొయింది  పోదాం పదా ,పెరటిలో ఉన్న తోటకూర తో ఈరోజు సరిపెట్టు కుంటా అన్నాడు చక్రధర్, మరి కాఫీ అన్న త్రాగుదామా అన్నాడు, ఏమి వద్దు ఇప్పుడు కాఫీ షాపు వారు 100 రూపాయల చిల్లర లేదంటాడు, అప్పుడు మానపరిస్థితి ఒక్కసారి ఆలోచించుకో అన్నాడు, ఆమ్మో ఆ పప్పు రుబ్బలేను నేను అన్నాడు నవ్వుతూ, అందుకే ఇక పోదామా, పోదాం పదా అని కదిలారు అక్కడ    నుండి. 
       
మందుల షాపు వానికి పైకము ఇచ్చి మందులు ఆమెకు ఇచ్చి  పంపించాడు, , నెమ్మదిగా ఇంటి ముఖం పట్టాడు రామకృష్ణ

ఏమేవ్ ఏమేవ్ వినబడిందా అని కేక వేసాడు చక్రధర్, అత్తయ్యగారు మామయ్యగారు పిలుస్తున్నారు వెళ్ళండి అన్నది పెద్ద కోడలు సుశీల.

వినబడిందమ్మా వెళ్ళలిగదా వెళ్తా ముందు నీవు తిరగమోత మాడకుండా , పాలు పొంగా కుండా చూడు అంటూ బయటకు నడిచింది.

రావద్ద ఏమిటి అంత పెద్దగా అరిచింది ఒక మనిషి రావాలా వద్దా అంటూ చెంబ్బుతో నీళ్ళుఇచ్చింది. ఓక్కరవ్ ఆ పంపుదాకా వచ్చి కడుకుంటే మీ సొమ్మే పోయింది అట్లా అరవటం దేనికి ఎనర్జీ వేష్టు చేసుకోవటం దేనికి అన్నది.

నీకేం నీవు చెపుతావ్ ఇంట్లోకూర్చొని, ఒక్కసారి వీధిలోకి వస్తే తెలుస్తుంది, మీ అబ్బాయి చేసిన ఘనకార్యం అన్నాడు.

మీరు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు నాకు ముందే తెలుసు, మీరు కూర తారని కొడుకుతో కుంటారని ఊహించా, అందుకే పెరటిలో తోటకూర కోసి పప్పు చేసి, సాంబారు పెట్టా  అన్నది.

అవునే నీవు నన్ను  అర్ధం చేసుకున్నట్లు పిల్లలు నన్ను అర్ధం చేసుకోవటం లేదు ఎందుకంటావు, ఆ చిలక  ప్రశ్న అడిగి చెపుతా .... అంటూ లోపలకు నడిచింది.

ఏమిటి అత్తయ్యగారు   మామయ్యగారు ఎమన్నా అన్నారా, ఇది మాకు రోజు ఉన్నది.

చూడమ్మా మనకు ఒక స్వతంత్రము ఉన్నది ఈ మగవారితో ఎట్లా మాట్లాడినా కష్టముగా ఉన్నది అవునండి అత్తయ్యగారు మీ అబ్బాయి కూడా అంతే పిలవంగానే పోకపోతే పిచ్చి కోపం వస్తుంది, సర్దుకు పోక తప్పదు గదా అత్తయ్యగారు. నిజమే కోడలా పిల్లా.

ఇలా వంట చేస్తూ మెగవారి జాడ్యాలను నా అనుభవాలను కలిపి చెపుతా విను.

* మనం ఎప్పుడైనా షాపింగ్ వెల్దామంటే ఏడుపు మొహం పెడతారు, ఎదో మనం  సొమ్మును ఖర్చు చేయిస్తున్నట్లు ఊహిస్తారు, కనీసం ఆనందంగా వెంట నడుస్తూ కూడా ఉండారు.
* మగ వాళ్లకి ఎక్కడకన్నా వెళ్లాలని ఇష్ట మైనదనుకో వెంటనే రెడీ అవ్వమని చెపుతారు, ఓ ఆరగంట  ఆయినదో లేదో "ఇంకా ఎంతసేపు అని విసుక్కోవటం మొదలు పెడతారు, ఇంకా ఈ ఆడవారికి చీర సింగారించు కోవటానికి ఒక గంట సమయము ఇచ్చిన సరిపోదు అంటారు.
* మనం ఏదన్నా టివి సీరియల్ చూస్తున్నా మనుకో, దగ్గరగా వచ్చి ఆ సిరియాల్ చూసి మరెందుకు ఏడుస్తారు, అంటూ రిమోట్ లాకుంటారు ఎంతసేపు న్యూస్, స్పోర్ట్స్, లేదా అర్ధం కాని ఇంగ్లీషు సినిమా ను మార్చి మార్చి చూస్తారు, మనల్ని కూడా చూడమని విసిగించి చం పుతారు.

* మనకు మనస్సు బాగాలేనప్పుడు దగ్గరగా వచ్చి, ప్రేమగా ఒక మాట చెప్పఁటమూ,  తీసుకోవటం చస్తే చేయరు, ఇంకా తిండి తినలేదు ఎదో ఆలోచిస్తారు అనీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతారు.
* ఒక మంచి మాట చెప్పరు పొద్దస్తమానం, ఆకురా అలా చేస్తే బాగుండును కదా, ఆ ప చ్చడి ఎండుమిరపకాయలతో చేస్తే బాగుండేది కదా అని నవ్వు తూ  సతాయిస్తారు. వారు ఇది చేయమని చెప్పరు చేసినదానిని మాత్రం వంక పెడతారు..
* రొమాంటిక్ కధలు చెప్పడం, భార్యను ముద్దుచేయడం కాదనీ  అది భార్యకు లొంగి పోవటమని ఊహిస్తారు, మనం దగ్గర చేరామనుకో   చులకనగా చూస్తారు .
* పురుష అహంకారం  క్వింటాల్లో ఉంటుంది,  చేసిన తప్పు ఒప్పుకోరు, ఒక కోరిక పట్టు పట్టారనుకో నిద్ర పోరు నిద్రపోనీయరు.
* పూలు చీరలు కొనటానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు .




ఓం శ్రీ రాం      ఓం శ్రీ రాం      ఓం శ్రీ రాం 















ప్రాంజలి ప్రభ -  కన్నవారి కలలు 





ప్రాంజలి ప్రభకు పంపినవారు-౩7
  
సర్వేజన్న సుఖోనోభావంతు 
రాఘవరావు ఒక ప్రవాస భారతీయుడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అమెరికాలో స్థిరపడిన తెలుగు వాడు. చాలా మంది తెలుగు వాళ్ళలానే తనూ హెచ్-1 వీసా ద్వారా అమెరికా వచ్చి, ఆ తరువాత పెళ్ళి చేసుకుని, ఆ తరువాత గ్రీన్ కార్డ్ సంపాదించి, అమెరికాలో తెలుగు వారు ఇబ్బడి ముబ్బడిగా ఉన్న క్యాలిఫోర్నియా రాష్ట్రంలో, భార్యా సమేతంగా సెటిల్ అయ్యాడు. 

రాఘవరావుకి ఇండియాలో గడిపిన రోజుల గురించి, ముఖ్యంగా తన చదువు గురించి, ఉన్న గుర్తులు ఇవి. వీధిలో ఉన్న పిల్లలతో గోళీలు, క్రికెట్టు లాంటి ఆటలు ఆడుకోవడం. సాయంత్రం వీలైతే ఒక గంట చదవడం. ఎవరైనా చుట్టాలొస్తే వాళ్ళతో సినిమాకి వెళ్ళడం, పరీక్షలకు రెండు రోజుల ముందు కాస్త సీరియస్‌గా చదవడం, మార్కులు సరిగ్గా రానప్పుడు నాన్న చేతిలో దెబ్బలు తినడం.

రాఘవరావు వాళ్ళ ఇంటి దగ్గర స్కూల్‌లో పదో తరగతి వరకు చదువుకున్నాడు. తరువాత దగ్గర ఉన్న టౌన్‌లో ఇంటర్‌మీడియేట్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణుడు కావడం వల్ల హైదరాబాద్‌లోని గవర్నమెంట్ కాలేజ్‌లో ఇంజనీరింగ్ చదువుకుని, తరువాత కొన్ని రోజులు ఇండియాలో ఉద్యోగం వెలగబెట్టి, ఆ తరువాత అమెరికా చేరుకున్నాడు.

ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే, అప్పటితో పోలిస్తే ఇప్పటి పిల్లల పెంపకం, ముఖ్యంగా ప్రవాస భారతీయుల పిల్లల పెంపకం, ఎంతలా మారిపోయిందో అన్న విషయాన్ని ఎత్తి చూపడానికి.

ఒక శనివారం, ఫ్రెండ్ సుధాకర్ పిలిచాడని, రాఘవరావు తన భార్య రాధతో సహా అతనింటికి చేరుకున్నాడు. సుధాకర్ రాఘవరావు కంటే వయసులో పెద్ద. అతనికి 5, 7 ఏళ్ళ వయసులో ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇంటికి చేరి కాలింగ్ బెల్ కొట్టగానే సుధాకర్ భార్య స్మిత తలుపు తెరిచింది. “రండి,రండి. మీ కోసమే ఎదురు చూస్తున్నాం. లంచ్ కూడా సిద్ధం,” అని ప్రకటించింది నోరారా నవ్వుతూ.

“మరే, క్యాలిఫోర్నియాకి మూవ్ ఆయాక ఇదే మొదటి సారి మీ ఇంటికి రావడం,” సోఫాలో కూర్చుంటూ అంది రాధ.

“ఇంతకి మా వాడు ఎక్కడ?” అడిగాడు రాఘవరావు భార్య పక్కనే ఆసీనుడవుతూ.

“ఆయన ఇప్పుడే బయటకి వెళ్ళారు, కాసేపట్లో వచ్చేస్తారు,” చెప్పింది స్మిత.

“అదేంటి? మేము వస్తునట్టు వాడికి తెలీదా?” కాస్త నొచ్చుకున్నాడు రాఘవరావు.

“మీరు అపార్థం చేసుకోకండి. ఆయన అర్చక్‌ని కుమ్మోన్ క్లాసులో దింపడానికి వెళ్ళారు. క్లాస్ కాగానే వచ్చేస్తారు,” వివరణ ఇచ్చుకుంది స్మిత.

ఒక్క క్షణం ఆవిడ వాడిన పదాలు అర్థం కాలేదు రాఘవరావుకి. తరువాత వెలిగింది అతనికి, అర్చక్ సుధాకర్ స్మితల ఏడేళ్ళ అబ్బాయి. వినూత్నంగా ఉండాలని సుధాకర్ దంపతులు తమ కొడుకుకి ఆ పేరు పెట్టుకున్నారు.

“ఈ కుమ్మోన్ ఏంటండి?” సంభాషణలో తను కూడా పాలు పంచుకుంది రాధ.

“లెక్ఖలు నేర్పిస్తారు,” చెప్పింది స్మిత.

“అంటే అర్చక్ వెళ్ళే స్కూల్‌లో ఆ సబ్జెక్ట్ లేదా?” అయోమయంగా అడిగింది రాధ.

కిసుక్కున నవ్వింది స్మిత. “మీరు మరీ చోద్యం రాధా గారూ, వాళ్ళ స్కూల్‌లో కూడా చెప్తారు. ఐతే కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఎక్స్‌ట్రా కోచింగ్ అవసరం. కుమ్మోన్ వాళ్ళైతే అడ్వాన్సుడ్ మ్యాత్ ఒక లెవెల్‌లో కుమ్మేస్తారు, అందుకే అనుకుంటా కుమ్మోన్ అని పేరు. పైగా మేమొకరమే కాదు, వాడి స్కూల్‌లో ఉన్న మిగతా ఇండియన్ పిల్లలు అంతా కూడా కుమ్మోన్‌కి వెళ్తారు,” కాస్త గర్వంగా చెప్పింది స్మిత.

“కానీ మీ అబ్బాయి వెళ్ళే స్కూల్ బే ఏరియాలోనే పేరు పొందిన స్కూల్ అట కద? ఎక్స్‌ట్రా కోచింగ్ అవసరమా?” అంత తొందరగా ఆ టాపిక్ వదల దల్చుకోలేదు రాధ.

“ఇక్కడ సమస్య అది కాదండి, మిగతా ఇండియన్ పిల్లలు వెళ్తూంటే మనం పంపకపోతే వెనక పడిపోతాం. ఈ కాంపిటీషన్ తట్టుకోలేం,” అంది స్మిత.

“మీ వాడికి ఏడేళ్ళే కద. అప్పుడే కాంపిటీషన్ ఏంటండి? ఈ వయసులో నేనేం చదువుకున్ననో కూడా నాకు గుర్తు లేదు,” ఉండబట్టలేక అన్నాడు రాఘవరావు.

“మన కాలం వేరు రాఘవరావు గారూ, ఇప్పుడు లోకమంతా మారిపోయింది. ఈ కాలంలో తప్పదు. అయినా నా చిన్నప్పుడు నాకెన్నో కోరికలు ఉండేవి. అప్పట్లో కాస్త స్థోమత లేక, కాస్త అవకాశాలు లేక నా కలలను సాకారం చేసుకోలేక పోయాను. నా పిల్లలకు మాత్రం అలాంటి పరిస్థితి రానివ్వను. ఐనా మీకు పిల్లలు పుట్టాక తెలిసొస్తుంది లెండి,” నవ్వుతూ అంది స్మిత.

అంతలో, అర్చక్‌తో పాటు ఇంట్లోకి ప్రవేశించాడు సుధాకర్. “ఏరా రాఘవ్ ఎలా ఉన్నావు? మీరెలా ఉన్నారు రాధ గారు?” అంటూ.

“బాగున్నాంరా, ఇప్పుడే మీ వాడి క్లాస్ గురించే మాట్లాడుకుంటున్నాం,” సుధాకర్‌తో కరచాలనం చేస్తూ అన్నాడు రాఘవరావు.

“అంకుల్‌కి చేత వెన్న ముద్ద పద్యం చెప్పి వినిపించమ్మా,” ఆర్డర్ వేసింది స్మిత. ఇంకో సారి అడిగించుకోకుండా, టక టక పద్యం చదివేశాడు అర్చక్.

“భలే చదివావు. దీని అర్థం తెలుసా?” అడిగాడు రాఘవరావు. అర్చక్ బిక్కమొహం వేశాడు.

“వాడికి తెలుగు సరిగ్గా మాట్లాడ్డమే రాదురా, ఇంక అర్థమేం చెప్తాడు,” నవ్వాడు సుధాకర్.

“వాడి వయసు తెలుగు పిల్లలు అందరూ చెరో పదేసి పద్యాలు అప్ప చెప్తారు రాఘవ రావు గారు. వీడు వెనక పడిపోకూడదు, పైగా మన సంస్కృతి తెలియాలి, అని మేము కూడా నేర్పిస్తున్నాం. అర్థం తరువాత తెలుసుకుంటాడు లెండి,” చెప్పింది స్మిత. రాఘవరావు అప్రయత్నంగా బుర్ర గోక్కున్నాడు.

అప్పటిదాక తన రూంలో ఉన్నట్టుంది, అప్పుడే బయటకి వచ్చింది అర్చక్ చెల్లెలు కుహూ. వెరైటీగా ఉండాలని తనకి ఆ పేరు పెట్టారట, ఒకసారి సుధాకరే చెప్పాడు రాఘవరావుకి.

“ఇంకా తయారు కాలేదా! స్విమ్మింగ్ క్లాస్‌కి టైం అయ్యింది, పద పద,” ఖంగారు పడ్డాడు సుధాకర్.

“ఏంటి, నువ్వు మళ్ళీ బయటకి వెళ్తున్నావా?” ఆందోళనగా అన్నాడు రాఘవరావు.

“లేదురా, ఈ సారి స్మిత వంతు. నేను ఇంట్లోనే ఉండిపోతా,” చెప్పాడు సుధాకర్.

స్మిత, “పద కుహూ, నిన్ను తయారు చేస్తాను,” అంది.

“ఊహూ, నేను రాను,” మారాం చేసింది కుహూ.

“కుహూ, చెప్తే వినాలి.”

“ఊహూ, నేను ఇంట్లోనే ఆడుకుంటాను.”

“అక్కడ నీ ఫ్రెండ్స్ అంతా వస్తారమ్మ. నువ్వే మిస్ అవుతావు,” నచ్చ చెప్తూ అంది స్మిత.

“ఆ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా ఆహా ఓహో అనే పేర్లు ఉన్నాయా?” ఆసక్తిగా అడిగంది రాధ.

“అబ్బే! అవేం పేర్లండి? కుహూ అంటే కోయిల కూత. కాబట్టి ఈ పేరులో ఎంతో భావుకత్వం ఉంది,” ఎక్స్‌ప్లెయిన్ చేసింది స్మిత.

కాసేపట్లో స్మిత కుహూని తీసుకుని నిష్క్రమించింది. సుధాకర్, రాఘవరావు కబుర్లలో పడ్డారు. రాధ దిక్కులు చూస్తూ కూర్చుంది. అర్చక్ ఏదో తింటున్నాడు.

కాసేపయ్యాక అసహనంగా గడియారం వైపు చూశాడు సుధాకర్.

“ఏమయ్యిందిరా?” ప్రశ్నించాడు రాఘవరావు.

“స్మిత ఇంకా రాలేదేంటా అని. తను రాగానే నేను అర్చక్‌ని తీసుకుని కరాటే క్లాస్‌కి వెళ్ళాలి.”

“మళ్ళీ బయటకి వెళ్తావా, ఐనా నువ్వు కరాటే నేర్చుకుంటే, వాడెందుకు మధ్యలో?”

“హ హ హ. కరాటే నేర్చుకునేది వాడే. నాది కేవలం డ్రైవర్ ఉద్యోగం. వాడికి కరాటే ఎందుకు నేర్పిస్తున్నామంటే…”

“మిగతా పిల్లలు అంతా నేర్చుకుంటున్నారు. మీ వాడు వెనక పడిపోకూడదని,” ముక్త కంఠంతో సమాధానం ఇచ్చారు రాఘవరావు, రాధ.

“కరెక్ట్! మీరు బాగా క్యాచ్ చేశారు. అదిగో స్మిత వచ్చింది. నేను బయలుదేరుతున్నా,” హడావుడిగా అర్చక్‌ని తీసుకుని బయట పడ్డాడు సుధాకర్.

కాసేపయ్యాక సుధాకర్ అర్చక్‌తో తిరిగి రాగానే, స్మిత కుహూని తీసుకుని పియానో క్లాస్‌కి వెళ్ళిపోయింది. అలా సాయంత్రం అయ్యేప్పటికి, అర్చక్,కుహూ, చెరి ఆరు క్లాసులకి వెళ్ళొచ్చారు.

దాదాపు సాయంత్రం ఏడయ్యాక, ఫైనల్‌గా సుధాకర్ స్మిత, ఇంట్లోనే సెటిల్ అయ్యారు.

“ఏరా! ఇంక క్లాసులేమీ లేవా?” నీరసంగా అడిగాడు రాఘవరావు.

“ఈ రోజుకింతేరా, నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం అర్చక్ గుర్రపు స్వారీ నేర్చుకోవడానికి వెళ్తాడు. అప్పుడు ఇంకో క్లాస్ ఎక్కువవుతుంది,” సమాధానమిచ్చాడు సుధాకర్.

“ఇక మేం వెళ్ళొస్తాంరా,” లేచి నిలబడ్డాడు రాఘవరావు.

“అప్పుడే వెళ్ళిపోతారా! ఏంటో అసలు మీతో సరిగ్గా మాట్లాడినట్టే లేదు,” బాధ పడ్డాడు సుధాకర్.

“మరే, ఎప్పుడన్నా మీ పిల్లలకి ఏ క్లాసులు లేని రోజు, ఇంకోసారి వస్తాంలే,” అన్నాడు రాఘవరావు.

“ఆ రోజు రావాలంటే, నువ్వింకో పదిహేనేళ్ళు వెయిట్ చెయ్యాలిరా,” బిగ్గరగా నవ్వాడు సుధాకర్. స్మిత కూడా అతనితో జత కలిపింది.

వింజమూరు వెంకట అప్పరవుగారికి ధన్యవాదములు

--((**))--

ప్రాంజలి ప్రభకు పంపినవారు-౩6   

కోతికొమ్మచ్చి... ఆడితే అప్పచ్చి..!! 
"పొద్దున్నే ఈ వెధవ ట్యూషన్ కనిపెట్టినవాడిని చంపెయ్యాలి!", అని ఏడ్చుకుంటూ, కాళ్ళీడ్చుకుంటూ బయల్దేరాను. అప్పుడు నా వయస్సు ఆరేడేళ్ళు వుంటాయ్ అనుకుంటా. ఇంటి పక్కనే, మా స్కూలు పంతులమ్మ ఒకావిడ పాఠాలు చెప్పేవారు. చాలా మంచావిడ. కాకపొతే కొంచెం ఆలస్యం ఐనా, మార్కులు తక్కువ వచ్చినా చంపేస్తారు. పొద్దున్నే అమ్మ ఎలాగో తన్ని నిద్ర లేపి పంపిస్తుంది, మళ్ళీ తన్నులు  అంటేనే కొంచెం బాధ. అది కూడా అమ్మాయిల ముందు! ఛీ.. ఛీ.. పరువు పోతుంది. 'ఏదో చిన్నపిల్లోడు, ఇంత పొద్దున్నే ఎలా వస్తాడు?', అని వదిలెయ్యొచ్చుగా! బాగా తంతారు, దానికి తోడు మిగతా పిల్ల రాక్షసులు పొద్దున్నే తగలెడతారు. వాళ్ళతో పోలిక ఒకటి. బతుకు నరకం అయిపోయింది. తొందరగా పెద్దోళ్ళం అయిపోతే ఈ బాధ నుంచి విముక్తి దొరుకుతుంది. 



'ఇలా వారం అంతా గడిచిపోతుంది. పొద్దున్నే లేవటం, ట్యూషన్ కి వెళ్ళటం! అక్కడినుండి రాగానే స్కూలు! ఛీ! వెధవ బ్రతుకు ఎన్నాళ్ళు చదవాలో ఏంటో!', అనుకుంటుంటే వారాంతం వచ్చేది. వుండేది ఒక్క రోజు, కనీసం ఆ రోజు ఆడుకుందాం అంటే వచ్చే వారం నుంచి ఆ వేళ కూడా ట్యూషన్ పెడుతున్నారు. అర్థవార్షిక పరీక్షలు వస్తున్నాయి కదా! లాభం లేదు ఏదో ఒకటి చేసి ఆ వేళ ట్యూషన్ ఎగ్గొట్టాలి అని నిర్ణయించుకున్నా! పైగా ఆ వేళ లవుకాంత్ (నా స్నేహితుడు, వాళ్ళ అమ్మానాన్నల్ది ప్రేమపెళ్ళి గుర్తుగా వాడికి ఆ పేరు పెట్టారు) వాళ్ళతో మ్యాచ్ (కోతికొమ్మచ్చి) ఉంది. పోయినవారం మమ్మల్ని ఓడించి పెద్ద పోసు కొట్టాడు, వెధవ. ఈ వారం వాళ్ళకి చుక్కలు చూపించాలి అనుకున్నానే! ఇప్పుడేమో ఈ ట్యూషన్. ఆ విషయం వాడికి చెప్తే భయపడి, తప్పించుకోవటానికి ఇలా చెప్తున్నాను అనుకుంటాడు. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూనే వారం అంతా అయిపోయింది. వస్తుంది వస్తుంది అనుకుంటున్న ఆదివారం రానే వచ్చింది. అదృష్టవశాత్తూ ఆ వేళ పొద్దున్నే ట్యూషన్. "హిప్ హిప్ హుర్రే!", అనుకుంటూ ఎగిరి గంతేసాను. మొత్తానికి ట్యూషన్ మానటానికి అనవసరంగా అబద్దాలు చెప్పక్కర్లేదు అనుకుంటూ ఆనందంగా ఉదయాన్నే లేచి ట్యూషన్ కి బయల్దేరాను. 




ట్యూషన్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురుచూడటం సరిపోయింది. చదువు-సంద్యా లేకుండా అలా అలా సమయం గడిపేశాను. మొత్తానికి ట్యూషన్ అయిపోయింది. ఇంక సంచి బుజాలకెత్తుకొని పరిగెత్తి పరిగెత్తి ఇంటికొచ్చాను. ఏదో రెండు మెతుకులు మెక్కి మ్యాచ్ ఆడటానికి పరిగెత్తాను. ఆడాం.. మళ్ళీ ఓడాం . ఉసూరుమంటూ ఇంటికి వస్తే నా ఖర్మ కొద్దీ రోజూ ఆలస్యంగా వచ్చే నాన్నగారు ఆ వేళ తొందరగా వచ్చారు. "ఎక్కడికి వెళ్ళావు రా ఇంట్లో చెప్పకుండా? నీకు అసలు భయం లేకుండా పోతుంది", అంటూ అప్పుడే కొట్టేసిన సరుకు చెట్టు పుల్లతో ఒళ్ళంతా వాయగొట్టారు. అసలే మ్యాచ్ ఓడిపోయి వస్తే ఇంట్లో కూడా వళ్ళు హూనం అయిపోయింది. అదే మొదటిసారి నాన్నగారు నన్ను కొట్టడం!! ఆ రోజంతా దెబ్బలు బాగా నొప్పిపెట్టాయి. ఇంకా జన్మలో మళ్ళీ కోతికొమ్మచ్చి ఆడకూడదు అని తీర్మానం చేసుకున్నా. 




మళ్ళీ వారం అంతా స్కూలు, ఇల్లు, ట్యూషన్, చదువులతో సరిపోయింది. అన్నట్టు చెప్పడం మరిచాను మళ్ళీ ఆదివారం కోతికొమ్మచ్చి మ్యాచ్ ఆడాం. గెలిచాం కూడా. ఈ సారి నాన్నగారికి దొరకలేదు లేండి!! 

కృతజ్ఞతలు:-బ్లాగ్ తెలుగువారమండీ(దీలిప్.)
--((**))--


ప్రాంజలి ప్రభ " ఓట్ల రాజకీయం"
ఒక చిన్న కధ ౩5  

విమర్శలు, ప్రతి విమర్శలు ఓట్లకోసం నాయకులు ఉపన్యాసాలు పెచ్చు పెరుగుతాయి. మనకందరికి ఓర్పు ఉన్నది. త్యాగాలు చేసేవారు, అభివృధ్ధి పరిచేవారు ఎవరో తెలుసుకొని ఓట్లు వేయండి

కులాలు కూడు పెట్టవు, కష్టపడితే నే ఫలితం ఉంటుందని దైవమే తెలియ పరిచాడు. క్షణిక సుఖానికి లొంగి ఓట్లు వేయటం అవసరమా, నిజాయితీగా నమ్మిన వానికి ఓటు వేయటమో నిర్ణయం చేసుకొనే శక్తి మనకన్నది. ఓటు విలువ గుర్తించి ఓటు వేయండి.

ఈ ఒక్కసారి మాకు ఓటేయండి అని అడుగుతున్నారు. కరంటు తీగ పట్టు కోమంటే పట్టు కుంటారా, విషం త్రాగ మంటే త్రాగుతారా. మానవ జన్మకు ఆలోచించే జ్ణానాన్ని దైవం కల్పించింది. కనుక ఎవరికి ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృధ్ధి చెందునో తెలుసుకొని ఓటు వేయండి

కొందరి మాటలు ప్రజలను భయ భ్రాంతులు చేస్తున్నాయి, వాటిలో నిజా నిజాలు తెలుసుకొని ఓట్లు వేయుటకు ముందుకు రండి.

అడిగిన వెంటనే మన సమస్యకు పరిష్కారం చెప్పి, రాజకీయ పరంగా ఆదు కుంటారు అని తెలుసుకొని వారికే ఓటు వేసి గెలిపించండి

కొందరు పార్టీ కొమ్ము కాసి ప్రచారం చేస్తారు, ఎదుటి వారిని దూషిస్తే ఓట్లు పడతాయని తిట్ల పురాణం చేపట్టారు, అందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసు కోవాలి, టాక్స్ ఎగొట్టేందుకు, చేసిన తప్పులు బయఁట పడకుండా ఉండేందుకు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. మమ్మల్ని గెలిపిస్తే స్వర్గాన్ని చూపిస్తామంటారు. నేను ఒకటే చెప్పేది ఓటును దుర్వినియోగం చేయక ఓటు వెయ్యండి, మన ఓటు వేరొకరు వేయకుండా ముందుగా వచ్చి ఓటు వెయ్యండి.             


*నోట్ల మార్పిడి-తెచ్చిన తంటా (పాత  కధ ) 34 
రచాయ: మల్లాప్రగడ రామకృష్ణ 

ఏమండి టి.వీ.  చూసారా,, ఏముంది దానిలో అసభ్యకరమైన నృత్యాలు, అర్ధం కాని పాటలు ,  నాయకుల వాదోప వాదాలు, దెయ్యపు కథలు, అర్ధరాత్రి హత్యలు, ప్రభుత్వము వారు ప్రజలకొరకు ఇవి చేస్తున్నారు ఇన్ని కోట్లు ఖర్చు, అది చేస్తున్నందుకు అన్ని కోట్లు ఖర్చులు అని వినటం, లేదా ప్రేమికులు హత్యలు, చూసిన సినిమా చూడటం తప్ప ఏమున్నదే దానిలో.


మీ కదే తెలుసు 500 రూపాయల నోట్లు, 1000  రూపాయల నోట్లు రద్దు చేస్తున్నారు తెలుసా

అయినా మన దగ్గర ఏమున్నాయి, ఏదన్న అవసరం అనుకునే  ఏ .టి  ఎం  కు పోయి డబ్బులు తెచ్చుకుంటున్నాము కదా
.
ఈ రోజు ముందు ఈ ముడుపులో దాచిన నోట్లు మన డిపాజిట్ లో వేసి రండి.

మన కవసరమయితే ఎట్లాగే, పనికిరాని నోట్లు ఇంట్లో పెట్టుకుంటే ఎం లాభం ముందు  బ్యాన్కు లో వేసి రండి అన్నది శ్రీమతి సుభద్ర.

సరేనే ఆగొడుగు, కళ్ళజోడు, ఆ కర్ర, ఇటు ఇవ్వు నెమ్మదిగా పోయి నీ      ఎకౌంట్లో జమా చేసి   వస్తాను, నాకు ఆలస్యమైనదని గాబరా పడకు, అక్కడ ఎంత మంది ఉన్నారో తెలియదుకదా అన్నాడు అర్జున్ రావు .

మీరు ఆఁలా అంటారని నాకు తెలుసు ఇదిగో ఈ సెల్లు దగ్గర పెట్టుకోండి, అక్కడ ఆలస్యమైతే నాకు ఫోన్ చేయండి.

నెమ్మదిగా బ్యాన్కువద్దకు చేరాడు అర్జున్ రావుగారు, అక్కడ ఒక పెద్ద క్యూ ఉన్నది దాని దాటుకుంటూ లోపలకు పో బోయాడు, అక్కడ వున్నవారు ఒక్కసారి దాడి చేసి నట్లు ముసలి వారని కూడా గమనించకుండా మేము పొద్దున్న వచ్చాము, మీరు ఇప్పుడొచ్చి ముందుకు పోతారా అని ఒకటే అరుపులు గత్యంతరం లేక లైన్లో నుంచొని ఉన్నాడు, పైన ఎండగా ఉన్నదని గొడుగు తీస్తే పక్కవాడు పొడుచు కుంటున్నాదని పోట్లాడాడు, కనీసము మంచి నీళ్లు కూడా ఏర్పాడు చేయలేదు బ్యాన్కువారు, అతి కష్టం మీద మూడు గంటలు నుంచొని బ్యాన్కు లో డిపాజిట్ చేసి వచ్చాడు అర్జున్ రావు.

ఏమండి ఉప్పు లేదు కొనుక్కు రండి అని ఇంట్లో ఉన్న చిల్లరంతా సేకరించి ఎక్కువరేటుతో ఉప్పు ప్యాకెట్టు కొనుక్కొని తెచ్చాడు.

ఏమండి మందులు అయిపోయినాయి ఏ.టి.ఎం వద్దకు పోయి డబ్బులు తెండి అన్నది సుభద్ర.

ఎం తెచ్చేది వాగులో మట్టి తేవచ్చు అసలు ఏ.ట్.ఎం.లో డబ్బులు పెడితేనే కదా, మరి ఎట్లాగండి నాకు చాలా కష్టముగా ఉన్నది, ప్రాణం పోయేటట్లు ఉన్నది.

నీవు భాద పడకు మందులు షాపు వాన్నీ బాకీ అడుగుతాను అని వెళ్ళాడు మందుల షాపువద్దకు

ఏమండి పెద్ద వారు, మీరు అప్పు అడగటం ఏమిటి,  ఎం చెప్పమంటావు బాబు ప్రభుత్వం వారు నోట్లు రద్దు చేసారు, ఏ.ట్.ఎం లో డబ్బు లేకుండా చేశారు, నీకు తెలుసు కదా అందుకని వచ్చాను అని నెమ్మదిగా చెప్పాడు. అదిగో ఆబోర్డు చూడండి దాని బట్టి మీరు ప్రవర్తించండి అని చెప్పగా  అటు చూడగా దానిపై 'అప్పు రేపు' అని ఉన్నది.

అప్పుడే అర్జునరావు స్నేహితుడు సుబ్బారావు కని పించాడు, వీరిద్దరి మాటలు విని వెంటనే ఆఁ చీటీలో ఉన్న మందులు ఒక్కొక్కటి చొప్పున, అన్నీ ఎంతవు తుందో చెప్పు నేను ఇస్తాను అని తీసి కొంత పైకము ఇచ్చాడు సుబ్బారావు.

ఒక పూటకు మాత్రలు తీసుకోని అర్జున్ రావు సుబ్బారావుతో మీరు చాలా తెలివి గలవారను కుంటా ముందు జాగర్తగా 100  రూపాయలు నోట్లు ఉంచుకొని ఉనట్లున్నారు.

మీరు అమాయకులు లాగున్నారు, భాద పడుతున్నారుగా, అవును సుబ్బారావ్ నీ దగ్గర డబ్బులెట్లా వచ్చాయి, ఏమీ లేదు అర్జున్ రావుగారు నాకు ఒక మెసేజ్ వచ్చింది మీ డబ్బుకు 100  నోట్లు ఇవ్వ బడును, కొంత కమిషన్లతో అని ఉన్నది.  మంచిదని అక్కడకు పోయాను వారి కమిషన్ ఇచ్చి నోట్లు తెచ్చుకున్నాను.

మరి మీరు బ్యాన్కులో వేయలేదా ఎందుకు వేస్తామండి, అక్కడకు  పోయి ప్రాణ్ కార్డు చూపి మరి వెయ్యాలి మా కెందు కండి అంత కష్టం అని నిర్మొహ మాటంగా చెప్పాడు, అర్జున్ రావు ఏంచేయాలో తోచక రెండో పూటకు మందులెట్లా అని ఆలోచిస్తూ సుబ్బారావును అప్పు అడుగు దామని నిర్ణయించుకున్నాడు. నెమ్మదిగా నాకు కొంత డబ్బు కావాలి అప్పుగా మాత్రమే అన్నాడు

అయ్యో మీరు అట్లా అడగాలండి ఒక్క మూడు రోజులు లాగండి ఏ.ట్.ఎం లు పని చే స్తాయి డబ్బు తీసుకోని ఇస్తాను ఇంతకీ మీకు ఎంత కావాలి అన్నాడు.

ఇపుడు ఎంత ఇవ్వగలవో చెప్పు అన్నాడు అర్జున్ రావు సుబ్బారావుతో అంత కోపము వద్దు అర్జన్ రావు ఇప్పుడు నేను ఇవ్వనంటే మన స్నేహం చెడి పోతుందని అనవద్దు, నీ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేను, మా హెడ్ ను కనుక్కొని రేపు చెప్పగలను సరే నీ మాటకు నేను ఏమి చెప్పగలను నీకు ఒక నమస్కారము తప్పా.

          అప్పుడే   తెలిసింది బ్యాంకులో డబ్బు తీసుకొనుటకు వీలు కల్పించారు  విషయం తెలుసుకొని అతికష్టం మీద ఇంటి దగ్గరగా ఉన్న s.b.h   బ్యాన్క్ లో లైన్ లో నుంచొని వెళ్లగా మాదగ్గర మీ ఎకౌంట్ లేదు, మీ చెక్కు ఇక్కడ మార్చుటకు కుదరలేదు అన్నారు , చేసేది లేక మరలా  SBH ఎకౌంట్ ఉన్న చోటునే వెళ్లి లైన్లో నుంచొనగా, 20, 2000 రూపాయల నోట్లతో బయటకు రాగలిగాడు అర్జునరావు.

మొత్తం మీద మందులు కొనుక్కొని ఇంటికి చేరాడు, అప్పుడే సు బ్బారావు వచ్చి ఇదిగో నీవు అడిగావు కదా డబ్బులు తెచ్చా 3 రూపాయల వడ్డీ అవుతుంది నీకు ఇష్టమైతే తీసుకో అన్నాడు . వెంటనే అర్జున్ రావు ఇప్పుడు అవసరము లేదు, అవసరమయితే నీ దగ్గరకే వస్తా అని చెప్పి పంపించాడు .

 ఇదేమి లోకమో బలహీనులను   బలవంతులు   దోచుకుంటారు, బలవంతులను తెలివిగలవాళ్ళు దోచు కుంటారు, తెలివి గలవాళ్ళు ఆశకు పోయి ఉన్నది పోగొట్టు కుంటారు, మధ్య తెలివిగలవాడు ప్రభుత్వాన్ని దోచుకుంటారు, టాక్స్ కట్టకుండా తిరిగినా ఏమి చేయ లేరు, ఇతరదేశాల పారిపోయినా ఏమిచేయలేరు, నోట్లు మారుస్తున్నారు ఐ .టి  కట్టని వారిని  ఎవరు పట్టు కుంటారు, ఏది ఏమైనా కొత్తనోట్లు రావటం సూచకం, ప్రజలు భాద పడకుండా ఏ.టి.ఎం. లో  కూడా డబ్బు పెట్టుట ఇంకా శుభసూచకం.

--((**))--

చిన్న కధ (32 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఏమిట్రా ప్రవీణ్ రోజు మాదిరిగా ఈ రోజు ఉషారు లేవేమిటిరా 
లేకే ఎప్పటి లాగానే ఉన్నాను గా 
కాదు ఎదో నీలో మార్పు ఉన్నది  
నాలో మార్పు వచ్చిందని ఎలా కనుక్కొన్నావ్ 
అదేరా స్నేహం అంటే
ఆర్నెల్లు నీతో సహవాసం చేసానుగా నీ లక్షణాలు నాకు తెలియదా 
ఎందుకోరా ఈరోజు నామనసు ఏటో లాగుతున్నది 
పెళ్లి చూపులకేమన్నా పొయ్యావా ఏమిటి
నా మొహానికి అదికూడానా 
మరి ఏమిటిరా 
అదేరా మన ఇంటి సందు చివరా ఉన్న ఇంట్లో 
ఆ ఉన్నఇంట్లో   
ఒక అమ్మాయి నవ్వుతుంటే చూసానురా 
ఆ ఇంట్లో దూరావా "ఎయిడ్స్" వేరే తెచ్చుకోవక్కర్లా
నీ కెట్లా తెలుసురా
అదో పెద్ద కధలే
ముందు నీ విషయం చెప్పు 
గులాబీ అందం చూసావా 
చూసాను 
మల్లె పువ్వు అందం చూసావా 
చూసాను 
పువ్వుకు అందం కన్నా సువాసన బాగుంటే ప్రతి ఒక్కరి మనస్సు పులకరిస్తుంది 
అదేరా నేను చెప్పా బొయ్యేది

పదహారేళ్ళ పడచు నవ్వింది 
ఆ నవ్వితే 
ఆనవ్వుకు మనస్సు చలించింది రా
ఆ ఆమ్మాయి ప్రేమతో నవ్విందను కుంటున్నావా
మరింకేమిటిరా 
ఆ రకం అనుకోవచ్చుగా 
అలాంటిది కాదురా        
ఆ నవ్వులో అర్ధం నీకు తెలియదురా 
అబ్బో నీకేం తెలుసో చెప్పు 


" నవ్వింది

 మల్లెపూవంటి
ఆ పూబోణీ నవ్వింది
గులాబీ అందాన్ని మించి
సన్నజాజి సుమగంధం మించి
నందనవనంలోని పువ్వులను మించి
తొలకరి చిరు చినుకుల ఆహ్లాదాన్ని మించి
కొండపైనుండి జాలువారే జలపాతాన్ని మించి
నిండు పున్నమి చంద్రిక విరిసే వెన్నెలను మించి
నీలి మబ్బులు చీల్చుకుని మెరిసే మెరుపుని మించి  
ఇంద్రధనస్సులోని సప్తవర్ణాల సోయగాన్ని మించి 
మనసును మురిపించి మైమరపించేలా నవ్వింది." 


ఇంతకీ నీవేమనుకుంటున్నావు 

చదువు మానేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నా 
అబ్బో అంతదాకా వచ్చిందా 
దాని నిజరూపం ఏమిటో తెలుసా 
నా కవసరం లేదు 
మరి నీకు ఇంకేం కావాలి 
ఆ నవ్వు ఒక్కటి చాలు ఈ హృదయంలో పదిలంగా దాచు కుంటా
కొందరి బలహీనత మరికొందరికి ఆయుధం 
ఇలాంటి వారిని కాలమే మార్చాలి 


--((**))--

(8)

*ఆనంద్ ముసలి వాడు అవుతున్నాడు . తన బిజినెస్ ఎవరో ఒకరికి అప్పచెప్పేసి హృషీకేష్ వెళ్లిపోవాలి అని నిర్ణయించుకున్నాడు .*


*తన ఇన్ని కోట్ల వ్యాపారం వారసులకు ఇవ్వడమా ? కంపనీ డైరెక్టర్ ల కొడుకులకు ఇవ్వడమా ? ఏమి చెయ్యాలి ?*

*ఒక రోజు కంపెనీ సిబ్బందిని అందరినీ సమావేశ పరచాడు . నేను రెండు మూడు నెలల తర్వాత హృషీకేష్ కి వెళ్లిపోవాలి అని నిర్ణయించుకున్నాను . ఈ కంపెనీ చీఫ్ ఎక్జిక్యూటివ్ పోస్టుకు మీలో ఒకరిని నియమించాలి అని నిర్ణయించుకున్నాను . అయితే అందుకు నేను ఒక విధానం ఆలోచించాను*


*“నేను ఈ రోజు మీలో ప్రతీ ఒక్కరికీ ఒక “విత్తనం” ఇవ్వదలచుకున్నాను . ఆ విత్తనాన్ని మీరు కుండీలో నాటి , నీరు పోసి నెల రోజుల తర్వాత నాకు చూపాలి.. ఎవరు చూపుతారో వారికి ఆ పదవి ఇవ్వాలని నిశ్చయించుకున్నాను . మీకు అంగీకారం అయితే మీరు తీసుకున్న వివరాలు ఆఫీస్ లో నమోదు చేయించుకుని పట్టుకు వెళ్ళండి . సరిగా నెల రోజుల తర్వాత మనం కలుద్దాం”*

*ఆయన ఇచ్చిన విత్తనాలను అందరూ తీసుకున్నారు . అలాగే ప్రదీప్ కూడా తీసుకున్నాడు . రాధిక తో చెప్పాడు . కుండీ కొని అందులో విత్తనం వేశారు . రోజూ నీళ్ళు పోస్తున్నాడు . ఒక వారం గడిచింది . ఆఫీస్ లో అందరూ తాము పెంచుతున్న మొక్క ఎదుగుదల గురించి చర్చించడం మొదలు పెట్టారు . ప్రదీప్ వాళ్ళ ఇంట్లో వేసిన “విత్తనం” ఇంకా మొలకెత్తలేదు . ప్రదీప్ కి అర్ధం కాలేదు . విత్తనం తీసి చూశాడు . ఉంది . ఇంకా మొలకెత్తలేదు . ఏమయ్యుంటుంది ? అందరి విత్తనాలూ మొలకలు వచ్చి పెద్దవి అవుతున్నాయి . మూడు వారాలు గడచిపోయాయి . కొందరు వేసిన విత్తనాలు పెరిగి పెద్దవి అయ్యి పూలు వస్తున్నాయి ట*


*ప్రదీప్ ఇంటిలో వేసిన “విత్తనం” లో ఎటువంటి మార్పూ రాలేదు .పోటీలోఓడిపోయాను . ఎక్కడో లోపంజరిగింది . ప్రదీప్ లో నిరాశ ! ఎవరితోనూ ఏమీ చెప్పలేదు ప్రదీప్*


*నాలుగో వారం వచ్చేసింది*


*మళ్ళీ అందరూ సమావేశం అయ్యారు . కొందరు తమ మొక్కను ప్రత్యేకం ఆటో లలో తీసుకు వచ్చారు . ఆ రోజు ప్రదీప్ కి ఆఫీస్ కి వెళ్ళాలి అనిపించలేదు.*


*మీరేమీ లోటు చెయ్యలేదు . మీరూ వెళ్ళండి . మీరు వేసిన “విత్తనం” ఎందుకు మొలకెత్తలేదో తెలుస్తుంది కదా ! అన్న రాధిక సాంత్వన తో ఆఫీస్ కి బయలుదేరాడు . తాను వేసిన “విత్తనం” కుండీని చిన్న బేగ్ లో పెట్టుకుని*


*ఆఫీస్ రకరకాల మొక్కలతో నందన వనం లా కళకళలాడుతోంది . తాను తెచ్చిన కుండీ ఎక్కడ పెడితే ఎవరు ఏమంటారో అని తలుపు వారగా పెట్టాడు . ఆ కుండీని చూసిన కొందరు జాలిగా చూశారు . కొందరు వెక్కిరిస్తున్నట్టు చూశారు . ఒక మూలగా తాను కూర్చున్నాడు*
.


*ఆనంద్ రూమ్ లోకి వచ్చాడు .*
.
*అందమైన ఆ మొక్కలను చూశాడు*

.
*"ఓహ్ ! ఎంత అందమైన గొప్ప గొప్ప మొక్కలను పెంచారు ? ఈ రోజు మీలో ఒకరు ఈ కంపెనీ అధికారి కాబోతున్నారు . ప్రదీప్ ! నువ్వేమిటి ఖాళీ కుండీ తెచ్చావు ?*
.

*ప్రదీప్ ఒక్కసారి ఊపిరి పీల్చాడు . జరిగిన కధను యధాతధం గా వివరించాడు .*

*ఆనంద్ “ ఫ్రెండ్స్ ! అందరూ కూర్చోండి . మీకు నేను మీ కంపెనీ సి ఈ ఓ ని చూపబోతున్నా ! ఆ వ్యక్తి మిస్టర్ ప్రదీప్ !”*

*అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు*

*“అదేంటి సర్ ? అతడు మొక్కను పెంచలేదుగా ?”*

*ఆనంద్ అన్నాడు ,*


*ఫ్రెండ్స్ ! మిమ్మల్ని నేను విత్తనం పట్టుకు వెళ్లి నాటి నీళ్ళు పోసి నెలరోజుల తర్వాత తీసుకు రమ్మన్నాను. నేను మీకు విత్తనాలు ఇచ్చినపుడు అవి కొద్దిగా వేడి చేసి ఇచ్చాను . వాటిలో జీవ శక్తి లేకుండా చేసి ఇచ్చాను . అవి దగ్ధ బీజాలు . అవి మొలకేత్తవు అని నాకు తెలుసు .”అలాగే మీరంతా వేరే విత్తనాల ద్వారా మొక్కలను పెంచుకొచ్చారని నాకు తెలుసు.*

*“అందుచేత ప్రదీప్ ని నేను ఈ కంపెనీ సి . ఈ . ఓ గా నియమిస్తున్నాను”*

         *మిత్రులారా*

 *🌷మీరు నిజాయతీని నాటితే నమ్మకాన్ని పొందుతారు*

*🌷మంచిని నాటితే మిత్రులను పొందుతారు*

*🌷నిగర్వం నాటితే గొప్పదనం పొందుతారు*

*🌷వినయాన్ని నాటితే తృప్తిని పొందుతారు*

*పరిశీలన దృక్పధం నాటితే మంచి దృష్టి పొందుతారు*

*🌷శ్రమను నాటితే విజయం పొందుతారు*

*🌷క్షమను నాటితే సయోధ్యను పొందుతారు*

*🌷ప్రార్ధనలు నాటితే భగవానుని పొందుతారు*

*🙏మీరు నేడు నాటిన విత్తనం బట్టిరేపు మీరు పొందే వృక్షం ఉంటుంది.మీరు ఇచ్చేదే మీకు తిరిగి వస్తుంది🙏*

         *🌷ప్రాంజలి ప్రభ (7)

--(())--
*రాత్రి జరిగే ఆకస్మిక మరణాలకు దూరంగా ఉండండి, ఒక వైద్యుని సలహా*

ఇంటిని పరిశీలించడానికి లేదా మూత్ర విసర్జన చేయడానికి రాత్రి లేచిన వారికి, ప్రతి వ్యక్తి తప్పనిసరిగా మూడున్నర నిమిషాలు గమనించాలి.

ఇది తరచూ జరుగుతుంది: ఎల్లప్పుడూ ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి రాత్రి కన్నుమూశారు.  "నిన్న, నేను అతనితో మాట్లాడాను, అతను అకస్మాత్తుగా ఎందుకు చనిపోయాడు?"

కారణం, మీరు టాయిలెట్ కు వెళ్ళడానికి రాత్రి లేచినప్పుడు వెంటనే లేవడం వలన మెదడుకు రక్త ప్రసరణ ఉండదు.

 "మూడున్నర నిమిషాలు" ఎందుకు అంత ముఖ్యమైనవి?  అర్ధరాత్రి, మూత్ర విసర్జన కోరిక మిమ్మల్ని మేల్కొల్పినప్పుడు, ecg సరళి మారవచ్చు.

అకస్మాత్తుగా మంచం నుండి లేవడం ద్వారా, మెదడు రక్తహీనతతో ఉంటుంది మరియు రక్తం లేకపోవడంతో గుండె ఆగిపోతుంది.

మూడు నిమిషాలన్నర సాధన చేయడం మంచిది, అవి:

1. మీరు మేల్కొన్నప్పుడు, ఒకటిన్నర నిమిషాలు మంచం మీద ఉండండి.

2. తరువాతి అర్ధ నిమిషంలో మంచం మీద కూర్చోండి

3. మీ కాళ్ళను కింద ఉంచి, మంచం అంచున అర నిమిషం కూర్చోండి.

మూడున్నర నిమిషాల తరువాత, మీ మెదడు రక్తహీనత ఉండదు మరియు మీ గుండె బలహీనపడదు. ఈ విధంగా చేసినట్లయితే  ఆకస్మిక మరణం సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మీ కుటుంబం, స్నేహితులు మరియు ప్రియమైనవారితో ఈ విషయం షేర్ చేయండి.

వయస్సుతో సంబంధం లేకుండా ఇది జరగవచ్చు.  చిన్నవారైనా లేదా ముసలివారైనా, అందరికి తెలియజేయండి.

మీ కుటుంబం కూడా అంతా ఈ విధానాన్ని అనుసరించండి.
--(())--

ప్రాంజలి ప్రభ (6)
సేకరణ మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

🤔 ఒకబ్బాయి  Exams లో అన్నిటి కి correct
గా answers రాసాను..కావాలనే మాస్టారు zeero marks వేశారంటే..వాళ్ళ నాన్న...Recounting apply చేస్తే.వాడు.సమాధానాలు చూడండి 😂

☘తాజ్ మహల్ ఎక్కడ ఉంది?
జవాబు: కట్టిన చోటే!

☘చలికా లంలో ఐ స్ క్రీం తింటే ఏమవుతుంది?
జవాబు: కప్పు ఖాళీ అవుతుంది.

☘రెండు మామిడి పళ్ళను ముగ్గురు ఎలా పంచుకోవాలి?
జవాబు: రసం తీసి!

☘గుడికి వెళ్ళినప్పుడు బొట్టుదేనికి పెట్టుకుంటారు?
జవాబు: నుదుటికి!

☘నిద్రలో మంచం మీద నుంచి కిందపడితే ఏమౌతుంది?
జవాబు:మెలకువ వస్తుంది

☘సెల్ ఫోన్ పొతే ఏమౌతుంది..?
జవాబు:మనశ్శాంతి ప్రీగా వస్తుంది

☘నిమ్మకాయ సగానికి కోసి రసం ఎందుకు పిండుతారు?
జవాబు: తొక్క తీస్తే టైం వేస్ట్ కాబట్టి

☘టివి రిమోట్ అంటే మగవారికి ఎందుకు అంత ఇష్టం.?
జవాబు : ఇంట్లో అదొక్కటే తను చెప్పినట్టు వింటుంది కాబట్టి.!

☘అమ్మాయిలకు పెళ్లి ఎందుకు చేస్తారు?
జవాబు: ప్రేమలకు పుల్ స్టాప్ పెడతారని

☘భార్యలను సినిమాకి ఎందుకు తీసుకెళతారు? జవాబు: మూడు గంటలపాటు మాట్లాడకుండా ఉంటారని

☘స్విచ్ వేయగానే ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది...?
జవాబు: తిరగక పోతే కర్రతో కొడతారని

☘పెళ్లి చూపులకు అబ్బాయినే అమ్మాయి ఇంటికి ఎందుకు తీసుకెళతారు....?    జవాబు: బలి ఇచ్చేముందు మేకనే గుడి దగ్గరకు తీసుకెళతారు కాబట్టి😜...

😀😃😄😁😆😅😂🤣😛😝😜

నవ్వడం కాదు షేర్ చేసి అందరిని నవ్వించండి....


--(***))--
వాము (5)

 .. ప్రయోజనాలెన్నో .. కారంగా ఉన్నా ..ఖచ్చితంగా పనిచేస్తుంది..  నాటికాలంలో తిన్నది అరిగినట్లు లేదనగానే, కొద్దిగా వాము వేడినీళ్లతో కలిపి తీసుకోమని ఇంట్లో పెద్దోళ్లు చెబుతుంటారు. జంతికలు, మురుకులు వంటి కొన్ని పిండి వంటల్లో వాము వాడతారు. వాము జీర్ణశక్తికి మంచిదని చాలా మందికి తెలుసు, కానీ అంతకుమించి వాము ఎంతో ఉపయోగకరం. జీలకర్రలా కనిపించే ఇది రూపంలో చిన్నగా ఉన్నా చేసే మేలు చాలా గొప్పది.

* వామును నీళ్లలో నానబెట్టి, ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి. వాము, ధనియాలు, జీలకర్ర మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.

* వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, కడుపునొప్పి తగ్గుతాయి.   దీనిని కరక్కాయ, ఉసిరికాయ, తానికాయలతో కలిపి ముద్దగా నూరి, దంతాల మూలల్లో పెట్టుకుంటే అన్నిరకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి.

* వామును బుగ్గన పెట్టుకుని, నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి.

* దీనిని వివిధ అనుపానాలతో సేవిస్తే మూత్రపిండాల్లో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది.

* ప్రసవం తర్వాత స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి.

* జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి, మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది.

* ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది.

* గుండె వ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది.


*శాలువా నాకేందుకు ఆరటి పళ్ళు ఇస్తే ఓక పూట గడిచేదిగా అన్న మాజీ ముఖ్యమంత్రి*

--((***))--


ఓం శ్రీ రామ్ శ్రీ మాత్రే నమ: (4)
పంజలి ప్రభ - పాత కథకు జ్ఞాన భాష్యం
మల్లాప్రగడ రామకృష్ణ కధలు 5

















http://vocaroo.com/i/s1x6glE18C6s

అనగనగా ఒక రాజు... ఆ రాజుకి ఏడుగురు కొడుకులు...
(ఈ కధ (పరమా)అర్ధం )
కథ:
అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. ఏడు చేపల్ని ఎండ పెట్టారు. అందులో ఒకచేప ఎండలేదు. చేప చేప ఎందుకు ఎండలేదు. గడ్డిమోపు అడ్డమొచ్చింది. గడ్డిమోపు ... గడ్డిమోపు  ఎందుకు అడ్డమొచ్చావ్... ఆవు మెయ్యలేదు. ఆవు  ఆవు  ఎందుకు మెయ్యలేదు... గొల్లవాడు మేపలేదు. గొల్లవాడా... గొల్లవాడా ఎందుకు మేపలేదు... అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మా... అమ్మా ఎందుకు అన్నంపెట్టలేదు... పిల్లవాడు ఏడిచాడు. పిల్లవాడా... పిల్లవాడా ఎందుకు ఏడిచావు... చీమ కుట్టింది. చీమా చీమా ఎందుకు కుట్టావ్... నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టానా... అన్నది.
.
రాజుగారు అంటే మనిషి.

ఏడుగురు కొడుకులు అంటే మనలోని సప్త థాతువులు.

వేటకు వెళ్ళటము అంటే జీవనము సాగించటము. జీవితము అనే వేట.

ఏడు చేపలు అనగా మనల్ని పీడించే సప్త వ్యసనాలు
(కామము, వేట, జూదము, మద్యపానము, వాక్పారుష్యము (కఠినంగా, పరుషంగా మాట్లాడటం), దండపారుష్యము (కఠినముగా దండించుట), అర్థదూషణము (థనమును దూబారాగా ఖర్చుచేయుట)).
 
ఎండగట్టాటానికి వీలైనది కనుక చేప అని చెప్పబడినది.
 
ఎండపెట్టము అంటే వ్యసనాల్ని జయించుట. సాథన చేసి మనిషి తనలోని వ్యసనాలను జయించవచ్చు.

ఒకచేప ఎండలేదు. అంటే సప్తవ్యసనాలలో ఒక్క కామాన్ని తప్ప మిగిలినవాటిని జయించవచ్చును అని చెప్పుటకు ఒక చేప ఎండలేదు అని చెప్పబడినది.

కామాన్ని జయించటము చాలా కష్టము. అది ఎప్పటికి ఎండదు. ఇక్కడ కామము అంటే కోరిక... అది ఎలాంటి కోరిక అయినా కావచ్చును. మోక్షాన్ని పొందాలన్నది చాలా ఉత్కృష్టమైనది అయిననూ అదికూడా కొరికే కనుక కామాన్ని జయించుట కుదరని పని. కోరిక ఎండితే కానీ మోక్షము రాదు. కోరిక లేక బంధము తోలగుటయే కదా మోక్షము.

చేప ఎండకపోవటానికి కారణము గడ్డిమేటు. గడ్డిమేటు అజ్ఞానానికి ప్రతీక.

మన అజ్ఞానము ఎంత అంటే గడ్డిమేటంత. ఎన్ని గడ్డిపరకలు లాగినా గడ్డిమేటు తరగదు. అలాగే అజ్ఞానము తరగదు. ఎన్ని విన్నా, ఎంత తెలిసినా అజ్ఞానము పీడిస్తూనే ఉంటుంది. చెప్పలేనంత అజ్ఞానము అని చెప్పుటకు గడ్డిమేటును చెప్పారు. సమస్త జ్ఞానము కలిగినా అహంకారము (నేనున్నానన్న భావన) తొలగుట కష్టము. కనుక అజ్ఞానమును గడ్డిమేటుతో పోల్చినారు.

గడ్డిమేటు అడ్డుతగలటానికి కారణము ఆవు మేయక పోవటము.
వేదములలో ఆవును జ్ఞానమునకు ప్రతీకగా చెప్పారు. ఇక్కడ ఆవు అనగా జ్ఞానము. జ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగును. ఆవులచే మేయబడినా, అగ్నిచే దగ్దము చేయబడినా గడ్డిమేటు తొలగింపబడుతుంది. "జ్ఞానగ్ని దగ్ధ కర్మాణం" అని భగవద్గీత చెప్పుచున్నది. జ్ఞానమనే అగ్ని చేత మాత్రమే అజ్ఞానము తొలగింపబడుతుంది.

ఆవు ఎందుకు మేయలేదు అంటే గొల్లవాడు మేపలేదు. గొల్లవాడు అనగా సద్గురువు. సద్గురువుచే జ్ఞానము బోధింపబడలేదు కనుగ అజ్ఞానము తొలగలేదు అని అర్థము. సద్గురువు ద్వారానే జ్ఞానము అందింపబడాలి. అప్పుడు మాత్రమే అజ్ఞానము తొలగింపబడి జ్ఞానము కలుగుతుంది.

"కృష్ణం వందే జగద్గురుం". జగద్గురువు శ్రీకృష్ణుడే. అతడు గొల్లవాడు కనుక ఇక్కడ గొల్లవాడు అని చెప్పబడినది.

గొల్లవాడు ఎందుకు మేపలేదు అంటే అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మ ఇచ్చిన అన్నం తిని, తీసుకొని వెళ్ళి ఆవులను మేపటం అన్నది గోవులు మేపే వాళ్ళ నిత్యకృత్యం. అంటే జగన్మాతచే సద్గురువు పంపబడలేదు అని అర్థము. జగన్మాత ఆజ్ఞలేనిదే సద్గురువును దర్శించుటకాని, ఉపదేశము పొందుటకాని జరుగదు అని తెలుసుకొనవలెను. ఇంకా జ్ఞానమును పొందే సమయము రాలేదు అని అర్థము. దైవానుగ్రహము కలుగలేదు అని అర్థము.
అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడ్చాడు.

పిల్లవాడు ఏడవటం అంటే జగన్మాత అనుగ్రహము కోసము ఆర్తితో పరితపించటము. అటువంటి వారికి తల్లి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అవసరము కోసము ఏడవటము వేరు, అనుగ్రహము కోసము పరితపించటము వేరు. జగత్తంతటికి తల్లి కనుక జ్ఞానము కావాలి అని పరితపించే వారికన్నా, దైవమే కావాలి అని పరితపించేవారిని మొదట అనుగ్రహిస్తుంది జగన్మాత. అంటే అమ్మ ఆజ్ఞ అవలేదు అని అర్థము.
పిల్లవాడు ఎందుకు ఏడ్చాడు అంటే చీమ కుట్టింది.

చీమ అంటే సంసారము. సంసారము అంటే కుటుంబము ఒక్కటే కాదు. మనల్ని అంటుకొని ఉన్న సమస్త భావములు కూడా సంసారమే. సంసార, ఈతి భాధలచే దుఃఖము చెంది దైవము కొరకు పరితపించటమే చీమ కుట్టి ఏడవటము.

చీమ కుట్టటానికి కారణము తన బంగారు పుట్టలో వేలు పెట్టుట వలన కుట్టింది. నిజమునకు చీమల పుట్టలన్నీ కూడా మట్టి పుట్టలే. కానీ సంసారము లేకుండా ఎలా అన్న అజ్ఞానంలో కావాలని దాని ఎడల అనురక్తి కలగటమే బంగారు పుట్ట. చివరకు అనురక్తి తొలగి సంసార బాథలనుండి తనను రక్షింపమని దైవము కొరకు జీవుడు పరితపించును. 

కథ సారాంశము:
సప్తథాతువులతో కూడిన మనిషి సాథన చేసి సప్త వ్యసనములలో 6 వ్యసనములు జయించిననూ 7వది అయిన కామముకు జయించుట కష్టము. అజ్ఞానము తొలగనిదే కామము జయింపబడదు. జ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగును. జ్ఞానమును ఒక్క సద్గురువు మాత్రమే అందిపగలడు. అట్టి సద్గురువు జీవితమున దైవానుగ్రహమున మాత్రమే లభించగలడు. సంసారమున చిక్కి బాథపడుతున్న జీవుడు దైవము కొరకు పరితపించి, ఆర్తితో తపన చెందుతున్నప్పుడు మాత్రమే దైవానుగ్రహమునకు పాత్రుడు కాగలడు. దైవముచేత పంపబడినవాడే సద్గురువు. అతడు జ్ఞానమును అందించి అజ్ఞానమును తొలగించి జీవుని ఉద్దరించి దైవమును చేర్చును.
కనుక సద్గురువు యొక్క ఆవశ్యకత జీవితమున ఎంతైనా ఉన్నది.


--(())--

దేముడు* (3)
రచన... కన్నెగంటి అనసూయ గారు.
ఆకాశానికీ, అవనికి దారాలు కడుతూ.. ఒకటే వాన.
బంగాళాఖాతంలో వాయుగుండమట. అయిదార్రోజుల్నుండీ అదే పరిస్థితి.
మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణశాఖ వారి హెచ్చరిక.
అర్ధరాత్రి దాటి చాలసేపైంది.
ఆ కాలనీలో కరెంట్‌ లేదు. కన్ను చించుకున్నా కానరాని చీకటి. మెరిస్తే తప్ప తెలియని ఉనికి. చలికి తట్టుకోలేక చుట్టూ దుప్పటి బిగదీసుకుని కూర్చు నున్నాడు రంగబాబు.
అతనా గేటెడ్‌ కమ్యూనిటీలో ప్లంబర్‌. డ్యూటీ టైమైనా అతనక్కడే ఉన్నాడింకా. కమిటీ ఆదేశం. వర్షాలకి ముందుచూపు.
దసరా నవరాత్రి ఉత్సవాల ముమ్మరం ఆ కాలనీలో. వినాయకచవితికి పిల్లలకి పరీక్షల వత్తిడని దసరానే చేస్తారా కాలనీలో. వర్షాలు కావటంతో ఆ నవరాత్రుళ్లూ ఎలక్ట్రీషియన్నీ, రోడ్లు ఊడ్చే సూరయ్య మ్మని ఉత్సవాలు జరిగినన్నాళ్లూ రాత్రుళ్లు కాలనీలోనే ఉండమన్నారు. అయితే, ఎడతెరిపినీయని వానలు ప్లంబర్నీ వాళ్లకు జతచేసాయి.
ఆరు రోజులూ ఇట్టే గడచిపోయాయ్‌.
ఆ రోజు ఏడోరోజు. ఆ రాత్రి సహపంక్తి భోజనా లేమో అంతకు కొద్ది గంటల ముందే పూర్తయ్యాయి. అతిగా తిన్నాడేమో.. ఉండుండి మూసుకుపోతున్న కళ్లు.. అంతలోనే అంతకుముందే జరిగిన సంఘటన గుర్తొచ్చి ఉలిక్కిపడుతున్నాడు.
చికాగ్గా ఉంది రంగబాబుకి.
‘ఇవ్వాళ వాడికైంది. రేపు తనకవ్వచ్చు’ ఇలా ఎన్ని సార్లనుకున్నాడో తనలో తను.
ఇలా ఆలోచిస్తున్నకొద్దీ కలవరపెడుతున్న అభద్రతా భావం.
‘ఎప్పుడనగా వెళ్లాడో? తెలియద్దా ఆ మనిషికి?’ గొణుక్కున్నాడు ఎలక్ట్రీషియన్‌ మల్లిని తలచుకుని. అతను చాలసేపైంది ఏదైనా తినొస్తానని బయటికి వెళ్లి. అదే అతని కొంప ముంచింది.
రంగబాబు మనసులో వాన చినుకుల్ని మించిన ఆలోచనలు.
దుప్పట్లోంచే చుట్టూ చూశాడు.
వానతో పాటు ఉండుండి వీస్తున్న గాలికి అమ్మవారి ముందున్న దీపం ఎప్పుడో ఆరిపోయింది. చుట్టూ కటిక చీకటి.
అంతకుముందు మూడు గంటల వరకూ సంగీతం ఒకటే ¬రెత్తిందక్కడంతా. పిల్లలు నత్యాలు చేస్తుంటే పెద్ద పెద్ద కెమెరాలతోనూ, ఫోన్లు పట్టుకుని పెద్దాళ్లు అటూ ఇటూ తిరుగుతూ చేసే హడావుడి ఇంకా కళ్లల్లో మెదుల్తూనే ఉంది రంగబాబుకి. గత వారం రోజులుగా అదే వరస.
భోజనాలయ్యాక సామాన్లతో ట్రక్కెళ్లి కూడా చాలా సేపైంది.
మిగిలిన వాటిల్లో తనక్కావాల్సినవి తీసుకుని బాక్సుల్లో సర్దుకుని అదే హాల్లో ఒక మూలగా గురక పెడుతోంది సూరయ్యమ్మ.
దేవీ నవరాత్రులన్నాళ్లూ కాలనీలో కార్యక్రమాలు పెందరాళే మొదలెట్టి అంతే త్వరగా ముగించేస్తారు పసిపిల్లలకి ఇబ్బందని.
గత నాల్గయిదేళ్లుగా ఎలక్ట్రీషియన్‌ మల్లి, సూరయ్యమ్మా అక్కడే పనిచేస్తున్నారేమో.. ఉత్సవాల న్నాళ్లూ ఏ నిమిషంలో ఏ ఇబ్బంది వస్తుందోనని అక్కడే ఉంటారు.
సంసారాలని వదిలిపెట్టి అలా ఉండాల్సిరావటం కష్టమని కమిటీ వాళ్లకీ తెలుసు. అందుకే కాలనీలో పనిచేసే వాళ్లంతా ఇంటింటికీ వెళ్లి వసూలు చేసుకున్న దసరా మామూళ్లు కాక, కమిటీ కూడా కొంత మొత్తాన్ని ఇచ్చి కొత్త బట్టలు కొంటుంది.
అందుకే ఏదైనా కొత్త వస్తువు కొనుక్కోవాలన్నా, ఉన్న అప్పు తీర్చాలన్నా.. దసరా కోసం చూస్తూంటారు వాళ్లంతా.
సూరయ్యమ్మకి భర్తా, పిల్లలూ లేకపోటంతో రేయింబవళ్లూ అక్కడే. ఒక్క స్నానానికే ఇంటికెళుతుంది.
ఎలక్ట్రీషియన్‌ మల్లి ఒక్కడే ఎంత రాత్రైనా ఇంటికి వెళ్లిపోతున్నాడు. అతను ఈ మధ్యే తెలిసిన వాళ్లు అమ్ముతుంటే చవగ్గా వస్తుందని వాయిదాల మీద పాత యాక్టివా కొన్నాడు. అతనికి కొద్దో గొప్పో బయటి ఆదాయం కూడా ఉంటుంది. పైగా చిన్నోడు.
ప్లంబర్‌ రంగబాబుని మాత్రం కొత్తగా వర్షాలని ఉండమన్నారు.. ఎక్కడైనా నీళ్లు నిలిస్తే చీకట్లో పిల్లలకి ఇబ్బందని.
‘ఒరేయ్‌ మల్లిగా.. రారా బాబా’ అదేన్నోసారో అతనలా అనుకోవటం.
ఆలోచనల్లోనే మెల్లగా వచ్చి ఆగాడు మల్లి చుట్టూ ఆశ్చర్యంగా చూస్తూ..
స్కూటర్‌ లైటుని దూరం నుంచే చూశాడేమో ప్రాణం లేచొచ్చింది రంగబాబుకి.
‘ఏరా బతికే ఉన్నావా? నాయాల..’ అప్పటిదాకా ఊపిరి బిగబట్టి ఎదురు చూశాడేమో.. కోపంతో అరిచేశాడు రంగబాబు వాడు వచ్చాడన్న ఆనందంలో..
‘ఎక్కడెక్కడా తిరిగొచ్చేవ్‌? ఇక్కడ కొంపలంటుకు పోతుంటే?’ మళ్లీ అంతలోనే ఒకింత ఆత్రుతగా, నీరసంగా మల్లినే చూస్తూ. అతని గొంతులో అలజడి, కంగారు..ఏదో బాధ.
‘ఏమైంది? ఎంతసేపయ్యింది కరెంటు పోయి?’ అయోమయంగా అనిపించింది మల్లికి.
ఏమీ మాట్లాడకుండా మల్లి వైపే చూస్తూ ఉండి పోయేడు రంగబాబు. ఆ చూపుల్లో ఏదో జాలి.
కాసేపలా చూసి.. ‘మతిగానీ పోయిందా ఏటి నీకు?’
‘ఏమైంది? సార్లుగానీ పిల్చేరేటి కొంపదీసి? ఓరి బాబోయ్‌. ఈ పాత బండి ఎందుకు కొన్నానా అనిపించిందనుకో! మధ్యలో ఆగిపోయింది. ఎంతసేపున్నా స్టాటవదే! చచ్చాన్రా నాయనా దీంతో. ఆ ఉస్మాన్‌ అన్న గేరేజీ దాకా ఈడ్చుకెళ్లే సరికి అంత వాన్లోనూ ముచ్చెమట్లంటే నమ్ము. నిద్రలేపి బాగు చేయించుకున్న! ఆయన దగ్గరే గదా కొన్నది. అందుకని బండి స్టాటవుతుల్లేదన్నా అంటే పడుకున్నోడు లేచి మరీ చేసిచ్చేడు. గేరేజ్‌లోనే ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే చాల ఇబ్బందైపోయేది’ అన్నాడు కమ్యూనిటీ హాలు మెట్ల కింద మడత పెట్టి ఉన్న టవల్‌ తీసుకుని ఒళ్లంతా తుడుచుకుంటూ.
‘సార్లు అడిగేరా నా గురించి? చెప్పక పోయావా? తినటానికి వెళ్లానని’
‘…ఇంతకీ దొరికిందా ఏదైనా?’
‘ఆ.. ఏదో.. దొరికిందిలే.. అడుగూ, బొడుగూ…!’
‘..ఎక్కడ..?!’
‘ఆ హనుమాన్లు టిఫిన్‌ సెంటర్లో..! ఏ…? ఏవైంది?’ అని తల తుడుచుకుంటూ మళ్లీ తనే..
‘…సార్లేవైనా అన్నారా.. అలా కంగారుగా మాట్లాడతన్నావ్‌?’ దగ్గరకంటా వస్తూ ఆత్రుతగా అడిగాడు ఎలక్ట్రీషియన్‌ మల్లి.
అలా కూర్చుని అతన్నే చూస్తూ…’చూశావా? నీ నమ్మకం నిన్నెంత ఇబ్బంది పెట్టిందో!’
అంత చీకట్లోనూ.. ఒకింత తెల్లబోతూ చూశాడు రంగబాబుకేసి ఏ నమ్మకం అన్నట్టుగా..
ఒక్క నిమిషం అలాగే చూసి అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్టు..
‘అదే అడుగుతున్నాను ఏవైందని?’
‘…విన్నావంటే.. కారుద్ది రెండు కాళ్ల మధ్య నించీ…’
‘అవునా? చెప్పన్నా ఏవైంది?’ అంతకు ముందున్న ధీమా లేదతని మాటల్లో..
‘సర్ధుకో సరంజామా..! ఇంకేంటి చెప్పేది..?’
‘అంటే…’ దెబ్బతో దిగిపోయిందేమో.. కంగారుగా అన్నాడు మల్లి.
‘సెక్రెట్రీ సారు కోపం చేసేడు..’ నిస్సత్తువగా అన్నాడు రంగబాబు.
‘య్యే.. కరెంటు పోయిందా?’ షాక్కొట్టినట్లయి పోయాడతను.
‘దార్లో ఎక్కడా లైట్లు లేవన్నా? మొత్తం పోయిందనుకున్నాను..’ పిచ్చెక్కినట్టయ్యి కళ్లు బైర్లు కమ్మాయొక్కసారిగా.
ఏమీ మాట్లాడలేదు రంగబాబు.
‘ఏవైందో సెప్పెహ్హే.. పిచ్చెక్కుతుందిక్కడ…’ విసుగ్గా అన్నాడు కాళ్లు వణుకుతుండగా మల్లి.
‘ఇంక నీకెంత పిచ్చెక్కినా నీ పిచ్చి గిచ్చి పట్టిచ్చుకునేవోళ్లెవరూ లేరిక్కడ..’
‘అంటే.. అంటే… కరెంటు.. కరెంటు….?’
‘అవును. ఫీజు కొట్టేసింది. పోనీ కరెంటు పోతే జనరేటర్‌ నేనన్నా వేసేవాడ్ని. ఏకంగా ఫీజే పోయింది. డాన్సులన్నీ మధ్యలోనే ఆగిపోయేసరికి పిల్లలంతా ఒకటే అరుపులూ, ఈలలు. అంతా గోల గోల. వేలకి వేలు ఖర్చు చేసి డాన్సులు నేర్పించేరంట. ఆ మాస్టరుగారు కూడా ఇక్కడే ఉన్నాడు. నాకు కంగారు వచ్చేసి ఎన్నిసార్లు ఫోన్జేసినా నువ్వేమో ఎత్తవ్‌. సార్లు కూడా ఎన్నిసార్లు చేసేరో నీ ఫోన్‌కి. ఏదీ ఫోనెక్కడ పెట్టేవ్‌?’
‘నువ్‌ చెప్పలేదా తినటానికి వెళ్లేనని?’
‘నోరు ముయ్యేస్సే. మా బాగా చెప్పేవ్‌ గానీ..! నువ్‌ తింటాకే వెళ్లావో, పడుకుంటాకే వెళ్లావో ఎవ్వడికి పట్టుద్ది? ఫీజు కొట్టేసిందిక్కడ. సమయానికి నువ్వు లేవు ఇక్కడ. అంతే..! అక్కడికీ చెప్పేననుకో. అయితే మాత్రం?’
‘ఫోను ఇక్కడే ఉంది. తడిచిపోతుందని పట్టుకెళ్లలేదు..’
‘మంచి పని చేసేవ్‌? దగ్గరుంచుకోవద్దా? మనం ఏ ఉద్దేశంతో ఇలా రాత్రుళ్లు ఇక్కడ ఉండాల్సి వచ్చింది? అసలే వర్షం. దానికితోడు ఇవ్వాళ కాలనీ పిల్లల కార్యక్రమాలు. పైగా భోజనాలొకటి. ఎంత హడావుడి? ఎప్పుడే కరెంటు పోతుందో, ఏ అవసరం వస్తుందో అనే మనల్ని ఇక్కడే ఉండమన్నది?’
‘ఎవరు వేసేరు ఫీజు..?’ అతని ఫీజు ఎగిరి పోయిందేమో.. గొంతు వణుకుతుండగా నీరసంగా అన్నాడతను.
‘ఎవరు వేస్తారు? సార్లేమో సెల్‌ఫోనుల్లో లైట్లు వేసేరు. టైముకి బ్యాట్రీ లైటు కూడా ఎక్కడ పెట్టేవో కనపడలేదు. ఎవరికి వచ్చింది వాళ్లు చేసేం. అయినా పనైతేగదా? ఎవరిమట్టుకు వాళ్లకే భయం ఏం జరుగుతుందోనని. పైగా వానొకటి..’
‘సెక్రెట్రీ సార్‌ ఎక్కడున్నాడు? ఇప్పుడెళ్లి కలవనా?’
‘కోపంతో రగిలిపోతున్నాడు. కలిసి ఏం చేస్తావ్‌? ఇప్పటికిప్పుడు చేసేదేం లేదు. కార్యక్రమాలు ఆగిపోయి పిల్లలు ఏడుస్తూ వెళ్లిపోయేరు. ఇంక చేసేదేం లేదు. అడుగో… సూపర్‌వైజర్‌ వస్తున్నాడు. కావాలంటే అడుగు సెప్తాడు.’
దూరాన కనిపిస్తున్న టార్చిలైటు వెలుగుని చూసి.
ఇంతలో గొడుగేసుకుని రానే వచ్చాడు సూపర్‌వైజర్‌ మహేశ్‌.
వస్తూనే.. ‘ఎంతసేపైందొచ్చి? నిద్రపట్టక లేచి వచ్చాను బాధేసి…’
‘ఇప్పుడే వచ్చేను. తిందామని వెళ్లాను.’ నూతిలోంచి వచ్చినట్టుందతని స్వరం.
‘వెళితే వెళ్లేవ్‌ లే. సార్లతో చెప్పి వెళ్లచ్చు కదా! ఇంత వరకూ రాకపోను..’
‘ఏమైంది? అదే అడుగుతున్నాను. తిట్టేరా?’
‘తిడితే బాధేవుందిరా? పెద్దోళ్లు ఒకమాటంటే తప్పేముంది. తిట్టలేదు. పొమ్మన్నారు..’
‘అంటే?’ అర్ధం కాక అయోమయంగా అన్నాడు మల్లి.
‘అదే..! నేను చెప్పేనుగదా..! చూసేవా నీ నమ్మకం నీకు అయిదార్రోజుల్నించీ కూడు పెట్టలేదు సరిగదా… నీ ఉద్యోగం..’
‘ఊ.. ఉద్యోగం…’ మల్లిలో ఒకటే వణుకు. అతన్నే చూస్తున్నాడు రంగబాబు. ఆ చూపుల్లో మల్లి పట్ల జాలి.
‘పోయింది..’
ఆ మాటతో కళ్లు బైర్లుకమ్మాయి మల్లికి. మల్లేశ్‌ మౌనం రంగబాబు మాటల్ని సమర్థిస్తున్నట్లుగా ఉండే సరికి.. ‘నిజం చెప్పండ్రా..’ అరిచాడు మల్లి. మళ్లీ అంతలోనే.. నిమ్మళించి..
‘ఏం తినకుండా ఇంక ఉండలేనేమో అని పించింది మహేషూ..! కళ్లు తిరుగుతున్నట్ల య్యింది. లేదంటే ఒక పూట తినకపోతే చస్తానా? ఇంతకీ ఏం చెయ్యమంటారు?’ దిగాలుగా అన్నాడు మల్లి.
‘చెయ్యటానికేముంది కానీ.. ఇప్పుడైనా వాస్తవంగా ఆలోచిస్తే బాగుంటుందేమో ఆలోచించు’
ఏం మాట్లాడలేదు మల్లి.
‘నమ్మకం కూడు పెట్టాల్రా..! కడుపు మీద కొట్టగూడదు. ఇప్పుడేం జరిగింది? నోటికాడ కూడు పట్టుకుపోయింది. ఇది.. ఇదిరా నీ నమ్మకం నీకిచ్చింది.
ఒరేయ్‌! నీ దేవుడు.. నీ ఇష్టం. నా దేవుడు నా ఇష్టం. ఎవరి ఇష్టాఇష్టాలు వాళ్లవే. దేవుడనేవాడు ఒక నమ్మకం. అంతేరా! నమ్ముకో. నీకు ఇష్టమైన దేవుణ్ణి నమ్ముకో. అతను చెప్పినట్లే నడుచుకో. ఎవ్వరూ కాదనరు. కానీ ఆ నమ్మకాలు ఎలా ఉండాల్రా..! మనకి సుఖాన్ని ఇచ్చేవై ఉండాలి. అంతేగాని! చెడగొట్టేవి అయి ఉండకూడదు కదా’ మల్లి ఉద్యోగం పోయిందనే బాధలో ఏదేదో అనేశాడు రంగబాబు.
ఆ కాలనీలో పనిచేసే వాళ్లల్లో వీళ్లిద్దరికే ఎక్కువ స్నేహం.
‘అవుననుకో..!’ అంత గాలివాన రొదలోనూ సూరయ్యమ్మ గురక స్పష్టంగా వినిపిస్తుంటే.. కమ్యూనిటీ హాల్‌ లోపలికంటా చూస్తా..
‘చేసేదా ఉజ్జోగం. ఇంట్లో వాళ్లా సెలవులకెళ్లేరు. వండి పెట్టేవాళ్లు ఒక్కళ్లూ లేరు. ఒరేయ్‌.. ఒరేయ్‌.. మన నమ్మకం మన కడుపు కాల్చకూడదురా..’
‘నేనిక్కడ తిననని సార్లకి తెలుసు..’
‘గొప్పోడివేలే కానీ.. నువ్విక్కడ తింటే ఎంత? తినకపోతే ఎంత? ఎవరు పట్టించుకుంటారు నువ్వు తిన్నావో, తినలేదో. అయినా తింటే తప్పేంటంటావ్‌? అసలు ఇలాంటప్పుడు వీటిని భోజనాలని అనరు నీకు తెల్సో లేదో! సహపంక్తి భోజనాలంటారు. అంటే ఏంటో తెలుసా? కులాలూ, మతాలకతీతంగా, చిన్నా, పెద్దా, ఉన్నోడూ, లేనోడూ.. అనే తేడా లేకుండా అందరూ కలసి తినటం అన్నమాటేగా! మరి నువ్వేం చేసేవ్‌, అమ్మోరికి పెట్తారని తినటం మానేసేవ్‌. అలా మానేసి నువ్వు ఎవ్వర్నీ ఉద్ధరించలేదు. నీ కడుపుని నువ్వే ఎండబెట్టుకున్నావ్‌? అంతేగదా!’ అన్న మహేష్‌ అదే బాధతో..
‘పండగన్నాళ్లూ రోజూ కాలనీలో ఆడాళ్లు ఏదో ఒకటి ఇళ్లల్లో చేసుకొచ్చి అన్నీ మన కళ్లెదురుగా ఇక్కడే టేబుల్‌ మీద పెట్టి కొద్దికొద్దిగా వేరే పళ్లెంలో తీసుకెళ్లే గదా అమ్మగారి విగ్రహం ముందు పెడుతున్నారు. మొత్తం గిన్నెలన్నీ తీసుకెళ్లి ఏం పెట్టటం లేదుగదా? అలాంటప్పుడు తినటానికి నీకేమైంది?
నాకు అదే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఆలోచిస్తే! ఒక్కటి చెప్పు అడుగుతాను. ఇప్పుడు నువ్వెళ్లి తినొచ్చేనన్నావ్‌ గదా? ఆ ఆంజనేయుడో, హనుమంతుడో ఏదో టిఫిన్‌ సెంటరు! నీకు తెలుసో లేదో! ఆ టిఫిన్‌ సెంటర్‌ వాడు పొద్దున్నే పళ్లెంలో మొదటగా రెండు ఇడ్లీలు, కొంచెం పచ్చడి, కొంచెం ఉప్మా ఏది చేస్తే అది దేవుడి పటం ముందు పెట్టి అగరొత్తులు వెలిగించాకనే కదా అమ్మకాలు మొదలుపెడతాడు. మరి అది ఏమిటంటావ్‌?
ఈ లెక్కన ఆ తర్వాత వండినవన్నీ హను మంతుని ప్రసాదాలే కదా! మరి ఇప్పుడు నువ్వు తిని వచ్చిన ఆ టిఫిన్‌ దేనికిందకి వస్తుంది? ఆలోచించావా?’ అన్నాడు.
‘అంటే… నీ కళ్లెదురుగా ఇక్కడ విగ్రహం ముందు పెట్టారు కాబట్టి నువ్వు తినవ్‌. ఎక్కడికో దూరంగా వెళ్లి వెతుక్కుని వెతుక్కుని మరీ తినొస్తావ్‌. లేదంటే ఖాళీ కడుపుతో పడుకుంటావ్‌. ఏ రాయైతే ఏముందిరా ఆకలితో ఉన్న కడుపును పగలగొట్టు కోవటానికి?’ నవ్వుతూ అన్నాడు గిరిధర్‌, ఆ మర్నాడు ఉదయం అంతా కలసి సెక్రెటరీగారితో చెప్పమని అడగటానికి అతనింట్లో అతన్ని కలసినప్పుడు. అతను ఆ కాలనీకి మాజీ ప్రెసిడెంటు.
ఏమీ మాట్లాడలేదు ఎవ్వరూ.. వింటూ నిలబడ్డారు…తప్ప.
‘నిన్నేదో మార్చెయ్యాలని నేనేమీ శపథం చేసుకోలేదు. అది గుర్తుంచుకో. అర్ధం చేసుకుంటావని చెప్తున్నా..
అంతెందుగ్గానీ ఒక్కదానికి సమాధానం చెప్పు.
నీ ఇంట్లోకని పచారీ సరుకులు ఎక్కడ కొంటావ్‌?’ ప్రశ్నించాడు గిరిధర్‌.
‘ఇక్కడే నండి. మన కాలనీ గేటు దగ్గరున్న మార్వాడీ షాపులో’ నేల చూపులు చూస్తా అన్నాడు మల్లి.
‘నెలంతా తీసుకుని జీతాలు వచ్చాక కట్టేస్తాడండి నెలాఖరున’ అన్నాడు సూపర్‌వైజర్‌ గిరిధర్‌నే చూస్తా..
‘సరే…! ఎక్కడో ఒకచోట కొనాలి కదా? తప్పదు. నువ్వు కొనే కిరాణా షాపాయన రోజూ దేవుడికి పూజ చేసి, కొబ్బరికాయ కొట్టి గానీ అమ్మకాలు మొదలెట్టడు. తెలుసా నీకా సంగతి? మరి వాడి షాపులో నీ నమ్మకం ప్రకారం నువ్వు కొనకూడదు కదా? ఒకదాంట్లో నమ్మకం ఉండి, మరోదాంట్లో లేకుండా ఉండకూడదు కదా? అన్నింట్లో ఉండాలి కదా? శ్రీలక్ష్మీ వెజిటెబుల్స్‌లో కూరగాయలు కొన్నా, ఉస్మాన్‌ దగ్గర మోటరు బండి కొన్నా అంతే.. అయినా ఉస్మానంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ ఉస్మాన్‌నే కదా…పడుకున్నోడ్ని లేపి బండి బాగు చేయించుకున్నానని అన్నావ్‌. మరి ఆ ఉస్మాన్‌ అదే రిపేర్‌ షాపులో రోజుకి అయిదు సార్లు నమాజ్‌ చేస్తాడు. అక్కడే నమాజ్‌ చేసుకుంటాడు కాబట్టి అదో మసీదే కదా..! మరి ఆ బండి ఫర్వాలేదా?
అంతెందుగ్గానీ.. ఇప్పుడే కదా ! మీ మేడమ్‌ ఇచ్చిన మంచినీళ్లు తాగారు. ఆ నీళ్ల సీసా వచ్చిందె క్కడ్నించి? అయ్యప్పా వాటర్‌ ప్లాంటు నుంచేగా? తెల్సా మీకు? ఆ ప్లాంటాయన మన వాళ్లకు స్నేహితుడే. అలా చూస్తే ఒకటా? రెండా? ప్రతీదీ మానెయ్యాలి ఈ లెక్కన. మానేసి బ్రతకగలవా?
ఆలోచించు.
అప్పుడుగానీ మనం అనుకునే మన నమ్మకంలో ఎంత మూర్ఖత్వం ఉందో తెలిసొస్తుంది.
దేవుణ్ణి నమ్ముకో.. నమ్మొద్దనను.. నేనూ నమ్ముతా.. నమ్మాలి కూడా. ఆయన ముందు కళ్లు మూసుకుని నిలబడి ప్రార్థనలు చేసుకుందాం. ప్రశాంతత వస్తుంది. అంతేకానీ..’
అని ఇంకేదో చెప్పబోతున్నంతలో… అంతకు ముందే అయిదు నిమిషాల క్రితం అక్కడికి వచ్చి అప్పటిదాకా అంతా విన్న గిరిధర్‌ పొరుగింటాయన కలగచేసుకుని..
‘నేనొకటి చెప్పనా?’ అనే సరికి అతనికేసి చూశారంతా..
‘నాకు అర్ధమైంది. అందుకే సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. బయటి వాళ్లకైతే చెప్పననుకో.. గానీ..’ అని కాసేపాగి..
‘ఇది… ఇదేంటిది? శరీరమేనా?’ అడిగాడు చేతి మీద చరుచుకుంటూ….
ఏం చెప్పబోతున్నాడా అన్నట్టు గిరిధర్‌తో సహా అందరూ అతన్నే చూడసాగారు..
‘…శరీరం అని మీరనుకుంటున్నారుగానీ.. నేనైతే ఇది గుడి అనే అనుకుంటాను. ఇందులో ఎంతుందిరా…! పైనించి పోస్తే మనకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి మిగతాది కిందకి పోతుంది. ఈ లోపు ఎంత జరుగుతుంది లోపల? మంచీ, చెడని ఎంచేదెవర్రా లోపల? చెప్పే వాళ్లు ఎవరున్నారు లోపల ఇది పనికొస్తుంది, ఇది పనికిరాదు అని. నువ్వు ఊహించగలవా లోపల ఏం జరుగుతుందో?
ఆలోచిస్తే అంతకంటే ఆశ్చర్యం ఇంకొకటుందా? వాడేరా దేవుడు. అక్కడున్నాడ్రా దేవుడు. వాడే ఆకలి. ఆ ఆకలి దేవుణ్ణి బాగా చూసుకోవాల్రా మనం. వాణ్ని పట్టించుకోకపోతే ఈ గుడి ఉంది చూశావా? ఇది కూలిపోతుంది… ఇది’ అన్నాడు గుండెల మీద కుడి చేత్తో కొట్టుకుంటూ..
‘ఈ గుడి కూలితే .. ఈ గుడి మీదే బతుకున్న పావురాలూ, పిచ్చుకలూ.. చిన్న చిన్న మొక్కలూ… అర్ధమైందా… అవే.. మీ పెళ్లాం పిల్లలూ.. వాళ్లూ కూలిపోతారు. అదీ విషయం.
ఇంతకంటే ఎక్కడైనా ఏముందిరా? ఏదో పరుగులు పెడతాంగానీ.. ఎక్కడైనా ఏవుంది ? ఉంటే చెప్పు.
నీ రెక్కలు పని చేసినన్నాళ్లు, నీ కాళ్లు తిరిగినన్నాళ్లు నీ గుడికేం కాదు. నీ గుడిమీద బతికే వాళ్లకీ ఏం కాదు. నీ దేవుడు క్షేమం. ఎవళ్లమట్టుకు వాళ్లే గుడి, వాళ్ల ఆకలే దేవుడు. ఏవంటావ్‌?
ఆ గుడి చల్లగా ఉండాలంటే నీ దేవుణ్ణి మెప్పించాల. అదే నీ ఆకలి దేవుణ్ణి.. అంతేగానీ.. ఎవరో ఏదో చెప్పేరని.. నోటి దగ్గరకి వచ్చినదాన్ని వదిలేసి.. కడుపు నాయగట్టుకుని.. ఆకల్తో ఉండ చుట్టుకుపోయి.. నిన్ను నీవు కసింపచేసుకుంటానంటే ఎవడిక్కావాలి? ఎవరడుగుతారు నిన్ను? తర్వాత మనకి ఏదైనా అయితే ఎవరు చూస్తారు మన మీద ఆధారపడ్డవాళ్లను.?
ఒక్క మనకే కాదు..
ఈ భూమ్మీద పుట్టే ఏ ప్రాణికైనా నేను చెప్పిందే దేవుడు. అందుకే మనకి తప్ప మిగతా ప్రాణు లందరికీ వల్లమాలిన ప్రేమ వాళ్ల ఆకలి దేవుడంటే. ఏ ప్రాణినైనా…చూడండి. పాములూ, పశువులూ, కప్పలూ, గొర్రెలూ, బర్రెలూ దేన్నైనా చూడు. కేవలం తిండి తప్ప మరో యావ ఉండదు వాటికి. ఇంకో మాట..’
అని కాసేపాగి..గిరిధర్‌ వైపు తిరిగి..
‘మా ఆవిడా చేస్తుంది గిరిధర్‌ పూజలు. కానీ అందరిలాగా ఉపవాసాలూ, ఏమీ తినకుండా చెయ్యటాలూ అలాటివేవీ ఉండవ్‌. ముందు కడుపు నిండా తినేసాకనే పూజైనా, ఏదైనా. మనం సమాధానం చెప్పుకోవాల్సిందల్లా మన మనసుకి’ అన్నాడు..నవ్వుతూ…
అందరి ముఖాల్లో ఒకలాంటి ఆలోచన..
అప్పుడే లోపలికెళ్లి అందరికీ కాఫీ పెట్టమని చెప్పి వచ్చిన గిరిధర్‌..
‘కాఫీ.. పెడుతున్నారు మేడమ్‌. కాఫీ తాగి ఆఫీసుకు పదండి. ఇంత సర్వీసుంది. నిన్ను పన్లోంచి తీసేస్తారని నేను అనుకోను. ఏదో పిల్లలు కష్టపడి ప్రిపేర్‌ అయ్యారు. నిరుత్సాహపడ్డారని బాధ అంతే. అంతగా అయితే మేము చెప్తాములే. ముందు మీరంతా వెళ్లి వాళ్లతో మాట్లాడండి..’
అన్నంతలో కాఫీలు తీసుకొచ్చి అందరికీ తలో కప్పూ అందించింది గిరిధర్‌ భార్య శ్రీకళ.
వాళ్లు కాఫీలు తాగేంతలో.. కాలనీ గార్డెనర్‌ ఉదయం పూజా ప్రసాదాలు తీసుకొచ్చి టేబుల్‌ మీద పెట్టాడు ప్రతి రోజూలాగే..
శ్రీకళ వచ్చి స్పూన్‌ తీసుకుని అందరి చేతుల్లో తలో స్పూను పులి¬ర పెట్టింది.
చెయ్యి చాపాడు మల్లి. అతని చేతిలో స్పూనెడు పులిహార వేసింది శ్రీకళ.. అతను నోట్లో వేసుకోబో తుంటే.. గిరిధర్‌ అన్నాడు…
‘మేమేదో నిన్ను మార్చెయ్యాలని ఇదంతా చెప్పలేదు! ఎవరో ఏదో చెప్పేరని ఎప్పుడూ మారిపోకూడదు. మన ఆలోచనా కొంత ఉండాలి..’
మీరు చెప్పింది సబబే అన్నట్టుగా నవ్వుతూ తలూపి పులి¬ర నోట్లో వేసుకోబోతుంటే..
‘ఆగు..’ అరిచాడు రంగబాబు.
తెల్లబోయాడు.. మల్లి..
‘తినేముందు దేవుణ్ణి తల్చుకోరా..! నువ్వెవరినైతే నమ్ముకుంటున్నావో.. ఆ దేవుణ్ణి తలచుకుని మరీ తిను. ఇవ్వాళ ఈ ముద్ద మనదాకా వచ్చిందంటే ఆయన చలవే..! సార్లన్నట్టు ఆకలి మొదటి దేవుడైతే.. మనం నమ్ముకున్న దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఆకలి దేవుడికి కొడుకన్నమాట…’
మనసులోనే రెండుసార్లు ప్రేయర్‌ చేసుకుని ముద్ద నోట్లో పెట్టుకున్నాడు.. మల్లి.

-----------------*********-----------------

రచయిత్రి పరిచయం
కన్నెగంటి అనసూయ 1.12.1962న పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, పశివేదల గ్రామంలో పుట్టారు. ఇప్పటివరకు 2 నవలలు, 300 పైగా కథలు, 150 కవితలు, 15 గల్పికలు, 300 బాలల కథలు రాశారు. ఈమె రాసిన ‘బుద్ధిబలం’ అనే బాలల కథ సాహిత్య అకాడమీ వారి కథల సంకలనంలో చోటు సంపాదించి 22 భారతీయ భాషల్లోకి అనువాదమైంది. వివిధ వారపత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో ఎన్నో బహుమతులు అందుకున్నారు. అడవిబాపిరాజు పురస్కారం, గురజాడ – ఉత్తమ కథా రచయిత్రి పురస్కారం అందుకున్నారు. ఎన్నో ఇతర సాహిత్య పురస్కారాలు కూడా అందుకున్నారు.

--((***))--

బండలు (2)
సాహితీమిత్రులారా!
ఈ కథను ఆస్వాదించండి...............
ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ మొదలవకముందు, ఇండియన్ ఎయిర్‌లైన్సే రాజై వెలుగుతున్నప్పటి కాలంలో– ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తుండేవాళ్ళం.
“ఇందూ, గంటవరకూ గ్యాంగుకి డ్యూటీలేవీ లేవు. మళ్ళీ ఎండ పోతుంది. బండలు ఖాళీగానే ఉన్నాయా?” ఇంటర్‌కామ్‌లో అడిగింది ప్రీతి.
మా గ్యాంగులో వారి డ్యూటీలు- ఎయిర్‌బస్ టెర్మినల్‌లోనూ బోయింగ్ టెర్మినల్‌లోనూ. నన్ను మాత్రం ఈ రెండిటికీ మధ్యనున్న డొమెస్టిక్ కార్గో సెక్షన్‌లో పడేశారీ మధ్య.
“వచ్చేయండి, ఖాళీగానే ఉన్నాయి. నేనూ నా డ్యూటీ బ్రేక్ ఇప్పుడే తీసేసుకుంటాను.” చెప్పాను.
మూడవవస్తోంది.
కార్గో బిల్డింగ్‌కి సరిగ్గా బయట, టార్మాక్ వైపు, అందరికీ ‘అడ్డా’ -అడ్డంగా పడేసున్న ఆ పొడుగాటి స్తంభాలు. మూడడుగుల వెడల్పున్న ఆ భారీ, చదరపు, నలుపురంగు స్తంభాలు కార్గో డివిజన్‌లో భాగమే అనిపిస్తాయి. అవే మా అందరి ‘బండలు’! ఎండలకి కాలవు. వానలకి జడవవు. చలికి వణకవు. వడగళ్ళకి చితకవు. ఏ పది నిముషాలో ఖాళీ ఉన్న ప్రతీ ఒక్కరమూ శీతాకాలంలో వాటిమీద కూర్చోక మానం.
అటునుంచిద్దరూ, ఇటునుంచిద్దరూ వచ్చారు.
కాంటీన్ ట్రాలీ తోసుకుంటూ ఎటెండర్లు వస్తుంటే- సాండ్‌విచ్‌లూ సమోసాలూ పేపర్ ప్లేట్లలో సర్దుకుని, టీ, కాఫీలూ అక్కడే వున్న ప్లాస్టిక్ టేబుల్స్ మీద పెట్టుకున్నాం. కబుర్లూ, టీలూ పూర్తయాయి. ఎవరి డ్యూటీ పాయింట్లకి వాళ్ళు తిరిగి వెళ్ళారు. నేనూ కార్గో బిల్గింగ్ లోపలికి వచ్చాను.
నాకోసమే ఎదురు చూస్తున్నాడు ఫెడ్‌ఎక్స్ ఏజెంట్, ‘మాడమ్, నా కన్‌సైన్‌మెంట్ సంగతేమయింది?’ అంటూ. నక్షత్రకుడు! పది రోజుల కిందట సీ-నోట్ అని మేం పిలుచుకునే ఏడేళ్ళనాటి పాత కన్‌సైన్‌మెంట్ నోట్ ఒకటి తెచ్చినప్పటినుంచీ విసుగూ విరామం లేకుండా రోజూ ఇక్కడే చక్కర్లు కొడుతున్నాడు. ఆ నోట్‌లో బుక్ చేసిన వ్యక్తి పేరు సతీష్ అగర్వాల్ అని రాసుంది.
“బాబూ, కార్గోలోనే కాదు, ఎయిర్‌పోర్టంతటా వెతికించినా మీ సామాను కనబడలేదు. అయినా 40 కోట్ల విలువయిన సామాను అని ఇన్‌వాయిస్‌లో ఉంది. అదీ, పన్నెండు టన్నుల మెటల్!” అరిగిపోయిన రికార్డులా చెప్పి, “అయినా ఇన్నేళ్ళూ మీ క్లయింట్ పట్టించుకోనేలేదేం?” చివరికి కుతూహలం పట్టలేక అడిగాను.
“నేను కొత్తగా చేరాను మామ్, నాకంత తెలియదు. బుక్ చేసిన సతీష్‌గారు పోయి ఆరేళ్ళు దాటిందట. ఇప్పుడు ఆయన కొడుకు నీరజ్ అగర్వాల్, ‘సామాను వెతికిస్తారా, చస్తారా!’ అంటూ మా పీకలమీద కూర్చున్నారు. మీకూ ఫోన్ చేస్తానన్నారు. ప్లీజ్, మళ్ళీ చూడండి…” బతిమాలుకున్నాడు.
జాలేసింది కానీ కనిపించని వాటినెక్కడినుంచి తెచ్చేది! ఏ ఈగో దోమో చిన్న పాకెట్టో కూడా కాదు, ఎక్కడో పోయిందనుకోడానికి.
“మళ్ళీ రెండ్రోజుల్లో రండి. ఇంకెక్కడైనా దొరికే వీలుంటుందేమో ప్రయత్నిస్తాను.” వాగ్దానం లాంటిది చేశాను.
సీ-నోట్ కాపీలు తీయించి, అవేవో కరపత్రాలయినట్టు హెల్పర్లకి పంచి, కన్‌సైన్‌మెంట్ వెతకమని అన్ని చోట్లకీ పరిగెత్తించాను.
ఈ వ్యవహారం అంతు తేలనప్పటికీ మా బండల మీది సంబంధాల్లో మాత్రం మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎప్పట్లాగే. మిత్రులు శత్రువులవుతున్నారు. ఒకరి మొహం ఇంకొకరు చూసుకోడానికి కూడా ఇష్టపడని వాళ్ళు ప్రాణ స్నేహితులయిపోతున్నారు. కొత్త రొమాన్సులు మొదలవుతున్నాయి. అత్తగారి ఆరళ్ళ గురించిన కబుర్లకి అంతమే లేదు.
‘రాజకీయాలు చర్చించుకోవద్దు మొర్రో!’ అని ఒకళ్ళిద్దరు గీపెట్టినా వినక, వాటి గురించిన వాదనలూ భేదాభిప్రాయాలూ మొహాలు ముడిచెట్టుకోవడం, రుసరుసలూ ఎలాగూ సామాన్యమే.
కొత్తగా హైదరాబాదునుంచి బదిలీ అయి వచ్చిన రాధిక నోట్లోంచి వచ్చీరాని హిందీ తప్ప ఇంకో భాష ఊడిపడదు. ‘పోనీ, ఇంగ్లీష్‌లో ఏడవ్వమ్మా,’ అన్నా వినదు.
పూనమ్ మగవాళ్ళందరి అందాన్నీ గ్రేడ్ చేస్తూ ఉంటుంది. మేం విన్నా వినకపోయినా, తనకున్నాయని ఊహించుకునే రోగాలన్నిటినీ రాజ్ ఏకరువు పెడుతుంటాడు.
డైటింగ్ చిట్కాలు చెప్తుంది అనుభ. సునీతకి ఎప్పుడూ తన వంటల గోలే!
ఈ మధ్యెవరో కొత్తమ్మాయి ఉద్యోగంలో చేరింది. ఆ వేటలో పడి జయంత్ రానే రావడంలేదు. వినితకి ఎప్పుడూ ‘నేను, నాకు’ అన్న టాపిక్ తప్ప మరేదీ పట్టదు.
అన్ని సమస్యలకూ పరిష్కారం అజయ్ దగ్గిర మాత్రం తప్పక ఉంటుంది. వద్దు నాయనా అన్నా, ఉచిత సలహాలు ఇవ్వడం మానడు.
ఒకరోజు మామూలుగా ఏ మూలో కూర్చుని ప్రేమ ఒలకబోసుకుంటుండే నీలేష్, నీనా ఎప్పుడూ లేనిది ఇక్కడికి వచ్చారు, మొహాలు చిటపటలాడించుకుంటూ! ఒక బండ చివర్న కూర్చుని లోగొంతుకలతో వాదించుకున్నారు. ఉన్నట్టుండి ఒకపక్క చెమర్చిన కళ్ళని అద్దుకుంటూనే నీనా అతన్ని చెంప మీద కొట్టింది. అతనూ తిరిగి కొట్టాడు. మేం నిశ్చేష్టులమై, చలనం లేకుండా బండలలో కలిసిపోయాం. తను ఇంచుమించు పరిగెత్తుతూ బోయింగ్ టర్మినల్ వైపు నడిచింది. అతనూ అనుసరించాడు. అదృష్టం కొద్దీ మేము తప్ప అక్కడింకెవరూ లేరు. లేకపోతే, అదో కేస్ అయి కూర్చునేది. అదంతా చూసి మేము కంగారు పడ్డాం.
బండలు మాత్రం నిర్వికారంగానే గమనించాయి అంతా.
ఇంతలో ఎండాకాలం వచ్చింది. బండలు వేడెక్కాయి. వాటిమీద కూర్చోవడం కాదు కదా సమీపించాలన్నా కాల్చేస్తున్న ఎండ వద్దు, వద్దంటూ వారిస్తోంది. మరవి చిన్నబుచ్చుకున్నాయో ఏమో కానీ కారునలుపుకి మారాయి.
కొన్నాళ్ళు ఫెడ్‌ఎక్స్ అబ్బాయీ రాలేదు, నీరజ్ అగర్వాల్‌ నుంచి ఫోనూ లేదు. ‘హమ్మయ్యా, ప్రస్తుతానికి కొంత ఉపశమనం’ అనుకుంటూ కార్గోలో పనిచేస్తున్న వాళ్ళందరం ఊపిరి పీల్చుకున్నాం. హెల్పర్లు కూడా ఆకాశంవైపు తలెత్తి దండాలు పెట్టుకున్నారు.
ఒకరోజు నీరజ్ అగర్వాల్ నుండి ఫోనొచ్చింది– మీ ఎయిర్‌లైనుని కోర్టుకీడ్చకపోతే చూడండి. ‘విలువైన సామాను కాజేసి, అందరూ కలిపి డబ్బు పంచుకుంటున్నట్టుగా ఉంది,’ అన్న బెదిరింపులతో. కోపంతో భగభగమంటున్నాడు.
“సర్, అంత భారీ సామాను సెక్యూరిటీ కంటపడకుండా ఎవరు బయటకి తీసుకెళ్ళగలరో మీరే ఒక్కసారి ఆలోచించండి…” అనునయంగా చెప్పాను.
కొంత వాదన తరువాత, నా శాంతస్వరం వినో ఏమో కానీ అతనే చల్లబడి, “మా ఫాక్టరీ మానేజర్ చాలాకాలంగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతానికి ఊళ్ళో లేడు. వెంటతెస్తాను. ఆయనే గుర్తుపడతాడు.” అన్నాడు. సరే ఆయనొచ్చాక చూడచ్చులే అని నేనూ మర్చిపోయాను.
హఠాత్తుగా ఒకరోజు, రీజినల్ డైరెక్టర్ నన్ను వెంటనే రమ్మంటున్నారన్న కబురుతో, ఎయిర్‌పోర్ట్ మానేజర్ ఫోనొచ్చింది. ఎందుకా! అనుకుంటూ, ఉరుకులూ పరుగులతో ఆయన ఆఫీసులోకి అడుగుపెట్టాను.
“ఈయన నీరజ్ అగర్వాల్!” అక్కడ కూర్చుని తీరిగ్గా టీ తాగుతున్న ఒక వ్యక్తిని పరిచయం చేశారాయన. ‘ఓహో, ఇతనేనా! పైనుండి నరుక్కు వస్తున్నాడన్నమాట! అందుకే, ఉలుకూ పలుకూ లేదీ మధ్య’ అనుకున్నాను.
“ఏమమ్మా, ఈయన కన్‌సైన్‌మెంట్ పోయిందట. మీరెవరూ సహకరించడం లేదంటున్నారీయన. మీరే కదూ ఈ కేసు చూస్తున్నదీ?” తిన్నగా విషయానికి వచ్చారు డైరెక్టర్‌.
పని అయిందో లేదో అని తప్ప ఆయన వివరాలు పట్టించుకోరని, నెపాలు చెప్తున్నానని అనగలిగే అవకాశం ఉందని తెలిసీ ఉండబట్టలేక, వెతికించడానికి ఎంత కష్టపడుతున్నామో క్లుప్తంగా చెప్పాను.
“దాని విలువెంతో చూశారా! ఇంత నిర్లక్ష్యం ఏమిటి?” అడిగారాయన. అవును, చూశాను కానీ ‘మెటల్’కి ఆ ధరెందుకో అంతు పడితే కదా!
“అది బుక్ చేసినదెవరో, ఏమిటో కనుక్కోండి. రేపట్లోగా రిపోర్ట్ కావాలి నాకు.”
‘ఇంక నువ్వు దయచేయి’ అన్నారని అర్థమై, తిరుగు మొహం పట్టాను. నాకెందుకు తట్టలేదీ సంగతి? బుక్ చేసిన ఆ కొలీగ్‌నే అడిగుంటే సరిపోయేది కదా! నన్ను నేను తిట్టుకుంటూ నా ఫైల్లో ఉన్న కాపీ తీశాను. ఆర్.కె.జి. అన్న ఇనీషియల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి తప్ప సంతకం గిలికేసినట్టుంది. ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు. అది పట్టుకుని ఎయిర్‌పోర్ట్ మానేజర్ వద్దకి వెళ్ళాను.
“ఆ టైములో మీ సెక్షన్లో ఎవరెవరి పోస్టింగ్ అయిందో కనుక్కుంటాను,” అన్నారాయన.
మర్నాడే, ఆ వ్యక్తి రాధాకృష్ణ గుప్తా అని తెలిసింది. ఇండోర్‌ నుంచి శ్రీనగర్‌కి బదిలీ అయే మధ్యన మూడ్రోజులు ఇక్కడ టెంపరరీ డ్యూటీ పడిందట. ఇప్పుడతని పోస్టింగ్ బాంకాక్‌లో అట. ఫోన్‌లో మాట్లాడితే, ‘అవును. మొదటిరోజే భారీ సీ-నోటేదో తయారుచేశానన్న గుర్తే. కార్గోలో పనిచేసిన అనుభవం లేదప్పటికి. సలహా అడగడానికి చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. ఏజెంటెవరో తెచ్చిన కాపీలో ‘ఇంత ఇనుమో, ఏదో’ అని రాసుందని లీలగా తప్ప మరేదీ జ్ఞాపకం రావడం లేదు. ఎన్నేళ్ళ కిందటి సంగతో!’ అని చెప్పాడట.
అయినా, బుక్ చేసింది తనే కాబట్టి అతన్ని మర్నాటి ఫ్లైటులోనే రప్పించారు. మొత్తానికి గుప్తా అయితే వచ్చాడు కానీ సామాను ఆకారం కూడా గుర్తు లేదు అన్నాడు. సిటీ, ఇంటర్నేషనల్ కార్గోతో సహా అన్ని చోట్లకీ ఇద్దరు హెల్పర్లని వెంటబెట్టుకుని తిరిగొచ్చాం. ఫలితం లేకపోయింది.
రెండ్రోజుల తరువాత, మరేం తోచిందో ఏమో కానీ ఆత్రంగా వచ్చి మా బండల చుట్టూ తిరుగుతూ, “ఇదే ఆ కన్‌సైన్‌మెంట్ అనుకుంటాను…” అన్నాడు.
కనుక్కోడానికి జూనియర్ అగర్వాల్‌కి ఫోన్ చేస్తే, తన మానేజర్ ఊరినుంచి తిరిగి వచ్చాడనీ, అతన్నీ తనతో పాటు తెస్తాననీ అన్నాడాయన ఉత్సాహంగానే.
మేనేజర్‌కి 50 ఏళ్ళుంటాయి. వచ్చీ రావడంతోనే బండల్ని చూసి, ‘ఇవే, ఇవే!’ అంటూ సంతోషం పట్టలేక ఇక గెంతులేయడమొక్కటే తక్కువ!
అంతటా కబురు పాకింది. ఎయిర్‌పోర్ట్ మానేజర్ కూడా వచ్చి అయోమయంగానే ఆయన్ని అడిగారు, “అయితే, మీ బిల్లుమీద కోట్ల విలువ రాసుందేమిటండీ? అసలే మెటలైనా అంత ధర పలుకుతుందా!”
మేనేజర్ చిద్విలాసంగా నవ్వి, “ఇది వెండండీ!” అన్నాడు.
అందరం నోళ్ళు వెళ్ళబెట్టాం.
“అసలేమయిందంటే, వీటిని మా చెన్నై ఫాక్టరీకి పంపించాలనుకున్నాం. ఇంత బరువున్న వెండి కడ్డీలు వంగిపోతాయి కదా అని వాటికి ఇనప తాపడం చేయించాం. అప్పటికే సతీష్‌గారి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన వీటిని బుక్ చేయించినప్పుడు నేను లేనక్కడ. నీరజ్‌గారేమో యుఎస్‌లో ఉన్నారు. ఫెడ్‌ఎక్స్ వాళ్ళే సలహా ఇచ్చారట, ఏదో మెటల్ అని రాసేయమని. సతీష్‌గారు పోయాక, ఎవరూ వీటి సంగతి పట్టించుకోలేదు. ఫాక్టరీ లెక్కలు చూస్తున్నప్పుడు అవి తేలకపోయి ఫైల్సన్నీ చెక్ చేస్తుంటే ఈ మధ్యే నీరజ్‌గారి కంటపడింది.” ప్రశ్నార్థకంగా పెట్టిన మా మొహాలని చూస్తూ తేలిగ్గా తేల్చేశాడాయన.
హమ్మయ్యా, చిక్కు ముడి విడింది!
మర్నాటి చెన్నై ఫ్లైట్‌లో వాటిని లోడ్ చేయడానికి పెద్ద క్రేనులూ పటాటోపం కనిపించాయి. దూరంగా ఉన్న బే మీద నిలుచున్న ఎయిర్‌బస్ వెనకాతల హెల్పర్లందరూ గుమిగూడి ఉన్నారు. వెళ్ళి చూస్తే, వెనకనున్న కార్గో హోల్డుల్లో కడ్డీలు పట్టలేదు. వాటిని దింపేసి మళ్ళీ ఎత్తి, ముందు హోల్డులో ఎక్కించడానికి ప్రయత్నిస్తుంటే పొడుగు చాలలేదు. ఇంక వీలవక రెండిటినీ దించేశారు. ఇన్నేళ్ళూ అవిక్కడే ఎందుకు పడున్నాయో అర్థమయింది. అవసలు మా విమానాలు వేటిల్లోనూ పట్టగలిగే కొలతలున్నవి కావు!
అవి తిరిగి అగర్వాలుల ఇంటికి రాజసంగా పెద్ద ట్రక్కులో ప్రయాణమయాయి.
గుప్తా తప్పు కేవలం సీ-నోట్ సరిగ్గా తయారు చేయకపోవడం మాత్రమే అనుకున్నారు ముందు. కానీ, ఈ సంఘటన తరువాత కడ్డీల పొడుగు సరిగ్గా కొలిపించకుండానే బుక్ చేసి, ఆ తరువాత అవి లోడ్ అయాయో లేదో అని కూడా పట్టించుకోని అతని నిర్లక్ష్యానికి అతని ఇంటర్నేషనల్ పోస్టింగ్ రద్దు చేసి, మూడు నెల్లు సస్పెండ్ చేశారు.
ఇప్పుడు కాంక్రీట్ మీద మా అందరి అనుభూతులకీ సాక్షిగా ఉండే చలనరహితమైన మా బండలైతే లేవు కానీ వాటి కింద ఇన్నేళ్ళూ వర్షం, ధూళి, నుండి తప్పించుకున్న తారూ ఇసుకా మేళవించిన టార్మాక్ భాగం మట్టుకు తళతళలాడుతోంది!
కానీ మేము మాత్రం మా కబుర్లకి మరో చోటోదే వెతుక్కోవాలి.
-----------------------------------------------------------
రచన: కృష్ణ వేణి, ఈమాట సౌజన్యంతో



,,🕉ఏ నామాన్ని జపిస్తే ఏ పలితం వస్తుంది.🙏  (1)

• శ్రీ రామ అని జపిస్తే జయం లభిస్తుంది.
• కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాదులు మటుమాయం అవుతాయి.
• దమోదరున్ని జపిస్తే బందముల నుంచి విముక్తి లబిస్తుంది.
• నారాయణ అని స్మరిస్తే సకల సర్వ గ్రహాల దోషాలు సమశిపోతాయి.
• మాధవా అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి.
• ఆచ్యుతా అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషదంగా పనిచేస్తుంది.
• నరసింహ అని స్మరిస్తే మీ శత్రువుల పై మీదే విజయం అవుతుంది, అదే నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుచి విముక్తి కలుగుతుంది.
• గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది.
• శ్రీ లక్ష్మినారాయణ లను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కలకలాడుతుంది.
• సర్వేశ్వర అని స్మరిస్తే మనం చేపట్టిన కార్యం సత్వరమే జరుగుతుంది, విజయం కలుగుతుంది.
• జగన్నాతా అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది.
• కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలుగుతాయి.
• శివ శివ అని అని స్మరిస్తే సకలమూ దరిచేరుతాయి.

 *శనిదేవుడిని ఈ విధంగా  పూజిస్తే ఐశ్వర్యాన్ని ఇస్తాడు*.

సాధారణంగా శనీశ్వరుడు పేరు చెప్పగానే ఉలిక్కి పడతాం. ఆయన పేరు వింటే తెగ ఆందోళన పడిపోతారు.శనిదేవుడిని ఈ రకంగా పూజిస్తే మనకు కష్టాలను కాదు ఐశ్వర్యాన్ని ఇస్తాడు.

సాధారణంగా శనీశ్వరుడు పేరు చెప్పగానే ఉలిక్కి పడతాం. ఆయన పేరు వింటే తెగ ఆందోళన పడిపోతారు. మన జాతకంలో శని ప్రభావం ఉండకూడదని కోరుకుంటాం. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ పేర్లు వింటేనే జనాల్లో ఓ రకమైన వణుకు పుడుతుంది. కానీ శనీశ్వరుడు ప్రసాదించే వాటి గురించి తెలుసుకుంటే ఆయనను తప్పక ఆరాధిస్తారు.

*నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం*.
అంటారు. నీలాంజనం అంటే నల్లటి కాటుక రూపంలో ఉండే వాడు, రవిపుత్రం అంటే సూర్యుడి పుత్రుడు, యమాగ్రజం-యముడికి సోదరుడు, ఛాయా మార్తాండ సంభూతం: ఛాయా దేవికి మార్తాండుడు అంటే సూర్య భగవానుడికి జన్మించిన వాడు, తం నమామి శనేశ్చరం: అలాంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం. ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే శనీశ్వరుడు మిమల్ని అనుగ్రహిస్తాడు.

శనీశ్వరుడిని ఎప్పుడూ శని శని అని పిలవకూడదు. శనీశ్వరా అని కానీ శని భగవానుడు అని కానీ పలకాలి. విశేషం ఏమంటే ఈశ్వర శబ్దం ఎక్కడ ధ్వనిస్తుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఉదాహరణకి శివుడిని ఈశ్వరుడు, మహేశ్వరుడు అంటాం, ఆయన అలా అనుగ్రహిస్తాడు... వెంకటేశ్వర స్వామి పేరులోనూ ఈశ్వర శబ్దం ఉంది. ఈశ్వర శబ్దం ఉంది కాబట్టే ఆయన కలియుగ దైవంగా మారి మన కోరికలను నెరవేరుస్తున్నాడు.

అలాగే శనీశ్వరుడి నామంలోనూ శని, ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా శివుడిలా, వేంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
శనీశ్వరుడికి బయపడాల్సిన పనిలేదు. నవగ్రహా మండపానికి వెళ్లినప్పుడు శనీశ్వరుడికి భక్తితో నమస్కారం చేయండి. నమస్కరించడం వల్ల, శనివార నియమాల్ని పాటించడం వల్ల, నీలం లేదా నలుపు రంగు వస్త్రాల్ని ధరించడం వల్ల, ఆయనకు ఇష్టమైన చిమ్మిలి నివేదనం చేయడం వల్ల, శివారాధన చేయడం వల్ల, తప్పక అనుగ్రహిస్తాడు.

శనీశ్వరుడి వల్ల కలిగే దోషాలు అంటే గ్రహరీత్యా ఏ గ్రహమైనాసరే మీకు యోగంతోపాటు పీడని కలిగిస్తుంది. శనీశ్వరుడు కూడా అంతే ఆయన నివాసం ఉన్న స్థానాన్ని బట్టి జన్మ శని, ద్వాదశ శని, లేదా ద్వితీయ శనిగా కొద్దిగా కష్టాలకు గురిచేస్తాడు. ఎవరైతే శనీశ్వరుని భక్తిగా పూజించి, గౌరవిస్తారో అలాంటి వాళ్లను అనుగ్రహిస్తాడు. అయితే ఎప్పుడు కూడా శని పీడ రావాలనే కోరుకోవాలట.

ఎందుకంటే శనీశ్వరుడు కొద్దిగా పీడించాడంటే దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్నీ మీకు అందించి వెళ్తాడు. మాకు శనీశ్వరుడి ప్రభావం కోరుకోకపోతే ఆయన ఇచ్చే యోగం, ఐశ్వర్యం కూడా రాదట. అందుకే శనీశ్వరుడు పీడించాలి, దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్నీకలిగించాలని భక్తిశ్రద్ధలతో కోరుకోవాలి. శనీశ్వరుడి ఆరాధించాలి.

చక్కగా నీలిరంగు పుష్పాలతో పూజించి, శివారాధన, హనుమాన్, అయ్యప్ప ఆరాధనా చేయాలి. అలాగే శనివార నియమాల్ని పాటించడం వల్ల కూడా శనీశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడు.

--(())--



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి